TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు

Download TS Board Solutions for Class 12 Telugu Chapter 04 Golconda Sweet Memories

Review structured textbook solutions for Class 12 Telugu Chapter 04 Golconda Sweet Memories. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access TS Board Solutions and Answers

View or download the dedicated Chapter 04 Golconda Sweet Memories solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

అభ్యాసం

I. వ్యాసరూప ప్రశ్నలు

Question 1: గోల్కొండ కోట ప్రత్యేకతలను వర్ణించండి.

Answer:

అంతఃపురంలోని వసతులు: గోల్కొండ కోట కాకతీయ ప్రోలరాజు కన్నా ప్రాచీనమైంది. కాకతీయులనాడు ఈ కోట కొత్త వైభవాన్ని సంతరించుకుంది. రాజ ప్రతినిధులకు స్థావరంగా, యువరాజుకు నివాసంగా, కాకతీయ సైన్యానికి నిలయంగా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా రూపొందింది. ఖుతుబుషాహీల కాలంలో ఈ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది.
మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి. మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది.
అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాలా లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.
ఉద్యానవనాల సౌందర్యం : గోల్కొండ కోటలో, చుట్టుప్రక్కల విశాలంగా, వివిధ రకాల పూలతోటలు ఉన్నాయి. అందులో ఆనాడు పుష్పించిన పూలపేర్లను ఈ రోజు పుస్తకాలలో చదవవలసిందే గాని అవి ఎలా ఉండేవో ఊహించలేము. ఆ పుష్పజాతులు అంతరించిపోయాయి. అంతఃపురంలో పెద్దకోనేరు, బయట “కటోర హవుజు” ఉన్నాయి. ఇందు ప్రతిరోజు నీటిని, రోజా పూవులను నింపేవారు. కటోరా హవుజు రాణీవాసపు స్త్రీలకు జలక్రీడా “స్థలం. దానిని అక్కడ ఉండే స్త్రీలు స్నానాలు జేయడానికి, ఈదులాటకు, నౌకా విహారం చేయడానికి ఉపయోగించేవారు. కటోరా హవుజు ఇప్పటికి ఉంది. కాని అంత శుభ్రంగా లేదు.
గోలకొండ కోటలో విశాలమైన, అందమైన రాజోద్యాన వనాలు, పుర ఉద్యానవనాలు ఉండేవి. అవి ఇంద్రలోకంలోని నందనవనాన్ని గుర్తు చేసే విధంగా ఉండేవి.
సాయంకాల సమయములో కవులు, పండితులు ఆ పురోద్యానవనాలలో గుంపులు గుంపులుగా కూర్చుండి సారస్వత చర్చలు, కవితా గోష్ఠులు చేసేవారు. నగీనాబాఘ్ అనే ఉద్యానవనం చారిత్రక ప్రసిద్ది కలిగినది.
కోటలో ఉన్న భవనాలు : కోటలో అంతఃపురాలు, సభాభవనాలు, కార్యాలయాలు, జలాశయాలు, క్రీడామైదానాలు మాత్రమే గాక సైనిక సమూహాలు నివసించే ఇండ్లు, అధికారుల నివాసస్థానాలు, పారిశ్రామికుల ఇండ్లు, పండిత, పామర నాగరికుల ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు మరుగుదొడ్లు, మురుగు నీరుపారే వసతులు, స్నానపు గదులు, వాటికి వేడి, చల్లనీటి ఏర్పాట్లు మొదలైన సామాజిక ఆరోగ్యానికి అవసరమైన ఇతర వసతులు కల్పించబడ్డాయి.
ఆయుధ కర్మాగారాలు, టంకశాలలు, సైనిక శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు, వైద్యశాలలు, సత్రాలు, సైనిక సమూహ ప్రణాళికా రచన, పరిశీలన స్థావరాలు ఉండేవి. ఖుతుబుషాహీల టంకశాల, భాండాగారము ఈనాటికీ “ఖజాన బిల్డింగు” అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖవారి ఆధీనంలో ఉంది. దానిని ఆనుకొని ఖుతుబుషాహీల ఆయుధాగారము ఉండేది. దానికి ఆనుకొని ఉన్న భవనాలలో సైనిక ప్రజా పరిపాలనాధికారులుండే గృహాలు ఉండేవి. వాటిని దారికి ఇరువైపులా అందమైన వరుసలలో నిర్మించారు.
రాతిఫలకం విశేషత : రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోటలో రాజాంతఃపురాలను దాటిపోతే భాండాగారాలు, తుపాకి మందుగుండు నిలువజేసే గదులు, జైలుగదులు కనిపిస్తాయి. బాలాహిస్సారుకు పోయేదారిలో మస్జిదు, మందిరం ఒకదాని పక్కన మరొకటి ఉంటాయి.
ఖుతుబుషాహీల మత సహనానికి సజీవ సాక్ష్యంగా ఈనాటికీ అవి కనిపిస్తాయి. “బాలా హిస్సారు” కు పోయే దారిలో రామదాసు చెఱశాల అని ఒక రాతి గుహను చూపిస్తారు. అందులో ఉన్న చలువరాతిపై శ్రీరాముని ఆకారము రామదాసు చెక్కినదే అని కూడా అంటారు. ఇది రామదాసున్న బందీఖాన యని చెప్పు ఆధారాలు లేవు. కాళ్లు చేతులు సంకెళ్ళతో బంధించబడిన గోపన్న ఉలి సుత్తి లేకుండా శిలపై రాముని చిత్రం చెక్కడం నమ్మదగిన విషయం కాదు.

Exam Tips:

a) కోట ప్రత్యేకతలను శీర్షికలుగా విభజించి రాయండి: అంతఃపుర వసతులు, నీటి ఏర్పాట్లు (ఎనిమిది బావులు, దుర్గమ్మ చెరువు), ఉద్యానవనాలు (కటోరా హవుజు, నగీనాబాఘ్), భవనాలు, ఖజానా బిల్డింగ్, రాతిఫలకం, రామదాసు చెఱశాల.
b) రాతిఫలకంపై చప్పట్లు కొడితే అంతఃపురంలో వినిపించడాన్ని, మసీదు–మందిరం పక్కపక్కనే ఉండటం (మత సహనం) వంటి విశేషాలను చేర్చండి.

 

Question 2: ఖులీఖుతుబ్ షా సమాధుల నిర్మాణ విశేషాలను తెలుపండి.

Answer:

గోల్కొండ దుర్గమునకు పడమర సుమారు మైలుదూరంలో ఒక ఎత్తైన సహజసుందరమైన మైదానముంది. ఆ ప్రదేశములో ఖుతుబుషాహీ పాలకుల సమాధులున్నాయి. ఈ ప్రదేశములో ఫలాలతో, పుష్పాలతో నిండిన తోటలుండేవి. కొన్ని ఈనాటికీ ఉన్నాయి. ఈ సమాధుల చుట్టు ఎత్తైన రాతి గోడ ఉంది. ఇందులో ఉన్న సమాధులలో కొన్ని ఖుతుబుషాహి రాజులవికావు. వీటిలో ప్రేమావతి తారామతి, రాజవైద్యుని సమాధులు మాత్రమే గాక రాజాదరణ పొందిన వేరొకరి సమాధికూడా ఉంది. రాజు బంధువులని చెప్పబడేవారి సమాధులు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. మహమ్మదు ఖులీ ఖుతుబుషా సమాధి నిర్మించిన పద్ధతికన్న జమీదు ఖులీ గోరి నిర్మించిన పద్ధతి వేరు. రెండు పర్ష్యా దేశపు నిర్మాణ రీతులనే విశేషంగ అనుకరించి నిర్మించారు.
ఇబ్రహీము ఖులీఖుతుబుషా సమాధి కూడా పెద్దదే. అందలి శిల్పవిజ్ఞానము, నిర్మాణరీతులు క్రొత్తపుంతలు తొక్కినవి. దాని దగ్గరనే మహమ్మదు ఖుతుబుషా సమాధి ఉంది. సమచతురశ్రమగు ఉన్నత వేదికపై అత్యంత సుందరంగ కట్టబడిన బ్రహ్మాండమైన కట్టడమిది. అందులోని శిల్పనిర్మాణ చాతుర్యం హిందూ, ముస్లిం, ఇండో, ఈరానియన్ శిల్ప సాంస్కృతుల కలయికకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అందులోని రాతి పుష్పాలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని వాటిని ధ్వంసం చేశారు. అయినా అవి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే ఉన్నాయి.
మహమ్మదు ఖుతుబ్ షా భాగ్యనగర నిర్మాత. గుల్జారుహౌజు, మక్కా మసీదు, చార్మినార్ వంటి విఖ్యాత కట్టడాలు ఇతను ప్రారంభించినవే. దక్షిణాపథములో ఉర్దూ భాషకు ఇతన్ని పిత అంటారు. అతని సమాధివద్ద ఈనాటికి ప్రార్థనలు, మత కర్మకాండలు మాత్రమే గాక ఉర్దూ దినం, ఖుతుబుషాహి దినం జరుపుతారు. ఈ సందర్భంగా పండితులతో సారస్వతోపన్యాసములు జరుగుతాయి. ఆ దినాలలో అక్కడ చరిత్ర సంస్కృతులను గురించిన చర్చలు జరుగుతాయి. ఇతని భార్య పేరు హయ్యతు బట్టీ బేగం, ఈమెకు ఈ వంశ చరిత్రలోను గోల్కొండ సంస్కృతిలోను ఒక విశిష్ట స్థానముంది. ఆమె ఖుతుబుషాహీ రాజులలో వరుసగ ఒకనికి కూతురు.
వేరొకనికి భార్య, మరొకనికి తల్లి. ఈమెకు బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది. దీని నిర్మాణ పద్ధతికూడా విశిష్టమైనది. అబ్దుల్లా ఖుతుబుషా సమాధి చాల పెద్దది. దాని నిర్మాణ పద్ధతికూడా విభిన్నమైనది. దానిని డబుల్ డోల పద్ధతి అంటారు. దీనిలో పైకి కనిపించే గుమ్మటమే గాక దానిలోన కూడా ఎక్కువ నేర్పు గల మరొక గుమ్మటముంది.
ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు. వీటిని చూడడానికి తండోపతండములుగా జనాలు నేటికి చాలా మంది వస్తుంటారు. విదేశీయులు సైతం ఈ సమాధులను చూసి ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందుతారు. చనిపోయిన రాజుల భౌతిక దేహాలను, వారి బంధువుల శవములను ఇక్కడికి తెచ్చి చివరిస్నానము చేయిస్తారు. అంత్య క్రియలు చేయడానికి ఇక్కడ ఒక చిన్న అందమైన కట్టడముంది. ఈ రాజులు షియా సంప్రదాయానికి చెందినవారు. వారు పన్నెండు మంది ఇమాములను పూజిస్తారు. కావున ఈ కట్టడంలో పన్నెండు కోణాలు, పన్నెండు మెట్లు, పన్నెండు చెంబులు, పన్నెండు ఆకుల ఆకారాలు, ఇలా అన్నీ పన్నెండు ఉంటాయి. ఇది చూడవలసిన చక్కని చిన్న కట్టడం. ఈ సమాధులు అత్యున్నతాలు, అపూర్వాలు, అతిసుందరాలు. ఒకప్పుడివి సర్ఫేఖాస్ (నిజాం నవాబు) ఆస్తి. ఆపై కేంద్రపురావస్తు పర్యవేక్షణలోకి వచ్చాయి. ఇప్పుడవి పురావస్తు శాఖవారి అధీనములో ఉన్నాయి. సుమారు ఎనిమిది లక్షల వ్యయముతో ఈ సమాధులను, పెద్ద ఉద్యానవనములను, క్రీడాసరోవరములను, నౌకా విహారావకాశములను, రమణీయ ఆరామాలను, విశ్రాంతి భవనాలను, పురావస్తు ప్రదర్శనశాలలను, మిరుమిట్లుగొలుపు దీపమాలికలను, జలయంతరాలను, అపురూపమైన పూదోటలను ఏర్పాటు జేసి, దీనిని భారతదేశములోనే ప్రథమ శ్రేణికి చెందిన యాత్రిక కేంద్రముగ రూపొందించే ఆలోచన ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి తప్పక దీనిని అభివృద్ధి పరచాలని ఎందరో ఒప్పుకుంటారు.

Exam Tips:

a) సమాధుల విశేషాలలో ముఖ్యమైనవి: ఎత్తైన రాతి గోడ, ఖుతుబ్‌షాహీ రాజులతో పాటు ఇతరుల సమాధులు, పర్షియన్ నిర్మాణ రీతి, అబ్దుల్లా కుతుబ్‌షా సమాధి యొక్క డబుల్ డోమ్ పద్ధతి.
b) పన్నెండు అనే సంఖ్యతో నిర్మించిన అంత్యక్రియల కట్టడాన్ని (షియా సంప్రదాయం కారణం) తప్పక రాయండి.

 

II. సంగ్రహరూప ప్రశ్నలు

Question 1: గోల్కొండ కోటలోని నీటి ఏర్పాట్లను తెలుపండి.

Answer:

గోలకొండ కోటలో అనేక సుందర భవనములు నిర్మించబడ్డాయి. అందులోని ఏర్పాట్లు ఈనాటికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రాణులు నివసించే అంతఃపురం అన్నిరకాల భద్రతా ఏర్పాట్లతోపాటు సర్వాంగ సుందరంగా ఉంది. మురికినీరు, వర్షపునీరు బైటికి పోవడానికి చేసిన ఏర్పాట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయిదారు అంతస్తుల మేడలు. ప్రతి అంతస్తుకు అవసరమయిన శుభ్రమైన నీరు రావడానికి, మురికి నీరు బైటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు చేశారు. మూడు వందల సంవత్సరాలు గడిచినా అవి ఇంకా నిలిచి ఉన్నాయి. కోటలో నీటి ఏర్పాటుకు వివిధ స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులున్నాయి.
మొదటి బావి అన్నిటికన్న క్రిందస్థాయిలో ఉంది. అది అన్నింటికన్న పెద్దది. కోటకు పడమర ఆరుమైళ్ళ దూరంలో మొదటి బావికి సమాన స్థాయిలో “దుర్గమ్మ చెరువు” ఉంది. అది చాల లోతుగా, విశాలంగా, శుభ్రంగా ఉండి మంచి నీటితో కొండల మధ్య ఉంది. మొదటి బావి నుంచి రెండవ బావికి ఆపై ఒకదానినుంచి వేరొకదానికి నీరు నింపబడేలా ఏర్పాట్లు చేశారు. అలా నింపడానికి ఉపయోగించే పర్ష్యా ఛత్రాలను తిప్పడానికి మానవులును, పశువులును ఉపయోగించేవారు.

Exam Tips:

a) నీటి ఏర్పాట్లలో ముఖ్యాంశాలు: ఎనిమిది బావులు వివిధ స్థాయిలలో, మొదటి బావి అతి పెద్దది, దుర్గమ్మ చెరువు నీటి వనరు, పర్షియన్ చక్రాలతో నీరు ఎగువకు ఎక్కించడం.
b) మురికినీరు పోయే శాస్త్రీయ ఏర్పాట్లు మూడు వందల ఏళ్ల తరువాత కూడా నిలిచి ఉన్నాయన్న విషయం ముగింపుగా రాయండి.

 

Question 2: ‘పురానపుల్’ నిర్మించుటకు గల కారణాలు ఏవి ?

Answer:

భాగ్యమతి ప్రేమ వలలో చిక్కుకున్న నవయువకుడు, యువరాజు మహమ్మదు ఖులీ కుతుబ్షా పొంగి పొరిలే ముచుకుందా నదిని తన గుర్రంతో దాటి ఆవలి తీరానికి సురక్షితముగ జేరుకున్నాడు. అలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిలోకి వెళ్ళిన తమ కుమారున్ని చూసి అతని తల్లిదండ్రులు మహమ్మదు ఇబ్రహీం ఖుతుబుషా (మల్కిభరాముడు), అతని భార్య తల్లడిల్లిపోయారు. ఇటువంటి ప్రమాదం మళ్ళీ రాకూడదని మూసీనదిపై రాజ దంపతులు పురానపుల్ను నిర్మించారు. అది ఇప్పటికి ప్రజోపయోగకరంగ నిలచి ఉంది. భాగ్యమతి పేరు మీదనే హైద్రాబాదు నిర్మించబడింది.

Exam Tips:

a) కారణం కథగా రాయండి: భాగమతి ప్రేమ కోసం యువరాజు మహమ్మద్ ఖులీ ప్రమాదకరమైన ముచుకుందా నదిని గుర్రంతో దాటడం → తల్లిదండ్రుల ఆందోళన → పురానపుల్ నిర్మాణం.
b) నిర్మించినవారు ఇబ్రహీం కుతుబ్‌షా దంపతులు అని, హైదరాబాదు భాగమతి పేరుమీద వెలిసిందని చెప్పండి.

 

Question 3: గోల్కొండ కళాకారుల వైశిష్ట్యాన్ని వివరించండి.

Answer:

రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతః పురంలోకి వినిపిస్తుంది. ఇది జహంగీరు చక్రవర్తి న్యాయ ఘటికాయంత్రం కంటే గొప్ప విషయం. కోట పడమటి ద్వారాన్ని బంజార దర్వాజ అంటారు. స్థానికముగ లభించే తెల్లటి గ్రానైటురాయితో ఈ కోటను నిర్మించారు. తుపాకి గుండ్లను కూడా బంతులలాగా తిరుగ గొట్టేంత గట్టితనమున్న రాయి అది. ఆ గట్టితనమును కొట్టలేకనే మొఘలులు ఈ కోట గోడలను, సొరంగముల ద్వారా కూల్చే ప్రయత్నం చేశారు. అయినా మూడు సార్లు విఫలులైనారు. తూర్పుభాగంలో ఉన్న బురుజును మాత్రము వారు కూల్చగలిగారు. కాని మరునాటి ఉదయం వరకే దానిని గోల్కొండవారు ఎప్పటిమాదిరి నిలబెట్టారు. అదిచూసి మొఘలులు ఆశ్చర్యపోయారు. ఆ బురుజు నిజమయిన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియదు. కాగితము పనితనమునకు అది ఒక పరాకాష్ట. గోల్కొండ కళాకారుల వైశిష్ట్యమునకు అదొక గొప్ప ఉదాహరణ.

Exam Tips:

a) కళాకారుల ప్రతిభకు ఉదాహరణలు: రాతిఫలకంపై ప్రతిధ్వని, కాగితం తో నిర్మించిన బురుజు మొఘలులను మోసం చేయడం.
b) బంజారా దర్వాజ, తెల్లటి గ్రానైట్ రాయి వంటి వివరాలతో సమాధానాన్ని విస్తరించండి.

 

Question 4: ఖజానా బిల్డింగ్లోని పురావస్తు ప్రదర్శనశాల విశేషాలను తెలుపండి.

Answer:

గోలకొండకోట కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి యాజమాన్యంలో, షంషీరుకోట్, ఖజాన బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి. వారు ఖజాన బిల్డింగును పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు. అందులో వివిధ శతాబ్దముల సంస్కృతులకు చెందిన సుందర శిల్పకళాఖండాలు, అమూల్యములైన శిలాశాసనాలు ప్రదర్శించబడుచున్నాయి. ఆ శిల్పసంపద, ఆనాటి సాంస్కృతీ, సామాజిక వైభవాలకు దర్పణంగా నిలుస్తుంది. ఆ పురావస్తుశాల పర్యవేక్షణకు ఒక అధికారి, కొంత సిబ్బంది నియమితులైనారు. దీని ప్రక్కనే షంషీరుకోట్ ఉంది. దానిలో ఆనాటి వివిధ ఆయుధాలు భద్రపరిచారు. వీటిని సాధారణంగా ప్రదర్శించరు. కాని ప్రదర్శించుట చాల అవసరం.

Exam Tips:

a) ప్రదర్శనశాల విశేషాలు: శిల్పకళాఖండాలు, శిలాశాసనాలు, వివిధ శతాబ్దాల సంస్కృతి; షంషీర్ కోట్‌లో ఆయుధాలు భద్రపరచారని కూడా చెప్పండి.
b) ఖజానా బిల్డింగ్ ఖుతుబ్‌షాహీల టంకశాల, భాండాగారం అని గుర్తుంచుకోండి.

 

III. ఏకపద/వాక్య సమాధాన ప్రశ్నలు

Question 1: భూపాలరావుకు తెలిసిన భాషలను పేర్కొనండి.

Answer:

తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్.

Exam Tips:

a) భూపాలరావుకు తెలిసిన భాషలు ఏడు: తెలుగు, సంస్కృతం, కన్నడ, మరాఠి, హిందీ, ఫ్రెంచి, డచ్; అన్నిటినీ రాయండి.
b) ఒక్క భాష వదిలినా అసంపూర్ణ సమాధానమవుతుంది.

 

Question 2: భూపాలరావు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి ఏ గ్రంథాన్ని రచించాడు ?

Answer:

దేవాలయ చరిత్ర

Exam Tips:

a) భూపాలరావు, రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి రాసిన గ్రంథం "దేవాలయ చరిత్ర".
b) గ్రంథం పేరును మహామంత్రి మాదన్న వంటి ఇతర పుస్తకాలతో కలపవద్దు.

 

Question 3: ‘గోల్కొండ మధురస్మృతులు’ పాఠం ఏ పుస్తకం లోనిది ?

Answer:

మహామంత్రి మాదన్న

Exam Tips:

a) ఈ పాఠం "మహామంత్రి మాదన్న" అనే పుస్తకం నుంచి తీసుకున్నది; పుస్తకం పేరు కచ్చితంగా రాయండి.
b) రచయిత భూపాలరావు అని కూడా జతచేయండి.

 

Question 4: సింహద్వారం నేలపైనున్న రాతిఫలకము ప్రత్యేకత ఏమిటి ?

Answer:

రాజాంతఃపురపు సింహద్వారంలో నేలపై ఉన్న రాతిఫలకమీద నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.

Exam Tips:

a) రాతిఫలకం ప్రత్యేకత: దానిపై నిలబడి చప్పట్లు కొడితే ప్రతిధ్వని అంతఃపురంలోకి వినిపిస్తుంది.
b) జహంగీరు న్యాయ ఘటికాయంత్రంతో పోలిక వచ్చే ప్రశ్నలో దీన్ని కూడా చేర్చండి.

 

Question 5: మొహర్రం పదవరోజున ఏ ఉత్సవాలు జరుగుతాయి ?

Answer:

బీబీకా ఆలం, ఏనుగు అంబారీ లంగరు ఉత్సవాలు.

Exam Tips:

a) మొహర్రం పదవరోజున జరిగే ఉత్సవాలు: బీబీకా ఆలం, ఏనుగు అంబారీ, లంగరు.
b) మూడు పేర్లనూ రాయండి; ఉత్సవాలు ప్రశ్నలో బహువచనం కాబట్టి ఒక్క పేరు చాలదు.

 

Question 6: ‘ఎనుగల చెట్టు’ గొప్పదనం తెలుపండి.

Answer:

గోలకొండ కోటలో ఎనుగల చెట్టు అని పిలువబడే ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. దీని చుట్టుకొలత సుమారు వంద అడుగులు. ఇంత పెద్ద చుట్టుకొలత ఉన్న జువ్విచెట్లు చాల తక్కువ.

Exam Tips:

a) ఎనుగల చెట్టు గోలకొండ కోటలోని పెద్ద జువ్వి చెట్టు, దాని చుట్టుకొలత సుమారు వంద అడుగులు; ఈ రెండు వివరాలను తప్పక చెప్పండి.
b) ఇంత పెద్ద జువ్వి చెట్లు అరుదని కూడా రాయండి.

 

Question 7: ‘డబుల్ డోల పద్ధతి’లో ఎవరి సమాధి నిర్మించారు ?

Answer:

అబ్దుల్లా కుతుబ్షా

Exam Tips:

a) డబుల్ డోమ్ (డబుల్ డోల) పద్ధతి అబ్దుల్లా కుతుబ్‌షా సమాధి నిర్మాణ విశేషం.
b) పైకి కనిపించే గుమ్మటం లోపల మరొక గుమ్మటం ఉండటమే దీని అర్థం అని కలిపి రాయండి.

 

Question 8: భాగ్యనగర నిర్మాత ఎవరు ?

Answer:

మహమ్మదు ఖుతుబ్ షా

Exam Tips:

a) భాగ్యనగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్‌షా; ఆయనే చార్మినార్, గుల్జార్ హౌజ్, మక్కా మసీదు వంటి నిర్మాణాలు ప్రారంభించాడని గుర్తుంచుకోండి.
b) ఆయన భార్య హయ్యతు బట్టీ బేగం అనే వివరం పాఠంలో వస్తుంది.

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 12 Telugu Chapter 04 Golconda Sweet Memories

Chapter Exercise Answers for Class 12 Telugu

Access structured TS Board textbook solutions for Chapter 04 Golconda Sweet Memories. Designed in alignment with the latest academic curriculum for Class 12 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Detailed Answer Guides for Chapter 04 Golconda Sweet Memories

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 04 Golconda Sweet Memories concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 12 Exams

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 04 Golconda Sweet Memories with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు is available for free on StudiesToday.com. These solutions for Class 12 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Telugu. You can access TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Telugu Study Material Chapter 4 గోల్కొండ మధుర స్మృతులు in printable PDF format for offline study on any device.