TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన

Download TS Board Solutions for Class 12 Telugu Chapter 03 My Literary Research

Access comprehensive textbook solutions for Chapter 03 My Literary Research using the official curriculum guides for Class 12 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Access TS Board Solutions and Answers

Access the complete solution PDF for Class 12 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

Question 1: బిరుదురాజు రామరాజు సాహిత్య పరిశోధనలను తెలుపండి.

Answer:

బిరుదురాజు రామరాజు ప్రారంభ కాలంలో కొన్ని గేయాలు, పద్యాలు, నవలలు రాశారు. ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసాల్లో మొదటి రెండు తక్కువగా ఉన్నాయనుకొని సృజనాత్మక సాహిత్యరంగంలో రాణింపు రాదని భావించారు. గుర్తింపు కోసం లోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో పరిశోధనను ప్రారంభించారు. బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడే వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగు శాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేసి అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు.
బిరుదురాజు రామరాజు హైస్కూలు విద్యార్థిగా ఉండినప్పటి నుంచే భారతి మొదలైన పత్రికల్లో మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి పరిశోధకులు వ్యాసాలు, వారు సంపాదకత్వం వహించిన గ్రంథాల పీఠికలు చదివారు. అందువల్ల వారిలాగ ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.
ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. అముద్రితంగా పడిఉన్న తెలుగు సంస్కృత రచనలు దాదాపు నూరు మొదటి సారి సాహిత్య ప్రపంచానికి తెలియపరిచారు. మరుగు పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు ఇతర ప్రత్యేక సంచికల్లో ప్రకటించిన వ్యాసాలు ఈ కోవకు చెందినవే. సంస్కృత సాహిత్యానికి రామరాజు కృషి : సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీపరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు.
ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం, తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యుల రసోదారభాణం, భారద్వాజ రామాచార్యుల భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం (ఉ.వి. సంస్కృత అకాడమీ పక్షాన అర్యేంద్రశర్మగారి పేరుతో ప్రకటితం) పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులు పరిష్కరించారు.
తెలుగు సాహిత్యానికి రామరాజు చేసిన కృషి : తెలుగులో బొడ్డుచెర్ల చినతిమ్మకవి ప్రసన్న రాఘవనాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, సాయప వెంకటాద్రి నాయకుని సకలజీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం మొదటిసారి పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుని శివరాత్రి మాహాత్మ్యం సంపూర్ణ గ్రంథం సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన పద్మపురాణం, పాలవేకరి కదరీపతిరాజు శుకసప్తతి, సంశోధిత ముద్రణలు విపులమైన పీఠికలతో ప్రకటించారు. ఈ రెండు గ్రంథాల్లోని వందల సంఖ్యలో తప్పుడు పాఠాలు సవరించి చూపారు.
ఇంటర్ దాకా చదివిన ఉర్దూ సార్ధకమయ్యే విధంగా ఉర్దూ తెలుగు నిఘంటువును రాశారు. ఇంగ్లీషు నుంచి, హిందీ నుంచి నాలుగు గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. 38 మంది పరిశోధకులు రామరాజు పర్యవేక్షణలో ఎం.ఫిల్., పిహెచ్.డి. పట్టాలు సంపాదించుకున్నారు.

Exam Tips:

a) పరిశోధనలను మూడు వర్గాలుగా రాయండి: జానపద గేయ పరిశోధన (తెలుగు జానపద గేయ సాహిత్యం – తొలి సిద్ధాంత గ్రంథం), సంస్కృత కృతుల పరిష్కరణ, తెలుగు కృతుల పరిష్కరణ (శివరాత్రి మాహాత్మ్యం మొదలైనవి).
b) ఇంగ్లీషు గ్రంథాలు (ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి. మొదలైనవి), రీసెర్చ్ జర్నల్స్ (విమర్శని, వివేచన), 38 మంది పరిశోధకుల పర్యవేక్షణ వివరాలు కూడా జోడించండి.

 

Question 2: జానపద గేయాలు సేకరించడంలో బిరుదురాజు అనుభవాలు ఎలాంటివి ?

Answer:

జానపద గేయాలు సేకరించినప్పటి అనుభవాలు : బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో తెలుగు జానపదగేయ సాహిత్యము అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథమైనది.
ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయంగా ఉన్నాయి.
తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళకు బస్సులు లేవు, జిల్లా, తాలూకా కేంద్రాల నుండి కొన్ని చోట్లకు నడచి కొన్ని చోట్లకు సైకిల్ పైన, కొన్నిచోట్లకు ఎడ్లబండి పైన పోయి గేయాలు సేకరించారు. స్త్రీలకు రవిక ముక్కలు, పురుషులకు బీడీలు, చుట్టలు, కల్లుకు పైసలు ఇచ్చి గేయాలు పాడించి రాసుకున్నారు.
నల్గొండ జిల్లా నకిరేకల్లు గ్రామంలో కోలాటం పాటలు పాడేవారున్నారని విని అక్కడకు పోతే అక్కడి యువకులు సహకరించలేదు. రామరాజుకు తెలిసిన పోలీస్ఆఫీసర్ చేత బలవంతాన పట్టి తెప్పించి రాత్రి 11 గంటల నుండి ఒంటిగంట దాకా కోలాటాలు వేయించారు. ఇద్దరు యువకులు ఎదురు తిరిగితే పోలీసు సి.ఐ. వాళ్ళను కొట్టాడు కూడా. ఆ తెల్లవారి వారి ఇంటికి వెళ్ళి క్షమార్పణ చెప్పి డబ్బులిచ్చాడు. అట్లా బలవంతాన పాడించటం తప్పే అని తెలిసి కూడా చేసినందుకు బాధపడ్డాడు. గాయక భిక్షుకులు డబ్బులు, పాతబట్టలిస్తే సంతోషంగా గేయగాథలు పాడేవాళ్ళు. కాని ఫోటోలు తీయనిచ్చేవారు కాదు.
ఫోటోలు తీస్తే వాళ్ళ కంఠమాధుర్యం పోతుందని వారి భావన. వారికి నచ్చచెప్పి డబ్బులిచ్చి గాయక భిక్షుకుల ఫొటోలు తీసుకున్నారు. తాళపత్రాలకోసం ఒక వేసవిలో కరీంనగరం జిల్లా ఎల్లారెడ్డి పేటకు నడచిపోయి ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద, మూర్చపోయారు. కొట్టం యజమాని బలిజాయన మంచినీళ్ళు, పాలు ఇచ్చాడు. రెండు రూపాయలిస్తే బండి కట్టాడు. ఆ నారాయణపురం పోయి మురళీధరశర్మ అనే ఆయన దగ్గర బస్తా (సంచి) నిండా తాళపత్ర గ్రంథాలు తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో వీరమ్మ-శివరాజం అనే ఆ బలిజ దంపతులే నీళ్ళచారు అన్నం పెట్టి బస్సెక్కించారు.

Exam Tips:

a) అనుభవాలను ఉదాహరణలతో రాయండి: నడకతో, సైకిల్, ఎడ్లబండిలో ప్రయాణం; రవిక ముక్కలు, బీడీలు ఇచ్చి పాటలు పాడించడం; నకిరేకల్లులో కోలాటం సంఘటన; ఎల్లారెడ్డిపేటలో సొమ్మసిల్లడం.
b) చివరిలో బలిజ దంపతుల ఆదరణను ప్రస్తావిస్తే కథనం పూర్తవుతుంది.

 

II. సంగ్రహరూప ప్రశ్నలు

Question 1: జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు ముద్ర ఎట్టిది ?

Answer:

బిరుదురాజు రామరాజు సాహిత్యలోకానికి క్రొత్త విషయాలు చెప్పాలనే నిశ్చయంతో పరిశోధన రంగంలోకి అడుగు పెట్టారు. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణ భారతదేశ భాషలన్నిటిలో “తెలుగు జానపదగేయ సాహిత్యము” అనే వీరి పరిశోధనా గ్రంథమే మొదటి సిద్ధాంత గ్రంథం. ఆ రంగంలో అనేక జానపద గేయ సంకలనాలు ప్రకటించారు. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదుల సంఖ్యలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు.
ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్సాంగ్స్, గ్లింప్సెస్ ఇన్ టూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించారు. జానపద గేయాలు సేకరించిన రామరాజు అనుభవాలు కూడా ఆసక్తిదాయకంగా ఉన్నాయి. తెలంగాణ అంతటా తిరిగి 1953-1955 సంవత్సరాల మధ్య జానపద గేయాలు తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు సేకరించారు.

Exam Tips:

a) బిరుదురాజు ముద్ర అంటే జానపద విజ్ఞానంలో మొదటి సిద్ధాంత గ్రంథం "తెలుగు జానపద గేయ సాహిత్యం" రాయడం; అది తప్పక మొదటి వాక్యంలో ఉండాలి.
b) సేకరించిన కాలం (1953–55), సదస్సులలో పత్రాలు, ఇంగ్లీషు గ్రంథాల పేర్లు వంటి వివరాలను తరువాత చేర్చండి.

 

Question 2: ఆంధ్రుల సంస్కృత సాహిత్యానికి బిరుదురాజు చేసిన కృషి తెలుపండి.

Answer:

బిరుదురాజు రామరాజు సంస్కృతంలో కృషిచేసిన తెలుగు వారి గురించి ప్రపంచానికి తెలిపారు. కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసు బిరుదాంకితుడైన వెల్లాల ఉమామహేశ్వరుల శృంగార శేఖర భాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతీ పరిణయ నాటకం మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు.
ఇంకా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి ఉషా రాగోదయం, బెల్లంకొండ రామారావుగారి రుక్మిణీ కల్యాణం తిరుమల బుక్కపట్టణం, అణయాచార్యులు రసోదార భాణం, భారద్వాజ రామాచార్యులు భద్రగిరి చంపూ, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, పరశురామపంతుల అనంతరామయ్య సీతావిజయ చంపూ వంటి సంస్కృత కృతులను పరిష్కరించి సాహిత్య చరిత్రలో వారి పేర్లకు చిరస్థాయి నందించారు.

Exam Tips:

a) సంస్కృత కృతులను పేరు–రచయిత జతలుగా రాయండి (ఉదా: వసుచరిత్రం – కాళహస్తి కవి; రామాయణ సారతిలకం – మధురవాణి; జాంబవతీ పరిణయం – శ్రీకృష్ణదేవరాయలు).
b) "మొదటిసారిగా పరిష్కరించి ప్రకటించారు" అనే పదబంధం ఈ ప్రశ్నకు కీలకం; దీన్ని వాడండి.

 

Question 3: విశ్వవిద్యాలయ ఆచార్యులుగా బిరుదురాజు రామరాజు సేవ ఎలాంటిది ?

Answer:

బి. రామరాజు ఉద్యోగంలో ఉన్నప్పుడు వరంగల్ స్నాతకోత్తర కేంద్రం తెలుగుశాఖకు విమర్శని పేరుతో, ఉస్మానియా తెలుగు శాఖకు వివేచన అనే పేరుతో రీసెర్చ్ జర్నల్స్ ప్రకటించే ఏర్పాటు చేశారు. అందుకు కావలసిన ఆర్థిక వనరులు యూనివర్సిటీ బడ్జెట్లోనే పొందుపరిచేటట్లు చూశారు. జానపద విజ్ఞానంలో దాక్షిణాత్య విశ్వవిద్యాలయాలలో మొదటిసారి సమ్మర్ కోర్సు నిర్వహించారు. ఏడవ అఖిలభారత జానపద విజ్ఞానసదస్సు తెలుగుశాఖ పక్షాన నిర్వహించాడు. 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల (అరవై ఏళ్ళ ఉత్సవం) సందర్భంగా “బోధన భాషగా తెలుగు” అనే సదస్సును నిర్వహించాడు.
వరంగల్ పి.జి. సెంటర్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఈతకొట్టిన బాలసముద్రం వైపు సరదాగా తిరగడానికి వెళ్ళాడు. అక్కడ నరసముద్రం కోసం ఆ జలసముద్రం పాడు చేస్తున్నారు.
ఆ చెఱువుకట్ట గండిలో గణపతి దేవ చక్రవర్తి మంత్రి వేయించిన శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దానిని పి.జి. సెంటర్ తెలుగు శాఖ ముందు ప్రతిష్ఠించి జిల్లా కలెక్టరుకు, ఆర్షశాఖ డైరెక్టరుకు తెలియపరచారు. ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ఆ శాసనం ఆధారంగా శాసనలిపి చదివే విధానం. శాసనం తీసే విధానం ప్రాక్టికల్గా నేర్పించారు. ఆంధ్రలిపి పరిణామం తెలిపే లిపి బొమ్మలు ఛార్జ్ ఫోటోలు తీయించి ముందుగా ఎం.ఏ. తెలుగు క్లాసురూంలో, తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పెట్టించారు.

Exam Tips:

a) ఆచార్యునిగా చేసిన పనులను పాయింట్లుగా రాయండి: జర్నల్స్ ప్రారంభం, సమ్మర్ కోర్సు, అఖిలభారత జానపద సదస్సు, 1978 వజ్రోత్సవ సదస్సు, శాసన లిపి ప్రాక్టికల్ శిక్షణ.
b) వరంగల్ పి.జి. సెంటర్‌లో శాసనాన్ని రక్షించిన సంఘటనను ఉదాహరణగా చెప్పండి.

 

Question 4: బిరుదురాజు మల్లినాధసూరి తాళపత్ర గ్రంథాలు ఎట్లా సంపాదించాడు ?

Answer:

తెలుగుజాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి. ఆయన స్వగ్రామం మెదక్ జిల్లాలోని కొలిచెలమ. అక్కడి కొలిచెలిమ వారింట్లో తాళపత్ర గ్రంథాలున్నాయని తెలిసి తన మిత్రుడు తహసీల్దార్ సి. హెచ్. కొండయ్యతో కలిసి వెళ్లి అమూల్యమైన తాళపత్ర గ్రంథాలు తెచ్చుకున్నారు. అంతటితో సంతృప్తి పడక వారి పూజాగృహంలో పెట్టుకున్న మల్లినాథసూరి ఘంటాలు చూచి కన్నుల కద్దుకొని వాటిని తనకివ్వండని డబ్బు ఇవ్వబోయారు. కాని అవి తరతరాల నుండి పూజాద్రవ్యాలుగా ఉన్నాయని చెప్పి వారు ఇవ్వలేదు.
తమకున్న రెండెకరాల పొలం అక్కడి భూస్వామి దున్నుతూ నామమాత్రపు కౌలు ఇస్తున్నాడనీ, భూమి తమ జీవనాధారమనీ కంటతడి పెట్టడం చూసి తన మిత్రుడు కొండయ్య సహకారంతో ఆ భూస్వామిని ఒప్పించి, భూమిని పురోహితునికి ఇప్పించారు. ఆ పురోహితుడు మల్లినాథ సూరి రెండు ఘంటాలను బిరుదురాజు రామరాజుకు ఇచ్చాడు.

Exam Tips:

a) ఘటనల క్రమం: కొలిచెలమలో తాళపత్ర గ్రంథాల సేకరణ → ఘంటాలు అడగడం → పూజాద్రవ్యాలని నిరాకరణ → భూమి కౌలు సమస్య పరిష్కరించడం → పురోహితుడు ఘంటాలు ఇవ్వడం.
b) మిత్రుడు తహసీల్దార్ కొండయ్య సహకారాన్ని తప్పక ప్రస్తావించండి.

 

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

Question 1: బిరుదురాజు రామరాజు స్వగ్రామమేది ?

Answer:

వరంగల్ జిల్లా దేవునూరు.

Exam Tips:

a) స్వగ్రామం వరంగల్ జిల్లా దేవునూరు; జిల్లా పేరు, ఊరి పేరు రెండూ రాయండి.
b) ఊరి పేరు స్పెల్లింగ్ ఒక్క అక్షరం తప్పినా మార్కు పోతుంది.

 

Question 2: బిరుదురాజు రామరాజు పిహెచ్.డి గ్రంథం పేరేమి ?

Answer:

తెలుగు జానపద గేయ సాహిత్యం.

Exam Tips:

a) పిహెచ్.డి. గ్రంథం "తెలుగు జానపద గేయ సాహిత్యం"; ఇది దక్షిణ భారత భాషలన్నింటిలో తొలి సిద్ధాంత గ్రంథం అని అదనంగా రాయవచ్చు.
b) గ్రంథం పేరును మార్చకుండా పూర్తిగా రాయండి.

 

Question 3: పరిణతవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటుచేసిన సంస్థ ఏది ?

Answer:

ఆంధ్ర సారస్వత పరిషత్తు.

Exam Tips:

a) పరిణతవాణి ప్రసంగాలను ఏర్పాటు చేసిన సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు; పేరు పూర్తిగా రాయండి.
b) ఇది పాఠంలోని సంస్థల పేర్ల ప్రశ్నల్లో తరచుగా వస్తుంది.

 

Question 4: రామరాజు చిన్నప్పటినుండి ఎటువంటి భావాలు ప్రోది చేసుకున్నాడు ?

Answer:

దేశభక్తి భావాలు.

Exam Tips:

a) చిన్నప్పటి నుంచి ప్రోది చేసుకున్న భావాలు "దేశభక్తి భావాలు"; ఒక్క వాక్యంలో రాయండి.
b) ఈ ప్రశ్నకు వ్యాసంలో వచ్చే ఇతర వివరాలు అవసరం లేదు.

 

Question 5: బిరుదురాజు రామరాజు ఎవరి పరిశోధనలను ఆదర్శంగా పెట్టుకున్నాడు ?

Answer:

మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ.

Exam Tips:

a) ఆదర్శంగా తీసుకున్న పరిశోధకులు నలుగురు: మానవల్లి రామకృష్ణకవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నిడదవోలు వేంకటరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ.
b) నలుగురి పేర్లూ రాయండి; కొందరిని వదిలేస్తే అసంపూర్ణ సమాధానం అవుతుంది.

 

Question 6: ఉస్మానియా విశ్వవిద్యాలయం (1978) వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సు ఏది ?

Answer:

బోధనా భాషగా తెలుగు.

Exam Tips:

a) 1978లో ఉస్మానియా వజ్రోత్సవాల సందర్భంగా జరిగిన సదస్సు "బోధనా భాషగా తెలుగు"; పేరు యథాతథంగా రాయండి.
b) సంవత్సరం (1978) కూడా జతచేస్తే మంచిది.

 

Question 7: తెలుగుజాతికి గర్వకారణమైన తొలి మహామహోపాధ్యాయుడు ఎవరు ?

Answer:

శ్రీ కోలాచలం మల్లినాథ సూరి.

Exam Tips:

a) తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథసూరి; ఆయన ఘంటాల కథతో ముడిపడిన ఈ పేరును గుర్తుంచుకోండి.
b) "తెలుగుజాతికి గర్వకారణం" అనే విశేషణాన్ని సమాధానంలో వాడవచ్చు.

 

Question 8: బిరుదురాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభమైంది ?

Answer:

ఆంధ్రుడా ! ఓ ఆంధ్రుడా !

Exam Tips:

a) బిరుదురాజు సాహిత్య వ్యాసంగం "ఆంధ్రుడా! ఓ ఆంధ్రుడా!" అనే గేయంతో ప్రారంభమైంది; గేయం మొదటి పంక్తిని యథాతథంగా రాయండి.
b) ఆ తరువాత గేయాలు, నవలల నుండి పరిశోధనకు ఎలా మళ్ళారో వ్యాస ప్రశ్నలలో చెప్పవచ్చు.

Free study material for Telugu

Telugu Class 12 Curriculum Solutions: Chapter 03 My Literary Research

Accessing Chapter 03 My Literary Research Solutions

Explore reliable textbook solutions for Chapter 03 My Literary Research tailored for Class 12 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Concept-Driven Answers for Class 12 Telugu

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 03 My Literary Research concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 03 My Literary Research with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Chapter 3 నా సాహిత్య పరిశోధన in printable PDF format for offline study on any device.