TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్

Solutions for Class 9 Telugu: Lesson 09 Chorus (Salandra Lakshminarayana)

Explore reliable textbook solutions for Lesson 09 Chorus (Salandra Lakshminarayana) tailored for Class 9 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Practice Class 9 Telugu Solutions: Lesson 09 Chorus (Salandra Lakshminarayana)

Access the complete solution PDF for Class 9 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 91)

“అన్నపురాసులు ఒకచోట
ఆకలిమంటలు ఒకచోట
హంసతూలికలొకచోట
అలసినదేహాలొకచోట
సంపదలన్నీ ఒకచోట
గంపెడు బలగాలొకచోట
వాసన నూనెలొకచోట
మాసిన తలలింకొకచోట
కమ్మని చకిలాలొకచోట
గట్టి దౌడలింకొకచోట” – కాళోజి

Question 1: పై కవితాపంక్తులు ఏ విషయం గురించి చెప్తున్నాయి?

Answer:

పై పంక్తులు సంఘంలో ఉండే పరస్పర విరుద్ధ పరిస్థితులను వెల్లడిస్తున్నాయి. ఆకలి వేసేవాడి దగ్గర అన్నంలేదు. అక్కరలేనివాడి దగ్గర “అది పోగుపడి ఉంది” అని ఈ పంక్తులు తెలుపుతున్నాయి.

Exam Tips:

a) కవి చూపిన వైరుధ్యాన్ని ('ఆకలి వేసేవాడి దగ్గర అన్నం లేదు – అక్కరలేనివాడి దగ్గర పోగుపడి ఉంది') ఒక్క వాక్యంలో రాయండి.

 

Question 2: అలసిన దేహాలకు ఏం కావాలి ?

Answer:

అలసిన దేహాలకు కొంచెం విశ్రాంతి కావాలి. కడుపునిండా తిండి కావాలి. కాసింత ఓదార్పు కావాలి. శ్రమపడ్డాడనే గుర్తింపు కావాలి. సంఘం యొక్క మన్నన కావాలి.

Exam Tips:

a) పేరాలోని ఐదు అవసరాలను (విశ్రాంతి, తిండి, ఓదార్పు, గుర్తింపు, సంఘం మన్నన) వదలకుండా రాయండి.

 

Question 3: ‘అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట’ అంటే మీకేం అర్థమైంది ?

Answer:

ఆకలి లేనివాడికి, తింటే పడనివాడికి, దిట్టంగా వాడి దగ్గర ధనం, ఆహారపదార్థాలు ఉంటాయి. కాని వాడు వాటిని తినలేడు. వాడికి ఆకలి లేదు. తింటే వాడి ఆరోగ్యం చెడిపోతుంది. ఆకలి వేస్తున్నవాడికి అన్నం కావాలి కాని వాడికి తినడానికి తిండిలేని దరిద్రం. ఈ విధంగా సంఘంలో పరస్పర వైరుధ్యాలున్నాయని నాకు అర్థమయ్యింది.

Exam Tips:

a) ఆకలి లేనివాడి వద్ద ఆహారం, ఆకలి ఉన్నవాడి వద్ద లేమి అనే రెండు వైపులనూ చూపండి.
b) ముగింపులో 'సంఘంలో వైరుధ్యాలున్నాయి' అని రాయండి.

 

Question 4: “కమ్మని చకిలాలొకచోట – గట్టి దౌడలింకొక చోట” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి ?

Answer:

‘కమ్మని చకిలాలు’ అంటే కమ్మని జంతికలు. అవి కొరికి తింటే కమ్మగా ఉంటాయి. వాడి దగ్గర ఆ చకిలాలు ఉన్నాయి. కాని గట్టిగా ఉండే వాటిని కొరికి తినడానికి వాడికి గట్టి దౌడలు, దంతాలు లేవు. అంటే ఆ కమ్మని చకిలాల ప్రయోజనం వాడికి అందదు. అలాగే మరో వ్యక్తికి గట్టి దౌడలు, దంతాలు ఉన్నాయి.
కాని వాడికి తినడానికి చక్కిలాలు లేవు. వాడికి గట్టి దౌడలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విధంగా ప్రయోజనం, ఉపయోగం లేనిచోట సంపదలు పోగు పడుతున్నాయి. కావలసిన బీదవాడి వద్ద దరిద్రం ఉంటోందని అర్థం.

Exam Tips:

a) 'చకిలాలు' (జంతికలు) అర్థం చెప్పి, దౌడలు ఉన్నవాడికి చకిలాలు లేవనే వైరుధ్యాన్ని వివరించండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 93)

Question 1: ‘భూమికి – ఆకాశానికి ఉన్న సంబంధం చెప్తే కొందరు నవ్వుతారు’ – అని కవి అనడానికి కారణం ఏమిటి ?

Answer:

దళితవాద కవి సలంద్ర లక్ష్మీ నారాయణగారు, తన ‘కోరస్’ అనే కవితలో భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధం తాను చెప్తే కొంతమంది నవ్వుతారన్నాడు. నిజమే. భూమికీ, ఆకాశానికీ మధ్య ఎంత దూరం ఉన్నా, వాటికి ఉన్న సహజ సంబంధాన్ని మనం గుర్తించాలని రచయిత ఉద్దేశం.
భూమి, ఆకాశము అనేవి రెండూ పంచ మహా భూతాలలోనివే. ఈ సృష్టి నిర్మాణానికి పంచమహా భూతములే కారణం. అటువంటిది ఉన్నత కులాలవారు, తాము ఆకాశం వలె ఎత్తుగా గొప్పవారము అని, దళితులు భూమిలా అడుగున పడియుండాలని అంటారు.
నిజానికి భూమ్యాకాశములు రెండూ సృష్టికి సమాన కారణాలే అయినట్లు, దళితులూ, అగ్రవర్ణాల వారూ అందరూ సమాజంలో సమానమే అని, ఆ మాట కవిగారు అంటే అగ్రవర్ణాలవారు నవ్వుతారనీ కవిగారి అభిప్రాయం.

Exam Tips:

a) భూమి–ఆకాశం రెండూ పంచభూతాలలోనివే అనే వాదనతో, అగ్రవర్ణాలు తమను ఆకాశంలా గొప్పవారిగా భావించడాన్ని పోల్చండి.

 

Question 2: ‘ప్రవాహం – నిశ్చలత’కు తేడాను మీరెట్లా అర్థం చేసుకుంటారు ?

Answer:

‘ప్రవాహం’ అంటే చైతన్యం. నీటిలో ప్రవాహం ఉంటే ఒక చోట నీరు కదలి, మరోచోటికి పోతుంది. పై నుండి అక్కడికి కొత్తనీరు వస్తుంది. సమాజం ఒక ప్రవాహం లాంటిది. పాత పోయి కొత్తదనం వస్తూ ఉంటుంది. ప్రవాహంలో స్తబ్ధత, నిశ్చలత ఉండవు. ప్రవాహంలో ఉండే కదలిక, చైతన్యము అనేవి, సమాజ లక్షణాలు.
నిశ్చలత అంటే కదలకుండా అక్కడే పడియుండడం. సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించకుండా, పాత చింతకాయ పచ్చడి మనస్తత్వాన్ని కల్గియుండడం ‘నిశ్చలత’.
సమాజంలో వస్తున్న కొత్తమార్పులను ఆహ్వానించడం ప్రవాహం అనీ, పాతతరం భావాలనే అంటిపెట్టుకొని పడియుండడం నిశ్చలత అనీ, నేను అర్థంచేసుకున్నాను.

Exam Tips:

a) ప్రవాహం = చైతన్యం, మార్పును ఆహ్వానించడం; నిశ్చలత = మార్పును నిరాకరించడం. ఈ తేడాను స్పష్టంగా రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 94)

Question 1: ‘గొంతు నొక్కేయడం’ అనే పదంలో విశేషార్థంపై మాట్లాడండి.

Answer:

‘గొంతు నొక్కేయడం’ అంటే, గొంతు, నొక్కడం అని రెండు శబ్దాల అర్థం వేరుగా తీసుకొంటే, పీక నొక్కడం అనే అర్థం వస్తుంది. కాని గొంతు నొక్కేయడం అన్నది పదబంధము. ఏ మాటకు ఆ మాట అర్థం తీసికోరాదు. ఆ రెండు పదాలు కలిసిన పదానికి, విశేషార్థం ఉంటుంది. ‘గొంతు నొక్కేయడం’ అనే పదబంధానికి, ఆ వ్యక్తి మనస్సులోని విషయం, పైకి రాకుండా తొక్కిపెట్టడం అనే విశేషార్థం వస్తుంది. బలవంతంగానో, భయపెట్టో లేక బ్రతిమాలో ఒక వ్యక్తి చెప్పదలచుకున్న విషయాన్ని పైకి చెప్పనీయకుండా ఆపుచేయడాన్ని ‘గొంతు నొక్కేయడం’ అని చెప్పాలి.

Exam Tips:

a) 'గొంతు నొక్కేయడం' పదబంధం – అక్షరార్థం కాక విశేషార్థం (భావ ప్రకటన అణచివేత) అని రాయడం ముఖ్యం.

 

Question 2: ‘ఒంటరి’ అంటే మీకేం అర్థమయ్యింది ?

Answer:

‘ఒంటరి’ అంటే ఏకాకి. అనగా తాను చెప్పే విషయాన్ని ఇతరులెవ్వరూ సమర్థించకున్నా, తనతో ఇతరులు గొంతు కలుపకున్నా, తాను ఒక్కడే ధైర్యంగా నిర్భయంగా చెప్పదలచుకున్న విషయాన్ని లోకానికి చెపుతానని కవి అన్నాడు. దాన్నే కవి ‘ఒంటరి’ అన్నాడు.

Exam Tips:

a) 'ఒంటరి' = ఏకాకి; ఎవరూ మద్దతు ఇవ్వకున్నా సత్యాన్ని నిర్భయంగా చెప్పడం – అనే భావాన్ని రాయండి.

 

Question 3: ‘చూపుడు వేళ్ళు’ – అన్న కవి మాటలో కవి భావనను ఎట్లా అర్థం చేసుకున్నారు ?

Answer:

సామాన్యంగా ఇతరులను బెదరించాలన్నా, ఇతరుల మాటల్లో తప్పులు ఎత్తి చూపాలన్నా, తమ చూపుడు వేళ్ళను ఎదుటివారికి చూపిస్తూ వారిని బెదిరిస్తారు. “నిన్ను చంపేస్తాం జాగ్రత్త” అని ఎదుటివారిని భయపెట్టడానికి, మనం మన చూపుడువ్రేలిని ఎదుటివారి వైపు చూపిస్తాం. ఎదుటివారిని భయపెట్టడానికి, బెదిరించడానికి సామాన్యంగా మన చూపుడు వ్రేలును ఉపయోగిస్తాం. కవి కూడా తన భావాలు నచ్చనివారు తనవైపు వారి చూపుడు వ్రేళ్ళను చూపించి, భయపెట్టి తనను చంపుతారనీ, నిందిస్తారనీ అన్నాడు.

Exam Tips:

a) 'చూపుడు వేళ్ళు' బెదిరింపుకు, నిందకు ప్రతీక అని రాయండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: “కోరస్” అనే పేరు వినగానే మీకేమనిపించింది ? ‘కోరస్’ అనే పేరు ఈ కవితకు సరిపోతుందా ? ఎందుకు ? మీ అభిప్రాయం చెప్పండి.

Answer:

‘కోరస్’ అనే పేరు వినగానే మేము నిత్యమూ పాఠశాలలో బాలబాలికలు అందరూ కలిసి పాడే వందేమాతరం, జనగణమన గేయాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కొక్కసారి, పై పాటలను ఒక విద్యార్థి లేక విద్యార్థిని చెపుతూంటే, మిగిలిన పిల్లలం మేము కోరస్‌గా అనగా గొంతులు కలిపి ఒకే కంఠధ్వనితో పాడుతాము. లేదా మా పిల్లలం అంతా కలిసి, కోరస్ గా పాడతాము.
ఈ కవితకు కోరస్ అనే పేరు, అంతగా సరిపడదు. కాని ఈ కవిత చివర, రచయిత సమాజం అంతా చివరకు తన అభిప్రాయాలను గౌరవిస్తుందనీ, అందరూ తనతోపాటే గొంతు కలిపి తన పాటను పాడుతారనీ చెప్పాడు. సమాజం తనతో కోరస్‌గా ఈ పాట పాడుతుందని కవి తన ఆకాంక్షనూ, తన ఆత్మ విశ్వాసాన్నీ ప్రకటించాడు. అందువల్ల ఈ వచన కవితకు, ‘కోరస్’ అన్న శీర్షిక సరిపోవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను.

Exam Tips:

a) పేరు సరిపోతుందా లేదా అనే మీ అభిప్రాయానికి కారణం చెప్పండి; కవిత చివర సమాజం కోరస్ పాడుతుందనే ఆశను ప్రస్తావించండి.

 

Question 2: ‘కోరస్’ కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావన ఎటువంటిదని భావిస్తున్నారు ? చర్చించండి.

Answer:

‘కోరస్’ కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావనలివి.
1. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ, అంత తొందరగా అంగీకరించదు. 2. భూమ్యాకాశాలకు సంబంధం ఉన్నదని చెపితే, సమాజం నవ్వుతుంది. 3. పువ్వుకీ, ముళ్ళకూ మధ్య భేదం చెపితే, సమాజం కోపపడుతుంది.
4. ప్రవాహ నిశ్చలతలకు, రూపం కల్పిస్తే సమాజం ఒప్పుకోదు.
5. ఆలోచనకూ, ఆచరణకూ అర్థం చెప్తే సమాజం అపార్థం చేసుకుంటుంది. 6. మేధస్సుకూ, మూర్ఖత్వానికీ ఉన్న పోలికను చెపితే, సమాజం రాళ్ళు విసరుతుంది.
7. సమాజం యొక్క యథార్థ స్వరూపాన్ని సమాజానికి తెలియపరిస్తే సమాజం ఎదురుతిరుగుతుంది.
8. సమాజాన్ని ఎవరైనా ఒంటరిగా ఒక వ్యక్తి విమర్శిస్తే, ఆ సమాజం ఆ వ్యక్తి గొంతును నొక్కేస్తుంది.
9. సమాజం గురించి తనలో తానే విమర్శించుకుంటున్న వ్యక్తిని, సమాజం పిరికివాడంటుంది. మూర్ఖుడంటుంది. బెదరించి చంపుతుంది.
10. చివరకు సమాజం తనతో కోరస్ పాడుతుంది.
పై విధమైన భావనలు సమాజం పట్ల కవికి ఉన్నాయి.

Exam Tips:

a) పది భావనలను క్రమసంఖ్యలతో జాబితాగా రాస్తే స్పష్టంగా ఉంటుంది.

 

Question 3: కింది కవితా పంక్తులు చదువండి. భావం రాయండి.
ఆకులు లేకుంటే
చెట్టునెలా గుర్తిస్తావు ?
పచ్చదనమే చెట్టుకు చిరునామా !
చెరువులో బంగళాలు మొలిచాయి
నీటి తల్లికి ఇన్ని సమాధులా !
చెట్టుతనం కట్టెతనమయ్యింది
చిగురుకలలేవి ? చిటపటలు తప్ప ?

Answer:

చెట్టుకు ఆకులు లేకపోతే, అది ఏ చెట్టో గుర్తించడం ఎలా ? అది చెట్టు అనడానికి దానికి గల పచ్చదనమే గుర్తు. ఈనాడు చెరువులు కప్పుపడి, ఆ ప్రాంతంలో భవనాలు కట్టబడ్డాయి. తల్లి వంటి నీటికి ఇలా సమాధులు నిర్మిస్తారా ? చెరువులను కప్పివేస్తారా ? చెట్టు బ్రతికుంటేనే, దానికి చెట్టుతనం ఉంటుంది.
చెట్టు చచ్చిపోతే అది పొయ్యిలో కాల్చే కట్టె వలె అవుతుంది. చచ్చిన చెట్టులో కట్టెతనమే ఉంటుంది. చెట్టు, కట్టెగా మారితే, దానికి చిగురులు పుట్టినట్లు కలలు రావు. దానికి నిప్పుల్లో కాలిపోతున్నప్పుడు వినిపించే చిటపటలే వినబడతాయి.

Exam Tips:

a) భావం రాసేటప్పుడు ప్రతి పంక్తిని వరుసగా విడమరచి, చివరకు పర్యావరణ విధ్వంసంపై కవి ఆవేదనను చెప్పండి.

 

Question 4: “కోరస్” కవిత నుండి – కింది భావాలకు తగిన కవితా పంక్తులు గుర్తించండి.
అ) నాకు భయమన్నదే లేదు – నేను ఒక్కడినే నా పాట పాడుకుంటా.
ఆ) నేను స్తబ్దంగా ఉంటే పిరికివాడంటారు.
ఇ) వీళ్ళ అసలు రూపాలు చూపిస్తే, తట్టుకోలేక నన్నే విమర్శిస్తారు.
ఈ) ఆలోచనలకు, వాటి అమలుకు మధ్య రూపమిస్తే వీళ్ళు అంగీకరించరు.

Answer:

అ) “నాకు భయం లేదు, నేను నేడు, ఈ పాట,
ఒంటరిగానే పాడుకుంటాను !”
ఆ) “నేను
ఒంటరిగా ఆలోచనలలో
ఊరికే ఊసుపోక పరుగులు తీస్తే
నన్ను పిరికివెధవననీ”
ఇ) “మీ ముఖాలు చూసుకొండంటూ
ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని
ముక్కలు చెక్కలుగా పగుల గొట్టేస్తారు”
ఈ) “ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే
వీళ్ళే అపార్థం చేసుకుంటారు”

Exam Tips:

a) ప్రతి భావానికి సరిపోయే పంక్తులను కవితలో ఉన్నట్లే కొటేషన్‌లో యథాతథంగా రాయండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (ఐదేసి వాక్యాల్లో జవాబులు)

Question 1: తన మీద రాళ్ళు విసురుతారని కవి భావించడంలో అంతరార్థం ఏమిటి ? వివరించండి.

Answer:

కవి సలంద్ర లక్ష్మీనారాయణ, తన కోరస్ అనే కవితలో, తెలివికీ మూర్ఖత్వానికీ దగ్గర పోలిక ఉందని తాను అంటే, మేధావులు తన మీద రాళ్ళు విసరుతారని చెప్పాడు. అంటే మేధావులు తనను నిందిస్తారని ఆయన చెప్పాడు.
మూర్ఖుడు తనకు తోచిందే తప్ప ఇతరులు చెప్పిన దానిని విని, ఆ మాటల్లోని మంచి చెడ్డలను గ్రహింపడు. మేధావులు కూడా, అంతా తమకే తెలుసుననీ, తమకు ఎవరూ ఏమీ చెప్పనవసరంలేదనీ అనుకుంటారు. ఇతరులు చెప్పింది వినకపోవడం మూర్ఖత్వమనీ, ఒక విధంగా మేధావికీ, మూర్ఖుడికీ పోలిక ఉందనీ చెపితే మేధావి కోపపడతాడు. తనను మూర్ఖుడితో పోల్చి చెప్పినవాడిపై మేధావి రాళ్ళు విసరుతాడు. అంటే కోపపడతాడు.
మేధావి కూడా మూర్ఖుడిలాగానే ఇతరులు చెప్పింది వినడని, ఈ మాటల్లోని అంతరార్థము.

Exam Tips:

a) రాళ్ళు విసరడం = నిందించడం/కోపపడటం అని చెప్పి, మేధావి కూడా మూర్ఖుడిలా వినడని అంతరార్థం రాయండి.

 

Question 2: మేధస్సు, మూర్ఖత్వం మధ్య తేడా ఏమిటి ?

Answer:

మేధస్సు గల మేధావి తానే మేధ గలవాడిననే గర్వంతో ఇతరులు ఎవరైనా ఏదైనా చెపితే అది సరయినదే అయినా, తాను అంగీకరించడు. తనకున్న తెలివితో తాను చెప్పినదే సరయినదని వాదిస్తాడు. తన మూర్ఖపు పట్టు ఎంతమాత్రం విడిచిపెట్టడు. మూర్ఖుడు కూడా తాను అనుకున్నదే కాని కొత్తదాన్ని అంగీకరించడు. “చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు” అని భర్తృహరి మూర్ఖుణ్ణి గూర్చి నిజం చెప్పాడు. ఒక విధంగా మేధావి కూడా మూర్ఖుడిలాగే ప్రవర్తిస్తాడు. తాను అనుకొన్నదే తప్ప, ఇతరులు చెప్పిన దానిని అతడు అంగీకరించడు.
దీనిని బట్టి మేధావికీ, మూర్ఖుడికీ పేరులో తప్ప వ్యవహారంలో పెద్దగా తేడా కనిపించదు.

Exam Tips:

a) ఇద్దరూ తమ మాటే నెగ్గాలనుకోవడం వల్ల తేడా లేదని కవి భావన – దానిని ఉదాహరణతో రాయండి.

 

Question 3: కవి దృష్టిలో మేధావులంటే ఎవరు ?

Answer:

మేధావులు అంటే, తెలివిగలవారు. సమాజానికి ఏది మంచో, ఏది చెడో తెలిసికోగల బుద్ధిమంతుల్ని మేధావులు అని చెప్పాలి.
మూర్ఖుడి వలె, ఏది చెప్పినా వినని మేధావి కూడా మూర్ఖుడితో సమానమే అని కవి ఉద్దేశ్యము. సమాజంలో వస్తున్న మార్పులను గమనించలేనివారు మేధావులు కారని కవి భావన. ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహింపలేనివాళ్ళు, ప్రజల పక్షాన నిలబడని వాళ్ళు, మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించాలని కవి భావన.

Exam Tips:

a) నిజమైన మేధావి = సమాజం మార్పులు గమనించి ప్రజల పక్షాన నిలిచేవాడు అని రాయండి.

 

Question 4: ‘గొంతునొక్కేయడం’ అంటే మీకేమి అర్థమయింది ? ఒక ఉదాహరణ తెలుపండి.

Answer:

‘గొంతు నొక్కేయడం’ అనేది ఒక పదబంధం. ఒక వ్యక్తి మనసులోని భావాన్ని పైకి చెప్పనీయకుండా అణచివేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
బలవంతంగానో, భయపెట్టో లేక మరో రీతిగానో ఒక వ్యక్తి చెప్పదలచుకున్న విషయాన్ని పైకి చెప్పనీయకుండా ఆపు చేయడాన్ని ‘గొంతు నొక్కేయడం’ అంటారు.
ఉదా : న్యాయస్థానంలో నిజం చెప్పడానికి వచ్చిన సాక్షి గొంతు నొక్కేశారు.

Exam Tips:

a) అర్థం + ఒక ఉదాహరణ వాక్యం తప్పక ఇవ్వండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (పది వాక్యాల్లో జవాబు)

Question 1: “కోరస్” పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంతమాటలలో రాయండి.

Answer:

నేను భూమికీ, ఆకాశానికీ ఉన్న సంబంధాన్ని చెప్తే సమాజం నన్ను చూసి నవ్వుతుంది. పువ్వుకీ, ముళ్ళకీ ఉన్న తేడా చెప్తే సమాజం నాపై కోపపడుతుంది. ప్రవాహానికీ, నిశ్చలతకూ రూపం కల్పిస్తే సమాజం అంగీకరించదు. ఆలోచనలకూ, వాటి అమలుకూ మధ్య రూపమిస్తే సమాజం అంగీకరించదు. మేధావులకూ, మూర్ఖులకూ పోలిక ఉందంటే మేధావులు రాళ్ళతో కొడతారు. వారి అసలు రూపాలు వివరంగా చూపిస్తే నన్ను విమర్శిస్తారు.
నేను గొంతెత్తి ఒంటరిగా మాట్లాడితే, నా గొంతు నొక్కేయాలని చూస్తారు. ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే, పిరికివాడవని అంటారు. నన్ను మూర్ఖుడని అంటారు. చూపుడు వేలుతో నన్ను బెదిరించి చంపేస్తారు. అయినా భవిష్యత్తులో నన్ను వ్యతిరేకించినవాళ్ళే, సత్యాన్ని గ్రహించి, నా మాటతో ఏకీభవిస్తారనీ, నాతో కలిసి కోరస్ ఆలపిస్తారనీ కవి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు.

Exam Tips:

a) కవిత క్రమాన్ని అనుసరించి (భూమి–ఆకాశం, పువ్వు–ముళ్ళు, … చివర కోరస్) సారాంశం రాసి, కవి ఆత్మవిశ్వాసంతో ముగించండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా)

Question 1: కవి సలంద్ర ఆలోచనలను, ఈ కవిత అంతరార్థాన్ని ప్రశంసిస్తూ ఏదైనా ఒక సాహిత్య పత్రికకు లేఖ రాయండి.

Answer:

సాహిత్య పత్రికకు లేఖ
ఖమ్మం,
తేదీ : XXXX.
ప్రధాన సంపాదకులు,
సాహితీ కౌముది,
ఉత్తమ సాహిత్య కళా సాంస్కృతిక మాసపత్రిక,
హైదరాబాదు.
సంపాదక మహాశయా!
నమస్కారాలు. మాకు తొమ్మిదవ తరగతిలో దళిత సాహిత్యోద్యమానికి పునాది వేసిన ‘దళిత మానిఫెస్టో’ కవితా రచయిత సలంద్ర లక్ష్మీనారాయణగారు రాసిన ‘కోరస్’ వచన కవిత పాఠ్యభాగంగా నిర్ణయింపబడింది. ఆ కవితలోని అంతరార్థం, ఆ కవిగారి ఆలోచనలు నాకు నచ్చి లేఖారూపంగా రాస్తున్నా. దయతో దీన్ని పరిశీలించి, మీ సాహిత్య పత్రికలో ప్రచురింపగలరని కోరుతున్నాను.
సలంద్ర వారి కోరస్ కవిత అద్భుతంగా ఉంది. సమాజం కొత్త ధోరణులనూ, వాస్తవాలనూ అంత తొందరగా అంగీకరించదనే విషయాన్ని గురించి కవి ఆవేదన వ్యక్తం చేస్తూ, అనేక విధాలుగా తన ప్రశ్నలనూ సందేహాలనూ ‘కోరస్’ అన్న తన వచన కవితలో వెలిబుచ్చాడు.
ఈయన భూమ్యాకాశాలకు మధ్య ఉన్న సహజ బంధాన్ని గుర్తించాలని, పూల సౌకుమార్యాన్నీ, ముళ్ళ కాఠిన్యాన్నీ గ్రహించాలనీ అంటాడు. నీటి ప్రవాహంలోని చైతన్యానికీ, నీటి నిశ్చలత్వానికీ గల తేడాను గ్రహించాలంటాడు. ఇవేవీ తెలుసుకోకుండా, కోపంతో అపార్థం చేసుకోవద్దంటాడు.
ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహించలేనివాళ్ళూ, ప్రజల పక్షాన నిలబడనివాళ్ళూ నిజమైన మేధావులు కారన్న సత్యాన్ని తెలిసికోమంటాడు.
ఒంటరిగా తాను ప్రగతిశీల భావాలు పాడుతానంటాడు. తనను పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్రవేసినా తాను లెక్కచేయనన్నాడు. ఇప్పుడు తనను వ్యతిరేకించినవాళ్ళే, భవిష్యత్తులో తనతో ఏకీభవించి, తన పాటతో గొంతు కలిపి, కోరస్ పాడతారన్నాడు. సలంద్ర మహాకవి, అభ్యుదయ కవి.
ఇట్లు,
మీ విశ్వసనీయ
కొంగర సత్యవాణి,
తొమ్మిదవ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు, ఖమ్మం,
తెలంగాణ రాష్ట్రం.
చిరునామా :
ప్రధాన సంపాదకులు,
సాహితీ కౌముది మాసపత్రిక,
అమీర్ పేట, హైదరాబాదు – 500004

Exam Tips:

a) లేఖలో చిరునామా, సంబోధన, విషయం, ముగింపు, పంపేవారి వివరాలు అనే నిర్ణీత రూపం పాటించండి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: ‘ఆచరణ’ పదానికి అర్థం రాసి, ఆ పదంతో సొంతవాక్యం రాయండి.

Answer:

ఆచరణ = ఆచరించేది, చేసేది
వాక్యప్రయోగము : గురువుల ఉపదేశాలు ఆచరణ యోగ్యంగా ఉండాలి.

Exam Tips:

a) అర్థం + సొంతవాక్యం రెండూ రాయండి; వాక్యంలో ఆ పదం తప్పక ఉండాలి.

 

Question 2: ‘ప్రతిబింబం’ పదానికి అర్థం రాసి, ఆ పదంతో సొంతవాక్యం రాయండి.

Answer:

ప్రతిబింబం = ప్రతిరూపం, నీడరూపం
వాక్యప్రయోగము : సూర్యుడి ప్రతిబింబం చెరువు నీళ్ళలో కనబడుతుంది.

Exam Tips:

a) వాక్యంలో పదాన్ని సందర్భానుసారంగా వాడండి.

 

Question 3: ‘నిశ్చల’ పదానికి అర్థం రాసి, ఆ పదంతో సొంతవాక్యం రాయండి.

Answer:

నిశ్చల = కదలనిది, స్థిరమైనది
వాక్యప్రయోగము : సంపూర్ణ నిశ్చలతతో కూడిన మనస్సుతో భగవంతుని స్మరించాలి.

Exam Tips:

a) 'నిశ్చల' పదానికి కదలనిది అనే అర్థాన్ని, వ్యతిరేకార్థం 'చలనం' అని గుర్తుంచుకోండి.

 

Question 4: ‘కోరస్’ పదానికి అర్థం రాసి, ఆ పదంతో సొంతవాక్యం రాయండి.

Answer:

కోరస్ = గొంతు కలుపటం
వాక్యప్రయోగము : విద్యార్థినీ, విద్యార్థులందరూ కలిసి, కోరస్‌గా జనగణమన గేయం పాడారు.

Exam Tips:

a) 'కోరస్' = అందరూ కలిసి ఒకే గొంతుతో పాడటం.

 

III. భాషాంశాలు – జాతీయాలు

Question 1: ‘రాళ్ళు విసరడం’ అనే జాతీయాన్ని వివరించండి.

Answer:

‘రాళ్ళు విసరడం’ అంటే లేనిపోని నేరాలు ఆరోపించి తప్పుపట్టడం అని అర్థము. ఎవరైనా ఒక మంచిపని చేస్తోంటే అది చూసి సహించలేని దుర్మార్గులు మంచిపని చేసేవాడిపై లేని నేరాలు ఆరోపించి, అతడిపై దోషాలు ఆరోపిస్తారు. దాన్నే ‘రాళ్ళు విసరడం’ అంటారు.

Exam Tips:

a) జాతీయం అర్థం + సందర్భం రెండూ రాయండి.

 

Question 2: ‘గొంతునొక్కేయడం’ అనే జాతీయాన్ని వివరించండి.

Answer:

‘గొంతు నొక్కేయడం’ అంటే మాట పైకి రాకుండా అడ్డుపెట్టడం అని అర్థము.
ఎవరైనా ఉన్న సత్యాన్ని ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడుతుండగా, వారు మాట్లాడితే సత్యం బయటపడుతుందనే భయంతో, బలవంతంగానో, లేక బెదరించో లేక బతిమాలో, అతడు గొంతువిప్పి మాట్లాడకుండా చేయడాన్ని, ‘గొంతునొక్కేయడం’ అంటారు.

Exam Tips:

a) అక్షరార్థం కాక, విశేషార్థం (భావ ప్రకటనను అడ్డుకోవడం) రాయండి.

 

III. భాషాంశాలు – వ్యాకరణాంశాలు (సంధులు)

Question 1: ‘చూసుకొండంటూ’ పదాన్ని విడదీసి, సంధి పేరు రాయండి.

Answer:

చూచుకొండు + అంటూ – ఉత్వ సంధి

Exam Tips:

a) సంధి సూత్రం: ఉకారానికి అచ్చు పరమైతే సంధి జరుగుతుంది (ఉత్వ సంధి).

 

Question 2: ‘గొంతెత్తి’ పదాన్ని విడదీసి, సంధి పేరు రాయండి.

Answer:

గొంతు + ఎత్తి – ఉత్వ సంధి

Exam Tips:

a) గొంతు + ఎత్తి = గొంతెత్తి: 'ఉ' లోపించి తర్వాతి అచ్చు (ఎ) హల్లుకు చేరింది – ఉత్వ సంధి.

 

III. భాషాంశాలు – వ్యాకరణాంశాలు (సమాసాలు)

Question 1: ‘ముక్కలు చెక్కలు’ పదానికి విగ్రహవాక్యం రాసి, సమాసం పేరు రాయండి.

Answer:

ముక్కలును, చెక్కలును – ద్వంద్వ సమాసం

Exam Tips:

a) ద్వంద్వ సమాసంలో రెండు పదాలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది.

 

Question 2: ‘గొంతునొక్కేయటం’ పదానికి విగ్రహవాక్యం రాసి, సమాసం పేరు రాయండి.

Answer:

గొంతును నొక్కేయటం – ద్వితీయా తత్పురుష సమాసం

Exam Tips:

a) 'ను' విభక్తి ప్రత్యయం ఉన్నందున ద్వితీయా తత్పురుషం.

 

Question 3: ‘నా పాట’ పదానికి విగ్రహవాక్యం రాసి, సమాసం పేరు రాయండి.

Answer:

నా యొక్క పాట – షష్ఠీ తత్పురుష సమాసం

Exam Tips:

a) 'యొక్క' షష్ఠీ విభక్తి గుర్తు – షష్ఠీ తత్పురుషం.

 

III. భాషాంశాలు – వ్యాకరణాంశాలు (అలంకారాలు)

Question 1: కింది పంక్తులను గమనించి వాటిలో ఉన్న అలంకారాన్ని గుర్తించి రాయండి.
పువ్వుకీ – ముళ్ళకీ భేదం చెప్తే
ప్రవాహానికీ నిశ్చలతకీ రూపం కల్పిస్తే
ఆలోచనకీ – ఆచరణకీ అర్థం చెప్తే

Answer:

పై గేయపంక్తులలో “అంత్యానుప్రాస” అలంకారం ఉంది.
లక్షణం : పదాల, పాదాల, వాక్యాల, చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే, అది ‘అంత్యానుప్రాసాలంకారం’ అవుతుంది.
సమన్వయము : పై పాదాల్లో పదాల చివర ‘కీ’ అనే అక్షరం పునరుక్తమయ్యింది. అంటే తిరిగి తిరిగి వచ్చింది – అలాగే వాక్యాల చివరలో “ప్తే, స్తే, ప్తే” అనే సంయుక్తాక్షరం పునరుక్తమయ్యింది. అందువల్ల పై పాదాల్లో ‘అంత్యానుప్రాస’ అనే శబ్దాలంకారం ఉంది.

Exam Tips:

a) లక్షణం, సమన్వయం రెండూ రాస్తేనే పూర్తి మార్కులు.

 

Question 2: కింది వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
కిశోర్ లేడిపిల్లలా పరుగెత్తుతున్నాడు.

Answer:

పై వాక్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది.
లక్షణం : ఉపమాన, ఉపమేయములకు పోలిక చెప్పినట్లయితే ‘ఉపమాలంకారం’ అవుతుంది.
సమన్వయము : పై వాక్యంలో
1. ‘లేడిపిల్ల’ అనేది ఉపమానము
2. ‘కిశోర్’ అనేది ఉపమేయం
3. ‘లా’ ఉపమావాచకం
4. ‘పరుగెత్తుతున్నాడు’ అనేది సమానధర్మం.
పై విధంగా ఉపమాన, ఉపమేయములకు పోలిక చెప్పబడింది. కాబట్టి ఇది ఉపమాలంకారం.

Exam Tips:

a) ఉపమానం, ఉపమేయం, వాచకం, సమానధర్మం నాలుగు అంగాలనూ గుర్తించి రాయండి.

 

Question 3: కింది వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి.
మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది.

Answer:

పై వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది.
లక్షణం : సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు.
సమన్వయము : ఇక్కడ ‘పండుగ వాతావరణం’ అనేది ఉపమానం. ‘ఇంటి వాతావరణం’ అనేది ఉపమేయం. ఉపమేయం అయిన ఇంటి వాతావరణాన్ని, ఉపమానం అయిన ‘పండుగ వాతావరణం’గా ఊహించారు. కాబట్టి ‘ఉత్ప్రేక్షాలంకారం’.

Exam Tips:

a) ఉత్ప్రేక్షలో ఉపమేయాన్ని ఉపమానంగా 'ఊహించడం' ఉంటుంది; ఇది ఉపమకు భేదం.

 

III. భాషాంశాలు – వ్యాకరణాంశాలు (కర్మణి వాక్యాలు)

Question 1: కింది వాక్యాన్ని కర్మణి వాక్యంగా రాయండి.
ఆయన ప్రశ్నలను, సందేహాలను ‘కోరస్’ కవిత ద్వారా లేవనెత్తాడు. (కర్తరి వాక్యం)

Answer:

ఆయనచేత ప్రశ్నలు, సందేహాలు ‘కోరస్’ కవిత ద్వారా లేవనెత్తబడ్డాయి. (కర్మణి వాక్యం)

Exam Tips:

a) కర్మణి వాక్యంలో కర్తకు 'చేత' చేర్చి, క్రియను 'బడు' రూపంలోకి మార్చాలి; కాలం మారకూడదు.

 

Question 2: కింది వాక్యాన్ని కర్మణి వాక్యంగా రాయండి.
నా మీద రాళ్ళు విసురుతారు. (కర్తరి వాక్యం)

Answer:

నా మీద రాళ్ళు విసరబడతాయి. (కర్మణి వాక్యం)

Exam Tips:

a) క్రియను 'విసరబడతాయి' వంటి 'బడు' రూపంలో రాయండి.

 

ప్రాజెక్టు పని

Question 1: తెలుగు కవిత్వంలో అభ్యుదయ కవులుగా పేరు పొందిన ఎవరిదైనా ఒకరి కవితలను సేకరించి నివేదిక రాసి, చదివి వినిపించండి.

Answer:

“శ్రీశ్రీ”గా పిలువబడే అభ్యుదయ కవి “శ్రీరంగం శ్రీనివాసరావు” గారు. ఆయన “మహాప్రస్థానం” అనే కవితా సంకలనం రాశాడు. ఆయన కవితలు రెండు పరిశీలిద్దాం.
1. “నేను సైతం,
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను”.
“నేను సైతం
ప్రపంచాబ్దపు
తెల్లరేకై పల్లవిస్తాను
నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను”
పై గేయంపై నా అభిప్రాయం : ఇక్కడ నేను అంటే శ్రీశ్రీ కాదు. శ్రీశ్రీ కంఠంతో పలుకుతున్న శ్రామికుడు. ప్రపంచం యొక్క అభ్యుదయం కోసం, ఆ శ్రామికుడు ఎన్నో త్యాగాలు చేశాడు. ఎంతో కృషి చేశాడు. ‘నేను సైతం’ అనే నుడికారం, మానవజాతి చరిత్రలో పేరుకు కూడా నోచుకోని ఒక సామాన్యుడికి ప్రాముఖ్యం కలిగిస్తోంది. తరతరాల నుండి ఇతడికి చరిత్రలో గుర్తింపు లేదు. ఇప్పుడితడు తిరగబడి తన ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిందిగా ఘోషిస్తున్నాడు.
2. “మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం”
పై గేయంపై నా అభిప్రాయం : పై మహాప్రస్థాన గేయం, ఒక యుద్ధగీతంలా నడచింది. ఇదొక వీరగానం. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం. ప్రస్తుత దోపిడీ వ్యవస్థ నుంచి, ఈ పీడిత సమాజం నుంచి, సామ్యవాద వ్యవస్థకి, సమసమాజ వ్యవస్థకి, ప్రయాణం చేయడమే మహాప్రస్థానం. అభ్యుదయ మార్గం వైపు ప్రస్థానం సాగించాలన్నది శ్రీశ్రీ ప్రబోధం. భావావేశానికి తగిన శబ్దప్రయోగంతో, శ్రీశ్రీ మహాప్రతిభకి ఈ గేయం అద్దం పడుతుంది. ఈ గేయం రచనా కాలంనాటికే, రష్యాలో సామ్యవాదవ్యవస్థ అనే ‘మరోప్రపంచం’ ఏర్పడింది.
మహాప్రస్థాన గేయం ఒక మహాప్రవాహం. ప్రళయ ఝంఝా ప్రభంజనం. దీని వేగానికి తట్టుకోలేక సహృదయుడు ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దీని గమనవేగం, భావతీవ్రత అంత శక్తివంతమైనవి.

Exam Tips:

a) కవి పరిచయం, కవితలు, వాటిపై మీ అభిప్రాయం అనే మూడు భాగాలుగా రాయండి.

 

Free study material for Telugu

Telugu Class 9 Curriculum Solutions: Lesson 09 Chorus (Salandra Lakshminarayana)

Chapter Exercise Answers for Class 9 Telugu

Review comprehensive exercise answers for Class 9 Telugu Lesson 09 Chorus (Salandra Lakshminarayana). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Detailed Answer Guides for Lesson 09 Chorus (Salandra Lakshminarayana)

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 09 Chorus (Salandra Lakshminarayana) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 9 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Telugu.

FAQs

Where can I find the latest TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్ for the 2026-27 session?

The complete and updated TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్ is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్ will help students to get full marks in the theory paper.

Do you offer TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్ in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire TS 9th Class Telugu Guide 9th Lesson కోరస్ in printable PDF format for offline study on any device.