Official TS Board Solutions for Class 9 Telugu: Lesson 03 Valasakuli (The Migrant Labourer)
Access comprehensive textbook solutions for Lesson 03 Valasakuli (The Migrant Labourer) using the official curriculum guides for Class 9 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Chapter-wise Solutions for Telugu: Lesson 03 Valasakuli (The Migrant Labourer)
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 25)
ఊరిలో నీకిల్లు లేదు – ఊరి వెలుపల పొలము లేదు
కూలి నిర్ణయ మింతని లేదు – కూలి పని స్థిరమైనది కాదు
ఆలుపిల్లల నేలేదెట్లా – అనే చింత నిన్నిడదోయి వ్యవసాయకూలి.
బతుకు దెరువు లేక నీవు – భార్య పిల్లల నొదిలి పెట్టి
బస్తి చేరి రిక్షలాగి – బలముగ జ్వరమొచ్చి పంటే
కాస్త నీకు గంజినీళ్ళు – కాసి పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి.
– సుద్దాల హనుమంతు
Question 1: ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి ? రాసింది ఎవరు ?
Answer:
ఈ పంక్తులు వ్యవసాయ కూలీలను గూర్చి తెలుపుతున్నాయి. ఈ గేయాన్ని “సుద్దాల హనుమంతు” రాశాడు.
Exam Tips:
a) గేయం చివర ఉన్న కవి పేరు (సుద్దాల హనుమంతు) చూసి రాయండి; ‘వ్యవసాయ కూలీలు’ అని స్పష్టంగా పేర్కొనండి.
Question 2: కూలిపని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి ?
Answer:
‘కూలిపని’ అంటే ఏ రోజుకు ఆ రోజు, ఎవరికైనా ఏదో పని చేసిపెట్టి, ఆ చేసిన పనికి కూలి తీసుకోవడం. ఈ పని ఉద్యోగంలా స్థిరమైనది కాదు. ప్రతిరోజూ కూలిపని ఎక్కడ దొరుకుతుందో అని వెతుక్కోవాలి. ఒక్కొక్క రోజు ఏ పనీ దొరకదు. వర్షం వచ్చిన రోజున ఎవరూ కూలిపని చెప్పరు. కూలిపని కోసం నిత్యం వేటాడాలి.
ఒకరోజు పని ఉంటుంది. మరొకరోజు ఏ పనీ ఉండదు. లేదా ఏ రిక్షాయో అద్దెకు తీసుకుని దాన్ని తొక్కుతూ జీవనం సాగించాలి. అందుకే కూలిపని స్థిరమైనది కాదు.
Exam Tips:
a) ‘స్థిరమైనది కాదు’ అంటే ఉద్యోగంలా ప్రతిరోజూ పని, జీతం ఉండవని ఉదాహరణలతో (వర్షం రోజు, పని దొరకని రోజు) వివరించండి.
Question 3: కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ?
Answer:
కూలిపని దొరికితే, వచ్చిన కొద్ది డబ్బుతో ఏదోరకంగా సంసారం నడుపుకుంటారు. డబ్బు లేనప్పుడు అప్పులు చేస్తారు. ఋణాలు తీసుకుంటారు. ఏమీ దొరకకపోతే, కాసిని మంచినీళ్ళు తాగి, కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకొని పడుకుంటారు. లేదా, ఏ రిక్షాయో తొక్కి దానితో వచ్చిన కొద్దిపాటి డబ్బుల్లో రిక్షా అద్దె కట్టి, మిగిలినది ఉంటే దానితో బతకాలి.
Exam Tips:
a) కూలి దొరికిన రోజు, దొరకని రోజు అనే రెండు స్థితులను విడివిడిగా రాయండి (అప్పులు, పస్తులు).
Question 4: ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి ?
Answer:
తాము ఉంటున్న ఊళ్ళలో సరైన వ్యవసాయపనులు, తమ వృత్తిపనులు లేకపోవడం వల్ల, నగరాల్లో కూలి చేసుకొని బ్రతకవచ్చని గ్రామీణ జనం, తమ ఊర్లు వదలి నగరాలకు పోతారు.
వర్షాలు లేకపోతే వ్యవసాయపనులు గ్రామాల్లో దొరకవు. వ్యవసాయ ఆదాయం లేకపోతే, పెద్ద రైతులు చేతివృత్తులవారికి తగిన పనులు చూపించలేరు. అలాగే కొందరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి నగరాలకు వలసపోతారు. పిల్లల చదువుల కోసం కొందరు గ్రామాలు వదలి నగరాలకు వెడతారు. గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు బొత్తిగా లేకపోవడం వల్లనే ప్రజలు ఊళ్ళు వదలి పోతున్నారు.
Exam Tips:
a) కారణాలను వరుసగా రాయండి: వ్యవసాయ పనులు లేకపోవడం, వర్షాభావం, చేతివృత్తులకు పని లేకపోవడం, పిల్లల చదువు.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 27)
Question 1: ‘గొడ్ల డొక్కలు గుంజడం’ అంటే మీకు ఏమి అర్థమైంది ?
Answer:
గొడ్లు అంటే పశువులు. ‘డొక్కలు గుంజడం’ అంటే వాటి పొట్టలు తిండిలేక లోపలకు నొక్కుకుపోవడం. పశువులకు తిండిలేక వాటి శరీరాలు ఎండిపోయి, వాటి డొక్కలు లోపలకు దిగిపోయాయన్నమాట. ఆ పాలమూరు జిల్లాలో వర్షాలు లేనందున, ప్రజలకు తిండి, పశువులకు గ్రాసం లేకపోయిందని నాకు అర్థమయ్యింది.
Exam Tips:
a) పదానికి అక్షరార్థం (గొడ్లు = పశువులు, డొక్కలు = పొట్టలు) చెప్పి, తర్వాత భావం రాయండి.
Question 2: కోస్తా ప్రాంతానికి ఎవరు, ఎందుకు వెళ్ళారు ?
Answer:
కోస్తా ప్రాంతానికి పాలమూరు జిల్లాలోని కూలీలతో పాటు, ఒక జాలరి వెళ్ళాడు. పాలమూరు ప్రాంతంలో వర్షాలు లేవు. కృష్ణాష్టమి వెళ్ళిపోయింది. పశువులకు ఆహారం లేదు. వాగుల్లో నీళ్ళులేక వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. వానపడుతుందన్న ఆశ లేకపోయింది. ఆ పరిస్థితుల్లో, కోస్తా దేశంలో కూలి ఎక్కువగా దొరుకుతుందని, కూలి పని చేసుకొనేవారు, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయారు.
Exam Tips:
a) ‘ఎవరు’ (పాలమూరు కూలీలు, జాలరి), ‘ఎందుకు’ (వర్షాలు లేక, కూలి ఎక్కువ దొరుకుతుందని) రెండు భాగాలకూ జవాబు ఇవ్వండి.
Question 3: పల్లెబతుకుల కష్టానికి కారణం ఏమిటి ?
Answer:
పల్లెల్లో ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. పశువుల పాడిపై ఆధారపడతారు. వర్షాలు పడకపోతే, వ్యవసాయం పనులుండవు. పశువులకు మేత దొరకదు. కూలివారికి కూలిపనులు దొరకవు. మొత్తంపై వర్షాలు లేక, వ్యవసాయం పనులు లేకపోవడం, వ్యవసాయం వల్ల, పాడిపంటల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండడం, అనేవే పల్లె బ్రతుకుల కష్టాలకు కారణాలు.
Exam Tips:
a) వర్షాలు లేకపోవడం, వ్యవసాయ పనులు లేకపోవడం, పశువులకు మేత లేకపోవడం అనే కారణాలను పాయింట్లుగా రాయండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 28)
Question 1: కృష్ణా ఆనకట్టను కట్టకపోవటానికి, పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది ?
Answer:
కృష్ణానదిపై ఎగువన ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పంటపొలాలకు అందుతాయి. ఆ నీళ్ళు లభ్యమైతే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు వర్షాధారంగా జీవించవలసిన పనిలేదు. హాయిగా కృష్ణాజలాలతో తమ పొలాల్లో పంటలు పండించు కోవచ్చు. ప్రస్తుతం ఆ ఆనకట్ట నిర్మించనందువల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, పాలమూరు జనం కూలీలుగా మారిపోయి యుంటారు.
Exam Tips:
a) ఆనకట్ట – సాగునీరు – పంటలు – కూలీలు అనే వరుసలో కారణ–ఫలిత సంబంధాన్ని చెప్పండి.
Question 2: ‘చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళి పోయిందని’ కవి ఎందుకు ఆవేదన చెందాడు ?
Answer:
సామాన్యంగా వర్షాలు శ్రావణ భాద్రపద మాసాల్లో ఎక్కువగా పడతాయి. కార్తీక పౌర్ణమి వచ్చే నాటికి వర్షాలు పూర్తిగా వెనుకపడతాయి. కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయిందంటే, ఇంక ఆ సంవత్సరానికి వర్షాలు లేనట్లే లెక్క ఇక చీకు మబ్బుల ముసురు సంగతి చూద్దాము. ఆ ప్రాంతంలో మబ్బులు ముసురుకున్నాయి. కాని అవి- చీకుమబ్బులు. అంటే చితికిపోయిన చిన్న చిన్న మబ్బులు అన్నమాట. దట్టమైన నల్లని మబ్బులు కావు. అందువల్ల చిన్న చిన్న జల్లులు తప్ప, పెద్ద వర్షం పడలేదన్నమాట.
అంతవరకూ పెద్ద వర్షం లేదు. కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆ సంవత్సరం వర్షం పడదు. అందుకే సరియైన వర్షం రాలేదని కవి ఆవేదన పడ్డాడు.
Exam Tips:
a) ‘చీకుమబ్బులు’ అంటే చితికిపోయిన చిన్న మబ్బులని అర్థం చెప్పి, కార్తీక పౌర్ణమి తర్వాత వర్షం ఉండదనే విషయాన్ని కలపండి.
I. అవగాహన – ప్రతిస్పందన
Question 1: ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళతారు? దీనిని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? చర్చించండి.
Answer:
ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువయిన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలసవెడుతూ ఉంటారు.
1. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురియక, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకదు. త్రాగేనీరు సహితం వారు కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జనం వలసలు పోతారు.
2. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయపనులు లేక, జీవనాధారం లేక, మరో ఉద్యోగం సంపాదించే సావకాశం లేక, ఏదైనా పని చేసుకొని బ్రతుకవచ్చనే ఆశతో, నగరాలకు వలసపోతారు.
3. తాము నివసించే ప్రాంతాలలో విద్యా వైద్య, ప్రయాణ సౌకర్యాలు లేక, ఆ సదుపాయాల కోసం జనం వలసలు పోతారు. ముఖ్యంగా జనం, జీవనభృతి కోసం, అది సంపాదించగల ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వలసలు నిరోధించాలంటే, ప్రజలకు కావలసిన అన్ని సదుపాయాలు గ్రామ ప్రాంతాల్లోనే దొరికేలా ప్రభుత్వాలు చర్యలు తీసికోవాలి. కూలీలకు వ్యవసాయపనులు లేనపుడు, పనికి ఆహారపథకం వంటి పథకాల ద్వారా, ప్రజలకు పనులు చూపించాలి. గ్రామాల్లో సాగునీటి, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలి.
Exam Tips:
a) చర్చ ప్రశ్నలో కారణాలు (నీరు, ఉపాధి, విద్య, వైద్యం) మరియు పరిష్కారాలు (గ్రామాల్లో సదుపాయాలు, పనికి ఆహారపథకం) రెండూ రాయండి.
Question 2: పాఠం చదువండి. ‘అంత్యానుప్రాస’ పదాలు రాయండి.
Answer:
1. ఎన్నడొస్తవు లేబరీ
పాలమూరి జాలరీ !
2. గొడ్ల డొక్కలు గుంజినా
వానపాములు ఎండినా
3. సరళా సాగరం నిండేది కాదని
కోయిల సాగరం నిండేది కాదని
4. గుడిసెకు విసిరి పోతివా
నడుం చుట్టుక పోతివా
5. దిక్కు మొక్కుకు పోతివా
కోస్తదేశం పోతివా
6. మరిగి రాకనె పోతివా
చారు మరిచే పోతివా
7. కర్మ మెందుకు
వేయ నందుకు
Exam Tips:
a) గేయంలో చివరి పదాలు/అక్షరాలు ఒకేలా ఉన్న జతలను (లేబరీ – జాలరీ, గుంజినా – ఎండినా) గుర్తించండి.
కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది.
దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరవు పీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.
Question 3: పై పేరా దేని గురించి చెప్తున్నది ?
Answer:
పై పేరా తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గురించి చెప్తున్నది.
Exam Tips:
a) పేరాలోని మొదటి వాక్యం ప్రధానాంశాన్ని చెబుతుంది; దాని ఆధారంగా ఒక వాక్యంలో రాయండి.
Question 4: ‘మిషన్ కాకతీయ’ అంటే ఏమిటి ?
Answer:
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ‘మిషన్ కాకతీయ’ అని పేరు పెట్టింది.
Exam Tips:
a) ‘మిషన్ కాకతీయ’ = చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అని, ఎవరు చేపట్టారో కలిపి రాయండి.
Question 5: తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు వెళ్ళుతున్నారు?
Answer:
తెలంగాణలో చెరువుల వ్యవస్థ కాలక్రమంలో సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దానితో తెలంగాణ గ్రామాలు కరవుపీడిత గ్రామాలుగా మారడంతో, తెలంగాణ ప్రజలు వలసలు వెడుతున్నారు.
Exam Tips:
a) పేరాలోని కారణ వాక్యాలనే వాడండి: చెరువుల వ్యవస్థ విధ్వంసం → కరవు → వలసలు.
Question 6: వలసలు ఆగిపోవడానికి చేపట్టవలసిన చర్యలేవి?
Answer:
తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా, వ్యవసాయాభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి.
Exam Tips:
a) పేరా చివరి భాగం నుండి పరిష్కారాన్ని (చెరువుల పునర్నిర్మాణం → వ్యవసాయాభివృద్ధి → ఉపాధి) రాయండి.
Question 7: చెరువుల అభివృద్ధి కోసం కృషిచేసిన వారెవరు?
Answer:
చెరువుల అభివృద్ధి కోసం కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు కృషిచేశారు.
Exam Tips:
a) పేరా ఆధారంగా కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు అనే నలుగురినీ పేర్కొనండి.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
Question 1: ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా! దీని ఆధారంగా పాలమూరు కూలీ జీవితం ఎట్లా ఉండేదో ఊహించి రాయండి.
Answer:
పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు.
త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం చేసేందుకు సాగునీటి సౌకర్యం లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చేది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేసికోడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయేవారు.
Exam Tips:
a) ఐదు వాక్యాల పరిమితిలో తిండి, నీరు, పని, చదువు, వైద్యం అనే సమస్యలను ఒక్కొక్క వాక్యంలో రాయండి.
Question 2: ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అలాంటి గ్రామాల నుండి ప్రజలు ఎందుకు వలసలు పోతున్నారు?
Answer:
గ్రామాల్లో పూర్వము పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ చెరువులు, ఆ చెరువుల నుండి పొలాలకు సాగునీరు లభించేది. దానితో గ్రామాల్లో పని కావలననే రైతు కూలీలందరికీ పని దొరికేది. ఇప్పుడు పెద్ద భూస్వాములు లేరు. పిల్లలకు భూములు పంచడంతో అవి చిన్న చిన్న భూకమతాలుగా మారాయి. ఆ చిన్నరైతులు వ్యవసాయ కూలీలకు 365 రోజులూ ఉపాధిని చూపించలేరు.
చిన్న రైతులకే సంవత్సరం పొడుగునా పని ఉండదు. యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు, విద్యా వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.
గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల పరిస్థితులు గ్రామాల్లో నేడు లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన సదుపాయాలు లభించడంలేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం ఉండడం లేదు.
అందువల్ల పిల్లలకు ఉద్యోగసంపాదనకు తగిన చదువులు చెప్పించడానికీ, తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికీ, తాము సుఖంగా జీవితాలు గడపడానికీ, ప్రజలు గ్రామాలు విడిచి, నగరాలకు వలసలు పోతున్నారు.
గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి సౌకర్యం ఉండడం లేదు. గ్రామాల్లోని వృత్తి పనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది.
పై కారణాల వల్లనే నేడు గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలసలు పోతున్నారు.
Exam Tips:
a) ‘ఒకప్పుడు – ఇప్పుడు’ అనే పోలికతో రాయండి (పెద్ద భూస్వాములు, చెరువులు → చిన్న కమతాలు, యంత్రాలు).
Question 3: “ఎప్పుడొస్తవు లేబరీ, పాలమూరి జాలరీ” అని అనడంలో కవి ఉద్దేశాన్ని రాయండి.
Answer:
‘లేబరీ’ అంటే పనిచేసుకొని జీవించే కూలివాడు అని అర్థము. ఈ పాటలో కూలి, జాలరివాడు. అంటే చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవించేవాడు. పాలమూరు ప్రాంతాల్లో వాగులు, వంకలూ ఎండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకొనే పనిలేకుండా పోయింది.
కోస్తా ప్రాంతంలో సముద్రం ఉంటుంది. అక్కడి జాలర్లు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెడతారు. అందుకే ఈ పాలమూరి జాలరి ఇక్కడ తనకు పనిలేక, కోస్తా బెస్తల పడవల్లో లేబరీగా మారాడు. అందుకే కవి జాలరిని, ఎప్పుడొస్తవు లేబరీ అని రాశాడు.
Exam Tips:
a) ‘లేబరీ’ = కూలివాడు, ‘జాలరి’ = చేపలు పట్టేవాడు అని అర్థం చెప్పి, ఆ జాలరి కూలీగా ఎందుకు మారాడో రాయండి.
Question 4: గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది ?
Answer:
గ్రామాల్లోని పంటచేలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తే గ్రామాల్లోని బీడు భూములన్నీ చక్కని పంటపొలాలుగా మారుతాయి. అప్పుడు గ్రామాల్లో ప్రజలందరికీ చేసుకోడానికి పని దొరుకుతుంది. గ్రామాల్లోని పూర్వం చెరువులన్నింటినీ పునరుద్ధరించాలి. పంటలు బాగా పండితే, ప్రజలు మంచి గృహాలు నిర్మించుకుంటారు. అప్పుడు వృత్తిపనివారలకు అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో విద్యా వైద్య రవాణా సౌకర్యాలు కల్పిస్తే, గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువమందికి ఉపాధి దొరుకుతుంది.
గ్రామాల్లో వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలు ప్రారంభించాలి. ముఖ్యంగా పాడి పరిశ్రమను గ్రామాల్లో ప్రోత్సహించాలి. కోళ్ళు, మేకలు, గొట్టెలు వంటివాటిని పెంచాలి. సేంద్రియ ఎరువులను తయారుచేసే యూనిట్లు ప్రారంభించాలి.
గ్రామాలను స్వయంపోషకంగా తయారుచేయాలి. యువకులకు గ్రామాల్లో లఘు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి చూపించాలి. గ్రామాల్లో ఉపాధి పుష్కలంగా లభించేటట్లు ప్రభుత్వం కృషిచేయాలి.
Exam Tips:
a) సాగునీరు, చెరువుల పునరుద్ధరణ, అనుబంధ పరిశ్రమలు, విద్యా వైద్య సౌకర్యాలు అనే పరిష్కారాలను క్రమంగా రాయండి.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
Question 5: “వలసకూలీ” గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి. (లేదా) ‘వలసకూలీ’ గేయ సారాంశాన్ని రాయండి.
Answer:
ఓ పాలమూరి జాలరీ ! కూలి ఎక్కువ ఇస్తారని, కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
గోకులాష్టమి వెళ్ళిపోయింది. పశువులు డొక్కలు ఎండిపోయాయి. వాగులలో, వంకలలో వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. అయినా చినుకుపడే ఆశలేదని కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
వానపడదు. సరళా కోయిల సాగరాలు నిండనే నిండవు. చౌట మడుగులు ఎండిపోయాయి. పైరులు వరుగులయ్యాయి. పల్లెల్లో బతకడం ఎలాగా అనీ, కూలి బాగా ఇస్తారనీ, కోస్తాకు వలసపోయావా !
ఓ జాలరీ ! నావ, గాలం గుడిసెలో పడేసి నైలాను వల తీసుకొని, మన్నెంకొండ దేవుడు వేంకటేశ్వరుడికి మొక్కుతూ, కోస్తాకు వెళ్ళావా ! తిరిగి ఎప్పుడొస్తావు ?
మెరిగె, బొచ్చె చేపలకు అలవాటుపడి, చందమామల, పరకపిల్లల చారు మరిచిపోయావా ! కోస్తా బెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు కృష్ణా ఎగువ ఆనకట్ట కట్టకపోడం వల్లనే కదా !
నీవు తిరిగి ఇంటికి వస్తానన్న గడువు దాటి వారాలయ్యింది. కార్తీక పౌర్ణమి వెళ్ళింది. ఇక్కడ నుండి వెళ్ళిన జనం అంతా చచ్చే కాలం వచ్చిందన్నట్లు, జలపిడుగు భద్రాచలం మెట్లు తాకిందట. ఎక్కడున్నావు ? ఎప్పుడొస్తావు ?
Exam Tips:
a) పది వాక్యాల జవాబులో గేయ క్రమాన్ని (వర్షాభావం → కరవు → కోస్తాకు వలస → ఆవేదన) అనుసరించండి.
Question 6: (లేదా) వలసకూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి.
Answer:
వలసకూలీలు సామాన్యంగా గ్రామీణప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు. 1. వలసకూలీలకు గ్రామాల్లో ఉన్న రేషనుకార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలన్నీ, వలసకు వారు వచ్చిన నగర ప్రాంతాల్లో కూడా కల్పించాలి.
2. వలసకూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి ఇళ్ళు కట్టించి ఉచితంగా ఇవ్వాలి.
3. వలసకూలీలందరికీ నగరాల్లో పట్టణ ఉపాధి పథకాల ద్వారా పనులు చూపించాలి. రెవెన్యూ అధికారులు వలస కూలీలకు రేషన్‌కార్డులు ఇచ్చి, వారికి చౌకగా బియ్యం, పంచదార వంటి వస్తువులు ఇప్పించాలి.
4. వలసకూలీల పిల్లలకు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
5. నగరాల్లో వలసకూలీలు ప్రయాణం చేయడానికి సిటీబస్సుల్లో కన్సెషన్టిక్కెట్లు ఇవ్వాలి.
6. ప్రభుత్వం చేయించే పనులలో వలసకూలీలకు పనిలో ప్రాధాన్యం ఇవ్వాలి. వలసకూలీల కాలనీల్లో రోడ్లు, మంచినీటి కుళాయిలు వగైరా సదుపాయాలు కల్పించాలి.
7. వలసకూలీలు తమ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి కనీసం ఏడాదిలో రెండుసార్లు ప్రయాణ సదుపాయాలు ఏర్పాటుచేయాలి.
8. వలసకూలీల కష్ట సుఖాలను మునిసిపల్ కౌన్సిలర్సు తెలిసికొని, ప్రభుత్వాధికారులకు తెలియజేయాలి. వలస కూలీలు నగరాల్లో స్వేచ్ఛగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వం కలుగజెయ్యాలి.
Exam Tips:
a) సూచనలను 1, 2, 3 … పాయింట్లుగా రాయండి (రేషన్‌కార్డులు, ఇళ్ళు, పని, పిల్లల చదువు, ప్రయాణ సౌకర్యం).
కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
Question 7: శ్రమజీవులైన కూలీలు పనిదొరకక పొట్టచేత పట్టుకొని వలసపోతున్నారు. వారి జీవనాన్ని ఊహిస్తూ ఒక కవిత/గేయం రాయండి.
Answer:
కూలీ గొప్పగ ముట్టుతుందని
నగర మార్గమై సాధనమ్మని
గ్రామం విడిచి పట్నవాసము
దారి పడితివి అయ్యోపాపము !
ఉన్న ఊరిలో పనులు లేవయా
కన్న తల్లిని విడిచి నావయా.
అమ్మా నాన్నలు దూరమయ్యిరీ
బంధు లందరూ నిన్ను విడిచిరీ
తిండి కోసమీ తిప్పలు తప్పవు
నగరములో మరి పనులు దొరకెనా ?
కడుపు నిండుగా తిండి దొరకెనా ?
ఉండడానికి ఇల్లు దొరకెనా ?
రోడ్డు పక్కనే చోటు దొరకెనా
అమ్మా నాన్నలు గుర్తుకొచ్చిరా
భార్యా బిడ్డలు గుర్తుకొచ్చిరా
అయ్యో కంటను కన్నీరొచ్చెనా
ఎవరైనా నీ పనిని మెచ్చెనా
కడుపు కోసమా ఇంత పరీక్ష
అయ్యా ఎందుకు నీకీ శిక్ష
కండబలమూ ఉన్నవాడవు
మొండితనమూ పట్టినాడవు
కలుగును తప్పక నీకు విజయము
దైవము తోడగు నీకిది నిజము.
Exam Tips:
a) గేయంలో ప్రాస (పాదాల చివర ఒకే అక్షరాలు) ఉండేలా రాయండి; కూలీ బాధ, ఆశ రెండూ ఉండాలి.
Question 8: (లేదా) వలసలను నిరోధించడానికి ప్రజలకు గ్రామాల్లోనే ఉపాధి లభించేటట్లు ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను గురించి పత్రికలకు లేఖ రాయండి.
Answer:
నిజామాబాద్,
తేది : X X X X X.
ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.
ఆర్యా,
నమస్కారాలు. నేను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా పరిసర ప్రాంతాల పల్లెల నుండి ఎందరో గ్రామీణ జనం, మా నగరాలకు వలస వస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వము కింది సాయం చేస్తే వలసలను అరికట్టవచ్చు.
1. గ్రామాల్లో ప్రజలకు సాగునీరు, త్రాగునీరు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
2. గ్రామాల నుండి రవాణా సదుపాయాలు కల్పించాలి.
3. గ్రామాల్లో ప్రజలకు పనికి ఆహారపథకం ద్వారా 365 రోజులూ పనులు చూపించాలి. ప్రతి మండల కేంద్రాల్లో పిల్లల చదువులకు సక్సెస్ పాఠశాలలు ఏర్పాటుచేయాలి.
ప్రతి గ్రామానికి రోజూ 24 గంటలూ విద్యుచ్ఛక్తి సదుపాయం కల్పించాలి. ప్రతి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రతి గ్రామాలకూ ఆర్.టి.సి బస్సు సౌకర్యం ఉండాలి.
వ్యవసాయానికి కావలసిన ఆధునిక పనిముట్లను, చౌకగా ప్రజలకు అందించాలి. వ్యవసాయదారులకు బ్యాంకుల ద్వారా అప్పులు తక్కువ వడ్డీకి ఇప్పించాలి. ఈ విషయాలను మీ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగానే మీకు నా కృతజ్ఞతలు. తప్పక ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి మీ పత్రిక ద్వారా తీసుకురండి.
ఇట్లు,
భవద్విశ్వసనీయుడు,
పి. రాజా,
తొమ్మిదవ తరగతి,
ప్రభుత్వ పాఠశాల,
నిజామాబాద్.
చిరునామా :
ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.
Exam Tips:
a) లేఖలో పై చిరునామా, తేదీ, సంబోధన (ఆర్యా), విషయం, ‘ఇట్లు’ తో ముగింపు, కింద చిరునామా తప్పనిసరి.
III. భాషాంశాలు
పదజాలం
Question 1: కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
Answer:
అ) పుస్తకాల నిండ మస్తుగ బొమ్మలు ఉన్నవి.
జవాబు:
మస్తుగ = అధికంగా
వాక్యప్రయోగం : ప్రభుత్వం దగ్గర మస్తుగ డబ్బు ఉంది.
ఆ) పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది.
జవాబు:
గడువు = కాలవ్యవధి
వాక్యప్రయోగం : ఈ నెల పదవ తారీకు వరకూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే గడువు ఉంది.
ఇ) పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది.
జవాబు:
పైరు = సస్యము
వాక్యప్రయోగం : ఈ సంవత్సరము మా చేలలో పైరులన్నీ పురుగుపట్టి పాడయ్యాయి.
Exam Tips:
a) గీత గీసిన పదానికి అర్థం చెప్పి, ఆ అర్థం స్పష్టమయ్యేలా మీ సొంత వాక్యం రాయండి.
Question 2: కింది పదాలు/వాక్యాలు వివరించి రాయండి.
Answer:
అ) గొడ్లడొక్కలు గుంజినా…
జవాబు:
వివరణ : ‘గొడ్లు’ అంటే పశువులు. ‘డొక్కలు’ అంటే వాటి పొట్టలు. గుంజడం అంటే ‘లాగడం’. పశువులకు కడుపునిండా తిండి లేకపోతే, వాటి డొక్కలు ఎండి లోపలకు దిగిపోతాయి. మొత్తంపై పశువుల శరీరాలు ఎండి లోపలకు దిగిపోడాన్ని ‘గొడ్లడొక్కలు గుంజడం’ అంటారు.
ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని………..
జవాబు:
వివరణ : చెర్లు అంటే చెరువులు. కుంటలు అంటే నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు, గుంటలు ఎండిపోయాయి. చెరువులు, గుంటలలోని నేల ‘పర్రెలు పడింది’ అంటే నెరలు తీసింది అనగా బీటలు పడిందని భావం.
ఇ) పైరులన్నీ వరుగులయ్యె….
జవాబు:
వివరణ : పైరులు పచ్చగా ఉంటాయి. ‘వరుగులు’ అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టిన ముక్కలు. పచ్చి కాయగూరలు ఎండబెడితే, బాగా ఎండి అవి వరుగులు అవుతాయి. పైరులు నీరులేక పచ్చదనం పోయి అవి వరుగులుగా మారిపోయాయని భావము.
ఈ) జల పిడుగు…….
జవాబు:
వివరణ : పిడుగు ఆకాశం మీది నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్లయితే ఆ పడ్డ వస్తువు లేక మనిషి మాడిపోతాడు. మరణిస్తాడు.
ఇది ‘జలపిడుగు’. పిడుగుపాటులా జలము పొంగి పొర్లిందన్న మాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి ‘జలపిడుగు’ అంటే పిడుగువలె వచ్చిపడిన ‘వరద ఉధృతి’ అని భావం. తుపాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది. కాబట్టి తుపాను, నదుల వరద వంటివి “జల పిడుగులు” అని భావం.
Exam Tips:
a) పదం/పంక్తి అర్థాన్ని పద విభజన చేసి వివరించండి; ‘భావం’ అనే మాటతో ముగించండి.
Question 3: కింది వాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి.
Answer:
అ) మానవుడు ఆశాజీవి. అతని ప్రయత్నాన్ని బట్టి ఆసలు నెరవేరుతాయి.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)
ఆ) సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి. జడివానకు కుహరాలలోని సింగాల గుండెలు పగిలాయి.
జవాబు:
సింహాలు (ప్రకృతి) – సింగాలు (వికృతి)
Exam Tips:
a) ప్రకృతి = మూల రూపం (సంస్కృత పదం), వికృతి = మారిన రూపం అని గుర్తుంచుకోండి (ఆశ – ఆస, సింహం – సింగం).
వ్యాకరణాంశాలు
Question 1: కింది పదాలను పరిశీలించండి. వాటిని విడదీసి సంధిని గుర్తించి, సూత్రం రాయండి.
Answer:
అ) ఎట్లని
ఎట్లని = ఎట్లు + అని = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.
ఆ) కాలమంటూ
కాలమంటూ = కాలము + అంటూ = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.
ఇ) వరుగులయ్యే = వరుగులు + అయ్యే = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.
శబ్దాలంకారాలు – అంత్యానుప్రాస
కింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
……….. గొడ్లడొక్కలు గుంజినా
………. వానపాములు ఎండినా
………. గుడిసెకు విసిరి పోతివా
………. నడుం చుట్టుక పోతివా
…….. ఎన్నడొస్తవు లేబరీ ;
……… పాలమూరి జాలరీ!
గమనిక : పై పాదాలు చివర అక్షరాలు, పునరుక్తమైనాయని గమనించారు కదా ! అక్షరాలు పునరుక్తమవడాన్ని “అంత్యానుప్రాస” అంటారు.
అంత్యానుప్రాస లక్షణం : పదాల, పాదాల, వాక్యాల చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాసాలంకారం.
Exam Tips:
a) ఉత్వసంధి సూత్రాన్ని పూర్తిగా రాయండి: ‘ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు’. పదాన్ని విడదీసి (పూర్వపదం + పరపదం) చూపండి.
Question 1: పాఠంలోని అంత్యానుప్రాసాలంకార పంక్తులను గుర్తించి రాయండి.
Answer:
1. ఎన్నడొస్తవు లేబరీ
పాలమూరి జాలరీ !
2. గొడ్లడొక్కలు గుంజినా
వానపాములు ఎండినా
3. సరళాసాగరం నిండేది కాదని
కోయిలసాగరం నిండేది కాదని
4. గుడిసెకు విసిరి పోతివా
నడుం చుట్టుక పోతివా
5. దిక్కు మొక్కుకు పోతివా
కోస్తదేశం పోతివా
6. మరిగి రాకనె పోతివా
చారు మరిచే పోతివా
7. కర్మ మెందుకు
వేయ నందుకు
సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ కింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి.
ఉదా : భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం.
గమనిక : పై ‘భద్రాచలం’ అనే సమాస పదంలో భద్ర, అచలం అనే రెండు పదాలున్నాయి కదా! ‘అచలం’ అంటే కొండ అని అర్థం. ‘అచలం’ అనేది నామవాచకం.
‘భద్ర’ అనేది పేరు. అనగా “సంజ్ఞ”.
సంజ్ఞనే సంభావన అని అంటారు.
ఈ విధంగా పూర్వపదం (మొదటి పదం)లో సంభావన ఉన్నట్లయితే, ఆ సమాసపదాన్ని “సంభావన పూర్వపద కర్మధారయ సమాసము” అని అంటారు.
Exam Tips:
a) ప్రతి జతలో చివరి అక్షరాలు ఒకేలా పునరావృతమయ్యే పాదాలను గుర్తించండి.
Question 1: ఈ పాఠంలో ఉన్న సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదాలను గుర్తించి, విశ్లేషించండి.
Answer:
1. సరళా సాగరం – విశ్లేషణ : ‘సరళా’ అనే పేరు గల సాగరం.
2. కోయిల సాగరం – విశ్లేషణ : ‘కోయిల’ అనే పేరు గల సాగరం
3. కోస్త దేశం – విశ్లేషణ : ‘కోస్తా’ అనే పేరు గల దేశం
4. మన్నెం కొండ – విశ్లేషణ : ‘మన్నెం’ అనే పేరు గల కొండ
5. మెరిగె చేప – విశ్లేషణ : ‘మెరిగె’ అనే పేరు గల చేప
6. బొచ్చె చేప – విశ్లేషణ : ‘బొచ్చె’ అనే పేరు గల చేప
Exam Tips:
a) సంభావన పూర్వపద కర్మధారయంలో మొదటి పదం పేరు (సంజ్ఞ) అయి ఉంటుంది; విగ్రహవాక్యం ‘…అనే పేరు గల …’ అని రాయండి.
రూపక సమాసం
కింద గీత గీసిన సమాస పదాన్ని పరిశీలించండి.
ధనాలన్నింటిలో శ్రేష్ఠమైనది విద్యాధనం.
పై గీత గీసిన పదములో విద్యకు ధనమునకు భేదం లేనట్లు చెప్పబడింది. “విద్య అనెడు ధనం” అని ‘విద్యాధనం’ అనే సమాసానికి అర్థం.
‘విద్యాధనం’ అనే సమాసపదంలో, ‘ధనం’ అనేది ఉపమానం.
‘విద్యాధనం’ అనే సమాసపదంలో, ‘విద్య’ అనేది ‘ఉపమేయము’.
Question 1: కింద గీత గీసిన సమాసపదాలలోని ఉపమాన, ఉపమేయాలను గుర్తించండి. 1. “దయాభరణము”ను ధరించినవాడు భగవంతుడు. 2. పేదలపై కృపారసము కలిగియుండాలి.
Answer:
1. వివరణ : “దయాభరణము” అనే సమాసపదంలో, ‘ఆభరణము’ అనే పదం ఉపమానము. ‘దయ’ అనేది ఉపమేయం.
2. వివరణ : ‘కృపారసము’ అనే సమాసపదంలో, “రసము” అనే పదం, ‘ఉపమానం’, ‘కృప’ అనేది ఉపమేయము.
గమనిక : ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని, ఉపమేయమందు ఆరోపించడాన్ని, ‘రూపక సమాసం’ అంటారు. లేదా “అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.
Exam Tips:
a) ఉపమానం, ఉపమేయం అనే రెండూ గుర్తించి, ‘ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడం రూపక సమాసం’ అని చెప్పండి.
Question 2: కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించండి. (సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం)
Answer:
అ) పాలమూరు జిల్లా – ‘పాలమూరు’ అను పేరు గల జిల్లా – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) సరళాసాగరం – ‘సరళా’ అనే పేరు గల సాగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) మన్నెంకొండ – ‘మన్నెం’ అనే పేరు గల కొండ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ) కీర్తికన్యక – కీర్తి అనే కన్య – రూపక సమాసం
ఉ) జ్ఞానజ్యోతి – జ్ఞానము అనే జ్యోతి – రూపక సమాసం
Exam Tips:
a) విగ్రహవాక్యం, సమాసం పేరు రెండూ రాయండి; సంభావన పూర్వపదం అయితే ‘అనే పేరు గల’, రూపకం అయితే ‘అనే’ అని విగ్రహవాక్యంలో వస్తుంది.
ప్రాజెక్టు పని
Question 1: మీ గ్రామంలో లేదా వాడలో వలసకూలీల వద్దకు/ వాళ్ల బంధువుల వద్దకు వెళ్లి, వలస ఎందుకు వచ్చారో తెలుసుకుని, వాళ్ళ కష్టసుఖాల గురించి ఇంటర్వ్యూ చేసి నివేదిక రూపొందించండి. (లేదా) కార్మికుల, కూలీల బతుకు జీవనం గురించి వచ్చిన కథ/కవిత/గేయం/ పాటలను సేకరించి, నివేదిక రాయండి. చదివి వినిపించండి.
Answer:
నేను మా గ్రామంలోని వలస కూలీల వద్దకు, వాళ్ళ బంధువుల వద్దకు వెళ్ళి వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో, ఎప్పటి నుండి వచ్చారో, ఏ కారణాలతో వచ్చారో ప్రశ్నావళి ద్వారా వివరాలను తెలుసుకున్నాను. కరవుకాటకాల వల్ల, ఉపాధి అవకాశాలు లేనందువల్ల, కూలీ పనులు లేని కారణంగా వలస వచ్చినట్లుగా గ్రహించాను. వారు ప్రతి రోజు దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లుగా అర్థమయ్యింది. అందువల్ల ఇలాంటి వలసకూలీల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతను అందివ్వాలి. సంపన్నులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. వారిని మనలో ఒకరిగా గుర్తించాలి. వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉన్నతంగా జీవించే అవకాశాలను కల్పించాలి.
Exam Tips:
a) ప్రాజెక్టు నివేదికలో వలస కారణాలు, వారి కష్టాలు, సూచనలు అనే మూడు భాగాలు ఉండాలి; ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలనూ చేర్చండి.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 9 Telugu Lesson 03 Valasakuli (The Migrant Labourer)
Textbook Solutions for Class 9 Telugu Lesson 03 Valasakuli (The Migrant Labourer)
Review comprehensive exercise answers for Class 9 Telugu Lesson 03 Valasakuli (The Migrant Labourer). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 9 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 03 Valasakuli (The Migrant Labourer) with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ in both English and Hindi medium.
Yes, you can download the entire TS 9th Class Telugu Guide 3rd Lesson వలసకూలీ in printable PDF format for offline study on any device.