TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం

Official TS Board Solutions for Class 6 Telugu: Lesson 02 Snehabandham (Bond of friendship)

Explore reliable textbook solutions for Lesson 02 Snehabandham (Bond of friendship) tailored for Class 6 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Chapter-wise Solutions for Telugu: Lesson 02 Snehabandham (Bond of friendship)

View or download the dedicated Lesson 02 Snehabandham (Bond of friendship) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

బొమ్మ చూసి చెప్పండి

Question 1: బొమ్మలో ఎవరెవరున్నారు ?

Answer:

ఉపాధ్యాయురాలు, విద్యార్థులు ఉన్నారు.

Exam Tips:

a) బొమ్మలో కనిపించే వ్యక్తుల గురించి చిత్రాన్ని బట్టి సూటిగా రాయండి.

 

Question 2: ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు ?

Answer:

ఉపాధ్యాయిని చెప్పే మాటలు వింటూ, స్నేహం విలువను తెలుసుకున్నారు. టీచరు గారు ముగ్గురు పిల్లకు నచ్చజెప్పగా ఆ ముగ్గురు నాలుగో విద్యార్థికి తమ దగ్గరున్న డబ్బులలో వాటా ఇచ్చారు.

Exam Tips:

a) బొమ్మలోని సన్నివేశాన్ని వర్ణిస్తూ వారు చేస్తున్న పనిని, చెప్పే మాటల సారాంశాన్ని రాయండి.

 

Question 3: పై బొమ్మ చూస్తే మీకే భావన కలిగింది ?

Answer:

అందరూ స్నేహంగా ఉండాలని, కష్టాల్లో పాలు పంచుకోవాలనే భావన కలిగింది.

Exam Tips:

a) ‘స్నేహం’, ‘పంచుకోవడం’ వంటి భావాన్ని ఒక వాక్యంలో స్పష్టంగా రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (పేజీ 12)

Question 1: తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారుకదా. మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడుతారో చెప్పండి.

Answer:

మేము మాతో కలిసిన కొత్త స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారిని జాగ్రత్తగా పరిశీలిస్తాము. వారు మంచివారా ? చెడ్డవారా ? అని గమనిస్తాము. వారి పనులు, మాటలు, ఆలోచనలు మంచివి అని నిర్ణయించుకున్నాకే వారితో మాటలు కొనసాగిస్తాము.

Exam Tips:

a) కొత్త స్నేహితులతో మర్యాదగా పలకరించడం, పరిచయం చేసుకోవడం, వారి గుణాలను గమనించడం వంటి అంశాలను చెప్పండి.

 

Question 2: కలిసిమెలిసి ఉండడం వలన కలిగే లాభం ఏమిటి ?

Answer:

కలిసిమెలిసి ఉండడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ఒకరి అవసరాలకు మరొకరు సాయం చేసుకొనవచ్చు. ఆనందంలో, కష్టాల్లో తోడునీడగా నిలువవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం.

Exam Tips:

a) పరస్పర సహాయం, కష్టసుఖాల్లో తోడు వంటి లాభాలను రెండు మూడు ఉదాహరణలతో రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (పేజీ 14)

Question 1: కన్నవాళ్ళకు, స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి.

Answer:

కన్న తల్లిదండ్రులకు, ఇష్టమైన స్నేహితులకు దూరంగా ఉంటే ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్నట్లు, బెంగగా ఉంటుంది. తన కష్టసుఖాలు, సుఖసంతోషాలు చెప్పుకొనడానికి ఎవరూ లేరని బాధతో గడుపుతాము.

Exam Tips:

a) ‘ఒంటరితనం’, ‘బెంగ’ వంటి భావాలను సొంత అనుభవంతో రాయండి.

 

Question 2: రాజకుమారుడు చేసిన పని మంచిదా ? చెడ్డదా ? వివరించండి.

Answer:

జింక తనలో తాను తన వాళ్ళతో కలిసి ఉంటే బాగుండును అనుకొన్న మాటలు రాజకుమారుడు విన్నాడు. జింకను మళ్ళీ అడవిలో విడిచిపెట్టాడు. రాజకుమారుడు చేసిన పని మంచిదే! మూగ జంతువులు కూడా తన వాళ్ళకు దగ్గరగా ఉండాలనే ఆలోచనతో ఉంటాయని దీనినిబట్టి అర్థమైంది.

Exam Tips:

a) ‘మంచిదే’ అని నిర్ణయాన్ని చెప్పి, జింక కోరికను రాజకుమారుడు అర్థం చేసుకున్నాడని కారణం చెప్పండి.

 

Question 3: ఎలుక తాబేలును ఎందుకు కోప్పడి ఉండవచ్చు?

Answer:

తాబేలు వెంటనే ఎటుపడితే అటు వెళ్ళలేదు. స్నేహితులు కాకి, ఎలుక, జింకల లాగ ఆపద వస్తే తాబేలు తప్పించుకోలేదు. అందుకే ఎలుక తాబేలును కోప్పడి ఉండవచ్చు.

Exam Tips:

a) తాబేలు నెమ్మదిగా కదలడం, ఆపద వస్తే తప్పించుకోలేకపోవడం వల్ల స్నేహితుల ఆందోళనను కారణంగా రాయండి.

 

Question 4: ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. ఎట్లాగో చెప్పండి.

Answer:

అడవిలో వేటగాడికి తాబేలు చిక్కింది. చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం వెంటనే ఒక ఆలోచన చేశాయి. వేటగాడి మార్గంలో చెరువు వద్ద జింక చచ్చినదానిలా పడి ఉండగా కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించింది. వేటగాడు తాబేలును క్రింద పెట్టి జింకకోసం వెళ్ళినంతలో ఎలుక తాళ్ళను కొరగ్గానే తాబేలు మడుగులోకి, జింక అడవిలోకి, కాకి ఆకాశంలోకి, ఎలుక కన్నంలోకి పారిపోయి తమను తాము రక్షించుకున్నాయి. దీనివలన ఉపాయంతో ఎలాంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చని అర్థమైంది.

Exam Tips:

a) ఉపాయాన్ని వరుస క్రమంలో రాయండి: జింక చచ్చినట్లు పడిఉండటం → కాకి కళ్ళు పొడిచినట్లు నటించడం → ఎలుక తాళ్ళు కొరకడం → తాబేలు తప్పించుకోవడం.

 

ఇవి చేయండి – I. విని అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.

Answer:

ఒక అడవిలో స్నేహంగా ఉంటున్న ఎలుక, తాబేలు, కాకి దగ్గరకు ఒక జింక వచ్చింది. భయంతో వణికిపోతోంది. ఏమైందని అడిగితే బోయవాడు తరుముకొచ్చాడని చెప్పింది. ఆ ముగ్గురూ జింకను కూడా స్నేహితునిగా చేసుకున్నారు. ఒకసారి జింక ఎంతకూ రాకపోయేసరికి కాకి ఎగురుతూ పోయి అది వలలో చిక్కుకోడం చూసింది. ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకొని తెచ్చింది. ఎలుక వల తాళ్ళు కొరికి జింకను విడిపించింది. అంతలో తాబేలు కూడా వచ్చింది. నలుగురూ కలిసి నివాసానికి పోతుంటే వేటగాడు కనిపించాడు.
తాబేలు తప్ప తక్కిన ముగ్గురూ తప్పించుకున్నారు. వేటగాడు తాబేలును వింటికి కట్టేసి తీసుకుపోతున్నాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులూ వెంటనే ఉపాయం ఆలోచించారు. ఆ ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్ళేదారిలో ఒక మడుగు దగ్గర జింక చచ్చినట్లు పడి ఉంది. దాన్ని పట్టుకుందామని వేటగాడు విల్లుకింద పెట్టి పోగానే ఎలుక వింటితాడు కొరికి తాబేలును విడిపించింది. తాబేలు మడుగులోకి, ఎలుక కన్నంలోకి పారిపోయాయి. కాకి ఎగిరిపోయింది. వేటగాడు రాకముందే జింక దూకుతూ పారిపోయింది.

Exam Tips:

a) కథను పాత్రల పేర్లతో (చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనకం, మంథరకం) ప్రారంభం, మధ్య, ముగింపు క్రమంలో చెప్పండి.

 

Question 2: మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా సాయపడ్డారా ? ఏ విధంగా సాయం చేశారు ?

Answer:

ఒకసారి నా స్నేహితుడి తల్లికి జబ్బు చేసింది. అప్పుడు ఇంట్లో అతని దగ్గర ఎవరూ తోడులేరు. అమ్మను ఆసుపత్రికి ఎలా తీసుకెళ్ళాలో తెలియక భయంతో ఏడుస్తూ కూర్చున్నాడు. బడికి వెళుతూ కలిసిపోదామని నేను వాళ్ళింటికి వచ్చాను. వెంటనే ఒక ఆటో పిలిచి నేను నా స్నేహితుడికి సాయంపట్టి వాళ్ళమ్మను ఆసుపత్రికి చేర్చాను. అతడెంత ఆనందించాడో! నాకు కూడా అలా సాయం చేసినందుకు ఎంతో తృప్తి కలిగింది.

Exam Tips:

a) మీ సొంత అనుభవాన్ని సంఘటన → మీరు చేసిన సాయం → ఫలితం అనే క్రమంలో రాయండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

Question 1: కింది పదాలు చదవండి. అవి పాఠంలో ఎక్కడున్నాయో వెతికి వాటికింద గీత గీయండి.
అ. మడుగు
ఆ. రొప్పుతూనె
ఇ. ఉరుక్కుంటూ
ఈ. గబగబ
ఉ. కానుక
ఊ. గబుక్కున
ఋ. కంచె
ౠ. అంతఃపురం
ఎ. కుండపోత
ఏ. ఊపిరిపీల్చుకుంది
ఐ. వడివడిగా
ఒ. నివ్వెరపోయారు

Answer:

అ. “తాబేలు నీటి మడుగులోకి జారుకుంది.”
ఆ. “జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది.”
ఇ. “హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వలతాళ్ళు కొరికింది.” (ఉరుకు = పరుగెత్తు)
ఈ. “తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు.”
ఉ. “వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు.”
ఊ. “గబుక్కున పైకి చూసింది.”
ఋ. “ఒక పూలతోట కంచెమీది నుంచి లోపలికి దూకాను.”
ౠ. “ఆ తోటలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు.”
ఎ. “కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో, ఉరుములతో కుండపోత వాన కురిసింది.”
ఏ. “స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది.”
ఐ. “వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడువండి.”
ఒ. “స్నేహితులంతా నివ్వెరపోయారు.”

Exam Tips:

a) పాఠంలో ఆ పదం ఉన్న వాక్యాన్ని వెతికి యథాతథంగా రాయండి.

 

కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి

హెలెన్ హృదయం కరుణరసభరితమయినది. దీనులను, దుఃఖితులను తలచుకొంటేనే ఆమె మనసు కరిగిపోయేది. ప్రకృతిలోని ప్రతి అణువూ ఆమెను పరవశింపజేసేది. మామూలు మనుషులకు కళ్ళు రెండే కాని ఆమె శరీరమంతటా స్పర్శరూప నేత్రాలున్నాయి. ప్రతి స్పర్శకూ ఆమె మనసారా అనుభూతిపొంది, తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది. తనలాంటివాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకే జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెల్లర్.
ప్రపంచమంతా తిరిగి ‘ప్రత్యేకావసరాలున్న’ పిల్లలను కలిసి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండు, అమెరికా, ఆఫ్రికా దేశాలు పర్యటిస్తూ భారతదేశానికి కూడా వచ్చింది. ఆమె జీవితం, సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయమైనాయి.

Question 1: హెలెన్ ఎటువంటిది ?

Answer:

హెలెన్ కరుణరసభరితమైన హృదయం కలది.

Exam Tips:

a) పేరా మొదటి వాక్యంలోనే సమాధానం ఉంటుంది; పేరాలోని పదాలనే ఉపయోగించండి.

 

Question 2: హెలెన్ ను పరవశింపజేసేది ఏది ?

Answer:

ప్రకృతిలోని ప్రతి అణువూ ఆమెను పరవశింపజేసేది.

Exam Tips:

a) ‘ప్రకృతిలోని ప్రతి అణువూ’ అనే పదాలను పేరా నుండి ఎత్తి రాయండి.

 

Question 3: ఎవరి జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది ?

Answer:

ప్రత్యేకావసరాలున్న పిల్లలను కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

Exam Tips:

a) పేరాలో ‘ప్రత్యేకావసరాలున్న పిల్లలు’ అన్న మాటను గమనించి రాయండి.

 

Question 4: హెలెన్ ఏయే దేశాలను పర్యటించింది ?

Answer:

హెలెన్ ఇంగ్లండు, అమెరికా, ఆఫ్రికా దేశాలను పర్యటించింది.

Exam Tips:

a) పేరాలో ఉన్న దేశాల పేర్లను (ఇంగ్లండు, అమెరికా, ఆఫ్రికా) సరిగ్గా రాయండి.

 

III. స్వీయ రచన

Question 1: ఎలుక, తాబేలు, కాకి మంచి మిత్రులని ఎలా చెప్పగలరు ? వివరించండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

ఒక అడవిలో ఎలుక, తాబేలు, కాకి స్నేహంగా జీవిస్తుండేవి. ఎవరికి ఆపద కలిగినా తక్కినవి ఆలోచన చేసి వాటిని రక్షిస్తుండేవి. పరిచయం లేని జింకను సైతం ఆపద నుండి రక్షించి మంచి మిత్రులుగా నిలిచాయి.

Exam Tips:

a) స్నేహానికి రుజువులైన సంఘటనలను (జింకను చేర్చుకోవడం, రక్షించడం) ఉదాహరణలుగా చెప్పండి.

 

Question 2: ఈ కథవల్ల మీరు గ్రహించిన మంచి విషయాలు ఏవి ? (ఐదు వాక్యాల్లో)

Answer:

మంచివారితో స్నేహం చేయాలి. స్నేహితులు ఆపదలలో ఉంటే ప్రాణానికి తెగించైనా కాపాడాలి. జంతువుల పట్ల స్నేహం, ప్రేమ, దయ కలిగి ఉండాలి. జంతువులను హింసించకూడదు, వేటాడకూడదు. ఆపద వచ్చినపుడు ధైర్యంగా ఉపాయం ఆలోచించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మిత్రులను వదులుకోకూడదు.

Exam Tips:

a) కథ నీతిని ‘మంచివారితో స్నేహం, ఆపదలో సాయం, ఉపాయంతో పరిష్కారం’ అనే రూపంలో రాయండి.

 

Question 3: సాధారణంగా పిల్లలు ఎలాంటి అపాయాలు / ఆపదలు ఎదుర్కొంటారు ? ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? (ఐదు వాక్యాల్లో)

Answer:

సాధారణంగా పిల్లలు ఆరుబయట, పాఠశాల వాతావరణంలో ఆడుకునే సందర్భాల్లో అపాయాలను ఎదుర్కొంటారు. వీధుల్లో వెళ్ళేటప్పుడు కుక్కల బారినపడే అవకాశముంటుంది. అలాగే దీపావళి వంటి పండుగ దినాల్లో చేతులు కాల్చుకునే ప్రమాదం ఉంటుంది. అందుకోసం పెద్దల సంరక్షణలో వారు ఆడుకునేలా చూడాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి తెలియజేయాలి.

Exam Tips:

a) అపాయాల జాబితా తరువాత జాగ్రత్తలను (పెద్దల పర్యవేక్షణ, నియమాలు) స్పష్టంగా రాయండి.

 

Question 4: ఈ కథకు ఇంకే పేరు పెట్టవచ్చు? ఎందుకు ? (ఐదు వాక్యాల్లో)

Answer:

ఈ కథకు మిత్రలాభం అని పేరు బాగుంటుంది. ఎందుకంటే ఇందులోని మిత్రులందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరి వలన మరొకరు లాభం పొందారు. మిత్రుల వలన లాభం కనుక మిత్రలాభం అనే పేరు పెట్టవచ్చు.

Exam Tips:

a) పేరు సూచించి, ఎందుకు సరిపోతుందో ఒక కారణం చెప్పడం మరవకండి.

 

Question 5: ‘స్నేహబంధం’ కథను క్లుప్తంగా సొంతమాటల్లో రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

ఒక అడవిలో స్నేహంగా ఉంటున్న ఎలుక, తాబేలు, కాకి దగ్గరకు ఒక జింక వచ్చింది. భయంతో వణికిపోతోంది. ఏమైందని అడిగితే బోయవాడు తరుముకొచ్చాడని చెప్పింది. ఆ ముగ్గురూ జింకను కూడా స్నేహితునిగా చేసుకున్నారు. ఒకసారి జింక ఎంతకూ రాకపోయేసరికి కాకి ఎగురుతూ పోయి అది వలలో చిక్కుకోడం చూసింది. ఎలుకను తన రెక్కలపై ఎక్కించుకొని తెచ్చింది. ఎలుక వల తాళ్ళు కొరికి జింకను విడిపించింది.
అంతలో తాబేలు కూడా వచ్చింది. నలుగురూ కలిసి నివాసానికి పోతుంటే వేటగాడు కనిపించాడు. తాబేలు తప్ప తక్కిన ముగ్గురూ తప్పించుకున్నారు. వేటగాడు తాబేలును వింటికి కట్టేసి తీసుకుపోతున్నాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులూ వెంటనే ఉపాయం ఆలోచించారు. ఆ ఉపాయం ప్రకారం వేటగాడు వెళ్ళే దారిలో ఒక మడుగు దగ్గర జింక చచ్చినట్లు పడిఉంది. దాన్ని పట్టుకుందామని వేటగాడు విల్లుకింద పెట్టి పోగానే ఎలుక వింటితాడు కొరికి తాబేలును విడిపించింది. తాబేలు మడుగులోకి, ఎలుక కన్నంలోకి పారిపోయాయి. కాకి ఎగిరిపోయింది. వేటగాడు రాకముందే జింక దూకుతూ పారిపోయింది.

Exam Tips:

a) పది వాక్యాల సారాంశంలో కథలోని పాత్రలు, సంఘటనలు, ముగింపు క్రమంగా ఉండాలి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: జంతువులను, పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా ఒక కథ రాయండి.

Answer:

పూర్వం ఒక అడవిలో ఒక చెరువు గట్టుమీద పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలలో ఒక దానిమీద హంస, మరొక దానిమీద కాకి ఉండేవి. ఒకరోజు ఒక బాటసారి ఆ దారినపోతూ తన అలసట తీర్చుకోవడానికి వచ్చి ఆ చెట్టుక్రింద నిద్రపోయాడు. కొద్దిసేపటికి సూర్యుని ఎండ ఆ బాటసారిపై పడింది. అది చూసి హంస బాటసారిపై జాలిపడి, సూర్యునికి ఎదురుగా రెక్కలు పరచి బాటసారిమీద ఎండపడకుండా చేసింది. ఇంతలో కాకి వచ్చి ఆ బాటసారి ముఖంపైన రెట్టవేసి పోయింది. బాటసారి ఉలిక్కిపడి లేచి, ఎవరు రెట్టవేసిరా అని కోపంతో చుట్టుప్రక్కల చూశాడు. హంస కనబడింది. ఆ హంసే తనపై రెట్ట వేసిందనుకొని ఆ హంసను చంపాడు.
నీతి: చెడ్డవారితో స్నేహం చేటు తెస్తుంది. .

Exam Tips:

a) కథలో పాత్రలు, సంఘటన, చివర ‘నీతి’ తప్పనిసరిగా ఉండేలా రాయండి.

 

Question 2: కథలో జింక మానవ భాషలో మాట్లాడింది కదా! ఇలాగే అడవిలోని జంతువులు మనలాగే మాట్లాడితే మన గురించి అవి ఏం మాట్లాడుకుంటాయో ఊహించి రాయండి.

Answer:

జింక : ఇది వరకు పచ్చని గడ్డిమేస్తూ తియ్యటి నీళ్ళు తాగుతూ చెట్ల నీడలలో ఆడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు ఎక్కడా కాస్త నీడ కూడా కనబడటం లేదు.
పావురం : నీకు నీడా లేదు. మాకు గూడూ లేదు.
కోతి : చెట్లన్నీ మనిషి నరికి పారేస్తుంటే నీడా గూడూ ఎక్కడి నుంచి వస్తాయి ? ఎంచక్కా కొమ్మలు పట్టుకు దూకేవాళ్ళం. చెట్టే లేకపోతే కొమ్మలెక్కడ ?
కాకి : మాకేమో మెతుకు విసిరెయ్యటం చేతకాదు గాని మన సుఖాలన్నీ లాక్కోడానికి ఈ మనిషికెట్లా మనసొప్పుతుందో!
నక్క : ఏదో ఉపాయం పన్ని ఈ మనిషి ఆగడాలు ఆపాలి.

Exam Tips:

a) సంభాషణ రూపంలో ప్రతి పాత్ర పేరు, ‘:’ తరువాత మాటలు రాయండి; మనుషుల వల్ల జంతువులకు కలిగే ఇబ్బందులను ప్రస్తావించండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింద గీత గీసిన పదాలకు సమానమయిన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి.
అ. కృష్ణకుచేలుర ‘చెలిమి’ గొప్పది.
ఆ. తామరలు ‘కొలను’లో పూస్తాయి.
ఇ. ఎలుక ‘కన్నం’లో నివసిస్తుంది.
ఈ. మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో ‘కూర్మ’ అవతారం ఒకటి.
ఉ. నిప్పుతో చెలగాటం ‘అపాయ’కరం.

Answer:

అ. స్నేహం
ఆ. మడుగు
ఇ. కలుగు
ఈ. తాబేలు
ఉ. ప్రమాదం

Exam Tips:

a) పాఠంలోని పర్యాయ పదాలను (చెలిమి = స్నేహం, కొలను = మడుగు, కన్నం = కలుగు) గుర్తుంచుకోండి.

 

Question 2: కింది పట్టికలోని ప్రకృతి – వికృతి పదాలను జతపరుచండి. అలా జతపరిచిన ప్రకృతి, వికృతులను పట్టిక రూపంలో రాయండి.
అ. అటవి
ఆ. స్నేహం
ఇ. సహాయం
ఈ. రాతిరి
ఉ. ఆకసం
1. ఆకాశం
2. సాయం
3. రాత్రి
4. నెయ్యం
5. అడవి

Answer:

అ – 5, ఆ – 4, ఇ – 2, ఈ – 3, ఉ – 1
ప్రకృతి – వికృతి
అటవి – అడవి
స్నేహం – నెయ్యం
సహాయం – సాయం
రాత్రి – రాతిరి
ఆకాశం – ఆకసం

Exam Tips:

a) ప్రకృతి పదం ముందు, వికృతి పదం తరువాత రాసి జతలను పట్టికగా రాయండి.

 

Question 3: కింది వాక్యాలను చదువండి. ప్రతి వాక్యంలోను ఒక పదానికి అదే అర్థంవచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాలకింద గీత గీయండి.
అ. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి, రంధ్రం వైపు తొంగిచూసి, బిలంలో దూరింది.
ఆ. కొలనులో కమలం వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది.
ఇ. కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమీ లేదని వాయసం మిత్రులకు చెప్పింది.
ఈ. కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది.

Answer:

అ. కన్నం, రంధ్రం, బిలం
ఆ. కొలను, సరస్సు
ఇ. కాకి, వాయసం
ఈ. సఖ్యం, నెయ్యం

Exam Tips:

a) ఒకే వాక్యంలో ఉన్న ఒకే అర్థం గల పదాలను జతగా గుర్తించండి; ప్రతి వాక్యంలో రెండు కంటే ఎక్కువ ఉండవచ్చు.

 

Question 4: కింది పదాలు చదువండి. వీటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ. గబుక్కున
ఆ. తళుక్కున
ఇ. చటుక్కున
ఈ. మిరుమిట్లు గొలిపే
ఉ. మురిసిపోవడం
ఊ. వడివడిగా
ఋ. నివ్వెరపోయి

Answer:

అ. కుక్కను చూసి పిల్లి గబుక్కున పారిపోయింది.
ఆ. ఆకాశంలో మెరుపు తళుక్కున మెరిసింది.
ఇ. పిల్లిని చూసి ఎలుక చటుక్కున పారిపోయింది.
ఈ. మిరుమిట్లు గొలిపే మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది.
ఉ. చిన్న పిల్లలు చిన్న చిన్న బహుమతులకే మురిసిపోవడం జరుగుతుంది.
ఊ. కొందరు నెమ్మదిగాను, మరికొందరు వడివడిగాను నడుస్తారు.
ఋ. బాగా చదివే నా మిత్రుడు పరీక్షలో తప్పినందుకు నివ్వెరపోయాను.

Exam Tips:

a) ఇచ్చిన పదం యథాతథంగా వాక్యంలో వాడండి; వాక్యం అర్థవంతంగా ఉండాలి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది వాక్యంలో పరుషాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.
కష్టపడి చదివితే ఫలితం తప్పక ఉంటుంది.

Answer:

పరుషాలు (క, చ, ట, త, ప) : కష్టపడి – క, ట, ప; చదివితే – చ, త; ఫలితం – త; తప్పక – త, ప, క; ఉంటుంది – ట
పరుషాలు : క, చ, ట, త, ప

Exam Tips:

a) క, చ, ట, త, ప అనే ఐదు అక్షరాలే పరుషాలు; వాక్యంలో ప్రతి పదాన్ని పరిశీలించండి.

 

Question 2: కింది మాటల్లో సరళాలతో మొదలయిన మాటలను గుర్తించండి.
బలం, కలం, గాలి, జలం, దళం, తళుకు, కాలు, డబ్బు, గళం

Answer:

బలం, గాలి, జలం, దళం, డబ్బు, గళం
సరళాలు : గ, జ, డ, ద, బ

Exam Tips:

a) సరళాలు గ, జ, డ, ద, బ – పదం మొదట ఈ అక్షరం ఉన్నవాటినే ఎంచండి.

 

Question 3: కింది మాటల్లో అంతస్థాలను గుర్తించండి.
యమున, కారం, పాలు, వంకర, వేళ, కల

Answer:

యమున – య; కారం – ర; పాలు – ల; వంకర – వ, ర; వేళ – వ; కల – ల
అంతస్థాలు : య, ర, ల, వ

Exam Tips:

a) అంతస్థాలు య, ర, ల, వ మాత్రమే (ళ కాదు).

 

Question 4: కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి.
భాష మనిషికి సహజమైన శక్తి.

Answer:

భాష – ష; మనిషికి – ష; సహజమైన – స, హ; శక్తి – శ
ఊష్మాలు : శ, ష, స, హ

Exam Tips:

a) ఊష్మాలు శ, ష, స, హ; ప్రతి పదంలో వీటిని వెతకండి.

 

ప్రాజెక్టు పని

Question 1: పాఠశాల గ్రంథాలయంలోని పంచతంత్రం కథల పుస్తకం చదవండి. దాంట్లో మీకు నచ్చిన కథను రాసి, తరగతిగదిలో ప్రదర్శించండి.

Answer:

1. ప్రాజెక్టు శీర్షిక : పాఠశాల గ్రంథాలయంలోని పంచతంత్రం కథల పుస్తకం లో నచ్చిన కథ రాసి ప్రదర్శించడం.
2. సమాచార సేకరణ:
సమాచారం సేకరించిన తేది : ……………
సమాచార వనరు : గ్రంధాలయం
చదివిన పుస్తకం : పంచతంత్రం
3. సేకరించిన విధానం : మా పాఠశాల గ్రంథాలయంలో పంచతంత్రం కథల పుస్తకం నుండి నాకు నచ్చిన కథను సేకరించాను
4. నివేదిక : ఒక చెరువులో ఒక తాబేలు ఉంది. అది రోజూ ఒడ్డుకు వచ్చి అటూ ఇటూ తిరిగి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయేది. ఎక్కడి నుంచో రెండు హంసలు అక్కడికి వచ్చి చేరాయి. తాబేలుతో వాటికి మంచి స్నేహంకుదిరింది. రోజూ ఆ రెండు హంసలు వచ్చి తాబేలుతో కబుర్లు చెబుతూ ఉండేవి. అలా ఆ మూడు బాగా స్నేహంగా ఉండేవి. ఒకసారి వానలు లేక చెరువు ఎండిపోసాగింది. తాబేలుకు ఏం చెయ్యాలో తెలియక దిగులుగా కూర్చుంది.
హంసలు తాబేలును వేరొక చెరువులోకి చేరుస్తామన్నాయి. ఒక పెద్దకర్ర తెచ్చి హంసలు వాటి ముక్కుతో పట్టుకున్నాయి. తాబేలును గట్టిగా కరిచి పట్టుకోమన్నాయి. తాబేలు అలాగే చేసింది. హంసలు ఎగురుతూ ఒక ఊరిలో నుండి పోతూ ఉంటే ఊళ్ళోని వారు తాబేలును చూసి నవ్వసాగారు. అది చూసి తాబేలు “ఎందుకీ మూర్ఖులు ఇలా నవ్వుతారు?” అంటూ నోరు తెరిచింది. అంతే కర్ర నుంచి జారి నేలమీద పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడడం వల్ల చనిపోయింది.
నీతి:
చేసే పనిమీద ధ్యాస ఉండాలి.
కోపం వల్ల ప్రమాదం కలుగుతుంది.
5. ముగింపు : పంచతంత్రం కథల్లో చిన్న చిన్న జంతువులు, పక్షులు పాత్రలుగా ఉండి అనేక నీతులను మనకు బోధిస్తాయి.

Exam Tips:

a) ప్రాజెక్టు శీర్షిక, సమాచార వనరు, పద్ధతి, నివేదిక, ముగింపు అనే క్రమాన్ని పాటించండి.

 

ముఖ్యమైన ప్రశ్నలు

Question 1: ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి అపాయంలో పడతామని జింక ఎందుకు అన్నది ?

Answer:

ఎంత జాగ్రత్తగా ఉన్నా అపాయాలు ఎదురౌతాయి. చిన్నప్పటి నుంచి జింకకు అలా అపాయాలు కలుగుతూనే ఉన్నాయి. ఆర్నెల్ల వయసులో వేటగాడి ఉచ్చులో చిక్కుకొని రాజభవనానికి చేరింది. వీధుల్లో తిరుగుతూ పిల్లలు తరిమితే ఉద్యానవనంలోకి దూకి కట్టివేయబడింది. రాజకుమారుడు విడిచి పెట్టగా అడవిలోకి చేరుకుని తన వారితో కలిసుందామనుకుంటే వేటగాడు తరిమాడు. ఎలాగో తప్పించుకొని కాకి, ఎలుక, తాబేలుతో స్నేహం సంపాదిస్తే మళ్ళీ వేటగాడి వలలో చిక్కుకుంది.

Exam Tips:

a) జింక జీవితంలోని అపాయాలను కాలక్రమంలో వరుసగా రాయండి.

 

Question 2: స్నేహానికున్న గొప్పతనాన్ని వివరించే సంఘటనలు మీ పాఠంలో ఏమేమి ఉన్నాయి ?

Answer:

జింక భయంతో వచ్చినపుడు స్నేహితులు ముగ్గురూ ఒక మాటపై నిలబడి జింకను తమ మిత్రునిగా చేసుకున్నాయి. ఆపదలో ఉన్న జింక రక్షింపబడటం స్నేహానికున్న గొప్పతనాన్ని తెలుపుతోంది.
జింకను వేటగాడి నుండి రక్షించటానికి కాకి, ఎలుక కలిసి ప్రయత్నించటం స్నేహం గొప్పదని తెలుపుతోంది.
తాబేలు వేటగాడికి చిక్కగానే తక్కిన ముగ్గురూ ఉపాయం ఆలోచించి విడిపించడం కూడా స్నేహం యొక్క గొప్పతనమే.

Exam Tips:

a) పాఠంలోని మూడు సంఘటనలను (జింకను చేర్చుకోవడం, వల నుండి రక్షణ, తాబేలును విడిపించడం) పేర్కొనండి.

 

Question 3: “తిరిగి అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను” అని జింక అన్నది కదా! దీనివల్ల మీరేం తెలుసుకున్నారు ?

Answer:

జంతువులు గాని, పక్షులుగాని తమ జాతి వారితో కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటాయి. మనుషులు తమ స్వార్థం కోసం, సంతోషం కోసం వాటిని ఇళ్ళలో బంధించి ఉంచటం తప్పు. వాటిని ఎంత ప్రేమగా చూసినా కూడా అవి స్వేచ్ఛను కోరుకుంటాయని తెలుసుకున్నాను.

Exam Tips:

a) స్వేచ్ఛ విలువను, జంతువులను బంధించరాదన్న సందేశాన్ని చెప్పండి.

 

Question 4: చిత్రాంగుడి వృత్తాంతాన్ని పది వాక్యాల్లో రాయండి.

Answer:

చిత్రాంగుడు ఒక జింక. దాని ఆర్నెల్ల వయసులో ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. వాడు దానిని ఒక రాకుమారుడికి కానుకగా ఇచ్చాడు. రాకుమారుడు దాన్ని తన ఇంట్లో స్వేచ్ఛగా తిరగనిస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒకనాడు జింక వీథుల్లో తిరుగుతుంటే పిల్లలు వెంటపడ్డారు. భయంతో పక్కనున్న గోడ దూకగానే అంతఃపుర స్త్రీలు పట్టుకొని రాకుమారుడి పడక గది బయట కట్టేశారు.
అంతలో ఉరుములు మెరుపులతో పెద్దవాన రాగానే దానికి తనవారు, తానుండే అడవి గుర్తుకొచ్చాయి. మళ్ళీ అడవిలోకెళితే ఎంత బాగుంటుందో అని మానవ భాషలో అనుకొన్నది. వెంటనే అది విన్న రాకుమారుడు దానిని అడవికి పంపివేశాడు. కొన్నాళ్ళకు ఒక వేటగాడు తరుముతుంటే పారిపోయి కాకి, ఎలుక, తాబేలు ఉన్న చోటికి వచ్చింది. వారితో స్నేహం కలిసింది. ఒకనాడు అడవిలో వేటగాడి వలలో చిక్కుకుంది. ఎలుక వలను కొరికి చిత్రాంగుడిని రక్షించింది.

Exam Tips:

a) పది వాక్యాల్లో జింక వృత్తాంతాన్ని కాలక్రమంలో రాయండి: ఉచ్చు, రాజభవనం, అడవి, స్నేహం, వల.

 

Question 5: జింకను స్నేహితులు రక్షించిన తీరును సొంత మాటల్లో రాయండి?
(లేదా)
వలలో చిక్కుకున్న జింకను వేటగాడి నుండి మిత్రులు ఎలా రక్షించాయి ?

Answer:

ఒక నాడు పొద్దు వాలుతున్న వేళ స్నేహితులు ఒక చోటికి చేరాయి. కాని మేతకు వెళ్ళిన జింక రాలేదు. ఎందుకు రాలేదో తెలియలేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. కాకి మనసులో ఒక ఉపాయం మెరిసింది. అది గాలిలో ఎగురుతూ అడవిలో అటు ఇటూ చూస్తున్నది. అంతలో ఒక చోట వలలో చిక్కుకున్న జింకను చూసింది. స్నేహితున్ని చూసి దుఃఖించింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా! నీవు ఈ ఆపదనుండి బయట పడాలి అన్నది కాకి. వెంటనే జింక, ఎలుక వచ్చి వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది. కాకి వెంటనే గాలిలో ఎగిరి హిరణ్యకం (ఎలుక) ను వీపు మీద తీసుకొచ్చింది. వెంటనే ఎలుక వల తాళ్ళను కొరికింది. జింక బయటికి వచ్చింది. ఈ విధంగా స్నేహితులు జింకను రక్షించారు

Exam Tips:

a) కాకి ఎగిరి చూడడం, ఎలుకను తెచ్చుకోవడం, ఎలుక వల కొరకడం అనే మూడు దశలను రాయండి.

 

కింది ఆహ్వాన పత్రికను చదివి దిగువ ప్రశ్నలకు సమాధానములు రాయండి

ఆహ్వానం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చర్లపల్లి, వరంగల్ గ్రామీణ క్రీడా దినోత్సవము.
…… ఫిబ్రవరి …… బుధవారం సాయంత్రం 5 గం॥ 30 ని॥ లకు మా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించబడే “క్రీడాదినోత్సవ” కార్యక్రమానికి రావలసిందిగా మనవి.
అధ్యక్షులు : గౌ|| ప్రకాశరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు
ముఖ్య అతిధి : శ్రీమతి గద్దల పద్మ గారు, జడ్పి చైర్పర్సన్
ఆత్మీయ అతిధి : గౌ|| నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి
ప్రత్యేక ఆహ్వానము : శ్రీ వెంకటనారాయణ, వాలీబాల్ క్రీడాకారులు
కార్యక్రమం :
జ్యోతి ప్రజ్వలన
అతిధుల సందేశాలు
విద్యార్థులకు బహుమతి
సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
వందన సమర్పణ
సూచన : దూరప్రాంతం వెళ్లవలసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాత్రి భోజనం, వసతి ఏర్పాటు ఉంది.
గమనించగలరు
ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ, జి.ప.ఉ.పా. చర్లపల్లి, వరంగల్

Question 1: పై ఆహ్వాన పత్రిక ఏ వేడుకకు సంబంధించినది ?

Answer:

క్రీడాదినోత్సవ వేడుకకు సంబంధించినది

Exam Tips:

a) పత్రిక శీర్షికలోనే సమాధానం ఉంటుంది.

 

Question 2: పై వేడుకకు ముఖ్య అతిధి ఎవరు ?

Answer:

శ్రీమతి గద్దల పద్మగారు (జడ్పి చైర్పర్సన్)

Exam Tips:

a) ‘ముఖ్య అతిధి’ పంక్తి చూసి పేరుతో పాటు పదవిని కూడా రాయండి.

 

Question 3: పై కార్యక్రమానికి అధ్యక్షత వహించినదెవరు ?

Answer:

గౌ|| ప్రకాశరావు గారు (పాఠశాల ప్రధానోపాధ్యాయులు)

Exam Tips:

a) ‘అధ్యక్షులు’ పంక్తిని చూడండి.

 

Question 4: వేడుకకు ఆహ్వానించు వారెవరు ?

Answer:

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ.

Exam Tips:

a) ‘ఇట్లు’ తరువాత ఉన్న వారిని రాయండి.

 

Question 5: వేడుక నిర్వహించు స్థలం ఏది ?

Answer:

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చర్లపల్లి, వరంగల్ గ్రామీణం

Exam Tips:

a) పత్రికలో ఉన్న స్థలం పేరును పూర్తిగా రాయండి.

 

కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి

తోలుబొమ్మల ఆట వలెనే బహుళ ప్రచారము పొందినవి యక్షగానాలు అనే వీథి నాటకాలు. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు. భాగవతములోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగోతులని పిలుస్తారు. కొన్ని సంవత్సరముల క్రిందటి వరకు మన పల్లెటూళ్ళలో ఈ భాగోతుల ఆటలు విరివిగా జరుగుతూ ఉండేవి. చాలాకాలం నుండి యక్షగానాలు, తోలుబొమ్మలాటలతో పాటు భాగోతాలు మన పల్లెటూళ్ళ ప్రజలను రంజింపచేస్తున్న వినోదాలు, వేడుకలు.

Question 1: వీధినాటకాలను ఆడేవారిని ఏమని పిలుస్తారు ?

Answer:

వీథి నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు.

Exam Tips:

a) పేరాలోని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సంపూర్ణ వాక్యంలో జవాబు రాయండి.

 

Question 2: భాగోతులని ఎవరిని పిలుస్తారు ?

Answer:

భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వాటిని ఆడేవారిని భాగోతులు అని పిలుస్తారు.

Exam Tips:

a) పేరాలోని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సంపూర్ణ వాక్యంలో జవాబు రాయండి.

 

Question 3: తోలుబొమ్మల ఆట వలెనే బహుళ ప్రచారము పొందినవి ఏవి ?

Answer:

తోలుబొమ్మలాట వలెనే బహుళ ప్రచారం పొందినవి యక్షగానాలు.

Exam Tips:

a) పేరాలోని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సంపూర్ణ వాక్యంలో జవాబు రాయండి.

 

Question 4: పల్లెటూళ్ళలో విరివిగా జరిగేవి ఏవి ?

Answer:

పల్లెటూళ్ళలో విరివిగా జరిగేవి భాగోతుల ఆటలు.

Exam Tips:

a) పేరాలోని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సంపూర్ణ వాక్యంలో జవాబు రాయండి.

 

Question 5: యక్షగానాలకు మరొక పేరు ?

Answer:

యక్షగానాలకు మరొక పేరు వీథి నాటకాలు.

Exam Tips:

a) పేరాలోని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సంపూర్ణ వాక్యంలో జవాబు రాయండి.

 

పదజాలం – సరైన సమాధానాన్ని గుర్తించండి

Question 1: ‘ఒక అడవిలో ఒక కాకి, ఎలుక ఉండేవి. అదే వనంలో జింక కూడా ఉంది.’ ఈ వాక్యాల్లో ఒకే అర్థానిచ్చే పదాలు
(a) ఎలుక, జింక
(b) అడవి, వనం
(c) వనం, ఎలుక
(d) అడవి, జింక

Answer:

(b) అడవి, వనం

Exam Tips:

a) ఒకే అర్థం ఉన్న రెండు పదాలను (అడవి – వనం) గుర్తించండి.

 

Question 2: మిత్రుని కోసం కాకి, ఎలుక కలత పడ్డాయి. నేస్తం కనిపించింది వాటికి. ఈ వాక్యాల్లో సమానమైన అర్థాన్నిచ్చే పదాలు
(a) మిత్రుడు, నేస్తం
(b) ఎలుక, నేస్తం
(c) మిత్రుడు, కాకి
(d) కాకి, ఎలుక

Answer:

(a) మిత్రుడు, నేస్తం

Exam Tips:

a) మిత్రుడు – నేస్తం ఒకే అర్థం గల పదాలు.

 

Question 3: ఎవరికైనా ఆపద వస్తుంటుంది. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ వాక్యాల్లోని పర్యాయ పదాలు
(a) ఆపద, ఉపాయం
(b) ఆపద, అపాయం
(c) ఉపాయం, తప్పించుకోవడం
(d) ఎవరు, తప్పించుకొను

Answer:

(b) ఆపద, అపాయం

Exam Tips:

a) ఆపద – అపాయం పర్యాయ పదాలు.

 

Question 4: ‘ఆకాశం’ అనే పదానికి వికృతి
(a) ఆకాష
(b) ఆశాకం
(c) ఆకసం
(d) అక్షం

Answer:

(c) ఆకసం

Exam Tips:

a) ఆకాశం – ఆకసం (ప్రకృతి – వికృతి).

 

Question 5: ‘సహాయం’ అనే పదానికి వికృతి
(a) సాయం
(b) సహనం
(c) సమం
(d) సహ్యం

Answer:

(a) సాయం

Exam Tips:

a) సహాయం – సాయం.

 

Question 6: ‘నెయ్యం’ అనే వికృతి పదానికి తగిన ప్రకృతి పదం
(a) నెయ్యి
(b) నేహ
(c) నయం
(d) స్నేహం

Answer:

(d) స్నేహం

Exam Tips:

a) నెయ్యం (వికృతి) – స్నేహం (ప్రకృతి).

 

Question 7: ‘ఆశ్చర్యం’ అనే పదానికి వికృతి
(a) అచ్చెరువు
(b) అచ్చరము
(c) అచ్చర
(d) ఆసరము

Answer:

(a) అచ్చెరువు

Exam Tips:

a) ఆశ్చర్యం – అచ్చెరువు.

 

Question 8: ‘బాస’ అనే వికృతి పదానికి ప్రకృతి
(a) బాస్
(b) భాస
(c) భాష
(d) భాసం

Answer:

(c) భాష

Exam Tips:

a) బాస (వికృతి) – భాష (ప్రకృతి).

 

వ్యాకరణం – సరైన సమాధానాన్ని గుర్తించండి

Question 1: ‘నీకు కావలసినంత పచ్చిక ఇక్కడ ఉంది’ – ఈ వాక్యంలో ఉన్న పరుషాలు
(a) వ, ది, త
(b) నీ, సి, ఇ, ఉ
(c) న, క, ఉ, ల
(d) కు, కా, త, ప, చ్చి, క, క్క

Answer:

(d) కు, కా, త, ప, చ్చి, క, క్క

Exam Tips:

a) పరుషాలు (క, చ, ట, త, ప) ఉన్న అక్షరాలన్నింటినీ లెక్కించి సరైన ఎంపికను ఎంచండి.

 

Question 2: కింది వాటిలో సరళంతో మొదలైన పదం
(a) బయటకు
(b) రాలేని
(c) చిత్రాంగుడు
(d) కలవరపడ్డాడు

Answer:

(a) బయటకు

Exam Tips:

a) సరళాలు గ, జ, డ, ద, బ; పదం ‘బ’ తో మొదలవుతుందో చూడండి.

 

Question 3: కింది వానిలో అంతస్థాలు
(a) శ, ష, స, హ
(b) క, చ, ట, త, ప
(c) య, ర, ల, వ
(d) గ, జ, డ, ద, బ

Answer:

(c) య, ర, ల, వ

Exam Tips:

a) అంతస్థాలు: య, ర, ల, వ.

 

Question 4: కింది వానిలో ఊష్మాలు
(a) హ, స, శ, ష
(b) య, వ, ర, ల
(c) ళ, క్ష, ఱ
(d) ఞ, న, ఙ, ణ, మ

Answer:

(a) హ, స, శ, ష

Exam Tips:

a) ఊష్మాలు: శ, ష, స, హ.

 

Question 5: కింది వానిలో వేటిని అనునాసికాలంటారు ?
(a) న, మ, హ
(b) ఙ, ఞ, ణ, న, మ
(c) గ, జ, ద, డ, బ
(d) క, చ, ట, త, ప

Answer:

(b) ఙ, ఞ, ణ, న, మ

Exam Tips:

a) అనునాసికాలు: ఙ, ఞ, ణ, న, మ.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 6 Telugu Lesson 02 Snehabandham (Bond of friendship)

Textbook Solutions for Class 6 Telugu Lesson 02 Snehabandham (Bond of friendship)

Review comprehensive exercise answers for Class 6 Telugu Lesson 02 Snehabandham (Bond of friendship). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 02 Snehabandham (Bond of friendship) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 6 Telugu.

FAQs

Where can I find the latest TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం for the 2026-27 session?

The complete and updated TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం will help students to get full marks in the theory paper.

Do you offer TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire TS 6th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana స్నేహబంధం in printable PDF format for offline study on any device.