TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి

Step-by-Step Textbook Solutions for Class 7 Telugu Lesson 07 Shilpi (The Sculptor)

Explore reliable textbook solutions for Lesson 07 Shilpi (The Sculptor) tailored for Class 7 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Download Lesson 07 Shilpi (The Sculptor) Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 7 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

పాఠ్యపుస్తక ప్రశ్నలు

Question 1: పై బొమ్మలను చూడండి. అవి వేటితో తయారైనాయి?

Answer:

పై చిత్రంలోని స్తంభాలు, అరుగులు, విగ్రహాలు, మండపాలు, తోరణాలు మొదలైనవన్నీ రాతితో తయారయ్యాయి.

Exam Tips:

a) చిత్రంలో కనిపించే వస్తువులను (స్తంభాలు, విగ్రహాలు, తోరణాలు) పేర్కొని, అవి రాతితో చెక్కినవని ఒక్క వాక్యంలో రాయండి.

 

Question 2: ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి ? దాని గురించి మీకు తెలిసింది చెప్పండి.

Answer:

ఇవన్నీ శిల్ప కళకు సంబంధించినవి. శిల్పము అనగా బొమ్మ. చక్కటి ఆకారాన్ని విగ్రహంలాగా పూర్తి రూపంలో తయారు చేయటమే శిల్పకళ. శిల్పాలు పూర్వం ఎక్కువగా రాతితో తయారు చేసేవారు. తరువాత చెక్క బొమ్మలు వచ్చాయి. మట్టితో కూడా బొమ్మలు చేస్తారు. కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాక మొదలైన చోట్ల కొయ్య బొమ్మలు తయారు చేస్తారు. పంచలోహాలనుగాని, ఒక్కొక్క లోహాన్ని గాని కరిగించి విగ్రహాలు తయారు చేస్తారు. ఇటీవల మైనపు బొమ్మలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా బొమ్మలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. ఈ బొమ్మలు రంగులలో కూడా ఉంటాయి.

Exam Tips:

a) శిల్పకళ అంటే ఏమిటో నిర్వచనం చెప్పి, ఏ ఏ పదార్థాలతో (రాయి, కొయ్య, లోహం, మట్టి) చేస్తారో ఉదాహరణలు ఇవ్వండి.
b) కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాక వంటి ప్రదేశాల ప్రస్తావన జవాబుకు విలువనిస్తుంది.

 

Question 3: శిల్పాలను తయారు చేసేవారిని ఏమంటారు ? వారి గురించి మీకు తెలిసింది చెప్పండి.

Answer:

శిల్పాలు తయారు చేసే వారిని శిల్పులు అంటారు. కొండ గుహలలోనూ కొండల మీదా శిల్పాలు చెక్కుతూ ఉండేవారు ఈ శిల్పులు. వాళ్ళ చేతిలో గొప్ప నేర్పు ఉండేది. ఏ శిల్పం చెక్కినా జీవకళ ఉట్టిపడుతూ ఉండేది. అంత కష్టపడినా వారిని ఆదరించే వారు గాని, కళకు తగినంత ప్రతిఫలం ఇచ్చేవారు గాని లేరు. రాయే కదా ఖర్చులేనిది అనుకోవడమే గాని రాతిలో జీవాన్ని నింపిన శిల్పి ప్రతిభను ఎవరూ గుర్తించరు. అందుచేత వారి పరిస్థితి చాలా దీనంగా ఉండేది.

Exam Tips:

a) శిల్పి నైపుణ్యం (జీవకళ), వారి దీన స్థితి (ఆదరణ లేకపోవడం) – రెండు కోణాలనూ చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.66)

Question 1: భక్తిభావం పెంపొందడానికి శిల్పి ఎట్లా దోహదపడతాడు?

Answer:

శిల్పి అనగా శిల్పం తయారు చేయువాడు. ఏదేని ఒక రాతిని జీవకళ ఉట్టిపడేటట్లు చెక్కడం శిల్పి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. శిల్పి తన నేర్పుతో చేతి దెబ్బల వల్ల అందమైన ఆకారాన్ని తయారు చేస్తాడు. ఆ ఆకారాలలో చూపరులకు ఆ బొమ్మ రాతిదే అయినా అద్భుతమైన ఆకారాలతో దిద్దడం వలన దేవతా ప్రతిమలుగాగాని, కళాఖండాలుగాగాని మారి భక్తిభావం ఏర్పడుతుంది. ఆ భక్తి భావం కలగాలంటే శిల్పి హస్తకళా ప్రావీణ్యం ఎంతో ఉండవలసి ఉంటుంది.

Exam Tips:

a) శిల్పి నైపుణ్యం వల్లనే రాయి దేవతా రూపమై భక్తిని కలిగిస్తుందనే అంశాన్ని స్పష్టంగా రాయండి.

 

Question 2: ఈ రాతికంబమునకు “కుసుమ వల్లరులు” కూర్చడమంటే
మీరేమనుకుంటున్నారు?

Answer:

కవి కవిత్వంతో ఎలాంటి అలంకారాలనైనా కవిత్వానికి సమకూర్చుతాడు. అలాగే కవియొక్క భావనాశక్తి శిల్పి ఉలికి కూడా ఉంటుంది. శిల్పికి ఎలాంటి ఊహలు, ఆలోచనలు ఉంటాయో అవన్నీ అతని ఉలికి కూడా వస్తాయి. ఉలి రాతిస్తంభానికి కూడా పూచిన తీగలను కూర్చగలడు.

Exam Tips:

a) “కుసుమ వల్లరులు” = పూలతీగలు; కవి కలం, శిల్పి ఉలి – రెండింటి అలంకార శక్తిని పోల్చండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.67)

Question 1: శిల్పి పేదరికంలో ఎందుకు నలిగిపోతున్నాడు?

Answer:

శిల్పులు కొండరాళ్ళపై శిల్పాలు చెక్కుతూ జీవకళను ఉట్టిపడేటట్లుగా చెక్కారు. ఎంతకష్టపడి చెక్కినా వారిని ఆదరించేవారులేరు. కళకు తగినంత ప్రతిఫలం ఇచ్చేవారు రాయిలో జీవాన్ని నింపి, తన ప్రతిభనంతా చూపినా ఎవరూ గుర్తించరు. అందుకే పేదరికంలో నలిగిపోతున్నాడు.

Exam Tips:

a) కారణం (ఆదరించేవారు లేకపోవడం, తగిన ప్రతిఫలం రాకపోవడం) ఫలితం (పేదరికం) – ఈ క్రమంలో రాయండి.

 

Question 2: శిల్పి సంతోషపడేదెప్పుడు?

Answer:

శిల్పి ఎంతో కష్టపడి చెక్కిన శిల్పాలు ప్రజల ఆదరణకు నోచుకున్నప్పుడు సంతోషపడతాడు. తాను అనుకున్న ప్రతిరూపాలు తయారైనపుడు వాటిని ప్రజలంతా మెచ్చుకున్నప్పుడు ఆనందపడతాడు. తన శిల్పకళానైపుణ్యానికి తగిన గౌరవం, పారితోషికం లభించినపుడు తన కళకు లభించిన గుర్తింపుగా ముదమునందుతాడు.

Exam Tips:

a) శిల్పి సంతోషించే మూడు సందర్భాలు: ప్రజల మెప్పు, గుర్తింపు, పారితోషికం – ఇవి చెప్పండి.

 

Question 3: కవికి, శిల్పికి మధ్యగల పోలికలు చెప్పండి.

Answer:

కవి కలంతో కవిత్వంలో, శిల్పి ఉలితో రాతిలో – ఇద్దరూ ఒకేలా అలంకారాలను సృష్టిస్తారు. పోలికలు:
1. కవి తన రచనలో ఎలాంటి అలంకారాలనైనా కూర్చగలడు; శిల్పి తన ఉలితో రాతిస్తంభంపై పూచిన పూలతీగలను కూడా కూర్చగలడు.
2. కవి స్త్రీ సహజసౌందర్యాన్ని తన రచనా నైపుణ్యంతో వెల్లడిస్తాడు; శిల్పి తన భావనాబలంతో బండరాయినైనా అప్సరస విగ్రహంగా చెక్కి శిల్పజగత్తులో శాశ్వతస్థానం సంపాదించుకున్నాడు.
3. కవి మహారాజుల చరిత్రలను కావ్యాల ద్వారా వెల్లడిస్తాడు; శిల్పి విగ్రహాల రూపాలలో చెక్కి కావ్యాలలోని కథలను గుర్తుచేస్తాడు.
4. కవి అజంతా వంటి గుహల నైపుణ్యాలను తన రచనలలో వెల్లడిస్తాడు; శిల్పి బండరాళ్ళను కూడా సజీవ విగ్రహాలుగా, సింహాలుగా, బొమ్మలుగా తీర్చిదిద్దగలడు.

Exam Tips:

a) పాఠంలోని 3వ, 6వ పద్యాల ఆధారంగా కనీసం మూడు పోలికలను సంఖ్యలతో వరుసగా రాయండి.

 

Question 4: శిల్పికి శాశ్వతత్వం ఎప్పుడు వస్తుంది?

Answer:

శిల్పి తన చేతితో అప్సరస విగ్రహం చెక్కి అందమైన ఆమె కన్నుల ప్రక్కనే తన రూపాన్ని మలచుకొని, ఆనందపడిపోతూ తనను చిరంజీవిగా చేసుకున్నాడు. శిల్పి తన ప్రతిభతో ఎల్లకాలం గుర్తుండిపోయే శిల్పాలు చెక్కినప్పుడు చరిత్రలో శాశ్వతత్వం వస్తుంది.

Exam Tips:

a) అప్సరస విగ్రహం పక్కన తన రూపాన్ని చెక్కుకోవడం (5వ పద్యం) అనే సందర్భాన్ని తప్పకుండా పేర్కొనండి.

 

Question 5: శిల్పిని “మహాపుణ్యుండవయ్యా” అని కవి ఎందుకన్నాడు?

Answer:

శిల్పి అజంతా, ఎల్లోరా గుహలలో శిల్ప సందపను శాశ్వతంగా గుర్తుండిపోయేటట్లు చెక్కాడు. వట్టి బండరాళ్ళను గూడా సజీవంగా నిలిపాడు. జాలువారే విగ్రహాలు అతని చేతి నుండి తయారయ్యాయి. అవన్నీ తలచుకొని కవి శిల్పిని మహాపుణ్యండవయ్యా! అని అన్నాడు.

Exam Tips:

a) అజంతా, ఎల్లోరా గుహల పేర్లు, “మహాపుణ్యుండవయ్యా” (8వ పద్యం) పాదాన్ని ఉదహరించండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: కవి శిల్పిని శాశ్వతుడనీ, ఆయన ప్రజ్ఞకు నమస్కారం చేయమని చెప్పాడు కదా! దీనిమీద మీ అభిప్రాయాన్ని చెప్పండి.

Answer:

ఒక్కొక్క శిల్పి చెక్కిన శిల్పానికి ఒక్కొక్క శైలి ఉంటుంది. శిల్పం చూడగానే ఏ ప్రాంతం వారు చెక్కారో చెప్పవచ్చు. కవి మనసులోని భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలడు. శిల్పి మనోభావాలకు రూపాన్నివ్వటం సామాన్యం కాదు. చక్కని శిల్పం చెక్కి అందులోనే తనను చూసుకొని మురిసిపోగలడు. ప్రజల మనసులపై తన శైలిని ముద్రించగలడు. అందుకే శిల్పి శాశ్వతుడు. ఆయన ప్రతిభకు నమస్కారం చేయాలి.

Exam Tips:

a) అభిప్రాయం అడిగిన ప్రశ్నలో పద్యంలోని మాటలను (శాశ్వతుడవోయి, నమస్కారంబు నీ ప్రజ్ఞకున్) ఉదహరిస్తూ, మీ సొంత కారణాలను రాయండి.
b) శిల్పి కళ కాలాన్ని దాటి నిలుస్తుందనే భావాన్ని ఒక ఉదాహరణ (రామప్ప, వేయిస్తంభాల గుడి)తో చెప్పండి.

 

Question 2: శిల్పకళవలె నీకు తెలిసిన ఇతర కళలేవి? ఆయా కళాకారుల గొప్పదనమేమిటి?

Answer:

శిల్పకళ వలె నాకు తెలిసిన ఇతర కళలు సంగీతం, కవిత్వం, నాట్యం, చిత్రలేఖనం. సంగీత కళాకారుడు శిశువులను, పశువులను, పాములను కూడా మైమరపించగలడు. కవి ఎలాంటి భావనలనైనా తన కవిత్వం ద్వారా తెలుపగలడు. నాట్యం అనేక కళల సమూహం. నాట్యకారుడు తన నటన ద్వారా పాటలోని భావాన్ని వ్యక్తం చేస్తాడు. చిత్రకారుడు తన కుంచెతో ఎలాంటి అందమైన చిత్రాన్నైనా గీయగలడు.

Exam Tips:

a) కనీసం మూడు కళలను పేర్కొని, ప్రతి కళాకారుడి ప్రత్యేకతను ఒక్కో వాక్యంలో రాయండి.
b) ఐదు లలితకళలు: చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం – వీటిని గుర్తుంచుకోండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: కింది పద్యపాదాలు పాఠంలోని ఏఏ పద్యాల్లో ఉన్నాయి? వాటి సందర్భమేమిటి?
అ) బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
ఆ) తారతమ్యంబు లే దబద్ధంబు గాదు
ఇ) ఱాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
ఈ) జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో గల

Answer:

అ) ఈ పద్యపాదం “సున్నితంబైన ………. పూజ” అనే పద్యములోనిది.
సందర్భం: శిల్పి తన సున్నితమైన చేతితో సుత్తిపట్టి రాళ్ళను చెక్కగా ఎన్నో దేవాలయాలు తయారైనాయి. వాటిలో ఎన్నో దేవతా విగ్రహాలు వెలసినాయి. అలా ఆ రాళ్ళకు పసుపుకుంకాలతో పూజలు దక్కినాయి అని కవి తెలిపిన సందర్భం.
ఆ) ఈ పద్యపాదము “ప్రతిమలు రచించి ………. అబద్ధంబుగాదు” అను పద్యములోనిది.
సందర్భం: కవిత్వంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే కవిలాగే శిల్పి కూడా తన శిల్పాలతో చూసేవారు చరిత్రలను చదువుకోగలిగేటట్లు తీర్చిదిద్దుతాడు. అందుకే కవికీ శిల్పికీ కొంచెం కూడా భేదం లేదు. ఇందులో అసత్యమేమీ లేదు అని కవి చెప్పిన సందర్భం.
ఇ) ఈ పద్యపాదము “ఱాల నిద్రించు ……….. నిశ్చయముగాను” అను పద్యములోనిది.
సందర్భం: శిల్పి రాళ్ళలోని బొమ్మలను నిద్రలేపి ఉలితో తాకి బయటికి తెచ్చాడు. అలా తయారైన శిల్పాలు తప్పక నీ పేరు నిలబెడతాయి. నీవు శాశ్వతంగా ప్రజల మనసులో ఉండిపోతావు అని కవి తెలిపిన సందర్భం.
ఈ) ఈ పద్యపాదము “తెలిరాతిన్ …………. నీ ప్రజ్ఞకున్” అను పద్యములోనిది.
సందర్భం: పాలరాతిలో అప్సరస విగ్రహాన్ని మలిచి ఆమె సోగకన్నుల పక్కనే నిన్ను నీవు మలచుకొని ఆనందపడిపోతావు. శిల్పకళా రంగంలో నిన్ను నువ్వు శాశ్వతంగా నిలుపుకున్నావు. నీకు సమానమైన వారెవ్వరూ లేరు. నీ నేర్పుకు నమస్కారము అని కవి పలికిన సందర్భం.

Exam Tips:

a) పద్యపాదంలోని కీలక పదాన్ని (సుత్తె, ఉలి, పాలరాయి, కవనం) పట్టుకుని ఏ పద్యమో గుర్తించండి.
b) ప్రతి సందర్భంలో “ఎవరు, ఎవరితో, ఏ సందర్భంలో అన్నారు” అనే మూడు అంశాలు ఉండేలా రాయండి.

 

Question 2: కవికి – శిల్పికి మధ్య పోలికలున్న పద్యాలు ఈ పాఠంలో ఉన్నాయి. అవి ఏయే పద్యాలలో ఉన్నాయో గుర్తించి వాటిని రాయండి.

Answer:

కవికి – శిల్పికి మధ్య పోలికలు చెప్పిన పద్యాలు:
1. కవికలంబున గల యలంకార రచన
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున;
గాకపోయిన బెను జాతికంబములకు
గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు ?
2. ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లెవేయింప గలవు చూపరులచేత
గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.

Exam Tips:

a) పాఠంలో 3వ పద్యం (కవి కలంబున…) మరియు 6వ పద్యం (ప్రతిమలు రచించి…) – ఈ రెండే కవి–శిల్పి పోలికలను చెబుతాయని గుర్తుంచుకోండి.
b) పద్యాన్ని రాసేటప్పుడు పాదాల క్రమం, గణయతి తప్పకుండా చూసుకోండి.

 

Question 3: కింది గద్యాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు తయారుచేయండి.
జనపదం అంటే గ్రామం. జనపదంలో నివసించే వాళ్ళు జానపదులు. వీళ్ళు ప్రదర్శించే కళలను జానపదకళలు అంటారు. యక్షగానం, వీధి నాటకం, వీరభద్ర విన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథ వంటివి కొన్ని జానపద కళారూపాలు. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనపైన ఉంది. చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకొనే రకంగా బొమ్మను గీయడం చిత్రలేఖనం. వీనుల విందుగా ఉండే గానకళ సంగీతం. రాళ్ళను చెక్కి, అనేక భావాలను మనసులో కలిగించే కళ శిల్పకళ. రాగ, తాళ, లయలకు తగిన విధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.

Answer:

ప్రశ్నలు:
1. జానపదులు అనే పేరెట్లా వచ్చింది ?
2. మనం వేటిని కాపాడుకోవాలి ?
3. లలిత కళలేవి ?
4. కవిత్వం అని దేనిని అంటారు ?
5. నృత్యకళకు ఏవి ప్రధానం ?
6. వీనులకు విందు చేసేది ఏది ?
7. శిల్పకళ ఏమిస్తుంది ?
8. కొన్ని జానపద కళారూపాలను పేర్కొనండి.

Exam Tips:

a) గద్యంలోని సమాచారంలో జవాబు ఉన్న ప్రశ్నలనే తయారుచేయండి; గద్యంలో లేని విషయాలను అడగవద్దు.
b) ప్రశ్నలు ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎలా వంటి ప్రశ్నార్థక పదాలతో వైవిధ్యంగా ఉండాలి.

 

III. స్వీయరచన – 1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: శిల్పి రాళ్ళలో ఏ ఏ రూపాలను చూసి ఉంటాడు ?

Answer:

శిల్పి నల్లరాతిలో మనసు పులకించి పోయేలా భయంకరమైన సింహాల తలలు, భూమి పైనున్న అన్ని పర్వతాలలోనూ ఎన్నో రకాలైన చిత్ర విచిత్రరూపాలను, విగ్రహాలు, దేవాలయాలు, పూలతీగెలు, అప్సరసలు, మహారాజులు, మానవులు మొదలైన వాటి నెన్నిటినో చూసి ఉంటాడు.

Exam Tips:

a) పాఠంలోని 1వ పద్యంలోని సింహాల తలలు, పర్వతాలలోని రూపాలను ఉదహరించి, మిగతా రూపాలను జోడించండి.
b) ఐదు వాక్యాల పరిమితి పాటించండి.

 

Question 2: నల్లని రాళ్ళకు శిల్పిమీద కృతజ్ఞత ఎందుకుండాలి?

Answer:

నల్లని రాళ్ళనుండి శిల్పి అనేకమైన చిత్ర విచిత్రమైన శిల్పాలను చెక్కి చూపరులందరి దృష్టి వాటిపై పడేలా చేస్తాడు. భయంకరమైన వాటిని కూడా ఎంతో అందంగా చెక్కుతాడు. రాళ్ళను దేవతా విగ్రహాలుగా చెక్కి గుడిలో వాటికి పూజార్హత కల్పిస్తాడు. ప్రజలంతా పసుపు కుంకాలతో పూజిస్తారు. రాళ్ళను అందమైన శిల్పాలుగా తీర్చిదిద్ది వాటికి గౌరవాన్ని కలిగిస్తున్నాడు గనుక వాటికి శిల్పి మీద కృతజ్ఞత ఉండాలి.

Exam Tips:

a) “పసుపు కుంకాల పూజ” (2వ పద్యం) అనే పద్య భావాన్ని కారణంగా చూపండి.
b) రాయి నుంచి దైవంగా మారిన మార్పును స్పష్టంగా రాయండి.

 

Question 3: కవికీ, చిత్రకారుడికీ ఉండే పోలికలు, భేదాలు ఏమిటి ?

Answer:

కవి మనసులోని భావాలను చక్కని పదాలలో కూర్చి, అలంకారాలలో చేర్చి మహారాజుల చరిత్రలను, ఇంకా అనేక కావ్యాలను చక్కగా తన కలంతో తయారు చేస్తాడు. చదువరులకు ఆనందం కలిగిస్తాడు. శిల్పి కూడా తన మనసులోని భావాలను సున్నితమైన సుత్తి, ఉలితో రాతి మీద చెక్కుతూ పూల తీగెలతో అలంకరిస్తూ చక్కని శిల్పాలలో అనేక చరిత్ర కథలను సృష్టిస్తాడు. చూపరులకు ఆనందం కలిగిస్తాడు. ఇద్దరికీ ఉన్న భేదమల్లా కవి కలంతో కాగితం మీద సృష్టి చేస్తాడు; శిల్పి ఉలి, సుత్తితో రాళ్ళమీద సృష్టి చేస్తాడు.

Exam Tips:

a) ప్రశ్నలో “కవి–శిల్పి” పోలికలను (పద్యం 3, 6), పాఠం ఆధారంగా చెప్పండి. “భేదం” అంటే సాధనాల తేడా (కలం–ఉలి, కాగితం–రాయి) అని రాయడం మరువకండి.

 

Question 4: చూసే వాళ్ళకు శిల్పాలు మహారాజుల కథలు చెప్పగలవని కవి ఎందుకు అన్నాడు?

Answer:

కవి అలంకారములతో చిత్ర విచిత్రముగా కావ్యము వ్రాసి అందలి కథలతో చదివే వారిని ఆకట్టుకున్నట్టే శిల్పి అందమైన శిల్పాలతో చూపరులను ఆకట్టుకుంటాడు. కావ్యంలోని కథకు సంబంధించిన శిల్పాలు గోడలమీద క్రమంలో చెక్కితే చూసేవారు ఆ బొమ్మల వల్ల మహారాజుల కథలను గుర్తు చేసుకుంటారు అని కవి జాషువా అంటున్నారు.

Exam Tips:

a) 6వ పద్యం (“ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత…”) భావాన్ని సొంత మాటల్లో రాయండి.

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి

Question 1: అ) తెలంగాణ రాష్ట్రంలోని శిల్పకళాసంపదను గురించి వ్యాసం రాయండి.
(లేదా)
ఆ) శిల్పి గొప్పదనాన్ని గురించి కవి జాషువా ఎలా వర్ణించారో వివరించండి.

Answer:

అ) తెలంగాణ రాష్ట్రంలో శిల్పకళ అద్భుతమైంది. హైదరాబాద్‌లో పూర్వీకులు నిర్మించిన చార్మినార్, గోల్కొండకోట, బిర్లామందిర్, వరంగల్లోని వెయ్యిస్తంభాల గుడి, రామప్ప దేవాలయము, హుస్సేన్ సాగర్‌లోని బుద్ధవిగ్రహం శిల్పకళా సంపదకు నిలయాలు. సుమారు 400 సంవత్సరాలకు ముందే నిర్మించిన చార్మినార్ నాలుగు మినార్లు మతసామరస్యానికి చిహ్నాలు. బిర్లామందిర్ పాలరాతి సుందర కట్టడము.
వెయ్యిస్తంభాల గుడి వరంగల్లో నల్లరాతి కట్టడంగా వెలుగొందుచున్నది. రామప్ప దేవాలయములో ఆనాటి శిల్పకళ నేటికీ ఎంతో అందంగా విరాజిల్లుచున్నది. హుస్సేన్ సాగర్‌లో ప్రతిష్ఠించిన బుద్ధుడు మనందరికి శాంతిసందేశాన్నిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతమైన కట్టడము; ప్రజలకు మానసిక విశ్రాంతికి, ఆనందానికి విడిది.
ఆ) శిల్పి శిల్ప కళాజగత్తుకు మకుటంలేని మహారాజు. అతడు తన సుతిమెత్తని చేతులతో ఉలి, సుత్తి పట్టుకొని కఠినమైన పాషాణాలను అద్భుతమైన శిల్పాలుగా చెక్కుతాడు. మనదేశంలోని పర్వత శ్రేణులన్నిటియందు శిల్పి చెక్కిన శిల్పాలు కనబడతాయి. ఎక్కువ భాగం దేవాలయాలు కొండల మీద ఉన్న కారణమిదే. కాళ్ళకింద తొక్కే బండరాళ్ళను దేవతా విగ్రహాలుగా మలచి ఆ రాళ్ళకు పూజార్హత కల్పించాడు. పూలతీగలు, సింహాలు, మానవ విగ్రహాలు, మహారాజుల చరిత్రలు, అప్సరసల శిల్పాలు మొదలైన అనేక విధాలైన శిల్పాలను చెక్కుతాడు.
రాతిని తాకితే సప్తస్వరాలు పలికించగల నేర్పు శిల్పికున్నది. కొన్ని వందల వేల ఏళ్ళవరకూ శాశ్వతంగా ఉండిపోయే శిల్పాలను సృష్టించి శిల్పి అమరుడైనాడు. శిల్పి చేతిలో పడి ఎటువంటి కఠిన పాషాణమైనా వెన్నముద్దలా కరిగిపోయి కవి మనసులోని ఆలోచనకు రూపంగా నిలుస్తుంది. రాళ్ళలో రాగాలు పలికించగల అద్భుత శక్తి గలవాడు శిల్పి.

Exam Tips:

a) వ్యాసంలో ఉపోద్ఘాతం, శిల్పకళా ప్రదేశాల పేర్లు (చార్మినార్, వేయిస్తంభాల గుడి, రామప్ప), ముగింపు – ఈ క్రమం పాటించండి.
b) “లేదా” ప్రశ్నలో రెండింటిలో ఒకదానికే జవాబు రాస్తే చాలు; మీకు బాగా తెలిసినదాన్ని ఎంచుకోండి.

 

IV. సృజనాత్మకత/ప్రశంస

Question 1: శిల్పిని గురించి ఆత్మకథ రాయండి. దీన్ని ఏకపాత్రాభినయంగా ప్రదర్శించండి.
ఉదా: నేను తెలుసా! నేను రాళ్లను చెక్కే……

Answer:

నన్ను పోల్చుకున్నారా ? నేను శిల్పిని. అంటే రాళ్ళను చెక్కి బొమ్మలుగా తయారు చేస్తాను. ఎడమచేత్తో ఉలిని, కుడిచేత్తో సుత్తిని పట్టుకొని రాతిలోని అవసరం లేని భాగాలను చెక్కివేస్తూ నేననుకున్న ఆకారాన్ని తయారుచేస్తాను. ఇలా చెయ్యాలంటే ఎంతో శ్రమపడవలసి వస్తుంది. అయినా నేను కోరిన బొమ్మ అందంగా తయారైతే నాకెంతో తృప్తిగా, ఆనందంగా ఉంటుంది. నేను చెక్కిన బొమ్మలు మీరంతా చూసి మెచ్చుకుంటుంటే నాకెంత గర్వంగా ఉంటుందో! కాని నేను చెక్కిన బొమ్మలు కొనేవాళ్ళెంతమంది? ఒకరిద్దరు కొన్నా చాలా తక్కువ ధరకు అడుగుతారు. మరి నాకు జీవనమెలా గడుస్తుంది? ఏ కళాకారుడికైనా ఆ కళను గుర్తించి, ఆదరించి, బహుమతి ఇస్తే, వెలకట్టితే ఆ కళాకారుడు బ్రతకగలుగుతాడు. మీరంతా ఈ విషయాన్ని గ్రహించి నాలాంటి వారిని ఆదరించండి. కళలకు గుర్తింపునివ్వండి. ఇదే నా ప్రార్థన.

Exam Tips:

a) ఆత్మకథను “నేను” అని మొదటి పురుషలో రాయండి; శ్రమ, ఆనందం, పేదరికం అనే మూడు భావాలు ఉండాలి.
b) చివరలో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తే జవాబు ప్రభావవంతంగా ఉంటుంది.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది వాక్యాలు మీ పాఠంలోవే. వీటిలో గీత గీసిన పదాల అర్థాన్ని తెలుసుకొని వాక్యాలను తిరిగి రాయండి.
అ) భయద సింహముల తలలు
ఆ) వసుధ గన్పట్టు పర్వతములందు
ఇ) శాశ్వతుడవోయి నిశ్చయముగాను
ఈ) తెనుగుందేశము నిన్నువంటి పనివానిం జూచి యుప్పొంగుచుండును
ఉ) నీ సుత్తెలో మొలుచున్మానవ విగ్రహంబు

Answer:

అ) భయద = భయాన్ని కలిగించే
వాక్యం: భయాన్ని కలిగించే సింహముల తలలు.
ఆ) వసుధ = భూమి
వాక్యం: భూమి కనిపిస్తుంది పర్వతములందు.
ఇ) శాశ్వతుడు = స్థిరమైనవాడు, నాశనము లేనివాడు
వాక్యం: మనం చేసే మంచిపనులు స్థిరంగా నిలిచి ఉంటాయి.
ఈ) తెనుగు = తెలుగు
వాక్యం: తెలుగు దేశము కళలకు ప్రసిద్ధి.
ఉ) మొలుచు = పుట్టు
వాక్యం: బండరాయి నుండి అందమైన శిల్పాన్ని పుట్టించగలవాడు శిల్పి.

Exam Tips:

a) పద్యంలోని పదానికి అర్థం ఇచ్చాక, ఆ అర్థంతోనే వాక్యాన్ని తిరిగి రాయండి; పద్యపదం మళ్ళీ వాడవద్దు.

 

Question 2: కింది వాక్యాలలో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
అ) సింగం బావిలో తన మొహాన్ని చూసి అది మరో సింహం ముఖమని అనుకొన్నది.
ఆ) కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాగూడదు.
ఇ) నిద్ర మనకు అవసరమే కాని మనమే నిద్దుర మొహాలం కాగూడదు.
ఈ) పేదలకు సహాయం చేయడం పున్నెం. ఆ పుణ్యమే మనను నిలుపుతుంది.

Answer:

అ) సింగం (వి) – సింహం (ప్ర)
ఆ) స్తంభాలు (ప్ర) – కంబాలు (వి)
ఇ) నిద్ర (ప్ర) – నిద్దుర (వి)
ఈ) పున్నెం (వి) – పుణ్యం (ప్ర)

Exam Tips:

a) సంస్కృత పదం ప్రకృతి (ప్ర), దాని తెలుగు రూపం వికృతి (వి) – జవాబులో రెండింటినీ బ్రాకెట్లతో గుర్తించండి.

 

Question 3: సూచనల ఆధారంగా పాఠ్యాంశంలోని పదాలతో గళ్ళు నింపండి.
అడ్డం: 1. శిల్పాలు చరిత్రను ____ వేయించగలవు. 2. కవి చేతిలోనిది. 3. దేవళంలో ‘ళం’ తీసేస్తే. 4. మూడోపద్యం రెండో పాదంలో మొదటి పదం చివరి అక్షరం లోపించింది. 5. శిల్పంగా మారేది. 6. శిల్పి ప్రజ్ఞకు మనం సమర్పించేది.
నిలువు: 1. ఈ పదం భూమికి మరో అర్థం. 2. కవిత్వం చెప్పడాన్ని ఇట్లా అంటారు. 3. రాతికి మరో పదం తలకిందులైంది. 4. ‘స్వప్నం’ పర్యాయపదం. 5. శిలను శిల్పంగా మలిచేవాడు.

Answer:

అడ్డం: 1. వల్లె 2. కలము 3. దేవ 4. కల 5. శిల 6. నమస్కారం
నిలువు: 1. వసుధ 2. కవనం 3. పాషాణం (తలకిందులుగా) 4. కల 5. శిల్పి

Exam Tips:

a) గళ్ళ అక్షరాలు ఇచ్చిన సంఖ్యల వద్ద అడ్డం–నిలువు పదాలు కలిసే చోట ఒకే అక్షరం ఉండాలి; సరిచూసుకోండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది పదాలను విడదీయండి. (సవర్ణదీర్ఘ సంధి)
1. కిరీటాకృతి 2. మహానందం 3. మహీంద్రుడు 4. గురూపదేశం 5. కోటీశ్వరులు 6. మాతౄణం

Answer:

1. కిరీటాకృతి = కిరీట + ఆకృతి = (అ + ఆ = ఆ)
2. మహానందం = మహా + ఆనందం = (ఆ + ఆ = ఆ)
3. మహీంద్రుడు = మహి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ)
4. గురూపదేశం = గురు + ఉపదేశం = (ఉ + ఉ = ఊ)
5. కోటీశ్వరులు = కోటి + ఈశ్వరులు = (ఇ + ఈ = ఈ)
6. మాతౄణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ౠ)

Exam Tips:

a) సూత్రం: అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలు (అవే అచ్చుల హ్రస్వ/దీర్ఘాలు) పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. విడదీసి (పూర్వస్వరం + పరస్వరం = దీర్ఘం) చూపండి.

 

ప్రాజెక్టు పని

Question 1: మీ గ్రామం / ప్రాంతంలోని కళలను గురించి, కళాకారులను గురించి వివరాలు తెలుసుకొని వాళ్ళ గొప్పదనాన్ని గురించి నివేదిక రాయండి.

Answer:

తెలంగాణ ప్రాంతంలో కళలకూ, కళాకారులకు లోటులేదు. కాపురాజయ్య, మిద్దె రాములు వంటివారిని అందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
1. మిద్దె రాములు: రాములు కరీంనగర్ జిల్లా హనుమాజిపేట గ్రామంలో 1939లో జన్మించాడు. మిద్దె యల్లవ్వ, లస్మగౌడ్‌లు రాములు తల్లిదండ్రులు. అతడు చదువుకు దూరమైనా కళామతల్లి అతణ్ణి అక్కున చేర్చుకుంది. పాటలు పాడుతుండేవాడు. బుర్రకథలు, హరికథల పట్ల ఆకర్షితుడయ్యాడు. అదే ఆయనను ఒగ్గుకథల రారాజును చేసింది. రాములు కంఠస్వరం, గానమాధుర్యం ప్రేక్షకులకు కొత్త ఊపునిచ్చేది. కళారంగంలో స్థిరపడాలనే ఆశతో వేములవాడకు చేరుకున్నాడు. ఆబాలగోపాలం అతడి పాట కోసం, మాట కోసం, ఆట కోసం ఎగబడడం అతని కళాసక్తికి నిదర్శనం.
2. కాపు రాజయ్య: రాజయ్య మెదక్ జిల్లా సిద్ధిపేటలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. నిరాడంబర జీవితం, నిరంతర కృషితో గొప్ప చిత్రకారునిగా ఎదిగాడు. హైదరాబాద్‌లో జరిగిన చిత్రలేఖన పోటీల్లో ప్రథమ బహుమతి పొందాడు. అంతర్జాతీయ కీర్తి, అధిక ఆదాయం ఆశ చూపినా “నా పల్లె నాకు కాన్వాసు. నా ప్రజలే నాకు వస్తువు, వాళ్ళ జీవనమే ప్రేరణ, ఈ ప్రకృతే నాకు గురువు” అని తిరస్కరించాడు. ఇది ఆయన మాతృభూమి పట్ల ఆత్మీయతకు నిదర్శనం.

Exam Tips:

a) నివేదికలో కళాకారుడి పేరు, ఊరు, కళ, సాధించిన విజయాలు, నీ అభిప్రాయం – ఈ శీర్షికలు ఉంచండి.
b) మీ సొంత ప్రాంతం కళాకారుల వివరాలు (ఇంటర్వ్యూ ద్వారా) చేర్చితే మార్కులు ఎక్కువ.

 

అదనపు ప్రశ్నలు (Important Questions)

Question 1: శిలకు, శిల్పానికీ ఉండే భేదం ఏమిటి ?

Answer:

శిల అంటే రాయి. శిల్పం అంటే రాతి చుట్టూరా అవసరం లేని భాగాలను చెక్కివేసి అందమైన ఆకారంలో తీర్చిదిద్దబడిన బొమ్మ. బొమ్మను చూసి ఆనందిస్తాం. రాతిని చూసి ఆనందించలేము. శిలతో చెక్కిన దేవుని శిల్పానికి పసుపు కుంకాలతో పూజచేస్తాము. కాని శిలకు చేయము. ఇదే శిలకు, శిల్పానికి గల భేదం.

Exam Tips:

a) రెండు పదాల అర్థం, ఉపయోగం, గౌరవం – మూడు తేడాలను పోల్చి రాయండి.

 

Question 2: “కవి” ఈ గేయంలో ఒకచోట శిల్పి దారిద్ర్యాన్ని చూసి, తెలుగుదేశం కంట తడి పెడుతుందని అన్నాడు కదా! దీన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి ?

Answer:

శిల్పి రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి జీవంలేని రాళ్ళను శిల్పాలుగా మలచి జీవకళ ఉట్టిపడేట్టు చేస్తాడు. కానీ తినడానికి తిండి లేక నిర్జీవంగా పేదరికంలో బతుకుతూ ఉంటాడు శిల్పి. అందువల్ల తెలుగుదేశం కంట తడిపెడుతుందని కవి చెప్పారు అని నాకనిపిస్తోంది.

Exam Tips:

a) 4వ పద్యంలోని “నీ లేమి దలంచి కంట దడిబెట్టున్” భావంతో జవాబు మొదలుపెట్టండి.

 

Question 3: శిల్పాలలో ఉన్న గొప్పతనాన్ని గురించి నువ్వేమనుకొంటున్నావు ?

Answer:

శిల్పాలలో ఎంతో గొప్పదనముంది. శిల్పాలలోని ప్రసన్నత, సౌందర్యం శిల్పి మనోభావాలకు అద్దంపడుతుంది. శిల్పాలన్నీ మనకెక్కువగా దేవాలయాల గోడలమీద కనిపిస్తాయి. శిల్పకళలోని గొప్పదనాన్ని బట్టే అతి ప్రాచీనమైన మన దేవాలయాలు దేశ విదేశాలలో ప్రసిద్ధికెక్కాయి. అందమైన శిల్పాలను చూచి ఒళ్ళుమరచిపోయి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాము. ఆ శిల్పాలలోని శక్తి యాత్రికులను పదే పదే తన దగ్గరకు రప్పించుకుంటుంది.
ఈ శిల్పాలలో శాతవాహనులు, విష్ణుకుండినులు మొదలైన రాజుల కాలం, శిల్ప శైలి గోచరిస్తూ అప్పటి అనేక విషయాలను మనముందరికి తీసుకొస్తాయి. లిపి పుట్టకముందు చెక్కిన ఆకారాల ద్వారానే భావవ్యక్తీకరణ జరిగేది. ఇలా రాళ్ళు చెక్కి ఇచ్చిన రూపాలే శిల్పాలు. అందుకే ఇది ప్రతివారిలోనూ నెలకొన్న అతి ప్రాచీనమైన కళారూపం అని చెప్పొచ్చు. వివిధ ప్రాంతాల శిల్పకళా సంప్రదాయాల కలగలుపు మనకు మన దేశ శిల్పాలలో కనిపిస్తుంది.

Exam Tips:

a) శిల్పాలు చరిత్రకు సాక్ష్యాలు (శాతవాహనులు, విష్ణుకుండినులు) అనే అంశాన్ని తప్పక పేర్కొనండి.
b) అభిప్రాయ ప్రశ్నలో “నేను అనుకుంటున్నాను” అని సొంత దృక్కోణంతో ముగించండి.

 

Question 4: శిల్పకళ, కవిత్వం, చిత్రకళ, నాట్యకళ, వాద్యసంగీతం, గాత్రసంగీతం వంటి కళలు ఉన్నాయి కదా! వీటిలో నువ్వు దేన్ని నేర్చుకుంటావు ? ఎందుకు ?

Answer:

నాకు వాద్యసంగీతమంటే చాలా ఇష్టం. వీణావాదనం అంటే ఇష్టం. సంగీతంలో చక్కని మాధుర్యం ఉంటుంది. వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ వీణ మన పురాణాల్లో దేవతలందరూ వాయించే వాద్యం. రాజుల కథల్లో కూడా వీణ ఉంటుంది. అది చాలా పురాతనం కనుక నాకు వీణావాదనం అంటే ఇష్టం. అందుకే నేను వీణ నేర్చుకుంటాను.
మన శాస్త్రాలలో కళలు అరవైనాలుగు అని చెప్పబడ్డాయి. అందంగా చేసే ఏ పని అయినా కళ. వీటిలో మనసుకు హత్తుకుపోయి శ్రమను మరపింపజేస్తూ అలౌకికమైన ఆనందాన్ని ప్రసాదించే ఐదింటిని ప్రత్యేకంగా పేర్కొన్నారు; అవే లలితకళలు. రాతితోగాని చెక్కతోగాని మూర్తిని నెలకొల్పడం శిల్పకళ. మనసులోని భావాలకు చక్కని భాషనిచ్చి కవిత మొదలైన ప్రక్రియలలో అమర్చడం కవిత్వం. సప్తస్వరాల కూర్పుతో గొంతెత్తి ఆలపించేది గాత్ర సంగీతం. వాయిద్యాల మీద వినిపించేది వాద్యసంగీతం. రేఖల ద్వారా ఆకారాన్నిచ్చి, రంగులద్ది చిత్రీకరించేది చిత్రకళ. లయబద్ధంగా అడుగులు కదుపుతూ పాటలోని భావాలను ముఖంలో ప్రదర్శిస్తూ అభినయించేది నాట్యకళ.

Exam Tips:

a) నచ్చిన కళను ఎంచుకొని కనీసం రెండు కారణాలు ఇవ్వండి; ఇదే ప్రశ్నకు ఎవరైనా వేరే కళను ఎంచుకోవచ్చు.

 

I. కింది గేయాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి – అ) గేయం

సున్నితంబైన నీచేతి సుత్తెనుండి
బయలుపడె నెన్ని యెన్ని దేవస్థలములు
సార్థకము గాని యెన్ని పాషాణములకు
గలిగె నీనాడు పసుపు గుంకాల పూజ!

Question 1: శిల్పి చేతిలో ఏమి ఉన్నది?

Answer:

శిల్పి చేతిలో సుత్తి ఉన్నది.

Exam Tips:

a) పద్యపాదంలోని మొదటి పంక్తి (“నీచేతి సుత్తెనుండి”) నుంచి జవాబు తీసుకోండి.

 

Question 2: ఏమి బయటపడ్డాయి?

Answer:

దేవాలయములు బయటపడ్డాయి.

Exam Tips:

a) “దేవస్థలములు” అంటే దేవాలయాలు అని గుర్తుంచుకోండి.

 

Question 3: సార్థకం కానివి ఏవి?

Answer:

పాషాణములు (రాళ్ళు) సార్థకము కానివి.

Exam Tips:

a) “సార్థకము గాని” అనే పదాల తర్వాత వచ్చే పదం “పాషాణములు”.

 

Question 4: పాషాణములకు ఏమి కలిగింది?

Answer:

పాషాణములకు పసుపు కుంకాల పూజ కలిగింది.

Exam Tips:

a) పద్యంలోని చివరి పాదం నుంచి నేరుగా రాయండి.

 

Question 5: పాషాణం అంటే అర్థమేమి?

Answer:

పాషాణం అంటే రాయి (బండ).

Exam Tips:

a) ప్రతిపదార్థ సంబంధ ప్రశ్నలకు ఒక్క వాక్యంలో అర్థాన్ని రాస్తే చాలు.

 

ఆ) గేయం

ఱాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి
యులిని సోకించి బయటికి బిలిచినావు;
వెలికి వచ్చి, నీ పేర నిలపకున్నె
శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను.

Question 1: ప్రతిమలు ఎక్కడ నిద్రపోతున్నాయి?

Answer:

ప్రతిమలు రాళ్ళలో నిద్రపోతున్నాయి.

Exam Tips:

a) “ఱాల” అంటే రాళ్ళలో అని అర్థం.

 

Question 2: ప్రతిమలను మేలుకొలిపిందెవరు?

Answer:

ప్రతిమలను శిల్పి మేలుకొలిపాడు.

Exam Tips:

a) కర్త (శిల్పి)ని స్పష్టంగా పేర్కొనండి.

 

Question 3: ఎలా మేలుకొలిపాడు?

Answer:

తన ఉలిని తాకించి బయటికి పిలిచి మేలుకొలిపాడు.

Exam Tips:

a) సాధనం (ఉలి) పేరు తప్పనిసరిగా రాయండి.

 

Question 4: బయటికి వచ్చిన ప్రతిమలేంచేస్తాయి?

Answer:

బయటికి వచ్చిన ప్రతిమలు శిల్పి పేరును నిలబెడతాయి (శిల్పికి గొప్ప పేరు తెస్తాయి).

Exam Tips:

a) ఫలితం: శిల్పి శాశ్వతుడవుతాడు – ఈ భావాన్ని జోడించవచ్చు.

 

Question 5: ‘శాశ్వతుడు’ అంటే అర్థమేమి?

Answer:

శాశ్వతుడు అంటే ఎల్లకాలం ఉండేవాడు.

Exam Tips:

a) “శాశ్వతము” = స్థిరమైనది అని పదాన్ని విడదీసి అర్థం రాయండి.

 

II. ఈ క్రింది పద్యాల పాదాలను సరైన క్రమంలో రాయండి

Question 1: వసుధ గన్పట్టు సర్వపర్వతములందు
చేత మిగురొత్త నొక నల్లఱాతియందు
చిత్రముల నెన్ని గతుల జూచెదవొ నీవు!
మలచినాడవు, భయద సింహముల తలలు

Answer:

చేత మిగురొత్త నొక నల్లఱాతియందు
మలచినాడవు, భయద సింహముల తలలు
వసుధ గన్పట్టు సర్వపర్వతములందు
చిత్రముల నెన్ని గతుల జూచెదవొ నీవు!

Exam Tips:

a) తేటగీతి పద్యంలో నాలుగు పాదాలు; భావం పూర్తయ్యేలా పాదాల వరుస (మొదట “చేతమిగురొత్త”, ముగింపు “…నీవు!”) గుర్తించండి.

 

Question 2: వల్లెవేయింప గలవు చూపరులచేత
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.
ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు

Answer:

ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లెవేయింప గలవు చూపరులచేత
గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.

Exam Tips:

a) ప్రతి పాదంలో యతి/ప్రాస అక్షరాలను గమనించి క్రమం సరిచూసుకోండి.

 

III. కింది పద్యపాదాలను సరిచేసి భావం రాయండి

Question 1: రచన యలంకార గల కలంబున కవి
శిల్పి ముఖముననే యులి కలదోయి కలదు
బెను గాక పోయిన కంబములకు తాతి
గ్రుచ్చినావు వల్లరు గుసుమ లేరీతి?

Answer:

కవికలంబున గల యలంకార రచన
కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున;
గాకపోయిన బెను జాతికంబములకు
గుసుమవల్లరు లేరీతి గ్రుచ్చినావు ?
భావం: కవి కలంలో ఉండే అలంకార రచనాశక్తి శిల్పి ఉలికి కూడా ఉన్నది. లేకపోతే రాతిస్తంభంలో అందమైన పూలతీగలను ఎలా కూర్చినావు?

Exam Tips:

a) “సరిచేయి” అంటే పాదాల క్రమాన్ని సరిచేయడం; తరువాత భావాన్ని ఒకటి–రెండు వాక్యాల్లో రాయండి.

 

Question 2: నల్లచేత అరాతి మిగురొత్త యందు
భయద తలల సింహముల మలచినాడవు
సర్వ వసుధ పర్వతములందు గన్పట్టు
నెన్నిజిత్రముల జూచెదవొ గతుల నీవు!

Answer:

చేత మిగురొత్త నొక నల్లఱాతియందు
మలచినాడవు, భయద సింహముల తలలు
వసుధ గన్పట్టు సర్వపర్వతములందు
చిత్రముల నెన్ని గతుల జూచెదవొ నీవు!
భావం: ఓ శిల్పీ! నీవు మనసు చిగురించేటట్లు నల్లరాతిలో భయంకర సింహాల తలలు చెక్కావు. భూమి మీద కనిపించే పర్వతాలలో అనేక రూపాలను ఎన్నో విధాలుగా చూస్తూ ఉంటావో కదా!

Exam Tips:

a) భావం రాసేటప్పుడు కర్త (శిల్పి), కర్మ (సింహాల తలలు), స్థలం (పర్వతాలు) ఉండేలా చూడండి.

 

IV. కింది పద్యానికి ఐదు ప్రశ్నలు రాయండి

Question 1: ప్రతిమలు రచించి యొక మహారాజు చరిత
వల్లె వేయింప గలవు చూపరుల చేత
గవనమున జిత్రములు గూర్చు కవికి నీకు
దారతమ్యంబు లే దబద్ధంబు గాదు.

Answer:

1. శిల్పి ఎవరి చరిత్రలు వల్లె వేయిస్తాడు? – మహారాజుల చరిత్రలు.
2. ఎవరి చేత వల్లె వేయిస్తాడు? – చూపరుల చేత.
3. కవి ఏం చేస్తాడు? – కవిత్వంలో చిత్ర విచిత్రాలను (వర్ణనలను) కూరుస్తాడు.
4. ‘తారతమ్యం’ అంటే అర్థమేమిటి? – భేదం.
5. శిల్పి ఏం చేస్తాడు? – ప్రతిమలు (విగ్రహాలు) రచిస్తాడు.

Exam Tips:

a) పద్యంలో జవాబు స్పష్టంగా ఉండే ప్రశ్నలు రాయండి; ఒక్కో పాదానికి ఒక ప్రశ్న తయారుచేయడం సులభం.

 

V. సరైన విభక్తి ప్రత్యయాలతో ఖాళీలను పూర్తిచేయండి

Question 1: ఆయన గొప్ప పండితు ……… (1). ఆయన …… (2) రాని విద్యలేదు. బహుభాషల ….. (3) కోవిదుడు, ఎన్నో సంస్థ ….. (4) ఆయన …….. (5) సన్మానించాయి.

Answer:

ఆయన గొప్ప పండితుడు (1). ఆయనకు (2) రాని విద్యలేదు. బహుభాషలలో (3) కోవిదుడు. ఎన్నో సంస్థలు (4) ఆయనను (5) సన్మానించాయి.

Exam Tips:

a) కర్మ అయితే “ను/ని”, చతుర్థి (కొరకు/కి) అయితే “కు/కి”, సప్తమి అయితే “లో/అందు” అనే ప్రత్యయాలను గుర్తుంచుకోండి.

 

Question 2: అరసవిల్లి …… (1), ను, కోణార్క్ … (2) ను సూర్యుని …… (3) దేవాలయా……. (4) ఉన్నాయి. బ్రహ్మ……… (5), దేవాలయా ……. (6) చాలా అరుదు.

Answer:

అరసవిల్లిలో (1) ను, కోణార్క్‌లో (2) ను సూర్యునికి (3) దేవాలయాలు (4) ఉన్నాయి. బ్రహ్మకు (5) దేవాలయాలు (6) చాలా అరుదు.

Exam Tips:

a) వాక్యంలో ఆ పదం చేసే పని (స్థలం/సంబంధం) చూసి విభక్తిని నిర్ణయించండి.

 

VI. కింది పదాలలోని ఔపవిభక్తిక ప్రత్యయాలను గుర్తించండి

Question 1: రాతిలోన

Answer:

రాయి + లోన = రాతిలోన; ఔపవిభక్తిక ప్రత్యయం: తి

Exam Tips:

a) “రాయి” పదం విభక్తి ముందు “రాతి”గా మారడాన్ని గమనించండి.

 

Question 2: చేతిలోన

Answer:

చేయి + లోన = చేతిలోన; ఔపవిభక్తిక ప్రత్యయం: తి

Exam Tips:

a) చేయి → చేతి: “యి” స్థానంలో “తి” వచ్చింది.

 

Question 3: రాతికంబం

Answer:

రాయి + కంబం = రాతికంబం; ఔపవిభక్తిక ప్రత్యయం: తి

Exam Tips:

a) షష్ఠీ సంబంధంలోనూ (రాతి యొక్క కంబం) అదే రూపం వస్తుంది.

 

Question 4: కంట

Answer:

కన్ను + అందు = కంట; ఔపవిభక్తిక ప్రత్యయం: ట

Exam Tips:

a) “కన్ను” పదానికి విభక్తి ముందు “కంట” అనే రూపం వస్తుంది.

 

Question 5: బయటికి

Answer:

బయలు + కి = బయటికి; ఔపవిభక్తిక ప్రత్యయం: టి

Exam Tips:

a) “బయలు” → “బయటి” (లు → టి) మార్పు గమనించండి.

 

VII. క్రింది వాక్యాలలోని ద్వంద్వ, ద్విగు సమాస పదాలను గుర్తించి వ్రాయండి

Question 1: కలిమి లేములు కావడి కుండలు వంటివి.

Answer:

కలిమి లేములు = కలిమియు, లేమియు – ద్వంద్వ సమాసం

Exam Tips:

a) ద్వంద్వ సమాసంలో రెండు పదాలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది; “యు” తో విగ్రహవాక్యం రాయండి.

 

Question 2: నాలుగు పుస్తకాలు చదివి కాస్త జ్ఞానం పెంచుకో.

Answer:

నాలుగు పుస్తకాలు = నాలుగైన పుస్తకాలు – ద్విగు సమాసం

Exam Tips:

a) పూర్వపదం సంఖ్యావాచకమైతే ద్విగు సమాసం.

 

VIII. క్రింది వాక్యాలకు వ్యతిరేక వాక్యాలు రాయండి

Question 1: రాజు బాగా చదవగలడు.

Answer:

రాజు బాగా చదవలేడు.

Exam Tips:

a) క్రియను వ్యతిరేకార్థక రూపంలోకి మార్చండి (-గలడు → -లేడు).

 

Question 2: ఇది మంచి కథ.

Answer:

ఇది మంచి కథ కాదు (లేదా: ఇది చెడ్డ కథ).

Exam Tips:

a) వ్యతిరేక వాక్యం అంటే వాక్య భావాన్ని తిరగరాయడం; “కాదు” చేర్చడం సులభమైన పద్ధతి.

 

IX. క్రింది వాక్యాలలో సవర్ణదీర్ఘ, గుణసంధులను గుర్తించి రాయండి

Question 1: విద్యాలయం దేవాలయం వంటిది.

Answer:

విద్యా + ఆలయం = విద్యాలయం
దేవ + ఆలయం = దేవాలయం
ఈ రెండూ సవర్ణదీర్ఘ సంధులు.

Exam Tips:

a) అ/ఆ + అ/ఆ = ఆ అయితే సవర్ణదీర్ఘ సంధి.

 

Question 2: దేశోన్నతికోసం ప్రతివారూ పాటుపడాలి.

Answer:

దేశ + ఉన్నతి = దేశోన్నతి – గుణసంధి

Exam Tips:

a) అ/ఆ + ఇ, ఉ, ఋ అచ్చులు పరమైతే ఏ, ఓ, అర్ వస్తాయి – ఇదే గుణసంధి.

 

కవి పరిచయం

Question 1: ‘శిల్పి’ పాఠ్యభాగ రచయిత గురించి రాయండి.

Answer:

“మాతలకు మాత సకల సంపత్సమేత” అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అణువణువున తెలుగుదనం గుబాళింపజేసిన జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు కథ, నా కథ, స్వప్నకథ, కొత్తలోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశారు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్లుంటాయి. కవికోకిల, కవితావిశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవిచక్రవర్తి మొదలైనవి జాషువా బిరుదులు.

Exam Tips:

a) కవి పేరు, జన్మస్థలం, రచనలు, బిరుదులు – ఈ నాలుగు అంశాలు వరుసగా రాయండి.
b) ఈ పాఠం జాషువా “ఖండకావ్యం” మొదటి భాగంలోనిది అని గుర్తుంచుకోండి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 7 Telugu Lesson 07 Shilpi (The Sculptor)

Accessing Lesson 07 Shilpi (The Sculptor) Solutions

Access structured TS Board textbook solutions for Lesson 07 Shilpi (The Sculptor). Designed in alignment with the latest academic curriculum for Class 7 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 7 Telugu

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 07 Shilpi (The Sculptor) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 7 Telugu.

FAQs

Where can I find the latest TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి for the 2026-27 session?

The complete and updated TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి is available for free on StudiesToday.com. These solutions for Class 7 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి will help students to get full marks in the theory paper.

Do you offer TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Telugu. You can access TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire TS 7th Class Telugu 7th Lesson Questions and Answers Telangana శిల్పి in printable PDF format for offline study on any device.