Solutions for Class 6 Telugu: Lesson 06 Pothana Balyam (Pothana's Childhood)
Review structured textbook solutions for Class 6 Telugu Lesson 06 Pothana Balyam (Pothana's Childhood). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Practice Class 6 Telugu Solutions: Lesson 06 Pothana Balyam (Pothana's Childhood)
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
బొమ్మ చూసి చెప్పండి
Question 1: బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
Answer:
బొమ్మలో ఇద్దరు బాలురు గిల్లీ దండ ఆడుతున్నారు. ముగ్గురబ్బాయిలు గోళీలాట ఆడుతున్నారు. కొంతమంది అబ్బాయిలు రెండు జట్లుగా కబడ్డీ ఆడుతున్నారు. ఇద్దరమ్మాయిలు వామనగుంటలాడుతున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి జారుడు బండ ఆట ఆడుతున్నారు.
Exam Tips:
a) బొమ్మలోని ప్రతి ఆటను, ఆడేవారిని కలిపి పూర్తి వాక్యాల్లో చెప్పండి (గిల్లీదండ, గోళీలాట, కబడ్డీ, వామనగుంటలు, జారుడుబండ).
b) బొమ్మలో లేని ఆటలను రాయవద్దు.
Question 2: వాటిలో మీరు ఆడేవేవి ? ఆడనివేవి ?
Answer:
పై ఆటలలో అన్ని ఆటలు నేను ఆడుతాను.
Exam Tips:
a) మీరు నిజంగా ఆడే, ఆడని ఆటలను వేర్వేరుగా చెప్పండి; ఒక్క వాక్యంలో ముగించకండి.
b) ఆడని ఆటల పేర్లు కూడా రాస్తే పూర్తి జవాబు అవుతుంది.
Question 3: మీకు ఏ ఆట అంటే ఇష్టం ? ఆ ఆటను ఎట్లా ఆడుతారో చెప్పండి.
Answer:
నాకు కబడ్డీ అంటే ఇష్టం. ఒక జట్టులో నుండి ఒకరు ఆపకుండా కూతపెట్టుకుంటూ వెళ్ళి రెండవ జట్టులోని వారిని అంటుకొని వారికి దొరకకుండా రావాలి. దొరికితే ఇతడు ఔటు. దొరక్కపోతే అవతలివాడు ఔటు. అలా పాయింట్సు నిర్ణయిస్తారు.
Exam Tips:
a) ఒక ఆటను ఎంచుకొని ఎంతమంది, ఎలా ఆడతారు, గెలుపు ఎలా నిర్ణయిస్తారు అనే క్రమంలో రాయండి.
b) ఆటకు సంబంధించిన పదాలను (జట్టు, కూత, ఔటు, పాయింట్లు) సరిగా వాడండి.
ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ 56)
Question 1: “తమ్మునిమీద ఈగను వాలనీయడు” అంటే మీకేమర్థమయింది ?
Answer:
“తమ్ముని మీద ఈగవాలనీయడు” అంటే తమ్ముడికి ఏరకమైన ఆపదను కలుగనివ్వడు అని అర్థం. ఈగ వాలితే బరువునొప్పి ఏమీ ఉండదు. రెప్పపాటులో ఎగిరిపోతుంది. అంత చిన్న ఈగ వాలినా సహించడంటే తమ్మునికి చిన్న ఆపదను కూడా రానీయడు అని అర్థం.
Exam Tips:
a) ‘ఈగ వాలనీయడు’ అనేది జాతీయం; అక్షరార్థం కాకుండా ‘ఏ ఆపదా రానివ్వడు’ అనే భావాన్ని చెప్పండి.
b) ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మార్కులు పెరుగుతాయి.
Question 2: అన్న తన తినుబండారాలు తమ్మునికి ఇచ్చాడు. ఇట్లా తమ్ముని కోసం అన్న ఇంకా ఏమేమి చేయవచ్చు?
Answer:
అన్న తన తినుబండారాలు తమ్మునికిచ్చాడు. అలాగే తను ఆడుకొనే వస్తువులు ఇవ్వొచ్చు. తన దగ్గర తమ్ముడి కిష్టమైనవి ఏవైనా ఉంటే ఇవ్వొచ్చు. తమ్ముడికి చదువులోగాని, ఆటపాటల్లో గాని సాయం చెయ్యొచ్చు.
Exam Tips:
a) తినుబండారాలే కాక ఆటవస్తువులు, చదువులో సాయం, రక్షణ వంటి కనీసం మూడు పనులు సూచించండి.
b) అన్ని సూచనలు అన్నతమ్ముల ప్రేమను చూపేలా ఉండాలి.
Question 3: ‘తిప్పన పోతన’ లకు తగువులాట అంటే ఏమిటో తెలియదట. మరి మీ ఇంట్లో మీరు మీ అన్నదమ్ముళ్ళతోటి లేదా అక్కజెల్లెళ్ళతోటి ఎట్లా ఉంటారు ?
Answer:
తిప్పన, పోతన ఎప్పుడూ తగువులాడుకొనేవారు కాదు. నేను మా తమ్ముడు కూడా ఎప్పుడూ పోట్లాడుకోం, మా తమ్ముడి కేది కావాలంటే అది చేస్తాను. వాడు బడికి తయారుకావడానికి సాయం చేస్తాను. మంచి విషయాలు మంచి ఆటలు నేర్పుతాను.
Exam Tips:
a) మొదట పాఠంలోని తిప్పన పోతనల స్థితిని చెప్పి, తరువాత మీ ఇంటి అనుభవాన్ని రాయండి.
b) సొంత అనుభవం రాసేటప్పుడు ‘నేను’ అనే రూపంలో రాయండి.
ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ 57)
Question 1: పోతనను ‘ఉక్కు బాలుడు’ అని కవి ఎందుకు అనవలసి వచ్చింది ?
Answer:
ఉక్కు గట్టిదనానికి సూచన. పోతన ఒక్కక్షణం కూడా కుదురుగా ఉండకుండా ఎగురుతూ దూకుతూ పరుగెత్తుతుంటాడు. ఒక్కోసారి ఎత్తుమీంచి కిందపడ్డా వెంటనే బంతిలా పైకి లేచి పరుగెత్తి పోతాడు. ఎక్కడైనా దెబ్బతగలిందేమో కూడా చూసుకోడు. అందుకే పోతనను ఉక్కు లాంటి గట్టి బాలుడు అనవలసి వచ్చింది.
Exam Tips:
a) ‘ఉక్కు’ దృఢత్వానికి సంకేతం; పోతన పడినా లేచి పరుగెత్తే స్వభావాన్ని ఉదాహరణగా చెప్పండి.
b) కారణం అడిగారు కాబట్టి ‘అందుకే’ అని ముగించండి.
Question 2: పాడటంలో పోతనను కోకిలతో పోల్చాడు కదా! ఇంకా వేటిని వేటితో పోల్చవచ్చు? (ఉదా: నడకను, మాటను, కళ్ళను, మనస్సును, ముఖాన్ని, చేష్టలను)
Answer:
పాడటాన్ని కోయిలతో పోల్చినట్లే వయ్యారంగా నడుస్తుంటే హంసతో పోలుస్తారు. మాట్లాడటాన్ని చిలుకతో పోలుస్తారు. కళ్ళను కలువలతోను, ముఖాన్ని పద్మంతోను పోలుస్తారు. పరుగును జింక పిల్లతోను, పౌరుషాన్ని సింహంతోను పోలుస్తారు. బుద్ధికి బృహస్పతి అంటారు.
Exam Tips:
a) ప్రతి పోలికను ‘దేన్ని – దేనితో’ అనే రూపంలో జతగా రాయండి (నడక – హంస, ముఖం – పద్మం).
b) ఇచ్చిన సూచనలను (నడక, మాట, కళ్ళు, మనస్సు, ముఖం, చేష్టలు) అన్నింటినీ కలపండి.
Question 3: ‘వీడు అసాధ్యుడు!” అని ఎవరినైనా, ఏయే సందర్భాల్లో అంటారు ?
Answer:
ఎవరూ చెయ్యలేని పనులు చేసినప్పుడు, తన వయసుకు, శక్తికి మించిన పనులు చేసినపుడు, అందరూ ఆశ్చర్యపడేలా ప్రవర్తించినపుడు, అసామాన్యమైన ప్రతిభ చూపించినపుడు ఇలాంటి సందర్భాలలో “వీడు అసాధ్యుడు” అంటారు.
Exam Tips:
a) ‘అసాధ్యుడు’ అంటే ఎవరూ చేయలేనిది చేసేవాడు; రెండు మూడు సందర్భాలను ఉదాహరణలతో చెప్పండి.
b) పోతన ఆటలలో చూపిన నైపుణ్యాన్ని ఉదాహరించండి.
ఆలోచించండి – చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ 58)
Question 1: “దూకుతున్నాడ”న్నారు కదా! ఇవి కాక ఇంకా పిల్లలు ఏయే చేష్టలు చేస్తారో చెప్పండి.
Answer:
పిల్లలు దూకుతారు. ఎగురుతారు. పరుగెత్తుతారు. పైకెక్కి దిగుతారు. పక్షులను, జంతువులను అనుకరిస్తారు. ఆటల్లో ఎవరికీ కనబడకుండా దాక్కుంటారు.
వెంటబడి తరుముతూ పట్టుకుంటారు. ఎదుటి వారిని సరదాగా వెక్కిరిస్తారు. ఇలా పిల్లలు ఎన్నో చేష్టలు చేస్తారు.
Exam Tips:
a) దూకడంతో పాటు ఎక్కడం, దాక్కోవడం, అనుకరించడం, వెంటపడటం వంటి కొత్త చేష్టలను రాయండి.
b) ఒకే చేష్టను మళ్లీ రాయకండి.
Question 2: ‘పెరుగసాగె వేరొక ప్రక్క బిడ్డ యెడద’ అంటే మీకేమి అర్థమయ్యింది ?
Answer:
పోతన చదువులో దిట్ట. ఆటలలో మేటి, పాటలు పాడటంలో నేర్పుగలవాడు.
పిల్లలెంతమంది కలబడినా ఒక్కడే వారిని ఎదిరించి నిలబడగలడు. ఇవన్నీ ఒకవైపు, సాధు సత్పురుషులను ఆదరిస్తాడు. హరికథలు, పురాణాలు వింటాడు. శివపూజలు చేస్తాడు. ఇవన్నీ మరొకవైపు. రెండూ వేరు వేరు కోణాలు. అయినా పోతన అన్నీ చేయగలడు అంటే అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థం.
Exam Tips:
a) ‘ఒకవైపు ఆటపాటలు, మరొకవైపు భక్తి’ అనే రెండు కోణాలను స్పష్టంగా చెప్పండి.
b) ‘బహుముఖ ప్రజ్ఞ’ అనే మాటతో ముగించండి.
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ ఎట్లా ఉంటున్నదని మీరు అనుకుంటున్నారు ? విశ్లేషించండి.
Answer:
పోతన కాలంలో వ్యక్తుల మధ్య బంధాలు, ప్రేమలు గట్టిగా ఉండేవి. అందుకే ఉమ్మడి కుటుంబాలు చక్కగా ఉండేవి. ఈ రోజుల్లో అవకాశాలు, వసతులు, సౌకర్యాలు పెరిగే కొద్దీ ప్రేమలు తగ్గుతున్నాయి. అనుబంధాలు దూరమౌతున్నాయి. అదీగాక బడి చదువుల భారంతో పిల్లలకు ఆటపాటలకు సమయం లేకుండా పోతోంది. ఎవరి పని వారు చేసుకొని అలిసిపోయి పడుకుంటారు. ఇంక సోదరులు కలిసి గడిపే సమయం ఉండడం లేదు. ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ తగ్గిపోతోంది.
Exam Tips:
a) పాఠంలోని అనుబంధాలతో నేటి పరిస్థితిని పోల్చి విశ్లేషించండి.
b) కారణాలు (చదువుల భారం, ఉమ్మడి కుటుంబాలు తగ్గడం) సూచిస్తే విశ్లేషణ బలపడుతుంది.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
Question 1: ‘ఈ చిన్నబాలుడు అసాధ్యుడు” అనే భావం వచ్చే పద్య పంక్తి ఏది ? ఆ పద్యాన్ని, దాని భావాన్ని రాయండి.
Answer:
“చిరుతఁ డసాధ్యుఁఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్” అనేది ఆ పద్య పంక్తి.
గురినిడి కొట్టెనేని యొక గోలియుఁ దప్పదు కచ్చగట్టి బొం గరమును వేయ వ్రేటు కొక కాయ పటుక్కను, బందెమూని తా నుఱికిన లేడిపిల్లవలె నొక్కని యయ్యకుఁ జిక్కడద్దిరా!
చిఱుతఁ డసాధ్యుఁఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్.
భావం : గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీకూడా గురితప్పదు. పోటీపడి బొంగరాన్ని విసిరితే వేటువేటుకు ఇతరుల బొంగరాలు ‘పటుక్కని’ పగులవలసిందే. పందెం పెట్టుకొని పరుగెత్తాడంటే లేడిపిల్లవలె ఏ ఒక్కనికీ చిక్కడు. దాన్ని చూసి అదిరా! ఈ చిఱుతడు అసాధ్యుడు సుమా! అంటూ అందరు గుండెలమీద చేయి వేసుకొని ఆశ్చర్యపడుతుంటారు.
Exam Tips:
a) పద్య పంక్తిని ఎంపిక చేసి పూర్తిగా రాయండి; తరువాత పద్యాన్ని, భావాన్ని విడివిడిగా ఇవ్వండి.
b) పద్యంలో అక్షర దోషాలు లేకుండా, పాదభంగం లేకుండా రాయండి.
Question 2: కింది పద్యం చదవండి. భావంలోని ఖాళీలు పూరించండి.
కందుకము వోలె సుజనుడు
గ్రిందం బడి మగుడ మీదికి న్నెగయుఁ జుమీ!
మందుఁడు మృత్పిండము వలె
గ్రిందంబడి యడఁగి యుండు గృపణత్వమునన్.
అ. కింద పడ్డా పైకి లేచేవాడు ………………………
ఆ. అపజయం పాలైనా తిరిగి సాధిస్తాడు. ………………………
ఇ. మందుడు అంటే ………………………
ఈ. బంతితో పోల్చబడినవాడు ………………………
ఉ. ‘మట్టిముద్ద’ అనే పదానికి పద్యంలో వాడబడిన పదం ………………………
Answer:
అ. సుజనుడు
ఆ. విజయం
ఇ. తెలివిలేనివాడు
ఈ. సుజనుడు
ఉ. మృత్పిండము
Exam Tips:
a) పద్యం భావాన్ని ముందు అర్థం చేసుకొని ఖాళీలను పూరించండి; పద్యంలో వాడిన పదాలనే సమాధానంగా ఇవ్వండి.
b) ‘కందుకము’ అంటే బంతి, ‘మృత్పిండము’ అంటే మట్టిముద్ద.
III. స్వీయ రచన
Question 1: ఊళ్ళోని పెద్దలందరూ అన్నదమ్ములిద్దరినీ మెచ్చుకునేవారట. మీ చుట్టుపక్కలవారు నిన్ను మెచ్చుకునేటట్లుగా నీవు ఏం చేస్తావు ?
Answer:
నేను మా చుట్టుపక్కల వాళ్ళందరితోనూ స్నేహంగా ఉంటాను. వాళ్ళ పిల్లలతో కలిసి మెలిసి ఆడుకుంటూ, చదువుకుంటూ ఉంటాను. నేనెవరింటికెళ్ళినా వారితో ఎంతో గౌరవంగా మాట్లాడుతాను. ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. నా స్నేహితులెవరైనా బడికి రాకపోతే వారికి ఆ రోజు బడిలో జరిగిన పాఠాల గురించి, ముఖ్యమైన సంగతుల గురించి చెబుతాను. వారికి రాసుకోడానికి నా నోట్సులు ఇస్తాను. ఇలా చేస్తాను గనుక చుట్టుపక్కల వారు నన్ను ప్రేమగా చూస్తారు.
మెచ్చుకుంటారు.
Exam Tips:
a) చుట్టుపక్కల వారితో మీరు చేసే మంచి పనులను (స్నేహం, గౌరవం, సాయం) ఐదు వాక్యాల్లో రాయండి.
b) ఐదు వాక్యాల హద్దు దాటకండి.
Question 2: ‘కాళ్ళలో పాదరసం’ అంటే మీకు ఏమి అర్థమయింది ?
Answer:
పాదరసం ద్రవం రూపంలో ఉండే లోహం. దానిని పట్టుకోవాలంటే చేతికి చిక్కదు. అటూ ఇటూ దొర్లిపోతుంది. గట్టిగా పట్టుకుంటే చిన్న చిన్న ముక్కలై దొర్లుతూనే ఉంటుంది. అలాగే పోతన ఆటలో ఎవరికీ దొరక్కుండా తేలికగా తప్పించుకొనేవాడు. తప్పించుకోవాలంటే కాళ్ళతోనే గదా పరుగెత్తాలి. అందుకే ‘కాళ్ళలో పాదరసం’ అని ఉంటారు.
Exam Tips:
a) ‘పాదరసం’ లక్షణాన్ని (చేతికి చిక్కకపోవడం) చెప్పి దాన్ని పోతన పరుగుకు అన్వయించండి.
b) ఇది జాతీయం; భావార్థాన్ని చెప్పడం ముఖ్యం.
Question 3: ‘తిప్పన – పోతన’ లను రామలక్ష్మణులతో ఎందుకు పోల్చారు ?
(లేదా)
తిప్పనకు, పోతన పై గల ప్రేమ సొంతమాటల్లో రాయండి.
Answer:
రామలక్ష్మణులు అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి ప్రేమ. తిప్పన, పోతన కూడా అన్నదమ్ములు. అన్నమీద తమ్ముడికి, తమ్ముడి మీద అన్నకు ఎంతో ప్రేమ. అన్న తిప్పన తమ్ముడి మీద చూపించే అనురాగానికి ఊరంతా ఎంతో మెచ్చుకొనేవారు. అన్న అంటే పోతనకెంతో గౌరవం. తనకెవరైనా తినడానికిస్తే తిప్పన తమ్ముడికిచ్చేవాడు. తమ్ముడు కావాలంటే తనకెంత ఇష్టమైన వస్తువైనా ఇచ్చేసేవాడు. ఒక్క నిమిషం తమ్ముడు కనబడకపోతే ఊరంతా వెతికేవాడు.
తమ్ముడి మీద ఈగవాలనివ్వడు. అందుకే వారిద్దరినీ రామలక్ష్మణులతో పోల్చారు.
Exam Tips:
a) రామలక్ష్మణుల ప్రేమను, తిప్పన పోతనల ప్రేమను పక్కపక్కనే పోల్చి రాయండి.
b) ‘లేదా’ ఉన్నప్పుడు ఒక్క ప్రశ్నకే జవాబు రాయండి.
Question 4: ఈ పాఠం రాసిన కవి గురించి సొంతమాటల్లో రాయండి.
Answer:
‘పోతన బాల్యం’ అనే పాఠాన్ని రచించిన కవి డా॥ వానమామలై వరదాచార్యులు గారు. ఈ పాఠాన్ని చదివితే కవికి పోతనంటే ఎంత ఇష్టమో అర్థమౌతుంది. అంతేగాక పల్లెటూరి వాతావరణం, ఆటలు, పిల్లల కాలక్షేపాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. పోతన జీవిత విశేషాలు చదువుతుంటే కవి బాల్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది. కవి ఇందులో తేలికైన తేటతెలుగు పదాలు వాడాడు. అందులోనే చక్కని అలంకారాలు ప్రయోగించాడు. ఏ విషయాన్నైనా అలవోకగా రాయగల గొప్పకవి అని తెలుస్తోంది.
Exam Tips:
a) కవి పేరు, పాఠంలో ఆయన వర్ణించిన అంశాలు (ఆటలు, పల్లెటూరి వాతావరణం) చెప్పండి.
b) బిరుదులు, రచనల పేర్లు అవసరం లేదు, పాఠం ఆధారంగానే రాయండి.
Question 5: పోతన బాల్యాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ఆటలలో చదువులలో కూడా పోతనకు పోతనే సాటి అనవచ్చు- వివరించండి.
Answer:
తిప్పన, పోతన అన్నదమ్ములు. రామలక్ష్మణుల వలె ఒకరంటే ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. పోతనకు అన్న అంటే గౌరవం అన్నకు తమ్ముడంటే ప్రాణం. తిప్పన ఏదైనా పద్యాన్ని చదివితే పోతన ఒకసారి వినగానే అప్పజెప్పేవాడు. అంత సూక్ష్మబుద్ధి కలవాడు. పోతన ఆటలాడుతూ, దూకుతూ, ఎగురుతూ ఎవ్వరికీ దొరక్కుండా పరిగెత్తుతూ, కిందపడితే పట్టించుకోకుండా లేచి మళ్ళీ పరిగెత్తుతూ ఆడుతుండేవాడు.
ఆటల్లోనూ, పాటల్లోనూ, చదువులోనూ అన్నింటా పోతనదే పైచేయి. గోలీలాట, బొంగరాలాట, పరుగుపందెం అన్నిటా గెలుపు పోతనదే. ఊరివారంతా అతడి చురుకుదనానికి ఆశ్చర్యపోయేవారు. అమ్మతో పాటు గుడికెళితే ఏకాగ్రతతో దేవునికి నమస్కరించేవాడు. పరిసరాలుకూడా మర్చిపోయేవాడు. సాధు సజ్జనులను గౌరవించేవాడు. హరికథలను, పురాణాలను ఎంతో ఆసక్తితో వినేవాడు. శివారాధన చేయాలనే కోరిక మనసులో పెంచుకున్నాడు.
Exam Tips:
a) బాల్యం, అన్నదమ్ముల ప్రేమ, ఆటపాటల్లో నేర్పు, భక్తి అనే క్రమంలో పది వాక్యాలు రాయండి.
b) ప్రారంభంలో తిప్పన పోతనల సంబంధం చెప్పండి.
IV. సృజనాత్మకత / ప్రశంస
Question 1: పోతన తన బాల్యంలో ఆడుకొనే ఆటలు తెలుసుకున్నారు కదా! అట్లాగే మీరు ఆడుకొనే ఆటలు ఏవి ? ఆటలు ఎందుకోసం ఆడాలో, వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం రాయండి.
Answer:
ఆటలు – ప్రాముఖ్యం
1. పూర్వరంగం : పోతన బాల్యంలో గోళీలు, బొంగరాలు, కోతి కొమ్మచ్చులు, వంగుడు దూకుళ్ళు, పరుగెత్తడాలు వంటి ఆటలు ఆడుకొనేవాడని పోతన ల పాఠంలో చెప్పబడింది.
2. ప్రస్తుతం : ఇప్పుడు ఆ ఆటలేవీ పిల్లలు ఆడటం లేదు. ఒక పరుగు పందాలు మాత్రం ఆడుతున్నారు. నేను మా స్నేహితులు పరుగు పందాలు, దాక్కునే ఆటలు ఆడతాం. జట్లుగా కబడ్డి ఆడతాం. ఇంట్లో ఉంటే చదరంగంగానీ, మెకానో సెట్స్లోని ఆడుకుంటాను.
3. ఆటలు ఎందుకు ఆడాలి : ఆటలు ఆడినందువల్ల శరీరం దృఢంగా ఉంటుంది. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఒంటికి బాగా చెమటలు పట్టి శరీరంలోని మలినాలు బయటికి పోతాయి. చురుకుదనం వచ్చి పనులు చకచకా చేసుకుంటారు. బుద్ధి కూడా చురుకుగా ఉంటుంది. ఇలా ఆటలు చక్కని వ్యాయామం. అంతేగాక అందరితో కలిసి ఆడటం వల్ల టీమ్ స్పిరిట్ అలవాటౌతుంది. సంఘీభావం, సర్దుకుపోవటం లాంటి మంచి అలవాట్లు వస్తాయి. 3. ఆటల ప్రాముఖ్యం : ఆటలు ఆడకపోతే పిల్లల్లో మందకొడితనం ఏర్పడుతుంది. టి.వి.లు చూస్తూ కూర్చుంటారు. కళ్ళు దెబ్బతింటాయి. ఒళ్ళు పెరిగిపోతుంది.
అనవసరమైన రోగాలు చుట్టుకుంటాయి.
4. ముగింపు : కాబట్టి ఏ వయసు వారికైనా వ్యాయామం అవసరమే. అది పిల్లల విషయంలో ఆటలే మంచి వ్యాయామం.
Exam Tips:
a) వ్యాసాన్ని పూర్వరంగం, ప్రస్తుతం, ఆటల ప్రాముఖ్యం, ముగింపు అనే శీర్షికలతో రాయండి.
b) ఆరోగ్య ప్రయోజనాలను కారణాలతో వివరించండి.
Question 2: పోతన ఆడుకునేటప్పుడు చూసినవాళ్ళు “ఈ బాలుడు అసాధ్యుడు” అని అనుకునేవారు కదా! మరి ఇప్పుడు ఆడుకొనే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఊహించి సంభాషణలు రాయండి.
Answer:
లలిత : చూశావా జానకీ! రాజు ఎంత బాగా పరిగెత్తుతున్నాడో !
జానకీ : ఔనౌను. తప్పకుండా ముందున్న ముగ్గుర్నీ దాటేస్తాడు.
లలిత : వాడి కాళ్ళలో మెరుపు వేగం ఉంది. నిజంగా వాడు అసాధ్యుడే సుమా!
జానకీ : ఔనౌను. అటుచూడు. ఆ పక్కనించి రవి దూసుకొచ్చేస్తున్నాడు.
లలిత : నిజమే. ఎవరు ముందొస్తారో!
జానకీ : రవి రాజుతో పాటు జానీ, జీవన్ కూడా వేగం అందుకున్నారు.
లలిత : చూసే వాళ్ళకు మనకే ఎంత ఉత్కంఠగా ఉందో ! ఇక పిల్లల సంగతి ఏం చెప్పాలి.
జానకీ : నిజమే లలితా! ఈ కాలం పిల్లలు అసాధ్యులమ్మా! మన రోజుల్లో ఇంత గంభీరంగా ఉండేదికాదు. ఇప్పుడు పిల్లల్లో పట్టుదల, స్పర్థ బాగా పెరిగిపోతున్నది.
లలిత : ఎవరికి వారే తామే మొదటిస్థానం గెలవాలని పట్టుదలగా ఆడుతున్నారు. రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఇది మెచ్చుకోవలసిన విషయం.
జానకీ :ఔనౌను. అటుచూడు చివరగా పరుగెత్తుతున్న రాకేష్ అందర్నీ దాటి ఫస్టు వచ్చాడు. ఇది ఊహించని మలుపు.
Exam Tips:
a) సంభాషణలో ఇద్దరు వ్యక్తులు మార్చి మార్చి మాట్లాడేలా పేర్లు వాడి రాయండి.
b) ‘అసాధ్యులు’ అనే పదం తప్పకుండా వచ్చేలా చూడండి.
V. పదజాల వినియోగం
Question 1: కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి.
ఉదా : భారతీయులు సోదరభావం కలిగి ఉంటారు. (సోదరభావం – సౌభ్రాత్రము)
అ. లక్ష్మి పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది. (పుస్తకాన్ని)
ఆ. అర్జునుడు విలువిద్యయందు అధిపుడు. (అధిపుడు)
ఇ. బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు. (సోదరుడు)
ఈ. ప్రతిరోజు స్నానంచేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. (శరీరాన్ని)
Answer:
అ. పొత్తము
ఆ. మేటి
ఇ. అనుజుడు / అవరజుడు / యవీయసుడు
ఈ. మెయి
Exam Tips:
a) ఇచ్చిన వాక్యంలో ఉన్న పదానికి అర్థం ఇచ్చే పాఠంలోని పదాన్ని వెతికి రాయండి (పుస్తకం – పొత్తము).
b) ఒకటి కంటే ఎక్కువ పదాలుంటే అన్నీ రాయండి.
Question 2: కింది పట్టికలోని ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి. అ. భోజనం – క. నిద్ర ఆ. నిదుర – ఖ. పుస్తకం ఇ. పొత్త – గ. బోనం
Answer:
అ) భోజనం – గ. బోనం
ఆ) నిదుర – క. నిద్ర
ఇ) పొత్త – ఖ. పుస్తకం
Exam Tips:
a) ప్రకృతి సంస్కృత పదం, వికృతి తెలుగు రూపం అని గుర్తుంచుకోండి (నిద్ర – నిదుర).
b) జతపరచేటప్పుడు ఒక్కో అక్షరాన్ని సరిచూసుకోండి.
Question 3: కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) అనుజుడు
ఆ) గొంకుజంకులు
ఇ) మేటి
ఈ) ఆసక్తి
ఉ) వెత
ఊ) అసాధ్యుడు
Answer:
అ) అనుజుడు = తమ్ముడు. అర్జునుడు ధర్మరాజుకు అనుజుడు.
ఆ) గొంకుజంకులు = భయసందేహాలు. కిషోర్ గొంకుజంకులు లేకుండా చక్కగా ఉపన్యాసమిచ్చాడు.
ఇ) మేటి = శ్రేష్ఠుడు. ఏకలవ్యుడు విలువిద్యలో మేటి.
ఈ) ఆసక్తి = ఇష్టము. పిల్లలకు ఆటలమీద ఆసక్తి ఎక్కువ.
ఉ) వెత = బాధ. తుఫాన్లో సర్వం కోల్పోయిన వారి వెతలు చూస్తే మనసు కరిగిపోతుంది.
ఊ) అసాధ్యుడు = ఎవరికీ లొంగనివాడు. ఈ కాలంలో పిల్లలు తెలివితేటలలో అసాధ్యులుగా ఉన్నారు.
Exam Tips:
a) ముందు పదానికి అర్థం రాసి, తరువాత ఆ పదంతో మీ సొంత వాక్యం రాయండి.
b) వాక్యంలో పదం సరైన అర్థంలో వాడినదేనా చూసుకోండి.
Question 4: కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి.
అ) అరుణాస్పదమనే పురంలో ప్రవరుడు నివసించేవాడు. ఆ పట్టణం చాలా అందమైనది. ఆ నగరంలో ఆకాశాన్ని తాకే మేడలున్నాయి.
ఆ) సకాలంలో వర్షాలు పడితే ధరణి పులకరిస్తుంది. రైతు పుడమిని దున్ని విత్తనాలు చల్లుతాడు. పచ్చని పంటల తోటి అవని శోభిస్తుంది.
ఇ) కార్తీక్ ఇంటిమీద కపి కూర్చున్నది. ఆ వానరం చేతిలో కొబ్బరి చిప్ప ఉన్నది. అది చూసి మరో కోతి ఉరికొచ్చింది.
ఈ) మా గ్రామంలోని గుడి చాలా పెద్దది. నేను ప్రతినిత్యం కోవెలకు పోతాను. ఆ దేవాలయంలో ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
Answer:
అ) అదే అర్థం వచ్చే పదాలు : పురం, పట్టణం, నగరం.
ఆ) అదే అర్థం వచ్చే పదాలు : ధరణి, పుడమి, అవని.
ఇ) అదే అర్థం వచ్చే పదాలు : కపి, వానరం, కోతి.
ఈ) అదే అర్థం వచ్చే పదాలు : గుడి, కోవెల, దేవాలయం.
Exam Tips:
a) ఒకే అర్థం ఉన్న మూడు పదాలను వాక్యంలో గుర్తించి ఆ పదాల కింద గీత గీయండి.
b) పదాలను యథాతథంగా (వాక్యంలో ఉన్నట్లే) రాయండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: కింది పట్టికలోని పదాలను చదివి, పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలను, ఏకవచన బహువచనాలను, అవ్యయాలను గుర్తించండి.
బాలుడు, పుట్ట, బాలురు, ఆమె, పర్వతం, ఆహా, సీత, అమ్మో, డబ్బ, ఆటలు, అతడు, శభాష్, మహిళలు, పత్రిక, సుధాకర్, రచయిత్రి, చెట్టు, చంద్రుడు, ఉంగరం, నటి, అట్లని, రచనలు, బలరాం, బల్ల, ఆకాశం
Answer:
అ. పుంలింగ పదాలు : బాలుడు, బాలురు, చంద్రుడు, బలరాం, సుధాకర్, అతడు.
ఆ. స్త్రీలింగ పదాలు : ఆమె, సీత, మహిళలు, రచయిత్రి, నటి.
ఇ. నపుంసకలింగ పదాలు : పుట్ట, పర్వతం, డబ్బ, ఆటలు, పత్రిక, చెట్టు, ఉంగరం, రచనలు, బల్ల, ఆకాశం.
ఈ. ఏకవచనం : బాలుడు, పుట్ట, ఆమె, పర్వతం, సీత, డబ్బ, అతడు, పత్రిక, సుధాకర్, రచయిత్రి, చెట్టు, చంద్రుడు, ఉంగరం, నటి, బలరాం, బల్ల, ఆకాశం.
ఉ. బహువచనం : బాలురు, ఆటలు, మహిళలు, రచనలు.
ఊ. అవ్యయం : ఆహా, అమ్మో, శభాష్, అట్లని.
Exam Tips:
a) పురుషులు – పుంలింగం, స్త్రీలు – స్త్రీలింగం, ఇతరమైనవి – నపుంసకలింగం అని గుర్తుంచుకోండి.
b) ఏకవచనం, బహువచనం ఒక్కొక్కటి వేరుగా పరిశీలించండి; అవ్యయాలకు లింగ వచనాలు ఉండవు.
Question 2: కింది వాటిని జతపరచండి.
అ. నామవాచకం – క. చదివింది
ఆ. సర్వనామం – ఖ. కాని
ఇ. విశేషణం – గ. ఆమె
ఈ. క్రియ – ఘ. ఎర్రని
ఉ. అవ్యయం – ఙ. హైదరాబాదు
Answer:
అ. నామవాచకం – ఙ. హైదరాబాదు
ఆ. సర్వనామం – గ. ఆమె
ఇ. విశేషణం – ఘ. ఎర్రని
ఈ. క్రియ – క. చదివింది
ఉ. అవ్యయం – ఖ. కాని
Exam Tips:
a) ఎడమ వైపు భాషాభాగం, కుడివైపు ఉదాహరణ పదం అని సరిచూడండి.
b) ఒకసారి ఉపయోగించిన జవాబును మళ్లీ వాడకండి.
Question 3: కింది ఖాళీలను పూరించండి.
అ. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ___________
ఆ. నామవాచకానికి బదులుగా వాడేది ___________
ఇ. పనిని తెలిపే మాట ___________
ఈ. లింగ వచన విభక్తులు లేనివి ___________
ఉ. పేరును తెలిపే పదం ___________
Answer:
అ. విశేషణం
ఆ. సర్వనామం
ఇ. క్రియ
ఈ. అవ్యయాలు
ఉ. నామవాచకం
Exam Tips:
a) భాషాభాగాల నిర్వచనాలను సొంత మాటల్లో గుర్తుంచుకోండి.
b) అవ్యయాలకు లింగ, వచన, విభక్తులు ఉండవనే సూత్రం ముఖ్యం.
ముఖ్యమైన ప్రశ్నలు
Question 1: ఆటలలో పోతన నేర్పు వివరించండి.
Answer:
పోతన ఆటల్లో ఆరితేరినవాడు. గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీ కూడా గురి తప్పదు. స్నేహితులతో పోటీపడి బొంగరాన్ని విసురుతుంటే ఒక్కొక్క వేటుకు ఒక్కొక్క బొంగరం ముక్కలయ్యేది. పందెం పెట్టుకొని పరిగెత్తితే లేడిపిల్లాగా ఎవరికీ చిక్కడు. చెట్ల కొనకొమ్మల నెక్కుతాడు. పక్షివలె దూకుతాడు. ఒక్క క్షణం కూడా నేలమీద కాలు నిలవదు.
పాదరసంలా జారిపోతాడు.
Exam Tips:
a) గోలీలు, బొంగరాలు, పరుగుపందెం అనే మూడు ఆటలను ఉదాహరణలుగా చెప్పండి.
b) ‘పాదరసం’ పోలికను చివర వాడితే జవాబు చక్కగా ముగుస్తుంది.
Question 2: పోతన భక్తి ఎలాంటిది ?
Answer:
పోతన అమ్మ గుడికి పోతుంటే ఆమె వెంటే వెళతాడు. వేరే ఏ ధ్యాసకూడా లేకుండా దేవుని మీదే మనసు లగ్నం చేసి మళ్ళీ మళ్ళీ దేవుడికి నమస్కారాలు చేస్తాడు. సాధువులను, సజ్జనులను సేవిస్తాడు. హరికథలను, పురాణాలను ఆసక్తిగా వింటాడు. శివుని పాదాలను నిరంతరం పూజించాలనే కోరిక ఎక్కువగా కలవాడు.
Exam Tips:
a) పోతన భక్తిలోని మూడు అంశాలు (గుడికి వెళ్ళడం, సాధుసేవ, హరికథలు, శివపూజ) తప్పక పేర్కొనండి.
b) ఇది భావ ప్రశ్న; ఉదాహరణలతో చిన్న పేరాగా రాయండి.
Free study material for Telugu
Free TS Board Textbook Explanations: Class 6 Telugu Lesson 06 Pothana Balyam (Pothana's Childhood)
Chapter Exercise Answers for Class 6 Telugu
Access structured TS Board textbook solutions for Lesson 06 Pothana Balyam (Pothana's Childhood). Designed in alignment with the latest academic curriculum for Class 6 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Detailed Answer Guides for Lesson 06 Pothana Balyam (Pothana's Childhood)
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Complete Preparation Kit for Class 6 Exams
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 6 Telugu.
FAQs
The complete and updated TS 6th Class Telugu 6th Lesson Questions and Answers Telangana పోతన బాల్యం is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 6th Class Telugu 6th Lesson Questions and Answers Telangana పోతన బాల్యం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 6th Lesson Questions and Answers Telangana పోతన బాల్యం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 6th Lesson Questions and Answers Telangana పోతన బాల్యం in both English and Hindi medium.
Yes, you can download the entire TS 6th Class Telugu 6th Lesson Questions and Answers Telangana పోతన బాల్యం in printable PDF format for offline study on any device.