Official TS Board Solutions for Class 6 Telugu: Lesson 01 Abhinandana (Salutations)
Access comprehensive textbook solutions for Lesson 01 Abhinandana (Salutations) using the official curriculum guides for Class 6 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Chapter-wise Solutions for Telugu: Lesson 01 Abhinandana (Salutations)
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
బొమ్మ చూసి చెప్పండి
Question 1: పై బొమ్మలో ఏం జరుగుతున్నది ?
Answer:
పై బొమ్మలో సైనిక దినోత్సవం సందర్భంగా పిల్లల ఊరేగింపు జరుగుతోంది.
Exam Tips:
a) బొమ్మలో కనిపించే సన్నివేశాన్ని (ఊరేగింపు, పిల్లలు, సైనికులు) ఒక వాక్యంలో స్పష్టంగా వర్ణించండి.
Question 2: పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు ?
Answer:
జై జవాన్, సైనికులకు వందనం, వీరులకు వందనం అంటూ పిల్లలు నినాదాలు ఇస్తున్నారు.
Exam Tips:
a) బొమ్మలో కనిపించే నినాదాలను, గేయంలోని ‘వందనాలు’ భావంతో జతచేసి రాయండి.
Question 3: జై జవాన్! అని ఎందుకంటున్నారు ?
Answer:
జవాన్ అంటే సైనికుడు. సైనికులు ప్రతి నిమిషం దేశాన్ని శత్రువుల నుండి రక్షిస్తూ ఉంటారు అందుకే సైనికులకు జయం కలగాలి అనే అర్థం వచ్చేలా జై జవాన్ అని అంటున్నారు.
Exam Tips:
a) జవాన్ అంటే సైనికుడని అర్థం చెప్పి, వారు దేశాన్ని ఎలా రక్షిస్తారో కారణంగా రాయండి.
Question 4: జవాను దేశానికి సేవ చేస్తాడు కదా! ఇతనివలె దేశం కోసం పాటుపడేవాళ్ళు ఎవరు ?
Answer:
జవానుల వలె పోలీసులు కూడా దేశ సేవ చేస్తారు. ఇలాగే రైతులు వ్యవసాయంచేసి ప్రజలకు అన్నసేవ చేస్తున్నారు. ఇంకా వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు దేశానికి సేవ చేస్తున్నారు.
Exam Tips:
a) సైనికులతో పాటు రైతులు, పోలీసులు, వైద్యులు వంటి వారి సేవలను ఉదాహరణలతో చెప్పండి.
ఆలోచించండి – చెప్పండి (పేజీ 4)
Question 1: రైతులను “శ్రమ దాచని హాలికులని” ఎందుకన్నారు ?
Answer:
రైతులు శ్రమదాచని హాలికులు. ఎందుకంటే ఏడాది పొడవునా కష్టపడి పొలంలో పనిచేస్తారు. తమ నెత్తురును చెమటలాగా ధారపోస్తూ కాయకష్టం చేసి బంగారు పంటలు పండిస్తాడు.
Exam Tips:
a) ‘శ్రమ దాచని’ అంటే కష్టాన్ని దాచుకోకుండా చేయడమని అర్థం; రైతు కష్టాన్ని ఉదాహరణలతో రాయండి.
Question 2: “భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులు” అనే వాక్యం ద్వారా మీకేమర్థమయింది ?
Answer:
రైతులు, సైనికులు రాత్రింబవళ్ళు కష్టపడుతూ ప్రజాసేవ చేస్తున్నారు. రైతులు పంటలు పండించి ప్రజల ఆకలి తీర్చి దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తూ శత్రు సైనికుల నుండి దేశాన్ని రక్షిస్తున్నారు.
దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. అలా రైతులూ, సైనికులూ భరతమాత పురోగతికి మూల స్తంభాలైన వారు.
Exam Tips:
a) ‘ప్రాతిపదిక’ అంటే పునాది అని ముందు చెప్పి, రైతులు, సైనికులు దేశానికి పునాది ఎలా అయ్యారో రాయండి.
Question 3: “రుధిరం స్వేదమ్ము కాగ పసిడిని పండించునట్టి” అంటే మీకేం అర్థమయింది ?
Answer:
రుధిరం అంటే రక్తం; స్వేదము అంటే చెమట; పసిడి అంటే బంగారం. రైతు పగలు రాత్రీ తేడా లేకుండా తన శ్రమను దాచుకోకుండా కష్టపడతాడు. తన రక్తాన్ని చెమటగా మార్చి పొలందున్ని బంగారం లాంటి పంటలు పండిస్తాడు. ప్రజల ఆకలి తీరుస్తాడు అని అర్ధమయింది.
Exam Tips:
a) రుధిరం = రక్తం, స్వేదం = చెమట, పసిడి = బంగారం అని పదాల అర్థాలను చెప్పి తరువాత భావాన్ని రాయండి.
Question 4: కంటికి కనురెప్ప, చేనుకు కంచె. ఇట్లా దేనికి ఎవరు రక్ష ? ఇటువంటివే మరికొన్ని చెప్పండి.
Answer:
బిడ్డకు తల్లి, తలకు టోపీ, కోటకు గోడ, చెరువుకు కట్ట, నదులకు తీరం, ఎండా వానలకు గొడుగు, కాలికి చెప్పు రక్షణగా ఉంటాయి. భూమికి ఓజోన్ పొర రక్షణ.
Exam Tips:
a) ‘X కు Y రక్ష’ అనే నమూనాలో ఉదాహరణలు రాయండి (కంటికి రెప్ప, తలకు టోపీ).
ఆలోచించండి – చెప్పండి (పేజీ 5)
Question 1: “జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు” అని కవి ఎందుకన్నాడు ?
Answer:
జవానులు అంటే సైనికులు. వాళ్ళెప్పుడూ సరిహద్దులో కాపలా కాస్తూ ఉంటారు. శత్రు సైనికులు దండెత్తి వస్తే వెంటనే తరిమి కొడతారు. ఒక కవచం మనిషికి దెబ్బ తగలకుండా ఎలా రక్షిస్తుందో ఒక సైనికుడు మాతృభూమికి శత్రువుల దెబ్బ తగలకుండా అలాగే రక్షిస్తాడు కనుక కవి అలా వర్ణించాడు.
Exam Tips:
a) ‘కవచం’ ఉపమానాన్ని వివరిస్తూ సైనికుడు దేశాన్ని ఎలా రక్షిస్తాడో రాయండి.
Question 2: “నీతికర్మ శీలురు” అని ఎవరిని అంటారు ?
Answer:
ఎప్పుడూ నీతిని తప్పకుండా న్యాయమార్గంలో నడిచేవారు, తమ పనులను సకాలంలో బాధ్యతతో నిర్వర్తించేవారు మంచి ప్రవర్తన గలవారౌతారు. వారినే నీతికర్మ శీలురు అంటారు.
Exam Tips:
a) ‘నీతి’ (న్యాయం), ‘కర్మ’ (కర్తవ్యం) అని రెండు భాగాలుగా అర్థం చెప్పి ముగించండి.
ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: గేయాన్ని పాడుతూ అభినయించండి.
Answer:
ఇది విద్యార్థులు స్వయంగా చేయవలసిన కృత్యం. గేయాన్ని రాగయుక్తంగా పాడుతూ ముఖ కవళికలతో, చేతి కదలికలతో అభినయించాలి.
Exam Tips:
a) అభినయ గేయం అని గుర్తుంచుకొని సొంత ప్రదర్శనగా సాధన చేయండి.
Question 2: ప్రగతి మార్గదర్శకులని ఎవరినంటారు ? ఇట్లాంటివారి పేర్లు కొన్ని చెప్పండి. సమాజానికి వీరి అవసరం ఏమిటి?
Answer:
ప్రగతి మార్గదర్శకులంటే ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించేవారు. మంచి విషయాలు నేర్పి మంచి మార్గంలో నడిపి అభివృద్ధిలోకి తెచ్చేవారు. మహాత్మగాంధీ, బాలగంగాధరతిలక్ వంటి దేశ నాయకులు ప్రజలలో దేశభక్తి రేకెత్తించి స్వరాజ్య ఉద్యమం వైపు నడిపించారు. రాజారామమోహన్రాయ్, కందుకూరి వీరేశలింగం వంటివారు సాంఘిక దురాచారాలను రూపుమాపి ప్రజలను అభివృద్ధిమార్గంలో నడిపించారు. అలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వీరి అవసరం ఎప్పుడూ ఉంటుంది.
Exam Tips:
a) ప్రగతి మార్గదర్శకులకు (గాంధీ, తిలక్, రాజారామమోహన్ రాయ్, వీరేశలింగం) సంబంధించిన పేర్లు, వారి కృషిని జతగా రాయండి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం
Question 1: పాఠాన్ని చదవండి. రైతుల, సైనికుల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను గుర్తించి రాయండి.
Answer:
రైతులు : శ్రమదాచనివారు. పసిడిని పండించువారు. ప్రగతి మార్గదర్శకులు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పుతారు.
సైనికులు: తలవంచనివారు. భరతమాత పురోగతికి ప్రాతిపదికలు. ఘనవీరులు. నిర్మలురు. నీతికర్మ శీలురు. ఘనజనులు.
Exam Tips:
a) పాఠంలోని విశేషణాలను (శ్రమదాచని, తలవంచని, ఘనవీరులు) రైతు, సైనికుల వారీగా వేరు చేసి రాయండి.
Question 2: కింది గేయాన్ని చదవండి. ఖాళీలను పూరించండి.
పల్లెలు మనపాలిటి కల్పతరువులూ – నవభారత గృహసీమకు మణిదీపాలూ
మానవతకు మందిరాలు మమతలకవి పుట్టినిళ్ళు – మన సంపద నిలయాలు
భరతమాత నయనాలు ప్రగతికి సోపానాలూ
సుగతికి తార్కాణాలు – మనిషి మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు
అ) భరతమాతకు నయనాలు ___________
ఆ) పల్లెలు నవభారత గృహసీమకు ___________
ఇ) “ప్రగతికి సోపానాలు”లో సోపానాలు అంటే ___________
ఈ) నివాసం అనే అర్థం వచ్చే పదాలు ___________
Answer:
అ) పల్లెలు
ఆ) మణిదీపాలు
ఇ) మెట్లు
ఈ) మందిరాలు, నిలయాలు, ఇళ్ళు
Exam Tips:
a) గేయంలోని పదాలనే యథాతథంగా ఖాళీలలో రాయండి; స్పెల్లింగ్ జాగ్రత్తగా రాయండి.
III. స్వీయ రచన
Question 1: అ. “దేశపురోగతి” అంటే ఏమిటి ? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి.
Answer:
దేశపురోగతి అంటే దేశం అభివృద్ధి చెందటం, పంచవర్ష ప్రణాళిక రచించిన పండిట్నెహ్రూ, ఆయన ఆశయ సాధనకు కృషిచేసి ప్రాజెక్టులు నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె.ఎల్.రావు వంటి ఇంజనీర్లు, వ్యవసాయంలో విప్లవం తెచ్చిన స్వామినాథన్, పాల ఉత్పత్తిలో విప్లవం తెచ్చిన కురియన్ మొదలైన వారంతా దేశ పురోగతికి తోడ్పడినవారే.
Exam Tips:
a) ‘పురోగతి’ అంటే అభివృద్ధి అని నిర్వచించి, పేర్లతో పాటు వారి కృషిని కూడా ఒక్కొక్క వాక్యంలో రాయండి.
Question 2: ఆ. దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి ?
Answer:
నీతిశీలురు అంటే న్యాయమార్గంలో నడిచేవారు. మోసపు మార్గంలో నడవనివారు. న్యాయంగా ప్రవర్తిస్తే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటివారు కూడా సంతృప్తిగా ఉంటారు. అవినీతి వల్ల ఎవ్వరికీ సుఖశాంతులుండవు. అందువల్ల ప్రతివారు నీతిమంతులై ఉండాలి. కర్మశీలురు అంటే తమ విధులను సక్రమంగా నెరవేర్చేవారు. ఎవరి పనులు వారు సకాలంలో చక్కగా నిర్వర్తిస్తే అన్నీ చక్కగా నెరవేరుతాయి. అలా ఎవరి పనులను వారు పద్ధతి ప్రకారం నెరవేరిస్తే దేశంతప్పకుండా ప్రగతి సాధిస్తుంది.
Exam Tips:
a) నీతిశీలురు, కర్మశీలురు అనే రెండు పదాలను విడివిడిగా వివరించి, దేశప్రగతికి వీరు ఎలా అవసరమో ముగించండి.
Question 3: ఇ. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలు ఆర్పటం అంటే ఏమిటి ?
Answer:
అవిశ్రాంత సేద్యం అంటే కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా పొలంలో పనిచేసి పంటలు పండించటం. రైతు ఏ మాత్రం విరామం లేకుండా పంటలు పండిస్తూ ఉంటే కూడా సమయం చాలటం లేదు. ప్రజల అవసరానికి తగినంత పంట పండించి ఎవరూ ఆకలితో బాధపడకుండా చూస్తాడు రైతు. ఇదే ఆకలి మంటలు ఆర్పటం అంటే.
Exam Tips:
a) ‘అవిశ్రాంత సేద్యం’, ‘ఆకలి మంటలు’ అనే రెండు పదబంధాల భావాన్ని విడివిడిగా చెప్పండి.
Question 4: ఈ. ఈ గేయ రచయిత గురించి సొంతమాటల్లో రాయండి.
Answer:
శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. ఈయన తల్లిదండ్రులు కనకమ్మ, నరహరిస్వామి. చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు; దైవభక్తి, దేశభక్తి గేయాలు రాయడంలో ఈయనది అందెవేసిన చేయి. ‘స్వరభారతి’ అనే గేయ సంకలనం నుండి ఈ ‘అభినందన’ గేయం తీసుకోబడింది.
Exam Tips:
a) కవి పేరు, ఊరు, తల్లిదండ్రులు, వృత్తి, రచనలు అనే క్రమంలో రాయండి.
Question 5: ‘అభినందన’ గేయ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
రైతులు, సైనికులు దేశానికి ఎలా సేవ చేస్తున్నారో తెలుపండి ?
(లేదా)
జన్మభూమికి ఎవరెవరు ఎట్లా సేవ చేస్తున్నారో వివరించండి. (పది వాక్యాల్లో)
Answer:
రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్లుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలె, చేనుచుట్టూ కంచెవలె, ఈ జన్మభూమికి కవచంవలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు.
దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసుగలవారై నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు అభినందనలు.
Exam Tips:
a) సారాంశాన్ని రైతులు, సైనికులు అనే రెండు భాగాలుగా రాసి చివరలో వందనం తెలిపే వాక్యంతో ముగించండి.
b) పది వాక్యాల జవాబులో అవసరమైన పదజాలం (హాలికులు, జవానులు) వాడండి.
IV. సృజనాత్మకత / ప్రశంస
Question 1: “వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే” అని రైతులు, సైనికుల గురించి గేయం పాడుకున్నారు కదా! అట్లాగే తల్లి, తండ్రి, గురువు, మంచిమిత్రులు, గొప్పవాళ్ళు… ఇట్లా ఎవరి గురించైనా వందనాలు వందనాలు… అని అభినందనలు తెలుపుతూ ఒక చిన్న గేయాన్ని రాయండి.
Answer:
వందనం అభివందనం హరి చందనాలతో వందనం
మంచి చెడులు నేర్పించే మా దైవములు – తల్లిదండ్రులకు గురువులకు మా వందనం ॥వందనం॥
పలుకునేర్పి నడకనేర్పి – అడుగుఅడుగున తోడునిలిచి నన్ను కాచిన ప్రేమమూర్తి – కన్నతల్లికి వందనం ॥వందనం॥
తప్పటడుగుల నాటి నుంచి – తప్పు అడుగులు వేయకుండా ముందకడుగేయించినట్టి – కన్నతండ్రికి వందనం ॥వందనం॥
అక్షరాలను దిద్దబెట్టి – జ్ఞాన దీపము చేతికిచ్చి మనిషిగా నను తీర్చిదిద్దిన – గురువుకు నా వందనం ॥వందనం॥
Exam Tips:
a) గేయం పల్లవి, చరణాలు ఉండేలా ప్రాసతో రాయండి; ‘వందనం’ అనే పల్లవిని ప్రతి చరణం చివర పునరావృతం చేయండి.
V. పదజాల వినియోగం
Question 1: కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి.
అ) స్వాతంత్ర్యోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు.
ఆ) పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ.
ఇ) వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు.
ఈ) కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారుచేస్తారు.
Answer:
అ) నెత్తురు (రుధిరం = రక్తం)
ఆ) బంగారం (పసిడి = బంగారం)
ఇ) రైతులు (హాలికులు = రైతులు)
ఈ) చెమట (స్వేదం = చెమట)
Exam Tips:
a) పర్యాయ పదాలు (రుధిరం – నెత్తురు, పసిడి – బంగారం, హాలికుడు – రైతు, స్వేదం – చెమట) గుర్తుంచుకోండి.
Question 2: కింది వాక్యాలు చదువండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి.
అ) భారతదేశానికి రైతు వెన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు దేశం ఋణపడి ఉన్నది.
ఆ) భారతీయులు స్వాతంత్య్రం సాధించి విజయ బావుటా ఎగుర వేశారు. నాటినుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు.
ఇ) పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధరంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు.
Answer:
అ) రైతు, కర్షకుడు, హాలికుడు.
ఆ) బావుటా, పతాకం, జెండా.
ఇ) ఖడ్గం, అసి, కత్తి.
Exam Tips:
a) వాక్యంలో ఒకే అర్థం వచ్చే పదాలను గుర్తించి గీత గీయండి (రైతు, కర్షకుడు, హాలికుడు).
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: కింది అక్షరాల్లో రెండేసి వర్ణాలున్నాయి. వాటిని గుర్తించండి.
ఉదా : గా = గ్ + ఆ = (రెండు ధ్వనులు)
అ) య
ఆ) కా
ఇ) వొ
Answer:
అ) య = య్ + అ (రెండు ధ్వనులు)
ఆ) కా = క్ + ఆ (రెండు ధ్వనులు)
ఇ) వొ = వ్ + ఒ (రెండు ధ్వనులు)
Exam Tips:
a) అక్షరాన్ని హల్లు + అచ్చుగా విడదీయండి (య = య్ + అ).
Question 2: కింది పదాల్లోని సంయుక్త, ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి.
ఉదా : పద్మ = ద్ + మ్ + అ (మూడు ధ్వనులు)
అ) ఎత్తండి
ఆ) దుర్గతి
ఇ) సాధ్వి
Answer:
అ) ఎత్తండి = త్ + త్ + అ = త్త (మూడు ధ్వనులు)
ఆ) దుర్గతి = ర్ + గ్ + అ = ర్గ (మూడు ధ్వనులు)
ఇ) సాధ్వి = ధ్ + వ్ + ఇ = ధ్వి (మూడు ధ్వనులు)
Exam Tips:
a) ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరంలోని ప్రతి హల్లును, చివరి అచ్చును వేరు చేసి రాయండి.
Question 3: కింది వాక్యాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గీతగీసి గుర్తించండి.
“బలరాం మంచి ఫలాల కోసం పల్లెలో తోటకు పోయాడు. తోటలో పామును చూసి భయపడ్డాడు”
Answer:
ప-వర్గం : ప, ఫ, బ, భ, మ
Exam Tips:
a) పేరాలో ఒకే వర్గానికి చెందిన అక్షరాలను గుర్తించి వర్గం పేరు చెప్పండి: ప-వర్గం (ప, ఫ, బ, భ, మ).
ప్రాజెక్టు పని
Question 1: మీ సమీపంలోని రైతులు/విశ్రాంత సైనికులను కలవండి. వారు చేస్తున్న సేవలను గురించి తెలుసుకొని నివేదిక రాయండి.
Answer:
1. ప్రాజెక్టు శీర్షిక : విశ్రాంత సైనికులను కలిసి, వారు దేశానికి చేస్తున్న సేవలను గురించి తెలుసుకొని నివేదిక రాయడం.
2. సమాచార సేకరణ : సమాచారం సేకరించిన తేది: ……………
సమాచార వనరు: గ్రామంలోని పరిసరాలు.
3. సేకరించిన విధానం : నేను ఈ మధ్య మా గ్రామంలో నివసించే ఒక విశ్రాంత సైనికుని కలిసి సమాచారం సేకరించాను.
4. నివేదిక : ఈ మధ్య నేనొక విశ్రాంత సైనికుణ్ణి కలిశాను. ఆయన పేరు నరసింహరాజు. ఆయన సైన్యంలో మేజర్ ఇరవై ఏళ్ళు పనిచేసి స్వచ్ఛందంగా విశ్రాంతి తీసుకున్నాడు. కారణం ఏమిటని అడిగాను. ఇంతకాలం సైనికుడిగా దేశానికి సేవ చేశాను. కొంతకాలం పౌరుడిగా నా ఊరికి, చుట్టుపక్కల గ్రామాలలోను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. అందుకే రిటైరయ్యాను అని చెప్పాడు. ఆయన తనతోబాటు మరికొంతమంది యువకులను కూడగట్టుకొని ముందుగా పిల్లలు పనిలోకి కాదు బడిలోకి పోవాలి అనే విషయంపై అందరికీ అవగాహన కలిగిస్తూ పిల్లలను బడికి పోయేలా ప్రోత్సహిస్తున్నాడు.
అమాయకులైన ప్రజలకు కాలుష్యం గురించి తెలియజెప్పి పరిసరాల పరిశుభ్రత గురించి బోధించి చైతన్యవంతులను చేస్తున్నాడు. రాత్రిపూట బడికి వెళ్ళి చదువుకోమని పెద్దలను ప్రోత్సహిస్తున్నాడు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇలా విశ్రాంతుడై యుండి అవిశ్రాంతంగా సమాజ అభివృద్ధికి పాటుపడుతూ ఆ రకంగా దేశసేవ చేస్తున్నాడు. అటువంటి వారి జన్మ ధన్యం.
5. ముగింపు : సైనికులు దేశానికి ఏవిధంగా సేవ చేస్తున్నారో తెలుసుకున్నాను.
Exam Tips:
a) ప్రాజెక్టు శీర్షిక, సమాచార వనరు, పద్ధతి, నివేదిక, ముగింపు అనే క్రమాన్ని పాటించండి.
ముఖ్యమైన ప్రశ్నలు
Question 1: మన రైతులు ఎటువంటి వారు ?
(లేదా)
రైతులు ఏవిధంగా కష్టపడుతున్నారు ? ప్రజలకు వారేమి చేస్తున్నారు?
Answer:
మన రైతులు శ్రమ దాచుకోకుండా కాయకష్టం చేస్తారు. పగలూ రాత్రీ అనకుండా పొలంలో పని చేస్తారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటతో నేలను తడిపి బంగారు పంటను పండిస్తారు. సమాజ అభివృద్ధికి బాటలు వేస్తారు. తమ సేద్యంతో ప్రజలందరికి ఆకలి తీరుస్తారు.
Exam Tips:
a) రైతు శ్రమ, త్యాగం, ప్రజలకు చేసే మేలు అనే అంశాలను వరుసగా రాయండి.
Question 2: రైతు ఆత్మకథ రాయండి.
Answer:
నేను రైతును. ఎండ-వాన, రాత్రి పగలూ తేడా లేకుండా ప్రతి నిత్యం కష్టపడి వ్యవసాయం చేస్తాను. దుక్కిదున్ని, నీరుపెట్టి, విత్తనాలు చల్లి ఆ మొలకలను పశువులు, పక్షులనుండి రక్షిస్తాను. పొలంలో కావలసిన ఎరువులు వేస్తూ, కలుపు మొక్కలను ఏరివేస్తూ ఉంటాను. చీడ పీడలనుండి కాపాడుతాను. నా నెత్తురును చెమటగా మార్చి, బంగారం లాంటి పంటలను పండిస్తాను.
దేశంలో ఆకలితో ఉన్నవారి ఆకలి మంటలను చల్లార్చడం కోసం నా ఆకలిని సైతం మరచిపోతాను. నాకు విరామం లేదు. విశ్రాంతి లేదు, విరమణ కూడా లేదు. రైతే రాజు అన్నవారు సహితం మా గొప్పదనాన్ని, వ్యవసాయం యొక్క అవసరాన్ని గుర్తించడం లేదు. ఎద్దు ఏడ్చిన ఎవుసం (వ్యవసాయం) రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవని గుర్తించండి. వ్యవసాయాన్ని పోత్సహించండి.
Exam Tips:
a) ఆత్మకథను ‘నేను’ అనే ఉత్తమ పురుషలో రాయాలి; రైతు పనులు, కష్టాలు, సందేశం చేర్చండి.
క్రింది పద్యము చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి
బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటె గాదు
చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు
త్యాగ భావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగు బాల.
Question 1: ‘తరువులు’ అంటే ఏమిటి ?
Answer:
తరువులు అంటే చెట్లు
Exam Tips:
a) ‘తరువు’ అంటే చెట్టు అనే అర్థం గుర్తుంచుకోండి.
Question 2: చెట్లు మనకు ఏమేమి ఇస్తాయి ?
Answer:
చెట్లు మనకు పూలు, పండ్లు ఇస్తాయి. చనిపోయిన తరువాత కూడా తమ శరీరాన్ని (కలపను) ఇస్తాయి.
Exam Tips:
a) పద్యం మొదటి రెండు పాదాల ఆధారంగా జవాబు రాయండి.
Question 3: తనువును చీల్చి ఇచ్చేవి ఏవి ?
Answer:
చెట్లు తనువును చీల్చి ఇస్తాయి.
Exam Tips:
a) తనువును చీల్చి ఇచ్చే ఆ పద్య భావం చెట్లకే వర్తిస్తుంది.
Question 4: త్యాగం అంటే ఏమిటి ?
Answer:
స్వార్థము లేకుండా సర్వస్వము సమర్పించుట
Exam Tips:
a) త్యాగం అంటే ఏమిటో సొంత మాటల్లో నిర్వచించండి.
Question 5: ఈ పద్యానికి శీర్షిక పెట్టండి.
Answer:
త్యాగ భావం
Exam Tips:
a) పద్య భావానికి సరిపోయే పదంతో చిన్న శీర్షిక పెట్టండి.
పదజాలం – గీత గీసిన పదాలకు సరైన అర్థాన్ని గుర్తించండి
Question 1: కార్మికులు స్వేదం చిందించి, పనిచేస్తారు.
(a) రక్తం
(b) చెమట
(c) కన్నీరు
(d) శ్రమ
Answer:
(b) చెమట
Exam Tips:
a) స్వేదం = చెమట అని గుర్తుంచుకోండి. ఎంపికలను వాక్య సందర్భంలో ఉంచి చదివి సరిచూడండి.
Question 2: వానచినుకులకు పుడమి పులకరించింది.
(a) శరీరం
(b) మేఘం
(c) భూమి
(d) ఆమె
Answer:
(c) భూమి
Exam Tips:
a) పుడమి = భూమి. ఎంపికలను వాక్య సందర్భంలో ఉంచి చదివి సరిచూడండి.
Question 3: బిడ్డను చూసి తల్లి పులకించింది.
(a) దుఃఖించింది
(b) పాటపాడింది
(c) గగుర్పాటు చెందింది
(d) బాధపడింది
Answer:
(c) గగుర్పాటు చెందింది
Exam Tips:
a) పులకించడం అంటే ఆనందంతో గగుర్పాటు కలగడం. ఎంపికలను వాక్య సందర్భంలో ఉంచి చదివి సరిచూడండి.
Question 4: పసిబిడ్డల మనసులు నిర్మలమైనవి.
(a) స్వచ్ఛం
(b) సుందరం
(c) చిన్నవి
(d) పెద్దవి
Answer:
(a) స్వచ్ఛం
Exam Tips:
a) నిర్మలం = స్వచ్ఛం. ఎంపికలను వాక్య సందర్భంలో ఉంచి చదివి సరిచూడండి.
Question 5: మనమందరం దేశ ప్రగతికి పాటుపడాలి.
(a) పేరు
(b) సుఖం
(c) మంచి
(d) అభివృద్ధి
Answer:
(d) అభివృద్ధి
Exam Tips:
a) ప్రగతి = అభివృద్ధి. ఎంపికలను వాక్య సందర్భంలో ఉంచి చదివి సరిచూడండి.
ఒకే అర్థంగల పదాలను గుర్తించి రాయండి
Question 1: పుడమిని దున్నిన రైతు ఆ భూమిలో విత్తనాలు చల్లితే ఆ ధరణి బంగారం లాంటి పంటనిస్తుంది.
(a) భూమి, విత్తనాలు, బంగారం
(b) పుడమి, విత్తనాలు, దున్నడం
(c) రైతు, పుడమి, పంట
(d) పుడమి, భూమి, ధరణి
Answer:
(d) పుడమి, భూమి, ధరణి
Exam Tips:
a) పుడమి, భూమి, ధరణి అనేవి ఒకే అర్థం కలిగిన పదాలు.
Question 2: మనం చేయవలసిన పని చక్కగా చేస్తే మన విధి నిర్వహణ బాగున్నదని మన కర్తవ్య నిర్వహణను అందరూ మెచ్చుకుంటారు.
(a) విధి, కర్తవ్యం, పని
(b) మెప్పు, కర్తవ్యం, పని
(c) చేయవలసిన, నిర్వహణ, మెప్పు
(d) మనం, విధి, అందరం
Answer:
(a) విధి, కర్తవ్యం, పని
Exam Tips:
a) విధి, కర్తవ్యం, పని ఒకే అర్థాన్నిచ్చే పదాలని గుర్తించండి.
వ్యాకరణం
Question 1: ‘అభినందన చందనాలివే’ – గీతగీసిన అక్షరంలోని వర్ణాలు
(a) అ + భి
(b) భ్ + ఇ
(c) బ + హ + ఇ
(d) భి + ఇ
Answer:
(b) భ్ + ఇ
Exam Tips:
a) అక్షరాన్ని హల్లు + అచ్చు గా విడదీయండి (భి = భ్ + ఇ).
Question 2: ‘నిర్మలమైన మనస్సుతో జన్మభూమిని ప్రేమించాలి’ – ఈ వాక్యంలోని సంయుక్తాక్షరాలు
(a) ర్మ, మై, న్మ, స్సు
(b) స్సు
(c) ర్మ, న్మ, ప్రే
(d) మై, స్సు, ప్రే
Answer:
(c) ర్మ, న్మ, ప్రే
Exam Tips:
a) ఒకే హల్లు రెండుసార్లు వస్తే ద్విత్వం, వేర్వేరు హల్లులు కలిస్తే సంయుక్తం.
Question 3: ‘తల్లి’ – గీతగీసిన అక్షరంలోని ధ్వనులు
(a) త + ల్ + లి
(b) ల్ + ల + ఇ
(c) ల్ + ల్ + అ
(d) ల్ + ల్ + ఇ
Answer:
(d) ల్ + ల్ + ఇ
Exam Tips:
a) ల్లి = ల్ + ల్ + ఇ – ద్విత్వాక్షరంలో రెండు హల్లులు, ఒక అచ్చు.
Question 4: ‘తలపులలోని కథలు చెప్పే విధం గొప్పది’ ఈ వాక్యంలోని త వర్గాక్షరాలు
(a) థ, ధ, ది
(b) త. థ. ధ, ది
(c) క, చె, త, ప్పే, ప్ప
(d) తలపు, కథ, చెప్పే, విధం
Answer:
(b) త, థ, ధ, ది
Exam Tips:
a) త-వర్గం: త, థ, ద, ధ, న అని గుర్తుంచుకుని వాక్యంలో వెతకండి.
Question 5: కింది వానిలో చ వర్గాక్షరాలేవి ?
(a) క చ ట త ప
(b) గ జ డ ద బ
(c) చ-ఛ-జ-ఝ-ఞ
(d) చ – ఛ -ఝ
Answer:
(c) చ-ఛ-జ-ఝ-ఞ
Exam Tips:
a) చ-వర్గం: చ, ఛ, జ, ఝ, ఞ.
కవి పరిచయం
Question 1: అభినందన పాఠం రచించిన కవిని గురించి రాయండి.
Answer:
శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్. కనకమ్మ, నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింప బడ్డాయి. టీవీ, రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి ‘స్రవంతి పత్రిక’లో ప్రచురింపబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చేయి.
Exam Tips:
a) కవి పేరు, ఊరు, తల్లిదండ్రులు, వృత్తి, రచనలు అనే క్రమంలో రాయండి.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 6 Telugu Lesson 01 Abhinandana (Salutations)
Official TS Board Solutions for Lesson 01 Abhinandana (Salutations)
Review comprehensive exercise answers for Class 6 Telugu Lesson 01 Abhinandana (Salutations). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Step-by-Step Explanations for Lesson 01 Abhinandana (Salutations)
Clear, methodical explanations accompany every challenging problem within the Class 6 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Next Steps in Your Telugu Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 01 Abhinandana (Salutations) with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన is available for free on StudiesToday.com. These solutions for Class 6 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Telugu. You can access TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన in both English and Hindi medium.
Yes, you can download the entire TS 6th Class Telugu 1st Lesson Questions and Answers Telangana అభినందన in printable PDF format for offline study on any device.