Download TS Board Solutions for Class 7 Telugu Lesson 09 Which Caste? (E Kulam?)
Explore reliable textbook solutions for Lesson 09 Which Caste? (E Kulam?) tailored for Class 7 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Access TS Board Solutions and Answers
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
పాఠ్యపుస్తక ప్రశ్నలు
Question 1: పై బొమ్మలో ఎవరెవరున్నారు?
Answer:
పై బొమ్మలో ఉపాధ్యాయిని, ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని ఉన్నారు.
Exam Tips:
a) చిత్రంలో కనిపించే ప్రతి వ్యక్తిని (ఉపాధ్యాయిని, విద్యార్థి, విద్యార్థిని) వరుసగా పేర్కొనండి.
Question 2: నల్లబల్లపైనున్న పద్యం ఏ శతకంలోనిది?
Answer:
నల్లబల్లపైనున్న పద్యం వేమన శతకంలోనిది.
Exam Tips:
a) నల్లబల్లపై ఉన్న పద్యం ఏ శతకానికి చెందినదో శతక పేరును స్పష్టంగా రాయండి.
Question 3: ఆ పద్యం ఏ సందేశాన్నిస్తుంది?
Answer:
ఏ కులంలో పుట్టారన్నది ముఖ్యంకాదు, మంచి గుణములు కలవారా, కాదా అన్నది గమనించాలి అని ఆ పద్యం సందేశాన్నిస్తుంది.
Exam Tips:
a) పద్యం సారాంశం: కులం కాదు, గుణం ముఖ్యం – ఈ భావాన్ని ఒక వాక్యంలో చెప్పండి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.86)
Question 1: కార్మికుల ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తున్నది?
Answer:
కొలిమి దగ్గర పనిచేస్తుంటే ఆ సెగలకు పొగలకు కార్మికుల పేగులు కాలిపోతున్నాయి. బొగ్గుగనులలో తవ్వుతుంటే కమ్ముకునే దుమ్ము గొంతులోకి పోయి ఊపిరాడకపోవటం, దగ్గతూ ఉండటం జరుగుతుంది. అలా కార్మికుల ఆరోగ్యం క్షీణిస్తున్నది.
Exam Tips:
a) కొలిమి సెగలు, బొగ్గు గనుల దుమ్ము – రెండు కారణాలను పాఠంలోని చరణం (2) ఆధారంగా రాయండి.
Question 2: ఈ “మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు” అని కవి అనడంలో ఉద్దేశం ఏమిటి?
Answer:
మాగాణం అంటే శ్రేష్ఠమైన భూమి. అందులో వ్యవసాయం చేస్తే నాణ్యమైన పంటే చేతికందుతుంది. అంత కష్టపడి అటువంటి మంచి పంట పండించి మనకందించే రైతుకు తినడానికి ఏమీ మిగలడం లేదు. అడుగుబొడుగూ మిగిలినది ఏదో తింటాడు అని చెప్పటం కవి ఉద్దేశం.
Exam Tips:
a) “మాగాణం” = శ్రేష్ఠమైన పొలం; రైతు నాణ్యమైన పంట పండించినా తాను మాడిన అన్నమే తింటాడు అనే వైరుధ్యాన్ని చెప్పండి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.87)
Question 1: రామకోటి రాసే కాగితాన్నీ, పూలబుట్టను కష్టపడి తయారుచేసిన వారిపట్ల మీ అభిప్రాయం ఏమిటి?
Answer:
కార్మికుడు కాగితాలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేస్తే కాగితాలు పుస్తకాలుగా తయారుచేస్తే ఆ పుస్తకాలలో మనం రామకోటి రాసుకుంటాం. మనమెంతో పుణ్యాత్ములమనుకుంటాం. అలాగే పూలబుట్టలు అల్లి తెచ్చిపెడితే వాటిలోకి పూలుకోసుకుని పూజలు చేసి పుణ్యం సంపాదించుకున్నాం అనుకుంటాం. కాని మనం పుణ్యం సంపాదించగలగడానికి సౌకర్యం కలిగించిన వారిని మాత్రం మర్చిపోతాం. నా ఉద్దేశంలో అవి తయారు చేసినవారే గొప్ప పుణ్యాత్ములు
Exam Tips:
a) అభిప్రాయం రాసేటప్పుడు శ్రామికుల పట్ల కృతజ్ఞతను, వారి శ్రమ విలువను పేర్కొనండి.
Question 2: శ్రామికులు కూటికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?
Answer:
శ్రమకు తగ్గ జీతం, ప్రతిఫలం శ్రామికుడికి రావడంలేదు. ముఖ్యంగా కుండలుచేసే కుమ్మరి గురించి చెప్పుకోవాలి. మనం తినే అన్నం వండుకోవడానికి కుండ కావాలి. ఆ కుండ తయారు చేయడానికి కుమ్మరి ఉండాలి. కానీ ఆ కుమ్మరికి కుండలు తయారీ డబ్బులు కూడా రాక, తిండికి ఇబ్బంది పడడం విచిత్రం.
Exam Tips:
a) శ్రమకు తగిన ప్రతిఫలం లభించకపోవడమే కారణం; కుమ్మరి ఉదాహరణను జోడించండి.
Question 3: ఈ “పాత రోత రథం విరిగిపోయింది” అని కవి అన్నాడు కదా! దీనిని సమర్థిస్తూ మాట్లాడండి.
Answer:
కొంతమంది పెత్తందార్లు కార్మికులను కర్షకులను తమ చేతికింద మనుషులుగా చేసుకొని వెట్టిచాకిరీ చేయిస్తూ వారికి కూటికి గతిలేకుండా చేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఆ అమాయకులను మోసం చేస్తున్నారు. కాని కాలం మారింది. మెల్లగా వారిలోనూ చైతన్యం వచ్చింది. ఇప్పటిదాకా సాగిన జులుం ఇకపై సాగదు. అని చెప్పడానికి కవి “పాతరోత రథం విరిగిపోయింది” అన్నాడు.
Exam Tips:
a) “పాత రోత రథం” = పాతబడిన అన్యాయపు ఆలోచనలు; కాలం మారింది, చైతన్యం పెరిగింది అనే భావాన్ని రాయండి.
Question 4: శ్రీ శ్రామికులందరు చేయి చేయి కలిపి నిలబడితే ఏమి జరుగుతుంది?
Answer:
అన్ని వృత్తులవారూ ఏకమై చేయి చేయి కలిపితే స్వార్థపరుల ఆటలు సాగవు.
సమసమాజం ఏర్పడుతుంది. ఆ నవసమాజంలో అందరూ సుఖంగా ఉంటారు.
Exam Tips:
a) ఐకమత్యం వల్ల స్వార్థపరుల ఆటలు సాగవు, సమసమాజం ఏర్పడుతుంది – ఈ రెండు ఫలితాలు రాయండి.
గేయం – ఏ కులం? (చెరబండరాజు)
ఏ కులమబ్బీ! మాదే మతమబ్బీ!!
1. మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినపుడు
డొక్కలెండి కొండ్రలేసి ధాన్యరాసులెత్తినపుడు ॥ఏ॥
2. పొగగొట్టాలై పేగులు కొలిమి సెగలు చిమ్మినపుడు
దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుగుట్టలు త్రవ్వినపుడు ॥ఏ॥
3. మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినపుడు
ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినపుడు ॥ఏ॥
4. పూజకు అందిచ్చు పూల బుట్టలల్లి ఇచ్చినపుడు
రామకోటి రాసుకొనే కాగితాలు చేసినపుడు ॥ఏ॥
5. పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినపుడు
కూటికింత కూడు లేక కుండలు జేసిచ్చినపుడు ॥ఏ॥
6. సన్యాసులై వస్తే క్షవరాలూ చేసినపుడు
మురికి గుడ్డలుతికి మల్లెపూలు చేసి ఇచ్చినపుడు ॥ఏ॥
7. చెల్లవు మీ కల్లబొల్లి కబుర్లన్ని చెదలు పట్టె
ఆగదు మీ పాతరోత రథం విరిగిపోయినది ॥ఏ॥
8. కులాలనీ కులంలోని శాఖలనీ వేరుజేస్తే
చెమటోడ్చే మనుషులమూ చేయి కలిపి నిలబడితే ॥ఏ॥
ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: “ఏ కులమబ్బీ….” అనే పాట ఉద్దేశం ఏమై ఉంటుంది? చర్చించండి.
Answer:
అన్ని వృత్తుల వారూ సమానమే. కులాలు, మతాలు పేరుతో వారిని వేరుచేసి చూడటం తప్పు. వారు చేసే సేవల వల్లనే సమాజంలో ఎవరికీ ఏ కష్టం రాకుండా జీవితం సాఫీగా గడిచిపోతోంది. కాబట్టి కులాల మధ్య స్వార్థంతో అనైక్యతను సృష్టించకూడదు అని సమాజానికి గుణపాఠం చెప్పటమే ఈ పాట ఉద్దేశం.
Exam Tips:
a) పాటలోని “ఏ కులం? ఏ మతం?” అనే పల్లవిని ఉదహరించి, వృత్తులన్నీ సమానమే అనే సందేశాన్ని స్పష్టంగా రాయండి.
Question 2: పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు ఉన్నాయా? దీనిమీద అభిప్రాయాలు తెలుపండి.
Answer:
ఈ పాఠంలో కవి చెప్పినట్లుగానే శ్రామికుల జీవితాలు కష్టాల కడలిలో కొట్టుకు పోతున్నాయి. పగలూ రాత్రీ కష్టపడినా చాలినంత కూలి లేక చాలీచాలని తిండితో శ్రామికులు పస్తులతో బతుకు గడుపుతున్నారు. ఫ్యాక్టరీలలో పనిచేసే వారు రకరకాలుగా బాధలు పడుతూ అనారోగ్యం పాలౌతున్నారు. వారి కష్టాన్ని పట్టించుకొనే వారుగాని ఆదరించే వారుగాని లేరు. ఇవన్నీ గమనించిన తరువాతే కవి ఆ విధంగా చెప్పాడు.
Exam Tips:
a) అభిప్రాయ ప్రశ్నలో “అవును” అని అంగీకరించి, తక్కువ కూలి, అనారోగ్యం, ఆదరణ లేకపోవడం వంటి మూడు కారణాలు రాయండి.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
Question 1: కింది పేరాను చదివి పట్టికను నింపండి.
మనిషి జీవనగమనమంతా శ్రామికులమీద ఆధారపడి నడుస్తుంది. మనిషి లౌకిక జీవన పార్శ్వాలన్నీ శ్రామికుల స్పర్శతో చైతన్యవంతమవుతాయి. పొద్దున్నే లేవగానే అవసరమయ్యే నీళ్ళు మన ఇంట్లోకి రావడానికి వెనుక ఎవరి శ్రమ దాగివున్నదో ఆలోచించామా? వేడివేడి చాయ్, కాఫీలు తాగే రుచి వెనుక పాలుపోసే పాలవాడిని గుర్తుచేసుకుంటామా? ఇల్లూ వాకిలిని పరిశుభ్రంగా ఉంచేవారిని, మనం వేసుకునే ఉతికిన దుస్తులు, ఇస్త్రీమడతల వెనుక ఉన్న శ్రమ సౌందర్యాన్ని తలచుకున్నామా? అందమైన పూల తోటల పరిమళాలు, అపురూప శిల్ప సంపదలతో విలసిల్లే దేవాలయాల వాతావరణం వెనుక దాగిన కార్మికశక్తులను స్మరించుకున్నామా? ఇట్లా అడుగడుగునా మన అవసరాలకు, విలాసాలకు ఉపయోగపడే శ్రామికులు, కార్మికులు, వివిధ కులవృత్తులవాళ్ళు తీవ్రమైన సామాజిక వివక్షతకు గురౌతున్నారు.
చేసిన పనికి తగిన వేతనం లేక, సరైన గౌరవమూ లభించక శ్రమదోపిడికి, నిరాదరణకు గురౌతూ మానసిక వేదనలను అనుభవిస్తున్నారు. వారిపట్ల సమాజ దృక్పథం మారవలసిన అవసరమున్నది. ఆయా వృత్తుల వెనుక వున్న సాంస్కృతిక వారసత్వాన్ని సామాజిక బాధ్యతను మనం గుర్తించాలి. శ్రామికుల స్వేదంతో ప్రపంచం కదులుతుందన్న సత్యాన్ని గౌరవిద్దాం.
Answer:
| శ్రమజీవులు | వారి సేవలు |
| 1. నీటి సరఫరా ఉద్యోగులు | ఇంటింటికీ తెల్లవారేసరికి నీరు అందేట్లు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. |
| 2. పాలవారు | చీకటితోనే లేచి పశువులను సిద్ధంచేసి, పాలు పిండి అందరికీ అందిస్తారు. |
| 3. పనివారు | ఇల్లు, వాకిలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతారు; మన దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేస్తారు. |
| 4. తోటమాలి | అందమైన పూలతోటలు పెంచి ఆ పూల పరిమళాలను అందిస్తాడు. |
| 5. శిల్పి | చక్కని నిర్మాణంతో, శిల్పాలతో దేవాలయాలను నిర్మిస్తాడు. |
Exam Tips:
a) పేరాలో ప్రతి శ్రామికుని పేరు, అతడు చేసే సేవను వరుసగా గుర్తించి పట్టికలో రాయండి; పేరాలో లేని విషయాలు రాయవద్దు.
Question 2: ఈ పాఠంలోని ప్రాసపదాలు రాయండి.
Answer:
ఉదా:
1. పెట్టినపుడు, ఎత్తినపుడు, ఇచ్చినపుడు, చేసినపుడు, చిమ్మినపుడు, త్రవ్వినపుడు, దున్నినపుడు, చెక్కినపుడు
2. పాత – రోత, ఎండలు – బండలు
Exam Tips:
a) ప్రాస అంటే పాదాల్లో రెండో అక్షరం (లేదా చివరి పదం) సరిపోవడం; గేయంలోని ఒక్కో చరణం నుండి ఉదాహరణలు ఎంచుకోండి.
III. స్వీయరచన – 1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి
Question 1: “చెమటోడ్చే మనుషులు చేయి కలిపి నిలబడితే” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
Answer:
ఈ సమాజంలో కులాలు, మతాల పేరుతో జనాన్ని వేరుచేసి చూడటం, ఎక్కువ తక్కువ అంటూ వర్గీకరించటం జరుగుతున్నది. ఈ భేదాల మూలంగా శ్రామికుల మధ్య విభేదాలు కల్పించి అనైక్యతను సృష్టిస్తున్నారు. వారి సేవలందుకుంటున్నప్పుడు కనబడని హెచ్చుతగ్గులు మిగతా సమయాలలో గుర్తురావడం బాధాకరం. ఆ శ్రామికులంతా ఏకమై కలిసికట్టుగా ఉన్నప్పుడు ఈ స్వార్థపరుల ఆటలు సాగవు అని కవి చెబుతున్నాడు.
Exam Tips:
a) 8వ చరణం (కులాలనీ కులంలోని…) భావాన్ని ఆధారంగా తీసుకోండి: ఐక్యతే బలం, స్వార్థపరుల ఆటలు సాగవు.
Question 2: శ్రమ చేసేవారికి సమాజంలో తగిన గౌరవం లభిస్తుందా? అభిప్రాయం రాయండి.
Answer:
శ్రమ చేసేవారికి సమాజంలో తగిన గౌరవం లభించటం లేదు. కనీసం వారిని మనుషులుగా కూడా గుర్తించడంలేదు. వారిచేత ఊపిరాడకుండా చాకిరీ చేయిస్తారు. తగిన కూలి మాత్రం ఇవ్వరు. వారు తిన్నారా? పస్తులున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, రోగాలతో బాధపడుతున్నారా? ఇవేవీ పట్టించుకోని స్వార్థపూరితమైన సమాజం మనది. అందుకే మన సమాజంలో శ్రమకు గుర్తింపులేదు.
Exam Tips:
a) “లేదు” అని మొదట స్పష్టంగా చెప్పి, తగిన కూలి ఇవ్వకపోవడం, గౌరవం లేకపోవడం వంటి కారణాలు ఇవ్వండి.
Question 3: పాత కబుర్లకు చెదలు పట్టాయని కవి అంటున్నాడు. ఎందుకు అట్లా అన్నాడో ఆలోచించి రాయండి.
Answer:
మన సమాజంలో ఇప్పటికీ బూజుపట్టిన సంప్రదాయాలనూ, ఆచారాలనూ పాటించే మూర్ఖులున్నారు. కులాలు, వాటిలో శాఖలు, ఎచ్చుతగ్గులు, మతాలు అంటూ రకరకాల భేదాలను కల్పించి సమాజాన్ని ముందుకు పోనివ్వరు. ఇలాంటి పాత కబుర్లకు కాలం చెల్లిపోయింది. సమాజంలో వస్తున్న మార్పులను అందరూ గుర్తించి పాటించాలి. అందరూ సమానమే అనే భావం కలిగి ఉండాలి. కలిసిమెలిసి ఉంటూ శాంతిని నెలకొల్పాలి అని కవి భావిస్తున్నాడు. అందుకే పాతకబుర్లకు చెదలు పట్టాయన్నాడు.
Exam Tips:
a) “చెదలు పట్టడం” = పాతబడి పనికిరాకపోవడం అనే జాతీయ అర్థాన్ని మొదట చెప్పండి.
Question 4: పాఠం ఆధారంగా కవికి గల సామాజిక భావన ఎటువంటిదో రాయండి.
Answer:
కవి మన సమాజంలో కులమత భేదాలు నశించిపోవాలని కోరుకుంటున్నాడు. ఏ వృత్తియైనా గౌరవప్రదమైనదే. ఇతరుల ఉపయోగం కోసమే ఆయా వృత్తులు సాగిస్తున్నారు ఆ శ్రామికులు. మన అవసరాలు తీరుస్తున్న వారిని మనమెంతో గౌరవించాలి. వారి పనిలోని నేర్పరితనాన్ని గుర్తించి ప్రోత్సాహపరచాలి. అప్పుడు వారెంతో ఆనందిస్తారు. అలాగే వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని కవి భావిస్తున్నాడు.
Exam Tips:
a) కవి భావన: కులమత భేదాలు లేని, శ్రమకు గౌరవమిచ్చే సమసమాజం – ఈ రెండు అంశాలు తప్పనిసరిగా రాయండి.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి
Question 1: ‘సమాజంలో మనుషులంతా ఒక్కటే’ అనే వాక్యాన్ని సమర్థిస్తూ రాయండి.
Answer:
సమాజంలో మనుషులంతా ఒక్కటే. వారిలో కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు లేవు. అవన్నీ మనుషులు తమ స్వార్థం కోసం కల్పించుకున్నవే. నేతపనివారు బట్టలు తయారుచేయకపోతే మన పరిస్థితి ఏమిటి? రైతు పత్తి పండించకపోతే నేతపనివారికి దారమెక్కడిది? రైతు పంటలు పండించాడు. అన్నం వండుకోడానికి కుండలు కావాలి కదా! కుమ్మరి ఆ కుండలు చేసి ఇస్తాడు. అతడికి సారె (చక్రం) వడ్రంగి తయారు చేయాలి; దానికి ఇనుప పట్టాను కమ్మరి తయారు చేయాలి. రైతు పొలం దున్నటానికి, పంట వేయడానికి, కోయడానికి కావలసిన కొడవలి, నాగలి, గొడ్డలి వంటి పనిముట్లను కమ్మరి, వడ్రంగి తయారు చెయ్యాల్సిందే. ధాన్యం శుభ్రం చేయాలంటే మేదరి అల్లిన బుట్టలు, చేటలు కావాలి. కాళ్ళు కాలకుండా నడవాలంటే ఒకరు చెప్పులు కుట్టాల్సిందే. వానలో తడవకుండా ఉండాలంటే ఒకరు ఇళ్ళు కట్టాల్సిందే. ఇలా సమాజంలోని మనుషులంతా ఒకరిమీద ఒకరు ఆధారపడి బతుకుతుంటే వీరిలో ఎక్కువ తక్కువలు ఎక్కడి నుండి వచ్చాయి? కాబట్టి మనుషుల మధ్య తేడాలేదు. అందరూ సమానమే.
Exam Tips:
a) సమర్థన ప్రశ్నలో వృత్తుల పరస్పరాధారాన్ని (రైతు–నేత–కుమ్మరి–కమ్మరి) ఒక గొలుసులా వివరించండి; ముగింపులో “అందరూ సమానమే” అని చెప్పండి.
b) పది వాక్యాల పరిమితిని దాటకుండా సంక్షిప్తంగా రాయండి.
IV. సృజనాత్మకత/ప్రశంస
Question 1: మీ పాఠశాలలో ఈ గేయాన్ని అభినయించి చూపండి.
(లేదా)
ఈ పాఠం స్ఫూర్తిగా తీసుకొని వివిధ పనులు చేసేవారి ప్రాధాన్యత తెలిపేటట్లు చిన్న కవిత/గేయం రాయండి.
Answer:
(అభినయం: విద్యార్థులు తరగతిలో చేయవలసిన పని.)
కవిత (ఉదాహరణ) – సమరం:
సూర్యుడు ఉదయించగానే మొదలౌతుందీ సమరం
మట్టిబొట్టు పెట్టుకొని ఆయుధాలు పట్టుకొని
సమరానికి సాగుతారు గుంపులుగా సైనికులు
దేనికోసమీ సమరం? ఏమి గెలుచుకుంటారు?
కాలేకడుపులకోసం, పిడికెడు మెతుకులకోసం
సాగే ఈ సమరంలో గెలిచేదేముంటుంది?
ఒక్కపూట అర్ధాకలి, ఒక్కపూట పస్తులు
ఎవరా సైనికులంటే శ్రామికులూ కార్మికులూ
ఎవరు వారి శత్రువులు? కాలుతున్న కడుపులు
ఏవి వారి ఆయుధాలు? కొడవలి, నాగలి, రంపం, కత్తి, సుత్తి, ఉలి, గొడ్డలి, చేతులలో నైపుణ్యం.
Exam Tips:
a) కవితలో శ్రామికుల పని, వారి కష్టం, వారిపట్ల గౌరవం – ఈ మూడు భావాలు ఉండేలా నాలుగైదు పాదాలు రాయండి.
b) అభినయం చేసేటప్పుడు గేయంలోని ప్రతి చరణానికి తగిన హావభావాలు, సాధనాలు (నాగలి, సుత్తి) వాడండి.
V. పదజాల వినియోగం
Question 1: కింద ఇచ్చిన వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) మా నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది.
ఆ) నేను మా బడిదగ్గర కమ్మరి కొలిమిని చూశాను.
ఇ) పొలంలోని కొండ్రలు చక్కని గీతలవలె ఉన్నాయి.
ఈ) మా వీధిలోని కుక్కకు తిండి లేక డొక్కలెండిపోయినాయి.
ఉ) పిల్లలు కబుర్లలో పడిపోయారు.
ఊ) మన దేశంలో కూడు లేనివారు ఉండరాదు.
Answer:
అ) క్షీణించింది = తరిగిపోయింది
ఆ) కొలిమి = కమ్మరివారు ఇనుమును కాల్చడానికి మంటపెట్టిన చోటు
ఇ) కొండ్రలు = భూమి దున్నిన సాళ్ళు; గీతలవలె = చారలవలె
ఈ) డొక్క = కడుపు (పక్కభాగం)
ఉ) కబుర్లు = ముచ్చట్లు
ఊ) కూడు = అన్నం, బువ్వ
Exam Tips:
a) వాక్యంలో గీత గీసిన పదానికి సందర్భానుసారం అర్థాన్ని రాయండి; అర్థం చెప్పేటప్పుడు సరళమైన పదాలు వాడండి.
Question 2: కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) కల్లబొల్లి
ఆ) పాతరోత
ఇ) చెమటోడ్చి
ఈ) విగ్రహాలు
Answer:
అ) కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసం చేసేవారి నుండి జాగ్రత్తగా ఉండాలి.
ఆ) కొత్త వింత, పాత రోత అని నిరసించడం తప్పు.
ఇ) చెమటోడ్చి పనిచేసినా కడుపునిండా తిండిలేని పేదలు ఎంతోమంది ఉన్నారు.
ఈ) రాళ్ళతో విగ్రహాలు చెక్కే కళ శిల్పకళ.
Exam Tips:
a) ఇచ్చిన పదాన్ని మార్చకుండా వాక్యంలో అదే రూపంలో వాడండి; వాక్యం అర్థవంతంగా ఉండాలి.
Question 3: కింది వాక్యాలు చదువండి. ప్రతివాక్యంలోనూ ప్రకృతి–వికృతి పదాలు ఉన్నాయి. వాటిని గుర్తించండి.
అ) కొందరు పిల్లలు పశువులను మేపుతున్నారు. మరికొందరు పసరాలతో ఆడుతున్నారు.
ఆ) జాతరలో రథం తిప్పుతారట! ఆ అరదం అందంగా ఉంటుందట!
Answer:
అ) పశువు (ప్ర) – పసరం (వి)
ఆ) రథం (ప్ర) – అరదం (వి)
Exam Tips:
a) సంస్కృత పదం ప్రకృతి (ప్ర), తెలుగులో మారిన రూపం వికృతి (వి); రెండింటినీ బ్రాకెట్లతో గుర్తించండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: కింది పదాలను విడదీయండి. సంధుల పేర్లు రాయండి.
ఉదా: ఎవరితడు = ఎవరు + ఇతడు (ఉకార సంధి)
అ) డొక్కలెండి
ఆ) బుట్టలల్లి
ఇ) గుడ్డలుతికి
ఈ) రాముడెప్పుడు
Answer:
అ) డొక్కలు + ఎండి (ఉత్వ సంధి)
ఆ) బుట్టలు + అల్లి (ఉత్వ సంధి)
ఇ) గుడ్డలు + ఉతికి (ఉత్వ సంధి)
ఈ) రాముడు + ఎప్పుడు (ఉత్వ సంధి)
Exam Tips:
a) సూత్రం: ఉకారానికి అచ్చు పరమైతే సంధి (పూర్వపదం చివరి “ఉ” లోపిస్తుంది); విడదీసినప్పుడు ముందు పదం ఉకారాంతమై ఉండాలి.
Question 2: ఈ కింది పదాలను కలుపండి. సంధుల పేర్లు రాయండి.
ఉదా: వెలుగును + ఇచ్చెను = వెలుగునిచ్చెను (ఉకార సంధి)
అ) కులాలు + అని
ఆ) కూటికి + ఇంత
ఇ) కొండ్రలు + ఏసి
ఈ) కబుర్లు + అని
ఉ) అంది + ఇచ్చు
Answer:
అ) కులాలు + అని = కులాలని (ఉత్వ సంధి)
ఆ) కూటికి + ఇంత = కూటికింత (ఇత్వ సంధి)
ఇ) కొండ్రలు + ఏసి = కొండ్రలేసి (ఉత్వ సంధి)
ఈ) కబుర్లు + అని = కబుర్లని (ఉత్వ సంధి)
ఉ) అంది + ఇచ్చు = అందిచ్చు (ఇత్వ సంధి)
Exam Tips:
a) పూర్వపదం చివరి అచ్చును గమనించి (ఉ, ఇ, అ) సంధి పేరు నిర్ణయించండి.
Question 3: కింది పట్టిక ఆధారంగా సరైన ప్రత్యయాలతో ఖాళీలు పూరించండి.
అనగనగా ఒక రాజ్య _____ (1) ఆ రాజ్య _____ (2) ప్రజల _____ (3) కులాలు, మతాలు లేవు. వారంతా ఒకరి _____ (4) ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారి _____ (5) మంచివారు ప్రపంచం _____ (6) ఎవరూ లేరు. అన్నదానం _____ (7) పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు _____ (8) అన్నదానం చేయబడింది. కాని ఆ అన్నదానాని _____ (9) ఎవరూ రాలేదు. కారణం ఆ ఊరిప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. _____ (10) ప్రజలారా! మీరంతా ధన్యులు. మీ _____ (11) నా జేజేలు అన్నాడు రాజు.
ప్రత్యయాలు: కు, ఓ, చేత, కి, ము, వలన, లో, కొరకు, కంటె, తో
Answer:
అనగనగా ఒక రాజ్యము (1). ఆ రాజ్యములో (2) ప్రజలకు (3) కులాలు, మతాలు లేవు. వారంతా ఒకరి కొరకు (4) ఒకరు త్యాగాలు చేసుకుంటారు. వారి కంటె (5) మంచివారు ప్రపంచంలో (6) ఎవరూ లేరు. అన్నదానం వలన (7) పుణ్యం వస్తుందని ఆ ఊరి రాజు చేత (8) అన్నదానం చేయబడింది. కాని ఆ అన్నదానానికి (9) ఎవరూ రాలేదు. కారణం ఆ ఊరిప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు. ఇది విని రాజు సంతోషపడ్డాడు. ఓ (10) ప్రజలారా! మీరంతా ధన్యులు. మీకు (11) నా జేజేలు అన్నాడు రాజు.
Exam Tips:
a) ప్రతి ఖాళీ ముందు ఉన్న పదం, తర్వాతి భావాన్ని చూసి సరైన విభక్తి ప్రత్యయం ఎంచుకోండి; ఇచ్చిన ప్రత్యయాలలో ప్రతిదాన్నీ ఉపయోగించండి.
ప్రాజెక్టు పని
Question 1: కుల వ్యవస్థను రూపుమాపేందుకు కృషిచేసిన ఒక సంఘసంస్కర్త గురించి, మీ పాఠశాల గ్రంథాలయం నుండి సమాచారం సేకరించండి, వారి గురించి నివేదిక రాయండి. ప్రదర్శించండి.
Answer:
బాబాసాహెబ్ అంబేద్కర్:
పూర్వకాలంలో కులవ్యవస్థ బాగా పాతుకుపోయి ఉండేది. అంటరానితనం భూతంలాగా భయపెడుతూ బాధిస్తూ ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యంలో ఎన్నో కష్టాలను అనుభవించి, అవమానాలకు గురియై, సమాజానికి ఎదురు తిరిగాడు. పట్టుదలతో పెద్దచదువులు చదివాడు. దళితులలో ఆత్మవిశ్వాసం పెంచాడు. వారిని చైతన్యవంతులను చేశాడు. రాజ్యాంగ నిర్మాణ ముసాయిదా సంఘానికి అధ్యక్షుడై దళితులకు కొన్ని హక్కులు కల్పించాడు. రిజర్వేషన్లు కల్పించాడు. ఆ విధంగా కులాల వ్యవస్థను కదిలించి అణగద్రొక్కబడ్డవారిని తల ఎత్తుకొని జీవించేలా ప్రోత్సహించాడు. అలా అందరికీ ఆరాధ్య దైవమైనాడు.
Exam Tips:
a) నివేదికలో సంస్కర్త పేరు, జననం, చేసిన కృషి, ఫలితాలు – ఈ నాలుగు అంశాలు ఉండాలి; గ్రంథాలయం నుండి సేకరించిన వివరాలు జోడించండి.
అదనపు ప్రశ్నలు (Important Questions)
Question 1: రైతు చేసే కష్టాన్ని వివరించండి.
Answer:
రైతు తన కడుపుమాడుతున్నా లెక్కచేయకుండా భూమి చదును చేసి నాట్లు వేస్తాడు. పగలూ రాత్రీ కష్టపడి పొలంలో పంట పండించి ధాన్యపు రాసులను బస్తాల కెత్తుతాడు. ప్రజలందరి ఆకలి తీరుస్తాడు. అతనికి చివరికి మిగిలేది మాడిపోయిన మాడు అన్నమే. దానితోనే సరిపెట్టుకుంటూ కష్టపడుతూ మాగాణి పొలాలను దున్ని నాణెమైన పంటలు పండిస్తున్నాడు రైతు.
Exam Tips:
a) రైతు శ్రమను క్రమంగా (భూమి చదును, నాట్లు, పంట, ధాన్యరాసులు) వివరించి, అతడికి మిగిలేది మాడు అన్నమే అని ముగించండి.
Question 2: “మనుషులంతా ఒక్కటే” అనడానికి ఉదాహరణగా మీకు తెలిసిన ఒక సంఘటన గాని, కథగాని రాయండి.
Answer:
కోట్లాదిమంది ప్రజలు తమ ఆరాధన స్థలాలకు రోజూ వెళ్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. శక్తి కొద్దీ కానుకలిస్తారు. కాని భగవంతుడికి వీటన్నిటికంటే దయాదాక్షిణ్యాలు, జాలి, కరుణ కలిగిన వాళ్ళు, దానధర్మాలు చేసేవాళ్ళు అంటేనే ఇష్టం.
మనిషి మనిషికీ మధ్య అసూయాద్వేషాలు, ఓర్వలేనితనం, మోసాలు ద్వేషాలు, నేరాలు అడ్డుగోడలైనాయి.
మానవత్వం మరుగున పడిపోయింది. సమత, మమత అంతరించాయి. ఒక శివరాత్రినాడు శివాలయానికి తండోపతండాలుగా వచ్చారు. ఆ జనసమ్మర్దంలో ఒక కళ్ళులేని బిచ్చకత్తె కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలో గిన్నె గోతిలో పడిపోయింది. అవ్వ స్పృహకోల్పోయింది. అక్కడికొచ్చిన మంత్రులు, అధికారులు, పెద్దమనుషులు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. గుడిలో గంట ఎవరు కొట్టినా మోగటం లేదు. ఇద్దరు పిల్లలు ఆమె పరిస్థితి చూసి అక్కడికొచ్చారు.
అవ్వను లేపి కూర్చోబెట్టారు. దుమ్ము ధూళి దులిపి గాయానికి కట్టుగట్టారు.
అవ్వనోట్లో చల్లని నీరు పోశారు. శివపూజకు తెచ్చిన అరటిపళ్ళు తినిపించారు. అవ్వ ఎంతో ఆనందంగా ఆ పిల్లల్ని మెచ్చుకొని దీవించింది. అంతే గుడిగంటలు గణగణా మ్రోగాయి. సమాజంలో నేడు అందరూ అలవరచుకోవలసింది ఇటువంటి మానవత్వమే.
Exam Tips:
a) కథ లేదా సంఘటనలో మానవత్వం, కుల మత భేదం లేకపోవడం స్పష్టంగా కనిపించాలి; ముగింపులో నీతిని చెప్పండి.
I. కింద ఇచ్చిన వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి
Question 1: వేసవి ఎండలవేడి కొలిమిలో పెట్టినట్లున్నది. (కొలిమి)
Answer:
కొలిమి = ఇనుము కాల్చే నిప్పులు మండే చోటు
Exam Tips:
a) కమ్మరి ఇనుము కాల్చే స్థలం అని సందర్భంతో రాయండి.
Question 2: మాగాణంలో వరి బాగా పండుతుంది. (మాగాణం)
Answer:
మాగాణం = తరిపొలం (నీటి వసతి గల పొలం)
Exam Tips:
a) “మాగాణి” అంటే వరి పండించే పొలం.
Question 3: వేసవిలో మల్లెపూలు రాసులు మంచి వాసన వెదజల్లుతాయి. (రాసులు)
Answer:
రాసులు = కుప్పలు
Exam Tips:
a) రాసి (ప్ర) – రాసులు అనే రూపాన్ని గుర్తించండి.
Question 4: పశువులను ప్రేమగా చూడాలి. (పశువులు)
Answer:
పశువులు = జంతువులు
Exam Tips:
a) పశువు పదానికి ఇతర అర్థాలు కూడా ఉన్నాయి; సందర్భానికి తగినదే రాయండి.
Question 5: ఎండలలో బండలు కాలిపోతుంటాయి. (బండలు)
Answer:
బండలు = రాళ్ళు
Exam Tips:
a) బండ = రాయి, శిల అనే పర్యాయపదాలను గుర్తుంచుకోండి.
II. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి
Question 1: దగ్గు
Answer:
దగ్గు ఎక్కువగా వస్తుంటే మందు వాడాలి.
Exam Tips:
a) పదం ఉపయోగించిన సరళమైన వాక్యం రాయండి.
Question 2: పూజ
Answer:
ఈ రోజు గుడిలో ప్రత్యేకమైన పూజ ఉన్నది.
Exam Tips:
a) పదాన్ని అదే రూపంలో వాడండి.
Question 3: కాగితాలు
Answer:
మనం కాగితాలపై రాసుకుంటాము.
Exam Tips:
a) బహువచన రూపాన్ని వాక్యంలో వాడండి.
Question 4: చేయి కలిపి
Answer:
ఏ పనియైనా అందరూ చేయి కలిపితే తేలికగా అయిపోతుంది.
Exam Tips:
a) జాతీయం (చేయి కలపడం) అర్థంతో వాక్యం రాయండి: ఐకమత్యం.
III. కింది వాక్యాలలోని ప్రకృతి వికృతి పదాలను గుర్తించి రాయండి
Question 1: అడవిలో అగ్నిశిఖలు వ్యాపించినాయి. ఆ సెగలకు చెట్లు మాడిపోయాయి.
Answer:
శిఖ (ప్ర) – సెగ (వి)
Exam Tips:
a) శిఖ – సెగ జంటను గుర్తుంచుకోండి.
Question 2: కులంలో గుణవంతుడైన కొడుకుంటే ఆ కొలం ప్రసిద్ధమౌతుంది.
Answer:
కులం (ప్ర) – కొలం (వి)
Exam Tips:
a) కులం – కొలం అనే రూపాలు పాఠంలోనివే.
Question 3: దేవుని రథం బయలుదేరింది. ఆ అరదాన్ని భక్తులంతా లాగారు.
Answer:
రథం (ప్ర) – అరదం (వి)
Exam Tips:
a) రథం – అరదం; రాశి – రాసి వంటి జంటలను నేర్చుకోండి.
IV. కింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి
Question 1: రవి ఇల్లు మా గృహం పక్కనే ఉంది. వారి నివాసానికి నేను వెళుతూ ఉంటాను.
Answer:
ఇల్లు – గృహం, నివాసం
Exam Tips:
a) ఇల్లు, గృహం, సదనం, నివాసం, ఆవాసం ఒకే అర్థం ఉన్న పదాలు.
Question 2: సన్న్యాసి అంటే అన్ని కోరికలను వదిలేసినవాడు. కాని ఈ కాలంలో జడధారులు అంతా మోసగాళ్ళే. ఆ దొంగ యతులను నమ్మకూడదు.
Answer:
సన్న్యాసి – జడధారి, యతి
Exam Tips:
a) సన్న్యాసి = భిక్షువు, యతి, ముని, జడధారి.
V. క్రింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి
Question 1: బుట్టలల్లి
Answer:
బుట్టలు + అల్లి = ఉత్వ సంధి
Exam Tips:
a) ఉకారాంత పూర్వపదం + అచ్చు = ఉత్వ సంధి.
Question 2: గొట్టాలై
Answer:
గొట్టాలు + ఐ = ఉత్వ సంధి
Exam Tips:
a) పూర్వపదం “గొట్టాలు” ఉకారాంతం.
Question 3: కూటికింత
Answer:
కూటికి + ఇంత = ఇత్వ సంధి
Exam Tips:
a) పూర్వపదం చివర “ఇ” ఉంటే ఇత్వ సంధి అవుతుంది.
Question 4: చెమటోడ్చి
Answer:
చెమట + ఓడ్చి = అత్వ సంధి
Exam Tips:
a) “చెమట” అకారాంతం కాబట్టి అత్వ సంధి.
VI. క్రింది పదాలకు విగ్రహవాక్యం రాసి ఏ సమాసాలో రాయండి
Question 1: చెమటోడ్చి
Answer:
చెమటను ఓడ్చి = ద్వితీయా తత్పురుష సమాసం
Exam Tips:
a) “-ను” విభక్తి ఉంటే ద్వితీయా తత్పురుషం.
Question 2: పొగగొట్టాలు
Answer:
పొగ యొక్క గొట్టాలు = షష్ఠీ తత్పురుష సమాసం
Exam Tips:
a) “యొక్క” ఉంటే షష్ఠీ తత్పురుషం.
Question 3: కూటికింత
Answer:
కూటి కొరకు ఇంత = చతుర్థీ తత్పురుష సమాసం
Exam Tips:
a) “కొరకు/కై” ఉంటే చతుర్థీ తత్పురుషం.
కవి పరిచయం
Question 1: ‘ఏ కులం?’ పాఠ్య రచయిత గూర్చి రాయండి.
Answer:
చెరబండరాజు అసలుపేరు బద్దం భాస్కరరెడ్డి. నల్లగొండ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంతూరు. ఈయన ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 1965లో దిగంబర కవిగా మొదలై, 1970 తర్వాత విప్లవగేయాలు, కథలు, నవలలు రాశాడు. ‘గమ్యం’, ‘ముట్టడి’, ‘పల్లవి’ ఇతని కవితా సంకలనాలు. “కత్తిపాట” ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కవోని దీక్షకు, ధిక్కారస్వరానికి ప్రతినిధి, ప్రతీక చెరబండరాజు. ‘ఏ కులం?’ పాఠం ఆయన రచించిన ‘జన్మహక్కు’ అనే కవితా సంపుటిలోనిది.
Exam Tips:
a) కవి అసలు పేరు, ఊరు, వృత్తి, రచనలు, బిరుదు/గుర్తింపు – ఈ క్రమంలో రాయండి.
b) ఈ పాఠం “గేయ” ప్రక్రియకు చెందినది (మాత్రా ఛందస్సు) అని గుర్తుంచుకోండి.
Free study material for Telugu
Telugu Class 7 Curriculum Solutions: Lesson 09 Which Caste? (E Kulam?)
Accessing Lesson 09 Which Caste? (E Kulam?) Solutions
Access structured TS Board textbook solutions for Lesson 09 Which Caste? (E Kulam?). Designed in alignment with the latest academic curriculum for Class 7 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Concept-Driven Answers for Class 7 Telugu
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Maximizing Study Efficiency
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Telugu.
FAQs
The complete and updated TS 7th Class Telugu 9th Lesson Questions and Answers Telangana ఏ కులం? is available for free on StudiesToday.com. These solutions for Class 7 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 7th Class Telugu 9th Lesson Questions and Answers Telangana ఏ కులం? as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 7th Class Telugu 9th Lesson Questions and Answers Telangana ఏ కులం? will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Telugu. You can access TS 7th Class Telugu 9th Lesson Questions and Answers Telangana ఏ కులం? in both English and Hindi medium.
Yes, you can download the entire TS 7th Class Telugu 9th Lesson Questions and Answers Telangana ఏ కులం? in printable PDF format for offline study on any device.