Step-by-Step Textbook Solutions for Class 9 Telugu Lesson 02 Nenerigina Burgula (The Burgula I Knew)
Access comprehensive textbook solutions for Lesson 02 Nenerigina Burgula (The Burgula I Knew) using the official curriculum guides for Class 9 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Download Lesson 02 Nenerigina Burgula (The Burgula I Knew) Textbook Solutions PDF
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
చదువండి – ఆలోచించి చెప్పండి (Textbook Page No. 14)
సహనమ్ము, సత్యమ్ము, శాంతగంభీరమ్ము,
ఆత్మవిశ్వాసమ్ము, నహరహమ్ము
సాధన, దక్షత, సాధుభాషణమును,
సద్వివేచనమును, సద్గమనము,
దానమ్ము, ధైర్యమ్ము, త్యాగమ్ము, సునిశిత
బుద్ధి, మేల్గాంచుట, పుణ్యగుణము,
కరుణ, క్షమ, పరోపకారబుద్ధియనెడి
యాలోచనారీతు లమరియుండు
‘మనుజులెప్పుడును మాన్యులు, మంగళస్వ
రూపులు, మహోన్నతులు, విరాడ్రూపశోభి
తులు, సుకీర్తికాంతవరపతులు, సుమతులు,
జగతిగతి విరచితులు, సజ్జనులువారు.’
Question 1: ఈ పద్యం దేన్ని గురించి చెబుతున్నది ?
Answer:
ఈ పద్యం మాన్యులూ, మంగళ స్వరూపులూ, మహోన్నతులూ, కీర్తిమంతులూ అయిన సజ్జనులను గురించి చెబుతున్నది.
Exam Tips:
a) పద్యం ఎవరి గురించి చెబుతున్నదో (సజ్జనులు) మొదటి వాక్యంలోనే స్పష్టంగా రాయండి.
Question 2: ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి ?
Answer:
ఈ పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలు ఇవి.
1. సహనం,
2. సత్యం,
3. శాంతగంభీరం,
4. ఆత్మవిశ్వాసం,
5. రాత్రింబగళ్ళు సాధన,
6. దక్షత,
7. సాధుభాషణం,
8. సద్వివేచనం,
9. సద్గమనం,
10. దాన ధైర్యాలు,
11. త్యాగం,
12. సునిశిత బుద్ధి,
13. పుణ్యగుణం,
14. కరుణ,
15. క్షమ,
16. పరోపకారబుద్ధి.
Exam Tips:
a) పద్యంలోని లక్షణాలను క్రమసంఖ్యలతో ఒక్కొక్కటిగా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి; పద్యంలో లేని లక్షణాలు చేర్చవద్దు.
Question 3: మంచి లక్షణాలు కలిగిన వారినేమంటారు ?
Answer:
మంచి లక్షణాలు కలిగిన వారిని
1. మాన్యులు,
2. మంగళ స్వరూపులు,
3. మహోన్నతులు,
4. విరాడ్రూపశోభితులు,
5. సుమతులు,
6. సజ్జనులు అని అంటారు.
Exam Tips:
a) పద్యంలో చెప్పిన పదాలనే (మాన్యులు, మంగళస్వరూపులు, మహోన్నతులు, సజ్జనులు మొదలైనవి) ఉపయోగించండి.
Question 4: అలాంటివారి గురించి ఎందుకు తెలుసుకోవాలి ? వారితో ఎందుకు సాంగత్యం చేయాలి ?
Answer:
అలాంటి వారిని గూర్చి చదివితే, మంచి స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి మహాత్ముల గుణాలను ఆదర్శంగా తీసుకొని తాము కూడా ఆ విధంగా సన్మార్గంలో నడవడానికి వీలుపడుతుంది. అటువంటి వారితో సాంగత్యం చేయడం వల్ల, వారి మహోన్నత వ్యక్తిత్వం గూర్చి చక్కగా తెలిసికోడానికి వీలవుతుంది.
అటువంటి వారిని గూర్చి తెలిసికొని, వారు నడచిన అడుగుజాడలలో తాము కూడా నడవడానికి వీలవుతుంది.
Exam Tips:
a) ‘స్ఫూర్తి’, ‘ఆదర్శం’, ‘అడుగుజాడలు’ అనే మాటలతో రెండు కారణాలు రాయండి.
b) ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయి (ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు సాంగత్యం); రెండింటికీ జవాబు ఇవ్వండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 17)
Question 1: అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి ? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా ? ఎప్పుడు?
Answer:
అంతరాత్మ అంటే హృదయం. అంటే మనలో ఉన్న మనస్సు. మనం నోటితో పైకి ఏమి చెపుతున్నా, లోపల మనస్సు మరోరకంగా చెపుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి అందరికీ జరుగుతుంది.
ఒకసారి నేను మధ్యాహ్నం బడి మానివేసి సినీమాకు వెళ్ళాను. ఇంటికి వచ్చాక నాన్నగారు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు. ఆటలు ఆడి వచ్చానని అబద్ధం చెప్పాను కాని నేను అబద్ధం చెపుతున్నాననీ, అది తప్పనీ, నా అంతరాత్మ నాకు బోధించింది.
Exam Tips:
a) అంతరాత్మ అంటే ఏమిటో నిర్వచనంతో మొదలుపెట్టి, తర్వాత మీ సొంత అనుభవాన్ని చిన్న సంఘటనగా రాయండి.
Question 2: ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట, ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
Answer:
ప్రతి వ్యక్తి తాను ఇతరుల కంటే గొప్పవాడినని, పదిమంది చేత అనిపించుకోవాలని గట్టిగా అనుకుంటాడు. అందుకోసం లేని గొప్పలు చెప్పుకోడానికి కూడా అతడు సిద్ధపడతాడని గ్రహించాను.
Exam Tips:
a) వాక్యభావాన్ని మీ మాటల్లో చెప్పి, ఒక ఉదాహరణ (బడిలో మార్కులు, ఆటలు) ఇవ్వండి.
Question 3: సత్యదూరమైన విషయం అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
Answer:
సత్యదూరమైన విషయం అంటే, నిజం కాని విషయం. అంటే పూర్తిగా అబద్ధము అన్నమాట. ఇతరులు లేని మాటలను ఉన్నట్లు చెపుతున్నపుడు, వారు చెప్పినది. అబద్ధం అని చెప్పడానికి ‘సత్యదూరం’ అనే మాటను వాడతారు.
Exam Tips:
a) ‘సత్యదూరం’ అంటే ‘నిజానికి దూరమైనది’ అని పదార్థం చెప్పి, ఒక సందర్భం ఉదహరించండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 19)
Question 1: ఎవరైనా గుర్తింపు పొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్సుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?
Answer:
“ఒక వ్యక్తి గుర్తించబడటానికి అతని శరీరం యొక్క ఆకారం కారణం కాదు” అని రచయిత చెప్పిన మాట సత్యం.
మన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయిన “లాల్ బహదూర్ శాస్త్రిగారు” పొట్టివాడు. ఆయన ఎంతోకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. రైల్వేమంత్రిగా ఆయన ఉన్నప్పుడు పెద్ద రైల్వే ప్రమాదం జరిగింది. వెంటనే ఆయన రిజైన్ చేశారు.
ఆయన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం ఇచ్చి, రైతులనూ, సైనికులనూ ఉత్తేజపరచాడు. ఆయన మరణించే నాటికి ఆయనకు స్వంత ఇల్లు లేదు. అంతటి నిజాయితీ గల శాస్త్రిగారు పొట్టివాడైనా, ఆయన గట్టివాడనిపించుకున్నాడు కదా!
Exam Tips:
a) శాస్త్రిగారి వంటి ఒక స్పష్టమైన ఉదాహరణతో ‘శరీరాకృతి కాదు, గుణాలే గుర్తింపునిస్తాయి’ అని సమర్థించండి.
Question 2: అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి ? ఇది ఎవరికి అవసరం ? ఎందుకు ?
Answer:
‘వాదనాపటిమ’ అంటే వాదించడంలో గల సమర్థత అని అర్థం. ‘అనన్యము’ అంటే అటువంటి వాదనాశక్తి, మరొక్కరికి ఎవ్వరికీ లేదని అర్థం. ‘అనన్యమైన వాదనాపటిమ’ అంటే, తాను చెప్పినదే సరయినదని, ఎదుటి వారివద్ద గట్టిగా వాదించి చెప్పగల సామర్థ్యం.
ఇటువంటి వాదనాపటిమ ముఖ్యంగా న్యాయ వాదులకు ఉండాలి. న్యాయవాదులు చేపట్టిన కేసులను నెగ్గించుకోవాలంటే, వాదనాపటిమ వారికి ముఖ్యం.
Exam Tips:
a) పదాన్ని విడదీసి (అనన్యము + వాదనాపటిమ) అర్థం చెప్పడం మంచి పద్ధతి; ఎవరికి అవసరమో, ఎందుకో రెండూ రాయండి.
Question 3: “కొరుకుడు పడకపోవడం” అంటే ఏమిటి ? దీన్ని ఏ ఏ సందర్భాలలో వాడతారు ?
Answer:
వస్తువు గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలులేక పోవడాన్ని “కొరుకుడు పడకపోవడం” అంటారు. ఈ పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు.
1. వస్తువు బాగా గట్టిగా ఉండి, పళ్ళతో కొరికి తినడానికి వీలుకానప్పుడు వాడతారు.
2. తెలిసికోవలసిన విషయం మన బుద్ధికి అందనప్పుడు, అది ఎంత చెప్పినా అర్థం కానప్పుడు, ఎంత పరిశీలించినా ఆ విషయం స్పష్టం కానప్పుడు, విషయం “కొరుకుడు పడడం లేదు” అని అంటారు.
Exam Tips:
a) రెండు అర్థాలు (గట్టిగా ఉండడం, అర్థంకాకపోవడం) తప్పనిసరిగా రాయండి.
ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 20)
Question 1: గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్థం ఎందుకు చేయాలి ?
Answer:
గొప్పవారి జీవిత చరిత్రలో ఎన్నో ఆదర్శ సంఘటనలు ఉంటాయి. అవి ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. వాటిని అందరూ తెలిసికోవాలి.
గొప్పవారు తమ జీవితానుభవాలను వారు పుస్తక రూపంగా రాసిపెడితే, ఆ పుస్తకాలు చదివి, ఇతరులు తమ జీవితాల్ని గొప్పవారు నడిచిన మంచి దారిలో నడుపుకోవచ్చును. కనుక గొప్పవారు తమ జీవితాను భవాల్ని పుస్తకంగా రాయాలి.
Exam Tips:
a) ‘మార్గదర్శకం’, ‘ఆదర్శ సంఘటనలు’ అనే మాటలతో కారణాన్ని రాయండి.
Question 2: మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా ? లేక ఇతరపనులకా ?
Answer:
నేను ఎక్కువగా నా సమయాన్ని చదువుకోసం, ఆటపాటల కోసం వినియోగిస్తాను. నేను ఇతర పనులకు నా సమయాన్ని వినియోగించను.
Exam Tips:
a) ఇది మీ సొంత అభిప్రాయం అడిగే ప్రశ్న; నిజాయితీగా రాస్తూ ‘చదువు, ఆటలు, ఇతర పనులు’ అని విభజించండి.
Question 3: రామకృష్ణారావుగారిని పి.వి. గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్పపేరు సంపాదించు కోవాలంటే ఎలా ఉండాలి ? ఏమేం చేయాలి ?
Answer:
నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావు గారివలె పేరు సంపాదించుకోవాలంటే ఈ క్రింది విధంగా పనులు చేయాలి.
1. ప్రజల అభీష్టానికి పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చి మతాతీతంగా విశిష్ట వ్యక్తిత్వం కలిగి ఉండాలి.
2. ప్రజలకు కష్టసుఖాలలో తాము పాలుపంచుకోవాలి.
3. శాసనసభ చర్చలలో చక్కగా పాల్గొని, దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి చక్కని సూచనలు ఇవ్వాలి.
4. సాహిత్యం బాగా చదివి మంచి పాండిత్యం సంపాదించాలి. మంచి వక్తగా పేరు పొందాలి.
5. అవినీతికి దూరంగా ఉండాలి.
6. ప్రజలకు సన్నిహితంగా, సోదర శాసనసభ్యులతో స్నేహంగా, ప్రజల తలలో నాలుకవలె మెలగాలి.
Exam Tips:
a) పాయింట్ల రూపంలో (1, 2, 3 …) లక్షణాలు రాయండి; బూర్గులవారి గుణాలతో (మతాతీతం, నిజాయితీ, సాహిత్యం) ముడిపెట్టండి.
I. అవగాహన – ప్రతిస్పందన
Question 1: కింది అంశం గురించి మాట్లాడండి.
ఇతరుల కంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి.
Answer:
ఇతరుల కంటే తాను గొప్పవాడని అనిపించుకోవాలనే కోరిక, ఉత్సాహము సహజంగా అందరిలోనూ ఉంటుంది. బడిలో పిల్లలకు కూడా పక్కవాడి కంటే తాను ఎక్కువ మార్కులు తెచ్చుకొని, తాను గురువుల వద్ద మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అలాగే ఆటలలో తానే బాగా ఆడి, పేరు తెచ్చుకోవాలని, అందరూ తన ప్రతిభను మెచ్చుకోవాలని పిల్లలు అనుకుంటారు.
కవులూ, పండితులూ, ఇతర కవి పండితుల కంటే తాము గొప్పవారమని అందరూ గుర్తించాలని వారు తమను గూర్చి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సంఘంలో మనుషులు తాము పక్కవారి కంటే డబ్బు కలవారమని, గొప్పవారమని అనిపించుకోవాలని ఉబలాటపడుతూ ఉంటారు.
Exam Tips:
a) మొదట అంశాన్ని మీ మాటల్లో చెప్పి, తర్వాత పిల్లలు, కవులు, సమాజం వంటి ఉదాహరణలు ఇవ్వండి; ఇది మౌఖిక ప్రశ్న, 6–8 వాక్యాలు చాలు.
Question 2: కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయి ? వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి.
Answer:
| వ్యక్తిత్వం | పేరా సంఖ్య | సంబంధించిన అంశాలు |
| 1) మహోన్నత వ్యక్తిత్వం | 5వ పేరా | బూర్గులవారి ప్రతిభతో కూడిన మూర్తిమత్వం, అవసరం అయినపుడు మహోన్నత రూపంలో కనబడేది. అవసరం తీరాక స్వరూపంలో ఇమిడిపోయేది. వారి మహోన్నత వ్యక్తిత్వం, అగాధపు లోతులలోనే కనబడేది. |
| 2) విశిష్ట వ్యక్తిత్వం | 7వ పేరా | బూర్గులవారు, ప్రాతఃస్మరణీయులు. బూర్గుల వారు పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని పూరించారు. పి.వి. తమ శక్తి సామర్థ్యాలను తాను గుర్తించగలిగేటట్లు, బూర్గుల విశిష్ట వ్యక్తిత్వాన్ని చూపించారు. |
| 3) విశాల వ్యక్తిత్వం | 10వ పేరా | బూర్గులవారు మూడు విభిన్న తరాల వారికి వారిధి. బూర్గులవారు నైజాంకు వ్యతిరేకి అయినా, ఎందరో ముస్లింలకు మిత్రులు. బూర్గుల విశాల వ్యక్తిత్వంతో ప్రజాజీవితాన్ని తీర్చిదిద్దారు. |
Exam Tips:
a) పట్టికలో మూడు నిలువు వరుసలు (వ్యక్తిత్వం, పేరా సంఖ్య, అంశాలు) ఉండాలి; పేరా సంఖ్యలు తప్పకుండా రాయండి.
Question 3: పాఠం మొత్తాన్ని చదువండి. పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయండి.
Answer:
పాఠంలో జాతీయాలు:
1. శ్రీరామరక్ష
2. గీటురాయి
3. స్వస్తివాచకం
4. కారాలు మిరియాలు నూరడం
5. రూపుమాపడం
6. ముప్పిరిగొను
7. ఉక్కిరిబిక్కిరైపోవు
8. వీసం ఎత్తు
9. ఒడ్డూ పొడుగూ
10. నిత్య నైమిత్తికం
11. కంచుగోడలు
12. కొరుకుడుపడని
13. జోహారులర్పించు
14. ప్రాతఃస్మరణీయులు
15. మార్గదర్శకులు
16. స్వస్తివాచకం
17. ఆరునూరుగు
18. చీల్చిచెండాడు
19. అతిశయోక్తి
20. ఒడుదుడుకులు.
Exam Tips:
a) జాతీయాలను పాఠంలో గీత గీసి గుర్తించి రాయండి; ప్రతి జాతీయానికి అర్థం, సొంత వాక్యం సిద్ధం చేసుకోండి.
కింది గద్యాన్ని చదువండి.
క్లిష్టపరిస్థితుల్లో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థురాలుగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్టడం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక వీరనారిగా చరిత్రలో నిలిచింది.
స్త్రీ అయినప్పటికి పురుషవేషం, పురుషనామం ధరించి సమకాలీన రాజులందరికంటే మిన్నగా రాజ్యాన్ని పరిపాలించి సాహసవంతమైన జీవితాన్ని గడిపింది. గ్రామాలను దానంచేసి ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు చేసింది. ఒక విద్యాపీఠం స్థాపించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బోధింపజేసేది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గ్రామాల్లో కరణాలను నియమించి వారికి వస్తువాహనాలను, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్యసేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం గురించి ప్రశంసిస్తూ తన డైరీలో రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
Question 4: రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి ?
Answer:
రుద్రమాంబ స్త్రీ మూర్తి అయినా, ఆమె రాజ్యాధికారం చేపట్టి, చక్కగా పరిపాలించగలదని, రుద్రమాంబపై ఆమె తండ్రి నమ్మకం పెట్టుకున్నాడు.
Exam Tips:
a) గద్యంలోని ‘తండ్రి నమ్మకం’ గురించి ఒకే వాక్యంలో స్పష్టంగా రాయండి.
Question 5: రుద్రమాంబ చేసిన సత్కార్యాలేవి ?
Answer:
రుద్రమాంబ గ్రామాలను దానంచేసి, ఆ ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు ఏర్పాటు చేసింది. విద్యాపీఠం నెలకొల్పి, వేదాలను, సాహిత్యాన్ని, ఆగమాలను బోధింపజేసింది. కరణాలనూ, ఉపాధ్యాయులనూ నియమించింది.
Exam Tips:
a) గద్యంలో చెప్పిన పనులను (పాఠశాలలు, వసతిగృహాలు, ఆరోగ్యశాలలు, విద్యాపీఠం) వరుసగా రాయండి.
Question 6: మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు ?
Answer:
మార్కోపోలో రుద్రమదేవి యొక్క
1. పరిపాలనా దక్షత
2. సాహిత్యసేవ
3. శిల్పకళలు
4. మహదైశ్వర్యం అనే విషయాలను గురించి పొగిడాడు.
Exam Tips:
a) మార్కోపోలో ప్రశంసించిన నాలుగు అంశాలనూ (దక్షత, సాహిత్యసేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం) తప్పక రాయండి.
Question 7: రుద్రమదేవి సమర్థత ఏమిటి ?
Answer:
రుద్రమదేవి క్లిష్టపరిస్థితిలో రాజ్యాధికారం చేపట్టి, నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థత కలిగి ఉండేది.
Exam Tips:
a) గద్యంలోని పదాలనే వాడి, ‘యుద్ధాల్లో ఉన్నా పరిపాలనలో సమర్థత’ అని చెప్పండి.
Question 8: ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
Answer:
రుద్రమదేవి పాలనాదక్షత
Exam Tips:
a) ఒక్క వాక్యంలో సమాధానం ఇవ్వాలి; ‘పరిపాలనాదక్షత’ వంటి ముఖ్యమైన పదాన్ని వాడండి.
II. వ్యక్తీకరణ-సృజనాత్మకత
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
Question 1: బూర్గుల – పి.వి. గార్ల సంబంధం గురుశిష్య సంబంధం లాంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి.
Answer:
పి.వి. నరసింహారావుగారు, బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర, అందరికంటే జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందేవారు. తల్లి, చిన్న పిల్లవానిపై మమకారం ఎక్కువగా చూపించే విధంగానే, బూర్గుల వారు, పి.వి. గారిపై విశేష మమకారం చూపించేవారు. పి.వి. గారు చొరవగా బూర్గుల వారి ఆఫీసుకు వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కుకేసులను చదివేవారు. అది చూసిన బూర్గులవారి సీనియర్ గుమస్తా, పి.వి. గారిపై కోపపడేవాడు.
అది చూసిన బూర్గులవారు, పి.వి. గార్కి కేసులు చదవడానికి అనుమతి ఇచ్చారు. అంతేగాక, పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పి.వి. గారు తన శక్తిసామర్థ్యాలను గుర్తించి, ఆత్మవిశ్వాసాన్ని పొందారు.
ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన, బూర్గుల వారు, గురువులుగానూ, పి.వి. గారు శిష్యులుగానూ పేరు పడ్డారు. వారిద్దరి మధ్య గల సంబంధం గురుశిష్య సంబంధం వంటిది.
Exam Tips:
a) గురుశిష్య సంబంధాన్ని సమర్థించేటప్పుడు ఒక సంఘటన (ఫైళ్ళు చదవడం, చర్చించడం) ప్రస్తావించండి; ఐదు వాక్యాల పరిమితిని పాటించండి.
Question 2: ‘సరే – అవన్నీ ఆటల్లో ఉండేవేగా’ అని బూర్గులవారు అనేవారు కదా! ఏ సందర్భంలో ఎందుకనేవారో దానికిగల కారణాలను రాయండి.
Answer:
బూర్గుల రామకృష్ణారావుగారి సామాజిక యాత్ర, ఎప్పుడూ సాఫీగా సాగలేదు. ఆయన అనేక రకాల ఒడుదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక సందర్భాల్లో ఆపదలు ఆయనను చుట్టుముట్టాయి. అయినా ఆయన చలించేవారు కాడు. మనః స్థైర్యాన్నీ, సమచిత్తతనూ విడిచిపెట్టేవారు కాడు.
ఆయన విజయానికి పొంగిపోలేదు. కష్టం వస్తే క్రుంగిపోలేదు. ఎవరైనా స్నేహితులు ఆయనకు ద్రోహం తలపెట్టినా, ఆయనకు వ్యతిరేకులు ఆయనను దూషించినా “సరే, అవన్నీ ఆటలో ఉండేవేగా” అని సరిపెట్టుకునేవారు.
Exam Tips:
a) ‘సరే – అవన్నీ ఆటల్లో ఉండేవేగా’ అనే మాటకు బూర్గులవారి సమచిత్తత కారణమని స్పష్టంగా చెప్పండి.
Question 3: బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులని పి.వి. నరసింహారావుగారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి.
Answer:
‘బూర్గుల రామకృష్ణారావుగారు ప్రాతఃస్మరణీయులు’ అని పి.వి. నరసింహారావుగారు రాశారు. ప్రాతఃస్మరణీయులంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపుడు అని అర్థము.
పి.వి. గారు బూర్గులవారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పి.వి. గారు, బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, జూనియర్లకు లొంగని చిక్కు కేసుల ఫైళ్ళను తీసి, చదువుతూ ఉండేవారు. పి.వి. చూపించే చొరవ, అక్కడ ఉన్న బూర్గుల వారి సీనియర్ గుమాస్తాకు కోపం తెప్పించింది.
ఒకసారి బూర్గులవారు దానిని గమనించి, పి.వి. గారు తన ఫైళ్ళు చూడడానికి అంగీకరించారు. అంతేగాక పి.వి. గారితో కేసుల గురించి స్వయంగా చర్చించేవారు. పి.వి. గారిలో శక్తి సామర్థ్యాలున్నాయని ఈ విధంగా పి.వి. గారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. ఆ ఆత్మవిశ్వాసం, పి.వి. గారికి శ్రీరామరక్ష అయ్యింది. అందుకే పి.వి. గారు, బూర్గుల వారిని ప్రాతఃస్మరణీయులు అని రాశారు.
Exam Tips:
a) ‘ప్రాతఃస్మరణీయులు’ అనే పదార్థం మొదట చెప్పి, తర్వాత పి.వి. గారికి వచ్చిన స్ఫూర్తిని ఉదాహరించండి.
కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
Question 4: బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
Answer:
బూర్గుల వ్యక్తిత్వం – మహోన్నత లక్షణాలు: బూర్గులవారు ఎప్పుడూ అన్ని విషయాలూ, ఆఖరుకు తమలోని లోపాలను సహితం ఉన్నవి ఉన్నట్లు చెప్పేవారు. ఆయన పొట్టిగా ఉండేవారు. కాని ఆయనలో బహుముఖమైన ప్రతిభ ఉండేది.
అవసరం అయినప్పుడు దానిని మహోన్నతరూపంలో వారు కనబరచేవారు.
అవసరం లేనప్పుడు అది ఆయనలో ఇమిడి పోయేది.
న్యాయవాదిగా, బూర్గులవారు విశేషప్రతిభతో, ఎదుటి న్యాయవాదుల వాదనలకు ఎదురొడ్డి నిలిచేవారు. ఆయనలో సునిశిత మేధాసంపత్తి ఉండేది. బూర్గులవారు తమ జూనియర్ న్యాయవాదులను బాగా ప్రోత్సహించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారు. బూర్గులవారు ప్రాతఃస్మరణీయులు.
బూర్గులవారు కౌలుదారీ చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులు అయ్యారు. బూర్గులవారు, రాజనీతి విశారదులు. బూర్గులవారు ఏ నిర్ణయం తీసుకున్నా, అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ, మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకొనేవారు. బూర్గులవారు మతాతీత స్థితిని పాటించేవారు. వీరిది విశిష్టమైన వ్యక్తిత్వం. బూర్గులవారు మంచి పార్లమెంటేరియన్. ఈయన బహుభాషావేత్త.
ఈయన మంచి ఉపకారశీలి. ఈయన సంతోషానికి పొంగలేదు. కష్టాలకు క్రుంగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, బూర్గులవారు “పూర్ణపురుషులు”, బహుముఖ ప్రజ్ఞగలవారు. ప్రధానంగా వీరు సాహితీ జగత్తుకు చెందినవారు.
Exam Tips:
a) పది వాక్యాల్లో రాయండి: మొదట ఒక లక్షణం, తర్వాత పాఠం నుండి ఉదాహరణ (న్యాయవాదిగా, కౌలుదారీ చట్టం, మతాతీత స్థితి).
Question 5: ఈ పాఠం ఆధారంగా “గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది” అనే అంశం గురించి, సమర్థిస్తూ రాయండి.
Answer:
‘గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి కూడా గొప్పగానే ఉంటుంది’ అన్నమాట నిజం.
బూర్గుల రామకృష్ణారావుగారు మహోన్నత వ్యక్తి. వారిది విశిష్ట వ్యక్తిత్వం. విశాల వ్యక్తిత్వం. ఈయన పూర్ణపురుషుడు. బూర్గులవారి సాంగత్యం, శ్రీ పి.వి.
నరసింహారావుగారికి మంచి స్ఫూర్తి నిచ్చింది. బూర్గులవారి వద్ద శ్రీ పి.వి. గారు జూనియర్ లాయర్‌గా పనిచేసేవారు.
బూర్గులవారు లాయర్ కేసు తీసుకొనేటప్పుడే, ఆ కేసు తాలూకు ఫైలుపై రేఖామాత్రంగా, నోటు వ్రాసి పెట్టుకొనేవారు, ఆ నోటు ఆధారంగానే వారు కోర్టులో ఎదుటి న్యాయవాదుల వాదనలను గట్టిగా అడ్డుకొనేవారు. బూర్గులవారి మేధాసంపత్తినీ, ఆ వాదనాపటిమనూ దగ్గరగా చూసిన పి.వి. గారికి మంచి స్ఫూర్తి కలిగింది.
పి.వి. గారు బూర్గులవారి వద్ద అందరికంటే జూనియర్ లాయరుగా ఉండేవారు. బూర్గులవారు, పి.వి. గారిని ఆదరంగా చూసేవారు. దానితో పి.వి. గారు చొరవగా బూర్గులవారి ఆఫీసులోకి వెళ్ళి, తనకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కష్టమైన చిక్కు కేసుల ఫైళ్ళను ఏరుకొని చదివేవారు. పి.వి. గారి ఆ చొరవకు అక్కడి సీనియర్ గుమాస్తా కోపపడేవాడు.
కాని బూర్గులవారు పి.వి. గారు తన ఫైళ్ళు చూడ్డానికి అంగీకరించారు. అంతేకాక కేసుల గురించి పి.వి. గారితో బూర్గులవారు సమాన స్థాయిలో చర్చించేవారు. దానితో పి.వి. గారు తనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఆత్మవిశ్వాసాన్ని పొందారు. పి.వి. గారికి ఆ ఆత్మవిశ్వాసం, శాసనసభల్లోనూ, ఇతర స్థలాల్లోనూ శ్రీరామరక్షగా పనిచేసింది. ఈ విధంగా గొప్పవారైన బూర్గులవారి సాంగత్యం, పి.వి. గారికి మంచి స్ఫూర్తి నిచ్చింది.
Exam Tips:
a) ‘సమర్థిస్తూ’ అని ఉంది కాబట్టి మొదటి వాక్యంలో అంగీకరించి, పి.వి. గారి అనుభవంతో కారణాలు చూపండి.
Question 6: సృజనాత్మకంగా రాయండి – కవిత: పాఠంలోని పదజాలం, విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి.
Answer:
“పూర్ణపురుషుడు బూర్గుల రామకృష్ణారావు”
“రామకృష్ణారావు మహాశయా! ఓ పూర్ణపురుషా!
నీవు నా పాలిటి ప్రాతఃస్మరణీయుడవు.
నీ పేరు వింటే, గత స్మృతులతో ఉక్కిరిబిక్కిరౌతాను.
నీ చదువూ, మంత్రి పదవులూ, గవర్నరు గిరీలూ
కమిటీ అధ్యక్షతలూ – నీ వ్యక్తిత్వ ప్రతిబింబాలు కానేకావు.
నీ గురించి నీవు వీసం ఎత్తు ఎక్కువ తక్కువలు చెప్పవు.
నీవు నిజంగా వామనుడైన విరాట్ స్వరూపుడివి,
నీ వ్యక్తిత్వపు మహోన్నత శిఖరం, అనన్య దర్శనీయం
న్యాయవాదిగా నీ ప్రజ్ఞాప్రాభవాలు, శక్తి సామర్థ్యాలూ సునిశిత మేధా సంపత్తీ – జాజ్వల్యమాన ప్రతిభా అనన్య వాదనాపటిమా – అద్భుతం, మహాద్భుతం.
నీవు నాలో నింపిన ఆత్మవిశ్వాసం, నా కదే శ్రీరామరక్ష.
నీ విశిష్ట వ్యక్తిత్వానికి ఇవే నా జోహార్లు
నీవు సామ్యవాదవ్యవస్థకు మార్గదర్శకుడవు.
రాజకీయాలలో నీ సమ్యక్ దృష్టి, ప్రశంసనీయం
మత దురభిమాని నిజాం, నీకు బద్ధ శత్రువు, కానీ
కుచ్చుటోపీల మౌల్వీలూ, గడ్డాల ముల్లాలూ నీ వాళ్ళే మతాతీత స్థితి, నీ విశాల వ్యక్తిత్వం నీవు బహు భాషావేత్తవు, ఉపకారశీలివి, ఉదారుడవు.
కించిత్తూ చలించవు కష్టసుఖాల రాకలకు
నీ గురించి చెప్పాలంటే అది నా వల్ల ఔతుందా ?
కానేకాదు. నీవు నిజంగా “పూర్ణపురుషుడవు”.
Exam Tips:
a) కవితలో పాఠంలోని పదజాలం (ప్రాతఃస్మరణీయుడు, శ్రీరామరక్ష, ఉక్కిరిబిక్కిరి) వాడండి; శీర్షిక, చరణాలు పద్ధతిగా రాయండి.
Question 7: సృజనాత్మకంగా రాయండి – అభినందన వ్యాసం: ఈ పాఠం ఓ అభినందన పత్రంగా ఉంది కదూ! దీన్ని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తిని గురించి అభినందన వ్యాసం రాయండి.
Answer:
సరస్వతీ మూర్తీ!
మాకు నచ్చిన గొప్ప వ్యక్తి “ఉత్తమోపాధ్యాయుడు” దువ్వూరి సోమయాజులు గార్కి విద్యార్థులు సమర్పించిన సన్మానపత్రం.
ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయునిగా మిమ్ము నిర్ణయించి గౌరవించిన సందర్భంగా మీ శిష్యులమైన మేము మీకూ, ప్రభుత్వానికీ, శతకోటి వందనాలు అర్పిస్తున్నాం. మీరు బహుభాషావేత్తలు. సంస్కృతాంధ్రభాషల్లో మీకు గల శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞాప్రాభవాలు ప్రశంసనీయాలు. మీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మాకు ఉపాధ్యాయుడిగా ఉండడం మాకు గర్వకారణం.
సౌజన్యమూర్తీ!
మీరు మా విద్యార్థులను మీ కన్నబిడ్డవలె ప్రేమగా చూస్తారు. మీరు మతాతీత స్థితిని పాటిస్తారు. మీకు కులమతాల పట్టింపులు లేవు. ధనిక బీద తారతమ్యం లేదు. మీ విశాల వ్యక్తిత్వం, విశిష్ట వ్యక్తిత్వం, సౌజన్యం మరెక్కడా కనబడదు. అందుకే మీరు ఉత్తమోపాధ్యాయులు అయ్యారని మా విశ్వాసం.
మార్గదర్శీ!
మీరు మాలో గల శక్తి సామర్థ్యాలను వెలికితీసి, మెరుగుపెట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అందుకే మాకు ఎన్నో మంచి మార్కులు, బహుమతులు వస్తున్నాయి. మీ సునిశిత మేధాసంపత్తి, జాజ్వల్యమాన ప్రతిభ ఆధారంగా మమ్మల్ని ఉత్తమ విద్యార్థులుగా మీరు తీర్చిదిద్దుతున్నారు. మీరు మా కందించే ప్రోత్సాహమే, మాకు శ్రీరామరక్ష. మీరు మాకు ప్రాతఃస్మరణీయులు.
మీకు పరమేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యాలను ఇచ్చి, మా వంటి ఎందరో విద్యార్థినీ, విద్యార్థులను సాహితీ సంపన్నులుగా తయారుచేసేందుకు మీకు తోడ్పడాలని, మేము దైవాన్ని కోరుతున్నాం.
ఇట్లు,
మీ విద్యార్థులు
X X X X X X
హైదరాబాద్.
Exam Tips:
a) అభినందన పత్రంలో సంబోధనలు, ప్రశంస, ఆశీస్సులు, ‘ఇట్లు’ తో ముగింపు ఉండాలి; ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు వంటి నిజమైన వ్యక్తిని ఎంచుకోండి.
III. భాషాంశాలు
పదజాలం
Question 1: కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
Answer:
అ) చిన్నప్పటి జ్ఞాపకాలు నాకు ముప్పిరిగొంటున్నాయి.
జవాబు:
ముప్పిరి = చుట్టుముట్టాయి (అతిశయించాయి.)
ఆ) వీసం ఎత్తు అహంకారం లేకుండా ముందుకెళ్ళాలి.
జవాబు:
వీసం ఎత్తు : 1/16 వ వంతు
ఇ) దశరథుని కడగొట్టు బిడ్డడు శత్రుఘ్నుడు.
జవాబు:
కడగొట్టు = కట్టకడపటి ; చివరి
ఈ) భారతదేశ ప్రాభవాన్ని మనమంతా పెంచాలి.
జవాబు:
ప్రాభవాన్ని = శ్రేష్ఠత్వాన్ని
ఉ) మనదేశ ప్రజలకు వివేకానందుడు ప్రాతః స్మరణీయుడు.
జవాబు:
ప్రాతఃస్మరణీయుడు = నిద్ర నుండి లేవగానే స్మరించుకోవలసిన దైవస్వరూపులు.
ఊ) హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టవద్దు.
జవాబు:
హితైషి = మేలును కోరేవాడు.
Exam Tips:
a) గీత గీసిన పదానికి ఆ వాక్యంలో సరిపోయే అర్థాన్ని మాత్రమే రాయండి.
Question 2: కింది జాతీయాలను మీ సొంతవాక్యాలలో ప్రయోగించండి.
Answer:
అ) శ్రీరామరక్ష = పరిరక్షించగలిగినది, సర్వరక్షకం
జవాబు:
వాక్యప్రయోగం : నెహ్రూజీ మొదటి ప్రధానమంత్రి కావడం, మన భారతదేశానికి శ్రీరామరక్ష అయ్యింది.
ఆ) గీటురాయి = కొలబద్ద, ప్రమాణం
జవాబు:
వాక్యప్రయోగం : మంత్రిగారు మెచ్చుకోడం, నా తమ్ముని ప్రతిభకు గీటురాయి అని చెప్పాలి.
ఇ) రూపుమాపడం = శాశ్వతంగా తొలగించడం
జవాబు:
వాక్యప్రయోగం : వీరేశలింగంగారు నాటి సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషిచేశారు.
ఈ) కారాలు మిరియాలు నూరడం = మండిపడడం, మిక్కిలి కోపగించడం
జవాబు:
వాక్యప్రయోగం : నా తమ్ముడు తప్పుచేస్తే, మా నాన్నగారు కారాలు మిరియాలు నూరుతారు.
ఉ) స్వస్తివాచకం = ముగింపు, వదలివేయు
జవాబు:
వాక్యప్రయోగం : విద్యార్థులు చదువుకోసం పూర్తిగా ఆటలకు స్వస్తివాచకం చెప్పకూడదు.
Exam Tips:
a) జాతీయం యొక్క అర్థం తెలిసి, ఆ భావం వచ్చేలా సొంత వాక్యం రాయండి; పాఠంలోని వాక్యాన్ని కాపీ చేయవద్దు.
Question 3: కింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించండి.
Answer:
అ) రైతులు ప్రతివర్షం పంటలను పండిస్తూ సాలుకొకసారి వచ్చిన ధనంతో సంవత్సరమంతా నడుపుతారు.
జవాబు:
పర్యాయపదాలు:
1. వర్షం
2. సాలు
3. సంవత్సరం
ఆ) భూమిపై కాలుష్యం పెరుగుట వల్ల, ధరిత్రి మీద ఉండే జనం విలవిలలాడుతూ అవనిపై మేము జీవించలేమని అంటున్నారు.
జవాబు:
పర్యాయపదాలు:
1. భూమి
2. ధరిత్రి
3. అవని.
ఇ) ఒక వ్యక్తి దక్షతతో పనిచేస్తే, ఆ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది.
జవాబు:
పర్యాయపదాలు:
1. దక్షత
2. సామర్థ్యం
Exam Tips:
a) వాక్యంలో ఒకే అర్థం ఇచ్చే మూడు పదాలను (వర్షం–సాలు–సంవత్సరం) గుర్తించండి.
Question 4: కింది ‘వికృతి’ పదాలకు పాఠంలో ఉన్న ‘ప్రకృతి’ పదాలను వెతికి రాయండి.
Answer:
అ) దవ్వు
జవాబు:
దవ్వు (వికృతి) – దూరము, దవీయము (ప్రకృతి)
ఆ) గారవం
జవాబు:
గారవం (వికృతి) – గౌరవం (ప్రకృతి)
ఇ) పగ్గె / పగ్గియ
జవాబు:
పగ్గె / పగ్గియ (వికృతి) – ప్రజ్ఞ (ప్రకృతి)
ఈ) దోసం
జవాబు:
దోసం (వికృతి) – దోషం (ప్రకృతి)
ఉ) రాతిరి
జవాబు:
రాతిరి (వికృతి) – రాత్రి (ప్రకృతి)
ఊ) బాస
జవాబు:
బాస (వికృతి) – భాష (ప్రకృతి)
Exam Tips:
a) వికృతి = మారిన రూపం, ప్రకృతి = మూల రూపం అని గుర్తుంచుకోండి (గారవం–గౌరవం, బాస–భాష).
Question 5: ప్రతి వృత్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయని పాఠం ద్వారా తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన కొన్ని వృత్తులు, వాటికున్న ప్రత్యేక లక్షణాలకు సంబంధించిన పదాలను పట్టిక రూపంలో రాయండి.
Answer:
| వృత్తి | ప్రత్యేక లక్షణం |
| ఉదా : ఉపాధ్యాయుడు | నిరంతర అధ్యయనం, బోధన |
| 1) న్యాయవాది | 1) మంచి వాదనాపటిమ, సూక్ష్మపరిశీలనాసక్తి, భాషానైపుణ్యం |
| 2) పురోహితుడు | 2) చక్కని కంఠస్వరం, పవిత్ర వేషధారణ |
| 3) ఆఫీసు గుమాస్తా | 3) ఒళ్ళు వంచి పనిచేయడం, నిజాయితీ |
| 4) కలెక్టరు | 4) అవినీతిని సహించకపోవడం, నిర్ణయత్వం, సూక్ష్మబుద్ధి |
| 5) పోలీసు | 5) ధైర్యసాహసాలు, క్రమశిక్షణ |
| 6) రాజకీయ నాయకుడు | 6) నీతి నిజాయితీలు, కార్యసాధన, పరోపకారం |
| 7) మంత్రి | 7) ప్రజల పట్ల ప్రేమానురాగాలు, బంధుప్రీతి లేకపోవడం |
| 8) రాష్ట్రపతి | 8) పార్టీ రహిత సమన్యాయదృష్టి, న్యాయవర్తనం |
Exam Tips:
a) ఉదాహరణకు ఇచ్చిన వరుసలో వృత్తి–లక్షణం పట్టిక రాయండి; లక్షణం ఆ వృత్తికి నిజంగా సరిపోవాలి.
వ్యాకరణాంశాలు
Question 1: కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి.
Answer:
అ) హైదరాబాద్ లోని విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి.
జవాబు:
విమానాశ్రయం : విమాన + ఆశ్రయం = సవర్ణదీర్ఘ సంధి
ఆ) చిన్నప్పటి విషయాలు జ్ఞాపకముండడం చాలా అరుదు.
జవాబు:
జ్ఞాపకముండడం : జ్ఞాపకము + ఉండడం ఉత్వసంధి
ఇ) ప్రతి జీవికి ఒక్కో శరీరాకృతి ఉంటుంది.
జవాబు:
శరీరాకృతి : శరీర + ఆకృతి = సవర్ణదీర్ఘ సంధి
ఈ) అబ్దుల్ కలాం మహోన్నత వ్యక్తిత్వం కలవాడు.
జవాబు:
మహోన్నత : మహా + ఉన్నత = గుణసంధి
ఉ) నా జీవితాన్నంతా దేశసేవకే వినియోగించాలనుకుంటున్నాను.
జవాబు:
జీవితాన్నంతా : జీవితాన్ని + అంతా = ఇత్వసంధి
ఊ) మాధవి చెప్పినప్పటికీ రమ వినలేదు.
జవాబు:
చెప్పినప్పటికీ : చెప్పిన + అప్పటికీ = అత్వసంధి
ఋ) ఒక్కొక్కప్పుడు ముఖ్యమైన విషయాలు జ్ఞప్తికి రావు.
జవాబు:
ఒక్కొక్క : ఒక + ఒక = ఆమ్రేడిత సంధి
Exam Tips:
a) సంధి విడదీసేటప్పుడు ‘పూర్వపదం + పరపదం = సంధిపేరు’ క్రమంలో రాయండి (ఉదా: శరీర + ఆకృతి = సవర్ణదీర్ఘ సంధి).
Question 2: కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి, విగ్రహవాక్యాలు రాయండి. సమాస నిర్ణయం చేయండి.
Answer:
ఉదా : – సత్యదూరము – సమాస పదం – షష్ఠీ తత్పురుష సమాసం సమాసపదం – విగ్రహకవాక్యం – సమాసం పేరు
అ) అమెరికా రాయబారి – అమెరికా యొక్క రాయబారి – షష్ఠీ తత్పురుష సమాసం
ఆ) వాదనాపటిమ – వాదనయందు పటిమ – సప్తమీ తత్పురుష సమాసం
ఇ) అసాధ్యం – సాధ్యము కానిది – నఞ తత్పురుష సమాసం
ఈ) నెలతాల్పు – నెలను ధరించినవాడు – ద్వితీయా తత్పురుష సమాసం
ఉ) గురుదక్షిణ – గురువు కొఱకు దక్షిణ – చతుర్థీ తత్పురుష సమాసం
ఊ) వయోవృద్ధుడు – వయస్సు చేత వృద్ధుడు – తృతీయా తత్పురుష సమాసం
ఋ) దొంగభయము – దొంగవలన భయము – పంచమీ తత్పురుష సమాసం
ౠ) రెండు రాష్ట్రాలు – రెండైన రాష్ట్రాలు – ద్విగు సమాసం
ఎ) శక్తిసామర్ధ్యాలు – శక్తియు, సామర్ధ్యమును – ద్వంద్వ సమాసం
ఏ) అమూల్యసమయం – అమూల్యమైన సమయం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఐ) పూర్ణపురుషులు – పూర్ణులైన పురుషులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఒ) ప్రాచీనకావ్యాలు – ప్రాచీనములైన కావ్యాలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఓ) పెద్దకుటుంబం – పెద్దదైన కుటుంబం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
Exam Tips:
a) ఉదాహరణ ఇచ్చిన క్రమంలో సమాసపదం – విగ్రహవాక్యం – సమాసం పేరు మూడూ రాయండి.
Question 3: కింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి.
Answer:
అ) పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు.
పర్షియన్ భాషను చదివాడు.
ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.
జవాబు:
పూనాలోని ఫెర్గూసన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివి, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. (సంక్లిష్ట వాక్యం)
ఆ) బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కు నిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేశాడు.
బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
బూర్గుల అజరామర కీర్తిని పొందాడు.
జవాబు:
బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు పునాదివేసి, అజరామరకీర్తిని పొందాడు. (సంక్లిష్ట వాక్యం)
Exam Tips:
a) కొన్ని వాక్యాలను ‘ఇ / ఉ’ క్రియా రూపాలతో కలిపి ఒకే వాక్యంగా రాయండి (చేరి, చదివి, పొంది); అర్థం మారకుండా చూడండి.
ప్రాజెక్టు పని
Question 1: మహోన్నత వ్యక్తిత్వంతో, పరిపాలనాదక్షతతో సేవచేసిన వారి వివరాలు సేకరించండి. నివేదిక రూపొందించండి. తరగతిలో ప్రదర్శించండి.
Answer:
| మహోన్నత వ్యక్తిత్వం – పరిపాలనా దక్షతగల వ్యక్తులు | ||
| 1) | డా. జవహర్లాల్ నెహ్రూ | భారతదేశ మాజీ ప్రధాని |
| 2) | శ్రీమతి ఇందిరాగాంధీ | భారతదేశ మాజీ ప్రధాని |
| 3) | లాల్ బహదూర్ శాస్త్రి | భారతదేశ మాజీ ప్రధాని |
| 4) | అటల్ బిహారీ వాజ్‌పేయి | భారతదేశ మాజీ ప్రధాని |
| 5) | డా. పి.వి. నరసింహారావు | భారతదేశ ప్రధాన మంత్రి |
| 6) | కామరాజ్ నాడార్ | తమిళనాడు ముఖ్యమంత్రి, అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు |
| 7) | డా. నీలం సంజీవరెడ్డి | భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి |
| 8) | ఎన్.టి. రామారావు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నటనా సార్వభౌముడు |
| 9) | ఎమ్.జి. రామచంద్రన్ | తమిళనాడు ముఖ్యమంత్రి, గొప్ప సినీ నాయకుడు |
| 10) | అబ్రహాం లింకన్ | అమెరికా ప్రెసిడెంటు |
Exam Tips:
a) ప్రాజెక్టులో పేరు, పదవి/రంగం వివరాలు పట్టికలో రాసి, తరగతిలో చెప్పడానికి సిద్ధంగా ఉండండి.
Free study material for Telugu
Free TS Board Textbook Explanations: Class 9 Telugu Lesson 02 Nenerigina Burgula (The Burgula I Knew)
Textbook Solutions for Class 9 Telugu Lesson 02 Nenerigina Burgula (The Burgula I Knew)
Review comprehensive exercise answers for Class 9 Telugu Lesson 02 Nenerigina Burgula (The Burgula I Knew). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 02 Nenerigina Burgula (The Burgula I Knew) with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల in both English and Hindi medium.
Yes, you can download the entire TS 9th Class Telugu Guide 2nd Lesson నేనెరిగిన బూర్గుల in printable PDF format for offline study on any device.