Solutions for Class 11 Physics: Chapter 14 Kinetic Theory
Access comprehensive textbook solutions for Chapter 14 Kinetic Theory using the official curriculum guides for Class 11 Physics. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Practice Class 11 Physics Solutions: Chapter 14 Kinetic Theory
Access the complete solution PDF for Class 11 Physics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: స్వేచ్ఛా పథమధ్యమాన్ని నిర్వచించండి.
Answer:
స్వేచ్ఛా పథమధ్యమము : ఒక వాయు అణువు లేక పరమాణువు అభిఘాతం చెందకుండా ప్రయాణించే సగటు దూరాన్ని స్వేచ్ఛా పథమధ్యమం అంటారు. (లేక)
ఒక వాయు అణువు రెండు వరుస అభిఘాతాల మధ్య ప్రయాణించే దూరాన్ని స్వేచ్ఛా పథమధ్యమం అంటారు.
Exam Tips:
a) స్వేచ్ఛా పథమధ్యమం = రెండు వరుస అభిఘాతాల మధ్య అణువు ప్రయాణించే సగటు దూరం అని ఒక్క వాక్యంలో రాయండి; 'సగటు' అనే పదం మరచిపోవద్దు.
Question 2: అణుచలన సిద్ధాంతం అవొగాడ్రో పరికల్పనను ఏ విధంగా సమర్థిస్తుంది ? వివిధ వాయువులకు ఉండే అవొగాడ్రో సంఖ్య ఒకటే అయి ఉంటుందని చూపండి.
Answer:
అవొగాడ్రో నియమము లేక అవొగాడ్రో పరికల్పన:
“సమాన ఉష్ణోగ్రత, పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం ఉన్న అన్ని వాయువులలో అణువుల సంఖ్య సమానం”. వాయు సమీకరణం ప్రకారం PV = KT. ఇందులో వాయు అణువుల సంఖ్య N ను లెక్కలోనికి తీసుకుంటే స్థిరాంకము K = NkB అని రాయగా
\( \frac{PV}{NT} = k_B \) లేదా \( \frac{P_1 V_1}{N_1 T_1} = \frac{P_2 V_2}{N_2 T_2} = k_B \)
kB బోల్ట్స్మన్ స్థిరాంకము, అన్ని వాయువులకు సమానము. కావున P, V, T లు సమానంగా ఉంటే ఆ వాయువులలో గల అణువుల సంఖ్య N కూడా సమానంగా ఉంటుంది.
Exam Tips:
a) PV = Nk_BT నుండి PV/NT = k_B అని చూపి, P, V, T సమానమైతే N సమానం అని ముగించండి; ఇదే అవొగాడ్రో పరికల్పన.
Question 3: నిజ వాయువు ఆదర్శ వాయువు లాగా ఎప్పుడు ప్రవర్తిస్తుంది ?
Answer:
ఆదర్శ వాయువు అనేది ఒక వాయువుకు సరళ, సైద్ధాంతిక నమూనా. ఏ నిజ వాయువైనా యధార్థంగా ఆదర్శ వాయువు కాదు. అల్ప పీడనాలు, అధిక ఉష్ణోగ్రతల వద్ద కొన్ని నిజ వాయువులు (H₂, O₂, N₂, He వంటివి) ఆదర్శ వాయువులుగా ప్రవర్తిస్తాయి. వాయువులోని అణువుల మధ్య అన్యోన్య చర్యలు లేనప్పుడు వాయువు ఆదర్శ వాయువు వలె ప్రవర్తిస్తుంది.
Exam Tips:
a) 'అల్ప పీడనం, అధిక ఉష్ణోగ్రత' అనే రెండు షరతులూ రాయండి; అణువుల మధ్య ఆకర్షణ బలాలు చాలా తక్కువగా ఉండటం కారణమని చెప్పండి.
Question 4: బాయిల్, ఛార్లెస్ నియమాలను పేర్కొనండి.
Answer:
బాయిల్ నియమం : ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు, ఇచ్చిన ద్రవ్యరాశి కలిగిన వాయు పీడనం (P), దాని ఘనపరిమాణానికి (V) విలోమానుపాతంలో మారుతూ ఉంటుంది.
∴ V ∝ \( \frac{1}{\mathrm{P}} \) లేక PV = స్థిరాంకం = K.
ఛార్లెస్ నియమం : స్థిర పీడనం వద్ద వాయువు ఘనపరిమాణము (V), దాని పరమ ఉష్ణోగ్రతకు (T) అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ V ∝ T లేక \( \frac{V}{T} = K \) (స్థిరాంకము)
Exam Tips:
a) బాయిల్: T స్థిరం, PV = స్థిరాంకం; ఛార్లెస్: P స్థిరం, V/T = స్థిరాంకం. ఉష్ణోగ్రత పరమ (కెల్విన్) ప్రమాణాలలో ఉండాలని గుర్తుంచుకోండి.
Question 5: డాల్టన్ పాక్షిక పీడనాల నియమాన్ని తెలపండి.
Answer:
డాల్టన్ పాక్షిక పీడనాల నియమము : స్థిర ఉష్ణోగ్రత వద్ద, వాయువుల మిశ్రమం మొత్తం పీడనం ఆ మిశ్రమంలోని వివిధ వాయువులు కలుగజేసే పాక్షిక పీడనాల మొత్తానికి సమానము.
మొత్తం పీడనం, P = P₁ + P₂ + P₃
ఇక్కడ P₁, P₂, P₃, ... మిశ్రమంలోని వివిధ వాయువులు కలుగచేసే పాక్షిక పీడనాలు.
Exam Tips:
a) డాల్టన్ నియమం: P = P₁ + P₂ + P₃ + ...; ఉష్ణోగ్రత స్థిరం, వాయువులు పరస్పరం చర్య జరపనివి అని షరతు రాయండి.
Question 6: పాత్రలోని ఆదర్శ వాయువు పీడనం పాత్ర ఆకారంపై ఆధారపడదు – వివరించండి.
Answer:
నిర్వచనం ప్రకారముగా, వాయు పీడనము ఆ వాయు అణువులు పాత్ర గోడలపై జరిపే వరుస అభిఘాతాల ఫలితము అని తెలియుచున్నది. ఇటువంటి ప్రతి అభిఘాతములో కొంత ద్రవ్యవేగము అణువుల నుండి పాత్ర గోడలకు అందుతుంది. ఈ మార్పు పాత్ర యొక్క ఆకారంపై ఆధారపడదు ఎందుకనగా తుది ఫలితంలో పాత్ర వైశాల్యం A, అభిఘాతం సమయం ∆t లు ఉండవు. కావున, పాత్రలోని ఆదర్శ వాయువు పీడనం పాత్ర ఆకారంపై ఆధారపడదు.
Exam Tips:
a) అభిఘాతంలో ద్రవ్యవేగ మార్పు 2mvₓ మరియు P = (1/3) nmv̄² లో పాత్ర వైశాల్యం, ఆకారం లేవని చూపండి; ఇదే సమాధానానికి ముఖ్యాంశం.
Question 7: వాయువులోని అణువుల స్వతంత్ర పరిమితులనే భావనను వివరించండి.
Answer:
అంతరాళంలో స్వేచ్ఛగా చలిస్తున్న అణువు యొక్క స్థానాన్ని నిర్దేశించడానికి కావలసిన నిరూపకాల సంఖ్యను స్వతంత్ర పరిమితులు అని చెప్పవచ్చును.
Exam Tips:
a) స్వతంత్ర పరిమితులు = అణువు స్థానాన్ని, ఆకృతిని నిర్దేశించే స్వతంత్ర నిరూపకాలు; ఉదా: ఏకపరమాణుకానికి 3, ద్విపరమాణుకానికి 5 అని ఉదాహరణ ఇవ్వండి.
Question 8: వాయు అణువు గతిజశక్తికీ, వాయు పీడనానికి మధ్య సంబంధాన్ని తెలిపే సమాసం ఏమిటి ?
Answer:
ఆదర్శ వాయువు పీడనము, ప్రమాణ ఘనపరిమాణంలోని వాయు అణువుల మొత్తం గతిజశక్తి (E) లో \( \frac{2}{3} \) వ వంతు ఉంటుంది.
\( P = \frac{2}{3} E \)
Exam Tips:
a) P = (2/3)E, ఇక్కడ E = ప్రమాణ ఘనపరిమాణంలోని అణువుల మొత్తం గతిజశక్తి; 'సగటు' అని కాకుండా ఈ నిర్వచనంతో రాయండి.
Question 9: వాయువు పరమ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచితే, ఆ వాయు అణువు rms వేగంలో పెరుగుదల ఎంత ఉంటుంది ?
Answer:
వాయువు పరమ ఉష్ణోగ్రత మరియు వాయు అణువు rms వేగముల మధ్య సంబంధం
C ∝ \( \sqrt{\mathrm{T}}. \)
కావున, పరమ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచితే rms వేగం \( \sqrt{3} C \) అవుతుంది.
∴ rms వేగంలో పెరుగుదల \( = \sqrt{3}\,C - C = 0.732\,C = 73.2\% \)
Exam Tips:
a) C ∝ √T; T ను 3 రెట్లు చేస్తే C₂ = √3 C = 1.732C, పెరుగుదల = 0.732C = 73.2%; 'పెరుగుదల' అడిగితే 1 ను తీసివేయడం మరచిపోవద్దు.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: ఉష్ణోగ్రతకు గతిక అర్థ వివరణను వివరించండి.
Answer:
వాయు అణుచలన సిద్ధాంతం ప్రకారం, ఒక మోల్ వాయువు కలిగించే పీడనం P కి సమీకరణము
\( P = \frac{1}{3} \rho C^2 \)
⇒ \( P = \frac{1}{3} \frac{M}{V} C^2 \) (∵ సాంద్రత \( \rho = \frac{M}{V} \))
⇒ \( PV = \frac{1}{3} M C^2 \)
⇒ \( \frac{1}{3} M C^2 = RT \) ……… (1) (∵ 1 మోల్ వాయువునకు PV = RT)
⇒ \( C^2 = \frac{3RT}{M} \) లేక \( C^2 \propto T \)
⇒ \( C \propto \sqrt{T} \) లేక \( \sqrt{T} \propto C \) ……… (2)
కావున, ఒక ఆదర్శ వాయువు యొక్క పరమ ఉష్ణోగ్రత వర్గమూలం దాని అణువుల యొక్క rms వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
మరియు సమీకరణం (1) నుండి
\( \frac{1}{3} \frac{M}{N_A} C^2 = \frac{R}{N_A} T = k_B T \) (లేక) \( \frac{1}{2} m C^2 = \frac{3}{2} k_B T \Rightarrow \frac{1}{2} m C^2 \propto T \) (∵ \( \frac{3}{2} k_B \) ఒక స్థిరాంకం)
కాని \( \frac{1}{2} m C^2 \) అనునది వాయువులోని అణువుల సగటు స్థానాంతరణ గతిజశక్తి.
కాబట్టి, వాయు అణువుల సగటు స్థానాంతరణ గతిజశక్తి ఆ వాయువు యొక్క పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
Exam Tips:
a) C² = 3RT/M నుండి C ∝ √T; (1/2)mC² = (3/2)k_BT అని రాసి, ఉష్ణోగ్రత అణువుల సగటు గతిజశక్తికి కొలమానం అని ముగించండి.
Question 2: ఏకపరమాణుక, ద్విపరమాణుక, బహు పరమాణుక వాయువుల విశిష్టోష్ణ సామర్థ్యాన్ని శక్తి సమవిభాజన నియమం ఆధారంగా ఏ విధంగా వివరించవచ్చు ?
Answer:
శక్తి సమవిభజన నియమం ప్రకారం ప్రతి స్థానాంతరణ, భ్రమణ స్వతంత్ర పరిమితికి గల సగటు శక్తి = \( \frac{1}{2} k_B T \); ప్రతి కంపన రీతికి గల శక్తి = \( k_B T \).
ఏకపరమాణుక వాయువు : మూడు స్వతంత్ర పరిమితులు (స్థానాంతరణ) ఉంటాయి. ఒక మోల్ వాయువు శక్తి \( U = \frac{3}{2} k_B T \times N_A = \frac{3}{2} RT \)
∴ స్థిర ఘనపరిమాణ విశిష్టోష్ణ సామర్థ్యము \( C_v = \frac{dU}{dT} = \frac{3}{2} R \)
స్థిర పీడన విశిష్టోష్ణ సామర్థ్యము \( C_p = C_v + R = \left(\frac{3}{2} + 1\right) R = \frac{5}{2} R \)
ద్విపరమాణుక వాయువు : మూడు స్థానాంతరణ, రెండు భ్రమణ స్వతంత్ర పరిమితులు కలవు. మొత్తం స్వతంత్ర పరిమితుల సంఖ్య 5.
∴ ఒక మోల్ వాయువు శక్తి \( U = 5 \times \frac{1}{2} k_B T \times N_A = \frac{5}{2} RT \)
స్థిర ఘనపరిమాణ విశిష్టోష్ణ సామర్థ్యము \( C_v = \frac{dU}{dT} = \frac{5}{2} R \); స్థిర పీడన విశిష్టోష్ణ సామర్థ్యము \( C_p = C_v + R = \left(\frac{5}{2} + 1\right) R = \frac{7}{2} R \)
బహుపరమాణుక వాయువు : మూడు స్థానాంతరణ, మూడు భ్రమణ మరియు కనీసం ఒక కంపన స్వతంత్ర రీతులు ఉంటాయి.
∴ 1 మోల్ వాయువు శక్తి \( U = \left(\frac{3}{2} k_B T + \frac{3}{2} k_B T + f k_B T\right) N_A = (3 + f) k_B T N_A = (3 + f) RT \)
∴ \( C_v = \frac{dU}{dT} = (3 + f) R \); \( C_p = C_v + R = (4 + f) R \)
Exam Tips:
a) ప్రతి స్థానాంతరణ, భ్రమణ స్వతంత్ర పరిమితికి ½k_BT అని రాసి, ఏక-, ద్వి-, బహుపరమాణుక వాయువులకు C_v = 3R/2, 5R/2, (3+f)R మరియు C_p = C_v + R విలువలను పట్టికగా రాయండి.
Question 3: అణుచలన సిద్ధాంతం ఆధారంగా పరమ శూన్య ఉష్ణోగ్రత భావనను వివరించండి.
Answer:
వాయు అణుచలన సిద్ధాంతం ప్రకారంగా, ఒక మోల్ ఆదర్శ వాయువు కలుగజేసే పీడనము,
\( P = \frac{1}{3} \rho C^2 \Rightarrow P = \frac{1}{3} \frac{M}{V} C^2 \)
⇒ \( PV = \frac{1}{3} M C^2 \)
⇒ \( \frac{1}{3} M C^2 = RT \) ……… (1) (∵ PV = RT)
పరమ శూన్య ఉష్ణోగ్రత:
ఉష్ణోగ్రత, T = 0 అయిన సమీకరణం (1) నుండి, C = 0 కాబట్టి, పరమశూన్య ఉష్ణోగ్రత అనగా వాయు అణువుల యొక్క rms వేగము శూన్యముగా మారు ఉష్ణోగ్రత. అనగా, పరమ శూన్య ఉష్ణోగ్రత వద్ద వాయు అణువులలో ఎటువంటి కదలికా లేక నిశ్చల స్థితిలో ఉండును.
ఈ నిర్వచనము కేవలము ఆదర్శ వాయువులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ, వాడుకలో ఉన్న నిజ వాయువులు అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆదర్శ వాయువులుగా వ్యవహరించవు.
Exam Tips:
a) (1/3)MC² = RT లో T = 0 ⇒ C = 0 అని చూపండి; ఇది ఆదర్శ వాయువుకే వర్తిస్తుందని, నిజ వాయువులు ముందే ద్రవీకరిస్తాయని చెప్పండి.
Question 4: ఆదర్శ వాయువులోని అణువు సగటు గతిజశక్తి, వాయువు పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని రుజువు చేయండి.
Answer:
వాయు అణుచలన సిద్ధాంతం ప్రకారంగా, ఒక మోల్ ఆదర్శ వాయువు కలుగజేసే పీడనము,
\( P = \frac{1}{3} \rho C^2 \), ఇచ్చట ρ = వాయు సాంద్రత
∴ \( P = \frac{1}{3} \frac{M}{V} C^2 \) ⇒ \( PV = \frac{1}{3} M C^2 \)
కాని PV = RT (ఆదర్శ వాయు సమీకరణము నుండి)
∴ \( \frac{1}{3} M C^2 = RT \)
⇒ \( \frac{1}{3} \frac{M}{N_A} C^2 = \frac{R}{N_A} T = k_B T \) (∵ \( k_B = \frac{R}{N_A} \) మరియు \( \frac{M}{N_A} = m \))
⇒ \( \frac{1}{3} m C^2 = k_B T \) లేదా \( \frac{1}{2} m C^2 = \frac{3}{2} k_B T \)
⇒ \( \frac{1}{2} m C^2 \propto T \)
\( \frac{1}{2} m C^2 \) అనగా వాయువులోని అణువు సగటు గతిజశక్తి.
కాబట్టి, ఆదర్శ వాయువులోని అణువు సగటు గతిజశక్తి, వాయువు పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
Exam Tips:
a) PV = (1/3)MC² = RT నుండి మొదలుపెట్టి ½mC² = (3/2)k_BT అని, k_B = R/N_A ఉపయోగించి సాధించండి; ప్రతి దశ రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
Question 5: V₁, V₂ ఘనపరిమాణాలు కలిగిన రెండు ఉష్ణ బంధక పాత్రలు 1, 2 లను ఒక వాల్వుతో కలిపి వాటిలో ఉష్ణోగ్రతలు (T₁, T₂) పీడనాలు (P₁, P₂) వరుసగా ఉండేటట్లుగా గాలిని నింపారు. ఈ రెండు పాత్రలను కలిపే ఆ వాల్వ్ ను ఇప్పుడు తెరిస్తే, సమతాస్థితి వద్ద ఆ పాత్రల్లో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ?
Answer:
ఆదర్శ వాయు సమీకరణము నుండి
\( \frac{P_1 V_1}{T_1} = \mu_1 R \) మరియు \( \frac{P_2 V_2}{T_2} = \mu_2 R \) ……… (1)
వాయు పాత్రలు ఉష్ణబంధక పాత్రలు గనుక, ఎటువంటి బాహ్యపని జరుగదు, కనుక మొత్తం శక్తి స్థిరముగా ఉండును.
కాబట్టి \( \frac{3}{2} (P_1 V_1 + P_2 V_2) = \frac{3}{2} P (V_1 + V_2) \)
∴ మిశ్రమ పీడనము \( P = \frac{P_1 V_1 + P_2 V_2}{V_1 + V_2} \) ……… (2)
రెండు వాయువుల మిశ్రమంలో,
\( (\mu_1 + \mu_2) RT = P (V_1 + V_2) \)
ఇందులో T = మిశ్రమ ఉష్ణోగ్రత
సమీకరణాలు (1), (2) లను పై సమీకరణంలో ప్రతిక్షేపించగా,
\( \left(\frac{P_1 V_1}{R T_1} + \frac{P_2 V_2}{R T_2}\right) RT = \frac{P_1 V_1 + P_2 V_2}{V_1 + V_2} (V_1 + V_2) \)
⇒ \( \left[\frac{P_1 V_1}{T_1} + \frac{P_2 V_2}{T_2}\right] T = (P_1 V_1 + P_2 V_2) \)
పై సమీకరణమును సాధించగా,
\( T = \frac{(P_1 V_1 + P_2 V_2) T_1 T_2}{P_1 V_1 T_2 + P_2 V_2 T_1} \)
ఇదే సమతాస్థితి వద్ద ఆ పాత్రల్లో ఉన్న గాలి యొక్క ఉష్ణోగ్రత.
Exam Tips:
a) ఉష్ణబంధక పాత్రలో బాహ్యపని లేదు, కాబట్టి మొత్తం అంతర్గత శక్తి స్థిరం; μ₁ + μ₂ మోల్లతో (μ₁+μ₂)RT = P(V₁+V₂) వాడి T = (P₁V₁+P₂V₂)T₁T₂/(P₁V₁T₂+P₂V₂T₁) పొందండి.
Question 6: ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్ అణువుల rms వడుల నిష్పత్తి ఎంత ? (మే 2014)
Answer:
T ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఆక్సిజన్ వాయువులోని అణువుల rms వడి,
\( C_{O_2} = \sqrt{\frac{3RT}{M_{O_2}}} = \sqrt{\frac{3RT}{32}} \)
అదే ఉష్ణోగ్రత (T) వద్ద ఉన్న హైడ్రోజన్ వాయు అణువుల rms వడి,
\( C_{H_2} = \sqrt{\frac{3RT}{M_{H_2}}} = \sqrt{\frac{3RT}{2}} \)
ఆక్సిజన్, హైడ్రోజన్ అణువుల rms వడుల నిష్పత్తి
\( \frac{C_{O_2}}{C_{H_2}} = \frac{\sqrt{3RT/32}}{\sqrt{3RT/2}} = \sqrt{\frac{2}{32}} = \frac{1}{4} \)
∴ Cఆక్సి : Cహై = 1 : 4
Exam Tips:
a) C ∝ 1/√M; హైడ్రోజన్ అణు ద్రవ్యరాశి 2 (పరమాణు ద్రవ్యరాశి 1 కాదు), ఆక్సిజన్ 32 తీసుకుంటే C_O : C_H = 1 : 4.
Question 7: ఒక వాయువులోని నాలుగు అణువులు 1, 2, 3, 4km/s ల వడులు కలిగి ఉన్నాయి. ఆ వాయు అణువు rms వడిని కనుక్కోండి.
Answer:
ఇక్కడ, C₁ = 1 km/s; C₂ = 2 km/s; C₃ = 3 km/s; C₄ = 4km/s
వాయు అణువుల rms వడి,
\( C_{rms} = \sqrt{\frac{C_1^2 + C_2^2 + C_3^2 + C_4^2}{4}} = \sqrt{\frac{1^2 + 2^2 + 3^2 + 4^2}{4}} = \sqrt{\frac{1 + 4 + 9 + 16}{4}} = \sqrt{7.5} \)
∴ Crms = 2.74 km/s
Exam Tips:
a) rms వడి = √(సగటు వర్గం) — మొదట వడుల వర్గాల సగటు (30/4 = 7.5) తీసుకుని తరువాత వర్గమూలం (2.74 km/s) తీయండి.
Question 8: ఒక వాయువుకు f స్వతంత్ర పరిమితులు ఉంటే, Cₚ, Cᵥ ల నిష్పత్తిని కనుక్కోండి.
Answer:
ఒక బహుపరమాణుక వాయువుకు ‘f’ స్వతంత్ర పరిమితులు ఉన్నాయి అని అనుకొనుము.
కాబట్టి, ఒక గ్రాము మోల్ వాయువు యొక్క అంతర్గత శక్తి,
\( U = f \times \frac{1}{2} k_B T \times N_A = \frac{f}{2} RT \)
మరియు \( C_v = \frac{dU}{dT} \) కాబట్టి \( C_v = \frac{d}{dT}\left(\frac{f}{2} RT\right) = \frac{f}{2} R \)
ఇంకా \( C_p = C_v + R \) కాబట్టి \( C_p = \frac{f}{2} R + R = \left(\frac{f}{2} + 1\right) R \)
\( C_p, C_v \) ల నిష్పత్తి, \( \gamma = \frac{C_p}{C_v} = \frac{\left(\frac{f}{2} + 1\right) R}{\frac{f}{2} R} = \frac{2}{f}\left(\frac{f}{2} + 1\right) \)
\( \Rightarrow \gamma = \frac{C_p}{C_v} = \left(1 + \frac{2}{f}\right) \)
Exam Tips:
a) U = (f/2)RT, C_v = (f/2)R, C_p = C_v + R, γ = 1 + 2/f అని వరుసగా రాయండి; ఏకపరమాణుకానికి f = 3 ⇒ γ = 5/3 అని పరిశీలించండి.
Question 9: 127°C వద్ద ఉన్న 1 గ్రాము హీలియం (అణుభారం 4) కు అణు గతిజశక్తిని
లెక్కించండి. R = 8.31 J mol⁻¹ K ⁻¹.
Answer:
n = హీలియం వాయువులోని మోల్‌ల సంఖ్య \( = \frac{1\ \mathrm{g}}{4\ \mathrm{g\,mol^{-1}}} = 0.25 \) మోల్
R = 8.314 J mol⁻¹ K ⁻¹,
T = 127°C = 127 + 273 = 400K
∴ అణు గతిజశక్తి \( = \frac{3}{2} \) nRT \( = \frac{3}{2} × 0.25 \) mol × 8.314 J mol⁻¹ K⁻¹ × 400K = 1247.1 J
Exam Tips:
a) గతిజశక్తి = (3/2)nRT, n = 1/4 = 0.25 మోల్, T = 400 K (కెల్విన్లోకి మార్చడం మరచిపోవద్దు); జవాబు ≈ 1247 J.
Question 10: ఒక వాయువుకు పీడనం 2% పెరిగితే, దాని ఘనపరిమాణంలో తగ్గుదల శాతం ఎంత వుంటుంది ? వాయువు బాయిల్ నియమం పాటిస్తుందని ఊహించండి.
Answer:
ఒక వాయువు యొక్క తొలిపీడనం ‘P’ మరియు ఘనపరిమాణం ‘V’ అని అనుకొనుము.
ఆ వాయు పీడనం 2% పెరిగితే, కొత్త పీడనం,
\( P' = P + \frac{2}{100} P = \frac{102}{100} P \)
బాయిల్ నియమం ప్రకారం, PV = స్థిరాంకం ⇒ PV = P′V′
⇒ \( PV = \frac{102}{100} P \times V' \) ⇒ \( V' = \frac{100}{102} V \)
వాయు ఘనపరిమాణంలో తగ్గుదల శాతం \( = \frac{V - V'}{V} \times 100 = \frac{V - \frac{100}{102} V}{V} \times 100 = \frac{2}{102} \times 100 = 1.96\% \)
కావున వాయుపీడనం 2% పెరిగితే వాయు ఘనపరిమాణం 1.96% తగ్గుతుంది.
Exam Tips:
a) P' = 1.02P, V' = V/1.02; తగ్గుదల % = (V − V')/V × 100 = 1.96% (2% కాదు, ఎందుకంటే V' కొత్త విలువ).
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
Question 1: అణుచలన సిద్ధాంతం నుంచి ఒక పాత్రలోని ఆదర్శ వాయువు పీడనానికి సమాసం రాబట్టి, తద్వారా ఉష్ణోగ్రతకు గతిక అర్ధ వివరణను ఇవ్వండి.
Answer:
భుజము పొడవు ‘l’ ఉన్న ఒక ఘనాన్ని తీసుకోండి. దాని భుజముల వెంబడి నిరూపకాక్షాలు x, y మరియు z అనుకోండి. ఈ దిశలలో వాయు అణువు వేగ అంశాలు vₓ, vy మరియు vz అనుకోండి. y – z తలానికి లంబంగా x – అక్షం వెంబడి చలించే అణువు వేగము vₓ. ఇది y – z తలంతో స్థితిస్థాపక అభిఘాతం జరపడం వల్ల వచ్చిన దిశలో వెనుకకు మరలుతుంది కావున వేగాలు vy, vz లు ప్రభావితం కావు.
x – దిశలో వాయు అణువు ద్రవ్యవేగంలో మార్పు = తుది ద్రవ్యవేగము (–mvₓ) – తొలి ద్రవ్యవేగము (mvₓ) = –2mvₓ ……… (1)
పాత్ర గోడ వైశాల్యము A అనుకుంటే Δt కాలంలో పాత్ర గోడ నుండి vₓΔt దూరంలో గల అణువులు మాత్రమే గోడను ఢీకొంటాయి. కావున AvₓΔt ఘనపరిమాణంలో ఏకాంక ఘనపరిమాణానికి గల అణువుల సంఖ్య ‘n’ అనుకుంటే వీటిలో సగం గోడవైపు, మిగిలినవి పాత్ర గోడ నుండి దూరంగా చలిస్తాయి. కావున Δt కాలంలో గోడకు బదిలీ ఐన ద్రవ్యవేగము
Q = 2mvₓ × గోడను తాకిన అణువుల సంఖ్య
∴ \( Q = 2 m v_x \left(\frac{1}{2} n A v_x \Delta t\right) \)
పాత్ర గోడ y, z తలంపై పీడనము
\( P_x = \frac{\text{వాయు అణువుల ద్రవ్యవేగంలో మార్పురేటు}}{\text{వైశాల్యము}} \) ∴ \( P_x = \frac{\text{బలము}}{\text{వైశాల్యము}} = \frac{Q/\Delta t}{A} = n m \overline{v_x^2} \)
వాయువు సమదైశికము అనగా వాయు అణువులు అన్ని దిశలలో సమానంగా చలిస్తాయని భావిస్తే \( v_x = v_y = v_z \)
∴ వాయు అణువు సగటు వర్గ వడి \( = \frac{\overline{v_x^2} + \overline{v_y^2} + \overline{v_z^2}}{3} = \frac{1}{3} \overline{v^2} \); ఇందులో \( \overline{v_x^2} + \overline{v_y^2} + \overline{v_z^2} = \overline{v^2} \)
వాయువు మొత్తం పీడనము \( P = n m \overline{v_x^2} = \frac{1}{3} n m \overline{v^2} \)
పాస్కల్ నియమం ప్రకారం పాత్ర అంతటా ఒకే పీడనం ఉంటుంది. కాబట్టి x, y, z దిశలో ఏ దిశ వెంబడి అయినా పీడనం విలువ ఒక్కటే.
పై సమీకరణంలో పాత్ర ఆకారానికి సంబంధించిన పదం లేకపోవడం వల్ల ఈ సమీకరణ ఎటువంటి ఆకారం గల పాత్రకైనా వర్తిస్తుంది.
ఉష్ణోగ్రతకు గతిక వివరణ:
వాయు సమీకరణం నుండి \( PV = \frac{1}{3} n V m \overline{v^2} = \frac{2}{3} N \left(\frac{1}{2} m \overline{v^2}\right) \)
ఇందులో N = nV మరియు \( \frac{1}{2} m \overline{v^2} \) = ఒక అణువు సగటు గతిజశక్తి.
ఆదర్శ వాయువు అంతర్గత శక్తి శుద్ధంగా గతిజశక్తి కావున \( E = N \cdot \frac{1}{2} m \overline{v^2} \) ∴ \( PV = \frac{2}{3} E = N k_B T \)
పై సమీకరణాల నుండి \( \frac{E}{N} = \frac{1}{2} m \overline{v^2} = \frac{3}{2} k_B T \Rightarrow \frac{E}{N} \propto T \)
అనగా ఒక అణువు సగటు గతిజశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది వాయువు పీడనం, పాత్ర ఘనపరిమాణం మీద ఆధారపడని ఉష్ణగతిక చలరాశి.
Exam Tips:
a) ఘనం, ద్రవ్యవేగ మార్పు 2mvₓ, ΔT లో గోడ తాకే అణువులు ½nAvₓΔt అని మూడు దశలు రాయండి; P = (1/3)nmv̄² పొందాక PV = (2/3)E = Nk_BT నుండి ఉష్ణోగ్రత వివరణ ఇవ్వండి.
లెక్కలు
Question 1: STP వద్ద ఆక్సిజన్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణంలో, ఆక్సిజన్ అణు ఘనపరిమాణ భాగాన్ని అంచనావేయండి. ఆక్సిజన్ అణువు వ్యాసాన్ని 3 Å గా తీసుకోండి.
Answer:
ఇచ్చట అణువు వ్యాసము d = 3 Å,
అణువు వ్యాసార్ధము \( r = \frac{d}{2} = \frac{3}{2} \text{ Å} = \frac{3}{2} \times 10^{-8} \) cm.
అణు ఘనపరిమాణము \( V = \frac{4}{3} \pi r^3 \cdot N \), ఇచ్చట N అనునది అవొగాడ్రో సంఖ్య
\( = \frac{4}{3} \times \frac{22}{7} (1.5 \times 10^{-8})^3 \times (6.023 \times 10^{23}) = 8.52 \) cc.
STP వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించు నిజ ఘనపరిమాణము, V′ = 22400 cc
∴ \( \frac{V}{V'} = \frac{8.52}{22400} = 3.8 \times 10^{-4} \approx 4 \times 10^{-4} \)
Exam Tips:
a) అణు ఘనపరిమాణం = (4/3)πr³ N, r = 1.5 × 10⁻⁸ cm (Å = 10⁻⁸ cm); STP వద్ద మోలార్ ఘనపరిమాణం 22400 cc తో భాగిస్తే ≈ 4 × 10⁻⁴.
Question 2: ప్రామాణిక ఉష్ణోగ్రతా పీడనాల వద్ద (STP : 1 వాతావరణ పీడనం, 0°C) ఏదైనా ఒక మోల్ (ఆదర్శ) వాయువు ఆక్రమించే ఘనపరిమాణాన్ని మోలార్ ఘనపరిమాణం అంటారు. ఇది 22.4 లీటర్లు అని చూపండి.
Answer:
1 మోల్ ఆదర్శ వాయువుకు, PV = RT ∴ \( V = \frac{RT}{P} \). R = 8.31 J mol⁻¹ K⁻¹, T = 273 K మరియు P = 1 వాతావరణ పీడనం = 1.013 × 10⁵ N m⁻² విలువలను పై సమీకరణములో ప్రతిక్షేపించగా,
\( V = \frac{8.31 \times 273}{1.013 \times 10^5} = 0.0224\ \mathrm{m^3} = 0.0224 \times 10^6 \) cc = 22400 cc = 22.4 లీటర్లు.
Exam Tips:
a) V = RT/P లో P = 1.013 × 10⁵ N m⁻², T = 273 K ప్రతిక్షేపించి m³ ను లీటర్లకు (1 m³ = 1000 L) మార్చండి.
Question 3: రెండు వేరు వేరు ఉష్ణోగ్రతల వద్ద 1.00 × 10⁻³ kg ఆక్సిజన్ వాయువుకు PV/T కి, P కి మధ్య గ్రాఫ్ వక్రాన్ని పటం సూచిస్తుంది.
a) చుక్కల గీత వక్రం ఏ ప్రాధాన్యతను సూచిస్తుంది ?
b) వీటిలో ఏది నిజం : T₁ >T₂ (లేదా) T₁ < T₂?
c) Y-అక్షంపై వక్రాలు కలిసిన చోట PV/T విలువ ఎంత ?
d) 1.00 × 10⁻³ kg హైడ్రోజన్‌కు ఇటువంటి వక్రాలే వస్తే, Y-అక్షంపై వక్రాలు కలిసిన చోట PV/T కి ఇదే విలువ వస్తుందా ? ఒకవేళ రాకుంటే, ఎంత ద్రవ్యరాశి ఉన్న హైడ్రోజన్, అదే PV/T విలువను ఇస్తుంది. (గ్రాఫ్‌లో అల్పపీడనం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతానికి) ? (H₂ అణు ద్రవ్యరాశి = 2.02 u, O₂ అణు ద్రవ్యరాశి = 32.0 u, R = 8.31 Jmol⁻¹ K ⁻¹.)
Answer:
a) చుక్కల గీత \( \frac{PV}{T} (= \mu R) \) అనునది స్థిరరాశి అని సూచిస్తుంది. ఇది పీడనంపై ఆధారపడదు. చుక్కల గీత వక్రం ఆదర్శ వాయు ప్రవర్తనను సూచిస్తుంది.
b) T₁ ఉష్ణోగ్రతా వక్రం, T₂ ఉష్ణోగ్రతా వక్రం కన్నా చుక్కల గీతకు సమీపంలో ఉంది. ఉష్ణోగ్రతను పెంచినపుడు నిజవాయువు ప్రవర్తన ఆదర్శ వాయు ప్రవర్తనకు దగ్గరగా ఉంటుంది. అందువల్ల T₁ > T₂.
c) Y-అక్షంపై వక్రాలు కలిసిన చోట \( \frac{PV}{T} \) విలువ μR కు సమానం.
∴ \( \frac{PV}{T} = \mu R = \left(\frac{1}{32}\right) \times 8.31\ \mathrm{J K^{-1}} = 0.26\ \mathrm{J K^{-1}} \)
d) Y-అక్షంపై వక్రాలు కలిసిన చోట \( \frac{PV}{T} \) కి ఇదే విలువ రాదు. ఎందువలన అనగా ఆక్సిజన్ అణు ద్రవ్యరాశికి, హైడ్రోజన్ అణు ద్రవ్యరాశికి మధ్య తేడా ఉంటుంది. \( \frac{PV}{T} \) విలువ పైన ఉదహరించినట్లుగా రావలెనంటే, కావలసిన హైడ్రోజన్ ద్రవ్యరాశి m:
\( \frac{PV}{T} = \mu R = \frac{m}{2.02} \times 8.31 = 0.26 \Rightarrow m = \frac{2.02 \times 0.26}{8.31} \) గ్రాము = 6.32 × 10⁻² గ్రాము.
Exam Tips:
a) PV/T = μR స్థిరం (ఆదర్శ వాయువు); b) T₁ > T₂ (ఉష్ణోగ్రత ఎక్కువ ⇒ ఆదర్శ ప్రవర్తనకు దగ్గరగా); c) μR = (1/32) × 8.31 = 0.26 J/K; d) m = 2.02 × 0.26/8.31 = 6.32 × 10⁻² g.
Question 4: 30 లీటర్ల ఘనపరిమాణం ఉన్న ఆక్సిజన్ సిలిండర్ తొలి గేజ్ పీడనం 15 atm, ఉష్ణోగ్రత 27°C. ఆ సిలిండర్ నుంచి కొంత ఆక్సిజన్ వాయువును తొలగించిన తరువాత గేజ్ పీడనం 11atm కు, ఉష్ణోగ్రత 17°Cకు పడిపోయాయి. అయితే, సిలిండరు నుంచి తొలగించిన ఆక్సిజన్ వాయువు ద్రవ్యరాశిని అంచనా కట్టండి. (R = 8.31 J mole⁻¹ K ⁻¹, O₂ అణు ద్రవ్యరాశి = 32 u).
Answer:
ప్రారంభమున ఆక్సిజన్ సిలిండరు నందు, V₁ = 30 లీటర్లు = 30 × 10⁻³ m³
P₁ = 15 atm = 15 × 1.01 × 10⁵ Pa; T₁ = 27 + 273 = 300 K.
సిలిండర్ n₁ మోల్‌ల ఆక్సిజన్ కల్గియున్న P₁V₁ = n₁RT₁
(లేదా) \( n_1 = \frac{(15 \times 1.01 \times 10^5) \times (30 \times 10^{-3})}{8.3 \times 300} = 18.253 \)
ఆక్సిజన్ అణుభారం M = 32 g
సిలిండర్‌లో ఆక్సిజన్ తొలి ద్రవ్యరాశి m₁ = n₁M = 18.253 × 32 = 584.1 g.
చివరగా ఆక్సిజన్ సిలిండర్ నందు n₂ మోల్‌ల ఆక్సిజన్ మిగిలినది.
ఇచ్చట V₂ = 30 × 10⁻³ m³; P₂ = 11 × 1.01 × 10⁵ Pa; T₂ = 17 + 273 = 290 K
ఇపుడు \( n_2 = \frac{P_2 V_2}{R T_2} = \frac{(11 \times 1.01 \times 10^5) \times (30 \times 10^{-3})}{8.3 \times 290} = 13.847 \)
∴ సిలిండర్‌లో ఆక్సిజన్ వాయువు తుది ద్రవ్యరాశి m₂ = 13.847 × 32 = 443.1 g
∴ సిలిండర్ నుంచి తొలగించిన ఆక్సిజన్ వాయువు ద్రవ్యరాశి = m₁ – m₂ = 584.1 – 443.1 = 141.0 g
Exam Tips:
a) రెండు స్థితులకు P₁V₁ = n₁RT₁, P₂V₂ = n₂RT₂ వాడి n₁ − n₂ = 18.253 − 13.847 = 4.406 మోల్ ⇒ 4.406 × 32 = 141 g అని ఒకే సారి తీసివేయడం సులభం.
Question 5: 40 m లోతు, 12°C ఉష్ణోగ్రత ఉన్న సరస్సు అడుగు నుంచి 1.0 cm³ ఘనపరిమాణం ఉన్న గాలి బుడగ పైకి లేస్తుంది. ఉష్ణోగ్రత 35°C ఉన్న సరస్సు ఉపరితలాన్ని చేరుకోగానే అది ఎంత ఘనపరిమాణానికి పెరుగుతుంది ?
Answer:
V₁ = 1.0 cm³ = 1.0 × 10⁻⁶ m ³; T₁ = 12°C = 12 + 273 = 285 K;
P₁ = 1 atm. + h₁ ρg = 1.01 × 10⁵ + 40 × 10³ × 9.8 = 493000 Pa.
గాలి బుడగ సరస్సు ఉపరితలాన్ని చేరినపుడు
V₂ = ? ; T₂ = 35°C = 35 + 273 = 308 K; P₂ = 1 atm. = 1.01 × 10⁵ Pa
ఇప్పుడు \( \frac{P_1 V_1}{T_1} = \frac{P_2 V_2}{T_2} \) లేదా \( V_2 = \frac{P_1 V_1 T_2}{T_1 P_2} \)
∴ \( V_2 = \frac{(493000) \times (1.0 \times 10^{-6}) \times 308}{285 \times 1.01 \times 10^5} = 5.275 \times 10^{-6}\ \mathrm{m^3} \)
Exam Tips:
a) నీటి అడుగున పీడనం P₁ = P₀ + hρg = 4.93 × 10⁵ Pa; P₁V₁/T₁ = P₂V₂/T₂ ఉపయోగించండి; ఉష్ణోగ్రతలను కెల్విన్‌లో (285 K, 308 K) రాయండి.
Question 6: 27°C ఉష్ణోగ్రత 1 atm పీడనం వద్ద 25.0 m³ ఘనపరిమాణం ఉన్న గదిలోని మొత్తం గాలి (ఆక్సిజన్, నైట్రోజన్, నీటి ఆవిరి, ఇతర అంతర్భాగాలను కలుపుకొని) అణువుల సంఖ్యను అంచనా కట్టండి.
Answer:
దత్తాంశము ప్రకారము V = 25.0 m³; T = 27 + 273 = 300 K; k = 1.38 × 10⁻²³ J K⁻¹; ఇప్పుడు, PV = nRT = n(NAk)T = (nNA) kT = N′kT
nNA = N′ = గదిలోని మొత్తం గాలిలో గల అణువుల సంఖ్య.
∴ \( N' = \frac{PV}{kT} = \frac{(1.01 \times 10^5) \times 25}{(1.38 \times 10^{-23}) \times 300} = 6.10 \times 10^{26} \)
Exam Tips:
a) PV = N′kT ⇒ N′ = PV/kT; ఇక్కడ మొత్తం అణువుల సంఖ్య అడిగారు కాబట్టి R కాకుండా k = 1.38 × 10⁻²³ J/K వాడండి.
Question 7: హీలియం పరమాణువు సగటు ఉష్ణశక్తిని,
(i) గది ఉష్ణోగ్రత (27°C),
(ii) సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత (6000 K),
(iii) 10 మిలియన్ కెల్విన్ ఉష్ణోగ్రత (ఒక నక్షత్రం యొక్క మాదిరి అంతర్భాగ ఉష్ణోగ్రత) ల వద్ద అంచనా కట్టండి.
Answer:
i) దత్తాంశము ప్రకారము T = 27°C = 27 + 273 = 300 K
సగటు ఉష్ణశక్తి \( = \frac{3}{2} kT = \frac{3}{2} \times 1.38 \times 10^{-23} \times 300 = 6.2 \times 10^{-21} \) J.
ii) T = 6000 K వద్ద, సగటు ఉష్ణశక్తి \( = \frac{3}{2} kT = \frac{3}{2} \times 1.38 \times 10^{-23} \times 6000 = 1.24 \times 10^{-19} \) J.
iii) T = 10 మిలియన్ కెల్విన్ = 10⁷ K వద్ద, సగటు ఉష్ణశక్తి \( = \frac{3}{2} kT = \frac{3}{2} \times 1.38 \times 10^{-23} \times 10^7 = 2.1 \times 10^{-16} \) J.
Exam Tips:
a) సగటు ఉష్ణశక్తి = (3/2)kT; మూడు ఉష్ణోగ్రతలకు (300 K, 6000 K, 10⁷ K) ఒకే సూత్రం ప్రతిక్షేపించండి; జవాబులు జౌల్లో (6.2 × 10⁻²¹, 1.24 × 10⁻¹⁹, 2.1 × 10⁻¹⁶).
Question 8: సమాన ఘనపరిమాణాలు ఉన్న మూడు పాత్రలలోని వాయువులు ఒకే ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఉన్నాయి. మొదటి పాత్రలో నియాన్ (ఏకపరమాణుక), రెండో దానిలో క్లోరిన్ (ద్విపరమాణుక), మూడో దానిలో యురేనియం హెక్సాఫ్లోరైడ్ (బహుపరమాణుక) వాయువులు ఉన్నాయి. ఈ పాత్రలలో ఉన్న సంబంధిత వాయు అణువుల సంఖ్యలు సమానంగా ఉంటాయా ? ఈ అణువుల rms (వడి వర్గమధ్యమ వర్గమూల) వడి మూడు సందర్భాల్లో సమానంగా ఉంటుందా ? అలా ఉండకపోతే, ఏ సందర్భానికి Vᵣₘₛ అత్యధికమై ఉంటుంది ?
Answer:
మూడు పాత్రలు (ఒకే ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద) సమాన ఘనపరిమాణాన్ని కలిగి ఉన్నాయి. అవొగాడ్రో నియమం ప్రకారము మూడు పాత్రలు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి. ఇది అవొగాడ్రో సంఖ్యకు సమానము.
అనగా N = 6.023 × 10²³.
నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద \( V_{rms} = \sqrt{\frac{3kT}{m}} \), అనగా \( V_{rms} \propto \frac{1}{\sqrt{m}} \)
అణువుల rms వేగము మూడు సందర్భాలలో సమానము కాదు. నియాన్‌కు అతి తక్కువ ద్రవ్యరాశీ వుంటుంది. కావున rms వేగం చాలా ఎక్కువ.
Exam Tips:
a) ఒకే T, P, V వద్ద అణువుల సంఖ్య సమానం (అవొగాడ్రో), కానీ V_rms ∝ 1/√m; అతి తక్కువ ద్రవ్యరాశి ఉన్న నియాన్‌కు V_rms ఎక్కువ అని ముగించండి.
Question 9: ఏ ఉష్ణోగ్రత వద్ద ఆర్గాన్ వాయువు సిలిండర్లోని ఒక పరమాణువు rms వడి -20°C వద్ద ఉన్న హీలియం పరమాణువు rms వడికి సమానంగా ఉంటుంది (Ar పరమాణు
ద్రవ్యరాశి = 39.9 u, He పరమాణు ద్రవ్యరాశి = 4.0u).
Answer:
TK మరియు T’ K ఉష్ణోగ్రతల వద్ద వరుసగా ఆర్గాన్ మరియు హీలియం వాయు పరమాణువులు. rms వేగము C మరియు C’ అని అనుకొనుము.
ఇచ్చట, M = 39.9 ; M’ = 4.0; T= ? T’ = -20 + 273 = 253K
ఇప్పుడు \( C = \sqrt{\frac{3RT}{M}} = \sqrt{\frac{3RT}{39.9}} \) మరియు \( C' = \sqrt{\frac{3RT'}{M'}} = \sqrt{\frac{3R \times 253}{4}} \)
(లేదా) \( C = C' \) కావున \( \sqrt{\frac{3RT}{39.9}} = \sqrt{\frac{3R \times 253}{4}} \) (లేదా) \( T = \frac{39.9 \times 253}{4} = 2523.7 \) K.
Exam Tips:
a) C = C′ ⇒ T/M = T′/M′ ⇒ T = 39.9 × 253/4 ≈ 2524 K; −20°C ను 253 K గా మార్చడం మరచిపోవద్దు.
Question 10: ఒక సిలిండర్‌లో 2.0 atm పీడనం, 17°C ఉష్ణోగ్రత వద్ద ఉన్న నైట్రోజన్ వాయు అణువు స్వేచ్ఛా పథమధ్యమాన్ని, అభిఘాత పౌనఃపున్యాన్ని లెక్కించండి. నైట్రోజన్ అణువు వ్యాసార్ధాన్ని సుమారు 1.0Å గా తీసుకోండి. దాని అభిఘాత కాలాన్ని రెండు వరుస అభిఘాతాల మధ్య అణువు స్వేచ్ఛగా తిరగడానికి పట్టే కాలంతో పోల్చండి. N₂ అణువు ద్రవ్యరాశి = 28.0 u),
Answer:
λ = ?, f = ? ; p = 2 atm = 2 × 1.013 × 10⁵ Nm ⁻²; T = 17°C = (17 + 273) K = 290 K σ = 2 × 1 = 2 Å = 2 × 10⁻¹⁰ m; k = 1.38 × 10⁻²³ J molecule⁻¹ K⁻¹, M = 28 × 10⁻³ kg
\( \lambda = \frac{kT}{\sqrt{2}\,\pi \sigma^2 p} = \frac{1.38 \times 10^{-23} \times 290}{1.414 \times 3.14 \times (2 \times 10^{-10})^2 \times 2.026 \times 10^5} = \frac{1.38 \times 29 \times 10^{-7}}{1.414 \times 3.14 \times 4 \times 2.026} = 1.11 \times 10^{-7} \) m
\( v_{rms} = \sqrt{\frac{3RT}{M}} = \sqrt{\frac{3 \times 8.31 \times 290}{28 \times 10^{-3}}} = 508.24 \) m/s
అభిఘాత పౌనఃపున్యము = ఒక సెకనులో జరిగే అభిఘాతాల సంఖ్య = \( \frac{v_{rms}}{\lambda} = \frac{508.24}{1.11 \times 10^{-7}} = 4.58 \times 10^9\ \mathrm{s^{-1}} \)
అభిఘాత కాలం \( \approx \frac{\sigma}{v_{rms}} = \frac{2 \times 10^{-10}}{508.24} \approx 4 \times 10^{-13} \) s; రెండు వరుస అభిఘాతాల మధ్య కాలం \( \approx \frac{\lambda}{v_{rms}} = \frac{1.11 \times 10^{-7}}{508.24} \approx 2.2 \times 10^{-10} \) s.
∴ అభిఘాత కాలం, రెండు వరుస అభిఘాతాల మధ్య కాలంలో సుమారు 1/550 వ వంతు మాత్రమే.
Exam Tips:
a) λ = kT/(√2 πσ²p) లో σ = వ్యాసం (2 × వ్యాసార్ధం) = 2 Å తీసుకోండి; పౌనఃపున్యం = v_rms/λ; కాలాల పోలిక కూడా రాయండి.
Question 11: ఒక మీటరు పొడవు కలిగి, ఇరుకైన బోలు రంధ్రం (bore) ఉన్న (ఒకవైపు మూసిన) గొట్టాన్ని క్షితిజ సమాంతరంగా ఉంచినప్పుడు, అందులో 76 cm పొడవైన పాదరస దారం (thread) ఉంటే, అది 15 cm (పొడవైన) ల గాలి స్తంభాన్ని పట్టుకోగలుగుతుంది. ఇప్పుడు గొట్టాన్ని, తెరిచిన కొన కిందివైపు ఉండేటట్లు నిలువుగా ఉంచితే ఏం జరుగుతుంది?
Answer:
గాజు గొట్టమును క్షితిజ సమాంతరంగా వుంచిన, 76 cm పొడవుగా గల పాదరసం 15 cm పొడవు గల గాలిని బంధించును. తెరిచి ఉన్న వైపు 9 cm పొడవు గల గొట్టం మిగిలి ఉంటుంది.
గొట్టంలో గల గాలిపై వాతావరణ పీడనం వుండును.
గొట్టం అడ్డుకోత వైశాల్యంను 1sq.cm. అని అనుకొనుము.
∴ P₁ = 76 cm మరియు V₁ = 15 cm ³.
అదే గొట్టమును నిట్టనిలువుగా వుంచిన, 15cm పొడవు గల గాలి అదనముగా 9 cm పెరుగును. మరియు పాదరసం, వాతావరణ పీడనమును సమము చేయుటకు h cm దూరం బయటకి ప్రవహించును. దీనిని పటం (b)లో చూపితిమి. అందువలన గాలి ఎత్తు మరియు పాదరసం ఎత్తు వరుసగా (24 + h) cm మరియు (76 – h) cm.
గాలి పీడనము = 76 – (76 – h) = h cm పాదరసం
∴ V₂ = (24 + h) cm³ మరియు P₂ = h cm
ఉష్ణోగ్రత స్థిరం అని ఊహించిన
P₁V₁ = P₂V₂
(లేదా) 76 × 15 = h × (24 + h)
(లేదా) h² + 24h – 1140 = 0
(లేదా) \( h = \frac{-24 \pm \sqrt{(24)^2 + 4 \times 1140}}{2} = 23.8 \) cm (లేదా) –47.8 cm
h ఋణాత్మకం కాదు కావున h = 23.8 cm. అందువల్ల, గొట్టాన్ని నిట్టనిలువుగా ఉంచినపుడు 23.8 cm పాదరసం బయటికి వస్తుంది (గొట్టంలో 76 – 23.8 = 52.2 cm పాదరసం మిగులుతుంది).
Exam Tips:
a) బాయిల్ నియమం: 76 × 15 = h(24 + h) ⇒ h² + 24h − 1140 = 0; ఋణ మూలాన్ని తిరస్కరించి h = 23.8 cm పొందండి.
Question 12: ఒక నిర్దిష్టమైన పరికరం నుంచి హైడ్రోజన్ సగటు విసరణ రేటు విలువ 28.7 cm ³s⁻¹ గా ఉంది. అదే పరిస్థితులలో ఉన్న మరొక వాయువు సగటు విసరణ రేటు 7.2 cm ³s⁻¹ గా కొలవడమైంది. ఆ వాయువు ఏదో గుర్తించండి. సూచన : గ్రాహమ్ విసరణ నియమాన్ని ఉపయోగించండి. R₁/R₂ = (M₂/ M₁)1/2 ఇందులో R₁, R₂ లు వరుసగా 1, 2 వాయువుల విసరణ రేట్లు, M₁, M₂లు వాటి (అనురూప) అణు ద్రవ్యరాశులు. అణుచలన సిద్ధాంతం యొక్క సరళమైన పర్యవసానమే ఈ నియమం.
Answer:
గ్రాహమ్ విసరణ వాయు నియమము ప్రకారము \( \frac{r_1}{r_2}=\sqrt{\frac{M_2} {M_1}} \)
హైడ్రోజన్ వాయువు విసరణ రేటు r₁ = 28.7 cm³ s⁻¹
వేరొక వాయువు విసరణ రేటు r₂ = 7.2 cm³ s⁻¹
M₁ = హైడ్రోజన్ అణు ద్రవ్యరాశి = 2 u
M₂ = ?
\( \frac{28.7}{7.2} = \sqrt{\frac{M_2}{2}} \) (లేదా) \( M_2 = \left(\frac{28.7}{7.2}\right)^2 \times 2 = 31.78 \approx 32 \).
ఇది ఆక్సిజన్ వాయువు యొక్క అణు ద్రవ్యరాశి.
Exam Tips:
a) గ్రాహమ్ నియమం r₁/r₂ = √(M₂/M₁); M₂ = (28.7/7.2)² × 2 ≈ 32 ⇒ ఆక్సిజన్.
Question 13: సమతాస్థితిలో ఉన్న వాయువు, దాని ఘనపరిమాణమంతటా ఏకరీతి సాంద్రత, పీడనాలను కలిగి ఉంది. ఇది తప్పనిసరిగా బాహ్య ప్రభావాలు లేనపుడే యదార్థం. ఉదాహరణకు, గురుత్వ ప్రభావంలో ఉన్న ఒక వాయు స్తంభం ఏకరీతి సాంద్రత (పీడనం) కలిగి ఉండదు. ఎత్తుతో దాని సాంద్రత తగ్గుతుందని మీరు ఊహించవచ్చు. ఎత్తుపై వాయు సాంద్రత కచ్చితంగా ఎలా ఆధారపడుతుందో మనం చెప్పుకొనే వాతావరణాల నియమం ఇవ్వగలుగుతుంది.
అది,
n₂ = n₁ exp [-mg (h₂ – h₁) / kB T]
దీనిలోని n₂, n₁ లు ఎత్తులు h₂, h₁ వద్ద గల సంఖ్యా సాంద్రతను వరుసగా సూచిస్తాయి. ద్రవ స్తంభంలోని వ్యాక్షేపం (suspension) యొక్క అపసారం (sedimentation)కు ఉండే కింది సమీకరణాన్ని ఉత్పాదించటానికి పై సంబంధాన్ని ఉపయోగించండి.
n₂ = n₁ exp [–mg NA (ρ – ρ′) (h₂ – h₁)/(ρRT)]
ఇందులో ρ ద్రవంలో వేలాడే కణం సాంద్రత, ρ′ అనేది ఆ కణం చుట్టూ ఉన్న యానకం సాంద్రత (NA అవొగాడ్రో సంఖ్య, R సార్వత్రిక వాయు స్థిరాంకం). (సూచన : వేలాడే కణం దృశ్య భారాన్ని కనుక్కోవడానికి ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించండి.)
Answer:
వాతావరణాల నియమం ప్రకారము \( n_2 = n_1 \exp\left[-\frac{mg}{k_B T}(h_2 - h_1)\right] \) ……… (i)
ఇచ్చట n₁, n₂ లు వరుసగా h₁, h₂ ఎత్తుల వద్ద కణాల సంఖ్యా సాంద్రతలు.
ద్రవ స్తంభంలోని వ్యాక్షేపం యొక్క అపసారంను పరిగణించినపుడు mg స్థానంలో వ్యాక్షేపం చెందిన కణాల దృశ్యభారంను తీసుకొనవలెను.
వ్రేలాడే కణం ఘనపరిమాణము V, దాని సాంద్రత ρ, కణం చుట్టూ ఉన్న యానకం సాంద్రత ρ′, వ్రేలాడే ఒక కణం ద్రవ్యరాశి m, కణం వలన స్థానభ్రంశం చెందిన ద్రవం ద్రవ్యరాశి m′ అనుకొనుము.
ఆర్కిమెడీస్ సూత్రమును అనుసరించి వ్రేలాడే ఒక్క కణం దృశ్యభారం = నిజభారం – స్థానభ్రంశం చెందిన ద్రవభారం
\( = mg - m'g = mg - V\rho' g = mg - \left(\frac{m}{\rho}\right)\rho' g = mg\left(1 - \frac{\rho'}{\rho}\right) \)
బోల్ట్జ్మన్ స్థిరాంకము \( k_B = \frac{R}{N_A} \), ఇందులో R = సార్వత్రిక వాయు స్థిరాంకము మరియు NA = అవొగాడ్రో సంఖ్య.
mg స్థానంలో \( mg\left(1 - \frac{\rho'}{\rho}\right) \) ను మరియు kB విలువను సమీకరణం (i) లో ప్రతిక్షేపించగా
\( n_2 = n_1 \exp\left[-\frac{mg N_A}{RT}\left(1 - \frac{\rho'}{\rho}\right)(h_2 - h_1)\right] \)
ఇదే మనకు అవసరమయిన సంబంధం.
Exam Tips:
a) వేలాడే కణం దృశ్యభారం = mg(1 − ρ′/ρ) (ఆర్కిమెడిస్ సూత్రం); దానిని వాతావరణాల నియమంలో mg స్థానంలో ఉంచండి; ఘాతంలో ఋణ గుర్తు ఉంచడం మరచిపోవద్దు.
Question 14: కొన్ని ఘనపదార్థాలకు, ద్రవాలకు సాంద్రతలను కింద ఇచ్చాం. వాటి పరమాణువుల పరిమాణా (size) లకు ఉజ్జాయింపు అంచనాలను ఇవ్వండి.
| పదార్థం | పరమాణు ద్రవ్యరాశి (u) | సాంద్రత (10³ kg m⁻³) |
| కార్బన్ (వజ్రం) | 12.01 | 2.22 |
| బంగారం | 197.00 | 19.32 |
| నైట్రోజన్ (ద్రవం) | 14.01 | 1.00 |
| లిథియం | 6.94 | 0.53 |
| ఫ్లోరిన్ (ద్రవం) | 19.00 | 1.14 |
(సూచన : ఘన (పదార్థం) రూప, ద్రవరూప ప్రావస్థలో అణువులు దగ్గర దగ్గరగా బంధితమై ఉంటాయని ఊహించుకొంటూ మీకు తెలిసిన అవొగాడ్రో సంఖ్య విలువను ఉపయోగించండి. అయితే, వివిధ పరమాణు పరిమాణాలకు, ఈ విధంగా మీరు పొందే వాస్తవిక విలువలను నిజంగానే వాటికుంటాయని మాత్రం భావించకండి. దగ్గర దగ్గరగా అణువులు బంధితమై ఉంటాయనే ఉజ్జాయింపుకుండే ముడితత్వ భావన (Crudeness of the tight packing approximation) వల్ల, ఈ ఫలితాలు కొన్ని Åల వ్యాప్తిలో పరమాణు పరిమాణాలు ఉంటాయని మాత్రమే సూచిస్తాయి).
Answer:
పరమాణు వ్యాసార్ధం r అయిన, పరమాణు ఘనపరిమాణం \( = \frac{4}{3} \pi r^3 \)
ఒక మోల్ పదార్థంలోని అన్ని పరమాణువుల ఘనపరిమాణం \( = \frac{4}{3} \pi r^3 \times N = \frac{M}{\rho} \)
∴ \( r = \left[\frac{3M}{4 \pi \rho N}\right]^{1/3} \)
కార్బన్‌కు M = 12.01 × 10⁻³ kg, ρ = 2.22 × 10³ kg m⁻³
కావున \( r = \left[\frac{3 \times 12.01 \times 10^{-3}}{4 \times \frac{22}{7} \times (2.22 \times 10^3) \times (6.023 \times 10^{23})}\right]^{1/3} = 1.29 \times 10^{-10} \) m = 1.29 Å
ఇదే విధంగా బంగారం, r = 1.59 Å
ద్రవ నైట్రోజన్‌కు r = 1.77 Å
లిథియమ్కు r = 1.73 Å
మరియు ద్రవ ఫ్లోరిన్‌కు r = 1.88 Å
Exam Tips:
a) r = [3M/(4πρN)]^(1/3); M ను kg/mol లోకి (12.01 × 10⁻³) మార్చి, ρ ను kg m⁻³ లో వాడండి; జవాబులు కొన్ని Å పరిధిలో ఉంటాయి.
Free study material for Physics
Free TS Board Textbook Explanations: Class 11 Physics Chapter 14 Kinetic Theory
Accessing Chapter 14 Kinetic Theory Solutions
Explore reliable textbook solutions for Chapter 14 Kinetic Theory tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Physics.
Concept-Driven Answers for Class 11 Physics
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Physics module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Maximizing Study Efficiency
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Physics.
FAQs
The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 14 అణుచలన సిద్ధాంతం is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 14 అణుచలన సిద్ధాంతం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 14 అణుచలన సిద్ధాంతం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 14 అణుచలన సిద్ధాంతం in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 14 అణుచలన సిద్ధాంతం in printable PDF format for offline study on any device.