TS 8th Class Telugu Lesson 8 చిన్నప్పుడే

Step-by-Step Textbook Solutions for Class 8 Telugu Lesson 08 Chinnappude (Childhood)

Access comprehensive textbook solutions for Lesson 08 Chinnappude (Childhood) using the official curriculum guides for Class 8 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Download Lesson 08 Chinnappude (Childhood) Textbook Solutions PDF

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి

Question 1: పై బొమ్మలోని సన్నివేశం ఎక్కడ జరుగుతుండవచ్చు?

Answer:

పై చిత్రంలోని సన్నివేశం గ్రామంలో ఒక చెట్టుకింద రచ్చబండ దగ్గర జరుగుతోంది.

Exam Tips:

a) బొమ్మను జాగ్రత్తగా చూసి (చెట్టు, రచ్చబండ, చుట్టూ గ్రామస్థులు) కనిపించే అంశాల ఆధారంగా ఒక పూర్తి వాక్యంలో జవాబు రాయండి.

 

Question 2: మీ గ్రామంలో ఇట్లాంటి దృశ్యం ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు?

Answer:

మా గ్రామానికి మధ్యలో రావిచెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ సిమెంటుతో దిమ్మ కట్టబడి ఉంది. దానిని అందరూ పెద్ద బజారు సెంటరు (కూడలి) అంటారు.
సాయంకాలానికి రైతులందరూ అక్కడికి చేరి వ్యవసాయపు పనుల గురించి, గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుంటారు. ఆ దృశ్యాన్ని నేను చాలా సార్లు చూశాను.

Exam Tips:

a) ఇది స్వానుభవ ప్రశ్న; ప్రదేశం, సమయం, అక్కడ ఎవరు ఏం చేస్తారు అనే మూడు విషయాలను 2–3 వాక్యాల్లో రాయండి.

 

Question 3: మాట్లాడుతున్న నాయకుడు ఏం చెప్పుతున్నాడని మీరు అనుకుంటున్నారు ?

Answer:

మాట్లాడుతున్న నాయకుడు గ్రామ ప్రజలకు జరుగుతున్న మోసాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉండి ఉంటాడు. గ్రామీయులు పంటల విషయం, పశువుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వం వారికి ఏర్పాటు చేస్తున్న ఆర్థిక సౌకర్యాల గురించి చెబుతూ ఉండవచ్చు. తమ చుట్టూ ఉన్న సమాజంలో ఏమి జరుగుతోందో చెప్పి, గ్రామీయులు కూడా సమాజం మార్పునకు ఎలా కృషిచేయాలో చెబుతూ ఉండవచ్చు.

Exam Tips:

a) ఇది ఊహాత్మక ప్రశ్న; పాఠంలోని నాయకులు మాట్లాడిన విషయాలకు (పెత్తందార్ల మోసాలు, హక్కులు, చైతన్యం) దగ్గరగా జవాబు ఉంచండి.

 

Question 4: స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఇట్లాంటి దృశ్యాలు ఊరిలో కనిపించేవని మీకు తెలుసా ?

Answer:

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలలో చైతన్యం కలిగించడానికి గ్రామాలలో సభలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు ఉద్యమాలు నడిపి గ్రామప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు” అనే నినాదంతో బాలగంగాధర తిలక్ ప్రజలలో పౌరుషాన్ని నింపాడు. ఇవన్నీ మేము పెద్దవాళ్ళు చెప్పగా విన్నాము. మరికొన్ని విషయాలు పుస్తకాలు చదివి తెలుసుకున్నాము.

Exam Tips:

a) తిలక్ నినాదం ‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు’, అల్లూరి సీతారామరాజు వంటి నాయకుల ఉదాహరణలను పేర్కొంటే జవాబు బలంగా ఉంటుంది.

 

ఆలోచించండి – చెప్పండి

Question 1: ఈ “వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు” ఈ వాక్యాన్నిబట్టి మీకేమి అర్థమయింది ?

Answer:

వ్యవసాయం చేసి పంటలు పండించే గ్రామీణులకు నాట్లు వేయడం, కోత కోయడం, కుప్ప నూర్చడం అనే మూడు పనులూ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పంట పండాక దానిని తగిన సమయంలో కోయడానికి ఊళ్ళో జనం అంతా పొలాల్లోనే ఉంటారు. అటువంటి వరికోతల రోజులలో కూడా ప్రజలు పొలాలు విడిచి నాయకుల కోసం వెళ్ళారంటే వారికి ఆ నాయకుల మీద ఉన్న అభిమానం, గౌరవం తెలుస్తున్నాయి.

Exam Tips:

a) ‘అయినా’ అనే పదం వైరుధ్యాన్ని సూచిస్తుంది; ఈ వాక్యం నాయకులపై ప్రజల అభిమానాన్ని, గౌరవాన్ని తెలుపుతుందని స్పష్టంగా చెప్పండి.

 

Question 2: ఈ ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడమంటే ఏమిటి ?

Answer:

ఊళ్ళోకి ఎవరైనా గౌరవనీయులు వస్తే వారికి ఎదురువెళ్ళి వాయిద్యాలతోనో, పూలదండలతోనో స్వాగతం పలికి ఊరిలోకి తీసుకురావడం మర్యాద. దీనినే ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడం అంటారు.

Exam Tips:

a) ‘ఎదుర్కొని తీసుకొనిపోవడం’ అంటే ఏమిటో అర్థం చెప్పి, ఉదాహరణగా వాయిద్యాలు, పూలదండలతో స్వాగతం పలకడాన్ని పేర్కొనండి.

 

Question 3: “పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు” కదా! వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి ?

Answer:

తమ గ్రామంలోని పెత్తందారుడు ప్రతిరోజూ ప్రతివస్తువునూ తమ దగ్గరి నుంచి అన్యాయంగా అపహరిస్తాడు. కానీ నాయకుడు మాత్రం దుర్మార్గుడైన ఆ పెత్తందారును ఎదిరించాడు. గ్రామంలో పెత్తందారులు నిందలు లేకుండా చేశాడు. నేరాలు మోపడం, లంచాలు గుంజడం లేకుండా చేశాడు. నాయకుని కృషివల్లనే గ్రామంలో అందరూ గౌరవంగా, ఆకలి బాధలు లేకుండా బతుకుతున్నారు. పైగా నాయకుడు పిల్లలందరినీ చేరదీసి వారి బాగోగులను తెలుసుకుంటాడు. వారిని ప్రేమతో పలకరిస్తాడు. అందువల్లనే పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు.

Exam Tips:

a) కారణాలను వరుసగా రాయండి: పెత్తందార్ల అన్యాయాలను ఆపడం, గౌరవం, ఆకలి బాధలు తీర్చడం, పిల్లలను ప్రేమగా పలకరించడం.

 

Question 4: ఈ పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకున్నారు?

Answer:

నాయకులు వచ్చింది తమను బతికించడానికి అని పిల్లలు చెప్పడం ద్వారా ఆ నాటి గ్రామాలలో పెత్తందారీల దుర్మార్గాలు తెలిశాయి. ఏదో సాకుతో బర్రెను బందెల దొడ్లో పెట్టించడం, కోడెదూడ చేలో పడిందని పదిరూపాయలు వసూలు చేయడం, దున్నపోతు బుస్సు మన్నదని, మోతాడు లేదని ముప్పయి రూపాయలు గుంజడం, సర్కారీ రకం కట్టలేదని నాయనకు బండలెత్తడం వంటి దౌర్జన్యాల ద్వారా ఆ నాటి గ్రామ ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో తెలుస్తుంది. అంతేగాక చేలో కట్టెపుల్లు ఏరుకుంటే ఆడ కూలీలను కొట్టడం. అడ్డువచ్చిన భర్తల్ని విరగబాదడం మొదలైన విషయాల ద్వారా ఆ నాటి గ్రామప్రజల దయనీయ దుర్భరస్థితి తెలుస్తున్నది.

Exam Tips:

a) పాఠంలోని ఉదాహరణలు (బర్రెను బందెల దొడ్లో పెట్టించడం, కోడెదూడకు పది రూపాయలు, పన్ను కట్టలేదని బండలెత్తడం) తప్పక ప్రస్తావించండి.

 

Question 5: “మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా” అని నాయకుడు అనడంలోని ఉద్దేశమేమి?

Answer:

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలలో దయనీయ పరిస్థితిని ఉద్దేశించి నాయకుడు ఈ మాట అన్నాడు. ఏరోజు కారోజున వచ్చే కూలీ డబ్బులతో పేదలు పొట్ట పోషించుకుంటారు. పని లేకపోతే పస్తు పడుంటారు. లేకపోతే అప్పులు చేస్తారు. చేసిన అప్పుతీర్చలేక నానా అవస్థలూ పడతారు. రోగాలు వచ్చి పడతాయి. ఈ అప్పులు, రోగాలు, కష్టాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. అందువల్లనే నాయకుడు అట్లా అన్నాడు.

Exam Tips:

a) ‘రెక్కాడితే గానీ డొక్కాడని’ అనే జాతీయ అర్థాన్ని చెప్పి, అప్పులు–రోగాలు–కష్టాలు తరతరాలుగా కొనసాగుతాయనే భావాన్ని వివరించండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: ‘చిన్నప్పుడే’ కథ చదివారు కదా! దీని ఆధారంగా స్వాతంత్ర్యానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.

Answer:

స్వాతంత్ర్యం రాకముందు గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. గౌరవ మర్యాదలు ఉండేవికాదు.
పెత్తందార్లు, అగ్రకులాల వాళ్ళు పేదవారిని, బలహీన వర్గాల వారిని దోపిడీ చేసేవారు. స్త్రీలను నీచంగా చూడడం, అనరాని మాటలు అనడం చేసేవారు. పేద ప్రజలు గ్రామాలలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడేవారు.
స్త్రీలు కూలికి పోయి చేలో కట్టెలు ఏరుకుంటే ఎందుకు ఏరుకున్నారని సిగపట్టుకొని కొట్టేవారు. సర్కారుకు పన్నులు కట్టలేదని నెత్తిమీద బండరాళ్ళు ఎత్తి మోయించేవారు. పిల్లలు బడికెళుతుంటే వాళ్ళను బెదిరించేవారు. పశువులు చేలో పడి గడ్డి తిన్నాయని వాటిని బందెల దొడ్లో పెట్టించేవారు. లేకపోతే డబ్బులు వసూలు చేసేవారు. స్వాతంత్ర్యం రాకముందు మన గ్రామాలలో పరిస్థితి పైవిధంగా ఉండేదని ఈ పాఠం చదివిన తరువాత అనిపించింది.

Exam Tips:

a) పాఠంలోని ఘటనలను ఉదాహరణలుగా తీసుకుని, ధన–మాన–ప్రాణాలకు రక్షణ లేని స్థితిని మీ సొంత మాటల్లో రాయండి.

 

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారో చర్చించండి: వీండ్లందరెవరో ఎరికేనా?

Answer:

తమ గ్రామానికి వెంకట్రావు, ఇతర నాయకులు వస్తున్నారని తెలిసిన గ్రామంలోని పిల్లలు వారు ఉన్నచోటికి వెళ్ళారు. నాయకులు పిల్లల్ని ప్రేమగా పలకరించారు. పిల్లలు వారికి తాము కోసుకున్న ఉసిరికాయలు పంచారు. అప్పుడు వెంకట్రావు నాయకుల్ని చూపించి. వీండ్లందరెవరో ఎరికేనా ? అని పిల్లల్ని ప్రశ్నించాడు.

Exam Tips:

a) సందర్భ ప్రశ్నల్లో ‘ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో’ అనే మూడు అంశాలూ జవాబులో ఉండాలి; ఇక్కడ వెంకట్రావు పిల్లలతో అన్నాడు.

 

Question 2: కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారో చర్చించండి: నేను సంగిశెట్టి కొడుకును.

Answer:

ఒక నాయకుడు ఒక పిల్లవాణ్ణి “మీరెవరబ్బాయి!” అని ప్రశ్నించాడు. అపుడు ఆ అబ్బాయి “నేను సంగిశెట్టి కొడుకును” అని బదులిచ్చాడు.

Exam Tips:

a) ఈ మాట ఒక పిల్లవాడు నాయకుల ప్రశ్నకు ఇచ్చిన జవాబు; అతని అమాయకత్వాన్ని సూచించే ఈ సందర్భాన్ని ఒక్క వాక్యంలో స్పష్టంగా చెప్పండి.

 

Question 3: కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారో చర్చించండి: మన సంతానమంతా హాయిగా బతుకుతారు.

Answer:

మనం ఈరోజు స్వార్థరహితంగా ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బతుకుతారని ఒక నాయకుడు మరొక నాయకునితో అన్నాడు.

Exam Tips:

a) ఇది ఒక నాయకుడు మరొక నాయకునితో అన్న మాట; స్వార్థరహిత కృషి వల్ల భావితరం సుఖపడుతుందనే భావాన్ని చెప్పండి.

 

Question 4: కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
నిజాం రాష్ట్రంలో సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేయబడిన తెలంగాణ ప్రజల్లో వారి మాతృభాష, సంస్కృతి పట్ల గాఢాభిమానం కలిగించటంలో ఆనాడు తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు ఎంతో దోహదం చేశాయి. తెలంగాణలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించటం ద్వారా వారి జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయుల్లో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణరెడ్డి ముఖ్యులు. జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమాన్ని తెలంగాణలో అంటే అప్పటి నిజాం రాష్ట్రంలో ప్రారంభించాడు.
ప్రశ్నలు :
అ. అణచివేతకు గురైన వారెవరు ?

Answer:

నిజాం రాష్ట్రంలో అణచివేతకు గురైన వారు తెలంగాణ ప్రజలు.

Exam Tips:

a) గద్యభాగం ఆధారిత ప్రశ్నకు పేరాలోని వాక్యాల నుంచే జవాబు తీసుకోండి; ‘ఎవరు’ అంటే వ్యక్తులు/సమూహం పేరు మాత్రమే రాయండి.

 

Question 5: వాళ్ళు ఏఏ విషయాల్లో అణచివేతకు గురి అయ్యారు ?

Answer:

వాళ్ళు సాంస్కృతికంగా, భాషాపరంగా అణచివేతకు గురి అయ్యారు.

Exam Tips:

a) ‘ఏఏ విషయాల్లో’ అంటే రెండు అంశాలు ఉండాలి: సాంస్కృతికంగా, భాషాపరంగా.

 

Question 6: తెలంగాణాలో ఆంధ్రోద్యమం ఎందుకు విస్తరించింది ?

Answer:

తెలంగాణాలో తెలుగు ప్రజలకు తెలుగు భాషపై, సంస్కృతిపై ఆసక్తి కలిగించడానికి ఆంధ్రోద్యమం విస్తరించింది.

Exam Tips:

a) ‘ఎందుకు’ ప్రశ్నకు ‘…కోసం/…కు’ అనే కారణ వాక్యంతో ముగించండి; పేరాలోని పదాలనే వాడండి.

 

Question 7: తెలంగాణ ప్రజల్లో భాషాసంస్కృతులపట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?

Answer:

తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలు.

Exam Tips:

a) ‘సంస్థలు’ అడిగినందున మూడింటినీ రాయండి: తెలుగు గ్రంథాలయాలు, పఠనాలయాలు, తెలుగు పత్రికలు.

 

Question 8: తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన కొందరు మహనీయులు ఎవరు ?

Answer:

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయి, రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి, రావి నారాయణ రెడ్డి మొదలైన వారు తెలంగాణాలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషిచేసిన మహనీయులు.

Exam Tips:

a) పేరాలో ఇచ్చిన ఐదుగురు మహనీయుల పేర్లనూ రాయండి; పేరు స్పెల్లింగ్ తప్పులు లేకుండా చూసుకోండి.

 

III. స్వీయరచన – ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: వెంకట్రావు స్వభావాన్ని తెల్పండి.

Answer:

వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్త. తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక వారిలో చైతన్యం తీసుకొనిరావడానికి కృషిచేసిన మహానుభావుడు.
ఆయనకు ప్రజలు హృదయపూర్వకంగా దండం పెట్టేవారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షకునిగా పనిచేశాడు. పెత్తందార్లు చేసే ఆగడాలను ఎదుర్కొని వారు చిన్న, పెద్దలను గౌరవించే విధంగా మార్పు తెచ్చాడు.
వెంకట్రావు కృషి ఫలితంగా పెత్తందార్లు స్త్రీలను దుర్భాషలాడడం, నీచంగా ప్రవర్తించడం లాంటివి పోయాయి. ప్రజలంతా విరామం లేకుండా కూలి పనిచేసినా కడుపు నిండా తిండిలేకపోవడం చూసి వెంకట్రావు పెత్తందార్లపై తిరగబడి పేదలు కడుపునిండా అన్నం తినేటట్లుగా చేసిన మహనీయుడు. మనిషిని మనిషిగా చూడాలనే తత్త్వం కలవాడు వెంకట్రావు. అందుకే అటువంటి మంచి స్వభావం గల వెంకట్రావును గ్రామపెద్దలు, పిన్నలు కూడా గౌరవిస్తూ దేవుడిలా చూసుకునేవారు.

Exam Tips:

a) స్వభావాన్ని చెప్పేటప్పుడు గుణాలను (ధైర్యం, దేశభక్తి, సేవాభావం, మానవత్వం) వాటికి ఆధారమైన ఘటనలతో కలిపి ఐదు వాక్యాల్లో రాయండి.

 

Question 2: వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలేవి?

Answer:

వెంకట్రావు వంటి యువకుల వల్ల ప్రజలలో చైతన్యం కలుగుతుంది. ‘దండం – నమస్కరించడం’ అనే పదానికి సరైన అర్థం లభిస్తుంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కలుగుతుంది. ప్రజలపై పెత్తందార్లు వేసే నిందలు తగ్గుతాయి. లంచాలు తీసుకొనే వారి సంఖ్య తగ్గిపోతుంది. సమాజంలో ధనం ఆధారంగా ఎక్కువ, తక్కువ అనే భావనపోయి, మనుషుల్ని మనుషుల్లా చూడడం జరుగుతుంది.
పేద ప్రజలకు కడుపునిండా తిండి దొరుకుతుంది. పెత్తందార్లు ప్రజలను హింసించకుండా గౌరవ భావంతో చూస్తారు. నాయకులు పిల్లలు, పెద్దల కష్ట నష్టాలను తెలుసుకొని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. పేద ప్రజలకు మేలు చేస్తారు. వెంకట్రావు వంటి యువకులవల్ల సమాజానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

Exam Tips:

a) ప్రయోజనాలను వరుసగా పాయింట్లుగా రాయండి: చైతన్యం, రక్షణ, నిందలు/లంచాలు తగ్గడం, సమానత్వం, కడుపునిండా తిండి.

 

Question 3: వెంకట్రావుతో నేటి యువతను పరిశీలించి, పోల్చండి.

Answer:

మన దేశ స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న కాలం నాటి వ్యక్తి వెంకట్రావు.
వెంకట్రావులో దేశభక్తి, సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలను రూపుమాపాలనే కోరిక అధికంగా కనిపిస్తున్నాయి. తనకు దేశం ఏమిచ్చింది అని చూడక, తాను దేశానికి ఏమి చేయాలి అని ఆలోచించిన వ్యక్తి వెంకట్రావు. నేటి యువకుల్లో అలా ఆలోచించే వారు తక్కువ మందే ఉన్నారు.
ఎక్కువ మందికి తాము, తమ కుటుంబం బాగుంటే చాలనే స్వార్థం పెరిగిపోయింది. సోమరితనం పెరిగిపోయింది. సమాజంలోని అవినీతిని దౌర్జన్యాలను, దురాచారాలను వెంకట్రావులా ఎదిరించాలనే ధోరణి, తన తోటి వారికి సాయపడాలనే సేవాభావం నేటి యువతలో తగ్గాయి. పెడధోరణులు, క్రమశిక్షణ లేకపోవడం నేటి యువతలో కనబడుతున్నాయి.

Exam Tips:

a) పోలిక ప్రశ్నలో రెండు వైపులా రాయండి: వెంకట్రావు లక్షణాలు (దేశభక్తి, సేవ), నేటి యువత పరిస్థితి; చివర్లో ఒక సూచన చేర్చండి.

 

Question 4: “మనం ఈ రోజు స్వార్థ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే, మన సంతానం అంతా హాయిగా బతుకుతారు.” అని ఒక నాయకుడు ఎందుకు అని ఉంటాడు ?

Answer:

ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలిసి రంగాపురానికి వెళ్లాడు. అక్కడ కొంతమంది పిల్లలు తమ ఊరి పటేలు, దొర, ఇతర పెత్తందార్లు తమను, తమ తల్లిదండ్రులను ఎంతగా బాధపెడుతోందీ నాయకులకు చెప్పారు. హాయిగా, సంతోషంగా ఎదగాల్సిన బాలలు అంత చిన్న వయసులోనే తమ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే, సమాజ పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని నాయకులకు అర్థమైంది.
వారి పసిమనస్సులు కష్టాల కారణంగా గాయపడితే, సమాజానికి ప్రమాదం. అలాంటి కష్టాలేవి తెలియకుండా పిల్లలు ఎదగాలంటే, స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పెత్తందార్ల ఆగడాలను ఆపే నాయకులు రావాలి. వారు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. నాయకులు చేసే కృషి వల్లే సమాజంలో జరిగే అన్యాయాలు తగ్గి, పిల్లలు ఎటువంటి బాధలు, కష్టాలు లేకుండా ఎదుగుతారని నాయకుడన్నాడు.

Exam Tips:

a) కారణం–ఫలితం క్రమంలో రాయండి: పిల్లల కష్టాలు విన్న నాయకుల అనుభూతి, ఆ తర్వాత ఈ మాట చెప్పడానికి గల ఉద్దేశం.

 

Question 5: గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌష్ట్యాలను వివరించండి.

Answer:

గ్రామంలోని పెత్తందార్లకూ, దొరలకూ దయాదాక్షిణ్యాలు లేవు. అన్యాయంగా బర్రెను బందెల దొడ్లో పెట్టించారు. కోడెదూడ చేలో పడ్డదని ఊరి పటేలు పదిరూపాయలు వసూలు చేశాడు. దున్నపోతు బుస్సుమన్నదనీ, దానికి మోతాడు లేదనీ మాలిపటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు. వెంకట్రామ పంతులు పెట్టిన బడిలోకిపోతే దెబ్బలు కొడతానని దొర గుమస్తా బెదిరించాడు. కూలికి పోయి వస్తూ చేలో కట్టెపుల్లు ఏరుకున్నందుకు స్త్రీ అని కూడా చూడకుండా ఒక తల్లిని సిగపట్టుకొని కొట్టాడు దొర శేగిదారు. అడ్డువెళ్ళిన ఆమె భర్త చెయ్యి విరగగొట్టాడు కూడా. ఈ విధంగా గ్రామంలోని పెత్తందార్ల, దొరల దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది.

Exam Tips:

a) పెత్తందార్ల దౌష్ట్యాలను పాఠంలోని ఘటనలతో (బందెలదొడ్డి, జరిమానాలు, గుమస్తా బెదిరింపు, స్త్రీపై దాడి) క్రమంగా చెప్పండి.

 

Question 6: గ్రామస్తుల కష్టాలను పిల్లలు నాయకులకు ఎలా వివరించారు?

Answer:

వెంకట్రావు, ఇతర నాయకులూ వచ్చి పిల్లలను కుశల ప్రశ్నలతో ప్రేమగా పలకరించారు. ఒక పిల్లవాడు వాళ్ళమ్మ పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రాత్రి బువ్వెట్లా వండిందో వివరించాడు. అయ్య అన్నం వండుతుంటే గిర్దావరు బరులకు పోవాలని అతణ్ణి పట్టుకుపోయాడు. పొయ్యిమీది అన్నం చెడిపోయింది. అయినా దాంట్లోనే మీరం, ఉప్పుపోసుకుని నీళ్ళుపోసుకొని తిన్నానన్నాడు ఆ పిల్లవాడు. ఒకసారి వాళ్ళమ్మ పసుల జంగల్లో నుంచి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకున్నాడనీ, ఆ తట్ట ఇప్పటిదాక ఇవ్వలేదని ఒక పిల్లవాడు చెప్పుకున్నాడు. పాపం! చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి బట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో కదా! అని నాయకులు బాధపడ్డారు.

Exam Tips:

a) పిల్లలు చెప్పిన ఘటనలను పాఠంలోని క్రమంలోనే రాయండి: కట్టెలు లేని పొయ్యి, గిర్దావరు పట్టుకుపోవడం, ఇనుపతట్ట గుంజుకోవడం.

 

III. స్వీయరచన – పది వాక్యాల్లో జవాబు రాయండి

Question 1: ‘చిన్నప్పుడే’ కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా! నాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా ? కారణాలు ఏమిటి ?

Answer:

‘చిన్నప్పుడే’ కథా కాలంలో పటేళ్ళ దొరల దౌర్జన్యాలు ఎక్కువగా ఉండేవి. ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవు. 1947 సం||లో మనకు స్వాతంత్ర్యం వచ్చాక, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన దేశానికి రూపొందించిన రాజ్యాంగం ప్రజలంతా సమానమేనని, కుల, మత, వర్గ విచక్షణ పనికిరాదని తేల్చి చెప్పింది. చట్టం ముందు అంతా సమానమేనని తేల్చింది. కొన్ని వర్గాల వారికి ప్రత్యేక రక్షణలు కల్పించింది. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించింది. దీంతో సమాజంలో చైతన్యం తెచ్చింది.
పటేలు, దొర పెత్తనాలు తగ్గుముఖం పట్టాయి. నేడు ప్రతి గ్రామంలో విద్యాలయం స్థాపించడం వల్ల, విద్యా విధానంలో మార్పులు రావడం వల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న పిల్లలు కూడా విద్యావంతులై తమ హక్కులను గుర్తించడం మొదలుపెట్టారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేసి పెత్తందారీతనాన్ని అణచివేశాయి. అయితే ఇంకా మార్పు రావలసి ఉంది. ఢిల్లీ అత్యాచార సంఘటనలు అప్పుడప్పుడు వెలుగుచూస్తున్నా పెత్తందార్ల దౌర్జన్యాలు, దోపిడీల వల్ల సమాజంలో ఇంకా ఆనాటి పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయనిపిస్తున్నా, చాలా వరకు పరిస్థితులు మారాయన్నది నిజం.

Exam Tips:

a) పది వాక్యాల జవాబులో ‘నాటి పరిస్థితి – మార్పునకు కారణాలు (రాజ్యాంగం, విద్య, చట్టాలు) – ఇంకా మిగిలిన సమస్యలు’ అనే మూడు భాగాలు ఉంచండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి: ఈ పాఠం ఆధారంగా చేసుకొని, మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.

Answer:

రామాపురం మారుమూల చిన్న పల్లెటూరు. అన్ని వర్గాల వాళ్ళు కలిసి మొత్తం 350 కుటుంబాలున్నాయి. ఆ ఊళ్ళో జానయ్య అనే ఒక మోతుబరి రైతు ఉన్నాడు. అదే ఊళ్ళో రామయ్య అనే 100 ఎకరాలున్న రైతు ఉన్నాడు. రామయ్య దగ్గర వ్యవసాయం పనులు చేయడానికి, ఇంకా ఇతర పనులు చేయడానికి మొత్తం పదిమంది పనివాళ్ళున్నారు. రామయ్య పనివాళ్లను బాగా చూసుకుంటాడు.
జానయ్యకు తల పొగరు ఎక్కువ.
పనిచేసే వాళ్ళను చాలా హీనంగా చూస్తాడు. అందుకే ఆయన ఇంట్లో పనివాళ్ళు ఎక్కువ కాలం పనిచేయరు. గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ అవసరమొచ్చినా రామయ్య ముందుంటాడు. అందుకే అంతా రామయ్యను గౌరవిస్తారు. ఆయన గ్రామానికి గత 30 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. ఈ మధ్యనే రామయ్య తన పొలంలో 40 ఎకరాల పొలాన్ని కొంత రైతులకు, కొంత ఇండ్ల స్థలాలకు ఇచ్చాడు.
ప్రతి గ్రామంలో ఇటువంటి వారుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.
గ్రామాభివృద్దే దేశాభివృద్ధి కదా! అదే విధంగా 5 ఎకరాల స్థలంలో పాఠశాల నిర్మాణం చేయించాడు. ఒకప్పుడు ఆ గ్రామ విద్యార్థులు దాదాపు 5 కి.మీ. నడచి వెళ్ళి చదువుకోవలసిన పరిస్థితి ఉండేది. గ్రామంలో మంచినీటి సౌకర్యాన్ని కలిగించాడు. పంచాయితీ భవనాన్ని కట్టించాడు. రోడ్ల నిర్మాణం చేయించాడు.
రామయ్యను చూసి ఇప్పుడు జానయ్య కూడా మారాడు.

Exam Tips:

a) కథలో ప్రారంభం, సంఘటన, ముగింపు ఉండాలి; ఇక్కడ మంచి–చెడు పాత్రల పోలికతో సందేశాన్ని స్పష్టంగా చూపండి.

 

Question 2: కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి: వెంకట్రావు వలె గ్రామం బాగుకోసం పాటుపడుతున్న వాళ్ళు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.

Answer:

ఆర్మూర్, తేది : XX.XX.XXXX పేద కుటుంబంలో, మురికివాడలో జన్మించిన ‘స్వామి’ బాల్యంలో ఎంతో దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు. ఎంతో కష్టపడి చదువుకున్నాడు. చిన్న వయస్సులోనే ఉద్యోగం సంపాదించడం అతని ప్రతిభకు నిదర్శనం. స్వామి మా గ్రామ ప్రజలకు తలలో నాలుకలా ఉంటాడు. మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తనే ముందుంటాడు. యువకులను, విద్యావంతులను కలిసి ‘గాంధీ యువసేన’ అనే సంఘం ఏర్పాటు చేశాడు.
వారంతా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవం, నవంబరు 14 బాలల దినోత్సవం వంటి వాటిల్లో బాల బాలికలకు వివిధ రకాల పోటీలు ముఖ్యంగా వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ మా గ్రామ పాఠశాలలో నిర్వహిస్తారు. బాల బాలికలను చైతన్యవంతులను చేయడమే అతని ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇవే కాకుండా పోలియో చుక్కలు వేసేటప్పుడు పసిపిల్లల తల్లులను చైతన్యపరుస్తాడు.
వివిధ రకాలైన సేవా కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ వారితో మాట్లాడి గ్రామంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయించాడు. మొక్కల అవసరం, వినియోగం గురించి అందరికీ చెప్పి ఇండ్లో, రహదారులపై, పొలాల గట్లపై విరివిగా మొక్కలను నాటించేటట్లు చేశాడు. మన దేశ సమైక్యత, సమగ్రతలను గురించి, అవినీతి, లంచగొండితనం గురించి వివరిస్తూ ప్రజలలోనూ, విద్యార్థులలోనూ అవగాహన కలిగిస్తాడు. స్వామిలాంటి వారు ప్రతి గ్రామంలో ఉంటే దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని నా భావన.
స్వామికి నా అభినందనలు
ఇట్ల రవికుమార్, ఆర్మూర్.

Exam Tips:

a) అభినందన పత్రంలో స్థలం–తేదీ, వ్యక్తి సేవల వివరణ, అభినందన, చివర రాసిన వారి పేరు అనే నిర్మాణం పాటించండి.

 

Question 3: కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి: పాఠం ఆధారంగా వెంకట్రావు, నాయకులు, బాలుర మధ్య జరిగిన సన్నివేశాన్ని సంభాషణల రూపంలో రాయండి.

Answer:

సంభాషణ
ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకట్రావు నాయకులతో కలసి రంగాపురానికి బయలుదేరాడు.
వెంకట్రావు : (నాయకులతో) మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. మనం అలా వెళితే గ్రామ ప్రజలకు నిరుత్సాహం కలుగుతుంది. వాళ్ళు మంగళవాయిద్యాలతో మనకు స్వాగతం పలికి తీసుకువెళతారు.
గ్రామ యువకుడు : (బాటసారితో) ఆంధ్రనాయకులు వచ్చారని గ్రామంలో తెలియజెయ్యి.
బాలకులు : మన గ్రామానికి నాయకులు వచ్చారట మనందరం ఉసిరికాయలు ఏరుకొని అక్కడకు వెళదాం పదండి.
నాయకులు : రండి ! పిల్లలూ ! రండి.
నాయకుడు 1 : నీ పేరేంటి?
ఒక బాలుడు : లింగయ్య
రెండో బాలుడు : మేము ముందు లింగా అని పిలిచేవాళ్ళం. బడిలో అందరం లింగయ్య ! అని పిలుస్తున్నాం.
నాయకుడు 2 : మీరు ఎవరు ?
లింగయ్య : మేము బట్టలుతుకుతాం.
నాయకుడు 3 : నాకు ఒక ఉసిరికాయ ఇస్తావా ?
లింగయ్య : ఇదిగో. తీసుకోండి.
బాలలందరూ (పిల్లలందరూ) : ఇవిగోండయ్యా ! ఇవన్నీ మీకే !
వెంకట్రావు : వీళ్ళంతా ఎవరో మీకు తెలుసా ?
పిల్లలు (బాలురు) : వీళ్ళంతా మమ్మల్ని బతికించడానికి వచ్చినవాళ్ళు.
నాయకుడు : మీకేం మీరు బాగానే ఉన్నారు కదా !
బాలుడు – 1 : ఏం బాగు బాబూ ! మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు.
బాలుడు – 2 : మా అన్న కోడెదూడ చేలో పడిందని పటేలు పది రూపాయలు వసూలు చేశాడు.
బాలుడు – 3 : మా దున్నపోతు బుస్సుమన్నదని మాలి పటేలు ముప్పయి రూపాయలు తీసుకున్నాడు.
బాలుడు – 4 : సర్కారు పన్ను కట్టలేదని మా నాయనకు బండలెత్తారు.
బాలుడు – 5 : వెంకట్రావు పంతులు పెట్టిన బడికిపోతే దెబ్బలు కొడతానని మా దొర గుమాస్తా బెదిరించాడు.
బాలుడు – 6 : మా అమ్మ కూలి పనికిపోయి కట్టెపుల్లు ఏరుకుందని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డంపోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి శేగిదారు.
నాయకుడు : నువ్వు ఎవరబ్బాయివి ?
బాలుడు : నేను సంగిశెట్టి కొడుకును.
నాయకుడు : మీకేమయినా కష్టాలున్నాయా ?
బాలుడు : ఏమో ? నాకేం ఎరుక ? మా నాయనకెరుక. (నాయకులందరూ ఒకరితో ఒకరు)
పాపం ! ఈ చిన్నపిల్లలు ఇప్పటినుంచే కష్టాలు పడాల్సి వచ్చింది. మనందరం స్వార్థం లేకుండా ఉంటే భావితరం పిల్లలు హాయిగా బతుకుతారు.

Exam Tips:

a) సంభాషణ రాసేటప్పుడు పాత్ర పేరు తర్వాత ‘:’ పెట్టి, ప్రతి వాక్యాన్ని కొత్త పంక్తిలో రాయండి; పాఠంలోని ఘటనలను యథాతథంగా వాడండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అర్థం తెలుసుకొని రాయండి (వాక్యాన్ని తిరిగి రాయండి): వెంకట్రావుకు పెట్టే దండంలో పెత్తందార్లకు పెట్టే దండంలో తేడా కనిపించింది.

Answer:

దండం = నమస్కారం, వందనం
తిరిగి రాయుట : వెంకట్రావుకు పెట్టే నమస్కారంలో, పెత్తందార్లకు పెట్టే నమస్కారంలో తేడా ఉంది. వెంకట్రావుకు పెట్టే వందనంలో, పెత్తందార్లకు పెట్టే వందనంలో తేడా ఉంది.

Exam Tips:

a) ‘తిరిగి రాయుట’లో గీత గీసిన పదం స్థానంలో అర్థాన్ని పెట్టి, మిగిలిన వాక్యాన్ని మార్చకుండా రాయండి.

 

Question 2: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అర్థం తెలుసుకొని రాయండి (వాక్యాన్ని తిరిగి రాయండి): ఆ నాయకుడు పిల్లలకు అవ్యాజ బంధువైపోయాడు.

Answer:

అవ్యాజ = కపటం లేనిది
తిరిగి రాయుట : పసిపిల్లలు కల్లాకపటంలేని వారు. ఆ నాయకుడు పిల్లలకు కపటం లేని బంధువైపోయాడు.

Exam Tips:

a) ‘అవ్యాజ’ అంటే కపటం లేనిది; పర్యాయపదం వచ్చేలా వాక్యం మార్చి రాస్తే అర్థం చెడిపోకుండా చూసుకోండి.

 

Question 3: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అర్థం తెలుసుకొని రాయండి (వాక్యాన్ని తిరిగి రాయండి): సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు.

Answer:

రకం = పైకం, ధనం
తిరిగి రాయుట : సర్కారీ పైకం కట్టలేదని పిల్లవాని తండ్రికి బండలెత్తారు. సర్కారీ ధనం కట్టలేదని పిల్లవాని తండ్రికి బండలెత్తారు.

Exam Tips:

a) ‘రకం’ ఇక్కడ పైకం/ధనం అనే అర్థంలో వాడిన నానార్థం; సందర్భానికి సరిపోయే అర్థాన్నే ఎంచుకోండి.

 

Question 4: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అర్థం తెలుసుకొని రాయండి (వాక్యాన్ని తిరిగి రాయండి): ఆ బువ్వలోనే మిరం, ఉప్పుపోసుకొని పిల్లవాడు తిన్నాడు.

Answer:

మిరం : మిరపపొడి
తిరిగి రాయుట : ఆ బువ్వలోనే మిరపపొడి, ఉప్పు పోసుకొని పిల్లవాడు తిన్నాడు.

Exam Tips:

a) ‘మిరం’ అంటే మిరపపొడి/కారం; మాండలిక పదాల అర్థాలను పాఠం చివరి పదార్థాలతో సరిచూసుకోండి.

 

Question 5: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అర్థం తెలుసుకొని రాయండి (వాక్యాన్ని తిరిగి రాయండి): కష్టాల సంగతి నాయనకు ఎరుక.

Answer:

ఎరుక = జ్ఞానం, తెలుసు
తిరిగి రాయుట = కష్టాల సంగతి నాయనకు తెలుసు.

Exam Tips:

a) ‘ఎరుక’ అంటే తెలుసు/జ్ఞానం; వాక్యంలో ఆ పదం స్థానంలో ‘తెలుసు’ పెట్టి రాయండి.

 

Question 6: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి (ఉదా: దండం = నమస్కారం, అంజలి): పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం.

Answer:

విలువ = ధర, వెల, మూల్యం
1. వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.
2. ఆ పుస్తకం వెల కట్టలేనంత గొప్పది.
3. ఆ వస్తువు మూల్యం ఎంత ?

Exam Tips:

a) పర్యాయపదం అంటే అదే అర్థం వచ్చే పదం; ఇచ్చిన పదానికి రెండు పదాలు రాసి, ఒక్కొక్కదానికి సొంత వాక్యం కూడా రాయండి.

 

Question 7: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి: పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు.

Answer:

కుప్పలు = రాసులు, పోగులు, గుంపులు
1. రైతులు ధాన్యాన్ని రాసులుగా పోశారు.
2. మొక్కజొన్న కండెలు పోగులుగా ఉన్నాయి.
3. నాయకుని ఉపన్యాసం వినడానికి జనం గుంపులుగా చేరారు.

Exam Tips:

a) ఒక్కో పర్యాయపదంతో వాక్యం రాసేటప్పుడు ఆ పదం అర్థం మారకుండా చూసుకోండి.

 

Question 8: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి: కుటుంబ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి.

Answer:

అధ్వాన్నం = అమార్గం, తప్పుదారి
1. ఆ గ్రామానికి వెళ్ళే దారి అమార్గంగా ఉంది.
2. విద్యార్థులు తప్పుదారిలో నడవకూడదు.

Exam Tips:

a) ‘అధ్వాన్నం’ అంటే చెడ్డ స్థితి/అపమార్గం; వాక్యాలు ఈ అర్థానికి తగినట్లు ఉండాలి.

 

Question 9: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి: పిల్లలందరూ గభాలున అతని వద్దకు చేరుకున్నారు.

Answer:

గభాలున = శీఘ్రంగా, తొందరగా, త్వరగా
1. ప్రమాదం జరిగిన చోటుకు శీఘ్రంగా అందరూ చేరారు.
2. బడి గంట వినపడి పిల్లలు తొందరగా పరుగెత్తారు.

Exam Tips:

a) ‘గభాలున’ అంటే వెంటనే/త్వరగా అనే అర్థం; వాక్యాల్లో కాలం–వేగం సూచించే సందర్భాన్ని వాడండి.

 

Question 10: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే మరి రెండు పదాలను రాయండి: నీ చేతులకు వెండి కడియాలున్నాయి.

Answer:

వెండి = రజతము, శ్వేతము
1. మా చెల్లి కాలి పట్టీలు రజతముతో చేసినవి.
2. శ్వేతము స్వచ్ఛతకు మారు పేరు.

Exam Tips:

a) ‘వెండి’కి రజతము, శ్వేతము అనే పర్యాయపదాలు ఉన్నాయి; రంగును సూచించే వాక్యంలో శ్వేతము ఉపయోగించవచ్చు.

 

Question 11: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి పాఠం ఆధారంగా ప్రకృతి పదం రాయండి: నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు. (మొగం – వికృతి)

Answer:

ముఖం (ప్రకృతి)

Exam Tips:

a) వికృతి పదానికి ప్రకృతి పదం సంస్కృత మూలానికి దగ్గరగా ఉంటుంది: మొగం → ముఖం.

 

Question 12: కింది వాక్యంలో గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి: అతడు పట్టలేని సంతసంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు. (సంతసం – వికృతి)

Answer:

సంతోషం (ప్రకృతి)

Exam Tips:

a) సంతసం → సంతోషం; ప్రకృతి రూపంలో ‘ష’ ఉంటుందని గుర్తుంచుకోండి.

 

Question 13: కింది వాక్యంలో గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి: మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుకంగా ఉంటారు. (సుకం – వికృతి)

Answer:

సుఖం (ప్రకృతి)

Exam Tips:

a) సుకం → సుఖం; ‘ఖ’ వర్ణం మహాప్రాణం అని గమనించండి.

 

Question 14: కింది వాక్యంలో గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి: గారవం పొందాలంటే మంచి పనులు చేయాలి. (గారవం – వికృతి)

Answer:

గౌరవం (ప్రకృతి)

Exam Tips:

a) గారవం → గౌరవం; ‘గౌ’ అనే సంయుక్త అచ్చు సరిగా రాయండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది పట్టికలోని ఖాళీలను పూరించండి. (సమాసపదాలు: రాజ్యకాంక్ష, విజయగర్వం, అష్టదిక్కులు, బలరామకృష్ణులు, ప్రజల భాష, అక్రమము)

Answer:

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
రాజ్యకాంక్షరాజ్యము నందు కాంక్షసప్తమీ తత్పురుష సమాసం
విజయగర్వంవిజయం వల్ల గర్వంపంచమీ తత్పురుష సమాసం
అష్టదిక్కులుఎనిమిది అయిన దిక్కులుద్విగు సమాసం
బలరామకృష్ణులుబలరాముడును, కృష్ణుడునుద్వంద్వ సమాసం
ప్రజల భాషప్రజల యొక్క భాషషష్ఠీ తత్పురుష సమాసం
అక్రమముక్రమము కానిదినఞ్ తత్పురుష సమాసం

Exam Tips:

a) సమాసం పేరు కోసం విగ్రహవాక్యంలోని విభక్తి ప్రత్యయం (నందు → సప్తమి, వల్ల → పంచమి, యొక్క → షష్ఠి) చూడండి; సంఖ్య పూర్వపదం ఉంటే ద్విగు, ‘–యు’ తో కలిసిన జంట పదాలైతే ద్వంద్వం.

 

Question 2: కింది పదాలను కలిపి రాయండి: (అ) అప్పుడు + అప్పుడు (ఆ) ఏమి + ఏమి (ఇ) ఊరు + ఊరు (ఈ) ఇంట + ఇంట (ఉ) ఓరి + ఓరి

Answer:

(అ) అప్పుడు + అప్పుడు = అప్పుడప్పుడు
(ఆ) ఏమి + ఏమి = ఏమేమి
(ఇ) ఊరు + ఊరు = ఊరూరు
(ఈ) ఇంట + ఇంట = ఇంటింట
(ఉ) ఓరి + ఓరి = ఓరోరి
ఇవి ఆమ్రేడిత సంధికి ఉదాహరణలు. సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అవుతుంది.

Exam Tips:

a) ఆమ్రేడిత సంధి: ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు; అచ్చు పరమైతే సంధి జరుగుతుందని సూత్రంతో చెప్పండి.

 

Question 3: ఈ కింది పదాలను చదవండి: (అ) పగలు + పగలు = పట్టపగలు (ఆ) చివర + చివర = చిట్టచివర. పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి.

Answer:

పగలు + పగలు = పట్టపగలు అవుతోంది. అంటే మొదటి పదంలోని పగలులో ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ పోయి దానికి బదులుగా ‘ట్ట’ వచ్చింది. అప్పుడు పట్టపగలు అయింది. అట్లనే చిట్టచివర పదం కూడా ఏర్పడింది.
మరికొన్ని ఉదాహరణలు: నడుమ + నడుమ = నట్టనడుమ, కొన + కొన = కొట్టకొన, కడ + కడ = కట్టకడ. ‘ట్ట’ను ద్విరుక్తటకారం అంటారు.
సూత్రం : ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్తటకారం వస్తుంది.

Exam Tips:

a) కడాదులకు ఆమ్రేడితం పరమైతే మొదటి అచ్చు తర్వాతి అక్షరాలు పోయి ‘ట్ట’ (ద్విరుక్తటకారం) వస్తుంది: పగలు+పగలు = పట్టపగలు.

 

Question 4: కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి: బయలు + బయలు

Answer:

బయలు + బయలు = బట్టబయలు
బయలు + బయలు – అని ఉన్నప్పుడు మొదటి పదమైన బయలులోని ‘బ’ తప్ప తక్కిన ‘యలు’ లోపించాయి. ఆ లోపించిన ‘యలు’ స్థానంలో ద్విరుక్తటకారం అంటే ‘ట్ట’ వచ్చింది. అప్పుడు బట్టబయలు అనే రూపం ఏర్పడింది.

Exam Tips:

a) బయలు+బయలు = బట్టబయలు; లోపించే అక్షరాలు (యలు), వచ్చే ఆదేశం (ట్ట) రెండూ చెప్పండి.

 

Question 5: కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి: అంత + అంత

Answer:

అంత + అంత = అంతంత
అంత + అంత – అని ఉన్నప్పుడు మొదటి పదంలో చివరి ‘అ’ (త్ + అ) ఉన్నది. తరువాతి పదంలో మొదటి ‘అ’ ఉన్నది. అంటే ‘అ + అ’ అని ఉండగా మొదటి పదంలోని చివరి ‘అ’ లోపించి రెండవ పదంలో మొదట ఉన్న ‘అ’ మిగిలి ‘అంతంత’ అనే రూపం ఏర్పడింది.

Exam Tips:

a) అంత+అంత = అంతంత; ఇక్కడ మొదటి పదం చివరి ‘అ’ లోపించిందని వివరించండి.

 

Question 6: కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి: తుద + తుద

Answer:

తుద + తుద = తుట్టతుద
తుద + తుద – అని ఉండగా అందులోని మొదటి తుదలో మొదటి అక్షరము మాత్రం మిగిలింది. దాని మీద ఉన్న ‘ద’ లోపించింది. లోపించిన ‘ద’ స్థానంలో ద్విరుక్తటకారం ‘ట్ట’ వచ్చింది. అప్పుడు తుట్టతుద అనే రూపం ఏర్పడింది.

Exam Tips:

a) తుద+తుద = తుట్టతుద; ‘ద’ లోపించి ‘ట్ట’ వచ్చిందని స్పష్టంగా రాయండి.

 

Question 7: కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి: ఎన్ని + ఎన్ని

Answer:

ఎన్ని + ఎన్ని = ఎన్నెన్ని
ఎన్ని + ఎన్ని – అని ఉండగా అందులోని మొదటి పదం చివర ఉన్న ‘ఇ’ (న్.న్ + ఇ), తరువాతి పదం మొదట ఉన్న ‘ఎ’ల స్థానంలో అంటే ‘ఇ + ఎ’లలో ‘ఇ’ లోపించి ‘ఎ’ మాత్రం మిగిలింది. అప్పుడు ‘ఎన్నెన్ని’ అనే రూపం ఏర్పడింది.

Exam Tips:

a) ఎన్ని+ఎన్ని = ఎన్నెన్ని; ‘ఇ+ఎ’ లలో ‘ఇ’ లోపించి ‘ఎ’ మిగిలిందని చెప్పండి.

 

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

Question 1: మీ తాత / అమ్మమ్మ / నాయనమ్మలను అడిగి ఒక కథ చెప్పించుకుని వాళ్ళు చెప్పినట్లుగానే రాసి నివేదికను తరగతి గదిలో ప్రదర్శించండి.

Answer:

(అ) ప్రాథమిక సమాచారం :
(1) ప్రాజెక్టు పని పేరు : పెద్దలు చెప్పిన కథ వాళ్ళు చెప్పిన రీతిలో రాయడం.
(2) సమాచారాన్ని సేకరించిన విధానం : తాత/నానమ్మ/అమ్మమ్మ చెప్పగా విని
(ఆ) నివేదిక : రామయ్యశెట్టి 3 వరాల కథ
మా 8వ పాఠం ‘చిన్నప్పుడే’లో తాత/నానమ్మ/అమ్మమ్మలచే కథ చెప్పించుకుని చెప్పిన రీతిలోనే రాయాలని ప్రాజెక్టుపని ఉన్నదని, ఒక కథ చెప్పమని మా నానమ్మను అడగగా తన వంటపని ముగిశాక, భోంచేశాక నన్ను దగ్గర కూర్చుండబెట్టుకుని ఈ కథ నాకు చెప్పింది. పూర్వం రంగాపురంలో రామయ్యశెట్టి అనే పరమ పిసినారి ఉండేవాడు. అతడు మిక్కిలి దురాశ గలవాడు. ఒకరోజు భగవంతుడు భిక్షకుని రూపంలో ‘అయ్యా భిక్షాందేహి’ అని అతని దుకాణం ముందుకు వచ్చి అడగ్గా కసురుకొని పంపివేశాడు.
భిక్షకుని రూపంలో ఆ దేవుడు రామయ్య పక్కింటి వాడైన పేరిశాస్త్రి ఇంటికి వెళ్ళగా, వారు ఆ భిక్షకుణ్ణి సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టారు. భిక్షకుడు వారిని ఆశీర్వదించి బయటకు వెళ్ళగానే పేరయ్య పాత ఇంటి స్థానంలో పెద్ద భవనము, పరిచారకులు, ఇంటినిండా ధన, ధాన్య రాశులు ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసిన రామయ్యశెట్టి ఆ వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదని గ్రహించి, పరుగు పరుగున వెళ్ళి అతని కాళ్ళపైపడి అనుగ్రహించమనగా, ‘నీవు మొదట కోరిన 3 కోరికలు నిజమౌతాయి వెళ్ళు’ అని భగవంతుడు అతన్ని పంపివేశాడు. 3 కోరికలు ఏం కోరుకోవాలని ఇంటి వెనుక రాయిపై కూర్చుని రామయ్యశెట్టి తీక్షణంగా ఆలోచిస్తుండగా నెత్తిపై కాకి రెట్ట వేసింది. ఛీ, కాకి చచ్చిపోను అన్నాడు రామయ్యశెట్టి. మొదటి వరం ప్రకారం కాకి చచ్చిపోయింది.
మిట్టమధ్యాహ్నం అయ్యింది, భర్త ఇంకా లోనికి రావడం లేదని భార్య ‘ఏమండీ, లోపలికి రారా’ అంటే, నేను రాను అన్నాడు రామయ్యశెట్టి. అలా రెండవ వరం నిష్ప్రయోజనం అయ్యింది. రాయికే అతడు అతుక్కుపోయాడు. ఎండ తీవ్రత పెరుగుతోంది. రాయి వేడెక్కి కాలడం వల్ల దానిపై కూర్చోలేక తను రాయి నుండి విడివడాలని 3వ వరం కోరుకుని ఇంట్లోకి వచ్చాడు. ఇలా అతని 3 వరాలు నిష్ఫలమయ్యాయి.
(ఇ) ముగింపు / అభిప్రాయం :
దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ పనికిరాదు. జనులు మితిమీరిన సంపాదన మోజులో పడి, చిన్న చిన్న ఆనందాలకు, ఆత్మీయుల స్నేహపూర్వక పలకరింపులకు దూరం కారాదు. కేవలం సంపాదనే కాకుండా ఆనందంగా జీవించడం కూడా ఎంతో ముఖ్యం. అత్యాశకు పోయి రామయ్య తన 3 వరాలలో ఏ ఒక్క వరాన్నీ ఉపయోగించుకోలేకపోయాడు.

Exam Tips:

a) ప్రాజెక్టు నివేదికలో ప్రాథమిక సమాచారం, నివేదిక, ముగింపు/అభిప్రాయం అనే మూడు భాగాలు తప్పనిసరి; పెద్దలు చెప్పిన తీరులోనే సరళమైన భాషలో రాయండి.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 8 Telugu Lesson 08 Chinnappude (Childhood)

Chapter Exercise Answers for Class 8 Telugu

Access structured TS Board textbook solutions for Lesson 08 Chinnappude (Childhood). Designed in alignment with the latest academic curriculum for Class 8 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Detailed Answer Guides for Lesson 08 Chinnappude (Childhood)

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Complete Preparation Kit for Class 8 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 08 Chinnappude (Childhood) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 8th Class Telugu Lesson 8 చిన్నప్పుడే for the 2026-27 session?

The complete and updated TS 8th Class Telugu Lesson 8 చిన్నప్పుడే is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 8th Class Telugu Lesson 8 చిన్నప్పుడే as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu Lesson 8 చిన్నప్పుడే will help students to get full marks in the theory paper.

Do you offer TS 8th Class Telugu Lesson 8 చిన్నప్పుడే in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Telugu. You can access TS 8th Class Telugu Lesson 8 చిన్నప్పుడే in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire TS 8th Class Telugu Lesson 8 చిన్నప్పుడే in printable PDF format for offline study on any device.