Step-by-Step Textbook Solutions for Class 6 Telugu Lesson 11 Palleturi Pillagada!
Access comprehensive textbook solutions for Lesson 11 Palleturi Pillagada! using the official curriculum guides for Class 6 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Download Lesson 11 Palleturi Pillagada! Textbook Solutions PDF
Access the complete solution PDF for Class 6 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
ఆలోచించండి – చెప్పండి
Question 1: పై బొమ్మలో ఎవరెవరున్నారు ?
Answer:
పై బొమ్మలో సైకిలు యజమాని, బాల కార్మికుడు ఉన్నారు.
Exam Tips:
a) చిత్రాన్ని జాగ్రత్తగా గమనించి, కనిపించిన వారి గురించి మాత్రమే రాయండి.
Question 2: పిల్లవాడు ఏం చేస్తున్నాడు ?
Answer:
పిల్లవాడు సైకిల్ ట్యూబు బాగుచేస్తున్నాడు.
Exam Tips:
a) చిత్రంలో పిల్లవాడు చేస్తున్న పనిని ఒక్క వాక్యంలో స్పష్టంగా చెప్పండి.
Question 3: ఆ పిల్లవాడిని చూస్తే మీకేమనిపిస్తున్నది ?
Answer:
ఆ పిల్లవానిని చూస్తే అయ్యో పాపం అని అనిపిస్తుంది.
Exam Tips:
a) చూసినపుడు కలిగిన భావాన్ని (జాలి, బాధ) సొంత మాటల్లో రాయండి.
Question 4: ఇట్లాంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు ?
Answer:
ఇట్లాంటి వాళ్ళ జీవితాలు నిరాశతో, బాధతో ఉంటాయి.
Exam Tips:
a) బాలకార్మికుల కష్టాలను (చదువు లేకపోవడం, ఆకలి, బాధ) రెండు మూడు పాయింట్లుగా రాయండి.
ఆలోచించండి – చెప్పండి (పాఠ్యభాగం ఆధారంగా)
Question 1: “పాలబుగ్గల జీతగాడు” అంటే నీకు ఏమని అర్థం అయింది ?
Answer:
పాలబుగ్గల జీతగాడంటే పాలుగారే బుగ్గలతో ఉన్న వాడని అర్థమయింది. అంత చిన్న వయసులోనే పనికి కుదిరాడని అర్థమయింది.
Exam Tips:
a) ‘పాలబుగ్గలు’ అంటే చిన్న వయసు – ‘జీతగాడు’ అంటే జీతానికి పనిచేసేవాడు అని రెండు పదాలకూ అర్థం చెప్పండి.
Question 2: “దొడ్డికీవే దొరవైపోయావా” అని కవి పిల్లవాడిని ఎందుకు అన్నాడు ?
Answer:
పాలబుగ్గల జీతగాడు చిన్న వయస్సున్న వాడైనప్పటికి పశువుల దొడ్డి బాగోగులు తానే చూసుకోవలసి వచ్చింది. అందుకే కవి అలా అన్నాడు.
Exam Tips:
a) ‘దొడ్డికి దొర’ అనేది పశువుల దొడ్డి బాధ్యతను చిన్న వయసులో తనే మోయడాన్ని సూచిస్తుందని చెప్పండి.
Question 3: “చేతికర్రే తోడయ్యిందా?” అనడంలో అర్థం ఏమిటి ?
Answer:
‘చేతికర్రే తోడయ్యిందా’ అని అనడంలో ఇంత చిన్న వయస్సులో పశువుకాపరివి అయ్యావా అన్న అర్థం, స్నేహితులుండాల్సిన వయసులో కర్రతో స్నేహం చేయాల్సి వచ్చిందని అర్థం.
Exam Tips:
a) ‘చేతికర్రే తోడు’ అంటే స్నేహితులు లేరు, ఒంటరితనం అనే భావం ఉంది.
Question 4: పంటచేనుకు కాపు ఉంటాడు కదా! పంటకు కాపు అవసరం ఏమిటి ?
Answer:
పంట చేనుకు కాపు ఉంటాడు. పంటలను పశువులు, పిట్టలు తినకుండా, పంటను ఇతరులు దొంగిలించకుండా ఉంటాడు.
Exam Tips:
a) కాపు అవసరం: పశువులు, పిట్టలు తినకుండా, దొంగలు దోచుకోకుండా పంటను కాపాడడం.
Question 5: “జీతగాని జీవితం వెలుగు లేనిది” అని కవి అన్నాడు కదా! అదెట్లాగో చెప్పండి ?
Answer:
జీతగాని జీతం నిజంగా వెలుగులేనిదే! ఎందుకంటే అతడి నెల జీతం కుంచెడు ధాన్యం. వాటిలో కూడా కొన్ని తాలుగింజలు, మరికొన్ని కల్తీ ఒడ్లు, కడుపునిండా తినడానికి సరిపోదు. అందుకే అలా వెలుగులేని జీవితం అన్నాడు.
Exam Tips:
a) నెల జీతం కుంచెడు వడ్లు, అందులో తాలు, కల్తీ – ఈ కారణాలను చెప్పి ‘వెలుగు లేని జీవితం’ అని ముగించండి.
ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: పాటను విన్నారు కదా! ఈ పాటను రాగంతో పాడండి.
Answer:
విద్యార్థి కృత్యం.
Exam Tips:
a) పాటను రాగంతో పాడడం కృత్యం; స్పష్టంగా, భావంతో పాడండి.
Question 2: పల్లెటూరి పిల్లగాని బాధలు ఎట్లున్నాయో చెప్పండి.
Answer:
లేత వయసులోనే దొరల వద్ద బానిస బతుకు బతుకుతున్న దుర్భర జీవితం పల్లెటూరి పిల్లగానిది. ఆ పల్లెటూరి పిల్లగాడికి వేసుకోవటానికి బట్ట లేవు.
తొడుక్కోవటానికి చెప్పులు లేవు. పశువుల కొట్టం వాడి నివాసం. దొరగారి తిట్టు వాడికి బహుమానాలు, పచ్చికారం ముద్దలు వాడికి ఆహారం. పాలికాపుల అదిరింపులు బెదిరింపులు. చదువుకునే అదృష్టం కూడా లేదు. ఇంతకన్నా బాధ లేముంటాయి.
Exam Tips:
a) బాధలను (బట్టలు, చెప్పులు, ఆహారం, నివాసం, చదువు లేకపోవడం) వరుసగా రాయండి.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
Question 1: కింది పదాలను చదవండి. తారుమారుగా ఉన్న పదాలను సరిచేసి రాస్తే పాఠంలోని ఒక భాగం అవుతుంది. సరిచేసి రాయండి.
అ. కంచె దుంకి మాటిమాటికి పాడుచేసాయా పంటచేలు మాయదారి ఆవుదూడలు కొట్టాడా పాలికాపు నిన్నే జీతగాడ ఓ పాలబుగ్గల.
ఆ. వొంపులోకి తరలేగుంపు కూరుచున్నవు గుండు గుండుమీద దొరవైపోయావా దొడ్డికీవే ఓ పాలబుగ్గల జీతగాడ నడ్డగించేవా దొంగగొడ్ల
Answer:
అ. మాయదారి ఆవుదూడలు
మాటిమాటికి కంచె దుంకి
పంటచేలు పాడుచేశాయా
పాలికాపు నిన్నే కొట్టాడా
ఓ పాలబుగ్గల జీతగాడా
ఆ. గుంపు తరలే వొంపులోకి
కూరుచున్నవు గుండుమీద
దొడ్డికీవే దొరవైపోయావా
దొంగగొడ్ల నడ్డగించేవా
ఓ పాలబుగ్గల జీతగాడా
Exam Tips:
a) గేయంలోని పంక్తుల క్రమాన్ని పాటను గుర్తు చేసుకుని సరిచేయండి; ప్రాస, అర్థం రెండూ సరిపోవాలి.
Question 2: కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
మదునయ్య చేపల వ్యాపారి. పాలేరు రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు. పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడతాడు. ఇందుకోసం ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్కు పోయి ఆరోతరగతి చదివే గంగయ్య అనే బాలుడి తల్లిదండ్రులతోటి మాట్లాడి పదివేలకు అతడిని పనికి కుదుర్చుకున్నాడు.
గంగయ్యను తనవెంట తీసుకొని పాలేరు వచ్చాడు. గంగయ్య రోజూ నీటి ఒడ్డున కూర్చొని వలను చూస్తూ ఉండేవాడు. ఒక్కోసారి రాత్రికూడా అక్కడే పండుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మదునయ్యను శిక్షించారు. గంగయ్యను బడిలో చేర్పించి అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.
(అ) మదునయ్య ఎవరు ? ఏం చేసేవాడు ?
(ఆ) గంగయ్య ఎవరు ? పాలేరుకు ఎందుకు వచ్చాడు ?
(ఇ) గంగయ్య పనిలో చేరడం వల్ల ఏమేం కోల్పోయాడు ?
(ఈ) బాలల హక్కులలో గంగయ్య ఏ హక్కులకు దూరమయ్యాడు ?
(ఉ) మదునయ్యను ఎందుకు శిక్షించారు ? ఇట్లా చేయడం సరైందేనా ?
(ఊ) గంగయ్య తల్లిదండ్రులు చేసిన పని సరైందేనా ? ఎందుకు ?
Answer:
(అ) మదునయ్య చేపల వ్యాపారి. అతడు పాలేరు రిజర్వాయరులో చేపలు పట్టి అమ్ముతాడు.
(ఆ) గంగయ్య ఒరిస్సాలోని బరంపూర్ గ్రామానికి చెందిన బాలుడు. పేదరికం వల్ల అమ్ముడుపోయి పాలేరుకు వచ్చాడు.
(ఇ) గంగయ్య పనిలో చేరడం వలన చదువును, ఆనందాన్ని, ఆటలను, స్వేచ్ఛను కోల్పోయాడు.
(ఈ) బాలల హక్కులలో గంగయ్య చదువుకునే హక్కును కోల్పోయాడు.
(ఉ) బాలకార్మికుడిని పనిలోకి తీసుకున్నందుకు మదునయ్యను శిక్షించారు. ఇది సరైందే.
(ఊ) గంగయ్య తల్లిదండ్రులు చేసిన పని సరైనది కాదు. ఎందుకంటే గంగయ్యకు చదువు చెప్పించకుండా పసితనంలోనే బాలకార్మికునిగా మార్చడం తప్పు.
Exam Tips:
a) పేరా చదివి సమాధానాలను పేరాలోని పదాలతో రాయండి; ‘సరైందేనా?’ అనే ప్రశ్నలో అవును/కాదు చెప్పి కారణం రాయండి.
Question 3: కింది వాక్యాలను చదివి తప్పో, ఒప్పో గుర్తించండి. కారణం రాయండి.
(అ) చదువుకోవడం అందరి హక్కు.
(ఆ) బాలికలు కూడా బాలురతో పాటు సమానంగా చదవడం.
(ఇ) బాలబాలికలకు సమాన హక్కులు ఉంటాయి.
(ఈ) బాలబాలికలను భయపెట్టడం, కొట్టడం, తిట్టడం.
(ఉ) తల్లిదండ్రులు తమ పిల్లలను పనిలో పెట్టడం.
(ఊ) పిల్లలు మంచి ఆహారం పొందడం.
(ఎ) తెలియనివాటిని, రానివాటిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం, నేర్చుకోవడం.
Answer:
(అ) ఒప్పు. కారణం : చదువు సంస్కారాన్నిస్తుంది, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
(ఆ) ఒప్పు. కారణం : బాలురతో సమానంగా బాలికలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది.
(ఇ) ఒప్పు. కారణం : బాలబాలికలకు సమాన హక్కులుంటాయి. అది రాజ్యాంగం ఇచ్చిన వరం.
(ఈ) తప్పు. కారణం : పిల్లలలో మంచి మాటలతో మార్పు తేవాలి గాని కొట్టడం చట్టవిరుద్ధం.
(ఉ) తప్పు. కారణం : తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి జ్ఞానవంతులను చేయాలి గాని పనిలో పెట్టరాదు.
(ఊ) ఒప్పు. కారణం : పిల్లలు మంచిగా ఎదగాలంటే మంచి ఆహారం అవసరం.
(ఎ) ఒప్పు. కారణం : తెలియని వాటిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం వలన విషయ అవగాహన పెరుగుతుంది.
Exam Tips:
a) ఒప్పు/తప్పు చెప్పడమే కాదు, కారణం తప్పక రాయండి.
III. స్వీయ రచన
Question 1: కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
(అ) “సగము ఖాళీ, చల్లగాలి” అని కవి ఏ సందర్భంలో అన్నాడు ? ఎందుకు ?
(ఆ) పశువుల కాపరి వలె బాల్యాన్ని కోల్పోతున్నవారు ఇంకెవరెవరు ఉండవచ్చు ?
(ఇ) బడిలోని తోటి పిల్లలను చూసిన పసుల కాసే పిల్లవాడు ఎందుకు బాధపడ్డాడో కారణాలు ఊహించి రాయండి.
(ఈ) సుద్దాల హనుమంతు గురించి రాయండి.
Answer:
(అ) కవి పల్లెటూరి పిల్లగాని వేషధారణను వర్ణిస్తూ ‘సగము ఖాళీ, చల్లగాలి’ అన్నాడు. వాడు చాలీచాలని చిరిగిపోయిన వస్త్రాన్ని మొలకు చుట్టుకున్నాడు. అదంతా చిరుగులతో ఉండటంతో చల్లగాలి అతని శరీరాన్ని తాకుతున్నదని, తద్వారా అతని బీదరికాన్ని వర్ణించాడు.
(ఆ) పశువుల కాపరుల వలె బాల్యాన్ని కోల్పోతున్నవారు బాలకార్మికులు. వారిలో హోటళ్ళలో, కార్ఖానాలలో, పరిశ్రమలలో, మార్కెట్లలో పనిచేసేవారు ఉన్నారు. ఇండ్లలో పనిచేసేవారు కూడా తమ బాల్య జీవితాన్ని కోల్పోతున్నారు.
(ఇ) బడిలోని తోటి పిల్లలను చూసిన పసుల కాసే పిల్లవాడు చదువుకునే అదృష్టం తనకు కలుగలేదే అని బాధపడ్డాడు. మనసులో చదువుకోవాలని ఉన్నా పరిస్థితులకు బానిస అయినందుకు బాధపడ్డాడు. బడి పిల్లల వలె మంచి బట్టలు ధరించనందుకు, వారితో కలిసి హాయిగా ఆడుకోనందుకు బాధపడ్డాడు.
(ఈ) ‘పల్లెటూరి పిల్లగాడా’ గేయ రచయిత సుద్దాల హనుమంతు. ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామస్తుడు. 1910లో జన్మించాడు. ఆర్యసమాజ కార్యకర్తగా, ఆంధ్రమహాసభ కార్యవర్గ సభ్యుడిగా, ప్రజాకవిగా, కళాకారుడిగా తెలంగాణ విమోచనోద్యమ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాడు. చైతన్యవంతమైన గీతాలు, బుర్రకథలు, గొల్లసుద్దులు, పిట్టలదొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. 1982 అక్టోబరు 10న మరణించాడు.
Question 2: కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
(అ) పల్లెటూరి పిల్లగాడు, పశువుల కాపరి లాంటి వాళ్ళ జీవితాలు చదువుకుంటేనే బాగుపడతాయి. దీనిని సమర్థిస్తూ రాయండి.
Answer:
కవి సుద్దాల హనుమంతు ‘పల్లెటూరి పిల్లగాడా’ గేయంలో బాలకార్మికులు పడే బాధలను కళ్ళకు కట్టినట్లు చూపారు. వీటికి కారణం బడికి పోలేకపోవడమే.
చదువుకోవడం వల్ల బుద్ధి వికసిస్తుంది. మంచీ చెడూ తెలుస్తుంది. నలుగురితో ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది. పల్లెటూరి పిల్లగాడికి యజమాని జీతం సరిగా కొలవలేదు. చదువుకోవడం వల్ల అలాంటి మోసాలను తెలుసుకుని మోసపోకుండా ఉండవచ్చు. పల్లెటూరి పిల్లగాడు చదువుకోకపోవడం వల్లే సరైన బట్టలు లేక, చెప్పులు లేక, అడవుల్లో తిరుగుతూ పశువులు కాయవలసి వచ్చింది.
చదువుకుంటే మంచి ఉద్యోగం చేసి చక్కని బట్ట, తిండి, గూడు సంపాదించుకోవచ్చు. చిన్నతనంలోనే శ్రమకు గురైతే, ఎదుగుతున్నకొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. బాల్యం చదువుకోవడానికి. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండి చదువుకుంటూ, తమ ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఎదగడం వల్ల శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగుంటాయి.
Exam Tips:
a) ఐదేసి వాక్యాల పరిమితిని పాటించండి; కవి పరిచయంలో జన్మస్థలం, సంవత్సరం, రచనలు తప్పనిసరిగా రాయండి.
IV. సృజనాత్మకత / ప్రశంస
Question 1: పాఠం ఆధారంగా పిల్లగాని జీవితాన్ని “ఆత్మకథ”గా రాయండి.
Answer:
నేను పల్లెటూరి పిల్లగాడిని. నిన్న మొన్నటివరకు చిన్న పిల్లవాడిగా తిరిగాను. పసి వయసులో పనిచేయాల్సిన దుస్థితి నాకు కలిగింది. చిరిగిపోయిన దుస్తులు కట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని పశువులను కాసే మొనగాడిని కావాల్సి వచ్చింది. పశువులను అడవికి తోలుకుపోయి బండరాయి మీద కూర్చుంటాను. చిన్న వయసులోనే బండచాకిరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
పశువులు పంట చేలో మేశాయని పాలికాపు కొట్టకమానడు. అమ్మా నాన్నా పేదవాళ్ళు! పాపం వాళ్ళు ఏం చేస్తారు. జీతగానిగా దొరకు నన్నప్పగించారు. నా నెల జీతం కుంచెడు వడ్లు. అవి కూడా సరిగా ఇవ్వడు దొర. అందులో తాలు వడ్లు, పొట్టు, కల్తీ వడ్లు, చాలీచాలని తిండితో నా బాధలు ఏమని చెప్పను. నా ఈడు పిల్లలు బడికి పుస్తకాలతో వెళ్తుంటే నా మనసు అటే లాగేది. నా జీవితానికి వెలుగులేదని బాధపడ్డాను. నేను ఓ బాలకార్మికుడిని. నాలాంటి వారిని ఆదుకునే మంచిరోజులు రావాలి. నాలాంటి బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి.
Exam Tips:
a) ఆత్మకథలో ‘నేను’ అనే ఉత్తమ పురుషలో రాయండి; గేయంలోని విషయాలు (కర్ర, చిరిగిన బట్ట, జీతం, ఆకలి, బడి పిల్లలు) చేర్చండి.
Question 2: కింది బొమ్మను చూడండి. పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి సంభాషణలు రాయండి.
Answer:
బడిపిల్లవాడు : హలో జానీ! ఏంటి ఇక్కడ కూర్చున్నావ్ ?
జీతగాడు జానీ : ఆ! ఏముంది! మా దొర బర్రెలను కాపలా కాస్తున్నా!
బడిపిల్లవాడు : బర్రెలు కాయడమేమిటి ? రా బడికి వెళ్దాం! చదువుకుందాం!
జీతగాడు : మా నాయన కొడతాడు! చదువుకోవడానికి పోతే పైసలు ఎక్కడినుండి వస్తాయి ? ఈ బర్రెలు కాయడమే హాయిగా ఉంది. బర్రెలు కాస్తే జీతమిస్తారు.
బడిపిల్లవాడు : చాలా తప్పు చేస్తున్నావు! చదువుకుంటే చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు! పెద్దయినాక ఇంతకన్నా మంచి ఉద్యోగం చేయవచ్చు.
జీతగాడు : నాకూ చదువుకోవాలనే ఉంది. ఆ చదువులు, గిదువులు నాకు అర్థం అవుతాయా ?
బడిపిల్లవాడు : టీచర్లు పాఠాలు అర్థమయ్యేలా చెబుతారు! మొదట్లో అర్థం కాకపోయినా త్వరగానే నేర్చుకోవచ్చు.
జీతగాడు : అయితే సరే! రేపటి నుండి నేనూ చదువుకుంటా!
Exam Tips:
a) సంభాషణలో ఇద్దరి మాటలు మార్చి మార్చి రాయండి; బడికి వెళ్ళడం వల్ల లాభాలను చెప్పండి.
V. పదజాల వినియోగం
Question 1: కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
(అ) మా అన్నయ్య బాగా చదివి సర్కారు కొలువు సంపాదించాడు.
(ఆ) పెందలాడే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
(ఇ) మా ఊరు పక్కనే ఏరు పారుతున్నది.
(ఈ) నీ ముఖం ఏంటి అట్లా వెలవెలబోయింది ? ఏదైనా బాధ ఉన్నదా ?
Answer:
(అ) కొలువు = ఉద్యోగము
(ఆ) పెందలాడే = ఉదయాన్నే, త్వరగా
(ఇ) ఏరు = వాగు, నది
(ఈ) వెలవెలబోవు = తెల్లబోవు (కళ తప్పిపోవు)
Exam Tips:
a) గీత గీసిన పదానికి సందర్భాన్ని బట్టి అర్థం రాయండి.
Question 2: కింది పట్టికలో ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
(అ) పసులు ( ) క. అడవి
(ఆ) అంబ ( ) ఖ. గ్రాసం
(ఇ) అటవి ( ) గ. పశువులు
(ఈ) గాసం ( ) ఘ. అమ్మ
Answer:
(అ) పసులు – గ. పశువులు
(ఆ) అంబ – ఘ. అమ్మ
(ఇ) అటవి – క. అడవి
(ఈ) గాసం – ఖ. గ్రాసం
ప్రకృతి – వికృతి : పశువులు – పసులు; అంబ – అమ్మ; అటవి – అడవి; గ్రాసం – గాసం
Exam Tips:
a) ప్రకృతి (సంస్కృత రూపం) – వికృతి (తెలుగు రూపం) తేడాను గుర్తుంచుకోండి: పశువు – పసులు.
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: కింది పదాలను విడదీసి రాయండి.
ఉదా : నాయనమ్మ = నాయన + అమ్మ
(అ) నిజాశ్రమంబు
(ఆ) పోయితివయ్యా
(ఇ) నిజమూహింప
(ఈ) వలయమందు
(ఉ) ముఖారవిందం
Answer:
(అ) నిజాశ్రమంబు = నిజ + ఆశ్రమంబు
(ఆ) పోయితివయ్యా = పోయితివి + అయ్యా
(ఇ) నిజమూహింప = నిజము + ఊహింప
(ఈ) వలయమందు = వలయము + అందు
(ఉ) ముఖారవిందం = ముఖ + అరవిందం
Exam Tips:
a) సంధిలో మొదటి పదంలోని చివరి అచ్చు, రెండో పదంలోని మొదటి అచ్చు గమనించి విడదీయండి.
Question 2: కింది విడదీసిన పదాలను కలిపి రాయండి.
(అ) నిన్ను + అడుగ
(ఆ) ఇడుమకు + ఓర్చి
(ఇ) ఇప్పుడు + ఏమిటి
(ఈ) ఎవ్వరు + ఏమనిన
(ఉ) నిమిషము + ఏని
Answer:
(అ) నిన్ను + అడుగ = నిన్నడుగ
(ఆ) ఇడుమకు + ఓర్చి = ఇడుమకోర్చి
(ఇ) ఇప్పుడు + ఏమిటి = ఇప్పుడేమిటి
(ఈ) ఎవ్వరు + ఏమనిన = ఎవ్వరేమనిన
(ఉ) నిమిషము + ఏని = నిమిషమేని
Exam Tips:
a) కలిపేటప్పుడు ఉకారం లోపించి తరువాతి అచ్చు చేరుతుంది (నిన్ను + అడుగ = నిన్నడుగ).
Question 3: కింది గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలను రాసి, సమాసము పేరు రాయండి.
(అ) మనిషి జీవితంలో వెలుగునీడల వలె కష్టసుఖాలు వచ్చిపోతుంటాయి.
(ఆ) భూమ్యాకాశాలు ఎప్పుడూ కలవవు.
(ఇ) ధర్మాధర్మాలు ఆలోచించి పనిచేయాలి.
(ఈ) శాంత్యహింసలు భారతీయ ధర్మానికి మూలస్తంభాలు.
(ఉ) సూర్యచంద్రులు లోకానికి వెలుగునిస్తారు.
(ఊ) జీవితంలో పైకి రావాలంటే నీతినిజాయితీలు చాలా ముఖ్యం.
(ఋ) జాతరకు చిన్నపెద్దలు అందరూ తరలిపోతారు.
Answer:
(అ) వెలుగునీడలు – వెలుగును, నీడయును – ద్వంద్వ సమాసం
(ఆ) భూమ్యాకాశాలు – భూమియును, ఆకాశమును – ద్వంద్వ సమాసం
(ఇ) ధర్మాధర్మాలు – ధర్మమును, అధర్మమును – ద్వంద్వ సమాసం
(ఈ) శాంత్యహింసలు – శాంతియును, అహింసయును – ద్వంద్వ సమాసం
(ఉ) సూర్యచంద్రులు – సూర్యుడును, చంద్రుడును – ద్వంద్వ సమాసం
(ఊ) నీతినిజాయితీలు – నీతియును, నిజాయితీయును – ద్వంద్వ సమాసం
(ఋ) చిన్నపెద్దలు – చిన్నయును, పెద్దయును – ద్వంద్వ సమాసం
Exam Tips:
a) రెండు పదాల మధ్య ‘యును’ వస్తే ద్వంద్వ సమాసం – విగ్రహవాక్యంలో ‘…యును, …యును’ అని రాయండి.
ప్రాజెక్టు పని
Question 1: మీ ప్రాంతంలో బడికి పోకుండా ఉండే పిల్లలను కలవండి. వారెందుకు బడికి రావడం లేదో, బడి గురించి, చదువు గురించి వారేమనుకుంటున్నారో రాయండి.
Answer:
1. ప్రాజెక్టు శీర్షిక : మా ప్రాంతంలో బడికి పోకుండా ఉండే పిల్లలను కలవడం; వారు ఎందుకు బడికి రావడం లేదో, బడి గురించి, చదువు గురించి వారేమనుకుంటున్నారో రాయడం.
2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : ……… (ఆ) సమాచార వనరు : పరిసరాలు
3. సేకరించిన విధానం : మా పరిసరాలలో ఉన్న బడికి వెళ్ళని పిల్లలను కలిసి మాట్లాడడం ద్వారా సమాచారం సేకరించాను.
4. నివేదిక : మా ప్రాంతంలో బడికి పోని పిల్లలు చాలా మందే ఉన్నారు. వారందరూ చాలా పేదవారు. చదువుకోవాలనే ఆశతో ఉన్నవారే. మా ఇంటికి దగ్గరలో శంకరన్న ఉన్నాడు. వాడు మా వీధిలోని వారికందరికీ పాలు, కూరగాయలు తెచ్చి ఇస్తూ, ఇంటి పనిలో సహాయం చేస్తూ బాలకార్మికునిగా ఉండిపోయాడు. అతని వయస్సు 7 సంవత్సరాలే.
చదువును గురించి వాడిని అడిగితే “నాకూ చదువుకోవాలనుంది, కాని చదువుకు వెళ్తే నాస్తా ఎట్లా దొరుకుతుంది ? ఎక్కడ దొరుకుతుంది ? ఎవ్వరు పెడతారు ?” అని అంటాడు. పాపం ఇలాంటి వారికోసం ప్రభుత్వం శరణాలయాలను కట్టించి వారిలోని ఆశను నెరవేర్చాలి.
బతుకు పోరు వారిని చదువులకు దూరం చేస్తోంది. పేదరికం వారిని బాలకార్మికులుగా తయారుచేస్తున్నదని అర్థమయింది. అలాంటి వారిలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు కనిపిస్తున్నది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు, సంక్షేమ గృహాలు, అనాథ శరణాలయాలు, ఆశ్రమాలు వారికి ఆదరణనిస్తున్నాయి; కొందరు చదువులపట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. చదువంటే ఎవరికి ఇష్టం ఉండదు ? కాని బీదరికం వారి ఆశలను దూరం చేస్తుందని వారితో మాట్లాడటం వలన తెలుసుకున్నాను.
5. ముగింపు : పేదరికంలో ఉన్న పిల్లలు బాలకార్మికులుగా ఉండడం వల్ల చదువుకు దూరమైపోతున్నారు. వారిలో చదువుకోవాలనే ఆశ ఉన్నా చదువుకోలేకపోతున్నారని అర్థం చేసుకున్నాను.
Exam Tips:
a) ప్రాజెక్టులో శీర్షిక, సమాచార సేకరణ, విధానం, నివేదిక, ముగింపు – ఈ ఐదు భాగాలు రాయండి.
ముఖ్యమైన ప్రశ్నలు
Question 1: బాలజీతగాని దుఃఖానికి కవి ఊహించిన కారణాలు ఏవి ?
Answer:
పల్లెటూరి పిల్లగాడా గేయం సుద్దాల హనుమంతు రాశారు. కవి బాల జీతగాని దుఃఖానికి పలు కారణాలను ఊహించాడు. అందులో ముఖ్యమైంది ఆకలి. దొర భార్య బాలజీతగానికి పెందలాడే సద్ది పెట్టనందుకు బాధపడ్డాడు. ఆకలితో అలమటిస్తూ దొర చెప్పిన పని చేయలేక బాధపడ్డాడు. పశువులు పదేపదే పంట చేలలోకి వెళ్తుంటే పాలికాపు కొట్టినందుకు బాధపడ్డాడు. దొర తనకు నెల నెలా జీతం తగ్గించి ఇవ్వడం వల్ల తాలు తప్పల ధాన్యాన్ని కొలచినందుకు బాధపడ్డాడు. పల్లెటూరి పిల్లగాడు తన తోటి పిల్లలతో కలిసి బడికి వెళ్ళి చదువుకోలేక పోయినందుకు చాలా బాధపడ్డాడు.
Exam Tips:
a) కారణాలు ఊహించే ప్రశ్నలో ఆకలి, దెబ్బలు, జీతం మోసం, చదువు లేకపోవడం వంటి కారణాలను క్రమంగా రాయండి.
Question 2: బాలజీతగాని పాలెకాపు ఎందుకు కొట్టాడో వివరించండి.
Answer:
బాలజీతగాడు చాలీచాలని చిరిగిన వస్త్రాన్ని కట్టుకొని తాటి మట్టలతో చేసిన చెప్పులతో చేత కర్ర పట్టుకొని పశువులను మేతకు తోలుకెళ్ళాడు. ఆ సమయాన ఆ పశువులలోని దొంగ గొడ్లు పంట చేలల్లోకి పోతుండేవి. పంట చేలను పిల్లగాడి దొంగ గొడ్లు పాడుచేశాయని, పాలికాపు జీతగాడిని కొట్టేవాడు. పాపం అందరికీ అలుసు బాల జీతగాడే కదా !
Exam Tips:
a) పాలికాపు ఎందుకు కొట్టాడో గేయంలోని సంఘటన (పశువులు పంటచేలల్లో పడటం) ఆధారంగా వివరించండి.
Question 3: ‘పల్లెటూరి పిల్లగాడా’ గేయ సారాంశాన్ని రాయండి.
Answer:
కవి సుద్దాల హనుమంతు బాలకార్మికుల ఆవేదనను ‘పల్లెటూరి పిల్లగాడా’ గేయంలో వివరించారు. చాలా చిన్న వయసులోనే చాలీచాలని చింపులంగి, గోనెచింపు కొప్పెర, తాటి జెగ్గల కాలిజోడుతో పశువులను మేపటానికి అడవికి ఒంటరిగా వెళ్ళే పరిస్థితి పల్లెటూరి పిల్లగాడిది. పశువులను కాస్తూ, ఒంటరిగా కొండ రాయి మీద కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటాడు.
ఆకలికి తట్టుకోలేక అలసిపోతుంటాడు. అడవిలో కందిరీగలు, ఇతర పురుగులు కుడుతూ ఉంటే బాధపడుతూ ఉంటాడు. పశువులు పంట చేలు పాడుచేస్తే, పాలికాపు కొట్టే దెబ్బలకు ఏడుస్తూ ఉంటాడు. దొర జీతంగా ఇవ్వాల్సిన ఒడ్లు సరిగా కొలచి ఇవ్వకపోయినా, తాలు గింజలు, కల్తీ గ్రాసం కలిపి ఇచ్చినా బాధపడడం తప్ప ఏమీ చేయలేడు. తన ఈడు పిల్లలందరూ చక్కగా బడిలో చదువుకుంటూ ఉంటే, తన జీవితంలో వెలుగులేదని బాధపడుతూ ఉంటాడు.
Exam Tips:
a) సారాంశంలో పిల్లగాని వేషం, పని, బాధలు, జీతం, బడి పిల్లల పట్ల ఆవేదన – ఈ వరుసలో రాయండి.
అదనపు ప్రశ్నలు (బహుళైచ్ఛిక / ఇతర ప్రశ్నలు)
Question 1: గీత గీసిన పదాలకు సరైన అర్థాలను గుర్తించండి.
1. భారతదేశాన్ని బ్రిటీష్ దొరలు పరిపాలించారు. (A) సేవకుడు (B) బానిస (C) అధికారి (D) పనివాడు
2. పసివయస్సు పిల్లలు ఆటలాడుకుంటారు. (A) చిన్న వయస్సు (B) పెద్ద వయస్సు (C) ముసలి వయస్సు (D) పాలు
3. ఆకలితో బిడ్డ అడలుతున్నాడు. (A) బాధపడుతున్నాడు (B) కోపంగా ఉన్నాడు (C) పాడుతున్నాడు (D) ఏడుస్తున్నాడు
4. ‘కుంచం’ పదానికి అర్థం రాయండి. (A) కొలుత (B) ధాన్యం కొలుచు సాధనం (C) భూమిని కొలుచునది (D) బరువును కొలుచునది
5. ‘పసులు’ అంటే అర్థం. (A) పసుపు (B) పశువులు (C) పస్తులు (D) ఆకలి
6. పశువుల కాపర్లు తలపై కొప్పెరలు పెట్టుకుంటారు. (A) గొంగడి (B) బొట్టు (C) పిలక (D) మూట
Answer:
1. (C) అధికారి
2. (A) చిన్న వయస్సు
3. (A) బాధపడుతున్నాడు
4. (B) ధాన్యం కొలుచు సాధనం
5. (B) పశువులు
6. (A) గొంగడి
Exam Tips:
a) అర్థాలు గుర్తించేటప్పుడు వాక్యంలో పదం ఉపయోగించిన సందర్భాన్ని చూడండి.
Question 2: కింది వాటికి పర్యాయపదాలు గుర్తించండి.
7. ‘తల్లి’కి పర్యాయపదం రాయండి. (A) అమ్మ, మాత (B) నాన్న, తండ్రి (C) చెల్లి, కుమార్తె (D) అన్న, కుమారుడు
8. క్షీరము, దుగ్ధములకు పర్యాయపదం రాయండి. (A) పాలు (B) నీరు (C) నిప్పు (D) గాలి
9. మనసు, ఎద – పర్యాయపదం రాయండి. (A) శరీరం (B) తనువు (C) నీరు (D) హృదయం
Answer:
7. (A) అమ్మ, మాత
8. (A) పాలు
9. (D) హృదయం
Exam Tips:
a) పర్యాయపదాలు ఒకే అర్థం ఇచ్చే వేరే పదాలు.
Question 3: కింది వాటికి నానార్థాలు గుర్తించండి.
10. క్షీరము, భాగము అనే అర్థాలిచ్చే నానార్థ పదం రాయండి. (A) పాలు (B) నీరు (C) సముద్రం (D) ఏదీకాదు
11. మా ఊరు మంచిది. – ‘ఊరు’కు నానార్థాలు రాయండి. (A) గ్రామము, ఊటవచ్చు (B) పాలు, పెరుగు (C) పెరుగు, మజ్జిగ (D) జలము, నీరు
12. నేత్రము, బండి చక్రము అనే నానార్థాలు ఇచ్చే పదం. (A) ముక్కు (B) చెవి (C) కాళ్ళు (D) కన్ను
Answer:
10. (A) పాలు
11. (A) గ్రామము, ఊటవచ్చు
12. (D) కన్ను
Exam Tips:
a) నానార్థాలు – ఒకే పదానికి ఉన్న వేరు వేరు అర్థాలు.
Question 4: కింది పదాలకు వికృతి పదాలను గుర్తించండి.
13. ‘విద్య’ వికృతి పదాన్ని రాయండి. (A) విద్దె (B) చదువు (C) సంపద (D) లాభం
14. ‘పశువు’ వికృతి పదం రాయండి. (A) గేదె (B) ఆవు (C) ఎద్దు (D) పసరము
15. ‘అంబ’ వికృతి పదం రాయండి. (A) తల్లి (B) అమ్మ (C) అక్క (D) చెల్లి
Answer:
13. (A) విద్దె
14. (D) పసరము
15. (B) అమ్మ
Exam Tips:
a) ప్రకృతి – వికృతి జతలను గుర్తుంచుకోండి: విద్య–విద్దె, పశువు–పసరము, అంబ–అమ్మ.
Question 5: వ్యాకరణం : సరైన సమాధానాన్ని గుర్తించండి.
16. నీకు + ఏమైనా – కలిపి రాస్తే (A) నీకేమైనా (B) నీకామైన (C) నీకొరకు ఏమైనా (D) నీతో ఏమైనా
17. జీవితమంతా – విడదీస్తే (A) జీవిత + అంతా (B) జీవిత + మంతా (C) జీవితము + అంతా (D) అంతా + జీవితం
18. రామయ్య – విడదీస్తే (A) రాము + అయ్య (B) రామ + అయ్య (C) రామయ్య + అయ్య (D) రామ + మయ్య
19. మేన + అత్త = …… (A) మేనయత్త (B) మేనాఅత్త (C) మేనఅత్త (D) మేనత్త
20. మంచిచెడులు – విగ్రహ వాక్యం (A) మంచియొక్క చెడులు (B) మంచిలో చెడు (C) మంచిదైన చెడు (D) మంచి మరియు చెడు
21. రాముడును, లక్ష్మణుడును – సమాస పదంగా మారిస్తే (A) రామునిలక్ష్మణుడు (B) రామలక్ష్మణులు (C) అన్నదమ్ములు (D) రామయ్యలక్ష్మయ్య
22. ‘ఏడుకొండలు’ – విగ్రహ వాక్యం (A) ఏడుసంఖ్య గల కొండలు (B) ఏడు మరియు కొండలు (C) తిరుపతి (D) కొండల సంఖ్య ఏడు
Answer:
16. (A) నీకేమైనా
17. (C) జీవితము + అంతా
18. (B) రామ + అయ్య
19. (D) మేనత్త
20. (D) మంచి మరియు చెడు
21. (B) రామలక్ష్మణులు
22. (A) ఏడుసంఖ్య గల కొండలు
Exam Tips:
a) సంధి విడదీసినపుడు రెండు పదాలు కలిపి మళ్ళీ చదివి సరిచూసుకోండి.
Question 6: గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలను గుర్తించండి.
23. నిజం దాచవద్దు. (A) అనిజం (B) అబద్ధం (C) తప్పు (D) నిజం
24. ‘వెలుగు’ అనే పదానికి వ్యతిరేకార్థక పదం (A) వెలుతురు (B) కిరణం (C) చీకటి (D) రాత్రి
25. బాలకార్మికుల కష్టం చూస్తే దుఃఖం కలుగుతుంది. (A) సుఖం (B) కష్టం (C) సంతోషం (D) బాధ
Answer:
23. (B) అబద్ధం
24. (C) చీకటి
25. (A) సుఖం
Exam Tips:
a) వ్యతిరేక పదం అర్థంలో పూర్తిగా వ్యతిరేకంగా ఉండాలి.
Question 7: క్రింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
“గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని గిరిజనులు, వారి ఆధ్వర్యంలో రైతులు పూజించే దేవుళ్ళు చిన్నయ్య, పెద్దయ్య. ‘చిన్నయ్య భీమయ్య / చిలుకల భీమయ్య’ అని స్థానికంగా వినిపించే జానపదగేయంలో చిన్నయ్య అంటే అర్జునుడు, పెద్దయ్య అంటే ధర్మరాజు. వారితో కూడిన భీముడిని పూజిస్తారు. భీముడిని ప్రత్యేకంగా కొలవడానికి కారణముంది. పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడి గిరిజన అమ్మాయి హిడింబిని భీముడు పెళ్ళి చేసుకొని ఆ స్థానిక గిరిజనులకు ఆరాధ్యదైవమయ్యాడు.”
1. గోదావరి నదికి ఇరువైపుల ఉన్న జిల్లాలేవి ?
2. స్థానికంగా వినిపించే జానపద గేయం ఏది ?
3. గిరిజనులు, రైతులు పూజించే దేవుళ్ళు ఎవరు ?
4. పెద్దయ్య, చిన్నయ్య అంటే ఎవరు ?
5. గిరిజనులకు భీముడు ఎందుకు ఆరాధ్య దైవమయ్యాడు ?
Answer:
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు.
‘చిన్నయ్య భీమయ్య / చిలుకల భీమయ్య’ అనే గేయం.
చిన్నయ్య, పెద్దయ్య.
పెద్దయ్య అంటే ధర్మరాజు, చిన్నయ్య అంటే అర్జునుడు.
స్థానిక గిరిజన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం వల్ల.
Exam Tips:
a) పేరా చదివి సమాధానాలను పేరాలోని వాక్యాల నుండే రాయండి.
Question 8: క్రింది పద్యాన్ని చదివి ఖాళీలను పూరించండి.
తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
ఖాళీలు :
1. …………… తనకు రక్ష.
2. తనలో ఉండే కోపమే తనకు ……………
3. …………… ఉంటే అదే స్వర్గము
4. తన …………… నరకము.
5. దయయే …………………
Answer:
1. తన శాంతమే తనకు రక్ష.
2. తనలో ఉండే కోపమే తనకు శత్రువు.
3. తన సంతోషమే స్వర్గము.
4. తన దుఃఖమే నరకము.
5. దయయే చుట్టము.
Exam Tips:
a) పద్యంలోని పంక్తులను యథాతథంగా గుర్తుంచుకుని ఖాళీలు పూరించండి.
Free study material for Telugu
Telugu Class 6 Curriculum Solutions: Lesson 11 Palleturi Pillagada!
Textbook Solutions for Class 6 Telugu Lesson 11 Palleturi Pillagada!
Explore reliable textbook solutions for Lesson 11 Palleturi Pillagada! tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Effective Self-Study and Homework Assistance
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Telugu.
FAQs
The complete and updated TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా! is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా! as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా! will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా! in both English and Hindi medium.
Yes, you can download the entire TS 6th Class Telugu Guide 11th Lesson పల్లెటూరి పిల్లగాడా! in printable PDF format for offline study on any device.