TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి

Download TS Board Solutions for Class 9 Telugu Lesson 04 Rangacharyato Mukhamukhi (Interview with Dasarathi Rangacharya)

Access comprehensive textbook solutions for Lesson 04 Rangacharyato Mukhamukhi (Interview with Dasarathi Rangacharya) using the official curriculum guides for Class 9 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Access TS Board Solutions and Answers

Access the complete solution PDF for Class 9 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 34)

తెలంగాణకు చెందిన ప్రముఖ భాషాశాస్త్రవేత్త డా॥ చేకూరి రామారావుతో పత్రికా విలేఖరి ముఖాముఖి.
పత్రికా విలేఖరి : మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి.
చేకూరి రామారావు : మాది ఇల్లిందలపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ప్రారంభించి, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో డీన్‌గా పదవీ విరమణ చేశాను.
పత్రికా విలేఖరి : మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు, ఏ రచనకు వచ్చింది?
చేకూరి రామారావు : నేను రాసిన “స్మృతి కిణాంకం” అనే వ్యాస సంకలనానికి 2002 సంవత్సరంలో ఉత్తమమైన విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
పత్రికా విలేఖరి : వాడుకభాష గురించి చెప్పండి.
చేకూరి రామారావు : వ్యావహారిక భాషావాదమంటే మాట్లాడినట్లు రాయడం కాదు. మాట్లాడే భాషకు, రాసే భాషకు పరిమితులు వేరు. ప్రయోజనం వేరు. రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరం.
పత్రికా విలేఖరి : తెలుగు కనుమరుగు అవుతుందేమోనన్న ఆందోళన గురించి మీ అభిప్రాయం.
చేకూరి రామారావు : ఇన్ని కోట్లమంది మాట్లాడే భాష కనుమరుగుకాదు. కాకపోతే మన తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా కనిపిస్తున్నది.

Question 1: పై పేరాలో ఎవరు ఎవరిని ప్రశ్నలడుగుతున్నారు?

Answer:

పై పేరాలో ప్రముఖ భాషాశాస్త్రవేత్త అయిన డా॥ చేకూరి రామారావుగారిని, పత్రికా విలేఖరి ప్రశ్నలు అడుగుతున్నాడు.

Exam Tips:

a) పేరా ఆరంభంలోనే ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి (డా॥ చేకూరి రామారావు), అడిగిన వ్యక్తి (పత్రికా విలేఖరి) ఉన్నారు; ఇద్దరి పేర్లూ రాయండి.

 

Question 2: పై సమాధానాల ద్వారా మీకు తెలిసిన సాహితీ విశేషాలేమిటి?

Answer:

వ్యవహారిక భాషావాదము అంటే, మాట్లాడినట్లు రాయడం కాదనీ, మాట్లాడే భాషకూ, రాసే భాషకూ పరిమితులు వేరనీ, ప్రయోజనం వేరనీ, రచనా వ్యవస్థకు కొన్ని నియమాలు అవసరమనీ తెలిసింది. నేటి తెలుగుభాషను కోట్లాదిమంది మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగు ఎప్పటికీ కనుమరుగు కాదనీ, నేటి తెలుగులో ఇతర భాషల మిశ్రమం ఎక్కువగా ఉందనీ తెలిసింది.

Exam Tips:

a) ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలను (వ్యావహారిక భాష, తెలుగు కనుమరుగు కాకపోవడం, ఇతర భాషల మిశ్రమం) పాయింట్లుగా రాయండి.

 

Question 3: ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఏమంటారు?

Answer:

ఈ విధంగా ప్రశ్నలడిగే విధానాన్ని ఇంగ్లీషు భాషలో ‘ఇంటర్వ్యూ’ అంటారు.
తెలుగులో “ముఖాముఖి” అని, ‘పరిపృచ్ఛ’ అని పిలుస్తారు.

Exam Tips:

a) ఇంగ్లీషులో ‘ఇంటర్వ్యూ’, తెలుగులో ‘ముఖాముఖి’, ‘పరిపృచ్ఛ’ అనే మూడు పేర్లనూ రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 37)

Question 1: “తెలంగాణ సాయుధపోరాటం” గురించి విన్నారా ? మీకు తెలిసింది చెప్పండి.

Answer:

తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల నుండి, దొరల నుండి, నిజాం ప్రభుత్వం నుండి, వెట్టిచాకిరి నుండి, విముక్తి కోసం, రైతులూ, రైతుకూలీలూ, కార్మికులూ స్త్రీలూ, పిల్లలూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పోరాటమే, “తెలంగాణ సాయుధపోరాటం”.
ఈ పోరాటం, 1946 నుండి 1951 వరకు కొనసాగింది. వందలాది ఎగరాలు కలిగిన భూస్వాములపై, వారికి అండదండలు అందించిన నిజాం ప్రభుత్వంపై, రైతులు చేసిన పోరాటం ఇది. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం, పేద రైతులు చేసిన ఈ సాయుధ పోరాటం, ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చింది.

Exam Tips:

a) భూస్వాములు, నిజాం, వెట్టిచాకిరి అనే మూడు అంశాలనూ, ఏ కాలంలో (1946–51) జరిగిందో తప్పక పేర్కొనండి.

 

Question 2: “వారసత్వం” అనే మాటను ఏ విధంగా గ్రహించాలి ?

Answer:

‘వారసత్వం’ అనే పదానికి, ఒకతరం నుండి మరో తరానికి వచ్చే సంప్రదాయ హక్కు అని అర్థము. తాత ఆస్తి తండ్రికి, తండ్రి ఆస్తి కొడుకుకి వారసత్వంగా సంక్రమిస్తుంది. అలాగే తెలంగాణ సాయుధపోరాట స్ఫూర్తి, ఒక తరం నుండి వారి తరువాత తరానికి సంక్రమించాలి.
తెలంగాణ సాయుధపోరాటంలో ఆనాటి రైతులూ వగైరా ప్రజలు, ఎలా ప్రభుత్వంపై, భూస్వాములపై, తమ హక్కుల కోసం పోరాడారో, అలాగే భావితరాల వారు కూడా, తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేసే పట్టుదల, దీక్ష, వారసత్వంగా వారికి రావాలని ఆ మనం ఈ మాటనుబట్టి గ్రహించాలి.

Exam Tips:

a) ‘వారసత్వం’ అంటే ఒక తరం నుండి మరో తరానికి సంక్రమించేది; ఉదాహరణగా ఆస్తి, స్ఫూర్తి రెండింటినీ చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 38)

Question 1: “జనపదం” నవల ఇతివృత్తమేమిటి ?

Answer:

తెలంగాణలో పోలీసు యాక్షన్ తరువాత రైతుల భూములను దొరలు కాజేశారు. దానితో ‘జనపదం’ కథ మొదలవుతుంది. తరువాత వచ్చిన ఉద్యమాల గురించి, ఉద్యమాల పేరున జరిగిన మోసాల గురించి, ఆనాడు రాజకీయాలు భ్రష్టు పట్టడం గురించి, ఈ “జనపదం” నవలలో వివరంగా చెప్పబడింది. ఇది ఒక్క తెలంగాణ కాక, భారతదేశానికి చెందిన నవల. ఈ నవలలో నిజం చెప్పబడింది.

Exam Tips:

a) ‘జనపదం’ నవల ఇతివృత్తాన్ని (పోలీసు చర్య తర్వాత భూములు కాజేయడం, ఉద్యమాలు, రాజకీయాల భ్రష్టత) క్లుప్తంగా చెప్పండి.

 

Question 2: రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ఏమిటి ?

Answer:

రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం, “తెలంగాణ సాయుధపోరాటం”. రంగాచార్య నవలలు, తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా రాయబడ్డాయి. ‘మోదుగు పూలు’ అనే నవల ఆయన జీవిత చరిత్ర ప్రధానంగా రాయబడింది.

Exam Tips:

a) రంగాచార్య నవలల ప్రధానాంశం ‘తెలంగాణ సాయుధపోరాటం’ అని మొదటి వాక్యంలోనే రాయండి.

 

Question 3: తన ఆత్మకథగా వర్ణించిన పుస్తకమేది ?

Answer:

రంగాచార్య రాసిన ‘మోదుగుపూలు’ అనే నవల సుమారుగా ఆయన ‘ఆత్మకథ’ వంటిది. రంగాచార్య తన జీవన యానాన్ని ఈ నవలా రూపంలో రాశాడు. ఈ నవల పర్ఫెక్షన్ సాగింది. ఈ నవలలో ఒక్క లోపాన్ని కూడా చూపించలేరని రంగాచార్య చెప్పారు. ఈ నవలలో సిద్ధాంతం కన్నా, విశ్వాసం కన్నా, కర్తవ్యం గొప్పది అని రంగాచార్య చెప్పాడు.

Exam Tips:

a) ఆత్మకథ వంటి నవల ‘మోదుగుపూలు’; పేరు తప్పనిసరిగా రాసి, అందులోని సందేశాన్ని ఒక వాక్యంలో చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 39)

Question 1: ‘మాండలికమే ప్రజల భాష !’ నిజమేనా ?

Answer:

మాండలిక భాష అంటే ఆ మండలంలో లేక ఆ ప్రాంతంలో సామాన్య ప్రజలు వారి నిత్య వ్యవహారాలలో ఒకరితో ఒకరు మాట్లాడుకొనే భాష, మాండలిక భాష, ప్రజల హృదయాల్లోంచి అప్రయత్నంగా వచ్చిన భాష, అది కావ్య భాషవలె కృత్రిమం కాదు. కాబట్టి మాండలిక భాషను నిజమైన ప్రజల భాష అని చెప్పవచ్చు.

Exam Tips:

a) ‘మాండలికం’ అంటే ప్రాంతీయ భాష అని నిర్వచించి, అది ప్రజల హృదయ భాష అని కారణంతో సమర్థించండి.

 

Question 2: ‘వసుధైక కుటుంబం’ అంటే మీరు ఏమనుకుంటున్నారు?

Answer:

కుటుంబము అంటే మనకు తెలుసు. మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అప్పాచెల్లెండు, తాతామామ్మలు మన కుటుంబము. మన కుటుంబ సభ్యులపట్ల, మనం ప్రేమాదరాలతో ఉంటాము. మన కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో మనం పాలుపంచుకుంటాము.
వసుధైక కుటుంబం, అంటే ప్రపంచంలోని భూమండలంపై ఉండే ప్రజలందరూ ఒకే కుటుంబం అని అర్థం. అంటే ప్రపంచ ప్రజలంతా కులమత భేదాలు విడిచి, ఒకే తల్లిదండ్రుల పిల్లల్లా కలసిమెలసి, కష్టసుఖాల్లో పాలుపంచుకోడాన్ని ‘వసుధైక కుటుంబం’ అనవచ్చు.

Exam Tips:

a) ‘వసుధ’ = భూమి, ‘ఏక’ = ఒకే అని పదార్థం చెప్పి, కులమత భేదాలు లేని కుటుంబ భావనను వివరించండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 39)

Question 1: కృషి – గుర్తింపు వీటి మధ్య సంబంధాన్ని చెప్పండి.

Answer:

కొందరు వ్యక్తులు సంఘం కోసం తమ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఎంతో ‘కృషి’ అనగా ప్రయత్నం చేస్తారు. కొందరు సంఘసంస్కర్తలు, సాంఘిక సంస్కరణల కోసం గొప్ప కృషి చేస్తారు. కొందరు శాస్త్రవేత్తలు, శాస్త్రాభివృద్ధికై కృషి చేస్తారు. కొందరు డాక్టర్లు, ఎన్నో పరిశోధనలు చేసి గొప్ప విజయాలు సాధిస్తారు. కొందరు రాజకీయ వేత్తలు దేశం కోసం కృషి చేస్తారు.
అందులో కొందరిని సంఘం గుర్తించి వారిని గౌరవిస్తుంది. వారికి సన్మానాలు చేస్తుంది. అందులో కొందరి కృషికి, గుర్తింపు ఉండదు. ఎవరూ వారి కృషిని మెచ్చుకోరు. కాబట్టి కృషికీ, గుర్తింపుకూ మధ్య సంబంధం ఉండదు.

Exam Tips:

a) ‘కృషి’, ‘గుర్తింపు’ రెండింటికీ ఉదాహరణలు (శాస్త్రవేత్తలు, సంఘసంస్కర్తలు) ఇస్తూ మీ అభిప్రాయం చెప్పండి.

 

Question 2: సందేశమిచ్చే అవకాశం ఎవరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు ?

Answer:

కొందరు వ్యక్తులు దేశం కోసం, శాస్త్రాభివృద్ధి కోసం, జనం కోసం, ఎంతో కృషి చేసి తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. వారు ప్రజలకు చెప్పిన మాటలను తాము కూడా ఆచరిస్తారు. అటువంటి మహాత్ములకు, ఆదర్శ జీవనం కలవారికి, ఇతరులకు సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది.

Exam Tips:

a) తాము చెప్పినదాన్ని ఆచరించేవారికే సందేశం ఇచ్చే అర్హత ఉంటుందనే భావాన్ని ఉదాహరణతో రాయండి.

 

Question 3: ‘సాంస్కృతిక వైభవం’ అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు?

Answer:

‘సంస్కృతి’ అంటే నాగరికత. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కళలు, కొన్ని ఆచార వ్యవహారాలు, కొన్ని పండుగలు, కొన్ని ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. గణేశ్ ఉత్సవాలు చేస్తారు. మహంకాళి అమ్మవార్ని ఆరాధిస్తారు. దీనినే సాంస్కృతిక వైభవం అని చెప్పవచ్చు.

Exam Tips:

a) సంస్కృతి అంటే ఆచారాలు, పండుగలు, కళలు; తెలంగాణ ఉదాహరణలు (బతుకమ్మ, బోనాలు) ఇవ్వండి.

 

I. అవగాహన-ప్రతిస్పందన

Question 1: దాశరథి రంగాచార్యతో ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ? మీ అభిప్రాయం చెప్పండి.

Answer:

దాశరథి రంగాచార్యగారితో ఇంటర్వ్యూ మంచి ఆనందాన్ని కల్గించింది. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన రంగాచార్యగార్కి తెలంగాణ సాయుధపోరాటంతో గల సంబంధం, మాకు మంచి స్ఫూర్తినిచ్చింది. రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు వంటి నవలలు కొని, తప్పక చదవాలనిపించింది. ఆ నవలలు ప్రతి పాఠశాల, గ్రంథాలయంలోనూ ఉండేలా, ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుదనిపించింది.
నాలుగు వేదాలనూ, 10 ఉపనిషత్తులనూ తెనిగించిన ఆ మహాపండితుడిని, ఒక్కసారి కన్నులారా చూడాలనిపించింది. రంగాచార్య వంటి పండితునిపై కమ్యూనిస్టుల ప్రభావం ఉందని తెలిసి, ఆశ్చర్యం అనిపించింది. రంగాచార్యగారు ఉత్తమ మనీషి అని, మంచి మనిషి అని నాకు అనిపించింది. రంగాచార్య ఉద్యమజీవి అనిపించింది. రంగాచార్య తెలంగాణ ముద్దుబిడ్డ అనిపించింది.

Exam Tips:

a) ఇది అభిప్రాయ ప్రశ్న; ఇంటర్వ్యూలో మీకు నచ్చిన రెండు విషయాలను కారణాలతో రాయండి.

 

Question 2: ఈ మధ్యకాలంలో టి.వి.లో లేదా ఇంకెక్కడైనా మీరు చూసిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడండి.

Answer:

అఖిల భారత, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు ‘అమిత్ షా’తో, ఈనాడు పత్రిక వారు చేసిన ఇంటర్వ్యూ వివరాలను దిగువ ఇస్తున్నాం.
ఈనాడు ప్రతినిధి : మోదీ ప్రభుత్వం, మొదటి సంవత్సరం పాలనలో సాధించిన అతిపెద్ద విజయం ఏమిటి ?
అమిత్ షా : మేము 2014 మే 26న అధికారానికి వచ్చాం. ఈ ఏడాది పాలనలో మాపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదు. అదే యూ.పీ. ఏ – 10 ఏళ్ళ పాలనలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇది మేము సాధించిన మొదటి పెద్ద విజయం.
ఈనాడు ప్రతినిధి : ఇవి కాకుండా, ఇంకా ఏమి సాధించారు ?
అమిత్ షా : గాడి తప్పిన ఆర్థిక రంగాన్ని పట్టాలపైకి ఎక్కించాం. ద్రవ్యలోటు దిగి వస్తోంది. కాశ్మీర్ వరదలు, నేపాల్ భూకంపం, వంటి ఉపద్రవాలలో, వేగంగా బాధితులను మేము ఆదుకున్నాం. ఏడాది కాలంలో 14 కోట్ల (జన్ ధన్) బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం. మూడు సామాజిక భద్రతా పథకాలు, పేదవారి కోసం తీసుకువచ్చాం.
ఈనాడు ప్రతినిధి : మోదీ సర్కారు కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా!
అమిత్ షా : అదంతా వట్టి అబద్దం. గత ప్రభుత్వం, బొగ్గు, ఖనిజ నిక్షేపాలను, కార్పొరేట్లకు దాదాపు ఉచితంగా ఇచ్చింది. మేము మొత్తం గనుల్లో 10 శాతం వేలం వేస్తే, 2 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. అలాగే స్పెక్ట్రమ్ వేలంలో 1.08 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. మీరే గమనించండి. ఎవరు ఎవరికి వత్తాసో !
ఈనాడు ప్రతినిధి : ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ?
అమిత్ షా : ఈ సమస్యను త్వరలో ఆర్థిక మంత్రి పరిష్కరిస్తారు.
ఈనాడు ప్రతినిధి : భూసేకరణ బిల్లును మీరు రాజ్యసభలో పాస్ చేయించుకోలేకపోతున్నారు కదా !
అమిత్ షా : అవును. ప్రతిపక్షాలు అనవసరంగా అడ్డు వస్తున్నాయి. ఆ బిల్లు త్వరలోనే పార్లమెంట్లో పాసవుతుంది.
ఈనాడు ప్రతినిధి : ధన్యవాదాలు, సెలవు.

Exam Tips:

a) మీరు చూసిన ఒక ఇంటర్వ్యూ ఎవరిది, ఏ విషయంపై అనేవి చెప్పి, ప్రశ్న–జవాబు పద్ధతిలో సారాంశం చెప్పండి.

 

Question 3: పాఠం ఆధారంగా దాశరథి రంగాచార్య నవలలు, వాటిలోని ఇతివృత్తాలను తెలుపుతూ ఒక జాబితా రాయండి.

Answer:

క్రమసంఖ్యరచన పేరుఇతివృత్తం
1చిల్లర దేవుళ్ళుతెలంగాణ ఫ్యూడల్ అధికారులే చిల్లర దేవుళ్ళు. ఆ అధికారుల కుట్రలు, అవినీతి, ప్రజాపీడనం దీనిలోని కథ.
2జనపదంప్రజల భూముల్ని దొరలు కాజేయగా వచ్చిన ఉద్యమాలు, ఉద్యమాల పేర జరిగిన మోసం, భ్రష్టు పట్టిన రాజకీయాలు వివరంగా ఈ నవలలో చెప్పారు.
3మోదుగుపూలుదాశరథి రంగాచార్యగారి జీవిత కథనే ఈ నవలగా రాశారు. సిద్ధాంతం కంటే విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పదని, దీనిలో చెప్పారు.
4మాయజలతారుతెలంగాణ రైతాంగ పోరాటం వెనుక చరిత్ర.

Exam Tips:

a) పట్టికలో నవల పేరు – ఇతివృత్తం జతలను క్రమసంఖ్యతో రాయండి (చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు).

 

ఇంటర్వ్యూకు సంబంధించిన కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
పత్రికల్లో, టి.వి.లో రకరకాల ఇంటర్వ్యూలను చూస్తుంటాం. ఇంటర్వ్యూలు రెండు రకాలని తెలుసుకదా ! ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థి ప్రతిభను పరీక్షించటానికి చేసేది ఒకరకం. ఉద్యోగాన్ని సంపాదించటానికి అభ్యర్థులు పూర్తి సంసిద్ధతతో ఇంటర్వ్యూకు పోతారు. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముఖ్యపాత్ర పోషిస్తారు. ఇది మొదటిది. ప్రముఖుల జీవిత విశేషాలను తెలుసుకోవటానికి చేసేది మరోరకం.
ప్రముఖుల, గొప్పవాళ్ళ నుండి వారి వివరాలను విశేషాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది. దీనిలో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తే కీలకం.
రెండవ రకం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట వారిని పరిచయం చేసుకొని వారి వ్యక్తిగత వివరాల నుండి మొదలై వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ముగ్గుస్తుంది. ఇట్లా చేసే ఇంటర్వ్యూల వివరాలను పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో ప్రజలు చూస్తుంటారు. ఆదర్శవంతులు, సంఘసంస్కర్తలు, కవులు, రచయితలు, ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు మొదలగు వారే కాకుండా మరే ఇతర రంగంలోనైనా ‘ఉత్తమ’ సేవలందించిన వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేయడం మనం చూస్తుంటాం. వీళ్ళ జీవితాలు ఎందరికో స్పూర్తిని కలిగిస్తాయి. దారిని చూపుతాయి.

Question 4: ఇంటర్వ్యూ అంటే ఏమిటి ?

Answer:

ఉద్యోగాల కొరకై అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఒక ప్రక్రియను ఇంటర్వ్యూ అంటారు.

Exam Tips:

a) ‘ఇంటర్వ్యూ’ అంటే ఉద్యోగ ఎంపికకై ప్రతిభను పరీక్షించే ప్రక్రియ అని పేరాలోని మాటలతో రాయండి.

 

Question 5: ప్రముఖులను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు ?

Answer:

ప్రముఖుల జీవిత విశేషాలు, వారి అనుభవాలు, వారు అందించిన సేవలు, ఎందరికో స్ఫూర్తినిస్తాయి. మరెందరికో దారిని చూపుతాయి. అందుకోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తారు.

Exam Tips:

a) ప్రముఖుల అనుభవాలు, సేవలు ఇతరులకు స్ఫూర్తి, దారి చూపుతాయని కారణం చెప్పండి.

 

Question 6: మొదటిరకం ఇంటర్వ్యూ దేనికి సంబంధించినది ?

Answer:

ఉద్యోగాల ఎంపికకై అభ్యర్థుల ప్రతిభను పరీక్షించడానికి చేసే ఇంటర్వ్యూ మొదటి రకం. దీనిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ప్రముఖపాత్ర వహిస్తారు.

Exam Tips:

a) మొదటి రకంలో ఇంటర్వ్యూ చేసేవారు ముఖ్యపాత్ర పోషిస్తారని కూడా చేర్చండి.

 

Question 7: ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడానికి ఎట్లా సిద్ధం కావాలి ?

Answer:

ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముందుగా కొన్ని అంశాలపై ప్రశ్నలు తయారుచేసుకుంటారు. మొదట ప్రముఖులను పరిచయం చేసుకొని, వారి వ్యక్తిగత వివరాలను అడిగి, తరువాత వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశంతో ఇంటర్వ్యూ ముగుస్తుంది. ఉ) ప్రముఖుల నుండి ఇంటర్వ్యూలో సాధారణంగా రాబట్టే విషయాలు ఏవి ?
జవాబు:
1. వ్యక్తిగత వివరములు,
2. వారి జీవితంలోని ముఖ్య సన్నివేశాలు, ఘట్టాలు, వారందించిన సేవలు, వారి ఆశయాలు, సమాజానికి వారిచ్చే సందేశం మొదలయిన విషయాలు ప్రముఖుల నుండి రాబడతారు.

Exam Tips:

a) ప్రశ్నల తయారీ → పరిచయం → వ్యక్తిగత వివరాలు → సేవలు, ఆశయాలు → సందేశం అనే క్రమాన్ని రాయండి.

 

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

Question 1: దాశరథి రంగాచార్య తాను రచనలు ఎందుకు చేయాలనుకున్నారో సొంతమాటల్లో రాయండి.

Answer:

రంగాచార్య ఆంధ్ర మహాసభ ఉద్యమాల ప్రభావంతో మొదట రచన ప్రారంభించారు. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి, పత్రికలకు లేఖలూ, వ్యాసాలూ రాశారు.
ప్రభుత్వం, తెలంగాణ సాయుధపోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చెరిపివేసి విద్యార్థులకు తెలియకుండా చేసింది. అందువల్ల తెలంగాణ మహోజ్జ్వల వారసత్వం, తరువాతి తరాల వారికి తెలియకుండా పోతుందనే బాధతో, ఆందోళనతో, రంగాచార్య, తెలంగాణ సాయుధపోరాట గాథలో వట్టికోట ఆళ్వారుస్వామి రాయగా మిగిలిన విషయాలను నవలలుగా రచించారు.

Exam Tips:

a) ‘ఆంధ్ర మహాసభ ప్రభావం’, ‘చరిత్ర వక్రీకరణపై ఆవేదన’ అనే రెండు కారణాలను రాయండి.

 

Question 2: “తెలంగాణ ఏర్పాటు సంతోషాన్నిచ్చింది” అని రచయిత అనటంపై మీ అభిప్రాయాన్ని రాయండి.

Answer:

తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. అలా రాష్ట్రం ఏర్పాటు కావడం తనకు సంతోషాన్ని కలుగజేసిందని రంగాచార్యగారు చెప్పారు. అదే సందర్భంలో రంగాచార్యగారు తెలంగాణ వచ్చిందనుకుంటే లాభం లేదని, వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.
దీనినిబట్టి దాశరథి రంగాచార్యగారికి, తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంతో ప్రేమ ఉందని అర్ధం అవుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయంలో తెలంగాణలో పుట్టినవారందరూ సంతోషిస్తారని నా అభిప్రాయం.

Exam Tips:

a) మొదట రచయిత చెప్పిన మాటలు, తర్వాత మీ అభిప్రాయం (తెలంగాణను కాపాడుకోవాలి, అభివృద్ధి చేయాలి) అని రాయండి.

 

Question 3: “ప్రజల భాష” అంటే మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి.

Answer:

రంగాచార్య తన నవలలను ప్రజల భాషలో వ్రాశానని చెప్పారు. ప్రజల భాష అంటే ప్రజలు మాట్లాడుకొనే మాండలిక భాష, నవలల్లో పాత్రలకు వారు పాత్రోచితమైన తెలంగాణలోని మాండలిక భాష వాడారు. రంగాచార్య గారికి తెలంగాణ అంటే అభిమానం. తెలంగాణ యాస సొగసులు అంటే ఇష్టం. అందుకే వారు నవలలలోని పాత్రలను బట్టి, పాత్రలు మాట్లాడేటప్పుడు ప్రజల భాషయైన మాండలికాన్ని వాడారు.
ఇక కథను చెప్పేటప్పుడు సాధారణ భాషనే వాడారు. ఆయన ప్రజాజీవితాన్ని చిత్రించడానికి, ప్రజల కోసం రచనలు చేశారు. అందుకే ప్రజల భాషయైన తెలంగాణ యాసతో ప్రజలు మాట్లాడే భాషను, తమ నవలల్లో ఉపయోగించారని గ్రహించాను.

Exam Tips:

a) ‘ప్రజల భాష’ = మాండలికం/యాస అని నిర్వచించి, పాత్రోచిత భాష వాడకాన్ని ఉదాహరించండి.

 

Question 4: రంగాచార్య తన రచనలకు “తెలంగాణ ప్రజల జీవితాన్ని” నేపథ్యంగా ఎందుకు తీసుకున్నాడు ?

Answer:

దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
ఆయనను ఆ ఉద్యమం ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆయన ఉద్యమ జీవి.
ముఖ్యంగా కమ్యూనిష్టు ఉద్యమం, ఆయనకు జీవితాన్ని నేర్పి’ మనిషిని చేసింది. ప్రభుత్వం తెలంగాణ సాయుధపోరాట చరిత్రను వక్రీకరించింది. దాన్ని చరిత్ర నుండి చెరిపేయడానికి ప్రయత్నించింది. రైతులూ, కూలీలూ, కార్మికులూ, స్త్రీలూ, పిల్లలూ చేసిన చారిత్రాత్మక పోరాటం భావితరాలకు తెలియకుండా పోతుందనే బాధతో, ఆవేదనతో రంగాచార్య తెలంగాణ ప్రజల జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని, తన రచనలను సాగించారు. తెలంగాణ ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు పోరాటాలు, శాశ్వతంగా భావితరాలకు స్ఫూర్తినియ్యాలని, రంగాచార్య తన రచనలను తెలంగాణ ప్రజల జీవితాలు నేపథ్యంగా రచించారు.

Exam Tips:

a) రంగాచార్య ఉద్యమంలో పాల్గొనడం, కమ్యూనిస్టు ప్రభావం, చరిత్ర వక్రీకరణ అనే కారణాలను వరుసగా రాయండి.

 

కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

Question 5: డా॥ దాశరథి రంగాచార్య చేసిన సాహిత్యసేవను వివరించండి.

Answer:

మహాకవి దాశరథి రంగాచార్యగారు తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంగా చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు, మాయజలతారు వంటి అద్భుతమైన నవలలు రాశారు. చారిత్రాత్మకమైన తెలంగాణ పోరాట చరిత్రను తన రచనల ద్వారా భావితరాలకు వారు అందజేశారు.
ఇంతేకాక, నాలుగు వేదాలనూ, పది ఉపనిషత్తులనూ తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళవచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం, వంటి అంశాలు నేపథ్యంగా ఈయన విశిష్టమైన నవలలు రచించి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టారు. వీరి రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదింపబడ్డాయి.
ఈయన నవలలు చలన చిత్రాలుగా వచ్చాయి. ఈయన రచనాశైలి, పాఠకుడిని ఆకట్టుకొంటుంది. ఈయన రాసిన “చిల్లర దేవుళ్ళు” నవలకు, రాష్ట్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయనను ‘గద్య దాశరథి’ అనేవారు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో మహాపండితుడు. ఈయన జీవిత చరిత్రను ‘మోదుగుపూలు’ నవలలో చిత్రించారు. రంగాచార్య గొప్ప రచయిత.

Exam Tips:

a) పది వాక్యాల్లో నవలలు (చిల్లర దేవుళ్ళు, జనపదం, మోదుగుపూలు), అనువాదాలు (వేదాలు, ఉపనిషత్తులు), పురస్కారాలు అనే మూడు భాగాలుగా రాయండి.

 

కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

Question 6: మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు లేదా నాయకుడు వచ్చాడనుకోండి. వారిని ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయండి.

Answer:

మా పాఠశాలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వస్తే, నేను ఈ కింది ప్రశ్నలతో ఆయనను ఇంటర్వ్యూ చేస్తాను.
1. భారతరత్న మహాశయా ! మీకు క్రికెట్ ఆట కాకుండా, ఇంకా ఇష్టమైన ఇతర ఆటలేవో చెప్పండి.
2. మీరు ఎన్నో సంవత్సరంలో క్రికెట్ ఆడుగు పెట్టారు ?
3. క్రికెట్లో మీరు సాధించిన విజయాలు మీకు పూర్తి సంతృప్తినిచ్చాయా ?
4. క్రికెట్, పాఠశాలల్లో, కళాశాలల్లో బాగా వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టాలి ?
5. నేడు భారత క్రికెట్ రంగంలో, రాజకీయాలు ప్రవేశించాయి కదా ! దానిపై మీ అభిప్రాయం ఏమిటి ?
6. మీరు అభిమానించే క్రికెట్ క్రీడాకారుడు ఎవరు ?
7. మీకు క్రికెట్ నేర్పిన గురువు ఎవరు ?
8. భారత్లో క్రికెట్ అభివృద్ధికి మీరిచ్చే సూచనలు ఏమిటి ?
9. క్రికెట్ నేర్చుకొనే యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి ?
10. మొత్తంపై క్రీడాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

Exam Tips:

a) ప్రశ్నలు వ్యక్తిగత వివరాలతో మొదలై, సేవలు, ఆశయాలు, సందేశంతో ముగియాలి; కనీసం 8–10 ప్రశ్నలు రాయండి.

 

Question 7: (లేదా) డా॥ దాశరథి రంగాచార్య వ్యక్తిత్వాన్ని లేదా సాహిత్యసేవను ప్రశంసిస్తూ వార్తా పత్రికకు ఒక లేఖ రాయండి.

Answer:

నమస్తే తెలంగాణ పత్రిక ప్రధాన సంపాదకులకు లేఖ
నల్గొండ,
తేది : X X X X X.
ప్రధాన సంపాదకులు,
నమస్తే తెలంగాణ దినపత్రిక,
హైదరాబాదు.
ఆర్యా,
నమస్కారాలు. నేను నల్గొండ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మాకు దాశరథి రంగాచార్య గారితో ఇంటర్వ్యూ పాఠం ఉంది. శ్రీరంగాచార్య మహా మనీషి, వారిని గూర్చి ప్రతి తెలంగాణబిడ్డ తెలుసుకోవాలి. వారిని గూర్చి తెలిసిన విషయాలు రాస్తున్నా. మీ పత్రిక ద్వారా ప్రజలకు అందించకోరుచున్నాను.
“దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొన్న ఉద్యమ శీలి. వీరు తెలంగాణ ప్రజాజీవితం నేపథ్యంగా ఎన్నో నవలలు రాశారు. వీరి నవలల్లో ‘చిల్లర దేవుళ్ళు’ నవలకు రాష్ట్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘జనపదం’ అనే నవలలో మొత్తం సమాజాన్ని మైక్రోస్కోపిక్ గా చూపించారు. ఇది తెలంగాణకి సంబంధించిన నవల కాదు. ఇది భారతదేశానికి చెందిన నవల. ‘మోదుగుపూలు’ నవలలో వీరి జీవిత చరిత్రను రాశారు.
దాశరథి రంగాచార్య గారిపై కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉంది. ఆ ఉద్యమం వీరికి జీవితాన్ని నేర్పింది. వీరిని మనిషిని చేసింది. ప్రభుత్వం, తెలంగాణ సాయుధపోరాటాన్ని వక్రీకరించింది. చరిత్ర నుండి చెరిపివేయడానికి ప్రయత్నించింది. ఎందరో రైతులు, కూలీలు, స్త్రీలు, కార్మికులు, పిల్లలు చేసిన ఆ చారిత్రక పోరాటం వివరాలు, భావితరాలకు అందజేయాలని వీరు తెలంగాణ ప్రజల నేపథ్యంలో నవలలు రాశారు.
ఈయనకు తెలంగాణ అంటే గొప్ప ప్రేమ. ఈయన నేపథ్యంలో మహాపండితుడు. నాలుగు వేదాలను, పది ఉపనిషత్తులను, తెలుగులోకి అనువదించారు. భారత, భాగవత, రామాయణములను సరళ వచనంలో రాశారు.
రంగాచార్య చరిత్రను మీ పత్రికలో తప్పక అచ్చువేయండి. నమస్తే కృతజ్ఞతలతో,
ఇట్లు,
మీ విశ్వసనీయుడు,
పి. రామకృష్ణ,
9వ తరగతి,
ప్రభుత్వ పాఠశాల,
నల్గొండ.
చిరునామా :
ప్రధాన సంపాదకుడు,
నమస్తే తెలంగాణ,
దినపత్రిక, హైదరాబాదు.

Exam Tips:

a) లేఖలో చిరునామా, తేది, సంబోధన, విషయం, ‘ఇట్లు’ తో ముగింపు తప్పనిసరి; రంగాచార్య సేవలను పాయింట్లుగా ప్రశంసించండి.

 

III. భాషాంశాలు

పదజాలం

Question 1: కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.

Answer:

ఉదా : విలువలతో కూడిన విద్య మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది.
జవాబు:
వికాసం = వికసించడం, విప్పారడం
అ) రామప్పగుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా ?
జవాబు:
సొగసు = అందము, సౌందర్యము
ఆ) వట్టికోట ఆళ్వారుస్వామి రచనల్లో ప్రజల మనిషి ఉత్కృష్టమైన రచన.
జవాబు:
ఉత్కృష్టం = శ్రేష్ఠము, గొప్పది
ఇ) భాగవతంలో కృష్ణలీలలు సమగ్రంగా రాశారు.
జవాబు:
సమగ్రం = సంపూర్ణంగా, సమస్తమూ
ఈ) నానాటికి మానవ సంబంధాలు క్షీణించి పోతున్నాయి.
జవాబు:
క్షీణించు = తరుగు, నశించు

Exam Tips:

a) గీత గీసిన పదానికి ఆ వాక్యంలోని అర్థాన్ని మాత్రమే రాయండి (వికాసం = వికసించడం).

 

Question 2: కింది వాక్యాల్లో గల ప్రకృతి – వికృతులను గుర్తించి రాయండి.

Answer:

అ) కథలంటే నాకిష్టమని మా నాయినమ్మ నాకు రోజూ కతలు చెప్పింది.
జవాబు:
కథ (ప్రకృతి) – కత (వికృతి)
ఆ) స్వచ్ఛభారతం కోసం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిన చేయడమే కాదు పనిచేసి చూపుదాం.
జవాబు:
ప్రతిజ్ఞ (ప్రకృతి) – ప్రతిన (వికృతి)
ఇ) ప్రజలకోసం కవిత్వం రాశాడు. ఆ కైత ప్రజలను చైతన్యపరిచింది.
జవాబు:
కవిత్వం (ప్రకృతి) – కైత (వికృతి)
ఈ) ఆశ ఉండవచ్చు. మితమీరిన ఆస ఉండరాదు.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

Exam Tips:

a) ప్రకృతి = సంస్కృత మూల రూపం, వికృతి = తెలుగులో మారిన రూపం; వాక్యంలో ఉన్న రూపాన్నే రాయండి (కైత, ఆస, కత, ప్రతిన).

 

వ్యాకరణాంశాలు

Question 1: కింది పదాలను విడదీయండి. సంధిపేరు రాయండి.

Answer:

సంధి పదం – విడదీసిన రూపం – సంధిపేరు
ఉదా:
పోయినాడంటే – పోయినాడు + అంటే -ఉత్వసంధి
అ) ఏమని – ఏమి + అని – ఇత్వసంధి
ఆ) కాదనుకున్నాడు – కాదు + అనుకున్నాడు – ఉత్వసంధి
ఇ) పిల్లలందరూ – పిల్లలు + అందరూ – ఉత్వసంధి

Exam Tips:

a) సంధిని విడదీసి సంధి పేరు రాయండి: ఉత్వసంధి (ఉత్తునకు అచ్చు పరమైతే), ఇత్వసంధి (ఇత్తునకు అచ్చు పరమైతే).

 

Question 2: కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి. సమాసం పేరు రాయండి.

Answer:

ఉదా : మూడు సంఖ్యగల రోజులు = మూడురోజులు – ద్విగు సమాసం
అ) రెండు సంఖ్యగల రోజులు = రెండురోజులు – ద్విగు సమాసం
ఆ) వజ్రమూ, వైడూర్యము = వజ్రవైడూర్యములు – ద్వంద్వ సమాసం
ఇ) తల్లియూ, బిడ్డయూ = తల్లీబిడ్డలు – ద్వంద్వ సమాసం

Exam Tips:

a) ద్విగు: మొదటి పదం సంఖ్య; ద్వంద్వ: రెండు పదాలకూ సమాన ప్రాధాన్యం (‘యు’ ‘ఉ’ తో విగ్రహవాక్యం).

 

కర్తరి, కర్మణి వాక్యాలు
కింది వాక్యాలు పరిశీలించండి.
1. ఆళ్వారుస్వామి “చిన్నప్పుడే” అనే కథ రాశాడు. (కర్తరి)
2. ‘చిన్నప్పుడే అనే కథ ఆళ్వారుస్వామిచే రచింపబడింది. (కర్మణి)
పై రెండింటిలో మొదటివాక్యం కర్తరి వాక్యం. భావం సూటిగా ఉంది కదా ! అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే ‘రాశాడు’ అనే క్రియ, ‘ఆళ్వారుస్వామి’ అనే కర్తను సూచిస్తోంది. ఇటువంటి వాక్యాలను ‘కర్తరి వాక్యాలు’ అంటారు. రెండవ వాక్యం ‘కర్మణి వాక్యం’. ఇది కర్మ ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే ‘రాయబడింది’ అనే క్రియ, ‘చిన్నప్పుడే అనే కథ’ అనే కర్మను సూచిస్తోంది.
ఈ వాక్యంలో రెండు మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1. ‘బడు’ అనే ధాతువు చేరడం
2. ‘చే’ అనే విభక్తి చేరడం.
కర్తరి వాక్యం : కర్త ప్రధానంగా రూపొందుతుంది.
కర్మణి వాక్యం : కర్మ ప్రధానంగా రూపొందుతుంది. క్రియ మీద ‘బడు’ ధాతువు, కర్తమీద ‘చే / చేత’ విభక్తి చేరుతుంది.

 

Question 3: కింది వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి.

Answer:

అ) లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
లింగయ్య చేత మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది. (కర్మణి వాక్యం)
ఆ) బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు. (కర్తరి వాక్యం)
జవాబు:
బాలుచే ఇసుకతో ఇల్లు కట్టబడింది. (కర్మణి వాక్యం)
ఇ) అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. (కర్తరి వాక్యం)
జవాబు:
అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది. (కర్మణి వాక్యం)

Exam Tips:

a) కర్మణిలో కర్తకు ‘చేత/చే’ చేరుతుంది, క్రియకు ‘బడు’ చేరుతుంది (ఇవ్వబడింది, కట్టబడింది).

 

Question 4: కింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా రాయండి.

Answer:

అ) గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:
గ్రామీణులు నాయకులను ఎదుర్కొని పోయారు. (కర్తరి వాక్యం)
ఆ) కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:
అతడు కాయలన్నీ ముందర పోశాడు. (కర్తరి వాక్యం)
ఇ) బాలురచే సెలవు తీసుకోబడింది. (కర్మణి వాక్యం)
జవాబు:
బాలురు సెలవు తీసుకున్నారు. (కర్తరి వాక్యం)

Exam Tips:

a) కర్తరి వాక్యంలో ‘చే/చేత’ తొలగించి, క్రియను సాధారణ రూపంలో రాయండి.

 

Question 5: మీరు తత్పురుష సమాసం గురించి తెలుసుకున్నారు కదా ! కింది విగ్రహవాక్యాల్లో గీత గీసిన విభక్తి ప్రత్యాయాల ఆధారంగా ఆయా తత్పురుష సమాసాల పేర్లు రాయండి.

Answer:

అ) విద్యను అర్థించువారు
(ద్వితీయా తత్పురుష సమాసం)
ఆ) గుణాలచేత హీనుడు
జవాబు:
(తృతీయా తత్పురుష సమాసం)
ఇ) సభ కొరకు భవనం
జవాబు:
(చతుర్థీ తత్పురుష సమాసం)
ఈ) దొంగల వల్ల భయం
జవాబు:
(పంచమీ తత్పురుష సమాసం)
ఉ) రాముని యొక్క బాణం
జవాబు:
(షష్ఠీ తత్పురుష సమాసం)
ఊ) గురువు నందు భక్తి
జవాబు:
(సప్తమీ తత్పురుష సమాసం)

Exam Tips:

a) విభక్తి ప్రత్యయాల ఆధారంగా పేరు చెప్పండి: ను – ద్వితీయ, చేత – తృతీయ, కొరకు – చతుర్థి, వల్ల – పంచమి, యొక్క – షష్ఠి, అందు/నందు – సప్తమి.

 

ప్రాజెక్టు పని

Question 1: మీ గ్రామంలోని వేరు వేరు రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రశ్నావళి రూపొందించుకుని ముఖాముఖి నిర్వహించండి. నివేదిక రాయండి.

Answer:

విద్యారంగం:
మీరు ఎంత కాలంనుండి విద్యాబోధన చేస్తున్నారు ?
విద్యా ప్రణాళికలో నైతిక విలువల ప్రాధాన్యత ఎంతవరకు ఉంది ?
ప్రాథమిక స్థాయిలో యోగా విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలా ?
ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షల సంస్కరణలు ఎలా ఉండాలి ?
పనిబాట పట్టిన పిల్లలను బడిబాట పట్టడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి ?
లోపాలను ఎలా సరిదిద్దాలి ?
వ్యాపార రంగం:
వ్యాపారంలో నైతికత అవసరం ఎంతవరకు ఉంది ?
పెట్టుబడులకు బ్యాంకుల సహకారం ఎంతవరకు ఉండాలి?
వినియోగదారుల మన్ననను వ్యాపారులు ఎట్లా పొందాలి ?
వ్యాపారుల మధ్య పోటీ ఎలా ఉండాలి ?
వ్యాపారస్థులు సమాజం పట్ల బాధ్యతను ఎలా గుర్తించాలి ?
వైద్యరంగం:
గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ?
గ్రామస్థులకు వైద్యులు ఎలాంటి ఆరోగ్య సూత్రాలను అందించాలి ?
వర్షాకాలంలోనూ, ఎండాకాలంలోనూ, ప్రజలకు ఎలాంటి సూచనలను వైద్యులు అందించాలి ?
అంటురోగాలు ప్రబలకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
వ్యవసాయరంగం:
పంటలో సేంద్రియ ఎరువుల ఆవశ్యకత ఎంతవరకు ఉంది ?
రైతులకు గిట్టుబాటు ధరలు కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ?
ప్రస్తుత తరుణంలో సమష్టి వ్యవసాయం అవసరం ఉందా ? లేదా ?
రైతుల ఆత్మహత్యలను ఎలా నివారించాలి ?
ఆధునిక వ్యవసాయంలో ఎలాంటి మెలకువలు పాటించాలి ?

Exam Tips:

a) ఇంటర్వ్యూ ప్రశ్నావళి రంగాల వారీగా (విద్య, వ్యాపారం, వైద్యం, వ్యవసాయం) ఐదారు ప్రశ్నలతో రాయండి; నివేదికలో వారి సమాధానాల సారాంశం కూడా ఉండాలి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 9 Telugu Lesson 04 Rangacharyato Mukhamukhi (Interview with Dasarathi Rangacharya)

Textbook Solutions for Class 9 Telugu Lesson 04 Rangacharyato Mukhamukhi (Interview with Dasarathi Rangacharya)

Review comprehensive exercise answers for Class 9 Telugu Lesson 04 Rangacharyato Mukhamukhi (Interview with Dasarathi Rangacharya). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Telugu.

FAQs

Where can I find the latest TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి for the 2026-27 session?

The complete and updated TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి will help students to get full marks in the theory paper.

Do you offer TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire TS 9th Class Telugu Guide 4th Lesson రంగాచార్యతో ముఖాముఖి in printable PDF format for offline study on any device.