TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం

Official TS Board Solutions for Class 12 Telugu: Chapter 02 Telangana Sahiti Vikasam

Review structured textbook solutions for Class 12 Telugu Chapter 02 Telangana Sahiti Vikasam. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Chapter-wise Solutions for Telugu: Chapter 02 Telangana Sahiti Vikasam

Access the complete solution PDF for Class 12 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

Question 1: తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధి వెనకబడటానికి కారణాలు వివరించండి.

Answer:

తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది.
భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతి చరిత్ర రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి.
దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించారు. తెలంగాణ శాసనాలలో కొన్నింటిని హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక మండలివారు ప్రచురించారు. మరికొన్ని శాసనాలు పురావస్తు శాఖకు అప్పగించారు.
వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి.
హైదరాబాదు సంస్థానంలో తెలుగు దుస్థితికి కారణాలు : గోలకొండ సుల్తానుల ఉత్తమ సంప్రదాయాన్ని అసఫ్ జాహీ వంశీయులు పాటించలేదు. భాషా సంస్కృతులను అణచి వేశారు. హైదరాబాదు పైన పోలీసు చర్య జరిగే వరకు, నిజాం ప్రభుత్వ విధానాలు ప్రజల భాషలను అణచివేశాయి. బ్రిటిషు పరిపాలనలో భాషలపై ఇటువంటి ప్రయత్నాలు జరుగలేదు. నైజామేతర ప్రాంతాలలో బ్రిటీషువారు గ్రంథాలయాల స్థాపనను నిషేధించలేదు. రాజకీయాలతో సంబంధంలేని సారస్వత కృషి నిరంతరాయంగా జరిగింది. సి.పి. బ్రౌన్ వంటి ఉన్నత అధికారులు ప్రజల భాషల వికాసానికి కృషిచేశారు.
వీరేశలింగం పంతులు మొదలైన వారి సారస్వత కృషికి ప్రభుత్వం ఆటంకాలు కలిగించలేదు. కానీ తెలంగాణా ప్రాంతంలో మాతృభాషల వికాసానికి గొడ్డలి పెట్టువంటి విధానాలను హైదరాబాదు ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రాంతంలోని 90% ప్రజల భాష తెలుగు అయినప్పటికీ తెలుగు చదువుకొనడానికి అవకాశాలు లేవు. ఒక గ్రంథాలయాన్ని పెట్టుకోవడమే చాలాకష్టమైన పని.
కవిసమ్మేళనాలు, సారస్వత సభలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి అవసరమయ్యేది. ఆంధ్ర అనే పేరుతో ఏ ఉద్యమం సాగినా దానిని ప్రభుత్వం శత్రుభావముతో చూసేది. ఈ పరిస్థితినే వాగ్బంధన శాసన పైశాచిక తాండవం (నోటిని కట్టివేసే పిశాచాల నర్తనం) అని సురవరం ప్రతాపరెడ్డి అన్నారు.
తెలంగాణా ప్రాంతంలో ఎందరో గొప్పవారైన సంస్కృతాంధ్ర పండితులున్నప్పటికీ వారు సభలలో సమావేశమై పరస్పర అవగాహన చేసుకునే అవకాశాలు లేవు. ప్రజలలో పది శాతం మందికి కూడా రాని ఉర్దూ భాషను రాజభాషగా రుద్దారు. ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశవరకు ఉర్దూయే బోధనాభాష కావడంవల్ల తెలుగు భాషాభివృద్ధికి అవకాశం లేదు. ఆ రోజులలో హైదరాబాదు రాష్ట్రం ఒక ప్రత్యేకమైన ద్వీపకల్పంగా మారి అక్కడ నివసించే ప్రజలను ఇతర ప్రపంచం నుండి వేరు చేసింది. (నిజాం రాజ్యంలో సంస్కృతి సంప్రదాయాలన్నీ ఇతర ప్రాంతాలకంటే భిన్నంగా ఉండేవి.)
అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు తెలంగాణలో అక్షరాస్యత చాలా తక్కువ. సంస్కృతాంధ్ర పండితులు, కవులు తిండికి, నివాసానికి కూడా డబ్బుల్లేక పల్లెటూళ్ళలో బాధలు పడ్డారు. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకొని తమ జీవనం సాగించారు. ఈ విధంగా తెలుగు భాషా వికాసానికి తెలంగాణా ప్రాంతంలో గ్రహణము పట్టింది.

Exam Tips:

a) కారణాలను పాయింట్లుగా రాయండి: ఉర్దూను రాజభాషగా, బోధనాభాషగా రుద్దడం; నిజాం ప్రభుత్వం గ్రంథాలయాలు, సభలపై ఆంక్షలు పెట్టడం; "ఆంధ్ర" పేరుతో సాగే ఉద్యమాలపై శత్రుభావం; అక్షరాస్యత తక్కువ ఉండటం.
b) బ్రిటిష్ పాలిత ప్రాంతాలతో పోలిక (అక్కడ గ్రంథాలయాలపై నిషేధం లేదు) చెప్పడం ఈ ప్రశ్నకు ముఖ్యం.
c) సురవరం ప్రతాపరెడ్డి వర్ణించిన "వాగ్బంధన శాసన పైశాచిక తాండవం" అనే మాటను తప్పక ఉటంకించండి.

 

Question 2: కొమర్రాజు లక్ష్మణరావు సాహిత్యసేవను తెలియజేయండి.

Answer:

తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతులపై జరుగుతున్న దాడిని గమనించి ఈప్రాంతంలో సాహిత్య వికాసానికి కృషి చేసినవారిలో ముఖ్యులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన గొప్ప పరిశోధకుడు, తెలుగు భాషా వికాసానికి అపారమైన కృషి చేసిన మేధావి. నిష్కళంక దేశభక్తుడు. ఆ రోజులలో చాలామంది ఆంధ్ర ప్రాంతం వారికి తెలంగాణ గురించి సరైన అవగాహన లేదు. లక్ష్మణరావు మునగాల సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. మునగాల సంస్థానాధీశ్వరులకు తెలంగాణా ప్రాంతంతో సంబంధాలు ఉండేవి. వారిద్దరూ హైదరాబాదుకు వస్తూపోతూ ఉండే వారు.
లక్ష్మణరావు కృషికి మునగాల రాజా తోడ్పాటు అందించారు. ఆ కారణంగా 1900వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము స్థాపితమైంది. తరువాత 1904వ సంవత్సరంలో రాజరాజనరేంద్ర భాషా నిలయం హనుమకొండలో స్థాపితమైనది. ఆ తరువాత వరంగల్లులో శబ్దానుశాసనాంధ్ర భాషా నిలయం స్థాపితమైంది. లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కూడా 1900 సంవత్సరంలోనే హైదరాబాదులో స్థాపితమైంది. లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, మునగాల రాజాగారి తోడ్పాటుతో తెలంగాణలో సాహిత్య వికాసానికి, సాంస్కృతిక చైతన్యానికి గట్టి పునాదులను నిర్మించారు. తరువాత క్రమక్రమంగా తెలంగాణాలో అనేక గ్రంథాలయాల ద్వారా సాహిత్య సభలు జరిగాయి.
కవి పండితులను చైతన్య పరిచి తెలుగు భాషాభ్యుదయానికి కృషి చేశాయి.
లక్ష్మణరావు ప్రోత్సాహంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావులు ఈ కృషిలో పాలుపంచుకున్నారు. మొత్తంమీద ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావానికి లోనై తన మాతృభాషకు అంత ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితి ఆనాటి తెలంగాణలో కనిపించింది. పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు గ్రంథాలయాలు, పత్రికలు, గ్రంథమాలలు స్థాపించి తెలంగాణను మేలుకొల్పారు. వీరి కారణంగా యువకులు సాహిత్య వికాసానికి కంకణబద్ధులైనారు.
తెలంగాణ సాహిత్యరంగంలో నవయుగోదయమైనది. కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించిన 1900 సంవత్సరము నుంచి ఈ నవ యుగము ప్రారంభమై 1948 సెప్టెంబరులో జరిగిన పోలీసు చర్య వరకు సాగింది. చరిత్ర పరిశోధన, భాషాపరిశోధన, విజ్ఞాన వాఙ్మయాభివృద్ధి, వచన వాఙ్మయ ప్రగతి అనేవి కొమర్రాజు లక్ష్మణరావుగారి ఆశయాలు. ఈ ఆశయాలకనుగుణంగా వారు తమ అనుయాయులను తీర్చిదిద్దారు. వారిలో ముఖ్యులు ముగ్గురు. వారు మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి. వీరు ముగ్గురూ తెలంగాణలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి తీవ్రమైన కృషి చేశారు.

Exam Tips:

a) లక్ష్మణరావు స్థాపించిన సంస్థలను క్రమంగా రాయండి: కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం (1900), విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి, రాజరాజనరేంద్ర భాషా నిలయం.
b) ఆయన శిష్యులు మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు పేర్లు తప్పక చెప్పండి.
c) తెలంగాణ సాహిత్యంలో నవయుగోదయం 1900తో ప్రారంభమైందనే వాక్యంతో ముగించండి.

 

II. సంగ్రహరూప ప్రశ్నలు

Question 1: తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంత విశిష్టత ఎట్టిది ?

Answer:

తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణా ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. భారత, రామాయణ, భాగవతాలకు తెలంగాణా ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. భాస్కరరామాయణము రాసిన భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుఁడు, అయ్యలార్యుడు, ఆంధ్ర మహాభాగవతము రాసిన పోతనామాత్యుడు, మార్కండేయ పురాణం రాసిన మారన, మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యము యయాతిచరిత్రను రచించిన పొన్నగంటి తెలగన్న, జాను తెనుగులో రచన చేయాలని చెప్పి బసవపురాణాన్ని రాసిన పాల్కురికి సోమనాథుడు మొదలైన వారంతా తెలంగాణా ప్రాంతం వారే. ప్రాచీన సాహిత్యం తెలంగాణాలో వర్ధిల్లింది. తెలంగాణా ప్రాంతంలో తెలుగు పాండిత్యం లేదని, తెలుగు సంస్కృతికి చోటులేదని, కొన్ని వర్గాలలో వ్యాపించిన అభిప్రాయం సరైంది కాదు.
తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో తాళపత్ర గ్రంథాలు దొరికాయి. దూపాటి వేంకటరమణాచార్యులు తెలంగాణా ప్రాంతమంతా తిరిగి ఎన్నో శాసనాలను, నూర్లకొద్ది తాళపత్ర గ్రంథాలను సంపాదించి సాహిత్య పరిషత్తుకు అప్పగించారు. వీటన్నిటిద్వారా తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదని తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల దీపాలు దేదీప్యమానముగా ప్రకాశించకపోయినా మిణుకుమిణుకుమని వెలుగుతూనే ఉన్నాయి. హైదరాబాదు నగరంలోని పరిస్థితి ఎట్లున్నా పల్లె ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాలు అంతరించలేదని తెలుస్తుంది.

Exam Tips:

a) భాస్కరుడు, పోతన, మారన, పొన్నగంటి తెలగన్న, పాల్కురికి సోమనాథుడు వంటి ప్రసిద్ధుల పేర్లను వారి రచనలతో జతచేసి రాయండి.
b) తాళపత్ర గ్రంథాలు, శాసనాల సేకరణ (దూపాటి వేంకటరమణాచార్యులు) వల్ల తెలంగాణలో తెలుగు దీపం ఆరిపోలేదని నిరూపించడం ఈ ప్రశ్నలో కేంద్రాంశం.

 

Question 2: తెలుగుభాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలుపండి.

Answer:

నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషా సంస్కృతులు నిరాదరణకు గురైనాయి. అటువంటి పరిస్థితులలో గద్వాల, వనపర్తి, ఆత్మకూరు మొదలైన సంస్థానాలు తెలుగు భాషా సంస్కృతుల రక్షణకు విశేషమైన కృషిచేశాయి. ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఈ సంస్థానాల ఆదరణి వల్ల సాంస్కృతిక సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రాంతం నుంచి కవులు, పండితులు వచ్చి ఈ సంస్థానాలలో సన్మానాలు పొందేవారు. ఇటువంటి వారిలో తిరుపతి వేంకటకవులు కూడా ఉన్నారు.
అవధానాలు తెలంగాణా ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య భాషాపరమైన వంతెనలుగా పనిచేశాయి. వీటికితోడు కొన్ని నాటక సంఘాలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో కొన్ని పట్టణాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. మైలవరము, సురభి మొదలైన నాటక సంఘాలు వరంగల్లు మొదలైన తెలంగాణా ప్రాంతాలలో నాటకాలను ప్రదర్శించి ఈ రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక సమైక్యతను బలపరిచాయి.

Exam Tips:

a) గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానాల పేర్లు తప్పక రాయండి.
b) ఆంధ్ర కవులకు సన్మానాలు, అవధానాలు, నాటక సంఘాల (మైలవరం, సురభి) ప్రదర్శనలు అనే మూడు సాంస్కృతిక వంతెనలను విడివిడిగా చెప్పండి.

 

Question 3: సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి.

Answer:

సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి. ఎల్ పట్టభద్రులు.
న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు.
ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండ పత్రికా సంపాదకునిగా వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు విజ్ఞాన నిక్షేపాలవంటివి. రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. ప్రతాపరెడ్డి మంచికవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. తమ రచనల ద్వారా తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేశారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణలో మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చారు.

Exam Tips:

a) సురవరం ప్రతాపరెడ్డి ఇచ్చిన బహుముఖ సేవను విభజించి రాయండి: గోలకొండ పత్రిక సంపాదకత్వం, పరిశోధనా గ్రంథాలు (ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు), కథలు, గోలకొండ కవుల సంచిక.
b) "గోలకొండ కవుల సంచిక" ద్వారా మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చాడని ప్రత్యేకంగా రాయండి.

 

Question 4: తెలంగాణ ప్రాంతంనుండి వెలువడిన పత్రికల గురించి వివరించండి.

Answer:

తెలంగాణాలోని మొదటి పత్రిక హితబోధిని 1818వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఒక సంవత్సరం మాత్రమే నడిచింది. తరువాత 1920వ సంవత్సరంలో తెనుగు అనే పత్రిక ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వంలో వరంగల్లు జిల్లా ఇనుగుర్తి నుంచి, నీలగిరి అనే పత్రిక షబ్నవీసు నరసింహారావు సంపాదకత్వంలో నల్లగొండ నుండి నడిచాయి. ఈరెండు పత్రికలూ ఐదేండ్లు మాత్రమే నడిచాయి. 1925వ సంవత్సరంలో గోలకొండ పత్రిక అర్ధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1947లో దినపత్రికగా మారి సుమారు ఇరువై సంవత్సరాలు నడిచింది.
సుజాత అనే మాసపత్రిక పి.ఎన్. శర్మ సంపాదకత్వంలో వెలువడింది.
ఆంధ్రాభ్యుదయం అనే పత్రిక హన్మకొండ నుంచి, దేశబంధు అనే పత్రిక హైదరాబాదు జిల్లా తూప్రాన్ నుండి, తెలుగు తల్లి, విభూతి, దివ్యవాణి అనే తెలుగు పత్రికలు సికిందరాబాదు నుండి వెలువడినాయి.
తరువాత 1945 లో అడవి బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్, బి.ఆర్. చారి సంపాదకత్వంలో తెలంగాణా అనే రెండు దినపత్రికలు వెలువడినాయి.
సికింద్రాబాదు నుంచి ఆంధ్ర కేసరి, ఆంధ్రవాణి అనే వార పత్రికలు, తరణి అనే దినపత్రిక వచ్చింది. శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్లు నుండి వెలువడింది. ఈ విధంగా తెలంగాణలో నూతన యుగోదయమై అనేకమంది రచయితలు ఆవిర్భవించారు. ఈ పత్రికలన్నీ జాతీయోద్యమ ప్రభావితాలై నవీన వాఙ్మయ నిర్మాణానికి దోహదం చేశాయి.

Exam Tips:

a) పత్రికలను సంవత్సరాల క్రమంలో రాయండి (హితబోధిని, తెనుగు, నీలగిరి, గోలకొండ, మీజాన్, తెలంగాణ); ప్రతిదానికి సంపాదకుని పేరు, ప్రదేశం జతచేయండి.
b) సంవత్సరాలను పాఠ్యపుస్తకంలో ఉన్నట్లే రాయండి; పత్రికల పేర్లు తారుమారు చేయకండి.

 

III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు

Question 1: దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది ?

Answer:

వరంగల్లు జిల్లా దేశాయిపేట.

Exam Tips:

a) రామానుజరావు స్వగ్రామం వరంగల్లు జిల్లా దేశాయిపేట; జిల్లా పేరు కూడా రాయండి.
b) ఇలాంటి ప్రశ్నల్లో ఊరి పేరు స్పెల్లింగ్ సరిగా ఉండాలి.

 

Question 2: రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది ?

Answer:

శోభ

Exam Tips:

a) రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక "శోభ"; ఇది వరంగల్లు నుండి వెలువడింది.
b) "శోభ" పత్రికను "సుజాత"తో కలపకండి (సుజాత పి.ఎన్. శర్మ మాసపత్రిక).

 

Question 3: రామానుజరావు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ ఏది ?

Answer:

ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.

Exam Tips:

a) ఆయన అధ్యక్షుడిగా పనిచేసిన సంస్థలు రెండు: ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి; రెండింటినీ రాయండి.
b) ఒక్క పేరు మాత్రమే రాస్తే అసంపూర్ణ సమాధానమవుతుంది.

 

Question 4: రామానుజరావు రాసిన ఖండ కావ్యసంపుటి పేరేమిటి ?

Answer:

పచ్చతోరణం.

Exam Tips:

a) రామానుజరావు ఖండకావ్య సంపుటి "పచ్చతోరణం"; పేరును యథాతథంగా రాయండి.
b) ఖండకావ్యం అంటే చిన్న కథాంశాలతో కూడిన కావ్యం అనే అర్థాన్ని గుర్తుంచుకోండి.

 

Question 5: కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం ఏ సంవత్సరంలో స్థాపించారు ?

Answer:

క్రీ. శ. 1900

Exam Tips:

a) కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపన సంవత్సరం పాఠంలో 1900గా ఇవ్వబడింది; అదే రాయండి.
b) భాషా నిలయం స్థాపకుడు కొమర్రాజు లక్ష్మణరావు అని కూడా ప్రస్తావిస్తే మంచిది.

 

Question 6: మున్షీ ప్రేమచంద్ కథలను మొదటిసారి తెలుగులోకి అనువదించింది ఎవరు ?

Answer:

మాడపాటి హనుమంతరావు.

Exam Tips:

a) ప్రేమచంద్ కథలను తెలుగులోకి తొలిసారి అనువదించినవారు మాడపాటి హనుమంతరావు.
b) ఆయన పేరును లక్ష్మణరావు శిష్యుల్లో ఒకరిగా గుర్తుంచుకోండి.

 

Question 7: తెలంగాణాలోని మొదటి పత్రిక ఏది ?

Answer:

హితబోధిని.

Exam Tips:

a) తెలంగాణ ప్రాంతంలో మొదటి పత్రిక "హితబోధిని" అని పాఠం చెబుతోంది; అది ఒక సంవత్సరం మాత్రమే నడిచిందని గుర్తుంచుకోండి.
b) తరువాతి పత్రికలు (తెనుగు, నీలగిరి, గోలకొండ) తో గందరగోళం పడకండి.

 

Question 8: ‘మీజాన్’ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ?

Answer:

అడవి బాపిరాజు.

Exam Tips:

a) "మీజాన్" పత్రిక అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడింది (1945); అదే సంవత్సరం బి.ఆర్. చారి సంపాదకత్వంలో "తెలంగాణ" దినపత్రిక వచ్చింది.
b) రెండు పత్రికల సంపాదకుల పేర్లను తారుమారు చేయవద్దు.

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 12 Telugu Chapter 02 Telangana Sahiti Vikasam

Accessing Chapter 02 Telangana Sahiti Vikasam Solutions

Explore reliable textbook solutions for Chapter 02 Telangana Sahiti Vikasam tailored for Class 12 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu.

Concept-Driven Answers for Class 12 Telugu

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 12 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 12 Telugu.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Chapter 2 తెలంగాణ సాహితీ వికాసం in printable PDF format for offline study on any device.