Solutions for Class 12 Telugu: Poem 06 Aadapillalantene
Review structured textbook solutions for Class 12 Telugu Poem 06 Aadapillalantene. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Practice Class 12 Telugu Solutions: Poem 06 Aadapillalantene
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు
Question 1: ‘ఆడపిల్లలంటేనే’ పాఠ్యభాగం ద్వారా కవి అందించిన సందేశం తెలియజేయండి.
Answer:
ఆడపిల్లలంటేనే అనే పాఠ్యభాగం ద్వారా నిసార్ మహిళాలోకానికి సందేశాన్ని ఇచ్చాడు. ఆడపిల్లలు అంటేనే లోకానికి చులకన భావం ఏర్పడింది. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడగమని సలహా ఇచ్చాడు. పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.
కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటగా మారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారు. తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.
ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఏదో ఒక పని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన భర్త మాత్రం ఆడవారిమీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం.
అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు. పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతారని, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించి ఒంటిలో ఓపిక ఉన్నంతకాలం సంసారపు బరువును మోస్తారని కవి చెప్పాడు. ముసలి దానివి అని దూరంగా ఉంచుతారు. వయసుమీద పడి పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయారని ఆడవారి పట్ల జాలి చూపాడు.
స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని అన్నాడు. ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటారని, ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలని, సహించినంత కాలం కష్టాలను భరించాల్సి ఉంటుందని, ఎదిరిస్తేనే బాధలు దూరమవుతాయని దానికోసం పోరాటం చేయాలని నిసార్ మహిళలకు సందేశం ఇచ్చాడు.
Exam Tips:
a) సందేశ ప్రశ్నలో ఈ క్రమం పాటించండి: ఆడపిల్లపై చులకన భావం → కట్నవేధింపులు → ఇంటిపని భారం → తక్కువ కూలి → వృద్ధాప్యంలో నిర్లక్ష్యం → ఎదిరించి పోరాడమనే పిలుపు.
b) చివరి పేరాలో "లేచి ముందుకు రమ్మని" కవి ఇచ్చిన పిలుపునే అసలు సందేశంగా స్పష్టంగా రాయండి; కేవలం కష్టాల జాబితా రాస్తే పూర్తి మార్కులు రావు.
Question 2: ‘ఆడపిల్లలంటేనే’ పాటలో కవి చిత్రించిన స్త్రీల శ్రమతత్త్వాన్ని విశ్లేషించండి.
Answer:
ఆడపిల్లలంటేనే లోకానికి చులకన భావం ఏర్పడిందని కవి నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని తెలపడం ప్రారంభించాడు. ఆడవారు లేకుండా ఈ లోకం ఎక్కడుంది అని సమాజాన్ని నిలబెట్టి స్పష్టంగా అడగమని స్త్రీలకు సూచించాడు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ భావన.
కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి తెచ్చిన కట్నంలో ఏ కొద్దిగా తగ్గినా నీ మొఖం పాడుగాను, నువ్వేం తెచ్చావని అంటారు. నిన్ను వాళ్ళే చంపేసి వంటింట్లో చచ్చిందని వార్తాపత్రికలకు ఇస్తారని నిసార్ హెచ్చరించాడు.
ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఏదో ఒక పని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరిఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం.
అయినా మగవారికే కూలి ఎక్కువ ఎందుకిస్తారు అని నిసార్ ప్రశ్నించాడు.
పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడ్డా, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించినా, ఒంటిలో ఓపిక ఉన్నంతకాలం సంసారపు బరువును మోసి ముసలితనం పొందితే దూరంగా ఉంచుతారని చెప్పాడు. వయసుమీద పడి నీవు పెంచుకున్న ఆశలు ఎండి పోయి తొడిమలాగా మిగిలిపోయావని చెప్తూ స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాల తేనెతుట్టె లాంటి వారని అన్నాడు. చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోతారని, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని నిసార్ స్త్రీల శ్రమ తత్వాన్ని విశ్లేషించాడు.
Exam Tips:
a) శ్రమతత్త్వం అంటే స్త్రీ చేసే ఇంటిపని, కూలిపని, పిల్లల పెంపకం; ఇవన్నీ "రోజుకు ఇరవై నాలుగు గంటల డ్యూటీ" అని కవి చెప్పిన పోలికను తప్పక రాయండి.
b) పురుషుడు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసినా ఎగిరెగిరి పడతాడనే విరుద్ధ అంశాన్ని, మగవారికంటే తక్కువ కూలి ఇవ్వడాన్ని ప్రస్తావించండి.
II. సంగ్రహరూప ప్రశ్నలు
Question 1: నిసార్ కవి పరిచయం రాయండి.
Answer:
ఆడపిల్లలంటేనే అనే పాఠాన్ని ‘నిసార్ పాట’ అనే ఉద్యమగీతాల సంపుటిలోనుండి గ్రహించారు. దీని రచయిత నిసార్. ఈయన పూర్తి పేరు మహమ్మద్ నిసార్ అహమద్. నిసార్ డిసెంబర్ 16, 1964 న జన్మించాడు. జూలై 8, 2020 న కరోనా కారణంగా చనిపోయాడు. ఈయన స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామం. తల్లిదండ్రులు హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్.
సుద్దాలలో ప్రాథమిక విద్యను, సీతారాంపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. ఉన్నత చదువులు అభ్యసించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం కారణంగా నిసార్ చదువుకు స్వస్తిచెప్పి, ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు చేరుకున్నాడు.
దూర విద్య ద్వారా బి.ఏ. డిగ్రీ పట్టా అందుకున్నాడు తొలితరం ప్రజావాగ్గేయకారుల స్ఫూర్తితో 1986 సం॥ నుంచి పాటలు రాయడం ప్రారంభించాడు. “చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు.
Exam Tips:
a) కవి పరిచయంలో వరుస: పూర్తి పేరు (మహమ్మద్ నిసార్ అహమద్), జననం 1964, స్వస్థలం సుద్దాల, తల్లిదండ్రులు, విద్య, పాటల రచన ఆరంభం (1986), రచన (నిసార్ పాట), మరణం 2020.
b) తేదీలు, ఊరి పేర్లు కచ్చితంగా రాయండి; వీటిలో తప్పులు వస్తే మార్కులు పోతాయి.
Question 2: సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను తెలియజేయండి.
Answer:
పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు చేస్తారు. కాని ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వెక్కిరిస్తారు. ఆడపిల్ల పడుకుంటే లేపి అంట్లు శుభ్రం చేయిస్తారు. మగపిల్లలను బడికి పంపి చదివిస్తారు. ఆడపిల్లలను పనికి మగపిల్లలను చదువుకు పంపడం అనే భేద భావాలు ఎందుకుండాలి ? ఆడ మగ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ఉండాలి అలా ఉండకుంటే జీవితం సఫలం కాదు అని నిసార్ స్త్రీలపట్ల ఉన్న వివక్షను ఎత్తి చూపాడు.
Exam Tips:
a) వివక్షను ఉదాహరణలతో రాయండి: ఆడపిల్ల పుడితే మూతులు ముడవడం, ఆమెకు అంట్లు, మగపిల్లవాడికి బడి.
b) పాఠంలోని పదం "ఆడ మగ తేడా లెందుకు" అనే కవి ప్రశ్నతో ముగిస్తే సమాధానానికి బలం వస్తుంది.
Question 3: కుటుంబ ప్రగతిలో స్త్రీ పాత్రను వివరించండి.
Answer:
ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదు. రోజులో ఉండే ఇరవైనాలుగు గంటలూ కష్టపడ్డా ఇంకా ఏదో ఒక పని ఉండనే ఉంటది. కాని కేవలం ఎనిమిది గంటలు బయట పనికి వెళ్లి వచ్చిన నీ భర్త మాత్రం నీ మీద ఎగిరి ఎగిరి పడతాడు తల్లి అని నిసార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికం. ఇలా కుటుంబ ప్రగతిలో స్త్రీపాత్ర కీలకం అని నిసార్ తెలిపాడు.
Exam Tips:
a) కుటుంబంలో స్త్రీ చేసే పనులను వరుసగా రాయండి: ఇంటిపని, పిల్లల పోషణ, అత్తమామల సేవ, భర్తకు ఆనందం, కూలిపని.
b) "ఏ లెక్కనా చూసినా స్త్రీ కష్టమే ఎక్కువ" అనే పంక్తిని ఉటంకిస్తూ ముగించండి.
Question 4: స్త్రీ త్యాగనిరతిని తెలుపండి.
Answer:
పేగులు తెంపుకొని, పిల్లల్ని కనీ, పెంచి వారికి పెళ్ళిళ్ళు చేసి ఆనందపడతారని, చావుబతుకుల్లో, కష్టసుఖాల్లో సంసారాన్ని సాగించి ఒంటిలో ఓపిక ఉన్నంతకాలం సంసారపు బరువును మోస్తారని కవి చెప్పాడు. ముసలి దానివి అని దూరంగా ఉంచుతారు. వయసుమీద పడి పెంచుకున్న ఆశలు ఎండిపోయి తొడిమలాగా మిగిలిపోయారని ఆడవారి పట్ల జాలి చూపాడు. స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని స్త్రీల త్యాగ నిరతిని నిసార్ తెలియచేశాడు.
Exam Tips:
a) త్యాగాన్ని సూచించే కవి పోలికలు రాయండి: "నడిచేటి చెట్టు", "త్యాగాల తేనెతుట్టె", "ఆకు రాల్చినట్టు కష్టాలు మరవడం".
b) పేగులు తెంచుకొని కని, పెంచి, పెళ్లిళ్లు చేసినా వృద్ధాప్యంలో దూరం పెట్టడమనే చేదు నిజాన్ని కూడా చేర్చండి.
III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు
Question 1: నిసార్ జన్మస్థలం ఏది ?
Answer:
నల్లగొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం
Exam Tips:
a) ఈ ప్రశ్నకు జన్మస్థలాన్ని జిల్లా, మండలం, గ్రామం మూడూ కలిపి రాయండి (నల్లగొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల).
b) గ్రామం పేరు మాత్రమే రాస్తే అసంపూర్ణ సమాధానం అవుతుంది.
Question 2: నిసార్ తల్లిదండ్రులెవరు ?
Answer:
హాలీమాబీ, మహమ్మద్ అబ్బాస్
Exam Tips:
a) తల్లిదండ్రుల పేర్లను క్రమం తప్పకుండా రాయండి: తల్లి హాలీమాబీ, తండ్రి మహమ్మద్ అబ్బాస్.
b) ఒక వాక్యంలో సమాధానం రాస్తే సరిపోతుంది; పేర్ల స్పెల్లింగ్ తప్పులు రాకుండా చూడండి.
Question 3: నిసార్ ఏ సంస్థకు కార్యదర్శిగా ఉన్నాడు ?
Answer:
ప్రజా నాట్యమండలికి
Exam Tips:
a) నిసార్ కార్యదర్శిగా పనిచేసిన సంస్థ ప్రజానాట్యమండలి; ఇది కవి పరిచయంలోనే వచ్చే అంశం కాబట్టి గుర్తుపెట్టుకోండి.
b) పేరును పూర్తిగా రాయండి, సంక్షిప్తరూపం వాడవద్దు.
Question 4: కనుమరుగవుతున్న కళారూపాలపై నిసార్ రాసిన పాట ఏది ?
Answer:
“చుట్టుపక్కల ఎక్కడ జూచిన పొట్టలల్లో ఆకలిమంటలు/చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టిలేపుతున్నాయి” అంటూ తొలిపాట రాసి, అంతులేని ఆకలిబాధలను ఆర్ద్రంగా గానం చేశాడు.
Exam Tips:
a) ఈ ప్రశ్నలో అడిగిన పాట కవి మొదటి పాట ఉదాహరణతో కవి పరిచయంలో వస్తుంది; ఆ పాటలోని పంక్తులను యథాతథంగా ఉటంకించండి.
b) ఉటంకింపులో ఆకలిమంటలు, పేగులు అనే పదాలు తప్పకుండా ఉండాలి; ఉటంకించేప్పుడు కొటేషన్ గుర్తులు వాడండి.
Question 5: ‘ఆడపిల్లలంటేనే’ పాఠ్యభాగం ఏ సంపుటి లోనిది?
Answer:
నిసార్ పాట అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి
Exam Tips:
a) పాఠం తీసుకున్న గ్రంథం పేరు "నిసార్ పాట" (ఉద్యమగీతాల సంపుటి); గ్రంథం పేరును తప్పుగా రాయకండి.
b) గ్రంథ రకాన్ని (ఉద్యమ గీతాల సంపుటి) కూడా జతచేయండి.
Question 6: నిసార్ ఏ సంవత్సరం నుంచి పాటలు రాస్తున్నాడు ?
Answer:
1986 నుండి
Exam Tips:
a) కవి పాటలు రాయడం ప్రారంభించిన సంవత్సరం 1986; సంఖ్యలు తప్పుగా రాస్తే మార్కులు రావు.
b) సమాధానంలో "1986 నుండి" అని రాస్తే చాలు.
Question 7: బ్రతుకు పండేది ఎప్పుడు ?
Answer:
ఆడ, మగ ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటే బ్రతుకు పండుతుంది.
Exam Tips:
a) సమాధానం ఒకే వాక్యంలో: ఆడ, మగ ఇద్దరూ ఒకరికొకరు తోడు నీడగా ఉన్నప్పుడే బ్రతుకు పండుతుంది.
b) "తోడు నీడ" అనే పదబంధాన్ని తప్పక వాడండి.
Question 8: ఆకు రాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు ?
Answer:
ఆడవారు, స్త్రీలు
Exam Tips:
a) ఈ ప్రశ్నకు ఒక్క పదం లేదా రెండు పదాల సమాధానం చాలు: "ఆడవారు" లేదా "స్త్రీలు".
b) గేయంలోని "ఆకు రాల్చినట్టు కష్టాలు మరిచేవు" అనే పంక్తి సందర్భాన్ని గుర్తుంచుకోండి.
IV. సందర్భసహిత వ్యాఖ్యలు
Question 1: క్రింది వాక్యానికి సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “కట్నకానుకల పంటవయి నిండాలె”
Answer:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటేనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : కొత్తగా పెండ్లి కాగానే అత్తగారి ఇంటికి వరకట్నం, కానుకలు తెచ్చే పంటగా మారి వారి ఇల్లు నింపాలని అనుకుంటారు. నువ్వు కట్నంగా తెచ్చిన డబ్బుతో, బంగారంతో, వాహనంతో, వంట పాత్రలతో ఇల్లు నింపినా ఇంకా సరిపోలేదని అంటారని కవి చెప్పిన సందర్భం లోనిది ఈ వాక్యం.
అర్థం : కట్నం అనే పంటతో ఇల్లంతా నింపాలని అర్థం.
వ్యాఖ్య : ఆడపిల్లలు ఎంత కట్నం తెచ్చినా ఇంకా కావాలని వేధిస్తారని భావం.
Exam Tips:
a) సందర్భసహిత వ్యాఖ్యకు నాలుగు భాగాలుండాలి: కవి పరిచయం, సందర్భం, అర్థం, వ్యాఖ్య (స్వభావం); ఏ భాగమూ వదలవద్దు.
b) ఈ వాక్యంలో "కట్నకానుకల పంట" అంటే వరకట్నం అనే పంటతో అత్తవారి ఇల్లు నింపాలనే ఒత్తిడి అని వ్యాఖ్యలో స్పష్టంగా చెప్పండి.
Question 2: క్రింది వాక్యానికి సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “వొళ్లెంత వొంచిన పని వొడవదోయమ్మా”
Answer:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటేనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ఉదయం లేచింది మొదలు ఇల్లు ఊడ్చడం, వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడం, వంటపాత్రలు కడిగి వంటచేయడం, అందరి బట్టలుతకడం, వడ్డించి తినేవరకు ఆగి నీ శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని అయిపోదని నిసార్ చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : శరీరం మొత్తం అలిసి పోయేదాక పని చేసినా పని పూర్తి కాదని అర్థం.
వ్యాఖ్య : స్త్రీలు ఒళ్ళు హూనం చేసుకునేలా పని చేసినా వారికి తీరిక లభించదు అని భావం.
Exam Tips:
a) సందర్భం కోసం ఉదయం నుండి రాత్రి వరకు స్త్రీ చేసే పనుల జాబితాను (ఊడ్చడం, చల్లడం, కడగడం, ఉతకడం, వండటం) ఒక వాక్యంలో రాయండి.
b) వ్యాఖ్యలో ఎంత పనిచేసినా తీరిక దొరకదనే భావాన్ని రాయండి.
Question 3: క్రింది వాక్యానికి సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “ఏ లెక్క జూసినా నువు జేసె కష్టమే ఎక్కువాయే”
Answer:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటేనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : ఇంటికి కావలసిన పనులన్ని చేసి, పిల్లలను పోషించి, అత్త మామలను సరిగా పోషించి, భర్త మెప్పును పొంది కూలికి కూడా వెళ్లి పనిచేసి ఆకలితో ఇంటికి వచ్చి పొయ్యి వెలిగిస్తావు. ఏ లెక్కప్రకారం చూసినా ఆడవారు చేసే శ్రమనే అధికమని చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : ఏ లెక్క ప్రకారం చూసినా స్త్రీలు చేసే పని విలువనే అధికం అని అర్థం.
వ్యాఖ్య : స్త్రీలు చేసే పనివిలువ ఎక్కువ అయినా స్త్రీలకు తక్కువ కూలి ఇస్తారని భావం.
Exam Tips:
a) ఈ వాక్యం స్త్రీ శ్రమను లెక్కగట్టే సందర్భంలోనిది; పని ఎక్కువ అయినా కూలి తక్కువ ఇవ్వడాన్ని వ్యాఖ్యలో చూపండి.
b) కవి పరిచయ వాక్యాన్ని నాలుగు సమాధానాలకూ యథాతథంగా వాడవచ్చు, కాని సందర్భం మాత్రం ఈ పంక్తికి తగినట్టు మార్చండి.
Question 4: క్రింది వాక్యానికి సందర్భసహిత వ్యాఖ్య రాయండి : “కష్టాల కొలిమిలో ఇంకెంత కాలమేడుస్తవమ్మా”
Answer:
కవి పరిచయం : ఉద్యమకవి నిసార్ రాసిన “నిసార్ పాట” అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి స్వీకరించిన “ఆడపిల్లలంటేనే” అనే పాఠ్యభాగం నుండి తీసుకున్నది ఈ వాక్యం. నిసార్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కవి.
సందర్భం : స్త్రీలు నడిచే చెట్టులాంటి వారని, త్యాగాలు చేసిన తేనెతుట్టె లాంటి వారని చెట్టు ఆకులను రాల్చినట్టు కష్టాలను మరిచిపోయి, తేనెలను పంచినట్టు ప్రేమలను పంచుతారని ఇంకా ఎన్ని రోజులు కష్టాల కొలిమిలో ఉంటారని, ఈ చెడిపోయిన వాళ్ళను వెళ్ళగొట్టడానికి లేచి ముందుకు రావాలని, కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం.
అర్థం : కష్టాలనే కొలిమిలో ఇంకా ఎన్ని రోజులు కాలం గడుపుతారని అర్థం.
వ్యాఖ్య : స్త్రీలు వారి జీవితాన్ని వారి కుటుంబంకోసం త్యాగం చేస్తారు. ఇంకా ఎన్ని రోజులు ఆ బాధలను భరిస్తారు ఎదిరించాలని భావం.
Exam Tips:
a) ఈ పంక్తిలో కవి స్త్రీలను ఎదిరించమని పిలుస్తున్నాడు; అందుకే వ్యాఖ్యలో కష్టాలను భరించవద్దనే సందేశాన్ని చేర్చండి.
b) "కొలిమి" అంటే కష్టాల తీవ్రతను సూచించే ఉపమానమని వివరించండి.
Free study material for Telugu
Step-by-Step Textbook Answers: Class 12 Telugu Poem 06 Aadapillalantene
Official TS Board Solutions for Poem 06 Aadapillalantene
Explore reliable textbook solutions for Poem 06 Aadapillalantene tailored for Class 12 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.
Step-by-Step Explanations for Poem 06 Aadapillalantene
Clear, methodical explanations accompany every challenging problem within the Class 12 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Next Steps in Your Telugu Revision
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 12 Telugu.
FAQs
The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Poem 6 ఆడపిల్లలంటేనే in printable PDF format for offline study on any device.