TS 8th Class Telugu Lesson 9 అమరులు

Solutions for Class 8 Telugu: Lesson 09 Amarulu (Martyrs)

Access comprehensive textbook solutions for Lesson 09 Amarulu (Martyrs) using the official curriculum guides for Class 8 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 8 Telugu Solutions: Lesson 09 Amarulu (Martyrs)

Access the complete solution PDF for Class 8 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

బొమ్మను చూడండి – ఆలోచించి చెప్పండి

Question 1: బొమ్మలో ఏం జరుగుతున్నది?

Answer:

బొమ్మలో అమరవీరుల స్తూపం ఉన్నది. దాని ముందు ప్రజలు నిలబడి అమరవీరులకు వందన సమర్పణ చేస్తున్నారు.

Exam Tips:

a) బొమ్మలో కనిపించే స్తూపం, నివాళులర్పిస్తున్న ప్రజలను గమనించి ఒక పూర్తి వాక్యంలో జవాబు రాయండి.

 

Question 2: స్థూపాలను ఎందుకు కట్టిస్తారు ?

Answer:

గొప్పవారికి గుర్తుగా, వారు చేసిన పనులకు గుర్తుగా స్థూపాలను కట్టిస్తారు.

Exam Tips:

a) స్తూపాల ఉద్దేశం స్మరణ; ‘గుర్తుగా’, ‘స్ఫూర్తికి’ అనే భావాలు జవాబులో ఉండేలా చూడండి.

 

Question 3: స్తూపం వద్ద ఎందుకు నివాళులు అర్పిస్తారు ?

Answer:

జాతి కోసం ప్రాణాలర్పించిన అమరులను గుర్తు చేసుకుంటూ, తాము కూడా వారి బాటలో నడుస్తామని ఆశిస్తూ వారిని గౌరవించటానికి స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు.

Exam Tips:

a) నివాళి అర్పించడానికి మూడు కారణాలు చెప్పవచ్చు: స్మరించుకోవడం, కృతజ్ఞత, వారి బాటలో నడవాలనే సంకల్పం.

 

Question 4: అమరవీరులకు ఎట్లా నివాళులు అర్పించాలో మీకు తెలుసా ?

Answer:

నిటారుగా నిలబడి తల నిటారుగా ఉంచి కుడిచేయి కుడి కణత మీద ఉంచి గౌరవ పూర్వకంగా నివాళులు అర్పించాలి. కొంతమంది కవితల ద్వారా గాని, పాటల ద్వారా గాని, ఇతర కళల ద్వారాగాని నివాళులు అర్పిస్తారు..

Exam Tips:

a) నివాళి అర్పించే పద్ధతులను (నిటారుగా నిలబడటం, కవితలు–పాటలు) వరుసగా రాయండి; స్వంత అనుభవం చేర్చవచ్చు.

 

ఆలోచించండి – చెప్పండి

Question 1: “మాకై అసువులు బాసిన” అనటంలో మాకు అంటే ఏవరు ?

Answer:

మాకై అసువులు బాసిన అంటే ‘మా కోసం ప్రాణాలర్పించిన’ అని అర్థం. మాకు అంటే తెలంగాణ ప్రజలు.

Exam Tips:

a) ‘మాకై’ అంటే ‘మా కోసం’ అని అర్థం చెప్పి, ‘మాకు’ అంటే తెలంగాణ ప్రజలు అని స్పష్టంగా రాయండి.

 

Question 2: “జోహార్లు అంటే ఏమిటి ? ఎవరికి జోహార్లు సమర్పిస్తాం ?” ఎందుకు సమర్పించాలి ?

Answer:

జోహార్లు అంటే నమస్కారాలు. ప్రజల సమస్యల కోసం పోరాడి మరణించిన వారికి, ప్రజాసేవలో మరణించిన వారిని, అమర జవానులకు జోహార్లు సమర్పిస్తాం.
మనకోసం మన బాగు కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు గనుక వారిపట్ల కృతజ్ఞతా సూచకంగా జోహార్లు సమర్పించాలి. (నేటి కాలంలో జోహార్లు అంటే చనిపోయిన వారికి ఇచ్చే శ్రద్ధాంజలి అని పొరబడుతున్నారు. జోహార్లు బ్రతికున్న వారికీ చెబుతారు. జోహారు శిఖిపింఛమౌళి… అని ప్రసిద్ధ గేయం కూడా ఉంది).

Exam Tips:

a) ప్రశ్నలో మూడు భాగాలున్నాయి (జోహార్లు అంటే, ఎవరికి, ఎందుకు); మూడింటికీ విడివిడిగా జవాబు ఉండాలి.

 

Question 3: “కడుపు పంటల – కడుపు మంటల” – దీనిని గురించి మీకేమి అర్థమయింది ?

Answer:

కడుపు పంటలు అంటే ప్రేమతో కడుపార కన్న సంతానం. కడుపు మంటలు మనసుకు కలిగిన గాయాలు, కడుపార కన్న సంతానాన్ని కోల్పోవడం. ఒక తల్లి కన్న బిడ్డను బ్రతికించడానికి మరొక తల్లి కన్నబిడ్డ బలియై పోయాడు అని ఈ వాక్యానికి అర్థం.

Exam Tips:

a) ‘కడుపు పంటలు’ = కన్న సంతానం, ‘కడుపు మంటలు’ = సంతానాన్ని కోల్పోయిన బాధ; రెండింటి అర్థాన్ని వేరుగా చెప్పండి.

 

Question 4: ఈ “పాపాత్ముల పరిపాలన” అని అనడంలో కవి ఉద్దేశం ఏమై ఉంటుంది ?

Answer:

పాపాత్ములు అంటే పాపం చేసినవారు. దుర్మార్గాలు చేసేవారంతా పాపాత్ములే. అటువంటి దుష్టులు దేశాన్ని పాలిస్తుంటే ప్రజల బాధలు వర్ణించరానివి. అందుకే పాపాత్ముల పరిపాలన అంతం చేస్తాం అన్నాడు కవి.

Exam Tips:

a) ‘పాపాత్ములు’ అంటే దుర్మార్గులు; కవి వారి పాలన అంతం కావాలని ఆకాంక్షించాడని ముగించండి.

 

Question 5: “మీ యడుగుజాడల్లో మాయడుగుల నుంచేస్తాం!” దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?

Answer:

మంచివారు తన తరువాతి వారికి ఆదర్శమయ్యేలా ఎలా ఎలా నడుచుకున్నారో అలాగే మేము నడుచుకుంటాం అని అర్థం. మీ అడుగు జాడల్లో మా అడుగు వేసి నడుస్తాం అంటే మిమ్మల్ని మేం అనుసరిస్తాం అని అర్థం.

Exam Tips:

a) ‘అడుగుజాడల్లో నడవడం’ అనే జాతీయానికి అనుసరించడం అనే అర్థం; దీనిని వాక్యంలో వివరించండి.

 

Question 6: ఈ ‘అమృతవర్షం కురిపించడం అంటే ఏమిటి ?

Answer:

అమృతం అంటే చావులేనిది. చనిపోయిన వారు మనకిక కనిపించరు. అమృతం తాగటం వల్ల అసలు చావే ఉండదు. దేశం కోస ప్రాణత్యాగం చేసిన వారు కనిపించకుండా పోయినా వారి ఆత్మల మీద అమృతం చల్లితే మన దగ్గరే ఉన్నట్లు ఉంటుందని భావం.

Exam Tips:

a) ‘అమృతవర్షం’ అంటే చావు లేకుండా చేసే వాన, అంటే వీరుల ఆత్మలకు శాంతి కలిగించడం అనే భావం చెప్పండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన ఉద్యమం గురించి మాట్లాడండి.

Answer:

తెలంగాణా రాష్ట్రం కోసం ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంటే 60 ఏళ్ళుగా ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించింది. కానీ అది చల్లారిపోయింది. ఆ తర్వాత గత 15 ఏళ్ళగా జరిగిన ఉద్యమం 2009లో పల్లెపల్లెలకూ పాకి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యేలా చేసింది.

Exam Tips:

a) ఉద్యమ నేపథ్యాన్ని కాల క్రమంలో రాయండి: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, 1969 ఉద్యమం, 2009 తర్వాతి మలిదశ, 2014లో రాష్ట్ర ఆవిర్భావం.

 

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి: సకలజనుల సమూహములు.

Answer:

పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం పాటుపడి ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తున్న ప్రజలు పలికిన మాటలు ఇవి.
అర్థం : మాన్యులు, ధన్యులు, శివ స్వరూపులైన అమర వీరులారా! మీకు ప్రజలంతా మంచి మనసుతో నివాళులు అర్పిస్తున్నాము.

Exam Tips:

a) సందర్భ ప్రశ్నలో ‘పరిచయం, సందర్భం, అర్థం’ అనే మూడు భాగాల క్రమాన్ని పాటించండి; కవి పేరు, పాఠం పేరు తప్పక రాయండి.

 

Question 2: కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి: క్రాంతి విడదు శాంత పడదు.

Answer:

పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించిన వీరుల రక్తం ఏరులై ప్రవహించింది. ఈ దుర్మార్గుల పాలన అంతమయ్యే వరకు ఈ ప్రవాహం ఆగదు అని ప్రజలు అమరుల ముందు ప్రతిజ్ఞ చేశారు.
అర్థం : ఈ రక్త ప్రవాహం ఆగదు. శాంతించదు.

Exam Tips:

a) ‘క్రాంతి’ అంటే విప్లవం; రక్త ప్రవాహం పాపాత్ముల పాలన అంతమయ్యే వరకు ఆగదనే భావాన్ని సందర్భంలో చెప్పండి.

 

Question 3: కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి: రుధిరసిక్త యమపాశం.

Answer:

పరిచయం : ఈ వాక్యం ఆచార్య రుక్నుద్దీన్ రాసిన అమరులు పాఠంలోనిది.
సందర్భం : అమర వీరులు నుదుట ధరించిన రక్తతిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది. అధికారుల మదాన్ని అణచివేస్తుంది. అని ప్రజలు అమరులకు జోహారులర్పిస్తూ పలికారు.
అర్థం : వీరులు ధరించిన రక్తతిలకం అధికారుల పాలిట నెత్తుటితో తడిసిన యమపాశమౌతుంది.

Exam Tips:

a) ‘రుధిరసిక్త యమపాశం’ = రక్తంతో తడిసిన యముని పాశం; అధికార గర్వితులకు ఇది శిక్షగా మారుతుందని వివరించండి.

 

Question 4: కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి: అమృతవర్షం కురిపిస్తాం.

Answer:

పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. రాసిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : ప్రజలు అమర వీరుల బాటలో నడుస్తామని, వారివలనే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించియైనా ప్రత్యేక తెలంగాణా సాధిస్తామని, వారి ఆత్మలకు శాంతి కలిగిస్తామని ప్రతిజ్ఞ చేసిన సందర్భం.
అర్థం : వీరుల ఆత్మలు శాంతించేలా అమృతం వానగా కురిపిస్తాము.

Exam Tips:

a) ‘అమృతవర్షం కురిపిస్తాం’ ప్రజల ప్రతిజ్ఞలోని చివరి భాగం; వీరుల ఆత్మలకు శాంతి కలిగిస్తామనే అర్థం రాయండి.

 

Question 5: కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి: రక్తం తోడ ఇచ్చేస్తాం.

Answer:

పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : అమర వీరులకు జోహార్లు చేస్తూ ప్రజలు పలికిన మాటలివి. అమర వీరుల త్యాగాలతో ప్రజలందరికీ ప్రోత్సాహం లభించింది. వారిలో స్ఫూర్తి నింపింది. అని చెప్పిన సందర్భంలోనిదీ వాక్యం.
అర్థం : మాతృభూమి రక్షణ కోసం మీరిచ్చిన స్ఫూర్తితో రక్తం ధారపోయమన్నా సంతోషంగా ధార పోస్తాం.

Exam Tips:

a) ‘రక్త తర్పణం’ అంటే రక్తాన్ని ధారపోయడం; ప్రజలు వీరుల స్ఫూర్తితో త్యాగానికి సిద్ధమనే భావాన్ని చెప్పండి.

 

Question 6: కింది వాక్యాలు చదువండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి, వాటి సందర్భం రాయండి: బాహాటంగా సాధిస్తాం.

Answer:

పరిచయం : ఈ వాక్యం అమరులు పాఠంలోనిది. రచించిన కవి ఆచార్య రుక్నుద్దీన్.
సందర్భం : తెలంగాణా విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు జోహారులర్పిస్తూ ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ పలికిన మాటలివి.
అర్థం : లోకమంతా తెలిసేలా ప్రత్యేక తెలంగాణా సాధిస్తాం.

Exam Tips:

a) ‘బాహాటంగా’ అంటే అందరికీ తెలిసేలా/బహిరంగంగా; ప్రజలు బహిరంగంగా ప్రతిజ్ఞ చేసిన సందర్భాన్ని రాయండి.

 

Question 7: కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2009 నాటికి మహోద్యమమయింది. ఈ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు, పిల్లల నుండి పెద్దల వరకు సకల జనులు పాల్గొన్నారు. ఉద్యమం శాంతియుతంగా నడవాలని ఉద్యమ నాయకత్వం కోరింది. తెలంగాణకై ప్రజలందరు ఆత్మవిశ్వాసంతో పోరాడాలని, అధైర్యంతో బలిదానాలు చేయవద్దని చెప్పింది.
ఆ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయం సిద్ధించింది. ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించింది. తెలంగాణలోని ఆబాలగోపాలం ఘనంగా సంబురాలు జరుపుకున్నది. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి అందరం కృషి చేయాలి. అదే మనం అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి.
ప్రశ్నలు :
అ. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది ?

Answer:

తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది.

Exam Tips:

a) పేరా ఆధారిత ప్రశ్నలకు పేరాలోని వాక్యాలనే వాడండి; ‘ఎందుకు’ ప్రశ్నకు కారణాన్ని స్పష్టంగా ఒక వాక్యంలో చెప్పండి.

 

Question 8: ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు ?

Answer:

ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు అందరూ పాల్గొన్నారు.

Exam Tips:

a) ‘ఎవరెవరు’ అడిగారు కాబట్టి పేరాలో చెప్పిన అన్ని వర్గాలను (విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, నాయకులు) రాయండి.

 

Question 9: ఉద్యమం పట్ల నాయకత్వానికి ఉన్న ఆలోచన ఏమిటి ?

Answer:

ఉద్యమం శాంతియుతంగా నడవాలని, ఆత్మహత్యలు వంటి ప్రాణాలు పోగొట్టుకునే పనులు చేయకుండా ఆత్మవిశ్వాసంతో ఉద్యమం నడపాలని నాయకత్వం కోరింది.

Exam Tips:

a) నాయకత్వం కోరినవి రెండు: ఉద్యమం శాంతియుతంగా నడవడం, ఆత్మవిశ్వాసంతో పోరాడుతూ బలిదానాలు చేయకపోవడం.

 

Question 10: ఆబాలగోపాలం అంటే అర్థమేమిటి ?

Answer:

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అని అర్థం.

Exam Tips:

a) ‘ఆబాలగోపాలం’ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ; ఇలాంటి సమాస పదాలకు అర్థం ఒక్క వాక్యంలో రాయండి.

 

Question 11: అమరవీరులకు మనమిచ్చే నివాళి ఏమిటి ?

Answer:

తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటమే మనం అమర వీరులకిచ్చే నివాళి.

Exam Tips:

a) నివాళి ఏమిటో పేరాలోని చివరి వాక్యం నుంచే రాయండి: సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం.

 

III. స్వీయరచన – ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: అమరవీరులను కవి “తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!” అని ఎందుకు సంబోధించారు ?

Answer:

అమరవీరులను కవి ‘తెలంగాణ గర్భమ్మున గలిగిన శ్రీ రుద్రులారా!’ అని సంబోధించాడు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీరశైవం వ్యాప్తిలో ఉండేది. శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపులుగా భావిస్తారు. అందుకే అక్కడి ప్రజలనందరినీ కవి రుద్రులుగానే భావించి శ్రీరుద్రులారా అని సంబోధించాడు. ఓరుగల్లును పాలించిన కాకతీయులందరి పేర్లోనూ ‘రుద్ర’ అనే పేరు చేరుతుంది.
రుద్రదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. రుద్రుడు అంటే కోపం, పరాక్రమానికి గుర్తు కనుక కవి అమర వీరులను శ్రీరుద్రులారా అని సంబోధించాడు.

Exam Tips:

a) రుద్రుడు కోపం, పరాక్రమాలకు గుర్తు; కాకతీయుల పేర్లలో ‘రుద్ర’ ఉండటాన్ని ఉదాహరణగా చెప్పడం మర్చిపోవద్దు.

 

Question 2: అమరవీరుల పట్ల మనమెట్లాంటి గౌరవాన్ని చూపాలి ?

Answer:

మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు మన మందరం కలిసి నివాళులర్పించాలి. వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకొని మనం వారి బాటలోనే నడవాలి. మనదేశాన్ని గౌరవించాలి. మన తోడివారిని కాపాడటానికి ఎటువంటి త్యాగనికైనా సిద్ధపడాలి. అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగించాలి. మనకు సిద్ధించిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యకూడదు. మన రాజ్యం అభివృద్ధి కోసం మనమందరం కలిసి కృషి చెయ్యాలి. సుఖశాంతులతో ఐకమత్యంతో జీవించాలి. ఇదే మన అమర వీరులు కోరినది. అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుంది.

Exam Tips:

a) అమరవీరుల పట్ల గౌరవాన్ని చర్యలుగా రాయండి: నివాళి, వారి బాటలో నడవడం, స్వేచ్ఛను దుర్వినియోగం చేయకపోవడం, ఐకమత్యం.

 

Question 3: అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది ?

Answer:

అధికారాంధులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అధికారమదంతో వారి కళ్ళు మూసుకుపోయి ఇతరులను తమ బానిసలుగా చూస్తారు. వారి స్వేచ్ఛను హరిస్తారు. వారి ప్రవర్తన, ఆహార విహారాలు, జీవితం తమ ఆధీనంలో ఉంచుకుంటారు. వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తారు. ఇక చదువు సంధ్యల గురించి చెప్పవలసిన పనిలేదు. అటువంటి వారి అధికారాన్ని సహించకూడదు. ఆత్మవిశ్వాసంతో వారిని ఎదుర్కొని తమ హక్కులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదే.

Exam Tips:

a) ‘అధికారాంధులు’ = అధికార గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వారు; వారి ప్రవర్తనను లక్షణాల వారీగా వరుసగా రాయండి.

 

Question 4: కవి ప్రతిజ్ఞలోని విషయాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు ?

Answer:

కవి ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరతామని బాహాటంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు తెలంగాణా వీరులు’ అని రాశాడు. సుమారు పన్నెండు సంవత్సరాల నించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం సాగుతూనే ఉన్నది. ఎప్పటికప్పుడు అధికారులు మంత్రులు ఏవేవో కారణాలు చెబుతూ వారి ఉద్యమాన్ని నీరుకారుస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటే తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో సమృద్ధంగా జీవించాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాల్సిందే. అప్పుడే ఏ అభివృద్ధియైనా సాధ్యమౌతుంది. కాబట్టి తెలంగాణా సాధించే తీరతామని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

Exam Tips:

a) కవి ప్రతిజ్ఞ = ప్రత్యేక తెలంగాణను బహిరంగంగా సాధిస్తామనే సంకల్పం; ఎందుకు అవసరమో కారణాలతో వివరించండి.

 

Question 5: కవి అమరులు అనే కవితలో అమరవీరులను ఎలా సంబోధించాడు ? ఎందుకు ?

Answer:

కవి ఈ కవితలో అమరవీరులను ‘మాన్యులార; ధన్యులార, ప్రబలులార, శ్రీరుద్రులార, ఘనులార’ అని సంబోధించాడు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులార’ అని సంబోధించాడు. అమరవీరులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం దీక్ష వహించారు. ఇది చాలా గౌరవించదగిన ఆశయం. అందుకే ‘మాన్యులారా’ అని సంబోధించాడు.
వీరులు వారి ప్రయత్నంలో వీరమరణం పొంది తల్లి భూమి రుణం తీర్చుకున్నారు. అందుకే ‘ధన్యులార’ అనే సంబోధన పరాక్రమంలో సాక్షాత్తు రుద్రులే కనుక ‘శ్రీరుద్రులార’ అని సంబోధించాడు. పోరాటంలో తమ బల పరాక్రమాలు చూపించారు గనుక ‘ప్రబలులార’ అని సంబోధించాడు. ఇంతటి ఘనకార్యానికి పూనుకున్నారు కాబట్టి ‘ఘనులార’ అని సంబోధించాడు.

Exam Tips:

a) కవి వాడిన ఐదు సంబోధనలను (మాన్యులారా, ధన్యులారా, ప్రబలులారా, శ్రీరుద్రులారా, ఘనులారా) విడివిడిగా ఎందుకో రాయండి.

 

Question 6: ఈ కవితలో కవి ‘రక్తం’ అనే పదం ఎన్ని చోట్ల ఎలా ఉపయోగించాడు ?

Answer:

1. ప్రత్యేక తెలంగాణ కోసం అమర వీరులు చిందించిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయే వరకు శాంతించదు. ప్రవహిస్తూనే ఉంటుంది.
2. అమరవీరుల ఒక్కొక్క రక్తపు చుక్క అధికంగా విషాన్ని కక్కుతుంది.
శత్రువులను అంతం చేస్తుంది.
3. అమరవీరులు దిద్దిన రక్త తిలకం ప్రజలకు దీక్షా కంకణం వంటిది.
4. వారి రక్తం అధికార మదంతో విర్రవీగే వారి పాలిట రక్తంతో తడిసిన యమపాశం వంటిది.
5. ప్రజలు తమ రక్తం తర్పణ చేసియైనా తెలంగాణ విముక్తికోసం పోరాడుతారు.

Exam Tips:

a) ‘రక్తం’ పదం వచ్చిన చోట్లను పాఠంలోని చరణాల క్రమంలో లెక్కించి, ఒక్కొక్క చోట అర్థాన్ని చెప్పండి.

 

III. స్వీయరచన – పది వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: కవి నాడు చేసిన ప్రతిజ్ఞ నేడు సాకారమైంది కదా! దీనికి పాటుబడిన వారిని గురించి వివరించండి.

Answer:

కవి ఆచార్య రుక్నుద్దీన్ పన్నెండేళ్ళ క్రితం రాసిన కవిత ఇది. ప్రత్యేక తెలంగాణ కోసం అమరవీరులు ముమ్మరంగా పోరాటం జరిపారు. లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలంతా వారి త్యాగాలను మరచి పోకుండా వారి బాటలోనే నడుస్తామని ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోడానికి నాటి నుండి నేటి వరకు ఉద్యమం ఆపలేదు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. చివరికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ శ్రీ జయశంకర్, ఆమరణ నిరాహారదీక్ష చేసిన. శ్రీ.కె.సి.ఆర్. ఐ.కా.స. నాయకుడు శ్రీ కోదండరాం వంటి మేధావులు, రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది సామాన్యజనం కూడా భాగస్తులే. ఉద్యమంలో భాగంగా ఆత్మాహుతి చేసుకున్న విద్యార్థుల పాత్ర తక్కువేమీ కాదు. సుమారు 60 రోజలు విధులు బహిష్కరించి సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు ఇలా అందరూ తమ వంతు కృషివల్లే తెలంగాణా రాష్ట్రం సాకారమైంది.

Exam Tips:

a) పది వాక్యాల జవాబులో ప్రతిజ్ఞ, పోరాటం, పాల్గొన్న వ్యక్తులు/వర్గాలు (జయశంకర్, కోదండరాం, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు), రాష్ట్ర ఏర్పాటు అనే క్రమం పాటించండి.

 

Question 2: అమరులు కవితా సారాంశాన్ని రాయండి.

Answer:

‘అమరులు’ అనే కవితను ఆచార్య కె. రుక్నుద్దీన్ రచించారు. ఈ కవితలో అమరవీరులకు ప్రజాసమూహం నివాళులర్పించిన విధాన్ని కవి వివరించాడు. తెలంగాణ ప్రజలకోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా! మీకు జోహార్లు. వీరులారా! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు.
శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపుచుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది. మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తర్పణలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం.

Exam Tips:

a) సారాంశంలో కవి పేరు, ఇతివృత్తం, ప్రతి చరణం భావాన్ని క్రమంగా చెప్పి, చివర ప్రతిజ్ఞను ప్రస్తావించండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక కవిత/గేయం రాయండి.

Answer:

అమరవీరులకు భక్త్యంజలి
మరణించిన మహావీరులు
నిజంగా మరణించరు
అమరులైన ఆ వీరులు
ఆ చంద్ర తారార్కంగా
అందరి హృదయాల్లోనూ
అత్యున్నతమైన ప్రేమ
పీఠాలను అధివసించి ఉంటారు
ఆదిత్యుని అంశువుల వలె
అనంతమైన ప్రకాశాన్ని వెదజల్లుతుంటారు
నిరంతరం మనకు
నిండు వెలుగు బాటల్ని చూపుతుంటారు
నిత్యం మనకు
అభ్యుదయ పథం నిర్దేశిస్తుంటారు.

Exam Tips:

a) కవిత రాసేటప్పుడు శీర్షిక, ప్రాస, సరళమైన పదాలు వాడండి; ‘అమరులు మరణించరు’ అనే భావాన్ని ప్రధానంగా ఉంచండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది పదాలకు పర్యాయపదాలు (అదే అర్థం వచ్చే పదాలను) రాయండి: (అ) సమూహం (ఆ) అసువులు (ఇ) స్వేచ్ఛ (ఈ) సఖులు

Answer:

(అ) సమూహం = గుంపు, సముదాయం
(ఆ) అసువులు = ప్రాణములు, ఉసురు
(ఇ) స్వేచ్ఛ = విడుదల, స్వాతంత్ర్యం
(ఈ) సఖులు = స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు

Exam Tips:

a) పర్యాయపదాలు అంటే సమానార్థక పదాలు; ఇచ్చిన పదానికి కనీసం రెండు పదాలు రాయండి.

 

Question 2: కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు గల నానార్థాలు (వేరు వేరు అర్థాలు) రాయండి: (అ) ఈ వర్షంలో కురిసిన పెద్ద వర్షం ఇది. (ఆ) అమృతంతో పాయసం చేశారు. అమృతంతో చేతులు కడిగారు.

Answer:

(అ) వర్షం – సంవత్సరం, వాన
(ఆ) అమృతం – పాలు, నీరు

Exam Tips:

a) నానార్థాలు అంటే ఒకే పదానికి వేరువేరు అర్థాలు; వాక్యంలో ఏ అర్థం వస్తుందో ఎంచుకోండి (వర్షం: సంవత్సరం/వాన).

 

Question 3: కింది వృత్తంలో గల ప్రకృతి, వికృతి పదాలను గుర్తించి రాయండి.

Answer:

ప్రకృతి – వికృతి
ప్రతిజ్ఞ – ప్రతిన
ఆకాశం – ఆకసం
భాగ్యం – బాగ్గెం
శ్రీ – సిరి

Exam Tips:

a) ప్రకృతి అంటే సంస్కృత/అసలు రూపం, వికృతి అంటే తెలుగులో మారిన రూపం; జతలను సరిగా (ప్రతిజ్ఞ–ప్రతిన) రాయండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది పదాలను విడదీసి, సంధిపేరు రాయండి: (అ) ఉద్రేకాస్త్రం (ఆ) మొట్టమొదలు (ఇ) లావైన (ఈ) అనంతాకాశం (ఉ) ఒక్కొక్క

Answer:

(అ) ఉద్రేకాస్త్రం = ఉద్రేక + అస్త్రం = సవర్ణదీర్ఘసంధి
(ఆ) మొట్టమొదలు = మొదలు + మొదలు = ఆమ్రేడిత సంధి
(ఇ) లావైన = లావు + ఐన = ఉత్వసంధి
(ఈ) అనంతాకాశం = అనంత + ఆకాశం = సవర్ణదీర్ఘ సంధి
(ఉ) ఒక్కొక్క = ఒక్క + ఒక్క = ఆమ్రేడిత సంధి

Exam Tips:

a) సంధి విడదీసేటప్పుడు ‘పూర్వపదం + పరపదం’ రాసి, సూత్రం ఆధారంగా సంధి పేరు చెప్పండి: అ+అ → ఆ అయితే సవర్ణదీర్ఘ సంధి, ఉ+అచ్చు → ఉత్వసంధి, ఒకే పదం రెండుసార్లు → ఆమ్రేడిత సంధి.

 

Question 2: కింది వాక్యాలను చదువండి. తేడా చెప్పండి: ఆమె ముఖం అందంగా ఉన్నది. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.

Answer:

పై వాక్యాల్లోని తేడాను చూస్తే ‘ఆమె ముఖం అందంగా ఉన్నది’ అనే దానికి బదులు ‘ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది’ అనే వాక్యం బాగా ఆకట్టుకుంటుంది కదా! ఇలా ఆకట్టుకునేటట్లు చెప్పడానికి చంద్రబింబం అనే పోలికను తీసుకున్నాం. ఇలా చక్కని పోలికతో చెప్పడాన్నే ‘ఉపమాలంకారం’ అంటాం. పై వాక్యాన్ని బట్టి చూస్తే ఉపమాలంకారంలో నాలుగు అంశాలను గమనించవచ్చు. అవి:
1. ఉపమేయం – దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం – ఉపమేయం)
2. ఉపమానం – దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం – ఉపమానం)
3. సమానధర్మం – ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకేవిధమైన ధర్మం. (అందంగా ఉండడం – సమానధర్మం)
4. ఉపమావాచకం – పోలికను తెలిపే పదం. (వలె – ఉపమావాచకం)
“ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.”

Exam Tips:

a) ఉపమాలంకారం నాలుగు అంశాలు: ఉపమేయం, ఉపమానం, సమానధర్మం, ఉపమావాచకం; నాలుగింటినీ ఉదాహరణతో చెప్పండి.

 

Question 3: కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి: ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాడు.

Answer:

ఉపమాన ఉపమేయాలకు చక్కనిపోలిక చెప్పటమే ఉపమాలంకారం. ఈ వాక్యంలో ఏకలవ్యుడిని అర్జునునితో పోల్చారు. (ఏకలవ్యుడు – ఉపమేయం, అర్జునుడు – ఉపమానం) గురి తప్పకుండా బాణాలు వేయడం సమానధర్మం. పోలికను తెలిపే పదం ‘వలె’ ఉపమావాచకం.

Exam Tips:

a) ఉపమాలంకార ఉదాహరణలో ‘దేనిని దేనితో పోల్చారు’ ముందు చెప్పి, తర్వాత సమానధర్మం, ఉపమావాచకం రాయండి.

 

Question 4: కింది ఉదాహరణలు చదువండి. దేనిని దేనితో పోల్చారో, వాటిలోని సమానధర్మం ఏమిటో చెప్పండి: తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటూ ఇటూ తిరుగుతున్నారు.

Answer:

ఈ వాక్యంలో పిల్లలను సీతాకోకచిలుకలతో పోల్చారు. కనుక ఉపమాలంకారం. పిల్లలు – ఉపమేయం. సీతాకోక చిలుకలు – ఉపమానం. అటూ ఇటూ తిరగడం – సమానధర్మం. ‘లాగా’ అనే పోలికను తెలిపే పదం ఉపమావాచకం.

Exam Tips:

a) ఇక్కడ ఉపమేయం పిల్లలు, ఉపమానం సీతాకోకచిలుకలు; సమానధర్మం అటూ ఇటూ తిరగడం.

 

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

Question 1: తెలంగాణ ఉద్యమం సందర్భంగా వచ్చిన పాటలను లేదా ఉద్యమకాలంలో జరిగిన ఒక కార్యక్రమం గురించి వివరాలు సేకరించి నివేదిక రాయండి. తరగతిలో ప్రదర్శించండి.

Answer:

(అ) ప్రాథమిక సమాచారం :
1. ప్రాజెక్టు పని పేరు : తెలంగాణ ఉద్యమ గీతాలు మరియు సకల జనుల సమ్మె – ఒక నివేదిక
2. సమాచారాన్ని సేకరించిన విధానం : ఉద్యమ గీతాల పుస్తకాలు, పెద్దలతో చర్చ, ప్రత్యక్ష పరిశీలన
(ఆ) నివేదిక :
1. నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణ
పల్లవి : నాగేటి సాళ్ళల్లొ నా తెలంగాణా నా తెలంగాణా
నవ్వేటి బతుకులా నా తెలంగాణా నా తెలంగాణా || 2 ||
చరణం 1 : పారేటి నీళ్ళల్ల పానాదులల్లా
పూసేటి పువ్వుల్ల పునాసాలల్లా || 2 ||
కొంగు జాపిన నేల నా తెలంగాణా నా తెలంగాణా
పాలు తాపిన తల్లి నా తెలంగాణా నా తెలంగాణా || నాగేటి ||
చరణం 2 : తంగేడి పువ్వుల్ల తంబాల మంతా
తీరాక్క రంగుల్ల తీరిచ్చినావూ
తీరొ రంగుల్ల తీరిచ్చి నావూ
బంగారు చీరలు బాజారులన్నీ || 2 ||
బతుకమ్మ పండుగ నా తెలంగాణా నా తెలంగాణా
బంతిపూల తోట నా తెలంగాణా నా తెలంగాణా || నాగేటి ||
చరణం 3 : వరద గూడు గడితె వానొచ్చునంటా
బురద పొలం దున్న బురి సున్న రంతా || 2 ||
శివుని గుళ్ళో నీరు సీమలకు సెక్కరి
వాన కొరకు జడకొప్పులేసీ
వాగుల్లా వంకల్ల నా తెలంగాణా నా తెలంగాణా || నాగేటి ||
చరణం 4 : కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు || 2 ||
పాల పిట్టల జూసి పడుచు చప్పట్లు
జొన్న కర్రల జండ జోరున్న దేమీ || 2 ||
అళై భళై తీసె నా తెలంగాణా నా తెలంగాణా
తిండి పంచిన ఆర్తి నా తెలంగాణా నా తెలంగాణా || నాగేటి ||
2. ఉస్మానియా క్యాంపస్ లో
ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా
కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా || వీర ||
భలె భలె భలె || ఉస్మానియా ||
నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ ఖడ్గమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
మహబూబ్నగర్ మట్టిలోన మొలచిన మందారమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
భలె భలె భలె || ఉస్మానియా ||
హైదరాబాద్ బడిలోన చేసిన బలిదానమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా వీర తెలంగాణమా
భలె భలె భలె || ఉస్మానియా ||
మెదక్ సీమ గాలిలోన త్యాగాల గంధమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
నిజామాబాద్ నుదుటి మీద దిద్దిన ఓ కుంకుమ వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
భలె భలె భలె || ఉస్మానియా ||
కరీంనగర్ రైతుకూలీ చిందించిన రక్తమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
అరెరె రరెరె ఆదిలాబాద్ అడవుల్లో రాజుకున్న రౌద్రమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
భలె భలె భలె || ఉస్మానియా ||
వరంగల్లు గడ్డమీద చేసిన నినాదమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
ఖమ్మం, మొట్టు పెల్లోన ఉప్పొంగిన కెరటమా వీర తెలంగాణమా
వీర తెలంగాణమా నాల్గు కోట్ల ప్రాణమా
భలె భలె భలె || ఉస్మానియా ||
(ఇ) ముగింపు :
మాట కన్నా పాట సామాన్యులకు తొందరగా చేరుతుంది. వారిని ఉత్తేజితుల్ని చేస్తుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది కవులు రాసిన పాటలు ప్రజలలో చైతన్యం నింపడానికి ఎంతగానో తోడ్పడ్డాయి.
తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన ఒక కార్యక్రమం:
(ఆ) నివేదిక :
సకల జనుల సమ్మె
తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన వివిధ రకాల కార్యక్రమాలలో నేను ప్రత్యక్షంగా చూచిన సకలజనుల సమ్మె గూర్చి పొందు పరుస్తున్నాను.
సిరిసిల్ల R.D.O ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ ఆక్షన్ కమిటి 42 రోజుల పాటు వివిధ రూపాలలో తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించింది. డివిజన్లోని అన్ని మండలాల్లోని ఉద్యోగులు స్వచ్ఛందంగా 42 రోజులు తమ విధులను బహిష్కరించి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రోజుకు కొంతమంది నిరాహార దీక్షలో కూర్చోవడం జానపద గీతాలు పాడే గాయకులను తీసుకువచ్చి ఉద్యమ గీతాలు పాడించడం, వంటా వార్పు, రోడ్ల దిగ్బంధనం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉద్యోగులు చేస్తున్న ఈ ఉద్యమానికి అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజల నుండి భారీ మద్దతు లభించింది. రోజుకో కుల సంఘాలు ర్యాలీగా వచ్చి వీరి ఉద్యమానికి మద్దతు తెలియజేశాయి. రోజురోజుకు తీవ్రమౌతున్న ఈ ఉద్యమాన్ని అణచడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో బెదిరింపులకు పాల్పడింది. తాత్కాలిక ఉద్యోగులతో పని చేయిస్తామని… ఉద్యోగాలు పోతాయని ఎన్ని రకాలుగా భయపెట్టినా ఉద్యోగులు లొంగలేదు.
చివరకు విద్యార్థులు నష్టపోతారని, ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుందని. ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయి. ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు వక్తలచే తెలంగాణ ఆవశ్యకత గూర్చి ఉపన్యాసాలు ఇప్పించడం, కళాకారులచే పాటలు పాడించడం, వంటా వార్పు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు కొన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తితో సమ్మె విరమించి విధుల్లో చేరారు.
(ఇ) ముగింపు :
ఒక నెల జీతం 4 రోజులు లేటైతేనే తల్లడిల్లే ఉద్యోగులు 42 రోజులు “సకల జనుల సమ్మె” లో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఈ 42 రోజుల సమ్మె కాలంలో ఇంటి అద్దె, పాల బిల్లు, పేపరు బిల్లు, కరంటు బిల్లు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. అయినా ఉద్యోగులు ధైర్యంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా వీరికి బాగా సహకరించారు.

Exam Tips:

a) ప్రాజెక్టు నివేదికలో ప్రాథమిక సమాచారం, నివేదిక, ముగింపు అనే భాగాలు ఉండాలి; పాట లేదా కార్యక్రమ వివరాలను స్వంత మాటల్లో రాయండి.

 

అదనపు ప్రశ్నలు

Question 1: అమరులు పాఠ్యభాగ నేపథ్యం వివరించండి.

Answer:

ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ 1969లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు. నాటి పోరాటంలో 360 కి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. ఆ అమరవీరులకు ప్రజలు, కవులు, కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. ఆచార్య రుక్నుద్దీన్ అమరవీరులకు తన కవితల ద్వారా నివాళులు అర్బించాడు. తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటివరకు అమరులైన వీరి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. (1969 సంఘటనకు సంబంధించి అప్పుడు రాసిన కవిత కాబట్టి పాఠంలో “[ప్రత్యేక తెలంగాణా బాహాటంగా సాధిస్తాం” అని ఉన్నది. దాన్ని గమనించండి.)

Exam Tips:

a) నేపథ్యంలో 1969 ఉద్యమం, అమరుల త్యాగం, కవి నివాళి అనే మూడు అంశాలు ఉండాలి.

 

Question 2: అమరులు పాఠ్యభాగ వివరాలు తెల్పండి.

Answer:

ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది ఆచార్య క. రుక్నుద్దీన్ రాసిన ‘విప్లవ ఢంకా’ అనే కవితా సంకలనంలోనిది.
కవి పరిచయం:
కవి పేరు : ఆచార్య కె. రుక్నుద్దీన్
పాఠ్యభాగం పేరు : అమరులు
కాలం : 2/5/1947 – 26/5/2013
జన్మస్థలం : నాగర్ కర్నూలు జిల్లా రాచూరు గ్రామం.
వృత్తి : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.
పరిశోధనాత్మక గ్రంథం : జానపద సాహిత్యంలో అలంకార విధానం.
పాఠ్యభాగ గ్రంథం : విప్లవఢంకా
ఇతర రచనలు : ప్రయాణం, సూక్తిసుధ, శెలిమె, కిన్నెరమెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం
సత్కారాలు : వివిధ సాహిత్య సంస్థల నుండి పురస్కారాలు.
విశేషాంశాలు : బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక స్పృహ కలిగిన సాహిత్యవాదిగా, పాలమూరు ఆణిముత్యంగా కీర్తి పొందారు.

Exam Tips:

a) కవి పరిచయంలో పేరు, కాలం, జన్మస్థలం, వృత్తి, రచనలు వంటి వివరాలను శీర్షిక వారీగా రాయండి.

 

Question 3: అమరులు పాఠ్యభాగ ప్రవేశికను వివరించండి.

Answer:

వలస పాలనలోని వివక్షపై, తమ ప్రాంత విముక్తి కోసం, స్వపరిపాలన కోసం, సహజవనరుల సంరక్షణ కోసం, తమదైన భాష, సంస్కృతులను కాపాడుకోవటం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు. 1969 ఉద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఆశయసిద్ధి కొరకు పోరాడి అమరులైన వీరులకు కవి ఎట్లా నివాళులు అర్పించాడో తెలుసుకుందాం.

Exam Tips:

a) ప్రవేశికలో ఉద్యమ కారణాలు (వివక్ష, విముక్తి, స్వపరిపాలన, భాషా సంస్కృతుల రక్షణ) మరియు కవి నివాళి అనే రెండు భాగాలు చెప్పండి.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 8 Telugu Lesson 09 Amarulu (Martyrs)

Official TS Board Solutions for Lesson 09 Amarulu (Martyrs)

Explore reliable textbook solutions for Lesson 09 Amarulu (Martyrs) tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Step-by-Step Explanations for Lesson 09 Amarulu (Martyrs)

Clear, methodical explanations accompany every challenging problem within the Class 8 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Next Steps in Your Telugu Revision

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 09 Amarulu (Martyrs) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 8th Class Telugu Lesson 9 అమరులు for the 2026-27 session?

The complete and updated TS 8th Class Telugu Lesson 9 అమరులు is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 8th Class Telugu Lesson 9 అమరులు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu Lesson 9 అమరులు will help students to get full marks in the theory paper.

Do you offer TS 8th Class Telugu Lesson 9 అమరులు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Telugu. You can access TS 8th Class Telugu Lesson 9 అమరులు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire TS 8th Class Telugu Lesson 9 అమరులు in printable PDF format for offline study on any device.