TS 9th Class Telugu Guide Lesson 8 ఉద్యమ స్ఫూర్తి

Download TS Board Solutions for Class 9 Telugu Lesson 08 Spirit of the Movement (Udyama Sphurti)

Access comprehensive textbook solutions for Lesson 08 Spirit of the Movement (Udyama Sphurti) using the official curriculum guides for Class 9 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Access TS Board Solutions and Answers

Access the complete solution PDF for Class 9 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

చదువండి – ఆలోచించి చెప్పండి

Question 1: ప్రజలు గాంధీజీని ఎందుకు ఆరాధించారు ?

Answer:

గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకూ ఏకైక మార్గదర్శకుడు అయ్యాడు.
అందువల్లనే, ప్రజలు గాంధీజీని ఆరాధించారు.

Exam Tips:

a) ఒక్క వాక్యంలో కారణం చెప్పండి: అన్ని వర్గాలకూ ఏకైక మార్గదర్శకుడయ్యాడు.
b) ప్రజల ఆరాధనకు కారణం ‘నాయకత్వం’ అని స్పష్టంగా ముగించండి.

 

Question 2: నాయకులు గాంధీజీని ఎందుకు అనుసరించారు ?

Answer:

గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి, ఉప్పు సత్యాగ్రహానికి దండియాత్ర ప్రారంభించారు. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాన్ని అహింసామార్గంలో ప్రజలందరినీ ఏకంచేసి, సైన్యంలా నడిపించారు. అందువల్ల నాయకులు, గాంధీజీని అనుసరించారు.

Exam Tips:

a) ‘సబర్మతి ఆశ్రమం – దండి యాత్ర – ఉప్పు సత్యాగ్రహం’ అనే మూడు కీలక అంశాలను రాయండి.
b) ‘అహింసతో ప్రజలను ఏకంచేశాడు’ అనే వాక్యం తప్పనిసరి.

 

Question 3: గాంధీజీ అహింసా మార్గాన్ని ఎందుకు అనుసరించాడు ?

Answer:

బ్రిటిష్వారి వద్ద అంతులేని సైన్యం ఉంది. వారివద్ద తుపాకులూ, ఫిరంగులూ ఉన్నాయి. హింసా మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించడం కష్టం. హింసా పద్ధతిలో వెడితే, ఎందరో దేశభక్తులు, ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. శాంతియుతంగా ఉద్యమాన్ని ఎక్కువకాలము నడుపవచ్చు. బ్రిటిష్ వారిని లొంగదీయవచ్చు. వారి సానుభూతి సంపాదించవచ్చు. అందుకే, గాంధీజీ అహింసా మార్గాన్ని అనుసరించారు.

Exam Tips:

a) హింసా మార్గం కష్టమని చెప్పడానికి బ్రిటిష్ వారి సైన్యం, తుపాకులు, ఫిరంగులను ప్రస్తావించండి.
b) అహింస వల్ల కలిగే లాభాలు (ప్రాణనష్టం తగ్గడం, సానుభూతి) చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 84)

Question 1: “తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం” అంటే ఏమిటి?

Answer:

ఈ రోజుల్లో మనుష్యులు, దేశంలో, రాష్ట్రంలో లేక తమ గ్రామంలో ఏమి జరిగినా, పట్టించుకోడం మానివేశారు. ఏ సంఘటన జరిగినా, అది తమకూ తమ వారికీ సంబంధించినవి కాకపోతే, వాటిని వారు పట్టించుకోడం మానివేశారు. ఆ సంఘటన ప్రభావం, తమపై పడినప్పుడే, మనుష్యులు శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ తమచుట్టూ గిరిగీసుకొని, తనకూ తమవారికీ వారు పరిమితమవుతున్నారని అర్థం.

Exam Tips:

a) ‘పరిధులు’ అంటే హద్దులు; ‘తమ బ్రతుకు వరకే’ అంటే స్వార్థం అని వివరించండి.
b) దేశం కోసం ఆలోచించకపోవడం అనే భావాన్ని తప్పక రాయండి.

 

Question 2: విప్లవసంఘం వారి చర్యలు కొన్ని ఎందుకు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా తోచినాయి ?

Answer:

ఆనాడు విప్లవకారులు, చిత్రవిచిత్రమైన బాంబులు తయారు చేసేవారు. అందులో ఇంద్రపాల్ అనే అతడు, మిత్రుల ప్రోద్బలంతో సన్యాసి వేషంలో వెళ్ళి, వైస్రాయి మీద బాంబు పేల్చాడు. ఈ విధమైన వారి చర్యలు, అహింసావాదులయిన దేశభక్తులకు, అద్భుతంగానూ, ఆశ్చర్యకరంగానూ తోచాయి.

Exam Tips:

a) విప్లవ సంఘం చర్యలు ధైర్యంతో కూడిన సాహసాలని ఉదాహరణతో చెప్పండి.
b) ‘అద్భుతం, ఆశ్చర్యం’ అనే పదాలకు కారణాలు విడిగా రాయండి.

 

Question 3: సుఖదేవ్, భగత్‌సింగులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి దేశంలోని ప్రతి ఒక్కరు ఎందుకు తల్లడిల్లిపోయారు?

Answer:

సుఖదేవ్, భగత్సింగ్లు విప్లవ సంఘంలోని సభ్యులు. విప్లవసంఘం వారు కూడా దేశభక్తులే. వారి ఉద్యమం కూడా స్వాతంత్ర్య సిద్ధి కోసమే. కాని అహింసావాదుల విధానాలు, విప్లవసంఘంవారి విధానాలు వేరు వేరుగా ఉండేవి. విధానాలు వేరైనా సుఖదేవ్, భగత్సింగులు, దేశభక్తులైనందువల్ల, వారికి ఉరిశిక్ష పడుతుందని తెలిసి, దేశంలో ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోయారు.

Exam Tips:

a) సుఖదేవ్, భగత్‌సింగ్, రాజగురు వంటి యువ దేశభక్తుల పేర్లు ప్రస్తావించండి.
b) ప్రజలు భావోద్వేగంతో స్పందించారని ముగింపు వాక్యం రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 85)

Question 1: బొంబాయిలో విదేశీ వస్త్రబహిష్కరణోద్యమం జరిగిన పరిస్థితులను మీరు ఎట్లా అర్థం చేసుకొన్నారు ?

Answer:

ప్రజల్లో ముఖ్యంగా సత్యాగ్రహులు, విదేశ వస్త్రాలను ఎలాగైనా బహిష్కరించాలనే పట్టుదలతో ఉండేవారు. అందుకే వారు విదేశ వస్త్రాలు అమ్ముతానన్న వ్యాపారిని అమ్మవద్దని బ్రతిమాలారు. మరో యువకుడు విదేశ వస్త్రాలను తీసుకువెళ్ళే వ్యాపారి కారుకు అడ్డంగా పడుకొని, తన ప్రాణాలు విడిచాడు. దీనిని బట్టి సత్యాగ్రహులు ఈ ఉద్యమాన్ని ప్రాణప్రదంగా భావించారు.
ప్రభుత్వం అండదండలు ఉన్న కొంతమంది వ్యాపారులు మాత్రం, సత్యాగ్రహుల ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి విదేశ వస్త్రాలు అమ్మేవారు.

Exam Tips:

a) విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్ర వినియోగం అనే రెండు అంశాలు రాయండి.
b) ప్రజల ఉత్సాహాన్ని ఒక ఉదాహరణతో చెప్పండి.

 

Question 2: బ్రిటిషువారి హృదయాలు కర్కశమైనవని సంగెం లక్ష్మీబాయి ఎందుకన్నది?

Answer:

1. మూర్షాబాద్ జైలులో మణిలాల్సేన్ అనే 17 సంవత్సరాల బాలుడు, 60 రోజులు నిరాహారదీక్ష చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
2. జైలులో రాజకీయ ఖైదీలకు కల్తీ సరకులు ఇచ్చినంత కాలం, తాను తిండి తిననని మణిలాల్సేన్ నిరసన వ్రతం చేశాడు. ఈ విధంగా 60 రోజులు ఆ బాలుడు నిరసన వత్రం చేసినా, ఏ బ్రిటిష్ పాలకుడూ, అతడిని పట్టించుకోలేదు.
3. అలాగే స్వాతంత్ర్యం కోసం, ఎందరో వీరులు ఆనాడు మరణించారు.
అయినా బ్రిటిష్ పాలకుల మనస్సులు కరుగలేదు. అందుకే సంగెం లక్ష్మీబాయి, బ్రిటిష్వారి హృదయాలు కర్కశమైనవని అన్నది.

Exam Tips:

a) ‘కర్కశం’ అంటే కఠినం; బ్రిటిష్ వారి క్రూర చర్యలను (లాఠీచార్జి, నిర్బంధాలు) ఉదహరించండి.
b) రచయిత్రి భావాన్ని ఆమె మాటల్లోనే సంక్షిప్తంగా చెప్పండి.

 

Question 3: సమాజం వ్యాధిగ్రస్తమై పోయిందంటే, అర్థమేమిటి ?

Answer:

సమాజం వ్యాధిగ్రస్తమైందంటే, సమాజంలో స్వార్థము, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, దేశద్రోహం, దేశభక్తి లేకపోడం, పదవీలాలస, ధన సంపాదనపై కోరిక వంటి దుర్గుణాలు పెరిగాయని అర్థము. ఆ దుర్గుణాలనే రోగాలు, సమాజంలో వ్యాపించాయని అర్థం.

Exam Tips:

a) ‘వ్యాధిగ్రస్తం’ అంటే రోగంతో ఉన్నది; ఇక్కడ సమాజ నిర్లిప్తతను సూచిస్తుంది.
b) స్వార్థం, బాధ్యతారాహిత్యం అనే లక్షణాలను రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 86)

Question 1: ప్రకృతికీ, ప్రాణికీ నడుమ గల అనుబంధం ఏమిటి?

Answer:

ప్రకృతికీ, ప్రాణీకీ గొప్ప అనుబంధం ఉంది. మన భారతీయులు పాములనూ, వృక్షాలనూ పూజించేవారు.
నేడు కూడా పూజిస్తున్నారు. పాము, కాలగమ్యాలకు సంకేతము. రావిచెట్టు, సృష్టిస్థితిలయములకు సూచకము. ఆటలాడేటప్పుడు పిల్లలకు బట్టలు తక్కువగా తొడిగితే వారిపై సూర్యకాంతి పడుతుంది. పిల్లలు మట్టి తినకుండా, మట్టిలో ఆడుతుంటే, వారికి నరాల పుష్టి కలుగుతుంది. ఈ విధంగా ప్రాణికీ, ప్రకృతికీ సంబంధం ఉంది.

Exam Tips:

a) ఆరోగ్యానికి ప్రకృతితో గల సంబంధాన్ని రావిచెట్టు, సూర్యకాంతి, మట్టిలో ఆట ఉదాహరణలతో చెప్పండి.
b) ‘ప్రాణికీ ప్రకృతికీ సంబంధం ఉంది’ అని ముగించండి.

 

Question 2: మన పెద్దల చాకచక్యం ఏమిటి?

Answer:

మన పెద్దలు ప్రకృతికీ, ప్రాణికీ గల అనుబంధాన్ని విప్పి చెప్పారు. ఆరోగ్య సూత్రాలనూ, ఆధ్యాత్మిక భావనలనూ, మానవుడి నిత్యజీవితంలో గుప్పించి, వదిలేశారు. మన `పెద్దలు, ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన శిక్షణలతో కాలహరణ లేకుండా, ఆరోగ్య సూత్రాలను ఎంతో చాకచక్యంతో వారు మనకు తెలియచెప్పారు.

Exam Tips:

a) పెద్దలు ప్రకృతిని దైవంగా చూపి కాపాడిన తీరును ఉదాహరణలతో రాయండి.
b) చెట్లు, పాములు పూజించడం వెనుక శాస్త్రీయ కారణం ప్రస్తావించండి.

 

Question 3: “బాధ్యతాయుత ప్రవర్తనకూ, కర్తవ్య పాలనకూ కూడా మనకు స్వతంత్రం లభించింది” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.

Answer:

స్వాతంత్ర్యం మనకు కొన్ని హక్కులను తెచ్చిపెట్టింది. ఆ హక్కులతోపాటు, మనము బాధ్యతతో ప్రవర్తించాలి. అలాగే మన కర్తవ్యాన్ని మనం చక్కగా నెరవేర్చాలి. స్వాతంత్ర్యం అంటే ఇష్టం వచ్చినట్లు తిరగడం,కాదు. మనం హక్కులను పొందినట్లే, మనపై బాధ్యత, కర్తవ్యం కూడా ఉంటాయని నా అభిప్రాయం.

Exam Tips:

a) ‘స్వాతంత్ర్యం = హక్కులు + బాధ్యతలు’ అనే భావంతో మీ అభిప్రాయం రాయండి.
b) విధులు నెరవేర్చడం గురించి ఒక ఉదాహరణ ఇవ్వండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: ఆనాటి కాలంలో కూడా సంగెం లక్ష్మీబాయి వంటివారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, సమాజ సేవకు అంకితమైనారు కదా! ఇందుకు దారితీసిన పరిస్థితులేమిటి ? ఇలాంటి ఆదర్శమూర్తుల అవసరం ఉందా? ఎందుకు ? మాట్లాడండి.

Answer:

సుమారు రెండు వందల సంవత్సరాలపాటు మనదేశం బ్రిటిష్వారి పాలన కింద బానిస దేశంగా ఉండిపోయింది. ఆ రోజుల్లో గాంధీజీ, నెహ్రూ, తిలక్ వంటి నాయకుల నాయకత్వంలో స్వాతంత్ర్యం కోసం ప్రజలు పోరాటం చేశారు. అప్పుడు సంగెం లక్ష్మీబాయి వంటి స్త్రీలు సహితం గాంధీజీ పిలుపును అందుకుని స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ‘ వారు సత్యాగ్రహాలు, ధర్నాలు, పికెటింగులు చేశారు. వారు సమాజసేవకు నడుం కట్టారు. ఆ త్యాగమూర్తుల కృషివల్లనే నేడు మనం హాయిగా స్వాతంత్య్ర వాయువులను పీలుస్తున్నాము. నేడు మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాము.
నేడు కూడా లక్ష్మీబాయి, దుర్గాబాయమ్మ వంటి త్యాగమూర్తుల సేవలు మన దేశానికి అవసరము. స్వాతంత్ర్యం సిద్ధించాక మనదేశంలోని ప్రజలలో నిర్లిప్తత పెరిగిపోయింది. స్వార్థం పెరిగిపోయింది. సంఘంలో ఎటువంటి పరిణామాలు వచ్చినా, ప్రజలు తమకు ఎందుకని స్పందించడం లేదు. ప్రజలు కర్తవ్యాన్ని మరచి, బాధ్యత లేకుండా ఉంటున్నారు.
ఆ నిర్లిప్తత పోవాలి.. దేశాభ్యున్నతి కోసం, సంఘం కోసం దేశ పౌరులంతా ముందుకు రావాలి. అందుకే లక్ష్మీబాయి వంటి త్యాగమూర్తుల సేవలు నేడు కూడా అవసరము.

Exam Tips:

a) రెండు భాగాలుగా రాయండి: పరిస్థితులు, ఇలాంటి ఆదర్శమూర్తుల అవసరం.
b) సంగెం లక్ష్మీబాయి, దుర్గాబాయమ్మ పేర్లను ప్రస్తావించండి.

 

Question 2: పాఠం చదివి కింది పేరాలకు శీర్షికను పెట్టండి. ఆ పేరాలోని కీలక పదాలు రాయండి. (పట్టిక : పేరా సంఖ్య 1, 5, 9 – శీర్షిక పేరు – ముఖ్యమైన పదాలు)

Answer:

పేరా సంఖ్యశీర్షిక పేరుముఖ్యమైన పదాలు
1సాంఘిక నిర్లిప్తతనిర్లిప్తత, ఎప్పుడూ చచ్చేవాడికి ఏడ్చేదెవరు? స్వతంత్ర సమరసంరంభం, నిర్వీర్యత, సాంఘిక నిర్లిప్తత.
5విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంవిదేశీ వస్త్ర బహిష్కరణోద్యమం, సత్యాగ్రహులు ప్రాధేయపడటం, వ్యాపారి యువకుడిపై కారు పోనివ్వడం, ప్రభుత్వపు అందదందలు వ్యాపారికి ఉండటం.
9వ్యాధిగ్రస్త సమాజంస్వాతంత్ర్యం వచ్చాక, దేశం అధోగతి – గ్రామీణులు అజ్ఞానంలో మగ్గడం – ఛాందసాచారాలు – దేశ భక్తుడి గుండె మందడం – సమాజం వ్యాధిగ్రస్తం కావడం.

Exam Tips:

a) పేరా సంఖ్య, శీర్షిక, కీలకపదాలను పట్టికలో వరుసగా రాయండి.
b) శీర్షిక పేరాలోని ప్రధాన భావాన్ని ప్రతిబింబించాలి.

 

Question 3: మాసుమా బేగం గురించిన కింది పేరా చదువండి. సందర్భాన్ని బట్టి, ఖాళీలను సరైన పదాలతో పూరించండి.
“మాసుమాబేగం హైదరాబాదులో ........ (1) ........ ఆమె ప్రముఖ సంఘ ........ (2) ........ నైజాం రాజ్యంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి ముస్లిం మహిళ. అంజుమన్ – ఎ – ఖవాతీన్‌ను స్థాపించి, బీద పిల్లల కోసం హైదరాబాదు నగరంలో ఏడు పాఠశాలలు ........ (3) ........ హైదరాబాదు నుంచి మంత్రి పదవి పొందిన మొదటి మహిళ మాసుమాబేగం. ఈమె చేసే పనుల్లో, సేవా కార్యక్రమాలలో ఆమె భర్త ప్రొఫెసర్ హాసిమాన్ అలీఖాన్ కూడా ఎంతో ........ (4) ........ ఈమె చేసిన సేవలకు గాను, భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ బిరుదుతో ........ (5) .........”

Answer:

1) జన్మించింది
2) సేవకురాలు
3) నెలకొల్పింది
4) తోడ్పడ్డాడు
5) సత్కరించింది

Exam Tips:

a) సందర్భాన్ని బట్టి వాక్య వ్యాకరణ సరిపోలికను చూసి పదాన్ని ఎంచుకోండి.
b) ఇచ్చిన ఐదు పదాలు ఒక్కసారే వాడాలి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: స్వాతంత్ర్యం లభించినప్పటికీ, అది సంతోషం కలిగించటం లేదని సంగెం లక్ష్మీబాయి ఎందుకు భావించింది? (ఐదు వాక్యాల్లో)

Answer:

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సమాజం వ్యాధిగ్రస్తమైపోయింది. అందుకు కారణం, సమాజంలోని వ్యక్తులు. అంతేకాని స్వాతంత్ర్య సిద్ధి కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, రాజకీయ నాయకులలో స్వార్ధము, పదవీ లాలస, అక్రమ ధన సంపాదన, అవినీతి, లంచగొండితనం పెరిగిపోయాయి.
ప్రజలలో సాంఘిక నిర్లిప్తత పెరిగిపోయింది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా, మనకెందుకులే అనే నిర్లిప్తత ప్రజల్లో పెరిగిపోయింది. ప్రజలు తామూ, తమ బ్రతుకూ వరకు పరిధుల్ని పరిమితం చేసుకుంటున్నారు. దేశం కోసం, తోటిప్రజల కోసం సేవచేయడం, త్యాగం చెయ్యడం అనే గుణాలు తగ్గిపోయాయి.
అందువల్లనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, అది తనకు సంతోషం కల్గించటం లేదని సంగెం లక్ష్మీబాయి భావించింది.

Exam Tips:

a) ‘స్వాతంత్ర్యం వచ్చినా నిర్లిప్తత, స్వార్థం పెరిగాయి’ అనే కారణాలు రాయండి.
b) ఐదు వాక్యాల పరిమితి పాటించండి.

 

Question 2: గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించిందని ఎట్లా చెప్పగలరు ? (ఐదు వాక్యాల్లో)

Answer:

స్వాతంత్ర్య సాధనకు గాంధీజీ సత్యము, అహింస, సహాయ నిరాకరణము అనే వాటినే అస్త్రాలుగా స్వీకరించి బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర్యం సాధించాడు. గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, స్వాతంత్య్ర సాధనలో ప్రధానపాత్ర పోషించింది.
బ్రిటిష్వారి వద్ద గొప్ప సైన్య సంపద ఉండేది. వారికి తుపాకీలు, విమానాలు, ఫిరంగులు ఉన్నాయి. గాంధీజీ హింసా మార్గాన్ని ఎన్నుకుంటే, బ్రిటిష్ వారు ఆ ఉద్యమాన్ని మిలటరీ సాయంతో అణచివేసి యుండేవారు. గాంధీ హింసా పద్ధతిలో పోరాడితే పెక్కుమంది ఉద్యమకారులు తమ ప్రాణాలు పోగొట్టుకొని యుండేవారు. ఎక్కువ మంది సత్యాగ్రహులు మరణిస్తే, ఉద్యమంలోకి ప్రజలు ఎక్కువగా వచ్చియుండేవారు కారు. ఆ విధంగా స్వాతంత్ర్య పోరాటం నీరసించి యుండేది. అలాకాక, అహింసా పద్ధతిలో ఉద్యమం సాగడం వల్ల, ఉద్యమంపట్ల ప్రజలకూ, ప్రభుత్వానికీ, పాలకులకూ, సానుభూతి కలిగింది. కనుక అహింసామార్గం స్వాతంత్ర్య సాధనలో కీలకపాత్ర పోషించిందని చెప్పవచ్చు.

Exam Tips:

a) సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలు పేర్కొనండి.
b) అహింస ద్వారా ప్రజలందరూ ఏకమయ్యారని ముగించండి.

 

Question 3: బ్రిటిష్ వారి చేతుల్లోకి మనదేశ పాలన పోవుటకు గల కారణాలు వివరించండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

బ్రిటిష్వారు మొదట మనదేశానికి వర్తకం చేసుకోడానికి వచ్చారు. వర్తకం చేసుకోడానికి స్వదేశరాజుల అనుమతులు సంపాదించారు. స్వదేశరాజుల మధ్య తగవులు పెంచి, వారిలో తాము ఒకరి పక్షాన్ని వహించి, రెండవ వారిని దెబ్బతీసారు. తరువాత తాము సమర్థించిన రాజునూ దెబ్బతీశారు. స్వదేశరాజులకు మిలటరీ సాయం చేస్తామని చెప్పి, వారి నుండి కొన్ని రాజ్య భాగాలు సంపాదించారు.
క్రమంగా స్వదేశరాజులు దత్త చేసుకోరాదని వారి రాజ్యాన్ని లాక్కున్నారు.
అన్యాయంగా, అక్రమంగా స్వదేశరాజుల రాజ్యాల్ని లాక్కున్నారు. అన్యాయంగా, అక్రమంగా స్వదేశరాజుల రాజ్యాల్ని కుట్రలతో స్వాధీన పరచుకున్నారు. ఈ విధంగా వర్తక నెపంతో మనదేశానికి వచ్చి బ్రిటిష్వారు క్రమంగా మనదేశాన్నీ, మనదేశ సంపదనూ, కబళించి వేశారు.

Exam Tips:

a) వ్యాపార నిమిత్తం వచ్చి, మన అనైక్యతను వాడుకున్నారనే విషయం రాయండి.
b) కారణాలను క్రమసంఖ్యతో రాస్తే సులభంగా చదవబడుతుంది.

 

Question 4: సంగెం లక్ష్మీబాయి రచనా విధానం ఎట్లా ఉన్నది? (ఐదు వాక్యాల్లో)

Answer:

సంగెం లక్ష్మీబాయి తెలుగు పండితురాలు. సుప్రసిద్ధ దేశభక్తురాలు. ఈమె రచనా శైలి సంస్కృతాంధ్రపద సమ్మేళనంతో అనుప్రాసలతో అద్భుతంగా ఉంది. ఆమె రచనలో దేశభక్తి, బ్రిటిష్ వారిపై ద్వేషం అడుగడుగునా తొంగిచూస్తున్నాయి.
ఆనాడు దేశప్రజలు సంతోషంగా ఉరికంబాలెక్కారని ప్రజల దేశభక్తిని ఈమె ప్రశంసించింది. రచనలో మంచి పదబంధాలు ప్రయోగించింది. “ఉడుకు నెత్తురు ప్రవహించేలా”, “వీరావేశంతో జేజేలు కొట్టు” – “బాలుడి మరణం తల్లికీ, స్వదేశీయులకూ రంపపు కోత” – “వంటి మాటలు రాసింది. బ్రిటిష్ వారివి, కర్కశ హృదయాలన్నది. వారు పచ్చి నెత్తురు త్రాగే కిరాతకులన్నది. మన స్వదేశరాజులు దేశాన్ని బ్రిటిష్ వార్కి ధారాదత్తం చేశారని బాధపడింది.
ప్రపంచం. మారినా, మన భారతీయులు ఇంకా అజ్ఞానంలో మ్రగ్గుతున్నారనీ, కరవు కాటకాలు మారెమ్మలా ఊళ్ళమీద పడి ఊడ్చేశాయనీ, మంచి అనుప్రాసలతో ఈమె రచన సాగింది.
మన ప్రాచ్యదేశం అంతా అప్రాచ్యమని, పాశ్చాత్యులు నాగరికత కలవారని భారతీయులను తక్కువ చూపు చూసిన బ్రిటిష్ వారిని, ఈమె పరాన్న భుక్కులని ఎగతాళి చేసింది.
మనకు స్వాతంత్ర్యం, మన హక్కుల సంరక్షణకేకాక, బాధ్యతాయుత ప్రవర్తనకూ, కర్తవ్యపాలనకూ లభించిందని మనకు ఈమె గుర్తు చేసింది. లక్ష్మీబాయి రచనాశైలి ప్రభావవంతమైనది. చురుకైనది. పదబంధాలతో, తెలుగు నుడికారంతో సుందరంగా ఉంది.

Exam Tips:

a) ఆమె రచన సరళం, ఆత్మకథాత్మకం అనే లక్షణాలను రాయండి.
b) సొంత అనుభవాలు, నిజాయితీ అనే అంశాలను ఉదాహరించండి.

 

Question 5: స్వాతంత్ర్య సమరయోధులు కన్నకలలు నిజం కావాలంటే మనకు లభించిన స్వాతంత్య్రాన్ని ఎట్లా సద్వినియోగించుకోవాలో విశ్లేషిస్తూ రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

మన భారతదేశ ప్రజలు కేవలం తమ హక్కులను రక్షించుకోడమే కాదు.
బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. భారతదేశ ప్రజలు పాటించవలసిన విధులనూ, కర్తవ్యాన్నీ, నిర్దుష్టంగా నెరవేర్చాలి. భారత ప్రజలలో సమాజంపట్ల నిర్లిప్తత పనికి రాదు.
మనది ప్రజాస్వామ్య దేశం. మన ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మంచి శీలవంతమైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలి.
అవినీతిపరులైన లంచగొండులైన వారిని దూరంగా తరిమికొట్టాలి. ప్రతివ్యక్తి సంఘంలో జరిగే చెడ్డను ఎదిరించి పోరాడాలి. లంచగొండితనాన్ని రూపుమాపాలి. “మన దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. శ్రమించి పనిచేయాలి. సోమరితనం కూడదు. దేశాభివృద్ధికి ప్రతివ్యక్తి తన వంతుగా కష్టించి పనిచేయాలి. స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా పాల్గొని, దేశాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి.
వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి. యువత శ్రద్ధగా చదువుకోవాలి. వృద్ధులను గౌరవించాలి. దేశభక్తి కలిగియుండాలి. దేశసంపదను కొల్లగొట్టే నీచులను తరిమికొట్టాలి.
ప్రతి భారతీయుడు పై విధంగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, స్వాతంత్య్ర సమరయోధుల కలలు ఫలిస్తాయి.

Exam Tips:

a) పదివాక్యాలలో: సమాజ సేవ, కర్తవ్య పాలనం, స్వార్థ త్యాగం, ఐక్యత అనే అంశాలు కలపండి.
b) చివరి వాక్యంలో మీ సొంత సందేశం ఇవ్వండి.

 

Question 6: నేటి కాలంలో కూడా సంగెం లక్ష్మీబాయి వంటి వారు ఎందుకు అవసరమో వివరిస్తూ వ్యాసం రాయండి.

Answer:

సంగెం లక్ష్మీబాయి వంటి స్వాతంత్ర్య సమరయోధుల అవసరం సంగెం లక్ష్మీబాయి, దుర్గాబాయి, వరలక్ష్మమ్మ వంటి దేశభక్తురాండ్రు ఆనాడు గాంధీ మహాత్ముని అడుగుజాడలలో నడచి, అహింసా పద్ధతిలో బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. కారాగారాలలో నిర్బంధింపబడ్డారు.
లక్ష్మీబాయి గొప్ప దేశభక్తురాలు. సాంఘిక సేవా పరాయణురాలు.
దుర్గాబాయి ఆంధ్ర మహిళాసభ ద్వారా స్త్రీల అభ్యున్నతికి ఎంతో కృషిచేసింది. వరలక్ష్మమ్మగారు, లక్ష్మీబాయిగారు ఎందరినో కార్యకర్తలను తయారుచేశారు. వినోబాభావే భూదానోద్యమ యాత్రలో లక్ష్మీబాయి పాల్గొంది. బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమి వేయడంలో వీరు ప్రముఖపాత్ర వహించారు.
ఇటువంటి మహిళామణుల ఆవశ్యకత స్వతంత్ర భారతంలో ఎంతగానో ఉంది. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు, స్త్రీలపై జరిగే అత్యాచారాల నిరోధానికి, పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు జరగాలి.
స్వచ్ఛభారత్, బాలకార్మికుల నిరోధం, అవినీతి నిర్మూలనం, స్ త్రీవిద్యాభివృద్ధి, స్త్రీలకు పురుషులతో సమానహక్కుల సాధన వంటి రంగాల్లో లక్ష్మీబాయి వంటి త్యాగధనులయిన మహిళామణుల సేవలు ఎంతో అవసరం. ప్రతి స్,త్రీ ప్రతి పురుషుడు మహనీయులయిన దేశభక్తురాండ్ర అడుగుజాడల్లో నడిస్తే, మన భారతదేశం సస్యశ్యామలమై, రామరాజ్యమై వర్ధిల్లుతుంది.

Exam Tips:

a) వ్యాసానికి ప్రారంభం, మధ్య భాగం, ముగింపు అనే మూడు భాగాలు ఉండాలి.
b) నిర్లిప్తత పోవాలనే సందేశాన్ని తప్పక చేర్చండి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) మనం మంచి చేస్తే, మనకూ మంచి జరుగుతుందని స్వానుభవం వల్ల తెలుసుకున్నాను.
ఆ) తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు.
ఇ) బ్రిటిష్ వారు మనదేశ సంపదను కొల్లగొట్టి తీసుకొని పోయారు.

Answer:

అ) స్వానుభవము = తన అనుభవము
వాక్యప్రయోగం : స్వానుభవమును మించిన గుణపాఠము, వేరే ఉండదని నా నమ్మకము.
ఆ) పరితపిస్తూ = బాధపడుతూ
వాక్యప్రయోగం : జీవితమంతా బాధలతో పరితపిస్తూ బ్రతికే పేదవారిని ప్రభుత్వాలు ఆదుకోవాలి.
ఇ) కొల్లగొట్టి = దోచుకొని
వాక్యప్రయోగం : దొంగలు ప్రజల సొమ్ములను కొల్లగొట్టి తీసుకుపోతారు.

Exam Tips:

a) ప్రతి పదానికి అర్థం రాసి, ఆ పదంతో స్వంత వాక్యాన్ని రాయండి.
b) వాక్యం పదం అర్థాన్ని స్పష్టంగా చూపించాలి.

 

Question 2: కింది వికృతి పదాలకు ప్రకృతులను పాఠంలో వెతికి రాయండి.
అ) గారవం ఆ) కత ఇ) జీతం ఈ) కఱకు

Answer:

వికృతి – ప్రకృతి :
అ) గారవం – గౌరవం
ఆ) కత – కథ
ఇ) జీతం – జీవితము
ఈ) కఱకు – కర్కశము

Exam Tips:

a) వికృతి అంటే మారిన రూపం, ప్రకృతి అంటే మూల రూపం – తేడా గుర్తుంచుకోండి.
b) ప్రతి జతను ‘వికృతి – ప్రకృతి’ క్రమంలో రాయండి.

 

వ్యాకరణాంశాలు

Question 1: కింది పదాలను పరిశీలించి, అవి ఏ ఏ సంధులో గుర్తించి, పదాలను విడదీసి, సంధి సూత్రం రాయండి.
అ) మనకెందుకు ఆ) విషాదాంతము ఇ) మేమెంత ఈ) ఎవరికున్నాయి ఉ) విచిత్రమైన

Answer:

అ) మనకెందుకు = మనకు + ఎందుకు – ఉకారవికల్ప సంధి
సూత్రము : ప్రథమేతర విభక్తి, శత్రర్థక చువర్ణములందున్న ఉకారానికి సంధి వైకల్పికముగానగు.
ఆ) విషాదాంతము = విషాద + అంతము – సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : అ, ఇ, ఉ, ఋ లకు అవియే అచ్చులు పరమైన సవర్ణదీర్ఘము ఏకాదేశంబగు.
ఇ) మేమెంత = మేము + ఎంత – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.
ఈ) ఎవరికున్నాయి = ఎవరికి + ఉన్నాయి – ఇత్వసంధి
సూత్రము : ఏమ్యాదుల ఇకారమునకు సంధి వైకల్పికముగానగు.
ఉ) విచిత్రమైన = విచిత్రము + ఐన – ఉత్వసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

Exam Tips:

a) సంధి పదాన్ని విడదీసి, సంధి పేరు, సూత్రం మూడూ రాయండి.
b) ఉత్వసంధి, ఇత్వసంధి సూత్రాలను కంఠస్థం చేయండి.

 

Question 2: కింది సమాస పదాలను పరిశీలించి, వాటికి విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
అ) మాతృదేశం ఆ) కర్కశహృదయం ఇ) సహాయనిరాకరణ ఈ) విప్లవసంఘం ఉ) అశ్వత్థవృక్షం ఊ) శాస్త్రదృష్టి

Answer:

అ) మాతృదేశం = తల్లి యొక్క దేశం – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) కర్కశహృదయం = కర్కశమైన హృదయము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) సహాయనిరాకరణ = సహాయమును నిరాకరించడం – ద్వితీయా తత్పురుష సమాసం
ఈ) విప్లవసంఘం = విప్లవకారుల యొక్క సంఘం – షష్ఠీ తత్పురుష సమాసం
ఉ) అశ్వత్థవృక్షం = ‘అశ్వత్థము’ అనే పేరుగల వృక్షము – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఊ) శాస్త్రదృష్టి = శాస్త్రము యొక్క దృష్టి – షష్ఠీ తత్పురుష సమాసం

Exam Tips:

a) విగ్రహవాక్యం రాసి, సమాసం పేరు తప్పనిసరిగా రాయండి.
b) షష్ఠీ తత్పురుషం (యొక్క), ద్వితీయా తత్పురుషం (ను, ని) గుర్తులు గుర్తుంచుకోండి.

 

Question 3: యణాదేశ సంధి అంటే ఏమిటి? ఉదాహరణలతో వివరించండి.

Answer:

కింది పదాలను విడదీసి, విడదీసిన పదాలను కలిపి, కలిగిన మార్పులను గమనించండి.

పదంవిడదీతమార్పుసంధి రూపం
అ) అత్యవసరంఅతి + అవసరంఅత్ + ఇ + అవసరం → అత్ + య్ + అవసరంఅత్యవసరం
ప్రత్యుత్తరంప్రతి + ఉత్తరంప్రత్ + ఇ + ఉత్తరం → ప్రత్ + య్ + ఉత్తరంప్రత్యుత్తరం
ప్రత్యేకంప్రతి + ఏకంప్రత్ + ఇ + ఏకం → ప్రత్ + య్ + ఏకంప్రత్యేకం
ఆ) అణ్వస్త్రంఅణు + అస్త్రంఅణ్ + ఉ + అస్త్రం → అణ్ + వ్ + అస్త్రంఅణ్వస్త్రం
గుర్వౌన్నత్యంగురు + ఔన్నత్యంగుర్ + ఉ + ఔన్నత్యం → గుర్ + వ్ + ఔన్నత్యంగుర్వౌన్నత్యం
ఇ) పిత్రార్జితంపితృ + ఆర్జితంపిత్ + ఋ + ఆర్జితం → పిత్ + ర్ + ఆర్జితంపిత్రార్జితం

పదంవిడదీతమార్పుసంధి రూపం
మాతృపదేశంమాతృ + ఉపదేశంమాత్ + ఋ + ఉపదేశం → మాత్ + ర్ + ఉపదేశంమాత్రుపదేశం

గమనిక : పై మూడు రకాల ఉదాహరణల ద్వారా కింది అంశాలను గమనింపవచ్చు. ఇ, ఉ, ఋ లకు అసవర్ణములు కలిస్తే ఇ, ఉ, ఋ లకు ఆదేశంగా య్, వ్, ర్ లు వస్తాయి. య, వ, ర, ల లను ‘యణులు’ అని పిలుస్తారు. ‘యణులు’ ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి ఇలా ఏర్పడిన సంధిని “యణాదేశ సంధి” అంటారు.
సూత్రము : ఇ, ఉ, ఋ లకు, అసవర్ణములైన అచ్చులు పరమైనపుడు, ‘యణులు’ ఆదేశంగా వస్తాయి.
అసవర్ణములు : అసవర్ణములు అంటే సవర్ణములు కాని అచ్చులు. ఉదా : ‘ఇ’ కి, ఇ, ఈ లు కాకుండా, మిగిలిన (అ, ఆ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ) అచ్చులు అసవర్ణాచ్చులు.

Exam Tips:

a) నిర్వచనం, ఒక ఉదాహరణ, సూత్రం – మూడూ రాయండి.
b) య్, వ్, ర్ – ‘యణులు’ అని గుర్తుంచుకోండి.

 

Question 4: కింద ఇచ్చిన పదాలను విడదీసి, యణాదేశ సంధి అవునో కాదో పరిశీలించండి.
అ) అభ్యుదయం ఆ) గుర్వాజ్ఞ ఇ) మాత్రంశ ఈ) మధ్వరి ఉ) స్వాగతం

Answer:

అ) అభ్యుదయం = అభి + ఉదయం = యణాదేశ సంధి
వివరణ : ‘అభి’ అనే పదంలో చివర ‘ఇ’ ఉంది. దానికి ‘ఉ’ అనే అసవర్ణాచ్చు పరమైంది కాన యణాదేశం వచ్చి, అభ్యుదయం అయ్యింది.
ఆ) గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ = యణాదేశ సంధి
వివరణ : ‘గురు’ అనే పదంలో చివర ‘ఉ’ అనే అచ్చు ఉంది. దానికి ‘ఆ’ అనే అసవర్ణాచ్చు పరమై యణాదేశ సంధిలో ‘వ్’ వచ్చింది.
ఇ) మాత్రంశ = మాతృ + అంశ = యణాదేశ సంధి
వివరణ : ‘మాతృ’ అనే పదంలో చివర ‘ఋ’ ఉంది. దానికి ‘అ’ అనే అసవర్ణాచ్చు పరమయ్యింది. యణాదేశంగా ‘ర్’ వచ్చింది.
ఈ) మధ్వరి = మధు + అరి = యణాదేశ సంధి
వివరణ : ‘మధు’ అనే పదంలో చివర ‘ఉ’ ఉంది. దానికి అసవర్ణమైన అచ్చు ‘అ’ పరమై యణాదేశంగా ‘వ్’ వచ్చింది.
ఉ) స్వాగతం = సు + ఆగతం = యణాదేశ సంధి
వివరణ : ‘సు’ అనే పదంలో, చివర ‘ఉ’ అనే అచ్చు ఉంది. దానికి ‘ఆ’ అనే అసవర్ణాచ్చు పరమైంది. యణాదేశంగా ‘ప్’ వచ్చింది.

Exam Tips:

a) ప్రతి పదాన్ని విడదీసి, ఇ/ఉ/ఋ కు అసవర్ణ అచ్చు పరమైందో చూడండి.
b) అవును/కాదు అని ముగింపు వాక్యం రాయండి.

 

Question 5: మీ పాఠ్యపుస్తకంలో యణాదేశ సంధికి సంబంధించిన పది పదాలు వెతికి రాయండి.

Answer:

1. ప్రత్యర్థులు = (ప్రతి + అర్థులు) – (నేనెరిగిన బూర్గుల – 2వ పాఠం)
2. అధ్యయనం = (అధి + అయనం) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
3. ప్రత్యేకమైన = (ప్రతి + ఏకమైన) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
4. ప్రత్యేక తెలంగాణ = (ప్రతి + ఏక) – (రంగాచార్యతో ముఖాముఖి – 4వ పాఠం)
5. ప్రత్యేకమైన శిక్షణ = (ప్రతి + ఏకమైన) – (దీక్షకు సిద్ధంకండి – 6వ పాఠం)
6. అత్యాచారము = (అతి + ఆచారము) – (ఉద్యమ స్ఫూర్తి – 8వ పాఠం)
7. అభ్యుదయం = (అభి + ఉదయం) – (వాగ్భూషణం – 10వ పాఠం)
8. అధ్యయనం = (అధి + అయనం) – (వాగ్భూషణం – 10వ పాఠం)
9. స్మృత్యర్థం = (స్మృతి + అర్థం) – (తీయని పలకరింపు – 12వ పాఠం)

Exam Tips:

a) పదాన్ని విడదీసి, ఏ పాఠంలోనిదో రాయండి.
b) అతి, ప్రతి, అభి, అధి, స్మృతి వంటి పూర్వ పదాలను గుర్తించండి.

 

Question 6: ప్రాజెక్టు పని : స్వాతంత్ర్య పోరాటంలో (లేదా) తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు, ముగ్గురు మహిళల వివరాలు సేకరించి, నివేదిక రాయండి.

Answer:

విద్యార్థి కృత్యం. (సంగెం లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి మహిళల పేరు, జననం, పోరాటంలో పాత్ర, సేవలను నివేదికలో రాయండి.)

Exam Tips:

a) ప్రాజెక్టు పనిలో పేరు, జననం, ఉద్యమంలో పాత్ర, సేవలను రాయండి.
b) నివేదికకు శీర్షిక, ముగింపు ఉండాలి.

 

పాఠ్యభాగ విశేషాలు

Question 1: పాఠంలోని కఠిన పదాలకు అర్థాలు రాయండి.

Answer:

(83వ పేజి)
అర్థాలు:
నిర్లిప్తత = దేనినీ పట్టించుకోకపోడం
కాఠిన్యము = కఠినత్వము(కర్కశత్వము)
పరిధుల్ని = చుట్టుగోడలను (కంచెలను)
పరిమితంచేసికోవటం = కొలతపెట్టుకోడం ;
గడ్డ = నేల;
విభ్రాంతి = భ్రాంతి లేక భ్రమ
గాథలు = కథలు
సమర సంరంభం = యుద్ధ ఉత్సాహము
జీవితాహుతులకు (జీవిత + ఆహుతులకు) = ప్రాణాలను సమర్పించి నందులకు; కడలినై = సముద్రమునై
ఘోషించాను = మ్రోతపెట్టాను (అఱచాను)
మాతృదేశ శృంఖలాలను = తల్లిదేశపు సంకెళ్ళను
వీరవాహిని = వీర సైన్యము
అలగా = కెరటంగా
స్వానుభవం (స్వ + అనుభవం) = స్వంత అనుభవం నిర్లిప్తత = పట్టించుకోకపోడం
నిర్వీర్యత = పౌరుషం లేకపోవడం
సహాయనిరాకరణం = సహాయం చేయడానికి అంగీకరించకపోడం పోరాటానికి = యుద్ధానికి ;
ప్రతీకారవాంఛ = ఎదురు దెబ్బతీయాలనే కోరిక ;
అహింసావాదులము = హింస పనికిరాదని చెప్పేవారము తల్లడిల్లిపోవు = భయపడి కంపించిపోవు
అప్రూవరు (Approver) = ప్రభుత్వం తరఫున సాక్షి
ప్రోద్బలం = పెద్దబలము ; (ప్రేరణ)
శతవిధాల = వంద విధాలుగా (అనేక విధాలుగా)
విఫలులైనారు = ప్రయత్నం ఫలించని వారు అయ్యారు. నిర్జన ప్రదేశానికి = మనుష్యులు లేని చోటుకు ;
నమోదు అవడం = చేరడం
84వ పేజీ
ఉప్పెనలా = తుపానులా ;
చర్యలు = చేసే పనులు
విషాదాంతం (విషాద + అంతం) = చివరకు దుఃఖాన్ని తెచ్చేవి; ఘోరమైన = భయంకరమైన
దారుణాలు = క్రూరకృత్యాలు
ప్రతినిత్యం = ప్రతిరోజు
బహిష్కరణోద్యమం (బహిష్కరణ + ఉద్యమం) = వెలివేయాలనే పోరాటం ; సవాలుచేస్తూ = ఇది ఏమిటని నిలదీసి అడుగుతూ;
సత్యాగ్రహులు = సత్యాగ్రహ ఉద్యమకారులు
విరమించుకోమని = మానుకొమ్మని
ప్రాధేయపడ్డారు = బ్రతిమాలారు
హాస్పిటల్ (Hospital) = వైద్యశాల
స్తంభించిపోయారు = మొద్దుబారిపోయారు (స్తంభంలా బిగిసిపోయారు) పరితపించిపోవు = మిక్కిలి బాధపడిపోవు
అండదండలు = సహాయములు;
విచ్చలవిడిగా (విడిగా + విడిగా) = ఇష్టం వచ్చినట్లుగా
దారుణానికి = క్రూరకృత్యానికి
గంధపుష్పాక్షతలు = గంధము, పుష్పములు, అక్షతలు ;
వీరావేశం (వీర + ఆవేశం) = పరాక్రమపు పొంగు
దుర్మరణానికి = అకాలమరణానికి
సానుభూతి = దుఃఖాన్ని వెల్లడించడం.
చెల్లాచెదరు = అటుఇటుపోవు
పికెటింగు (Piqueting) = పోలీసులను రానీకుండా అడ్డుకోడం శ్రేణి = గుంపు
నిరసనవ్రతం = నిరాహారదీక్ష
అసువులు కోల్పోవు = ప్రాణాలు పోగొట్టుకొను;
పాలకుడు = పాలనాధికారి
గడగడలాడించింది = వణికించింది
కర్కశహృదయాల్ని = కఠినమైన మనసులను
రంపపు కోత = అంపముతో కోసినట్లు నొప్పి కలగడం ;
85వ పేజి
అత్యాచారాలు = అనుచిత ప్రవర్తనలు
ప్రబలిపోవు = ఎక్కువగు
అట్టుడికినట్లు ఉడకడం = ఒక విషయమై పెద్ద గగ్గోలు ఏర్పడం కిరాతకులు = మ్లేచ్ఛ జాతీయులు
తోచేవారు = కనబడేవారు
అధోగతిపాలగు = కిందికి పతనమగు
నిట్టూర్చడం = నిట్టూర్పులు వదలడం
ధారాదత్తం చేయు = దానంగా ఇవ్వడం (వట్టినే ఇవ్వడం)
కొల్లగొట్టి = దోచుకొని
అనాగరికులు = నాగరికత లేనివారు
పరిగణిస్తూ = లెక్కిస్తూ
అడపాదడపా = అప్పుడప్పుడు
వసతులు = ఆనుకూల్యములు (సుఖములు)
అజ్ఞానంలో మ్రగ్గు = తెలివితక్కువలో అణిగి యుండు
కాటకములు = కరవులు,
మారెమ = అమ్మవారు ;
ఊడ్చేస్తూ ఉండడం = తుడిచిపెట్టేయడం
ఛాందసాచారాలు (ఛాందస + ఆచారాలు) = లోకజ్ఞానంలేని ఆచారాలు ప్రవచిస్తూ ఉంటే = చెపుతూ ఉంటే
వ్యాధిగ్రస్తము = రోగంతో ఆక్రమింపబడినది
186 వపేజీ
సుభిక్షం = మంచివర్షం పడి, పంట బాగా పండి ఆహారం, ఆరోగ్యం సమృద్ధిగా ఉండడం
అగ్ని రగులు = అగ్ని ప్రజ్వరిల్లు
గలకపోతే = ప్రజ్వరిల్లకపోతే
హారిబుల్ (Horrible) = భయంకరమైన, దారుణమైన నిరు పేదలు = మిక్కిలి బీదవారు
పరిహసిస్తూ ఉంటే = వేళాకోళం చేస్తూ ఉంటే
లజ్జాకరంగా = సిగ్గుపుట్టేటట్లుగా
కాలగమ్యాలకు = కాలగమనమునకు (కాలం నడకకు) సంకేతము = చిహ్నము, గుర్తు
అశ్వత్థ వృక్షం = రావి చెట్టు
ఉష్ణదేశం = వేడిదేశం
నరాలపుష్టి = నరాల బలము
నిపుణులు = నైపుణ్యం గల నేర్పరులు
అనుబంధం = సంబంధం
ఆధ్యాత్మిక భావనలు = పరమాత్మ సంబంధమైన ఆలోచనలు దైనందిన జీవితం = నిత్యజీవితం
కుప్పించి = గుప్పించి ;
కాలహరణ = కాలం ఖర్చుకాకుండా
ప్రాచ్యము = తూర్పుదేశాల ప్రాంతం
అప్రాచ్యము = పాశ్చాత్యదేశాల ప్రాంతం
ప్రాచ్యులు = తూర్పుదేశస్థులు
పరాన్నభుక్కులు (పర + అన్నభుక్కులు) = ఇతరుల అన్నాన్ని తినేవారు ఛాందసాచారాలు = లోకజ్ఞానం లేని ఆచారాలు
దిక్కుకానక = దిక్కు కనబడక
సంతోషాస్పదం (సంతోష + ఆస్పదం) = సంతోషం కల్గించేది సంరక్షణార్థము = సంరక్షించుకోడం కోసం బాధ్యతాయుత ప్రవర్తన = బాధ్యతతో కూడిన నడవడి కర్తవ్యపాలన = చేయవలసిన పనిని చేయడం
స్ఫురణ = స్ఫూర్తి (ప్రేరణ)
కొరవడటమే = లోపించటమే
హేతువు = కారణము
స్వార్ధపరులు = తమ బాగును మాత్రమే కోరుకొనేవారు సాంఘిక బాధ్యత = సంఘం ఎడల బాధ్యత
శోచనీయంగా = విచారింపవలసినదిగా

Exam Tips:

a) పదాలను వర్ణమాల క్రమంలో నేర్చుకుంటే సులభం.
b) ప్రతి పదానికి ఒక వాక్యంలో అర్థం గుర్తుంచుకోండి.

 

Question 2: పాఠం ఉద్దేశం ఏమిటి?

Answer:

నేనొక్కడిని బాగుంటే చాలు ఎవరు ఏమైతే నాకెందుకు ? అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్య్ర లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్య్రానికి సార్థకత లభిస్తుందని చెప్పటమే ఈ పాఠం ఉద్దేశం.

Exam Tips:

a) పాఠం ఉద్దేశాన్ని ఒకటి రెండు వాక్యాల్లో చెప్పండి.
b) ‘బాధ్యత’, ‘ఐక్యత’ అనే విలువలు ప్రస్తావించండి.

 

Question 3: పాఠ్యభాగ వివరాలు తెలపండి.

Answer:

ఈ పాఠం ‘ఆత్మకథ’ అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను, ఒక గ్రంథంగా రాస్తే, అది ”ఆత్మకథ’ అవుతుంది. దీనినే స్వీయచరిత్ర అని కూడా పిలుస్తారు. ఇందులో రచయిత అనుభవాలే కాక, సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు కూడా ప్రతిబింబిస్తాయి. ఇవి చదివిన వారికి, మంచి ప్రేరణను కలిగిస్తాయి. ఆత్మకథలు, ఉత్తమ పురుష కథనంలో సాగుతాయి. ప్రస్తుత పాఠ్యభాగం, సంగెం లక్ష్మీబాయి రాసిన “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” అనే ఆత్మకథలోనిది.

Exam Tips:

a) పాఠ్యభాగం ప్రక్రియ, ఆధారం, రచయిత్రి గ్రంథం అనే వివరాలు తప్పక రాయండి.
b) రచన ‘ఆత్మకథ’ అని గుర్తుంచుకోండి.

 

Question 4: రచయిత్రి సంగెం లక్ష్మీబాయి గురించి పరిచయం రాయండి.

Answer:

పాఠం : ‘ఉద్యమ స్ఫూర్తి’
రచయిత్రి : సంగెం లక్ష్మీబాయి
దేని నుండి గ్రహించబడినది : రచయిత్రి రాసిన “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” అనే ఆత్మకథ నుండి గ్రహించబడినది.
జన్మస్థలము : ఈమె మేడ్చల్ జిల్లాలోని ‘ఘటకేశ్వరం’ అనే గ్రామంలో జన్మించింది. జననమరణాలు : జననము 27-07-1911. మరణము 1979 వ సంవత్సరం ఉద్యోగం : హైదరాబాదు నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెనుగా, తెలుగు పండితురాలిగా ఈమె పనిచేసింది.
పదవులు : ఈమె బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. ఈమె 1957 నుండి 1971 వరకు 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు.
పాల్గొన్న ఉద్యమాలు:
1. గాంధీజీ పిలుపుతో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని, జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళ ఈమె.
2. 1951లో తెలంగాణలో వినోబాభావే చేసిన భూదానోద్యమ యాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ ఈమె.

Exam Tips:

a) రచయిత్రి జననం, ఊరు, కుటుంబం, ఉద్యమాలలో పాల్గొనడం, గ్రంథాలు వరుసగా రాయండి.
b) ఫోటోలోని సంవత్సరాలు (1911–1979) సరిచూసుకోండి.

 

Question 5: ప్రవేశిక : ‘ఉద్యమ స్ఫూర్తి’ పాఠానికి ప్రవేశికను రాయండి.

Answer:

చిన్నతనంలో తల్లిని, వివాహమైన కొంత కాలానికే భర్తను కోల్పోయినా లక్ష్మీబాయి నిరాశ పడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలను ఓర్చి చదువుకొన్నది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం, స్త్రీల అభ్యున్నతికి కృషిచేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగెం లక్ష్మీబాయి.
తన జీవిత విశేషాలు, తాను చూసిన స్వాతంత్ర్యోద్యమాన్ని కండ్లకు కట్టినట్లు, మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వాతంత్ర్యోద్యమ సంఘటనలు కొన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం.

Exam Tips:

a) ప్రవేశికను 4–5 వాక్యాల్లో, పాఠం సారాంశంతో రాయండి.
b) అందరూ దేశానికి కృషి చేయాలి అనే సందేశం ముగింపులో ఉండాలి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 9 Telugu Lesson 08 Spirit of the Movement (Udyama Sphurti)

Chapter Exercise Answers for Class 9 Telugu

Explore reliable textbook solutions for Lesson 08 Spirit of the Movement (Udyama Sphurti) tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Detailed Answer Guides for Lesson 08 Spirit of the Movement (Udyama Sphurti)

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 9 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Complete Preparation Kit for Class 9 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Telugu.

FAQs

Where can I find the latest TS 9th Class Telugu Guide Lesson 8 ఉద్యమ స్ఫూర్తి for the 2026-27 session?

The complete and updated TS 9th Class Telugu Guide Lesson 8 ఉద్యమ స్ఫూర్తి is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 9th Class Telugu Guide Lesson 8 ఉద్యమ స్ఫూర్తి as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Guide Lesson 8 ఉద్యమ స్ఫూర్తి will help students to get full marks in the theory paper.

Do you offer TS 9th Class Telugu Guide Lesson 8 ఉద్యమ స్ఫూర్తి in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Guide Lesson 8 ఉద్యమ స్ఫూర్తి in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire TS 9th Class Telugu Guide Lesson 8 ఉద్యమ స్ఫూర్తి in printable PDF format for offline study on any device.