TS 9th Class Telugu Lesson 11 వాయసం

Solutions for Class 9 Telugu: Lesson 11 The Crow (Vayasam)

Review structured textbook solutions for Class 9 Telugu Lesson 11 The Crow (Vayasam). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Practice Class 9 Telugu Solutions: Lesson 11 The Crow (Vayasam)

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

ప్రారంభ ప్రశ్నలు

Question 1: పై పంక్తుల్లో జనవ్యవహారంలో ఉన్న పదబంధాలేవి ?

Answer:

నాట్యమయూరి, హంసనడక, చిలుకపలుకలు, కోకిల స్వరం, ఉడుంపట్టు, ఉడుతాభక్తి, కుక్కవిశ్వాసం, సింహస్వప్నం అనేవి పై పంక్తులలో జనవ్యవహారంలోని పదబంధాలు.

Exam Tips:

a) పాఠం ప్రారంభంలోని పంక్తుల నుండి పదబంధాలను ఉన్నవి ఉన్నట్లు, ఒక్కొక్కటిగా రాయండి.

 

Question 2: ఇట్లాంటి పదబంధాలు ఏ సందర్భంలో వాడుతారు ?

Answer:

ఇట్లాంటి పదబంధాలు ఇతరుల నాట్యాన్ని, కళను, విశ్వాసాన్ని, భక్తిని, సేవను, మాటలను, పట్టుదలను మొదలైన గుణగణాలను ప్రశంసించే సందర్భంలో వాడతారు.

Exam Tips:

a) ‘ప్రశంసించే సందర్భంలో’ అనే మాట జవాబులో తప్పక ఉండాలి.

 

Question 3: వీటిని వాడడంలో పశుపక్ష్యాదుల పట్ల ఏ భావం కనిపిస్తుంది ?

Answer:

వీటిని వాడటంలో పశుపక్ష్యాదుల పట్ల మనకు గౌరవభావం, అభిమానం కనిపిస్తుంది.

Exam Tips:

a) ఒక్క వాక్యం చాలు – గౌరవం, అభిమానం అనే రెండు భావాలను పేర్కొనండి.

 

Question 4: పశువులను, పక్షులను చిన్నచూపుతో పోల్చే సందర్భాలు కూడా ఉంటాయా?

Answer:

పశువులను, పక్షులను చిన్నచూపుతో పోల్చే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మిక్కిలిగా గోల చేస్తున్నప్పుడు ‘కాకిగోల’ అంటారు. చలించకుండా ఉంటే ‘దున్నపోతు మీద వానపడ్డట్లు’ అంటారు. ఇలా చిన్నచూపుతో పోల్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Exam Tips:

a) ‘కాకిగోల’, ‘దున్నపోతు మీద వాన’ వంటి పోలికలను ఉదాహరణగా ఇవ్వండి.

 

Question 5: అటువంటి కొన్ని పోలికలు చెప్పండి. ఇట్లా పోల్చడం సరైందేనా ?

Answer:

అటువంటి కొన్ని పోలికలలో – కాకిగోల, అచ్చోసిన ఆంబోతువలె ఉన్నావు, దున్నపోతు మీద వానపడ్డట్లు, టక్కరి నక్క వలె ఉన్నావు మొదలైనవి ఉన్నాయి.
ఇలా పోల్చడం తగదు దీని వల్ల మనం పక్షులను, జంతువులను హీనంగా చూసినట్లు అవుతుంది.

Exam Tips:

a) రెండు భాగాలకూ జవాబు ఇవ్వాలి – పోలికలు, తర్వాత ‘ఇది తగదు’ అనే మీ అభిప్రాయం.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 115)

Question 1: “మానవుల్ మెక్కుటమానినారె ?” అంటే మీకు ఏమర్థమైంది ?

Answer:

‘మెక్కటం’ అంటే, ఎక్కువగా ‘పొట్టపట్టినంతా తినడం’ అని అర్థము. మనుషులు మాంసాన్ని మెక్కి తింటున్నారనీ, వారు మాంసాన్ని కాకులకు వేయరనీ, అందువల్ల మాంసంపై కాకి కోరిక పెట్టుకోడం వల్ల ప్రయోజనముండదనీ, కవి కాకికి హితబోధ చేశాడని అర్థమయ్యింది.

Exam Tips:

a) ‘మెక్కటం’ అనే పదానికి అర్థం ముందుగా రాసి, తర్వాత కవి కాకికి చేసిన హితబోధను వివరించండి.

 

Question 2: బలికూడు తిని బతుకుతుందని కాకిని ఎందుకన్నారు?

Answer:

దేవతలకు, పితృదేవతలకు నైవేద్యంగా బలికూడు పెడతారు. దేవతల తృప్తి కోసం అన్నం పప్పు వండి, దాన్ని నైవేద్యం పెడతారు. ఆ బలి అన్నాన్ని కాకులు తింటాయి. అందుకే కాకికి “బలి భుక్కు” అని పేరు.

Exam Tips:

a) ‘బలి’ అంటే నైవేద్యంగా పెట్టే అన్నం; కాకికి గల ‘బలిపుష్టము’ అనే పేరుతో జవాబును ముగించండి.

 

Question 3: కాకిని ‘పేదరికపు పక్షి’ అనడంలో అర్థమేమిటి?

Answer:

కాకి మానవులకు మంచి ఉపకారం చేస్తుంది. ఎంగిలి మెతుకులు ఏరుకొని తిని, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది. పితృదేవతలకు తృప్తిగా, బలికూడును తింటుంది. ఎంత చేసినా పాపం కాకిని ఎవరూ గౌరవంగా చూడరు. కాకిని ఎవరూ పెంచుకోరు. దానికి ఎవరూ ప్రేమతో ఏమీ పెట్టరు. మనం పారేసిన ఎంగిలి మెతుకులు తిని, అది జీవిస్తుంది. అందుకే కవి, కాకిని ‘పేదరికపు పక్షి’ అన్నారు.

Exam Tips:

a) కాకి చేసే ఉపకారం, అయినా దానికి లభించని గౌరవం – ఈ వైరుధ్యాన్ని చూపండి.

 

Question 4: కాకిలో ఉన్న కలుపుగోలుతనం ఎట్లాంటిది ?

Answer:

కాకి కనబడగానే ప్రజలు దాన్ని ‘హాష్ కాకీ’ అని దూరంగా చెదరగొడతారు. కాని కాకి మాత్రం, అన్నగారి కొడుకు తన పినతండ్రిని “కాక కాక” అని పిలిచినట్లుగా, ప్రేమతో మనలను కేక వేస్తుంది. కాకి మన బంధువుల రాకను తెలియపరుస్తూ, వార్తలు తెస్తుంది. కాబట్టి కాకిలో కలుపుగోలుతనం ఉంది అని చెప్పవచ్చు.

Exam Tips:

a) ‘కాక కాక’ అని అన్న కొడుకు పినతండ్రిని పిలిచినట్లు అనే పోలిక జవాబులో తప్పక ఉండాలి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 116)

Question 1: ‘మసిబూసి మారేడు కాయజేయడం’ అనే జాతీయం ఏ సందర్భంలో వాడుతారు ?

Answer:

లేని దానిని ఉన్నట్లు కల్పించి చెప్పడాన్ని, ఏదో రంగుపూసి, అది ఫలానా వస్తువని ఇతరులకు చెప్పి వారిని మోసగించడాన్ని “మసిపూసి మారేడు కాయ జేయడం” అంటారు. మారేడు కాయ కాని కాయకు ఏదో మసిపూసి, అదే మారేడు కాయ అని చెప్పి ఇతరులను మోసగించడం అన్నమాట.

Exam Tips:

a) జాతీయానికి అర్థం (మోసగించడం) ఒక వాక్యంలో, ఉదాహరణ రెండో వాక్యంలో రాయండి.

 

Question 2: ‘లిబ్బులబ్బగ పిచ్చి బెబ్బులియై ప్రవర్తించ’డమంటే ఏమర్థమైంది?

Answer:

పిచ్చెక్కిన పెద్దపులి, దాని ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా తిరుగుతుంది. ‘లిబ్బులు’ అంటే సొమ్ములు. డబ్బులు రాగానే, ధనాహంకారంతో మనిషి పిచ్చెక్కిన పులిలా, ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా తిరుగుతాడని అర్థం అయ్యింది.

Exam Tips:

a) ‘లిబ్బులు’ = సొమ్ములు అనే అర్థాన్ని ముందు చెప్పండి.

 

Question 3: “పాపాత్ముని మనసు నలుపు” అనడం సరైందేనా ? ఎందుకు ?

Answer:

చెడును నల్లని రంగుతోనూ, మంచిని స్వచ్ఛమైన తెల్లని రంగుతోనూ కవులు పోలుస్తారు. పాపాత్ముడు -ఎండ్రకాయ తీరుగా అడ్డంగా సంచరిస్తాడు. అతడు – బెదరింపులతో ఇతరుల నోళ్ళు మూయిస్తాడు. అతడు పందిలా, మెక్కుతూ, నీచమైన బ్రతుకు బ్రతుకుతాడు. కాబట్టి పాపాత్ముడి మనస్సును నలుపు అనడం సమంజసమే అని చెప్పాలి.

Exam Tips:

a) నలుపు చెడుకు, తెలుపు మంచికి కవులు ప్రతీకలుగా వాడతారని పేర్కొని, పాపాత్ముని లక్షణాలను (ఎండ్రకాయ నడక, బెదిరింపు) ఉదాహరించండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 117)

Question 1: ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అనే సామెత ఎందుకొచ్చి ఉంటుందో చర్చించండి ?

Answer:

కాకి పిల్ల కాకిలాగే నల్లగా అందవికారంగా ఉంటుంది. మన పిల్లలు ఎలా ఉన్నా, మనకు ముద్దు వస్తారు. అలాగే ఎవరి పిల్లలు వారికి అందంగా కనబడతారు. కాకి పిల్ల అందంగా లేకపోయినా, కాకికి అందంగా కనబడినట్లే, మన పిల్లలు అందంగా ఉన్నా లేకపోయినా మనకు అందంగానే కనబడతారని చెప్పడానికి ఈ సామెతను వాడతారు..

Exam Tips:

a) ‘మన పిల్లలు ఎలా ఉన్నా మనకు ముద్దే’ అనే భావాన్ని సామెతకు అన్వయించండి.

 

Question 2: ‘లొట్టి మీద కాకి లొల్లి’ అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ?

Answer:

చెట్ల నుండి కల్లు తీయడానికి చెట్లకు కల్లుముంత కడతారు. ఆ కల్లు ముంతను లొట్టి అంటారు. కాకులు ఆ లొట్టి మీద వ్రాలి కల్లును తాగాలని పెద్దగా అరుస్తూ ఉంటాయి. అయితే దానికి కల్లు త్రాగడానికి వీలు కాదు. అలాగే ఏదైనా తినే పదార్థం ప్రక్కన చేరి, పెద్దగా అల్లరి చేయడాన్ని “లొట్టి మీద లొల్లి” అంటారు.

Exam Tips:

a) ‘లొట్టి’ (కల్లు ముంత) అంటే ఏమిటో వివరించి, ఆ తర్వాత జాతీయ సందర్భాన్ని రాయండి.

 

Question 3: కాకిని ప్రాణసఖుడు అనవచ్చా ? మీ అభిప్రాయం చెప్పండి.

Answer:

మంచి స్నేహితుడిని, అవసరమైతే స్నేహితుడి కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్దం అయ్యే మిత్రుడిని ప్రాణసఖుడు అంటాం. ప్రాణసఖుడు మన దగ్గరకు వచ్చి మన క్షేమ సమాచారాలు అడుగుతాడు. మనల్ని ప్రేమగా పిలుస్తాడు.
కాకి కూడా మన ఇంటిపై వ్రాలి మన క్షేమాన్ని అడిగే విధంగా కావు కావు మంటుంది. రావద్దని కొట్టినా మానకుండా ప్రాణస్నేహితుడిలా మన ఇంటికి వస్తుంది. కాబట్టి కాకిని ప్రాణసఖుడు అనడం సమంజసమే.

Exam Tips:

a) ప్రాణసఖుడి లక్షణాలను చెప్పి, కాకి ప్రవర్తనతో పోల్చి ‘అనవచ్చు’ అని ముగించండి.

 

Question 4: కాకిని చులకన చేసి, కోకిలను ఆదరించడం సరైందేనా ? ఎందుకు ?

Answer:

కోకిల వసంత ఋతువులో మాత్రం చెట్ల కొమ్మలలో దాగి, కమ్మగా కూస్తుంది.
అప్పుడు అంతా కోకిలను మెచ్చుకుంటారు. కాకి నిత్యం వచ్చి మనలను పలుకరిస్తుంది. కాని జనం కాకిని ఆదరించరు.
దీన్నే ఒక కవి ఇలా చెప్పాడు. కాకి మనలను తిట్టనూలేదు. కోకిల మనల్ని ధనం తీసుకో అని కోరీ పిలువనూలేదు. కాని కోకిలను మెచ్చుకోడానికి కారణము దాని కమ్మని మధుర స్వరమే. కాకిని చులకన చేయడానికి కారణము, దాని పరుష స్వరమే అని.

Exam Tips:

a) ఆదరణకు కారణం స్వరమే అనే కవి అభిప్రాయాన్ని ఉటంకించండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: పక్షిజాతిలో కాకిని చిన్నచూపు చూడడం సరైందేనా? చర్చించండి.

Answer:

‘కాకి’ని మనము నిత్యము చూస్తూ ఉంటాము. భగవంతుడు పుట్టించిన ప్రతిప్రాణి ఉపయోగకరమైనదే. అలాగే మనము నిత్యముచూసే కాకి వల్ల, మానవులకు ఎన్నో ఉపయోగాలున్నాయి.
1) మనము పెరటిలో పారవేసే ఎంగిలి మెతుకులను కాకి ఏరుకొని, తిని పెరడును శుభ్రంగా ఉంచుతుంది. కాకులు ఎంగిలి మెతుకులను తినకపోతే, అవి మట్టిలో పడి కుళ్ళి కంపుకొడతాయి. కాబట్టి స్వచ్ఛభారత్ ఉద్యమానికి కాకులు ఎంతో సాయం చేస్తున్నాయి.
2) పెద్దలు పితృ దేవతలకూ, దేవతలకూ పిండాలు పెడతారు. బలులు ఇస్తారు. కాకి వాటిని తింటుంది. కాకికి ‘బలిపుష్టము’ అని పేరు. శ్రాద్ధ కర్మ చేసి పెట్టిన పిండాలు కాకులు తినకపోతే, పితృదేవతలు తృప్తిని పొందలేదని మనం భావిస్తాము.
అందువల్ల కాకిని చిన్నచూపు చూడరాదు.
3) కాకికి ‘మౌకలి’ అనిపేరు. అంటే అది యముడికి సంబంధించినది. కాకి వచ్చి అరుస్తూ ఉంటే, బంధువులు మన ఇంటికి వస్తారని మనకు పెద్ద నమ్మకం ఉంది. కాబట్టి కాకి, మనకు ప్రాణస్నేహితుడి వంటిది.
4) కాకి గొంతు, కోయిల గొంతులా తియ్యగా ఉండదు. అందుకే కాకిని మనం ‘కాకిగోల’ అని చీదరించుకుంటాం. కాకిలో ఒక సుగుణం ఉంది. దానికి జాతి ప్రేమ హెచ్చు. ఒక కాకికి ప్రమాదం వస్తే మిగిలిన కాకులన్నీ అక్కడకు వచ్చి అరుస్తాయి.
ఐకమత్యం విషయంలో కాకి, మనకు ‘ఆదర్శ పక్షి’ అని చెప్పాలి.
కాబట్టి కాకిని చిన్నచూపు చూడడం సరికాదు.

Exam Tips:

a) కాకి ఉపయోగాలను (పరిశుభ్రత, పితృదేవతల పిండాలు, ఐకమత్యం) నంబర్లతో రాయండి.

 

Question 2: పాఠం చదువండి. పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
పట్టిక శీర్షికలు: కాకిని సంబోధించిన పదాలు | పాఠంలో వచ్చిన సామెతలు, జాతీయాలు | కాకి నలుపు రంగుకు ప్రతీకగా వాడబడిన పేర్లు

Answer:

కాకిని సంబోధించిన పదాలుపాఠంలో వచ్చిన సామెతలు, జాతీయాలుకాకి నలుపు రంగుకు ప్రతీకగా వాడబడిన పేర్లు
1) ధ్వాంక్షము
2) బలిపుష్టము
3) వాయసము
4) మౌకలి
5) ఆత్మఘోషము
1) ఎంగిలి మెతుకులు
2) ఆకలి బొబ్బలు
3) ఏకరువు పెట్టు
4) మసిబూసి మారేడు కాయ
5) పగబట్టి తొడగొట్టు
6) పచ్చినెత్తురు జుఱ్ఱు
7) ఎండ్రకాయ నడత
8) పందిమేత
9) కాకి బలగము
10) కాకి పిల్లలు కాకికే కదుముద్దు
11) లొట్టి మీద కాకి లొల్లి
12) కాకి గోల
1) నల్ల మొగమున్న వెన్నుడు
2) విషపుమేతరి గొంతు
3) చుక్కల దొరలో మచ్చ
4) నరుల తలలు
5) ఇరుల దారులు
6) నలుపు నింగి
7) నీరు
8) రాత్రి
9) నీడ
10) మాయి
11) అంధకారము
12) అజ్ఞానము

Exam Tips:

a) పట్టికలోని మూడు కాలమ్‌లను పాఠంలోని పద్యాల నుండి వరుసగా వెతికి నింపండి.
b) సామెతలు, జాతీయాలు ఒక్కొక్కటి ఒక్కో వరుసలో రాయండి.

 

Question 3: కింది పేరా చదువండి. పట్టికలో వివరాలు రాయండి.
“రాకెల్కార్సన్ అనే పర్యావరణవేత్త. 1963లో “సైలెంట్ స్ప్రింగ్” అనే పుస్తకాన్ని రాశాడు. క్రిమిసంహారక మందుల వాడకంవల్ల పక్షులు ఎట్లా కనుమరుగవుతున్నాయో రాశాడు. పక్షులు నశిస్తే మానవజాతికి కూడా నష్టం వాటిల్లుతుంది. రాబందులు, గద్దలు, కాకులు, పిచ్చుకలు అని మనం చిన్నచూపు చూడవచ్చు. ఎందుకంటే వాటి ప్రాధాన్యం మనకు తెలియదు కాబట్టి. జనావాసాల నుండి చెత్తా చెదారం, మలిన పదార్థాలను కాకులు దూరంగా తీసుకొనిపోతాయి. రాబందులు మృతజంతుకళేబరాలను తిని రోగాలు, అంటురోగాలు రాకుండా జనాన్ని కాపాడుతాయి. పిచ్చుకలు పంటలను నాశనం చేసే కీటకాలను, కీటకాలుగా మార్చే గొంగళి పురుగులను తిని, పంట దిగుబడికి తోడ్పడుతున్నాయి.
పట్టికలో కారణాలు: 1) క్రిమిసంహారక మందుల వాడకం పెరగడం 2) పక్షులు కనుమరుగైతే 3) రాబందులు ఉండడం వల్ల 4) కాకులు ఉండడం వల్ల 5) పిచ్చుకల వల్ల – ఫలితాలను రాయండి.

Answer:

కారణంఫలితం
1) క్రిమిసంహారక మందుల వాడకం పెరగడం1) పక్షులు కనుమరుగవుతాయి.
2) పక్షులు కనుమరుగైతే2) మానవజాతికి కూడా నష్టం కలుగుతుంది.
3) రాబందులు ఉండడం వల్ల3) మృతకళేబరాలను తిని అంటురోగాలు రాకుండా జనాన్ని కాపాడతాయి.
4) కాకులు ఉండడం వల్ల4) జనావాసాల నుండి చెత్తాచెదారం, మలిన పదార్థాలను దూరంగా తీసుకొని పోతాయి.
5) పిచ్చుకల వల్ల5) పంటలను నాశనం చేసే కీటకాలను, కీటకాలుగా మారే గొంగళిపురుగులను తిని, పంట దిగుబడికి తోడ్పడుతున్నాయి.

Exam Tips:

a) పేరాలో ప్రతి పక్షి పేరు ఎదురుగా దాని ఉపయోగాన్ని వెతికి, కారణం–ఫలితం క్రమంలో రాయండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: కాకులను చులకనగా చూడడాన్ని బట్టి మానవ స్వభావం ఎట్లాంటిదని భావిస్తున్నారు ? (ఐదు వాక్యాల్లో)

Answer:

మానవుడు విచిత్రమైన వ్యక్తి. తనకు సాయం చేసే పశుపక్ష్యాదులను తేలికగా చూస్తాడు. మానవుడు కృతఘ్నుడు, అనగా చేసిన మేలును మరచిపోతాడు.
1. మానవుడు ఎక్కువ మంది చుట్టాలున్న వాడిని చూచి, ‘వాడిది కాకి బలగం’ అని హేళనచేస్తాడు. కాని తాను మాత్రం, బంధువుల ఇళ్ళకు వెళ్ళి, వారి ఆదరణ పొందుతాడు.
2. ఎవరైనా తమ పిల్లను ముద్దుగా, గారాబంగా చూస్తూ ఉంటే, ‘కాకిపిల్ల కాకికే ముద్దు’ అని వారిని మానవుడు హేళనగా మాట్లాడతాడు. ఎవరైనా తన పిల్లను ఏమైనా అంటే మాత్రం, వారితో తగవులాడుతాడు.
3. మానవుడు తాను వదరుబోతును మించి, వాదిస్తాడు. కాని తాను ఆ వదరుబోతును, “లొట్టి మీద కాకి లొల్లి” అని హేళన చేస్తాడు.
4. పిల్లలు అల్లరిచేస్తే కాకి గోల అని చీకాకు పడతాడు.
5. కాకి తన్ను కావుమని దేవుణ్ణి ప్రార్థిస్తోంటే, మనిషికి ఆ ధ్వని, ముల్లులా గుచ్చుకుంటుంది. కాబట్టి మానవుని మనస్తత్వము విచిత్రమైనది. కృతజ్ఞత లేనిది.

Exam Tips:

a) ‘కృతఘ్నత’ అనే ముఖ్యమైన మాటను వాడి, జాతీయాలను ఉదాహరణలుగా ఇవ్వండి.

 

Question 2: రామగౌడు కవితాశైలిని వివరించండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

రామగౌడు మంచి విద్వత్కవి. కాకి వంటి అల్ప జంతువును, తన కవితా ప్రతిభతో, వాదనాబలంతో మహోన్నతంగా, తీర్చిదిద్దాడు. సీస పద్యాలను మంచి రసవంతంగా, మంచి భావనా బలంతో, ప్రకృతి ప్రేమికునిగా, జీవకారుణ్యవాదిగా అద్భుతంగా రచించాడు.
కాకిని సంబోధిస్తూ ధ్వాంక్షము, బలిపుష్టము, వాయసము, మౌకలి, ఆత్మఘోషము వంటి వివిధ పర్యాయపదాలను అర్థవంతంగా ప్రయోగించడం, గొడుగారి పాండిత్యానికి ప్రబల నిదర్శనం.
కాకి అరచే ‘కాక కాక’ ధ్వనిలో, కవిగారికి అన్న కొడుకు పినతండ్రిని పిలిచే ఆత్మీయత కనిపించింది. మనిషిలో కలుపుగోలుతనం లేనందువల్లే, కాకిని చీదరించుకొంటున్నాడని కవిగారి భావన బాగుంది. నలుపున్న అందరినీ మెచ్చుకొని, కాకి నలుపును మాత్రం కాదనడం బాగోలేదని, కవి చక్కగా సమర్థించారు.
కాకిని నిందిస్తూ లోకంలో వాడే పదబంధాలలో ఉండే దోషాన్ని చక్కగా కవిగారు వెల్లడించారు.
కాకి, చుట్టాల కబురును తెచ్చే ప్రాణసఖుడని, దాన్ని గౌరవించారు. కోయిల ఎప్పుడో సంవత్సరంలో వసంత ఋతువులోనే కూస్తుంది. కాకి నిత్యం వచ్చి మనలను పలకరిస్తుంది. కోకిలను మెచ్చుకొని, కాకిని చులకనగా చూడడం తప్పని, కవిగారు తన ప్రతిభా సంపత్తితో మానవులను హెచ్చరించారు.
రామగౌడు గారు ప్రతిభా సంపన్నులైన ఉత్తమ కవిచక్రవర్తి.

Exam Tips:

a) సీస పద్యాలు, పర్యాయపదాల ప్రయోగం, జీవకారుణ్యం – ఈ మూడు అంశాలు రాయండి.

 

Question 3: కాకి, కోకిల రెండూ నల్లనివే! అయితే ఒకదానిని ఆదరించి, ఇంకొకదాన్ని చులకనగా చూడడం గురించి మీ అభిప్రాయం తెలుపండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

కాకి నలుపు. కోకిల నలుపు. ఈ రెంటికీ భేదము లేదు. కాని వసంత కాలం రాగానే, మామిడి చిగుర్లను తిన్న కోకిల, తియ్యగా కమ్మగా కూస్తుంది. కాని కాకి గొంతు బొంగురుగా, కర్ణకఠోరంగా ఉంటుంది. అందువల్లే కోకిలను ప్రజలు ఆదరిస్తారు. కాకిని చులకనగా చూస్తారు.
మరో కవి కోయిలకూ, కాకికీ తేడా ఇలా చెప్పాడు. “కాకి మనలను ఏమీ తిట్టలేదు. కోయిల ధనాన్ని పుచ్చుకోండి అని మనల్ని పిలువలేదు. మరి ఎందుకు కోయిలను ప్రేమిస్తున్నారంటే, దాని మధుర స్వరం వల్లనే కోయిలను జనం ఆదరిస్తున్నారు. దాని పరుష స్వరం వల్లనే కాకిని, విరోధభావంతో చూస్తున్నారు.
నిజానికి కోకిలకు తన గుడ్లను పిల్లలుగా చేసే శక్తి ఉండదు. కోయిల తన గ్రుడ్లను కాకి గూట్లో పెడుతుంది. కాకులు, అవి తన గ్రుడ్లే అనుకొని, వాటిని పొదిగి పిల్లలుగా తయారుచేస్తాయి. కోయిల పిల్ల గొంతెత్తగానే, వాటిని గుర్తించి వాటిని గూటి నుండి కాకులు తరిమివేస్తాయి.
దీనినిబట్టి కోయిలకు ఆదరం కేవలం దానిగొంతు వల్లనే వచ్చింది. కాకిని దాని పరుషస్వరం వల్లనే, లోకం దాన్ని అనాదరంగా చూస్తోంది. నిజానికి కాకి మలిన పదార్థాలను మన ఇంటి నుండి దూరంగా తీసుకుపోయి, మనకు ఎంతో ఉపకారం చేస్తోంది.

Exam Tips:

a) కోకిల తన గుడ్లను కాకి గూటిలో పెట్టే విషయం ఒక విలువైన అదనపు అంశం.

 

Question 4: కాకులు సమైక్యంగా ఉంటాయి. దీనిపై మీ అభిప్రాయం సకారణంగా రాయండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

సాధారణంగా మానవులకంటే మూగజీవాల్లోనే సమైక్యత ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా కాకుల్లో అది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా ఆహారం ఒక కాకికి కనిపిస్తే అన్ని కాకులను సమాయత్తం చేస్తుంది. అందరిని తీసుకొని వెళ్తుంది. ఉన్న ఆహారాన్ని అన్నీ కలిసి తింటాయి.
అంతేకాదు ఒక కాకికి ఆపదజరిగితే అన్ని కాకులు సానుభూతి తెలుపుతాయి.
పడిపోయిన కాకిని సమీపించేవారిని కాళ్ళతో పొడుస్తాయి. కాకులకు ముందుచూపు ఎక్కువ. అందుకనే కాకులన్నీ ఐక్యంగా ఆహారాన్ని ముందుగానే జాగ్రత్త పరచుకుంటాయి. ఆహారాన్ని పరస్పరం అందిపుచ్చుకుంటాయి. విహారానికి కూడా కాకులు ఒక్కటిగా కలిసి వెళతాయి. శత్రువులపై ఒక్కటిగా దాడి చేస్తాయి. అందువల్ల కాకులు సమైక్యంగా ఉంటాయని పేర్కొనవచ్చు.

Exam Tips:

a) ఆహారాన్ని పంచుకోవడం, ఆపదలో సాయం – రెండు ఉదాహరణలు తప్పక ఇవ్వండి.

 

Question 5: కాకి విశిష్టతను సొంతమాటల్లో రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

కాకి మానవులకు మంచి ఉపకారం చేసే పక్షి. కాకులు జనావాసాల నుండి చెత్తాచెదారాన్నీ, మలిన పదార్థాలనూ దూరంగా తీసుకుపోతాయి. ఆ విధంగా కాకులు మన పరిసరాల పరిశుభ్రతకు తోడ్పడుతున్నాయి.
మనం కాకిని చీదరించుకుంటాం అయినా అది నొచ్చుకోదు. అన్న కొడుకు తన పినతండ్రిని, ‘కాక కాక’ అని ప్రేమతో పిలిచినట్లుగా, కాకి ‘కాక’ అని అరుస్తుంది. అది తెలియక కలుపుగోలుతనం లేని మనం, కాకిని చీదరించుకుంటాము.
నిజానికి పాపాత్ముడి మనస్సులో పేరుకుపోయిన నలుపు కంటె, కాకి నలుపు కలుషితమైనది కాదు. శ్రీకృష్ణుడు నలుపు. ఈశ్వరుని కంఠం నలుపు. చంద్రుడి ముఖంలో మచ్చ నలుపు. మనుష్యుల తలలు నలుపు. అటువంటప్పుడు, కాకి నలుపును అసహ్యించుకోడం అనవసరం. అది తప్పు.
కాకి మన ఇళ్ళమీద వాలి, మన క్షేమ సమాచారాన్ని అడుగుతుంది. మనం చీదరించుకున్నా, కాకి మన ప్రాణ స్నేహితుడిలా వచ్చిపోవడం మానదు కాకిని మనం చీదరించి కొట్టినా, కాకి ఏ మాత్రం విసుక్కోదు. రాయబారివలె చుట్టాలు మన ఇంటికి వస్తున్నారన్న వార్తను తెస్తున్నట్లుగా గొంతు చింపుకొని తన నోరు నొప్పిపెట్టేటట్లు అరుస్తుంది.
ఎప్పుడో ఏడాదికొకసారి వచ్చి కూసే కోయిలను మనం మెచ్చుకుంటాం. అదే రోజూ వచ్చి మనలను పలుకరించే కాకిని మనం చులకనగా చూస్తాం. కాని కాకి నిజానికి మనకు ప్రాణస్నేహితుడిలాంటిది.

Exam Tips:

a) పరిశుభ్రత, కలుపుగోలుతనం, ప్రాణస్నేహం, కోకిలతో పోలిక – వరుసగా పేరాగ్రాఫులుగా రాయండి.

 

Question 6: మనుషులు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న కాకి మనుషుల గురించి తాను ఏమనుకుంటుందో ఊహించి కాకి స్వగతం రాయండి.

Answer:

కాకి అంతరంగం
ఈ మనుషులు శుద్ధ అమాయకులు. పరిశుభ్రత లేనివాళ్ళు. తాము తినగా మిగిలిన ఎంగిలి మెతుకులను పెరటిలో, వీధుల్లో వీరు పారపోస్తారు. లేదా పెంటకుప్పలపైనా, తమ ఇళ్ళల్లోనూ కుళ్ళిపోయిన, చెడిపోయిన పదార్థాలను వీళ్ళు పారవేస్తారు. అవి అలా కుళ్ళి దుర్వాసన పెరిగితే అంటురోగాలు వస్తాయని పాపం వీళ్ళకు తెలియదు కాబోలు.
ఇప్పటికే ఈ మనుషులు నానా రోగాలతో బాధపడుతున్నారు. అందుకే ఈ మనుష్యులకు శుభ్రత గురించి నేర్పుదామని వీళ్ళు పారవేసిన ఎంగిలి మెతుకులను, చెత్తా చెదారాన్ని వీరి ఇళ్ళ నుండి తీసికెళ్ళి దూరంగా నేను పారవేస్తున్నా. నేను వీళ్ళకు ఎంతో మేలు చేస్తున్నా. అయినా వీళ్ళు కృతజ్ఞత లేనివాళ్ళు. నన్ను ‘హాష్ కాకీ’ అంటూ దూరంగా తరుముతారు.
నేను మనుషులకు ప్రాణస్నేహితుడిని. వాళ్ళ ఆరోగ్యాల గురించి, నేను. అందుకే శ్రద్ధ తీసికొంటున్నా. కాని ఈ మనుష్యులు నన్ను చీదరించుకుంటూ, కర్రతో కొడతారు. నాపై బెడ్డలు విసరుతారు. బహుశా ఈ మనుషులు, నాకు వాళ్ళ ఎంగిలి మెతుకులు పెట్టి పోషిస్తున్నాం అనుకుంటున్నారేమో! నాకు వీళ్ళ మెతుకులే అక్కర్లేదు.
అడవులలో, దొడ్లలో ఎన్నో చెట్ల కాయలు, పళ్ళు ఉన్నాయి. నిజానికి అవి ఎంగిలివి కావు. నాకు బోళ్ళంత ఆహారం ఉంది. వీళ్ళు నన్ను కాకిగోల అని, కాకిబలగం అని, కాకిచూపు అని ఆక్షేపిస్తారు. ఈ మనుషులు చేసే గోల, నా గోల కంటే పెద్దది.
మోటారు సైకిళ్ళ చప్పుళ్ళు, ఫ్యాక్టరీల కూతలు, రికార్డుల మోతలు ఎంతో శబ్ద కాలుష్యం. ఈ మనుషులు వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడుతున్నారు.
నాకు ఈ మనుషులపై జాలి, దయ. అందుకే వీరి ఇళ్ళల్లో నేను మోడీ పిలుపు రాని క్రితమే, స్వచ్ఛభారత్ ఉద్యమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నా. నా మంచితనం వీళ్లకి ఎప్పుడు అర్థం అవుతుందో?

Exam Tips:

a) స్వగతం ‘నేను’ అనే ఉత్తమ పురుషలో రాయాలి; కాకి సేవలు, మనుషుల కృతఘ్నత రెండూ కనిపించాలి.

 

Question 7: తన గురించి చులకనగా మాట్లాడడం తగదని కాకి మనుషులతో మాట్లాడింది. దీన్ని ఊహించి సంభాషణ రూపంలో రాయండి. (పై ప్రశ్నకు బదులుగా)

Answer:

కాకి – మనిషి సంభాషణ
మనిషి : ఛీ! కాకీ! నీకు బుద్ధి లేదా! పొమ్మంటే పోవేం! సిగ్గుండాలి. ఒకసారి చెపితే వినాలి. ఇంత సిగ్గులేకుండా ఎలా పుట్టావ్ ?
కాకి : మానవా! నీవు నన్ను తరమడం మానవా? నేను నీకు ఉపకారం చేద్దామనే రోజూ వస్తూ ఉన్నా. కాని నీవు కృతఘ్నుడివి. నీవు పారవేసిన మెతుకులు, పదార్థాలూ కుళ్ళిపోతే మీ మనుషులకు అంటురోగాలు వస్తాయని, జాలిపడి వాటిని ఏరి దూరంగా పడవేద్దామని నేను మీ ఇళ్ళకు వస్తున్నా. నీకు ఎందుకు అర్థం కాదు?
మనిషి : చాలులే. కాకీ! నీది దొంగ బుద్ధి. ఎంగిలి మెతుకులు తినడం మాని, ఇంట్లోకి వచ్చి మేము ఎండబెట్టుకున్న పప్పులు వగైరా పట్టుకుపోతావు. నీకు కారం వేయదేమో! మిరపకాయలు పట్టుకుపోతావు. మా చెట్లకాయలు -కొరికి పారవేస్తావు. నీవు మా ఆరవేసిన బట్టలపై రెట్టలు వేస్తావు. ఏవేవో తెచ్చి మా పెరట్లో పారవేస్తావు. మాంసం ముక్కలు, కోడి వెండ్రుకలు తెచ్చి పడవేస్తావు. నీవు చేసే శుభ్రం నాకు తెలియనిది కాదు.
కాకి : ఏం మనిషివయ్యా! నేను ఎక్కడనుండో ఏవో పనికి రాని పదార్థాలు తీసుకువెడుతుండగా మీ పెరట్లో మీరు పారవేసిన కుళ్ళు మెతుకులు నాకు కనబడతాయి. వాటిని కూడా దూరంగా పారవేద్దామని, మీ పెరట్లో దిగుతా. ఇంతలో నన్ను నీవు బెదరిస్తావు. నానోట్లో వస్తువులు మీ దొడ్లో జారిపడతాయి. దానికి కారణం నువ్వే ! తప్పు నా మీద దొర్లిస్తున్నావు!
మనిషి : నిన్న మా ఇంట్లో కొబ్బరిచిప్పలు తీసుకుపోయావు. మా తమ్ముడిని నీ ముక్కుతో పొడిచావు. మా దొడ్లో పళ్ళను కొరికి పారవేస్తున్నావు? నీవు ఇంక మా ఇంటికి రాకు.
కాకి : నేను మీ ఇంటికి రాకపోతే, నీకే నష్టం. నేను జీతం, నాతం లేకుండా నీ పెరట్లో, పరిసరాల్లో శుభ్రం చేసి, నీకు, ఉపకారం చేస్తున్నా. కృతజ్ఞతగా ఉండు. మనిషివి అనిపించుకో. కొంచెం దయగా ఉండు.
మనిషి : నిజమే కాకీ! నీవు చెప్పినది నాకు అర్థం అయ్యింది. రేపటి నుండి మనం స్నేహితులుగా ఉందాం. కోపం తెచ్చుకోకు.

Exam Tips:

a) సంభాషణలో వక్త పేరు, కోలన్ (:) వాడి వరుసగా రాయండి.
b) చివరలో మనిషి తప్పు ఒప్పుకునేలా ముగించండి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: పాఠం ఆధారంగా కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) కాకి ఆ) గృహం ఇ) సంతోషం ఈ) ముల్లు

Answer:

అ) కాకి: 1. ధ్వాంక్షము 2. బలిపుష్టము 3. వాయసము 4. మౌకలి 5. ఆత్మఘోషము 6. కరటము 7. చిరజీవి
ఆ) గృహం: 1. ఇల్లు 2. కొంప 3. గీము 4. గేహము 5. భవనము
ఇ) సంతోషం: 1. హర్షము 2. సంతసము 3. ముదము 4. ప్రమోదము
ఈ) ముల్లు: 1. కంటకము 2. ములికి 3. ములుకు

Exam Tips:

a) పాఠంలోని పద్యాల్లోని పదాలనే వాడండి; కనీసం మూడు పర్యాయపదాలు రాయడం ఉత్తమం.

 

Question 2: కింది వ్యుత్పత్తులకు సరైన పదాలు పాఠం ఆధారంగా గుర్తించండి.
అ) బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషింపబడేది.
ఆ) మాంసాన్ని కాంక్షించేది.

Answer:

అ) బలిపుష్టము
ఆ) ధ్వాంక్షము

Exam Tips:

a) పద్యంలోని పదం, దాని వ్యుత్పత్తి అర్థం – రెండూ సరిపోలాయో చూసుకోండి.

 

Question 3: కింది వాక్యాల్లో ప్రకృతి, వికృతి పదాలు వేరువేరుగా ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి.
అ) సిరి గలవారు దాన్ని సద్వినియోగం చేయడం తెలుసుకుంటే అదే సంతసం.
ఆ) విజయం సాధించిన ఆనందం ఆ పక్కి మొగంలో కనిపించింది.
ఇ) పక్షి కూడా గీము నిర్మించడంలో నైపుణ్యం కనబరుస్తుంది.
ఈ) శ్రీ విలసిల్లిన గృహంలో అందరి ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తుంది.

Answer:

అ) సిరి (వికృతి) – శ్రీ (ప్రకృతి); సంతసం (వికృతి) – సంతోషం (ప్రకృతి)
ఆ) పక్కి (వికృతి) – పక్షి (ప్రకృతి); మొగం (వికృతి) – ముఖం (ప్రకృతి)
ఇ) గీము (వికృతి) – గృహం (ప్రకృతి)
ఈ) శ్రీ (ప్రకృతి) – సిరి (వికృతి); గృహం (ప్రకృతి) – గీము (వికృతి); సంతోషం (ప్రకృతి) – సంతసం (వికృతి)

Exam Tips:

a) సంస్కృత రూపం ప్రకృతి, తెలుగులో మారిన రూపం వికృతి.
b) ప్రతి వాక్యంలో ఉన్న ప్రతి పదానికి జతను రాయండి.

 

Question 4: కింది ఇచ్చిన జాతీయాలు, సామెతలను గుర్తించి, వాటిని వినియోగించే సందర్భాన్ని రాయండి.
1) కాకి బలగం 2) కాకిపిల్ల కాకికి ముద్దు 3) కాకిగోల 4) లొట్టిమీద కాకి లొల్లి 5) మసిపూసి మారేడుకాయ చేయడం

Answer:

1) కాకి బలగం: బాగా ఎక్కువ మంది బంధుజనం ఉన్నారనే సందర్భంలో పరిహాసం చేస్తూ దీన్ని వినియోగిస్తారు.
2) కాకిపిల్ల కాకికి ముద్దు: ప్రతి వారికీ తమ పిల్లలు ముద్దుగా కనిపిస్తారనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.
3) కాకిగోల: ఎక్కువగా వాగుతున్నప్పుడు, పెద్దగా మాట్లాడుతున్నప్పుడు దీన్ని వినియోగిస్తారు.
4) లొట్టిమీద కాకి లొల్లి: కల్లుకుండ మీద వ్రాలిన కాకి బాగా అరుస్తుంది. అలా తిండిపదార్థాల పక్కన చేరి, ఆ పదార్థం లభించనప్పుడు దాని కోసం చేసే అల్లరి అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.
5) మసిపూసి మారేడుకాయ చేయడం: మోసం చేసి ఒక వస్తువును మరొక వస్తువుగా నమ్మించడం అనే సందర్భంలో దీన్ని వినియోగిస్తారు.

Exam Tips:

a) ప్రతి జాతీయానికి అర్థం కాకుండా ‘ఏ సందర్భంలో వాడతారో’ అని రాయడం ప్రశ్న ఉద్దేశం.

 

వ్యాకరణాంశాలు

Question 1: కింది సంధులకు సంబంధించిన పదాలు ఈ పాఠంలో గుర్తించి, వాటిని విడదీసి సూత్రాలు రాయండి.
సవర్ణదీర్ఘ సంధి, ఉకారసంధి (ఉత్వసంధి)

Answer:

సవర్ణదీర్ఘ సంధి:
విషాగ్ని = విష + అగ్ని = సవర్ణదీర్ఘ సంధి
సూత్రము: అ, ఇ, ఉ, ఋ లకు, అవియే అచ్చులు పరమైన సవర్ణదీర్ఘములు ఏకాదేశంబగు.
ఉకారసంధి (ఉత్వసంధి):
1. దినములెన్ని = దినములు + ఎన్ని
2. పాయసమొల్లక = పాయసము + ఒల్లక
3. బోనమబ్బు = బోనము + అబ్బు
4. గంతులిడును = గంతులు + ఇడును
5. లిబ్బులబ్బగ = లిబ్బులు + అబ్బగ
6. జల్లులిడడె = జల్లులు + ఇడడె
7. ములుకులగును = ములుకులు + అగును
8. తగవులాడు = తగవులు + ఆడు
అన్నీ ఉత్వసంధి. సూత్రము: ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

Exam Tips:

a) సంధి సూత్రాన్ని పదం విడదీసిన వెంటనే తప్పక రాయండి; సూత్రం లేకపోతే మార్కులు తగ్గుతాయి.

 

Question 2: కింది పదాలు విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలు రాయండి.
అ) దినములెన్ని ఆ) తొడఁగొట్టి ఇ) లొల్లియనుచు

Answer:

అ) దినములు + ఎన్ని = ఉత్వసంధి
సూత్రము: ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఆ) తొడన్ + కొట్టి = ద్రుత ప్రకృతిక సంధి (లేక) సరళాదేశ సంధి
సూత్రము 1: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ఉదా: తొడన్ + గొట్టి
సూత్రము 2: ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు. ఉదా: తొడఁగొట్టి
ఇ) లొల్లి + అనుచు = యడాగమ సంధి
సూత్రము: సంధిలేనిచోట అచ్చుకంటే పరమైన అచ్చునకు యడాగమంబగు. ఉదా: లొల్లి + య్ + అనుచు = లొల్లియనుచు

Exam Tips:

a) ద్రుతప్రకృతికం (న్, ం) తర్వాత పరుషం ఉంటే సరళాదేశం – ఈ సూత్రాన్ని గుర్తుంచుకోండి.
b) ఇ, ఈ, ఎ, ఏ, ఐ లతో అంతమై అచ్చు పరమైతే యడాగమం వస్తుంది.

 

Question 3: కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.
అ) ఎంగిలిమెతుకులు ఆ) కాకిబలగం ఇ) విషాగ్ని

Answer:

అ) ఎంగిలియైన మెతుకులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) కాకి యొక్క బలగం – షష్ఠీ తత్పురుష సమాసం
ఇ) విషము అనెడి అగ్ని – రూపక సమాసం

Exam Tips:

a) ‘యొక్క’ ఉంటే షష్ఠీ; ‘ఐన’ తో విశేషణం ఉంటే కర్మధారయం; ‘అనెడి/అనే’ తో ఉపమానం ఉంటే రూపకం.

 

Question 4: కింది పద్య పాదాలలో ఒకే రకంగా ఉన్న మాటలు (పదాలు) గుర్తించి, రాయండి. ఆ పదాల ఆధారంగా యమకాలంకారం గురించి వివరించండి.
అ) లేమా ! దనుజుల గెలువగ లేమా! నీవేల కడగి లేచితివిటురా.
ఆ) పాఱఁజూచిన పరసేన పాఱఁజూచు.
ఇ) మీ పాఠ్యభాగం ‘ధర్మపాలన’లో ‘యమకాలంకార’ పాదాలను గుర్తించి రాయండి.

Answer:

అ) 1. లేమా 2. లేమా
ఆ) 1. పాఱఁజూచిన 2. పాఱఁజూచు
గమనిక: ఒకే శబ్దంతో కూడిన పదాలు అర్థభేదంతో రెండుసార్లు వచ్చాయి. ‘లేమా’ అనే పదం మొదటి చోట ‘స్త్రీ’ అనే అర్థంలో, రెండవచోట ‘చాలమా’ (గెలువజాలమా) అనే అర్థంలో ప్రయోగించబడింది. ‘పాఱఁజూచు’ మొదటిచోట ‘తేరిపారచూడటం’, రెండవచోట ‘పారిపోవ చూస్తుంది’ అనే అర్థాలలో వచ్చింది.
ఇటువంటి పదప్రయోగం జరిగితే అది ‘యమకము’ అనే శబ్దాలంకారం అవుతుంది.
లక్షణం: పదాలు తిరిగి తిరిగి వస్తూ, అర్థభేదం కలిగి ఉంటే అది ‘యమకాలంకారం’. పదాల విరుపువల్ల అర్థభేదం సృష్టించడం దీని ప్రత్యేకత.
ఇ) ‘ధర్మపాలన’ పాఠంలోని యమక పాదాలు:
1. వేయునేటికి నలపాండవేయుసాటి
2. వింటికొరిగిన రిపురాజి వింటికొరగు
3. కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు
4. ఏలవలె శాశ్వతముగాగ నీ ఘనుండె / యేలవలె నన్యులన, నా నృపాలుడలరు – మొదలైనవి.

Exam Tips:

a) యమకం = అర్థభేదంతో ఒకే పదాల పునరావృత్తి; ఉదాహరణలో రెండు చోట్లా అర్థాలను విడివిడిగా చెప్పండి.

 

Question 5: కింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి, లక్షణాలతో సమన్వయం చేయండి.
‘ఆ పురమేలు ‘మేలుబళి’ ! యంచు బ్రజల్ జయవెట్టుచుండ నా’

Answer:

ఆపురమేలుమేలుబళియంచుబ్రజల్జయవెట్టుచుండనా
U I IU I UI I IU I IU I IU I UI U
భరనభభరవ
గమనిక:
1. పై పద్యపాదంలో భ, ర, న, భ, భ, ర, వ గణాలున్నాయి. కాబట్టి ఇది ‘ఉత్పలమాల’ పద్యపాదం.
2. యతిస్థానము 10వ అక్షరము. (ఆ – యం)
3. ప్రాసాక్షరము ‘ప’
4. ఈ పాదంలో 20 అక్షరాలున్నాయి.

Exam Tips:

a) గురువు = U, లఘువు = I; మూడేసి అక్షరాల గణాలుగా విడగొట్టి గణం పేరు రాయండి.
b) ఉత్పలమాల: భ ర న భ భ ర వ – 20 అక్షరాలు, 10వ అక్షరం యతి.

 

ప్రాజెక్టు పని

Question 1: పక్షులకు సంబంధించిన కథ/గేయం/కవిత సేకరించి రాయండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.

Answer:

చిలకమ్మ పెండ్లి (పాట)
చిలకమ్మ పెండ్లి అని – చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి – చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు – సందడి చేయగ
కాకుల మూకలు – బాకాలూద
కప్పలు బెకబెక – డప్పులు కొట్టగ
కొక్కొరో కోయని – కోడి కూయగా
ఝమ్మని తుమ్మెద – తంబుర మీటగ
కుహు కుహూయని – కోయిల పాడగా
పిల్ల తెమ్మెరలు – వేణువూదగా
నెమలి సొగసుగా – నాట్యం చేయగా
సాలీడిచ్చిన – చాపు కట్టుకొని
పెండ్లి కుమారుడు – బింకము చూపగ
మల్లీ మాలతి – మాధవీ లతలు
మైనా గోరింక – పెండ్లి కుమారుని
దీవిస్తూ తమ పూలు రాల్చగ
పెండ్లి కుమారుని – మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత – చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టే – చింతాకు పుస్తె..
– గిడుగు వేంకట సీతాపతి గారి రచన

Exam Tips:

a) సేకరించిన గేయం/కథ శీర్షిక, రచయిత పేరుతో సహా రాయండి.
b) నివేదికలో పక్షుల పేర్లు, ప్రత్యేకతలను పట్టికగా చూపితే బాగుంటుంది.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 9 Telugu Lesson 11 The Crow (Vayasam)

Textbook Solutions for Class 9 Telugu Lesson 11 The Crow (Vayasam)

Explore reliable textbook solutions for Lesson 11 The Crow (Vayasam) tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 11 The Crow (Vayasam) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 11 The Crow (Vayasam) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 9th Class Telugu Lesson 11 వాయసం for the 2026-27 session?

The complete and updated TS 9th Class Telugu Lesson 11 వాయసం is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 9th Class Telugu Lesson 11 వాయసం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Lesson 11 వాయసం will help students to get full marks in the theory paper.

Do you offer TS 9th Class Telugu Lesson 11 వాయసం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Lesson 11 వాయసం in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire TS 9th Class Telugu Lesson 11 వాయసం in printable PDF format for offline study on any device.