TS 9th Class Telugu Lesson 1 ధర్మార్జునులు

Official TS Board Solutions for Class 9 Telugu: Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna)

Explore reliable textbook solutions for Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna) tailored for Class 9 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Chapter-wise Solutions for Telugu: Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna)

View or download the dedicated Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

ప్రారంభ ప్రశ్నలు

Question 1: సజ్జనుల బాధలను నివారించే వాళ్ళెవ్వరు ?

Answer:

సజ్జనుల బాధలను నివారించే వారు రాజులు.

Exam Tips:

a) ఒక్క వాక్యంలో ‘రాజులు’ అని స్పష్టంగా రాయండి.

 

Question 2: దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి ?

Answer:

దుర్మార్గులు విజృంభించి క్రూర స్వభావముతో సత్పురుషులను బాధించేటప్పుడు, రాజులు దుర్మార్గులను దండించాలి.

Exam Tips:

a) ‘దండించాలి’ అనే క్రియతో జవాబు ముగించండి; కారణం (సత్పురుషులను బాధించడం) కూడా చెప్పండి.

 

Question 3: ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు ?

Answer:

చెడ్డవారు క్రూర స్వభావముతో విజృంభించి మంచివారిని బాధిస్తున్నప్పుడు, రాజులు చెడ్డవారిని దండించాలి. అంతేకాని తమ బలహీనతను వెల్లడించరాదు. అలా చేస్తే ఆ రాజుల రాజ్యం చెడిపోతుంది.

Exam Tips:

a) దుష్టులకు శిక్ష, శిష్టులకు రక్షణ అనే రాజధర్మాన్ని మీ మాటల్లో రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 4)

Question 1: ‘ఆజ్ఞా పరిపాలనా వ్రతం’ అంటే ఏమిటి ? మీ అభిప్రాయం చెప్పండి.

Answer:

తాను వేసిన ఆజ్ఞల ప్రకారమే, తాను కూడా నడచుకొనడాన్ని “ఆజ్ఞా పరిపాలనా వ్రతం” అంటారు. సామాన్యంగా ప్రజలను పాలిస్తూ రాజులు కొన్ని నియమాలను పాటించుమని ప్రజలను ఆజ్ఞాపిస్తారు. తాము మాత్రం, ఆ ఆజ్ఞల ప్రకారం నడచుకోరు. అలా కాకుండా ధర్మరాజు తాను వేసిన ఆజ్ఞల ప్రకారమే, తాను కూడా నడచుకొనేవాడు. అందువల్లనే ధర్మరాజు ‘ఆజ్ఞాపరిపాలనా వ్రతుడు’ అయ్యాడు.

Exam Tips:

a) మొదట అర్థం, తర్వాత ధర్మరాజు ఉదాహరణ, చివరగా మీ అభిప్రాయం – ఈ క్రమంలో రాయండి.

 

Question 2: ‘మొకమిచ్చకపు మెచ్చు !’ అంటే మీరేమనుకుంటున్నారు ?

Answer:

ఎదుటి వ్యక్తిని అతని ఎదుట, అతని ముఖప్రీతి కోసం మెచ్చుకోడాన్ని ‘మొకమిచ్చకపు మెచ్చు’ అంటారు. ఆ వ్యక్తిని అతని ముఖం ముందు మెచ్చుకొని, అతడు వెళ్ళిపోయిన తర్వాత అతడిని కొందరు నిందిస్తారు. అది సరయిన పద్ధతి కాదు. మెచ్చుకుంటే ఆ వ్యక్తిని అతని ముందూ, అతడు వెళ్ళిన తర్వాత కూడా మెచ్చుకోవాలి.

Exam Tips:

a) ‘ముఖప్రీతి కోసం మెచ్చుకోవడం’ అనే అర్థాన్ని స్పష్టంగా చెప్పండి.

 

Question 3: మంచివారిని ఎందుకు అనుసరించాలి ?

Answer:

మంచివారు మంచి గుణాలను కలిగియుంటారు. వారు మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. అటువంటి మంచి వారిని అనుసరిస్తే, వారిలాగే తాను కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు. ధర్మరాజువంటి సజ్జనులను అనుసరిస్తే తాము కూడా ధర్మమూర్తులు కావచ్చు.

Exam Tips:

a) ధర్మరాజు వంటి సజ్జనులను అనుసరిస్తే మనమూ ధర్మమూర్తులం కావచ్చని ఉదాహరణతో రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 5)

Question 1: స్నేహభావం ఎవరెవరితో పెంపొందించుకోవాలి ?

Answer:

స్నేహభావం సత్పురుషులతో పెంపొందించుకోవాలి.
ధర్మరాజు వంటి సత్పురుషులు:
1. ప్రజల సంపదలకు సంతోషిస్తారు. అసూయపడరు.
2. ప్రజలందరూ తనను సేవించాలని అనుకుంటారు. వీరు ఎవరినీ వెగటుగా చూడరు.
3. అడిగిన వారికి ఇద్దామని అనుకుంటారు. పూర్వమే అతడికి ఎంతో ఇచ్చామని అనరు.
4. రాత్రింబగళ్ళు ధర్మార్జన దృష్టితో ఉంటారు. అన్యాయవర్తన ఉండదు.
కాబట్టి ధర్మరాజు వంటి సత్పురుషులతో స్నేహభావం పెంపొందించుకోవాలి.

Exam Tips:

a) ‘ఎవరితో’ అని అడిగారు కాబట్టి, ముందు సత్పురుషులు అని సూటిగా చెప్పి, వారి లక్షణాలను జాబితాగా రాయండి.

 

Question 2: ‘కొంగు బంగారం’ అనే మాట ఎప్పుడైనా విన్నారా అయితే దాని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి.

Answer:

‘కొంగు బంగారం’ అనేది తెలుగు జాతీయము. ‘సులభ సాధ్యము’ అని దీనికి అర్థము. పూర్వులు తమకు కావలసిన ధనాన్ని చెంగున ముడివేసుకొనేవారు. ఆ రోజుల్లో మనీ పర్సులు లేవు. వారికి ఏదయినా డబ్బు అవసరం అయితే వెంటనే చెంగున లేక కొంగున ముడి వేసిన ముడి విప్పి, అందులో కావలసిన మొత్తాన్ని వారు సులభంగా వాడుకొనేవారు. వారి డబ్బు ఏ పెట్టెలోనో ఉండి ఉంటే అంత సులభంగా అది వారి అవసరానికి ఉపయోగించదు. ఆ విధంగా ‘కొంగు బంగారం’ అంటే, సులభంగా అయ్యే పని అని అర్థంలో, ఆ జాతీయం వాడుకలోకి వచ్చింది.

Exam Tips:

a) జాతీయం అర్థం (సులభంగా అయ్యే పని/ఎప్పుడూ అందుబాటులో ఉండేది), దాని పుట్టుక – రెండూ రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 5 – రెండవ భాగం)

Question 1: అసూయాపరులంటే ఎవరు ? వారి వల్ల ఎవరికి నష్టమో చెప్పండి.

Answer:

అసూయాపరులంటే ఈర్ష్యగుణం కలవారు. ఎదుటి వారికి ఉన్నది, తనకు లేదని బాధపడేవారు ‘అసూయా పరులు’. అసూయ వల్ల అసూయాపరులకే నష్టము.
అసూయాపరుల వల్ల ఒక్కొక్కప్పుడు ఎదుటివారికి కూడా నష్టం ఉంటుంది.

Exam Tips:

a) ‘అసూయపరులకే ఎక్కువ నష్టం’ అనే మాట జవాబులో ఉండాలి.

 

Question 2: ‘దానగుణం మనిషికి అవసరం’ ఎందుకో మీ అభిప్రాయాలు చెప్పండి.

Answer:

‘దానగుణం’ అంటే ఎదుటి వారికి ఇవ్వడం. మన పెద్దలు దశదానాలు, షోడశ మహాదానాలు చేయాలని చెప్పారు. మనం ఒకరికి ఇస్తే దేవుడు తిరిగి మనకు మరింతగా ఇస్తాడు. దానగుణం వల్ల, పేదలు సంతోషిస్తారు. ఈ జన్మలో దానం చేసుకుంటే మరుసటి జన్మలో భగవంతుడు దానం ఇచ్చిన వారికి మరింతగా ఇస్తాడు. దానగుణం లోకంలో ఉంటే పేదవారికి లోటు ఉండదు.

Exam Tips:

a) దానం వల్ల పేదల సంతోషం, సమాజంలో లోటు లేకపోవడం – ప్రయోజనాలుగా రాయండి.

 

Question 3: యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి పాండవులు ఉత్సాహం చూపేవారు. ఎందుకో చెప్పండి.

Answer:

పాండవులు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడానికి ఉత్సాహం చూపేవారు. పాండవుల వద్ద ఎంతో సంపద ఉంది. అదీగాక వారి దేశప్రజలు సకల సంపదలతో తులతూగాలని పాండవులు కోరుకొనేవారు. వారు దానం చేయడంలో గొప్పవారు. అందుకే వారు యాచకుల కోరికలను పూర్తిగా తీర్చి, వారి దీనత్వాన్ని పోగొట్టేవారు. పాండవులు మంచి సౌజన్యం గలవారు. అందుకే వారు యాచకుల దీనత్వాన్ని పోగొట్టడంలో అంటే దానం చేయడం అనే ప్రక్రియలో శూరత్వం చూపేవారు.

Exam Tips:

a) పాండవుల సంపద, దానశీలత, ప్రజలు సంపదలతో తులతూగాలనే కోరిక – కారణాలుగా రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (Textbook Page No. 6)

Question 1: ‘ప్రాణసఖుడు’ అని ఎవరినంటారు ? వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి ?

Answer:

‘ప్రాణసఖుడు’ అంటే తన ప్రాణంతో సమానంగా ఎదుటి వారిని చూసుకొనే మిత్రుడు. అవసరమైతే స్నేహితుడి కోసం, తన ప్రాణాలను ఇచ్చే మిత్రుడిని “ప్రాణసఖుడు” అంటారు.
ప్రాణసఖుడి లక్షణాలు:
1. మిత్రుడిని పాపకార్యముల నుండి మరలిస్తాడు.
2. స్నేహితునిచే హితమైన కార్యాలు చేయిస్తాడు.
3. స్నేహితుడి రహస్యాన్ని దాస్తాడు.
4. మిత్రుడి సద్గుణాలను పోషిస్తాడు.
5. మిత్రునికి లేని సమయంలో అతడిని విడిచిపెట్టడు.
6. మిత్రుడికి కావలసినది తాను ఇస్తాడు.

Exam Tips:

a) నిర్వచనం ముందు, ఆరు లక్షణాలు సంఖ్యలతో – ఇలా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 2: ‘ధర్మప్రవర్తన కలిగి వుండటం’ అంటే ఏమిటి ?

Answer:

వేదధర్మ శాస్త్రాలలో చెప్పిన ధర్మాలకు అనుగుణంగా నడచుకోడాన్ని ధర్మప్రవర్తన కలిగియుండడం అంటారు. అన్నదమ్ముల యందు సమభావన, తోడి రాజులలో మంచి ప్రసిద్ధి, సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా నడచుకోడం అన్నది ధర్మప్రవర్తన.

Exam Tips:

a) శాస్త్రాలు చెప్పిన ధర్మాలకు అనుగుణంగా నడచుకోవడం అనే నిర్వచనాన్ని ముందు రాయండి.

 

Question 3: స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి.

Answer:

ఇతరులందరితోనూ స్నేహభావం పెంపొందించుకోడం వల్ల మనకు మిత్రులు పెరుగుతారు. మనకు శత్రువులన్న వారే ఉండరు. అందరూ మనల్ని ప్రేమభావంతో చూస్తారు. అవసరం వచ్చినపుడు ఆ మిత్రులు మనల్ని ఆదుకుంటారు. మనకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే, శత్రువులు మనవైపుకు కన్నెత్తి చూడడానికి సైతం జంకుతారు.

Exam Tips:

a) మిత్రులు పెరగడం, శత్రువులు తగ్గడం, ఆపదలో ఆదుకోవడం – ప్రయోజనాలను వేర్వేరుగా రాయండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: ధర్మరాజు సుగుణాల గురించి విన్నారు కదా ! వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి పాలకులకు ఉండవలసిన లక్షణాలను గురించి చర్చించండి.

Answer:

నేటి పాలకులకు ఉండవలసిన లక్షణములు:
1. ప్రభుత్వ శాసనం ప్రకారము, తానూ, తనవారూ నడచుకోవాలి. ప్రజలకు కూడు, గుడ్డ, ఇల్లు సమకూర్చాలి. బీదలపట్ల, హరిజన గిరిజనులపట్ల సానుభూతి ఉండాలి.
2. శాంతి, దయ అనే సుగుణములు కలిగి ఉండాలి..
3. సదా సత్యమునే మాట్లాడాలి.
4. సత్పురుషులైన ప్రజలను ఎల్లవేళలా ఆదరంగా చూడాలి.
5. విపన్నులకు దానధర్మాలు చేసేవాడై ఉండాలి.
6. ముందు ఒకమాట, వెనుక ఒకమాట చెప్పకూడదు.
7. ప్రజలు చేసిన విన్నపాలను, ఆదరంగా ఆలకించి పరిష్కారం చూపించాలి.
8. మంచిపనులు చేసిన వారిని, మెచ్చుకొని వారిని ఘనంగా సన్మానించాలి.
9. ప్రజల సంపదపై అసూయకూడదు. ప్రభుత్వ సంపదకు తాను కాపలాదారుగా ఉండాలి.
10. రాత్రింబగళ్ళు ధర్మమార్గంలో నడవాలి.
11. ప్రభుత్వ పాలన, పారదర్శకంగా ఉండాలి.
12. స్వపక్ష, పరపక్ష తారతమ్యం పనికిరాదు.
13. కోపం, ఈర్ష్య ఉండరాదు.
14. పండితులను గౌరవించాలి.
15. అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉండరాదు.
16. రాత్రింబగళ్ళు ప్రజల కష్టనష్ట నివారణపైనే దృష్టి ఉండాలి.
17. దేశాన్ని శత్రువుల నుండి కాపాడుకోవాలి.
18. ప్రజలకు విద్యావైద్య సదుపాయాలు కల్గించాలి.

Exam Tips:

a) పాఠంలోని ధర్మరాజు లక్షణాలను ఆధునిక పాలనకు (పారదర్శకత, అవినీతి లేకపోవడం) అన్వయించి రాయండి.
b) కనీసం 8–10 లక్షణాలను సంఖ్యలతో రాయండి.

 

Question 2: “మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి” ఎందుకో చర్చించండి.

Answer:

ఏ పని చేయాలని అనుకున్నా, ఆ పని చేయడంలో వచ్చే మంచి చెడులనూ దానివల్ల కలిగే లాభనష్టాలనూ ముందుగా బాగా ఆలోచించాలి. తరువాతే నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి మంచి చెడులను ఆలోచించకుండా నిర్ణయం తీసుకొంటే, తరువాత కష్టనష్టాలు వస్తాయి. అప్పుడు విచారింపవలసి వస్తుంది.
బుద్ధిమంతుడైనవాడు, తొందరతో నిర్ణయాలు తీసుకోరాదు. అవసరమైతే తనకు కావలసిన వారికి సమస్యను చెప్పి, వారందరితో బాగా ఆలోచించి, రాబోయే మంచిచెడులను లోతుగా చర్చించి నిర్ణయించాలి.
అలా ఆలోచించి నిర్ణయిస్తే ఆ నిర్ణయం వల్ల ఎటువంటి కష్టనష్టాలు రావు. ఒకవేళ కష్టనష్టాలు వచ్చినా, పశ్చాత్తాప పడవలసిన అవసరం ఉండదు.

Exam Tips:

a) తొందరపాటు నిర్ణయం వల్ల పశ్చాత్తాపం కలుగుతుందనే విషయాన్ని నొక్కి చెప్పండి.

 

Question 3: పువ్వు గుర్తుగల పద్యాలను భావస్ఫోరకంగా చదువండి.

Answer:

ఈ పాఠంలో 1, 4, 7, 9 పద్యాలు పువ్వు గుర్తు గల పద్యాలు. వీటిని చక్కగా మీ గురువుగారి సాయంతో అర్థవంతంగా, భావం తెలిసేలా చదవడం అలవాటు చేసుకొండి.

Exam Tips:

a) ఇది పఠన కృత్యం – గతి, యతి, భావానికి తగిన స్వరం పాటిస్తూ చదవడం సాధన చేయండి.

 

Question 4: కింద నాలుగో పద్యానికి ప్రతిపదార్థం ఉన్నది. ఇదే విధంగా 1, 9 సంఖ్యగల పద్యాలకు ప్రతిపదార్థం రాయండి.
(4వ పద్యం ప్రతిపదార్థం)
కోపము = కోపము
ఒక + ఇంత = కొంచెం కూడా
లేదు = లేద
బుధకోటికిన్ = పండితుల సమూహానికి
కొంగుపసిండి = కొంగున మూటగట్టిన బంగారం (అవసరానికి ఉపయోగ పడుతుంది) సత్యము = సత్యం (చెప్పడం సంగతంటారా !)
ఆరూపము = దాని స్వరూపమే అతడు
తారతమ్యములు = వ్యత్యాసాలు (మనుష్యులలో)
ఎఱుంగు = తెలియును
స్వతంత్రుడు = స్వేచ్ఛగలవాడు (నిర్ణయాధి కారంలో)
నూతన ప్రియ + ఆటోపము = కొత్త విషయాలపట్ల ఆడంబరం
లేని = లేనటువంటి
నిశ్చలుడు = స్థిర స్వభావం గలవాడు
ఇటుల్ = ఈ విధంగా
కృతలక్షణుండు + ఐ = కృతయుగ (మంచి) లక్షణాలు కలిగి
చెలంగగాన్ = ప్రవర్తిస్తుండగా/ప్రకాశిస్తుండగా
అల ధర్మనందనున్ = ఆ యమధర్మరాజు వరపుత్రు డైన ధర్మరాజును
ద్వాపర లక్షణుండు = (సందిగ్ధమైన) (ద్వాపరయుగ లక్షణాలు కలవాడనీ
అనగ వచ్చునొకో = అనవచ్చునా ? (అనకూడదు)
(అనగవచ్చును + ఒకొ) కృతలక్షణుడనాలి.

Answer:

1వ పద్యం (ఉత్పలమాల):
ఆ పురమేలు ‘మేలు బళి !’ యంచుఁ బ్రజల్ జయవెట్టుచుండ నా
జ్ఞా పరిపాలన వ్రతుఁడు, శాంతి దయాభరణుండు, సత్య భా
షా పరతత్త్వకోవిదుఁడు, సాధు జనాదరణుండు, దాన వి
ద్యా పరతంత్ర మానసుఁడు ధర్మతనూజుఁ డుదగ్రతేజుఁడై.
ప్రతిపదార్థం:
ఆజ్ఞా పరిపాలన వ్రతుడు;
ఆజ్ఞా = తాను చేసిన ఆజ్ఞా ప్రకారము
పరిపాలన = తాను కూడా పరిపాలించాలన్న
వ్రతుడు = దీక్షా వ్రతము కలవాడునూ
శాంతి దయాభరణుండు;
శాంతి = శాంతము
దయా = ‘దయ’ అన్న మహాగుణాలు
ఆభరణుండు = భూషణాలుగా కలవాడునూ
సత్యభాషా పరతత్త్వ కోవిదుడు;
సత్యభాషా = నిజాన్ని చెప్పడంలోని
పరతత్త్వ = ఉత్కృష్టమైన స్వరూపాన్ని (స్వారస్యాన్ని)
కోవిదుడు = బాగా తెలుసుకున్నవాడునూ;
సాధుజనాదరణుండు;
సాధుజన = మంచివారలను
ఆదరణుండు = ఆదరించి పోషించేవాడునూ;
దానవిద్యాపరతంత్ర మానసుడు;
దానవిద్యా = దానము చేయడమనే విద్యయందు
పరతంత్ర = ఆసక్తి కల
మానసుడు = మనస్సు కలవాడునూ అయిన
ధర్మతనూజుడు = యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజు ఉదగ్రతేజుడై;
ఉదగ్ర = మిక్కిలి తీక్షణమైన (నిశితమైన)
తేజుడై (తేజుడు + ఐ) = పరాక్రమము గలవాడై;
ప్రజల్ = ప్రజలు
మేలు, బళి, అంచున్ = మేలు, బళి అని అతడిని ప్రశంసిస్తూ జయవెట్టుచుండన్;
జయ = జయజయ ధ్వనులు
పెట్టుచుండ = పెడుతుండగా; (చేసేలాగున)
ఆ పురము = ఆ ఇంద్రప్రస్థ పట్టణాన్ని
ఏలున్ = పాలిస్తూ ఉండేవాడు
9వ పద్యం (చంపకమాల):
అతని నుతింప శక్యమె ? జయంతుని తమ్ముఁడు సోయగమ్మునన్
పతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్
క్షితిధర కన్యకాధిపతికిన్ బ్రతిజోదు సమిజ్జయమ్మునం
దతని కతండె సాటి చతురబ్ధి పరీత మహీతలమ్మునన్.
ప్రతిపదార్థం:
అతనిన్ = ఆ అర్జునుని
నుతింపన్ = పొగడడానికి
శక్యమై = ఎవరికైనా శక్యమవుతుందా ? (శక్యము కాదని భావము) (ఎందుచేతనంటే ! అతడు).
సోయగమ్మునన్ = అందుమలో
జయంతుని తమ్ముడు = సౌందర్యానికి ప్రసిద్ధిపొందిన ఇంద్రపుత్రుడు జయంతుని వంటి వాడు.
కృపారసమ్మునన్ = దయారసములో
పతగ కులాధిపధ్వజుని;
పతగ = పక్షుల యొక్క
కుల = జాతికి
అధిప = ప్రభువయిన గరుత్మంతుని యొక్క
ధ్వజుని = జెండాగల (గరుడధ్వజుడైన విష్ణుమూర్తికి (కృష్ణునికి) పోలినవాడు) ప్రాణసఖుండు = ప్రాణ స్నేహితుడు;
సమిజ్జయమ్మునన్;
సమిత్ = యుద్ధములందలి
జయమ్మునన్ = విజయాలలో
క్షితిధర కన్యకాధిపతికిన్;
క్షితిధర = పర్వతము యొక్క
కన్యకా = కూతురైన పార్వతి యొక్క
అధిపతికిన్ = భర్త అయిన ఈశ్వరుడికి
ప్రతిజోదు = పోటీ (ఎదిరి వీరుడు, అనగా పోలినవాడు)
చతురబ్ధి మహీతలమ్మునన్;
చతురబ్ధి (చతుః + అబ్ధి) = నాలుగు సముద్రములచేత
పరీత = చుట్టుకొనబడిన
మహీతలమ్మునన్ = భూమండలమందు
అతనికిన్ = అతనికి (ఆ అర్జునుడికి)
అతండె = అతడే
సాటి = సమానుడు; (ఇతరులు ఎవ్వరూ సాటికారు)

Exam Tips:

a) ప్రతిపదార్థంలో పద్యంలోని ప్రతి పదాన్ని క్రమంగా ‘పదం = అర్థం’ రూపంలో రాయండి.
b) సంధి పదాలను విడదీసి (ఉదా: కృతలక్షణుండు + ఐ) అర్థం చెప్పండి.

 

Question 5: కింది భావాలు గల పద్యపాదాలు ఏయే పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి.
అ) ధర్మరాజే సాటిలేని చక్రవర్తి.
ఆ) గరుడధ్వజుని స్నేహితుడు.
ఇ) ఎల్లప్పుడు ధర్మాన్ని సంపాదించే దృష్టేగాని న్యాయం తప్పలేదు.
ఈ) అర్జునుడు సాత్త్వికులతో కూడా ప్రశంసల నందుకునే ధర్మవర్తన గలవాడు.

Answer:

అ) రెండవ పద్యంలో ఉంది: “ఇతడెపో సార్వభౌముఁ డప్రతిముఁ డనఁగఁ బ్రజలఁ బాలించె సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు.”
ఆ) తొమ్మిదవ పద్యంలో ఉంది: “పతగ కులాధిపధ్వజుని ప్రాణసఖుండు కృపారసమ్మునన్.”
ఇ) మూడవ పద్యంలో ఉంది: “రేవగల్ ధర్మమార్జించు దృష్టియె కాని, న్యాయంబు దప్పిన నడకలేదు.”
ఈ) ఎనిమిదవ పద్యంలో ఉంది: “సాత్వికుల్ దన్ను సుతింపఁగాఁ దనరు ధార్మికుఁడర్జునుఁ డొప్పు నెంతయున్.”

Exam Tips:

a) భావంలోని కీలక పదాలు (సార్వభౌముడు, ప్రాణసఖుడు, ధర్మమార్జించు, సాత్వికులు) పద్యంలో వెతకండి.
b) పద్యపాదాన్ని ఉన్నది ఉన్నట్లు, తప్పులు లేకుండా రాయండి.

 

Question 6: కింది పద్యాన్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
కుసుమ కోమల భావముల్ కూర్చువేళ
సరసకవులకు కలములన్ నెరసు లేక
జాఱు మకరంద ధారల తీరు రసము
తేలికన జిల్కు మా ముద్దు తెలుగుపలుకు
– శిరశినహళ్ కృష్ణమాచార్య
అ) పై పద్యాన్ని రాసిన కవి ఎవరు ?
ఆ) కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు ?
ఇ) కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి ?
ఈ) తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు ?
ఉ) ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి.

Answer:

అ) పై పద్యాన్ని ‘శిరశినహళ్ కృష్ణమాచార్య’ రచించారు.
ఆ) కవులు కుసుమములవలె కోమలములయిన భావాలను కూర్చగలరు.
ఇ) కలం నుండి తెలుగు పలుకులు, మకరంద ధారలవలె జాలువారుతాయి.
ఈ) తెలుగు పలుకులను కవి మకరంద ధారలతో పోల్చాడు.
ఉ) ఈ పద్యానికి శీర్షిక “తెలుగు పలుకు” అన్నది సరిపడుతుంది.

Exam Tips:

a) పద్యంలోని పదాలనే వాడి సూటిగా ఒక్క వాక్యంలో జవాబు రాయండి.
b) శీర్షిక పద్యం ముఖ్యభావాన్ని సూచించేలా ఉండాలి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు ? ఎందుకు ? (ఐదు వాక్యాల్లో)

Answer:

ధర్మరాజు నలుగురు తమ్ములూ, ఓటమిని ఎరుగని వారు. శత్రువులను ఓడించడానికీ, యాచకుల దీనత్వం పోగొట్టడానికీ, ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగియుంటారు. వీరు మంచి పరాక్రమం గలవారు.
పాండవులు ఐదుగురూ. కోరిన కోరికలు తీర్చడంలో అయిదు దేవతా వృక్షాలవంటివారని. శత్రువులను జయించడంలో విష్ణుమూర్తి అయిదు ఆయుధాల వంటి వారనీ, పవిత్ర ప్రవర్తనలో ఈశ్వరుడి ఐదు ముఖాల వంటివారనీ, లోకం పొగిడేటట్లు గుణవంతులుగా ఉండేవారు.
పాండవులు స్నేహభావం, భక్తి, ప్రేమ, ఓర్పు కనబడేటట్లు, పెద్ద, చిన్న అనే తేడాలు తెలుసుకొని, ఒకరిమాట మరొకరు దాటకుండా చేసే పనులలో తేడా లేకుండా, ఒకరి మనస్సుననుసరించి మరొకరు నడచుకుంటూ ఉండేవారు. అన్నదమ్ముల సరాగము అంటే పాండవులదే అని లోకము ప్రశంసించే విధంగా వారు ప్రవర్తించేవారు.

Exam Tips:

a) పంచ కల్పవృక్షాలు, పంచాయుధాలు, పంచముఖాలు అనే కవి పోలికలను తప్పక పేర్కొనండి.

 

Question 2: ఈ పాఠానికి “ధర్మార్జునులు” అనే పేరు తగినవిధంగా ఉన్నదని భావిస్తున్నారా ? ఎందుకు ? (ఐదు వాక్యాల్లో)

Answer:

ఈ పాఠంలో మొత్తం 10 పద్యాలు ఉన్నాయి. అందులో మొదటి నాలుగు పద్యాలలో ధర్మరాజు సుగుణాలనూ, ప్రజలను అతడు పాలించిన విధానమునూ వర్ణించారు. అలాగే చివరి 8, 9, 10 పద్యాలలో అర్జునుని సుగుణాలనూ, అతడి సౌందర్యాన్నీ, దయాగుణాన్నీ, అతడి యుద్ధ విజయాలనూ గూర్చి వర్ణించారు.
ఇందులో ఐదు, ఆరు, ఏడు పద్యాలలో మాత్రము మొత్తం పాండవులు ఐదుగురి గుణగణాలనూ కవి వర్ణించాడు. మొత్తంపై ధర్మరాజు గురించి, అర్జునుడి గురించి ఈ పద్యాలలో విశేషంగా వర్ణింపబడింది. కాబట్టి మొత్తం ఈ పాఠానికి ధర్మరాజు పేరు, అర్జునుడి పేరు కలిసివచ్చేలా, ‘ధర్మార్జునులు’ అని పేరు పెట్టడం తగిన విధంగానే ఉన్నదని భావిస్తున్నాను.

Exam Tips:

a) ఏ పద్యాలు ధర్మరాజును, ఏవి అర్జునుని వర్ణిస్తున్నాయో సంఖ్యలతో వివరించండి.

 

Question 3: ‘పాండవులు ఉదారస్వభావులు’ సమర్థిస్తూ రాయండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

ఉదార స్వభావము అన్నదానికి దాతృత్వము, దయ, గొప్పతనము, సరళస్వభావము, గాంభీర్యము, నేర్పరిదనము అని అనేక విశేషార్థాలు ఉన్నాయి. పాండవులు ఐదుగురూ పైన చెప్పిన గుణగణాలు కలవారు.
ధర్మరాజు శాంతి దయలు, ఆభరణంగా కలవాడు. సాధు జనులను ఆదరించేవాడు. దానవిద్య యందు ఆసక్తి కలవాడు. యాచకులకు అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేవాడు.
ధర్మరాజు ప్రజల సంపదకు అసూయపడేవాడు కాడు. రాత్రింబగళ్ళు ధర్మాన్ని ఆచరించేవాడు. అన్యాయ ప్రవర్తన అతడి వద్ద లేదు. పండితులకు ధర్మరాజు కొంగు బంగారం వంటివాడు.
పాండవులందరూ యాచకుల దీనత్వాన్ని పోగొట్టే సుగుణం కలవారు. పాండవులు దేవతా వృక్షములయిన కల్పవృక్షాల మాదిరిగా యాచకుల కోర్కెలు తీర్చేవారు. వారంతా పరస్పర ప్రేమతో కలిసిమెలిసి ఉండేవారు.
ఇక అర్జునుడు ధార్మికుడు. అర్జునుడు దయారసంలో శ్రీకృష్ణునికి ప్రాణసఖుడట. ఈ పై గుణాలు పాండవుల యందు ఉండడం చేత, వారిని ఉదార స్వభావులని చెప్పడం సమర్థనీయమే.

Exam Tips:

a) ‘ఉదారం’ అనే పదానికి గల అర్థాలు ముందు చెప్పి, పద్యాల ఆధారాలు ఇవ్వండి.

 

Question 4: మంచివారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను గురించి రాయండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

మంచివారు అంటే సత్పురుషులు అనగా మంచి గుణాలు కలవారు. ప్రభువులు మంచివారిని ఆదరించి, వారికి ఉద్యోగమిచ్చి వారిని పెంచి పోషించాలి. మంచి వారిని ఆదరించి పోషిస్తే, వారు సహృదయులు కాబట్టి, యజమానుల క్షేమానికీ, వారి అభివృద్ధికీ కృషి చేస్తారు.
యోగ్యుడైన రాజు తన విచక్షణ జ్ఞానంతో ప్రజల మంచి చెడులను ముందుగా గుర్తించాలి. మంచివారిని ప్రోత్సహించాలి. చెడును ఖండించాలి.
మంచివారికి ఆశ్రయం కల్పిస్తే వారు ధర్మమార్గంలో సంసారాన్ని పోషించుకుంటారు. లోకోపకారానికి ప్రయత్నిస్తారు. మంచివారినే మనం ఆదరిస్తే లోకంలో దుర్జనులకు ఆశ్రయం లభించదు. ఆ విధంగా లోకంలో దుష్టత్వం దూరం అవుతుంది. మంచిగా ఉందాం. మంచినే చేద్దాం. మంచివారినే ఆదరిద్దాం అనే భావం లోకంలో వ్యాపిస్తుంది.

Exam Tips:

a) మంచివారిని ఆదరిస్తే దుర్జనులకు ఆశ్రయం ఉండదనే ముఖ్యమైన వాదాన్ని రాయండి.

 

Question 5: ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి మీ సొంతమాటల్లో రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

ధర్మరాజు వ్యక్తిత్వము : ధర్మరాజు పాండవులలో పెద్దవాడు. ఇంద్రప్రస్థ పట్టణాన్ని పాలించేవాడు. ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, తాను సహితం ఆచరించేవాడు. శాంతము, దయ, సత్యము అనే సద్గుణాలు గలవాడు. మంచివారిని ఆదరించేవాడు. దానము చేయడంలో ఆసక్తి కలవాడు. ఆయన గొప్ప పరాక్రమంతో ప్రజలు మెచ్చుకొనేటట్లు రాజ్యపాలన చేసేవాడు.
ధర్మరాజు ఇతరుల గురించి రహస్యంగా చెడు చెప్పేవాడు కాడు. ముఖప్రీతి కోసం మాట్లాడేవాడు కాడు. ఎవరికీ చనువు ఇచ్చి, వారిని లోకువ చేసేవాడు కాడు.
మెచ్చుకున్నప్పుడు తృప్తిగా ఇచ్చేవాడు. మొగమాటానికి ఎవరినీ మెచ్చుకొనేవాడు . కాడు. ప్రజల సంపదలకు సంతోషపడేవాడు కాని, అసూయపడేవాడు కాడు.
వెగటుగా ఎవరినీ చూసేవాడు కాడు. అడిగినంత ఇచ్చేవాడు. రాత్రింబగళ్ళు ధర్మార్జన చేసేవాడు. అన్యాయ ప్రవర్తన లేనివాడు.
ధర్మరాజునకు కోపం లేదు. పండితులకు ఆయన కొంగు బంగారం వంటివాడు.
సత్యస్వరూపుడు. ఆయన మనుష్యుల తారతమ్యాలు తెలిసిన స్వతంత్రుడు. కొత్త వారిపై మోజులేనివాడు. అతడు కృతయుగ లక్షణుడు.

Exam Tips:

a) ఆజ్ఞాపరిపాలన వ్రతం, శాంతి, దయ, సత్యం, దానగుణం, అసూయ లేకపోవడం – ఈ గుణాలను వరుసగా రాయండి.

 

Question 6: మీకు తెలిసిన మంచిగుణాలు కలిగిన ఒకరిని గురించి ‘అభినందన వ్యాసం’ రాయండి.

Answer:

మా వరంగల్లు నగరంలో ‘కామేశ మహర్షి’ అనే ఒక సత్పురుషుడూ, దైవభక్తుడూ ఉన్నాడు. ఆయన ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఆయన తల్లిగారి జన్మస్థలము “వరంగల్లు”. కామేశ మహర్షికి తల్లిదండ్రులు ‘బెహరా’ అని పేరు పెట్టారు. బెహరా పదవ తరగతిలో ఉండగా, కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి ఒకసారి వరంగల్లు కళాశాలకు వచ్చారు. ‘బెహరా’ స్నేహితులతో కలసి, స్వామిని దర్శించారు. కంచి స్వామి, చిన్న కామాక్షీదేవి విగ్రహాన్ని బెహరా గార్కి ఇచ్చారు. అంతే, బెహరా కామాక్షీ భక్తుడుగా మారారు.
మహర్షి నగరంలో కామాక్షీ ప్రేమ మందిరాన్ని స్థాపించి, అమ్మవారిని ఆరాధిస్తున్నారు. దిక్కులేని అనాథపిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని, వారందరికీ తండ్రిగా తల్లిగా తానే ఉంటూ, వారిని పెంచి పోషిస్తున్నారు.
కంచి పీఠాధిపతులు ఒకసారి బెహరా గారి ప్రేమమందిరాన్ని దర్శించి, బెహరా గారిని కామేశ మహర్షి అని పిలిచారు. బెహరాగారికి ఎందరో సజ్జనులు చందాలు ఇస్తూ ఉంటారు. కామేశ మహర్షిగారు ఒక ట్రస్టు ఏర్పరచారు. ఆ ధనంతో సుమారు ప్రేమమందిరంలోని నూరు మంది బాలబాలికలకు భోజన వసతి, విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రేమమందిరంలోని బాలబాలికలను మహర్షిగారు ఆదరిస్తున్న పద్ధతి చూస్తే సామాన్యులకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కారణజన్ముడు. కరుణామూర్తి.
మహర్షిగారు అనాథ బాలబాలికలు పెద్దవారయ్యాక, వారికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వారికి పురుళ్ళు పోస్తున్నారు. వారి పిల్లలకు బారసాలలు జరిపిస్తారు. పేరంటాలు ఫెట్టిస్తారు. కన్న తల్లిదండ్రులు సైతం ఇంత ప్రేమతో, ఆదరణతో తమ పిల్లలను చూడలేరు.
చందాల రూపంగా వచ్చిన మొత్తంతో మందిరానికి మంచి భవనం కట్టించారు. పిల్లలకు వసతి సౌకర్యాలు, బట్టలు, పుస్తకాలు ఏర్పాటు చేస్తున్నారు.
కామేశ మహర్షి దయాగుణం మూర్తీభవించిన సత్యస్వరూపులు. ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆర్ద్రత గూడు కట్టుకున్న మహనీయ త్యాగమూర్తి. మహర్షిగారికి పెళ్ళి కాలేదు. పిల్లలు లేరు. అనాథ బాలబాలికలే వారి సంతానము. ఆయన దైవస్వరూపుడు.

Exam Tips:

a) పరిచయం – సేవా కార్యక్రమాలు – గుణాలు – ముగింపు అనే నాలుగు భాగాలు ఉండాలి.
b) మీకు తెలిసిన వ్యక్తి గురించి సొంత ఉదాహరణలు ఇవ్వడం మంచిది.

 

Question 7: పాఠం ఆధారంగా చేమకూర వేంకటకవి గురించి ప్రశంసిస్తూ రాయండి.

Answer:

చేమకూర వేంకటకవి తంజావూరు రాజ్యాన్ని పాలించిన రఘునాథనాయకుని ఆస్థానకవి. ఈ వేంకటకవి, ‘విజయవిలాసము’ అనే గొప్ప చమత్కార ప్రబంధాన్ని రచించి, రఘునాథరాయలకు అంకితం ఇచ్చాడు.
ఈ విజయవిలాస ప్రబంధము తెలుగులో పంచకావ్యాలని పిలువబడే వాటిలో చివరిది. ఉత్తమమైనది. వేంకటకవిని రఘునాథరాయలు మెచ్చుకొని “ప్రతిపద్యమునందు చమత్కృతి కలుగ చెప్పనేర్తువు”, “క్షితిలో నీ మార్గము ఎవరికిం రాదు సుమీ” అని మెచ్చుకున్నాడు. దీనిని బట్టి వేంకటకవి ప్రతి పద్యంలోనూ చమత్కారం ఉండేటట్లు రాస్తాడనీ, వేంకటకవిలా ఇతరులు వ్రాయలేరనీ తెలుస్తుంది.
మన పాఠంలో చమత్కారాలు చూద్దాం. ఈ పద్యాలన్నింటిలో అర్జునుడిని వర్ణిస్తూ చెప్పిన “అతని నుతింపశక్యమె …………… మహీతలమ్మునన్” అనే 9వ పద్యము మేలిరత్నం వంటిది. అర్జునుడు అందంలో జయంతుని తమ్ముడట అంటే సమానం అన్నమాట. దయారసంలో కృష్ణుడికి ప్రాణసఖుడట అంటే కృష్ణునితో సమానం. యుద్ధ విజయంలో ఈశ్వరుడికి ‘ప్రతిజోదు’ అట అంటే సమానమన్న మాట. ఇలా అందంలో జయంతునితో, దయలో కృష్ణుడితో, యుద్ధంలో ఈశ్వరుడితో సమానమని చెప్పి, చివరి పంక్తిలో భూమండలంలో ‘అతనికతండె సాటి’ అని చెప్పాడు.
మొదటలో అర్జునుడిని ముగ్గురితో సమంగా చెప్పి చివరన అర్జునుడికి అర్జునుడే భూమండలంలో సాటి అనడంలో చమత్కారం ఉంది. జయంతుడు, విష్ణుడు, ఈశ్వరుడు అనేవారు భూమండలంలోనివారు కారు. భూమండలంలో అర్జునుడిని మించిన వారులేరని దానిలో చమత్కారం. అదేగాక పురాణాల ప్రకారం జయంతుడు అర్జునుడికి తమ్ముడే, కృష్ణుడు ప్రాణసఖుడే, ఈశ్వరుడు ప్రతిజోదే ఇది మరో చమత్కారం. ఈ పద్యాలు మంచి సమాస గాంభీర్యంతో శబ్దాలంకారాలతో అద్భుతంగా నడుస్తాయి. ‘ఆ పురమేలు, మేలు’ అన్న పద్యం శబ్దాలంకార సుందరము.
‘కోప మొకింత లేదు. బుధకోటికి కొంగు బసిండి’ అన్న పద్యంలో మంచి తెలుగు నుడికారమూ, అందమైన శైలి, ప్రసన్న గంభీరమైన పద్యం నడక కనబడుతుంది. ‘కీర్తి విసరుండు, పాండవాగ్రేసరుండు’, ‘ఏలవలెశాశ్వతము గాగ, నీ ఘనుండె, యేలవలె నన్యులు” అన్నచోట మంచి శబ్దాలంకారాలు ఉన్నాయి.
“పాఱఁ జూచిన బరసేన పాఅఁజూచు
వింటి కొరిగిన రిపురాజి వింటికొరగు” అనే పాదాల్లో అద్భుతమైన యమకాలంకారం ఉంది. మొత్తంపై చేమకూర పాకాన పడిందన్నమాట నిజము. మా పాఠంలో పద్యాలు చేమకూర కవి కవిత్వానికి నిజమైన మచ్చుతునకలు.

Exam Tips:

a) కవి పేరు, ఆస్థానం, ‘విజయవిలాసం’, ‘ప్రతి పద్య చమత్కారం’ అనే విశేషాలను పేర్కొనండి.
b) 9వ పద్యంలోని చమత్కారం (తమ్ముడు, ప్రాణసఖుడు, ప్రతిజోదు) ఒక ఉదాహరణగా చూపండి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: కింది పదాలకు అర్థాలు రాస్తూ సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) సోయగం ఆ) ఏవురు ఇ) వెగటు ఈ) బుధుడు

Answer:

అ) సోయగం = చక్కదనము
వాక్యప్రయోగం: బాలకృష్ణుని సోయగం అపూర్వమైనది.
ఆ) ఏవురు = ఐదు మంది
వాక్యప్రయోగం: మా అన్నదమ్ములు ఏవురూ కలసి పొరుగూరు వెళ్ళాము.
ఇ) వెగటు = వైరస్యము (అసహ్యం)
వాక్యప్రయోగం: ఈ మందు త్రాగడం నాకు వెగటుగా ఉంటుంది.
ఈ) బుధుడు = పండితుడు
వాక్యప్రయోగం: బుధుడు దేశవిదేశాల్లో గౌరవాన్ని పొందుతాడు.

Exam Tips:

a) పదం అర్థం ఒక్క మాటలో, వాక్యం పూర్తిగా సొంతదై ఉండాలి; పాఠంలోని వాక్యాన్ని కాపీ చేయకండి.

 

Question 2: కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి.
అ) తనూజుడు ఆ) నృపాలుడు ఇ) నందనుడు

Answer:

అ) తనూజుడు: తన దేహము నుండి పుట్టినవాడు (కుమారుడు)
ఆ) నృపాలుడు: నరులను పాలించువాడు (రాజు)
ఇ) నందనుడు: సంతోషపెట్టువాడు (కొడుకు)

Exam Tips:

a) పదాన్ని విడదీసి (తనూ + జుడు = దేహమున పుట్టినవాడు) అర్థం చెప్పండి.

 

Question 3: కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) క్షితి ఆ) కుమారుడు ఇ) మొగము ఈ) పురము

Answer:

అ) క్షితి: 1. భూమి 2. ధరణి 3. వసుధ
ఆ) కుమారుడు: 1. తనూజుడు 2. పుత్రుడు 3. కొడుకు
ఇ) మొగము: 1. ముఖము 2. వదనము 3. ఆననము 4. వక్త్రము
ఈ) పురము: 1. నగరం 2. ప్రోలు 3. పట్టణం

Exam Tips:

a) కనీసం మూడేసి పర్యాయపదాలు రాయండి.

 

Question 4: కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాలలోని ప్రకృతి – వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి.
అ) బుద్ధుని యొక్క దమ్మం ఎందరినో ధర్మమార్గంలో నడిపింది.
ఆ) ఉపాధ్యాయుని గౌరవించాలి. ఒజ్జ చూపిన మార్గంలో నడవాలి.
ఇ) ప్రకృతి ఆజ్ఞను ధిక్కరించను. ఇదే నా యొక్క ఆన.
ఈ) తెలుగు భాషను కాపాడుతానని బాస చేస్తున్నాడు.

Answer:

ప్రకృతివికృతి
ధర్మముదమ్మము
ఉపాధ్యాయుడుఒజ్జ
ఆజ్ఞఆన
భాషబాస

Exam Tips:

a) సంస్కృత రూపం (ప్రకృతి) ఎడమ వైపు, తెలుగు రూపం (వికృతి) కుడి వైపు రాయండి.

 

Question 5: కింది వాటిలో నానార్థాలు గుర్తించి, పట్టిక రాయండి.
అ) రాజు: అ) తరువు, చెరువు ఆ) ప్రభువు, ఇంద్రుడు ఇ) చిలుక, పలక ఈ) రాముడు, భీముడు
ఆ) ప్రియం: అ) హెచ్చు, ఇష్టం ఆ) పేరు, ఊర ఇ) చౌక, తేలిక ఈ) బాధ, సంతోషం
ఇ) దిక్కు: అ) దిశ, ఆశ్రయం ఆ) కన్ను, ఆకాశం ఇ) మార్గం, ఆశ్రయం ఈ) తూర్పు, నేర్పు
ఈ) చిత్తము: అ) బొమ్మ, కాగితం ఆ) ఉత్తరం, నది ఇ) ఇష్టం, కష్టం ఈ) మనసు, ఇష్టం

Answer:

పదంనానార్థాలు
రాజుప్రభువు, ఇంద్రుడు
ప్రియంహెచ్చు, ఇష్టం
దిక్కుదిశ, ఆశ్రయం
చిత్తముమనసు, ఇష్టం

Exam Tips:

a) పదానికి ఉన్న రెండు వేర్వేరు అర్థాలు ఉన్న జతను మాత్రమే ఎంచుకోండి.

 

వ్యాకరణాంశాలు – కర్మధారయ సమాసం

Question 1: కింది సమాస పదాలకు విగ్రహవాక్యములు రాసి, కర్మధారయ సమాస సూత్రంతో సరిచూసుకోండి.
అ) సకలజనములు ఆ) ధార్మికుడర్జునుడు ఇ) పరసేన

Answer:

అ) సకలజనములు – సకలమైన జనములు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) ధార్మికుడర్జునుడు – ధార్మికుడైన అర్జునుడు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) పరసేన – పరమైన సేన – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
నియమం: పూర్వపదం విశేషణమై, ఉత్తరపదం నామవాచకమైతే అది ‘విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం’ (ఉదా: ఉదగ్రతేజం = ఉదగ్రమైన తేజం; తొల్లిటిరాజులు = తొలివారలైన రాజులు).

Exam Tips:

a) విశేషణం ముందుంటే పూర్వపదం, వెనుకుంటే ఉత్తరపదం అని గుర్తుంచుకోండి.
b) విగ్రహవాక్యంలో ‘-ఐన / -అయిన’ చేర్చడం కర్మధారయ లక్షణం.

 

Question 2: కింది సమాసపదాలను పరిశీలించి, విగ్రహవాక్యాలు, సమాసం పేర్లు రాయండి.
అ) తమ్ముకుర్రలు ఆ) కార్మికవృద్ధులు

Answer:

అ) తమ్ముకుర్రలు – కుర్రలైన తమ్ములు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
ఆ) కార్మికవృద్ధులు – వృద్ధులైన కార్మికులు – విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం
వివరణ: ‘కుర్రలు, వృద్ధులు’ అనే విశేషణ పదాలు సమాసాలలో ఉత్తరపదాలుగా, ‘తమ్ములు, కార్మికులు’ అనే నామవాచకాలు పూర్వపదాలుగా ఉన్నాయి. నామవాచకం పూర్వపదంగా, విశేషణం ఉత్తరపదంగా ఉంటే అది ‘విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం’.

Exam Tips:

a) విశేషణం రెండో పదమైతే ‘ఉత్తరపద’ అని పేరులో చేర్చండి.

 

Question 3: కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించి రాయండి.
అ) పాదపద్మం ఆ) చారుసంసారం

Answer:

అ) పాదపద్మం – పద్మము వంటి పాదం – ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం
ఆ) చారుసంసారం – చారువైన సంసారం – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

Exam Tips:

a) ఉపమానం (పద్మం) రెండో పదంగా ఉంటే ‘ఉపమాన ఉత్తరపద కర్మధారయం’.

 

ప్రాజెక్టు పని

Question 1: ఉత్తమ పాలనను ‘రామరాజ్యం’తో పోలుస్తారు కదా ! శ్రీరాముని పరిపాలన ఏ విధంగా ఉండేదో తెలుసుకొని నివేదిక రాయండి.

Answer:

1. శ్రీరాముడు రాజ్యమును పాలించేటప్పుడు స్త్రీలకు వైధవ్యము ఉండేది కాదు.
2. ప్రజలకు క్రూరమృగముల బాధ లేదు.
3. ప్రజలకు రోగ భయము లేదు.
4. జనాలకు దొంగల భయము లేదు. ప్రజలకు ఎటువంటి కీడు సంభవింపలేదు. పెద్దలు బ్రతికియుండగా వారి పిల్లలు మృతి పొందలేదు. రామరాజ్యంలో ప్రజలంతా ధర్మనిరతులై ఉండేవారు. వారు సంతోషంతో జీవించేవారు. వారంతా శ్రీరాముడినే ధ్యానిస్తూ, ఒకరితో ఒకరు విరోధములు లేకుండా ఉండేవారు.
రాముని పాలనలో ప్రజలు దీర్ఘాయుర్దాయములతో ఉండేవారు. వారికి ఎక్కువగా సంతానం ఉండేది. వారికి విచారము లేదు. ఆరోగ్య భాగ్యముతో వారు వర్ధిల్లారు. ఆ రామరాజ్యంలో ఎవరినోట విన్నా రాముడి పేరే వినబడేది.
వృక్షములు అన్నీ పుష్పఫల భరితంగా ఉండేవి. సకాలంలో వర్షాలు కురిసేవి. చల్లటిగాలి వచ్చేది. ప్రజలు దురాశాపరులు కారు. ప్రజలు ఎవరిపని వారు చేసుకొనేవారు. ప్రజలు ధర్మవర్తనులు. సత్యమునే పలికేవారు. స్వధర్మాన్నే ఆచరించేవారు.

Exam Tips:

a) రామరాజ్య లక్షణాలను (భయం లేకపోవడం, ధర్మనిరతి, సకాల వర్షాలు) అంశాలవారీగా రాయండి.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 9 Telugu Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna)

Chapter Exercise Answers for Class 9 Telugu

Review comprehensive exercise answers for Class 9 Telugu Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Detailed Answer Guides for Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna)

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 9 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 01 Dharmarjunulu (Dharmaraja and Arjuna) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 9th Class Telugu Lesson 1 ధర్మార్జునులు for the 2026-27 session?

The complete and updated TS 9th Class Telugu Lesson 1 ధర్మార్జునులు is available for free on StudiesToday.com. These solutions for Class 9 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 9th Class Telugu Lesson 1 ధర్మార్జునులు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 9th Class Telugu Lesson 1 ధర్మార్జునులు will help students to get full marks in the theory paper.

Do you offer TS 9th Class Telugu Lesson 1 ధర్మార్జునులు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Telugu. You can access TS 9th Class Telugu Lesson 1 ధర్మార్జునులు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire TS 9th Class Telugu Lesson 1 ధర్మార్జునులు in printable PDF format for offline study on any device.