TS Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణగతిక శాస్త్రం

Step-by-Step Textbook Solutions for Class 11 Physics Chapter 13 Thermodynamics

Review structured textbook solutions for Class 11 Physics Chapter 13 Thermodynamics. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Chapter 13 Thermodynamics Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 11 Physics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: ఉష్ణ సమతాస్థితిని నిర్వచించండి. ఇది ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమానికి ఎలా దారితీసిందో తెలపండి.

Answer:

ఉష్ణ సమతాస్థితి : ఒక వ్యవస్థలోని స్థూలచరరాశులైన పీడనం, ఘనపరిమాణం, ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి, వాటి సంఘటన కాలంతోపాటు మారకుండా ఉంటే ఆ వ్యవస్థ ఉష్ణ సమతాస్థితిలో ఉంది అంటారు.
రెండు వ్యవస్థలు ఉష్ణ సమతాస్థితిలో ఉండాలంటే ఆ రెండు వ్యవస్థల ఉష్ణోగ్రతలు సమానంగా ఉండాలి. ఈ భావన ఆధారంగా ఉష్ణ గతిక శాస్త్ర శూన్యాంక నియమం రూపుదిద్దుకుంది.

Exam Tips:

a) ఉష్ణ సమతాస్థితి నిర్వచనం (స్థూల చరరాశులు కాలంతో మారవు) రాసి, 'రెండు వ్యవస్థల ఉష్ణోగ్రతలు సమానం' అనే శూన్యాంక నియమ భావనతో ముగించండి.

 

Question 2: కెలోరిని నిర్వచించండి. కెలోరి, ఉష్ణయాంత్రిక తుల్యాంకాల మధ్య గల సంబంధం ఏమిటి ?

Answer:

కెలోరి : ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1°C మేరకు పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని కెలోరిగా నిర్వచించారు.
ప్రామాణిక కెలోరి లేదా సగటు 15°C కెలోరి : ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను 14.5°C నుండి 15.5°C వరకు పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని సగటు 15°C కెలోరిగా నిర్వచించారు.
ఉష్ణయాంత్రిక తుల్యాంకము (J) : 1 కెలోరి ఉష్ణాన్ని జనింపచేయడానికి కావలసిన పని. J = 4.186 J/cal

Exam Tips:

a) కెలోరి నిర్వచనం (1 g నీటికి 1°C), 15°C కెలోరి నిర్వచనం (14.5°C → 15.5°C) రెండూ రాసి, J = 4.186 J/cal అని చివర చెప్పండి.

 

Question 3: a) శూన్యాంక నియమం
b) మొదటి నియమం వల్ల ఏ ఉష్ణగతిక చరరాశులు నిర్వచించడమైంది ?

Answer:

a) ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమం నుండి ఉష్ణోగ్రత మరియు ఉష్ణ సమతాస్థితి అన్న భావనలు రూపొందుకున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతను కొలవడం అన్న భావన రూపుదిద్దుకుంది.
b) ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం నుండి అంతరికశక్తి ∆U = ∆Q – ∆W వ్యవస్థ పని జరిగే మార్గంపై ఆధారపడక కేవలం వ్యవస్థ తొలిస్థితి (i) మరియు తుది స్థితి (f) పైనే ఆధారపడుతుంది అని స్పష్టం చేసింది.

Exam Tips:

a) శూన్యాంక నియమం → ఉష్ణోగ్రత భావన; b) మొదటి నియమం → అంతరిక శక్తి U (ΔU = ΔQ – ΔW) అని ఒక్కో వాక్యంలో రాయండి.

 

Question 4: పదార్థ విశిష్టోష్ణ సామర్థ్యాన్ని నిర్వచించండి. అది వేటి మీద ఆధారపడి ఉంటుంది ?

Answer:

విశిష్టోష్ణ సామర్ధ్యం (S) : ప్రమాణ ద్రవ్యరాశిగల పదార్థంలో ఏకాంక ఉష్ణోగ్రతా మార్పు కోసం అందజేసిన ఉష్ణరాశిని లేదా కోల్పోయిన ఉష్ణరాశిని విశిష్టోష్ణ సామర్థ్యము అంటారు.
విశిష్టోష్ణ సామర్థ్యం \( S = \frac{1}{\mathrm{~m}} \frac{\Delta \mathrm{Q}}{\Delta \mathrm{T}} \) ప్రమాణము J/kg-k
విశిష్టోష్ణ సామర్థ్యము ఒక వస్తువుకు సంబంధించిన భౌతిక స్థిరరాశి. ఇది పదార్థపు రసాయన సంఘటనముపై ఆధారపడును.

Exam Tips:

a) S = (1/m)(ΔQ/ΔT), ప్రమాణం J kg⁻¹ K⁻¹; పదార్థ స్వభావం (ద్రవ్యరాశిపై కాదు) పై ఆధారపడుతుంది అని చెప్పండి.

 

Question 5: మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యాన్ని నిర్వచించండి.

Answer:

మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యం : 1 గ్రామ్ మోల్ ద్రవ్యరాశిగల పదార్థానికి అందజేసిన ఉష్ణరాశి ∆Q మరియు దాని ఉష్ణోగ్రతలోని మార్పు ∆T కి గల నిష్పత్తిని మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యము అంటారు.
మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యము \( C = \frac{1}{\mu} \frac{\Delta \mathrm{Q}}{\Delta \mathrm{T}} \) J g-mol⁻¹ K⁻¹

Exam Tips:

a) మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యం C = (1/μ)(ΔQ/ΔT), ప్రమాణం J mol⁻¹ K⁻¹ అని సూత్రంతో రాయండి.

 

Question 6: ఒక ఘనపదార్థంలో ఒక డోలకం మొత్తం శక్తి ఎంత ?

Answer:

ఘనపదార్థంలో డోలకం మొత్తం శక్తి Eని దానికి గల స్థితిజ శక్తి PE మరియు గతిజశక్తి KE ల మొత్తంగా భావిస్తాము. డోలకం మొత్తం శక్తి E = PE + KE

Exam Tips:

a) డోలకం శక్తి E = KE + PE అని రాసి, ఘనపదార్థంలోని పరమాణువులను డోలకాలుగా భావిస్తామని ఒక వాక్యం జోడించండి.

 

Question 7: నీటి విశిష్టోష్ణం ఉష్ణోగ్రతతో పాటు మారడాన్ని తెలియచేసే గ్రాఫ్ను సూచించండి. ఇది దేనిని తెలియచేస్తుంది ?

Answer:

నీటి విశిష్టోష్ణ సామర్థ్యం నీటి ఉష్ణోగ్రతతో పాటు మారుతుంది. పటం నుండి 15°C వద్ద నీటి విశిష్టోష్ణ ధారణ సామర్థ్యాన్ని కెలోరీగా నిర్వచిస్తే 0°C నుండి 15°C వరకు కెలోరి పరిమాణం ఎక్కువ. 40°C వద్ద విశిష్టోష్ణ సామర్థ్యం అతి తక్కువ. 40°C నుండి ‘s’ విలువ క్రమంగా పెరుగుతూ సుమారు 60°C ప్రాంతంలో ‘S’ విలువ ఒక కెలోరిగా ఉంటుంది.

60°C నుండి 100°C అవధిలో ‘s’ విలువ కెలోరికన్నా ఎక్కువ.

Exam Tips:

a) గ్రాఫ్ గీయండి: 15°C వద్ద 1 cal/g°C; సుమారు 40°C వద్ద కనిష్ఠం, తర్వాత పెరుగుదల; ఇది విశిష్టోష్ణం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుందని సూచిస్తుంది.

 

Question 8: స్థితి చరరాశులను, స్థితి సమీకరణాన్ని నిర్వచించండి.

Answer:

స్థితి చరరాశులు : ఉష్ణయాంత్రిక శాస్త్రంలో ఒక వ్యవస్థ సమతాస్థితిని సూచించే పీడనము, ఘనపరిమాణము, ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి వంటి చరరాశులను స్థితి చరరాశులు అంటారు.
స్థితి చరరాశుల మధ్య సంబంధాన్ని సూచించే సమీకరణం PV = μ RT

Exam Tips:

a) స్థితి చరరాశులు (P, V, T, m) మరియు స్థితి సమీకరణం PV = μRT; ప్రతి చరరాశికి ఒక్క వాక్యం రాయండి.

 

Question 9: 100% దక్షతతో పనిచేసే ఉష్ణయంత్రాన్ని తయారుచేయడం సాధ్యం కాదు.
ఎందుకు ?

Answer:

ఉష్ణయంత్రం సామర్ధ్యము \( η = 1 - \frac{\mathrm{Q}_2}{\mathrm{Q}_1} \) ఇందులో పరిసరాలకు ఇచ్చిన ఉష్ణం Q₂ = 0 అయితే ఆ ఉష్ణయంత్రం 100% దక్షత కలిగి ఉంటుంది లేదా కొలిమి ఉష్ణోగ్రత, (Q₁ = ∞) అనంతము కావాలి. ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం నుండి ఇటువంటి పరిస్థితులు సాధ్యపడవు అని తెలుస్తుంది. కాబట్టి ఉష్ణ యంత్రాలను 100% దక్షతతో తయారుచేయలేము.

Exam Tips:

a) η = 1 – Q₂/Q₁ = 1 అవ్వాలంటే Q₂ = 0 లేదా T₁ → ∞ కావాలి; ఈ రెండూ రెండవ నియమం ప్రకారం సాధ్యం కాదని రాయండి.

 

Question 10: వేసవికాలంలో సైకిల్ ట్యూబ్ నుంచి గాలిని తొలగిస్తున్నప్పుడు ఆ గాలి చల్లగా అనిపించడానికి కారణం ఏమిటి ?

Answer:

సైకిల్ ట్యూబ్ నుండి వేగంగా గాలి తొలగించేటపుడు అది స్థిరోష్ణక వ్యాకోచం చెందుతుంది. కాబట్టి వాయువు కొంత పని చేస్తుంది. \( W = \frac{\mu R (T_1 - T_2)}{\gamma - 1} \) ఈ పనికి కావలసిన శక్తి వ్యవస్థ నుండే పొందటం వల్ల తుది ఉష్ణోగ్రత T₂ తగ్గుతుంది.

Exam Tips:

a) స్థిరోష్ణక వ్యాకోచంలో వాయువు పని చేస్తుంది కానీ ఉష్ణం అందదు; అంతరిక శక్తి తగ్గి ఉష్ణోగ్రత తగ్గుతుంది అని చెప్పండి.

 

Question 11: ఒక మోటారు వాహనాన్ని ఏటవాలు రోడ్డుపై దిగువకు స్థిరవడితో ప్రయాణం చేసేటట్లు బ్రేకులను ఉపయోగిస్తే బ్రేక్ డ్రమ్ములు ఎందుకు వేడెక్కుతాయి ?

Answer:

ఏటవాలు మార్గంలో స్థిర వడితో కిందికి ప్రయాణం చేయడానికి గురుత్వ త్వరణ అంశ (g Sin θ కి) సమానమైన మంద త్వరణాన్ని ప్రయోగించాలి. ఇందుకోసం కారు చలనదిశకు వ్యతిరేకంగా కొంత మందబలము F = mg sinθ ను బ్రేకులు
ప్రయోగిస్తాయి. ఈ బలం పనిగా మారి బ్రేకు డ్రమ్ములను వేడి చేస్తుంది లేదా వాహనం కిందికి దిగేటప్పుడు స్థితిశక్తిలో మార్పు (mg h₁ – mgh₂) పనిగా మారటం వల్ల బ్రేకు డ్రమ్ములు వేడెక్కుతాయి.

Exam Tips:

a) గురుత్వ స్థితిజ శక్తిలో తగ్గుదల (mgh₁ – mgh₂) బ్రేకులతో ఘర్షణ పనిగా మారి ఉష్ణంగా విడుదలవుతుంది అని రాయండి.

 

Question 12: విద్యుత్ శీతలీకరణ యంత్రాన్ని (రిఫ్రిజిరేటర్) తెరచి ఉంచి గదిని చల్లబరచడం సాధ్యమవుతుందా ?

Answer:

సాధ్యపడదు. శీతలీకరణ యంత్రం రెండు వేరువేరు వ్యవస్థలు (ఉష్ణాశయం, శీతలాశయం)ల మధ్య మాత్రమే పనిచేస్తుంది. రిఫ్రిజిరేటరు తలుపు తెరిస్తే గది మరియు రిఫ్రిజిరేటరు ఒకే వ్యవస్థగా వ్యవహరిస్తాయి. కావున శీతలీకరణ యంత్రం పనిచేయదు.

Exam Tips:

a) రిఫ్రిజిరేటర్ తెరిస్తే గది + రిఫ్రిజిరేటర్ ఒకే వ్యవస్థ; వేడి బయటకు పంపే చోటు లేదు, కాబట్టి గది చల్లబడదు (వాస్తవంగా కొద్దిగా వేడెక్కుతుంది).

 

Question 13: వ్యవస్థ ఘనపరిమాణాన్ని 50%కి తగ్గించినప్పుడు, స్థిరోష్ణక లేదా సమ ఉష్ణోగ్రతా ప్రక్రియలలో దేనిలో పీడనం అధికంగా పెరుగుతుంది ?

Answer:

స్థిరోష్ణక ప్రక్రియలో వ్యవస్థ నుండి శక్తి బయటకు పోవడం లేదా లోపలికి రావడం జరగదు. ఘనపరిమాణాన్ని 50% తగ్గించడానికి బాహ్యపని అవసరము. ఇది వ్యవస్థ ఉష్ణోగ్రతను పెంచుతుంది. కాబట్టి పీడనం ఎక్కువ ఉంటుంది.
సమఉష్ణోగ్రతా ప్రక్రియలో వ్యవస్థ ఉష్ణోగ్రత T స్థిరం కావున V లో తగ్గుదల వల్ల పీడనంలో పెరుగుదల స్థిరోష్ణక ప్రక్రియ కన్నా తక్కువ.

Exam Tips:

a) స్థిరోష్ణక సంపీడనంలో P₂/P₁ = (V₁/V₂)^γ = 2^γ > 2, సమోష్ణోగ్రతా సంపీడనంలో P₂/P₁ = 2 అని పోల్చి చూపండి.

 

Question 14: ఒక థర్మాస్ ఫ్లాస్క్ లో ఉన్న ద్రవాన్ని బాగా కుదిపితే, దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది ?

Answer:

థర్మాస్ ఫ్లాస్క్ లో ద్రవాన్ని బాగా కుదిపితే దానిలోని ద్రవం ఉష్ణోగ్రత పెరుగుతుంది. కారణం థర్మాస్ ఫ్లాస్క్ ఉష్ణ బంధక వ్యవస్థ. అంటే స్థిరోష్ణక మార్పులు జరుగుతాయి. కాబట్టి కుదుపులకు వాడిన పని ఉష్ణంగా మారి లోపలి ద్రవాన్ని వేడెక్కిస్తాయి.

Exam Tips:

a) థర్మాస్ ఉష్ణబంధకం (ΔQ = 0) కాబట్టి కుదిపిన పని అంతా అంతరిక శక్తిని పెంచి ద్రవ ఉష్ణోగ్రత పెరుగుతుంది.

 

Question 15: వాయువుతో నిండి ఉన్న గొట్టంలోకి ఒక ధ్వని తరంగాన్ని పంపితే దాని అంతరిక శక్తి మారుతుందా ?

Answer:

మారుతుంది. ధ్వని తరంగం కొంత శక్తిని కలిగి ఉంటుంది. దీనిని గొట్టంలోకి పంపితే వ్యవస్థ అంతరికశక్తి పెరుగుతుంది.

Exam Tips:

a) ధ్వని తరంగ శక్తి వాయువులోకి చేరి అంతరిక శక్తిని పెంచుతుంది అని 'అవును, పెరుగుతుంది' తో మొదలుపెట్టి రాయండి.

 

Question 16: i) సమ ఉష్ణోగ్రతా ప్రక్రియ
ii) స్థిరోష్ణక ప్రక్రియలలో అంతరిక శక్తిలోని మార్పు ఎంత ?

Answer:

i) సమ ఉష్ణోగ్రతా ప్రక్రియలో, ఉష్ణోగ్రత (T) స్థిరము ∴ dT = 0 కావున అంతరికశక్తిలో మార్పు dU = 0
స్థిరోష్ణక ప్రక్రియలో dQ = dU + dw కాని dQ = 0 కావున du = -dW.
అనగా స్థిరోష్ణక ప్రక్రియలో అంతరికశక్తిలో మార్పు వ్యవస్థ జరిపిన పనికి సమానము.

Exam Tips:

a) i) సమోష్ణోగ్రతా: ΔT = 0 ⇒ ΔU = 0; ii) స్థిరోష్ణక: ΔQ = 0 ⇒ ΔU = –W అని రెండింటికీ విడివిడిగా రాయండి.

 

Question 17: రసాయనిక లేదా అణుకేంద్రాలలో వాడే శీతలీకరణి అధిక విశిష్టోష్ణతను కలిగి ఉంటుంది. ఎందుకు ?

Answer:

ఒకే ద్రవ్యరాశి గల శీతలీకరణులలో అవి ఉష్ణాన్ని గ్రహించి బయటకు తేగల సామర్థ్యం విశిష్టోష్ణ సామర్థ్యంకు అనులోమానుపాతంలో ఉంటుంది. (Q = mc∆T కావున Q ∝ c) అందువల్ల శీతలీకరణిగా వాడే ద్రవానికి వీలైనంత ఎక్కువ విశిష్టోష్ణ సామర్థ్యం ఉండాలి.

Exam Tips:

a) శీతలీకరణి గ్రహించే ఉష్ణం Q = mcΔT, అందుకే విశిష్టోష్ణం c ఎక్కువైతే ఎక్కువ ఉష్ణం తీసుకెళ్తుంది అని రాయండి.

 

Question 18: i) సమ ఘనపరిమాణ ప్రక్రియ,
ii) సమ పీడన ప్రక్రియలను గురించి వివరించండి.

Answer:

i) సమ ఘనపరిమాణ ప్రక్రియ : సమఘనపరిమాణ ప్రక్రియలో ఉష్ణ యాంత్రిక మార్పులు వ్యవస్థ ఘనపరిమాణంను స్థిరంగా ఉంచుతూ జరుగుతాయి. ఈ
ప్రక్రియలో dV = 0.
ii) సమపీడన ప్రక్రియ : సమపీడన ప్రక్రియలో ఉష్ణ యాంత్రిక మార్పులు వ్యవస్థ స్థిరంగా ఉంచుతూ జరుగుతాయి. అనగా dP = 0

Exam Tips:

a) సమఘనపరిమాణం: dV = 0 (పని W = 0); సమపీడనం: dP = 0 (W = PΔV) అని ఒక్కో ప్రక్రియకు షరతు + ఫలితం రాయండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: ఉష్ణగతికశాస్త్ర మొదటి నియమాన్ని నిర్వచించి, వివరించండి.

Answer:

ఒక వ్యవస్థ ఒక స్థితి నుండి మరియొక స్థితికి మారినపుడు ఆ వ్యవస్థకు సరఫరా చేసిన ఉష్ణరాశి dQ ఆ వ్యవస్థ అంతర్గత శక్తి పెరుగుదల (dU) మరియు వ్యవస్థ చేయు బాహ్య పని (dW) ల మొత్తమునకు సమానమని మొదటి నియమం తెల్పుతుంది.
∴ dQ = dU + dW కాని dW = PdV, కనుక dQ = dU + PdV.
ఉష్ణ సరఫరా లేకుండా వ్యవస్థ పనిచేస్తే
dQ = 0 కనుక dU + PdV = 0; ∴ PdV = – dU
అంటే దాని అంతర్గత శక్తి ఎంత తగ్గుతుందో, అదంతా బాహ్యపని చేయడానికి ఉపయోగపడుతుంది.
ఉష్ణగతికశాస్త్ర మొదటి నియమానికి అవధులు : ఉష్ణగతికశాస్త్ర ప్రథమ నియమానికి రెండు అవధులు ఉన్నాయి. అవి
1. ఈ నియమం ఉష్ణప్రవాహ దిశను తెలియజేయదు మరియు ఏ పరిస్థితులలో పని జరపడానికి లేదా ఉత్పన్నం చేయడానికి వస్తువు ఉష్ణశక్తిని వినియోగించుకుంటుందో తెలియజేయదు.
2. ఈ నియమం వ్యవస్థ ఎంత దక్షతతో ఉష్ణశక్తిని యాంత్రికశక్తిగా మార్చగలదో తెలియజేయదు.

Exam Tips:

a) dQ = dU + dW (W = PdV) సూత్రం, స్థిరోష్ణక సందర్భం (dQ = 0) మరియు రెండు అవధులను 1, 2 సంఖ్యలతో రాయండి.

 

Question 2: వాయువుల రెండు ప్రధాన విశిష్టోష్ణాలను నిర్వచించండి. ఆ రెండింటిలో ఏది ఎక్కువ ? ఎందుకు ?

Answer:

స్థిరఘనపరిమాణ మోలార్ విశిష్టోష్ణ సామర్ధ్యము (C ᵥ): స్థిరఘనపరిమాణము వద్ద ఒక గ్రామ్ మోల్ ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రతను 1°C లేదా 1 కెల్విన్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని స్థిరఘనపరిమాణ మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యము Cᵥ గా నిర్వచించినారు.
\( Cᵥ = \frac{1}{\mu} \frac{\mathrm{dQ}}{\mathrm{dT}} \)
μ = వాయువులోని మోల్ ల సంఖ్య
స్థిరపీడన మోలార్ విశిష్టోష్ణ సామర్ధ్యము (C ₚ) : స్థిరపీడనము వద్ద ఒక గ్రామ్ మోల్ ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రతను 1°C లేదా 1 కెల్విన్ మేరకు పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని స్థిరపీడన మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యము Cₚ గా నిర్వచించినారు.
\( Cₚ = \frac{1}{\mu} \frac{\mathrm{dQ}}{\mathrm{dT}} \)
μ = వాయువులోని గ్రామ్ మోల్ సంఖ్య
వాయువులలో Cₚ > Cᵥ వివరణ : వాయువును స్థిర ఘనపరిమాణం వద్ద వేడిచేస్తే వాయువుకు అందజేసిన మొత్తం ఉష్ణరాశి వాయువు ఉష్ణోగ్రతను పెంచడానికి ఉపయోగపడును. అనగా దాని అంతర్గత శక్తి పెరుగును.
∴ dQ = dU = C ᵥdT
స్థిర పీడనం వద్ద వాయువుకు అందజేసిన ఉష్ణరాశి (dQ) వాయువు అంతర్గతశక్తిని పెంచడంతో పాటు వాయువును వ్యాకోచింపచేయడానికి కొంత పని (dW = PdV) కూడా చేస్తుంది. కావున ఈ స్థిరపీడనం వద్ద dQ = dU + PdV.
వాయువులలో స్థిరపీడన విశిష్టోష్ణము, స్థిరఘనపరిమాణ విశిష్టోష్ణము కన్నా ఎక్కువ. స్థిరపీడనం వద్ద వాయువును వేడిచేయటానికి ఇచ్చిన ఉష్ణశక్తి 1) వాయువును వేడిచేయటానికి 2) వాయువు పీడనానికి వ్యతిరేకంగా వ్యాకోచించడానికి కూడా ఉపయోగపడుతుంది. అనగా ఉష్ణశక్తి కొంత పని (dW = PdV) అదనంగా చేయడం వలన Cₚ > Cᵥ అవుతుంది.

Exam Tips:

a) Cᵥ, Cₚ నిర్వచనాలు; స్థిరపీడనం వద్ద అదనపు ఉష్ణం విస్తరణ పనికి కూడా పోతుంది కాబట్టి Cₚ > Cᵥ అని ముగించండి.

 

Question 3: ఉష్ణ గతిక శాస్త్ర మొదటి నియమం ఆధారంగా, వాయువు రెండు విశిష్టోష్ణ సామర్థ్యాల మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పాదించండి.

Answer:

స్థిరఘనపరిమాణ మోలార్ విశిష్టోష్ణ సామర్ధ్యము (Cᵥ) : స్థిరఘనపరిమాణము వద్ద ఒక గ్రామ్ మోల్ ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రతను 1°C లేదా 1 కెల్విన్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని స్థిరఘనపరిమాణ మోలార్ విశిష్టోష్ణ సామర్ధ్యము Cᵥ గా నిర్వచించినారు.
\( Cᵥ = \frac{1}{\mu} \frac{\mathrm{dQ}}{\mathrm{dT}} \)
μ = వాయువులోని మోల్ల సంఖ్య
స్థిరపీడన మోలార్ విశిష్టోష్ణ సామర్ధ్యము (Cₚ) : స్థిరపీడనము వద్ద ఒక గ్రామ్ మోల్ ద్రవ్యరాశి గల వాయువు ఉష్ణోగ్రతను 1°C లేదా 1 కెల్విన్ మేరకు పెంచడానికి కావలసిన ఉష్ణరాశిని స్థిరపీడన మోలార్ విశిష్టోష్ణ సామర్థ్యము Cₚ గా నిర్వచించినారు.
\( Cₚ = \frac{1}{\mu} \frac{\mathrm{dQ}}{\mathrm{dT}} \)
μ = వాయువులోని గ్రామ్ మోల్ల సంఖ్య
గమనిక : విశిష్టోష్ణము మరియు విశిష్టోష్ణసామర్థ్యములను ఒకే అర్థంలో వాడతారు. ఉష్ణ గతిక శాస్త్ర మొదటి నియమం నుండి Cₚ – Cᵥ = R ఉత్పాదన.
ఉష్ణ గతిక శాస్త్ర మొదటి నియమం నుండి dQ = dU + dW = ∆U + P∆V………….. (1) ఒక మోల్ వాయువును స్థిర ఘనపరిమాణం వద్ద వేడి చేస్తే అది శోషించుకున్న
ఉష్ణం dQ = dU (∵ dV = 0 కావున)
∴ \( Cᵥ = \frac{\Delta \mathrm{Q}}{\Delta \mathrm{T}}=\frac{\Delta \mathrm{U}} {\Delta \mathrm{T}} ……………. (2) \)
ఒక మోల్ వాయువును స్థిరపీడనం వద్ద వేడిచేస్తే అది శోషించుకున్న ఉష్ణరాశి \( = Cₚ = \frac{\Delta \mathrm{Q}}{\Delta \mathrm{T}}=\frac{\Delta \mathrm{U}}{\Delta \mathrm{T}}+\mathrm{P} \frac{\Delta \mathrm{V}}{\Delta \mathrm{T}} ……………….. (3) \)
వాయు సమీకరణం PV = RT అవకలనం చేయగా
P ∆ V + V ∆ P = R ∆ T కాని Cₚ వద్ద ∆P = 0
∴ \( P \frac{\Delta \mathrm{V}}{\Delta \mathrm{T}} = R ……………… (4) \)
సమీకరణ 2, 4 లను 3 లో ప్రతిక్షేపించగా Cₚ = Cᵥ + R లేదా Cₚ – Cᵥ = R

Exam Tips:

a) Cₚ – Cᵥ = R ఉత్పాదనలో (1), (2), (3), (4) సమీకరణాల క్రమం పాటించండి: స్థిర V వద్ద dQ = dU, స్థిర P వద్ద PΔV/ΔT = R.

 

Question 4: సమఉష్ణోగ్రతా ప్రక్రియలో ఒక వాయువు చేసిన పనికి సమాసాన్ని సాధించండి.

Answer:

సమ ఉష్ణోగ్రతా ప్రక్రియ : సమ ఉష్ణోగ్రతా ప్రక్రియలో వ్యవస్థ ఉష్ణోగ్రత T స్థిరము. ఇది PV = μ RT ని పాటిస్తుంది. వ్యవస్థ పీడనం P, ఘనపరిమాణం V₁ నుండి V₂ మారడం వల్ల జరిగిన పని dW = PdV ……….. (1) కాని \( P = \frac{\mu \mathrm{RT}} {\mathrm{V}} \)
ఇందులో μ = వాయువులోని మోల్ల సంఖ్య
ఈ ప్రక్రియలో జరిగిన మొత్తం పని \( W = \int dW = \int P\,dV = \int_{V_1}^{V_2} \frac{\mu RT}{V} dV = \mu RT \int_{V_1}^{V_2} \frac{dV}{V} = \mu RT \left[\log_e V\right]_{V_1}^{V_2} = \mu RT \left[\log_e V_2 - \log_e V_1\right] \)
∴ సమ ఉష్ణోగ్రతా ప్రక్రియలో జరిగిన పని \( W = \mu RT \log_e \frac{V_2}{V_1} \)

Exam Tips:

a) W = ∫PdV, P = μRT/V ఉంచి W = μRT logₑ(V₂/V₁) పొందండి; ప్రతి సమాకలన దశ రాయండి.

 

Question 5: స్థిరోష్ణక ప్రక్రియలో ఒక వాయువు చేసిన పనికి సమాసాన్ని సాధించి, వివరించండి.

Answer:

స్థిరోష్ణక ప్రక్రియ : స్థిరోష్ణక ప్రక్రియలో వ్యవస్థకు గల శక్తి Q స్థిరము. ఈ ప్రక్రియలో PVγ = K స్థిరము. …..(1) μ మోల్ల ఒక ఆదర్శ వాయువును స్థిరోష్ణక ప్రక్రియలో వ్యాకోచింపచేయడంవల్ల దాని పీడనము P₁ నుండి P₂ కు ఘనపరిమాణం V₁ నుండి V₂కు మారినదనుకోండి. ఆదర్శ వాయువు వ్యాకోచించడంలో జరిగిన పని
\( W = \int_{\mathrm{V}_1}^{\mathrm{v}_2} \mathrm{PdV} \) కాని స్థిరోష్ణక ప్రక్రియలో PVγ = K లేదా \( P = \frac{\mathrm{K}}{\mathrm{V}^\gamma} \)
∴ మొత్తం పని \( W = \int_{v_1}^{v_2} \frac{K}{v^\gamma} \) dV. దీనిని సమాకలనం చేయగా
\( W = \frac{K}{1-\gamma}\left[V^{1-\gamma}\right]_{V_1}^{V_2} = \frac{K}{1-\gamma}\left(V_2^{1-\gamma} - V_1^{1-\gamma}\right) = \frac{1}{\gamma-1}\left[K V_1^{1-\gamma} - K V_2^{1-\gamma}\right] \)
కాని \( PV^{\gamma} = K \quad \therefore K = P_1V_1^{\gamma} = P_2V_2^{\gamma} \) ఈ విలువలు పై సమీకరణంలో వ్రాయగా
\( W = \frac{1}{\gamma-1}\left[P_1V_1^{\gamma}V_1^{1-\gamma} - P_2V_2^{\gamma}V_2^{1-\gamma}\right] = \frac{1}{\gamma-1}\left(P_1V_1 - P_2V_2\right) \)
\( \therefore W = \frac{1}{\gamma-1}\left(\mu RT_1 - \mu RT_2\right) = \frac{\mu R}{\gamma-1}(T_1 - T_2) \quad (\because PV = \mu RT) \)
∴ స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పని \( W = \frac{1}{\gamma-1}\left(P_1V_1 - P_2V_2\right) \) లేదా \( W = \frac{\mu R}{\gamma-1}(T_1 - T_2) \)

Exam Tips:

a) PV^γ = K నుంచి W = ∫K V^(–γ) dV సమాకలనం చేసి W = [μR/(γ–1)](T₁ – T₂) = (P₁V₁ – P₂V₂)/(γ – 1) పొందండి.

 

Question 6: సమఉష్ణోగ్రత, స్థిరోష్ణక ప్రక్రియలను పోల్చండి.

Answer:

సమఉష్ణోగ్రతా ప్రక్రియ
1. ఈ ప్రక్రియలో వ్యవస్థ ఉష్ణోగ్రత (T) స్థిరము.
∴ ∆T = 0
2. వ్యవస్థను ఉత్తమ ఉష్ణ వాహకంతో చేయవలెను.
3. వాయుసమీకరణ PV = RTని పాటిస్తాయి.
4. వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఉష్ణ వినిమయం ఉంటుంది.
5. ఈ చర్యలు నెమ్మదిగా జరుగును.
6. అంతర్గత శక్తిలో మార్పు ∆U = 0
7. విశిష్టోష్ణము అనంతము
8. సమ ఉష్ణోగ్రతా ప్రక్రియ వక్రాల వాలు \( \frac{\mathrm{dP}}{\mathrm{dV}} = - P / V \) కి సమానము.
స్థిరోష్ణక ప్రక్రియ
1. ఈ ప్రక్రియలో వ్యవస్థ మొత్తం శక్తి ‘Q’ స్థిరము.
∴ ∆Q = 0
2. వ్యవస్థను అధమ ఉష్ణ వాహకంతో చేయవలెను.
3. PVγ = స్థిరరాశి అన్న నియమం పాటిస్తాయి.
4. వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఉష్ణ వినిమయం ఉండదు.
5. ఇవి వేగంగా జరుగుతాయి.
6. అంతర్గత శక్తి మారుతుంది. ∆U ≠ 0
7. విశిష్టోష్ణము ‘0’
8. ఈ వక్రాల వాలు \( \frac{\mathrm{dP}}{\mathrm{dV}} = -\gamma \frac{P}{V} \) కి సమానము.

Exam Tips:

a) రెండు ప్రక్రియలను 8 అంశాలతో వరుసగా పోల్చండి: ఉష్ణోగ్రత (ΔT = 0 / ΔQ = 0), సంబంధం (PV = స్థిరం / PV^γ = స్థిరం), ΔU, విశిష్టోష్ణం (∞ / 0), వక్రం వాలు (–P/V / –γP/V).

 

Question 7: కింది ప్రక్రియలను ఉదాహరణతో వివరించండి.
i) చక్రీయ ప్రక్రియ
ii) చక్రీయం కానటువంటి ప్రక్రియ

Answer:

i) చక్రీయ ప్రక్రియ (Cyclic Process) : ఏదైనా ఉష్ణయాంత్రిక వ్యవస్థ దాని పీడనం, ఉష్ణోగ్రత వంటి చలరాశులలో వేరువేరు దశలలో మార్పులు పొందినప్పటికి చివరకు తొలిస్థితికి తిరిగివస్తే అటువంటి ప్రక్రియను చక్రీయ ప్రక్రియ అంటారు. చక్రీయ ప్రక్రియ తొలిపీడనం, ఉష్ణోగ్రతలకు తిరిగి వస్తుంది కాబట్టి దీని అంతర్గత శక్తిలోని మార్పు dU = 0.
చక్రీయ ప్రక్రియలో జరిగిన పని ఆ వ్యవస్థ శోషణం చేసుకున్న ఉష్ణశక్తికి సమానము. అనగా dW = dQ.
చక్రీయ ప్రక్రియలో అంతర్గత శక్తిలోని మార్పు dU = 0 మరియు వ్యవస్థ జరిపిన పని dW = dQ. కావున సాధారణంగా అన్నిరకాల ఉష్ణయంత్రాలు మరియు శీతలీకరణ యంత్రాలు చక్రీయ ప్రక్రియ ఆధారంగా పనిచేస్తాయి.
ii) చక్రీయం కానటువంటి ప్రక్రియ : ఏదైనా ఉష్ణయాంత్రిక వ్యవస్థలో పీడనము, ఘనపరిమాణము, ఉష్ణోగ్రత వంటి చలరాశులు వివిధ దశలలో మార్పులు పొందినప్పటికి చివరి దశలో తొలి విలువలను పొందలేకపోతే అటువంటి ప్రక్రియను అచక్రీయ ప్రక్రియ అంటారు.

Exam Tips:

a) చక్రీయ ప్రక్రియ: తొలి స్థితికి తిరిగొస్తుంది, ΔU = 0, W = ΔQ; అచక్రీయ ప్రక్రియ: తిరిగి రాదు — రెండింటికీ నిర్వచనం + ఉదాహరణ రాయండి.

 

Question 8: అర్ధస్థితిక ప్రక్రియ మీద లఘుటీక రాయండి.

Answer:

అర్ధస్థితిక ప్రక్రియ (Quasi static process) : అర్ధస్థితిక ప్రక్రియలో ఉష్ణయాంత్రిక వ్యవస్థలోని మార్పులు అత్యంత నిదానంగా జరుగుతూ ప్రతిదశలోను వ్యవస్థకు చెందిన ఉష్ణగతిక స్థిరరాశులు పరిసరాలతో దాదాపు సమతాస్థితిలో ఉన్నట్లు భావిస్తాము.

వివరణ : సమతాస్థితిలో లేని ఏదైనా ఉష్ణయాంత్రిక వ్యవస్థను గురించి వివరించడానికి ఆ వ్యవస్థ ప్రతిస్థితిలోను పరిసరాలతో సమతాస్థితిలో ఉండే ఆదర్శవంతమైన ప్రక్రియగా ఊహిస్తారు.
ఇటువంటి ఉష్ణయాంత్రిక వ్యవస్థలో ముషలకాన్ని వేగంగా, లేదా అకస్మాత్తుగా జరిపే బదులుగా అతి నెమ్మదిగా ముషలకాన్ని జరిపినట్లు భావిస్తారు. అందువల్ల వ్యవస్థలోపలి పీడనం P మరియు ఉష్ణోగ్రత T లు పరిసరాల పీడనము P + ∆P మరియు ఉష్ణోగ్రత T + ∆T లకు దాదాపు సమానము.
ఈ ప్రక్రియ అత్యంత నెమ్మదిగా జరగడం వల్ల పీడనంలో మార్పు ∆P మరియు
ఉష్ణోగ్రతలో మార్పు ∆T లు అతిచిన్నవి కావడం వల్ల P + ∆P = P మరియు T + ∆T = T అని భావిస్తారు. ఇటువంటి ప్రక్రియలను అర్ధస్థితిక ప్రక్రియలు అంటారు.

Exam Tips:

a) అర్ధస్థితిక ప్రక్రియ అంటే అత్యంత నెమ్మదిగా, ప్రతి దశలో పరిసరాలతో దాదాపు సమతాస్థితిలో జరిగేది; పటం గీసి ముషలకం నెమ్మదిగా జరిగిందని చూపండి.

 

Question 9: ఉష్ణయంత్రం పనిచేసే విధానాన్ని వివరించండి.

Answer:

ఉష్ణయంత్రాలు : ఉష్ణశక్తిని పని లేక యాంత్రికశక్తిగా మార్చే పరికరాన్ని ఉష్ణయంత్రం అంటారు.
ఉష్ణయంత్రాలు అన్నీ చక్రీయ ప్రక్రియలపై ఆధారపడతాయి. వీటిలో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి.
1) జనకం : ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే వస్తువు. ఉష్ణయంత్రం దీని నుండి ఉష్ణశక్తి (Q₁) ని గ్రహిస్తుంది.
2) పనిచేసే పదార్థము : ఇది యంత్రం పనిచేయడానికి అవసరమైన పదార్థాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ పనిచేసే పదార్థం ఎక్కువ పీడనం కలిగిన నీటి ఆవిరి లేదా ఇంధన మిశ్రితమైన గాలి రూపంలో ఉంటాయి.
3) సింక్ లేదా రిజర్వాయర్ : ఇది తక్కువ ఉష్ణోగ్రత వద్ద గల వస్తువు లేదా పదార్థం. ఉష్ణయంత్రంలోని పనిచేసే పదార్థం పని పూర్తి ఐన తరువాత తనలో మిగిలి ఉన్న ఉష్ణశక్తిని సింక్ లేదా రిజర్వాయర్లోకి విసర్జిస్తుంది. ప్రతి ఉష్ణ యంత్రం జనకం నుండి Q₁ అనే ఉష్ణశక్తిని తీసుకొని కొంత పనిచేసిన తరువాత మిగిలిన ఉష్ణరాశి Q₂ ని సింక్లోనికి విసర్జిస్తుంది.
ఉష్ణయంత్రం జరిపిన పని W = Q₁ – Q₂

ఉష్ణయంత్రపు సామర్ధ్యము : ఏదైనా యంత్రము జరిపిన పనికి, దానికి అందజేసిన శక్తికి గల నిష్పత్తిని ఆ ఉష్ణ యంత్రపు సామర్థ్యంగా నిర్వచించినారు.
\( \text{ఉష్ణయంత్రపు సామర్థ్యము } \eta = \frac{\text{జరిగిన పని}}{\text{యంత్రానికి అందజేసిన శక్తి}} = \frac{W}{Q_1} \)
కాని పని \( W = Q_1 - Q_2 \) కావున \( \eta = \frac{Q_1 - Q_2}{Q_1} = 1 - \frac{Q_2}{Q_1} \)
ఇందులో Q₁ = యంత్రానికి అందజేసిన శక్తి, Q₂ = యంత్రం సింక్‌కు అందజేసిన శక్తి.

Exam Tips:

a) ఉష్ణయంత్రం మూడు భాగాలు (జనకం, పనిచేసే పదార్థం, సింక్), W = Q₁ – Q₂, సామర్థ్యం η = W/Q₁ = 1 – Q₂/Q₁ — పటం గీయడం తప్పనిసరి.

 

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

Question 1: ఏకగత, ద్విగత ప్రక్రియలను వివరించండి. కార్నో యంత్రం పనిచేసే విధానాన్ని వివరించి, దాని దక్షతకు సమాసాన్ని రాబట్టండి. (మార్చి 2014)

Answer:

ఏకగత ప్రక్రియ లేదా ఉత్రమణీయ ప్రక్రియ : విశ్వంలో ఎక్కడా ఏ విధమైన మార్పులూ లేకుండా, వ్యవస్థ మరియు పరిసరాలు తొలిదశకు చేరుకునేటట్లుగా ఒక ప్రక్రియను అదే ప్రక్రియ సూటి పద్ధతిలో ఏయే దశల గుండా ప్రయాణం చేసిందో అదే దశల గుండా దానిని వెనుకకు తీసుకొనిరాగలిగితే ఆ ప్రక్రియను ఉత్రమణీయ ప్రక్రియ అంటారు. ఉత్రమణీయ ప్రక్రియ కేవలం ఆదర్శభావన మాత్రమే.
ఉత్రమణీయ ప్రక్రియ పాటించవలసిన నిబంధనలు:
1. వ్యవస్థ జరిపే మార్పులు అత్యంత నెమ్మదిగా ఉండాలి.
2. వ్యవస్థ ఎప్పుడూ పరిసరాలతో ఉష్ణ మరియు యాంత్రిక సమతాస్థితిలో ఉండాలి.
3. ఉష్ణవహనం, సంవహనం, ఘర్షణ మరియు నిరోధం వంటి ఏ విధమైన పద్ధతుల ద్వారా వ్యవస్థ ఉష్ణశక్తిని నష్టపోరాదు.
4. ఉష్ణశక్తి ఏ విధమైన ఇతర శక్తులలోనికి (విద్యుత్తు లేదా అయస్కాంత శక్తి వంటివి) రూపాంతరం చెందరాదు.
ద్విగత ప్రక్రియ లేదా అనుత్ప్ర్కమణీయ ప్రక్రియ : ఏదైనా ఉష్ణయాంత్రిక ప్రక్రియను సూటి పద్ధతి ప్రక్రియకు వ్యతిరేకదిశలో వెనుకకు మరలించి తీసుకొని రాలేకపోతే అటువంటి ప్రక్రియను అనుత్రమణీయ ప్రక్రియ అంటారు.
ఉదా:
1. ఘర్షణ బలాలకు వ్యతిరేకంగా పని జరుపుట.
2. వాహకం గుండా విద్యుత్ పంపినపుడు అది వేడెక్కుట. దీనిని జౌల్ ఉష్ణ ప్రభావం అంటారు.
కార్నో యంత్రం : కార్నో యంత్రం T₁ మరియు T₂ ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ఉత్రమణీయ ఉష్ణయంత్రము. దానిలోని నాలుగు వరుస ప్రక్రియలను కలిపి కార్నో చక్రము (cornot cycle) అంటారు.
1వ దశలో వాయువు సమఉష్ణోగ్రతా వ్యాకోచం చెందుతుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత T₁ స్థిరము కావున ఈ దశను
\( P_1V_1T_1 \to P_2V_2T_1 \) గా చూపవచ్చు.
సమఉష్ణోగ్రతా ప్రక్రియలో జరిగిన పని \( W_{1-2} = Q_1 = \mu RT_1 \log_e \left(\frac{V_2}{V_1}\right) \)
2వ దశలో వాయువు స్థిరోష్ణక వ్యాకోచం చెందుతుంది. ఈ దశలో P, V మరియు T లను \( P_2V_2T_1 \to P_3V_3T_2 \) గా చూపవచ్చు.
స్థిరోష్ణక ప్రక్రియలో జరిగిన పని \( W_{2-3} = \frac{\mu R (T_1 - T_2)}{\gamma - 1} \)
3వ దశలో వాయువు సమఉష్ణోగ్రతా సంపీడనం చెందుతుంది. ఈ దశను \( P_3V_3T_2 \to P_4V_4T_2 \) గా చూపవచ్చు.

ఈ దశలో వాయువు సింక్‌కు Q₂ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది : \( W_{3-4} = -Q_2 = \mu R T_2 \log_e \left(\frac{V_4}{V_3}\right) \)
నాల్గవ దశలో వాయువు స్థిరోష్ణక సంపీడనం చెంది తిరిగి మొదటి స్థితికి వస్తుంది.
ఈ దశను \( P_4V_4T_2 \to P_1V_1T_1 \) గా చూపవచ్చు.
ఈ దశలో జరిగిన పని \( W_{4-1} = \frac{\mu R (T_2 - T_1)}{\gamma - 1} \)
పూర్తి చక్రంలో జరిపిన పని W = W1,2 + W2,3 + W3,4 + W4,1
ఈ మొత్తం పని Q₁ – Q₂ కి సమానము. అనగా రిజర్వాయరు నుండి గ్రహించిన ఉష్ణరాశి Q₁ మరియు సింక్కు ఇచ్చిన ఉష్ణరాశి Q₂ ల భేదానికి సమానము.
కార్నో యంత్రం దక్షత \( \eta = \frac{\text{యంత్రం జరిపిన పని}}{\text{అందజేసిన ఉష్ణము}} = \frac{Q_1 - Q_2}{Q_1} \)
కార్నో యంత్రం దక్షత \( \eta = 1 - \frac{Q_2}{Q_1} \). 1వ, 3వ దశల నుండి \( \frac{Q_2}{Q_1} = \frac{T_2 \log_e (V_3/V_4)}{T_1 \log_e (V_2/V_1)} \). 2వ, 4వ దశలు స్థిరోష్ణకాలు కావున \( T_1 V_2^{\gamma-1} = T_2 V_3^{\gamma-1} \) మరియు \( T_1 V_1^{\gamma-1} = T_2 V_4^{\gamma-1} \); వీటిని భాగిస్తే \( \frac{V_2}{V_1} = \frac{V_3}{V_4} \), కావున \( \frac{Q_2}{Q_1} = \frac{T_2}{T_1} \).
∴ \( \eta = 1 - \frac{Q_2}{Q_1} = 1 - \frac{T_2}{T_1} \)

Exam Tips:

a) కార్నో చక్రం నాలుగు దశలు (సమోష్ణోగ్రతా వ్యాకోచం, స్థిరోష్ణక వ్యాకోచం, సమోష్ణోగ్రతా సంపీడనం, స్థిరోష్ణక సంపీడనం) P–V పటంతో రాసి, Q₂/Q₁ = T₂/T₁ నుంచి η = 1 – T₂/T₁ పొందండి.

 

Question 2: ఉష్ణగతికశాస్త్ర రెండవ నియమాన్ని నిర్వచించండి. ఉష్ణ యంత్రం శీతలీకరణ యంత్రం కంటె ఏ విధంగా భిన్నమయిందో తెలపండి. (మే 2014)

Answer:

ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమము:
a) కెల్విన్ – ప్లాంక్ ప్రవచనము : ఒక ఉష్ణాశయం నుంచి ఉష్ణశక్తిని గ్రహించి ఏ ఇతర ఫలితాలు కలుగజేయకుండా మొత్తం శక్తిని పనిగా మార్చే చక్రీయ ప్రక్రియ సాధ్యం కాదు.
b) క్లాసియస్ ప్రవచనము : తక్కువ ఉష్ణోగ్రత గల ఒక వస్తువు నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత గల మరొక వస్తువుకు తనంతట తాను ఉష్ణరూపంలో శక్తిని బదిలీ చేసే ఏ ప్రక్రియ సాధ్యం కాదు.
ఉష్ణ గతిక శాస్త్ర రెండవ నియమం ఉష్ణ ప్రసార దిశను తెలుపుతుంది.
ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం ప్రకారము ఏ ఉష్ణ యంత్రం దక్షత η విలువ 1కిసమానం కాదని మరియు శీతలీకరణ యంత్రం క్రియాశీలతా గుణకం (∝) విలువ అనంతం కాదని చెపుతుంది.
I. ఉష్ణయంత్రాలు : ఉష్ణశక్తిని పని లేక యాంత్రికశక్తిగా మార్చే పరికరాన్ని ఉష్ణయంత్రం అంటారు.
సాధారణంగా ఉష్ణయంత్రాలు అన్నీ చక్రీయ ప్రక్రియలపై ఆధారపడతాయి. ప్రతి ఉష్ణ యంత్రంలోను మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి.
1) జనకం : ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద ఉండే వస్తువు. ఉష్ణయంత్రం దీని నుండి ఉష్ణశక్తి (Q) ని గ్రహిస్తుంది.
2) పనిచేసే పదార్థము : ఇది యంత్రం పనిచేయడానికి అవసరమైన పదార్థాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ పనిచేసే పదార్థం ఎక్కువ పీడనం కలిగిన నీటి ఆవిరి లేదా ఇంధన మిశ్రితమైన గాలి రూపంలో ఉంటాయి.
3) సింక్ లేదా రిజర్వాయర్ : ఇది తక్కువ ఉష్ణోగ్రత వద్ద గల వస్తువు లేదా పదార్థం. ఉష్ణయంత్రంలోని పనిచేసే పదార్థం పని పూర్తి అయిన తరువాత తనలో మిగిలి ఉన్న ఉష్ణశక్తిని సింక్ లేదా రిజర్వాయర్లోకి విసర్జిస్తుంది. ప్రతి ఉష్ణయంత్రం జనకం నుండి Q₁ అనే ఉష్ణశక్తిని తీసుకొని కొంత పనిచేసిన తరువాత మిగిలిన ఉష్ణరాశి Q₂ని సింక్లోనికి విసర్జిస్తుంది.
ఉష్ణయంత్రం జరిపిన పని W = Q₁ – Q₂

ఉష్ణయంత్రపు సామర్థ్యము : ఏదైనా యంత్రము జరిపిన పనికి, దానికి అందజేసిన శక్తికి గల నిష్పత్తిని ఆ ఉష్ణ యంత్రపు సామర్థ్యంగా నిర్వచించినారు.
\( \eta = \frac{\text{జరిగిన పని}}{\text{యంత్రానికి అందజేసిన శక్తి}} = \frac{W}{Q_1} \)
కాని పని W = Q₁ – Q₂ కావున \( \eta = \frac{Q_1 - Q_2}{Q_1} = 1 - \frac{Q_2}{Q_1} \)
ఇందులో Q₁ = యంత్రానికి అందజేసిన శక్తి, Q₂ = యంత్రం సింక్లోనికి వదిలివేసిన శక్తి.
II. శీతలీకరణ యంత్రము : శీతలీకరణ యంత్రం, ఉష్ణయంత్రం యొక్క విలోమ ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. ఇది తక్కువ ఉష్ణోగ్రత వద్ద గల వస్తువు సింక్ నుండి ఉష్ణశక్తి Q₂ని గ్రహించి దానికి కొంతపనిని జోడించి (బాహ్య పని Wని) ఉష్ణరాశి Q₁ ని అధిక ఉష్ణోగ్రత గల వస్తువు (Source) కు అందజేస్తుంది.
శీతలీకరణ యంత్రానికి అందజేసిన బాహ్య పని W = Q₁ – Q₂; శీతలీకరణ యంత్రం ఈ బాహ్య పనిని దాని పనిచేసే పదార్థానికి జోడిస్తుంది.

ఉష్ణయంత్రము, శీతలీకరణ యంత్రాల మధ్య భేదము.
ఉష్ణయంత్రం జనకం నుండి ఉష్ణశక్తి ‘Q₁‘ గ్రహించి దానిలో కొంత భాగాన్ని పనిగా మార్చి (W) మిగిలిన ఉష్ణశక్తిని (Q₂) రిజర్వాయర్ లేదా సింక్కు ఇస్తుంది. ఈ యంత్రంలో Q₂ < Q₁ శీతలీకరణ యంత్రము రిజర్వాయర్ లేదా తక్కువ ఉష్ణోగ్రత గల పదార్థం నుండి ఉష్ణశక్తిని గ్రహించి దానికి కొంత బాహ్య పనిని జోడించి మొత్తాన్ని ఎక్కువ ఉష్ణోగ్రత గల పదార్థానికి అందజేస్తుంది. అనగా శీతలీకరణ యంత్రం చల్లని వస్తువు నుండి గ్రహించిన ఉష్ణరాశి Q₂ కన్న పరిసరాలకు అందజేసిన ఉష్ణరాశి Q₁ ఎక్కువ.

Exam Tips:

a) రెండవ నియమం: కెల్విన్–ప్లాంక్ మరియు క్లాసియస్ ప్రవచనాలు రెండూ రాయండి; ఉష్ణయంత్రం (Q₁ గ్రహించి W + Q₂ విడుదల) vs శీతలీకరణ యంత్రం (బాహ్య పని W తో Q₂ గ్రహించి Q₁ విడుదల) పట్టికలా పోల్చండి.

 

లెక్కలు

Question 1: N.T.P. వద్ద 1 లీటరు ఘనపరిమాణం ఉన్న ఒక ఏక పరమాణుక ఆదర్శ వాయువును సంపీడనం చేశారు. (i) సంపీడనం స్థిరోష్ణకమై, ఘనపరిమాణం సగం అయితే వాయువు మీద జరిగిన పనిని, (ii) సంపీడనం సమ ఉష్ణోగ్రతమైతే జరిగిన పనిని లెక్కించండి. (γ = 5/3)

Answer:

i) స్థిరోష్ణక ప్రక్రియలో \( T_1V_1^{\gamma-1} = T_2V_2^{\gamma-1} \).
దత్తాంశము నుండి \( T_1 = 273\,\mathrm{K};\; V_2 = \frac{V_1}{2};\; \gamma = \frac{5}{3} \).
∴ స్థిరోష్ణక ప్రక్రియలో \( 273\, V_1^{\frac{5}{3}-1} = T_2 \left(\frac{V_1}{2}\right)^{\frac{5}{3}-1} \)
\( T_2 = (2)^{\frac{2}{3}} \times 273 = 433.4\,\mathrm{K} \).
మోల్ల సంఖ్య, \( n = \frac{1\,\text{లీ.}}{22.4\,\text{లీ.}} = \frac{1}{22.4} \)
జరిగిన పని \( W = \frac{nR}{\gamma-1}(T_1 - T_2) = \frac{8.314}{22.4\left(\frac{5}{3}-1\right)}(273 - 433.4) = \frac{8.314 \times 3}{22.4 \times 2}(-160.4) = -89\,\mathrm{J} \) (వాయువు చేసిన పని; వాయువుపై జరిగిన పని +89 J)
ii) సమ ఉష్ణోగ్రతా ప్రక్రియలో పని \( W = 2.3026\, nRT \log_{10}\left(\frac{V_2}{V_1}\right) \) ఇందులో \( \frac{V_2}{V_1} = \frac{1}{2} = 0.5 \)
మోల్ల సంఖ్య, \( n = \frac{1}{22.4} ; T = 273 K; R = 8.314 \) J mol⁻¹K⁻¹
∴ \( W = \frac{2.3026 \times 8.314 \times 273 \log _{10}(0.5)}{22.4} = - 70J. \)

Exam Tips:

a) స్థిరోష్ణక సంపీడనం: T₂ = T₁·2^(2/3) = 433.4 K, W = –89 J (వాయువు చేసిన పని); సమోష్ణోగ్రతా: W = 2.3026 nRT log₁₀(0.5) = –70 J.

 

Question 2: 5 మోల్ల హైడ్రోజన్ను స్థిర పీడనం 10⁵ N/m² వద్ద ఉష్ణోగ్రతలో పెరుగుదల 20 K ఉండేటట్లు వేడిచేస్తే అది 8.3 × 10 ⁻³m³ ల వ్యాకోచం చెందింది. Cᵥ = 20 J/mole K, అయితే Cₚ ని కనుక్కోండి.

Answer:

వాయువులలో Cₚ – Cᵥ = R.
ఇరువైపులా n ∆T చే గుణించగా
nCₚ ∆T- nCᵥ ∆T = nR ∆ T లేదా n ∆ T(Cₚ – C ᵥ) = P ∆ V
5 × 20 (Cₚ – 20) = 10⁵ × 8.3 × 10⁻³ (∵ nR∆T = P∆V)
Cₚ – 20 = 8.3 ⇒ Cₚ = 28.3 J/mole K.
( ∵ n = 5, ∆T = 20 K, P = 1 × 10⁵ N/m² & Cᵥ = 20 J/mole K and ∆V = 8.3 × 10⁻³ m³)

Exam Tips:

a) Cₚ – Cᵥ = R ను nΔT తో గుణించి nΔT(Cₚ – Cᵥ) = PΔV వాడండి: 5 × 20 (Cₚ – 20) = 10⁵ × 8.3 × 10⁻³ ⇒ Cₚ = 28.3 J/mol K.

 

ముఖ్యమైన అదనపు లెక్కలు

Question 1: ఒక గీజరు నిముషానికి 3.0 లీటర్ల ప్రవాహ రేటు కలిగిన నీటిని 27°C నుంచి 77°C వరకు వేడిచేస్తుంది. గీజరులో 4.0 × 10⁴ J/g దహనోష్ణం గల సహజ వాయువు ఇంధనంగా పనిచేస్తే, ఇంధనం ఖర్చయ్యే రేటును కనుక్కోండి.

Answer:

వేడి చేయబడిన నీటి ఘనపరిమాణము = 3.0 లీ./ ని.
వేడెక్కిన నీటి ద్రవ్యరాశి, = m = 3000 గ్రా./ని.
ఉష్ణోగ్రతలో పెరుగుదల, ∆T = 77 – 27 = 50°C
నీటి విశిష్టోష్ణం c = 4.2 J g ⁻¹°C⁻¹
వాడిన ఉష్ణశక్తి, ∆Q = mc ∆T = 3000 × 4.2 × 50 = 63 × 10⁴ J/min.
దహనం వల్ల విడుదలైన ఉష్ణశక్తి = 4 × 10⁴ J/g
ఇంధనం దహనం చెందిన రేటు \( = \frac{63 \times 10^4}{4 \times 10^4} = 15.75 g/min. \)

Exam Tips:

a) ద్రవ్యరాశి m = 3000 g/min, Q = mcΔT = 63 × 10⁴ J/min; ఇంధన రేటు = Q/దహనోష్ణం = 15.75 g/min.

 

Question 2: స్థిర పీడనం వద్ద, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న 2.0 × 10⁻² kg ల నైట్రోజన్ ఉష్ణోగ్రతను 45°C మేర పెంచడానికి అందచేయాల్సిన ఉష్ణం ఎంత ? (N₂ అణు ద్రవ్యరాశి = 28; R = 8.3 Jmol ⁻¹K ⁻¹)

Answer:

వాయువు ద్రవ్యరాశి, m = 2 × 10⁻² kg = 20g; ఉష్ణోగ్రతలో పెరుగుదల, ∆T = 45°C కావలసిన ఉష్ణశక్తి, ∆Q = ?;
అణుభారము, M = 28
గ్రామ్ మోల్ల సంఖ్య, \( n = \frac{\mathrm{m}}{\mathrm{M}}=\frac{20}{28} = 0.714 \) నైట్రోజన్ ద్విపరమాణుక వాయువు కావున
\( Cₚ = \frac{7}{2} R = \frac{7}{2} × 8.3 J mol⁻¹ K ⁻¹ \), కావున ∆Q = n Cₚ ∆T
∴ ∆\( Q = 0.714 × \frac{7}{2} × 8.3 × 45 J = 933.4 J \)

Exam Tips:

a) N₂ ద్విపరమాణుకం: Cₚ = (7/2)R; n = 20/28 = 0.714; ΔQ = nCₚΔT ≈ 933 J.

 

Question 3: కింద ఇచ్చిన వాటిని వివరించండి.
a) T₁, T₂ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న రెండు వస్తువులను ఒకదానితో ఒకటి తాకుతున్నట్లు ఉంచినప్పుడు వాటి సగటు ఉష్ణోగ్రత (T₁ + T₂) /2 కు చేరాల్సిన అవసరం లేదు. b) ఒక రసాయనిక లేదా న్యూక్లియర్ ప్లాంట్లో ఉపయోగించే శీతలీకరణి (ప్లాంట్ లోని వివిధ భాగాలు అత్యధిక ఉష్ణోగ్రతలు పొందకుండా చల్లబరిచే ద్రవం) తప్పకుండా అధిక విశిష్టోష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
c) మోటారు వాహనం చలనంలో ఉన్నప్పుడు, దాని టైరులోని గాలి పీడనం పెరుగుతుంది.
d) ఒకే అక్షాంశంపై ఉన్న సముద్రతీర పట్టణ వాతావరణం ఎడారి ప్రాంత పట్టణ వాతావరణం కంటే అధిక సమశీతోష్ణత కలిగి ఉంటుంది.

Answer:

a) వస్తువులు ఒకదానితో ఒకటి తాకి ఉన్నపుడు ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుల నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ఉష్ణం ప్రసరిస్తుంది. తుది ఉష్ణోగ్రత సగటు ఉష్ణోగ్రత \( \frac{T_1+T_2}{2} \) కి సమానమవ్వడం అనేది వాటి ఉష్ణ సామర్థ్యాలు (ద్రవ్యరాశి × విశిష్టోష్ణం) సమానమైతేనే సాధ్యపడుతుంది.
b) ఒక వస్తువు గ్రహించిన ఉష్ణరాశి దాని విశిష్టోష్ణ సామర్థ్యానికి అనులోమానుపాతంలో ఉండును.
c) డ్రైవింగ్లో ఉన్నపుడు చక్రాలు చలనంలో ఉండటంవల్ల చక్రాలలోని గాలి ఉష్ణోగ్రత పెరుగును. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం ‘P’ పెరుగును. (స్థిర ఘనపరిమాణం వద్ద P ∝ T).
d) ఎడారి పట్టణాల కంటే నౌకాశ్రయ పట్టణాలలోని గాలిలో తేమ ఎక్కువ. కావున సముద్ర పట్టణ ప్రాంతాలలో అధిక సమశీతోష్ణస్థితి ఉంటుంది.

Exam Tips:

a) భాగాలు a)–d) ప్రతి భాగానికి ఒక్క కారణ వాక్యం రాయండి: ఉష్ణ సామర్థ్యాలు సమానమైతేనే సగటు; Q ∝ c; టైర్ గాలి వేడెక్కి P పెరుగుతుంది; నీటి విశిష్టోష్ణం ఎక్కువ/తేమ ప్రభావం.

 

Question 4: కదలగలిగే ముషలకం ఉన్న ఒక స్థూపాకార పాత్రలో, సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద 3 మోల్ల హైడ్రోజన్ వాయువు ఉంది. పాత్ర గోడలు, ముషలకాలు ఉష్ణబంధక పదార్థంతో చేయడమైంది. ముషలకంపైన కొంత ఇసుక ఉన్నది. వాయువును, దాని తొలి ఘనపరిమాణంలో సగానికి తగ్గేటట్లుగా సంపీడనం చెందిస్తే వాయు పీడనం ఎన్ని రెట్లు పెరుగుతుంది ?

Answer:

వ్యవస్థ నుండి ఉష్ణ వినిమయం లేకపోవడం వల్ల ఇది స్థిరోష్ణక ప్రక్రియ
∴ \( P_1 V_1^{\gamma} = P_2 V_2^{\gamma} \) లేదా \( \frac{P_2}{P_1} = \left(\frac{V_1}{V_2}\right)^{\gamma} \)
దత్తాంశం నుండి \( V₂ = \frac{1}{2} V₁ \)
∴ \( \frac{\mathrm{P}_2}{\mathrm{P}_1}=\left(\frac{\mathrm{V}_1}{\frac{1}{2} \mathrm{~V}_1}\right)^{1.4} = 2^{1.4} = 2.64 \)

Exam Tips:

a) రుద్ధోష్ణక (స్థిరోష్ణక) ప్రక్రియ: P₂/P₁ = (V₁/V₂)^γ = 2^1.4 = 2.64; హైడ్రోజన్‌కు γ = 1.4 అని చెప్పండి.

 

Question 5: ఒక వాయువును స్థిరోష్ణక ప్రక్రియ ద్వారా సమతాస్థితి A నుంచి మరొక సమతాస్థితి B కి మార్చడానికి, దానిపై 22.3Jల పని జరపడమైంది. వాయువు 9.35 cal నికర ఉష్ణాన్ని గ్రహించేటట్లుగా ఒక ప్రక్రియ ద్వారా వాయు స్థితిని A నుంచి B కి చేర్చితే ఈ ప్రక్రియలో వాయువుపై జరిగిన నికర పని ఎంత ? (1 cal = 4.19 J గా తీసుకోండి)

Answer:

స్థిరోష్ణక మార్పులో ∆Q = 0, ∆W = – 22.3 J
అంతర్గత శక్తిలో మార్పు du అయితే ∆Q = ∆U + ∆W
0 = ∆U – 22.3 (లేదా) ∆U = 22.3 J
రెండవ సందర్భంలో, ∆Q = 9.35 cal = 9.35 × 4.19 J = 39.2 J ; ∆W = ?
కాని ∆U + ∆W = ∆Q
∴ ∆W = ∆Q – ∆U = 39.2 – 22.3 = 16.9 J (వాయువు చేసిన నికర పని; వాయువుపై జరిగిన నికర పని = –16.9 J)

Exam Tips:

a) స్థిరోష్ణక సందర్భంలో ΔQ = 0 ⇒ ΔU = 22.3 J; రెండవ సందర్భంలో ΔW = ΔQ – ΔU = 39.2 – 22.3 = 16.9 J (1 cal = 4.19 J).

 

Question 6: సమాన ఘనపరిమాణాలున్న A, B రెండు స్థూపాకార పాత్రలను ఒక స్టాప్ కాక్ (ప్రవాహ నియంత్రణ మర) తో కలపడమైంది. పాత్ర A లో సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక వాయువు ఉన్నది. B పూర్తిగా శూన్యం చేయడమైంది. ఈ మొత్తం వ్యవస్థ అంతా ఉష్ణబంధకం చేయడమైంది. స్టాప్కాక్ను ఒక్కసారిగా తెరిచారు. కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి.
a) A, B లలో వాయువు తుది పీడనం ఎంత ?
b) వాయువు అంతరిక శక్తిలో మార్పు ఎంత ?
c) వాయువు ఉష్ణోగ్రతలో మార్పు ఎంత ?
d) వ్యవస్థ యొక్క మధ్యస్థ స్థితులు (తుది సమతాస్థితిని చేరడానికి పూర్వం) P-V-T గ్రాఫ్ తలంపై ఉంటాయా ?

Answer:

a) స్థూపములు A, B ల మధ్య గల స్టాప్కాక్ను తెరిస్తే Aలోని వాయువు B లోకి పీడనం సమానమయ్యే దాకా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఘనపరిమాణం V₁ = VA + VB = 2V. కాని PV స్థిరరాశి
∴ P₁V₁ = PV + 0 ⇒ \( P₁ = P . \frac{V}{2 V}=\frac{P}{2} \)
అనగా కొత్త పీడనం \( P₁ = \frac{P}{2} \) తొలి పీడనంలో సగము
b) వాయువు ఉష్ణోగ్రతలో మార్పు లేకపోవడం వల్ల, PV స్థిరంగా ఉండటం వల్ల అంతరిక శక్తిలో మార్పు ఉండదు.
c) ఈ ప్రక్రియలో వాయువు పని చేయలేదు. కావున దాని ఉష్ణోగ్రతలో మార్పులేదు. d) ఉండవు. ఎందుకనగా వాయువులు స్వేచ్ఛగా శూన్యంలోకి వ్యాపించాయి. ఇది వేగవంతమైన ప్రక్రియ దీనిని అదుపులో ఉంచలేము. అందువల్ల మధ్యస్థ దశ సమతాస్థితిలో ఉండదు. కావున వాయు సమీకరణాన్ని తృప్తిపరచదు. ఇది అనుత్రమణీయ చర్య.

Exam Tips:

a) శూన్యంలోకి స్వేచ్ఛా వ్యాకోచం: పని W = 0, ΔU = 0, ΔT = 0, P_తుది = P/2; ఇది అనుత్రమణీయం కాబట్టి మధ్య స్థితులు P–V–T తలంపై ఉండవు.

 

Question 7: ఒక ఆవిరి యంత్రం నిమిషానికి 5.4 × 10⁸ Jల పని జరిపి, నిమిషానికి 3.6 × 10⁹ J ల ఉష్ణాన్ని దాని బాయిలర్ ద్వారా సరఫరా చేస్తుంది. ఆ యంత్రం దక్షత ఎంత ? నిమిషానికి ఎంత ఉష్ణం వృధాగా పోతుంది ?

Answer:

నిమిషానికి జరిగిన పని = 5.4 × 10⁸ J
నిమిషంలో వాడిన ఉష్ణశక్తి = 3.6 × 10⁹ J
\( \text{దక్షత} = \frac{\text{జరిగిన పని}}{\text{గ్రహించిన ఉష్ణము}} \)
\( = \frac{5.4 \times 10^8}{3.6 \times 10^9} = 0.15 = 0.15 × 100% = 15% \)
నిమిషంలో వృధా అయిన ఉష్ణం = నిమిషంలో గ్రహించిన ఉష్ణము – నిమిషంలో జరిగిన పని
= 3.6 × 10⁹ – 5.4 × 10⁸ = 10⁹ (3.6 – 0.54) = 3.06 × 10⁹ J

Exam Tips:

a) η = W/Q = 5.4×10⁸ / 3.6×10⁹ = 0.15 = 15%; వృధా ఉష్ణం = Q – W = 3.06 × 10⁹ J/min.

 

Question 8: ఒక ఎలక్ట్రిక్ హీటరు 100W రేటు చొప్పున ఉష్ణాన్ని ఒక వ్యవస్థకు అందచేస్తుంది. వ్యవస్థ సెకనుకు 75 J ల రేటు చొప్పున పనిచేస్తుంటే, అంతరిక శక్తి ఏ రేటుతో పెరుగుతుంది ?

Answer:

అందజేసిన ఉష్ణరాశి, ∆Q = 100 W = 100 J/s
ఉపయోగపడిన పని, ∆W = 75 J/s
సెకనుకు అంతర్గత శక్తిలో పెరుగుదల ∆U = ?
కాని ∆Q = ∆U + ∆W
∴ ∆U = ∆Q – ∆W = 100 – 75 = 25J/s

Exam Tips:

a) ΔQ = ΔU + ΔW ⇒ ΔU = 100 – 75 = 25 J/s (W = J/s అని గుర్తుంచుకోండి).

 

Question 9: ఒక ఉష్ణగతిక వ్యవస్థను దాని నిజ స్థితి నుంచి ఒక మధ్యస్థ స్థితికి, రేఖీయ ప్రక్రియ ద్వారా పటంలో చూపినట్లుగా తీసుకోవడమైంది.

వ్యవస్థ ఘనపరిమాణం, నిజ విలువకు E నుంచి F కు సమపీడన ప్రక్రియ ద్వారా తగ్గించడమైంది. వాయువును D నుంచి Eకు, E నుంచి F కు చేర్చడానికి జరిగిన మొత్తం పనిని లెక్కించండి.

Answer:

పటం నుండి
పీడనంలో మార్పు, dP = DF = 600 – 300 = 300 N m⁻²
ఘనపరిమాణంలో మార్పు, dV = EF = 5.0 – 2.0 = 3.0 m³
D నుండి E నుండి F వరకు జరగటంలో వాయువు జరిపిన పని = త్రిభుజం DEF వైశాల్యం \( W = \frac{1}{2} \times EF \times DF = \frac{1}{2} \times 3.0 \times 300 = 450 \) J

Exam Tips:

a) పటం నుండి ΔDEF వైశాల్యం = ½ × 3.0 m³ × 300 N/m² = 450 J; అక్షాల ప్రమాణాలు (N/m², m³) జాగ్రత్తగా చదవండి.

 

Question 10: ఒక శీతలీకరణ యంత్రంలో ఉంచిన తినే పదార్థాలను ఆ యంత్రం 9°C వద్ద ఉంచుతుంది. గది ఉష్ణోగ్రత 36°C అయితే దాని క్రియాశీలతా గుణకాన్ని లెక్కించండి.

Answer:

దత్తాంశం నుండి, T₂ = 9°C = 9 + 273 = 282 K ;
T₁ = 36°C = 36 + 273 = 309 K
క్రియాశీలతా గుణకం నుండి \( = \frac{\mathrm{T}_2}{\mathrm{~T}_1-\mathrm{T}_2} = \frac{282}{309-282} = \frac{282}{27} = 10.4 \)

Exam Tips:

a) రిఫ్రిజిరేటర్ క్రియాశీలతా గుణకం α = T₂/(T₁ – T₂) = 282/27 ≈ 10.4; ఉష్ణోగ్రతలను కెల్విన్‌లో మార్చడం మరచిపోకండి.

 

Free study material for Physics

TS Board Solutions for Class 11 Physics Chapter 13 Thermodynamics

Accessing Chapter 13 Thermodynamics Solutions

Review comprehensive exercise answers for Class 11 Physics Chapter 13 Thermodynamics. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 11 Physics

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Physics module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Physics.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణగతిక శాస్త్రం for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణగతిక శాస్త్రం is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.

Are the Physics TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణగతిక శాస్త్రం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణగతిక శాస్త్రం will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణగతిక శాస్త్రం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణగతిక శాస్త్రం in both English and Hindi medium.

Is it possible to download the Physics TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 13 ఉష్ణగతిక శాస్త్రం in printable PDF format for offline study on any device.