TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ

Solutions for Class 6 Telugu: Lesson 10 Balanagamma (Folk Tale)

Access comprehensive textbook solutions for Lesson 10 Balanagamma (Folk Tale) using the official curriculum guides for Class 6 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 6 Telugu Solutions: Lesson 10 Balanagamma (Folk Tale)

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

బొమ్మను చూడండి – మాట్లాడండి

Question 1: బొమ్మలో ఎవరెవరున్నారు ? ఏం జరుగుతున్నది ?

Answer:

బొమ్మలో ఒక బాలుడు, సీసాలో నుంచి బయటికి వచ్చిన ఒక భూతం ఉన్నారు. చేతులు కట్టుకొని వినయంగా ఉన్న భూతం బాలుడి ఆజ్ఞ కోసం చూస్తున్నది. ఆ బాలుడు తనకు చేయవలసిన పనులను గురించి ఆ భూతానికి చెబుతున్నాడు.

Exam Tips:

a) బొమ్మలో ఉన్న పాత్రలు (బాలుడు, భూతం) ఎవరో ముందు చెప్పి, తర్వాత వారు ఏం చేస్తున్నారో రాయండి.
b) భూతం నిలబడిన తీరు (చేతులు కట్టుకొని, వినయంగా) వంటి వివరాలు రాస్తే పరిశీలన బాగుందని మార్కులు వస్తాయి.

 

Question 2: బొమ్మ ద్వారా కథను ఊహించండి.

Answer:

ఒక పిల్లవాడు తన మిత్రులతో తన ఇంటి దగ్గర ఉన్న ఆటస్థలంలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఆటలో ఆ పిల్లవాడు కొట్టిన బంతి దూరంగా చెట్ల మధ్యలో పడ్డది. బంతి తేవడానికి వెళ్ళిన ఆ పిల్లవానికి అక్కడ ఏవో పారేసిన సంచులు, డబ్బాలు, సీసాలు కనబడ్డాయి. వాటిలో ఒక సీసా అతనికి ప్రత్యేకంగా కనిపించింది. అందులో ఏమున్నదో తెలుసుకుందామని ఆ సీసా బిరడా గట్టిగా ఊడబీకాడు.
అంతే! ఒక్కసారిగా అందులో నుండి సుడిగాలి వేగంతో ఒక పెద్ద ఆకారం బయటికి వచ్చి గాలిలో నిలబడింది. ‘దండాలు మహారాజా’ అన్నది. హఠాత్తుగా జరిగిన ఆ ఘటనకు కంగారు పడిన పిల్లవాడు ‘ఎవరు నువ్వు ?’ అన్నాడు. ‘నేను తమ సేవకుణ్ణి మహారాజా! మీకు ఏమి సేవలు చేయాలో ఆజ్ఞ ఇవ్వండి’ అని అంది ఆ ఆకారం.

Exam Tips:

a) ఊహించి రాసే కథకు మొదలు (సందర్భం), మధ్య (సంఘటన), ముగింపు అనే క్రమం ఉండాలి.
b) పాత్రల మధ్య చిన్న సంభాషణలు చేర్చితే కథ సజీవంగా ఉంటుంది; బొమ్మలోని అంశాలకు దూరంగా పోకండి.

 

Question 3: ఇటువంటి కథలు మీకు తెలుసా ? వీటిని ఏమంటారు ?

Answer:

ఇటువంటి కథలు నాకు తెలుసు. ఇట్లా మానవులకు సాధ్యంకాని శక్తులు, మంత్రాలు, తంత్రాలు, సాహసాలను తెలిపే కథలను జానపద కథలు అంటారు.

Exam Tips:

a) ‘జానపద కథలు’ అనే పేరును స్పష్టంగా రాయండి.
b) మానవాతీత శక్తులు, మంత్రతంత్రాలు, సాహసాలు అనే జానపద కథల లక్షణాలను కూడా చెప్పండి.

 

Question 4: మన తెలంగాణా ప్రాంతంలోని జానపద కథలు మీకేమైనా తెలుసా ? ఏమిటవి ?

Answer:

తెలుసు. తెలంగాణా ప్రాంతంలో బాలనాగమ్మ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సర్వాయి పాపన్న కథ, బిల్లూరి కొండల్రాయుని కథ వంటి జానపద కథలు ప్రసిద్ధి చెందాయి.

Exam Tips:

a) కనీసం నాలుగైదు తెలంగాణా జానపద కథల పేర్లు రాయండి.
b) ఒక కథను పూర్తిగా చెప్పమంటే దాని గురించి వేరే ప్రశ్న ఉంటుంది; ఇక్కడ పేర్లు చాలు.

 

ఆలోచించండి – చెప్పండి

Question 1: ‘కంటికి రెప్పలా కాపాడుకోవడం’ అంటే ఏమనుకుంటున్నారు ?

Answer:

కంట్లో దుమ్మూ ధూళీ మొదలైనవి పడి హాని కలిగించకుండా రెప్పలు కంటిని ప్రతిక్షణం కాపాడుతూ ఉంటాయి. ఏదైనా దెబ్బ తగిలేటప్పుడైనా రెప్పలు కంటిని కాపాడేటందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. అందువల్ల ‘కంటికి రెప్పలా కాపాడుకోవడం’ అంటే ఎదుటి వారిని తమ ప్రాణం కంటే మిన్నగా, ప్రతిక్షణం జాగ్రత్తగా కాపాడుకోవటం అని అనుకుంటున్నాను.

Exam Tips:

a) జాతీయం అర్థం చెప్పే ముందు కన్ను – రెప్ప ఉదాహరణను వివరించండి.
b) చివరలో ‘ఎంతో శ్రద్ధగా, ప్రాణంలా కాపాడుకోవడం’ అనే అర్థాన్ని ఒక వాక్యంలో స్పష్టంగా రాయండి.

 

Question 2: ‘మాట నిలబెట్టుకోవడం’ అనే మాటను ఎట్లా అర్థం చేసుకున్నారు ?

Answer:

ఇక్కడ మాట అంటే ఆడిన మాట. ‘నిలబెట్టుకోవడం’ అంటే తప్పకపోవడం. ఏదైనా చేస్తానని లేక ఇస్తానని ఒకసారి చెబితే ఆ పని చేసి తీరడం, ఆ వస్తువు ఇచ్చి తీరడం. అది ఎంత కష్టమైనదైనా, ఎంత నష్టమైనదైనా ఆడిన మాట తప్పకపోవడాన్నే “మాట నిలబెట్టుకోవడం” అంటారు అని అర్థం చేసుకున్నాను.

Exam Tips:

a) ‘మాట’, ‘నిలబెట్టుకోవడం’ అనే రెండు పదాలకు విడిగా అర్థం చెప్పి, తర్వాత కలిపి వివరించండి.
b) పాఠంలో లక్ష్మీదేవమ్మ నాగేంద్రునికి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోవడం ఉదాహరణగా చెప్పవచ్చు.

 

Question 3: ‘తల్లిదండ్రులు లేని పిల్లలు’ ఎట్లా ఆగమై పోతారు ?

Answer:

తల్లిదండ్రులు లేని పిల్లలను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. ఒకవేళ జాలి చూపి ఎవరైనా పట్టించుకున్నా అది ఎంత కాలం ఉంటుందో చెప్పలేం.
తల్లిదండ్రులు లేని పిల్లలు సరైన క్రమశిక్షణ లేక, సరిగా మంచీ చెడూ చెప్పేవాళ్ళు లేక, మానసికంగా ఎంతో బాధ అనుభవిస్తారు.

Exam Tips:

a) ప్రేమ, రక్షణ, క్రమశిక్షణ, మంచి–చెడు చెప్పేవారు లేకపోవడం అనే అంశాలను వరుసగా రాయండి.
b) ‘ఆగమైపోవడం’ అంటే దిక్కులేనివారై చెడిపోవడం అని అర్థం గ్రహించి జవాబు రాయండి.

 

Question 4: కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు ?

Answer:

కష్టాల్లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా చూసుకుంటారు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావిస్తారు. వాటిని తొలగించడానికి రాత్రనకా పగలనకా కృషి చేస్తారు. వారి కష్టాలు తొలగే వరకూ కంటిమీద కునుకు లేకుండా శ్రమిస్తారు.

Exam Tips:

a) ‘కంటికి రెప్పలా’, ‘రాత్రనకా పగలనకా’ వంటి జాతీయాలు వాడితే జవాబు అందంగా ఉంటుంది.
b) పాఠంలో నవాంభోజరాజు తల్లిలేని బిడ్డలను కాపాడిన విధానాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.

 

Question 5: ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ?

Answer:

ముఖ్యమైన పనులను అసమర్థులకు అప్పగిస్తే ఆ పనులు చక్కగా నెరవేరవు. పైగా వారి అసమర్థత కారణంగా కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సమయం, డబ్బు వృథా అవుతాయి; చివరికి ఆ పనిని మళ్ళీ మొదటి నుంచి చేయవలసి వస్తుంది.

Exam Tips:

a) పని చెడిపోవడం, కొత్త సమస్యలు రావడం, సమయం – ధనం వృథా అనే మూడు నష్టాలను రాయండి.
b) పాఠంలో రాజు తన బిడ్డలను సవతి తల్లి మాణిక్యాలదేవికి అప్పగించడం వల్ల వచ్చిన కష్టాలను ఉదాహరణగా చెప్పవచ్చు.

 

Question 6: పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ?

Answer:

పెద్దలకు జీవితకాలంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. వారి పెద్దలు చెప్పగా విని గానీ, స్వయంగా చూసి గానీ వారు ఎంతో విజ్ఞానం, అనుభవం గడించి ఉంటారు. ముందుచూపుతో పెద్దలు చెప్పే మాటలు వినాలి. లేకపోతే ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. వాటిని తీర్చుకోవడానికి ఎంతో విలువైన జీవిత సమయం వృథా అవుతుంది.

Exam Tips:

a) పెద్దల అనుభవం విలువను ముందు చెప్పి, తర్వాత మాట వినకపోతే వచ్చే నష్టాలను రాయండి.
b) పాఠంలో భార్య మాట కాదని రాజు మళ్ళీ పెళ్ళి చేసుకోవడం వల్ల బిడ్డలకు వచ్చిన కష్టాలను ఉదాహరణగా జోడించవచ్చు.

 

Question 7: మాయల ఫకీరు బాలనాగమ్మను ఎత్తుకుపోయిన సంఘటన వల్ల మీకు ఇతర కథలలోని ఇట్లాంటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయా ? చెప్పండి.

Answer:

అవును. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయిన రామాయణంలోని సంఘటన గుర్తుకు వస్తున్నది. అందులో కూడా రావణాసురుడు భిక్షకుడి (సన్యాసి) వేషంతో వచ్చి సీతాదేవితో లక్ష్మణుడు గీసిన గీతను దాటించి తన మాయతో ఆమెను ఎత్తుకుపోతాడు.

Exam Tips:

a) రెండు సంఘటనల మధ్య పోలికను (మారు వేషం, మాయ, ఎత్తుకుపోవడం) స్పష్టంగా చూపండి.
b) రామాయణం కాక మీకు తెలిసిన ఏ కథలోని సంఘటననైనా రాయవచ్చు; కథ పేరు తప్పక పేర్కొనండి.

 

Question 8: ‘కర్కోటకుడు’ అంటే ఎట్లా ఉంటాడని అనుకుంటున్నావు ?

Answer:

కర్కోటకుడు అంటే దయ, జాలి ఏమాత్రం లేని కఠినమైన మనస్సు కలవాడు, ఇతరులను బాధపెట్టి ఆనందించే క్రూరుడు అని అనుకుంటున్నాను. అటువంటివాడు చూడడానికి కూడా భయంకరంగా ఉంటాడు. పాఠంలో మాయల ఫకీరు అటువంటి కర్కోటకుడు.

Exam Tips:

a) కర్కోటకుడు అంటే రూపం కంటే స్వభావం (క్రూరత్వం, దయ లేకపోవడం) ముఖ్యమని చెప్పండి.
b) పాఠంలోని మాయల ఫకీరును ఉదాహరణగా పేర్కొంటే జవాబు పూర్తవుతుంది.

 

Question 9: దుర్మార్గుల వల్ల ఎట్లాంటి నష్టాలుంటాయని భావిస్తున్నావు ?

Answer:

దుర్మార్గులు తాము కోరుకున్నది సాధించడానికి ఎదుటివారిని ఎన్నో ఇబ్బందులు పెడతారు. చివరికి ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. దుర్మార్గుల వల్ల ప్రజలు ధనాన్ని, మానాన్ని, చివరకు ప్రాణాలను కూడా కోల్పోతారు.
దుర్మార్గుల పనుల వల్ల ప్రజలు భయపడిపోతారు. వాళ్ళు ఎప్పుడు ఎవరికి హాని తలపెడతారోనని నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు.

Exam Tips:

a) ధన నష్టం, మాన నష్టం, ప్రాణ నష్టం, భయం అనే నాలుగు అంశాలను వరుసగా రాయండి.
b) మాయల ఫకీరు వల్ల బాలనాగమ్మ కుటుంబానికి వచ్చిన నష్టాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.

 

Question 10: గండభేరుండ పక్షులు బాలవద్దిరాజుకు సహాయం చేశాయి కదా! అట్లాగే మనం కూడా ఇతరులకు ఎందుకు సహాయం చేయాలి ?

Answer:

ఆపదలో ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి మనకు తోచిన, మనం చేయగలిగిన సహాయం చేయాలి. ఇతరులకు మనం సాయం చేస్తే ఇతరులు కూడా మనకు అవసరమైనప్పుడు సాయం చేస్తారు. మనిషి సంఘజీవి. అంటే ఒక సమూహంలో బతికేవాడు. ఏ మనిషైనా ఇతరుల సాయం పొందకుండా జీవించలేడు. అందువల్ల మనం ఇతరులకు సాయం చేయాలి.

Exam Tips:

a) ‘మనిషి సంఘజీవి’ అనే అంశాన్ని తప్పక చెప్పండి.
b) బాలవద్దిరాజు పక్షి పిల్లలను కాపాడాడు కాబట్టే పక్షి అతనికి సాయం చేసింది – ‘మేలుకు మేలు’ అనే సంగతిని జోడించండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: ‘బాలనాగమ్మ’ కథను విన్నారు కదా! ఈ కథలో మీకు ఆసక్తి కలిగించిన సంఘటన ఏదో చెప్పండి.

Answer:

ఈ కథలో బాలవద్దిరాజు వజ్రాల చిలుకను సాధించి తెచ్చి మాయల ఫకీరు ప్రాణాలు తీసే సంఘటన నాకు ఎంతో ఆసక్తి కలిగించింది. అందులో సప్తసముద్రాలు దాటడానికి బాలవద్దిరాజుకు గండభేరుండ పక్షి సాయం చేయడం ఎంతో బాగుంది. ఫకీరు ప్రాణం చిలుకలో ఉండడం ఆశ్చర్యం కలిగించింది. బాలవద్దిరాజు తన తల్లిదండ్రులనూ, తన సైన్యాన్నీ బతికించుకొని చిలుక కంఠంలో ఉన్న దుర్మార్గుడైన ఫకీరు ప్రాణాలను తీసివేయడం సంతోషం కలిగించింది.

Exam Tips:

a) ఒకే సంఘటనను ఎంచుకొని, అది ఎందుకు నచ్చిందో కారణాలతో చెప్పండి.
b) ‘ఆశ్చర్యం కలిగించింది’, ‘సంతోషం కలిగించింది’ వంటి మీ స్పందనను తెలిపే మాటలు వాడండి.

 

Question 2: మీకు తెలిసిన జానపద కథను చెప్పండి.

Answer:

తెలంగాణా జానపద కథలలో రాణి శంకరమ్మ కథ ఒకటి. రాణి శంకరమ్మ మెదక్ జిల్లాలోని గౌడిచర్ల గ్రామంలో సంగారెడ్డి, రాజమ్మ దంపతులకు పుట్టింది. చిన్నప్పటి నుంచి కర్రసాము, కత్తిసాము, గుఱ్ఱపు స్వారీ వంటి విద్యలు నేర్చుకుంది. నాగలి పట్టడం, బండి తోలడం వంటి వ్యవసాయ పనులు నేర్చుకొంది. ఒకరోజు ఒక చిరుతపులి మీదికి వచ్చినా భయపడక, కట్టెతో పులిని కొడుతూ, కాళ్ళతో తొక్కి చంపివేసింది. అంతటి ధైర్యవంతురాలు ఆమె.
ఇతరులకు సాయం చేసే ఆమె మంచిగుణం నచ్చి, అందోలు రాజు నారసింహారెడ్డి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూడాలని, మొదట రాజ్యం పనులు, తర్వాతే ఇంటి సుఖాలు అని రాజుకు రాజధర్మాల గురించి చెప్పింది. నారసింహారెడ్డి మరణం తర్వాత శంకరమ్మ నైజాం రాజు ఆజ్ఞ మేరకు మరాఠీల మీదకు కాళికలా యుద్ధానికి వెళ్ళి, వారిని ఓడించింది.
1764 లో అందోలు రాజ్యానికి శంకరమ్మ రాణి అయింది. చక్కగా రాజ్యపాలన చేసింది. తన తండ్రి పేరిట సంగారెడ్డి, తల్లి పేరిట రాజంపేట అనే పట్టణాలు నిర్మించింది. చివరికి 1774 సం॥లో రాచపుండుతో బాధపడుతూ చనిపోయింది. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన శంకరమ్మ ఆదర్శ రాణి.

Exam Tips:

a) కథను మొదలు – మధ్య – ముగింపు క్రమంలో, సొంత మాటల్లో చెప్పండి.
b) ప్రధాన పాత్ర పేరు, ఊరు, ఆమె చేసిన గొప్ప పనులు, కథ నుంచి నేర్చుకునే నీతి – ఇవి తప్పక ఉండాలి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

Question 1: కింది జాతీయాలను పాఠంలో ఏ సందర్భంలో ఉపయోగించారో రాయండి.
(అ) అల్లారు ముద్దుగా (ఆ) కడుపుల పెట్టుకొని కాపాడుట (ఇ) చిలుకపలుకులు (ఈ) కాలం చేయుట (ఉ) ఆరునూరైనా

Answer:

(అ) అల్లారు ముద్దుగా : లక్ష్మీదేవమ్మ తన ఏడుగురు కుమార్తెలను అపురూపంగా పెంచే సందర్భంలో.
(ఆ) కడుపుల పెట్టుకొని కాపాడుట : లక్ష్మీదేవమ్మ తన బిడ్డలను భర్తకు అప్పజెప్పే సందర్భంలో.
(ఇ) చిలుకపలుకులు : పిల్లల్ని కాపాడతానని నవాంభోజరాజుకు మాణిక్యాలదేవి మాయ మాటలు చెప్పిన సందర్భంలో.
(ఈ) కాలం చేయుట : నవాంభోజరాజు చనిపోయిన సందర్భంలో.
(ఉ) ఆరునూరైనా : తన తల్లిదండ్రులను ఫకీరు ఖైదు నుంచి విడిపిస్తానని బాలవద్దిరాజు చెప్పిన సందర్భంలో.

Exam Tips:

a) ప్రతి జాతీయానికి ‘ఎవరు – ఎవరితో – ఏ సందర్భంలో’ అనే మూడు అంశాలు రాయండి.
b) జాతీయం అర్థం కూడా తెలుసుకోండి – సొంత వాక్యాలు రాయమని పరీక్షలో అడగవచ్చు.

 

Question 2: పాఠం ఆధారంగా ఎవరు ఎటువంటివారో కింది పట్టికలో రాయండి.

Answer:

పాత్రలుపాత్రల స్వభావం తెలిపే పదాలు
(అ) నవాంభోజరాజుభార్య చేతిలో కీలుబొమ్మ. అటు పిల్లల్ని, ఇటు రాజ్యాన్ని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు.
(ఆ) బాలనాగమ్మభయస్తురాలు, భక్తురాలు, అమాయకురాలు
(ఇ) మాయల ఫకీరుదుర్మార్గుడు, పరస్త్రీని కోరిన దుష్టుడు, మాయగాడు
(ఈ) బాలవద్దిరాజువిద్యావంతుడు, వీరుడు, కార్యసాధకుడు
(ఉ) గండభేరుండ పక్షికృతజ్ఞతాభావం, స్నేహగుణం, పరోపకార గుణం కలిగినది
(ఊ) లక్ష్మీదేవమ్మభక్తురాలు, అన్నమాట తప్పదు, పతివ్రత, బిడ్డలంటే ప్రాణం
(ఋ) మాణిక్యాలదేవిస్వార్థపరురాలు, సవతి పిల్లలను చంపాలనుకొన్న రాక్షసి

Exam Tips:

a) ప్రతి పాత్రకు రెండు మూడు స్వభావ పదాలు (విశేషణాలు) రాయండి; కథ మొత్తం రాయవద్దు.
b) మంచి పాత్రలకు, చెడ్డ పాత్రలకు తగిన పదాలు వాడండి – ఉదా: బాలవద్దిరాజు ‘వీరుడు’, ఫకీరు ‘దుష్టుడు’.

 

III. స్వీయ రచన

Question 1: కింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.
నవాంభోజరాజు మారుమనువుకు ఒప్పుకోలేదు కదా! ఐనా బంధువులు, మంత్రులు మొదలైన వారు ఏమని నచ్చజెప్పి ఒప్పించి ఉంటారు ?

Answer:

నవాంభోజరాజు భార్య అయిన లక్ష్మీదేవమ్మ ఒకే కాన్పులో ఏడుమంది ఆడపిల్లలను కన్నది. ఇచ్చిన మాట ప్రకారం బిడ్డలు పుట్టిన తొమ్మిది నెలలకే నాగేంద్రుణ్ణి చేరుకున్నది. వెడుతూ వెడుతూ రాజు అయిన భర్తను బిడ్డల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోమనీ, మళ్ళీ పెళ్ళి చేసుకోవద్దనీ చెప్పింది. కానీ బంధువులు, మంత్రులు మొదలైనవారు నచ్చజెప్పి రాజును ఒప్పించి మళ్ళీ పెళ్ళి చేశారు. బిడ్డలు తొమ్మిది నెలల పసివాళ్ళనీ, వారి ఆలనాపాలనా చూసుకోవడానికి ఒక తల్లిలాంటి స్త్రీ కావాలని చెప్పి ఉంటారు. అంతేకాక వయసులో ఉన్న రాజుకు తోడు కావాలని, రాజ్యానికి వారసుడు కావాలనీ వారు ఇట్లా రకరకాలుగా నచ్చజెప్పి ఉంటారు.

Exam Tips:

a) బిడ్డల ఆలనాపాలన, రాజుకు తోడు, రాజ్యానికి వారసుడు – ఈ మూడు కారణాలను తప్పక రాయండి.
b) ‘ఊహించి రాయండి’ ప్రశ్న కాబట్టి ‘చెప్పి ఉంటారు’ వంటి ఊహను తెలిపే క్రియారూపాలు వాడండి.

 

Question 2: కింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.
అడవిలో దిక్కులేని పక్షుల తీరుగ తిరుగుతున్న లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు ఇంటికి తీసుకొని పోయాడు కదా! అతడు ఆ పిల్లలను ఇంటికి తీసుకొని పోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించి రాయండి.

Answer:

ఆ పిల్లలను మేనమామ తీసుకొనిపోకపోతే ఆ పిల్లలు అడవిలోనే పెరిగి ఉండేవారు. అక్కడి పక్షులు, లేళ్ళు, కుందేళ్ళు మొదలైన సాధుజంతువులు వారిని పెంచి పోషించేవి. చిలుకలు వారికి పలుకులు నేర్పేవి. కోయిలలు పాటలు నేర్పేవి. హంసలు నడకలు నేర్పేవి. ఏనుగులు తమ తొండాలతో వారిని ఉయ్యాలలు ఊపేవి. వారు జలపాతాలలో జలక్రీడలు ఆడుకొనేవారు. ఆకులు అలములూ, పండ్లూ దుంపలూ తిని బతికేవారు. చెట్ల నీడల్లో, గుబురు పొదల్లో తలదాచుకొనేవారు. పక్షుల, మృగాల భాష నేర్చుకొనేవారు. మనుషుల భాష మాత్రం వచ్చేది కాదు.

Exam Tips:

a) ఊహాత్మక ప్రశ్న కాబట్టి మంచి, చెడు రెండు అవకాశాలనూ (జంతువులు కాపాడటం / క్రూరమృగాల భయం) రాయవచ్చు.
b) కనీసం ఐదు వాక్యాలు రాయండి; ‘…ఉండేవారు’, ‘…నేర్పేవి’ వంటి ఊహార్థక రూపాలు వాడండి.

 

Question 3: కింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.
బాలవద్దిరాజుకు కట్టెసాము, కత్తిసాము, విలువిద్య మొదలైన విద్యలు వస్తాయి కదా! మీకు చదువుతోపాటు ఏయే విద్యలు వస్తాయి ? అందులో మీకు బాగా ఇష్టమైన విద్య ఏది ?

Answer:

చదువుతో పాటుగా నాకు సంస్కృతం, సంగీతం అనే విద్యలు వచ్చు.
సంస్కృతంలో శబ్దాలు, ధాతువులు, అమరకోశం నేర్చుకున్నాను. సంస్కృతం రాయడం, మాట్లాడటం నేర్చుకుంటున్నాను. ఈ రెండింటిలో నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో త్యాగరాజస్వామి, రామదాసు కీర్తనలు నేర్చుకున్నాను. లలిత సంగీతంలో అన్నమయ్య కీర్తనలు కూడా పాడతాను. నాకు మా ఊరి జాతరలో పాడే జానపద గీతాలంటే చాలా ఇష్టం. అవకాశం వచ్చినప్పుడు నేను కూడా వేదిక మీద మైకు పట్టుకుని చిందులేస్తూ పాడతాను. అప్పుడు మా స్నేహితులు కూడా నాతో కలిసి అడుగులేస్తారు.

Exam Tips:

a) ప్రశ్నలో రెండు భాగాలున్నాయి – వచ్చే విద్యలు, వాటిలో ఇష్టమైనది; రెండింటికీ జవాబు ఇవ్వండి.
b) ఇష్టమైన విద్య ఎందుకు ఇష్టమో ఒకటి రెండు కారణాలు రాయండి; మీకు నిజంగా వచ్చిన విద్యలే రాయండి.

 

Question 4: కింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.
లక్ష్మీదేవమ్మ పడిన కష్టాలను గురించి రాయండి.

Answer:

లక్ష్మీదేవమ్మ నవాంభోజరాజుకు భార్య. ఆమెకు ముని ఇచ్చిన వరం వల్ల ఏడుగురు ఆడపిల్లలు జన్మించారు. నాగేంద్రునికి ఇచ్చిన మాట వల్ల ఆ పిల్లల తల్లి వారికి తొమ్మిది నెలలు రాగానే వెళ్ళిపోయింది. భార్యకు ఇచ్చిన మాట వల్ల రాజు అయిన భర్త మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా రాజ్యపరిపాలన కూడా మరచిపోయి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కానీ మంత్రులు, బంధువులు నచ్చజెప్పి రాజుకు మాణిక్యాలదేవితో మళ్ళీ పెళ్ళి చేశారు. రాచకార్యం మీద రాజు ఢిల్లీ వెళ్ళగా సవతి తల్లి పిల్లలకు అన్నం, నీళ్ళు ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టింది. అంతేగాక విషం పెట్టి చీకటింట్లో పడేసింది. అపుడు వారిని వారి తల్లి ఆత్మ కాపాడింది.
అపుడు సవతి తల్లి వారిని అడవిలో పాడుపడ్డ గుడిలో పడేసి తాళమేసి వచ్చింది. ఈసారి కూడా లక్ష్మీదేవమ్మ ఆత్మ వారిని కాపాడింది. ఆ ఆత్మ ద్వారా జరిగింది తెలుసుకున్న రాజు ఢిల్లీ నుంచి వెంటనే వచ్చి బిడ్డలను కాపాడుకున్నాడు.
పట్టువదలని సవతి తల్లి రాజుకు మరుగు మందు పెట్టింది. ఆ మందు వల్ల రాజు తన బిడ్డలను చంపడానికి తానే వారిని అడవికి తీసుకొని వెళ్ళాడు. కన్నబిడ్డలను చంపడానికి చేతులు రాక వారిని అక్కడే నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికొచ్చాడు. అపుడు ఆ పిల్లలను వారి మేనమామ అయిన వద్దిరాజు వచ్చి రక్షించాడు.

Exam Tips:

a) సంఘటనలను జరిగిన వరుసలో రాయండి: తల్లి వెళ్ళిపోవడం → సవతి తల్లి హింస → విషం → గుడిలో బంధించడం → అడవిలో వదిలేయడం → మేనమామ రక్షణ.
b) తల్లి ఆత్మ బిడ్డలను కాపాడిన సంగతిని తప్పక పేర్కొనండి – ఇది ముఖ్యమైన అంశం.

 

Question 5: కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
బాలనాగమ్మ కథను సొంతమాటల్లో రాయండి.

Answer:

పరిచయం : తెలంగాణాలో ప్రసిద్ధమైన జానపద కథలలో బాలనాగమ్మ కథ ఒకటి. చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనాగమ్మ, కార్యవద్దిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహస కథ ఇది.
బాలనాగమ్మ : బాలనాగమ్మ నవాంభోజరాజు, లక్ష్మీదేవమ్మలకు పుట్టిన ఏడుగురు సంతానంలో చివరిది. కార్యవద్దిరాజు భార్య. బాలనాగమ్మ గర్భవతిగా ఉండగా కార్యవద్దిరాజు లేని సమయం చూసి మాయల ఫకీరు బాలనాగమ్మను పట్టితేవాలని పానుగంటిలోని ఆమె మేడలోకి వెళ్ళాడు. అప్పటికి బాలనాగమ్మ పిల్లవాణ్ణి కన్నది. మాయల ఫకీరు బాలనాగమ్మను కుక్కగా మార్చి తన వెంట తీసుకొని పోయాడు. ఆ బాలుడి పేరు బాలవద్దిరాజు. బాలనాగమ్మను రక్షించడానికి వెళ్ళిన వద్దిరాజులను ఫకీరు రాళ్ళలా మార్చేశాడు.
బాలవద్దిరాజు : బాలనాగమ్మ కొడుకు పానుగంటిలో పెరిగి పెద్దవాడయ్యాడు. చాలా ధైర్యవంతుడు. ఫకీరున్న కోటలోకి పోయి తల్లిని కలిశాడు.
ఫకీరు పీడ విరగడ : ఫకీరు ప్రాణం ఏడు సముద్రాల అవతల మామిడిచెట్టు తొర్రలో ఉన్న వజ్రాల చిలుకలో ఉన్నదని తెలుసుకున్నాడు. ఆఖరుకు ఆ వజ్రాల చిలుకను పట్టుకొని ఫకీరు కోటకు చేరాడు. వజ్రాల చిలుక మెడ విరిచేసి, మాయల ఫకీరు పీడ వదిలించాడు. తన తల్లిదండ్రులను, సైన్యాన్ని రక్షించుకున్నాడు.
ముగింపు : ఈ విధంగా బాలవద్దిరాజు ధైర్యసాహసాలతో తన తల్లిదండ్రులను రక్షించుకోవడమే కాక దుర్మార్గుడైన మాయల ఫకీరును అంతమొందించాడు.

Exam Tips:

a) పరిచయం, ముఖ్య సంఘటనలు, ముగింపు అనే ఉపశీర్షికలతో రాస్తే పది వాక్యాల జవాబుకు పూర్తి మార్కులు వస్తాయి.
b) పాత్రల పేర్లు (బాలనాగమ్మ, కార్యవద్దిరాజు, బాలవద్దిరాజు, మాయల ఫకీరు) తప్పులు లేకుండా రాయండి.
c) ఫకీరు ప్రాణం వజ్రాల చిలుకలో ఉండటం అనే కథలోని కీలక అంశాన్ని మరచిపోవద్దు.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: “సాయంత్రం గండభేరుండ పక్షి రాంగనే……” అనే పేరా నుంచి చివరి వరకు పాఠం చదవండి. దీని ఆధారంగా గండభేరుండ పక్షి, బాలవద్దిరాజు, మాయల ఫకీరుల మధ్య జరిగిన సంభాషణలను ఊహించి రాయండి.

Answer:

గండభేరుండ పక్షి : బాలకా! నువ్వు ఎవరివి ? ఇక్కడికి ఎందుకు వచ్చావు ? ఎక్కడికి పోవాలి ? ఏమి కావాలో చెప్పు.
బాలవద్దిరాజు : నేనొక రాజకుమారుణ్ణి. నా తల్లిదండ్రులను కాపాడుకోవడానికి వచ్చాను. నాకు సప్త సముద్రాల అవతల పంజరంలో ఉన్న వజ్రాల చిలుక కావాలి.
గండభేరుండ పక్షి : నా బిడ్డల్ని కాపాడావు. నాకు ఎంతో మేలు చేశావు. కనుక నీకు నేను సాయం చేస్తా. నిన్ను నా రెక్కల మీద కూర్చోబెట్టుకొని సప్తసముద్రాలు దాటించి మళ్ళీ తీసుకువస్తా. సరేనా ?
బాలవద్దిరాజు : ఆహా! ఎంత అదృష్టవంతుణ్ణి. ఈ సమయంలో నీ సాయం నాకు ఎంతో అవసరం.
(బాలవద్దిరాజు చిలుకను పట్టుకోగానే మాయల ఫకీరుకు చలి జ్వరం మొదలైంది.)
మాయల ఫకీరు : ఏమిటి! నాకింత చలి జ్వరంగా ఉన్నది. ఎందుకో నాకేమిటో అయిపోతున్నది.
బాలవద్దిరాజు : ఇదిగో ఫకీరూ! చూడు. నీ ప్రాణం చిలుక కంఠంలో. ఆ చిలుక కంఠం నా చేతిలో.
మాయల ఫకీరు : (కోపంతో) ఎంత ధైర్యం రా నీకు ? ఇప్పుడే నిన్ను బూడిద చేసేస్తాను చూడు. (అంటూ కుడిచెయ్యి పైకెత్తుతాడు. వెంటనే బాలవద్దిరాజు చిలుక కుడి రెక్క విరిచేస్తాడు.)
మాయల ఫకీరు : అబ్బా… నన్నేమీ చెయ్యకు. నువ్వు ఏమి చెబితే అది చేస్తా.
బాలవద్దిరాజు : అట్లాగా! అయితే నా తల్లిని విడుదల చెయ్యి. నా తండ్రుల్ని, సైన్యాన్ని తిరిగి బతికించు. (ఫకీరు అట్లాగే చేస్తాడు.)
బాలవద్దిరాజు : నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి నష్టం. (అంటూ ఆ వజ్రాల చిలుక మెడ విరిచేస్తాడు.)
మాయల ఫకీరు : (అయ్యో, అమ్మో, అబ్బా… అనుకుంటూ అరుస్తూ గిలగిలా కొట్టుకుంటూ చనిపోతాడు.)
ముగింపు : ఈ విధంగా బాలవద్దిరాజు తన తల్లిదండ్రులనూ, సైన్యాన్నీ కాపాడుకోవడమే కాకుండా దుర్మార్గుడైన మాయల ఫకీరును అంతం చేసి, రాజ్యాన్ని, ప్రజల్ని రక్షించాడు.

Exam Tips:

a) ప్రతి మాటకు ముందు మాట్లాడే పాత్ర పేరు, తర్వాత ‘ : ’ గుర్తు పెట్టి సంభాషణ రూపంలో రాయండి.
b) పాత్రల చర్యలను, భావాలను కుండలీకరణాలలో ( ) రాయండి – ఇది సంభాషణ రచనలో ముఖ్య నియమం.
c) మూడు పాత్రలకూ మాటలు ఉండాలి; కథలోని క్రమం (పక్షి సాయం → చిలుక → ఫకీరు అంతం) తప్పకూడదు.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది వాక్యాల్లోని గీతగీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను ఖాళీలలో రాయండి.
(అ) కొడుకు పుట్టినందుకు సంతోషపడ్డారు. కాని అతడు ప్రయోజకుడు కానందుకు …………
(ఆ) సుఖము కోరుకుంటే దేన్నీ సాధించలేము. కాని …………… దేన్నైనా సాధించవచ్చు.
(ఇ) మంచివాళ్ళు మేలు చేయాలని చూస్తే, చెడ్డవాళ్ళు …………… చేయాలని చూస్తారు.
(ఈ) సీత జాడ తెలియక విషాదంలో ఉన్న రాముడికి ఆమె జాడ చెప్పి హనుమంతుడు …………… కలిగించాడు.
(ఉ) దుర్మార్గుల వల్ల సమాజానికి చెడు జరుగుతుంది. ఐతే మంచివాళ్ళ వల్ల సమాజానికి …………… జరుగుతుంది.

Answer:

(అ) సంతోషపడ్డారు × బాధపడ్డారు
(ఆ) సుఖము × కష్టముతో
(ఇ) మేలు × కీడు
(ఈ) విషాదం × ఆనందం
(ఉ) చెడు × మంచి

Exam Tips:

a) ఖాళీలో పెట్టే పదం వాక్యంలో సరిగ్గా ఇమడాలి – ‘కష్టముతో’ లాగా విభక్తి ప్రత్యయం కూడా చూడండి.
b) మేలు × కీడు, సుఖం × దుఃఖం/కష్టం, విషాదం × ఆనందం వంటి జతలను కంఠస్థం చేయండి.

 

Question 2: కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను రాయండి.
ఉదా: కొంతమంది చిన్నతనం నుండే యోగాసనాలు సాధన చేస్తారు. – అభ్యాసం
(అ) మా బడి మా ఇంటికి తూర్పు దిక్కున ఉంది.
(ఆ) మా తాత పులిహోర ఆరగించాడు.
(ఇ) అప్పు కట్టలేదని రాజయ్య భూమిని బ్యాంక్ వాళ్ళు జప్తు చేశారు.
(ఈ) ప్రజల సేవకై తపించిన రాజులు చరిత్రకెక్కారు.
(ఉ) నా శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తున్నాను.

Answer:

(అ) దిక్కు = దిశ
(ఆ) ఆరగించాడు = తిన్నాడు
(ఇ) జప్తు = స్వాధీనం
(ఈ) రాజులు = ప్రభువులు
(ఉ) శిరస్సు = తల

Exam Tips:

a) గీత గీసిన పదం స్థానంలో మీరు రాసిన పదం పెట్టి వాక్యం చదివి చూడండి – అర్థం మారకూడదు.
b) కాలం, వచనం గమనించండి: ‘ఆరగించాడు’కు ‘తిన్నాడు’ అని అదే రూపంలో రాయాలి.

 

Question 3: కింది జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి.
(అ) అల్లారుముద్దుగా (ఆ) చిలుకపలుకులు (ఇ) ఆరునూరైనా

Answer:

(అ) అల్లారుముద్దుగా – తల్లిదండ్రులు చిన్న పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతారు.
(ఆ) చిలుకపలుకులు – పసిపిల్లల తప్పటడుగులు, చిలుకపలుకులు ముచ్చటగా ఉంటాయి.
(ఇ) ఆరునూరైనా – ఆరునూరైనా అబద్ధమాడకూడదు.

Exam Tips:

a) జాతీయం అర్థం స్పష్టమయ్యేలా పూర్తి వాక్యం రాయండి; జాతీయాన్ని మార్చకుండా వాడండి.
b) పాఠంలోని వాక్యాన్ని కాకుండా సొంత వాక్యం రాస్తేనే పూర్తి మార్కులు వస్తాయి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
(అ) తల్లిదండ్రులు (ఆ) తోడునీడలు (ఇ) భీమార్జునులు (ఈ) కాయగూరలు (ఉ) ఆటపాటలు

Answer:

(అ) తల్లిదండ్రులు : తల్లియును, తండ్రియును
(ఆ) తోడునీడలు : తోడును, నీడయును
(ఇ) భీమార్జునులు : భీముడును, అర్జునుడును
(ఈ) కాయగూరలు : కాయయును, కూరయును
(ఉ) ఆటపాటలు : ఆటయును, పాటయును

Exam Tips:

a) ద్వంద్వ సమాసంలో రెండు పదాలూ నామవాచకాలే; విగ్రహవాక్యంలో ప్రతి పదానికీ ‘-యును/-ను’ చేర్చి రాయాలి.
b) సమాస పదం బహువచనంలో ఉంటుంది (తల్లిదండ్రులు) – విగ్రహవాక్యంలో ఏకవచనంలో విడదీయాలి.

 

Question 2: కింది పదాలను కలిపి రాయండి.
ఉదా : సెలవు + ఇచ్చి = సెలవిచ్చి
(అ) మీరు + ఎవరు (ఆ) పది + ఇంతలు (ఇ) ఏది + ఐనా (ఈ) పట్టిన + అంత

Answer:

(అ) మీరు + ఎవరు = మీరెవరు
(ఆ) పది + ఇంతలు = పదింతలు
(ఇ) ఏది + ఐనా = ఏదైనా
(ఈ) పట్టిన + అంత = పట్టినంత
రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని కలిపిరాయడం అంటారు. దీనికే ‘సంధి’ అని పేరు.

Exam Tips:

a) మొదటి పదం చివరి అచ్చు లోపించి, రెండవ పదంలోని అచ్చు నిలుస్తుంది (ఉ + ఎ = ఎ) – ఇది ఉత్వ/ఇత్వ/అత్వ సంధి.
b) కలిపిన పదం సరిగ్గా రాశారో లేదో మళ్ళీ విడదీసి చూసుకోండి.

 

ప్రాజెక్టు పని

Question 1: గ్రంథాలయం నుంచి గాని, వార్తాపత్రికల నుంచి గాని ఏదైనా జానపద కథను సేకరించి, రాసి తరగతిలో చెప్పండి.

Answer:

1. ప్రాజెక్టు శీర్షిక : గ్రంథాలయం నుండి గాని, వార్తా పత్రికల నుంచి గాని ఏదైనా జానపద కథను సేకరించడం.
2. సమాచార సేకరణ : (అ) సమాచారం సేకరించిన తేది : XXX (ఆ) సమాచార వనరు : గ్రంథాలయం
3. సేకరించిన విధానం : నేను మా గ్రామ గ్రంథాలయానికి వెళ్ళి వార్తా పత్రికలను చదివి, ఒకనాటి వార్తా పత్రికలో వచ్చిన సర్వాయి పాపన్న కథను సేకరించాను.
4. నివేదిక : సర్వాయి పాపన్న
క్రీ.శ. 1650 ప్రాంతంలో అణిచివేతకు గురి అవుతున్న గౌడ కులంలో పుట్టిన పాపన్న బాల్యంలో పశువులను కాస్తూ జీవించాడు. ఒక్క కొడుకు కావడంతో తల్లి సర్వమ్మ పాపన్నను గారాబంగా పెంచింది. స్వతంత్ర ఆలోచనలు కలిగిన పాపన్న కల్లు గీస్తూ, పశువులను కాసేవాడు. తన స్నేహితులను సమీకరించి చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. సంప్రదాయ ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తన అనుచరులతో కలిసి బల్లెం, బాణం, కర్ర వంటి ఆయుధాలను ఉపయోగించే పద్ధతులను సాధన చేశాడు. క్రమంగా తాను పెరిగిన తాటికొండ చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న ధనవంతులను, జమీందారులను రహస్య పద్ధతుల ద్వారా కొల్లగొడుతూ ధనాన్ని సేకరించడం మొదలుపెట్టాడు.
పాపన్న సాహసాలకు ఆకర్షితులై ప్రజలు సైన్యంలో చేరడం ప్రారంభించారు. దొరల పీడన వల్ల బాధలు పడుతున్న అణగారిన కులాలకు చెందిన ప్రజలకు పాపన్న రక్షణ ఇచ్చాడు. పాపన్న సైన్యం రోజురోజుకు పెరగసాగింది. మొదట సర్వాయిపేటలో బలిష్ఠమైన కోటను నిర్మించాడు. పాపన్న తనను తాను స్వతంత్రునిగా ప్రకటించుకొని సర్వాయిపేట కేంద్రంగా పాలించాడు. క్రమక్రమంగా తన రాజ్యాన్ని విస్తరించుకొంటూ హుస్నాబాద్, కరీంనగర్ ప్రాంతాలను జయించి అధీనంలోకి తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో గోల్కొండను జయించడానికి ముందే వ్యూహరచన చేసి తాటికొండలో మరొక కోటను నిర్మించాడు.
ప్రజల మన్ననలు అందుకొంటూ తగినంత సైన్యాన్ని వృద్ధి చేసుకొని ప్రజల సహకారంతో నల్లగొండ పరగణా భువనగిరి సర్కారులోని ‘షాపురం’ వద్ద గుట్టమీద పెద్ద మట్టి కోటను నిర్మించాడు. ఈ కోటను తన కేంద్రంగా చేసుకొని నల్లగొండ పరగణాలో ఉన్న జమీందారులను దోచుకుంటూ పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు.
పాపన్నను నిలువరించే వారు లేకపోవడంతో జమీందారులు, భూస్వాములంతా కలిసి ఢిల్లీ పాదుషాకు విన్నవించుకున్నారు. ఔరంగజేబు ఈ పరిస్థితిని గమనించి పాపన్నను శిక్షించేందుకు కొలనుపాక సర్దారు రుస్తుందిల్ ఖాన్‌ను ఆదేశించాడు. రుస్తుందిల్ ఖాన్ స్వయంగా పెద్ద సైన్యంతో వచ్చి షాపురం వద్ద పాపన్నతో తలపడ్డాడు. పాపన్న సైన్యం వీరోచితమైన పోరాటం సాగించింది. మూడు నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం రుస్తుందిల్ ఖాన్ పాపన్న చేతిలో ఓడిపోయాడు.
పాపన్న విజయాలు స్థానిక దొరలకు, భూస్వాములకు మింగుడు పడలేదు. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకొని క్రీ.శ. 1708 ఏప్రిల్ 1వ తేదీన పాపన్న వరంగల్ కోటను ముట్టడించాడు. అక్కడ మొగల్ ఆధీనంలో ఉన్న వేలమంది బందీలను విడుదల చేశాడు. అనంతరం తన సైన్యాన్ని పటిష్ఠపరచుకొని క్రీ.శ. 1709 ఆరంభంలో పాపన్న గోల్కొండపైకి దండెత్తాడు. భీకర పోరాటం తర్వాత అంతిమంగా గోల్కొండ పాపన్న వశమైంది.
మొగలు నాయకత్వం అపజయంతో రగిలిపోయింది. తన ధైర్యసాహసాలు, వరుస విజయాలతో ఎంతో ధీమాగా ఉన్న పాపన్న మొగలుల కుట్రలను, మోసపూరిత చర్యలను గమనించలేకపోయాడు. ప్రజలకు రక్షణ, పరిపాలనా సంస్కరణలలో మునిగిన పాపన్న ఈ ద్రోహాన్ని పసిగట్టలేకపోయాడు. దీనితో మొగలు సైన్యం మూకుమ్మడిగా స్థానిక దొరలు, భూస్వాముల అండతో గోల్కొండ మీదికి దాడిచేసింది. ఈ దాడిలో పాపన్న సైన్యం చాలా వరకు నష్టపోయింది. చివరి దాకా పోరాడిన పాపన్న శత్రువు చేతిలో మరణించడం తన స్వభావానికి విరుద్ధమని తలచి బాకుతో పొడుచుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు.
5. ముగింపు : ఈ జానపద కథ వల్ల సర్వాయి పాపన్న గురించి, ఆయన ధైర్యసాహసాల గురించి తెలుసుకున్నాను.

Exam Tips:

a) ప్రాజెక్టు నివేదికలో శీర్షిక, సమాచార సేకరణ, సేకరించిన విధానం, నివేదిక, ముగింపు అనే ఐదు భాగాలు తప్పక ఉండాలి.
b) కథను సొంత మాటల్లో, సంఘటనల వరుసలో రాయండి; సేకరించిన తేదీ, వనరు (పుస్తకం/పత్రిక పేరు) నిజమైనవి రాయండి.

 

ముఖ్యమైన ప్రశ్నలు (Important Questions)

Question 1: బాలవద్దిరాజు చేసిన సాహసాలను వివరించండి.

Answer:

పరిచయం : పానుగంటిని పరిపాలించే వద్దిరాజు కుమారుడు కార్యవద్దిరాజు. బాలనాగమ్మ, కార్యవద్దిరాజుల కుమారుడే బాలవద్దిరాజు. ఈ బాలుడు ఏడు రోజుల పసికందుగా ఉన్నప్పుడు మాయల ఫకీరు బాలనాగమ్మను ఎత్తుకుపోయాడు. తన తల్లిదండ్రుల గురించి తెలిసిన పన్నెండేళ్ళ బాలవద్దిరాజు వారిని కాపాడతానని బయలుదేరాడు.
పులిని చంపడం : తల్లిని వెతుకుతూ వెళుతున్న బాలవద్దిరాజు దారిలో పులిరాజు పట్టణం చేరాడు. అక్కడ ఒక పులి మంచినీళ్ళ బావి దగ్గర అందరినీ మింగుతోంది. ఇది తెలిసి బాలవద్దిరాజు పులిని వెతుక్కుంటూ గుహ దగ్గరకే వెళ్ళి దాన్ని చంపాడు.
రాజకుమారిని రక్షించడం : గుడిమీద మొలచిన సంజీవని మొక్క ఆకుల రసం పిండి, చిలుకవాదిపట్నం రాజు కూతురి రాచపుండును నయం చేసి బతికించాడు.
శక్తిని ఓడించడం : నాగిళ్ళపూడి మొదట్లో ఉన్న నయవాది పట్టణం చేరుకోగానే అక్కడ ఫకీరు ఏర్పాటుచేసిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది. దాన్ని చంపబోగా అది భయపడి ఆ బాలుడికి ఫకీరు ఎక్కడ ఉన్నాడో రహస్యం చెప్పి, ఒక మాయల బెత్తం కూడా ఇచ్చింది. అట్లా అతడు ఫకీరు కోటలోకి పోయి తల్లిని కలిశాడు. తల్లి ద్వారా ఫకీరు ప్రాణ రహస్యం తెలుసుకొన్నాడు.
సప్త సముద్రాలు దాటడం : గండభేరుండ పక్షి సాయంతో సప్త సముద్రాలు దాటి ఆ బాలుడు పంజరంలో ఉన్న చిలుకను పట్టి తెచ్చాడు.
మాయల ఫకీరు సంహారం : చిలుకను ఫకీరు దగ్గరకు తీసుకు వచ్చాడు. ఫకీరు భయంతో బాలనాగమ్మను విడుదల చేశాడు. ఫకీరు వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని బాలవద్దిరాజు వజ్రాల చిలుక మెడ విరిచేశాడు. మాయల ఫకీరు ప్రాణం విడిచాడు.

Exam Tips:

a) ప్రతి సాహసానికి ఒక ఉపశీర్షిక (పులిని చంపడం, శక్తిని ఓడించడం…) పెట్టి వరుసగా రాయండి.
b) బాలవద్దిరాజు ధైర్యం, తెలివి, పరోపకారం అనే గుణాలను ముగింపులో ఒక వాక్యంలో చెప్పండి.

 

Question 2: బాలవద్దిరాజు సప్తసముద్రాలు దాటి మాయల ఫకీరు ప్రాణాలున్న చిలుకను పట్టుకున్నాడు కదా! ఆ చిలుకను దొరికిన చోటనే చంపకుండా ఫకీరు దగ్గరకు ఎందుకు తీసుకొని పోయి ఉంటాడో రాయండి.

Answer:

ఆ చిలుకను దొరికిన చోటనే చంపితే మాయల ఫకీరుకు తాను ఎందుకు చనిపోతున్నాడో తెలిసేది కాదు. అంతటి దుర్మార్గుణ్ణి అతని కళ్ళ ముందే శిక్షించాలని బాలవద్దిరాజు ఆ పని చేసి ఉంటాడు. అంతేకాక మాయల ఫకీరు తన మాయలతో తన తల్లిని బందీగా చేశాడు. తన తాత తండ్రులను రాళ్ళుగా, సైనికులను బూడిదగా మార్చాడు. తన తల్లి విడుదల కావాలన్నా, తన తండ్రి, సైనికులు తిరిగి మనుషులుగా మారాలన్నా అది ఫకీరు వల్లనే సాధ్యపడుతుంది. ఆ చిలుకను దొరికిన చోటనే చంపేస్తే తన తల్లిదండ్రులు గానీ, సైనికులు గానీ విడుదల అయ్యే అవకాశం ఉండదు. అందువల్ల బాలవద్దిరాజు ఆ చిలుకను దొరికిన చోటనే చంపకుండా ఫకీరు దగ్గరకు తీసుకొని పోయి ఉంటాడు.

Exam Tips:

a) ముఖ్య కారణం: రాళ్ళుగా మారిన తండ్రిని, సైన్యాన్ని ఫకీరు చేతనే తిరిగి బతికించాలి – ఇది తప్పక రాయండి.
b) బాలవద్దిరాజు తెలివి, ముందుచూపును ప్రశంసిస్తూ జవాబు ముగించండి.

 

అపరిచిత పద్యాలు – గద్యం

Question 1: క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు తగిన సమాధానాలు రాయండి.
కష్ట పెట్టబోకు కన్నతల్లి మనసు
నష్ట పెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలిత సుగుణజాల తెలుగుబాల!
1. వేనికి నష్టం కలిగించకూడదు ?
2. కష్టపెట్టకూడనిది ఏమిటి ?
3. ఎవరు దైవ సమానులు ?
4. ఈ పద్యం రాసిన కవి పేరేమిటి ?
5. ఈ పద్యానికి మకుటం ఏమిటి ?

Answer:

1. నాన్న పనులకు నష్టం కలిగించకూడదు.
2. కన్నతల్లి మనసును కష్టపెట్టకూడదు.
3. తల్లిదండ్రులు దైవ సమానులు.
4. కరుణశ్రీ (జంధ్యాల పాపయ్యశాస్త్రి).
5. ‘లలిత సుగుణజాల తెలుగుబాల’.

Exam Tips:

a) జవాబులు పద్యంలోని పదాలతోనే, పూర్తి వాక్యాలుగా రాయండి.
b) మకుటం అంటే ప్రతి పద్యం చివర మళ్ళీ మళ్ళీ వచ్చే పాదం అని గుర్తుంచుకోండి.

 

Question 2: క్రింది పద్యాన్ని చదివి, దాని క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
అక్షరంబు వలయు కుక్షిజీవనులకు
నక్షరంబు జిహ్వ కిక్షురసము
అక్షరంబు తన్ను రక్షించు గావున
నక్షరంబు లోకరక్షితంబు.
1. మానవులకు అవసరమైనది ఏది ?
2. అక్షరం జిహ్వకు ఎటువంటిది ?
3. అక్షరం దేనిని రక్షిస్తుంది ?
4. ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
5. ‘జిహ్వ’ అను పదానికి అర్థం రాయండి.

Answer:

1. మానవులకు (కుక్షిజీవనులకు) అక్షరం (చదువు) అవసరం.
2. అక్షరం జిహ్వకు (నాలుకకు) చెరుకు రసం వంటిది.
3. అక్షరం చదువుకున్న వారిని (తన్ను) రక్షిస్తుంది.
4. ‘అక్షరం అవసరం’ / ‘అక్షర మహిమ’.
5. జిహ్వ అనగా ‘నాలుక’ అని అర్థం.

Exam Tips:

a) పద్యంలోని కఠిన పదాల అర్థం (కుక్షిజీవనులు = మానవులు, ఇక్షురసము = చెరుకు రసం) గ్రహించి జవాబులు రాయండి.
b) శీర్షిక పద్యం ముఖ్య భావాన్ని తెలిపేలా చిన్నగా ఉండాలి.

 

Question 3: ఈ క్రింది గద్యాన్ని చదివి, ఏవేని ఐదు ప్రశ్నలు తయారు చేయండి.
“సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తి నందుకొన్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కవిగా, రచయితగా, తత్త్వవేత్తగా, సంగీతజ్ఞుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. వీరి పేరు వినగానే చప్పున స్ఫురించేవి ‘జనగణమన గీతం’, ‘గీతాంజలి’. జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తింపబడింది. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా వీరి లేఖిని నుండి వెలువడినదే. ఇలా రెండు జాతీయ గీతాలనందించిన కవిగా, అపూర్వ చరిత్రను సృష్టించారు. “శాంతినికేతన్” పేరున విద్యాలయాన్ని స్థాపించి ‘గురుదేవుడు’గా కీర్తింపబడ్డారు.”

Answer:

1. సాహిత్య సృజనలో అంతర్జాతీయ కీర్తిని అందుకున్న వారు ఎవరు ?
2. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది ఎవరు ?
3. రవీంద్రుడు స్థాపించిన విద్యాలయం ఏది ?
4. రవీంద్రుని బిరుదు ఏమి ?
5. ఠాగూర్ రచించిన ఏవేని రెండు ప్రసిద్ధ రచనలు ఏవి ?

Exam Tips:

a) ప్రశ్నలకు జవాబులు గద్యంలోనే ఉండాలి; ఎవరు, ఏది, ఏమి, ఎక్కడ వంటి వేర్వేరు ప్రశ్నార్థక పదాలు వాడండి.
b) ప్రతి ప్రశ్న చివర ప్రశ్నార్థక గుర్తు ( ? ) తప్పక పెట్టండి.

 

బహుళైచ్ఛిక ప్రశ్నలు – పర్యాయపదాలు (గీత గీసిన పదాలకు)

Question 1: ఏ దిక్కూ లేని వారికి భగవంతుడే రక్ష. (దిక్కు)
(A) చోటు, స్థలం (B) ఇల్లు, గృహం (C) దిశ, వైపు (D) నీరు, జలం

Answer:

(C) దిశ, వైపు

Exam Tips:

a) దిక్కు = దిశ, వైపు; ‘శరణం’ అనే నానార్థం కూడా ఉంది – సందర్భం చూసి ఎంచుకోండి.

 

Question 2: తల్లి, తండ్రి, గురువు – వీరి ముగ్గురి ఋణమూ ఎప్పటికీ తీర్చుకోలేము. (తండ్రి)
(A) జనకుడు, పిత (B) వృద్ధుడు, ముదుసలి (C) తాత, నాయన (D) ఉపాధ్యాయుడు, గురువు

Answer:

(A) జనకుడు, పిత

Exam Tips:

a) తండ్రి = జనకుడు, పిత, నాన్న, అయ్య; తల్లి = జనని, మాత, అంబ – జతగా గుర్తుంచుకోండి.

 

Question 3: మన భారతీయుల వివాహం అనే సంప్రదాయం ప్రపంచ ప్రజలకు ఆదర్శప్రాయం. (వివాహం)
(A) ఇల్లు, గృహం (B) కులం, గుణం (C) మతం, గౌరవం (D) పెండ్లి, కళ్యాణం

Answer:

(D) పెండ్లి, కళ్యాణం

Exam Tips:

a) వివాహం = పెండ్లి, కళ్యాణం, పాణిగ్రహణం.

 

Question 4: దేహాన్ని దేవాలయంగానూ, అందులో ఉండే జీవుణ్ణి దేవుడిగానూ విజ్ఞులు పోలుస్తారు. (దేవాలయం)
(A) విద్యాలయం, బడి (B) గుడి, కోవెల (C) ఒడి, మడి (D) మడి, ఆయకట్టు

Answer:

(B) గుడి, కోవెల

Exam Tips:

a) దేవాలయం = గుడి, కోవెల; ఇచ్చిన రెండు పదాలూ పర్యాయపదాలు అయిన ఎంపికనే ఎంచుకోండి.

 

బహుళైచ్ఛిక ప్రశ్నలు – ప్రకృతి, వికృతులు (గీత గీసిన పదాలకు)

Question 1: అమ్మను మించిన దైవం లేదు. (అమ్మ)
(A) కొమ్మ (B) గుమ్మ (C) బొమ్మ (D) అంబ

Answer:

(D) అంబ

Exam Tips:

a) అమ్మ వికృతి, అంబ ప్రకృతి – సంస్కృత పదం ప్రకృతి, తెలుగులో మారిన రూపం వికృతి.

 

Question 2: పగటికి రాజు సూర్యుడైతే రాత్రికి రాజు చంద్రుడు. (రాత్రి)
(A) నక్తం (B) రాతిరి (C) చీకటి (D) అంధకారం

Answer:

(B) రాతిరి

Exam Tips:

a) రాత్రి – రాతిరి/రేయి; నక్తం పర్యాయపదం మాత్రమే, వికృతి కాదు – తేడా గమనించండి.

 

Question 3: విద్య లేని వాడు వింత పశువు. (విద్య)
(A) చదువు (B) సంధ్య (C) విద్దె (D) కూలి

Answer:

(C) విద్దె

Exam Tips:

a) విద్య – విద్దె; ‘చదువు’ పర్యాయపదం, వికృతి కాదు.

 

Question 4: ఎంత కొండలమీద ప్రవహించినా నదులు అన్నీ చివరికి సముద్రంలో కలిసేవే. (సముద్రం)
(A) సంద్రం (B) వారధి (C) వారిధి (D) కడలి

Answer:

(A) సంద్రం

Exam Tips:

a) సముద్రం – సంద్రం; వారిధి, కడలి పర్యాయపదాలు.

 

బహుళైచ్ఛిక ప్రశ్నలు – వ్యాకరణాంశాలు

Question 1: తెలంగాణలో బాలనాగమ్మ కథ బాగా పేరు పొందిన కథ – ఇందులో ద్విత్వాక్షరం ఏది ?
(A) థ (B) మ్మ (C) రా (D) పొం

Answer:

(B) మ్మ

Exam Tips:

a) ఒకే హల్లు రెండుసార్లు కలిస్తే ద్విత్వాక్షరం (మ్మ = మ్ + మ); వేర్వేరు హల్లులు కలిస్తే సంయుక్తాక్షరం.

 

Question 2: కింది వాటిలో పరుషాక్షరం ఏది ?
(A) ప (B) య (C) మ (D) గ

Answer:

(A) ప

Exam Tips:

a) పరుషాలు: క, చ, ట, త, ప; సరళాలు: గ, జ, డ, ద, బ – ఈ రెండు జాబితాలు కంఠస్థం చేయండి.

 

Question 3: బాలవద్దిరాజు తన తల్లిదండ్రులను రక్షించడం కొఱకు ఎన్నో సాహసాలు చేశాడు. గీత గీసినది (కొఱకు) ఏ విభక్తి ?
(A) ప్రథమ (B) ద్వితీయా (C) తృతీయా (D) చతుర్థి

Answer:

(D) చతుర్థి

Exam Tips:

a) కొఱకు(న్), కై – చతుర్థీ విభక్తి ప్రత్యయాలు; విభక్తి ప్రత్యయాల పట్టిక తప్పక నేర్చుకోండి.

 

Question 4: ఓ, ఓరి, ఓయి, ఓసి అనే ప్రత్యయాలకు ఏమని పేరు ?
(A) ప్రథమా (B) ద్వితీయా (C) సంబోధన ప్రథమా (D) షష్ఠీ

Answer:

(C) సంబోధన ప్రథమా

Exam Tips:

a) పిలవడానికి వాడే ఓ, ఓరి, ఓయి, ఓసి – సంబోధన ప్రథమా విభక్తి.

 

బహుళైచ్ఛిక ప్రశ్నలు – సంధులు

Question 1: పరోపకారులైన మానవులకు చేతులెత్తి మొక్కవచ్చు. (చేతులెత్తి – విడదీయండి)
(A) చేయి + ఎత్తి (B) చేతి + ఎత్తి (C) చేతులు + ఎత్తి (D) చేతులను + ఎత్తి

Answer:

(C) చేతులు + ఎత్తి

Exam Tips:

a) విడదీసేటప్పుడు లోపించిన అచ్చు (ఉ) ను మొదటి పదానికి తిరిగి చేర్చాలి – ఇది ఉత్వ సంధి.

 

Question 2: ప్రతిదీ ఎదుటి వాళ్ళు చెప్పినట్లు చేయడం వ్యక్తిత్వం అనిపించుకోదు. (చెప్పినట్లు – విడదీయండి)
(A) చెప్పిన + అట్లు (B) చెప్పు + అట్లు (C) చెబుతాను + ఇట్లు (D) చెప్పిన + ట్లు

Answer:

(A) చెప్పిన + అట్లు

Exam Tips:

a) అత్వ సంధి: మొదటి పదం చివరి ‘అ’ లోపించి రెండవ పదం అచ్చు నిలుస్తుంది.

 

Question 3: సంపద ఉన్నదని మిడిసిపడటం గొప్ప వారి లక్షణం కాదు. (ఉన్నదని – విడదీయండి)
(A) ఉన్నది + ని (B) ఉన్నది + అని (C) ఉన్న + అని (D) ఉంది + అని

Answer:

(B) ఉన్నది + అని

Exam Tips:

a) ఇత్వ సంధి: ‘ఉన్నది’ లోని చివరి ‘ఇ’ లోపించి ‘అని’ లోని ‘అ’ చేరుతుంది.

 

Question 4: కింది పదాలను కలపండి : వాళ్ళు + అందరు
(A) వాళ్ళందర (B) వాళ్ళందరు (C) వాళ్ళే అందరు (D) వాళ్ళందరితోనూ

Answer:

(B) వాళ్ళందరు

Exam Tips:

a) ఉత్వ సంధి: ఉ + అ = అ; కలిపిన పదంలో కొత్త అక్షరాలు చేర్చకూడదు.

 

Question 5: కింది పదాలను కలపండి : ఉన్నది + అని
(A) ఉందని (B) ఉన్నదంటూ (C) ఉంటే ఉంది (D) ఉన్నదని

Answer:

(D) ఉన్నదని

Exam Tips:

a) ఇచ్చిన రెండు పదాల అక్షరాలే కలిపిన రూపంలో ఉండాలి – ‘ఉందని’ వ్యావహారిక రూపం, సరైనది కాదు.

 

Question 6: కింది పదాలను కలపండి : మీద + ఎక్కి
(A) మీదెక్కి (B) మీద మీద (C) పైపైన (D) మీద కాక

Answer:

(A) మీదెక్కి

Exam Tips:

a) అత్వ సంధి: అ + ఎ = ఎ (మీద + ఎక్కి = మీదెక్కి).

 

Free study material for Telugu

TS Board Solutions for Class 6 Telugu Lesson 10 Balanagamma (Folk Tale)

Chapter Exercise Answers for Class 6 Telugu

Review comprehensive exercise answers for Class 6 Telugu Lesson 10 Balanagamma (Folk Tale). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Detailed Answer Guides for Lesson 10 Balanagamma (Folk Tale)

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Complete Preparation Kit for Class 6 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 10 Balanagamma (Folk Tale) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ for the 2026-27 session?

The complete and updated TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ will help students to get full marks in the theory paper.

Do you offer TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire TS 6th Class Telugu 10th Lesson Questions and Answers Telangana బాలనాగమ్మ in printable PDF format for offline study on any device.