TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు

Step-by-Step Textbook Solutions for Class 7 Telugu Lesson 08 Village Festivals and Sports (Gramalaloni Vedukalu Kreeda Vinodalu)

Review structured textbook solutions for Class 7 Telugu Lesson 08 Village Festivals and Sports (Gramalaloni Vedukalu Kreeda Vinodalu). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Lesson 08 Village Festivals and Sports (Gramalaloni Vedukalu Kreeda Vinodalu) Textbook Solutions PDF

View or download the dedicated Lesson 08 Village Festivals and Sports (Gramalaloni Vedukalu Kreeda Vinodalu) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

పాఠ్యపుస్తక ప్రశ్నలు

Question 1: పై బొమ్మ దేనిని గూర్చి తెలియజేస్తున్నది?

Answer:

జాతర గూర్చి తెలియచేస్తోంది. గుడిముందు పండుగ వాతావరణం కనిపిస్తోంది.

Exam Tips:

a) చిత్రంలోని వాతావరణాన్ని (గుడి ముందు పండుగ, జనం) వివరిస్తూ జాతర అని రాయండి.

 

Question 2: పై బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు?

Answer:

పై బొమ్మలో అంగట్లో లడ్డూలు, ప్రసాదాలు అమ్మేవారు, అమ్ముతున్నారు.
మెట్లగుండా బోనాలు (మహిళలు) తీసుకు వెళ్ళుతున్నారు. గాలి బుడగలు అమ్ముతున్నారు. రకరకాల తినుబండారాలు అమ్ముతున్నారు.

Exam Tips:

a) బొమ్మలో కనిపించే వ్యక్తులను, వారు చేసే పనులను విడివిడిగా వాక్యాలలో రాయండి.

 

Question 3: మీరు ఎప్పుడైనా జాతరలకు వెళ్ళారా? ఏయే జాతరలకు వెళ్ళారు?

Answer:

వెళ్ళాం. సికింద్రాబాద్ మహంకాళమ్మ జాతర, మేడారం (సమ్మక్క, సారక్క) జాతరలకు వెళ్ళాం. ఇది వరంగల్ జిల్లాలో ఉన్నది. నాగోబా జాతర (ఆదిలాబాద్ జిల్లాలో), కొమరవెల్లి మల్లన్న జాతర (కరీంనగర్ జిల్లా)లకు వెళ్ళాం.

Exam Tips:

a) కనీసం మూడు జాతరల పేర్లను, అవి ఉన్న జిల్లాలతో రాయండి.

 

Question 4: మీకు తెలిసిన / చూసిన జాతర గురించి చెప్పండి.

Answer:

సమ్మక్క, సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. వరంగల్లు జిల్లా కేంద్రం నుండి 110 కి.మీ. దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు.
సమస్త గిరిజన సమారాధ్య దేవతలను పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు తరలి వస్తారు. 1996లో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.

Exam Tips:

a) జాతర పేరు, ప్రదేశం, ఎవరిని పూజిస్తారు, ప్రత్యేకత – ఈ నాలుగు అంశాలు ఉండాలి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.75)

Question 1: “ఆటలలో అందం” అంటే ఏమిటి?

Answer:

ఆటలు మనిషికి మానసిక ఆందోళన తగ్గిస్తాయి. అందం అంటే మనసుకు సంబంధించినది. అందమే ఆనందం అని అంటారు. ఆ ఆనందమే జీవితాన్ని నడిపిస్తుంది. మానసిక ఆనందాన్ని ఆటలలో పొందొచ్చు. కాబట్టి ఆటలలో అందం అంటే మానసికోల్లాసం అని అర్థం.

Exam Tips:

a) అందం–ఆనందం–మానసికోల్లాసం మధ్య సంబంధాన్ని వివరించండి.

 

Question 2: గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం ఏది? అది ఎందుకు బాగా నచ్చి ఉంటుంది?

Answer:

గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం తోలుబొమ్మలాట. ఇది తెలుగువారి ప్రత్యేక కళారూపం. అనేక సంవత్సరాల నుండి ఉపాసించిన కళ. ఒక సన్నని బట్టను తెరగా గట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెర వెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ దారాలుగట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడిస్తారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణమూ, భారతమూ, మన దేశీయులలో ప్రతి రక్త కణమునందును జీర్ణించిన కథలు. కాబట్టే అది బాగా నచ్చి ఉంటుంది.

Exam Tips:

a) తోలుబొమ్మలాట ఎలా ఆడిస్తారో (తెర, దివిటీలు, దారాలు) క్లుప్తంగా వివరించి, ఎందుకు నచ్చుతుందో కారణం రాయండి.

 

Question 3: మీకు నచ్చిన గ్రామీణ వినోదం ఏది? అది ఎందుకు నచ్చింది?

Answer:

నా(మా)కు నచ్చిన గ్రామీణ వినోదం యక్షగానాలు. దీనినే వీధి నాటకాలు అని కూడా అంటారు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని కూడా పిలుస్తారు. చాలా సంవత్సరాల నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతోపాటు, భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపచేస్తున్న వినోదాలు, వేడుకలు. వినేవారికి అత్యంత రసానుభూతిని కల్గచేస్తుంది. కాబట్టి ఇది నాకు నచ్చింది.

Exam Tips:

a) ఇష్టమైన వినోదం పేరు, అది ఎందుకు నచ్చిందో రెండు కారణాలతో రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.77)

Question 1: స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు ఎందుకు ప్రజలకు నచ్చుతాయో చెప్పండి.

Answer:

స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు, పాటలు మన పల్లెటూళ్ళలో చాలా కనిపిస్తాయి. రంగులరాట్నము, గిల్లిదండ (చిర్రరగోనె), కోడిపందెములు, బొంగరాల ఆట మొదలైనవి స్వయంగా పాల్గొని ఆనందించే ఆటలు. వీటి ద్వారా ప్రత్యక్షంగా ఆనందాన్ని పొందుతున్నారు. కాబట్టి ఇవి ప్రజలకు నచ్చుతాయి.

Exam Tips:

a) రంగులరాట్నం, గిల్లిదండ వంటి ఆటల పేర్లను ఉదహరించి “ప్రత్యక్ష ఆనందం” అనే కారణాన్ని చెప్పండి.

 

Question 2: ఈ రోజుల్లో స్త్రీలు మధ్యాహ్నవేళ పచ్చీసు మొదలైన ఆటలు ఎందుకు ఆడటం లేదో చెప్పండి.

Answer:

ప్రస్తుత పరిస్థితులలో విదేశీ సంస్కృతిని ప్రతిబింబించే టెలివిజన్లో సీరియల్స్ చూడటం, సినిమాలపై మక్కువ కల్గటం వల్ల ఈ మధ్యాహ్నపు వేళ ఆడే పచ్చీసు మొదలైన ఆటలు ఆడటం లేదు.

Exam Tips:

a) టెలివిజన్, సినిమాల ప్రభావం వంటి ఆధునిక కారణాలను కనీసం రెండు రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.79)

Question 1: మీకు తెలిసిన జాతర గురించి చెప్పండి.

Answer:

సమ్మక్క, సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. వరంగల్లు జిల్లా కేంద్రం నుండి 110 కి.మీ. దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు, సమస్త గిరిజన సమారాధ్య దేవతలను పూజించడం ఇక్కడ ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు తరలి వస్తారు. 1996లో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.

Exam Tips:

a) సమ్మక్క–సారక్క జాతర వివరాలు (మేడారం, గిరిజన జాతర, రాష్ట్ర పండుగ) క్రమంలో రాయండి.

 

Question 2: ఈ “ముగ్గులు స్త్రీల కళాభిరుచికి ఉదాహరణలు” అనే రచయిత అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.

Answer:

ముగ్గులు వేయడం పల్లెటూరి బాలికలకు, యువతులకు మిక్కిలి ఆహ్లాదకరమైన వేడుక. రకరకాల ముగ్గులను వేయడంలో నైపుణ్యం ప్రదర్శించే స్త్రీలు మన పల్లెటూళ్ళలో పుష్కలంగా కనిపిస్తారు. ఈ ముగ్గులు తెలుగు పడతుల సౌందర్యరక్తికి, కళాభిరుచికీ గొప్ప (మంచి) ఉదాహరణలు.

Exam Tips:

a) సమర్థన ప్రశ్న: మొదట అంగీకారం, తర్వాత కారణాలు (ముగ్గులు, కళాభిరుచి) చెప్పండి.

 

Question 3: గ్రామీణ ఉత్సవాల వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం ఏమిటి?

Answer:

1. గ్రామీణ ఉత్సవాల వల్ల వినోదం లభిస్తుంది.
2. ఉత్తమ సంస్కృతిని తెలుసుకోవచ్చు.
3. సంప్రదాయాలు తెలుస్తాయి.
4. మానసికోల్లాసాన్ని కల్గిస్తాయి.
5. ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది.
6. క్రీడాస్ఫూర్తి కలుగుతుంది.
7. శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత తెలుస్తుంది.
8. ఇరుగుపొరుగువారితో, సమాజంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.

Exam Tips:

a) ఉత్సవాల ప్రయోజనాలను సంఖ్యలతో జాబితాగా రాయండి (సంస్కృతి, సంప్రదాయాలు, మానసికోల్లాసం, క్రీడాస్ఫూర్తి).

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: గ్రామాలలోని కళలు, క్రీడలు నేడు మనకు కనిపించకపోవడానికి కారణాలు చెప్పండి.

Answer:

1. గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు, కళలు దాదాపుగా కనుమరుగైపోయాయి.
2. ప్రస్తుతం ప్రజలు ఆడే ఆటలు గెలుపు ఓటములే లక్ష్యంగా, జూదంగా పరిణమిస్తున్నాయి.
3. పిల్లలు మైదానాలకు దూరమైనారు.
4. కంప్యూటర్లలో ఆటలు ఆడుతున్నారు.
5. చరవాణి (సెల్‌ఫోన్)లతో ఆటలాడుతున్నారు.
6. పాశ్చాత్య వికృత నృత్యాలు, ప్రసార మాధ్యమాలలోని విపరీత పోకడల ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు.
7. మానవ సంబంధాలు దూరమవుతున్నాయి.

Exam Tips:

a) పాఠం ప్రవేశికలోని కారణాలనే క్రమంగా సంఖ్యలతో రాయండి (కంప్యూటర్, చరవాణి, ప్రసార మాధ్యమాలు).
b) కనీసం ఐదు కారణాలు రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 2: గ్రామీణ కళలు, క్రీడలు ప్రజలను సమైక్యంగా ఎట్లా ఉంచాయో చర్చించండి.

Answer:

1. గ్రామీణ కళలు, క్రీడలు ప్రజలను సమైక్యంగా ఉంచాయి.
2. మైదానాలలో, ఆరుబయలు ప్రదేశాలలో ఆటలవల్ల సమష్టితత్వం ఏర్పడేది.
3. ఇరుగుపొరుగువారు, సంఘంలోని అందరూ ఒకటేననే భావన (వసుధైక కుటుంబ భావన) బలపడేది.
4. ఎడ్లపందాలు, కోలాటం మొదలగు ఆటలలో పోటీతత్వం బలపడేది.
5. విజ్ఞానం అభివృద్ధి అయ్యేది.
6. అలుపు, సొలుపు లేకుండా ఆడుతూ, పాడుతూ పనిచేసేవారు.
7. కాయకష్టం విలువ తెలిసేది.
8. రామాయణ, మహాభారత, భాగవత కథలు ప్రజలకు నీతిని తెల్పేవి. ఉదా: తోలుబొమ్మలాట. ఈ విధంగా గ్రామీణ క్రీడలు, కళలు ప్రజలను సమైక్యంగా ఉంచేవి.

Exam Tips:

a) సమైక్యతకు కారణాలను (కలిసి ఆడటం, కథల ద్వారా నీతి) ఉదాహరణలతో చెప్పండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: కింది విషయాలు పాఠంలో ఏయే పేరాలలో ఉన్నాయో వెతికి వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు పట్టికలో రాయండి.

Answer:

విషయంపేరాముఖ్యాంశాలు
1. తోలుబొమ్మలాట4వ పేరా1. సమస్త జనులను ఆకర్షిస్తుంది.
2. ఇది తెలుగువారి ప్రత్యేకత.
3. అనేక సంవత్సరాల నుండి ఉపాసించిన కళ.
4. రామాయణ, భారత కథలకు చెందినది.
5. తెర వెనుక తోలుబొమ్మల కాళ్ళకూ చేతులకూ దారాలు కట్టి ఆడిస్తారు.
2. చిర్రగోనె ఆట6వ పేరా1. దీనికి మరొక పేరు గిల్లిదండ.
2. ఇది చాలా పురాతనమైనది.
3. తెలంగాణ పల్లెటూళ్ళలో దీనిని చిర్రగోనె అంటారు.
4. భారతంలో కౌరవులు, పాండవులు ఈ ఆట ఆడారు.
5. ఇది క్రికెట్టు లాంటిదే.
3. అక్షక్రీడ7వ పేరా1. ఇప్పుడు ప్రచారం తగ్గిపోయిన ఆట.
2. మన పల్లెటూళ్ళలోని ఉన్నత కుటుంబాలలో విశేష ఆసక్తితో ఆడిన ఆట.
3. పాచికల ఆట; దీనిని అక్షక్రీడ అని అంటారు.
4. తరతరాల నుండి ప్రజలను ఆకర్షించింది.
5. ప్రబంధాలలో కవులు రమణీయంగా వర్ణించారు; రుక్మిణీ శ్రీకృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తరహరివంశంలో వర్ణించబడింది.

Exam Tips:

a) పట్టికలో ప్రతి విషయానికి పేరా సంఖ్య, తర్వాత కనీసం మూడు ముఖ్యాంశాలు రాయండి.
b) పాఠంలో ఆ పేరాను తిరిగి చదివి సంఖ్యలు సరిచూసుకోండి.

 

Question 2: కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలను తయారు చేయండి.
మన రాష్ట్రంలో సాధనాశూరులు ఇంద్రజాల విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు. వీరి ప్రదర్శన గ్రామం మధ్యలో ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ప్రేక్షకులు చూస్తుండగానే తెల్లని వస్త్రాలతో ఒక గుడారం ఏర్పాటుచేసి, ప్రదర్శన ప్రారంభిస్తారు. గుడారం ముందు హాస్యగాడు నిలబడి తనకు వివిధ దేవతల విగ్రహాలు కావాలని ప్రధాన సాధనాశూరుని కోరతాడు. వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, తిరుపతి వెంకన్న, కొండగట్టు అంజన్న…. అంటూ హాస్యగాడు వివిధ దేవుళ్ళ పేర్లు చెబుతుంటాడు. ప్రధాన సాధనాశూరుడు ఒక్కొక్క రాయిని ఒక్కో దేవునిగా అభివర్ణిస్తూ, మూసి ఉన్న గుడారంలో పెడతారు. చివరకు గుడారం తెరచి చూస్తే రాళ్ళకు బదులుగా దేవతల విగ్రహాలు ధూపదీపనైవేద్యాలతోసహా ప్రత్యక్షమౌతాయి. దీంతో చూపరులు ఆశ్చర్యచకితులౌతారు. వీరి ప్రదర్శనలో ప్రేక్షకుని తలపై పొయ్యిపెట్టి పూరీలను కాల్చడం, నీళ్ళకుండలో మూడురంగుల ఇసుకను పోసి, విడివిడిగా మూడురంగుల ఇసుకను ముద్దలు ముద్దలుగా తీయడం, గుడారంలోని ఒక కర్రకు కట్టిన వ్యక్తి మరో కర్రకు మారడం వంటి అంశాలు అందరినీ ఆకర్షిస్తాయి.

Answer:

ప్రశ్నలు:
1. మన రాష్ట్రంలో సాధనాశూరులు ఏ విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తారు?
2. ఇంద్రజాల ప్రదర్శనను ఎక్కడ ఏర్పాటు చేస్తారు?
3. గుడారం ముందు నిలబడి తనకు వివిధ దేవతల విగ్రహాలు కావాలని కోరేది ఎవరు?
4. ఏ దేవుళ్ళ పేర్లను హాస్యగాడు చెబుతాడు?
5. ఇంద్రజాల విద్యలో చూపరులను ఆకర్షించే అంశాలు ఏమిటి?

Exam Tips:

a) జవాబు పేరాలో స్పష్టంగా ఉండే ప్రశ్నలే రాయండి; ఎవరు, ఎక్కడ, ఏమిటి వంటి విభిన్న ప్రశ్న పదాలు వాడండి.

 

III. స్వీయరచన – 1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.

Answer:

పొలములో కలుపుతీసే పడుచులు, ఎద్దులను కాసే బాలకులు, సంపన్నుల ఇండ్లలో తీరిక ఉన్న బాలికలు పాటలు పాడుతూ ఉంటారు. ఈ పాటల వల్ల ఊపు వస్తుంది, సంతోషం కలుగుతుంది. సేద్యం చేస్తూ కూలీలు పాడే జాజర పాటలు ఈనాటికీ కొన్ని ప్రాంతాలలో వ్యాప్తిలో ఉన్నాయి. వరంగల్లు జిల్లా మానుకోట తాలూకాలో రైతు యువకులు మక్కువతో జాజర పాటలు పాడుతారు. ఆడుతూ పాడుతూ పనిచేస్తే ఆనందం కలుగుతుంది; అలుపు, సొలుపు ఉండదు. పెండ్లిపాటలు, అప్పగింతపాటలు, మంగళహారతులు, మేలుకొలుపులు పూర్వపద్ధతి కుటుంబాలలో కనిపిస్తున్నవి. పసిపిల్లలకు జోలపాటల వల్ల చక్కటి నిద్ర వస్తుంది. ఈ విధంగా స్త్రీల పాటల వల్ల స్త్రీలకు, పిల్లలకు ఆనందం కలుగుతుంది.

Exam Tips:

a) పని చేసేటప్పుడు పాడే పాటలు, పిల్లలకు జోలపాటలు – రెండు రకాల ఉదాహరణలు తప్పనిసరిగా ఇవ్వండి.

 

Question 2: “వినేవారి రక్తము ఉడుకెత్తునట్లు కథ చెప్పడం” అంటే మీరు ఏమనుకుంటున్నారో రాయండి.

Answer:

బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథలను చెప్పేవారు గంటల తరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా పల్లెటూరి ప్రజలను ఆకర్షించి, వినోదింపచేస్తారు. కాని ప్రస్తుత పరిస్థితులలో వీటికి వ్యాప్తి తగ్గిపోయింది. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా వీరగాథలను చెప్తారు. వీరగాథల పేరులోనే వీరరసం ఉంది. అది విన్నప్పుడు మన రక్తం ఉడుకుతుందని, మనము వాటిలో లీనమై పోతామని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ కథలు మొదలైనవి ఈ కోవకు చెందినవి.

Exam Tips:

a) జాతీయం యొక్క భావాన్ని (వినేవారు ఉత్తేజితులు కావడం) మొదట రాసి, తర్వాత ఉదాహరణలు (బొబ్బిలికథ, పల్నాటి వీరచరిత్ర) ఇవ్వండి.

 

Question 3: “కొన్ని వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి” అనే వాక్యాన్ని బట్టి వినోదాలకు, ఆర్థిక స్థితికి గల సంబంధాన్ని చెప్పండి.

Answer:

కొన్ని క్రీడలు, వినోదాలు శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్ని సార్వజనికమైనవి, అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండేవి. జనుల ఆర్థిక స్థితిని అనుసరించి క్రీడలు, వినోదాలు తెలుగుసీమలో ఉన్నాయి. “ధనం మూలమ్ ఇదం జగత్” కదా? డబ్బే అన్నింటికీ ఆధారం. డబ్బుతో ముడిపడి ఏపని అయినా సాగుతుంది. చిలుకలను పెంచి, వాటికి బుద్ధులు చెప్పి వినోదించడం డబ్బున్న సుందరాంగులు వేడుకగా చేసేవారు; ఇది పల్లెటూళ్ళలో కనిపించే గొప్ప విషయం.

Exam Tips:

a) ఆర్థిక స్థితి – వినోద సాధనాలు మధ్య సంబంధాన్ని ఒక ఉదాహరణతో (అక్షక్రీడ, చిలుకల పెంపకం) చెప్పండి.

 

Question 4: ఒకనాటి బాలికల ఆటలకు, నేటి బాలికల ఆటలకు గల తేడాలను చెప్పండి.

Answer:

ప్రాచీన బాలికల ఆటలునేటి బాలికల ఆటలు
1. పాచికల ఆట (అక్షక్రీడ)1. స్నేక్ అండ్ లాడర్స్ ఆట
2. పచ్చీసు ఆట2. చైనీస్ చెకర్స్ ఆట
3. ఉయ్యాలలూగడం3. ఇండోర్ బోర్డ్ ఆటలు
4. గుర్రపు స్వారీ4. గుర్రపు స్వారీ ఇప్పుడూ కొందరు చేస్తున్నారు
5. కబడ్డీ5. కబడ్డీ ఇప్పుడూ ఉంది
6. శారీరక శ్రమతో కూడిన ఆటలు ఎక్కువ6. కంప్యూటర్, చరవాణి ఆటలు ఎక్కువ

Exam Tips:

a) పట్టిక రూపంలో రాస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి; ఎడమ వైపు ప్రాచీన, కుడివైపు నేటి ఆటలు ఉంచండి.
b) చివర్లో “శారీరక శ్రమ తగ్గిపోయింది” అనే ముగింపు వాక్యం రాయండి.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి

Question 1: క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎందుకు అవసరమో మీ అభిప్రాయం రాయండి.

Answer:

క్రీడలు, వినోదాలు మానవ జీవితానికి ఎంతో అవసరము.
1. క్రీడలు, వినోదాలు మనిషిని ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తాయి.
2. ఆలోచనాశక్తిని పెంచుతాయి.
3. జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
4. చురుకుగా ఉండేటట్లు చేసి, శారీరక స్పందనలను నియంత్రిస్తాయి.
5. మనిషి బద్ధకాన్ని దూరంగా ఉంచుతాయి.
6. మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయి.
7. సంస్కృతి తెలుస్తుంది.
8. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
9. స్నేహితులు దగ్గరౌతారు.
10. మానవ సంబంధాలు మెరుగుపడతాయి.
11. శారీరక, మానసిక సమస్యల నుండి బయటపడవచ్చు.
12. పట్టుదల పెరుగుతుంది, ఆశయం ఏర్పడుతుంది.
ఈ విధంగా మానవ జీవితానికి క్రీడలు, వినోదాలు ఎంతో అవసరమని నా అభిప్రాయం.

Exam Tips:

a) శారీరక, మానసిక, సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరించి రాస్తే జవాబు క్రమబద్ధంగా ఉంటుంది.
b) పది వాక్యాలు పూర్తి చేయండి; మొదట ఉపోద్ఘాతం, చివర ముగింపు వాక్యం ఉంచండి.

 

Question 2: ఆటకు పాటకు విడరాని చుట్టరికమున్నదనే రచయిత మాటలను సమర్థిస్తూ రాయండి.

Answer:

ఆటకు పాటకు విడరాని సంబంధం ఉంది.
1. శ్రుతికి, లయకు ఉన్నంత సంబంధం ఆటకు పాటకు ఉంది. పగలూ రాత్రి, గెలుపు ఓటములు, కష్టసుఖాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నట్లు ఆటకు పాటకు చుట్టరికమున్నదని నా అభిప్రాయం.
2. కబడ్డీ, కబడ్డీ అని కూత పెడితే ఉత్సాహంతో ఆడటానికి, ఎదుటివాడిని గెలవటానికి ఉపయోగపడుతుంది.
3. కోకో ఆట కూడా అలాగే ఉంటుంది.
4. బతుకమ్మ ఆటలో పాట, ఆట కలిపి ఆడతారు. ఇది తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగే పండుగ.
5. యక్షగానాలలో (జక్కులు) పాటలు పాడుతూ ఆడతారు. ఉదా: బొబ్బిలికథ, బాలనాగమ్మ.
6. వీరగాథలను (జంగం కథలను) పాటలతో చెపుతారు. ఈ విధంగా ఆటకు పాటకు వీడరాని చుట్టరికమున్నదని నేను నమ్ముతున్నాను.

Exam Tips:

a) సమర్థించే ప్రశ్నలో మొదట మీ అంగీకారాన్ని స్పష్టంగా చెప్పి, తర్వాత కబడ్డీ, బతుకమ్మ, యక్షగానం వంటి ఉదాహరణలు ఇవ్వండి.

 

IV. సృజనాత్మకత/ప్రశంస

Question 1: మీకు తెలిసిన ఏవేని నాలుగు పద్యాలను బతుకమ్మ పాటగా మార్చి రాయండి.
ఉదా:
ఉప్పుకప్పురంబు ఉయ్యాలో …. ఒక్క పోలికనుండు ఉయ్యాలో ….
చూడచూడరుచులు ఉయ్యాలో …. జాడలువేరమ్మ ఉయ్యాలో….

Answer:

1. మేడిపండు చూడ మేలిమై యుండు ఉయ్యాలో ….
పొట్టవిప్పిచూడ పురుగులుండు ఉయ్యాలో ….
2. అనగ అనగ రాగ మతిశయిల్లుచునుండు ఉయ్యాలో ….
తినగ తినగ వేము తియ్యనుండు ఉయ్యాలో ….
సాధనమున పనులు సమకూరు ధరలోన ఉయ్యాలో….
3. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు ఉయ్యాలో….
కొంచెమైన నదియు కొదువగాదు ఉయ్యాలో ….
విత్తనంబు మఱి వృక్షమునకు నెంత ఉయ్యాలో ….

Exam Tips:

a) పద్యంలోని పాదాల చివర “ఉయ్యాలో” చేర్చి లయ కుదిరేలా రాయండి; భావం మారకుండా చూడండి.

 

Question 2: గ్రామీణ కళాకారులను ప్రశంసిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.

Answer:

వరంగల్లు,
తేది: XX-XX-XXXX
ప్రియమైన మిత్రుడు రవికి,
నేను క్షేమం. నీవు క్షేమమేనా?
మన గ్రామాలు సంస్కృతికి పట్టుకొమ్మలు. మన గ్రామాలలో కళాకారులు ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నారు. తోలుబొమ్మలాట ఆడేవారు, హరికథలు చెప్పేవారు, భాగోతులు ఒకప్పుడు మంచి బతుకు బతికి కాలం కలిసిరాక ఇలా ఉన్నారు. వారు తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తూ ఉంటే రామాయణ భారతాలు చాలా చక్కగా అర్థం అయ్యేవి. హరికథలు పిట్టకథలతో భలేగా చెప్పేవారు. భాగోతులు వివరంగా కథలను చెప్పేవారు. వారు సంస్కృతి పరిరక్షకులు. కొవ్వొత్తిలాగా తను వెలుగుతూ కాంతిని ఇచ్చినట్లే మనకు వినోదాన్ని పంచుతారు. మా నాయనమ్మ, తాతయ్యలు ఈ విషయాలు చెప్పారు; వాటిని ప్రత్యక్షంగా నేను చూశాను. నీకు తెలిసిన విషయాలు కూడా రాయగలవు. ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ!
ఇట్లు,
నీ మిత్రుడు నాగరాజు.
చిరునామా:
పి. రవి, 7వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
మధిర, ఖమ్మం (జిల్లా),
తెలంగాణ (రాష్ట్రం).

Exam Tips:

a) లేఖలో స్థలం, తేదీ, సంబోధన, విషయం, ముగింపు, పంపినవారి పేరు, చిరునామా – ఈ ఏడు భాగాలు తప్పనిసరి.

 

Question 3: నీవు దర్శించిన ఏదైనా పర్యాటక క్షేత్రం గురించి వర్ణిస్తూ రాయండి.

Answer:

నేను మా మామయ్యగారింటికి హైదరాబాద్‌లోని బోరబండకు వెళ్ళాను. మామయ్య భాగ్యనగరాన్ని చూపించారు. భాగ్యనగరం ఎంతో అందమైన నగరం; నన్ను ఎంతో ఆనందింపచేసింది. హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతులు, మతాలు, భాషల కలయిక కేంద్రం. మేము చార్మినార్‌ను చూశాము. అందులోని ఎత్తైన నాలుగు మినార్లు, వాటి నిర్మాణం నాకు నచ్చింది. జంతుప్రదర్శనశాలకు వెళ్ళాం. రంగురంగుల పక్షులు, కీటకాలు, చిన్నచిన్న ప్రాణులు నన్ను ఆనందింపచేశాయి. సాలార్జంగ్ మ్యూజియం చాలా బాగుంది. ప్రాచీనకాలపు శిల్పాలు, వస్తువులు, ఆయుధాలు చూశాం. తెల్లపాలరాతితో కట్టిన బిర్లామందిరం అద్భుతం. ప్లానెటోరియం చాలా నచ్చింది. ట్యాంక్‌బండ్, బుద్ధుని విగ్రహం, ఎన్టీఆర్ పార్కు, రామకృష్ణామిషన్ మఠం మొదలైన అందమైన ప్రదేశాలను చూశాం. ఈ సెలవుల్లో చక్కగా సంతోషంగా గడిపాం.

Exam Tips:

a) వర్ణనలో ప్రదేశం పేరు, ప్రత్యేకత, మీ అనుభూతి – మూడు అంశాలు ఉండాలి.

 

V. పదజాల వినియోగం – 1. కింది పదాలకు అర్థాలను రాసి, వాక్యాలలో ప్రయోగించండి

Question 1: కింది పదాలకు అర్థాలను రాసి, వాక్యాలలో ప్రయోగించండి.
ఉదా: మేలుకొలుపు = మా నాయనమ్మ మేలుకొలుపు గీతాలు చక్కగా పాడుతుంది.
అ) ఆసక్తి
ఆ) వీనులవిందు
ఇ) శోభ
ఈ) పురాతనమైన

Answer:

అ) ఆసక్తి = ఆపేక్ష, అభిరుచి
వాక్యప్రయోగం: నాకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎక్కువ.
ఆ) వీనులవిందు = చెవికి ఇష్టమైనది
వాక్యప్రయోగం: సంగీతం వీనులవిందు చేస్తుంది.
ఇ) శోభ = అందం, కాంతి
వాక్యప్రయోగం: దీపాల వెలుగులో ఇల్లంతా శోభతో వెలిగిపోయింది.
ఈ) పురాతనమైన = బహుదినములనాటిది, జీర్ణించినది
వాక్యప్రయోగం: ఓరుగల్లుకోట పురాతనమైనది.

Exam Tips:

a) పదానికి అర్థం ఇచ్చాక ఆ పదాన్నే ఉపయోగించి కొత్త వాక్యం రాయండి; పాఠంలోని వాక్యాన్ని కాపీ చేయవద్దు.

 

Question 2: కింది వాక్యాలు చదివి సమాన అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి.
అ) శ్రీరామనవమి పండుగ వైభవంగా జరిగింది. ఈ పర్వాన్ని చూడటానికి ప్రజలు తరలివచ్చారు. ఈ వేడుక అందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది.
ఆ) శ్రీజకు చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఎక్కువ. ఇష్టంతో బొమ్మలు గీసింది. ఆమె అభిరుచిని ఉపాధ్యాయులు అభినందించారు.
ఇ) రామయ్య గృహం నిర్మించుకోవాలనుకుని, ఇల్లుకు సరిపోయే స్థలం కొని, సదనం నిర్మించాడు.

Answer:

అ) పండుగ, పర్వం, వేడుక
ఆ) ఆసక్తి, ఇష్టం, అభిరుచి
ఇ) గృహం, ఇల్లు, సదనం

Exam Tips:

a) ఒకే అర్థం ఉన్న పదాలు (పర్యాయపదాలు) ప్రతి వాక్యంలో మూడేసి ఉంటాయి; అన్నింటినీ గుర్తించండి.

 

Question 3: కింది వికృతి పదాలకు సరిపోయే ప్రకృతి పదాలు గళ్ళలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి.
అ) పబ్బము
ఆ) పున్నమి
ఇ) జీతం
ఈ) కర్జము

Answer:

అ) పబ్బము = పర్వము
ఆ) పున్నమి = పౌర్ణమి
ఇ) జీతం = జీవితం
ఈ) కర్జము = కార్యము

Exam Tips:

a) ప్రకృతి = సంస్కృత మూల పదం, వికృతి = తెలుగులో మారిన రూపం; జంటలను గుర్తుంచుకోండి (పర్వము–పబ్బము, కార్యము–కర్జము, పౌర్ణమి–పున్నమి, జీవితం–జీతం).

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది వాక్యాల్లో “సమాపక”, “అసమాపక” క్రియలేవో గుర్తించి రాయండి.
అ) శిరీష అన్నం తిని, సినిమాకు వెళ్ళింది.
ఆ) రమ బడికి వెళ్ళి, చదువుకున్నది.
ఇ) విజయ్ పుస్తకం చదివి, నిద్రపోయాడు.
ఈ) భరత్ బొమ్మలు గీసి, ప్రదర్శనకు పెట్టాడు.

Answer:

అ) అసమాపక క్రియ: తిని; సమాపక క్రియ: వెళ్ళింది
ఆ) అసమాపక క్రియ: వెళ్ళి; సమాపక క్రియ: చదువుకున్నది
ఇ) అసమాపక క్రియ: చదివి; సమాపక క్రియ: నిద్రపోయాడు
ఈ) అసమాపక క్రియ: గీసి; సమాపక క్రియ: పెట్టాడు

Exam Tips:

a) వాక్యం చివరి క్రియ సమాపక క్రియ (పని పూర్తయినట్లు చెబుతుంది); “-ని/-ఇ/-సి” తో ముగిసి వాక్యం కొనసాగించేది అసమాపక క్రియ.

 

Question 2: ఈ వాక్యాలు ఏ రకమైనవో గుర్తించండి.
అ) మీరు ఏ ఊరు వెళ్తున్నారు ?
ఆ) ఈ పాఠం చదువు.
ఇ) వసంత ఎంత బాగా పాడిందో !
ఈ) మన పాఠశాలకు ఎవరు వచ్చారు ?
ఉ) చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా !
ఊ) పూలనన్నింటినీ హారంగా కూర్చండి.

Answer:

అ) ప్రశ్నార్థక వాక్యం
ఆ) విధ్యర్థక వాక్యం
ఇ) ఆశ్చర్యార్థక వాక్యం
ఈ) ప్రశ్నార్థక వాక్యం
ఉ) ఆశ్చర్యార్థక వాక్యం
ఊ) విధ్యర్థక వాక్యం

Exam Tips:

a) చివరి గుర్తు సూచన: “?” ప్రశ్నార్థకం, “!” ఆశ్చర్యార్థకం; ఆజ్ఞ/విధి సూచిస్తే విధ్యర్థకం.

 

ప్రాజెక్టు పని

Question 1: మీ జిల్లాలోని ముఖ్యమైన / పెద్ద చెరువులు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయి? మొదలగు విషయాలను ఒక పట్టిక ద్వారా వివరించండి. నివేదిక రాయండి. ప్రదర్శించండి. (లేదా) గ్రామీణ వేడుకలు లేదా క్రీడలకు సంబంధించిన పాట/గేయం/కథ/వ్యాసం సేకరించి తరగతిలో ప్రదర్శించండి.

Answer:

హైదరాబాద్ నగరంలోని, పరిసరాలలోని చెరువులు (ఉదాహరణ):

చెరువుప్రదేశం / ప్రత్యేకత
1. ఆల్వాల్ చెరువుసికింద్రాబాద్‌కు సుమారు 8 కి.మీ. దూరం; గణేష్ నిమజ్జనానికి వాడతారు.
2. బంజారా చెరువుబంజారాహిల్స్‌లో ఉంది.
3. దుర్గం చెరువురంగారెడ్డి జిల్లాలో ఉంది; రహస్య చెరువు అంటారు.
4. హిమాయత్ సాగర్మూసీనదికి ఉపనది; ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది.
5. హుస్సేన్ సాగర్హైదరాబాద్‌లో ఉంది; హజ్రత్ హుస్సేన్ షా వలీ 1562లో నిర్మించారు.
6. మీర్ ఆలం చెరువునెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర ఉంది.
7. ఉస్మాన్ సాగర్గండిపేటలో ఉంది; నిజాం కాలంలో నిర్మించారు; తాగునీటి జలాశయం.
8. సరూర్‌నగర్ చెరువుహైదరాబాద్‌లో ఉంది; 1626లో నిర్మించారు; వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడేది.
9. షామీర్‌పేట చెరువుపక్షుల సందర్శనకు ప్రసిద్ధి.
ఈ పట్టిక ఆధారంగా హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులను వివరించాను. ఇవి చరిత్రలో ఎంతో గొప్పవి. తెలంగాణ ప్రభుత్వం “మిషన్ కాకతీయ” పేరుతో చెరువులను పునరుద్ధరించే పథకం చేపట్టింది.
(లేదా) ఎడ్లబండి పాట:
కట్టు కట్టర బండి కాడెడ్ల బండి
గుంజు గుంజర బండి కాడెడ్ల బండి
ఎత్తు ఎత్తుర బండి కాడెడ్లా బండి

Exam Tips:

a) చెరువు పేరు, ఉన్న ప్రదేశం, ప్రత్యేకత – ఈ మూడు కాలమ్‌లు పట్టికలో ఉండాలి; మీ జిల్లా చెరువులను రాస్తే ఎక్కువ మార్కులు.
b) ప్రాజెక్టు పనిలో “లేదా” ప్రశ్నలలో ఒకదానికే సమాధానం ఇవ్వండి.

 

అదనపు ప్రశ్నలు (Important Questions)

I. క్రింది ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించండి

Question 1: ఇళయరాజా సంగీతం వీనులవిందు చేస్తుంది. (దీనికి అర్థం గుర్తించండి.)
a) చెవికి ఇష్టం
b) కంటికి ఇష్టం
c) తలకు ఇష్టం

Answer:

a) చెవికి ఇష్టం

Exam Tips:

a) “వీనులు” అంటే చెవులు; పదాన్ని విడదీసి అర్థం చెప్పండి.

 

Question 2: మేడారం జాతర వల్ల ప్రకృతికి శోభ వచ్చింది. (శోభ అర్థం గుర్తించండి.)
a) చీకటి
b) కాంతి
c) నల్లన

Answer:

b) కాంతి

Exam Tips:

a) శోభ = కాంతి, అందం; సందర్భాన్ని చూసి ఎంచుకోండి.

 

Question 3: మితిమీరిన ఆశ ఉండకూడదు. (ఆశ అర్థం గుర్తించండి.)
a) ఆరోగ్యం
b) శరీరం
c) ఆసక్తి

Answer:

c) ఆసక్తి

Exam Tips:

a) ఆశ = కోరిక; ఇచ్చిన ఎంపికలలో దగ్గరి అర్థం ఉన్నదాన్ని ఎంచుకోండి.

 

Question 4: ఓరుగల్లు కోట శిల్పాల అందం చూడముచ్చటగా ఉంది. (అందం అర్థం గుర్తించండి.)
a) సౌందర్యం
b) వికారం
c) సాకారం

Answer:

a) సౌందర్యం

Exam Tips:

a) అందం, సౌందర్యం పర్యాయపదాలు.

 

Question 5: తెలంగాణ భాష మధురం. తెలంగాణ మాట సుమధురం. తెలంగాణ వచనం మధురాతి మధురం. (పై వాక్యంలో పర్యాయ పదాలు గుర్తించండి.)
a) భాష, మాట, వచనం
b) మధురం, సుమధురం, మధురాతి మధురం
c) తెలంగాణ, వచనం, మధురం

Answer:

a) భాష, మాట, వచనం

Exam Tips:

a) పర్యాయపదాలు ఒకే అర్థం ఉండే వేరు పదాలు (భాష, మాట, వచనం).

 

Question 6: క్రీడలు శరీరానికి ఉల్లాసం ఇస్తాయి. ఆటలు సృజనాత్మకశక్తిని ఇస్తాయి. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) ఉల్లాసం, సృజనాత్మకత
b) శరీరం, ఆటలు
c) క్రీడలు, ఆటలు

Answer:

c) క్రీడలు, ఆటలు

Exam Tips:

a) క్రీడలు = ఆటలు; వాక్యంలో ఒకే అర్థం ఉన్న రెండు పదాలను చూడండి.

 

Question 7: రవి గృహం కొత్తది. రవి ఇల్లుకు రంగులు వేసారు. రవి సదనం నగరంలో ఉంది. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) రవి, కొత్తది
b) నగరం, సదనం
c) గృహం, ఇల్లు, సదనం

Answer:

c) గృహం, ఇల్లు, సదనం

Exam Tips:

a) గృహం, ఇల్లు, సదనం – మూడూ నివాసం అనే అర్థాన్నిస్తాయి.

 

Question 8: శ్రీజకు క్రీడలంటే ఆసక్తి. ఆమె అభిరుచిని మెచ్చుకున్నారు. (పర్యాయ పదాలు గుర్తించండి.)
a) ఆసక్తి, అభిరుచి
b) శ్రీజ, ఆమె
c) క్రీడలు, ఆమె

Answer:

a) ఆసక్తి, అభిరుచి

Exam Tips:

a) ఆసక్తి, అభిరుచి దాదాపు ఒకే అర్థం.

 

Question 9: తెలంగాణలో దసరా పండుగ బాగా చేస్తారు. (పండుగ పదానికి వికృతి గుర్తించండి.)
a) పరువం
b) పౌర్ణం
c) పబ్బం

Answer:

c) పబ్బం

Exam Tips:

a) పండుగ → పర్వము → పబ్బము అనే వికృతి క్రమాన్ని గుర్తుంచుకోండి.

 

Question 10: కార్యములు సాధనమున సమకూరును. (వికృతి గుర్తించండి.)
a) కర్జము
b) కావ్యము
c) సాహిత్యం

Answer:

a) కర్జము

Exam Tips:

a) కార్యము (ప్ర) – కర్జము (వి).

 

Question 11: జీవితం అందమైనది. (వికృతి గుర్తించండి.)
a) జీవితము
b) జీతం
c) గీతం

Answer:

b) జీతం

Exam Tips:

a) జీవితము (ప్ర) – జీతము (వి).

 

Question 12: వ్యవసాయదారులు సేద్యము చేస్తారు. (ప్రకృతి రాయండి.)
a) సీత్యము
b) గీతము
c) స్వేదము

Answer:

a) సీత్యము

Exam Tips:

a) సేద్యము (వి) – సీత్యము (ప్ర).

 

Question 13: తెలంగాణలో ఒగ్గుకథ చెపుతారు. (కథ పదానికి వికృతి రాయండి.)
a) కావ్య
b) కత
c) కర్ణం

Answer:

b) కత

Exam Tips:

a) కథ (ప్ర) – కత (వి).

 

Question 14: శ్రావ్య సినిమా చూసి నిద్రపోయింది. (దీనిలో అసమాపక క్రియ గుర్తించండి.)
a) చూసి
b) పోయింది
c) శ్రావ్య

Answer:

a) చూసి

Exam Tips:

a) “-ఇ” తో ముగిసి వాక్యం పూర్తి చేయనిది అసమాపక క్రియ.

 

Question 15: శృతి పుస్తకం చదివి ఇంటికి వెళ్ళింది. (దీనిలో సమాపక క్రియ గుర్తించండి.)
a) వెళ్ళింది
b) చదివి
c) శృతి

Answer:

a) వెళ్ళింది

Exam Tips:

a) చివరి క్రియ (వెళ్ళింది) సమాపక క్రియ.

 

Question 16: విజయశ్రీ పాఠం చెప్పి, ఖమ్మం వెళ్ళింది. (అసమాపక క్రియ గుర్తించండి.)
a) చెప్పి
b) వెళ్ళింది
c) విజయశ్రీ

Answer:

a) చెప్పి

Exam Tips:

a) “చెప్పి” – అసమాపక; “వెళ్ళింది” – సమాపక.

 

Question 17: రవి బొమ్మలు గీసి, వాటిని అమ్మాడు. (సమాపక క్రియ గుర్తించండి.)
a) గీసి
b) అమ్మాడు
c) రవి

Answer:

b) అమ్మాడు

Exam Tips:

a) వాక్యం చివర వచ్చే క్రియ సమాపకం (అమ్మాడు).

 

Question 18: రాజు పరీక్ష రాసి, మంచి మార్కులు పొందాడు. (అసమాపక క్రియ గుర్తించండి.)
a) రాజు
b) పొందాడు
c) రాసి

Answer:

c) రాసి

Exam Tips:

a) “రాసి” అసమాపక క్రియ; “పొందాడు” సమాపకం.

 

Question 19: ఆహా! ఎంత బాగుందో! (ఇది ఏ వాక్యం?)
a) విధ్యర్థకం
b) ఆశ్చర్యార్థకం
c) ప్రశ్నార్థకం

Answer:

b) ఆశ్చర్యార్థకం

Exam Tips:

a) ఆశ్చర్యాన్ని సూచించే “ఆహా!” వాక్యం ఆశ్చర్యార్థకం.

 

Question 20: మన రాష్ట్ర చిహ్నం ఏది? (ఇది ఏ వాక్యం?)
a) ప్రశ్నార్థకం
b) ఆశ్చర్యార్థకం
c) విధ్యర్థకం

Answer:

a) ప్రశ్నార్థకం

Exam Tips:

a) ప్రశ్న చివర “?” ఉంటే ప్రశ్నార్థకం.

 

Question 21: నీవు పాఠం చదువు. (ఇది ఏ వాక్యం?)
a) ప్రశ్నార్థకం
b) ఆశ్చర్యార్థకం
c) విధ్యర్థకం

Answer:

c) విధ్యర్థకం

Exam Tips:

a) ఆజ్ఞ/సూచన ఇచ్చే వాక్యం విధ్యర్థకం.

 

II. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి – 1

గౌతమి, కృష్ణవేణులకు ఆవాసమై, పాడిపంటలకు నిలయమైన తెలుగుసీమలోని పల్లెపట్టులలో కళాసౌందర్యము అడుగడుగున గోచరిస్తుంది. తెలుగువారి భాష యెంత మధురమైనదో, వారి సామాజిక జీవనమంత సుందరమైనదని చెప్పితే అతిశయోక్తి ఆవంతయునుగాదు. భారతదేశమంతటిలో నున్నట్లే తెలుగుసీమలో గూడ నూటికి తొంబదిపాళ్ల జనులు పల్లెటూళ్ళలోనున్నారు. తరతరాల నుండి వ్యాప్తిలోనున్న వేడుకలు, క్రీడా వినోదాలు ఎన్నియో ఇక్కడ కలవు. ఈ క్రీడా వినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తున్నది.

Question 1: తెలుగుసీమ ఏ నదులకు ఆవాసమైనది?

Answer:

గౌతమి, కృష్ణవేణులకు తెలుగుసీమ ఆవాసమైనది.

Exam Tips:

a) గద్యంలోని మొదటి వాక్యంలోనే జవాబు ఉంది; నదుల పేర్లు రెండూ రాయండి.

 

Question 2: తెలుగుసీమలోని పల్లెపట్టులు దేనికి నిలయము?

Answer:

తెలుగుసీమలోని పల్లెపట్టులు పాడిపంటలకు నిలయం.

Exam Tips:

a) ప్రశ్నలోని పదాలను జవాబు వాక్యంలో వాడండి.

 

Question 3: తెలుగుభాష ఎటువంటిది?

Answer:

తెలుగుభాష మధురమైనది.

Exam Tips:

a) ఒక్క పదం విశేషణం చాలు (మధురమైనది), వాక్యంగా రాయడం మంచిది.

 

Question 4: తెలుగుసీమలో ప్రజలు ఎంతశాతం పల్లెటూళ్ళలో ఉన్నారు?

Answer:

తెలుగుసీమలో నూటికి తొంభైశాతం ప్రజలు పల్లెటూళ్ళలో ఉన్నారు.

Exam Tips:

a) “నూటికి తొంబదిపాళ్ళు” = 90 శాతం అని మార్చి రాయండి.

 

Question 5: క్రీడావినోదాలలో ఏమి ప్రతిబింబిస్తున్నది?

Answer:

క్రీడా వినోదాలలో తెలుగువారి సుకుమార అభిరుచి ప్రతిబింబిస్తున్నది.

Exam Tips:

a) జవాబులో “తెలుగువారి” అనే పదాన్ని చేర్చండి.

 

III. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి – 2

ఆటలకూ పాటలకూ వీడరాని చుట్టరికమున్నది. తెలుగు పల్లెలలో రకరకాలైన ఆటలను మనము చూడవచ్చును. ఈ ఆటలు మనస్సుకు ఉల్లాసము కలిగించే వేడుకలు. ఇందులో సమస్త జనులను ఆకర్షించే తోలుబొమ్మలాట సుప్రసిద్ధమైనది. ఈ తోలుబొమ్మలాట తెలుగువారి ప్రత్యేకత. వారు అనేక సంవత్సరాలనుండి ఉపాసించిన కళ. ఒక సన్ననిబట్టను తెరగాగట్టి ఆ తెరవెనుక పెద్ద దివిటీలు వెలిగింతురు. తెరవెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ దారాలు గట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వానిని ఆడింతురు. ఈ ఆటను ఆడించే నిపుణులైనవారు కొందరు, మన పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉంటారు. ఈ తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినవి. నిజానికి రామాయణమూ, భారతమూ మన దేశీయులలో ప్రతి రక్తకణము నందు జీర్ణించిన కథలు.

Question 1: వేటికి వేటికి వీడరాని చుట్టరికమున్నది?

Answer:

ఆటలకూ, పాటలకూ వీడరాని చుట్టరికమున్నది.

Exam Tips:

a) గద్యం మొదటి వాక్యమే జవాబు.

 

Question 2: ఆటలు మనకు ఏమి కల్గిస్తాయి?

Answer:

ఆటలు, పాటలు మనకు ఉల్లాసాన్ని కల్గిస్తాయి.

Exam Tips:

a) “మనస్సుకు ఉల్లాసము” అనే పదాలను వాడండి.

 

Question 3: తెలుగువారి ప్రత్యేకత కల్గించే ఆట ఏది?

Answer:

తెలుగువారికి ప్రత్యేకత కల్గించే ఆట తోలుబొమ్మలాట.

Exam Tips:

a) ఆట పేరును స్పష్టంగా రాయండి.

 

Question 4: తోలుబొమ్మలాట ఎట్లా ఆడిస్తారు?

Answer:

ఒక సన్నని బట్టను తెరగా కట్టి ఆ తెరవెనుక పెద్ద దివిటీలు వెలిగిస్తారు. తెరవెనుక తోలుబొమ్మల కాళ్ళకూ, చేతులకూ దారాలు కట్టి బొమ్మలను నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వాటిని ఆడిస్తారు.

Exam Tips:

a) తెర, దివిటీలు, దారాలు – ఈ మూడు అంశాలను క్రమంగా రాయండి.

 

Question 5: తోలుబొమ్మలాటలు ఎక్కువగా వేటికి సంబంధించినవి?

Answer:

తోలుబొమ్మలాటలు ఎక్కువగా రామాయణ, భారత కథలకు సంబంధించినవి.

Exam Tips:

a) రెండు ఇతిహాసాల పేర్లూ రాయండి.

 

IV. క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి – 3

ఈ తోలుబొమ్మలాటవలెనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీధినాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తుంటారు. భాగవతములోని కృష్ణలీలలు మొదలైన వానిని ఆడేవారిని భాగోతులని గూడ పిలుస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రిందటివరకు మన పల్లెటూళ్ళలో ఈ భాగోతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. ఎన్నో నూర్ల సంవత్సరాలనించి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతోపాటు, భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపజేస్తున్న వినోదాలు, వేడుకలు. ఇవన్నీ తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు. భజనమండలులను స్థాపించి, వారానికొకసారి (ఏ శనివారమునాటి సాయంత్రమో) ప్రజలొకచోట సమావేశమై భజనలు గావించుట మన పల్లెటూళ్ళలోని వినోదాలలో ఒక ప్రత్యేకమైన వినోదము. ఇతరులు ఆడుతుండగా చూచి వినోదించే ఆటపాటలలో చేరే వినోదాలు బొబ్బిలికథ, బాలనాగమ్మకథ మొదలైనవి. ఈ కథలను చెప్పేవారు గంటలతరబడి, ఒక్కొక్కసారి ప్రొద్దంతా, పల్లెటూరి ప్రజలను ఆకర్షించి, వినోదింపజేస్తుంటారు. కాని ఈ నాటి మారిన పరిస్థితులలో వీటికన్నింటికీ వ్యాప్తి తగ్గిపోతున్నది. ఈ కథలను చెప్పేవారి నేర్పు చాలా గొప్పది. వినేవారి రక్తము ఉడుకెత్తునట్లుగా వీరగాథలను వీరు చెప్పుచుందురు.

Question 1: ఈ తోలుబొమ్మలాటవలె బహుళ ప్రచారం పొందినవి ఏవి?

Answer:

తోలుబొమ్మలాట వలె బహుళప్రచారం పొందినవి యక్షగానాలు అనే వీధినాటకాలు.

Exam Tips:

a) గద్యం మొదటి వాక్యం నుంచి జవాబు రాయండి.

 

Question 2: యక్షగానాలు ఆడేవారిని ఏమంటారు?

Answer:

యక్షగానాలు అనే వీథి నాటకాలను ఆడేవారిని జక్కులని అంటారు.

Exam Tips:

a) “జక్కులు” అనే పేరును గుర్తుంచుకోండి.

 

Question 3: ఏవి తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు?

Answer:

యక్షగానాలు, తోలుబొమ్మలాటలు, భాగోతాలు తెలుగువారి కళాభిరుచికి మంచి నిదర్శనాలు.

Exam Tips:

a) మూడు కళారూపాలను తప్పక పేర్కొనండి.

 

Question 4: ఆటపాటలలో చేరే వినోదాలకు రెండు ఉదాహరణలివ్వండి.

Answer:

ఆటపాటలలో చేరే వినోదాలకు బొబ్బిలికథ, బాలనాగమ్మకథ ఉదాహరణలు.

Exam Tips:

a) రెండు ఉదాహరణలు అడిగితే రెండే రాయండి.

 

Question 5: కథలను చెప్పేవారు వీరగాథలను ఎలా చెపుతారు?

Answer:

కథలను చెప్పేవారు వీరగాథలను వినేవారి రక్తం ఉడుకెత్తునట్లుగా చెపుతారు.

Exam Tips:

a) గద్యంలోని చివరి వాక్యం నుంచి సరళమైన భాషలో రాయండి.

 

V. గద్యం చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి

Question 1: కింది గద్యాన్ని చదివి ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
పల్లెటూళ్ళలో ఉయ్యాలలూగుట బాలబాలికలేగాక పెద్దలు గూడ మిక్కిలి మక్కువ జూపించే క్రీడ. ఏదోవిధమైన ఉయ్యాలను మనము అనేక గృహాలలో చూడవచ్చును. ఈ మధ్య యితర క్రీడల వలెనే సన్నగిల్లిపోతున్నప్పటికినీ గుర్రపుస్వారీ మన గ్రామాలలో బాగుగా అభిమానించిన క్రీడ. మల్లయుద్ధాలు, కుస్తీలు మొదలైనవి తరతరాలనుండి మనవారు అభిమానించి, ప్రోత్సహించిన క్రీడలు. తెలుగుదేశంలోని జమీందార్లు ఇందులో ప్రవీణులైనవారిని తమ ఆస్థానాలలోనికి చేరదీసి వారిని పోషించిరి. దసరా పండుగ సందర్భాలలో ప్రజల సమక్షాన యీ మల్లయుద్ధ ప్రదర్శనలు కుస్తీలు జరిపించి, వారికి బహూకరించే ఆచారము ఇటీవలి వరకు మన పల్లెటూళ్ళలో ఉండేది. కత్తిసాము, కట్టెసాములలో ప్రవీణులైనవారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చును.

Answer:

1. బాలబాలికలేగాక పెద్దలు కూడా మిక్కిలి మక్కువ చూపించే క్రీడ ఏది? – ఉయ్యాలలూగుట.
2. గ్రామాలలో బాగా అభిమానించే క్రీడ ఏది? – గుర్రపుస్వారీ.
3. మనవారు అభిమానించి ప్రోత్సహించిన క్రీడలేవి? – మల్లయుద్ధాలు, కుస్తీలు.
4. ఏ పండుగ రోజు మల్లయుద్ధ ప్రదర్శనలు ఇస్తారు? – దసరా పండుగ.
5. వేటిలో ప్రవీణులైన వారిని మన పల్లెటూళ్ళలో చూడవచ్చు? – కత్తిసాము, కట్టెసాములలో.

Exam Tips:

a) ప్రశ్నతో పాటు జవాబు కూడా గద్యంలో ఉన్నదేనని నిర్ధారించుకోండి.

 

కవి పరిచయం

Question 1: ‘గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.

Answer:

ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు. ఈయన 1917 ఆగస్టు 25న వరంగల్ సమీపంలోని దేశాయిపేట గ్రామంలో వేంకటచలపతిరావు, ఆండాళమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హైస్కూలు విద్య హన్మకొండలో పూర్తిచేశాడు. 1939లో బి.ఏ. పట్టా, 1942–44 మధ్యకాలంలో న్యాయశాస్త్ర పట్టాలను పొందాడు. 1946లో ‘శోభ’ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితి, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. “ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు” ఈయన ఆత్మకథ. ఈయన 1993 జూన్ 8న మరణించాడు.

Exam Tips:

a) కవి పేరు, జననం, విద్య, పత్రికలు, రచనలు – ఈ క్రమంలో రాయండి.
b) ఈ పాఠం “రేడియో ప్రసంగం” ప్రక్రియకు చెందినదని కూడా గుర్తుంచుకోండి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 7 Telugu Lesson 08 Village Festivals and Sports (Gramalaloni Vedukalu Kreeda Vinodalu)

Accessing Lesson 08 Village Festivals and Sports (Gramalaloni Vedukalu Kreeda Vinodalu) Solutions

Review comprehensive exercise answers for Class 7 Telugu Lesson 08 Village Festivals and Sports (Gramalaloni Vedukalu Kreeda Vinodalu). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 7 Telugu

Clear, methodical explanations accompany every challenging problem within the Class 7 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 08 Village Festivals and Sports (Gramalaloni Vedukalu Kreeda Vinodalu) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు for the 2026-27 session?

The complete and updated TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు is available for free on StudiesToday.com. These solutions for Class 7 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Telugu. You can access TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire TS 7th Class Telugu 8th Lesson Questions and Answers Telangana గ్రామాలలోని వేడుకలు క్రీడావినోదాలు in printable PDF format for offline study on any device.