TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ

Solutions for Class 6 Telugu: Lesson 04 Lekha (The Letter)

Review structured textbook solutions for Class 6 Telugu Lesson 04 Lekha (The Letter). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Practice Class 6 Telugu Solutions: Lesson 04 Lekha (The Letter)

View or download the dedicated Lesson 04 Lekha (The Letter) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

బొమ్మను చూడండి – మాట్లాడండి

Question 1: బొమ్మలో ఎవరెవరున్నారు ? ఏం చేస్తున్నారు ?

Answer:

బామ్మ (మామ్మ)గారు, ఒక విద్యార్థిని ఉన్నారు. ఆ అమ్మాయి ఉత్తరం చదువుతోంది. బామ్మ వింటోంది.

Exam Tips:

a) బొమ్మలో ఎవరున్నారో, వారు ఏం చేస్తున్నారో రెండూ రాయండి.

 

Question 2: ఉత్తరంలో ఏమి ఉండవచ్చు ?

Answer:

మామ్మ బంధువులు రాసిన క్షేమ సమాచారాలు, విశేషాలు ఉత్తరంలో ఉండవచ్చును.

Exam Tips:

a) ఉత్తరంలో ఉండే సాధారణ విషయాలు (క్షేమ సమాచారాలు, విశేషాలు) ఊహించి రాయండి.

 

Question 3: మీరెప్పుడైన ఉత్తరాలు రాయడం, చదవడం చేశారా ?

Answer:

నేను మా పాఠశాల గురించి నా స్నేహితురాలికి ఉత్తరం రాశాను. నా మిత్రులు, మా పెద్దలు నుండి నాకు వచ్చిన ఉత్తరాలు చదువుతూ ఉంటాను.

Exam Tips:

a) మీరు నిజంగా రాసిన లేదా చదివిన ఉత్తరం గురించి సొంత మాటల్లో రాయండి.

 

Question 4: మీ ఊరి గురించి లేదా మీరు చూసిన ప్రాంతం గురించి ఎవరికైనా ఉత్తరాలు రాశారా ?

Answer:

నేను మా ఊరి గురించి (ఖమ్మం జిల్లా మధిర) నా స్నేహితునికి ఉత్తరం రాశాను. నేను చూసి వచ్చిన నాగార్జున సాగర్ గురించి మా మామయ్యకు ఉత్తరం రాశాను.

Exam Tips:

a) ఊరి పేరు, ఎవరికి రాశారు, ఏ విషయం గురించి అనే మూడు అంశాలు చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.33)

Question 1: శైలజకు తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పి ఉంటారో ఊహించి చెప్పండి.

Answer:

1. బస్సు ఎక్కేటప్పుడు ఒకరిని ఒకరు తోసుకోరాదని,
2. చేతులు బయటపెట్టరాదని (బస్సులో)
3. నీళ్ళలోకి దిగవద్దని,
4. డబ్బులు జాగ్రత్తని – శైలజకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పి ఉంటారు.

Exam Tips:

a) ప్రయాణంలో పాటించవలసిన జాగ్రత్తలను నాలుగైదు పాయింట్లుగా వరుసగా రాయండి.
b) తల్లిదండ్రులు చెప్పే సలహాలలా “..వద్దు, ..జాగ్రత్త” అనే రూపంలో రాయండి.

 

Question 2: ఇంత గొప్ప నిర్మాణం ఎట్లా కట్టారా! అనడం వెనుక ఆంతర్యం ఏమిటి ?

Answer:

నాగార్జునసాగర్ డ్యాం చాలా పొడవుగా ఉంటుంది. చాలా పెద్ద నిర్మాణం.
ఎంతోమంది పనిచేసుంటారని, ఎంతో నేర్పుతో, ఓర్పుతో కట్టి ఉంటారని అనిపించి, ఈ మాటలు సరళ అన్నది.

Exam Tips:

a) నాగార్జునసాగర్ ఆనకట్ట పొడవు, నిర్మాణానికి పట్టిన శ్రమ – ఈ రెండు అంశాలను చెప్పండి.
b) “ఆంతర్యం” అంటే మాటల వెనుక ఉన్న భావం అని గుర్తుంచుకోండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.35)

Question 1: ఆనాటి విగ్రహాలకు శిలలను వాడినారు కదా! మరి ఈ రోజుల్లో విగ్రహాల తయారీకి వేటిని వాడుతున్నారు ?

Answer:

ఆనాటి విగ్రహాలకు శిలలను వాడారు. ఈ రోజుల్లో విగ్రహాల తయారీకి సిమెంటు, ఇనుము, ఇసుక కలిపి వాడుతున్నారు.

Exam Tips:

a) ఆనాటి (శిలలు) – ఈనాటి (సిమెంటు, ఇనుము) పోలికను ఒకే వాక్యంలో రాయండి.

 

Question 2: ” సింగరేణి కార్మికుల కష్టం మన ఇండ్లకు కాంతిగా మారింది” అంటే మీకేమి అర్థమైంది ?

Answer:

సింగరేణి కార్మికులు చాలా శ్రమపడతారు. భూమి లోపలి బొగ్గు గనుల్లోకి వెళ్ళి ప్రమాదాలను లెక్కచేయకుండా బొగ్గు తవ్వుతారు. ఆ బొగ్గుతో విద్యుత్ తయారై మనకు విద్యుత్ లభిస్తోంది. మన ఇండ్లో బలు వెలుగుతో విద్యుత్ కాంతి వస్తోంది. అంటే వారి కష్టం కరెంటు (విద్యుత్) రూపంలో మన ఇండ్లో విద్యుత్ కాంతిగా మారిందని అర్థం. ఆ కార్మికులకు ఎంతో ధన్యవాదాలని కూడా అర్థం.

Exam Tips:

a) సింగరేణి కార్మికుల శ్రమ → బొగ్గు → విద్యుత్ → ఇంటి వెలుగు అనే క్రమాన్ని వివరించండి.
b) చివరలో కార్మికులకు కృతజ్ఞత తెలపండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No.37)

Question 1: ప్రాచీన వస్తువులు భద్రపరచడం వల్ల కలిగే ఉపయోగాలేమిటి ?

Answer:

1. ప్రాచీన వస్తువులను భద్రపరచడంవల్ల రాబోయే తరాలవారికి మన సంస్కృతి తెలుస్తుంది.
2. మన ఆచార వ్యవహారాలు తెలుస్తాయి.
3. అప్పటి ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది.
4. ఆనాటి వస్తువుల నేర్పరితనం తెలుస్తుంది.

Exam Tips:

a) సంస్కృతి, ఆచారాలు, ఆర్థిక పరిస్థితి, నైపుణ్యం అనే ఉపయోగాలను వరుసగా రాయండి.
b) ప్రతి పాయింట్ “…తెలుస్తుంది” అనే రూపంలో ఒకే విధంగా రాయండి.

 

Question 2: మధుర జ్ఞాపకాలను డైరీలలో ఎందుకు రాస్తారు ?

Answer:

మనిషి ఏ విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకోలేడు. కాబట్టి మధుర జ్ఞాపకాలను డైరీలో (దినచర్యలో) రాసుకుంటాడు. వాటిని అప్పుడప్పుడు చూసుకుంటే ఆ తియ్యటి జ్ఞాపకాలు ఆనందాన్నిస్తాయి.

Exam Tips:

a) మనిషి మరచిపోయే గుణం – డైరీ రాయడం వల్ల తియ్యటి జ్ఞాపకాలు నిలుస్తాయి అనే రెండు విషయాలు రాయండి.

 

Question 3: యాత్ర ముగించుకొని ఇంటికి వస్తుంటే శైలజకు ఎందుకు బాధ కలిగియుండవచ్చు?

Answer:

ఆహ్లాదకరమైన, ఆనందకరమైన యాత్ర అప్పుడే ముగిసినందుకు శైలజకు బాధ కలిగి ఉండవచ్చును.

Exam Tips:

a) యాత్ర ముగియడం వల్ల కలిగే ఆనందం – బాధ మధ్య సంబంధాన్ని ఒక వాక్యంలో రాయండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: హైదరాబాద్, వరంగల్ వంటి దర్శనీయ స్థలాల గురించి తెలుసుకున్నారు కదా! మరి మీ ప్రాంతంలో ఉన్న దర్శనీయ స్థలాల గురించి చెప్పండి.

Answer:

మాది నల్గొండ జిల్లా ఆకుపాముల. మా జిల్లాలో పానగల్, భువనగిరి కోట, భూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట లాంటి చూడదగ్గ స్థలాలు ఉన్నాయి. సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి.

Exam Tips:

a) మీ జిల్లా/ప్రాంతం పేరు, అక్కడ చూడదగ్గ రెండు మూడు స్థలాల పేర్లు తప్పక రాయండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

Question 1: కింది వాక్యాలు చదివి వాటికి సంబంధించిన స్థలాల పేర్లను పాఠంలో వెతికి రాయండి.
అ. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా! అని ఆశ్చర్యం వేసింది.
ఆ. తొలి కందపద్యాలు ఇక్కడ శిలపై చెక్కబడి ఉన్నవి.
ఇ. మమ్మల్ని మేము మరిచిపోయి రాజుల కాలంలో ఉన్నామా! అని అనిపించింది.
ఈ. అక్కడున్న బొగ్గు బావులను చూసినం.
ఉ. అద్భుతమైన వాస్తు కళా నైపుణ్యంతో దీన్ని కట్టారు.

Answer:

అ. ఇది నాగార్జునసాగర్‌కు సంబంధించినది. సాగర్ ఆనకట్ట నిర్మాణం గురించి చెప్పిన మాటలు.
ఆ. బొమ్మల గుట్ట గురించి చెప్పిన సందర్భంలో చెప్పిన విషయాలు.
ఇ. వరంగల్ కోట.
ఈ. సింగరేణి బొగ్గు గనులు.
ఉ. చార్మినార్ గురించి.

Exam Tips:

a) ప్రతి వాక్యంలోని సూచనల (సాగర్ ఆనకట్ట, కందపద్యాలు, కోట, బొగ్గు బావులు, వాస్తు కళ) ఆధారంగా స్థలాన్ని గుర్తించండి.
b) స్థలం పేరుతో పాటు ఒక్క వాక్యం కారణం రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి.

 

Question 2: కింది లేఖను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
మందమర్రి, తేది : x x x x.
పత్రికా సంపాదకునికి,
నమస్కారం!
దేశంలో అడవులు బాగా తగ్గిపోతున్నాయి. బహుళ అంతస్తుల భవన నిర్మాణాల కోసం, రహదారుల విస్తరణ కోసం చెట్లను విచక్షణారహితంగా నరుకుతున్నారు.
రాబోయే తరాల శ్రేయస్సు పట్టకుండా పర్యావరణానికి ముప్పుతెస్తున్నారు. దీనివల్ల వర్షాలు సరిగా పడక రైతుల పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నది.
వృక్షజాలంతోపాటు జంతుజాలం కూడా నశిస్తున్నది. ఈ విధ్వంసాన్ని ఇప్పటికైనా ఆపాలి. పర్యావరణ పరిరక్షణ అనేది మన జీవన విధానంలో భాగం కావాలి. ఈ విషయంపై పత్రికాముఖంగా ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరుతున్నాను.
కృతజ్ఞతలతో….
ఇట్లు,
ఆర్. వెంకట్
ప్రశ్నలు:
అ. లేఖను ఎవరు, ఎక్కడినుంచి రాశారు ?
ఆ. రైతుల పరిస్థితి దిగజారడానికి ముఖ్య కారణం ఏమిటి ?
ఇ. చెట్లను ఎందుకు నరికి వేస్తున్నారు ?
ఈ. పర్యావరణ పరిరక్షణ కోసం మనమేం చేయాలి ?

Answer:

అ. మందమర్రి నుంచి ఆర్. వెంకట్ రాశారు.
ఆ. వర్షాలు సరిగ్గా పడక రైతుల పరిస్థితి నానాటికి దిగజారిపోతున్నది.
ఇ. భవన నిర్మాణాల కోసం, రహదారుల విస్తరణ కోసం చెట్లను విచక్షణారహితంగా నరుకుతున్నారు.
ఈ. చెట్లను నరకకూడదు. చెత్త, మురికితో కాలుష్యం పెంచకూడదు. వీలైనన్ని చెట్లు పెంచాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను, రసాయనాలను ఉపయోగించడం తగ్గించాలి.

Exam Tips:

a) జవాబులను లేఖలోని వాక్యాల నుంచే తీసుకొని పూర్తి వాక్యాలుగా రాయండి.
b) లేఖ రాసిన వారు, ప్రదేశం, తేది, ఎవరికి రాశారు వంటి వివరాలు జవాబుల్లో స్పష్టంగా ఉండాలి.

 

III. స్వీయ రచన

Question 1: ఉత్తరాల ద్వారానే కాకుండా నేటి కాలంలో సమాచారాన్ని పంపడానికి వేటిని ఉపయోగిస్తున్నారు ?

Answer:

1. నేటికాలంలో సమాచారాన్ని పంపడానికి, సెల్ఫోన్లో సంక్షిప్త సమాచారం (మెసేజ్) పంపుతున్నారు.
2. కొరియర్ ద్వారా పంపుతున్నారు.
3. (ఈ.మెయిల్) పంపుతున్నారు.
4. యాప్స్ (వాట్సప్) ద్వారా సమాచారం పంపుతున్నారు.
5. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కూడా సమాచారాన్ని పంపుతున్నారు.
ఈ విధంగా ఆధునిక సాంకేతిక ప్రగతిని వినియోగించుకొని సమాచారాన్ని పంపుతున్నారు.

Exam Tips:

a) సెల్‌ఫోన్ సందేశం, కొరియర్, ఈ-మెయిల్, యాప్స్, సామాజిక మాధ్యమాలు అనే మార్గాలను వరుసగా రాయండి.
b) ముగింపులో “ఆధునిక సాంకేతిక ప్రగతి” వల్ల ఇది సాధ్యమైందని చెప్పండి.

 

Question 2: యాత్రలకు వెళ్ళేటప్పుడు ఏయే జాగ్రత్తలు పాటించాలి ?
(లేదా)
కొత్తప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?

Answer:

1. ముందుగా పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన విషయాలను తెల్సుకోవాలి.
2. వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి.
3. నీరు, ఆహారం లభ్యత గురించి తెలుసుకోవాలి.
4. అవసరమైన మందులు (ఔషధాలు) తీసుకువెళ్ళాలి.
5. వైద్యుని ఫోన్ నెం. (సలహాల కొరకు) తెలుసుకోవాలి.
6. మంచినీటిని తీసుకువెళ్ళాలి లేదా స్వచ్ఛమైన నీటిని వాడాలి.
7. తేలికగా (సులువుగా) జీర్ణం అయ్యే ఆహారాన్ని, తాజా ఆహారాన్ని తినాలి.

Exam Tips:

a) ప్రయాణానికి ముందు, ప్రయాణంలో, చేరిన తర్వాత అనే క్రమంలో జాగ్రత్తలు రాయండి.
b) వసతి, ఆహారం, నీరు, మందులు, డాక్టర్ ఫోన్ నంబర్ – ఈ ముఖ్యాంశాలు మరవకండి.

 

Question 3: పురాతన కట్టడాలు, నదులు, దేవాలయాలు మొదలైనవాటిని చూడటానికి పోయినపుడు మనం ఎలా ప్రవర్తించాలి? ఎందుకు ? (లేదా) చారిత్రక ప్రదేశాల సందర్శనలో మనమెలా ప్రవర్తించాలి ?

Answer:

1. క్రమశిక్షణ పాటించాలి.
2. పురాతన కట్టడాలను చేతితో తాకి, పేర్లు రాసి, బొమ్మలు గీసి పాడు చేయరాదు.
3. నదులలో తొందరపడి ఈతకు దిగరాదు. (సూచనలను పాటించకుండా)
4. దేవాలయాలకు సంబంధించిన పద్ధతులను, నియమావళిని పాటించాలి.
5. సిబ్బంది, అధికారులు చెప్పిన సూచనలను తప్పక పాటించాలి.
6. ఫోటోలు, వీడియోలు చిత్రించుటకు అనుమతిని తీసుకోవాలి.
7. పరిశుభ్రత పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ తినడం, ఉమ్ములు వేయడం, మలమూత్ర విసర్జన చేయడం పనికి రాదు.

Exam Tips:

a) పురాతన కట్టడాలను తాకకూడదు, రాతలు రాయకూడదు, శుభ్రత పాటించాలి – ఈ ముఖ్యమైన అంశాలు రాయండి.
b) “ఎందుకు” అనే భాగానికి కారణం (భావితరాలకు కట్టడాలు మిగలాలి) చెప్పండి.

 

Question 4: శైలజ తన స్నేహితురాలికి రాసిన లేఖను చదివారుకదా! మీరైతే శైలజకు మళ్ళీ ఏమని ఉత్తరం రాస్తారు ?

Answer:

పోచంపల్లి, ది. x x x x x x
ప్రియమైన శైలజకు,
ఎలా ఉన్నావ్ ? నేను కులాసాగా ఉన్నాను. నీవు రాసిన ఉత్తరం అందినది. చాలా సంతోషం. నీవు చూసిన నాగార్జునసాగర్, హనుమకొండ, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, సింగరేణి గనులు, హైదరాబాద్ గద్వాల్ కోట మొదలయినవి నేను కూడా చూశాను. మా నాన్నగారు ఎండాకాలం సెలవులలో కుటుంబంతో కలిసి ఈ ప్రదేశాలకు తీసుకువెళ్ళారు. ఎంతో చూడదగ్గ ప్రదేశాలు. మన తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైనవి, దర్శించదగినవి. నేను బాగానే చదువుచున్నాను. ఇంకా విశేషాలు ఉంటే జాబు (ఉత్తరం) రాయి.
ఇట్లు,
బి. సాయిశ్రావ్య,
రంగాపురం.
చిరునామా:
ఎస్. శైలజ,
6వ తరగతి,
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,
వేముల, కరీంనగర్ జిల్లా.

Exam Tips:

a) లేఖలో ఊరు – తేది, సంబోధన, విషయం, ముగింపు (ఇట్లు), చిరునామా అనే భాగాలు తప్పక ఉండాలి.
b) చిరునామా లేఖ చివర స్పష్టంగా రాయండి.

 

Question 5: “విజ్ఞానయాత్రల వల్ల విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుంది.” దీనిని సమర్థిస్తూ రాయండి.
(లేదా)
విద్యార్ధులలో విజ్ఞానాన్ని పెంపొందించుటకు విజ్ఞాన యాత్రలు తోడ్పడతాయని లేఖ పాఠం ఆధారంగా రాయండి.

Answer:

విజ్ఞానం కొరకు చేసే యాత్రలు విజ్ఞానయాత్రలు:
1. అనేక ప్రదేశాలు తిరగటం వల్ల విషయావగాహన పెరుగుతుంది.
2. ఆయా ప్రదేశాలలోని భాష, అక్కడి ప్రజల ఆచారాలు, ఆహార అలవాట్లు, కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి.
3. చారిత్రక విషయాలు అవగతం అవుతాయి.
4. నిర్మాణాలు, కట్టడాలవల్ల ఆనాటి వాస్తు, శిల్పకళ మున్నగు విషయాలు తెలుస్తాయి.
5. ఆనాటి పండుగలు, జన జీవనం తేటతెల్లం అవుతాయి.
6. నదులు’ వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుస్తాయి.
7. దేవాలయాలలో వాస్తుకళ, సాంకేతిక పరిజ్ఞానం, కట్టడ నిర్మాణాలు (తెలుస్తాయి) ప్రత్యక్షంగా దర్శిస్తారు.
8. పాతకాలం నాటి నీరుపారుదల విధానం, చెరువుల నిర్మాణం సాగు, తాగునీటి విధానాలు తెలుస్తాయి.
9. క్రమశిక్షణ పెరుగుతుంది. స్నేహభావం, సోదర భావం, సర్దుబాటు ధోరణి పెరుగుతాయి.

Exam Tips:

a) విజ్ఞానయాత్రల వల్ల కలిగే ప్రయోజనాలను (భాష, సంస్కృతి, చరిత్ర, శిల్పకళ, క్రమశిక్షణ) ఒక్కొక్క వాక్యంగా రాయండి.
b) మొదట ఒక నిర్వచనం, చివర ముగింపు వాక్యం రాస్తే జవాబు పూర్తిగా ఉంటుంది.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: మీరు చూసిన యాత్రా విశేషాలను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి.

Answer:

కోదాడ, ది. x x x x x x
ప్రియమైన స్నేహితురాలు సాయిశృతికి,
నీ మిత్రురాలు రాయునది. నేను క్షేమం. ఈ మధ్య మా పాఠశాల విద్యార్థులను మా ‘సార్లు’ భద్రాచలం తీసుకువెళ్ళారు. భద్రాచలం ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి రామాలయం చాలా ప్రసిద్ధి పొందింది. 17వ శతాబ్దంలో కంచెర్ల గోపన్న దీనిని నిర్మించాడు. చుట్టూ దండకారణ్యం ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పర్ణశాల ఉన్నది. భద్రగిరిపై నిర్మించబడిన దేవాలయం ఇది.
జటాయువుపాక, దమ్ముగూడెం, శబరిగిరి మొదలైనవి దర్శనీయ స్థలాలు. ఇక్కడ శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది.
మేమందరం గోదావరిలో స్నానం చేసి, అన్నీ చూసి వచ్చాము. అక్కడి వాతావరణం ఎంతో బాగుంది. నీవు చూసిన యాత్రను గురించి రాయకోర్తాను.
ఇట్లు,
నీ ప్రియ మిత్రురాలు,
బి. శ్రావ్య,
కోదాడ.
చిరునామా :
వి. సాయిశృతి,
6వ తరగతి,
రంగాపురం,
మంచాల మండలం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.

Exam Tips:

a) లేఖ రూపం పాటించండి: ఊరు, తేది, సంబోధన, విషయం, ముగింపు, చిరునామా.
b) యాత్రలో చూసిన ప్రదేశం, దాని ప్రత్యేకత, మీ అనుభవం – ఈ మూడూ రాయండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది పదాలు చదువండి. వీటికి అవే అర్థాలు వచ్చే పదాలను రాయండి.
అ. గుడి
ఆ. ఆనవాళ్ళు
ఇ. ఆనందం
ఈ. ప్రథమ
ఉ. సందర్శించుట

Answer:

అ. దేవాలయం, కోవెల
ఆ. గుర్తులు, జాడలు, చిహ్నములు
ఇ. సంతోషం, హర్షం.
ఈ. మొదటి, ఆది
ఉ. చూచుట

Exam Tips:

a) ఒకే అర్థం ఇచ్చే రెండు మూడు పదాలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి.

 

Question 2: కింది పదాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ. అనుభూతి
ఆ. ఆకర్షణ
ఇ. కమ్మగా
ఈ. జ్ఞాపకం
ఉ. దర్శనం
ఊ. ప్రాచీనం
ఋ. యాత్ర
ౠ. మహనీయుడు

Answer:

అ. విహారయాత్రలలో పొందే అనుభూతులు మరచిపోలేనివి.
ఆ. రామప్పగుడిలో నంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
ఇ. కమ్మగా వండిన గారెలు నోరు ఊరిస్తాయి.
ఈ. ఇష్టపడి చదివిన విషయం జ్ఞాపకం ఉండిపోతుంది.
ఉ. పురాతన కట్టడాలు, ఆలయాల దర్శనం మనసుకు ఆనందం.
ఊ. గోల్కొండ కోట చాలా ప్రాచీన కట్టడం
ఋ. మా విహారయాత్ర సుఖంగా సాగింది.
ౠ. గాంధీ వంటి మహనీయుడు పుట్టిన దేశం మనది.

Exam Tips:

a) ప్రతి వాక్యంలో ఇచ్చిన పదాన్ని మార్చకుండా వాడండి.
b) వాక్యం చిన్నదిగా, అర్థవంతంగా ఉండాలి.

 

Question 3: కింది పదాల వరుసను చూడండి. ప్రతి వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి.
అ. దుర్గం, కోట, ఖిల్లా, జాగ
ఆ. గుడి, బడి, దేవాలయం, మందిరం
ఇ. శిల, రాయి, దండ, బండ
ఈ. గాలం, నీరు, జలం, సలిలం
ఉ. కన్ను, నేత్రం, రెప్ప, నయనం

Answer:

అ. జాగ – ‘జాగ’ అంటే స్థలం. దుర్గం, కోట, ఖిల్లా – పర్యాయపదాలు.
ఆ. బడి – చదువు నేర్పేది బడి. గుడి, దేవాలయం, మందిరం – పర్యాయపదాలు.
ఇ. దండ – శిల, రాయి, బండ – పర్యాయపదాలు.
ఈ. గాలం – గాలం చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. నీరు, జలం, సలిలం – పర్యాయపదాలు.
ఉ. రెప్ప – రెప్ప కంటిలో భాగం. కన్ను, నేత్రం, నయనం – పర్యాయపదాలు.

Exam Tips:

a) ఒకే అర్థం ఇచ్చే మూడు పదాలను గుర్తించి, మిగిలిన పదం ఎందుకు వేరో చిన్న కారణం రాయండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: మీకు తెలిసిన స్త్రీలింగ, పుంలింగ, నపుంసకలింగ పదాలను రాయండి.

Answer:

స్త్రీలింగ పదాలు: అంజన, గిరిజ, వనజ, లక్ష్మి, హేమ, నాగమణి
పుంలింగ పదాలు: వినాయకుడు, చక్రపాణి, విష్ణువు, హరి, చెన్నయ్య, రమణ.
నపుంసకలింగ పదాలు: పుస్తకం, గోడ, చెట్టు

Exam Tips:

a) స్త్రీ వాచకాలు (అంజన, లక్ష్మి), పురుష వాచకాలు (హరి, రమణ), వస్తు – జంతు వాచకాలు (పుస్తకం, చెట్టు) అని గుర్తుంచుకోండి.

 

ప్రాజెక్టు పని

Question 1: పాఠంలో రామప్పగుడి, గద్వాలకోట, వరంగల్ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మొదలైన వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా! వీటిలో ఏదైనా ఒకదాని గురించి పూర్తి వివరాలు సేకరించండి. రాసి, చదివి వినిపించండి.

Answer:

1. ప్రాజెక్టు శీర్షిక : చార్మినార్ గురించి వివరాలు సేకరించి, నివేదిక రాయడం.
2. సమాచార సేకరణ : అ) సమాచారం సేకరించిన తేది : ఆ) సమాచార వనరు : అంతర్జాలం
3. సేకరించిన విధానం : ఇంటర్నెట్ కు వెళ్ళి చార్మినార్ గురించిన వివరాలు సేకరించడం జరిగింది.
4. నివేదిక – చార్మినార్:
చార్మినార్ మూసీనదికి తూర్పు ఒడ్డున ఉంది. 1591-92 సంవత్సరాలలో కులీకుతుబ్షా దీనిని నిర్మించాడు. దీని ఎత్తు 56 మీటర్లు. ఈ కట్టడాన్ని సున్నంతో నిర్మించారు. చుట్టూ నాలుగు స్తంభాలు ఉన్నాయి. హిందీలో స్తంభాన్ని మినార్ అంటారు. చార్ అంటే నాలుగు. నాలుగు స్తంభాలు ఉన్నాయి కాబట్టి ఆ కట్టడాన్ని చార్మినార్ అని అంటారు. ఒక్కొక్క మినార్ ఎత్తు 30 మీటర్లు, 148 మెట్లు వలయాకారంలో ఉన్నాయి. రెండవ అంతస్థులో నిర్మించిన మసీదులో ఒకేసారి 240 మంది నమాజు చేసుకునే వీలుంది. కింది అంతస్థులో నీటి ఫౌంటెన్ ఉంది.
చార్మినార్ను భాగమతికి ప్రేమ కానుకగా నిర్మించారని కొందరు చరిత్రకారులు చెపుతారు. మరికొందరు ఆ కాలంలో కలరా జబ్బు వ్యాపించిందట. ఎంతోమంది చనిపోయారట. దాని నివారణకు గుర్తుగా నాలుగు రోడ్ల కూడలిలో చార్మినార్ నిర్మించాడని మరికొందరు చెపుతారు. చార్మినార్కి నాలుగువైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. వీటి మధ్యలో రకరకాల అంగళ్ళు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గాజులు, నగలు, బట్టలు మొదలైనవి దొరుకుతాయి. ఈ ప్రాంతం మంచి ముత్యాల అమ్మకానికి ప్రసిద్ధి.
5. ముగింపు : చార్మినార్ నిర్మాణం గొప్పదనం తెలుసుకోవడం జరిగింది.

Exam Tips:

a) శీర్షిక, సమాచార సేకరణ, విధానం, నివేదిక, ముగింపు అనే ఐదు అంశాలు వరుసగా రాయండి.
b) చార్మినార్ నిర్మాణ సంవత్సరం (1591–92), నిర్మించినవారు, ఎత్తు వంటి విషయాలు తప్పక చేర్చండి.

 

ముఖ్యమైన ప్రశ్నలు

Question 1: రామప్ప దేవాలయం గురించి రాయండి.

Answer:

రామప్ప గుడి వరంగల్ జిల్లాలో పాలంపేట గ్రామంలో ఉన్నది. రామప్పగుడిని కాకతీయరాజు గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇక్కడి శిల్పాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న నంది విగ్రహం ఏ దిక్కునుండి చూసినా, అది వారినే చూస్తున్నట్లు ఉంటుంది. ఈ గుడికి దగ్గర రామప్ప చెరువు ఉంది.

Exam Tips:

a) ప్రదేశం (పాలంపేట, వరంగల్ జిల్లా), నిర్మించినవారు (రేచర్ల రుద్రుడు), ప్రత్యేకత (శిల్పాలు, నంది) అనే క్రమంలో రాయండి.

 

Question 2: ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులను గుర్తించండి.
చాలా మంది పిల్లలు, పెద్దలు, టి.వి. చూస్తూ తినడం చేస్తారు. దాని వల్ల ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియదు. సమయానుకూలంగా కూడా తినరు. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండడం మొదలైనవన్నీ కూడా ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. ఈ విధంగా ఆహార నియమాలు, అలవాట్లను లేనివారు తరుచుగా ఎన్నో జబ్బులకు గురవుతారు. తినేటప్పుడు మాట్లాడడం, సరిగా నమలకపోవడం వంటి వాటివల్ల తేన్పులు, పొట్ట ఉబ్బరం కలుగుతుంది. వేగంగా తినడం నైపుణ్యం కాదు. నెమ్మదిగా నమిలి తినాలి.
1. టి.వి చూస్తూ తినడం అనేది (a) మంచి అలవాటు (b) చెడ్డ అలవాటు (c) చాలా మంచి అలవాటు
2. త్వరగా పడుకోకపోవడం వలన (a) ఆరోగ్యంగా ఉంటారు (b) అనారోగ్యంగా ఉంటారు (c) ఆనందంగా ఉంటారు
3. తినేటపుడు మాట్లాడడం, సరిగ్గా నమిలి తినకపోవడం (a) అనారోగ్యానికి కారణాలు (b) ఆరోగ్య కారణాలు (c) మానసిక కారణాలు
4. తినేటపుడు సాధారణంగా అందరూ చేస్తున్న పని (a) ఆడుతూ తినడం (b) మాట్లాడుతూ తినడం (c) టి.వి. చూస్తూ తినడం
5. తినడంలో ఆచరించదగిన పద్ధతి (a) మాట్లాడుతూ తినడం (b) గబగబా తినడం (c) బాగా నమిలి తినడం

Answer:

1. (b) చెడ్డ అలవాటు
2. (b) అనారోగ్యంగా ఉంటారు
3. (a) అనారోగ్యానికి కారణాలు
4. (c) టి.వి. చూస్తూ తినడం
5. (c) బాగా నమిలి తినడం

Exam Tips:

a) ప్రతి ప్రశ్నకు జవాబు గద్యంలోని సంబంధిత వాక్యంలోనే ఉంటుంది; ఆ వాక్యాన్ని గుర్తించి ఎంపికతో సరిపోల్చండి.
b) ఎంపికలలో “చాలా”, “అన్నీ” వంటి తీవ్రమైన పదాలున్న వాటిపై జాగ్రత్త వహించండి.

 

Question 3: క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు తప్పు, ఒప్పులను గుర్తించండి.
కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే దోచుచుండు నిక్కము సుమతీ!
1. కూరిమితో ఉన్నపుడు గొడవులు జరుగుతాయి.
2. కూరిమి అనగా ద్వేషము అని అర్థము.
3. పై పద్యము సుమతీ శతకం లోనిది.
4. ప్రేమ, మైత్రి చెడిపోతే గొడవలు జరుగుతాయి.
5. పై పద్యం స్నేహం గురించి చెబుతుంది.

Answer:

1. తప్పు
2. తప్పు (కూరిమి అంటే ప్రేమ, స్నేహం)
3. ఒప్పు
4. ఒప్పు
5. ఒప్పు

Exam Tips:

a) పద్యంలో “కూరిమి” (ప్రేమ) ఉన్నంతకాలం తప్పులు కనిపించవు, అది చెడితే తప్పులే కనిపిస్తాయి – ఈ భావంతో ప్రతి వాక్యాన్ని పోల్చి చూడండి.
b) సుమతీ శతక పద్యాల మకుటం “సుమతీ!” అని గుర్తుంచుకోండి.

 

బహుళైచ్ఛిక ప్రశ్నలు

Question 1: మన కుటుంబ సభ్యులంతా కలిస్తే ఆనందంగా ఉంటుంది. గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి.
a) దుఃఖం
b) విచారం
c) సంతోషం
d) సరదా

Answer:

c) సంతోషం

Exam Tips:

a) ఆనందం = సంతోషం, హర్షం; ఇతర ఎంపికలు విరుద్ధార్థాలు (దుఃఖం, విచారం).

 

Question 2: ఏకలవ్యుడు విలువిద్యలో నేర్పును ప్రదర్శించాడు. గీతగీసిన పదానికి అర్థం రాయండి. (నేర్పు)
a) నైపుణ్యం
b) నాణ్యత
c) క్రమశిక్షణ
d) బుద్ధి

Answer:

a) నైపుణ్యం

Exam Tips:

a) నేర్పు = నైపుణ్యం, నేర్పరితనం; క్రమశిక్షణ, బుద్ధి వేరే అర్థాలు.

 

Question 3: కింది పదాల వరుస చూడండి. వరుసలో లేని పదం రాయండి.
a) వేయి స్తంభాల గుడి
b) భద్రకాళి గుడి
c) వరంగల్ కోట
d) నాగార్జునసాగర్

Answer:

d) నాగార్జునసాగర్

Exam Tips:

a) మూడు ఎంపికలు వరంగల్ ప్రాంతానికి చెందినవి; నాగార్జునసాగర్ నల్గొండ/గుంటూరు సరిహద్దులో ఉన్నది.

 

Question 4: వరుసలో లేని పదం రాయండి.
a) చార్మినార్
b) సాలార్జంగ్ మ్యూజియం
c) గోల్కొండ కోట
d) రామప్ప చెరువు

Answer:

d) రామప్ప చెరువు

Exam Tips:

a) చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట హైదరాబాద్‌లో ఉన్నాయి; రామప్ప చెరువు పాలంపేటలో ఉంది.

 

Question 5: “అంజన” ఇది ఏ లింగ పదం ?
a) పుంలింగం
b) స్త్రీ లింగం
c) నపుంసకలింగం
d) ఏదీకాదు

Answer:

b) స్త్రీ లింగం

Exam Tips:

a) స్త్రీల పేర్లు (అంజన, గిరిజ, హేమ) స్త్రీలింగాలు.

 

Question 6: ‘విష్ణువు’ ఇది ఏ లింగ పదం ?
a) నపుంసక లింగం
b) స్త్రీ లింగం
c) పుంలింగం
d) ఏదీకాదు

Answer:

c) పుంలింగం

Exam Tips:

a) విష్ణువు, హరి, రాముడు వంటి పురుష వాచకాలు పుంలింగం.

 

Question 7: నపుంసక లింగ పదానికి ఉదాహరణ.
a) పుస్తకం
b) చక్రపాణి
c) అభిసారిక
d) తరుణి

Answer:

a) పుస్తకం

Exam Tips:

a) వస్తువులు, జంతువులు, పక్షులను సూచించే పదాలు నపుంసకలింగం (పుస్తకం, గోడ, చెట్టు).

 

Question 8: తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక (గీత గీసినవి ఏ విభక్తులు?)
a) ప్రథమా విభక్తి
b) సప్తమీ విభక్తి
c) షష్ఠీ విభక్తి
d) చతుర్థీ విభక్తి

Answer:

c) షష్ఠీ విభక్తి

Exam Tips:

a) ఈ పాఠ్యపుస్తకం ప్రకారం “కి(న్), కు(న్), యొక్క, లో(న్)” ప్రత్యయాలు షష్ఠీ విభక్తి.

 

Question 9: వాణి పూజ కొరకు పూలను కోసింది. (ఏ విభక్తి ?)
a) చతుర్థీ విభక్తి
b) షష్ఠీ విభక్తి
c) సప్తమీ విభక్తి
d) పంచమీ విభక్తి

Answer:

a) చతుర్థీ విభక్తి

Exam Tips:

a) “కొరకు, కై” అనే ప్రత్యయాలు చతుర్థీ విభక్తికి చెందుతాయి.

 

Question 10: ‘నిన్, నున్, లన్, కూర్చి, గురించి’ ఇవి ఏ విభక్తులు ?
a) ద్వితీయా
b) ప్రథమా
c) సప్తమీ
d) చతుర్థీ విభక్తి

Answer:

a) ద్వితీయా

Exam Tips:

a) ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి – ద్వితీయా విభక్తి ప్రత్యయాలు (కర్మ).

 

Question 11: సప్తమీ విభక్తిలో వచ్చు ప్రత్యయాలు.
a) ఓయి, ఓరి, ఓసి
b) డు, ము, వు, లు
c) అందు (న్), న (న్)
d) వలన (న్), కంటె (న్)

Answer:

c) అందు (న్), న (న్)

Exam Tips:

a) సప్తమీ విభక్తి ప్రత్యయాలు: అందు(న్), న(న్) – “ఇందు, ఎందు” రూపాలు ఉదాహరణకు.

 

Question 12: ‘పూర్వపు రాజులు వాడిన వస్తువులు చక్కగా భద్రపరిచారు.’ ఈ వాక్యంలోని సంయుక్తాక్షరాలు
a) క్క వా, పు
b) పూ, పు, చ, క్క, ప, చా
c) ర్వ, స్తు, ద్ర
d) వా, వ, వు, లు, రా, రి, రు

Answer:

c) ర్వ, స్తు, ద్ర

Exam Tips:

a) సంయుక్తాక్షరం అంటే వేర్వేరు హల్లులు కలిసినది (ర్వ, స్తు, ద్ర).
b) ద్విత్వాక్షరం (క్క) సంయుక్తాక్షరం కాదు – తేడా గుర్తుంచుకోండి.

 

Question 13: ‘అక్కడున్న వాటిలో గంటకొట్టే బొమ్మ బాగున్నది’ – ఈ వాక్యంలోని ద్విత్వాక్షరాలు ….
a) గ, బొ, బా , గు, ది
b) క్క, న్న, ట్టే, మ్మ, న్న
c) క్క, ట, కొ, ట్టే
d) గంట, కొట్టే ..

Answer:

b) క్క, న్న, ట్టే, మ్మ, న్న

Exam Tips:

a) ద్విత్వాక్షరం అంటే ఒకే హల్లు రెండుసార్లు వచ్చేది (క్క, న్న, ట్టే, మ్మ).
b) వాక్యంలోని పదాలను అక్షరాలుగా విడగొట్టి ఒక్కొక్కటి పరిశీలించండి.

 

Question 14: ‘జ్ఞానం మేలు చేస్తుందన్నాడు కణాదుడు.’ ఈ వాక్యంలోని అనునాసికాలు
a) జ్ఞానం, మేలు, చేస్తుంది
b) జ్ఞా, న, మే, న్నా, ణా
c) జ్ఞా, దు
d) చేస్తుంది, అన్నాడు.

Answer:

b) జ్ఞా, న, మే, న్నా, ణా

Exam Tips:

a) అనునాసికాలు: ఙ, ఞ, ణ, న, మ; పదంలో ఇవి ఉన్న అక్షరాలను ఎంచండి.

 

Question 15: ‘శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముఖుడు’. ఈ వాక్యంలోని ఊష్మాలు
a) శా, వా, వం, తొ
b) త, న, తొ
c) వా, వ, రా, ల
d) శా, హ, శ్రీ

Answer:

d) శా, హ, శ్రీ

Exam Tips:

a) ఊష్మాలు: శ, ష, స, హ; “శ్రీ” లో ‘శ’ ఉన్నందున అది కూడా ఊష్మమే.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 6 Telugu Lesson 04 Lekha (The Letter)

Textbook Solutions for Class 6 Telugu Lesson 04 Lekha (The Letter)

Review comprehensive exercise answers for Class 6 Telugu Lesson 04 Lekha (The Letter). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 04 Lekha (The Letter) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ for the 2026-27 session?

The complete and updated TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ will help students to get full marks in the theory paper.

Do you offer TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire TS 6th Class Telugu 4th Lesson Questions and Answers Telangana లేఖ in printable PDF format for offline study on any device.