TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !!

Solutions for Class 12 Telugu: Poem 05 Kokila O Kokila

Review structured textbook solutions for Class 12 Telugu Poem 05 Kokila O Kokila. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Practice Class 12 Telugu Solutions: Poem 05 Kokila O Kokila

View or download the dedicated Poem 05 Kokila O Kokila solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

Question 1: కోకిల స్వభావాన్ని వర్ణించండి.

Answer:

కోకిల గానం భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు.
కొందరు కళాకారులు ఏడంతస్తుల మేడలో రాజభోగాలు అనుభవిస్తుంటే మరికొందరు డబ్బులేక పేదరికంలో ఉన్నారని ధ్వనింప జేశాడు. ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండె కరిగింది.
ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు కవి వంటి వాడికి తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతుంది. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.
కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసిన ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం పాడుతున్నావు. సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా? అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు.
కవులు మాత్రమే కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని కూడా అన్నాడు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న వారిని సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.
కోకిలా ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక నీకు లేదనే విషయం కవికి తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమే తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు అని కవి అన్నాడు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.
కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతుంది. కాని మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.
కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని కోకిల సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు కోకిల అని కవి అంటున్నాడు. కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది.
కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ కోకిలా ఆ పక్కకు చూడు. ఆ పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో నీతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన. దీనిలో కోకిల స్వభావాన్ని కవి కనపర్తి రామచంద్రాచార్యులు వర్ణించారు.

Exam Tips:

a) కోకిలను కళాకారులకు ప్రతీకగా వివరించండి: పట్టపగలు పాటతో కవి గుండె కరగడం, పాట వినే తీరిక లేని కోఠీ సెంటర్ జనం, ‘వన్స్ మోర్’ చప్పట్లే తప్ప డబ్బు లేకపోవడం.
b) నలుపు రంగు వివక్ష (చిలుక, హంస, నెమలి వాహనాలు), పైరవీలు చేయని నిస్వార్థత, కాకి గూటిలో గుడ్లు పెట్టి తరిమివేయబడటం వంటి ముఖ్యాంశాలను కలపండి.
c) కోకిల స్వభావంలో చార్మినార్, బిర్లామందిర్ పై వాలే మత సామరస్యం అంశాన్ని చివర చేర్చండి.

 

Question 2: కోకిలకు సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరించండి.

Answer:

కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమన లాగ ఉత్సాహాన్ని సమాజానికి కలిగిస్తుంది. పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్ లో ఎవరో కోటిమందిలో ఒకడు తప్ప పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.
ఈ నగర జనాల్లో ఎవరి తొందర వారికి ఉంది. ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకున్నా వేగంగా వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నారు. అందరూ ఒకరిని తొక్కి పైకి రావాలని ఆశిస్తున్నవారే. అందరూ తమ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నవారే. కోకిల ఎవరో వన్స్ మోర్ అని అన్నట్లు పాడిన పాటనే మళ్ళీ మళ్ళీ పాడుతున్నావు. ఆహా ఓహో అనే పొగడ్తల మాటలే తప్ప డబ్బు ఎవరూ ఇవ్వరే అని చెప్తున్నాడు కవి. కళాకారులకు చప్పట్లు తప్ప నగదు బహుమతులు, ప్రోత్సాహాలు ఉండడం లేదని భావం.
కోకిల నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. కోకిల శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం ఈ సమయంలో సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు కోకిలను అడిగాడు.
నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. కవులు మాత్రమే కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారు. చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను సమాజం గుర్తించదు అని కవి అన్నాడు.
కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేదనే విషయం నాకు తెలుసు. కోకిలకు సూర్యుడు చూపిన మార్గం మాత్రమే తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారీ తెలియదు అని కవి అన్నాడు. కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే నువ్వు ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది. మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు.
తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు. కోకిలకు ఇల్లు వాకిలి వంటి ఆస్తులు లేవు, బరువు బాధ్యతలు అసలే లేవు. మనుషుల లాగ బస్సులకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆకులు అలములు ఇలా ఏది దొరికితే అదే తినుకుంటూ సంతృప్తిగా జీవిస్తుంది.
కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచుతావు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలివి అని కవి అంటున్నాడు.
పెద్దకోకిలకు నీ మీద ఎంత ద్వేషం ఉందో కోకిలతో పోటీ పెట్టుకున్నట్లు నువ్వు ఎలా కూస్తే అది కూడా అలాగే కూస్తుంది. తెలివితేటలకు కులభేదాలు లేనట్టే ఈర్ష్యాద్వేషాలకు వయస్సు భేదం లేదు అని కవి చెప్పాడు. ఒక స్థాయిలో ఉన్న కళాకారులు వెనుక వస్తున్న కొత్త తరం కళాకారులను ఎదగనివ్వడం లేదని కవి భావన.
నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పాడు. అంటే పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.
ఆ పల్లెటూరికి వెళ్లి ప్రతీకొమ్మను తన గానమాధుర్యంతో పరవశించే విధంగా, ప్రతీ చెట్టు తన కమ్మని గానంతో నిండిపోవాలని, ప్రతీ హృదయం, ప్రతీ ఇల్లు తన మధురమైన పాటలతో నిండాలని కవి సూచించాడు. అంటే కళకు గుర్తింపు ఉన్న దగ్గరే కళాకారుడు ఉండాలని కవి సూచన. ఇలా కోకిలకు సమాజానికి సంబంధం ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు వివరించాడు.

Exam Tips:

a) సమాజంతో సంబంధాన్ని ఈ క్రమంలో రాయండి: నగర జనుల తొందర, కళకు విలువ ఇవ్వని ధోరణి, నల్ల రంగు పట్ల వివక్ష, కుల మత భేదం, పెద్ద కోకిల ఈర్ష్య (కొత్త తరాన్ని ఎదగనివ్వకపోవడం).
b) ముగింపులో కవి సూచనను రాయండి: గుర్తింపు ఉన్న పల్లెకు వెళ్దాం, ప్రతి చెట్టూ వేదిక, పైరగాలే మైక్.

 

II. సంగ్రహరూప ప్రశ్నలు

Question 1: కోకిల ఎక్కడ ఉంది ? దాని పాటకు స్పందన ఎలా ఉంది ?

Answer:

కోకిల భగవద్గీతలా ఆనందాన్ని, జాతీయగీతమైన జనగణమనలాగ ఉత్సాహాన్ని కలిగిస్తున్నది. ఏ కరెంటు స్తంభం పైననో, ఏ ఏడంతస్తుల మేడపైననో కనబడకుండా ఉంది. కోకిలను కళాకారులకు ప్రతీకగా తీసుకొని ఆధ్యాత్మికతను, దేశభక్తిని ప్రబోధించే కళాకారులు కనబడకుండా ఉన్నారని కవి భావించాడు.
ఈ పట్టపగలు, మండుటెండలో కోకిల పాడుతున్న పాటతో కవి గుండెను కరిగించింది. ఎంతో హడావిడిగా ఉండే కోఠీ సెంటర్ లో ఎవరో కోటి మందిలో ఒకడికి తప్ప కోకిల పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని అందుకే స్పందన తక్కువగా ఉందని కనపర్తి రామచంద్రాచార్యులు చెప్పాడు.

Exam Tips:

a) రెండు భాగాలు రాయండి: కోకిల ఉన్న చోటు (కరెంటు స్తంభం లేదా ఏడంతస్తుల మేడ, కనబడకుండా) మరియు స్పందన (కోఠీ సెంటర్‌లో వినే తీరిక ఎవరికీ లేదు).
b) ‘ఆర్థిక సంపాదనపై శ్రద్ధ, కళలపై లేదు’ అనే విమర్శను చివర రాయండి.

 

Question 2: కోకిల పాట ఎలా అనిపిస్తుంది ? అది ఏం చేస్తున్నట్టుంది ?

Answer:

కోకిల కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే కోకిల చేసే ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. కోకిల గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పాడు. కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయ సందర్భాలు తెలియకుండా అడుక్కున్నట్లు ఇందుకోసం సంవత్సరకాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నట్లు అనిపించిందని కోకిలను అడిగాడు.

Exam Tips:

a) కవి భావించిన రెండు ఉపమానాలు రాయండి: ‘మినీ కవిత రాలిపడ్డట్లు’, ‘మధుర కవితల క్యాసెట్’. అలాగే బిచ్చగాడి ఉపమానాన్ని ప్రస్తావించండి.
b) ‘సంవత్సరకాలం మౌనవ్రతం ముగింపు’ అనే చమత్కారాన్ని చివరలో వివరించండి.

 

Question 3: కోకిల మార్గము, సంస్కారము ఎలాంటిది ?

Answer:

కోకిలకు ఎవరో వచ్చి సన్మానాలు చేయాలనే కోరిక లేదు. కోకిలకు పైన ఉన్న సూర్యుడు చూపిన మార్గం మాత్రమే తెలుసు కాని పైరవీలు చేసి సన్మానాలు పొందే దారి తెలియదు. అంటే కొంతమంది కళాకారులు పైరవీల ద్వారా గుర్తింపును పొందుతున్నారని ఆ గుర్తింపు కోసమే ప్రదర్శనలు చేస్తారని కనపర్తి రామచంద్రాచార్యులు చెప్తున్నాడు. కోకిల అలా కాకుండా తనకు దేవుడు ఇచ్చిన కళను నిస్వార్థంగా ప్రదర్శిస్తుందని తెలిపాడు.
కోకిల చేదుగా ఉండే మామిడి లేత చిగుళ్లను తిన్నందుకే ఇంతమందికి ఆనందాన్ని కలిగించే విధంగా మధురంగా పాడుతున్నది. మానవులు మాత్రం తియ్యని మామిడి పళ్ళను తిని కూడా మనసులకు బాధకలిగించే మాటలనే మాట్లాడుతున్నారు. తినే తిండిలో కాకుండా నేర్చుకునే సంస్కారంలోనే మానవుల మాట తీరు ఉంటుందని కవి చెప్పాడు.

Exam Tips:

a) మార్గం: సూర్యుడు చూపిన మార్గం మాత్రమే తెలుసు, పైరవీలు తెలియవు. సంస్కారం: చేదు మామిడి చిగుళ్ళు తిని మధురంగా పాడడం. ఈ రెండింటిని వేరువేరు పేరాలుగా రాయండి.
b) మనుషులు తీపి పండ్లు తిని కూడా బాధపెట్టే మాటలు మాట్లాడతారనే వ్యత్యాసాన్ని చెప్పడం మరువకండి.

 

Question 4: పట్టణంలో విహరిస్తూ కోకిల ఏం చేస్తుంది ?

Answer:

కోకిల చార్మినార్ పైనా, నౌబత్ పహాడ్ పైన గల బిర్లామందిర్ పైనా స్వేచ్ఛగా వాలగలదు. మత విద్వేషాల రక్తాలు పారే ప్రదేశంలో కూడా రాగాలతో అనురాగాలను పంచగలదు. కుల మతాల భేదం పాటించని సామాజిక సమానతను ఎవరూ అర్థం చేసుకోరు. అందరూ సమానము అని చెప్పే కోకిల మంచి మాటలు ఎవరికీ నచ్చవు. దాని కారణంగా కోకిలను పెంచి పోషించిన వారి ద్వారానే దూరం కొట్టబడ్డ పేదరాలు అని కవి అంటున్నాడు.
కోకిలలకు గూడు నిర్మించుకోవడం తెలియదు అది తన గుడ్లను కాకి గూటిలో పెడితే కాకి ఆ గుడ్లను పొదిగి పిల్లను చేస్తుంది. కోకిల పెరిగి శబ్దం చేసినప్పుడు అది తనపిల్ల కాదని కాకి దానిని వెళ్లగొడుతుంది. అదే విధంగా తమ జాతి, తమ కులం, తమ మతం కాదు అని అనేకమంది మంచివారిని దూరం చేసుకుంటున్నారని కవి ఆవేదనను వ్యక్తం చేశాడు.

Exam Tips:

a) పట్టణంలో కోకిల: చార్మినార్, నౌబత్ పహాడ్ బిర్లామందిర్ మీద వాలుతుంది, మత విద్వేషాల మధ్య అనురాగ రాగాలు పంచుతుంది.
b) కాకి గూటిలో గుడ్లు పెట్టడం, పెరిగాక కాకి తరిమివేయడం ఉపమానంతో మనుషుల కుల మత వివక్షను వివరించండి.

 

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

Question 1: కనపర్తి రాసిన కోకిల కవిత ఏ కావ్యంలోనిది ?

Answer:

నైమిశారణ్యం కవితా సంపుటి లోనిది

Exam Tips:

a) సమాధానం ‘నైమిశారణ్యం’ కవితా సంపుటి. ‘కావ్యం’ కాకుండా సంపుటి అని రాస్తే మరింత ఖచ్చితం.

 

Question 2: కనపర్తికి ఉన్న బిరుదు ఏమిటి ?

Answer:

వచన కవితా ప్రవీణ

Exam Tips:

a) కనపర్తి రామచంద్రాచార్యుల బిరుదు ‘వచన కవితా ప్రవీణ’. రెండు పదాలూ కలిపి రాయండి.

 

Question 3: కోకిల ఎలాంటి ఉత్తేజాన్నిస్తుంది ?

Answer:

జాతీయ గీతం వంటి

Exam Tips:

a) కోకిల గానం జాతీయ గీతం (జనగణమన) లాగా ఉత్తేజాన్ని ఇస్తుంది; భగవద్గీతలా ఉల్లాసాన్ని ఇస్తుంది. ప్రశ్న ‘ఉత్తేజం’ గురించి కాబట్టి జాతీయగీతం అని రాయండి.

 

Question 4: కోకిలను ఎవరు ఆవాహన చేసుకుంటారు ?

Answer:

కవులు

Exam Tips:

a) కోకిలను ఆవాహన చేసుకునేది కవులు; వారు కోకిల గాన మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకుంటారని పాఠంలో ఉంది.

 

Question 5: కోకిలను ఎవరు తరిమి కొడతారు ?

Answer:

తనను పెంచిన వారు, కాకులు

Exam Tips:

a) కోకిలను తరిమికొట్టేవారు తనను పెంచిన కాకులు. ఈ ఉదాహరణను కవి సమాజంలో కుల మత వివక్షకు ఉపమానంగా వాడాడు.

 

Question 6: ప్రతిభకు ఏది ఉండదు ?

Answer:

వర్ణ భేదం

Exam Tips:

a) ప్రతిభకు వర్ణ భేదం (రంగు భేదం) ఉండదు. ‘తెలివితేటలకు కులభేదాలు లేనట్టే’ అనే భావంతో కలిపి చెప్పవచ్చు.

 

Question 7: ధవళ పారావతం అంటే ఏమిటి ?

Answer:

తెల్లని పావురం

Exam Tips:

a) ‘ధవళ’ = తెల్లని, ‘పారావతం’ = పావురం. రెండు పదాల అర్థం కలిపి ‘తెల్లని పావురం’ అని రాయండి.

 

Question 8: కోకిలకు వేదిక ఏది ?

Answer:

పచ్చని చెట్టు

Exam Tips:

a) కోకిలకు వేదిక పచ్చని చెట్టు. పల్లెలో ‘ప్రతి చెట్టు కట్టని వేదిక’ అని కవి చెప్పిన భావానికి ఇది సంబంధించినది.

 

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

Question 1: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “ఎవరికుందే నీ పాట వినే తీరిక”

Answer:

కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : పట్టపగలు, మండుటెండలో నీవు పాడుతున్న పాటతో నా గుండెను కరిగించావు. ఎంతో హడావిడిగా ఉండే ఈ కోఠీ సెంటర్లో ఎవరో కోటిమందిలో ఒకడు నా వంటి వాడికి తప్ప నీ పాట వినే అంత ఖాళీ సమయం ఎవరికి ఉంది ? అని కవి కోకిలను అడిగిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : నీ కమ్మని పాట వినే తీరిక ఎవరికి ఉంది ? అని అర్థం.
వ్యాఖ్య : ఆర్థిక సంపాదనపైన ఉన్న శ్రద్ధ మనసులకు ఆనందాన్ని కలిగించే కళలను ఆస్వాదించడంపై లేదని భావం.

Exam Tips:

a) నాలుగు భాగాలుగా రాయండి: కవి పరిచయం (వచన కవితా ప్రవీణ కనపర్తి రామచంద్రాచార్యులు, నైమిశారణ్యం, 48 కావ్యాలు), సందర్భం, అర్థం, వ్యాఖ్య.
b) సందర్భంలో ‘కోఠీ సెంటర్‌లో కోటికొక్కడు’ అనే చమత్కారాన్ని చేర్చండి; వ్యాఖ్యలో ఆర్థిక సంపాదనపై శ్రద్ధ–కళపై నిర్లక్ష్యం అని రాయండి.

 

Question 2: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “నీ గళమే ఒక మధుర కవితల క్యాసెట్”

Answer:

కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా! ఓ కోకిలా!! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : ఓ కోకిలా నువ్వు కుహు కుహు అని పాడినప్పుడల్లా ఒక మినీ కవిత వెలువడ్డట్లు అనిపిస్తుంది. అంటే నీ ప్రతీ శబ్దంలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుందని భావం. నీ గొంతు ఒక మధురమైన కవితల క్యాసెట్ లాగ అనిపిస్తుందని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : నీ గొంతు మధురమైన కవితలతో కూడిన క్యాసెట్ వంటిది అని అర్థం.
వ్యాఖ్య : కోకిల ప్రతీ కూతలో కొత్త భావాలు వస్తున్నాయని భావం.

Exam Tips:

a) ఈ వాక్యం కోకిల గొంతును క్యాసెట్‌తో పోల్చిన సందర్భం. ‘కుహు కుహు అన్నప్పుడల్లా మినీ కవిత రాలిపడ్డట్లు’ అనే ముందు పంక్తిని కూడా సందర్భంలో రాయండి.
b) వ్యాఖ్య: ప్రతి కూతలో కొత్త భావం స్ఫురిస్తుంది.

 

Question 3: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “ఏ దేవుళ్లు నిన్ను వాహనం చేసుకొంటారు ?”

Answer:

కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా ! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : కొత్తగా వృత్తిలోకి వచ్చిన బిచ్చగాడు సమయం తెలియకుండా అడుక్కున్నట్లు ఎందుకోసం ఈ సమయంలో పాడుతున్నావు. సంవత్సర కాలం పాటు పాటించిన మౌనవ్రతానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నావా అని కవి కోకిలను అడిగాడు. నిజమే నోరు మూసుకొని కూర్చొంటే ఎవరూ గుర్తించరు. అని సమాధానం చెప్పుకున్నాడు. కవులు మాత్రమే కోకిల గానంలోని మాధుర్యాన్ని తమ కవితల్లో నింపుకోవాలని చూస్తారని, చిలకల్లా, హంసల్లా, నెమలిలాగా అందంగా ఉంటే ఏ దేవుడైన వాహనంగా ఉపయోగించుకుంటాడు కాని నల్లగా ఉన్న నిన్ను ఏ దేవుడు వాహనంగా అంగీకరిస్తాడని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఉద్యోగాలు ఇచ్చేవారు కూడా శరీరపు రంగును చూస్తున్నారని వ్యంగ్య అర్థం.
వ్యాఖ్య : వాహనంగా వాడుకోవడం అంటే ఉపాధి ఉద్యోగాలను చూపడం అని భావం.

Exam Tips:

a) సందర్భం: నల్లని రంగు కారణంగా ఏ దేవుడూ కోకిలను వాహనంగా చేసుకోడు (చిలుక, హంస, నెమలి వంటివి అందంగా ఉంటాయి కాబట్టి). బిచ్చగాడి ఉపమానాన్ని కూడా చెప్పండి.
b) వ్యాఖ్య: రంగు వివక్ష సమాజంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తుందనే వ్యంగ్యం.

 

Question 4: సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “కల్లాకపటమెరుగని పల్లె ప్రజలే నిన్ను గుర్తించే శ్రోతలు”

Answer:

కవి పరిచయం : వచన కవితా ప్రవీణ బిరుదాంకితుడైన కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిశారణ్యం అనే కవితా సంపుటి నుండి తీసుకున్న కోకిలా! ఓ కోకిలా !! అనే పాఠ్యభాగం లోనిది ఈ వాక్యం. రామచంద్రాచార్యులు 48 కావ్యాలు రాశాడు.
సందర్భం : నీ కళకు గుర్తింపు లేని ఈ పట్నంలో ఎందుకు ఉండటం ? నాతో మా పల్లెకు పోదాం రా. అక్కడ ప్రతీచెట్టు నీకు కట్టని వేదికలాగా, పైరగాలి పెట్టని మైకులాగా అబద్దాలు, మోసాలు తెలియని పల్లెజనం నీ కళను ఆస్వాదించే శ్రోతలుగా ఉంటారని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : అమాయకులైన పల్లె ప్రజలు కోకిల గానాన్ని ఆస్వాదిస్తారని అర్థం.
వ్యాఖ్య : పట్నాలలో భారీ వేదికలు, మైకులు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నా ఆ కళను ఆస్వాదించే శ్రోతలు లేరని, ఆ లోటు పల్లెటూరిలో తీరుతుందని భావం.

Exam Tips:

a) సందర్భం: గుర్తింపు లేని పట్నం వదిలి పల్లెకు రమ్మని కవి కోకిలను ఆహ్వానించే చోటు. కట్టని వేదిక, పెట్టని మైకు అనే పోలికలు తప్పక రాయండి.
b) వ్యాఖ్య: పట్నంలో వేదికలు, మైకులు ఉన్నా శ్రోతలు లేరు; పల్లెలో అమాయక శ్రోతలు ఉన్నారు.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 12 Telugu Poem 05 Kokila O Kokila

Official TS Board Solutions for Poem 05 Kokila O Kokila

Access structured TS Board textbook solutions for Poem 05 Kokila O Kokila. Designed in alignment with the latest academic curriculum for Class 12 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for Poem 05 Kokila O Kokila

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Poem 05 Kokila O Kokila concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Next Steps in Your Telugu Revision

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 12 Telugu.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Poem 5 కోకిలా! ఓ కోకిలా !! in printable PDF format for offline study on any device.