Download TS Board Solutions for Class 8 Telugu Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs)
Review structured textbook solutions for Class 8 Telugu Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access TS Board Solutions and Answers
View or download the dedicated Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.
పాఠం ప్రారంభంలో చర్చించవలసిన అంశాలు
Question 1: ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది ?
Answer:
ఈ గేయం తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలను గురించి చెప్తుంది.
Exam Tips:
a) గేయ విషయాన్ని ఒక వాక్యంలో స్పష్టంగా చెప్పండి.
Question 2: ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా ?
Answer:
తెలుసు. ఈ గేయాన్ని జానపదగేయం అంటారు.
Exam Tips:
a) “జానపద గేయం” అనే పేరును తప్పక రాయండి.
Question 3: ఇట్లాంటి మరికొన్ని గేయాలు పాడండి.
Answer:
గోగులు పూచే గోగులు కాసే తీగో నాగో ఉయ్యాలో
నారలు తియ్యా ఎవ్వరు లేరూ తీగో నాగో ఉయ్యాలో
నారలు తీయా వీరులు లేరా తీగో నాగో ఉయ్యాలో
వాగులు పొంగే వంకలు పొంగే తీగో నాగో ఉయ్యాలో
దారులు చెయ్యా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో
దారులు ఇయ్యా ఏరులు లేవా తీగో నాగో ఉయ్యాలో
Exam Tips:
a) మీకు తెలిసిన గేయాన్ని పల్లవి–చరణాలుగా పంక్తుల వారీగా రాయండి.
Question 4: ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి ?
Answer:
ఇట్లాంటి గేయాలు తెలుగువారి ఆచార సంప్రదాయాలనూ, చరిత్రను, గొప్పదనాన్ని తెలియజేస్తాయి.
Exam Tips:
a) ఆచారాలు, చరిత్ర, గొప్పదనం – మూడు అంశాలను పేర్కొనండి.
ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.59)
Question 1: ఈ తెలుగు జానపద గేయ చరిత్ర ప్రాచీనమైనదని ఎట్లా చెప్పగలం ?
Answer:
మానవ సమాజం తాము పడే శ్రమను మరచిపోవడానికి సృష్టించుకొన్న కళే గేయం. ఈ గేయ సాహిత్యం భాష పుట్టినప్పటి నుంచే ఉండే అవకాశం ఉంది. రాసే పనిలేకుండా నోటి ద్వారానే ఒకతరం నుంచి మరొక తరానికి జానపదులు పాడుకుంటున్న ఈ గేయాల చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. భాష పుట్టిన చాలా ఏళ్ళకు కానీ దాన్ని రాయడానికి అవసరమైన లిపి పుట్టదు. అందువల్ల లిపి అవసరం లేకుండా ఆనోటా ఆనోటా ప్రచారం అవుతున్న జానపద గేయచరిత్ర ప్రాచీనమైనదని చెప్పవచ్చు.
Exam Tips:
a) “లిపి పుట్టకముందే నోటి ద్వారా ప్రచారం” అనే కారణం ముఖ్యం.
Question 2: పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి భావం ఎట్లాంటిది ?
Answer:
పౌరాణిక గాథలపై గ్రామీణులకు ఉండే భక్తి మెచ్చుకోదగినది. జానపద గేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలు అన్నీ ఉండటం వారి భక్తికి నిదర్శనం.
రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను జానపదులు గేయాలలో తమకు నచ్చిన విధంగా మలచుకున్నారు.
Exam Tips:
a) రామాయణ, భారత, భాగవతాలను గేయాలుగా మలచుకోవడాన్ని ఉదాహరణగా చెప్పండి.
Question 3: “ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే” – దీనిని ఏ సందర్భంలో వాడారు. దీనిని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
Answer:
తెలుగు వారు నివసించే ప్రాంతం వీరులకు నిలయమనే విషయాన్ని చెబుతున్న సందర్భంలో దీనిని వాడారు. తెలుగు భూమి మీద పుట్టిన చిగురు కొమ్మ కూడా బలంగా ఉంటుంది అని దీని అర్థం. అంటే పని పిల్లలకు కూడా పౌరుషం ఉంటుంది అని భావం. దేశక్షేమం కోసం, తమ జాతి రక్షణ కోసం పసిపిల్లు కూడా పోరాటానికి వెనకాడరని తాత్పర్యం.
Exam Tips:
a) సందర్భం (తెలుగు నేల వీరులకు నిలయం) మొదట, తరువాత అర్థాన్ని విడిగా రాయండి.
ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.61)
Question 1: వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపదగేయాల ధ్యేయం వేరు. దీనిని వివరించండి.
Answer:
వీరగీతాలు వీరత్వాన్ని, దేశభక్తిని చాటుతాయి. వీటిలో వీర రసం ప్రధానంగా ఉంటుంది. కనుకనే వీటిని వీరగీతాలు అని అంటారు. వీటినే చారిత్రక గేయాలు అని పిలుస్తారు. ఈ వీరగీతాలకు సంబంధించిన సన్నివేశాలను కనులారా చూసినప్పుడు, చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో గానం చేసి వినిపిస్తాడు. ఇలా వీరగేయాలు జానపదగేయాలు అవుతాయి. జానపదగేయాల్లో స్త్రీల పాటలు, శ్రామిక గేయాలు కూడా భాగాలే. వీరగేయాల్లో కేవలం వీరరసమే ప్రధానం.
Exam Tips:
a) వీరగీతాలలో వీరరసం, దేశభక్తి ప్రధానం; ఇతర గేయాలలో స్త్రీల పాటలు, శ్రామిక గేయాలు ఉంటాయని తేడా చెప్పండి.
Question 2: భక్తిగీతాలు కొందరికి జీవనోపాధి. ఎట్లాగో చెప్పండి.
Answer:
తెలుగునాట భక్తిపాటలలో భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఇటువంటి భక్తిగీతాలు పాడుకుంటూ జంగంవారు, హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు.
Exam Tips:
a) జంగంవారు, హరిదాసులు పేర్లు, ప్రసిద్ధ కీర్తనకారుల పేర్లు ఉదహరించండి.
ఆలోచించండి – చెప్పండి (Text Book Page No.62)
Question 1: ఈ ‘నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏమిటి ?
Answer:
నిష్కపటం అంటే మోసం చేయాలనే ఆలోచనలు లేకపోవటం. నిర్మలం అంటే చెడు ఆలోచనలు లేకపోవడం. నిష్కపటము, నిర్మలము అయిన హృదయం కలిగి ఉండడం అంటే మోసం చేయాలనే ఆలోచనగానీ, చెడ్డ ఆలోచనలుగానీ లేని ‘స్వచ్ఛమైన మనసు’ కలిగి ఉండడం అని అర్థం.
Exam Tips:
a) నిష్కపటం = మోసం లేకపోవడం, నిర్మలం = చెడు ఆలోచనలు లేకపోవడం – రెండింటినీ వేర్వేరుగా నిర్వచించండి.
Question 2: ఆ జానపదగేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.
Answer:
జానపదగేయాలు వేల సంవత్సరాల నుంచీ ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని కలిగిస్తూ ఆనోటా ఆనోటా ప్రచారం అవుతూ ఉంటాయి. పని పాటలు చేసుకొని జీవించే చదువుకోని వారిని ఈ జానపదగేయాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. అందువల్ల ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య జాగ్రత్తలు మొదలైన ప్రజాసంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ఈ జానపద గేయాలు ఎంతో ఉపకరిస్తాయి.
Exam Tips:
a) ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య ప్రచారం వంటి ఆధునిక ఉపయోగాలను ఉదహరించండి.
Question 3: జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి ?
Answer:
జానపదగేయం సంపదపై విస్తృతంగా వివిధ కోణాలలో పరిశోధనలు జరగాలి. అమూల్యమైన గేయాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాలి. జానపదగేయాల గొప్పదనాన్ని ప్రచారం చేయాలి. సేకరించిన వాటిని తగిన రీతిలో భద్రపరచాలి. వాటికోసం ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. గేయ సాహిత్యాన్ని, వాటికి సంబంధించిన విశేషాలను అందరికీ అందుబాటులోకి తేవాలి.
Exam Tips:
a) పరిశోధన, సేకరణ, భద్రపరచడం, అధ్యయన కేంద్రాలు – పాయింట్లుగా రాయండి.
ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: “జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమదర్పణం” – చర్చించండి.
Answer:
పండితులైన కవులు దీక్ష పూని చేసే కావ్యం, శతకం, ప్రబంధం వంటి రచనలు శిష్టరచనలు. గ్రామీణ ప్రాంత ప్రజలు రోజంతా పనులు చేసుకుంటూ ఆ పని వల్ల కలిగే శ్రమను మరచిపోవడానికి అప్పటికప్పుడు తామే రచించుకొని లయబద్ధంగా పాడుకొనే పాటలే జానపదగేయాలు. శిష్ట రచనల్లాగే ఈ గేయాలన్నీ దాదాపుగా రామాయణం, భారతం, భాగవతం మొదలైన గ్రంథాలలోని ప్రసిద్ధ కథలకు సంబంధించినవే. శిష్ట సాహిత్యాన్ని చదువుకున్న వారు మాత్రమే చదువుకో గులుగుతారు. కానీ జానపదుల గేయాలు లయాత్మకంగా ఉండి పండితులనూ, పామరులనూ అలరిస్తాయి. ఈ గేయాలలో తెలుగు వారి దైనందిన జీవితం కనిపిస్తుంది. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయలతో ఈ గేయాలు నిండి ఉంటాయి. అందువల్ల తెలుగువారి నాలుకలపై నిత్యం నర్తించే జానపదగేయాలు తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణాలు అని చెప్పవచ్చు.
Exam Tips:
a) శిష్ట రచనలకు–జానపద గేయాలకు తేడా చెప్పి, తెలుగువారి దైనందిన జీవితం గేయాలలో కనిపిస్తుందని ముగించండి.
Question 2: మీకు తెలిసిన జానపద గేయాలు పాడండి. వాటి గురించి మాట్లాడండి.
Answer:
“చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!
మంచి చీరలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు కట్టను చాతగాదు ఊరుకోండు!”
“రవికలొచ్చినాయి మామ కట్టమిందికి!
మంచి రవికలొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు తొడగను చాతకాదు ఊరుకోండు!”
“పూవులొచ్చినాయి మామ కట్టమిందికి!
మల్లెపూవు లొచ్చినాయి మామ కట్టమిందికి!”
“ఊరుకోండు! ఊరుకోండు!
నీకు ముడవను చాతకాదు ఊరుకోండు!”
Exam Tips:
a) గేయం పాడిన తరువాత దాని భావం, ఏ సందర్భంలో పాడతారో ఒక వాక్యంలో చెప్పండి.
II. ధారాళంగా చదువడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
Question 1: కింద ఇచ్చిన అంశాల పేరా సంఖ్య, ఆ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి.
(అంశాలు : పౌరాణిక గేయాలు, చారిత్రక గేయాలు, శ్రామిక గేయాలు, పిల్లల పాటలు)
Answer:
| అంశం | పేరా సంఖ్య | కీలక (ముఖ్యమైన) విషయాలు |
| పౌరాణిక గేయాలు | 58వ పుటలో 4వ పేరా | జానపద గేయాలలో ప్రసిద్ధ పౌరాణిక గాథలు |
| చారిత్రక గేయాలు | 59వ పుటలో 2వ పేరా | వీర గీతాల స్వరూప స్వభావాలు |
| శ్రామిక గేయాలు | 61వ పుటలో 1వ పేరా | జానపదగేయాల పుట్టుక నేపథ్యం |
| పిల్లల పాటలు | 61వ పుటలో 2వ పేరా | పిల్లల పాటల్లోని స్వచ్ఛత, మార్దవ గుణాలు |
Exam Tips:
a) ప్రతి అంశానికి పేరా సంఖ్య, కీలక విషయం – రెండు కాలమ్‌లు తప్పక నింపండి.
Question 2: కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే. సమాజం నుంచి నేర్చుకొనే చదువు కొండంత. పసి పిల్లు ఆటలాడకుంటే వాళ్ళ మనస్సు చెడుతుంది. దేహ ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకుతామే సహజంగా నేర్చుకున్నదేగాని ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి. ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. పొడుపుకథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్తాలు పదజ్ఞానానికి సాటి అయింది మరొకటిలేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది.
అ) జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి ?
ఆ) పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటి ?
ఇ) పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది ఎక్కడ ?
ఈ) జానపద సాహిత్యం దేనికి హేతువు ?
ఉ) పొడుపు కథలు, ముక్తపదగ్రస్తాలు – వీటి ప్రత్యేకత ఏమిటి ?
Answer:
అ) జానపదులు సహజంగా నేర్చుకున్నది శారీరక శిక్షణ.
ఆ) పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది.
ఇ) పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది సమాజం నుంచే.
ఈ) జానపద సాహిత్యం జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు.
ఉ) పొడుపు కథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు. ముక్తపదగ్రస్తాల్లా పదజ్ఞానానికి సాటి అయింది మరొకటి లేదు.
Exam Tips:
a) పేరా నుండి సమాధానాన్ని ఎత్తిరాస్తూ ప్రశ్న పదాలను వాక్యంలో చేర్చి సంపూర్ణ వాక్యంగా రాయండి.
III. స్వీయరచన
Question 1: జానపదగేయాలను ఎందుకు భద్రపరచాలి ? (ఐదు వాక్యాల్లో)
Answer:
ప్రజల నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన జానపద గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనది. జానపదగేయాలకు సాహితీపరమైన విలువ మాత్రమే కాకుండా సాంఘిక, సాంస్కృతిక, భాషా విషయక ప్రాధాన్యత కూడా ఉన్నది. నిఘంటువుల్లో లేని ఎన్నో అందమైన నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనుపిస్తాయి. అంతేకాక వాటిలో రమణీయమైన స్థానిక గాథలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల జానపద గేయాలను భద్రపరచాలి.
Exam Tips:
a) సాహితీ, సాంఘిక, సాంస్కృతిక, భాషా ప్రాధాన్యాలను వేర్వేరు వాక్యాల్లో చెప్పండి.
Question 2: జానపదగేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి ? (ఐదు వాక్యాల్లో)
Answer:
భారతీయ సంస్కృతికి తలమానికమైన రామాయణ మహాకావ్యం ముఖ్యమైనది. ప్రాచీనమైనది. తెలుగువారి జానపద గేయాలలో కథా వస్తువులలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలే ఎక్కువ. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను చదువుకుని అర్థం చేసుకోలేని గ్రామీణులు వాటిని జానపద గేయాలుగా మలుచుకొని నేర్చుకుంటారు. విద్యావంతుల రచనలలో లాగానే జానపదుల గేయాలలో కూడా రామాయణ సంబంధ గేయాలే ఎక్కువగా ఉన్నాయి.
అంతేకాక ఈ రామాయణ సంబంధ కథలను జానపదులు తమ తమ అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం కూడా గమనించవచ్చు. అన్నదమ్ముల అనుబంధం, పిల్లలకు తల్లిదండ్రుల మాటపై గౌరవం, భార్యాభర్తల అనురాగం, రాజు ప్రజల అనుబంధం మొదలైన ఎన్నో కుటుంబ అనుబంధాలు, రాజ్యపాలన అనుభవాలు కలిగిన కథలు ఉండటం వల్ల జానపదగేయాల్లో రామాయణ సంబంధ గేయాలు ఎక్కువ ఉన్నాయి.
Exam Tips:
a) రామాయణం ప్రాచీనత, కుటుంబ అనుబంధాల కథలు, గ్రామీణుల మలచుకునే స్వేచ్ఛ – ఈ కారణాలు రాయండి.
Question 3: “గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటె ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది” – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ? (ఐదు వాక్యాల్లో)
Answer:
గృహజీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. భారతీయ కుటుంబ జీవనంలో ఇంటి యజమాని అయిన పురుషుడు కుటుంబ పోషణకోసం పొలంలోనో, పరిశ్రమలోనో, కొలువులోనో శ్రమచేసి సంపాదిస్తాడు. ఇల్లాలైన స్త్రీ భర్త శ్రమ చేసి తెచ్చిన సంపదను జాగ్రత్త చేస్తుంది. అర్థశాస్త్రవేత్తలా వాటిని అవసరాలకు వినియోగిస్తుంది. ఉత్తమ గృహిణిగా భర్త బాగోగులను చూసుకుంటుంది.
బిడ్డలను కనిపెంచి పోషించి ప్రయోజకులను చేస్తుంది. పెద్దలను సాకుతుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యాలనూ కాపాడుతుంది. అయిన వాళ్ళను ఆదరిస్తుంది.
అతిథులను గౌరవిస్తుంది. అవసరమైతే భర్తకు చేదోడుగా ఉంటూ తాను కూడా శ్రమపడి సంపాదిస్తుంది. తప్పని పరిస్థితులలో కుటుంబ భారాన్ని తానొక్కతే మోయడానికి సిద్ధమవుతుంది. అందువల్ల కుటుంబంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషించే స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది.
Exam Tips:
a) భర్త సంపాదన – భార్య నిర్వహణ, పిల్లల పోషణ, అతిథి సత్కారం వంటి ఉదాహరణలతో సమర్థించండి.
Question 4: శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ? (ఐదు వాక్యాల్లో)
Answer:
కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్టనివారణ కోసం కూడా ఉదయిస్తుంది. స్త్రీ పురుషులు కాయకష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనబడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోటి నుండి కూనిరాగాలు, మాటలు వెలువడతాయి. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు మాటలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి. పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం, నాగలి దున్నడం మొదలైన పనులు ఈ పాటలు పాడుతూ చేయడం వల్ల హృదయంలోనూ, మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక, శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువేదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీరభాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.
Exam Tips:
a) శ్రమ తెలియకపోవడం, తాళలయలు సమకూరడం, ఉదాహరణలు (విసరడం, దంచడం) – మూడు అంశాలు రాయండి.
Question 5: “స్త్రీల పాటల్లో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది.” – ఎట్లాగో వివరించండి. (పది వాక్యాల్లో)
Answer:
1. పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు రచించిన తెలుగు జానపదగేయాలు అనే పాఠ్యభాగంలో అతి ప్రాచీనమైన ఎంతో ప్రసిద్ధమైన తెలుగువారి జానపదగేయాల గురించి అపూర్వంగా వివరించారు. జానపద గేయాలలోని రకాలు వివరిస్తూ స్త్రీల పాటల ప్రత్యేకతలను వర్ణించారు.
2. స్త్రీల పాటలు : గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు స్త్రీలే ఆలంబనం. వీటిని స్త్రీపాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక పాటలు పాడతారు. లాలి పాటలు, జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.
3. సాంఘిక, సాంస్కృతిక జీవనం : స్త్రీలకు జరిపే ఆయా వేడుకలలో పాడే స్త్రీల పాటలు అన్నింటిలో తెలుగు వారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. వీటిని పెళ్ళిపాటలు, ఇతర వేడుకల పాటలు అని రెండు అంశాలుగా తెలుసుకోవచ్చు.
4. పెళ్ళి పాటలు : స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంచనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లిపాటలు. ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, తలుపు దగ్గరపాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగు పాటలు, కట్నాల పాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లి పాటలే.
5. ఇతర వేడుకల పాటలు : సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైన ఆయా సందర్భాలలో పాడే పాటలు అతి రమణీయమైనవి.
ముగింపు : ఈ విధంగా స్త్రీ జీవిత కాలంలో జరిపే వివిధ వేడుకలలో పాడే సందర్భోచితమైన ఆయా పాటలలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం అద్దంలా కనిపిస్తుంది.
Exam Tips:
a) పరిచయం – స్త్రీల పాటలు – సాంఘిక జీవనం – పెళ్ళి పాటలు – ఇతర వేడుకల పాటలు – ముగింపు అనే శీర్షికలతో రాయండి.
b) రచయిత పేరు (బిరుదురాజు రామరాజు) పరిచయంలో తప్పక రాయండి.
Question 6: “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” దీన్ని వివరిస్తూ రాయండి.
(లేదా)
జానపద గేయాల గొప్పతనం వివరించండి. (పది వాక్యాల్లో)
Answer:
1. పరిచయం : ఆచార్య బిరుదురాజు రామరాజు ‘తెలుగు జానపద గేయాలు’ అనే పాఠ్యభాగంలో జానపదగేయాలలో ప్రతిబింబించే మన సంస్కృతీ సంప్రదాయాలను అపూర్వంగా వివరించారు. మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు మొదలైన అంశాలతో తెలుగు ప్రజల జీవితమంతా జానపదగేయాలలో ప్రతిధ్వనిస్తుంది. ఈ గేయాలను పౌరాణిక, చారిత్రక, పారమార్థిక గేయాలు, స్త్రీలపాటలు, శ్రామిక గేయాలు, పిల్లపాటలు, కరుణరసగేయాలు అనే విభాగాలలో రచయిత వివరించారు.
2. పౌరాణిక గేయాలు : ప్రసిద్ధ రామాయణం, భారతం, భాగవతం మొదలైన పురాణాలలోని గాథలన్నీ జానపద గేయాలలో ఉన్నాయి.
ఉదా : శాంతాకల్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట మొదలైనవి.
3. చారిత్రక గేయాలు : వీరరసం ప్రధానంగా ఉండటం వల్ల వీటిని వీరగీతాలు అని కూడా అంటారు. ఇవి వీరత్వాన్ని, దేశభక్తిని బోధిస్తాయి. ఉదాహరణకు మియాసాబ్కథ, సోమనాద్రికథ, రామేశ్వరరావుకథ మొదలైనవి.
4. పారమార్థిక గేయాలు : పారమార్థిక గేయాలకు భక్తిగీతాలని పేరు. జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు భద్రాచల రామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు మొదలైనవి.
5. స్త్రీల పాటలు : గృహ జీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. స్త్రీల పాటలలో లాలిపాటలు, జోలపాటలు, పెళ్ళిపాటలు, వివిధ ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు తెలిపే మొదలైనవి ఉంటాయి. ఉదాహరణకు కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు మొదలైనవి.
6. శ్రామిక గేయాలు : పిండి విసరడం, ఇల్లు అలకడం, ధాన్యం దంచడం మొదలైన పనులకు, ఆయా వృత్తులకు సంబంధించి శ్రామికులు గేయాలు పాడుకుంటారు.
7. పిల్లల పాటలు : వీటిలో పిల్లల కోసం పెద్దలు రచించినవి కొన్ని కాగా పిల్లు తమకు తామే సమకూర్చుకున్నవి మరి కొన్ని. ఉదాహరణకు చెమ్మచెక్క, కోతికొమ్మచ్చి మొదలైన ఆటలలో పాడే పాటలు.
8. కరుణరస గేయాలు : ఎరుకల నాంచారమ్మకథ, రాములమ్మపాట, సరోజనమ్మపాట మొదలైనవి.
ముగింపు : ఈ విధంగా జానపదగేయాలలో గ్రామీణుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయలు, వారి మనోభావాలు మృదుహృదయం ప్రతిబింబిస్తుంది.
Exam Tips:
a) జానపద గేయాల ఏడు రకాలను (పౌరాణిక, చారిత్రక, పారమార్థిక, స్త్రీల, శ్రామిక, పిల్లల, కరుణరస) ఉదాహరణలతో వరుసగా రాయండి.
IV. సృజనాత్మకత / ప్రశంస
Question 1: వారం రోజుల పాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు, ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారుచేయండి.
Answer:
ఆహ్వానం
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పక్షంలో శరన్నవరాత్రులు, బతుకమ్మ పండగ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేసిన కళాప్రదర్శన వారోత్సవాలకు అందరికీ ఇదే సాదర ఆహ్వానం. ది. 10-10-2019 నుంచి 16-10-2019 వరకూ వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో దిగువ తెలిపిన కళారూపాలు వివిధ వేదికలపై ప్రదర్శించబడతాయి.
| క్ర.సం. | తేదీ | సమయం | వేదిక | ప్రదర్శించబడే కళారూపం |
| 1 | 10-10-2019 | సాయంత్రం గం. 6.00 ని||లు | తెలుగు లలితకళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్ | గుసాడి నృత్యం |
| 2 | 11-10-2019 | సాయంత్రం గం. 6.00 ని||లు | తెలుగు లలితకళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్ | కొండరెడ్ల మామిడి నృత్యం |
| 3 | 12-10-2019 | ఉదయం గం. 10.00 ని||లు | రవీంద్ర భారతి | బతుకమ్మ ఆటలు, పాటలు |
| 4 | 13-10-2019 | ఉదయం గం. 10.00 ని||లు | త్యాగరాయ గాన సభ | తోలుబొమ్మలాట |
| 5 | 14-10-2019 | ఉదయం గం. 10.00 ని||లు | ఎ.వి. కళాశాల ప్రాంగణం | వీధి భాగవతాలు |
| 6 | 15-10-2019 | సాయంత్రం గం. 6.00 ని||లు | నెక్లెస్ రోడ్డు | యక్షగానాలు |
| 7 | 16-10-2019 | సాయంత్రం గం. 6.00 ని||లు | హరికళాభవనం, సికిందరాబాదు | కాటిపాపలు |
కనుక ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాం.
స్థలం : హైదరాబాదు,
తేదీ : 5-10-2019.
ఇట్లు
ఆహ్వాన కమిటి, భాగ్యనగర్ దసరా ఉత్సవ సంఘం.
Exam Tips:
a) ఆహ్వాన పత్రికలో సందర్భం, తేదీలు, వేదికలు పట్టిక రూపంలో, చివర ఆహ్వానించేవారి పేరు తప్పనిసరి.
V. పదజాల వినియోగం
Question 1: కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి.
ఉదా : కవితా సౌరభం వెదజల్లుతుంది. – సౌరభం = సువాసన, పరిమళం.
అ) గృహజీవనానికి స్త్రీలే ఆలంబనం.
ఆ) భక్తి మార్గం మోక్ష సాధనం.
ఇ) కాయ కష్టం చేసేవారు కొందరు. తినేది అందరూ.
Answer:
అ) ఆలంబనం = ఆధారం, ఆశ్రయం
ఆ) మోక్షం = కైవల్యం, ముక్తి
ఇ) కష్టం = ఇక్కట్లు, శ్రమ
Exam Tips:
a) ఒకే అర్థం వచ్చే రెండు పర్యాయపదాలు జంటగా రాయండి.
Question 2: కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) పురోగతి
ఆ) రూపురేఖలు
ఇ) కూనిరాగాలు
Answer:
అ) పురోగతి : ప్రజలంతా శక్తి వంచన లేకుండా కృషిచేసినప్పుడే జాతి పురోగతి సాధ్యం అవుతుంది.
ఆ) రూపురేఖలు : మనిషికి రూపురేఖలు కంటే మంచి గుణమే ముఖ్యం.
ఇ) కూనిరాగాలు : కూనిరాగాలు తీస్తూ గొప్ప గాయకులమని ఊహించుకోకూడదు.
Exam Tips:
a) పదం అర్థం స్పష్టమయ్యేలా సొంత వాక్యం రాయండి; పాఠంలోని వాక్యాన్ని అలాగే ఎత్తి రాయకండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి.
అ) మామయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య కాఫీ తాగాడు.
ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది.
ఇ) శత్రువులు భయపడ్డారు. శత్రువులు పారిపోయారు.
Answer:
అ) మామయ్య ఇంటికి వచ్చి కాఫీ తాగాడు.
ఆ) కొమ్మ విరిగిపోయి కింద పడింది.
ఇ) శత్రువులు భయపడి పారిపోయారు.
Exam Tips:
a) ముందు వాక్యాల్లో సమాపక క్రియను అసమాపక క్రియ (-ఇ) గా మార్చండి; కర్తను ఒక్కసారే రాయండి.
Question 2: కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) శివ అన్నం తిన్నాడు. రాజు పండ్లు తిన్నాడు.
ఆ) ఆమె పూలు తెచ్చింది. ఆమె కొబ్బరికాయ తెచ్చింది.
ఇ) నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి. వర్షం పడలేదు.
Answer:
అ) శివ అన్నం, రాజు పండ్లు తిన్నారు.
ఆ) ఆమె పూలు, కొబ్బరికాయ తెచ్చింది.
ఇ) నల్లని మబ్బులు కమ్ముకొన్నాయి కానీ వర్షం పడలేదు.
Exam Tips:
a) కర్తలు వేరైతే క్రియను బహువచనంలో (తిన్నారు) రాయాలి.
b) విరోధ సంబంధానికి “కానీ”, కారణ సంబంధానికి “కాబట్టి” వాడండి.
Question 3: కింది పదాలు చదువండి. వాటి విగ్రహ వాక్యాలు రాయండి. అవి ఏ తత్పురుష సమాసాలో రాయండి.
అ) గదాధరుడు ఆ) అగ్నిభయం ఇ) గుణహీనుడు ఈ) ధనాశ ఉ) దైవభక్తి ఊ) అజ్ఞానం
Answer:
| సమాసపదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
| అ) గదాధరుడు | గదను ధరించినవాడు | ద్వితీయా తత్పురుష |
| ఆ) అగ్నిభయం | అగ్ని వలన భయము | పంచమీ తత్పురుష |
| ఇ) గుణహీనుడు | గుణము చేత హీనుడు | తృతీయా తత్పురుష |
| ఈ) ధనాశ | ధనము నందు ఆశ | సప్తమీ తత్పురుష |
| ఉ) దైవభక్తి | దైవము నందు భక్తి | సప్తమీ తత్పురుష |
| ఊ) అజ్ఞానం | జ్ఞానం కానిది | నఞ తత్పురుష |
Exam Tips:
a) విగ్రహవాక్యంలో వచ్చే విభక్తి ప్రత్యయం (ను, చేత, వలన, నందు) చూసి సమాసం పేరు చెప్పండి.
Question 4: తత్పురుష సమాసం అంటే ఏమిటి ? దాని రకాలను ఉదాహరణలతో వివరించండి.
Answer:
కింది వాక్యం చదువండి. ‘రాజభటుడు వచ్చాడు’.
పై వాక్యంలో వచ్చిన వాడు రాజా ? భటుడా ? అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందిన వాడని చెప్పడానికి ‘రాజు యొక్క భటుడు’ అంటాం. ఇట్లా చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయమైన “యొక్క” వాడినాం.
తిండి గింజలు – తిండి ‘కొరకు’ గింజలు
పాపభీతి – పాపం ‘వల్ల’ భీతి
పై రెండు వాక్యాలను కూడా గమనిస్తే రెండు పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్లా ఉత్తరపద ప్రాధాన్యతను తెలిపేది తత్పురుష సమాసం.
| పూర్వ పదాలు | ఉత్తర పదాలు |
| రాజు | భటుడు |
| తిండి | గింజలు |
| పాపం | భీతి |
‘సమాసంలో ఉండే రెండు పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తరపదం.
పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు.
| తత్పురుష సమాసం రకాలు | విభక్తులు | ఉదాహరణ |
| ప్రథమా తత్పురుషం | డు, ము, వు, లు | మధ్యాహ్నము – అహ్నము యొక్క మధ్య భాగం (సమాసంలోని మొదటి పదం ప్రథమా విభక్తిలో ఉన్నది కనుక ప్రథమా తత్పురుషం) |
| ద్వితీయా తత్పురుషం | ని, ను, ల, కూర్చి, గురించి | జలధరం – జలమును ధరించినది |
| తృతీయా తత్పురుషం | చేత, చే, తోడ, తో | బుద్ధిహీనుడు – బుద్ధి చేత హీనుడు |
| చతుర్థీ తత్పురుషం | కొరకు, కై | దూడగడ్డి – దూడకొరకు గడ్డి |
| పంచమీ తత్పురుషం | వలన (వల్ల), కంటె, పట్టి | దొంగభయం – దొంగవలన భయం |
| షష్ఠీ తత్పురుషం | కి, కు, యొక్క, లో, లోపల | రామబాణం – రాముని యొక్క బాణం |
| సప్తమీ తత్పురుషం | అందు, న | దేశభక్తి – దేశమునందు భక్తి |
నఞ తత్పురుషం :
అసత్యం – సత్యం కానిది.
అధర్మం – ధర్మం కానిది
అన్యాయం – న్యాయం కానిది
ఇట్లా వ్యతిరేకార్థం తెలిపితే అది నఞ తత్పురుషం (‘నఞ’ అంటే వ్యతిరేకార్థం).
Exam Tips:
a) ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం తత్పురుషం; పూర్వపదం చివరి విభక్తిని బట్టి రకాన్ని చెప్పండి.
భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని
Question 1: పెండ్లిళ్ళలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలను సేకరించి నివేదిక రాయండి.
Answer:
అ) ప్రాథమిక సమాచారం
1) ప్రాజెక్టు పని పేరు : పెండ్లిళ్ళు మరియు శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలు
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఇంటిలో పెద్దవాళ్ళ ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా
ఆ) నివేదిక:
1. పెండ్లిళ్ళలో పాడే పాటలు
1) నూతన వధువు గృహ ప్రవేశము:
పల్లవి:
మహాలక్ష్మి రావమ్మా శ్రీలక్ష్మి రావమ్మ
మా ఇంట కొలువుండ రావమ్మ
మంగళ హారతులు గొనుమమ్మ
చరణాలు:
1. అష్టలక్ష్మీ నీకు స్వాగతము పలికేము
ఇష్టముగ మా ఇంటి సౌభాగ్యములు కలుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||
2. పదము పెట్టిన చోట సిరిసంపదలు గలుగ
కరము తాకిన వెనుక ధనధాన్య రాశులుగ
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||
3. పతి భక్తితో నీవు పతివ్రతగా వర్ధిల్లు
పదికాలములు పిల్లపాపలతో రాజిల్లు
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||
4. సకల సుఖశాంతులతో సంసారమును నడుప
తులసిదాసుడు నీకు శుభ మంగళము పలుక
గృహలక్ష్మివై నీవు రావమ్మా … || మంగళ ||
2) అప్పగింతల పాట:
పల్లవి:
కోటి శుభములు కలుగు నీకు పోయిరావమ్మ
ముక్కోటి వేల్పుల దీవెలనతో వెలయు మాయమ్మ || కోటి ||
చరణాలు :
1. కీర్తికాంతుల భాగ్యరాశుల శోభ నీదమ్మా
పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తేవమ్మా
2. అత్తమామలె తల్లిదండ్రులు ఈ క్షణము నుండి
ఉత్తమ ఇల్లాలిగా నువు మసలుకోవమ్మా
3. మగని మనసెరిగి నీవు నడుచుకోవమ్మా
ప్రేమ మీరగ భర్త సేవలు చేసుకోవమ్మా
4. మరిది బావల ఆడపడచుల కలిసిమెసలమ్మా
బంధుమిత్రులు సేవకులను ఆదరించమ్మా.
5. అల్లుడా మా ముద్దు పట్టిని ఒప్పగించేము
మనసుదీరగ మురిపెమారగ ఏలుకోవయ్యా
6. కల్ల కపటము లేని పిల్లను మీకు ఇచ్చేము
కంటి పాపగ వెంట నుండి చూసుకో వదినా || కోటి ||
3) బెస్తవాళ్ళ పాట:
ఏలియాల – ఏలియాల – ఏలియాల
ఐలేసా జోరిసెయ్యి – ఐలేసా బారుసెయ్యి
గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ
కాళిందికి తెల్ల కల్వదండ
జోర్సెయ్యి బార్సెయ్యి …………. జోర్సెయ్యి బార్సెయ్యి ॥ఏలియాల॥
గోదారి తల్లికి ………….. గొజ్జంగి పూదండ
సరస్వతికి …………….. సన్నజాజి దండ
కృష్ణవేణమ్మకు …………. గౌదంగి పూదండ
కావేరికి చంద్రకాంత దండా
ఐలేసా జోరుసెయ్యి – ఐలేసా బారుసెయ్యి ॥ఏలియాల॥
ఇ) ముగింపు : ఈ విధంగా పెండ్లిళ్ళ పాటలలో వరుడికి నలుగు పెట్టేప్పుడు పాట, వధువుకు నలుగు పెట్టేటపుడు పాట, అప్పగింతల పాట, నిశ్చయ తాంబూలం పాట, నూతన వధువు గృహప్రవేశం పాట.. ఇలా ఎన్నో పాటలు ఆయా సందర్భాలను బట్టి ఉన్నాయి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని పాడేవాళ్ళు బహు అరుదు. అదే విధంగా కర్షకులు పొలం పని చేసేప్పుడు, శ్రామికులు ఆయా పనులు చేస్తున్నప్పుడు, తమ శ్రమను మరచి పోవడానికి అనేక జానపద గీతాలను పాడుతుంటారు. జానపదం అంటే జనం నోటితో పాడుకుంటూ, ఒక తరం నుండి మరొక తరానికి అందించే పాటలు. వీటికి లిఖిత రూపం ఉండదు. ఇలా సంస్కృతి వారసత్వంగా వస్తున్న ఈ పాటలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
Exam Tips:
a) నివేదికను ప్రాథమిక సమాచారం – నివేదిక (పాటలు) – ముగింపు అనే క్రమంలో రాయండి.
b) ప్రతి పాటకు పల్లవి, చరణాలు విడివిడిగా చూపండి.
Important Questions – అదనపు ప్రశ్నలు
Question 1: పిల్లల పాటల గురించి రాయండి.
(లేదా)
పిల్లల పాటలు ప్రాధాన్యతను తెలపండి.
Answer:
జానపదగేయాలలో పిల్లల పాటలది ఒక ప్రత్యేకశాఖ. పసిపిల్లల లేత హృదయం లాగానే వారి పాటలు కూడా నిష్కపటంగానూ, నిర్మలంగానూ, స్వచ్ఛంగానూ, మార్దవంగానూ ఉంటాయి. ఈ గేయాలు అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి ఆ) పిల్లు రాసినవి అని రెండు విధాలు.
అ) పిల్లల కోసం పెద్దలు రచించినవి : వీటిలో లాలిపాటలు, జోలపాటలు ముఖ్యమైనవి. పిల్లలను లాలించేందుకు జోలపాడి నిద్రపుచ్చేందుకు ఇవి రచించబడ్డాయి. ఈ పాటలలోని భావాలు పిల్లలకు అర్థం కాకపోయినా వాటిలోని సంగీతం, లయ పిల్లను లాలించి నిద్రపుచ్చుతాయి.
ఆ) పిల్లు రాసినవి : పిల్లు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు, మరొకొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చినవి ఉంటాయి. అనుకరణలో పిల్లు పెద్దల రచనలలోని ధ్వనులను, మాటలను అర్థంతో పనిలేకుండా గ్రహిస్తారు. వాటిని అర్థంలేని పాటలు అని కూడా అంటారు. బాలబాలికలు ఆడే చెమ్మచెక్క, బిత్తి, కోతికొమ్మచ్చి, గుడుగుడుగుంచం, బుజబుజరేకులు, గొబ్బిళ్ళు, చిట్టిచిట్టి చిర్రర మొదలైన ఆటలలో పాడే పాటలు ఇందుకు ఉదాహరణలు.
Exam Tips:
a) పిల్లల పాటలు రెండు రకాలు (పెద్దలు రాసినవి – పిల్లలు రాసినవి) అని విభజించి ఉదాహరణలు ఇవ్వండి.
Question 2: జానపదగేయాలలో పారమార్థిక గేయాల ప్రత్యేకత ఏమిటి ?
Answer:
భక్తి, కర్మ, జ్ఞానం – అనే మూడు మోక్ష సాధనాలలో భక్తిమార్గం సులభమైనదని భారతీయులు నమ్ముతారు. ఈ భక్తిని ప్రబోధించే గేయాలే భక్తిగేయాలు. వీటినే పారమార్థిక గేయాలు అంటారు. తెలుగు ప్రాంతాలలో శైవభక్తిగీతాలు, వైష్ణవ భక్తిగీతాలు వేల సంఖ్యలో ప్రచారం పొందాయి. భక్తిగీతాలు ప్రాచీనకాలం నుంచే ఉన్నట్లు తెలుస్తున్నది.
జంగంవారు, హరిదాసులు ఈ భక్తిగీతాలు పాడుకుంటూ తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు. అంటే భక్తిగీతాలు వీరికి జీవనోపాధిని కల్పిస్తున్నాయన్నమాట. ఈ గీతాలలో భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు మొదలైనవి తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దారువులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు, స్తోత్రములు, తారావళులు నామావళులు కూడా కీర్తనల కిందకే వస్తాయి.
Exam Tips:
a) భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో భక్తి సులభమని చెప్పి, కీర్తనకారుల పేర్లు ఇవ్వండి.
Question 3: స్త్రీల పాటలలో కనిపించే తెలుగువారి వేడుకలను తెలపండి.
(లేదా)
స్త్రీల పాటల్లో సంపూర్ణ జీవనం కనిపిస్తుంది. ఎలాగో వివరించండి.
Answer:
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల సంసార సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. కనుక వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికత పాలు ఎక్కువ. శిశువు పుట్టినప్పటి నుంచి వివాహం వరకూ జరిపే ప్రతి వేడుకకు సంబంధించిన పాటలు గమనించవచ్చు. పిల్లలను ఉయ్యాలలో ఉంచి పాడే లాలిపాటలు, జోలపాటలు ఎంతో ప్రసిద్ధమైనవి.
కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, అవిరేణి పాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొదలైన పాటల ద్వారా కట్నాలు, నలుగులు, అలుకలు, బంతులు, అప్పగింతలు మొదలైన తెలుగువారి వేడుకలు తెలుస్తాయి. అంతేకాక సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీత వామనగుంటలు, సుభద్రసారె, రుక్మిణీదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి కూడా తరతరాల తెలుగు వారి వేడుకలను తెలిపేవే.
Exam Tips:
a) శిశు జననం నుండి వివాహం వరకు వేడుకల వరుస క్రమంలో పాటల పేర్లు ఉదహరించండి.
Question 4: పనికి, పాటకి దగ్గర సంబంధం ఉంది అని శ్రామిక గేయాల ఆధారంగా తెల్పండి.
Answer:
పాటలు పాడుతూ పనిచేయటంవల్ల తాము చేసే కాయకష్టాన్ని మరిచి, హృదయంలోను మనసులోను ఉండే బాధ తొలగిపోవటమేకాక, శారీరక శ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటూ ఉంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శ్రామికగేయాలకు, గీతాలకు తాళలయలు సమకూరి ఉంటాయి.ఉదా :- తిరుగలి పాటలు, దంపుడు పాటలు, పల్లకీ పాటలు, దుక్కి పాటలు, పడవలాగేటప్పుడు పాడే పాటలు (హైలెస్సో పాటలు) మొ||వి. దీనినిబట్టి చేసే పనికి, పాడే పాటకి దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చు.
Exam Tips:
a) శ్రమ తెలియకపోవడం, తాళలయలు, ఉదాహరణలు (తిరుగలి పాటలు, దంపుడు పాటలు) – ఈ మూడు చెప్పండి.
Question 5: జానపదాలను ఏయే సందర్భాలలో పాడటాన్ని నీవు గమనిస్తున్నావు ?
Answer:
1) పౌరాణిక గేయాలను పురాణేతిహాసాలపైన మక్కువగల గ్రామీణులు రామాయణం, భారతం, భాగవతాది పురాణాలలో కథలకు సంబంధించిన పాటలు మనోల్లాసానికి పాడుతారు.
ఉదా :- ఊర్మిళాదేవి నిద్ర, శ్రీరామ పట్టాభిషేకం.
2) చారిత్రక గేయాలను దేశభక్తిని కల్గించి వినోదాన్ని, ఉల్లాసాన్ని కల్గించి వీరరసంలో పాడుతారు.
ఉదా :- కాటమరాజు కథ, బొబ్బిలికథ, అల్లూరి సీతారామరాజు కథ.
3) పారమార్థిక గేయాలను భక్తి జ్ఞాన కర్మ మార్గాలలో భక్తి మార్గం ద్వారా మోక్షప్రాప్తి కోసం ఈ గేయాలు పాడుతారు.
ఉదా :- భద్రాచల రామదాసు కీర్తనలు, లాలిపాటలు, తత్త్వాలు, బతుకమ్మ పాటలు మొ||వి.
4) స్త్రీల పాటలను ఇంట్లో జరిగే విభిన్న వేడుకలలో సందర్భాన్ననుసరించి పాడుతారు.
ఉదా :- వియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు మొ||వి.
5) శ్రామిక గేయాలను కాయకష్టం చేసుకొనేవారు తమ కష్టం మరిచి పనిచేసుకోవడానికి పాడేవారు.
ఉదా :- తిరుగలి పాటలు, ఊడ్పు పాటలు, దంపుడు పాటలు.
6) పిల్లల పాటలను నిష్కపటంగా, నిర్మలముగా, మార్దవంగా ఉండే ఈ పాటలు పిల్లలకు పాడి, ఆటలు ఆడించేవారు.
ఉదా :- గుడిగుడిగుంచెం, గొబ్బిళ్ళు, కోతికొమ్మచ్చి మొ॥ వి.
7) కరుణరస గేయాలను విషాద సమయాలలో పాడి వినిపించేవారు. సందర్భాన్ని బట్టి పాడేవారు.
ఉదా :- ఎరుకల నాంచారి కథ, రాములమ్మ పాట.
ఈ విధంగా విభిన్న సందర్భాలలో సందర్భానికి తగిన జానపదగేయాలను పాడి వినోదం పొంది గ్రామీణులు ఆనందించేవారు.
Exam Tips:
a) ఏడు రకాల గేయాలను, పాడే సందర్భాన్ని, ఒక్కో ఉదాహరణను వరుసగా రాయండి.
కవి పరిచయం
Question 1: బిరుదురాజు రామరాజుగారి పరిచయం రాయండి.
(లేదా)
బిరుదురాజు రామరాజుగారి జీవిత విశేషాలు తెల్పండి.
Answer:
తెలుగు జానపద సాహిత్యమనగానే మనకు గుర్తుకువచ్చేవాడు ఆచార్య బిరుదురాజు రామరాజు. పూర్వపు వరంగల్ జిల్లా దేవునూరు గ్రామంలో ఈయన జన్మించాడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ప్రసిద్ధుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడుగా, డీన్ గా పనిచేశాడు. “తెలుగు జానపద గేయ సాహిత్యం” ఈయన పరిశోధన గ్రంథం. చరిత్రకెక్కన చరితార్థులు, ఆంధ్రయోగులు, మరుగునపడిన మాణిక్యాలు, ఉర్దూ – తెలుగు నిఘంటువు, తెలుగు జానపదరామాయణం, తెలంగాణ పల్లెపాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.
Exam Tips:
a) పుట్టిన ఊరు, వృత్తి (ఉస్మానియా తెలుగు శాఖాధ్యక్షుడు), పరిశోధన గ్రంథం, ఇతర రచనలు – ఈ నాలుగు వివరాలు ఉండాలి.
Free study material for Telugu
TS Board Solutions for Class 8 Telugu Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs)
Official TS Board Solutions for Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs)
Access structured TS Board textbook solutions for Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs). Designed in alignment with the latest academic curriculum for Class 8 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Step-by-Step Explanations for Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs)
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Telugu Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 06 Telugu Janapada Geyalu (Telugu Folk Songs) with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS 8th Class Telugu 6th Lesson తెలుగు జానపద గేయాలు Questions and Answers is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 8th Class Telugu 6th Lesson తెలుగు జానపద గేయాలు Questions and Answers as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu 6th Lesson తెలుగు జానపద గేయాలు Questions and Answers will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Telugu. You can access TS 8th Class Telugu 6th Lesson తెలుగు జానపద గేయాలు Questions and Answers in both English and Hindi medium.
Yes, you can download the entire TS 8th Class Telugu 6th Lesson తెలుగు జానపద గేయాలు Questions and Answers in printable PDF format for offline study on any device.