Official TS Board Solutions for Class 6 Telugu: Lesson 07 Udutha Sayam (The Squirrel's Help)
Review structured textbook solutions for Class 6 Telugu Lesson 07 Udutha Sayam (The Squirrel's Help). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Chapter-wise Solutions for Telugu: Lesson 07 Udutha Sayam (The Squirrel's Help)
Access the complete solution PDF for Class 6 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
బొమ్మ చూసి చెప్పండి
Question 1: బొమ్మలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు?
Answer:
బొమ్మలో ఒక తల్లీబిడ్డ; ఒక అబ్బాయి, ఒక కళ్ళులేని వ్యక్తి; ఒక బాలుడు-బాలిక కనిపిస్తున్నారు.
Exam Tips:
a) బొమ్మలో ఉన్న వ్యక్తులను (తల్లీబిడ్డ, అబ్బాయి, కళ్ళులేని వ్యక్తి, బాలుడు-బాలిక) ఒక్కొక్కరిని పేర్కొనండి.
b) బొమ్మను జాగ్రత్తగా చూసి కనిపించినవే రాయండి.
Question 2: వారు ఏం చేస్తున్నారు ?
Answer:
తల్లికి బిడ్డ కూరలు తరగటంలో సాయం చేస్తున్నది. ఒక బాలుడు కళ్ళులేని వ్యక్తికి రోడ్డు దాటటంలో సాయం చేస్తున్నాడు. ఒక బాలుడు, బాలిక పరిసరాలు శుభ్రం చేస్తున్నారు.
Exam Tips:
a) ప్రతి వ్యక్తి చేస్తున్న సాయాన్ని వేర్వేరు వాక్యాలుగా రాయండి (కూరలు తరగడం, రోడ్డు దాటించడం, పరిసరాల శుభ్రత).
b) క్రియలను వర్తమాన కాలంలో రాయండి.
Question 3: వారు చేసే పనులవల్ల ఎవరికి మేలు జరుగుతుంది ?
Answer:
వారు చేసే పనులవల్ల వారికి, చుట్టుప్రక్కల వారికి మేలు జరుగుతుంది.
Exam Tips:
a) సాయం చేసినవారికి, సాయం పొందినవారికి ఇద్దరికీ మేలు జరుగుతుందనే విషయాన్ని చెప్పండి.
b) చుట్టుపక్కల సమాజానికి కలిగే మేలును కూడా పేర్కొనండి.
Question 4: మీరు ఎవరికి, ఎప్పుడు, ఏ సందర్భంలో సహాయం చేశారు ?
Answer:
నేను ఒకసారి, రోడ్డు దాటుతూ కింద పడిపోయిన పిల్లవాడిని స్కూటరు కింద పడకుండా తప్పించాను. అతని పెద్దలకు అప్పగించాను.
Exam Tips:
a) ఎవరికి, ఎప్పుడు, ఏ సందర్భంలో అనే మూడు అంశాలను తప్పకుండా చెప్పండి.
b) మీ నిజమైన అనుభవాన్ని సొంత మాటల్లో రాయండి.
ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ 66)
Question 1: “నిర్మల భక్తి” అంటే ఏమిటి ?
Answer:
నిర్మల భక్తి అంటే ఏ ఆలోచనలూ, కోరికలూ కోరకుండా దేవుని సన్నిధిని కోరుతూ పవిత్రంగా దేవుని మీద మనసు లగ్నం చేయడం, ప్రార్థించటం.
Exam Tips:
a) ‘నిర్మల’ అంటే కల్మషం లేని; కోరికలు లేని పవిత్ర భక్తిని ఉదాహరణతో చెప్పండి.
b) పాఠంలో ఉడుత భక్తిని ఉదాహరణగా వాడండి.
Question 2: ‘అడుగు దామరలు మనమున జేర్చి’ అంటే నీకేమి అర్థమైంది ?
Answer:
అడుగు దామరలు అంటే పాద పద్మములు. దేవుని పూజించేటప్పుడు పూలుగాని, అక్షతలుగాని దేవుని పాదాల ముందే ఉంచుతాము. అందుకే భక్తి అనగానే పాదాలే గుర్తుకొస్తాయి. అటువంటి పాదపద్మాలను మనసులో తలచుకోవటం అని అర్థం.
Exam Tips:
a) ‘అడుగు దామరలు’ అంటే పాదపద్మాలని చెప్పి, వాటిని మనసులో నిలుపుకోవడం భక్తికి సంకేతమని వివరించండి.
b) పూజలో పాదాలకు పూలు సమర్పించే ఆచారాన్ని ప్రస్తావించండి.
Question 3: ఉడుత నీళ్ళలో మునిగి ఇసుకలో పొర్లాడి వేగంగా వచ్చి కట్టపై రాలుస్తున్నది కదా! అట్లా ఎందుకు చేయాలని అనుకున్నది?
Answer:
నీళ్ళలో తడిసిన ఒంటికి ఎక్కువ ఇసుక అంటుకుంటుంది. వారధి కట్టే రాళ్ళమీద తనకు చేతనైనంత ఇసుక పోద్దామనుకుంది ఉడుత. అందుకే తడి ఒంటికి ఇసుక అంటించుకొంది. వేగంగా అని ఎందుకన్నారంటే నిదానంగా వెళితే దారిలోనే ఇసుక రాలిపోతుందేమోనని ఉడుత అలా చేసింది.
Exam Tips:
a) ఇసుక అంటుకోవడానికి ఒళ్ళు తడిగా ఉండాలి, వేగంగా వెళితే ఎక్కువ సాయం చేయవచ్చు అనే రెండు కారణాలు చెప్పండి.
b) ‘ఎందుకు’ ప్రశ్నకు ‘కాబట్టి’ లేదా ‘అందుకే’ అని ముగించండి.
Question 4: రామలక్ష్మణుల సంభాషణ ద్వారా మీరు ఏమి గ్రహించారు ?
Answer:
రామలక్ష్మణుల సంభాషణ ద్వారా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అవగాహన అర్థమౌతుంది. ఇద్దరూ ఒకరి అభిప్రాయంతో ఒకరు ఏకీభవిస్తారు. అన్నమాటను తమ్ముడు ఎప్పుడూ కాదనడు. తమ్ముడికి రామునిపై ఎంతో భక్తి అని అర్థమౌతుంది.
Exam Tips:
a) రామునికి, లక్ష్మణునికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం, ఏకాభిప్రాయం వంటి గుణాలను వేర్వేరుగా రాయండి.
b) సంభాషణలోని మాటలను ఆధారంగా చూపండి.
Question 5: ‘ఉడుతాభక్తి’ అంటే ఏమిటి ?
Answer:
ఉడుతకు రామునిమీద అమితమైన భక్తి. ఆ భక్తితో రాముడు చేస్తున్న గొప్పపనికి తాను కూడా సాయం చెయ్యాలని ఆశపడింది. అక్కడ గొప్పగొప్ప వానరవీరులు చెట్లు, బండలు ఎంతెంతో బరువులు మోస్తున్నారు. తాను అంతచెయ్యలేక పోయినా తన చేతనైనంత సాయం చేద్దామని నీళ్ళలో మునిగి తడి ఒంటికి ఇసుక అంటించుకొని వంతెన మీద దులిపింది. ఎంత చేశామన్నది ముఖ్యం కాదు.
చేశామా లేదా అనేది ముఖ్యం. అలా శక్తికి తగినట్లు సాయంచేయడాన్ని ఉడుతాభక్తి అంటారు.
Exam Tips:
a) ఉడుతాభక్తి అంటే ‘శక్తి కొద్దీ చేసే చిన్న సాయం’ అని స్పష్టంగా నిర్వచించండి.
b) ఫలితం కంటే ప్రయత్నం ముఖ్యమనే భావాన్ని చెప్పండి.
I. విని అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: పాఠాన్ని (ద్విపదను) రాగ, భావయుక్తంగా పాడండి.
Answer:
విద్యార్థి చేయవలసిన పని.
Exam Tips:
a) ద్విపదను పాడేటప్పుడు రాగం, భావం, స్పష్టమైన ఉచ్చారణ ఉండేలా సాధన చేయండి.
b) పాఠ్య పద్యంలోని పదాల అర్థం తెలుసుకొని పాడండి.
Question 2: మీరు ఎవరికైనా సాయం చేశారా ? అప్పుడు వారు ఏవిధంగా స్పందించారు ?
Answer:
ఒకసారి నాన్నగారు నాకిచ్చిన వందరూపాయలు తీసుకొని పుస్తకం కొనుక్కుందామని వెళుతున్నాను. దారిలో ఒక ముసలివాడు జ్వరంతో వణికిపోతూ రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. దగ్గరలో ఉన్న మందుల షాపుకు వెళ్ళి జ్వరం బిళ్ళలూ, తినడానికి రొట్టె, తాగడానికి మంచినీళ్ళు తెచ్చి యిచ్చాను. వాళ్లింటిదగ్గర దింపాను. నాకెంతో ఆనందం అనిపించింది. ఆ తాత ఎంతో సంతోషించి చల్లగా ఉండమని దీవించాడు.
Exam Tips:
a) సాయం చేసిన సంఘటనను క్రమంగా (సందర్భం, చేసిన పని, అవతలివారి స్పందన) రాయండి.
b) చివరలో మీకు కలిగిన సంతృప్తిని చెప్పండి.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
Question 1: కింది అర్థం గల పద్యపాదాలు మీ పాఠంలోని పద్యాలలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆ పాదాలు రాయండి.
(అ) త్వరగా సేతువు నిర్మాణం కావాలి.
(ఆ) తన ఒంటికంటిన ఇసుకను రాలుస్తున్నది.
(ఇ) పలు విధాల పొగడి.
(ఈ) భక్తితో గడ్డిపోచంత పనిచేసినా అది కొండతో సమానం.
Answer:
(అ) గొబ్బున సేతువు కొనసాగవలయు
(ఆ) తామేను జలముల దడిపి గట్టునకు జని వేగనిసుకపై జల్లాడి తిరుగ చనుదెంచి కొండల సందున రాల్చి
(ఇ) పలుతెరంగుల జాల ప్రస్తుతి జేసి
(ఈ) భవదంఘ్రి కమలయుగ్మమును, నెవ్వడు మదినిల్పియెసగుఁ దృణంబు నవ్వేల్పుగిరి బోలు.
Exam Tips:
a) ఇచ్చిన భావానికి సరిపోయే పాదాన్ని పద్యం నుంచి యథాతథంగా, అక్షర దోషాలు లేకుండా రాయండి.
b) ఒక్క పదం తప్పినా పాదం తప్పు అవుతుంది, జాగ్రత్తగా పోల్చండి.
Question 2: కింది పద్యాన్ని చదివి సరైన జవాబును గుర్తించండి.
ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరింపంగాఁ
అపకారికి నుపకారము
నెపమెన్నక చేయువాడె నేర్పరి సుమతీ!
(అ) అపకారి : (క) కీడుచేసేవాడు (ఖ) మేలు చేసేవాడు (గ) సాహసం చేసేవాడు (ఘ) ఏదీకాదు
(ఆ) పద్యం ఎవరి గురించి తెలియపరుస్తున్నది ? (క) ఉపకారి (ఖ) మమకారం (గ) అపకారి (ఘ) నేర్పరి
(ఇ) పద్యంలో చెప్పిన గొప్ప విషయం : (క) అపకారికి ఉపకారం చేయడం (ఖ) ఉపకారికి ఉపకారం చేయడం (గ) అపకారికి అపకారం చేయడం (ఘ) ఏదీకాదు
(ఈ) పద్యంలో ‘తప్పు’ అనే అర్థం వచ్చే పదం : (క) ఎన్నక (ఖ) నెపము (గ) విపరీతము (ఘ) నేర్పరి
(ఉ) పద్య మకుటం : (క) సుమతీ (ఖ) కుమతీ (గ) మందమతి (ఘ) ఏదీకాదు
Answer:
(అ) (క) కీడుచేసేవాడు
(ఆ) (ఘ) నేర్పరి
(ఇ) (క) అపకారికి ఉపకారం చేయడం
(ఈ) (ఖ) నెపము
(ఉ) (క) సుమతీ
Exam Tips:
a) మొదట పద్యం అర్థం తెలుసుకొని, తరువాత ఒక్కొక్క ప్రశ్నకు ఎంపికలను పరిశీలించండి.
b) ‘అపకారి’ వంటి పదాల అర్థం (కీడు చేసేవాడు) గుర్తుంచుకోండి.
III. స్వీయ రచన
Question 1: తొందరగా సేతువు నిర్మాణం కొనసాగాలని ఉడుత అనుకోవడంలో గల ఉద్దేశం ఏమిటి ?
Answer:
సేతువు నిర్మాణం పూర్తయితే గాని రాముడు సైన్యంతో లంక చేరలేడు. లంకకు వెళ్ళకపోతే అక్కడ రావణుని చెరలో సీతమ్మ కష్టాలు తీర్చలేడు. దుర్మార్గుడైన రావణుని సంహరిస్తే తప్ప లోకాలకు వాని పీడ వదలదు. సీతను విడిపించుకొని తెచ్చుకోవాలంటే వనవాసం గడువుకూడా పూర్తైపోతోంది. గడువు పూర్తయ్యే లోపల అయోధ్య చేరకపోతే భరతుడు ప్రాణాలు వదులుతానని ప్రతిజ్ఞ చేశాడు. కనుక తొందరగా సేతువు నిర్మాణం పూర్తి కావాలని ఉడుత అనుకున్నది.
Exam Tips:
a) సేతువు పూర్తయితేనే రాముడు లంక చేరి సీతను రక్షించగలడనే కార్యకారణ క్రమాన్ని చెప్పండి.
b) ఐదు వాక్యాల్లో ముగించండి.
Question 2: భక్తితో చేసే చిన్నపనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సమర్థిస్తూ రాయండి.
Answer:
భక్తితో చేసిన చిన్న పనైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఉడుత రాముని మీద భక్తితో తన శక్తిమేరకు సాయం చేయాలనుకుంది. వానర వీరులు చేసే పనిలో ఉడుత చేయగలిగిన పని చాలా తక్కువ. ఐనా ఉడుత నిరాశ పడకుండా సముద్రం నీటిలో మునిగి గట్టుమీద ఇసుకలో పొర్లి వంతెన మీద ఆ ఇసుక దులిపింది. ఇక్కడ ఎంత ఇసుక మోసింది అనికాదు చూడాల్సింది. ఉడుత భక్తిని గమనించాలి. శ్రీరాముడు గమనించాడు. తన వద్దకు ఉడుతను రప్పించుకొని తన కుడి చేతితో ప్రేమగా దాని వీపు మీద నిమిరాడు. ఆయన వేళ్ళ గుర్తులు దాని వీపు మీద మూడు చారలుగా ఏర్పడ్డాయి. ఇప్పటికీ అవి ముచ్చట గొలుపుతూ శాశ్వతంగా ఉండి పోయాయి.
Exam Tips:
a) ప్రశ్నలోని వాక్యాన్ని ఉడుత ఉదాహరణతో సమర్థిస్తూ, తరువాత మరో సాధారణ ఉదాహరణ ఇవ్వండి.
b) ‘భక్తి ప్రధానం’ అనే భావంతో ముగించండి.
Question 3: రాముడు ఉడుత చేసిన సహాయాన్ని మెచ్చుకొని వీపును దువ్వాడు. అట్లాగే మీరు చేసిన సహాయాన్ని ఇతరులు మెచ్చుకొన్న సంఘటన గురించి రాయండి.
Answer:
మా నాన్నగారు నా పుట్టిన రోజున, నీ స్నేహితులందరినీ పిలుచుకో. పార్టీ ఇద్దువు గాని అన్నారు. నేను నాన్నగారి నడిగి అనాథాశ్రమంలోని పిల్లల్ని పిలిచి వారితో కలిసి పుట్టిన రోజు చేసుకున్నాను. వారందరికీ మిఠాయిలు, పళు కేకు పంచి పెట్టాను. ఆటలు ఆడుకున్నాము. వారందరికీ బహుమతిగా పెన్నులు, పుస్తకాలు ఇచ్చాను. వాళ్ళెంతో సంతోషించారు. నేను చేసిన ఈ పనికి నా తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, ఇరుగు పొరుగు వారు ఎంతో మెచ్చుకున్నారు. ఒక మంచి పని చేశానని నాకు గర్వమూ, ఆనందమూ కలిగాయి.
Exam Tips:
a) సంఘటన జరిగిన సందర్భం, మీరు చేసిన సాయం, ఇతరుల ప్రశంస అనే మూడు భాగాలుగా రాయండి.
b) వాక్యాలు ఐదుకు మించకుండా చూడండి.
Question 4: ఈ పాఠం ఆధారంగా గోన బుద్ధారెడ్డి కథ చెప్పిన విధానం ఎట్లా ఉన్నది ? వివరించండి.
Answer:
ఈ పాఠం ద్విపద ఛందస్సులో ఉన్నది. చక్కగా పాడుకోవచ్చు. ఇక కవి ఇందులో చెప్పిన కథ ఉడుత చేసిన సాయం. ఇందులో భాష భావం తేలికగా అర్థమయ్యేటట్లు తేలికైన పదాలు ఉపయోగించాడు కవి. ఉడుత చేసిన పని చదువుతుంటే ఎదురుగా జరుగుతున్నట్లే అనిపిస్తుంది. అంత స్పష్టమైన వర్ణనలు. నాకీ పాఠం ఎంతగానో నచ్చింది.
Exam Tips:
a) ద్విపద ఛందస్సు, తేలికైన భాష, కథ చెప్పిన క్రమం అనే అంశాలను విడిగా చెప్పండి.
b) ఒక్కో అంశానికి ఒక్కో వాక్యం ఉదాహరణతో రాయండి.
Question 5: ఉడుత సాయం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి.
Answer:
సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో వానరభల్లూకాలు నలుని చేతికి రాళ్ళూ, రప్పలూ, కొండలూ తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడుత “తొందరగా సేతువు నిర్మాణం జరగాలి. అందుకోసం ఈ వీరులకు చేయూతనిస్తాను.” అంటూ శ్రీరాముని పాదపద్మాలను మనసులో నిల్పుకొన్నది. అతని ఎదురుగా, నిర్మలభక్తితో సముద్రంలో మునిగి వచ్చి యిసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి, తన ఒంటికి అంటిన యిసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి యిసుక నంటించుకొని వారధిపై విదిలిస్తూ ఉన్నది. భక్తితో ఉడుత చేస్తున్న చిన్న సాయాన్ని శ్రీరాముడు చూసి, తమ్ముడు లక్ష్మణుని పిలిచి “నా పై భక్తితో ఉడుత సముద్రజలాల్లో తడిసి యిసుకనంటించుకొని రాళ్ళమధ్య విదిలిస్తున్నది.
బలవంతులైన వానరులు కొండలను, వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత ? తన శక్తి యెంత ? అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది. చూశావా?” అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు “నీ పాదాలను మనసులో నిలిపి, భక్తితో, గడ్డిపోచంత (కొంచెం) పనిచేసినా అది కొండతో సమానం. భక్తే ప్రధానం కదా!” అన్నాడు. శ్రీరాముడు సంతోషించి సుగ్రీవునితో ఉడుతను తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడుతను తెచ్చి రామునికి ఇచ్చాడు. శ్రీరాముడు ఉడుతను పలువిధాల పొగడి తన కుడిచేతితో దాని వీపుపై దువ్వాడు. ఉడుత వీపుపై మూడు రేఖలు చూడడానికి అందంగా, ఆనందకరంగా ఏర్పడ్డాయి.
Exam Tips:
a) కథను వారధి నిర్మాణం, ఉడుత చేసిన సాయం, రాముని ప్రశంస, లక్ష్మణుని మాట అనే క్రమంలో రాయండి.
b) సొంత మాటల్లో రాయాలి; పద్యపాదాలను అలాగే ఎత్తి రాయవద్దు.
IV. సృజనాత్మకత / ప్రశంస
Question 1: ఈ పాఠాన్ని గేయ రూపంలో రాయండి.
Answer:
ఉడుత సాయం (గేయం)
చిన్ని ఉడుత చూడండి ఎంత ముద్దుగా ఉందో
వీపుమీద నల్లనైన – మూడు చారలున్నాయి
ఎక్కడివీ ఈ చారలు – కనులకింపు గొలుపుతూ
చూపు తిప్పుకోనీవు – ముచ్చటైన చారలు
రాముడిచ్చినాడమ్మా – ఉడుతకు ఈ అందాలు
మునివేళ్ళతో వీపునిమిరి తన ప్రేమను అద్దినాడు
ఎందుకంత ప్రేమంటే – దాని కథను వినండి
“రాముడు లంకను జేరగ – కోతులు వంతెన గట్టెను
పెద్ద పెద్ద బండరాళ్ళు – మోయుచున్న కోతులగని
శ్రీరాముని కార్యంలో – నేను ఏమి చెయ్యగలను ?
అని ఆలోచించి ఉడుత – శ్రీరాముని పాదాలను
భక్తితోడ మదిని దలచి
సముద్రంపు నీటమునిగి తన ఒంటిని తడుపుకొని – గట్టుమీద ఇసుకలోన
అటూ ఇటూ పొరలాడి – అంటిన ఆ ఇసుక తెచ్చి
మరల నీట మునిగింది వంతెనపై దులిపింది
అలుపులేక సొలుపులేక – మరల మరల తిరిగింది
అది చేసిన సాయానికి అది చూపిన వినయానికి
ముచ్చటపడి శ్రీరాముడు – మునివేళ్ళతో నిమిరెదాని
వీపున నల్లని చారలు – శాశ్వతముగ నిలచిపోయె
Exam Tips:
a) గేయంలో ప్రాస, లయ ఉండేలా పాదాలను రాయండి.
b) కథ ముఖ్య ఘట్టాలను (భక్తి, సాయం, మూడు చారలు) వరుసగా చెప్పండి.
Question 2: కింది బొమ్మను చూసి సంభాషణలు రాయండి.
Answer:
చీమ : ఉడుతమ్మా! రా. ఏంటిలా వచ్చావు ?
ఉడుత : ఊరికెనే నిన్నుచూసి పోదామని వచ్చాను చీమమ్మా!
చీమ : చాలా సంతోషం. ఇదిగో ఈ వేరుసెనగ పప్పులు తిను.
ఉడుత : ధన్యవాదాలు. నీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందా ఆహారం.
చీమ : అవును. కష్టపడి తెచ్చుకున్నదాంట్లో కొంత తిని కొంత దాచుకుంటాం.
ఉడుత : అలాగా! దాచుకోటానికి, ఉండటానికి మీరు కట్టుకున్న ఇళ్ళు ఎంత బాగున్నాయో!
చీమ : మేమంతా కలిసి ఇలా కట్టుకుంటాం. కలిసి మెలిసి ఉంటాం.
ఉడుత : మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి చీమమ్మా !
చీమ : నీవు మాత్రం తక్కువేంటి ? నీ భక్తితో రామయ్య తండ్రిని మెప్పించావు.
ఆయన వేళ్ళ గుర్తులు ఇప్పటికీ మోస్తున్నావు. వాటివల్ల నీకెంత అందమొచ్చిందో.
ఉడుత : ఆట్టే పొగడకు. నాకు సిగ్గుగా ఉంటుంది. మరి నేను వెళ్ళొస్తాను.
Exam Tips:
a) ఇద్దరు పాత్రల మాటలను ‘చీమ :’, ‘ఉడుత :’ అని పేర్లతో వరుసగా రాయండి.
b) సంభాషణలో పాఠం సందేశం (కలిసి పనిచేయడం, భక్తి) వచ్చేలా చూడండి.
V. పదజాల వినియోగం
Question 1: కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అర్థం వచ్చే మరో రెండు పదాలు ఉన్నాయి. ఆ పదాల కింద గీత గీయండి.
(అ) హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్టు శిఖరాన్ని పూర్ణిమ, ఆనంద్‌లు ఎక్కి, ఆ అద్రిపై భారత జాతీయపతాకం ఎగురవేసి, కొండంత కీర్తిని పొందారు.
(ఆ) రామాపురానికి, రంగాపురానికి మధ్యన వంతెన కట్టడంవల్ల రెండు గ్రామాల ప్రజలు ఆ వారధి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆ సేతువు పుణ్యంకొద్ది ఆ గ్రామాల మధ్య దూరం చాలా తగ్గింది.
(ఇ) ప్రజాధనం పచ్చికలా మేసినవాణ్ణి గడ్డిపోచలా భావించి, వాడికి తృణమే తిండిగా పెట్టాలి.
(ఈ) సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి. అదే వార్ధిలో జలచరాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వనధి నీటి నుండే ఉప్పు లభిస్తుంది.
Answer:
(అ) పర్వతాలు, అద్రి, కొండ
(ఆ) వంతెన, వారధి, సేతువు
(ఇ) పచ్చిక, గడ్డిపోచ, తృణం
(ఈ) సముద్రం, వార్ధి, వనధి
Exam Tips:
a) ఒకే అర్థం ఉన్న పదాలను (పర్యాయపదాలను) వాక్యం నుంచి వెతికి యథాతథంగా రాయండి.
b) ప్రతి వాక్యంలో మూడు పదాలను గుర్తించండి.
Question 2: ఈ కింది వాక్యాలలోని ప్రకృతి – వికృతులను గుర్తించి రాయండి.
ఉదా : హనుమంతుడు రాముణ్ణి భక్తితో కొలిచాడు. ఆ బత్తి ఎన్నటికీ తరగదు. (భక్తి – బత్తి)
(అ) మనుషులు దవ్వుగా ఉన్నా మమతలు దూరం కాకూడదు.
(ఆ) స్వచ్ఛభారత్ కార్యక్రమానికి నావంతు సహాయం చేస్తున్నాను. మీరూ నాలాగే సాయం చెయ్యండి.
(ఇ) వానరాల శక్తితో పోలిస్తే ఉడుత శక్తి కొంచెమే అయినా ఆ కొంచెం సత్తువతోనే అది వారధి కట్టడంలో సాయం చేసింది.
Answer:
(అ) దూరం (ప్రకృతి) – దవ్వు (వికృతి)
(ఆ) సహాయం (ప్రకృతి) – సాయం (వికృతి)
(ఇ) శక్తి (ప్రకృతి) – సత్తువ (వికృతి)
Exam Tips:
a) ప్రకృతి పదం సంస్కృత రూపం, వికృతి తెలుగు రూపం అని గుర్తుంచుకోండి.
b) ఉదాహరణ (భక్తి – బత్తి) పద్ధతిలో జతగా రాయండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: ఖాళీలను సరైన భాషాభాగాలతో పూరించి అవి ఏ భాషాభాగాలో రాయండి.
Answer:
(అ) రవి పుస్తకం తెరిచి పాఠం చదివాడు. (క్రియ)
(ఆ) రాముడు సీత తో కలిసి అరణ్యానికి పోయాడు. (నామవాచకం)
(ఇ) కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. అతడు చాలా వేగంగా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. (సర్వనామం)
(ఈ) అయ్యో! అంతపని జరిగిందా ? (అవ్యయం)
(ఉ) పండుగరోజు విమల కొత్త బట్టలు కట్టుకున్నది. (విశేషణం)
Exam Tips:
a) వాక్యంలోని పదం పని చేస్తే క్రియ, పేరు చెబితే నామవాచకం, నామవాచకానికి బదులు సర్వనామం అని గుర్తుంచుకోండి.
b) ‘అయ్యో’ వంటివి అవ్యయాలు.
Question 2: కింది వాక్యాల్లో విభక్తి ప్రత్యయాలను గుర్తించి వాటికింద గీతలు గీయండి. అవి ఏ విభక్తులో బ్రాకెట్లో రాయండి.
Answer:
(అ) మౌనిక మల్లెపూలను ధరించినది. (ద్వితీయా విభక్తి)
(ఆ) రాజేందర్ అడవికి వెళ్ళి ఉసిరికాయలు తెచ్చాడు. (షష్ఠీ విభక్తి)
(ఇ) చిన్నపిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి. (తృతీయా విభక్తి)
(ఈ) కీర్తన ఇంజనీరింగ్ చదవడంకోసం బాసర వెళ్ళింది. (చతుర్థీ విభక్తి)
(ఉ) సహాయం చేయడంవల్ల రహీం కష్టాల్లోంచి గట్టెక్కాడు. (పంచమీ విభక్తి)
Exam Tips:
a) ను – ద్వితీయ, తో – తృతీయ, కొరకు – చతుర్థి, వల్ల – పంచమి, కి/కు/లో – షష్ఠి అని ప్రత్యయాల పట్టికను కంఠస్థం చేయండి.
b) ప్రత్యయం కింద గీత గీసి బ్రాకెట్లో విభక్తి పేరు రాయండి.
Question 3: కింది పేరాలో ఉన్న విభక్తి ప్రత్యయాలను, భాషాభాగాలను గుర్తించి పట్టికలో రాయండి.
పూర్వం ఉజ్జయినీ నగరమందు విక్రమార్కుడనే రాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించేవాడు. ఒకసారి ఆయన దేశసంచారం కొరకు బయలుదేరి అనేక ప్రాంతాలు తిరుగుతూ, కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ పవిత్రమైన గంగానదిలో స్నానంచేసి, అక్కడి గుడిలో దేవతలను పూజించి, గుడినుంచి బయటకు వస్తుండగా చెవులకు ఇంపైన సంగీతం వినబడింది. ఆ మధురమైన సంగీతం వినవచ్చేవైపు నడిచాడు. అక్కడ ఒక తోటలో ఒక స్త్రీ, స్నేహితురాళ్ళతో కలిసి వీణను వాయిస్తూ పాట పాడుతున్నది. ఆ పాటను వింటూ రాజు చాలా ఆనందపడి ఆ స్త్రీకి రత్నాలహారాన్ని బహుమానంగా ఇచ్చారు.
Answer:
విభక్తి ప్రత్యయాలు : అందు – సప్తమీ విభక్తి; ను – ద్వితీయా విభక్తి; కొరకు – చతుర్థీ విభక్తి; లు, డు – ప్రథమా విభక్తి; లో, కు – షష్ఠీ విభక్తి; తో – తృతీయా విభక్తి.
నామవాచకాలు : ఉజ్జయిని, విక్రమార్కుడు, కాశీపట్టణం, గంగానది
అవ్యయాలు : పూర్వం, అక్కడ
సర్వనామాలు : అతడు, ఆయన
విశేషణాలు : పవిత్రమైన, ఇంపైన, మధురమైన
క్రియలు : ఉండేవాడు, పరిపాలించు, తిరుగుతూ, చేరుకున్నాడు, పూజించి, చేసి, వస్తుండగా, నడిచాడు, పాడుతున్నది
Exam Tips:
a) పేరా చదువుతూ ప్రతి పదాన్ని విభక్తి ప్రత్యయం, భాషాభాగం అనే రెండు వర్గాలలో గుర్తించండి.
b) పట్టికలో ఏదీ వదలకుండా వరుసగా నింపండి.
ముఖ్యమైన ప్రశ్నలు
Question 1: వానరులు సేతువును నిర్మించిన విధం తెల్పండి.
Answer:
కోతులూ, ఎలుగుబంట్లూ పెద్ద పెద్ద చెట్లనూ, బండరాళ్ళనూ మోసుకొచ్చి నలుని చేతికిస్తున్నారు. నలుడు వాటిని సముద్రం మీదికి విసురుతున్నాడు. అలా రాళ్ళను వరుసగా పేర్చుతూ వంతెన నిర్మిస్తున్నారు. ఆ మహావీరులకు తన చేతనైనంత సాయం చేయాలని ఉడుత ఆశపడింది. సముద్రం నీళ్ళలో ఒళ్ళు తడుపుకొని ఇసుకలో పొర్లాడి ఆ ఇసుకను వంతెన మీద రాల్చి ఉడుత సేతు నిర్మాణంలో సాయపడింది.
Exam Tips:
a) సేతు నిర్మాణ క్రమం: వానరులు రాళ్ళు తేవడం, నలుడు పేర్చడం, ఉడుత సాయం అని చెప్పండి.
b) చిన్న వాక్యాలు వాడండి.
Question 2: శ్రీరాముడు లక్ష్మణునితో ఏమన్నాడు?
Answer:
శ్రీరాముడు ఉడుత చేస్తున్న పనిని శ్రద్ధగా చూశాడు. ఆయనకు ఎంతో ముచ్చట వేసింది. తమ్ముడు లక్ష్మణుని వంక చూసి ఇలా అన్నాడు. “ఆ ఎదురుగా ఒక ఉడుత పొర్లాడుతున్నది చూడు. అది నా మీద గల గొప్ప భక్తితో తన శరీరాన్ని నీటితో తడుపుకొని గట్టుమీదికి వెళ్ళి ఇసుకలో పొర్లాడి వచ్చి కొండరాళ్ళ మధ్య ఇసుక రాలుస్తున్నది. అంత గొప్ప కపి వీరులు తరువులు, గిరులూ మోస్తుంటే తానెంత అని చిన్నబుచ్చుకోకుండా ప్రేమతో సాయం చేస్తున్నది చూశావా ?” అన్నాడు.
Exam Tips:
a) రాముడు ఉడుత భక్తిని, ఆ భక్తితో చేసిన సాయాన్ని లక్ష్మణునికి చూపించిన విధానాన్ని మూడు భాగాలుగా రాయండి.
b) ఉదాహరణ మాటలను ఉదాహరణగా (“చూశావా?”) ఉపయోగించండి.
Question 3: ఉడుత సాయం పాఠం నీకెందుకు నచ్చిందో వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి.
Answer:
ఖమ్మం, తేది : XXXX. ప్రియమైన దిలీపుకు,
నీ స్నేహితుడు కృష్ణ రాస్తున్న లేఖాంశాలు. నేను బాగానే చదువుతున్నాను. నీవెలా ఉన్నావు ? ఆరవ తరగతి పుస్తకంలో ఉడుత సాయం అనే పాఠం చదివాను. నాకెంతో నచ్చింది. ఆ పాఠం విశేషాలు నీకు వివరించాలని ఈ లేఖ రాస్తున్నాను.
ఈ పాఠం గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణంలోనిది. రాముడు రావణునిపై యుద్ధానికి బయలుదేరాడు. లంక చేరాలంటే సముద్రం దాటాలిగదా! వానరులంతా కలిసి వారధి కట్టసాగారు. కోతి అనగానే మనమెంతో చులకనగా చూస్తాం. కోతులే లేకపోతే రామాయణమే లేదు కదా! అనిపించింది.
అది చూసిన ఒక ఉడుత తానుకూడా రామకార్యంలో పాలు పంచుకోవాలనుకున్నది. తన శరీరం నీటిలో తడిపి ఇసుకలో పొర్లి వంతెనమీద దులుపుతూ శ్రమ పడింది. అప్పుడు నాకనిపించింది. ఉడుతకున్నపాటి జ్ఞానం కూడా మనుషులకు లేదు కదా! అని.
ఏ పనైనా ఒకరికొకరు తోడై మూకుమ్మడిగా చేస్తే ఎంతో సులభంగా పూర్తవుతుంది కదా అనుకున్నాను. నోరులేని జంతువులకే ఇంత సంఘీభావం ఉంటే మనుష్యులమైన మనకు ఎంత ఐకమత్యముండాలి అనిపించింది. ఏమైనా ఈ పాఠం మంచి సందేశాన్నిస్తోంది. మరి ఉంటాను. సెలవు. నీ జాబు కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
ఇట్లు, నీ స్నేహితుడు, కృష్ణ. చిరునామా:
కె. దిలీప్,
కేరాఫ్ శ్రీ సూర్యనారాయణ,
ఇంటి నెం.22-10-56, కోవెల వీధి, భద్రాచలం.
Exam Tips:
a) లేఖలో చిరునామా, తేదీ, సంబోధన, సారాంశం, ముగింపు (ఇట్లు…), చిరునామా అనే క్రమం పాటించండి.
b) పాఠం ఎందుకు నచ్చిందో కారణాలతో రాయండి.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 6 Telugu Lesson 07 Udutha Sayam (The Squirrel's Help)
Chapter Exercise Answers for Class 6 Telugu
Explore reliable textbook solutions for Lesson 07 Udutha Sayam (The Squirrel's Help) tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.
Detailed Answer Guides for Lesson 07 Udutha Sayam (The Squirrel's Help)
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Complete Preparation Kit for Class 6 Exams
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Telugu.
FAQs
The complete and updated TS 6th Class Telugu 7th Lesson Questions and Answers Telangana ఉడుత సాయం is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 6th Class Telugu 7th Lesson Questions and Answers Telangana ఉడుత సాయం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 7th Lesson Questions and Answers Telangana ఉడుత సాయం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 7th Lesson Questions and Answers Telangana ఉడుత సాయం in both English and Hindi medium.
Yes, you can download the entire TS 6th Class Telugu 7th Lesson Questions and Answers Telangana ఉడుత సాయం in printable PDF format for offline study on any device.