TS 8th Class Telugu 5th Lesson శతక సుధ Questions and Answers

Step-by-Step Textbook Solutions for Class 8 Telugu Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas)

Review structured textbook solutions for Class 8 Telugu Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas) Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 8 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

పాఠం ప్రారంభంలో చర్చించవలసిన అంశాలు

Question 1: ఈ పద్యం ఏ శతకం లోనిది ? కవి ఎవరు ?

Answer:

ఈ పద్యం శ్రీయాదగిరీంద్ర శతకం లోనిది. కవి తిరువాయిపాటి వేంకటకవి.

Exam Tips:

a) శతకం పేరు, కవి పేరు రెండూ రాయండి; మకుటం ద్వారా శతకాన్ని గుర్తించవచ్చు.

 

Question 2: ఈ పద్యాన్ని చదివినప్పుడు మీరేం గ్రహించారు ?

Answer:

ప్రజలు ప్రతి విషయానికీ ఎదుటి వారిని విమర్శిస్తూనే ఉంటారు. జనుల మెప్పుపొందడం తేలికకాదు అని ఈ పద్యాన్ని చదివి గ్రహించాను.

Exam Tips:

a) పద్యం చెప్పిన నీతిని మీ సొంత మాటల్లో ఒకటి రెండు వాక్యాల్లో రాయండి.

 

Question 3: కవులు శతక పద్యాలు ఎందుకు రాస్తారు ?

Answer:

ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సమాజంలోని మంచి చెడ్డలు తెలియజెప్పడానికి, ప్రజలకు మంచి నడవడి అలవర్చడానికి కవులు శతక పద్యాలు రాస్తారు.

Exam Tips:

a) “సమాజాన్ని సంస్కరించడం, నీతిని బోధించడం” అనే రెండు ఉద్దేశాలను తప్పక రాయండి.

 

Question 4: ఈ పద్యంలోని మకుటం ఏమిటి ?

Answer:

“యాదగిరీంద్ర” అనేది ఈ పద్యంలోని మకుటం.

Exam Tips:

a) మకుటం అంటే ప్రతి పద్యంలోనూ చివరన పునరావృతమయ్యే పదం/పాదం అని గుర్తుంచుకోండి.

 

Question 5: మీకు తెలిసిన కొన్ని శతకాల మకుటాలను చెప్పండి.

Answer:

యాదగిరీంద్ర !
విశ్వదాభిరామ వినురవేమ !
సుమతీ !
దాశరథీ కరుణాపయోనిధీ !
శ్రీ కాళహస్తీశ్వరా !
కుమారా !
కుమారీ !
నరసింహ ! దురితదూర ! మొదలైనవి.

Exam Tips:

a) శతకం పేరుతో పాటు మకుటం రాస్తే మంచిది (ఉదా: వేమన శతకం – విశ్వదాభిరామ వినురవేమ).

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 47)

Question 1: కవి ఉద్దేశంలో నిజమైన సుఖం అంటే ఏమిటి ? ‘వివేకధనం’గా కవి వేటిని పేర్కొన్నాడు ?

Answer:

పేదలకు సమృద్ధిగా అన్నము, వస్త్రాలు దానం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలు మాట్లాడకూడదు. ఇతరులతో తగవులు పెట్టుకోకూడదు. హద్దు మీరి ప్రవర్తించరాదు. అందరితో స్నేహంగా ఉండాలి. ఇవే తెలుసుకోవలసిన విషయాలు. ఇవన్నీ తెలుసుకోవడమే వివేకధనం అని కవి పేర్కొన్నాడు.

Exam Tips:

a) వివేకధనం అంటే పేదలకు దానం, అబద్ధాలాడకపోవడం, వాదనకు దిగకపోవడం, మర్యాద, స్నేహం – వీటిని పాయింట్లుగా రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 48)

Question 1: ఎట్లాంటి చదువు వ్యర్థమని మీరనుకొంటున్నారు. ఎందుకు ?

Answer:

మంచికూర ఎంత కమ్మగా నలభీమ పాకంగా చేసినా అందులో చాలినంత ఉప్పు వేయకపోతే రుచిగా ఉండదు. అలాగే ఎంత గొప్ప చదువులు చదివినా ఆ చదువులోని సారం గ్రహించలేకపోతే అటువంటి చదువు వ్యర్థం అని అనుకుంటున్నాను.

Exam Tips:

a) ఉప్పు–కూర ఉదాహరణతో “సారం గ్రహించని చదువు వ్యర్థం” అని చెప్పండి.

 

Question 2: సత్సంపదలు అంటే ఏవి ?

Answer:

మంచివారితో స్నేహం, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మోక్షాన్ని పొందడం – ఇవీ సత్సంపదలు.

Exam Tips:

a) మూడు సత్సంపదలను (స్నేహం, ఆరోగ్యం, మోక్షం) వరుసగా రాయండి.

 

Question 3: డబ్బు కూడబెట్టి దానధర్మం చేయనివాడిని తేనెటీగతో ఎందుకు పోల్చారు ?

Answer:

తేనెటీగ పువ్వు పువ్వుకూ తిరిగి తేనెను తెచ్చి తేనెపట్టులో దాచి పెడుతుంది. అది తాగదు. చివరికి బాటసారులు ఆ తేనెను పిండుకుంటారు. అలాగే పిసినారి దానధర్మాలు చేయకుండా డబ్బు దాచిపెట్టి తాను అనుభవించకుండా కష్టపడతాడు. చివరికి ఆ దాచిన డబ్బు రాజులపాలో దొంగలపాలో అవుతుంది. అందుచేత దానధర్మం చేయనివాడిని తేనెటీగతో పోల్చారు.

Exam Tips:

a) తేనెటీగ దాచిన తేనె బాటసారులకే చేరినట్లు, దాచిన ధనం ఇతరుల పాలవుతుందని సామ్యాన్ని స్పష్టంగా చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 49)

Question 1: మంచిమార్గంలో నడిచే ఆలోచనలు కలుగకపోవటానికి కారణాలేవి ?

Answer:

మానవుడు అంతంలేని కోరికలతో ఇష్టాలను పెంచుకుంటూ కొత్త కొత్త వాటికోసం ఆశపడుతూనే ఉంటాడు. అవి తీర్చుకోడానికి మంచి చెడు తెలుసుకోలేని అమాయకుడై ఉక్కిరిబిక్కిరైపోతూ చెడుదారులలో తిరుగుతుంటాడు. అందుకనే మంచి మార్గంలో నడిచే ఆలోచన చెయ్యడానికి కూడా అతడికి తీరిక దొరకదు.

Exam Tips:

a) అంతులేని కోరికలు → చెడు దారులు → తీరిక లేకపోవడం అనే క్రమంలో రాయండి.

 

Question 2: “చెప్పుట చేయుటేకమై” నడవటమంటే ఏమిటి ?

Answer:

మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే ఇతరులకు చెప్పాలి. ఇతరులకు మనమేమి చెప్పామో అదే ఆచరించాలి. ఆలోచనచేసే మనస్సు, చెప్పే మాట, చేసే పని ఈ మూడూ ఒకటిగా ఉండాలి. దీనినే త్రికరణ శుద్ధిగా ఉండటం అంటారు. చెప్పుట చేయుట ఏకమై నడవడమంటే ఇదే.

Exam Tips:

a) “త్రికరణ శుద్ధి” (మనసు, మాట, పని ఒకటిగా ఉండటం) అనే పదాన్ని తప్పక వాడండి.

 

Question 3: కవి చెప్పిన పుణ్యపు పనులేవి ?

Answer:

ఆకలితో, దప్పికతో బాధపడేవారికి కొంచెం అన్నము గాని, కూరగాని, నీరుగాని ఇచ్చి వారి బాధను తీర్చాలి. అలాచేస్తే ఎన్నో పుణ్యాలు చేసినంత ఫలితం లభిస్తుంది. ఇతరులకు మేలు కలిగే పని చేసినందుకు, ప్రియమైన పనిచేసినందుకు దేవుడు మెచ్చుకుంటాడు.

Exam Tips:

a) ఆకలి దప్పులు తీర్చడం (అన్నం, కూర, నీరు) అనే పని, దాని ఫలితం – రెండూ రాయండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: పాఠంలోని పద్యాలను రాగ, భావయుక్తంగా చదవండి.

Answer:

విద్యార్థి కృత్యం. (ఉపాధ్యాయుల సహాయంతో పద్యాలను రాగయుక్తంగా, భావానికి తగిన స్వరంతో చదవాలి.)

Exam Tips:

a) యతి, గణ విరామాలు పాటిస్తూ, స్పష్టమైన ఉచ్చారణతో చదవండి.

 

Question 2: శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి చర్చించండి.

Answer:

శతక పద్యాలలో కవులు వారి సమకాలికమైన సమాజంలోని ఆచారాలు, అలవాట్లు, నీతి నియమాలు, కట్టుబాట్లు మొదలైన వాటిని వివరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అని తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు. అందుచేత శతక పద్యాలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతాయి అని చెప్పవచ్చు.

Exam Tips:

a) ఆచారాలు, నీతి నియమాలు, మంచి చెడుల వివరణ – ఇవి శతకాల ద్వారా తెలుస్తాయని రాయండి.

 

II. ధారాళంగా చదువడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: పాఠంలోని పద్యాల ఆధారంగా కింద తెలిపిన పదాలతో వేటిని పోల్చినారో రాయండి.
అ) ఉప్పు : ______
ఆ) వేదాలు : ______
ఇ) సుడిగుండాలు : ______

Answer:

అ) ఉప్పు : రసజ్ఞతను
ఆ) వేదాలు : వివేకధనాన్ని
ఇ) సుడిగుండాలు : కోరికలను

Exam Tips:

a) భాస్కర శతకంలో ఉప్పు = రసజ్ఞత; వేంకటేశ్వర శతకంలో సుడులు = కోరికలు అని గుర్తుంచుకోండి.

 

Question 2: కరీంనగర్ జిల్లా వేములవాడ కవి మామిడిపల్లి సాంబశివశర్మ రాసిన కింది పద్యాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి.
పరువు లేకున్న జగతి సంబరము లేదు
సంబరము లేక అన్నమే సైపబోదు
అన్నమే లేక యున్న సోయగము సున్న
సోయగము లేక యున్న మెచ్చుదురె జనులు.
అ. అందంగా ఉండాలంటే ఇది అవసరం
ఎ) నగలు బి) రంగు సి) అన్నం డి) వస్త్రాలు
ఆ. పరువు అంటే అర్థం
ఎ) ధనం బి) గౌరవం సి) పండుగ డి) ప్రాణం
ఇ. సంతోషంగా లేకపోవడం వల్ల సహించనిది ఏది ?
ఎ) అన్నం బి) చదువు సి) ప్రార్థన డి) భక్తి
ఈ. జనులు మెచ్చుకొనటానికి ఒక కారణం
ఎ) దుర్మార్గం బి) కోపం సి) ద్వేషం డి) సోయగం
ఉ. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండవలసినది
ఎ) పరువు బి) సంబరం సి) అన్నం డి) పైవన్నీ

Answer:

అ. సి) అన్నం
ఆ. బి) గౌరవం
ఇ. ఎ) అన్నం
ఈ. డి) సోయగం
ఉ. డి) పైవన్నీ

Exam Tips:

a) పద్యంలోని గొలుసు క్రమాన్ని (పరువు → సంబరం → అన్నం → సోయగం) గమనిస్తే సమాధానాలు సులభంగా దొరుకుతాయి.
b) “పైవన్నీ” అనే ఆప్షన్ ఉన్నప్పుడు అన్ని ఆప్షన్లు సరైనవో చూడండి.

 

III. స్వీయరచన

Question 1: “తుచ్ఛ సౌఖ్య సంపాదనకై యబద్ధములఁ బల్కకు, వాదము లాడబోకు” అని భాస్కరకవి ఎందుకు చెప్పి ఉంటాడు? (ఐదు వాక్యాల్లో)

Answer:

ఎవరైనా మంచి ప్రవర్తన గలవారినే ఇష్టపడతారు. అబద్ధాలాడేవారిని, అన్యాయంగా ఒకరి సొమ్ము కాజేసే వారిని సమాజం హర్షించదు. అందరితో తగవులు పెట్టుకొని అబద్ధాలాడి అన్యాయాలు చేసి నీచమైన సుఖాలు పొందవలసిన పనిలేదు.
అందువల్ల మంచి మార్గంలో నడిచి పది మందితో మంచి అనిపించుకోవాలని భాస్కర కవి చెప్పాడు.

Exam Tips:

a) మంచి ప్రవర్తనకు సమాజంలో గౌరవం, అబద్ధాలకు తిరస్కారం అనే రెండు అంశాలు చెప్పండి.

 

Question 2: వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలేవి ?

Answer:

వివేకి అయినవాడు తనకు ఉన్న దానిలో నుండి కొంతైనా అనాథలకు, పేదలకు సాయం చేయాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలాడకూడదు. అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగకూడదు. అమర్యాదగా ప్రవర్తించ కూడదు. అందరితోనూ స్నేహంగా మెలగాలి. పైన చెప్పిన లక్షణాలన్నింటిని వేదాలుగా భావించాలి. ఇవే వివేకులకు ఉండవలసిన లక్షణాలు.

Exam Tips:

a) దానగుణం, సత్యవాక్కు, వాదనకు దూరం, మర్యాద, స్నేహం – ఐదు లక్షణాలు వరుసగా రాయండి.

 

Question 3: “పెంపున తల్లివై …” అనే పద్యంలోని అంతరార్థాన్ని మీరేమని గ్రహించారు ?

Answer:

భగవంతుడు సర్వ సమర్థుడు. ఆయన శరణు జొచ్చిన వారి పోషణ, రక్షణ మొదలైన అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు. మానసిక శారీరకమైన అన్ని జబ్బులను దూరంచేసి తన భక్తులను ఆరోగ్యంగా ఉంచుతాడు. పాపాలంటనీకుండా మంచిదారిలో నడిపిస్తాడు. శాశ్వతమైన మోక్ష పదాన్ని అనుగ్రహిస్తాడు. అని “పెంపున తల్లివై” అనే పద్యం ద్వారా తెలుస్తుంది.

Exam Tips:

a) దేవుడు తల్లి (పెంపకం), తండ్రి (రక్షణ), వైద్యుడు (రోగ నివారణ) పాత్రలు పోషిస్తాడనే సారాంశం రాయండి.

 

Question 4: “కోరికలకు బానిసై ఉక్కిరి బిక్కిరి కావడం కంటె విశిష్టమార్గాన్ని వెతుక్కోవటం మంచిది” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి.

Answer:

కోరికలు మనిషి మనుగడకు ఆటంకాలు. కోరికలు ఒకసారి మొదలైతే ఒకటి తీర్చుకుంటే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. మనిషి ఆ కోరికల సాగరంలో కొట్టుకుపోతూ ఉక్కిరిబిక్కిరై పోతాడు. వాటిని సాధించుకోడానికి అక్రమ మార్గాలు వెతుక్కుంటాడు. అనేక కష్టనష్టాలకు గురి అవుతాడు. అందుకే విశిష్ట మార్గాన్ని వెతుక్కోవటం మంచిది.

Exam Tips:

a) మీ అభిప్రాయం స్పష్టంగా మొదట చెప్పి, కారణాలతో సమర్థించండి.

 

Question 5: శతక కవులు ఈ విధమైన పద్యాలను ఎందుకు రాసి ఉంటారో కారణాలు రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

1. పరిచయం : వేమన, బద్దెన, పోతన, భాస్కర కవి, మారద వెంకయ్య, భక్త రామదాసు, శేషప్పకవి … ఇలా ఎందరో శతక కవులు మన సాహిత్యంలో కనబడతారు.
2. నిశిత పరిశీలన : శతక కవులు తమ కాలంలో తమ చుట్టూ ఉండే పరిసరాలు, సమాజం, మనుషులు, వారి ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, ధనవంతుల అత్యాచారాలు, పేదవారి అగచాట్లు మొదలైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించేవారు. వాటిని గమనిస్తూ వారి మనసుల్లో కలిగే భావాలను పద్యరూపంలో పెట్టి శతకాలుగా రాసి ఉంటారు.
3. సమాజాన్ని సంస్కరించాలనే తహతహ : కొన్ని భక్తి శతకాలు, కొన్ని నీతి శతకాలు మనకు లభిస్తున్నాయి. ఏ శతకమైనా పైన చెప్పిన అంశాలను ప్రజలకు వివరించడం, వాటిలోని మంచిచెడులను గుర్తింపజేయడం, మంచిమార్గంలో నడిచేందుకు స్ఫూర్తినివ్వడం, లక్ష్యంగా పెట్టుకొని శతక కవులు ఈవిధమైన పద్యాలు రాసి ఉండవచ్చు. ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకొని పోకుండా ఉండడానికి, సమాజం చెడుమార్గంలో వెళుతూ ఉంటే సరైన మార్గంలో పెట్టడానికి శతకాలు రాసి ఉంటారు.

Exam Tips:

a) పరిచయం – పరిశీలన – సంస్కరణ అనే మూడు శీర్షికలతో రాస్తే జవాబు క్రమబద్ధంగా ఉంటుంది.
b) కవుల పేర్లు (వేమన, బద్దెన, పోతన, భాస్కర కవి…) ఉదహరించండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: పాఠశాలలో పిల్లలకు నిర్వహించే పద్యాల పోటీలో పిల్లలందరు పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటనను రాయండి. (ప్రకటనలో పోటీ నిర్వహణ తేదీ, స్థలం, సమయం మొదలైన వివరాలుండాలి) (పది వాక్యాల్లో)

Answer:

ప్రకటన
పద్య పఠనం పోటీలు
ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల వారి ఆధ్వర్యంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు అంతర పాఠశాలలతో పద్య పఠనం పోటీలు నిర్వహించబడతాయి. పోటీ ఆగష్టు 13వ తేదీన జరుగుతుంది. పోటీలో గెలిచినవారికి ఆగష్టు 15న జరిగే జెండా వందనం ఉత్సవంలో బహుమతులు అందించబడతాయి.
నిబంధనలు:
పద్యాలు రాగయుక్తంగా పాడాలి.
తప్పులు లేకుండా పాడాలి.
స్పష్టమైన ఉచ్చారణతో పాడాలి.
నిర్ణయం న్యాయ నిర్ణేతలదే.
ఆసక్తిగల విద్యార్థులు ఆగష్టు 5వ తేదీ నాటికి తమ పేర్లు నమోదు చేయించుకోగలరు.
వేదిక :
ఎస్.ఆర్.ఎమ్. ప్రాథమికోన్నత పాఠశాల, వరంగల్.
నిర్వహణ తేదీ : XX.XX.XXXX
సమయం ఉదయం 10 గంటల నుంచి
ఇట్లు
కార్యదర్శి, ఎస్. ఆర్. ఎమ్. పాఠశాల వరంగల్.

Exam Tips:

a) ప్రకటనలో శీర్షిక, నిర్వాహకులు, తేదీ–సమయం–వేదిక, నిబంధనలు, చివర కార్యదర్శి సంతకం తప్పనిసరి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది వాక్యాలలోని సమానార్థక పదాలను గుర్తించి, గీత గీయండి.
అ) ఇతరుల దోషాలు ఎంచేవాళ్ళు తమ తప్పులు తాము తెలుసుకోరు.
ఆ) తేనెతెట్టు నుండి తేనెను సేకరిస్తారు. ఆ మధువు తీయగా ఉంటుంది.

Answer:

అ) దోషాలు = తప్పులు
ఆ) తేనె = మధువు

Exam Tips:

a) వాక్యంలో ఒకే అర్థం ఇచ్చే రెండు పదాలను జంటగా రాయండి.

 

Question 2: కింది వాక్యాలలోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : సహృదయత గల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. – సహృదయత = మంచి మనసు
అ) పూలతో పాటు దండలోని దారం కూడా పరిమళాన్నిస్తుంది.
ఆ) సజ్జనుల మైత్రి ఎప్పటికీ సంతోషాన్నిస్తుంది.

Answer:

అ) పరిమళం = సువాసన
ఆ) మైత్రి = స్నేహం

Exam Tips:

a) అర్థం చెప్పేటప్పుడు వాక్య సందర్భానికి సరిపోయే అర్థమే రాయండి.

 

Question 3: కింద ఇవ్వబడిన పదాలలో ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి.

ప్రకృతివికృతి
గుణం......
......దోసం
సుఖం......
......పున్నెం
అగ్ని......
......వెజ్జు
ధర్మం......

Answer:

ప్రకృతివికృతి
గుణంగొనం
దోషందోసం
సుఖంసుకం
పుణ్యంపున్నెం
అగ్నిఅగ్గి
వైద్యుడువెజ్జు
ధర్మందమ్మం

Exam Tips:

a) సంస్కృత రూపం ప్రకృతి, తెలుగులో మారిన రూపం వికృతి; ప్రతి జంటను కంఠస్థం చేయండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) దశేంద్రియ
ఆ) లక్షాధికారి
ఇ) పట్టెడన్నము
ఈ) రాతికంటు
ఉ) చాలకున్న

Answer:

అ) దశేంద్రియ = దశ + ఇంద్రియ – గుణసంధి
ఆ) లక్షాధికారి = లక్ష + అధికారి – సవర్ణదీర్ఘ సంధి
ఇ) పట్టెడన్నము = పట్టెడు + అన్నము – ఉత్వ సంధి
ఈ) రాతికంటు = రాతికి + అంటు – ఇత్వ సంధి
ఉ) చాలకున్న = చాలక + ఉన్న – అత్వ సంధి

Exam Tips:

a) పూర్వపదం చివర అచ్చు (అ, ఇ, ఉ) చూసి సంధి పేరు నిర్ణయించండి; సూత్రాన్ని ఒక వాక్యంలో రాయండి.

 

Question 2: కింది విగ్రహవాక్యాలకు సమాసపదాలు రాసి, సమాసం పేరు రాయండి.
అ) ఆకలియు, దప్పియు
ఆ) అన్నము, వస్త్రము
ఇ) దశ సంఖ్య గల ఇంద్రియములు
ఈ) నాలుగైన వేదాలు

Answer:

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
అ) ఆకలిదప్పులుఆకలియు, దప్పియుద్వంద్వ సమాసం
ఆ) అన్నవస్త్రాలుఅన్నము, వస్త్రముద్వంద్వ సమాసం
ఇ) దశేంద్రియాలుదశ సంఖ్య గల ఇంద్రియములుద్విగు సమాసం
ఈ) నాలుగు వేదాలునాలుగైన వేదాలుద్విగు సమాసం

Exam Tips:

a) “యును” తో విడిపోతే ద్వంద్వం; సంఖ్యా పూర్వపదం ఉంటే ద్విగు సమాసం.

 

Question 3: కింది పదాలకు గురులఘువులు గుర్తించండి.
చిక్కని, పాలపై, ధనము, చెందిన, పాకము, పంచదార, మూర్ఖుడు, అందం, పుణ్యముల్, నమోనమః, రైతులు, గౌరీపతి

Answer:

పదంగురులఘువులు (I = లఘువు, U = గురువు)
1) చిక్కనిU I I
2) పాలపైU I U
3) ధనముI I I
4) చెందినU I I
5) పాకముU I I
6) పంచదారU I U I
7) మూర్ఖుడుU I I
8) అందంU U
9) పుణ్యముల్U I U
10) నమోనమఃI U I U
11) రైతులుU I I
12) గౌరీపతిU U I I

Exam Tips:

a) దీర్ఘాక్షరం, సున్నా/విసర్గ/పొల్లు హల్లు ఉన్న అక్షరం, ద్విత్వ–సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరం గురువు అని గుర్తుంచుకోండి.

 

Question 4: కింది పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేయండి.
అ) బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛ సౌఖ్యసం
ఆ) పొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా

Answer:

అ)

గణాలుభరనభభరవ
గురులఘువులుU I IU I UI I IU I IU I IU I UI U
పాదంబీదలకన్న వస్త్రములుపేర్మినొసంగుముతుచ్ఛ సౌఖ్యసం

సూచన : ఇందులో భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఉత్పలమాల పద్యపాదము.
ఆ)
గణాలునజభజజజర
గురులఘువులుI I II U IU I II U II U II U IU I U
పాదంపొదవెడు నుప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్యభాస్కరా

సూచన : ఇందులో న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలు ఉన్నాయి. అందువల్ల ఇది చంపకమాల పద్యపాదం. ‘పొ’ కి, ‘పు’ కి యతి స్థానం.

Exam Tips:

a) ముందు ప్రతి అక్షరానికి I/U గుర్తు వేసి, తరువాత మూడేసి అక్షరాలుగా గణాలు విభజించండి; చివరి గణం రెండక్షరాలు (వ) కావచ్చు.
b) ఉత్పలమాల: భ ర న భ భ ర వ; చంపకమాల: న జ భ జ జ జ ర – ఇవి గుర్తుంచుకోండి.

 

Question 5: ఛందస్సు అంటే ఏమిటి ? లఘువు, గురువు, గణాలను ఉదాహరణలతో వివరించండి.

Answer:

పద్యాలలో, గేయాలలో ఉండే మాత్రలు, గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు.
లఘువు – ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘ల’ అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “I” (నిలువుగీత). లఘువులు:
(1) హ్రస్వాక్షరాలు (దీర్ఘాక్షరాలు కానివి). ఉదా : అ, ఇ, ఎ, ఒ, క, బ, ర, కృ
(2) దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఉదా : క్క, చ్చు, మ్మ, ర్ర, ల్ల, త్త
(3) దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు. ఉదా : క్ష, ఘ్ను, మ్య, ట్చ, త్య
గురువు – రెండు మాత్రల కాలంలో ఉచ్చరించేది. దీనిని ‘గ’ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు “U”. గురువులు:
(1) దీర్ఘాక్షరాలు. ఉదా : ఆ, ఈ, ఊ, ఏ, ఓ, ఐ, ఔ, కా, రీ, తే, దే
(2) ఐ, ఔ లతో కూడిన హల్లులు. ఉదా : కై, రై, గై, పై, రౌ, నౌ, తౌ, గౌ
(3) సున్నతో కూడిన అక్షరాలు. ఉదా : అం, చం, ఇం, కం, మం, సం
(4) విసర్గతో కూడిన అక్షరాలు. ఉదా : కః, మః, యః, పః, శః
(5) పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు. ఉదా : కన్, నిన్, దుర్, విద్
(6) ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు. ఉదా : అక్క, కర్ర, చిన్న, బొమ్మ (మొదటి అక్షరం గురువు)
(7) సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు. ఉదా : పద్మ, రిక్త, చోట్ల, దివ్య (మొదటి అక్షరం గురువు)
గణాలు – గణం అంటే గురు లఘువుల సమూహం. ఏక అక్షర గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి.
1. ఏక అక్షర గణాలు : లఘువు (I) అయితే ‘ల’, గురువు (U) అయితే ‘గ’.
2. రెండు అక్షరాల గణాలు :

ఉదాహరణగుర్తులుగణం
పదేI Uలగము లేదా ‘వ’ గణము
మదిI Iలలము లేదా ‘ల’ గణము
అందుU Iగలము లేదా ‘హ’ గణము
దోషంU Uగగము లేదా ‘గా’ గణము

3. మూడు అక్షరాల గణాలు :
ఉదాహరణగుర్తులుగణం
పెంపునU I I‘భ’ గణము
వినీతI U I‘జ’ గణము
సతతాI I U‘స’ గణము
ఆహారంU U U‘మ’ గణము
సమాజంI U U‘య’ గణము
మార్గముల్U I U‘ర’ గణము
పద్యాలుU U I‘త’ గణము
చదువుI I I‘న’ గణము

పద్య పాదాలకు గురులఘువులను గుర్తించి గణ విభజన చేసిన తీరు :
గణంనజభజజజర
గుర్తులుI I II U IU I II U II U II U IU I U
పాదంచదువదియెంతగల్గినరసజ్ఞతయించుకచాలకున్ననా

గణంభరనభభరవ
గుర్తులుU I IU I UI I IU I IU I IU I UI U
పాదంబాకవరాంజనేయఖలభంజనసాధుజనానురంజనా

Exam Tips:

a) గురులఘువుల నియమాలు, గణాల పేర్లు (న జ భ జ జ జ ర వంటివి) ఏ పద్యానికో గుర్తుంచుకోండి.

 

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

Question 1: కింది తరగతుల్లో ఇచ్చిన శతక పద్యాల ఆధారంగా ఆ శతకాల పేర్లు, వాటిని రాసిన కవుల పేర్లు సేకరించి, పట్టిక తయారుచేసి, నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.

Answer:

క్ర.సం. / శతకం పేరుకవి పేరు
1. వేమన శతకంవేమన
2. సుమతీ శతకంబద్దెన
3. శ్రీ కాళహస్తీశ్వర శతకంధూర్జటి
4. వృషాధిప శతకముపాల్కురికి సోమన
5. దాశరథీ శతకంకంచర్ల గోపన్న
6. సుభాషిత త్రిశతిఏనుగు లక్ష్మణకవి
7. భాస్కర శతకంమారద వెంకయ్య
8. నారాయణ శతకంపోతన
9. కుమార శతకముపక్కి అప్పల నర్సయ్య
10. చిత్తశతకంశ్రీపతి భాస్కరకవి
11. కాళికాంబ శతకంశ్రీ పోతులూరి వీరబ్రహ్మం
12. తెలుగుబాలజంధ్యాల పాపయ్యశాస్త్రి

ఇ) ముగింపు:
ఈ విధంగా వివిధ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా నేను వివిధ శతక కర్తలు, వారి పద్యాల గొప్పదనం తెలుసుకొన్నాను. అంత పురాతన కాలంలో, సాంఘిక రుగ్మతలు రూపు మాపటానికి కలాన్ని ఎన్నుకొని కృషి చేసిన ఆ మహనీయులు ఎంతో అభినందనీయులు.

Exam Tips:

a) పట్టికలో శతకం పేరు, కవి పేరు, మకుటం కూడా చేరిస్తే నివేదిక మరింత పరిపూర్ణంగా ఉంటుంది.

 

Important Questions – అదనపు ప్రశ్నలు

Question 1: అంతరార్థం తెలుసుకోని చదువు వృథా అనడానికి భాస్కర శతక కర్త ఏ ఉదాహరణ చెప్పారు ?

Answer:

భాస్కరా! ఎంత చదువు చదివినా, అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంటచేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా! అని భాస్కర శతక కర్త అన్నాడు.

Exam Tips:

a) “ఉప్పు లేని కూర” ఉదాహరణను, దాని సారాంశాన్ని (రసజ్ఞత లేని చదువు వ్యర్థం) రెండింటినీ రాయండి.

 

Question 2: “ఇతరులు గౌరవించనంత మాత్రాన తాను చేస్తున్న మంచి పనిని, వృత్తిని తక్కువగా అనుకోనక్కర్లేదు”. ఉదాహరణలతో రామసింహకవి ఎట్లా సమర్థించాడు ?

Answer:

మొగిలిపువ్వు మూలాలు బురదలో ఉన్నంత మాత్రాన దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు. పశువుల దోషాలేవీ పాలకు అంటుకోవు. ఇచ్చే మందులకు వైద్యుని కులంతో సంబంధమేమి ఉండదు. కప్పల దోషాలవల్ల ముత్యాల వన్నె కొంచెం కూడా తగ్గదు. ఎద్దు స్వరూపం ఎట్లున్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు. మనిషిని వెలివేసినా, అతని విద్యకు లోటేమిరాదు. అపవిత్రత వలన కలిగే దోషాలతో అగ్నిదేవునికి సంబంధం లేదు. చందనం మలినమైనంత మాత్రాన సువాసనలు ఎక్కడికీపోవు. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెం కూడా తగ్గదు. ఇతరులు గౌరవించనంత మాత్రాన అతని వృత్తి ఘనతకు ఏ భంగమూ కలుగదు అని పండిత రామసింహకవి చెప్పాడు.

Exam Tips:

a) కనీసం నాలుగైదు ఉదాహరణలు (మొగలిపువ్వు, పాలు, ముత్యాలు, చందనం, బెల్లం) తప్పక రాయండి.

 

Question 3: శతక పద్యాలలోని విలువలు విద్యార్థులను తీర్చి దిద్దుతాయి” ఎట్లాగో వివరించండి.
(లేదా)
శతక పద్యాలలో ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు కదా! వాటిని విద్యార్థులు తెలుసుకోవటం వల్ల భవిష్యత్తులో సమాజం చాలా బాగుంటుంది. ఎట్లాగో వివరించండి.
(లేదా)
“శతక సుధ” పాఠం ద్వారా మీరు తెలుసుకున్న మంచి విషయాలు ఏమిటి?
(లేదా)
సమాజం యొక్క మేలుకోసం శతక పద్యాలు ఏ విధంగా తోడ్పడుతాయి?

Answer:

సమాజహితాన్ని కోరి శతక కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెల్పుతూ, మానవుడిలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. సమాజంలోని ఆచారాలు, నీతిని వివరించుటే లక్ష్యంగా నీతి, భక్తి శతకాలను రచించారు. సమాజహితమే వీరి లక్ష్యం. సత్యం, దయ, శాంతం, భక్తి, ధ్యానం, మంచి మనసు, ధర్మం, ధైర్యం లాంటి గుణాలు నాకు ఇచ్చి నీ భక్తుడుగా ఉండే సుఖం ఇవ్వమని భక్తుల లక్షణాలు తెలిపారు.
పేదవారికి దానం, నీచ సుఖాలకి అబద్ధాలాడకుండుట, వాదనకు దిగకుండుట, హద్దు మీరి ప్రవర్తించకుండా సఖ్యంగా ఉండటం వివేకుల ధనం అని తెల్పారు. శాశ్వత సంపదలు ఇచ్చేది భగవంతుడు. దానం చేయకుండా దాస్తే పోయేముందు తీసుకెళ్ళడు. చివరికి బాటసారుల పాలౌతుంది. ఇతరులు గౌరవించనంతమాత్రాన వృత్తి ఘనతకు భంగం కలుగదు. భగవంతుని భక్తులను సేవించుట భగవంతుని సేవయే అని, మంచిదారిలో నడిచే ఆలోచన కల్గించేది భగవంతుడే అని తెలియచేశారు.
శతక పద్యాలలో ఇటువంటి ఎన్నో మంచి విషయాలు విద్యార్థులు తెలుసుకోవటం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో మంచివారుగా ఉండటమే కాకుండా సమాజాభివృద్ధికి తోడ్పడగలరు. ఇట్లాంటి మంచి నీతులు తెల్పే శతక పద్యాలు విద్యార్థులు చదవటం ఎంతో అవసరం. ఈ నీతులు విద్యార్థులను మంచివారుగా తీర్చి దిద్దుతాయనుటలో అతిశయోక్తి లేదు.

Exam Tips:

a) పాఠంలోని ప్రతి పద్యం నుండి ఒక్కో విలువ (దానం, సత్యం, వివేకం, వినయం, భక్తి) ప్రస్తావించండి.
b) మొదటి వాక్యంలో శతక కవుల లక్ష్యం, చివరి వాక్యంలో విద్యార్థులపై ప్రభావం – ఈ క్రమం పాటించండి.

 

Question 4: “చెడ్డ వారితో ఉన్నంత మాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవు” శతక సుధ పాఠం ఆధారంగా వివరించండి.

Answer:

1. మొగలి పువ్వు మూలాలు బురదలో ఉన్నా పువ్వు ప్రాధాన్యత తగ్గదు.
2. పశువుల దోషాలు పాలకు అంటుకోవు.
3. వైద్యుడిచ్చే మందులకు అతని కులంతో సంబంధమేమీ ఉండదు.
4. కప్పల దోషాల వల్ల ముత్యాల వన్నె తగ్గదు.
5. ఎద్దుల స్వరూపం ఎట్లా ఉన్నా వ్యవసాయానికి ఇబ్బంది రాదు.
6. మనిషిని వెలివేసినా అతని విద్యకు లోటురాదు.
7. అపవిత్ర దోషాలు అగ్నికి అంటవు.
8. చందనం మలినమైనంత మాత్రాన దాని సువాసనలు ఎక్కడికీపోవు.
9. రాయికి అంటిన బెల్లం తీపి కొంచెంకూడా తగ్గదు.
10. ఇతరులు గౌరవించనంత మాత్రాన వృత్తి ఘనతకు ఏ భంగం కలుగదు. దీనిని బట్టి చెడ్డవారితో ఉన్నంతమాత్రాన వారి దోషాలు మంచివారికి అంటుకోవని చెప్పవచ్చు.

Exam Tips:

a) పది ఉదాహరణలను వరుస సంఖ్యలతో రాయండి; చివర ముగింపు వాక్యం మరువకండి.

 

Question 5: శతక సుధ పాఠంలో నీవు చదివిన పద్యాల్లో నీకు బాగా నచ్చిన వాక్యం గురించి మీ చెల్లికి లేఖ రాయండి.

Answer:

ది. XX.XX.XXXX,
ఖమ్మం.
ప్రియమైన చెల్లి దేవికకు!
నీవు బాగా చదువుకుంటున్నావని తలుస్తాను. నేనిక్కడ హాస్టల్లో బాగానే చదువుకుంటున్నాను. ఈమధ్యే మా తెలుగు మాస్టారు ‘శతక సుధ’ పాఠం చెప్పారు. అందులో ఎన్నో చక్కని విషయాలు చెప్పారు. అందులోని ప్రతి పద్యమూ మన జీవితాలకు ఉపయోగపడేదే.
అందులో పండిత రామసింహకవి రాసిన విశ్వకర్మ శతకం నుండి ‘మొదట కర్దమముంటే మొగలి పుష్పముకేమి’ అనే పద్యం నాకు బాగా నచ్చింది.
బురద ఉన్నా మొగలిపువ్వు వాసన తగ్గదు. అపవిత్ర దోషాలతో అగ్నిదేవునికి వచ్చిన చిక్కులేదు. ఇలా ఎన్నో ఉదాహరణలతో మనం చేసే మంచి పనిని ఒకరు గుర్తించకపోయినా నష్టం లేదు అని చెప్పారు. ఒకరి మెప్పుకోసం కాక మన పనిని మనం ఇష్టంతో చేయాలని దీనర్థం.
నీవు కూడా నీ పుస్తకంలోని శతక పద్యాలు చదువు. నీకిష్టమైన పద్యం గూర్చి రాయి. అమ్మనీ, నాన్ననీ అడిగానని చెప్పు.
నీ అక్క
కె. రాజ్యలక్ష్మి
చిరునామా:
కొప్పురావూరి దేవిక
C/o. రమేష్
పుణ్యపురం
వైరా మండలం
ఖమ్మం జిల్లా

Exam Tips:

a) లేఖలో తేదీ, ప్రదేశం, సంబోధన, విషయం, ముగింపు, చిరునామా – అన్నీ ఉండాలి.

 

పాఠ్యభాగ వివరాలు

Question 1: శతకసుధ పాఠ్యభాగం ఉద్దేశం తెల్పండి.

Answer:

శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారుచేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం.

Exam Tips:

a) “నైతిక విలువలు – ఉత్తమ పౌరులు” అనే రెండు కీలక పదాలు రాయండి.

 

Question 2: శతక ప్రక్రియను గురించి వివరించండి.

Answer:

ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే నూరు పద్యాలు కలది. కాని నూటెనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది. పద్యం చివరి పదంగాని, పాదంగాని లేక రెండు పాదాలుగాని అన్ని పద్యాల్లో ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు. మకుటమంటే కిరీటం అని కూడా అర్థం. శతకంలోని ప్రతి పద్యం దేనికదే స్వతంత్రభావాన్ని కల్గివుంటుంది.
ఈ పాఠంలోని పద్యాలను నారాయణ, చిత్త, భాస్కర, దాశరథి, నరసింహ, విశ్వకర్మ, శ్రీ వేంకటేశ్వర, శ్రీ బాకవరాంజనేయ శతకాల నుండి తీసుకున్నారు.

Exam Tips:

a) శతకం అర్థం (నూరు పద్యాలు), 108 పద్యాల సంప్రదాయం, మకుటం, స్వతంత్ర భావం – ఈ నాలుగు పాయింట్లు తప్పనిసరి.

 

Question 3: శతక ప్రక్రియ గురించి వివరించండి. (ప్రవేశిక ఆధారంగా)

Answer:

విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో శతకం ఒకటి. మేలిముత్యాల్లాంటి శతక పద్యాలనుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా చదువుకుందాం. నైతిక విలువలను పెంపొందించుకుందాం.

Exam Tips:

a) ప్రవేశికలోని ముఖ్యమైన మాటలను ఉపయోగిస్తూ రెండు మూడు వాక్యాల్లో రాయండి.

 

కవి పరిచయం

Question 1: నారాయణ శతక కర్తను గురించి తెల్పండి.

Answer:

నారాయణ శతకం : ‘నారాయణా!’ అన్న మకుటంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నవి. దీనిని పోతన రాశాడు. ఇతడు వరంగల్లు జిల్లా బమ్మెర వాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగినీదండకం, వీరభద్ర విజయం రాశాడు.

Exam Tips:

a) శతకం పేరు, మకుటం, కవి ఊరు, ఇతర రచనలు – ఈ నాలుగు వివరాలు రాయండి.

 

Question 2: చిత్త శతకం రచించిన కవిని గురించి రాయండి.

Answer:

చిత్త శతకం : శ్రీపతి భాస్కర కవి ‘చిత్తమా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం.

Exam Tips:

a) మకుటం “చిత్తమా!” అని తప్పక రాయండి.

 

Question 3: భాస్కర శతకం రాసిన కవిని పరిచయం చేయండి.

Answer:

భాస్కర శతకం : మారద వెంకయ్య ‘భాస్కరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోను మొదటి, రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి, తరువాతి పాదాలలో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత.

Exam Tips:

a) భాస్కర శతకం ప్రత్యేకత – నీతి + దృష్టాంతం – తప్పక చెప్పండి.

 

Question 4: దాశరథీ శతక కర్తను పరిచయం చేయండి.

Answer:

దాశరథీ శతకం : కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాస్తవ్యుడు. ‘దాశరథీ కరుణాపయోనిధీ!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు.
భద్రాచల రామునిపై అనేక కీర్తనలు రాశాడు.

Exam Tips:

a) కంచర్ల గోపన్న = భక్త రామదాసు అనే విషయాన్ని పేర్కొనండి.

 

Question 5: నరసింహ శతకం రచించిన కవిని గురించి వివరించండి.

Answer:

నరసింహ శతకం : ఈ శతక కర్త కాకుత్థ్సం శేషప్పకవి. కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందినవాడు. “దుష్టసంహార నరసింహ దురితదూర!” అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు. ఈయన నరహరి, నృకేసరీ శతకాలు, ధర్మపురీరామాయణం మొదలగు రచనలు చేశాడు.

Exam Tips:

a) కవి స్వస్థలం (ధర్మపురి), మకుటం, ఇతర రచనలు రాయండి.

 

Question 6: పండిత రామ సింహ కవిని పరిచయం చేయండి.

Answer:

విశ్వకర్మ శతకం : ‘విశ్వపాలన ధర్మ! శ్రీ విశ్వకర్మ!’ అనే మకుటంతో పండిత రామసింహకవి ‘విశ్వకర్మ’ శతకాన్ని రాశాడు. ఈయన కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలంలోని పూర్వపు రాఘవపట్నం వాసి. ఈయన ఆశుకవి. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలగునవి ఇతని రచనలు.

Exam Tips:

a) శతకం పేరు (విశ్వకర్మ శతకం), మకుటం, ఊరు – ఇవి కీలకం.

 

Question 7: శ్రీవేంకటేశ్వర శతక కర్తను గురించి రాయండి.

Answer:

శ్రీవేంకటేశ్వర శతకం : నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ‘వేంకటేశ్వరా!’ అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతీ సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. ఈయన ‘విద్వత్ కవి’గా ప్రసిద్ధి పొందాడు.

Exam Tips:

a) కవి పేరు, ఊరు, మకుటం, ఇతర రచనలు రాయండి.

 

Question 8: శ్రీ బాకవరాంజనేయ శతకం రచించిన కవిని గురించి తెల్పండి.

Answer:

శ్రీ బాకవరాంజనేయ శతకం : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నివాసియైన వేంకటరావు పంతులు, తాండూర్ దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామిపై “బాకవరాంజనేయ! ఖలభంజన! సాధుజనానురంజనా! అనే మకుటంతో పద్యాలను రాశాడు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు రాశాడు.

Exam Tips:

a) శతక కర్త పేరు, నివాసం, మకుటం రాయండి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 8 Telugu Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas)

Official TS Board Solutions for Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas)

Explore reliable textbook solutions for Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas) tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Step-by-Step Explanations for Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas)

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Next Steps in Your Telugu Revision

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 05 Shataka Sudha (Nectar of Shatakas) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 8th Class Telugu 5th Lesson శతక సుధ Questions and Answers for the 2026-27 session?

The complete and updated TS 8th Class Telugu 5th Lesson శతక సుధ Questions and Answers is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 8th Class Telugu 5th Lesson శతక సుధ Questions and Answers as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu 5th Lesson శతక సుధ Questions and Answers will help students to get full marks in the theory paper.

Do you offer TS 8th Class Telugu 5th Lesson శతక సుధ Questions and Answers in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Telugu. You can access TS 8th Class Telugu 5th Lesson శతక సుధ Questions and Answers in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire TS 8th Class Telugu 5th Lesson శతక సుధ Questions and Answers in printable PDF format for offline study on any device.