TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం

Step-by-Step Textbook Solutions for Class 6 Telugu Lesson 12 Kapadukundam (Let us protect nature)

Explore reliable textbook solutions for Lesson 12 Kapadukundam (Let us protect nature) tailored for Class 6 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Download Lesson 12 Kapadukundam (Let us protect nature) Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 6 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

బొమ్మ చూసి చెప్పండి

Question 1: పై బొమ్మలో ఎవరున్నారు ?

Answer:

పై బొమ్మలో ఒక కట్టెలు కొట్టేవాడున్నాడు.

Exam Tips:

a) బొమ్మలో కనిపించే వ్యక్తి ఎవరో, అతడు ఏం చేస్తున్నాడో ఒక వాక్యంలో స్పష్టంగా రాయండి.

 

Question 2: బొమ్మలోని వ్యక్తి ఏమి చేసి ఉండవచ్చు ?

Answer:

బొమ్మలోని వ్యక్తి కట్టెల కోసం చెట్లన్నింటినీ నరికేసి ఉండవచ్చు.

Exam Tips:

a) చిత్రంలో కనిపించే చర్యను బట్టి దాని ఫలితం ఏమై ఉంటుందో తార్కికంగా ఊహించి రాయండి.

 

Question 3: బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని మీరు అంగీకరిస్తారా ? ఎందుకు ?

Answer:

బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని నేను అంగీకరించను. ఎందుకంటే చెట్లు మనకు ప్రాణాధారం. చెట్లను కొట్టేస్తే వాతావరణంలో సమతౌల్యం లోపిస్తుంది.

Exam Tips:

a) ‘అంగీకరిస్తాను / అంగీకరించను’ అని ముందు మీ అభిప్రాయం చెప్పి, తరువాత ‘ఎందుకంటే…’ అంటూ కారణాన్ని రాయండి.
b) చెట్ల వల్ల వాతావరణ సమతౌల్యం, ప్రాణవాయువు లభిస్తాయని పేర్కొనండి.

 

Question 4: ప్రకృతిని కాపాడాలంటే ఏమి చేయాలి ?

Answer:

ప్రకృతిని కాపాడాలంటే చెట్లను ఎక్కువగా పెంచాలి.

Exam Tips:

a) చెట్లను పెంచడం, నరకకుండా ఉండటం వంటి ఆచరణాత్మక చర్యలను చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి

Question 1: “అడవి జంతువులు – పల్లె బాట పట్టాయి” దీనికి గల కారణాలు చెప్పండి.

Answer:

మనిషి తన అవసరాల కోసం, నివాసం కోసం అడవులను నరికేస్తున్నాడు. దానితో అడవులు అంతరించి పోతుంటే అక్కడ నివసించే జంతువులకు ఉండటానికి చోటు లేకుండా పోతోంది. అందుకే అడవి జంతువులు పల్లెబాట పట్టాయి.

Exam Tips:

a) కారణాలను క్రమంగా రాయండి: అడవుల నరికివేత → జంతువులకు నివాసం పోవడం → గ్రామాల వైపు రావడం.

 

Question 2: “చెరువులే గ్రామాలకు మూలాధారాలు” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.

Answer:

గ్రామాలలో నదులు ప్రవహించే ప్రాంతాలు చాలా తక్కువ. అందుకే ప్రతి ఊరిలోనూ చెరువులు తవ్వేవారు. వానలు పడ్డప్పుడు చెరువులు నిండి గ్రామానికి నీటివసతి కలిగేది. పశువులకు, నీటిలో ఉండే జంతువులకూ కూడ నీటి కొరత లేకుండా ఉండేది. అందుకే చెరువులే గ్రామాలకు మూలాధారాలు.

Exam Tips:

a) ‘మూలాధారం’ అంటే ఏమిటో ముందు చెప్పి, చెరువు వల్ల నీటివసతి, పశువులకు నీరు వంటి ప్రయోజనాలను ఉదహరించండి.

 

Question 3: మనిషి ఆశే అనర్థాలకు కారణం. దీనిని సమర్థిస్తూ నాలుగు వాక్యాలను చెప్పండి.

Answer:

మనిషి ఆశే అనర్థాలకు మూలకారణం. మనిషికి ఆశ ఎక్కువై ప్రకృతి సంపదనంతా పాడు చేస్తున్నాడు. కనీసం తన ఇంట్లో కూడా చెట్లను పెంచటం లేదు. చెరువులను ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుతున్నారు. చెరువుల స్థలాన్ని కూడ కబ్జా చేస్తున్నాడు. కర్మాగారాలలోని రసాయనాలు కలిసిన మురుగు నీటిని నదులూ, చెరువుల్లో కలుపుతూ నీటిని కలుషితం చేస్తున్నాడు. తన ఆనందంకోసం పెద్ద సౌండు బాక్సులూ, టి.వి.లు, టేప్ రికార్డర్లనుండి పెద్ద శబ్దాలు చేస్తూ శబ్దకాలుష్యాన్ని కలిగిస్తున్నాడు.

Exam Tips:

a) ‘నాలుగు వాక్యాలు’ అని అడిగారు కాబట్టి కేవలం నాలుగైదు వాక్యాల్లోనే సూటిగా రాయండి.
b) చెట్లు పెంచకపోవడం, చెరువుల ఆక్రమణ, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి ఉదాహరణలు ఇవ్వండి.

 

Question 4: “సెల్టవర్లు పక్షులకే కాక మానవులకు కూడా శాపమే” అనడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుంది ?

Answer:

సెల్టవర్లనుండి వచ్చే సిగ్నల్స్లో ఉన్న రేడియేషన్ వల్ల చాలామటుకు పక్షుల జాతులు అంతరించిపోతున్నాయి. మనుషులకు కూడా ఈ రేడియేషన్ వల్ల రకరకాల రోగాలు అంటుకుని ప్రాణాలు తీస్తున్నాయి. అందుకే సెల్ఫోన్లు వచ్చాక జీవులకు, మనుషులకూ ప్రమాదము, అనారోగ్యము ఏర్పడుతున్నాయి.

Exam Tips:

a) సెల్‌టవర్ల రేడియేషన్ వల్ల పక్షులకు, మనుషులకు కలిగే హానిని రెండింటినీ పేర్కొనండి.

 

Question 5: వివిధరకాల పొగలను పీల్చడం వలన మానవుడు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు?

Answer:

ఇంట్లోంచి కాలు బయట పెడితే చాలు ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతున్నది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చిన పొగ, బీడీ సిగరెట్ల పొగ మొదలైనవి. ఈ పొగ ఊపిరితిత్తులలోకి పోయి దగ్గు, క్షయ, క్యాన్సర్ వంటి అనేకమైన భయంకర రోగాలను కలుగజేస్తున్నది. మనుషుల ఆయుర్దాయాన్ని హరించి వేస్తున్నది.

Exam Tips:

a) పొగ రకాలను (వాహనాలు, ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్, బీడీ సిగరెట్లు) జాబితాగా చెప్పి, తరువాత వచ్చే వ్యాధులను (దగ్గు, క్షయ, క్యాన్సర్) రాయండి.

 

Question 6: శబ్దకాలుష్యం ఎన్ని విధాలుగా జరుగుతున్నది ?

Answer:

శబ్దకాలుష్యానికి అనేక కారణాలు. బయట వాహనాలరద్దీ ఎక్కువై అవి చేసే శబ్దాలు, విద్యుత్తు పరికరాలు, ఏ.సి.లు, కూలర్లు, ఫ్యాన్లనుండి వచ్చే శబ్దాలు భరించలేకపోతున్నాము. దానికి తోడు సరదాకొద్దీ టి.వి., రేడియోలు పెద్ద శబ్దంతో పెట్టడం, ఫ్యాక్టరీలనుండి వచ్చే శబ్దాలు, ప్రతి చిన్నాపెద్దా సంతోషాలకూ పేల్చే బాంబులు, టపాకాయల శబ్దాలు. ఇలా అనేక విధాలుగా శబ్ద కాలుష్యం జరుగుతున్నది.

Exam Tips:

a) ‘ఎన్ని విధాలుగా’ అని అడిగారు కాబట్టి వాహనాలు, విద్యుత్ పరికరాలు, టి.వి.-రేడియోలు, ఫ్యాక్టరీలు, టపాకాయలు అంటూ కారణాలను వేర్వేరుగా లెక్కపెట్టి రాయండి.

 

Question 7: తేళ్ళు, పాములు భయంతో ఎందుకు అల్లాడుతున్నాయి ?

Answer:

తేళ్ళు, పాములు భూమిలోపల నివసిస్తాయి. అనేక రకాలైన రసాయనిక పదార్థాలతోనూ, బాణసంచా సామగ్రితోను భూమి కలుషితమై పోతున్నది. ఫీట్లకు ఫీట్లు లోతున మిషన్లను భూమిలోకి దింపి బావులు తవ్వుతుంటే భూమి అదిరిపోతున్నది. తేళ్ళు, పాములు భయంతో అల్లాడుతున్నాయి.

Exam Tips:

a) తేళ్లు, పాములు నేలలో నివసిస్తాయన్న విషయం, రసాయనాలు, బోర్ల యంత్రాల కంపనం వల్ల అవి భయపడటం — ఈ రెండు కారణాలను రాయండి.

 

Question 8: పర్యావరణ పరిరక్షణకై మీ పాఠశాలలో ఎటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు ?

Answer:

పర్యావరణ పరిరక్షణ గురించి మా బడిలో సమావేశాలు నిర్వహించి అందరికి అవగాహన కలిగిస్తాము. విద్యార్థులందరం కలిసి స్వచ్ఛందంగా తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రం చేస్తాము. బడి ముందర మొక్కలు పెంచి రోజూ తోట పని చేస్తాము. జట్లుగా ఏర్పడి ప్రజలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తాము.

Exam Tips:

a) మీ పాఠశాలలో నిజంగా జరిగే కార్యక్రమాలను (మొక్కలు నాటడం, పరిసరాల శుభ్రత, అవగాహన సభలు) సొంత మాటల్లో రాయండి.

 

Question 9: చెరువులు, బావులు నీళ్లతో కళకళలాడటం కోసం ఊరి ప్రజలకు ఎట్లాంటి సలహాలను ఇస్తావు?

Answer:

బావులలో, చెరువులలో ఎప్పుడూ నీళ్ళు ఉండాలంటే నీళ్ళు భూమిలో నుంచి ఊరుతూ ఉండాలి. అందుకోసం మనం మట్టినేలను కూడా ఉంచుకోవాలి.
ఇళ్ళమధ్య కొంచెమైనా ఖాళీస్థలం వదలాలి, అది కూడా సిమెంటు చేయకుండా. అందువల్ల నేల తడిసి నీటిని పీల్చుకుంటుంది. ఇంకుడు నీటి గుంటలు, చెరువులు, కోనేర్లు తవ్వాలి. ఆ విధంగా భూమిలోపలి పొరల్లోకి నీరు చేరితే బావుల్లోకి నీరు ఊరుతుంది. ఇదే నేను ఊరి ప్రజలకు ఇచ్చే సలహా.

Exam Tips:

a) ఇంకుడు గుంటలు, మట్టి నేలను ఉంచడం, సిమెంటు వేయకుండా ఖాళీ స్థలం వదలడం వంటి ఆచరణాత్మక సలహాలను ఇవ్వండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: ఈ పాఠం ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పండి?

Answer:

పెరిగిపోతున్న జనాభా వల్ల, వాళ్ల అవసరాలు తీర్చటానికి, మనుషుల్లో పెరిగిపోతున్న అంతులేని ఆశల వల్ల, స్వార్థంవల్ల అడవులు నాశనమైపోతున్నాయి. వాతావరణం, ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయి. జంతువులకు, పక్షులకు గూడు కరువైపోతోంది అని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది.

Exam Tips:

a) పాఠం సారాంశాన్ని రాయండి: జనాభా పెరుగుదల, స్వార్థం, అడవుల నాశనం, జీవులకు నష్టం.

 

Question 2: “పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి ?

Answer:

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకృతి సంపద మనకు దేవుడిచ్చిన వరం. అది ఏ ఒక్కరి సొంతం కాదు. అందరికీ దాని మీద అధికారం ఉంది.
అధికారం గురించి మాట్లాడినప్పుడు బాధ్యత గురించి కూడా మాట్లాడాలిగదా! మనం ఇంత సంపద సొంతం చేసుకున్నప్పుడు దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదేనని మర్చిపోకూడదు. మనం దానిని జాగ్రత్తగా వాడుకుంటూ మన తరువాత తరాల వారికోసం జాగ్రత్త చెయ్యాలి. అప్పుడే అందరి జీవితాలు ఆనందమయంగా ఉంటాయి.

Exam Tips:

a) మొదట ‘బాధ్యత’ అనే అంశంపై మీ వాదన చెప్పి, ‘మనం వాడుకుంటే తరువాతి తరాలకు కాపాడాలి’ అన్న కారణంతో ముగించండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

Question 1: పాఠం చదివి కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి.
(అ) పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోలేదట గదా! అయితే ఈ సారి ఎందుకు ఎండిపోయింది ?
(ఆ) జనం మధ్యలో సెల్టవర్లాయె. ఇక ఎట్లా బతుకుతయ్ ?
(ఇ) బావులు, నదులు ఇవన్నీ నీళ్లతోటి కళకళలాడితే నీళ్లకేం కష్టం.
(ఈ) తేళ్లు, పాములు భయంతోటి అల్లాడవట్టె.

Answer:

(అ) ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. గోపాల్ అన్నమ్మతో ఈ మాటలు అన్నాడు.
(ఆ) ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. అన్నమ్మ లక్ష్మితో అన్న మాటలివి.
(ఇ) ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. లక్ష్మి గోపాల్తో అన్నది.
(ఈ) ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. నరసయ్య అన్నమ్మతో అన్న మాటలివి.

Exam Tips:

a) ‘ఎవరు, ఎవరితో’ అన్న ప్రశ్నకు పాత్రల పేర్లను (గోపాల్, అన్నమ్మ, లక్ష్మి, నరసయ్య) పాఠంలోని సంభాషణ ఆధారంగా సరిగ్గా జతపరచండి.

 

Question 2: కింది పేరాను చదివి పట్టికను పూరించండి.
నేను చెట్టును. మీకు తల్లివంటిదాన్ని. నన్ను నరికి కరువు కోరల్లో చిక్కుకోవద్దు. మానవుల్లారా ! అమ్మలాంటి నన్ను కొట్టకండి. కాసుల కోసం అమ్మకండి. పండ్లను, నీడను, ప్రాణవాయువులను ఇచ్చే త్యాగజాతి మాది. చచ్చిన మీ మనుషులకై బతికిన మమ్ములను నరికే జాతి మీది. చేతనైతే మీ పుట్టిన రోజున పది మొక్కలను నాటి నీరు పోసి కాపాడండి. కానీ దయచేసి తుంచకండి.

Answer:

చేయకూడనివి : చెట్లను నరకకూడదు. కొట్టకూడదు. డబ్బుకోసం అమ్మకూడదు. తుంచకూడదు.
చేయవలసినవి : మొక్కలను నాటాలి. నీరు పోసి కాపాడాలి.
త్యాగజీవులు అందించేవి : పండ్లు, నీడ, ప్రాణవాయువులు
శీర్షిక : చెట్టు తల్లి వంటిది.

Exam Tips:

a) పేరాలోని చెట్టు మాటల నుంచే ‘చేయకూడనివి’, ‘చేయవలసినవి’ను వేరుచేసి రాయండి.
b) శీర్షిక పేరా భావాన్ని ప్రతిబింబించేలా చిన్నదిగా ఉండాలి.

 

III. స్వీయ రచన

Question 1: “చెరపకురా చెరువులను, చెడిపోతావు” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి? (ఐదు వాక్యాల్లో)

Answer:

చెరువులను చెరపకూడదు. అంటే పాడుచేయకూడదు. స్వార్థం కోసం ఆక్రమించుకోకూడదు. పశువులను కడిగి, చెత్తాచెదారం పడేసి, రసాయనిక వ్యర్థాలను కలిపి అనేక విధాలుగా చెరువులను కలుషితం చేయకూడదు.
చుట్టుపక్కల ఉండే నీటిగుంటలను మూసేయటం, నేలంతా గచ్చు చేయటం వల్ల భూమిలోకి నీరు ఇంకక చెరువులు ఎండిపోతాయి. కనుక అలాంటి ప్రమాదం లేకుండా చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నీటికి కొరత ఏర్పడి మనుషులే గాక పశువులు, పక్షులు,ఇతర జీవాలు కూడా బాధపడవలసి వస్తుంది.

Exam Tips:

a) ‘చెరపకురా’ అంటే చెరువులను పాడు చేయవద్దని అర్థం; కాలుష్యం, ఆక్రమణ, ఇంకిపోవడం అనే అంశాలను ఐదు వాక్యాల్లో రాయండి.

 

Question 2: “అడవులను నాశనం చేసుకుంటపోతే ఇంకా భయపడే కాలం వస్తది” అనడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుంది? (ఐదు వాక్యాల్లో)

Answer:

అడవులను నాశనం చేస్తుంటే ప్రకృతి సంపద హరించి పోతుంది. వానలు పడవు. ఎండలు పెరిగిపోతాయి. జంతువులకు నివాసాలు లేకుండా పోతాయి. వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. అడవుల్లో జంతువులు వచ్చి ఊళ్ళమీదపడి అన్నీ నాశనం చేస్తాయి. కొన్ని జంతువులు ప్రజల ప్రాణాలు తీస్తాయి. ఎండల తీవ్రత వల్ల వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని భయంకరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావానికి లోనై అనేక వ్యాధులపాల పడతారు. అందుకే అడవులను నాశనం చెయ్యకూడదు.

Exam Tips:

a) అడవుల నాశనం వల్ల వానలు తగ్గడం, ఓజోన్ పొర దెబ్బతినడం, జంతువుల దాడులు వంటి పరిణామాలను వరుసగా రాయండి.

 

Question 3: “మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” దీనితో మీరు ఏకీభవిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ? (ఐదు వాక్యాల్లో)

Answer:

“మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” ఈ మాటలు చాలా సరైనవి. నేను దీనితో ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం ప్రకృతిలో సృష్టిస్తున్న భయంకరమైన మార్పుల వల్ల మన ఆరోగ్యాలూ పాడౌతున్నాయి. జీవరాసులూ అంతరించిపోతున్నాయి. మన అనుకూలం కోసం సెల్ఫోన్లు తయారు చేసుకొని సెల్టవర్లు నిర్మిస్తే ఆ టవర్ల నుంచి వచ్చే తరంగశక్తిని తట్టుకోలేక పక్షి జాతులు చనిపోతున్నాయి. ఇలాగే భూకాలుష్యం, శబ్దకాలుష్యం, జలకాలుష్యం, వాయుకాలుష్యం మనమే సృష్టిస్తున్నాం. మనమే రోగాలపాలిట పడుతున్నాం.

Exam Tips:

a) ‘ఏకీభవిస్తాను’ అని స్పష్టంగా చెప్పి, సెల్‌టవర్లు, కాలుష్యాల వంటి ఉదాహరణలతో సమర్థించండి.

 

Question 4: “వాకిళ్ళు కాంక్రీటు గచ్చులాయె” ఇది ఎటువంటి నష్టాలను కలిగిస్తుందో వివరించండి? (ఐదు వాక్యాల్లో)

Answer:

కాళ్ళకు మట్టి అంటకుండా ఇంటిముందు, ఇంటివెనుక అంతా గచ్చు చేస్తున్నాం. ఇంటిమీద ఇల్లు కట్టేసి ఇళ్ళమధ్య కాస్తకూడ జాగా వదలటం లేదు. రోడ్లన్నీ కాంక్రీటు వేస్తున్నాం. ఇలా ఎక్కడా నేల అనేదే కనబడకుండా అంతా కాంక్రీటు గచ్చులే. చివరికి నీళ్ళు పోయే మోరీలు కూడా సిమెంటు చేస్తున్నాం. దీనివల్ల ఎక్కడా భూమిలోకి నీళ్ళు దిగడం లేదు. నేలలో తేమలేకుండా పోతోంది. ఎన్ని అడుగులు తవ్వినా నీళ్ళు పడవు. బావుల్లోకి, చెరువుల్లోకి ఎటునుంచి ఊట దిగదు. ఇలా అనేక విధాలుగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది.

Exam Tips:

a) కాంక్రీటు వల్ల నీరు భూమిలోకి ఇంకకపోవడం, నేలలో తేమ తగ్గడం, బావులు ఎండిపోవడం అనే గొలుసును వివరించండి.

 

Question 5: మీ ప్రాంతంలో ప్రకృతిని ఎన్ని విధాలుగా నాశనం చేస్తున్నారో రాయండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

మా ప్రాంతంలో పూర్వకాలం నుంచి ఇళ్ళలోనూ, ఇళ్ల బయటా కూడా పచ్చనిచెట్లు కనిపించేవి. చల్లని గాలి ఇళ్ళకు అందం, ఎంతో హాయిగా ఉండేది. ఇప్పుడు చెట్లు కొట్టేసి రోడ్లు, కాలువలు వేశారు. ఇంట్లో చెట్లుకూడా పోషణ అందక ఎండిపోతున్నాయ్. ఇళ్ళలో చెత్తంతా వీధుల్లోనూ, కాలువల్లోనూ విసిరేస్తున్నారు. ఇంత బాధ్యత లేకుండా ఉంటే ఆరోగ్యాలు ఎక్కడి నుండి వస్తాయి. నిలబడిపోయిన మురుగు, పేరుకు పోయిన చెత్త వల్ల ఈగలూ, దోమలూ చేరి మనుషులు రోగాలపాలౌతున్నారు.

Exam Tips:

a) మీ ప్రాంతంలో మీరు చూసిన నిజమైన ఉదాహరణలను (చెట్లు కొట్టడం, చెత్త పారవేయడం) రాయండి.

 

Question 6: “ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు” దీనిని విశ్లేషిస్తూ రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. పూర్వకాలంలో ఈ కొండలు, నదులు, అడవులు, సెలయేళ్ళు, అడవి జంతువులు, అడవులలోని ఉత్పత్తులు సమృద్ధిగా లభించేవి. ప్రకృతి ఆనందకరంగా, హాయిగా ఉండేది. సకాలంలో వర్షాలు కురిసేవి. వాతావరణంలో ఋతువుల మార్పులు మంచి సుఖాన్నిచ్చేవి. రాను రాను జనాభా పెరిగిపోతున్నది. అవసరాలు పెరిగిపోతున్నాయి. అడవులు నరికేస్తున్నారు. అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రకృతి సంపదను కరిగించేస్తున్నారు.
తమ తరువాత వచ్చే వారికి ఏమివ్వాలని ఆలోచించటం లేదు. సాంకేతికంగా అభివృద్ధి సాధించారు. ఆధునిక పరికరాలు వాడుతున్నారు. కర్మాగారాలు, పరిశ్రమలు అధికంగా స్థాపించి వాటి నుంచి వచ్చే వ్యర్థాలను నీళ్ళలోకి వదిలి నీళ్ళను కలుషితం చేస్తున్నారు. పొగతో గాలి కలుషితమైపోతున్నది. ప్రజలు అనారోగ్యం పాలౌతున్నారు. ఇది తప్పు. మానవులు తమ తప్పు తెలుసుకొని పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో కాలుష్యం తప్ప ఏమీ మిగలదు. భావితరాలకు భవిష్యత్తే లేదు.

Exam Tips:

a) పూర్వం ప్రకృతి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది, భవిష్యత్తులో ఏమవుతుంది అని మూడు భాగాలుగా రాయండి.
b) పది వాక్యాల జవాబులో ముగింపు తప్పనిసరిగా ఉండాలి.

 

Question 7: మానవులు, పక్షులు, పశువులు …………… సుఖంగా జీవించాలంటే ప్రకృతి పట్ల మన ఆచరణ ఎట్లా వుండాలి ? (పది వాక్యాల్లో)

Answer:

మానవులు, పశువులు, పక్షులు, ఇతర జలచరాలు ప్రకృతిలోని జీవులన్నీ సుఖంగా జీవించాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి.
నీరు : నీటిని వృథా చేయకూడదు. వర్షపు నీటిని నిలవ చేయడానికి ఇంకుడు నీటి గుంటలు తవ్వాలి. నదులు, చెరువులు మొదలైన వాటిలోని నీటిని కలుషితం చెయ్యకూడదు. పశువులను కడగటం, బట్టలుతకటం వంటి పనులు జలాశయాల్లో చెయ్యకూడదు. మురుగునీరు, ఫ్యాక్టరీల నీరు పోవడానికి వేరే ఏర్పాట్లు చెయ్యాలి. వాడుకునే నీటిలోకి వదలకూడదు.
గాలి : ఫ్యాక్టరీలను ఊరికి దూరంగా నిర్మించుకోవాలి. జనావాసాల మధ్య ఉంటే ఆ పొగ, దుమ్ము, ధూళి వలన కాలుష్యం ఎక్కువైపోయి మనుషుల ఆరోగ్యం పాడౌతుంది. మురికి ఇల్లంతా నిండిపోతుంది.
శబ్దం : అధిక శబ్దాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇంట్లో మనం ఉపయోగించే టి.వి.లు, రేడియోలు వంటివి కూడా తక్కువ శబ్దంతో ఉపయోగించాలి. సెల్ఫోన్ల వాడకం తగ్గించటం వల్ల మనకే కాకుండా ఇతర ప్రాణులకు కూడా ప్రమాదం తప్పుతుంది. వాహనాల వినియోగం నియంత్రించాలి. దానివల్ల గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గుతుంది. ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలి. చెట్లను అధికంగా పెంచాలి. ఒక చెట్టునరికే ముందు పది చెట్లను పెంచాలి. ఇలా చేయటం వల్ల ప్రకృతిని కొంతవరకు కాపాడగలుగుతాం.

Exam Tips:

a) నీరు, గాలి, శబ్దం అనే శీర్షికల కింద విడివిడిగా రాస్తే జవాబు స్పష్టంగా ఉంటుంది.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: “పర్యావరణ పరిరక్షణ”లో అందరూ పాలు పంచుకోవాలని ఒక పోస్టరు తయారుచేయండి.

Answer:

ప్రకటన

అందరం చేయి చేయి కలుపుదాం. కాలుష్యాలకు మూలాలు తెలుసుకుందాం. వాటిని నిర్మూలిద్దాం. ప్రపంచాన్ని కాలుష్యరహితమైన స్వర్గంగా తీర్చిదిద్దుతాం. ముందడుగేయండి. పర్యావరణ పరిరక్షణలో అందరూ పాలు పంచుకోండి.

Exam Tips:

a) పోస్టరులో ఆకర్షణీయమైన నినాదం, చిత్రం, చిన్న సందేశం ఉండాలి; అనవసరపు వివరాలు వద్దు.

 

Question 2: కింది బొమ్మను చూడండి. బొమ్మ ఆధారంగా సంభాషణలు రాయండి.

Answer:

అక్కా తమ్ముళ్ళు ఆడుకుంటూ ఒక చెట్టు కిందికి చేరారు.
తమ్ముడు : అక్కా! అదిగో నువ్వు పట్టుకోవాలన్న సీతాకోకచిలుక.
అక్క : ఔను. ఉండు ఇప్పుడే పట్టుకుంటా……… దొరకలేదురా.
తమ్ముడు : పోనీలే అక్కా! హాయిగా ఎగరనీ.
చెట్టు : పిల్లలూ ఆడుకుంటున్నారా ?
అక్క : ఎవరది ? చెట్టుతల్లా!
తమ్ముడు : అవునమ్మా! ఆడుకుంటున్నాం.
అక్క : అమ్మా! ఈ దెబ్బలేంటి ?
చెట్టు : ఇందాక కొంతమంది అల్లరి పిల్లలు నామీద రాళ్ళు విసిరారు.
తమ్ముడు : అయ్యో! నొప్పిగా ఉందా ?
చెట్టు : లేదులే. మీరు చాలా మంచివాళ్ళు. మీకు నేనంటే చాలా ఇష్టం. ఇవిగో ఈ పళ్ళు తీసుకోండి.
అక్క : ఇప్పుడెందుకులేమ్మా!
చెట్టు : తీసుకోండమ్మా! ఫరవాలేదు. నేను వీటిని మోసేది మీలాంటి వాళ్ళకోసమే. మీకు కావలసినన్ని తినండి. మిగతావి ఇంటికి తీసుకుపోండి.
అక్క, తమ్ముడు : ధన్యవాదాలు చెట్టుతల్లీ! వస్తాము. టాటా.

Exam Tips:

a) సంభాషణ రూపంలో పాత్రల పేరు తరువాత ‘:’ పెట్టి రాయండి; బొమ్మలో ఉన్న పాత్రలనే వాడండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది పదాలు చూడండి. వీటికి అదే అర్థం వచ్చే పదాలను పాఠం ఆధారంగా రాయండి.
తొందరగా, దురాక్రమణ, శబ్దాలు, సంతోషం, కాలువలు, ఇంతకుముందు కాలం, ప్రాణులు, పిల్లవాళ్లు, వాహనాలు, వేగంగా పోవడం

Answer:

(అ) తొందరగా – జల్ది
(ఆ) దురాక్రమణ – కబ్జా
(ఇ) శబ్దాలు – చప్పుళ్ళు
(ఈ) సంతోషం – సంబరం
(ఉ) కాలువలు – నదులు
(ఊ) ఇంతకుముందు కాలం – తాతలనాడు, మునుపు
(ఋ) ప్రాణులు – జీవులు
(ౠ) పిల్లవాళ్లు – పోరగాళ్ళు
(ఎ) వాహనాలు – మోటార్లు
(ఏ) వేగంగా పోవడం – బర్రురుబర్రురున పోవటం

Exam Tips:

a) పాఠంలోని మాండలిక పదాలకు (జల్ది, కబ్జా, చప్పుళ్ళు) సమానార్థక పదాలను పాఠం నుంచే వెతికి రాయండి.

 

Question 2: కింది పదాలలో భిన్నమైన పదాన్ని గుర్తించి గీతగీయండి.
(అ) పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క
(ఆ) బావులు, నదులు, సముద్రాలు, చెరువులు
(ఇ) కారు, స్కూటర్, సైకిలు, లారీ
(ఈ) బీడిపొగ, వాహనాల పొగ, సాంబ్రాణి పొగ, ఫ్యాక్టరీ పొగ

Answer:

(అ) కుక్క (పులి, సింహం, ఎలుగుబంటి అడవి జంతువులు; కుక్క పెంపుడు జంతువు)
(ఆ) బావులు (నదులు, సముద్రాలు, చెరువులు ఉపరితల నీటి వనరులు; బావులు భూగర్భ జలాన్ని ఇస్తాయి)
(ఇ) సైకిలు (మిగిలినవి ఇంధనంతో నడిచి పొగను వదులుతాయి)
(ఈ) సాంబ్రాణి పొగ (మిగిలినవి హానికరమైన కాలుష్యాన్ని కలిగించే పొగలు)

Exam Tips:

a) భిన్నమైన పదాన్ని గుర్తించినప్పుడు ఎందుకు భిన్నమో ఒక కారణం కూడా చెప్పండి.

 

Question 3: కింది పట్టికను చదివి అందులోని ప్రకృతి – వికృతులను రాయండి.

Answer:

అటవి – అడవి
ఆశ – ఆస
శబ్దం – సద్దు
రాత్రి – రాతిరి
సింహం – సింగం
శక్తి – సత్తువ
కుంభము – కుండ

Exam Tips:

a) ప్రకృతి పదం ముందు, వికృతి పదం తరువాత రాయండి (ఉదా: అటవి – అడవి, రాత్రి – రాతిరి).

 

Question 4: పాఠంలోగల ఆంగ్ల పదాలను, వాటి అర్థాలను రాయండి.

Answer:

డాక్టర్ – వైద్యుడు
ఫీట్లకు ఫీట్లు – అడుగులకు అడుగులు
మోటర్లు – వాహనాలు
రోడ్లు – వీధులు
సిమెంట్ – సిమెంటు
ఫ్యాక్టరీలు – కర్మాగారాలు
ప్లాస్టిక్ – ప్లాస్టిక్
సిగరెట్సు – పొగ పీల్చేకాడ
టి.వి. – దూరదర్శిని
సౌండ్ – శబ్దం
బోర్లు – పంపులు
డి.జె. సౌండ్సు – స్పీకర్ల శబ్దాలు
సెల్ – సెల్ఫోన్
రింగవటం – మోగటం
సిగ్నల్స్ – తరంగాలు
సెల్టవర్లు – సెల్ తరంగాల కోసం కట్టిన స్తంభాలు
పేపర్లు – వార్తాపత్రికలు
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ – రసాయనాలు కలిపిన సున్నం లాంటిది

Exam Tips:

a) ఆంగ్ల పదానికి ఎదురుగా దాని తెలుగు అర్థాన్ని జతగా రాయండి; స్పెల్లింగ్ తప్పులు రాకుండా చూడండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది ఖాళీలను విభక్తులతో పూరించండి. విభక్తుల పేర్లు రాయండి.

Answer:

(అ) రాజు సేనలతో వచ్చాడు. (తృతీయా విభక్తి)
(ఆ) దొంగతనం చేయడం కంటె పేదవానిగా ఉండటం మేలు. (పంచమీ విభక్తి)
(ఇ) వృద్ధులను ఆదరించాలి. (ద్వితీయా విభక్తి)
(ఈ) దొంగల కొరకు పోలీసులు గాలిస్తున్నారు. (చతుర్థీ విభక్తి)

Exam Tips:

a) వాక్యంలో ఉన్న ప్రత్యయాన్ని (తో, కంటె, ను, కొరకు) గమనిస్తే విభక్తి సులభంగా తెలుస్తుంది: తో – తృతీయ, కంటె – పంచమి, ను – ద్వితీయ, కొరకు – చతుర్థి.

 

Question 2: కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాసం పేరు రాయండి.
(అ) కృష్ణార్జునులు
(ఆ) శివకేశవులు
(ఇ) నిరాశానిస్పృహలు
(ఈ) భయాందోళనలు
(ఉ) న్యాయాన్యాయాలు

Answer:

(అ) కృష్ణార్జునులు = కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం
(ఆ) శివకేశవులు =శివుడును, కేశవుడును – ద్వంద్వ సమాసం
(ఇ) నిరాశానిస్పృహలు = నిరాశయును, నిస్పృహయును – ద్వంద్వ సమాసం
(ఈ) భయాందోళనలు = భయమును, ఆందోళనయును – ద్వంద్వ సమాసం
(ఉ) న్యాయాన్యాయాలు = న్యాయమును, అన్యాయమును – ద్వంద్వ సమాసం

Exam Tips:

a) ‘ఉం’ ‘ను’ చేర్చి విగ్రహవాక్యం రాయండి; రెండు పదాలకు సమాన ప్రాధాన్యం ఉంటే ద్వంద్వ సమాసం.

 

Question 3: కింది పదాలను విడదీసి రాయండి.
(అ) నీవెక్కడ
(ఆ) లేకుంటె
(ఇ) మరేమి
(ఈ) రామాలయం

Answer:

(అ) నీవెక్కడ = నీవు + ఎక్కడ
(ఆ) లేకుంటె = లేక + ఉంటె
(ఇ) మరేమి = మరి + ఏమి
(ఈ) రామాలయం = రామ + ఆలయం

Exam Tips:

a) సంధి విడదీసేటప్పుడు మొదటి పదం చివరి అచ్చు, రెండో పదం మొదటి అచ్చు ఏమిటో గుర్తించండి.

 

Question 4: కింది పదాలను కలిపి రాయండి.
(అ) మేన + అత్త
(ఆ) మనసు + ఐన
(ఇ) ఏమి + అంటివి
(ఈ) దేవ + ఇంద్రుడు

Answer:

(అ) మేన + అత్త = మేనత్త
(ఆ) మనసు + ఐన = మనసైన
(ఇ) ఏమి + అంటివి = ఏమంటివి
(ఈ) దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు

Exam Tips:

a) రెండు పదాలు కలిపేటప్పుడు ఒక అచ్చు లోపిస్తుంది (మేన + అత్త = మేనత్త); తుది రూపాన్ని సరిగ్గా రాయండి.

 

Question 5: కింద ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి. భాషాభాగాల పేర్లను రాయండి. (అతను, కమ్మగా, కొబ్బరికాయ, వెళ్ళి, అబ్బా)

Answer:

ఉదా : శంకర్ పామును చూసి అమ్మో! అంటూ పరుగెత్తాడు. (అవ్యయం)
(అ) రాధ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. (నామవాచకం)
(ఆ) అమ్మ చేసిన పాయసం కమ్మగా ఉన్నది. (విశేషణం )
(ఇ) గోపాలు డాక్టరే కాదు, అతను యాక్టరు కూడా. (సర్వనామం)
(ఈ) నవీన్ బాసరకు వెళ్ళి సరస్వతీ దేవిని దర్శించుకున్నాడు. (క్రియ)
(ఉ) రవి ఉరుకుతూ కిందపడి అబ్బా! అని అరిచాడు. (అవ్యయం)

Exam Tips:

a) ఇచ్చిన పదం వాక్యంలో ఏ పని చేస్తుందో చూడండి: పేరు – నామవాచకం, పని – క్రియ, గుణం – విశేషణం, నామానికి బదులు – సర్వనామం, ఆశ్చర్యం – అవ్యయం.

 

ప్రాజెక్టు పని

Question 1: పర్యావరణానికి సంబంధించిన పాటలను, కవితలను లేదా గేయాలను సేకరించండి. తరగతిలో ప్రదర్శించండి.

Answer:

1. ప్రాజెక్టు శీర్షిక : పర్యావరణానికి సంబంధించిన పాటలను, కవితలను, గేయాలను సేకరించి, నివేదిక రాసి ప్రదర్శించడం.
2. సమాచార సేకరణ
అ) సమాచారం సేకరించిన తేది : ……………
ఆ) సమాచార వనరు : వివిధ వార్తా పత్రికలు.
3. సేకరించిన విధానం : వివిధ వార్తా పత్రికలను చదివి వాటిలో పర్యావరణానికి సంబంధించిన కవితలు సేకరించడం జరిగింది
4. నివేదిక:
నీరు : జలకన్యను నేను జీవ జల రమ్యను నేను
స్వచ్ఛ వారి ధారలతో జగతికి జీవనమిచ్చే
మీరు వాడిన మురికి నీటికి, వేరుదారులు చూపకుండా స్వచ్ఛమగు నా ప్రవాహమ్మును, కలుషితమొనరించుచుంటిరి ప్రాణములు నిలబెట్టు జలము, ప్రాణములనే తీయుచుండిన జలచరములకు చలన మెక్కడ, మనుషులకు మనుగడ అదెక్కడ.
చెట్లు : ఇంటికి చుట్టూ మొక్కలు పెంచిన, పచ్చదనమదే పచ్చని ధనము బాటల ప్రక్కన మొక్కలు నాటండి, నీడనిచ్చును హాయిని గొలుపును ఒక్క చెట్టును నరుకగోరిన, ముందుగనే పది మొక్కలు నాటుడు వనములను నువ్వు పరిరక్షింపుము, వనములే నిన్ను పరిరక్షించును
గాలి : అయ్యయ్యో! ఏమిటి ఈ విపరీతం ?, కుప్పలు తెప్పలుగ కూలు జనసందోహం అంతులేని ఈ పొగతో ఊపిరాడటం లేదు, దుర్వాసనలకు అబ్బా! వికారమ్ము కలుగుతోంది శాస్త్రజ్ఞులందరూ జట్లుగా చేరి, వారి మేధస్సును మధనము చేసి కాలుష్యమును బాప కంకణము గట్టి, జీవజలముల కలుషరహితముగ జేసి ప్రాణవాయువులను రక్షింపగలుగు, పర్యావరణ సమతౌల్యమును గాచి ఎల్లజీవులు సౌఖ్యమును గాంచునట్టి, పథకాల నాలోచనము చేయవలయు ప్రకృతి సంపదలను పెంపొందజేసి పూర్వ శోభను మరల చేకూర్చవలయు.
అప్పుడే మన ప్రకృతి సురక్షితమౌతుంది.
5. ముగింపు : పై కవితల ద్వారా పర్యావరణానికి మనం చేస్తున్న హాని గురించి తెలుసుకున్నాను. ప్రకృతిని మనం రక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యం అని అర్థం చేసుకున్నాను.

Exam Tips:

a) ప్రాజెక్టు శీర్షిక, సమాచార వనరు, పద్ధతి, నివేదిక, ముగింపు అనే క్రమాన్ని పాటించండి.

 

Question 2: అడవులు / పశువులు / పక్షులు / చెరువులు / నేలతల్లి / బావుల గొప్పతనాన్ని తెలిపే వ్యాసాలను సేకరించండి.

Answer:

పశువులు
పశువులు మన నిత్యజీవితంలో ఒక భాగం. గొడ్డూగోదా పిల్లామేకా తో ఇళ్ళు కళకళలాడుతాయి అంటారు. వెనుకటి రోజులలో పశువులను కొట్టంలో కట్టేసి దూడలను తాము పడుకొనే మంచం కోడుకి కట్టేసుకొని దానికి ఊసులు చెబుతూ పడుకొనేవారు. పిల్లతో సమంగా కుటుంబ సభ్యులలాగా ప్రేమగా చూసుకొనేవారు. పశువులు కూడా ఆ ప్రేమకు తగ్గట్టే మనుషులకు ఉపయోగపడుతూ సేవ చేసేవి. పసిపిల్లలు పశువుల చుట్టూ తిరుగుతున్నా వాళ్ళనేమీచెయ్యవు. అలా మంచిమనసుతో యజమానులకు సహాయపడుతుండేవి.
వ్యవసాయంలోనూ బండ్లను లాగడంలోనూ బరువులు లాగటానికి ఎడ్లు సహాయపడేవి. పాడి పశువులు పెట్టిన మేత తింటూ పాలు ఇచ్చేవి. ఆవు ఇంట్లో ఉందంటే ఆరోగ్యం. అష్టశ్వర్యాలూ ఉన్నట్లే. ఈ పశువుల పేడ పొలాలకు ఎరువుగాను, పొయ్యిలోకి పిడకలు గాను పనికి వచ్చేది. పాలు పాల పదార్థాలు మనకు బలమైన ఆహారం కదా! ఇలా పశువులు మనకెంతో ప్రయోజనకరమైన స్నేహితులు.

Exam Tips:

a) వ్యాసంలో ప్రారంభం, ప్రయోజనాలు, ముగింపు ఉండేలా చూడండి.

 

ముఖ్యమైన ప్రశ్నలు

Question 1: జీవరాసులు ఎందుకు అంతరించిపోతున్నాయి?

Answer:

సెల్టవర్ల నుండి ఫోన్లకు వచ్చే సిగ్నల్స్ వల్ల ఆ తరంగ శక్తిని తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నాయి. మనిషి తన అవసరాల కోసం, నివాసాల కోసం అడవులు నరికేయడం వల్ల జంతువులు, పక్షులు నీడను కోల్పోయి క్రమంగా మాయమౌతున్నాయి. చెరువుల్లో, బావుల్లో నీరు లేకపోవడం వల్ల, ఉన్న నీరు కలుషితం కావడం వల్ల కొన్ని జలచరాలు పూర్తిగా కనబడకుండా పోయాయి. వీటి నాశనానికి మూలకారణం మానవులే.

Exam Tips:

a) కారణాలను మూడు భాగాలుగా రాయండి: సెల్‌టవర్ల సిగ్నల్స్, అడవుల నరికివేత, నీటి కొరత – కాలుష్యం.

 

Question 2: శబ్ద కాలుష్యం వల్ల ప్రమాదాలేమిటి ?

Answer:

శబ్ద కాలుష్యం వల్ల ప్రధానంగా వినే శక్తి నశిస్తుంది. మెదడు మీద ఈ శబ్దాలు ప్రభావం చూపించి ఎక్కువగా చిరాకు, కోపం వస్తుంది. చేసే పనిమీద ధ్యాస ఉండదు. నరాల్లో వణుకు, గుండెల్లో దడ లాంటివి కూడా వస్తాయి. పెద్ద పెద్ద శబ్దాలకు తట్టుకోలేక చిన్న ప్రాణులు, ముసలివారు ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంటుంది. బోరు దింపే శబ్దానికి తేళ్ళు, పాములు అదిరిపడి బైటికొచ్చేస్తాయి. ఇలా అనేక ప్రమాదాలు శబ్ద కాలుష్యం వల్ల ఎదురౌతాయి.

Exam Tips:

a) వినికిడి శక్తి నశించడం, చిరాకు, గుండె దడ, నరాల బలహీనత వంటి ప్రమాదాలను ఒక్కొక్కటిగా రాయండి.

 

Question 3: చెట్లు మనకు చేసే మేలును గురించి వివరించండి

Answer:

చెట్టు మనకు తల్లి వంటిది. తల్లి మనకు ఊపిరి ఊదుతుంది. మన సంరక్షణ చూస్తుంది. మనకు కావలసినవన్నీ ఇస్తుంది. కడుపు నింపుతుంది. సేదతీరుస్తుంది. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఔషధం ఇస్తుంది. పైన చెప్పిన సేవలన్నీ మనకు చెట్ల వల్ల లభిస్తాయి. చెట్లవల్ల ప్రాణవాయువు లభిస్తుంది. చెడు వాయువులను కాలుష్యాన్ని చెట్లు పీల్చుకొని మనను బతికిస్తాయి.
ఇంటికి కావలసిన కలప, వంటకు కావలసిన కట్టె సమస్తం చెట్ల నుండి లభిస్తాయి. తినడానికి కాయలు, పండ్లు, ఆకులు మొదలైనవన్నీ ప్రేమగా అందిస్తాయి. మన కడుపునింపి ఆకలి తీరుస్తాయి. చల్లని నీడనిచ్చి, గాలినిచ్చి సేదతీరుస్తాయి. ఎన్నో చెట్లలో ఔషధగుణాలుంటాయి. వాటివల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుతాయి. వరదలను ఆపుతాయి. వానలను కురిపిస్తాయి. పశువులకు నీడను, గూడును ఇస్తాయి. ఆహారాన్నిస్తాయి. ఇలా ఎన్నో విధాలుగా చెట్లు మనకు మేలు చేస్తున్నాయి.

Exam Tips:

a) చెట్ల వల్ల ప్రాణవాయువు, కలప, ఆహారం, నీడ, ఔషధాలు, వానలు – అన్నింటినీ ప్రస్తావించండి.

 

పదజాలం – సరైన సమాధానాన్ని గుర్తించండి

Question 1: పండుగ సంబురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గీతగీచిన పదానికి అర్థం …………………..
(A) చుక్కలు
(B) ధరలు
(C) మేడలు
(D) సంతోషాలు

Answer:

(D) సంతోషాలు

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 2: ఎన్నో వేల ఏండ్ల చరిత్ర మనది. ‘ఏండ్లు’ అంటే ………………..
(A) ఏడు రోజులు
(B) సంవత్సరాలు
(C) పాత
(D) కొత్త

Answer:

(B) సంవత్సరాలు

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 3: వాన పడగానే పిల్లలు బయటికి ఉరికారు. ‘ఉరికారు’ అర్థం
(A) తడిశారు
(B) ఎగిరారు
(C) పరుగెత్తారు
(D) చూశారు

Answer:

(C) పరుగెత్తారు

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 4: ఇవాళ మా దోస్తు వస్తున్నాడు. ‘దోస్తు’ అనే పదానికి అర్థం ………….
(A) తమ్ముడు
(B) మిత్రుడు
(C) బంధువు
(D) పిల్లవాడు

Answer:

(B) మిత్రుడు

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 5: సంబురాలు, సంతోషాలు అనే మాటలకు సమానార్థక పదం ………..
(A) ఆనందాలు
(B) ఊరేగింపులు
(C) పెండ్లిళ్ళు
(D) సంతలు

Answer:

(A) ఆనందాలు

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 6: సింహాన్ని మృగరాజు అంటారు. కేసరి అంటే అందరికీ భయం ఈ వాక్యాల్లో ఒకే అర్థాన్నిచ్చే మాటలు ……………….
(A) సింహం, కేసరి, భయం
(B) మృగరాజు, అందరు, భయం
(C) సింహం, మృగరాజు, కేసరి
(D) కేసరి, భయం

Answer:

(C) సింహం, మృగరాజు, కేసరి

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 7: రామప్ప చెరువు పెద్ది. ఆ కోనేరు అందమైంది గీతగీచిన పదాలకు సమానమైన అర్థాన్నిచ్చే పదం ………………..
(A) సముద్రం
(B) వాగు
(C) మడుగు
(D) గుడి

Answer:

(C) మడుగు

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 8: ‘పశువు’ అనే పదానికి వికృతి.
(A) పసువు / పసరం
(B) పాషాణం
(C) పస
(D) మృగం

Answer:

(A) పసువు / పసరం

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 9: ‘ఆస’ అనే వికృతి పదానికి తగిన ప్రకృతి ………………..
(A) కోరిక
(B) ఆశ
(C) ఆకసం
(D) ఆశయం

Answer:

(B) ఆశ

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

Question 10: గ్రంథాలయంలో శబ్దం చేయకూడదు. శబ్దానికి వికృతి …………..
(A) సద్దు
(B) శబుదం
(C) సబ్బుదం
(D) సబ్బు

Answer:

(A) సద్దు

Exam Tips:

a) ఇచ్చిన నాలుగు ఎంపికలలో అర్థం, వికృతి లేదా పర్యాయపదానికి సరిపోయేదానిని పాఠంలో వచ్చిన పదాల ఆధారంగా ఎంచుకోండి.

 

వ్యాకరణం – సరైన సమాధానాన్ని గుర్తించండి

Question 1: ‘అచ్చులు’ అంటే
(A) ‘క’ నుండి ‘ఱ’ వరకు గల అక్షరాలు
(B) ఊష్మాలు
(C) య, ర, ల వ లు
(D) ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అక్షరాలు

Answer:

(D) ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అక్షరాలు

Exam Tips:

a) అచ్చులు ‘అ’ నుండి ‘ఔ’ వరకు; హల్లులు ‘క’ నుండి ‘ఱ’ వరకు – ఈ తేడా గుర్తుంచుకోండి.

 

Question 2: ‘క’ నుండి ‘ఱ’ వరకుండే అక్షరాలను ఏమంటారు ?
(A) అచ్చులు
(B) హల్లులు
(C) ఉభయాక్షరాలు
(D) వర్ణాక్షరాలు

Answer:

(B) హల్లులు

Exam Tips:

a) హల్లుల సంఖ్య, అచ్చుల సంఖ్య స్థిరంగా గుర్తుంచుకోండి.

 

Question 3: ఒక హల్లు అదే హల్లు ఒత్తుతో కలిస్తే అది …………………
(A) సంయుక్తాక్షరం
(B) ద్విత్వాక్షరం
(C) ద్వంద్వం
(D) సమాసం

Answer:

(B) ద్విత్వాక్షరం

Exam Tips:

a) ఒకే హల్లు ఒత్తుతో కలిస్తే ద్విత్వం (అమ్మ), వేర్వేరు హల్లులైతే సంయుక్తం (కృష్ణ).

 

Question 4: సంయుక్తాక్షరంలో ఉండే రెండు హల్లులు ……………
(A) ఒక్కటే
(B) వేర్వేరు
(C) సమానం
(D) ఒకే ధ్వని

Answer:

(B) వేర్వేరు

Exam Tips:

a) సంయుక్తాక్షరంలో రెండు వేర్వేరు హల్లులు ఉంటాయి.

 

Question 5: క్రిందివానిలో ‘త’ వర్గాక్షరాలు
(A) క,చ, ట, త, ప
(B) గ, జ, డ, ద, బ
(C) త, థ, ద, ధ, న
(D) త, ద, న, ప, బ

Answer:

(C) త, థ, ద, ధ, న

Exam Tips:

a) క, చ, ట, త, ప వర్గాల చివరి అక్షరాలను (త, థ, ద, ధ, న) గుర్తుంచుకోండి.

 

Question 6: ఒక మాత్ర కాలంలో పలికే అక్షరాలు
(A) హ్రస్వాలు
(B) దీర్ఘాలు
(C) ఉభయబక్షాలు
(D) శ్లేషాలు

Answer:

(A) హ్రస్వాలు

Exam Tips:

a) హ్రస్వానికి ఒక మాత్ర, దీర్ఘానికి రెండు మాత్రలు.

 

Question 7: దీర్ఘాక్షరాలు పలకడానికి పట్టేకాలం
(A) ఒక మాత్రకాలం
(B) రెండు మాత్రల కాలం
(C) మూడు మాత్రల కాలం
(D) 4 మాత్రల కాలం

Answer:

(B) రెండు మాత్రల కాలం

Exam Tips:

a) దీర్ఘాక్షరాలకు రెండు మాత్రల కాలం పడుతుంది.

 

Question 8: క్రింది వాటిలో మహా ప్రాణాలు ……………..
(A) క, చ, ట, త, ప
(B) గ, జ, డ, ద, బ
(C) ఖ, ఛ, ఠ, థ, ఫ
(D) ఙ, ఞ, ణ, న, మ

Answer:

(C) ఖ, ఛ, ఠ, థ, ఫ

Exam Tips:

a) ప్రతి వర్గంలో రెండో, నాలుగో అక్షరాలు మహాప్రాణాలు.

 

Question 9: య, ర, ల, వ లను అంటారు. …………….
(A) ఊష్మాలు
(B) వర్ణాక్షరాలు
(C) అచ్చులు
(D) అంతస్థాలు

Answer:

(D) అంతస్థాలు

Exam Tips:

a) య, ర, ల, వ లను అంతస్థాలు అంటారు.

 

Question 10: గ, జ, డ, ద, బ లను ……….. అంటారు.
(A) పరుషాలు
(B) సరళాలు
(C) అంతస్థాలు
(D) ‘గ’ వర్ణాక్షరాలు

Answer:

(B) సరళాలు

Exam Tips:

a) ప్రతి వర్గంలో మూడో అక్షరాలు (గ, జ, డ, ద, బ) సరళాలు.

 

Question 11: క, చ, ట, త, ప లు
(A) కఠినాలు
(B) సులభాలు
(C) పరుషాలు
(D) సరళాలు

Answer:

(C) పరుషాలు

Exam Tips:

a) ప్రతి వర్గంలో మొదటి అక్షరాలు (క, చ, ట, త, ప) పరుషాలు.

 

Question 12: పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసేవి
(A) అక్షరాలు
(B) వాక్యాలు
(C) విభక్తులు
(D) అవ్యయాలు

Answer:

(C) విభక్తులు

Exam Tips:

a) విభక్తులు పదాల మధ్య సంబంధాన్ని సూచిస్తాయి.

 

Question 13: ప్రతి విభక్తికీ ………. ఉంటుంది.
(A) ప్రత్యయం
(B) పరుషం
(C) క్రియ
(D) అవ్యయం

Answer:

(A) ప్రత్యయం

Exam Tips:

a) ప్రతి విభక్తికి ఒక ప్రత్యయం ఉంటుంది.

 

Question 14: పండ్లు బలాన్నిస్తాయి. గీతగీసిన అక్షరంలోని ధ్వనులు
(A) డ, ల
(B) డు, ల
(C) డు, లు
(D) డ్, ల్, ఉ

Answer:

(D) డ్, ల్, ఉ

Exam Tips:

a) అక్షరాన్ని హల్లు + అచ్చుగా విడదీసి ధ్వనులను లెక్కించండి.

 

Question 15: అమ్మమ్మ. ‘మ్మ’ లోని హల్లులు
(A) మ, మ
(B) మ్, మ్
(C) మ, అ
(D) మ్, మ్, అ

Answer:

(D) మ్, మ్, అ

Exam Tips:

a) సంయుక్త అక్షరంలోని ధ్వనులను విడివిడిగా చెప్పి చివరి అచ్చును మరవకండి.

 

Question 16: వద్దు + అంటూ ……………. కలిపి రాస్తే
(A)వద్దుంటూ
(B) వద్దంటూ
(C) వద్దింటి
(D) వద్దని

Answer:

(B) వద్దంటూ

Exam Tips:

a) ఉకారం లోపించి కలిసే సంధి రూపాన్ని గమనించండి (వద్దు + అంటూ = వద్దంటూ).

 

Question 17: ‘పోతున్నవట’ విడదీస్తే ……….
(A) పోత + ఉన్నవట
(B) పోతన్న + అట
(C) పోతున్నవు + అట
(D) పోతు + ఉన్నది + అట

Answer:

(C) పోతున్నవు + అట

Exam Tips:

a) పదాన్ని విడదీసి, కలిపి చూస్తే సరైన రూపం తెలుస్తుంది.

 

Question 18: ‘మరిప్పుడు’ సంధి విడదీస్తే …………….
(A) మరి + ప్పుడు
(B) మరి + ఇప్పుడు
(C) మరి + ఎప్పుడు
(D) మరి + అప్పుడు

Answer:

(B) మరి + ఇప్పుడు

Exam Tips:

a) ఇకార సంధి: మరి + ఇప్పుడు = మరిప్పుడు.

 

Question 19: తిప్పన్న పోతన్నలు ………….సమాసానికి విగ్రహ వాక్యం
(A) తిప్పన్న అనెడి పోతన్న
(B) తిప్పన్న మరియు పోతన్న
(C) తిప్పన్న తమ్ముడు పోతన్న
(D) ఇద్దరు అన్నదమ్ములు

Answer:

(B) తిప్పన్న మరియు పోతన్న

Exam Tips:

a) ద్వంద్వ సమాసానికి విగ్రహవాక్యం ‘… మరియు …’ అనే రూపంలో ఉంటుంది.

 

Question 20: ‘కాళ్ళు చేతులు’ అనే పదానికి విగ్రహ వాక్యం
(A) కాలు, చేయి
(B) కాళ్ళ వంటి చేతులు
(C) కింద కాళ్ళు, పైన చేతులు
(D) కాళ్ళు అనెడి చేతులు

Answer:

(A) కాలు, చేయి

Exam Tips:

a) ద్వంద్వ సమాసంలో రెండు పదాలను ‘ను / యు’ తో కలిపి విగ్రహవాక్యం రాస్తారు.

 

Question 21: ‘సాధువులు మరియు సజ్జనులు’ – సమాసంగా కూరిస్తే
(A) సాధువు వెంట సజ్జనుడు
(B) సాధువు యొక్క సజ్జనుడు
(C) సాధుసజ్జనులు
(D) సాధువుల్లో సజ్జనులు

Answer:

(C) సాధుసజ్జనులు

Exam Tips:

a) ద్వంద్వ సమాసంగా కూర్చేటప్పుడు రెండు పదాలను కలిపి రాయండి.

 

కింది పేరాను చదివి వాక్యాలలోని తప్పు / ఒప్పులను గుర్తించండి

Question 1: కుతుబ్షాహి వంశంలోని నాలుగోరాజు మహమ్మద్ కులీకుతుబ్షా కాలంలోనే నేటి హైదరాబాదు నగరం నిర్మితమయింది. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్టచివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా ఎంతో ఉత్తముడై తన ప్రజలందర్నీ చక్కగా పాలించి తానాషా అనే బిరుదు పొందాడు. తానాషా అంటే మంచి రాజు అని అర్థం. తానాషానే తానీషా అని కూడా అంటారు.
1. కుతుబ్షాహి వంశంలోని నాల్గవరాజు తానాషా.
2. కులీకుతుబ్షా కాలంలోనే హైదరాబాదు నిర్మితమయింది.
3. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చివరిరాజు అబుల్ హసన్ కుతుబ్షా.
4. తానాషా అంటే దుర్మార్గుడైన రాజు.
5. కులీ కుతుబ్షా తానాషా బిరుదు పొందాడు.

Answer:

1. కుతుబ్షాహి వంశంలోని నాల్గవరాజు తానాషా. (తప్పు)
2. కులీకుతుబ్షా కాలంలోనే హైదరాబాదు నిర్మితమయింది. (ఒప్పు)
3. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చివరిరాజు అబుల్ హసన్ కుతుబ్షా. (ఒప్పు)
4. తానాషా అంటే దుర్మార్గుడైన రాజు. (తప్పు)
5. కులీ కుతుబ్షా తానాషా బిరుదు పొందాడు. (తప్పు)

Exam Tips:

a) ప్రతి వాక్యాన్ని పేరాతో సరిపోల్చి ఒప్పో తప్పో నిర్ణయించండి; ప్రతి జవాబుకు కారణం పేరాలోనే ఉంటుంది.

 

కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి

అన్ని దానములను నన్న దానమె గొప్ప
కన్న తల్లి కంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ!

Question 1: అన్నింటి కంటే గొప్ప దానమేది ?

Answer:

అన్నింటి కంటే గొప్పదానం – అన్నదానం.

Exam Tips:

a) పద్యంలో మొదటి పాదంలోనే సమాధానం ఉంటుంది.

 

Question 2: జ్ఞానం ప్రసాదించేది ఎవరు ?

Answer:

జ్ఞానం ప్రసాదించేది – గురువు

Exam Tips:

a) పద్యంలో గురువును గురించిన పాదాన్ని చూడండి.

 

Question 3: కవి ఉన్నత స్థానం ఎవరికిచ్చారు ?

Answer:

కన్న తల్లికి

Exam Tips:

a) పద్యంలో ఘనత ఇచ్చిన వ్యక్తిని రెండో పాదం చెబుతుంది.

 

Question 4: పై పద్యం ద్వారా ఏమి తెలుస్తున్నది ?

Answer:

అన్నదానము కంటే, కన్నతల్లి కంటే, గురువు కంటే ఎవరూ ఎక్కువ కాదు.

Exam Tips:

a) పద్యం భావాన్ని ఒక వాక్యంలో చెప్పండి: అన్నదానం, తల్లి, గురువుల గొప్పతనం.

 

Question 5: పై పద్యం ఏ శతకంలోనిది ?

Answer:

వేమన శతకం లోనిది.

Exam Tips:

a) మకుటం (విశ్వదాభిరామ వినురవేమ!) ఆధారంగా శతకం పేరు చెప్పవచ్చు.

 

క్రింది పద్యాన్ని చదివి సరియైన సమాధానాన్ని గుర్తించండి

చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగనేటికి తల్లుల కడుపు చేటు

Question 1: “కడుపు చేటు” అనే మాటకు అర్థం ……………
(A) చెడ్డ కడుపు
(B) పుట్టుక దండగ
(C) తల్లులకు బాధ

Answer:

(B) పుట్టుక దండగ

Exam Tips:

a) పద్యాన్ని మరొకసారి చదివి దాని భావానికి సరిపోయే ఎంపికనే ఎంచుకోండి.

 

Question 2: శివ పూజ ఎలా చేయాలి ?
(A) చేతులు ఆనించి
(B) చేతులు పట్టుకుంటూ
(C) చేతులతో తృప్తి కలిగేటట్లు

Answer:

(C) చేతులతో తృప్తి కలిగేటట్లు

Exam Tips:

a) పద్యాన్ని మరొకసారి చదివి దాని భావానికి సరిపోయే ఎంపికనే ఎంచుకోండి.

 

Question 3: దయను, సత్యాన్ని ఎట్లా తలచాలి
(A) మనసులో
(B) లోపల
(C) బయట

Answer:

(A) మనసులో

Exam Tips:

a) పద్యాన్ని మరొకసారి చదివి దాని భావానికి సరిపోయే ఎంపికనే ఎంచుకోండి.

 

Question 4: నోరారా హరి కీర్తిని …………..
(A) పాడాలి
(B) పలకాలి
(C) అరవాలి

Answer:

(B) పలకాలి

Exam Tips:

a) పద్యాన్ని మరొకసారి చదివి దాని భావానికి సరిపోయే ఎంపికనే ఎంచుకోండి.

 

Question 5: పద్యానికి శీర్షిక ………
(A) శివభక్తి
(B) కీర్తన
(C) కడుపు చేటు

Answer:

(C) కడుపు చేటు

Exam Tips:

a) పద్యాన్ని మరొకసారి చదివి దాని భావానికి సరిపోయే ఎంపికనే ఎంచుకోండి.

 

Free study material for Telugu

TS Board Solutions for Class 6 Telugu Lesson 12 Kapadukundam (Let us protect nature)

Textbook Solutions for Class 6 Telugu Lesson 12 Kapadukundam (Let us protect nature)

Explore reliable textbook solutions for Lesson 12 Kapadukundam (Let us protect nature) tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 12 Kapadukundam (Let us protect nature) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Telugu.

FAQs

Where can I find the latest TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం for the 2026-27 session?

The complete and updated TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం will help students to get full marks in the theory paper.

Do you offer TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire TS 6th Class Telugu 12th Lesson Questions and Answers Telangana కాపాడుకుందాం in printable PDF format for offline study on any device.