TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు

Step-by-Step Textbook Solutions for Class 6 Telugu Lesson 08 The Pond

Access comprehensive textbook solutions for Lesson 08 The Pond using the official curriculum guides for Class 6 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Download Lesson 08 The Pond Textbook Solutions PDF

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

ఆలోచించండి – చెప్పండి

Question 1: పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి?

Answer:

పై బొమ్మలో నది లేదా చెరువులో ప్రయాణిస్తున్న పడవ ఒడ్డున ఉన్న ఇళ్ళు, చెట్లు కన్పిస్తున్నాయి.

Exam Tips:

a) బొమ్మను జాగ్రత్తగా చూసి కనిపించిన వస్తువులను (పడవ, ఇళ్ళు, చెట్లు, నీరు) క్రమంగా పూర్తి వాక్యాల్లో రాయండి.
b) చూడనివి లేదా ఊహించినవి రాయవద్దు; బొమ్మలో ఉన్నవే చెప్పాలి.

 

Question 2: ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి ?

Answer:

ప్రజలకు చెరువుల అవసరం ఎంతో ఉంది. తాగునీటికి, ఇతర జీవిత అవసరాలైన స్నానం చేయడం, బట్టలుతకటం వంటి వాటికి, వ్యవసాయానికి చెరువుల నీరు అవసరం ఉంది. పల్లెటూరి కల్పవల్లులు చెరువులే.

Exam Tips:

a) తాగునీరు, వ్యవసాయం, స్నానం, పశువుల అవసరాలు వంటి కనీసం మూడు అవసరాలను వేర్వేరుగా చెప్పండి.
b) ‘కల్పవల్లి’ వంటి పాఠంలోని పదాలను వాడితే మంచి మార్కులు వస్తాయి.

 

Question 3: ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నది ?

Answer:

ప్రస్తుతం చెరువుల పరిస్థితి దయనీయంగా ఉంది. చెరువుల బాగోగులను ఎవరూ పట్టించుకోవటం లేదు. అవి జల కాలుష్యంతో మురికి కాల్వలుగా తయారయ్యాయి.

Exam Tips:

a) ప్రస్తుత పరిస్థితికి కారణాలు (కాలుష్యం, ఆక్రమణలు, పూడిక) కూడా ఒక వాక్యంలో చేర్చండి.
b) పాఠం ఆధారంగానే రాయండి; సొంత అభిప్రాయాలు తక్కువగా ఉంచండి.

 

Question 4: చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి.

Answer:

చెరువులు పల్లెలకు ప్రాణాలు. చెరువులు సంస్కృతికి, సంప్రదాయాలకు నిలయాలు. అనేక వృత్తులకు ఆధారం. చెరువులో పెరిగే చేపలు, తాబేళ్ళు వంటి వాటికి, వాటి ఒడ్డున ఉండే చెట్లమీద పెరిగే పక్షులకు, కీటకాలకు చెరువులే ఆధారం.

Exam Tips:

a) చెరువుల ప్రయోజనాలను మూడు వర్గాలుగా (మనుషులకు, జీవులకు, సంస్కృతికి) విభజించి రాస్తే సులభంగా ఉంటుంది.
b) ప్రతి వాక్యం ఒక్క విషయం మాత్రమే చెప్పేలా చిన్నవిగా రాయండి.

 

అవగాహన – ప్రతిస్పందన

Question 1: ‘మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి’ అనడంలో ఆంతర్యం ఏమిటి ?

Answer:

చెరువు తనను గురించి వివరించాలనుకుంది. తన ప్రత్యేకతలను చాటాలనుకుంది. ఉదయాన్నే లేవగానే మన మనసులు ప్రశాంతంగా ఉంటాయి కదా! అప్పుడు చెపితే ఆ మాటలు మనకు చక్కగా అర్థమౌతాయి. చెరువులను చక్కగా సంరక్షించుకోండి. పల్లెలకు నీటి వనరు చెరువు అని చెప్పటం “మనసు బాగున్నప్పుడే నాలుగు మాటలు చెవికెక్కుతాయి” అనటంలోని ఆంతర్యం.

Exam Tips:

a) ‘ఆంతర్యం’ అంటే లోపలి భావం; మాటలకు అర్థం కాక వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెప్పాలి.
b) చెరువు ఎందుకు ఉదయాన్నే మాట్లాడిందో కారణంతో వివరించండి.

 

Question 2: భూగర్భజలానికి నేను ‘శ్రీరామరక్ష’ అని చెరువు అనడాన్ని మీరెట్లా సమర్థిస్తారు?

Answer:

శ్రీరామరక్ష అంటే రక్షణ, దన్ను అని అర్థం. చెరువులలోని నీరు భూమిలోనికి ఇంకి భూగర్భజలాలు నిలువ ఉండేటట్లు చేస్తాయి. కాబట్టి చెరువులు భూగర్భజలాలకు శ్రీరామరక్ష అని అంగీకరించాలి.

Exam Tips:

a) ‘శ్రీరామరక్ష’ పదానికి అర్థం (రక్షణ) చెప్పి, తరువాత చెరువు నీరు భూగర్భజలం పెరగడానికి ఎలా దోహదం చేస్తుందో రాయండి.
b) ‘సమర్థిస్తారు’ అన్నప్పుడు మీ అంగీకారాన్ని ముందు స్పష్టంగా రాయండి.

 

Question 3: ‘రామసక్కని’ దృశ్యం చెరువు దగ్గర ఏయే సందర్భాలలో కనిపిస్తుంది ?

Answer:

చెరువు దగ్గర రామసక్కని దృశ్యం చెరువులోకి అలుగు పారేటప్పుడు కన్పిస్తుంది. అలాగే వర్షం పడినప్పుడు కూడా ఈ దృశ్యం కనిపిస్తుంది.

Exam Tips:

a) రెండు సందర్భాలను (అలుగు పారేటప్పుడు, వర్షం పడినప్పుడు) తప్పక పేర్కొనండి.
b) ‘రామసక్కని’ అంటే చాలా అందమైన అని అర్థం కూడా రాస్తే మంచిది.

 

Question 4: చెరువు నీటిని శ్రమజీవుల చెమటతో పోల్చడం జరిగింది. ఎందుకు ?

Answer:

శ్రమ జీవులు తమ కష్టంతోనే చెరువును తవ్వి నీరు నిల్వఉండేట్లు చేశారు. అందుకే వారి కష్టం నుండి కారిన చెమటలే నా నీళ్ళు అని చెరువు చెప్పుకున్నది.

Exam Tips:

a) ‘చెమట’ అనే పోలిక శ్రమకు సంకేతం; శ్రమజీవులు చెరువు తవ్వారనే విషయాన్ని చెప్పండి.
b) కారణం అడిగిన ప్రశ్నలో ‘అందుకే’ వంటి పదంతో కారణాన్ని ముగించండి.

 

Question 5: చెరువులు కాలుష్యం కాకుండా ఉండాలంటే మనమేం చేయాలి?

Answer:

చెరువులు కాలుష్యం కాకుండా ఉండాలంటే వాటిని దురాక్రమణ చేయకుండా కాపాడాలి. పూడికను ఎప్పటికప్పుడు తీస్తుండాలి. పొలాలలో వేస్తున్న రసాయనాలు చెరువుల్లో కలవకుండా చూడాలి. ఫ్యాక్టరీల వ్యర్థ పదార్థాలు, రసాయనాలు చెరువులో కలవకుండా జాగ్రత్త పడాలి. చెరువు ప్రక్కన మలమూత్ర విసర్జన చేయడం, గుడ్డలు ఉతకడం, పశువులను, వాహనాలను కడగడం చేయకుండా చూడాలి.

Exam Tips:

a) కాలుష్యాన్ని కలిగించే కారణాలను (రసాయనాలు, వ్యర్థాలు, బట్టలు ఉతకడం) తొలగించే చర్యలుగా రాయండి.
b) నాలుగైదు స్పష్టమైన సూచనలు ఇవ్వండి.

 

Question 6: “చెరువులు తరతరాల చరిత్రకు మౌనసాక్షి” దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.

Answer:

చెరువులు తరతరాల చరిత్రకు, సంఘటనలకు మౌనసాక్షులు. ఏనాడో కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం చెరువులు నేటికీ మౌనసాక్షులుగా నిలిచి ఉన్నాయి. మంథనిలో ‘శిలసముద్రం’ చెరువుంది. వనపర్తి రాజులు చెరువులను సముద్రాలని వ్యవహరించేవారు. ఆయా కాలాల్లోని మనుషులు చనిపోయిన, ఆ కాలం నాటి చెరువులు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఆ కాలం నాటి సంఘటనలను నిశ్శబ్దంగా చూసాయని అర్థం.

Exam Tips:

a) ‘మౌనసాక్షి’ అంటే మాట్లాడకుండా చూసిన సాక్షి; రామప్ప, పాకాల, లక్నవరం వంటి ఉదాహరణలు ఇవ్వండి.
b) చివరగా మీ అభిప్రాయాన్ని ఒక వాక్యంలో చెప్పండి.

 

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: బడిలో ఉపన్యాసపోటీ నిర్వహిస్తున్నారు. ‘చెరువులే జీవనాధారం’ అనే అంశం గురించి మాట్లాడండి.

Answer:

మా బడి ఉపన్యాసాల పోటీలలో నేను చెరువులే జీవనాధారం అన్న అంశంపై మాట్లాడాలనుకుంటున్నాను. గ్రామాలలో ప్రతి ఊరికి ఒక చెరువు తప్పక ఉంటుంది. చెరువులు సమాజానికి కల్పతరువులు. ప్రజల తాగునీటికి, సాగు నీటికి, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్ష్యాదులకు, దాహాన్ని తీర్చేవి చెరువులే!
చెరువులు గ్రామ సౌందర్యానికి తొలిమెట్టు. పిల్లలకు వేసవిలో ఆటవిడుపు. చెరువు లేని గ్రామం, చెట్టు లేని గ్రామం ఉండదు. నిలువ నీడకై తరువులు నిలువ నీటికై చెరువులు ఉండవలసిందే!

Exam Tips:

a) ఉపన్యాసంలో మొదట అంశాన్ని పరిచయం చేసి, రెండు మూడు ఉదాహరణలు ఇచ్చి, చివర సందేశంతో ముగించండి.
b) ‘నిలువ నీడకై తరువులు, నిలువ నీటికై చెరువులు’ వంటి పాఠంలోని మాటలను వాడండి.

 

Question 2: ఉపన్యాసపోటీలో ‘చెరువులను రక్షించుకోవడం మన బాధ్యత’ అనే అంశం గురించి మాట్లాడండి.

Answer:

చెరువులు గ్రామాలకు కల్పతరువులు. వాటిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. వ్యర్థ పదార్థాలతో, రసాయనాలతో చెరువులు కలుషితం కాకుండా చూసుకోవాలి. చెరువు గట్లను ఎప్పటికప్పుడు తెగిపోకుండా రక్షించుకోవాలి.
త్రాగునీరు, సాగునీరు అందించటంతో పాటు పలు ప్రయోజనాలున్న చెరువులను రక్షించుకోవటం మనందరి బాధ్యతగా తీసుకోవాలి. గ్రామీణ సంస్కృతీ సంపదలను నిలబెట్టుకోవాలి.

Exam Tips:

a) ‘బాధ్యత’ అంశంలో చెరువులను ఎలా కాపాడాలో (గట్లు, పూడిక, కాలుష్యం) స్పష్టంగా చెప్పండి.
b) అందరూ కలిసి చేయాలి అనే ముగింపు వాక్యం ప్రభావవంతంగా ఉంటుంది.

 

Question 3: ఉపన్యాసపోటీలో ‘చెరువులు మన సంస్కృతి కేంద్రాలు’ అనే అంశం గురించి మాట్లాడండి.

Answer:

చెరువులు మన సంస్కృతికి కేంద్రాలు. బతుకమ్మ పండుగ చెరువుతోనే ముడివడి ఉంది. గ్రామంలోని అమ్మలక్కలందరూ తల్లిగారింటికి వచ్చినట్లు చెరువు వద్దకే వస్తారు. పలురకాల పూలతో చెరువును అలంకరిస్తారు. ఆ పూలు చెరువులోని కాలుష్యాన్ని నివారిస్తాయి. ఇక వినాయక చవితి విషయం చెప్పనక్కర లేదు.
వినాయక మూర్తులను చెరువులోనే కలుపుకుంటారు. వానలు కురవకపోతే చెరువు కట్టపై విరాట పర్వం చెప్పిస్తారు. కవులు, కళాకారులు, కథలు, పాటలు, పద్యాలు చెరువుపైనే రాస్తారు. చెరువును చిత్రకళాకారులు అందంగా చిత్రిస్తారు. సామాజిక సంస్కృతిలో చెరువులు ఒక భాగం అయ్యాయి.

Exam Tips:

a) బతుకమ్మ, వినాయక నిమజ్జనం, విరాట పర్వం వంటి నిర్దిష్ట ఉదాహరణలను రాయండి.
b) సంస్కృతికి చెరువు ఎలా కేంద్రమో ఒక వాక్యంలో నొక్కి చెప్పండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

Question 1: పాఠంలోని 4, 8, 14, 20 పేరాలు చదివి, వాటికి శీర్షికను పెట్టండి. ఆ పేరాలోని 4, 5 కీలకపదాలు రాయండి.

Answer:

4వ పేరా శీర్షిక : ‘నీరే ప్రాణాధారం’. ఊపిరి, నీరే ప్రాణాధారం, తరువు, చెరువు, బతుకుతది, కళకళలాడేది. శ్రీరామరక్ష.
8వ పేరా శీర్షిక : ‘చెరువులు మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలయాలు!’.
కళాకారులు, గాయకులు, చైతన్యం, ముక్కున వేలేసుకొను, చిత్రకారులు, చిత్రించి, భేషనిపించుకొను, ఆటపాటలు, ఇబ్బడిముబ్బడి.
14వ పేరా శీర్షిక : ‘చెరువులు – పద బంధాలు’ సన్నబడుత, ఇబ్బంది. గుర్తు పట్టం, తెలిసిపోతది, బయట పడింది. పుట్టుకొచ్చినవి.
20వ పేరా శీర్షిక : ‘చెరువులు మన మౌన సాక్షులు’ ఉదారంగా, ప్రత్యేక శ్రద్ధ, చెక్కుచెదరలేదు. విశాలమైన, సప్త సముద్రాలు, సంప్రదాయం.

Exam Tips:

a) శీర్షిక పేరా మొత్తం భావాన్ని ఒక చిన్న వాక్యంలో చెప్పేలా ఉండాలి.
b) కీలక పదాలు ఆ పేరాలో ఉన్నవే రాయండి; కనీసం నాలుగు ఇవ్వండి.

 

Question 2: కింది పేరాను చదివి, ఐదు ప్రశ్నలు రాయండి.
నేలపై కురిసే వర్షం నిలువచేయడానికి అనువైన చెరువులు, కుంటలు, ఆనకట్టలు లేకపోవడం వల్ల మనకు వర్షపు నీరు ఉపయోగపడకుండా వృథాగా సముద్రంలోకి పోతున్నది. చెరువుల పునర్నిర్మాణం ప్రజల మనుగడతో ముడిపడిన కీలకాంశం. ప్రకృతి ప్రసాదంగా ఉన్న నీటి వనరులను ఇప్పుడు తెలంగాణ సంపదగా గుర్తించి, వాటికి పూర్వవైభవం తెచ్చే పనిని ‘మిషన్ కాకతీయ’ పేరిట ప్రభుత్వం స్వీకరించింది. రాజుల కాలంలో తవ్వించిన చెరువులే ఇప్పటికీ తెలంగాణలో జీవనాధారం. నీటి లభ్యత కొరవడకుండా చూసుకోవడం ప్రతి తరం బాధ్యత. స్థానిక ప్రజలను నీటిని పరిరక్షించటంలో భాగస్వాములను చేయాలి. నీటికొరత ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తుంది. చెరువులు, నదుల, భూగర్భవనరుల నుంచి మనం తోడే ప్రతి లీటరు నీటికి రెట్టింపు ప్రయోజనం కలిగేటట్లు వ్యవహరించాలి.

Answer:

1. వర్షం నీటిని నిలువచేయడానికి అనువైనవేవి ?
2. వర్షం నీరు మనకు ఉపయోగపడకుండా పోతోంది ? ఎందుకు ?
3. తెలంగాణ సంపదలుగా గుర్తింప తగినవి ఏవి ?
4. ప్రభుత్వం చెరువులకు పూర్వవైభవాన్ని తేవటానికి ఆరంభించిన పథకం ఏది ?
5. నీటిని పరిరక్షించటంలో ఎవరిని భాగస్వాములను చేయాలి ?
6. మన ఆర్థిక వికాసాన్ని దెబ్బతీసే విషయం ఏమిటి ?
7. ఎవరు త్రవ్వించిన చెరువులు ఇప్పటికీ జీవనాధారంగా ఉన్నాయి ?
8. చెరువులు, నదులు, భూగర్భ జలాల వాడుకలో ఎట్లాంటి ప్రయోజనాన్ని ఆశించాలి ?

Exam Tips:

a) ప్రశ్నలు పేరాలో జవాబు దొరికేలా ఉండాలి; ఎవరు, ఏది, ఎందుకు వంటి ప్రశ్నపదాలను వాడండి.
b) ప్రశ్న చివర ‘?’ గుర్తు మరువవద్దు.

 

III. స్వీయ రచన

Question 1: చెరువులు ఏ కాలంలో నిండుగా ఉంటాయి ? నిండుగా ఉండటానికి మనం ఏం చేయాలి ?

Answer:

చెరువులు వానాకాలంలో నిండుగా ఉంటాయి. మంచిగా వానలు కురిస్తే చెరువులు నెలలు నిండిన బాలింతరాలుగా ఉంటాయి. చెరువులు నిండుగా కళకళలాడుతూ ఉండాలంటే చెట్లను పెంచాలి. చెట్లను పెంచితే చక్కటి వర్షాలు కురుస్తాయి.
వర్షాలు కురిస్తే చెరువులు నిండుతాయి. చెరువులలో ఎప్పటికప్పుడు పూడికను తీయించాలి. చెరువు గట్లకు రక్షణ కల్పించాలి. ఆక్రమణలకు గురికాకుండా చూడాలి. ఫ్యాక్టరీ రసాయనాలు, ఎరువులు చెరువులో కలవకుండా చూడాలి.
కాలుష్యం చెరువుల దరి చేరకుండా చూడాలి. గ్రామాలలోని మురుగునీరు చెరువులోకి చేరనీయకూడదు. అప్పుడే చెరువులు నిండుగా ఉండి గ్రామాలకు సౌందర్యాన్ని, సుఖసంతోషాలను, ధనధాన్యాలను ఇస్తాయి.

Exam Tips:

a) ప్రశ్నలో రెండు భాగాలున్నాయి (ఏ కాలం, ఏం చేయాలి); రెండింటికీ జవాబు రాయండి.
b) ఐదు వాక్యాల పరిమితిని పాటించండి.

 

Question 2: చెరువుల అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళలో వెలుగులు ఎందుకు వస్తాయి?

Answer:

అలుగులంటే చెరువు నీరు నిండి బయటకు పారుటకు పెట్టిన తూములు. అలా అలుగులు పారితే ప్రజలలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఎందుకంటే నీటితో నిండిన చెరువులు సమాజానికి కల్పతరువులు కదా! చక్కగా అలుగుల ద్వారా నీళ్ళు ప్రవహిస్తే పంటలు వేసుకోవటానికి అనుకూల సమయం వచ్చిందని అర్థం. జలకళ సిరులను కురిపిస్తుందన్న ఆనందం. నీరే ప్రాణాధారం. చెరువుల అలుగులు పారితే నీటి కరువు తీరినట్లే. అలుగులు పారుతున్నప్పుడే గ్రామాలు రామసక్కని దృశ్యాలను అందిస్తాయి. మనం సిరిసంపదలతో తులతూగుతుంటే బంధుగణం మన వద్దకు వస్తారు. అట్లే చెరువులు నిండుగా ఉంటే కప్పలు, జలచరాలుచేరి, తామరలు వికసించి అందాన్నిస్తాయి. అందుకే అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళల్లో వెలుగులు చూస్తాము.

Exam Tips:

a) ‘అలుగు’ అంటే ఏమిటో మొదట చెప్పి, అది పారితే పంటలకు, నీటికి కలిగే మేలును వివరించండి.
b) ‘కళ్ళలో వెలుగు’ అనేది ఆనందానికి సంకేతమని గుర్తుంచుకోండి.

 

Question 3: మీ ఊరి చెరువు కాలుష్యం బారిన పడకుండా ఉండడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి ?

Answer:

చెరువులు సమాజాలకు కల్పతరువులు. అవి కాలుష్యానికి గురైతే గ్రామాల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. చెరువులు కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే చెరువు గట్టులను జాగ్రత్తగా కాపాడాలి. వాటిని ఆక్రమణలకు గురికాకుండా చూసుకోవాలి. గ్రామంలోని మురికి నీరు చెరువులలోకి చేరకుండా ఆపాలి. ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థ రసాయనిక పదార్థాలను చెరువులలో పడేయకూడదు. ఎప్పటికికప్పుడు చెరువులలో పూడికను తొలగిస్తుండాలి. అప్పుడే చెరువులు కాలుష్యం బారిన పడకుండా ఉంచగలం.

Exam Tips:

a) సలహాలను (గట్లను కాపాడటం, ఆక్రమణలు ఆపడం, వ్యర్థాలు వేయకపోవడం) వేర్వేరు వాక్యాలుగా రాయండి.
b) ‘నేను’ అనే దృష్టితో సొంత సూచనలుగా రాస్తే బాగుంటుంది.

 

Question 4: చెరువుల వలన కలుగు లాభాలను రాయండి.

Answer:

చెరువులు సమాజానికి కల్పతరువులు. అన్ని వృత్తులు సాఫీగా సాగటానికి వనరులు. వ్యవసాయానికి ప్రధానమైన నీరు ప్రజలకు, పశుపక్ష్యాదులకు దాహాన్ని తీర్చేవి చెరువులే! నీరే ప్రాణాధారం. ఆ నీటిని అందించేవి చెరువులే. చెరువులు ఉంటే భూగర్భజలాలు అందుబాటులో ఉంటాయి. చెరువులు విహారస్థలాలు కూడా!
చెరువులలో జలవిహారం కోసం పడవలను నడిపి పొట్టపోసుకుంటారు. చెరువులు నీటితో పాటు ప్రకృతి సౌందర్యాలను అందిస్తున్నాయి. వేసవి కాలంలో మత్స్యకారులకు ఆర్థిక బలాన్నిస్తున్నాయి. బహువిధ ప్రయోజనకారులు చెరువులు. వాటిని రక్షించుకుంటే సమాజాలు రక్షింపబడతాయి.

Exam Tips:

a) లాభాలను తాగునీరు, వ్యవసాయం, చేపల పెంపకం, విహారం, భూగర్భజలం అని వర్గీకరించి రాయండి.
b) చివరి వాక్యంలో చెరువులను రక్షించాలనే సందేశం చేర్చండి.

 

Question 5: “చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి” దీనిని సమర్థిస్తూ రాయండి.

Answer:

చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నది నిజం. చెరువులు గ్రామాలకు కల్పతరువులు. అన్ని వృత్తులు కొనసాగటానికి ఆధారాలు. ఉత్పాదక శక్తులకు ఊతాలు. వ్యవసాయానికి ప్రధానమైన వనరులు. ఆబాల వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాలు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వేదికలు. పరోపకారాన్ని చాటే పవిత్ర రూపాలు. మనుషులకే కాక పశుపక్ష్యాదులకు, జలచరాలకు ఆవాసాలు. సమాజంతో చెరువుల బంధం విడదీయరానిది. నిలువ నీడకై తరువులు – “నిలువ నీటికై చెరువులు” ఉండవలసిందే. మనకు నాలుగు ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాలి.
వ్యవసాయం చేయాలంటే నీరుండాలి. వర్షపునీటిని నిలువవుంచుకొని వ్యవసాయానికి నీటిని అందించేవి చెరువులు. చెరువులు లేని పల్లెలను, గ్రామాలను మనం ఎక్కడాచూడం. వ్యవసాయానికి, తాగునీటికి, సకల జీవకోటికి ఆధారభూతమైనవి చెరువులు. చెరువులను చక్కగా కాపాడగలిగితే అవి మనలను కాపాడతాయి. అందుకే చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి.

Exam Tips:

a) ప్రశ్నలోని వాక్యాన్ని ప్రారంభంలో ఒప్పుకుంటూ, తరువాత కారణాలు వరుసగా రాసి, చివరన తిరిగి నిర్ధారించండి.
b) పది వాక్యాల పరిమితికి తగ్గట్టు ఆరు ఏడు ముఖ్య అంశాలు ఇవ్వండి.

 

Question 6: ‘సంస్కృతితో ముడిపడ్డ జీవితం నాది’ అని చెరువు ఎందుకన్నది?

Answer:

చెరువు జీవితం గ్రామీణ సంస్కృతికి నిలయం. బతుకమ్మ పండుగకు చెరువు వైభోగం ఇంతింత అనరానిది. తెలంగాణ మహిళలు బతుకమ్మలతో తల్లిగారింటికి వచ్చినట్లు చెరువు వద్దకు వస్తారు. తంగేడు, గునుగు, గుమ్మడి పూలతో చెరువులను సింగారిస్తారు. ఈ పూలు నీటి కాలుష్యాన్ని నివారిస్తాయి. బతుకమ్మ చెరువులో తేలియాడుతుంటే ఉయ్యాలపై ఊగుతున్నట్లుటుంది. ఇక వినాయక చవితిని గురించి చెప్పనక్కర లేదు.
చెరువులో ఉండే తామరలు వినాయకునికి అలంకారమౌతాయి. గణపతి మూర్తులు చివరకు చెరువు ఒడికే చేరుతాయి. చెరువులకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని కట్ట మైసమ్మను పూజిస్తారు. వానలు పడకపోతే చెరువు కట్టలపై ‘విరాట పర్వాన్ని’ చదివిస్తారు. చిత్రకారులు చెరువు పై పలు చిత్రాలు వేస్తారు. పెద్దలు భజన బృందాలు, కోలాటగుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు చెరువుకు ఆనందాన్నిస్తారు. పిల్లలకు చెరువు ఆటస్థలం. చెరువులేని గ్రామం లేదు. అందుకే తన జీవితం సమాజ సంస్కృతిలో భాగం అని చెరువు చెప్పుకొంది.

Exam Tips:

a) బతుకమ్మ పూలు, వినాయక చవితి, కట్టమైసమ్మ పూజ, విరాట పర్వం వంటి ఉదాహరణలను పాఠంలో ఉన్నట్లే రాయండి.
b) చివరి వాక్యంలో ప్రశ్నలోని మాటలను తిరిగి వాడి ముగించండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: చెరువు యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చిన్న కవిత లేదా పాట రాయండి.

Answer:

చెరువును నేను చెరువును
గ్రామాలకు కల్పతరువును
పల్లెల అభివృద్ధి నా ధ్యేయం
సంస్కృతి సంప్రదాయాలకు నిలయాన్ని
జీవుల దాహార్తిని తీర్చే వలయాన్ని ||చెరు||
వ్యవసాయానికి మంచి వనరును
పర్యాటకులకు విహార స్థలాన్ని
కళాకారులకు ప్రేరణనిచ్చే
రూపం నాది నిలువ నీటికై నేనున్నాను. ||చెరు||
బతుకమ్మ పండుగ వైభోగం
గణపతి స్వామి నిమజ్జనం
కట్టమైసమ్మ పూజా విధానం
నాతోనే ఇవి సాకారం. ||చెరు||
మత్స్యకారులకు జీవన భృతిని
సహజ వనరును ఎరువును నేను
రోగాలను హరించే ఔషధాన్ని నేను ||చెరు||

Exam Tips:

a) కవితలో పల్లవి, చరణాలు ఉండేలా రాయండి; పల్లవిని మధ్యమధ్యలో పునరావృతం చేయండి.
b) పాఠంలోని ప్రయోజనాలను (వ్యవసాయం, పండుగలు, మత్స్యకారులు) ప్రస్తావించండి.

 

Question 2: పాఠం ఆధారంగా ‘చెరువు’ మాట్లాడుతున్నట్లుగా ఏకపాత్రాభినయం చేయండి.

Answer:

గ్రామ సౌందర్యానికి ఆధారాన్ని, వ్యవసాయానికి ప్రథమ వనరును బతుకమ్మను సాగనంపి, విఘ్నేశ్వరుని ఆహ్వానం పలికే సమాజానికి కల్పతరువును.
నేనెవరనుకుంటున్నారు. చెరువును. నా గురించి చెబుతాను వినండి. నేను చెరువును, గ్రామాలకు వెలుగును, అన్ని వృత్తుల వారికి ఆధారాన్ని, పిల్లలను, పెద్దలను అలరించే పర్యాటక కేంద్రాన్ని, వినోదాన్ని పంచే వేదికను, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అద్దాన్ని, కళలకు ప్రేరణను, పరోపకారం నా వృత్తి. నా మనుగడ మీకు ప్రవృత్తి కావాలని ఆశిస్తున్నాను.
మీకు తెలుసా నేను ఎందరికో జీవనాధారాన్ని, నా నీరే కాదు నాలోని మట్టి కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. నాలో ఉన్న ఒండ్రుమట్టి చాల సారవంతమైంది. అది మీ పంట పొలాలకు ఎరువు. ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది. నేను మీ సంస్కృతి సంప్రదాయాలకు పండుగలకు నిలయాన్ని. నాలో ఎన్నో జలరాశులు, జలజీవాలున్నాయి. పిల్లలకు నేనొక ఆటస్థలాన్ని. హాయ్ పిల్లలు నా దగ్గర సాహసం చేయకండి. అది మీకే ప్రమాదం. నాలో అలుగులు పారినపుడు నన్ను చూడండి. అది ఒక రామసక్కని దృశ్యం అవుతుంది. నన్ను కలుషితం చేయకండి – నన్ను ఆక్రమించి ఇళ్ళ నిర్మాణం చేయకండి. నా ఒడ్డులగు గట్టులను రక్షించండి. నేను మీకు రక్షణగా ఉంటాను…..

Exam Tips:

a) ఏకపాత్రాభినయం ‘నేను’ అనే ఉత్తమ పురుషలో, చెరువు మాటలుగా రాయండి.
b) పరిచయం, తన ప్రత్యేకతలు, చివరన మనుషులకు విజ్ఞప్తి అనే క్రమాన్ని పాటించండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది పదాలు, వాక్యాలు చదవండి.
చెవినిల్లు గట్టుకొని, ఉర్కబోయి బోర్లపడ్డట్టు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, కుండబద్దలుకొట్టినట్లు, వండిన కుండ, గాలం వేయడం, గుండె చెరువైంది, తామరతంపర, కన్నెర్ర.
పై వాటిలో ఉన్న తేడాలు ఏమిటి ? వాటిని ఏమంటారు?

Answer:

జాతీయం: ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఉదా : చెవినిల్లు కట్టుకొని, గుండె చెరువైంది, కుండబద్దలు కొట్టినట్లు.
సామెత: సామ్యతనుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తరువాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా, గూఢార్థకంగా ఉంటాయి. ఉదా : ఉర్కబోయి బోర్లపడ్డట్టు; చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.

Exam Tips:

a) జాతీయం ఒక పదబంధం యొక్క విశేషార్థం; సామెత ఒక పూర్తి వాక్యంగా ఉండే నీతి వాక్యం.
b) ఉదాహరణలు ఏది ఏ రకమో తెలుసుకొని రాయండి.

 

Question 2: కింది వాటిలోని జాతీయాలను గుర్తించండి. వాటిని వివరించండి.
కోరిక, పండ్లుకొరుకు, కొట్టినపిండి, మొసలికన్నీరు, మాధుర్యం, తలలో నాలుక, కలుగు, పూసల్లో దారము, చెరువు, నిండుకుండవోలె, జాతర, చల్లగాలి

Answer:

మొసలి కన్నీరు : దొంగకన్నీరు. లేని బాధ నటిస్తూ ఏడవడాన్ని, బాధను చూపడాన్ని మొసలి కన్నీరు అంటారు.
నిండుకుండ వోలె : గంభీరంగా తొణకక బెణకక ఉండే మనస్త్వాన్ని గురించి చెప్పటానికి దీనిని ప్రయోగిస్తారు.
పండ్లు కొరుకు : కోప భావాన్ని వివరించడానికి ఈ జాతీయాన్ని వాడతారు.
పూసల్లో దారము : పూసలలో దారమంటే పూసలకు దారమెలా ఆధారమో అలా. ఆధారంగా నిలవాలని చెప్పటానికి ప్రయోగం చేస్తాం.
తలలో నాలుక : అందరితో కలివిడిగా కలిసి పోవటాన్ని చెప్పటానికి ఈ పదం ఉపయోగిస్తాం.

Exam Tips:

a) ఇచ్చిన జాబితాలో నుంచి జాతీయాలను మాత్రమే ఎంచుకోండి (సామాన్య పదాలను కాదు).
b) ప్రతి జాతీయానికి సందర్భంతో కూడిన అర్థం ఇవ్వండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది పదాల్లోని సంయుక్త, ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి.
ఉదా : విద్య = వి, ద్ + య్ + అ
(A) అక్క (B) ముగ్ధ (C) మూర్ఛ

Answer:

(A) అక్క = అ, క్ + క్ + అ
(B) ముగ్ధ = ము, గ్ + ధ్ + అ
(C) మూర్ఛ = మూ, ర్ + ఛ్ + అ

Exam Tips:

a) ప్రతి అక్షరాన్ని హల్లు + హల్లు + అచ్చు రూపంలో విడదీయండి; ద్విత్వంలో ఒకే హల్లు రెండుసార్లు వస్తుంది.
b) ఉదాహరణ విద్య = వి, ద్ + య్ + అ పద్ధతిని అనుసరించండి.

 

Question 2: కింది పదాలను విడదీసి రాయండి.

Answer:

(అ) ప్రజలెంత = ప్రజలు + ఎంత
(ఆ) నేనెవరిని = నేను + ఎవరిని
(ఇ) పోరేమిటి = పోరు + ఏమిటి
(ఈ) నాకింకా = నాకు + ఇంకా
(ఉ) ఇవన్నీ = ఇవి + అన్నీ
(ఊ) సోమనాద్రి = సోమన + అద్రి

Exam Tips:

a) రెండు పదాల మధ్య సంధి జరిగిన చోట ఏ అక్షరం పోయిందో గమనించి విడదీయండి.
b) విడదీసిన తరువాత మళ్లీ కలిపి చదివి సరిచూసుకోండి.

 

Free study material for Telugu

Telugu Class 6 Curriculum Solutions: Lesson 08 The Pond

Chapter Exercise Answers for Class 6 Telugu

Access structured TS Board textbook solutions for Lesson 08 The Pond. Designed in alignment with the latest academic curriculum for Class 6 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Detailed Answer Guides for Lesson 08 The Pond

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Complete Preparation Kit for Class 6 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 08 The Pond with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు for the 2026-27 session?

The complete and updated TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు will help students to get full marks in the theory paper.

Do you offer TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire TS 6th Class Telugu 8th Lesson Questions and Answers Telangana చెరువు in printable PDF format for offline study on any device.