Download TS Board Solutions for Class 6 Telugu Lesson 03 Varsham (Rain)
Review structured textbook solutions for Class 6 Telugu Lesson 03 Varsham (Rain). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access TS Board Solutions and Answers
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
బొమ్మను చూడండి – మాట్లాడండి
Question 1: బొమ్మలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు ?
Answer:
బొమ్మలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు వాన చినుకులతో ఆడుకుంటున్నారు.
Exam Tips:
a) బొమ్మలో ఉన్నవారి సంఖ్య, వారు చేస్తున్న పని రెండూ రాయండి.
b) పూర్తి వాక్యాలలో జవాబు ఇవ్వండి.
Question 2: బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో ఊహించండి.
Answer:
బాలిక మబ్బును చూస్తూ
వానావానా వల్లప్పా వానలు కురిసే వల్లప్పా
బావులు నిండే చెరువులు నిండే
వాగులు పొంగి పరుగులు తీసే ॥ వానావానా వల్లప్పా|| అనే పాట పాడుతున్నది.
Exam Tips:
a) వానకు సంబంధించిన పదాలు (వాన, చెరువులు, వాగులు) పాటలో వచ్చేలా రాయండి.
b) పాటను పాదాలుగా విడగొట్టి, లయ చెడకుండా రాయండి.
Question 3: వానపడుతుంటే మీరేం చేస్తారు ? మీకేం చేయాలనిపిస్తుంది ?
Answer:
వానపడుతుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. శరీరానికి ఎంతో చల్లగా ఉంటుంది. అప్పుడు నాకు పాటలు పాడాలనిపిస్తుంది చురుక్కుమంటూ మీదపడే చినుకులతో ఆడుకోవాలని అనిపిస్తుంది.
Exam Tips:
a) మీ సొంత అనుభవాన్ని రెండు మూడు వాక్యాలలో రాయండి.
b) ఆనందం, చల్లదనం వంటి భావాలను వ్యక్తం చేసే పదాలు వాడండి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.22)
Question 1: మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు?
Answer:
నడుమంతరపు సిరి అంటే మొదటి నుంచీ లేకుండా మధ్యలో అనుకోకుండా వచ్చి చేరిన సంపద అని అర్థం. మేఘాలు వర్షాకాలంలో మాత్రమే నీటితో నిండి ఉంటాయి. వర్షాకాలం పూర్తి కాగానే తేలికైపోతాయి. అందువల్ల అన్నివేళల్లోనూ లేకుండా మధ్యలో వచ్చి మధ్యలో పోయే మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి పోల్చాడు.
Exam Tips:
a) ‘నడుమంతరపు సిరి’ అంటే మధ్యలో వచ్చి చేరిన సంపద అని మొదట అర్థం చెప్పండి.
b) మేఘం – సిరికి మిడిసిపడేవాడు అనే పోలికను స్పష్టంగా రాయండి.
Question 2: వర్షం పడడాన్ని కవి వర్ణించాడు కదా! జోరువాన పడుతుంటే మీకెట్లా అనిపిస్తుంది ?
Answer:
మొదట హాయిగా అనిపిస్తుంది. వినసొంపైన లయతో పడే వాన చినుకుల శబ్దాలకు అనుగుణంగా పాటలు పాడాలని అనిపిస్తుంది. వాన చినుకులతో ఆడుకోవాలని కూడా అనిపిస్తుంది. కానీ అదేపనిగా ఎండ రాకుండా ఎడతెరపి లేకుండా రోజూ వర్షం పడుతూనే ఉంటే విసుగొస్తుంది. వర్షానికి ఇళ్ళ మట్టిగోడలు పడిపోయి, పై కప్పులు ఎగిరిపోయి బాధలుపడే పేదలను చూస్తే బాధేస్తుంది.
Exam Tips:
a) ఆనందం, విసుగు, బాధ అనే మూడు భావాలను వేర్వేరు వాక్యాలలో రాయండి.
b) జోరువానలో పేదల బాధను ప్రస్తావిస్తే కవి దృక్కోణంతో సరిపోతుంది.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.23)
Question 1: ప్రజలందరు ఛత్రపతులైనారని కవి ఎందుకన్నాడు ?
Answer:
ఛత్రం అంటే గొడుగు. ఛత్రపతి అంటే గొడుగు కలిగినవాడు. వర్షంలో తడవకుండా జాగ్రత్త కోసం గొడుగును ఉపయోగిస్తున్నారు. జోరుగా కురిసే వానలో తడవకుండా ప్రజలందరూ గొడుగులు పట్టుకున్నారు అని చెప్పడం కోసం కవి ఈ మాటలు అన్నాడు.
Exam Tips:
a) ఛత్రం = గొడుగు, ఛత్రపతి = గొడుగు కలవాడు అని పదార్థం చెప్పి, భావాన్ని వివరించండి.
b) పద్యంలోని ‘ప్రభు పాలితులనక’ (ధనిక – పేద భేదం లేకుండా) అంశాన్ని ప్రస్తావించండి.
Question 2: ‘భూసతి రామచిలుకయయ్యె’ అని కవి ఎందుకన్నాడు ?
Answer:
భూసతి అంటే ‘భూమి’ అనే స్త్రీ. రామచిలుక ఆకుపచ్చగా ఉంటుంది.
రామచిలుకయయ్యె అంటే రామచిలుక రంగులాగా ఆకుపచ్చగా మారింది అని తాత్పర్యం. వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తున్నది అని చెప్పడానికి కవి ఈ మాటలు అన్నాడు.
Exam Tips:
a) భూసతి = భూమి, రామచిలుక = ఆకుపచ్చ రంగు అనే రెండు అర్థాలు తప్పక రాయండి.
b) వర్షం వల్ల నేల పచ్చగా మారడమే ఈ మాటల భావం.
Question 3: వానలు పడడం వల్ల వాతావరణం ఎట్లా మారుతుంది ? ఏమేం జరుగుతుంది ?
Answer:
వానలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది. కారుమబ్బులతో అంతా చీకటైపోతుంది. నేలంతా ఎటుచూసినా వాన నీళ్ళే కనిపిస్తాయి. అజాగ్రత్తగా నడిస్తే కాలు జర్రున జారుతుంది. వానల వల్ల బావులు, చెరువులు నిండుతాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తాయి. జలాశయాలు కళకళలాడతాయి. వర్షానికి పులకరించి నేలంతా పచ్చదనంతో రామచిలుకవలె కనిపిస్తుంది. రైతులు నాగలిపట్టి వ్యవసాయానికి సిద్ధపడతారు.
Exam Tips:
a) చల్లదనం, చీకటి, జారుడు నేల, నిండే చెరువులు, రైతుల పనులు అనే అంశాలను వరుసగా రాయండి.
b) ఐదారు వాక్యాలలో ముగించండి.
Question 4: మబ్బులను చూసి గుడిసెల కప్పులు, గుంజలు ఎందుకు గడగడలాడినాయి?
Answer:
గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. ఆకాశంలో నల్లని మబ్బులను చూడగానే వాటికి భయమేసింది. వాన అప్పటికే వాడిపోయిన, పట్టుతప్పిన తమను కూల్చేస్తుందేమోనని గుడిసెల కప్పులూ, వాటి గుంజలు గడగడలాడినాయి.
Exam Tips:
a) ఎండలకు వాడిపోయిన కప్పులు, గాలికి ఊగే గుంజలు అనే రెండు కారణాలు చెప్పండి.
b) ‘గడగడలాడడం’ అంటే భయపడడం అని వివరించండి.
Question 5: “శరీరములను రిపులకు అప్పజెప్పడం” అంటే నీకేమి అర్థమయింది ?
Answer:
రిపులు అంటే శత్రువులు. అంటే దోమలు, తేళ్ళు, పాములు మొదలైనవి అని భావం. పేదలు పూరిగుడిసెల్లో నేలమీద పడుకొని నిద్రపోతారు. వర్షంపడినప్పుడు కలుగుల్లోకి, పుట్టల్లోకి నీరు చేరడం వల్ల తేళ్ళు, పాములు బయటికి వస్తాయి. అలాగే అనుకూలమైన వాతావరణం వల్ల దోమలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి.
ఇటువంటి ప్రమాదకర పరిస్థితులలో కూడా పేదలు వాటినుంచి రక్షణకోసం తగిన జాగ్రత్తలు తీసుకోలేరు. వారి ప్రాణాలు దైవాధీనాలు అని అర్థమైంది.
Exam Tips:
a) రిపులు = శత్రువులు (దోమలు, తేళ్ళు, పాములు) అని అర్థం స్పష్టంగా రాయండి.
b) చివర పేదల నిస్సహాయతను ఒక వాక్యంలో చెప్పండి.
Question 6: పుడిసెడు పేదకాపురము అని కవి అన్నాడు కదా! పేదల కాపురాలు ఎట్లా ఉంటాయి ?
Answer:
కూడు, గూడు, గుడ్డ అనే కనీసావసరాల కోసం ప్రతిరోజూ తిప్పలు పడేవారు పేదవారు. ఏరోజుకారోజు కష్టించి పనిచేస్తేనే గానీ వారి కాపురాలు గడవవు. వారు నివసించే గుడిసెలు ఎండకూ, వానకూ, గాలికీ తట్టుకొని నిలబడేటంత బలంగా ఉండవు. చేతినిండా పని దొరకక, కంటినిండా నిద్రలేక, వంటినిండా కప్పుకునే గుడ్డలేక పేదల కాపురాలు అంతంతమాత్రంగా అతుకుల బొంతలా ఉంటాయి.
Exam Tips:
a) కూడు, గూడు, గుడ్డ అనే కనీస అవసరాలను తప్పక పేర్కొనండి.
b) ‘పుడిసెడు పేదకాపురం’ అంటే ఎంతో చిన్న పేద సంసారం అని భావం.
ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: నీకు ఏ కాలం అంటే చాలా ఇష్టం ? ఎందుకు ?
Answer:
నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు వాన ధారలను మా కిటికీలోనుంచి చూస్తే బలే సరదాగా ఉంటుంది. వాన చినుకులలో తడిస్తే జలుబు చేసి జ్వరం వస్తుందని భయమే గానీ చిరుజల్లుల్లో ఆడుకుంటే ఎంత బాగుంటుందో. మా పాఠశాల ఆటస్థలంలో మేం ఆడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండా వానజల్లు పడుతుంది. అప్పుడు చురుకు చురుకుమంటూ చెంపలను కొడుతున్నట్లు పడే చిరుజల్లు ఎంతో బాగుంటుంది. అందుకే నాకు వానాకాలం అంటే చాలా ఇష్టం.
Exam Tips:
a) ఇష్టమైన కాలం, కారణం, ఒక సొంత అనుభవం – ఈ మూడూ ఉండేలా రాయండి.
b) పరిచయం, కారణాలు, ముగింపు క్రమంలో రాస్తే బాగుంటుంది.
Question 2: పాఠం చదివారు కదా! కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ?
Answer:
పరిచయం : కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని సమర్థిస్తాను. కవి వర్షం గురించి చెప్పిన విషయాలు అన్నీ సరైనవే.
అ) మేఘం గర్వం : వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అనే ఆరు ఋతువులలో వర్ష ఋతువు మధ్యలో వస్తుంది మధ్యలోనే పోతుంది. ఎండాకాలంలో భూమిమీద నీరే ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘాలై కురుస్తాయి. అందువల్ల మేఘం హఠాత్తుగా ఏర్పడినట్లు అనిపిస్తుంది. నల్లని మబ్బు మీసాలు దువ్విన ఆకారంలో కనిపిస్తుంది. ఇంత మిడిసిపడిన మేఘం కూడా నీరైపోయి చివరకి సముద్రం పాలౌతుంది.
ఆ) వర్షధార : చిన్నచిన్న చినుకులతో మొదలయ్యే వాన ఒక్కసారిగా ఉరుములతో, వడగండ్లతో కుండపోతగా మారడం మనం నిత్యం చూస్తున్నదే.
ఇ) ప్రజలు – ఛత్రపతులు : వానలో నేలపై అజాగ్రత్తగా నడిస్తే కాలు జారుతుంది. వానకు తడవకుండా ప్రతి ఒక్కరూ గొడుగు పట్టుకుంటారు. నేలంతా ఎటుచూసిన వాననీళ్ళే. భూమి అంతా వాననీళ్ళవల్ల పచ్చదనంతో నిండిపోయింది. వర్షం పడ్డాక రైతులు వ్యవసాయం మొదలుపెడతారు.
ఈ) వానదాడి: వాన తన ప్రతాపాన్ని భవంతులమీద కాక పేదల గుడిసెల మీద చూపుతుంది. మేడలు, మిద్దెలు వానకు తట్టుకుంటాయి. కానీ ఎండకు ఎండి, గాలికి పట్టుతప్పి ఉన్న పేదల గుడిసెలే వానకు తేలికగా కూలిపోతాయి. ముగింపు : ఈ పాఠంలో కవి వర్షం గురించి చెప్పిన విషయాలు అన్నీ ప్రతిసారీ మన అందరి అనుభవంలోకి వచ్చేవే. చక్కని పరిశీలన దృష్టి కలిగిన కవి కనుక పల్లా దుర్గయ్య ఈ అంశాలను మనోహరంగా వర్ణించారు.
Exam Tips:
a) మొదట ‘సమర్థిస్తాను’ అని స్పష్టంగా చెప్పి, పాఠంలోని కవి భావాలతో కారణాలు ఇవ్వండి.
b) అ, ఆ, ఇ, ఈ అనే పాయింట్ల వారీగా రాయండి; చివర ముగింపు రాయడం మరవకండి.
II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
Question 1: కింది భావం వచ్చే వాక్యాలను పాఠంలో వెతికి రాయండి.
అ. నడుమంతరపు సిరికి గర్వపడే వారి గర్వం నీరై సముద్రంలో కలిసిపోతుంది.
ఆ. నెర్రెరెలిచ్చిన నేలంతా అద్దంవలె మారి నీడలు కనిపిస్తున్నాయి.
ఇ. పటపటమని వడగండ్లు నేలమీద పడినాయి.
ఈ. సంపన్నులు మేడల్లో హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు.
ఉ. నల్లని మబ్బులను చూడగానే గుడిసెలు, గుంజలు గడగడలాడుతున్నాయి.
Answer:
అ. “నడుమంతరపున్ సిరి కుబ్బు వారి గ
ర్వోన్నతి నిల్వునీరయి మహోదధి పాలయి పోదె”
ఆ. “నెఱియలు వాఱిన నేలనంతట నద్ద
ములు దాపినట్లు నీడలు కనబడె”
ఇ. “పటపట వడగండ్లు పుడమిపై బడె”
ఈ. “ఉన్నత సౌధ గోపురపు టుయ్యెల మంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మునియుండు సంపన్నుల”
ఉ. “గుడిసెల కప్పులొప్పెడలె, గుంజలు పాదుల నూగులాడెడిన్, గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత”
Exam Tips:
a) ఇచ్చిన వాక్యానికి సరిపోయే పద్యపాదాన్ని పద్యం నుంచి యథాతథంగా (మార్చకుండా) రాయండి.
b) పద్యపాదాన్ని ఉటంకింపు గుర్తులలో (“ ”) రాయండి.
Question 2: కింది కవితను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
చిటపట చినుకుల వాన – చిరుజల్లై కురిసేనా
నేలంతా తడిపే వాన – హరివిల్లై విరిసేనా
జలజల గలగల పారే – సవ్వడి ఈ వాన
చెరువులు బావులు నిండుగ – నింపే ఈ వాన
పసిడి పంటలను ఇవ్వగా పరుగెత్తే ఈ వాన
పరిసరాలను పచ్చదనంతో నింపేటి ఈ వాన.
ప్రశ్నలు:
అ. వాన ఎట్లా కురిసింది ?
ఆ. వాన వేటిని నింపడానికి కురిసింది ?
ఇ. వానవల్ల కలిగే లాభమేమిటి?
ఈ. “పసిడి పంటలు” అనే పదంలో పసిడి అనే పదానికి సమానార్థక పదం ఏది?
ఉ. పై కవితలో ఉన్న జంటపదాలు ఏవి ?
Answer:
అ. చిటపట చినుకుల వాన చిరుజల్లై కురిసింది.
ఆ. వాన చెరువులు, బావులు నింపడానికి కురిసింది.
ఇ. పసిడి పంటలను ఇవ్వడం, పరిసరాలను పచ్చదనంతో నింపడం అనే రెండూ వాన వల్ల కలిగే లాభాలు.
ఈ. పసిడి అనే పదానికి సమానార్థక పదం బంగారం.
ఉ. జలజల, గలగల అనేవి పై కవితలో ఉన్న జంట పదాలు.
Exam Tips:
a) అపరిచిత కవితలో జవాబులు కవితలోని పదాలనే ఉపయోగించి రాయండి.
b) జంటపదాలు అంటే ఒకే రకమైన శబ్దాన్ని రెండుసార్లు చెప్పే పదాలు (జలజల, గలగల).
III. స్వీయ రచన
Question 1: వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా! మరి శీతకాలంలో ఎట్లా ఉంటుంది ?
Answer:
శీతకాలంలో చలి ఎముకలు కొరికేస్తుంది. ఈ చలి బాధ కూడా భవనాలలో ఉండే వారికంటే సౌకర్యవంతంగా లేని గుడిసెలలో ఉండే వారికి ఎక్కువ. ఈ కాలంలో కూడా ఉన్నవారు ముసుగుదన్ని పడుకుంటే, లేని వారు, నిరుపేదలు కడుపు నింపుకోడానికి కష్టపడుతూనే ఉంటారు. శీతాకాలంలో పగటి పొద్దు తక్కువ.
రాత్రిపొద్దు ఎక్కువ. సాయంత్రం తొందరగా చీకటిపడుతుంది. అంతకు ముందునుంచే మంచు కురవడం మొదలవుతుంది. రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. తెల్లవారిన చాలాసేపటికి గానీ సూర్యుడు కనబడడు. పొగమంచు తొలగే వరకూ ప్రజలు చలికి వణుకుతూనే ఉంటారు.
Exam Tips:
a) చలి, చీకటి, మంచు, పేదల కష్టం అనే అంశాలతో ఐదు వాక్యాలు రాయండి.
b) ధనికులకు – పేదలకు తేడాను ఒక వాక్యంలో చెప్పండి.
Question 2: “చిన్ని చొప్ప కప్పు గుడిసెల్ వడికూలగ దాడిచేతువా ?” అని కవి ఎందుకు అని ఉంటాడు ?
Answer:
సాధారణంగా వర్షం పడినప్పుడు బలమైన పునాదులతో, ఇనుము, సిమెంటులతో నిర్మించిన భవనాలకు పెద్ద ప్రమాదం ఉండదు. కానీ తాటాకులతోనో, జొన్న చొప్పతోనో కప్పిన గుడిసెలకు మాత్రం ప్రమాదమే. అవి వర్షం జల్లులకు నానిపోయి కూలిపోతాయి కూడా. అందువల్లనే కవి ఓ వానదేవుడా! ఎత్తైన మేడలలో ఉండేవారి ఇళ్లను ఏమీ చేయలేక జొన్నచొప్పతో కప్పిన పేదల ఇళ్ళపై దాడి చేస్తావా ?
చేయవద్దు సుమా! అని కవి అని ఉంటాడు
Exam Tips:
a) పటిష్ఠమైన భవనాలు – తేలికైన గుడిసెలు అనే తేడాను వివరించండి.
b) చివర కవి వానదేవుడిని వేడుకున్నాడని ముగించండి.
Question 3: వర్షాల కోసం ఎవరెవరు ఎదురుచూస్తారు ? ఎందుకు ?
Answer:
వర్షాల కోసం భూమిపై ఉండే ప్రతి జీవి ఎదురుచూస్తుంది. మండే ఎండలతో బాధలు పడుతూ తాగడానికి గుక్కెడు నీళ్ళైనా లేని పరిస్థితులలో దాహం తీర్చుకోవడానికి ప్రతి జీవి ఎదురుచూస్తుంది. వర్షంపడితే బావులు, చెరువులూ నిండుతాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. పశువులకూ, పక్షులకూ, మనుషులకూ మంచినీరు బాగా లభిస్తుంది. ఆబోతులైతే హంకారంతో రంకెలు వేస్తాయి. వర్షం వస్తేనే రైతులు నాగలిపట్టి వ్యవసాయపు పనులు మొదలుపెడతారు. వర్షం వల్లనే నేలంతా పులకరించి పచ్చని పైర్లతో సస్యశ్యామలమవుతుంది.
Exam Tips:
a) అన్ని జీవులు (మనుషులు, పశుపక్ష్యాదులు, రైతులు) అని ఉదాహరణలతో రాయండి.
b) ఎండ బాధ – వర్షంతో ఉపశమనం అనే క్రమంలో రాయండి.
Question 4: డా॥ పల్లా దుర్గయ్య గురించి రాయండి.
Answer:
పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి. ఈయనకు ‘సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. ’16 వ శతాబ్దియందలి ప్రబంధ వాఙ్మయం-తద్వికాసం’ అనే అంశంపైన పరిశోధన చేశాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యభాగమైన ‘వర్షం’ ఆయన రచించిన ‘పాలవెల్లి’ అనే ఖండకావ్యంలోది.
Exam Tips:
a) జన్మస్థలం, తల్లిదండ్రులు, చదువు, రచనలు, శైలి అనే క్రమంలో రాయండి.
b) ‘పాలవెల్లి’ ఖండకావ్యం నుంచి ‘వర్షం’ పాఠం తీసుకున్నారని తప్పక రాయండి.
Question 5: పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
Answer:
1. పరిచయం : ‘వర్షం’ అనే పాఠ్యభాగం డా॥ పల్లా దుర్గయ్య రచించిన ‘పాలవెల్లి’ అనే ఖండకావ్యం నుంచి గ్రహించబడింది. ఇందులో కవి మేఘం యొక్క గర్వం, వర్ష విజృంభణ, నేలపులకింత, విన్నపం అనే అంశాలను మనోహరంగా వర్ణించారు.
2. మేఘం గర్వం : మేఘం పుట్టీ పుట్టకుండానే ఆకాశంలోకి ఎగబాకింది.
నల్లమేఘాలకొసలు మీసాలు దువ్వుతూ నవ్వుతున్నట్టున్నాయి. మధ్యలో వచ్చి మధ్యలోనేపోయే నీరు అనే సంపదతో మిడిసిపడినా మేఘం కరిగి నీరయి నేలపైపడి చివరికి సముద్రం పాలు కావలసిందే.
3. వర్ష విజృంభణ: చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమిమీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది.
4. నేల పులకింత : వేసవి ఎండలకు నెర్రెరెలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ గొడుగులు అంటే ఛత్రాలు పట్టుకొని ఛత్రపతులు అయ్యారు. వర్షం అన్ని జీవుల్లో ఆశలు నింపింది.
5. విన్నపం : వానతో పూరిగుడిసెలలో ఉండే పేదలను ఇబ్బంది పెట్టవద్దని కవి వానదేవుణ్ణి ప్రార్థించాడు.
Exam Tips:
a) పరిచయం, మేఘం గర్వం, వర్ష విజృంభణ, నేల పులకింత, విన్నపం అనే ఐదు శీర్షికలు వరుసగా రాయండి.
b) పది వాక్యాల పరిమితిలో పాఠంలోని ప్రధాన భావాలను మాత్రమే రాయండి.
IV. సృజనాత్మకత / ప్రశంస
Question 1: మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి.
Answer:
ప్రకృతిలోని ప్రతి దృశ్యమూ మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చేదే. పున్నమి వెన్నెల, ఇంద్రధనుస్సు, లేగదూడల పరుగులు, నదిలో తిరిగే పడవులు, పక్షుల కిలకిలరావాలు, సెలయేళ్ళ, జలపాతాల చప్పుడు ఇలా ప్రకృతి దృశ్యాలు మనలను ఎక్కడికో తీసికొని వెళతాయి. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో పక్షులు గూళ్ళకు చేరేటప్పుడు చేసే కూతల గురించి ఎంతైనా చెప్పవచ్చు. అది కూడా ఏదైనా ప్రశాంత వాతావరణంలో ఏ మామిడి తోటలోనో, నది ఒడ్డున కూర్చుని వింటే, ఆ పక్షుల కిలకిల రావాలు ఎంత కాలమైనా మరచిపోలేము. కోకిల కుహూ కుహూ రావాలు, పిచ్చుకమ్మల కిచకిచలు, చిలుకమ్మల, కాకమ్మల కూతలు భాషకందని అనుభూతులు.
Exam Tips:
a) మనసుకు నచ్చిన ఒక దృశ్యాన్ని ఎంచుకొని, చూసినట్లుగా వర్ణించండి.
b) ఉపమానాలు, చక్కని విశేషణాలు వాడితే మార్కులు పెరుగుతాయి.
Question 2: ఎండాకాలంలో వాతావరణాన్ని, ప్రజల స్థితిగతులను వర్ణిస్తూ వ్యాసం రాయండి.
Answer:
1. పరిచయం : గ్రీష్మఋతువులో ఎండలు మెండుగా ఉంటాయి. అంటే ఏప్రిల్, మే నెలల్లో కాసే ఎండలను తట్టుకోవడానికి ప్రజలు ఎన్నో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ఎండలు, ఉక్కపోత, తీరని దాహం, వడగాలులు ముఖ్య లక్షణాలు.
2. ఎండలు : ఎండాకాలంలో పగటి పొద్దు ఎక్కువగా ఉంటుంది. తెలతెలవారుతూనే సూర్యుడు పరుగులు తీస్తూ పైపైకి వస్తూంటాడు. పొద్దున్నుంచే ఎండతీవ్రత పెరుగుతూ ఉంటుంది. మిట్టమధ్యాహ్నం తలపైన గొడుగు లేకుండా కాలికి చెప్పులు లేకుండా నడవలేం.
3. ఉక్కపోత: ఎండాకాలంలో విపరీతంగా చెమట పడుతుంది. ప్రతి ఒక్కరూ విసనకర్రలతోనో, పంకాలతోనో, చలిమరలతోనో సేదతీరవలసిందే.
4. తీరని దాహం : విపరీతమైన చెమట వల్లనే గొంతు తడి ఆరిపోయి ఎక్కువ దాహం వేస్తుంది. ఎన్ని నీళ్ళు తాగినా ఆ దాహం తీరదు. అందువల్ల ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.
5. వడగాలులు : సాయంత్రం పూట మొదలై అర్ధరాత్రి వరకూ వీచే వడగాలులు చాలా ప్రమాదకరమైనవి. ఈ గాలులు వడదెబ్బకూ, ప్రాణాపాయానికీ ముఖ్యకారణాలు. అందుకోసం చల్లని నీడలో సేదతీరాలి.
6. ముగింపు : ప్రజలు ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా ఎండలో తిరగకపోవడం, చల్లని నీడలో సేదదీరడం వంటి జాగ్రత్తలతో ఎండాకాలంలో ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
Exam Tips:
a) పరిచయం, ఎండలు, ఉక్కపోత, దాహం, వడగాలులు, ముగింపు అనే శీర్షికలతో రాయండి.
b) ముగింపులో తీసుకోవలసిన జాగ్రత్తలు (నీరు తాగడం, నీడలో ఉండడం) రాయండి.
V. పదజాల వినియోగం
Question 1: ముందు చదివిన పాఠాల నుండి కింది గుణింతాలతో కూడిన పదాలను వెతికి పట్టిక ఆధారంగా రాయండి.
గుణింతాల గుర్తులు: ా, ి, ీ, ు, ూ, ె, ే, ై, ొ, ో, ౌ, ం
Answer:
| గుణింతం | ా | ి | ీ | ు | ూ | ె | ే | ై | ొ | ో | ౌ | ం |
| పదం | బావుటా | నిమిషము | నీతి | పుడమి | మూక | పెంచుకున్న | దేశభక్తి | వైపు | కొమ్మ | లోటు | ఔనౌను | జింక |
Exam Tips:
a) ప్రతి గుణింతానికి పాఠాల్లో నుంచి ఒక పదం ఎంచి, పట్టికలో రాయండి.
b) పదంలో ఆ గుణింతం గుర్తు స్పష్టంగా కనిపించాలి.
Question 2: కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
అ. సోమనాద్రిరాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది.
ఆ. కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు.
ఇ. ఎండాకాలం మిద్దెపై పడుకుంటే పయ్యెర హాయిగా వీస్తుంది.
ఈ. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి.
Answer:
అ. తాపడం = అతికించడం
ఆ. కృషికులు = రైతులు
ఇ. పయ్యెర = గాలి
ఈ. వడిగా = వేగంగా
Exam Tips:
a) వాక్య సందర్భాన్ని బట్టి సరైన అర్థం ఎంచుకోండి.
b) వ్యావహారిక పదం (రైతులు, గాలి) అర్థంగా రాయండి.
Question 3: కింది వాక్యాలు చదువండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి.
అ. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. కాని ఆ ఉదధి రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి.
ఆ. నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి.
ఇ. మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని మనం పుట్టడానికి, నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు.
Answer:
అ. సముద్రం,ఉదధి, పయోధి
ఆ. నింగి ,అంబరం
ఇ. భూమి , అవని, పుడమి
Exam Tips:
a) ఒకే అర్థం ఇచ్చే పదాలను (పర్యాయపదాలను) గుర్తించి వరుసగా రాయండి.
b) సముద్రం – ఉదధి – పయోధి; నింగి – అంబరం; భూమి – అవని – పుడమి జతలను గుర్తుంచుకోండి.
Question 4: కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ. బొబ్బలెక్కు
ఆ. అశ్రద్ధ
ఇ. పటపట
ఈ. ఆశలుప్పొంగు
ఉ. పులకరించు
Answer:
అ. శరీరం కాలి బొబ్బలెక్కినప్పుడు బర్నాల్ గానీ, తేనెగానీ రాసి ప్రథమ చికిత్స చేయాలి.
ఆ. ఒక్కోసారి చిన్నపాటి అశ్రద్ధ వల్ల పెద్ద అవకాశాన్ని కోల్పోతాం.
ఇ. కోపంలో కొంతమంది పళ్ళు పటపటలాడిస్తారు. దీనివల్ల పళ్ళు దెబ్బతింటాయి.
ఈ. భవిష్యత్తుపై ఎన్నో ఆశలుప్పొంగే లేత వయసులో ఏ నిర్ణయానికైనా పెద్దల సలహాలు తీసుకోవాలి.
ఉ. రామాయణంలో హనుమంతుడి సాహస ఘట్టాలు వింటూ ఉంటే ఒడలు పులకరిస్తుంది.
Exam Tips:
a) ఇచ్చిన పదం వాక్యంలో యథాతథంగా ఉండేలా చూసుకోండి.
b) వాక్యం పూర్తి అర్థం ఇచ్చేలా, చిన్నదిగా రాయండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: నాల్గవ పద్యాన్ని చదివి అందులో ఉన్న సరళాక్షరాలను, పరుషాక్షరాలను, మహాప్రాణాలను, అనునాసికాలను గుర్తించి రాయండి.
ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢ సుషుప్తిని మునియుండు సంపన్నుల
మీదికిన్ జనగ వాటము కామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా!
Answer:
సరళాక్షరాలు (గ, జ, డ, ద, బ అనే అక్షరాలతో వచ్చేవి) : గో, దు, గా, గు, గా, డు, ది, జ, గ, దే, డా, గు, డి, డి, గ, దా, డి.
పరుషాక్షరాలు (క, చ, ట, త, ప అనే అక్షరాలతో వచ్చేవి) : త, పు, పు, టు, చ, తి, క, ప్తి, ప, కి, ట, కా, చి, చొ, ప్ప, క, ప్పు, కూ, చే, తు.
మహాప్రాణాలు : ధ, ఢ
అనునాసికాలు (న, మ మొదలైనవి) : న్న, మం, ము, న్న, న్ను, మూ, మ, ని, ని, ము, ని, న్ను, మీ, న, న, ము, మి, ని, న, న్న, ని.
Exam Tips:
a) అక్షరంలో ఉన్న మూల హల్లు (గుణింతం, ద్విత్వం ఉన్నా) ఏ వర్గానికి చెందుతుందో చూసి గుర్తించండి.
b) సరళాలు: గ జ డ ద బ; పరుషాలు: క చ ట త ప; అనునాసికాలు: ఙ ఞ ణ న మ అని గుర్తుంచుకోండి.
Question 2: కింది పేరాలోని పుంలింగ, స్త్రీ లింగ, నపుంసకలింగ పదాలను గుర్తించి రాయండి.
సునీత ఉదయాన్నే నిద్రలేచి బడికి వెళ్ళింది. బడిలో సురేష్ తాను రాసిన కథను సునీతకు వినిపించాడు. ఆ కథలో కుందేలు చెట్టు తొర్రలో తన పిల్లతో ఆడుకునే సన్నివేశం సునీతకు బాగా నచ్చింది. కుందేలు, ముంగీసతో స్నేహం చేయడం కూడ బాగా నచ్చిందని, సునీత పూజితతో చెప్పింది. కథను గోపాల్‌కు కూడ వినిపించింది. అందరూ బాగుందని సురేశ్‌ను మెచ్చుకున్నారు.
Answer:
స్త్రీ లింగ పదాలు: సునీత, పూజిత
పుంలింగ పదాలు: సురేష్, గోపాల్
నపుంసకలింగ పదాలు: కథ, కుందేలు, ముంగీస
Exam Tips:
a) స్త్రీ పాత్రలు, పురుష పాత్రలు, వస్తు/జంతు వాచకాలు అని మూడు వర్గాలుగా విడదీసి రాయండి.
b) మానవేతర (కుందేలు, ముంగీస, కథ) పదాలు నపుంసకలింగంలోకి వస్తాయి.
ప్రాజెక్టు పని
Question 1: వానాకాలాన్ని వర్ణించే రెండు మూడు పాటలు లేదా కవితలు సేకరించండి. వాటిని రాసి, చదివి వినిపించండి.
Answer:
1. ప్రాజెక్టు శీర్షిక : : వానా కాలాన్ని వర్ణించే రెండు పాటలు / కవితలు సేకరించడం, నివేదిక రాయడం.
2. సమాచార సేకరణ : అ) సమాచారం సేకరించిన తేది: ఆ) సమాచార వనరు : అంతర్జాలం
3. సేకరించిన విధానం : నేను అంతర్జాలం నుండి ఈ క్రింది పాటలను సేకరించాను.
4. నివేదిక:
పాట 1:
వచ్చెను వచ్చెను వర్షాలు మా వసుధారాణికి తలబ్రాలు
విచ్చిన పూలై ప్రజాముఖమ్మున వెల్లివిరిసెను మురిపాలు
కత్తులు కత్తులు కలిసిన యట్టుల ఉత్తర దిక్కున ఉరిమింది,
కనుపాపల చెక్కని మెరిసింది. గడగడ గడగడ దివి ఉరిమింది.
చకచక చకచక దిశ మెరిసింది
చలిగాడుపు రివరివ విసిరింది.
పాడు కరవులకు బాణాలు మా
పంట చేలకివి ప్రాణాలు మా ॥ వచ్చెను ॥
కాపు కన్నులకు ముత్యాలు వరి
కర్రల నోళ్ళకు చనుబాలు ॥ వచ్చెను ॥
కోడెనాగులై ఉరికే వాగులు
క్షీరధారలై పారే తోగులు
భూసతి వానల తానములాడి
పచ్చిక కోకల పైట సవరించె ॥ వచ్చెను ॥
పాట 2:
వానల్లు కురువాలె వానదేవుడా!
వరిచేలు పండాలె వానదేవుడా!!
నల్లాని మేఘాలు వానదేవుడా!
సల్లంగ కురువాలె వానదేవుడా!!
తూరుపు దిక్కున వానదేవుడా!
తుళ్ళితుళ్ళి కురువాలె వానదేవుడా!!
చాటంత మబ్బుపట్టి వానదేవుడా!
వర్షంగా మారాలె వానదేవుడా!!
చుక్కచుక్క నీరు చేరి వానదేవుడా!
మాకు ఆసరవ్వాలె వానదేవుడా!!
మావూరి కుంటల్లు వానదేవుడా!
మత్తడై దుంకాలె వానదేవుడా!!
చెరువులన్ని నిండాలె వానదేవుడా!
అలుగులై పారాలె వానదేవుడా!!
పాట 3:
వానలు జోరుగ కురవాలోయ్
బాగా పంటలు పండాలోయ్
బిడ్డల బొజ్జలు నిండాలోయ్
రైతుల రాజ్యం రావాలోయ్
అందరి మిత్రత అల్లాలోయ్
స్వతంత్ర పాలన కావాలోయ్
స్వర్ణయుగమని చాటాలోయ్
భారత్ జగతిలో వెలగాలోయ్
5. ముగింపు : వర్షాలు కురవడం వల్ల సమస్త ప్రాణి కోటికి నీరు లభిస్తుంది. పంటలు బాగా పండుతాయి. పశుపక్ష్యాదులకు మేత దొరుకుతుంది. ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉంటారని తెలుసుకున్నాను.
Exam Tips:
a) శీర్షిక, సమాచార సేకరణ, విధానం, నివేదిక, ముగింపు అనే ఐదు శీర్షికలు వరుసగా రాయండి.
b) పాటలను తప్పులు లేకుండా పాదాలుగా రాయండి; మూలం (అంతర్జాలం/గ్రంథాలయం) తప్పక పేర్కొనండి.
ముఖ్యమైన ప్రశ్నలు
Question 1: మేఘం గర్వం గురించి కవి చేసిన వర్ణనను వివరించండి.
Answer:
గ్రీష్మ ఋతువులో కాసిన మండుటెండల తరువాత ఆకాశంలో మబ్బులు పట్టి వర్షాలు కురుస్తాయి. ఎండ నుండి జీవులకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తాయి. ఎండవేడికి నేలమీద ఉన్న నీరు ఆకాశంలోకి వెళ్ళి వాతావరణం చల్లబడ్డాక వర్షంగా కురుస్తుంది. అందువల్లనే మేఘం పుట్టుకను మనం గమనించలేం. ఆవిరిరూపంలో ఆకాశంలోకి వెళ్ళి మేఘం రూపంగా మనకు కనబడుతుంది. వర్షించే మేఘం నల్లగా ఉంటుంది.
దాని రూపం దువ్విన మీసాల ఆకారంలో ఉంటుంది. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరం అనే ఆరు ఋతువులలో వర్షఋతువు మధ్యలో వస్తుంది. మళ్ళీ మధ్యలోనే పోతుంది. అలాగే మేఘాలకు సాధారణంగా వర్షించే సామర్థ్యం వర్షాకాలంలోనే ఉంటుంది. ఇంత మిడిసిపడే మేఘమైనా కరిగి నీరై నేలమీద పడి చివరికి సముద్రం పాలుకావలసిందే అంటూ కవి మేఘం గర్వం గురించి వివరించాడు.
Exam Tips:
a) నల్లని మేఘం, మీసాలు దువ్వినట్లు ఆకారం, మధ్యలో వచ్చి మధ్యలో పోయే వర్షఋతువు – ఈ అంశాలను రాయండి.
b) చివరలో “గర్వించిన మేఘం కూడా నీరై సముద్రంలో కలుస్తుంది” అనే కవి భావంతో ముగించండి.
Question 2: వర్షం వలన ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో వివరించండి.
(లేదా)
పేదలపై ప్రతాపాన్ని చూపించకు వానదేవుడా ? అని కవి ఎందుకన్నాడు ?
Answer:
పేదల ఇళ్ళు చిన్నవిగా ఉంటాయి. వాటిని వారు జొన్న చొప్పతో కప్పుకుంటారు. అవి ఎండలకు ఎండిపోయి ఉంటాయి. అంతేగాక వేగమైన గాలులకు పట్టుతప్పి ఉంటాయి. ఆ ఇళ్ళ గుంజలు పాదుల నుంచి ఊగిసలాడుతూ ఉంటాయి.
అటువంటి ఆ కప్పులూ, గుంజలూ ఆకాశంలో కనిపించే కారుమబ్బులను చూసి గజగజలాడతాయి. అసలే అంతంతమాత్రంగా బలహీనంగా ఉన్న తమ మీద వాన పడితే ఎక్కడ నాశనమైపోతామో అని అవి భయపడతాయి. అటువంటి పూరిగుడిసెలలో పేదలు నేలమీదే పడుకుంటారు. కలుగుల్లోనూ, పుట్టల్లోనూ వాన నీరు చేరడం వల్ల బయటకు వచ్చే పాములు, తేళ్ళు వంటి శత్రువులనుంచి వారికి ప్రమాదం పొంచి ఉంటుంది.
Exam Tips:
a) పేదల గుడిసెలు, గాలికి ఊగే గుంజలు, కారుమబ్బులను చూసి భయపడడం అనే క్రమంలో రాయండి.
b) పాములు, తేళ్ళ వల్ల వచ్చే ప్రమాదాన్ని చివరలో చెప్పండి.
Question 3: ‘వర్షం’ ను వర్ణిస్తూ గేయం/కవిత రాయండి.
Answer:
వర్షాలు కురవాలి వానదేవుడా
వాగులు పారాలి వానదేవుడా
వంకలు సాగాలి వానదేవుడా
చెరువులు నిండాలి వానదేవుడా
కరువంతా పోవాలి వానదేవుడా
పుడమి పులకించాలి వానదేవుడా
చిగురులే తొడగాలి వానదేవుడా
పువ్వులే పూయాలి వానదేవుడా
పంటలు పండాలి వానదేవుడా
కష్టాలు తొలగాలి వానదేవుడా
ప్రజలంతా మురవాలి వానదేవుడా
Exam Tips:
a) ప్రతి పాదం చివర “వానదేవుడా” వచ్చేలా ఒకే లయలో రాయండి.
b) వానవల్ల కలిగే మేలు (చెరువులు నిండడం, పంటలు, పచ్చదనం)ను ఇతివృత్తంగా తీసుకోండి.
Question 4: క్రింది పద్యానికి భావం రాయండి.
వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి యీ గుడిసెల కప్పు లొప్పెడలె, గుంజలు పాదులు నూగులాడెడిన్, గడగడలాడుచున్నయవి కారుమొగుళ్లను గాంచినంత, నీ పుడిసెడు పేదకాపురము పొల్లొనరింపకు వానదేవుడా!
Answer:
గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి, వేగంగా వీచే గాలులకు పట్టుతప్పిపోయాయి. వాటి గుంజలు ఊగులాడుతున్నాయి. నల్లని మబ్బులను చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి. ఓ వానదేవుడా! ఈ పేద సంసారాన్ని నాశనం చేయకు.
Exam Tips:
a) పద్యంలోని ప్రతి పాదం భావం ఒక వాక్యంలో వచ్చేలా వరుసగా రాయండి.
b) చివర “పేద సంసారాన్ని నాశనం చేయకు” అనే విన్నపాన్ని తప్పక చెప్పండి.
Question 5: ఈ క్రింది పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి.
ఉన్నత సౌధ గోపురపు ………….. దాడి చేతువా!
Answer:
ఉన్నత సౌధ గోపురపు టుయ్యెలమంచములందు తిన్నగా
కన్నులు మూసి గుఱ్ఱుమని గాఢసుషుప్తిని మునియుండు సంపన్నుల
మీదికిన్ జనగ వాటము కామిని వానదేవుడా!
చిన్నని చొప్పకప్పు గుడిసెల్ వడి కూలగ దాడిచేతువా!
Exam Tips:
a) పద్యంలో నాలుగు పాదాలు వరుసగా, ఒక్క పదమూ మారకుండా రాయండి.
b) చివరి పాదంలోని “దాడిచేతువా!” వంటి ముగింపు పదాలు మరవకండి.
Question 6: ఈ క్రింది గద్యాన్ని చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి.
చిత్ర లేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వం వంటివి లలితకళలు. భావం మనస్సుకు హత్తుకునే విధంగా బొమ్మలు గీయడం చిత్రలేఖనం. వీనుల విందుగా ఉండే గాన కళ సంగీతం. మనలను కదలకుండా అనేక భావాలను మనస్సుకు అందించే కళ శిల్పకళ. రాగ, తాళ, లయలకు తగినవిధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలను కూర్చి చెప్పేదే కవిత్వం.
Answer:
1. వేటిని లలిత కళలు అంటారు ?
2. మనస్సుకు హత్తుకునే విధంగా బొమ్మలు గీయడం ఏ కళ ?
3. సంగీతం ఏ విధంగా ఉంటుంది ?
4. ఏ కళలో రాగ, తాళ, లయలకు అనుగుణంగా అభినయం ఉంటుంది ?
5. పదాలను అందంగా కూర్చి చెప్పేది ఏది ?
Exam Tips:
a) ప్రశ్నలకు జవాబులు గద్యంలోనే దొరికేలా, వేర్వేరు ప్రశ్నార్థక పదాలతో (ఏది, ఎట్లా, ఏ…) రాయండి.
b) ప్రతి ప్రశ్న చివర “?” గుర్తు పెట్టండి.
Question 7: ‘వర్షం’ పాఠం రచించిన కవిని గురించి రాయండి.
Answer:
డా॥ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్యశాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎం.ఎ. పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ’16 వ శతాబ్దియందలి ప్రబంధ వాఙ్మయం- తద్వికాసం’ అనే అంశంపైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది.
Exam Tips:
a) జన్మస్థలం, తల్లిదండ్రులు, చదువు, రచనలు, శైలి అనే క్రమంలో రాయండి.
b) “పాలవెల్లి” రచన పేరు తప్పక పేర్కొనండి.
బహుళైచ్ఛిక ప్రశ్నలు
Question 1: ఎండాకాలం మిద్దెపై పడుకుంటే ‘పయ్యెర’ హాయిగా వీస్తుంది. గీతగీసిన పదానికి అర్థం ?
a) గాలి
b) నీరు
c) విసనకర్ర
d) వింజామర
Answer:
a) గాలి
Exam Tips:
a) పయ్యెర = గాలి; ఇతర ఎంపికలలో (విసనకర్ర, వింజామర) గందరగోళం పడకండి.
Question 2: వేసవికాలంలో వడగాలులలో తిరగకూడదు. గీతగీసిన పదానికి అర్థం. (వడ)
a) వాన
b) దుమ్ము
c) వేడి
d) ఆవిరి
Answer:
c) వేడి
Exam Tips:
a) వడ = ఎండ, వేడి; “వడగాలి” అంటే వేడిగాలి అని గుర్తుంచుకోండి.
Question 3: వాతావరణ కాలుష్యం పెరగడం వల్లనే పుడమిపై ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. గీత గీసిన పదానికి అర్థం (పుడమి)
a) సముద్రం
b) భూమి
c) ఆకాశం
d) గాలి
Answer:
b) భూమి
Exam Tips:
a) పుడమి = భూమి, అవని, ధరణి – ఈ పర్యాయపదాలను జతగా నేర్చుకోండి.
Question 4: పాలితులే పాలకులు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న గొప్పదనం. – గీత గీసిన పదానికి అర్థం (పాలితులు)
a) పాలించేవారు
b) అణగదొక్కేవారు
c) రాజులు
d) పాలింపబడేవారు
Answer:
d) పాలింపబడేవారు
Exam Tips:
a) పాలితులు = పాలింపబడేవారు (ప్రజలు); పాలకులు = పాలించేవారు – తేడా గుర్తుంచుకోండి.
Question 5: మబ్బులు ఎంతగా కురిసినా ఆకాశం మాత్రం తడవదు. గీత గీసిన పదానికి పర్యాయపదాలు (ఆకాశం)
a) నింగి, గగనం
b) నీరు, జాలరి
c) నిప్పు, మంట
d) నేల, ధరణి
Answer:
a) నింగి, గగనం
Exam Tips:
a) ఆకాశానికి పర్యాయపదాలు: నింగి, గగనం, మిన్ను, అంబరం.
Question 6: ప్రాణికోటికి మంచినీటికి వారిదమే ఆధారం. – గీత గీసిన పదానికి పర్యాయపదాలు (వారిదం)
a) కొళాయి, పంపు
b) నది, ఏరు
c) సముద్రం, కడలి
d) మేఘం, మబ్బు
Answer:
d) మేఘం, మబ్బు
Exam Tips:
a) వారిదం = మేఘం (నీటిని ఇచ్చేది); మేఘం, మబ్బు, ఘనం ఒకే అర్థం ఇస్తాయి.
Question 7: ‘వసుధ’ అను పదానికి పర్యాయ పదాలు
a) పృథ్వి, జలధి
b) అవని, పుడమి
c) ముత్యము, ముక్తి
d) అడవి, వనము
Answer:
b) అవని, పుడమి
Exam Tips:
a) వసుధ = అవని, పుడమి, భూమి; “జలధి” సముద్రం కాబట్టి (a) తప్పు.
Question 8: వర్షం పదానికి నానార్థాలు
a) బాష్పం, నీరు
b) వాన, వృష్టి
c) సృష్టి, హర్షం
d) వాన, సంవత్సరం
Answer:
d) వాన, సంవత్సరం
Exam Tips:
a) నానార్థాలు అంటే ఒకే పదానికి వేర్వేరు అర్థాలు; వర్షం = వాన, సంవత్సరం.
b) (b) లో రెండూ ఒకే అర్థం (పర్యాయపదాలు) కాబట్టి అది సమాధానం కాదు.
Question 9: ఇందులో ద్విత్వాక్షరాన్ని గుర్తించండి.
a) ట్లో
b) క్క
c) ద్యు
d) ంటే
Answer:
b) క్క
Exam Tips:
a) ద్విత్వాక్షరం అంటే ఒకే హల్లు రెట్టింపై వచ్చేది (క్క, త్త, ల్ల).
b) ట్లో, ద్యు వంటివి సంయుక్తాక్షరాలు (వేర్వేరు హల్లులు కలిసినవి).
Question 10: వడలకు వాడిపోయి వడి పయ్యెర యూపుకు పట్టువీడి – ఇందులో ఉన్న అంతస్థాలను గుర్తించండి.
a) య్యె, ర, ల, వ
b) శ, ష, స, హ
c) క, చ, ట, త, ప
d) అ, ఆ, ఇ, ఈ
Answer:
a) య్యె, ర, ల, వ
Exam Tips:
a) అంతస్థాలు: య, ర, ల, వ; పదంలో ఇవి ఉన్న అక్షరాలను వెతికి ఎంపికతో సరిచూడండి.
Question 11: రాముడు సీతకోసం వానరులతో కలిసి లంకకుచేరి రావణుణ్ణి జయించాడు. ఇందులో పుంలింగ పదాలను గుర్తించండి.
a) వానరులు, లంక
b) సీత, రాముడు
c) రాముడు, రావణుడు
d) సీత, లంక
Answer:
c) రాముడు, రావణుడు
Exam Tips:
a) పుంలింగ పదాలు పురుషులను సూచిస్తాయి (రాముడు, రావణుడు); లంక, వానరులు ఆ వర్గంలో రావు.
Question 12: సంపన్నుల మీదికిన్ జనగ వాటము కామిని – గీతగీసినది ఏ విభక్తికి చెందింది ?
a) ప్రథమా
b) ద్వితీయా
c) చతుర్థీ
d) షష్ఠీ
Answer:
d) షష్ఠీ
Exam Tips:
a) “కిన్/కు” ప్రత్యయం ఈ పాఠ్యపుస్తకం ప్రకారం షష్ఠీ విభక్తి.
Question 13: అర్జునుడు విలువిద్యలో శ్రీరాముడంతటివాడు. గీతగీసిన పదం ఏ భాషా భాగం ?
a) నామవాచకం
b) సర్వనామం
c) విశేషణం
d) క్రియ
Answer:
a) నామవాచకం
Exam Tips:
a) పేర్లను తెలిపే పదాలు (అర్జునుడు, శ్రీరాముడు) నామవాచకాలు.
Question 14: శ, ష, స, హ లను ఏమంటారు ?
a) ఊష్మాలు
b) అంతస్థాలు
c) సరళాలు
d) అనునాసికాలు
Answer:
a) ఊష్మాలు
Exam Tips:
a) ఊష్మాలు: శ, ష, స, హ; ఈ నాలుగింటినీ కలిపి గుర్తుంచుకోండి.
Question 15: క, చ, ట, త, ప లను ఏమంటారు ?
a) సరళాలు
b) వర్గయుక్కులు
c) పరుషాలు
d) అంతస్థాలు
Answer:
c) పరుషాలు
Exam Tips:
a) పరుషాలు: క చ ట త ప (కఠినంగా పలికేవి).
Question 16: ‘అంతస్థాలు’ అని వేటినంటారు ?
a) అ, ఆ, ఇ, ఈ
b) ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అక్షరాలు
c) ‘క-ఱ’ మధ్యగల అక్షరాలు
d) య, ర, ల, వ
Answer:
d) య, ర, ల, వ
Exam Tips:
a) అంతస్థాలు = య, ర, ల, వ; అచ్చులు (అ–ఔ), హల్లులు (క–ఱ) అనే వేరే వర్గాలతో గందరగోళపడకండి.
Question 17: గ, జ, డ, ద, బ లకు గల పేరు
a) సరళాలు
b) పరుషాలు
c) అంతస్థాలు
d) అచ్చులు
Answer:
a) సరళాలు
Exam Tips:
a) సరళాలు: గ జ డ ద బ; వీటిని పరుషాలు (క చ ట త ప) తో జతగా పోల్చి గుర్తుంచుకోండి.
Free study material for Telugu
Telugu Class 6 Curriculum Solutions: Lesson 03 Varsham (Rain)
Textbook Solutions for Class 6 Telugu Lesson 03 Varsham (Rain)
Explore reliable textbook solutions for Lesson 03 Varsham (Rain) tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 03 Varsham (Rain) with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం in both English and Hindi medium.
Yes, you can download the entire TS 6th Class Telugu 3rd Lesson Questions and Answers Telangana వర్షం in printable PDF format for offline study on any device.