TS Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు

Official TS Board Solutions for Class 11 Physics: Chapter 12 Thermal Properties of Matter

Access comprehensive textbook solutions for Chapter 12 Thermal Properties of Matter using the official curriculum guides for Class 11 Physics. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Chapter-wise Solutions for Physics: Chapter 12 Thermal Properties of Matter

Navigate directly to the solved Physics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: ఉష్ణం, ఉష్ణోగ్రతల మధ్య భేదాలను పేర్కొనండి.

Answer:

ఉష్ణము మరియు ఉష్ణోగ్రతల మధ్య భేదాలు:
ఉష్ణము
1. ఉష్ణము శక్తి స్వరూపము. దీనికి ప్రమాణాలు జౌల్ లేదా కెలోరీ.
2. మనం వస్తువుకు నేరుగా ఉష్ణశక్తిని అందించగలము.
3. వస్తువు ఉష్ణోగ్రతను పెంచడానికి ఉష్ణశక్తిని మనం అందించాలి.
4. వస్తువుకు అందజేసిన ఉష్ణరాశి Q = mS∆t.
ఉష్ణోగ్రత
1. ఉష్ణోగ్రత ఒక పదార్థము యొక్క వేడిమి లేదా చల్లదనాన్ని తెలిపే కొలమానము. ప్రమాణము °F లేదా °C.
2. వస్తువుకు ఉష్ణశక్తిని అందించడంవల్ల దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. మనం వస్తువుకు ఉష్ణోగ్రతను నేరుగా అందించలేము.
3. వస్తువుల మధ్య ఉష్ణోగ్రతాభేదం ఉంటేనే ఉష్ణరాశి ఒక వస్తువు నుండి మరొక వస్తువుకు ప్రవహిస్తుంది.
4. వస్తువు ఉష్ణోగ్రతలో మార్పు ∆\( t = \frac{\mathrm{Q}}{\mathrm{mS}} \)

Exam Tips:

a) ఉష్ణం శక్తి (ప్రమాణం జౌల్/కెలోరీ), ఉష్ణోగ్రత వేడిమి స్థాయి (ప్రమాణం K, °C, °F) అని నాలుగు భేదాలను రెండు కాలమ్‌లుగా రాయండి.
b) ఉష్ణం Q = mS∆t; ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రతకే ప్రవహిస్తుంది అనే వాక్యం జోడించండి.

 

Question 2: సెల్సియస్, ఫారన్ హీట్ ఉష్ణోగ్రతా మానాలలో అధో, ఊర్ధ్వ స్థిర విలువలను తెలపండి. (మే 2014)

Answer:

సెల్సియస్ మానంలో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు ఘనీభవించే (మంచు ద్రవీభవన) స్థానాన్ని నిమ్న స్థిర బిందువు 0°C అని వ్యవహరిస్తారు. సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరుగు స్థానాన్ని ఊర్ధ్వ స్థిర బిందువు 100°C అంటారు.
ఫారన్హీట్ మానంలో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు ఘనీభవించే స్థానాన్ని నిమ్న స్థిర బిందువు 32°F గా వ్యవహరిస్తారు. సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరుగు స్థానాన్ని ఊర్ధ్వ స్థిర బిందువు 212°F అంటారు.

Exam Tips:

a) సెల్సియస్: 0°C – 100°C (100 భాగాలు), ఫారన్హీట్: 32°F – 212°F (180 భాగాలు) అని రెండు విలువలూ రాయండి.
b) అధో స్థిర బిందువు = మంచు ద్రవీభవన స్థానం, ఊర్ధ్వ స్థిర బిందువు = నీరు మరుగు స్థానం (సాధారణ పీడనం వద్ద) అని స్పష్టంగా చెప్పండి.

 

Question 3: ఉష్ణోగ్రతలను సెల్సియస్ లేదా ఫారన్హీట్ మానాలలో కొలిస్తే, వ్యాకోచ గుణకాల విలువలు మారతాయా ?

Answer:

వ్యాకోచ గుణకాలు ఉష్ణోగ్రతామానంపై ఆధారపడతాయి. ఉష్ణోగ్రతామానం మారితే ఉష్ణోగ్రతను కొలిచే ప్రమాణం విలువ మారుతుంది. α, β మరియు γ ను 1°C ఉష్ణోగ్రతా భేదానికి నిర్వచించటం వల్ల సెల్సియస్ మానంలో α, β, γ లు ఫారెన్హీట్మానంలోని α, β మరియు γ విలువల కన్న 1.8 రెట్లు పెద్దవి.

Exam Tips:

a) అవును మారతాయి: α సెల్సియస్ మానంలో ఫారన్హీట్ మానం కన్నా 1.8 రెట్లు ఎక్కువ అని రాసి, కారణం (1°C అంతరం = 1.8°F అంతరం) వివరించండి.

 

Question 4: వేడిచేస్తే పదార్థాలు సంకోచిస్తాయా ? ఒక ఉదాహరణ ఇవ్వండి.

Answer:

కొన్ని రకాలైన పదార్థాలు వేడిచేస్తే సంకోచిస్తాయి.
ఉదా : రబ్బరు, తోలు, పోత ఇనుము మరియు టైపు మెటల్ వంటివి.

Exam Tips:

a) రబ్బరు, తోలు, పోత ఇనుము వంటి ఉదాహరణలలో కనీసం ఒకటి తప్పక రాయండి.

 

Question 5: రైల్వే ట్రాక్పై రెండు వరస రైలు పట్టాల మధ్య ఖాళీ ప్రదేశం ఎందుకు వదులుతారు ?

Answer:

వేసవికాలంలో రైలు పట్టాలలోని వ్యాకోచ ప్రభావాన్ని తొలగించడానికి వీలుగా రైలు పట్టాల మధ్య ఖాళీని వదులుతారు. ఖాళీని వదలకపోతే రైలు పట్టాల వ్యాకోచం వల్ల రైలు పట్టాలు వంకర చెంది ప్రమాదాలను కలగజేస్తాయి.

Exam Tips:

a) వేసవిలో పట్టాలు వ్యాకోచించి వంగిపోకుండా ఉండటానికే ఖాళీ అని కారణం, ఖాళీ లేకపోతే కలిగే ప్రమాదం రెండూ చెప్పండి.

 

Question 6: ద్రవాలకు దైర్ఘ్య, విస్తీర్ణ వ్యాకోచ గుణకాలు ఎందుకు లేవు ?

Answer:

ద్రవాలకు స్వతంత్ర ఆకారం లేదు. అందువల్ల వాటికి దైర్ఘ్య వ్యాకోచ గుణకము, విస్తీర్ణ వ్యాకోచ గుణకాలు ఉండవు. వీటిని పాత్రలలో తీసుకోవటం వల్ల కేవలం ఘనపరిమాణమును మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అందుకని ద్రవాలకు ఘనపరిమాణ వ్యాకోచ గుణకం మాత్రమే చెపుతారు.

Exam Tips:

a) ద్రవాలకు స్వంత ఆకారం లేదు కాబట్టి ఘనపరిమాణ వ్యాకోచ గుణకం (γ) మాత్రమే ఉంటుంది అని సూటిగా రాయండి.

 

Question 7: ద్రవీభవన గుప్తోష్ణం అంటే ఏమిటి ?

Answer:

ద్రవీభవన గుప్తోష్ణము : ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థము ఘనస్థితి నుండి ద్రవస్థితికి లేదా ద్రవస్థితి నుండి ఘనస్థితికి మార్పుచెందునపుడు గ్రహించిన లేక కోల్పోయిన ఉష్ణరాశిని ద్రవీభవన గుప్తోష్ణముగా నిర్వచించినారు.

Exam Tips:

a) నిర్వచనంలో 'ప్రమాణ ద్రవ్యరాశి', 'ఘనం ↔ ద్రవం మార్పు' అనే పదాలు ఉండాలి; ప్రమాణం J kg⁻¹ (లేదా cal g⁻¹) చెప్పండి.

 

Question 8: బాష్పీభవన గుప్తోష్ణం అంటే ఏమిటి ?

Answer:

బాష్పీభవన గుప్తోష్ణం : ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థము ద్రవస్థితి నుండి బాష్పస్థితికి లేదా బాష్పస్థితి నుండి ద్రవస్థితికి మారునపుడు అది గ్రహించిన లేక కోల్పోయిన ఉష్ణరాశిని బాష్పీభవన గుప్తోష్ణముగా నిర్వచించినారు.

Exam Tips:

a) బాష్పీభవన గుప్తోష్ణం నిర్వచనంలో 'ద్రవం ↔ బాష్పం, ఉష్ణోగ్రత మారకుండా' అని రాయండి; నీటికి విలువ 540 cal g⁻¹ (2256 kJ kg⁻¹).

 

Question 9: వంట పాత్రలకు నల్లటి రంగు ఎందుకు పూస్తారు ? వంట పాత్రల అడుగు భాగాన్ని రాగితో ఎందుకు తయారుచేస్తారు?

Answer:

వంట పాత్రల అడుగు భాగం నల్లని పూత వేయటానికి ముఖ్య కారణము నల్లని వస్తువులు ఉత్తమ శోషకాలు. కావున అవి ఎక్కువ మొత్తంలో ఉష్ణాన్ని శోషిస్తాయి. రాగి ఉత్తమ ఉష్ణవాహకం కావున వంట పాత్రల అడుగు భాగంలో రాగిని ఉపయోగిస్తారు.

Exam Tips:

a) రెండు కారణాలు విడివిడిగా రాయండి: నలుపు రంగు ఉత్తమ శోషకం, రాగి ఉత్తమ ఉష్ణవాహకం.

 

Question 10: వీన్ స్థానభ్రంశ నియమాన్ని తెలపండి.

Answer:

కృష్ణ వస్తువు గరిష్ట వికిరణం జరిగే తరంగదైర్ఘ్యం, ఆ కృష్ణ వస్తువు పరమ ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది.
అనగా \( λₘ ∝ \frac{1}{T} \) లేదా \( λₘ = \frac{b}{T} \)
ఇచ్చట ‘b’ ను వీన్ స్థిరాంకం అని అందురు.

Exam Tips:

a) సూత్రం λₘ = b/T (వీన్ స్థిరాంకం b = 2.9 × 10⁻³ m K) అని రాసి, ఉష్ణోగ్రత పెరిగితే λₘ తగ్గుతుందని చెప్పండి.

 

Question 11: వెంటిలేటర్లను గదిలోని ఇంటిపై కప్పుకు కొద్దిగా కిందకి అమరుస్తారు. ఎందుకు ? (మార్చి 2014)

Answer:

వేడిగాలికి సాంద్రత తక్కువ. ఇది వాతావరణంలో పై పొరలను ఆక్రమిస్తుంది. గదిలో వేడిగాలి పైకప్పుకు దగ్గరగా చేరుతుంది. అందువల్ల వెంటిలేటర్లను కప్పుకు దగ్గరగా అమర్చితే వేడిగాలి తొందరగా బయటకు పోతుంది. ఫలితంగా గదిలోకి చల్లని గాలి ధారాళంగా క్రింది భాగాల గుండా రావటం జరుగుతుంది.

Exam Tips:

a) వేడిగాలి తేలికై పైకి చేరుతుంది (సంవహనం) → పైన ఉన్న వెంటిలేటర్ ద్వారా బయటకు పోతుంది, కింది నుంచి చల్లగాలి లోపలికి వస్తుంది అని క్రమంగా రాయండి.

 

Question 12: 0 K వద్ద మానవ దేహం ఉష్ణాన్ని వికిరణం చేస్తుందా ? 0°C వద్ద కూడా అది వికిరణం చేస్తుందా ?

Answer:

ప్రివోస్ట్ సిద్ధాంత ప్రకారము ‘సున్న’ కెల్విన్ కన్న ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద గల ప్రతి వస్తువు పరిసరాలలో ఉష్ణ వినిమయాన్ని కలిగి ఉంటుంది. కావున
1. ‘సున్న’ కెల్విన్ వద్ద గల వస్తువు నుండి ఏ విధమైన ఉష్ణవికిరణ శక్తి వెలువడదు. అనగా ఉష్ణ వికిరణం సాధ్యం కాదు.
2. 0°C అనగా 273 K కావున 0°C వద్ద గల వస్తువు ఉష్ణశక్తి వికిరణం వెలువడును. అనగా ఉష్ణ వికిరణం సాధ్యపడును.

Exam Tips:

a) ప్రివోస్ట్ సిద్ధాంతం: 0 K కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రతి వస్తువు వికిరణం చేస్తుంది; 0 K వద్ద చేయదు, 0°C (= 273 K) వద్ద చేస్తుంది.

 

Question 13: ఉష్ణ బదిలీకి సంబంధించి వివిధ విధానాలను తెలపండి. వీటిలో ఏ విధానాలకు యానకం అవసరం ?

Answer:

ఉష్ణ ప్రసారము మూడు రకాలుగా జరుగుతుంది.
1. ఉష్ణ వహనము
2. ఉష్ణ సంవహనము
3. ఉష్ణ వికిరణము.
ఉష్ణ ప్రసారంలో ఉష్ణ వహనము మరియు ఉష్ణ సంవహనము అన్న పద్ధతుల ద్వారా ఉష్ణము ప్రసరించడానికి యానకం అవసరము.

Exam Tips:

a) వహనం, సంవహనం, వికిరణం మూడూ రాసి, యానకం వహనం, సంవహనంలకే అవసరం; వికిరణానికి అవసరం లేదు అని ముగించండి.

 

Question 14: ఉష్ణ వాహకత్వ గుణకం, ఉష్ణోగ్రత ప్రవణతలను నిర్వచించండి.

Answer:

పదార్థం ఏకాంక అడ్డుకోత వైశాల్యానికి లంబంగా, ఏకాంక ఉష్ణోగ్రతా ప్రవణత ఉన్నపుడు సెకనుకు జరిగిన ఉష్ణరాశి ప్రసారాన్నే ఉష్ణ వహన గుణకంగా నిర్వచించినారు.
ఉష్ణ వహన గుణకం \( K = \frac{Q \cdot d}{A(\theta_2-\theta_1) \cdot t} \)
\( \text{ఉష్ణోగ్రతా ప్రవణత} = \frac{\text{వాహకం కొనల మధ్య ఉష్ణోగ్రతా భేదం}}{\text{వాహకం పొడవు}} = \frac{\theta_2 - \theta_1}{d} \)

Exam Tips:

a) K = Q d / [A(θ₂ – θ₁) t], ప్రమాణం W m⁻¹ K⁻¹; ఉష్ణోగ్రత ప్రవణత = (θ₂ – θ₁)/d అని రెండింటికీ విడిగా నిర్వచనం రాయండి.

 

Question 15: ఉద్గార సామర్థ్యం, ఉద్గారతలను నిర్వచించండి.

Answer:

ఉద్గార సామర్థ్యము (E λ) : ఏదైనా ఉష్ణోగ్రత వద్ద ఏకాంక వైశాల్యం గల వస్తువు నుండి తరంగదైర్ఘ్యము λ మరియు λ + dλ అవధులలో వస్తువు ప్రమాణ కాలంలో వికిరణం చెందించిన ఉష్ణరాశిని ఆ వస్తువు ఉద్గార సామర్థ్యంగా నిర్వచించినారు.
ఉద్గార సామర్థ్యము \( Eλ = \frac{\mathrm{dQ}}{\mathrm{d} \lambda} \); ప్రమాణము : వాట్ / మీ².
ఉద్గారత (e λ) : ఒక వస్తువు ఉద్గార సామర్థ్యానికి అదే ఉష్ణోగ్రత వద్ద పరిపూర్ణ కృష్ణ వస్తువు ఉద్గార సామర్థ్యానికి గల నిష్పత్తినే ఆ వస్తువు ఉద్గారత eλ గా నిర్వచించినారు.

Exam Tips:

a) ఉద్గార సామర్థ్యం (Eλ) మరియు ఉద్గారత (వస్తువు E / కృష్ణ వస్తువు E, అదే ఉష్ణోగ్రత వద్ద) నిర్వచనాలు రాయండి; ఉద్గారతకు ప్రమాణాలు ఉండవు.

 

Question 16: హరితగృహ ప్రభావం అంటే ఏమిటి ? గ్లోబల్ వార్మింగ్ గురించి వివరించండి.

Answer:

హరితగృహ ప్రభావము : భూమి నుండి శూన్యంలోకి వికిరణం చెందే ఉష్ణశక్తి తరంగదైర్ఘ్యం ఎక్కువ. ఈ ఉష్ణశక్తిని కార్బన్ డై ఆక్సైడ్ (CO₂), మీథేన్ (CH₄), క్లోరోఫ్లోరో కార్బన్ (CFₓ Cl ₓ) వంటి వాయువులు గ్రహించి భూమి వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ఈ ప్రక్రియను హరితగృహ ప్రభావము అంటారు.
గ్లోబల్ వార్మింగ్:
మానవుల చర్యల వల్ల హరితగృహ వాయువుల (CO₂, CH₄, N₂O మొ॥) గాఢత అధికమై భూమి వేడిగా తయారవుతుంది. భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను గ్లోబల్వార్మింగ్ అందురు. దీనివల్ల మంచు పర్వతాలు త్వరగా ద్రవీభవించడం, సముద్రమట్టం పెరగడం, వాతావరణం విధానం మార్పు చెందడం జరుగుతుంది.

Exam Tips:

a) CO₂, CH₄, CFC వాయువులు భూమి నుంచి వెళ్ళే వికిరణాన్ని గ్రహించి వాతావరణాన్ని వేడెక్కించడం = హరితగృహ ప్రభావం; గ్లోబల్ వార్మింగ్ పర్యవసానాలు (సముద్ర మట్టం పెరగడం, మంచు కరగడం) రాయండి.

 

Question 17: ఒక వస్తువు శోషణ సామర్థ్యాన్ని నిర్వచించండి. పరిపూర్ణ కృష్ణ వస్తువు శోషణ సామర్థ్యం ఎంత ?(మార్చి 2014)

Answer:

శోషణ సామర్థ్యము (aλ) : ఏదైనా వస్తువు యొక్క నియమిత వైశాల్యం మీద నియమిత కాలంలో (λ, λ + dλ) తరంగ వ్యవధిలో శోషణం చేసుకున్న వికిరణ శక్తి అభివాహం (dΦ′λ) కు, అదే కాల వ్యవధిలో అదే వైశాల్యంపై పతనమైన మొత్తం అభివాహం (dΦλ) కు గల నిష్పత్తిని శోషణ సామర్థ్యము (aλ) గా నిర్వచించినారు.
\( a_\lambda = \frac{\text{నిర్ణీత కాల వ్యవధిలో వస్తువు శోషణం చేసుకున్న శక్తి అభివాహం } (d\phi'_\lambda)}{\text{అదే కాల వ్యవధిలో వస్తువుపై పతనం చెందిన మొత్తం అభివాహం } (d\phi_\lambda)} \)
ఉత్తమ కృష్ణ వస్తువు శోషణ సామర్థ్యం ఒకటి (1).

Exam Tips:

a) aλ = శోషించిన అభివాహం / పతనమైన అభివాహం; పరిపూర్ణ కృష్ణ వస్తువుకు a = 1 అని చివర తప్పక రాయండి.

 

Question 18: న్యూటన్ శీతలీకరణ నియమాన్ని తెలపండి.

Answer:

న్యూటన్ శీతలీకరణ నియమము : వస్తువుకు, పరిసరాలకు మధ్య ఉష్ణోగ్రతా భేదం స్వల్పంగా ఉన్నపుడు ఆ వస్తువు కోల్పోయే ఉష్ణ శక్తి రేటు వస్తువుకూ, పరిసరాలకు మధ్య గల ఉష్ణోగ్రతా భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
వస్తువు కోల్పోయే ఉష్ణశక్తి రేటు \( \frac{dE}{dt} ∝ (T - T_s) \) లేదా శీతలీకరణ రేటు \( \frac{dT}{dt} = - \frac{b}{mc} (T - T_s) \) ఇందులో Tₛ పరిసరాల ఉష్ణోగ్రత, T వస్తువు ఉష్ణోగ్రత.

Exam Tips:

a) న్యూటన్ నియమం: dT/dt = –K(T – T₀); ఉష్ణోగ్రతా భేదం స్వల్పంగా ఉన్నప్పుడే వర్తిస్తుంది అని షరతు రాయండి.

 

Question 19: న్యూటన్ శీతలీకరణ నియమం అనువర్తించడానికి కావలసిన పరిస్థితులను తెలపండి.

Answer:

న్యూటన్ శీతలీకరణ నియమం అనువర్తింపచేయడానికి అనువైన పరిస్థితులు : 1. వహనం ద్వారా ఉష్ణ నష్టం విస్మరించ దగినంత తక్కువగా ఉండి కేవలం సంవహనం ద్వారానే ఉష్ణ నష్టం జరిగినపుడు,
2. లేదా బలాత్కృత సంవహనం వలన ఉష్ణ నష్టం జరిగినపుడు,
3. వస్తువుకు, పరిసరాలకు గల ఉష్ణోగ్రతా భేదం స్వల్పంగా ఉన్నపుడు అనగా సుమారు 30 K ఉన్నపుడు,
4. వస్తువుపై ఉష్ణోగ్రత ఏకరీతి వితరణలో ఉన్నపుడు.

Exam Tips:

a) నాలుగు పరిస్థితులను 1, 2, 3, 4 సంఖ్యలతో వరుసగా రాయండి: సంవహనం ద్వారా నష్టం, బలాత్కృత సంవహనం, స్వల్ప ఉష్ణోగ్రతా భేదం (సుమారు 30 K), ఏకరీతి ఉష్ణోగ్రత.

 

Question 20: వేసవి కాలంలో భవనాలపై పై కప్పుకు తరచుగా తెలుపు రంగును పూతగా పూస్తారు. ఎందుకు ?

Answer:

భవనాల పైభాగాన తెల్లని రంగు పూయటం వల్ల ఎండాకాలంలో భవనం లోపలి భాగం చల్లగా ఉంటుంది.
ఎందుకనగా తెల్లని వస్తువులకు శోషణ గుణకము తక్కువ. కావున తెల్లని భాగాలు వాటిపై పడిన ఉష్ణశక్తిలో తక్కువ భాగాన్ని శోషణం చేసుకొని ఎక్కువ ఉష్ణశక్తిని పరావర్తనం చెందిస్తాయి. ఫలితంగా ఆ వస్తువు తక్కువ వేడెక్కును. అనగా ఇంటి పైకప్పు ఇంటి లోపలికి తక్కువ ఉష్ణశక్తిని ప్రసారం చేస్తుంది.

Exam Tips:

a) తెలుపు రంగు పరావర్తనం ఎక్కువ, శోషణం తక్కువ → ఇంటి లోపలికి తక్కువ ఉష్ణం వెళ్తుంది అని 'శోషణ–పరావర్తనం' పదాలతో రాయండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: సెల్సియస్, ఫారన్హీట్ ఉష్ణోగ్రతా మానాలను వివరించండి. సెల్సియస్, ఫారన్హీట్ ఉష్ణోగ్రతా మానాల మధ్య సంబంధాన్ని రాబట్టండి.

Answer:

సెంటిగ్రేడ్ లేదా సెల్సియస్ ఉష్ణమానము : సెంటీగ్రేడ్ ఉష్ణమానంలో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు ఘనీభవించు స్థానాన్ని అధోస్థిరస్థానంగా తీసుకున్నారు. దీనిని 0°C గా వ్యవహరిస్తారు.
సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరుగు స్థానాన్ని ఊర్ధ్వ స్థిరస్థానంగా తీసుకున్నారు. దీనిని 100°C గా వ్యవహరిస్తారు.
ఊర్ధ్వ, అధో స్థిరస్థానాల మధ్య భేదాన్ని (100 – 0 = 100) వంద సమాన భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని 1°C గా పిలుస్తారు.
ఫారన్హీట్ ఉష్ణోగ్రతామానము : ఫారెన్హీట్ ఉష్ణోగ్రతామానంలో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు ఘనీభవించు ఉష్ణోగ్రతను అధో స్థిరస్థానంగా తీసుకున్నారు. దీనిని 32°F గా నిర్వచించారు.
సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరుగుస్థానాన్ని ఊర్ధ్వ స్థిరస్థానంగా నిర్ణయించారు. దీనిని 212°F గా తీసుకున్నారు.
ఊర్ధ్వ, అధో స్థిరస్థానాల మధ్య భేదాన్ని (212 – 32 = 180) 180 సమాన భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని 1°F గా పిలుస్తారు.
సెంటీగ్రేడ్ మరియు ఫారెన్హీట్ ఉష్ణోగ్రతల మధ్య సంబంధము : సెంటీగ్రేడ్ మరియు ఫారెన్హీట్ మానములలో ప్రామాణికంగా తీసుకున్న ఊర్ధ్వ స్థిరబిందువు మరియు అధో స్థిర బిందువులు ఒక్కటే.
కావున \( \frac{t_F-32}{180}=\frac{t_C}{100} \) (లేదా) \( \frac{9}{5} C = F - 32 \) (లేదా) 1.8 C = F – 32
C = సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత, F = ఫారెన్హీట్ మానంలో ఉష్ణోగ్రత.

Exam Tips:

a) (F – 32)/180 = C/100 సంబంధాన్ని రెండు స్థిర బిందువుల ఆధారంగా ఉత్పాదించండి: ఫారన్హీట్కు 180 భాగాలు, సెల్సియస్కు 100 భాగాలు.

 

Question 2: రాగి, స్టీల్తో చేసిన రెండు సర్వసమాన లోహ పట్టీలను ఒకదానితో ఒకటి కలిపి సంయోగ పట్టీగా తయారుచేశారు. ఆ సంయోగ పట్టీని వేడిచేస్తే ఏమవుతుంది ?

Answer:

రెండు భిన్నజాతిలోహపు బద్దలను (రాగి మరియు ఇనుము అనుకోండి) రివిట్ల సహాయంతో అతికితే ఆ అమరికను ద్విలోహపు పట్టి అంటారు. ఇటువంటి ద్విలోహపు పట్టీని వేడిచేస్తే అది ఒక లోహపు ముక్కవలె సంకోచ వ్యాకోచాలను పొందుతుంది.

ద్విలోహాత్మక పట్టీని వేడిచేసినపుడు వృత్త చాపము వలె వంగుతుంది. ఈ చాపంపైభాగంలో ఎక్కువ వ్యాకోచ గుణకం గల పదార్థము, క్రింది భాగంలో తక్కువ వ్యాకోచ గుణకం గల పదార్థము ఉంటాయి.

Exam Tips:

a) ద్విలోహపట్టీ వంగిన పటం గీయండి: ఎక్కువ వ్యాకోచించే లోహం (రాగి) బయటి (కుంభాకార) వైపు, తక్కువ వ్యాకోచించే లోహం (ఇనుము) లోపలి వైపు.

 

Question 3: లోలక గడియారాలు సాధారణంగా శీతాకాలంలో అధిక కాలాన్ని చూపుతాయి.
వేసవిలో తక్కువ కాలాన్ని చూపుతాయి. ఎందుకు ?

Answer:

సాధారణంగా లోలకంతో పనిచేసే గడియారాలను తయారుచేసేటప్పుడు అవి రోజుకు ఒక నిర్దిష్ట సంఖ్యలో డోలనాలు చేసే విధంగా తయారుచేస్తారు.
ఎండాకాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఘనపదార్థాలు
వ్యాకోచిస్తాయి. అనగా లోలకం పొడవు పెరుగును. లోలకం పొడవు l₁ = l (1 + α ∆t) లోలకం ఆవర్తన కాలము \( T = 2π\sqrt{\frac{l}{g}} \) లేదా T ∝ \( \sqrt{l} \) అనగా లోలకం పొడవు పెరిగితే దాని ఆవర్తనకాలం పెరగడం వల్ల అది ఒకరోజులో చేసే డోలనాల సంఖ్య తగ్గుతుంది. అనగా గడియారం నెమ్మదిగా నడుస్తుంది.
చలికాలంలో వాతావరణ ఉష్ణోగ్రత తగ్గటం వల్ల లోలక పదార్థం సంకోచిస్తుంది. అనగా లోలకం పొడవు తగ్గుతుంది. ఫలితంగా డోలనావర్తన కాలం తగ్గుతుంది. అనగా లోలకం ఒకరోజులో చేసిన డోలనాల సంఖ్య పెరుగును. అంటే చలికాలంలో గడియారాలు వేగంగా చలిస్తాయి.

Exam Tips:

a) T = 2π√(l/g): వేసవిలో l పెరిగి T పెరుగుతుంది → గడియారం నెమ్మదిగా; శీతాకాలంలో l తగ్గి వేగంగా నడుస్తుంది అని రెండు సందర్భాలూ రాయండి.

 

Question 4: నీటి అసంగత వ్యాకోచం ఏ విధంగా జలచర సంబంధమైన జంతువులకు లాభం చేకూరుస్తుంది ? (March 2014 / May 2014)

Answer:

చలి దేశాలలో ముఖ్యంగా ధృవ ప్రాంతాలలో చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు 0°C కన్న చాలా తక్కువకు పడిపోతాయి. ఫలితంగా నదులు, సరస్సులు మరియు సముద్రాల పైభాగాలు గడ్డ కడతాయి. కాని మంచు అధమ ఉష్ణవాహకం కావడం వల్ల మంచు పొరలలో లోతుకు పోయిన కొలది నీరు 1°C, 2°C లేదా 3°C వంటి వివిధ పొరల రూపంలో ఉంటుంది. కాని సముద్రం అడుగు భాగం వద్ద నీరు 4°C వద్ద ఉంటుంది. దీనికి కారణము నీటికి 4°C వద్ద గరిష్ఠ సాంద్రత ఉండుట.
ప్రాముఖ్యత : సముద్ర జలాలు ఉపరితలం వద్ద గడ్డ కట్టినప్పటికి లోపలి భాగం 4°C వద్ద ఉండటం వల్ల జలచరాలు జీవించగలుగుతున్నాయి.

Exam Tips:

a) నీరు 4°C వద్ద గరిష్ఠ సాంద్రత పొందుతుంది; కాబట్టి సరస్సు పైన మంచు ఏర్పడినా అడుగున 4°C నీరు ఉండి జలచరాలు బతుకుతాయని రాయండి.

 

Question 5: వహనం, సంవహనం, వికిరణాలను ఉదాహరణలతో వివరించండి.

Answer:

వహనం : వస్తువులోని కణాలు స్థానాంతరం చెందకుండా, వస్తువులో ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రదేశం నుండి తక్కువ ఉష్ణోగ్రత గల ప్రదేశానికి జరుగు ఉష్ణ ప్రసారాన్ని ఉష్ణ వహనం అంటారు.
ఉదా : ఒక పొడవైన లోహపు కడ్డీని ఒక చివర చేతితో పట్టుకొని రెండవ కొన మంటలో ఉంచితే, ఉష్ణం వాహనం ద్వారా కడ్డీ ఒక కొన నుండి మరొక కొనకు ప్రసరిస్తుంది. సంవహనం : వస్తువులోని కణాలు స్థానాంతరం చెందుతూ, వస్తువులో ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రదేశం నుండి తక్కువ ఉష్ణోగ్రత గల ప్రదేశానికి ఉష్ణ ప్రసారాన్ని ఉష్ణ సంవహనం అంటారు.
ఉదా : సముద్రగాలి, భూగాలి
వికిరణం : యానకం నిమిత్తం లేకుండా ఒకచోట నుండి మరొక చోటుకు జరుగు ఉష్ణ ప్రసారాన్ని ఉష్ణ వికిరణం అంటారు.
ఉదా : సూర్యుని నుండి భూమికి ఉష్ణం వికిరణం ద్వారా చేరుతుంది.

Exam Tips:

a) ప్రతి విధానానికి నిర్వచనం + ఉదాహరణ తప్పక రాయండి (కడ్డీలో ఉష్ణం – వహనం, సముద్రగాలి – సంవహనం, సూర్యుని ఉష్ణం – వికిరణం).

 

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

Question 1: ఉష్ణవాహకత్వం, ఉష్ణవాహకత్వ గుణకాన్ని వివరించండి. 0.10 m పొడవు, 1.0 × 10⁻⁶ m² మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ఒక రాగి కడ్డీ ఉష్ణ వాహకత్వం 401 W/(mK). కడ్డీ ఒక కొన 104°C వద్ద, మరొక కొన 24° C వద్ద కలవు. కడ్డీ వెంబడి ఉష్ణ ప్రవాహ రేటు ఎంత ?

Answer:

ఉష్ణవహనము : ఈ పద్ధతిలో ఉష్ణము ఒకచోటు నుండి మరొక చోటికి యానకంలోని అణువులను స్థానభ్రంశము చెందించకుండా ప్రయాణం చేస్తుంది.

ఉష్ణవహనము ద్వారా ఉష్ణము ఘనపదార్థాలలో ప్రసరిస్తుంది.
పటంలో చూపిన విధంగా ఒక దీర్ఘ ఘనమును తీసుకొనుము. దీని ఎదురెదురు సమాంతర తలాలు ABCD మరియు EFGH అనుకొనుము. ఈ తలాలను θ₁ మరియు θ₂ ఉష్ణోగ్రతల మధ్య ఉంచినామనుకొనుము. దీని అడ్డుకోత వైశాల్యము A మరియు పొడవు l అనుకొనుము.
ఒక పదార్థం గుండా ప్రవహించు ఉష్ణరాశి (Q) ఈ క్రింది నియమాలను పాటిస్తుంది అని ప్రయోగపూర్వకంగా కనుగొన్నారు.
1. ఇచ్చిన వాహకం గుండా ప్రవహించు ఉష్ణరాశి వాహకం అడ్డుకోత వైశాల్యము (A) కి అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ Q∝ A ……………. (1)
2. వాహకం గుండా ప్రవహించిన ఉష్ణరాశి (Q) వాహకపు కొనల మధ్య గల ఉష్ణోగ్రతా భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
∴ Q ∝ (θ₂ – θ ₁) …………….. (2)
3. వాహకం గుండా ప్రవహించిన ఉష్ణరాశి (Q) ఉష్ణము ప్రవహించిన కాలము (t) నకు అనులోమానుపాతంలో ఉంటుంది.
Q ∝ t …………. (3)
4. వాహకం గుండా ప్రవహించిన ఉష్ణరాశి (Q) వాహకము పొడవు (l) కు విలోమానుపాతంలో ఉంటుంది.
Q ∝ \( \frac{1}{l} ……………….. (4) \)
పై నాలుగు నియమాల నుండి Q ∝ \( \frac{\mathrm{A}\left(\theta_2-\theta_1\right) \mathrm{t}}{l} \) (లేదా) \( Q = \frac{{KA}\left(\theta_2-\theta_1\right) \mathrm{t}}{l} \) ఇందులో K స్థిరాంకము. దీనిని ఉష్ణవహన గుణకము అంటారు.
ఉష్ణవహన గుణకము (K) : ప్రమాణ అడ్డుకోత వైశాల్యం గల పదార్థపు ఎదురెదురు సమాంతర తలముల మధ్య ఏకాంక ఉష్ణోగ్రతా అతిక్రమం ఉన్నపుడు ప్రమాణ కాలంలో ఆ తలముల మధ్య ప్రవహించిన ఉష్ణరాశిని ఆ పదార్థం ఉష్ణవహన గుణకంగా నిర్వచించినారు.
ఉష్ణవహన గుణకము \( K = \frac{\mathrm{Q} . l}{\mathrm{~A}\left(\theta_2- \theta_1\right) \mathrm{t}} \)
ఉష్ణవహన గుణకానికి ప్రమాణాలు వాట్ మీటర్⁻¹ కెల్విన్⁻¹ లేదా జౌల్సకన్⁻¹ మీటర్⁻¹ కెల్విన్⁻¹
మితి ఫార్ములా = [M¹L¹T⁻³θ⁻¹]
సమస్య:
రాగి ఉష్ణవహన గుణకము Kc = 401 W/m-k
ఒక కొన వద్ద ఉష్ణోగ్రత θ₂ = 104°C
రెండవ కొన వద్ద ఉష్ణోగ్రత θ₁ = 24°C
రాగి దండం పొడవు l = 0.1m; వైశాల్యము = A = 1.0 × 10⁻⁶ m²
ఉష్ణవహన రేటు \( \frac{\mathrm{Q}}{\mathrm{t}}=\frac{{KA}\left(\theta_2- \theta_1\right)}{l}=\frac{401 \times 1 \times 10^{-6}(104-24)}{0.1} = 401 × 80 × 10⁻⁵ = 0.3208 J/s \)

Exam Tips:

a) Q = KA(θ₂ – θ₁)t/l ఉత్పాదనలో నాలుగు అనులోమ/విలోమ సంబంధాలను వరుసగా రాయండి; సంఖ్యా భాగంలో A = 1.0 × 10⁻⁶ m² తో Q/t = 0.3208 W చూపండి.

 

Question 2: న్యూటన్ శీతలీకరణ నియమాన్ని తెలిపి, వివరించండి. న్యూటన్ శీతలీకరణ నియమం అనువర్తించడానికి కావలసిన పరిస్థితులను తెలపండి.
ఒక వస్తువు 60°C నుంచి 50°C కు చల్లబడటానికి 5 నిమిషాల కాలం పట్టింది.
తరువాత 40°C కు చల్లబడటానికి మరొక 8 నిమిషాలు పట్టింది. పరిసరాల ఉష్ణోగ్రతను కనుక్కోండి.

Answer:

న్యూటన్ శీతలీకరణ నియమము : వస్తువుకు, పరిసరాలకు మధ్య ఉష్ణోగ్రతా భేదం స్వల్పంగా ఉన్నపుడు ఆ వస్తువు కోల్పోయే ఉష్ణ శక్తి రేటు వస్తువుకూ, పరిసరాలకు మధ్య గల ఉష్ణోగ్రతా భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
వస్తువు కోల్పోయే ఉష్ణశక్తి రేటు \( \frac{dE}{dt} ∝ (T - T_s) \) లేదా శీతలీకరణ రేటు \( \frac{dT}{dt} = - \frac{b}{mc} (T - T_s) \) ఇందులో Tₛ పరిసరాల ఉష్ణోగ్రత, T వస్తువు ఉష్ణోగ్రత.
ఉష్ణోగ్రతా భేదం స్వల్పంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది.
వికిరణం ద్వారా నష్టపోయే ఉష్ణం, వస్తువు ఉపరితల స్వభావం మీద, ప్రత్యక్షీకరణం అయ్యే ఉపరితల వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది.
\( - \frac{\mathrm{dQ}}{\mathrm{dt}} = k (T₂ - T₁) \) (రుణ గుర్తు నష్టాన్ని సూచిస్తుంది) ………………. (1)
ఇక్కడ k ధనాత్మక స్థిరాంకం. దీని విలువ వస్తువు ఉపరితల స్వభావం, వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. s విశిష్టోష్ణ సామర్థ్యం, mద్రవ్యరాశి ఉన్న వస్తువు, T₂ ఉష్ణోగ్రత వద్ద ఉందనుకోండి. పరిసరాల ఉష్ణోగ్రత T₁ అనుకోండి. dtకాలంలో స్వల్ప పరిమాణంలో ఉష్ణోగ్రతలో తగ్గుదల dT₂ అనుకొంటే, నష్టపోయిన ఉష్ణ పరిమాణం dQ = ms dT₂
∴ నష్టపోయిన ఉష్ణ రేటును కింది విధంగా ఇవ్వచ్చు.
\( \frac{\mathrm{dQ}}{\mathrm{dt}} = \) ms \( \frac{\mathrm{dT}_2}{\mathrm{dt}} \)
………….. (2)
సమీకరణాలు (1), (2) ల నుంచి
-ms \( \frac{\mathrm{dT}_2}{\mathrm{dt}} = k (T₂ - T₁) \)
\( \frac{dT_2}{T_2-T_1} = - \frac{k}{ms} dt = -K\,dt \) …………….. (3)
ఇక్కడ K = k/ms
సమాకలనం చేయగా,
loge (T₂ – T₁) = – Kt + c …………….. (4)
(T₂ – T₁) = e-Kt + c
లేదా T₂ = T₁ + C’ e-Kt; ఇక్కడ C’ = ec ……………. (5)
ప్రత్యేకమైన ఉష్ణోగ్రత అవధిలో ఒక వస్తువు శీతలీకరణానికి పట్టే కాలాన్ని సమీకరణం (5) ఉపయోగించి లెక్కించవచ్చు.
స్వల్ప ఉష్ణోగ్రతా భేదాలకు, ఉష్ణ వహనం, సంవహనం, వికిరణాల కలయిక వల్ల శీతలీకరణ రేటు ఉష్ణోగ్రతా భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక వికిరణకం నుంచి గదిలోకి బదిలీ అయ్యే ఉష్ణం, గదిలోని గోడల ద్వారా నష్టపోయే ఉష్ణం లేదా టేబుల్పై అమర్చిన కప్పులోని వేడి టీ శీతలీకరణం చెందే సందర్భాలలో ఈ నియమం ఉజ్జాయింపుగా చెల్లుబాటు అవుతుంది.
న్యూటన్ శీతలీకరణ నియమం అనువర్తింపచేయడానికి అనువైన పరిస్థితులు : 1. వహనం ద్వారా ఉష్ణ నష్టం విస్మరించదగినంత తక్కువగా ఉండి కేవలం సంవహనం ద్వారానే ఉష్ణ నష్టం జరిగినపుడు,
2. లేదా బలాత్కృత సంవహనం వలన ఉష్ణ నష్టం జరిగినపుడు,
3. వస్తువుకు, పరిసరాలకు గల ఉష్ణోగ్రతా భేదం స్వల్పంగా ఉన్నపుడు అనగా సుమారు 30K ఉన్నపుడు,
4. వస్తువుపై ఉష్ణోగ్రత ఏకరీతి వితరణలో ఉన్నపుడు.
సమస్య:
తొలి ఉష్ణోగ్రత θ₁ = 60°C;
తుది ఉష్ణోగ్రత θ₂ = 50°C
పట్టిన కాలము t = 5 ని॥ = 300 సె॥; గది ఉష్ణోగ్రత = θ₀ అనుకొనుము.
న్యూటన్ శీతలీకరణ నియమం నుండి \( \frac{d \theta}{dt}=K\left[\frac{\theta_1+\theta_2}{2}-\theta_0\right] \)
⇒ \( \frac{60-50}{300} = K \left[\frac{60+50}{2}-\theta_0\right] ⇒ \frac{10}{300} = K [55 - θ ₀] \) (లేదా) ⇒ \( \frac{1}{30} = K[55 - θ ₀] ….. (1) \)
రెండవ సందర్భంలో వస్తువు 50°C నుండి 40°C కు 8 నిమిషాలలో చల్లారింది. న్యూటన్ నియమం నుండి \( \frac{50-40}{8 \times 60} = K \left[\frac{50+40}{2}- \theta_0\right] \)
⇒ \( \frac{10}{480} = K[45 - θ ₀] ⇒ 1 = 48K (45 - θ ₀) ….. (2) \)
1 మరియు 2 సమీకరణముల నుండి 30 K (55 – θ ₀) = 48K (45 – θ ₀)
275 – 5θ₀ = 360 – 8θ₀ ⇒ 3θ₀ = 360 – 275
∴ \( θ₀ = \frac{85}{3} = 28.33°C \)

Exam Tips:

a) సమాకలనం ద్వారా T = T₀ + C′e^(–Kt) పొందండి; సంఖ్యా భాగంలో రెండు సందర్భాల సమీకరణాల నుంచి θ₀ = 85/3 ≈ 28.33°C అని ముగించండి.

 

లెక్కలు

Question 1: ఏ ఉష్ణోగ్రత వద్ద కెల్విన్ మానంలోని రీడింగ్, ఫారన్హీట్ మానంలోని రీడింగ్లు సమానం అవుతాయి ?

Answer:

కెల్విన్, ఫారన్ హీట్ మానాలలో \( \frac{\mathrm{K}-273.15}{100} = \frac{F-32}{180} \) ఇక్కడ K = F కావున
\( \frac{\mathrm{F}-273.15}{100}=\frac{\mathrm{F}-32}{180} \)
⇒ \( F - 273.15 = \frac{5}{9} F - \frac{160}{9} \)
⇒ \( \frac{4}{9} F = 273.15 - 17.77 = 255.38 \)
⇒ \( F = \frac{9}{4} (255.38) = 574.6 \)
∴ 574.6K = 574.6°F.

Exam Tips:

a) K = F అని ప్రతిక్షేపించి (F – 273.15)/100 = (F – 32)/180 సాధించండి; జవాబు 574.6.

 

Question 2: ఒక అల్యూమినియం కడ్డీ పొడవును 1% పెంచాలంటే దాని ఉష్ణోగ్రతలో కలిగే పెరుగుదల కనుక్కోండి. (అల్యూమినియం విలువ = 25 × 10⁻⁶ / °C)

Answer:

అల్యూమినియం దైర్ఘ్య వ్యాకోచ గుణకము, α = 25 × 10⁻⁶ / °C
\( \text{పొడవులో పెరుగుదల శాతం} = \frac{\text{పొడవులో పెరుగుదల}}{\text{తొలి పొడవు}} \times 100 = \frac{l_2 - l_1}{l_1} \times 100 = \alpha (t_2 - t_1) \times 100 \quad \left[\because \frac{l_2 - l_1}{l_1} = \alpha (t_2 - t_1)\right] \)
\( \therefore \text{ఉష్ణోగ్రతలో పెరుగుదల} = \frac{\text{పొడవులో పెరుగుదల శాతం}}{\alpha \times 100} = \frac{1}{25 \times 10^{-6} \times 100} = 400°C \)

Exam Tips:

a) ΔL/L = αΔT: 0.01 = 25 × 10⁻⁶ × ΔT → ΔT = 400°C అని చూపండి.

 

Question 3: 20°C ఉష్ణోగ్రత, 100 g ద్రవ్యరాశి ఉన్న నీటి ఉష్ణోగ్రతను 5°C పెంచడానికి 100°C ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఎంత ఆవిరిని ఆ నీటిలోకి పంపించాలి ? (నీటి ఆవిరి గుప్తోష్ణం 540 cal / g, నీటి విశిష్టోష్ణం 1 cal / g°C)

Answer:

నీటి బాష్పీభవన గుప్తోష్ణం, Lₛ = 540 cal / g; నీటి విశిష్టోష్ణం, Sw = 1 cal / g°C
నీటి ద్రవ్యరాశి, mw = 100g
మిశ్రమ పద్ధతి సూత్రం ప్రకారం
నీటి ఆవిరి కోల్పోయిన ఉష్ణరాశి = నీరు గ్రహించిన ఉష్ణరాశి
i.e., m ₛLₛ + m ₛSw (100 – t) = m wSw (t – 20)
⇒ mₛ × 540 + mₛ × 1(100 – 25) = 100 × 1 × (25 – 20)
⇒ 615mₛ = 500 (or) \( mₛ = \frac{500}{615} = 0.813 \) g

Exam Tips:

a) ఆవిరి కోల్పోయిన ఉష్ణం = నీరు గ్రహించిన ఉష్ణం (మిశ్రమ పద్ధతి) అని రాసి, L = 540 cal/g తో m = 500/615 = 0.813 g.

 

Question 4: 2 kg ల గాలిని స్థిర ఘనపరిమాణం వద్ద వేడిచేశారు. గాలి ఉష్ణోగ్రత 293 K నుంచి 313 K కు పెరిగింది. స్థిర ఘనపరిమాణం వద్ద గాలి విశిష్టోష్ణం 0.718kJ/kg K. అది శోషించుకొనే ఉష్ణ పరిమాణాన్ని kJ లలో, kcalలలో కనుక్కోండి. (J = 4.2 kJ/kcal.)

Answer:

గాలి ద్రవ్యరాశి m = 2 kg;
ఉష్ణోగ్రతలో మార్పు ∆T = 313 – 293 = 20 K.
స్థిర ఘనపరిమాణ విశిష్టోష్ణము Cᵥ = 0.718 k. J/kg – K.
ఉష్ణ యాంత్రిక తుల్యాంకము = J. = 4.2 kJ/k.cal.
\( Cᵥ = \frac{1}{\mathrm{~m}} \frac{\mathrm{dQ}}{\mathrm{dT}} ⇒ \) dQ = mC ᵥdT (లేదా) dQ \( = \frac{\mathrm{mC}_{\mathrm{v}} \mathrm{dT}}{\mathrm{J}} \) cal. ∴ గాలి శోషించుకొనిన ఉష్ణరాశి Q = 2 × 0.718 × 10³ × 20 = 28.72 kJ = 6.838 k calories.

Exam Tips:

a) Q = mC_vΔT = 2 × 0.718 × 20 = 28.72 kJ; kcal కోసం 4.2 తో భాగించండి (6.84 kcal) – రెండు ప్రమాణాలలో జవాబు ఇవ్వండి.

 

Question 5: ఇత్తడి లోలకం కలిగిన ఒక గడియారం 20°C వద్ద సరియైన కాలాన్ని చూపుతుంది. ఉష్ణోగ్రత 30°C కు పెరిగినప్పుడు ఆ గడియారం రోజుకు 8.212 సెకనుల కాలం తక్కువ చూపుతుంది. ఇత్తడి దైర్ఘ్య వ్యాకోచ గుణకం కనుక్కోండి.

Answer:

సరియైన కాలం వద్ద ఉష్ణోగ్రత t = 20°C;
ఒక రోజులో నష్టపోయిన లేక లాభపడిన కాలము = 8.212 sec.
తుది ఉష్ణోగ్రత t₂ = 30 C ∴ ∆t = 30 – 20 = 10;
లోలకం చేయబడిన పదార్థం α = ?
లోలకంలో ఒక రోజుకు నష్టపోయిన లేదా లాభపడిన సెకండ్ల సంఖ్య = 43,200 α ∆t
∴ \( α = \frac{8.212}{43200 \times 10} ≈ 19 × 10^{-6} /°C \)

Exam Tips:

a) లోలకం గడియారం రోజుకు కోల్పోయే కాలం = 43,200 α Δt అనే సూత్రం ఉపయోగించి α ≈ 1.9 × 10⁻⁵ °C⁻¹ పొందండి.

 

Question 6: ఒక వస్తువు 7 నిమిషాలలో 60°C నుంచి 40°C కు చల్లబడుతుంది. పరిసరాల ఉష్ణోగ్రత 10°C అయితే, తదుపరి 7 నిమిషాల తరువాత అది ఎంత ఉష్ణోగ్రతకు చేరుకొంటుంది ?

Answer:

మొదటి సందర్భము:
తొలి ఉష్ణోగ్రత, θ₁ = 60°C;
తుది ఉష్ణోగ్రత, θ₂ = 40°C
చల్లబడటానికి పట్టిన కాలము, t₁ = 7 నిమిషాలు = 7 × 60 = 420s ;
పరిసరాల ఉష్ణోగ్రత, θ₀ = 10°C
న్యూటన్ శీతలీకరణ నియమం ప్రకారం,
\( \frac{\mathrm{d} \theta}{\mathrm{dt}} = k \left[\frac{\theta_1+\theta_2}{2}- \theta_0\right] ⇒ \frac{60-40}{420} = k \left[\frac{60+40}{2}-10\right] \)
⇒ \( \frac{20}{420} = k × 40 …………….. (1) \)
రెండవ సందర్భము:
తొలి ఉష్ణోగ్రత, θ₁ = 40°C
చల్లబడటానికి పట్టిన కాలము, t₂ = 7 నిమిషాలు = 7 × 60 = 420s
న్యూటన్ శీతలీకరణ నియమం ప్రకారం,
\( \frac{40-\theta}{420} = k\left[\frac{40+\theta}{2}-10\right] \) ……………. (2)
(1) నుండి \( k = \frac{20}{420 \times 40} = \frac{1}{840} \). దీనిని (2) లో ప్రతిక్షేపించగా \( 2(40-\theta) = \frac{40+\theta}{2} - 10 = \frac{20+\theta}{2} \) ⇒ \( 160 - 4\theta = 20 + \theta \) ⇒ θ = 28°C

Exam Tips:

a) సగటు ఉష్ణోగ్రత [(θ₁ + θ₂)/2 – θ₀] వాడి k కనుక్కొని రెండవ సందర్భంలో ప్రతిక్షేపించండి; సరైన జవాబు 28°C.

 

Question 7: ఒక కృష్ణ వస్తువు గరిష్ఠ వికిరణ తీవ్రత 2.65 µ m వద్ద కనుక్కోవడమైంది. వికిరణాన్ని ఉద్గారం చేసే వస్తువు ఉష్ణోగ్రత ఎంత ? (వీన్ స్థిరాంకం = 2.9 × 10⁻³ mK)

Answer:

గరిష్ఠ తీవ్రత గల తరంగదైర్ఘ్యం λₘₐₓ = 2.65 µm = 2.65 × 10⁻⁶ m.
వస్తువు ఉష్ణోగ్రత T = ? వీన్ స్థిరాంకము b = 2.90 × 10⁻³ mK.
వీన్ నియమం నుండి \( T = \frac{b}{\lambda_m} = \frac{2.90 \times 10^{-3}}{2.65 \times 10^{-6}} = 1094 K. \)

Exam Tips:

a) T = b/λₘ = 2.90 × 10⁻³ / 2.65 × 10⁻⁶ ≈ 1094 K; µm ని మీటర్లలోకి (10⁻⁶ m) మార్చి లెక్కించండి.

 

ముఖ్యమైన అదనపు లెక్కలు

Question 1: నియాన్, కార్బన్-డై-ఆక్సైడ్ త్రిక బిందువులు వరుసగా 24.57 K, 216.55 K. ఈ ఉష్ణోగ్రతలను సెల్సియస్, ఫారన్హీట్ మానాలలో తెలియచేయండి.

Answer:

కెల్విన్ మానము మరియు సెల్సియస్ మానముల మధ్య సంబంధము TC = TK – 273.15 ఇక్కడ T C, TK లు సెల్సియస్ మరియు కెల్విన్ మానాలలో ఉష్ణోగ్రతలు
నియాను, TC = 24.57 – 273.15 = – 248.58°C
CO₂, TC = 216.55 – 273.15 = – 56.60°C.
ఫారన్హీట్ మానము మరియు కెల్విన్ మానంల మధ్య గల సంబంధము =
\( \frac{\mathrm{T}_{\mathrm{F}}-32}{180}=\frac{\mathrm{T}_{\mathrm{K}}-273.15} {100} \)
\( T_F = \frac{180}{100} (T_K - 273.15) + 32 \)
నియాను, \( T_F = \frac{180}{100} (24.57 - 273.15) + 32 = -415.44°F \)
CO₂, \( T_F = \frac{180}{100} (216.55 - 273.15) + 32 = -69.88°F \)

Exam Tips:

a) T_C = T_K – 273.15 మరియు T_F = 1.8 T_C + 32 వాడండి; నియాన్ –248.58°C, –415.44°F; CO₂ –56.60°C, –69.88°F.

 

Question 2: A, B అనే రెండు పరమ ఉష్ణోగ్రతా మానాలు నీటి త్రిక బిందువును 200 A, 350 B గా నిర్వచించాయి. T A, TB మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?

Answer:

దత్తాంశం ప్రకారం, ఉష్ణోగ్రతా మానం A లో నీటి త్రిక బిందువు = 200A
ఉష్ణోగ్రతా మానం Bలో నీటి త్రిక బిందువు = 350 B.
మన ప్రశ్నను బట్టి, 200A = 350 B = 273.16 K లేదా \( 1A = \frac{273.16}{200}K \)
మరియు \( 1B = \frac{273.16}{350} K \)
TA మరియు TB అనునవి ఒకే ఉష్ణోగ్రతను మానము A మరియు మానము B లలో సూచించే విలువలు అయితే
\( \frac{273.16}{200} T_A = \frac{273.16}{350} T_B \) (లేదా)
\( \frac{T_A}{T_B} = \frac{200}{350} = \frac{4}{7} \) (లేదా) \( T_A = \frac{4}{7} T_B \)

Exam Tips:

a) 200A = 350B = 273.16 K నుంచి ఒక్కో మానపు యూనిట్ విలువ కనుక్కొని T_A/T_B = 4/7 చూపండి.

 

Question 3: ఒక థర్మామీటర్ విద్యుత్ నిరోధం ఓమ్లో ఉష్ణోగ్రతతో ఉజ్జాయింపు నియమం ప్రకారం క్రింది విధంగా మారుతుంది. R = R₀ [1 + α (T – T₀)] నీటి త్రిక బిందువు 273.16 K వద్ద నిరోధం 101.6 Ω, సీసం ప్రమాణ ద్రవీభవన స్థానం 600.5 K వద్ద నిరోధం 165.5 Ω. ఏ ఉష్ణోగ్రత వద్ద నిరోధం 123.4 Ω అవుతుంది ?

Answer:

దత్తాంశము నుండి R₀ = 101.6 Ω; T₀ = 273.16 K
సందర్భం (i) R₁ = 165.5 Ω; T₁ = 600.5 K
సందర్భం (ii) R₂ = 123.4 Ω; T₂ = ?
R = R₀ [1 + α (T – T₀)] నకు సందర్భము (i) ఉపయోగించిన
165.5 = 101.6 [1 + α (600.5 – 273.16)]
\( α = \frac{165.5-101.6}{101.6 \times(600.5-273.16)}=\frac{63.9}{101.6 \times 327.34} \)
సందర్భం (ii) నుండి 123.4 = 101.6 [1+ α(T₂ – 273.16)]
(లేదా) \( 123.4 = 101.6 [1 + \frac{63.9}{101.6 \times 327.34} (T₂ - 273.16)] = 101.6 + \frac{63.9}{327.34} (T₂ - 273.16) \)
(లేదా) \( T₂ = \frac{(123.4-101.6) \times 327.34}{63.9} + 273.16 = 111.68 + 273.16 = 384.84 K \)

Exam Tips:

a) R = R₀[1 + α(T – T₀)] లో ముందు α కనుక్కొని, తర్వాత R = 123.4 Ω కు T ప్రతిక్షేపించండి; T ≈ 384.8 K.

 

Question 4: క్రింది వాటికి సమాధానాలు ఇవ్వండి:
(a) ఆధునిక ఉష్ణమితిలో నీటి త్రిక బిందువు ప్రమాణ స్థిర బిందువు. ఎందుకు ?
మంచు ద్రవీభవన స్థానాన్ని, నీటి బాష్పీభవన స్థానాన్ని ప్రమాణ స్థిర బిందువులుగా తీసుకొంటే కలిగే తప్పు ఏమిటి ? (సెల్సియస్ మానంలో అదే విధంగా తీసుకోవడమైంది)
(b) సెల్సియస్ మానంలో పై ప్రశ్నలో తెలిపిన విధంగా రెండు స్థిర బిందువులు కలవు. వాటికి వరుసగా 0°C, 100°C సంఖ్యలను కేటాయించడమైంది.
పరమమానంలో రెండు స్థిర బిందువుల్లో ఒకటి నీటి త్రిక బిందువుగా తీసుకొని కెల్విన్ మానంలో 273.16 K సంఖ్యను కేటాయించడమైంది. ఈ (కెల్విన్) మానంలో మరొక స్థిర బిందువు ఏమిటి ?
(c) పరమ ఉష్ణోగ్రత (కెల్విన్ మానం) T, సెల్సియస్ మానంపై ఉష్ణోగ్రత tc కి మధ్య సంబంధం tc = T – 273.15
ఈ సంబంధంలో 273.16 కాకుండా, 273.15 ను తీసుకోవడానికి కారణం ఏమిటి ?
(d) పరమ ఉష్ణోగ్రతా మానంలో యూనిట్ అంతరం ఫారన్హీట్ మానంలో యూనిట్ అంతరానికి సమానం అయితే పరమ ఉష్ణోగ్రత మానంపై నీటి త్రిక బిందువు ఉష్ణోగ్రత ఎంత ?

Answer:

(a) నీటి త్రిక బిందువుకు ఒకే ఒక విలువ 273.16 K. ఒకే ఒక బిందువు వుండుట ఒక సత్యం. అక్కడ పీడనానికి మరియు ఘనపరిమాణానికి ఒకే ఒక విలువ కలిగి వుంటుంది. వేరే విధంగా తెలిపిన, పీడనము మరియు ఘనపరిమాణములో మార్పు వచ్చునప్పుడు, నీరు మరుగు స్థానము, బాష్పీభవన స్థానములకు ఒకే విలువ వుండక మార్పు చెందుతూ ఉంటాయి.
(b) కెల్విన్ మానం లేదా కెల్విన్ సంపూర్ణ మానం నందు నిర్దేశ బిందువే దాని సంపూర్ణ లేదా పరమ శూన్య బిందువు.
(c) సెల్సియస్ మానంలో 0°C అనునది సాధారణ పీడనం వద్ద మంచు ద్రవీభవన బిందువు. దానికి అనుగుణమైన పరమ ఉష్ణోగ్రత 273.15 K, 273.16 K అనే ఉష్ణోగ్రత నీటి త్రిక బిందువును సూచిస్తుంది. ఈ సంబంధంను బట్టి నీటి త్రిక బిందువు సెల్సియస్ మానం నందు = 273.16 – 273.15 = 0.01°C.
(d) ఫారన్ హీట్ మానం మరియు పరమ ఉష్ణోగ్రతల మధ్య సంబంధము
\( \frac{T_F - 32}{180} = \frac{T_K - 273.15}{100} \quad \ldots (i) \)
T′_F, T′_K వేరొక జత ఉష్ణోగ్రత విలువలైతే,
\( \frac{T'_F - 32}{180} = \frac{T'_K - 273.15}{100} \quad \ldots (ii) \)
సమీకరణం (ii) నుంచి సమీకరణం (i) తీసివేయగా
\( \frac{T'_F - T_F}{180} = \frac{T'_K - T_K}{100} \) (లేదా) \( T'_F - T_F = \frac{180}{100}(T'_K - T_K) \)
\( T'_K - T_K = 1\,\mathrm{K} \) అయితే \( T'_F - T_F = \frac{180}{100} \times 1 = \frac{9}{5} \)
నీటి త్రిక బిందువు ఉష్ణోగ్రత 273.16 K అనునది కొత్త ఉష్ణోగ్రత మానంలో
\( = 273.16 × \frac{9}{5} = 491.69 \)

Exam Tips:

a) (a)–(d) ప్రతి భాగానికి వేరుగా జవాబు రాయండి: త్రిక బిందువు ఏకైకం; రెండవ స్థిర బిందువు పరమ శూన్యం; 273.15 = మంచు బిందువు; (d) 491.69.

 

Question 5: A, B అనే ఆదర్శవాయు థర్మామీటర్లో వరుసగా ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువులను ఉపయోగించారు. కింది పరిశీలనలు చేయడమైంది.
ఉష్ణోగ్రత | పీడనం (థర్మామీటర్ – ఎ) | పీడనం (థర్మామీటర్ – బి)
నీటి త్రిక బిందువు | 1.250 × 10⁵ Pa | 0.200 × 10⁵ Pa
సల్ఫర్ సాధారణ ద్రవీభవన స్థానం | 1.797 × 10⁵ Pa | 0.287 × 10⁵ Pa
(a) A, B థర్మామీటర్లు సూచించే సల్ఫర్ సాధారణ ద్రవీభవన స్థానం పరమ ఉష్ణోగ్రత ఎంత ?
(b) A, B థర్మామీటర్ల జవాబులో స్వల్పంగా తేడా ఉండటానికి గల కారణాన్ని మీరు ఏమని ఊహిస్తున్నారు ? (థర్మామీటర్లో ఎలాంటి దోషం లేదు) రెండింటి రీడింగ్ల మధ్య ఉన్న తేడాను తగ్గించడానికి పై ప్రయోగంలో ఇంకా ఏ పద్ధతి అవసరం ?

Answer:

సల్ఫర్ ద్రవీభవన స్థానంను “T” అనుకొనుము.
(a) థర్మామీటర్ A లో \( T = \frac{\mathrm{P}}{\mathrm{P}_{\mathrm{tr}}} × 273.16 = \frac{1.797 \times 10^5}{1.250 \times 10^5} × 273.16 = 392.69K \)
థర్మామీటర్ B లో \( T = \frac{\mathrm{P}}{\mathrm{P}_{\mathrm{tr}}} × 273.16 = \frac{0.287 \times 10^5}{0.200 \times 10^5} × 273.16 = 391.98 K \)
(b) థర్మామీటర్ A మరియు B ల సమాధానముల యందు స్వల్ప తేడా వచ్చుటకు కారణం ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వాయువులు కచ్చితమైన ఆదర్శవాయువులు కావు.
ఇలాంటి అసమానతను తగ్గించాలంటే, అతి తక్కువ పీడనం వద్ద పరిశీలనలను తీసుకోవాలి. ఇలాంటి సందర్భము నందు వాయువులు ఆదర్శ వాయు ప్రవర్తనకు దగ్గరగా వుండగలవు.

Exam Tips:

a) T = (P/P_tr) × 273.16 వాడి A: 392.69 K, B: 391.98 K పొందండి; తేడాకు కారణం వాయువులు ఆదర్శం కాకపోవడం, అందుకే తక్కువ పీడనం వద్ద పరిశీలనలు తీసుకోవాలి.

 

Question 6: 1m పొడవు ఉన్న ఉక్కు కొలబద్ద 27.0°C ఉష్ణోగ్రత వద్ద సరియైన కొలతను ఇచ్చే విధంగా క్రమాంకనం చేశారు. బాగా వేడిగా ఉన్న రోజు, అంటే 45.0°C ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ కొలబద్ద ఉక్కు కడ్డీ పొడవును 63.0 cm గా కొలిచింది. ఆ రోజున ఉక్కు కడ్డీ అసలు పొడవు ఎంత ? 27.0°C ఉష్ణోగ్రత ఉన్న రోజున అదే ఉక్కు కడ్డీ పొడవు ఎంత ? ఉక్కు దైర్ఘ్య వ్యాకోచ గుణకం = 1.20 × 10 ⁻⁵°K⁻¹

Answer:

27°C వద్ద ఉక్కు కొలబద్ద పొడవు 100 cm. i.e., L = 100 cm మరియు T = 27°C
45°C వద్ద ఉక్కు కొలబద్ద పొడవు L’ = L + ∆L = L + αL∆T
= 100 + (1.20 × 10⁻⁵ °C⁻¹) × 100 × (45° – 27°) = 100.0216 cm.
27°C వద్ద కొలబద్దపై 1 cm భాగం పొడవు, 45°C వద్ద = 100.0216/100 cm.
63 cm గా కొలిచిన ఉక్కు కడ్డీ అసలు పొడవు, 45°C వద్ద \( = \frac{100.0216}{100} × 63 = 63.0136 \) cm
27°C ఉష్ణోగ్రత ఉన్న రోజున అదే ఉక్కు కడ్డీ పొడవు = 63 × 1 = 63 cm.

Exam Tips:

a) 45°C వద్ద కొలబద్ద పెరిగి ఉంటుంది కాబట్టి కొలిచిన విలువను (1 + αΔT) తో గుణించండి: 63.0 × 1.000216 = 63.0136 cm; 27°C వద్ద 63.0 cm.

 

Question 7: ఒక పెద్ద ఉక్కు చక్రాన్ని అదే పదార్థంతో చేసిన కమ్మీపై 27°C ఉష్ణోగ్రత వద్ద బిగించాలి. ఆ కమ్మీ వెలుపల వ్యాసం 8.70 cm, చక్రం మధ్య ఉన్న రంధ్రం వ్యాసం 8.69 cm. కమ్మీని పొడి మంచు ఉపయోగించి చల్లబరచారు. కమ్మీ ఏ ఉష్ణోగ్రత వద్ద చక్రాన్ని కమ్మీపై బిగించవచ్చు. మనకు కావలసిన ఉష్ణోగ్రత అవధిలో ఉక్కు దైర్ఘ్య వ్యాకోచ గుణకం స్థిరంగా ఉంటుంది అని అనుకోండి. αఉక్కు 1.20 × 10⁻⁵ K ⁻¹.

Answer:

ఇచ్చట T₁ = 27°C = 27 + 273 = 300 K.
T₁K ఉష్ణోగ్రత వద్ద పొడవు = lT₁ = 8.70 cm;
T₂ K ఉష్ణోగ్రత వద్ద పొడవు = lT₂ = 8.69 cm
పొడవులో మార్పు = lT₂ – lT₁ = lT₁ α (T₂ – T₁) (లేదా) 8.69 – 8.70 = 8.70 × (1.20 × 10⁻ ⁵) (T₂ – 300)
(లేదా) \( T₂ - 300 = - \frac{0.01}{8.70 \times 1.2 \times 10^{-5}} = -95.8 \) (లేదా) T₂ = 300 – 95.8 = 204.2 K = – 68.8°C.

Exam Tips:

a) రంధ్రం వ్యాసం 8.69 cm కావడానికి కమ్మీని చల్లబరచాలి: 8.69 – 8.70 = 8.70 α (T₂ – 300) నుంచి T₂ ≈ 204.2 K (–68.8°C).

 

Question 8: ఒక రాగి పలకలో రంధ్రం చేశారు. 27°C వద్ద ఆ రంధ్రం వ్యాసం 4.24 cm. ఆ పలకను 227°C కు వేడిచేసినప్పుడు ఆ రంధ్రం వ్యాసంలో కలిగే మార్పు ఎంత ? రాగి దైర్ఘ్య వ్యాకోచ గుణకం = 1.70 × 10⁻⁵ K⁻¹

Answer:

ఈ లెక్కలో వేడిచేసినపుడు రాగి రేకు విస్తీర్ణ వ్యాకోచము ఇమిడి ఉంటుంది.
27°C వద్ద రంధ్రం వైశాల్యం, \( S₁ = \frac{\pi \mathrm{D}_1^2}{4}=\frac{\pi}{4} × (4.24)² cm² \)
227°C వద్ద రంధ్రం వ్యాసం D₂ cm అయిన
227°C వద్ద రంధ్రం వైశాల్యం, \( S₂ = \frac{\pi \mathrm{D}_2^2}{4} \) cm ².
రాగి విస్తీర్ణ వ్యాకోచ గుణకం β = 2 α = 2 × 1.70 × 10⁻⁵ = 3.4 × 10⁻⁵ °C⁻¹
వైశాల్యంలో పెరుగుదల = S₂ – S₁ = βS₁∆T (లేదా) S₂ = S₁ + βS₁∆T = S₁ (1 + β∆T)
\( \frac{\pi D_2^2}{4}=\frac{\pi}{4} (4.24)^2 [1 + 3.4 × 10^{-5} (227 - 27)] \)
(లేదా) D₂² = (4.24)² × 1.0068
D₂ = 4.2544 cm
వ్యాసంలో మార్పు = D₂ – D₁ = 4.2544 – 4.24 = 0.0144 cm

Exam Tips:

a) రంధ్రం కూడా లోహంలాగే వ్యాకోచిస్తుంది: ΔD = D α ΔT = 4.24 × 1.7 × 10⁻⁵ × 200 ≈ 0.0144 cm అని సరిచూడండి.

 

Question 9: 1.8 m పొడవు ఉన్న ఒక ఇత్తడి తీగను 27°C వద్ద రెండు దృఢమైన ఆధారాల మధ్య తీగలో స్వల్ప తన్యత ఉండేటట్లు బిగించారు. ఒకవేళ తీగను -39°C ఉష్ణోగ్రతకు చల్లబరిస్తే, తీగలో ఏర్పడే తన్యత ఎంత ? తీగ వ్యాసం 2.0 mm. ఇత్తడి దైర్ఘ్య వ్యాకోచ గుణకం 2.0 × 10⁻⁵ K ⁻¹; ఇత్తడి యంగ్ గుణకం = 0.91 × 10¹¹ Pa.

Answer:

ఇచ్చట L = 1.8 m, T₁ = 27°C, T₂ = -39°C, F = ?, r = 1 mm = 10⁻³ m,
α = 2 × 10⁻⁵ °K ⁻¹, Y = 0.91 × 10¹¹ N/m²
\( Y = \frac{F L}{a \Delta L} \) నుండి \( \Delta L = \frac{F L}{a Y} \)
ఇంకా ∆L = α L ∆T ∴ \( \frac{F L}{a Y} = α L ∆T \) (లేదా) F = α∆T a Y = α(T₂ – T₁) π r² Y
\( = 2 × 10^{-5} × (-39 - 27) × \frac{22}{7} (10^{-3})^2 × 0.91 × 10^{11} ≈ -3.8 × 10^2 \) N
తీగ సంకోచం చెందునపుడు బలం లోపలి వైపు పనిచేయును అని ఋణగుర్తు తెలుపుతున్నది.

Exam Tips:

a) F = α ΔT A Y; ΔT = –39 – 27 = –66 K తీసుకోండి; ఋణ గుర్తు = సంకోచం వల్ల తీగ లోపలికి లాగబడుతుంది; జవాబు ≈ 3.8 × 10² N.

 

Question 10: 50 cm పొడవు, 3.0 mm వ్యాసం ఉన్న ఒక ఇత్తడి కడ్డీని అంతే పొడవు, వ్యాసం ఉన్న మరొక ఉక్కు కడ్డీతో జతపరచారు. వాటి తొలి పొడవులు 40°C వద్ద ఉంటే, 250°C ఉష్ణోగ్రత వద్ద ఆ సంయోగ కడ్డీ పొడవులో కలిగే మార్పు ఎంత ? ఆ రెండు కడ్డీలు కలిసే సంధి వద్ద ఉష్ణప్రతిబలం ఏర్పడుతుందా ? కడ్డీ చివరి కొనలు స్వేచ్ఛగా వ్యాకోచించగలవు. (ఇత్తడి, ఉక్కు కడ్డీల దైర్ఘ్య వ్యాకోచ గుణకాలు వరుసగా 2.0 × 10⁻ ⁵K ⁻¹, 1.2 × 10⁻⁵ K ⁻¹).

Answer:

∆L₁ = L₁α₁∆T = 50 × (2.0 × 10⁻⁵)(250 – 40) = 0.21 cm
∆L₂ = L₂α₂∆T = 50 × (1.2 × 10⁻⁵)(250 – 40) = 0.126 cm
∴ సంయోగ కడ్డీలో మార్పు = ∆L₁ + ∆L₂ = 0.21 + 0.126 = 0.336 cm
కడ్డీ చివరి కొనలు స్వేచ్ఛగా వ్యాకోచించగలవు కాబట్టి, రెండు కడ్డీలు కలిసే సంధి వద్ద ఉష్ణప్రతిబలం ఏర్పడదు.

Exam Tips:

a) ΔL = L α ΔT ను ప్రతి కడ్డీకి విడిగా లెక్కించి కలపండి: 0.21 + 0.126 = 0.336 cm; కొనలు స్వేచ్ఛగా ఉంటే ఉష్ణప్రతిబలం ఉండదని చెప్పండి.

 

Question 11: గ్లిసరిన్ ఘనపరిమాణ వ్యాకోచ గుణకం 49 × 10 ⁻⁵K ⁻¹. ఉష్ణోగ్రతను 30°C కు పెంచితే దాని సాంద్రతలో కలిగే అంశిక మార్పు ఎంత ?

Answer:

ఇచ్చట γ = 49 × 10 ⁻⁵K ⁻¹,
∆T = 30°C
V’ = V + ∆V = V(1 + γ∆T)
∴ V’ =V(1 + 49 × 10⁻⁵ × 30) = 1.0147 V
ρ = \( \frac{m}{V} \) కనుక, \( ρ' = \frac{m}{V'} = \frac{m}{1.0147 V} = 0.9855 ρ \)
సాంద్రతలో కలిగే అంశిక మార్పు \( = \frac{\rho-\rho'}{\rho} = \frac{\rho - 0.9855 \rho}{\rho} = 0.0145 \)

Exam Tips:

a) V′ = V(1 + γΔT), ρ′ = ρ/(1 + γΔT); అంశిక మార్పు = (ρ – ρ′)/ρ ≈ 0.0145 (సాంద్రత తగ్గుతుంది).

 

Question 12: 8.0 kg ద్రవ్యరాశి ఉన్న ఒక చిన్న అల్యూమినియం దిమ్మెలో రంధ్రం వేయడానికి 10kW (రంధ్రాలు చేసే) యంత్రాన్ని ఉపయోగించారు. 50% యంత్రం సామర్థ్యం యంత్రం వేడెక్కడానికి లేదా పరిసరాలలోకి ఉష్ణ నష్టం జరగడానికి ఉపయోగపడింది అనుకొంటే 2.5 నిమిషాలలో దిమ్మె ఉష్ణోగ్రతలో కలిగే పెరుగుదల ఎంత ? అల్యూమినియం విశిష్టోష్ణం = 0.91 Jg⁻¹ °K ⁻¹,

Answer:

ఇచ్చట P = 10 k W = 10 ⁴W, ద్రవ్యరాశి,m = 8.0 kg = 8 × 10³ g
ఉష్ణోగ్రతలో పెరుగుదల ∆T = ?, కాలం t = 2.5 నిమిషాలు = 2.5 × 60 = 150s
అల్యూమినియం విశిష్టోష్ణం, C = 0.91 Jg⁻¹ K⁻¹
మొత్తం శక్తి Q = P × t = 10⁴ × 150 = 15 × 10⁵ J
50% శక్తి నష్టపోగా, ఉపయోగపడిన శక్తి ∆\( Q = \frac{1}{2} × 15 × 10⁵ = 7.5 × 10⁵ J \)
As, ∆Q = m c ∆T
∴ ∆\( T = \frac{\Delta Q}{\mathrm{mc}}=\frac{7.5 \times 10^5}{8 \times 10^3 \times 0.91} = 103°C \)

Exam Tips:

a) 50% శక్తి మాత్రమే వేడెక్కించడానికి: ΔQ = ½ P t = 7.5 × 10⁵ J, ΔT = ΔQ/(m c) = 7.5 × 10⁵/(8000 × 0.91) ≈ 103°C; ద్రవ్యరాశిని గ్రాములలో వాడండి.

 

Question 13: 2.5 kg ద్రవ్యరాశి ఉన్న ఒక రాగి దిమ్మెను కొలిమిలో 500°C ఉష్ణోగ్రతకు వేడిచేసి ఒక పెద్ద మంచు దిమ్మెపై ఉంచారు. అప్పుడు గరిష్ఠంగా కరిగే మంచు పరిమాణం ఎంత ? (రాగి విశిష్టోష్ణం = 0.39 Jg⁻¹ K⁻¹ నీటి ద్రవీభవన గుప్తోష్ణం = 335 Jg⁻¹ ).

Answer:

రాగి దిమ్మె ద్రవ్యరాశి m = 2.5 kg = 2500 g ;
రాగి విశిష్టోష్ణం c = 0.39 J g⁻¹ K ⁻¹;
ఉష్ణోగ్రతలో తగ్గుదల ∆T = 500 – 0 = 500°C
ద్రవీభవన గుప్తోష్ణం L = 335 J g⁻¹
కరుగుచున్న మంచు ద్రవ్యరాశిని m’ అని అనుకొనుము.
మంచు గ్రహించిన ఉష్ణరాశి = రాగి కోల్పోయిన ఉష్ణరాశి
∴ m’L = mc ∆T
m’ \( = \frac{\mathrm{mc} \Delta \mathrm{T}}{\mathrm{L}}=\frac{2500 \times 0.39 \times 500}{335} ≈ 1455 g ≈ 1.46 kg \)

Exam Tips:

a) రాగి కోల్పోయిన ఉష్ణం = మంచు గ్రహించిన ఉష్ణం: m′ = m c ΔT/L = 1455 g ≈ 1.46 kg; ద్రవ్యరాశిని గ్రాములలో ఉంచండి.

 

Question 14: ఒక పదార్థం విశిష్టోష్ణం కనుక్కొనే ప్రయోగంలో 150°C వద్ద ఉన్న 0.20 kg ల ఒక లోహపు దిమ్మెను 27°C వద్ద 150 cm³ నీరు ఉన్న కెలోరిమీటరు (జల తుల్యాంకం 0.025 kg) లోకి జారవిడిచారు. తుది ఉష్ణోగ్రత 40°C. లోహపు దిమ్మె విశిష్టోష్ణం గణన చేయండి. పరిసరాలలోకి నష్టపోయిన ఉష్ణం విస్మరించదగినంత కాకపోతే మీ సమాధానం ఆ పదార్థం విశిష్టోష్ణం అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటుందా లేదా తక్కువగా ఉంటుందా ?

Answer:

లోహం ద్రవ్యరాశి m = 0.20 kg = 200 g
లోహం ఉష్ణోగ్రతలో తగ్గుదల ∆T = 150 – 40 = 110°C
‘C’ అనునది లోహం విశిష్టోష్ణం అయిన లోహం కోల్పోయిన ఉష్ణరాశి
∆Q = mC∆T = 200 × c × 110 ………………. (i)
నీటి ఘనపరిమాణం = 150 c.c.
∴ నీటి ద్రవ్యరాశి m’. = 150 g
కైలోరి మీటరు నీటి తుల్యాంకం w = 0.025 kg = 25 g
నీటి మరియు కెలోరీ మీటరు ఉష్ణోగ్రతలో పెరుగుదల ∆T’ = 40 – 27 = 13°C
నీరు మరియు కెలోరీ మీటరు గ్రహించిన ఉష్ణరాశి
∆Q’ = (m’ + w)∆T’ = (150 + 25) × 13 = 175 × 13 …………….. (ii)
∆Q = ∆Q’ కావున
∴ (i) మరియు (ii) సమీకరణముల నుంచి 200 × c × 110 = 175 × 13 (లేదా) \( c = \frac{175 \times 13}{200 \times 110} ≈ 0.103 \) cal g⁻¹ °C⁻¹
పరిసరాలకు కొంత ఉష్ణం నష్టపోవడం వలన నిజ విలువ కన్నా సాధించిన c విలువ తక్కువగా ఉంటుంది.

Exam Tips:

a) లోహం కోల్పోయినది = నీరు + కెలోరిమీటర్ గ్రహించినది: 200 c × 110 = 175 × 13 → c ≈ 0.103 cal g⁻¹ °C⁻¹; ఉష్ణ నష్టం ఉంటే లెక్కించిన c నిజ విలువ కన్నా తక్కువ.

 

Question 15: గది ఉష్ణోగ్రత వద్ద కొన్ని సాధారణ వాయువుల మోలార్ విశిష్టోష్ణాలపై చేసిన పరిశీలనలు కింద ఇవ్వడమైంది.
వాయువు | మోలార్ విశిష్టోష్ణం (Cv) (cal mol⁻¹ K⁻¹)
హైడ్రోజన్ | 4.87
నైట్రోజన్ | 4.97
ఆక్సిజన్ | 5.02
నైట్రిక్ ఆక్సైడ్ | 4.99
కార్బన్ మోనాక్సైడ్ | 5.01
క్లోరిన్ | 6.17
ఈ విధంగా కొలచిన వాయువుల మోలార్ విశిష్టోష్ణ విలువలు ఏక పరమాణు వాయువుల విలువల కంటె విశేషంగా భిన్నమైనవి. ఉదాహరణకు, ఏక పరమాణుక వాయువు మోలార్ విశిష్టోష్ణం 2.92 cal/mol K. ఈ వ్యత్యాసం ఎందుకో వివరించండి. క్లోరిన్ విలువ కొంత వరకు అధికంగా (మిగతా వాటి కంటే) ఉండటాన్ని బట్టి ఏమి చెప్పవచ్చు ?

Answer:

పైన పట్టికలో ఇవ్వబడిన వాయువులు ద్విపరమాణు వాయువులు, ఏక పరమాణు వాయువులు కావు. ద్విపరమాణువు వాయువుల మోలార్ విశిష్టోష్ణం \( = \frac{5}{2}R = \frac{5}{2} × 1.98 = 4.95 \) cal mol⁻¹ K⁻¹ ఈ పట్టిక నందు ఇచ్చిన పరిశీలనల దృష్ట్యా క్లోరిన్
మినహాయించి మిగిలిన వాయువులు అన్నియూ నియమానుసారం ఉన్నట్లుగా ఆమోదించవచ్చును. ఏక పరమాణు వాయువులలో అణువులకు స్థానాంతర చలనం మాత్రమే ఉంటుంది.
ద్వి పరమాణు వాయువులో అణువులు స్థానాంతర చలనంతో పాటు కంపన మరియు భ్రమణ చలనాలను కూడా కలిగి ఉంటాయి. అందువలన 1 మోల్ ద్విపరమాణు వాయువు ఉష్ణోగ్రతను 1°C పెంచుటకు, స్థానాంతర శక్తితో పాటుగా, భ్రమణ మరియు కంపన శక్తులను పెంచుటకు కావలసిన ఉష్ణరాశిని సరఫరా చేయవలెను. అందువల్ల మోలార్ విశిష్టోష్ణం ఏక పరమాణు వాయువుల కన్నా ద్వి పరమాణు వాయువులకు ఎక్కువ.
గది ఉష్ణోగ్రత వద్ద క్లోరిన్ మోలార్ విశిష్టోష్ణం విలువ మిగిలిన ద్విపరమాణు వాయువులు హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ మొ॥ కన్నా అధికముగా ఉండటాన్ని బట్టి క్లోరిన్‌కు స్థానాంతర, భ్రమణ చలనాలతో పాటు కంపన చలనాలు కూడా ఉంటాయి. మిగిలిన వాయువులకు స్థానాంతర మరియు భ్రమణ చలనాలు మాత్రమే ఉంటాయి. ఈ కారణం వలన క్లోరిన్ వాయువు కొంత అధిక మోలార్ విశిష్టోష్ణం విలువను కలిగి ఉంటుంది.

Exam Tips:

a) ద్విపరమాణు వాయువుకు C_v = 5/2 R (స్థానాంతర + భ్రమణ), ఏక పరమాణు వాయువుకు 3/2 R; క్లోరిన్‌కు కంపన చలనం కూడా ఉండటం వల్ల విలువ ఎక్కువ.

 

Question 16: కార్బన్ డై ఆక్సైడ్ P-T ప్రావస్థా పటం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి.
(a) ఏ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద సమతాస్థితిలో CO₂ ఘన, ద్రవ, బాష్ప స్థితులు కలిసి ఉంటాయి ?
(b) CO₂ ఘనీభవన, బాష్పీభవన స్థానాలపై పీడన తగ్గుదల ప్రభావమేమిటి ?
(c) CO₂ సందిగ్ధ ఉష్ణోగ్రత, పీడన విలువలు ఏమిటి ? వాటి ప్రాముఖ్యత ఏమిటి ? (d) క్రింది వివిధ సందర్భాలలో CO₂ ఘనమా, ద్రవమా లేదా వాయువా తెలపండి. a) 1atm, – 70°C వద్ద b) 10atm, -60°C వద్ద c) 56 atm, 15°C వద్ద ?

Answer:

(a) -56.6° C ఉష్ణోగ్రత, 5.11 వాతావరణ పీడనం (త్రిక బిందువు) ల వద్ద CO₂, ఘన, ద్రవ మరియు బాష్ప స్థితులు కలసి ఉంటాయి.
(b)పీడనాన్ని తగ్గిస్తూ ఉంటే, CO₂ యొక్క ఘనీభవన మరియు బాష్పీభవన స్థానాలు తగ్గుతాయి.
(c) CO₂ సందిగ్ధ ఉష్ణోగ్రత విలువ 31.1°C మరియు సందిగ్ధ పీడనము విలువ 73 వాతావరణ పీడనము. CO₂ ఉష్ణోగ్రత 31.1°C కన్నా పెంచినపుడు ఎంత ఎక్కువ పీడనాన్ని ప్రయోగించిన అది ద్రవంగా మారదు.
(d) (a) 1 atm, -70° C వద్ద CO₂ వాయు స్థితిలో ఉంటుంది.
(b) 10 atm, –60°C వద్ద CO₂ ఘన స్థితిలో ఉంటుంది.
(c) 56 atm, 15°C వద్ద CO₂ ద్రవ స్థితిలో ఉంటుంది.

Exam Tips:

a) P–T పటంలో త్రిక బిందువు (–56.6°C, 5.11 atm), సందిగ్ధ బిందువు (31.1°C, 73 atm) గుర్తించి ప్రతి భాగానికి ఘన/ద్రవ/వాయు ప్రదేశం పటం ఆధారంగా చెప్పండి.

 

Question 17: CO₂ P-T ప్రావస్థా పటం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
(a) 1 atm పీడనం, -60°C ఉష్ణోగ్రత వద్ద CO₂ ను సమోష్ణోగ్రతా ప్రక్రియలో సంపీడనం చెందిస్తే దానిలో మార్పు ద్రవ ప్రావస్థ ద్వారా జరుగుతుందా ?
(b) 4 atm పీడనం వద్ద ఉన్న CO₂ను స్థిర పీడనం వద్ద గది ఉష్ణోగ్రత నుంచి చల్లబరిస్తే ఏమవుతుంది ?
(c) 10 atm పీడనం, -65°C ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి ఉన్న ఘన CO₂ ను స్థిర పీడనం వద్ద గది ఉష్ణోగ్రతకు వేడిచేస్తే, దానిలో కలిగే మార్పులను గుణాత్మకంగా వివరించండి.
(d) CO₂ను 70°C ఉష్ణోగ్రతకు వేడిచేసి సమోష్ణోగ్రతా ప్రక్రియలో సంపీడనం చెందించారు. దాని ధర్మాలలో ఎలాంటి మార్పులు కలుగుతాయో మీరు ఊహించగలరా ?

Answer:

(a) P–T పటంలో –60°C బిందువు –56.6°C కు ఎడమవైపు ఉన్నది. అనగా ఇది ఘన మరియు బాష్ప ప్రదేశాలలో ఉంటుంది. కావున CO₂ ద్రవ ప్రావస్థను చేరకుండా బాష్ప ప్రావస్థ నుండి ఘన ప్రావస్థను చేరుతుంది.
(b) CO₂ పీడనం 4 atm విలువ 5.11 atm ల కన్నా తక్కువగా ఉన్నది కావున, అది ద్రవ ప్రావస్థను పొందకుండా నేరుగా ఘనీభవిస్తుంది.
(c) 10 atm పీడనం, -65°C ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి ఉన్న ఘన CO₂ ను స్థిర పీడనం వద్ద వేడిచేస్తే ఘన స్థితి నుండి ద్రవ స్థితికి మారి ఆ తరువాత బాష్ప స్థితికి చేరుతుంది. P-T పటంలో క్షితిజ సమాంతర రేఖ 10 atm స్థిర పీడనం వద్ద ఘనీభవన, బాష్పీభవన వక్రాలను ఖండించే బిందువులు ఘనీభవన, బాష్పీభవన బిందువులను ఇస్తాయి.
(d) CO₂ ను 70°C ఉష్ణోగ్రతకే వేడిచేసి సమ ఉష్ణోగ్రతా ప్రక్రియలో సంపీడనం చెందించిన ద్రవస్థితికి పరివర్తనను విస్పష్టంగా ప్రదర్శించదు. ఎందుకనగా వాయువు ఉష్ణోగ్రత, సందిగ్ధ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ. కాని పీడనం అధికమయ్యే కొలదీ ఆదర్శ వాయు ప్రవర్తన నుంచి విచలనము పెరుగుతుంది.

Exam Tips:

a) ప్రతి భాగంలో పటంపై ఆ స్థిర పీడనం/ఉష్ణోగ్రత రేఖ గీసి అది ఏ ప్రదేశాల గుండా వెళ్తుందో చెప్పండి; సందిగ్ధ ఉష్ణోగ్రత పైన ఎంత సంపీడనం చేసినా ద్రవం కాదు.

 

Question 18: ఒక బాలుడు 101°F ఉష్ణోగ్రత జ్వరంతో ఉన్నాడు. అతడు జ్వరాన్ని తగ్గించే ఆంటీసైరిన్ మాత్ర తీసుకొన్నప్పుడు ఆ మాత్ర కారణంగా అతని దేహం నుంచి వెలువడే చెమట ఆవిరయ్యే రేటు పెరుగుతుంది. 20 నిమిషాలలో బాలుడి జ్వరాన్ని 98°Fకు తగ్గిస్తే, ఆ మాత్ర వల్ల కలిగే అదనపు ఆవిరయ్యే రేటు ఎంత ? ఆవిరిగా మారే క్రియ వల్లనే ఉష్ణ నష్టం జరుగుతుంది అనుకోండి. బాలుడి ద్రవ్యరాశి 30 kg. మానవ దేహం విశిష్టోష్ణం ఉజ్జాయింపుగా నీటి విశిష్టోష్ణానికి సమానం. ఆ ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరి గుప్తోష్ణం సుమారుగా 580 cal g ⁻¹,

Answer:

ఉష్ణోగ్రతలో తగ్గుదల, ∆T = 101 – 98 = 3°\( F = 3 × \frac{5}{9}°C = 5/3°C \)
బాలుడు ద్రవ్యరాశి, m = 30 kg
మానవ శరీరం విశిష్టోష్ణం = నీటి విశిష్టోష్ణం c = 1000 cal. kg⁻¹ °C⁻¹
∴ బాలుడు నష్టపోయిన ఉష్ణరాశి, ∆Q = mc∆\( T = 30 × 1000 × \frac{5}{3} = 50000 \) cals
20 నిమిషాలలో ఆవిరి అయిన నీటి ద్రవ్యరాశి m’ అయిన m’L = ∆Q (లేదా) m’ \( = \frac{\Delta Q}{L} = \frac{50000}{580} = 86.2g \)
∴ అధికంగా ఆవిరి కాబడిన నీటి సగటు రేటు \( = \frac{86.2}{20} = 4.31 g min⁻¹ \)

Exam Tips:

a) ΔT = 3°F = 5/3 °C అని మార్చడం మరచిపోకండి; ΔQ = mcΔT = 50000 cal; m′ = ΔQ/L = 86.2 g; రేటు = 86.2/20 ≈ 4.3 g/min.

 

Question 19: ప్రత్యేకంగా వేసవి కాలంలో తక్కువ పరిమాణంలో వండిన ఆహారాన్ని నిల్వ చేయడానికి చౌకయిన, సమర్థవంతమైన పద్ధతి థర్మోకోల్ మంచుపెట్టె. 30 cm పొడవు గల ఘన మంచు పెట్టె మందం 5.0 cm. ఆ పెట్టెలో 4.0 kg ల మంచును ఉంచారు. 6 గంటల తరువాత మిగిలి ఉండే మంచు పరిమాణాన్ని అంచనా వేయండి. వెలుపలి ఉష్ణోగ్రత 45°C, థర్మోకోల్ ఉష్ణ వాహకత్వ గుణకం 0.01 J s⁻¹ m⁻ ¹K⁻¹ [నీటి ద్రవీభవన ఉష్ణం = 335 × 10³ J kg⁻¹]

Answer:

మంచు పెట్టె పొడవు, l = 30 cm = 0.3 m;
మందం, ∆x = 5 cm = 0.05 m
మొత్తం ఉపరితల వైశాల్యం, A = 6l² = 6 × 0.3 × 0.3 = 0.54 m²
ఉష్ణోగ్రతలో వ్యత్యాసము, ∆T = 45 – 0 = 45°C, K = 0.01 Js⁻¹ m⁻¹ K⁻¹
కాలం = ∆t = 6hrs = 6 × 60 × 60s
ద్రవీభవన గుప్తోష్ణం, L = 335 × 10³ J / kg
ఈ కాలంలో కరిగిన మంచు ద్రవ్యరాశిని ‘m’ అనుకొనిన ∆Q = mL = KA \( \left(\frac{\Delta T}{\Delta x}\right) \) ∆t
m = KA \( \left(\frac{\Delta \mathrm{T}}{\Delta \mathrm{x}}\right) \frac{\Delta \mathrm{t}}{\mathrm{L}} = 0.01 × 0.54 × \frac{45}{0.05} × \frac{6 \times 60 \times 60}{335 \times 10^3} = 0.313kg \)
∴ మిగిలిన మంచు ద్రవ్యరాశి = 4 – 0.313 = 3.687 kg.

Exam Tips:

a) పెట్టె ఉపరితల వైశాల్యం A = 6l² = 0.54 m²; m = KA(ΔT/Δx)(Δt/L) = 0.313 kg కరుగుతుంది; మిగిలింది 4 – 0.313 = 3.687 kg.

 

Question 20: ఒక ఇత్తడి బాయిలర్ అడుగు భాగం వైశాల్యం 0.15 m ², మందం 1.0 cm. దీనిని ఒక గ్యాస్ స్టవ్ పై పెట్టినప్పుడు 6.0 kg/min రేటున నీటిని మరిగిస్తుంది. బాయిలర్తో స్పర్శలో ఉన్న మంటలోని కొంత భాగం ఉష్ణోగ్రతను అంచనా వేయండి. ఇత్తడి- ఉష్ణవాహకత్వం = 109 J s⁻¹ m⁻¹ K ⁻¹; నీటి బాష్పీభవన ఉష్ణం = 2256 × 10³ J kg ⁻¹.

Answer:

ఇచ్చట A = 0.15 m ², ∆x = 1.0 cm = 10⁻² m.
\( \frac{\Delta \mathrm{Q}}{\Delta \mathrm{t}}=\frac{6 \times 10^3 \times 2256} {60} Js⁻¹ = 2256 × 10² Js⁻¹ \)
K = 109 J s⁻¹ m⁻¹ °C⁻¹, ∆T = (t – 100)
\( \frac{\Delta Q}{\Delta t} = \) KA \( \left(\frac{\Delta T}{\Delta \mathrm{x}}\right) \) నుండి \( 2256 × 10² = 109 × 0.15\frac{(\mathrm{t}-100)}{10^{-2}} \)
\( t - 100 = \frac{2256}{109 \times 0.15} = 137.98 \)
⇒ t = 237.98°C ≈ 238°C

Exam Tips:

a) Q/t = (6 kg/min × L)/60 = 2.256 × 10⁵ W; ΔT = (Q/t)Δx/(KA) ≈ 138°C; మంట ఉష్ణోగ్రత ≈ 100 + 138 = 238°C.

 

Question 21: ఎందుకో వివరించండి:
(a) అధిక పరావర్తకత ఉన్న వస్తువు అధమ ఉద్గారకం.
(b) అతి శీతలంగా ఉన్న రోజు చెక్క పళ్ళెం కంటే ఇత్తడి పాత్ర చాలా చల్లగా ఉంటుంది.
(c) పరిపూర్ణ కృష్ణ వస్తువు వికిరణానికి క్రమాంకనం చేసిన దృశ్య పైరోమీటరు (అధిక ఉష్ణోగ్రత కొలవడానికి) బాహ్య ప్రదేశంలో ఉన్న బాగా ఎర్రగా వేడెక్కిన ఇనుప కడ్డీ ఉష్ణోగ్రతను చాలా తక్కువ విలువగా చూపుతుంది. కాని, అదే కడ్డీని కొలిమిలో అమర్చినప్పుడు ఆ ఉష్ణోగ్రత వద్ద సరైన విలువను చూపుతుంది.
(d) భూమిపై భూ వాతావరణం లేకుంటే జీవకోటి ఉండటానికి వీలులేనంత చల్లగా ఉండేది.
(e) వేడి నీటిని ప్రవహింపచేయడంపై ఆధారపడ్డ తాపన వ్యవస్థ కంటే ఆవిరిని ప్రవహింప చేయడంపై ఆధారపడ్డ తాపన వ్యవస్థ చాలా సమర్థవంతంగా భవంతిని వేడి చేయగలదు.

Answer:

(a) అధిక పరావర్తకత కలిగిన వస్తువు ఉష్ణాన్ని అధమంగా శోషించుకుంటుంది.
కిర్కాఫ్ నియమం ప్రకారం అధమ శోషకాలు, అధమ ఉద్గారకాలు.
(b) అతిశీతలంగా ఉన్న రోజున ఇత్తడి పాత్రను తాకిన, ఉష్ణం మనిషి శరీరం నుండి ఇత్తడి పాత్రకు ప్రసరిస్తుంది. అందువల్ల ఇత్తడి పలక చల్లగా ఉంటుంది. చెక్క పళ్ళెంను తాకిన, ఉష్ణం మనిషి శరీరం నుండి పళ్ళెంనకు ప్రసరించదు.
(c) కొలిమిలో అమర్చి బాగా ఎర్రగా వేడిచేసిన ఇనుపకడ్డీ ఉష్ణోగ్రత TK ను E = σT⁴ అను సంబంధము ద్వారా రాబట్టవచ్చు. Tₒ ఉష్ణోగ్రత కలిగిన బాహ్య ప్రదేశంలో ఉంచిన బాగా ఎర్రగా వేడెక్కిన ఇనుప కడ్డీ విడుదల చేసే శక్తిని, E = σ(T⁴ – Tₒ⁴) అను సంబంధము ద్వారా కనుగొనవచ్చు.
దృశ్య పైరోమీటరు అను పరికరము వస్తువు యొక్క ప్రకాశం, దాని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుందనే సూత్రముపై పనిచేస్తుంది. అందువల్ల బాహ్య ప్రదేశంలో ఉంచిన ఇనుప కడ్డీ ఉష్ణోగ్రతను చాలా తక్కువగా చూపుతుంది.
(d) సూర్యుని నుంచి భూమికి వచ్చే ఉష్ణ వికిరణాలలో పరారుణ వికిరణాలను భూవాతావరణంలోని పొరలు పరావర్తనం చెందించి భూఉపరితలానికి చేరుస్తాయి. దీని ఫలితంగా భూవాతావరణం వెచ్చగా ఉంటుంది. భూమిపై భూవాతావరణం లేకుంటే, పరారుణ వికిరణాలు పరావర్తనం జరగక జీవకోటి ఉండటానికి వీలు లేనంత చల్లగా ఉంటుంది.
(e) 100°C ఉష్ణోగ్రత వద్ద ఉన్న బాష్పం, 100°C ఉష్ణోగ్రత వద్ద ఉన్న అంతే ద్రవ్యరాశి కలిగిన వేడి నీటికన్నా ఎక్కువ ఉష్ణరాశిని కలిగియుంటుంది. 100°C వద్ద ఉన్న 1 గ్రామ్ నీటి ఉష్ణం కన్నా, 100°C వద్ద ఉన్న 1 గ్రామ్ బాష్పం 540 కెలరీల ఎక్కువ ఉష్ణరాశిని కలిగియుంటుంది. కావున వేడినీటిని ప్రవహింపచేయడంపై ఆధారపడ్డ తాపన వ్యవస్థ కంటే ఆవిరిని ప్రవహింపచేయటంపై ఆధారపడ్డ తాపన వ్యవస్థ చాలా సమర్థవంతంగా భవంతిని వేడి చేయగలదు.

Exam Tips:

a) ప్రతి భాగానికి ఒక్క కారణ వాక్యం రాయండి: (a) కిర్కాఫ్ నియమం, (b) ఉష్ణవాహకత, (d) హరితగృహ ప్రభావం, (e) బాష్పానికి అదనంగా 540 cal/g గుప్తోష్ణం.

 

Question 22: ఒక వస్తువు 5 నిమిషాలలో 80°C నుంచి 50°C కు చల్లబడుతుంది. 60°C నుంచి 30°C కు చల్లబడటానికి పట్టే కాలం కనుక్కోండి. పరిసరాల ఉష్ణోగ్రత 20°C.

Answer:

వస్తువు ఉష్ణోగ్రత మరియు పరిసరాల ఉష్ణోగ్రతలు వరుసగా T మరియు Tₒ అయిన న్యూటన్ శీతలీకరణ సిద్ధాంతము ప్రకారము
\( \frac{dT}{dt} = -K(T - T_0) \) (లేదా) \( \frac{dT}{T - T_0} = -K\,dt \)
వస్తువు ఉష్ణోగ్రత T₁ నుంచి T₂ వరకు t అనే కాలంలో తగ్గిన పై సంబంధాన్ని సమాకలనం చేయగా
\( \int_{T_1}^{T_2} \frac{dT}{T - T_0} = \int_0^t -K\,dt \) (లేదా) \( \left[\log_e (T - T_0)\right]_{T_1}^{T_2} = -Kt \)
(లేదా) \( \log_e \frac{T_2 - T_0}{T_1 - T_0} = -Kt \) (లేదా) \( 2.3026 \log_{10} \frac{T_2 - T_0}{T_1 - T_0} = -Kt \)
(లేదా) \( 2.3026 \log_{10} \frac{T_1 - T_0}{T_2 - T_0} = Kt \) (లేదా) \( t = \frac{2.3026}{K} \log_{10} \frac{T_1 - T_0}{T_2 - T_0} \quad \ldots (1) \)
ప్రశ్నలోని మొదటి సందర్భమునకు,
T₁ = 80°C,
T₂ = 50°C,
T₀ = 20°C,
t = 5 min. = 5 × 60s
\( 5 \times 60 = \frac{2.3026}{K} \log_{10} \frac{80 - 20}{50 - 20} = \frac{2.3026}{K} \log_{10} 2 \quad \ldots (2) \)
ప్రశ్నలోని రెండవ సందర్భమునకు,
\( T_1 = 60°C, \; T_2 = 30°C, \; T_0 = 20°C, \; t = ? \)
\( t = \frac{2.3026}{K} \log_{10} \frac{60 - 20}{30 - 20} = \frac{2.3026}{K} \log_{10} 4 \quad \ldots (3) \)
సమీకరణం (3) ను సమీకరణం (2) చే భాగించగా
\( \frac{t}{5 \times 60} = \frac{\log_{10} 4}{\log_{10} 2} = \frac{0.6021}{0.3010} = 2 \)
(లేదా) t = 5 × 60 × 2 = 10 × 60s = 10 min.

Exam Tips:

a) ∫dT/(T – T₀) = –K∫dt నుంచి t = (2.3026/K) log₁₀[(T₁ – T₀)/(T₂ – T₀)]; రెండు సందర్భాల నిష్పత్తి log 4/log 2 = 2 → t = 10 నిమిషాలు.

 

Free study material for Physics

Physics Class 11 Curriculum Solutions: Chapter 12 Thermal Properties of Matter

Textbook Solutions for Class 11 Physics Chapter 12 Thermal Properties of Matter

Access structured TS Board textbook solutions for Chapter 12 Thermal Properties of Matter. Designed in alignment with the latest academic curriculum for Class 11 Physics, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 12 Thermal Properties of Matter concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Physics.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.

Are the Physics TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు in both English and Hindi medium.

Is it possible to download the Physics TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 12 పదార్ధ ఉష్ణ ధర్మాలు in printable PDF format for offline study on any device.