Official TS Board Solutions for Class 11 Physics: Chapter 05 Laws of Motion
Review structured textbook solutions for Class 11 Physics Chapter 05 Laws of Motion. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Chapter-wise Solutions for Physics: Chapter 05 Laws of Motion
Navigate directly to the solved Physics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: జడత్వం అంటే ఏమిటి ? జడత్వ కొలతను ఏది ఇస్తుంది (మార్చి 2014)
Answer:
జడత్వం అంటే మార్పుకు నిరోధం. వస్తువు తనంతట తానుగా తన స్థితిని మార్చుకోజాలని వస్తు ధర్మాన్ని జడత్వం అంటారు. వస్తువు జడత్వాన్ని ద్రవ్యరాశి ‘m’ తో కొలుస్తారు.
Exam Tips:
a) జడత్వం = మార్పుకు నిరోధం అని నిర్వచించి, జడత్వ కొలత ద్రవ్యరాశి (m) అని స్పష్టంగా రాయండి.
b) రెండు భాగాల ప్రశ్న కావున రెండింటికీ విడివిడిగా సమాధానం ఇవ్వండి.
Question 2: న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం ప్రతి బలం సమానం, వ్యతిరేక బలాలతో కూడా ఉన్నప్పుడు గమనం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది?
Answer:
న్యూటన్ మూడవ నియమం ప్రకారము బలాలు ఎప్పుడూ జంటగానే ఏర్పడతాయి. చర్య = – ప్రతిచర్య.
సాధారణంగా చర్య, ప్రతిచర్యలు వేరు వేరు వ్యవస్థలపై పని చేయడం వల్ల చలనం సాధ్యపడుతుంది.
Exam Tips:
a) చర్య, ప్రతిచర్యలు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి కావున ఒకదానినొకటి రద్దు చేసుకోవు అనేదే ముఖ్య పాయింట్.
b) నడక లేదా పడవ నుండి దూకడం వంటి ఉదాహరణ రాస్తే సమాధానం పూర్తవుతుంది.
Question 3: ఒక తుపాకి నుంచి బుల్లెట్‌ను పేల్చినప్పుడు, తుపాకినీ వెనుకకు నెట్టివేసినట్లు అనిపిస్తుంది. వివరించండి.
Answer:
తుపాకి పేల్చటం అంతర్గత చర్య. అంతర్గత బలాలు వస్తువు ద్రవ్యవేగాన్ని
మార్చలేవు. కావున m₁u₁ + m₂u₂ = 0. (తుపాకి పేలకముందు అవి విరామస్థితిలో ఉన్నవి కావున)
∴ m₁u₁ = -m₂u₂ కావున తుపాకి గుండు ముందుకు, తుపాకి వెనుకకు పోవడం
ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం జరుగుతుంది.
Exam Tips:
a) ఇక్కడ తుపాకి + బుల్లెట్ కలిపి ఒకే వ్యవస్థ; పేలకముందు మొత్తం ద్రవ్యవేగం సున్న అని రాసి m₁u₁ + m₂u₂ = 0 వాడండి.
b) బలాలు అంతర్గతమైనవి కావున ద్రవ్యవేగ నిత్యత్వం వర్తిస్తుందని చెప్పండి.
Question 4: ఒకే గుళ్లను ఉపయోగించినా బరువుగా ఉన్న రైఫిల్ తేలిక రైఫిల్ కంటే తక్కువ వేగంతో వెనకకు వస్తుంది. ఎందువల్ల?
Answer:
తుపాకి వెనుకకు తన్నే వేగం \( v₁ = \frac{\mathrm{mv}}{\mathrm{M}} \) తుపాకి వేగము బులెట్ ద్రవ్యవేగానికి (mv), తుపాకి బరువుకు గల నిష్పత్తి. mv స్థిరంగా ఉన్నప్పటికి తుపాకి బరువు తగ్గితే దాని వెనుకకు తన్నే వేగం పెరుగుతుంది.
Exam Tips:
a) వెనుకకు తన్నే వేగం v = mv/M సూత్రం రాసి, M పెరిగితే v తగ్గుతుందని (విలోమానుపాతం) చూపండి.
Question 5: విరామస్థితిలో ఉన్న ఒక బాంబు రెండు ముక్కలుగా పేలితే దాని ముక్కలు వ్యతిరేకదిశలో చలిస్తాయి. వివరించండి.
Answer:
విరామ స్థితిలో ఉన్న బాంబు తొలి ద్రవ్యవేగం సున్న. బాంబు పేలిన తరువాత దాని ముక్కల ద్రవ్యవేగాల మొత్తం కూడా (ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం) సున్న.
∴ m₁v₁ + m₂v₂ = 0 లేదా m₁v₁ = − m₂v₂ (− గుర్తు వ్యతిరేక దిశను సూచిస్తుంది). అనగా ఆ రెండు ముక్కలు వ్యతిరేక దిశలో చలిస్తాయి.
Exam Tips:
a) పేలకముందు ద్రవ్యవేగం సున్న కావున m₁v₁ = −m₂v₂ ; ఋణ గుర్తు వ్యతిరేక దిశను సూచిస్తుంది అని రాయడం మరువకండి.
b) ముక్కల ద్రవ్యరాశులు సమానం కాకపోతే వేగాలు వ్యతిరేక దిశలో ఉండి, తేలికైన ముక్క ఎక్కువ వేగంతో వెళ్తుందని చెప్పడం అదనపు మార్కులకు ఉపయోగపడుతుంది.
Question 6: బలాన్ని నిర్వచించండి. ప్రకృతిలోని ప్రాథమిక బలాలను పేర్కొనండి.
Answer:
ఒక వస్తువు యొక్క స్థితిని మార్చునది లేక మార్చుటకు ప్రయత్నించే భౌతికరాశిని బలంగా నిర్వచించారు. ఇది సదిశరాశి.
ప్రకృతిలో ప్రాథమిక బలాలు : 1) గురుత్వాకర్షణ బలాలు, 2) విద్యుదయస్కాంత బలాలు, 3) ప్రబల కేంద్రక బలాలు, 4) దుర్బల కేంద్రక బలాలు.
Exam Tips:
a) బలం నిర్వచనంతో పాటు నాలుగు ప్రాథమిక బలాలను పేర్కొనండి (గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత, ప్రబల కేంద్రక, దుర్బల కేంద్రక).
b) బలం సదిశరాశి అని రాయండి.
Question 7: ఘర్షణ గుణకం విలువ ఒకటి కంటె ఎక్కువగా ఉంటుందా ?
Answer:
అవును. సాధారణంగా ఘర్షణ గుణకం ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో ‘1’ కంటె ఎక్కువగా ఉండవచ్చు.
Exam Tips:
a) సాధారణంగా μ < 1 ; కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో (ఉదా: చాలా గరుకు తలాలు) 1 కంటే ఎక్కువ కావచ్చు అని రెండు వాక్యాల్లో రాయండి.
Question 8: గాలి నిండిన టైర్లు ఉన్న కారు కంటే గాలి లేని టైర్లు ఉన్న కారు తొందరగా ఆగుతుంది. ఎందుకు ?
Answer:
టైర్లలోని గాలి తక్కువగా ఉన్నపుడు అవి ఎక్కువ భాగము సమాంతరముగా మారి భూమిని తాకుతాయి. దానివలన ఘర్షణ బలం పెరుగుతుంది. దొర్లుడు ఘర్షణ బలం వస్తువుల మధ్య ఉన్న స్పర్శతలం వైశాల్యంపై ఆధారపడుతుంది. కాబట్టి కారు త్వరగా నిశ్చల స్థితికి వస్తుంది.
Exam Tips:
a) గాలి తక్కువ ఉన్న టైర్లలో స్పర్శతల వైశాల్యం పెరిగి ఘర్షణ పెరుగుతుందని కారణం రాయండి.
b) చాలామంది "గాలి తక్కువ వల్ల ఘర్షణ పెరుగుతుంది" అని మాత్రమే రాస్తారు; స్పర్శతల వైశాల్యం పెరగడమే కారణమని స్పష్టంగా రాయాలి.
Question 9: గుర్రం చలనంలో ఉన్నప్పటికంటే, అది బయలుదేరడం ప్రారంభించే సమయంలో ఎక్కువ బలాన్ని ఎందుకు ఉపయోగిస్తుంది ?
Answer:
వస్తువు చలనంలోనికి రావటానికి సీమాంత ఘర్షణ బలాన్ని అధిగమించాలి. (Fₛ = μ ₛmg). కాని ఒకసారి చలనములోనికి వచ్చిన తరువాత గతిక ఘర్షణ బలం పనిచేస్తుంది. గతిక ఘర్షణ బలం సీమాంత ఘర్షణ బలం కంటే తక్కువ. కావున చలనం ఆరంభంలో గుర్రం ఎక్కువ బలంతో బండిని లాగవలసి ఉంటుంది.
Exam Tips:
a) సీమాంత ఘర్షణ (μₛ N) > గతిక ఘర్షణ (μₖ N) అనే పోలికే సమాధానానికి ఆధారం.
b) μₛ > μₖ కావడానికి కారణం (తలాల ఎగుడుదిగుళ్ళు ఒకదానిలో ఒకటి ఇమిడిపోవడం) ఒక వాక్యంలో చెబితే సమాధానం పూర్తవుతుంది.
Question 10: వస్తువు భారాన్ని రెట్టింపు చేస్తే ఘర్షణ గుణకం ఏమవుతుంది ? (మే 2014)
Answer:
వస్తువు భారాన్ని రెట్టింపు చేసినప్పటికి ఘర్షణ గుణకం విలువ మారదు. ఎందుకనగా ఘర్షణ బలం లంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉంటుంది కావున భారం రెండింతలైన, లంబ ప్రతిచర్య, ఘర్షణ బలం కూడా రెట్టింపు అవుతాయి. కాని ఘర్షణ గుణకం విలువ మారదు.
Exam Tips:
a) f = μN సూత్రంలో భారం పెరిగితే f, N రెండూ పెరిగి μ = f/N మారదని రాయండి; μ తలాల స్వభావంపై ఆధారపడుతుంది.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: 0.1 kg ద్రవ్యరాశి ఉన్న ఒక రాయిని నిలువుగా పైకి విసిరారు. కింది సందర్భాలలో రాయిపై పనిచేసే నికర బలం పరిమాణం, దిశను తెలపండి. ఎ) నిలువుగా పైకి ప్రయాణిస్తున్నప్పుడు, బి) క్రిందికి ప్రయాణిస్తున్నప్పుడు, సి) గరిష్ఠ ఎత్తు వద్ద, (ఎక్కడైతే క్షణం పాటు రాయి విరామస్థితికి వస్తుందో)
Answer:
రాయి ద్రవ్యరాశి m = 0.1 kg.
ఎ) రాయి పైకి పోవునపుడు దానిపై పనిచేసే బలం గురుత్వాకర్షణ బలము.
∴ F = mg = 0.1 × 9.8 = 0.98 న్యూ.
బి) రాయి క్రిందికి పడునపుడు దానిపై పనిచేసే బలం F = గురుత్వాకర్షణ బలము ∴ F = mg = 0.1 × 9.8 = 0.98 న్యూ.
సి) రాయి గరిష్టోన్నతి స్థానం వద్ద ఉన్నపుడు దాని వేగం సున్న కాని అధోదిశలో గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది.
∴ ఫలిత బలము = mg = 0.1 × 9.8 = 0.98 న్యూ.
గమనిక : రాయి యొక్క మొత్తం ప్రయాణమార్గంలో గురుత్వాకర్షణ బలం అధోదిశలోనే పనిచేస్తుంది.
Exam Tips:
a) గాలి నిరోధం విస్మరించినపుడు మూడు స్థానాలలోనూ నికర బలం mg అధోముఖంగా ఉంటుంది; త్వరణం g అని గుర్తుంచుకోండి.
b) గరిష్ఠ ఎత్తు వద్ద వేగం సున్న అయినా బలం సున్న కాదు.
Question 2: ద్రవ్యవేగం, ప్రచోదనాలను నిర్వచించండి. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని నిర్వచించి, వివరించండి. ఉదాహరణలు ఇవ్వండి.
Answer:
ద్రవ్యవేగం \( (\overline{\mathrm{p}}) : \) వస్తువు యొక్క ద్రవ్యరాశిని దాని వేగంతో గుణించగా వచ్చు లబ్ధాన్ని ద్రవ్యవేగంగా నిర్వచించినారు.
ద్రవ్యవేగం \( (\overline{\mathrm{p}}) = \) ద్రవ్యరాశి × వేగము ∴ \( \overline{\mathrm{p}} = \) mv. ఇది సదిశరాశి.
ప్రమాణము : కి.గ్రా. మీ/సె.; మితిఫార్ములా : MLT⁻¹
ప్రచోదనము (J): వస్తువుపై ఎక్కువ బలం స్వల్పకాలంపాటు పనిచేస్తే బలము మరియు కాలముల లబ్దాన్ని ప్రచోదనము అంటారు.
ప్రచోదనము (J) = F × t, ఇది సదిశరాశి. ప్రమాణము : న్యూటన్ – సెకను;
మితిఫార్ములా : MLT⁻¹
ప్రచోదనము = ద్రవ్యవేగంలో మార్పు అని చూపుట:
నిర్వచనం ప్రకారము ప్రచోదనము (J) = బలము × కాలము = F × t
కాని బలము F = ma ఇందులో \( a = \frac{v-u}{t} \)
ప్రచోదనము \( J = m\left(\frac{\mathrm{v}-\mathrm{u}}{\mathrm{t}}\right) × t = \) mv – mu. = ద్రవ్యవేగంలోని మార్పు.
అనగా ప్రచోదనము J = mv – mu ద్రవ్యవేగంలో మార్పు.
రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం: వ్యవస్థపై బాహ్యబలం పనిచేయకపోతే (లేదా బాహ్యబలాల మొత్తం సున్న అయితే) వ్యవస్థ మొత్తం రేఖీయ ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది. అనగా m₁u₁ + m₂u₂ = m₁v₁ + m₂v₂.
ఉదాహరణలు: తుపాకి నుండి బుల్లెట్ పేలినపుడు తుపాకి వెనుకకు తన్నడం; విరామస్థితిలోని బాంబు ముక్కలుగా పేలడం; రాకెట్ ప్రయోగం.
Exam Tips:
a) ద్రవ్యవేగం (mv), ప్రచోదనం (F·t) లకు ప్రమాణాలు, మితి ఫార్ములా రాయండి.
b) J = mv − mu ఉత్పాదనలో F = ma, a = (v−u)/t దశలను చూపండి.
Question 3: మోటారు సైకిళ్ళు, కార్లకు షాక్ అబ్సార్బర్లను ఎందుకు ఉపయోగిస్తారు ?
Answer:
వాహనాలు వేగంగా చలించేటపుడు రోడ్డుపై గల ఎగుడు దిగుడు గుంటలపై గుండా వెళ్ళినపుడు అవి ప్రచోదనానికి లోనవుతాయి.
ద్రవ్యవేగంలో మార్పు సమానమైనప్పటికి కాలవ్యవధి ఎక్కువ ఐతే ప్రచోదనం దుష్ప్రభావం చూపదు. ప్రచోదనము
J = F.dt = (mv – mu). బలము \( F = \frac{m v-m u}{\Delta t} \) ఇందులో ∆t చిన్నదైతే ద్రవ్యవేగంలో మార్పు సమానమైనప్పటికి బలము ఎక్కువ, కాలవ్యవధి ∆t పెద్దదైతే బలము F విలువ తక్కువ. కావున కాలవ్యవధి పెరిగితే ఒకే విధమైన ప్రచోదనానికి మనపై పనిచేసే బలం తక్కువ. ప్రచోదనంలో కాలవ్యవధిని పెంచడానికి
వాహనాలకు షాక్ అబ్జార్బర్లు వాడతారు.
షాక్ అబ్జార్బర్లు ప్రచోదనం వల్ల వచ్చిన బలం ఉపయోగించుకొని వాటిలో గల స్ప్రింగ్‌లను సంపీడనం చెందిస్తాయి. ఈ స్ప్రింగ్‌లకు స్ప్రింగ్ స్థిరాంకము ఎక్కువగా ఉండేటట్లు చేయడం వల్ల స్ప్రింగ్ గ్రహించిన బలాన్ని నిదానంగా విడుదల చేస్తుంది. ఫలితంగా మనపై ప్రచోదన ప్రభావం తగ్గటం వల్ల ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది.
Exam Tips:
a) F = Δp/Δt : Δp సమానమైనపుడు Δt పెరిగితే బలం తగ్గుతుంది అనే సూత్రంతో సమాధానం ప్రారంభించండి.
b) క్యాచ్ పట్టేటపుడు చేతిని వెనుకకు లాగడం వంటి ఉదాహరణ రాయండి.
Question 4: సీమాంత ఘర్షణ, గతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణలను వివరించండి.
Answer:
స్థితిక ఘర్షణ : విరామ స్థితిలో గల వస్తువుల మధ్య ఘర్షణను స్థితిక ఘర్షణ లేదా సీమాంత ఘర్షణ అంటారు. ఇది వస్తువుల మధ్య జరగబోయే చలనాన్ని వ్యతిరేకిస్తుంది.
వస్తువుపై అనువర్తిత బలం ప్రయోగించినపుడు మాత్రమే స్థితిక ఘర్షణ బలం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ బలాలు అనువర్తిత బలంతో పాటు ఒక సీమాంత విలువ వరకు పెరుగుతాయి. గరిష్ఠ స్థితిక ఘర్షణ (f ₛ) విలువ అభిలంబ ప్రతిచర్య (N) కు అనులోమానుపాతంలో ఉంటుంది.
(fₛ)ₘₐₓ = μₛN
గతిక ఘర్షణ : గమనంలోకి వచ్చిన తరువాత స్పర్శ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని నిరోధించే బలాన్ని గతిక ఘర్షణ బలం అంటారు.
fₖ = μ ₖN
గతిక ఘర్షణ గుణకం μₖ విలువ స్థితిక ఘర్షణ గుణకం μₛ కన్నా తక్కువ.
దొర్లుడు ఘర్షణ : వస్తువుల మధ్య దొర్లుడు చలనం ఉన్నపుడు దొర్లుడు చలనాన్ని వ్యతిరేకిస్తూ స్పర్శ తలాలకు సమాంతరంగా పనిచేసే బలాన్ని దొర్లుడు ఘర్షణ అంటారు.
ఘర్షణ బలాలన్నింటిలో కన్న దొర్లుడు ఘర్షణ బలం విలువ అతి తక్కువ.
Exam Tips:
a) మూడు రకాలనూ నిర్వచనం, సూత్రం (fₛ ≤ μₛN, fₖ = μₖN) తో రాయండి; μₖ < μₛ అని, దొర్లుడు ఘర్షణ అతి తక్కువ అని చెప్పండి.
Question 5: ఘర్షణ వల్ల కలిగే లాభాలు, నష్టాలను వివరించండి.
Answer:
లాభాలు:
1. ఘర్షణ బలాలు మన నిత్యజీవనంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. నడిచేటప్పుడు భూమికి, చెప్పులకు మధ్య గల ఘర్షణ బలం జారిపడిపోకుండా ఆపుతుంది.
2. ఘర్షణ బలాలు యంత్రాలలో చలనాన్ని ఒక చక్రము నుండి రెండవ దానికి బెల్టుల ద్వారా అందించుటలో ఉపయోగపడతాయి.
3. బ్రేకులు వేసినపుడు వాహనాలు నిశ్చలస్థితికి రావటానికి ఘర్షణ బలాలు అవసరం.
4. ఘర్షణ బలాలు లేకున్నచో తాడుతో వస్తువులను బంధించలేము.
5. ఘర్షణ బలాలు కారణంగానే మేకులు, బోల్టులు చెక్కలను కలిపి ఉంచుతాయి.
నష్టాలు:
1. ఘర్షణ వలన చాలా శక్తి వృధా అవుతుంది.
2. యంత్ర భాగాలు త్వరగా అరిగిపోతాయి.
3. ఘర్షణ వలన ఉష్ణం జనించి, యంత్ర పదార్థాల బలం తగ్గిపోతుంది
Exam Tips:
a) లాభాలు, నష్టాలు రెండింటినీ రెండు శీర్షికల కింద నంబరు వేసి రాయండి; కనీసం 3 చొప్పున రాయడం మంచిది.
b) ఉపయోగాలకు ఒక్కొక్కటి ఉదాహరణతో (నడక, బ్రేకులు, బెల్టులు) రాస్తే ఉపరితల జాబితా కంటే ఎక్కువ మార్కులు వస్తాయి.
Question 6: ఘర్షణను తగ్గించే పద్ధతులను పేర్కొనండి. (మార్చి 2014, మే 2014)
Answer:
ఘర్షణను తగ్గించు పద్ధతులు:
1. నునుపు చేయుట : ఘర్షణ ముఖ్యముగా తలములోని హెచ్చుతగ్గుల వలన వస్తుంది. కాబట్టి తలములను నునుపు చేయుట ద్వారా ఘర్షణ తగ్గించవచ్చు. కాని బాగా ఎక్కువగా నునుపు చేసినచో మరల ఘర్షణ పెరుగుతుంది.
2. స్నేహకాలు ఉపయోగించుట : గ్రీజు, నూనె మొదలగు పదార్థములను ఉపయోగించి యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించవచ్చు.
3. బాల్ బేరింగులు ఉపయోగించుట : చిన్నవి, గుండ్రనైన ఇనుపగోళాలు ఉపయోగించి రెండు తలాల మధ్య గల జారుడు చలనాన్ని దొర్లుడు చలనంగా మార్చవచ్చు. ఇలా చేయుట వలన ఘర్షణ తగ్గుతుంది.
4. స్ట్రీమ్ లైనింగ్ : గాలిలో ప్రయాణించే విమానాలకు, గాలి వలన ఘర్షణ ఉంటుంది. అదే విధంగా నీటిలో ప్రయాణించే ఓడలకు, నీటికి మధ్య ఘర్షణ ఉంటుంది. ఈ రకమైన ఘర్షణను తగ్గించటానికి, విమానాలు, ఓడలు ఒక ప్రత్యేకమైన ఆకారంలో తయారుచేస్తారు. దీనిని స్ట్రీమ్ లైనింగ్ అంటారు.
Exam Tips:
a) నునుపు చేయడం, స్నేహకాలు, బాల్ బేరింగులు, స్ట్రీమ్‌లైనింగ్ అనే నాలుగు పద్ధతులను ఉదాహరణలతో రాయండి.
Question 7: దొర్లుడు ఘర్షణ నియమాలను తెలపండి.
Answer:
ఒక వస్తువు వేరొక తలంపై దొర్లుతున్నపుడు, వాటి మధ్య గల ఘర్షణను దొర్లుడు ఘర్షణ అంటారు.
దొర్లుడు ఘర్షణ గుణకం
\( \mu_r = \frac{F_r}{R} \) (దొర్లుడు ఘర్షణ బలం ÷ లంబ ప్రతిచర్య)
దొర్లుడు ఘర్షణ సూత్రాలు:
1. దొర్లుడు ఘర్షణ విలువ స్పర్శలోనున్న తలాల వైశాల్యంపై ఆధారపడుతుంది.
2. దొర్లే వస్తువు, దొర్లుతున్న తలం ఆకారాన్ని మార్పు చేస్తుంది. అందువలన తలంలోని పదార్థం దొర్లుడును వ్యతిరేకిస్తుంది.
3. దొర్లుడు ఘర్షణ, దొర్లుతున్న వస్తువు వ్యాసార్ధముపై ఆధారపడుతుంది.
వ్యాసార్ధము ఎక్కువైన దొర్లుడు ఘర్షణ తక్కువగా ఉంటుంది. fᵣ ∝ \( \frac{1}{r} \)
4. దొర్లుడు ఘర్షణ, లంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంలో ఉంటుంది: Fᵣ ∝ R.
Exam Tips:
a) μᵣ = Fᵣ/R సూత్రాన్ని రాసి, నాలుగు నియమాలను వరుసగా రాయండి; వ్యాసార్ధం పెరిగితే దొర్లుడు ఘర్షణ తగ్గుతుందనే విషయం ముఖ్యం.
b) "వ్యాసార్ధం పెరిగితే దొర్లుడు ఘర్షణ తగ్గుతుంది" అనే నియమంలో Fᵣ ∝ 1/r గుర్తుపెట్టుకోండి; వ్యాసార్ధానికి అనులోమానుపాతం అని రాయడం సాధారణ పొరపాటు.
Question 8: లాన్ రోలర్‌ను నెట్టడం కంటే లాగడం తేలిక. ఎందుకు ?
Answer:
గడ్డిని చదునుచేయు రోలరు లేదా రోడ్డు రోలరును F అనే బలం క్షితిజ సమాంతరంతో ‘θ’ కోణం చేస్తూ ముందుకు లాగుతున్నదనుకొనుము. ఈ బలమును రెండు లంబ అంశములుగా విడదీయవచ్చు.
1. క్షితిజ సమాంతర అంశ F cos θ – ఇది రోలరును లాగుటకు ఉపయోగపడుతుంది.
2. లంబ అంశ F sin θ – ఇది భారానికి వ్యతిరేకంగా పనిచేస్తూ, లంబ ప్రతిచర్యను తగ్గిస్తుంది.
∴ లంబ ప్రతిచర్య R = mg – F sin θ
ఘర్షణ బలం f = μ . R
= [μ (mg – F sin θ)] ………………. (1)
కాని రోలరును ‘F’ బలము క్షితిజంతో ‘θ’ కోణం చేస్తూ నెట్టుచున్నచో ఈ
సందర్భంలో పటములో చూపినట్లు లంబ అంశము ‘F sin θ’ భారం వలెనే కిందకు పని చేయుచూ లంబ ప్రతిచర్య విలువను పెంచుతుంది. అనగా R = mg + F sin θ కావున ఘర్షణ బలం f = μ (mg + F sin θ) ………………. (2)
(1) మరియు (2) ల నుండి నెట్టుటలో ఘర్షణ బలం ఎక్కువగా నున్నది కావున నెట్టుట, లాగుట కంటే కష్టము.
Exam Tips:
a) బల చిత్రం గీసి, లాగేటపుడు R = mg − F sin θ, నెట్టేటపుడు R = mg + F sin θ అని చూపండి; R ఎక్కువైతే ఘర్షణ ఎక్కువ.
b) పటం గీయకపోతే ఈ ప్రశ్నలో మార్కులు తగ్గుతాయి; లాగే సందర్భానికి, నెట్టే సందర్భానికి వేర్వేరు పటాలు గీయండి.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
Question 1: ఎ) న్యూటన్ రెండవ గమన నియమాన్ని తెలపండి. దాని నుంచి గమన సమీకరణం F= ma ను రాబట్టండి. బి) ఒక వస్తువు వృత్త పథంలో ఎప్పుడూ సమవడితో చలిస్తూ ఉంటే దాని మీద బలం పనిచేస్తుందా ?
Answer:
న్యూటన్ రెండవ నియమము: వస్తువు ‘ద్రవ్యవేగంలోని మార్పురేటు వస్తువుపై ప్రయోగించిన బాహ్యబలానికి అనులోమానుపాతంలో ఉండి, బాహ్యబలం పనిచేసే దిశలోనే పనిచేస్తుంది.
అనగా \( \frac{\mathrm{d} \overline{\mathrm{p}}}{\mathrm{d} \mathrm{t}} ∝ F \) లేదా \( F = k . \frac{\mathrm{d} \overline{\mathrm{p}}}{\mathrm{d} \mathrm{t}} \) లేదా F = k.ma
ఇందులో k విలువ ఒకటి అగునట్లుగా బలప్రమాణాన్ని నిర్వచించినారు.
కావున \( F = \frac{d\overline{p}}{dt} \) లేదా F = ma
F = ma సమీకరణ ఉత్పాదన:
న్యూటన్ రెండవ నియమం నుండి ఏదైనా వస్తువు యొక్క ద్రవ్యవేగంలోని మార్పురేటు బాహ్యబలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
అనగా \( \frac{\mathrm{d} \overline{\mathrm{p}}}{\mathrm{d} \mathrm{t}} ∝ F \) లేదా \( F= k . \frac{\mathrm{d} \overline{\mathrm{p}}}{\mathrm{d} \mathrm{t}} \) ఇందులో \( \overline{\mathrm{p}} = \) వస్తువు ద్రవ్యవేగము = mv.
∴ \( F = k . \frac{\mathrm{d}}{\mathrm{dt}}(\mathrm{m} \overline{\mathrm{v}}) ⇒ k.m. \frac{\mathrm{dv}} {\mathrm{dt}} \)
కాని \( \frac{\mathrm{dv}} {\mathrm{dt}} = \) వస్తువు వేగంలోని మార్పురేటు. దీనిని త్వరణము ‘a’ అంటారు.
∴ F = k . m. a ఇందులో k ఒక స్థిరాంకము.
ప్రమాణ బలము (Unit force) : ప్రమాణ ద్రవ్యరాశి గల వస్తువులో ప్రమాణ త్వరణం కలిగించడానికి కావలసిన బలాన్ని ప్రమాణ బలంగా నిర్వచించినారు.
అనగా ద్రవ్యరాశి m = 1 యూనిట్, త్వరణము a = 1 యూనిట్ ఐతే బలము F = 1 యూనిట్ అవుతుంది.
∴ F = kma లో m = 1, a = 1, F = 1 అని వ్రాస్తే k = 1 అవుతుంది.
ప్రమాణబలం నిర్వచనం ప్రకారము F = kma = ma
∴ F = ma
ఒక వస్తువు వృత్త పథంలో ఎప్పుడూ సమవడితో చలిస్తుంటే దాని మీద బలం : m ద్రవ్యరాశి గల ఒక వస్తువు ‘r’ వ్యాసార్ధం గల వృత్తాకార మార్గంలో సమవడితో చలించుచున్నదనుకొనుము. ఏదైనా బిందువు వద్ద వృత్తానికి గీసిన స్పర్శరేఖ వస్తువుకు ఆ బిందువు వద్ద గల వేగాన్ని తెలుపుతుంది. వస్తువుకు గల వేగదిశ అనుక్షణం మారుతుండటం వల్ల వస్తువుకు త్వరణం ఉంటుంది. వృత్తకేంద్రం వైపు పనిచేసే ఈ త్వరణాన్ని అభికేంద్ర త్వరణము అంటారు. దాని పరిమాణం \( a = \frac{v^2}{r} \).
న్యూటన్ రెండవ నియమం ప్రకారం ఈ త్వరణాన్ని కలిగించడానికి కేంద్రం వైపు అభికేంద్ర బలం \( F = \frac{mv^2}{r} \) వస్తువుపై పనిచేయాలి. కావున సమవడితో వృత్తాకార పథంలో చలించే వస్తువుపై బలం పనిచేస్తుంది (వడి స్థిరమైనా వేగం దిశ మారుతుంది కావున).
Exam Tips:
a) న్యూటన్ రెండవ నియమం (F = dp/dt) నుండి F = ma ను ఉత్పాదించేటపుడు k = 1 అయ్యేలా ప్రమాణ బలాన్ని నిర్వచించే దశను వదలకండి.
b) (బి) భాగంలో వడి స్థిరమైనా వేగ దిశ మారుతుంది కావున అభికేంద్ర బలం అవసరం అని ముగించండి.
Question 2: ఘర్షణ కోణం, విశ్రామ కోణాలను నిర్వచించండి. గరుకు వాలుతలం విషయంలో ఘర్షణ కోణం, విశ్రామ కోణానికి సమానమని చూపండి. గరుకు క్షితిజ సమాంతర తలంపై 4కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక చెక్క దిమ్మె విరామస్థితిలో కలదు. దిమ్మెపై 30 N క్షితిజ సమాంతర బలాన్ని ప్రయోగిస్తే అది కదలడానికి సిద్ధం అయ్యింది. g = 10 m/s² అయితే, దిమ్మెపై ఆ తలం ప్రయోగించే మొత్తం స్పర్శా బలాన్ని కనుక్కోండి.
Answer:
గరుకు వాలుతలంపై ‘m’ ద్రవ్యరాశి గల వస్తువును ఉంచినారనుకొనుము.
వాలుతలం క్షితిజ సమాంతరంతో చేసే కోణం ‘θ’ ను పెంచుతూ పోతే, ఒక ప్రత్యేక కోణం θ = α వద్ద దానిపై ఉంచిన వస్తువు త్వరణం లేకుండా తలం వెంబడి కిందకు జారటం మొదలవుతుంది. వాలుతలం చేసే ఈ కోణంను ప్రశాంతత కోణం (విశ్రామ కోణం) అంటారు. ఈ విధంగా జారుతున్నపుడు వస్తువు త్వరణం ‘సున్న’ ఉంటుంది.
వస్తువు భారం ‘mg’ నిలువుగా కిందకు పని చేస్తుంది. దీనిని రెండు లంబ అంశాలుగా విడదీయవచ్చు.
1) ‘mg sin θ’ వాలుతలం వెంబడి కిందకు పనిచేస్తూ వస్తువు కిందకు జరుగునట్లు చేస్తుంది. కాని దీని విలువ, ఘర్షణ బలం fₖ కు సమానంగా ఉంటుంది.
∴ fₖ = mg sin θ
2) రెండవ అంశ ‘mg cos θ’ తలానికి లంబంగా పనిచేస్తుంది. దీనికి సమానంగా వ్యతిరేక దిశలో లంబ ప్రతిచర్య పనిచేస్తుంది.
∴ R = mg cos θ
∴ ఘర్షణ గుణకం \( μ = \frac{f}{R}=\frac{mg \sin \theta}{mg \cos \theta} = \tan \theta \) ఇందులో θ = α
∴ μ = tan α
కావున ప్రశాంతత కోణం యొక్క టాంజెంట్ విలువ ఘర్షణ గుణకంనకు సమానం.
ఘర్షణ కోణం (λ): అభిలంబ ప్రతిచర్య R, ఘర్షణ బలం f ల ఫలిత బలం S, R దిశతో చేసే కోణాన్ని ఘర్షణ కోణం అంటారు. tan λ = f/R = μ. పై ఫలితం నుండి tan α = μ = tan λ ⇒ λ = α, అనగా ఘర్షణ కోణం = విశ్రామ కోణం.
లెక్క ; క్షితిజ సమాంతర తలంపై విరామ స్థితిలో ఉన్న వస్తువుపై పనిచేయు బలాలు
1. అభిలంబ చర్య (N)
2. వస్తువు భారము (mg)
3. క్షితిజ సమాంతర దిశలో బాహ్యబలము (30N)
4. స్థితిక ఘర్షణ బలము fₛ
సమతా స్థితిలో అభిలంబ బలమును వస్తువు భారం తుల్యం చేస్తుంది.
బాహ్యబలము f విలువ స్థితిక ఘర్షణ బలానికి సమానమైతే అది సమతాస్థితిలో ఉంటుంది.
కావున ఘర్షణ బలం f = 30 న్యూ.
అభిలంబ ప్రతిచర్య N = mg = 4 × 10 = 40 న్యూ.
తలం ప్రయోగించే మొత్తం స్పర్శా బలం \( = \sqrt{N^2+f^2}=\sqrt{40^2+30^2} = 50 \) న్యూ.
Exam Tips:
a) విశ్రామ కోణం α అయితే μ = tan α ; ఘర్షణ కోణం λ అయితే tan λ = μ — కావున λ = α అని చూపండి.
b) లెక్కలో మొత్తం స్పర్శా బలం = √(N² + f²) (అభిలంబ, ఘర్షణ బలాల సదిశా మొత్తం).
లెక్కలు
Question 1: ఒక కణం రేఖీయ ద్రవ్యవేగం, కాలం (t) ప్రమేయంగా p = a + bt గా ఇచ్చారు. a, b లు ధనాత్మక స్థిరాంకాలు అయితే, కణంపై పనిచేసే బలం ఏమిటి ?
Answer:
వస్తువు ద్రవ్యవేగము \( \overline{\mathrm{p}} = a + \) bt
వస్తువుపై బలము \( \overline{\mathrm{F}}=\frac{\mathrm{d} \overline{\mathrm{p}}} {\mathrm{dt}}=\frac{\mathrm{d}}{\mathrm{dt}} (a + \) bt)
∴ \( F = \frac{\mathrm{d}}{\mathrm{dt}} (a) + \frac{\mathrm{d}}{\mathrm{dt}} \) (bt) = 0 + b
∴ వస్తువుపై బలము = b
Exam Tips:
a) F = dp/dt ; స్థిరాంకం a ను అవకలనం చేస్తే సున్న, bt ను అవకలనం చేస్తే b వస్తుంది.
Question 2: 10 kg ద్రవ్యరాశి ఉన్న వస్తువు వేగంలో 2 m/s మార్పు కలిగించడానికి 5N బలాన్ని ఎంత కాలం ప్రయోగించాలి ?
Answer:
బలము F = 5 న్యూ;
వేగంలో మార్పు = v – u = 2 మీ/సె.
ద్రవ్యరాశి m = 10 kg
బలము F = ma, కాలము t = ?
బలము \( F = m \frac{(v-u)}{t} \)
⇒ \( t = \frac{\mathrm{m}(\mathrm{v}-\mathrm{u})}{\mathrm{F}}=\frac{10 \times 2} {5} = 4 \) సె.
Exam Tips:
a) v−u = at నుండి t = m(v−u)/F ; ప్రమాణాలను (kg, m/s, N) సరిచూసుకోండి.
Question 3: m ద్రవ్యరాశి ఉన్న ఒక బంతిని భూమిపై నుంచి నిట్టనిలువుగా పైకి విసిరితే అది క్షణకాలంపాటు విరామస్థితికి వచ్చేలోపు ‘h’ ఎత్తుకు చేరుకొంది. గురుత్వ త్వరణం ‘g’ అనుకోండి. బంతి తన ప్రయాణ కాలంలో గురుత్వాకర్షణ బలం వల్ల పొందే ప్రచోదనం ఎంత ? (గాలి నిరోధాన్ని విస్మరించండి)
Answer:
ప్రచోదనము J = బలము × కాలము = F × t; వస్తువుపై బలము = భారము = mg పైకి విసిరిన వస్తువు గాలిలో ఉన్న కాలము \( t = \frac{2 \mathrm{u}}{\mathrm{g}}. \) ఇందులో \( u = \sqrt{2 \mathrm{gh}} \)
∴ J = mg \( × \frac{2 \mathrm{u}}{\mathrm{g}} = \) mg \( × \frac{2 \times \sqrt{2 \mathrm{gh}}}{\mathrm{g}} = \sqrt{8 \mathrm{~m}^2 \mathrm{gh}} \)
Exam Tips:
a) గురుత్వ బలం స్థిరం (mg) కావున J = mg × (గాలిలో గడిపిన కాలం = 2u/g), u = √(2gh) అని ప్రతిక్షేపించండి; దిశ అధోముఖం.
Question 4: ఒక స్థిర బలాన్ని 3.0 kg ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై 25 s కాలంపాటు ప్రయోగిస్తే, ఆ వస్తువు వేగం 2.0 m s⁻¹ నుంచి 3.5 m s⁻¹ కు మారింది. వస్తువు వేగ దిశలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బలం పరిమాణాన్ని, బలఁ ప్రయోగించిన దిశను కనుక్కోండి.
Answer:
వస్తువు ద్రవ్యరాశి m = 3 kg; తొలి వేగము u = 2.0 మీ/సె.;
కాలము t = 25 సె. ;
తుదివేగము v = 3.5 మీ/సె.
బలము \( F = ma = \frac{m(v-u)}{t}=\frac{3(3.5-2)}{25} = 0.18 \) న్యూ. (వేగం దిశలోనే).
Exam Tips:
a) F = m(v−u)/t లో వస్తువు వేగ దిశలోనే బలం పనిచేస్తుందని దిశను కూడా రాయండి.
Question 5: ఒక లిఫ్ట్ గురుత్వ త్వరణంలో 1/3వ వంతు ఏకరీతి త్వరణంతో పైకి చలిస్తున్నప్పుడు లిఫ్ట్ లో ఉన్న వ్యక్తి దృశ్య భారం. W. అదే లిఫ్ట్ గురుత్వ త్వరణంలో 1/2వ వంతు ఏకరీతి త్వరణంతో కిందికి చలిస్తున్నప్పుడు అతడి దృశ్యభారం ఎంత?
Answer:
మనిషి దృశ్యభారము = W, త్వరణము \( = a = \frac{\mathrm{g}}{3} \)
పైకి పోవునపుడు లిఫ్ట్‌లో దృశ్యభారము \( W = m(g + a) = m\left(g + \frac{g}{3}\right) = \frac{4}{3} mg \)
∴ \( mg = \frac{3}{4} W \)
లిఫ్ట్ కిందికి దిగునపుడు త్వరణము a = g/2
కిందికి దిగునపుడు దృశ్యభారము \( W_1 = m(g - a) = m\left(g - \frac{g}{2}\right) = \frac{mg}{2} \)
∴ \( W_1 = \frac{1}{2} \times \frac{3}{4} W = \frac{3W}{8} \)
Exam Tips:
a) పైకి చలనంలో W = m(g + a), కిందికి చలనంలో W = m(g − a). ఇక్కడ mg = 3W/4 అనే సంబంధం ఉపయోగించండి.
Question 6: ఒక తెరచిన ట్రక్కు వెనుక వైపు 200 kg ద్రవ్యరాశి ఉన్న ఒక పెద్ద పెట్టె విరామస్థితిలో కలదు. ట్రక్కు 1.5 m/s² త్వరణంతో ప్రయాణిస్తున్నప్పుడు ట్రక్కులోని పెట్టె జారిపోకుండా ఉండటానికి ట్రక్కు తలానికి, పెట్టెకు మధ్య ఉండవలసిన కనిష్ఠ స్థితిక ఘర్షణ గుణకం ఎంత ?
Answer:
పెట్టె బరువు m = 200 kg;
ట్రక్కు త్వరణము a = 1.5 మీ/సె²
పెట్టెలో కలిగిన త్వరణము స్థితిక ఘర్షణ వలన కావున ma = fₛ ≤ μ ₛN = μ ₛmg (పెట్టె విరామంలో ఉంది కావున)
⇒ a ≤ μ ₛg లేదా \( μₛ = \frac{\mathrm{a}}{\mathrm{g}}=\frac{1.5}{9.8} = 0.153 \)
Exam Tips:
a) పెట్టె త్వరణం ఘర్షణ వల్లనే కలుగుతుంది : ma ≤ μₛ mg ⇒ μₛ ≥ a/g.
Question 7: భూమికి 40 m ఎత్తున తొలుత విరామస్థితిలో ఉన్న ఒక బాంబు అకస్మాత్తుగా పేలి, సర్వసమానం అయిన రెండు ముక్కలుగా పేలింది. వాటిలో ఒకటి 10m/s తొలి వేగంతో నిట్టనిలువుగా కిందికి చలిస్తున్నది. బాంబు పేలిన 2 సెకన్ల తరువాత ఆ రెండు ముక్కల మధ్య దూరం ఎంత? (గురుత్వ త్వరణం 10m/s ²).
Answer:
బాంబు రెండు సర్వసమానమైన ముక్కలుగా విభజింపబడటం వల్ల రెండు ముక్కలకు వేగం సమానము. మొదటి ముక్క అధో దిశలో చలిస్తే రెండవది అదే సరళరేఖ వెంబడి ఊర్ధ్వ దిశలో చలిస్తుంది.
కాలము t = 2 సె.
గురుత్వ త్వరణము g = 10 మీ/సె²
1) క్రిందకు చలించిన ముక్క స్థానభ్రంశము s = ut \( + \frac{1}{2} gt² \)
తొలి వేగము u = 10 మీ/సె
∴ \( s₁ = 10 × 2 + \frac{1}{2} × 10 × 2 × 2 = 40 \) మీ.
2) ఊర్ధ్వ దిశలో చలించిన ముక్క స్థానభ్రంశము s₂ = ut \( - \frac{1}{2} gt² \) ; తొలివేగం u = 10 మీ/సె
∴ \( s₂ = 10 × 2 - \frac{1}{2} × 10 × 2 × 2 = 0 \)
ఆ రెండు ముక్కల మధ్య దూరము d = s₁ + s₂ = 40 + 0 = 40 మీ.
Exam Tips:
a) ఒక ముక్క కిందికి 10 m/s అయితే రెండవది పైకి 10 m/s (ద్రవ్యవేగ నిత్యత్వం). రెండూ గురుత్వ త్వరణంతో చలిస్తాయి కావున సాపేక్ష త్వరణం సున్న; దూరం = 2ut = 40 m అని కూడా తేల్చవచ్చు.
Question 8: స్థిరంగా బిగించిన ఒక నునుపైన కప్పీ మీదుగా తేలికైన దారాన్ని అమర్చి, దారానికి ఒక వైపు 4 kg ద్రవ్యరాశి, మరొక వైపు 3 kg ద్రవ్యరాశిని వేలాడదీశారు. ఈ 3 kg ద్రవ్యరాశికి మరొక తేలిక దారంతో అదనంగా మరో 3 kg ద్రవ్యరాశి వేలాడదీశారు. విరామస్థితి నుంచి ఆ వ్యవస్థను లాగి వదిలితే, ఆ వ్యవస్థ ఉమ్మడి త్వరణం ఎంత ? (g = 10 m/s ²)
Answer:
ఒక వైపు మొత్తం ద్రవ్యరాశి m₁ = 3 + 3 = 6 kg
రెండవవైపు ద్రవ్యరాశి m₂ = 4 kg; g = 10 మీ/సె²
ఆ వ్యవస్థ త్వరణము \( a = \left(\frac{m_1-m_2}{m_1+m_2}\right) g=\left(\frac{6-4} {6+4}\right) × 10 = 2 \) మీ/సె²
Exam Tips:
a) a = (m₁ − m₂)g/(m₁ + m₂) : భారమైన వైపు మొత్తం ద్రవ్యరాశి (3 + 3 = 6 kg) తీసుకోండి.
Question 9: క్షితిజ సమాంతర తలంతో 30° కోణం చేస్తున్న ఒక వాలుతలంపై 2 kg ద్రవ్యరాశి ఉన్న దిమ్మె జారుతుంది. దిమ్మెకు, వాలు తలానికి మధ్య ఘర్షణ గుణకం
\( \frac{\sqrt{3}}{2}. \)
ఎ) దిమ్మె ఎలాంటి త్వరణం లేకుండా కిందికి కదలాలంటే, దిమ్మెపై ఎంత బలాన్ని ప్రయోగించాలి ?
బి) దిమ్మె ఎలాంటి త్వరణం లేకుండా పైకి కదలాలంటే, దిమ్మెపై ఎంత బలాన్ని ప్రయోగించాలి ?
Answer:
దిమ్మె ద్రవ్యరాశి m = 2 కి.గ్రా.; వాలు కోణము θ = 30°
వాలు తలము, దిమ్మెల మధ్య ఘర్షణ గుణకము \( \mu = \frac{\sqrt{3}}{2} \)
1) μ = \( \frac{\sqrt{3}}{2} = 0.87 \) విలువ tan 30° (= 0.58) కంటే ఎక్కువ కావున దిమ్మె దానంతట అది జారదు. త్వరణం లేకుండా కిందికి కదలడానికి వాలుతలం వెంబడి కిందికి బలం ప్రయోగించాలి:
F = mg (μ cos θ – sin θ) \( = 2 × 9.8 \left(\frac{\sqrt{3}}{2} \times \frac{\sqrt{3}}{2}-\frac{1}{2}\right) = 19.6 × 0.25 = 4.9 \) న్యూ.
2) దిమ్మను వాలుతలంపైకి త్వరణం లేకుండా లాగడానికి కావలసిన బలం
F = mg (sin θ + μₖ cos θ)
F = 2 × 9.8 (sin 30° + μ cos 30°)
\( = 2 × 9.8 \left(\frac{1}{2}+\frac{\sqrt{3}}{2} \times \frac{\sqrt{3}}{2}\right) = 19.6 × 1.25 = 24.5 \) న్యూ.
Exam Tips:
a) వాలుతలం పై μ > tan θ అయితే వస్తువు దానంతట అది జారదు, కావున కిందికి కదలడానికి కూడా బలం అవసరం; బలం ఘర్షణ దిశను గమనించి సంకేతాలు వేయండి.
Question 10: y = x ²/20 అదే సమీకరణం సూచించే పరావలయ ఆకారంలో ఉన్న ఒక నునుపు తలంపై పటంలో చూపినట్లు ఒక దిమ్మెను ఉంచారు. μₛ = 0.5 అయితే, ఆ దిమ్మె జారిపోకుండా ఉండాలంటే, భూమి నుంచి ఎంత ఎత్తులో ఆ దిమ్మెను నునుపు తలంపై అమర్చాలి ? (tan \( θ = μₖ = \frac{\mathrm{dy}}{\mathrm{dx}}) \)
Answer:
దత్తాంశం నుండి \( y = \frac{x^2}{20} ; \)
∴ వాలు \( \frac{dy}{dx}=\frac{d}{dx}\left(\frac{x^2}{20}\right)=\frac{2x}{20}=\frac{x}{10} \)
tan θ = వాలు \( = \frac{dy}{dx}=\frac{x}{10} \) మరియు దత్తాంశం నుండి tan θ = μₛ = 0.5
∴ x = 10 tan θ = 10 μₛ = 10 × 0.5 = 5 మీ.
వస్తువు జారకుండా వీలైనంత గరిష్ఠ ఎత్తు వద్ద ఉంచాలంటే
x = 5 అయినపుడు y లెక్కగట్టాలి.
∴ \( y = \frac{x^2}{20}=\frac{5 \times 5}{20}=\frac{25}{20} = 1.25 \) మీ.
Exam Tips:
a) y = x²/20 నుండి వాలు dy/dx = x/10 ; జారకుండా ఉండే పరిమితి tan θ = μₛ ; తరువాత y = x²/20 లో x = 5 ప్రతిక్షేపించండి.
Question 11: ఒక క్షితిజ సమాంతర టేబుల్‌పై 2 kg ద్రవ్యరాశి ఉన్న ఒక లోహపు దిమ్మెను ఘర్షణలేని కప్పి మీదుగా అమర్చిన దారం సహాయంతో 0.45 kg మరొక ద్రవ్యరాశికి కలిపారు. 0.45 kg ల ద్రవ్యరాశి కిందపడటం వల్ల లోహపు దిమ్మెపై క్షితిజ సమాంతర బలం పనిచేస్తుంది. టేబుల్, దిమ్మెకు మధ్య గతిక ఘర్షణ గుణకం 0.2 అయితే, ఎ) తొలి త్వరణం, బి) దారంలో తన్యత, సి) దిమ్మె కదిలిన 2 సెకన్ల తరువాత దారం తెగిపోతే, దారం తెగిన తరువాత దిమ్మె కదిలే దూరం కనుక్కోండి.
Answer:
మొదటి దిమ్మె ద్రవ్యరాశి m₁ = 0.45 కి.గ్రా.;
రెండవ దిమ్మె ద్రవ్యరాశి m₂ = 2 కి.గ్రా.
బల్ల, దిమ్మెల మధ్య ఘర్షణ గుణకము μ = 0.2
ఎ) తొలి త్వరణము \( a = \left(\frac{m_1-\mu m_2}{m_1+m_2}\right) g \) (దిమ్మె జారుతున్నపుడు గతిక ఘర్షణ గుణకం μ = 0.2 వాడాలి.)
∴ \( a = \left(\frac{0.45-2 \times 0.2}{0.45+2}\right) \times 9.8=\frac{0.05 \times 9.8}{2.45} = 0.2 \) మీ/సె²
బి) దారంలో తన్యత = T; పటం నుండి T – f = m₂a
ఘర్షణ బలము f = μₖm₂g = 0.2 × 2 × 9.8 = 3.92 న్యూ
∴ T – 3.92 = 2 × 0.2 (లేదా) T = 0.4 + 3.92 = 4.32 న్యూ
సి) కదిలిన తరువాత దారం తెగటానికి పట్టిన కాలము t = 2 సె.
తొలివేగం u = 0 ; త్వరణము a = 0.2 మీ/సె²
తుదివేగము v = u + at = 0 + 0.2 × 2 = 0.4 మీ/సె.
దారం తెగిన తరువాత గతిక ఘర్షణ వల్ల దిమ్మె మందగించి ఆగుతుంది (మందగమనం = μg).
దిమ్మె ప్రయాణించిన దూరము \( s = \frac{v^2}{2 \mu g}=\frac{0.4 \times 0.4}{2 \times 0.2 \times 9.8}=\frac{0.16}{3.92} = 0.0408 \) మీ. లేదా 4.1 సెం.మీ.
Exam Tips:
a) కదులుతున్నపుడు గతిక ఘర్షణ గుణకం వాడాలి. a = (m₁ − μm₂)g/(m₁ + m₂), T = f + m₂a, దారం తెగాక మందగమనం = μg.
Question 12: ఒక నునుపైన క్షితిజ సమాంతర తలం మీద 10 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న A అనే దిమ్మెను ఉంచారు. 5 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న B అనే మరొక దిమ్మెను పటంలో చూపినట్లు A దిమ్మెపై ఉంచారు. రెండు దిమ్మెల మధ్య ఘర్షణ గుణకం 0.4. కింది దిమ్మెపై 30 N క్షితిజ సమాంతర బలం ప్రయోగించారు. రెండు దిమ్మెల మధ్య ఉన్న ఘర్షణ బలం కనుక్కోండి. (g = 10 m/s² గా తీసుకోండి)
Answer:
దిమ్మె A ద్రవ్యరాశి mA = 10 కి.గ్రా.
దిమ్మె B ద్రవ్యరాశి mB = 5 కి.గ్రా.; g = 10 మీ/సె²
బలము F = 30 న్యూ; ఘర్షణ గుణకము μ = 0.4
A, B ల మధ్య గరిష్ఠ స్థితిక ఘర్షణ బలము f_max = μ m_B g = 0.4 × 5 × 10 = 20 న్యూ.
రెండూ కలిసి కదులుతాయనుకుంటే ఉమ్మడి త్వరణం \( a = \frac{F}{m_A+m_B}=\frac{30}{15} = 2 \) మీ/సె².
B కి ఈ త్వరణాన్ని ఇవ్వడానికి కావలసిన ఘర్షణ బలం f = m_B a = 5 × 2 = 10 న్యూ. ఇది గరిష్ఠ విలువ 20 న్యూ కంటే తక్కువ కావున B జారదు.
∴ రెండు దిమ్మెల మధ్య ఘర్షణ బలం = 10 న్యూ.
Exam Tips:
a) ముందుగా రెండు దిమ్మెలు కలిసి కదులుతాయా అని పరీక్షించండి (a = F/(mₐ + m_B)); B కి కావలసిన ఘర్షణ బలం గరిష్ఠ ఘర్షణ కంటే తక్కువైతే అది స్థితిక ఘర్షణ.
ముఖ్యమైన అదనపు లెక్కలు
Question 1: క్రింది వాటిపై పనిచేసే నికర బలం పరిమాణం, దిశను తెలపండి.
ఎ) స్థిర వడితో కిందికి పడుతున్న ఒక వర్షపు బిందువు బి) నీటిలో తేలియాడుతున్న 10 గ్రా. ద్రవ్యరాశి ఉన్న కార్క్ సి) ఆకాశంలో నైపుణ్యంతో విరామస్థితిలో ఉంచిన గాలిపటం డి) ఒక గరుకు రోడ్డుపై 30 km/h వేగంతో ప్రయాణిస్తున్న కారు ఇ) అన్ని ద్రవ్యాత్మక వస్తువులకు చాలా దూరంగా, విద్యుత్ అయస్కాంత క్షేత్రాల ప్రభావానికి లోనుకాకుండా అంతరాళంలో అత్యధిక వేగంతో చలిస్తున్న ఎలక్ట్రాన్
Answer:
ఎ) స్థిర వడితో పడునపుడు a = 0 కావున బలం F = ma = 0.
బి) కార్కు నీటిపై తేలుతున్నది అనగా అది సమతా స్థితిలో ఉంది. సమతా స్థితిలో ఫలిత బలం F = 0.
సి) ఆకాశంలో స్థిరంగా ఉన్న గాలిపటం మీద ఫలిత బలం F= 0.
డి) స్థిర వడితో ప్రయాణిస్తున్న కారుకు త్వరణం a = 0 కావున బలం F = 0.
ఇ) అన్ని బలాలకు దూరంగా అనగా దానిపై బాహ్యబల ప్రభావం లేదు కావున F = 0.
Exam Tips:
a) స్థిర వేగం లేదా సమతాస్థితిలో a = 0 కావున ఫలిత బలం సున్న; ఐదు సందర్భాలలోనూ అదే కారణం రాయండి.
b) ఐదింటిలోనూ సమాధానం "నికర బలం సున్న" అయినా, ప్రతి భాగానికి కారణం (స్థిర వేగం, సమతాస్థితి, బాహ్యబలం లేకపోవడం) వేర్వేరుగా రాయండి.
Question 2: 0.05కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక గులకరాయిని నిట్టనిలువుగా పైకి విసిరారు. ఆ గులకరాయిపై పనిచేసే నికర బలం పరిమాణాన్ని, దిశను కింది సందర్భాలలో తెలియచేయండి.
ఎ) నిలువుగా పైకి ప్రయాణిస్తున్నప్పుడు
బి) కిందికి ప్రయాణిస్తున్నప్పుడు
సి) గరిష్ఠ ఎత్తువద్ద క్షణకాలంపాటు విరామస్థితిలో ఉన్నప్పుడు. ఒకవేళ గులకరాయిని క్షితిజ సమాంతర దిశతో 45° కోణంలో విసిరితే, మీ సమాధానాలు మారతాయా ? (గాలి నిరోధాన్ని విస్మరించండి)
Answer:
రాయి ఎ) నిలువుగా పైకి వెళుతున్నపుడు బి) క్రిందికి ప్రయాణిస్తున్నపుడు సి) గరిష్ఠ ఎత్తు వద్ద విరామంలో ఉన్నపుడు. ఈ అన్ని సందర్భాలలోను దాని త్వరణం a = g అధోదిశలో ఉంటుంది.
కావున దానిపై బలం F = mg = 0.05 × 10 = 0.5 న్యూ.
రాయిని గాలిలోనికి 45° కోణంతో విసిరినప్పటికి ఈ మూడు స్థానాలలో దానిపై పనిచేసే బలం పరిమాణం మారదు. ఎందుకనగా భారం (mg) ఎల్లపుడు అధో దిశలోనే ఉంది. కావున.
Exam Tips:
a) నికర బలం mg (అధోముఖం) = 0.05 × 10 = 0.5 N ; విసిరే కోణం మారినా గాలి నిరోధం లేనపుడు ఇది మారదు.
Question 3: 0.1కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక రాయిపై పనిచేసే నికర బలం పరిమాణం, దిశను కింది సందర్భాలలో తెలపండి.
ఎ) విరామస్థితిలో ఉన్న రైలు కిటికీ నుంచి బయటికి విసిరిన వెంటనే బి) 36 km/h స్థిర వేగంతో ప్రయాణిస్తున్న రైలు కిటికీ నుంచి బయటికి విసిరిన వెంటనే సి) 1 ms⁻² త్వరణంతో ప్రయాణిస్తున్న రైలు కిటికీ నుంచి బయటికి విసిరిన వెంటనే డి) 1 ms⁻² త్వరణంతో ప్రయాణిస్తున్న రైలు అడుగు తలంపై ఉన్నప్పుడు. రైలుతో సాపేక్షంగా రాయి విరామస్థితిలో ఉంది.
పై అన్ని సందర్భాలలో గాలి నిరోధాన్ని విస్మరించండి.
Answer:
దత్తాంశం నుండి m = 0.1 కి.గ్రా.; g = 10 మీ/సె²
ఎ) కిటికీలోనుంచి వదలిన వెంటనే F = mg = 0.1 × 10 = 1 న్యూ.
బి) రైలు స్థిరవేగం 36 km/h తో చలిస్తుంటే దాని త్వరణము a = 0 కావున కిటికీ నుంచి రాయిని జారవిడిస్తే
F = mg = 0.1 × 10 = 1 న్యూ.
సి) రైలు 1 మీ/సె2 త్వరణంతో చలిస్తున్నా కిటికీ నుంచి జారవిడిస్తే దానిపై రైలు త్వరణం ప్రభావం ఉండదు.
∴ రాయిపై బలము F = mg = 0.1 × 10 = 1 న్యూ.
డి) రైలు అడుగుభాగంలో రాయి ఆనుకొని ఉంటే దానిపై బలము
F = ma ‘a’ రైలు త్వరణము = 1 మీ/సె²
∴ బలము F = 0.1 × 1 = 0.1 న్యూ.
Exam Tips:
a) రాయి కిటికీ నుండి వదిలాక రైలు త్వరణం దాని మీద ప్రభావం చూపదు; (డి) లో రైలు తలం పై రాయి రైలుతో సమానంగా త్వరణం పొందుతుంది కావున F = ma.
Question 4: నునుపైన క్షితిజ సమాంతర బల్ల మీద l పొడవున్న దారం ఒక చివర m ద్రవ్యరాశి ఉన్న కణాన్ని, మరొక చివర చిన్న మేకుకు కలిపారు. కణం v వడితో వృత్తాకార మార్గంలో చలిస్తే, ఆ కణంపై పనిచేసే నికర బలం (వృత్తకేంద్రంవైపు పని చేసే బలం)
(i) T
(ii) \( T - \frac{mv^2}{l} \)
(iii) \( T + \frac{mv^2}{l} \)
(iv) 0
T దారంలోని తన్యత. సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
Answer:
వస్తువు వృత్తాకార మార్గంలో చలించడానికి కావలసిన బలం దారంలోని తన్యత T వలన లభిస్తుంది. కావున (i) సరియైనది.
Exam Tips:
a) వృత్త చలనంలో కేంద్రం వైపు నికర బలం = దారం తన్యత T మాత్రమే (నునుపైన బల్ల కావున); mv²/l కు సమానం.
b) ఇక్కడ సమాధానం (i) మాత్రమే; (ii), (iii) లోని mv²/l అనేది నికర బలం కాదు, నికర బలానికి సమానమైన అభికేంద్ర బలం అని గుర్తించండి.
Question 5: 20 కి.గ్రా. ద్రవ్యరాశి కలిగి, 15 మీ/సె తొలి వేగంతో ప్రయాణిస్తున్న వస్తువుపై 50 N స్థిర అపత్వరణ బలాన్ని ప్రయోగిస్తే, ఎంత కాలం తర్వాత అది ఆగిపోతుంది ?
Answer:
ద్రవ్యరాశి m = 20 కి.గ్రా.
తొలివేగము u = 15 మీ/సె
తుది వేగము υ = 0
బలము F = -50 న్యూ.
త్వరణము \( a = \frac{F}{m}=-\frac{50}{20} = -2.5 \) మీ/సె²
v = u + at నుండి 0 = 15 + (-2.5) t
కాలము \( t = \frac{15}{2.5} = 6 \) సె.
Exam Tips:
a) అపత్వరణం వల్ల a ఋణం (−2.5 m/s²) ; v = u + at లో v = 0 ప్రతిక్షేపించి t = 6 s.
b) అపత్వరణంలో F, a లకు ఋణ గుర్తు వేయడం మరువకండి; ఫలితంలో కాలం ధనాత్మకమే వస్తుంది.
Question 6: ఒక స్థిర బలాన్ని 3.0 కి. గ్రా. ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై 25 సెకన్లపాటు ప్రయోగిస్తే, ఆ వస్తువు వేగం 2.0 మీ/సె నుంచి 3.5 మీ/సె కు మారింది. వస్తువు వేగదిశలో మాత్రం ఎలాంటి మార్పులేదు. బలం పరిమాణాన్ని, బలం ప్రయోగించిన దిశను కనుక్కోండి.
Answer:
ద్రవ్యరాశి m = 3.0 కి.గ్రా.;
తొలివేగము u = 2 మీ/సె.
తుది వేగము υ = 3.5 మీ/సె.
కాలము t = 25 సె.; F = ?
బలము \( F = ma = \frac{m(v-u)}{t}=\frac{3(3.5-2)}{25}=\frac{3 \times 1.5}{25} \)
\( F = \frac{4.5}{25} = 0.18 \) న్యూ. (వేగం దిశలోనే).
Exam Tips:
a) F = m(v−u)/t = 3 × 1.5/25 = 0.18 N ; ద్రవ్యరాశి 3 kg అని గమనించండి.
Question 7: ఒకదానికి ఒకటి లంబంగా ఉన్న 8N, 6N పరిమాణం గల రెండు బలాలను 5 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై ప్రయోగించారు. వస్తువు త్వరణం పరిమాణాన్ని, దిశను తెలపండి.
Answer:
ద్రవ్యరాశి m = 5 కి.గ్రా.
\( F₁ = \overrightarrow{\mathrm{OA}} = 8 \) న్యూ.
\( F₂ = \overrightarrow{\mathrm{OB}} = 6 \) న్యూ.
OA, OB లు లంబాలు కావున ఫలిత బలం \( F_R = \sqrt{F_1^2+F_2^2}=\sqrt{64+36}=\sqrt{100} = 10 \) న్యూ.
త్వరణం \( a = \frac{F_R}{m}=\frac{10}{5} = 2 \) మీ/సె².
దిశ: త్వరణం ఫలిత బలం దిశలో ఉంటుంది. 8 న్యూ బలంతో అది చేసే కోణం θ అయితే \( \tan \theta = \frac{F_2}{F_1}=\frac{6}{8} = 0.75 \) ⇒ θ = tan⁻¹ (0.75) ≈ 37°.
Exam Tips:
a) లంబంగా ఉన్న బలాల ఫలితం √(F₁² + F₂²) ; త్వరణం = ఫలిత బలం/m ; దిశను tan θ = F₂/F₁ తో చెప్పండి.
Question 8: ఒక ఆటో డ్రైవర్ రోడ్డు మధ్యలో ఉన్న బాలుని చూసి, ఆ బాలుణ్ణి కాపాడటానికి 36 km/h వేగంతో పోతున్న తన ఆటోకు బ్రేకులు వేస్తే 4.0 s కాలంలో ఆగింది. ఆటోపై ప్రయోగించిన సరాసరి నిరోధ బలం ఎంత ? ఆటో ద్రవ్యరాశి 400 కి.గ్రా. డ్రైవర్ ద్రవ్యరాశి 65 కి.గ్రా.
Answer:
తొలివేగము u = 36 kmph \( = 36 × \frac{5}{18} = 10 \) మీ/సె.
తుదివేగము V = 0; కాలము t = 4 సె.
ఆటో ద్రవ్యరాశి m₁ = 400 కి.గ్రా., డ్రైవర్ ద్రవ్యరాశి m₂ = 65 కి.గ్రా.
మొత్తం ద్రవ్యరాశి m = m₁ + m₂ = 400 + 65 = 465 కి.గ్రా.
నిరోధక బలం \( F = ma = \frac{m(v-u)}{t}=\frac{465(0-10)}{4} = -1162.5 \) న్యూ (ఋణ గుర్తు చలన దిశకు వ్యతిరేక దిశను సూచిస్తుంది).
Exam Tips:
a) 36 km/h = 10 m/s ; ఆటో, డ్రైవర్ ద్రవ్యరాశులు రెండూ కలపాలి (465 kg). ఋణ గుర్తు నిరోధక బలాన్ని సూచిస్తుంది.
Question 9: 20,000 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక రాకెట్‌ను ఊర్ధ్వ దిశలో పేల్చితే అది 5.0 మీ/సె² తొలి త్వరణంతో ఆకాశంలోకి వెళ్ళిపోయింది. పేల్చినప్పుడు ప్రయోగించిన తొలి అభిబలం కనుక్కోండి.
Answer:
రాకెట్ ద్రవ్యరాశి m = 20,000 కి.గ్రా.
తొలి త్వరణము a = 5 మీ/సె² ఊర్ధ్వ దిశలో
నికర త్వరణం = g + a = 9.8 + 5 = 14.8 మీ/సె²
ఆరంభ అభిబలం F = m(g + a) = 20,000 × 14.8 = 2.96 × 10⁵ న్యూ.
Exam Tips:
a) రాకెట్ పైకి పోతున్నపుడు థ్రస్ట్ − mg = ma ; F = m(g + a) అని రాయండి.
b) థ్రస్ట్ గురుత్వ బలాన్ని కూడా అధిగమించాలి కావున F = ma మాత్రమే (20,000 × 5) రాయడం సాధారణ తప్పు.
Question 10: ప్రారంభంలో 10 మీ/సె⁻¹ స్థిరవేగంతో ఉత్తరం దిశలో ప్రయాణిస్తున్న 0.40 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై 8.0 న్యూ స్థిరబలాన్ని దక్షిణం దిశలో 30 సెకన్లపాటు ప్రయోగించారు. బలం ప్రయోగించిన క్షణ కాలం వద్ద t = 0 అని, ఆ క్షణకాలం వద్ద వస్తువు స్థానం .x = 0 అని అనుకోండి. t = – 5s, 25s, 100s ల వద్ద వస్తువు స్థానాన్ని ఊహించండి.
Answer:
ద్రవ్యరాశి m = 0.4 కి.గ్రా.;
తొలివేగము u = 10 మీ/సె. ఉత్తర దిశలో
బలము F = -8 న్యూ (- గుర్తు వ్యతిరేక దిశ)
త్వరణము \( a = \frac{\mathrm{F}}{\mathrm{m}}=\frac{-8.0}{0.4} = -20 \) మీ/సె² (0 ≤ t ≤ 30 సె. అయినపుడు)
1) కాలము t = -5 సె. అయినపుడు స్థానభ్రంశము s = ?
t = 0 కు ముందు వస్తువు స్థిర వేగం u = 10 మీ/సె తో చలిస్తుంది కావున t = –5 సె వద్ద స్థానం
x = ut = 10 × (–5) = –50 మీ.
2) కాలము t = 25 సె. వద్ద స్థానభ్రంశము s = ut \( + \frac{1}{2} at² \) నుండి
\( s = 10 × 25 + \frac{1}{2} (-20) × 25^2 = 250 - 10 × 625 = -6000 \) మీ.
3) t = 100 సె. అయినపుడు బలము 30 సెకనులు పనిచేసింది.
కావున 30 సె. తరువాత వస్తువుకు స్థిరవేగం ఉంటుంది.
∴ S = s₁ + s₂ ఇందులో \( s_1 = ut_1 + \frac{1}{2} at_1^2 \) మరియు s₂ = vt₂ (బలం తొలగిన తరువాత స్థిర వేగం).
ఇందులో t₁ = 30 సె., t₂ = 70 సె.; v = u + at నుండి
v = 10 + (-20) × 30 = 10 – 600 = – 590 మీ/సె
\( s_1 = 10 × 30 + \frac{1}{2} (-20) × 30 × 30 = 300 - 9000 = -8700 \) మీ.
s₂ = vt₂ = –590 × 70 = –41300 మీ.
మొత్తం స్థానభ్రంశము S = s₁ + s₂ = –8700 – 41300 = –50000 మీ. = –50 కి.మీ. (అనగా ఉత్తర దిశను ధనాత్మకంగా తీసుకుంటే మూల బిందువుకు 50 కి.మీ. దక్షిణంగా).
Exam Tips:
a) బలం ఉన్న కాలంలో (0 ≤ t ≤ 30 s) a = −20 m/s² ; 30 s తరువాత స్థిర వేగం −590 m/s. ఉత్తర దిశను ధనాత్మకంగా తీసుకుని సంకేతాలను జాగ్రత్తగా వాడండి.
Question 11: ఒక ట్రక్ విరామస్థితితో నుంచి బయలుదేరి 2.0 మీ/సె² ఏకరీతి త్వరణంతో
ప్రయాణిస్తుంది. t = 10 సె. తరువాత ట్రక్ పై కప్పుపై నిల్చొని ఉన్న వ్యక్తి ఒక రాయిని జారవిడిచాడు. (ట్రక్ పైకప్పు భూమి నుంచి 6 మీ.ల ఎత్తులో కలదు). 11 సె. వద్ద ఆ రాయి ఎ) వేగం, బి) త్వరణం కనుక్కోండి. (గాలి నిరోధాన్ని విస్మరించండి.)
Answer:
తొలివేగము u = 0, త్వరణము a = 2 మీ/సె²,
కాలము t = 10 సె.
రాయి వేగము (జారవిడచిన క్షణంలో) v = u + at
v = 0 + 2 × 10 = 20 మీ/సె.
రాయి క్షితిజ సమాంతర వేగము vₓ = 20 మీ/సె ……………… (1)
క్షితిజ లంబ దిశలో uy = 0, a = g = 10 మీ/సె²
t = 11 సెకనులు అనగా y దిశలో ప్రయాణించిన కాలము t₂ = 11 – 10 = 1 సె.
vy = gt = 10 × 1 = 10 మీ/సె ……………. (2)
11వ సెకనులో వేగము \( v = \sqrt{v_x^2+v_y^2}=\sqrt{20^2+10^2}=\sqrt{500} = 22.4 \) మీ/సె.
బి) రాయిని జారవిడచిన తరువాత దానిమీద త్వరణము గురుత్వ త్వరణము g = 10 మీ/సె²
Exam Tips:
a) క్షితిజ వేగం vₓ = 20 m/s మారదు; నిలువు వేగం v_y = gt₂ = 10 m/s ; త్వరణం g = 10 m/s² (క్షితిజ త్వరణం సున్న).
Question 12: 0.1కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక గోళాన్ని 2 మీ. పొడవు ఉన్న దారంతో ఒక గదిలోని లోకప్పుకు వేలాడదీశారు. గోళం డోలనాలు చేయడం ప్రారంభిస్తే, మాధ్యమిక స్థానం వద్ద గోళం వడి 1 ms ⁻¹. ఒకవేళ దారాన్ని తెంపితే గోళం ప్రయాణించే పథం కింది సందర్భాలలో ఎలా ఉంటుంది ? ఎ) ఏదైనా ఒక గరిష్ఠ స్థానం వద్ద, బి) మాధ్యమిక స్థానం వద్ద.
Answer:
ఎ) గరిష్ఠ స్థానం వద్ద గోళం వేగము v = 0. ఇక్కడ దారాన్ని తెంపితే అది
గురుత్వాకర్షణ బలం వల్ల నిట్టనిలువుగా కిందికి పడుతుంది.
బి) మాధ్యమిక స్థానం వద్ద వేగము v = 1 మీ/సె. ఇక్కడ దారాన్ని తెంపితే లోలకం మాధ్యమిక స్థానం వద్ద గీసిన స్పర్శ రేఖ వెంబడి వేగం ఉంటుంది. గోళం క్షితిజ సమాంతర ప్రక్షేపకం వలె పరావలయ పథంలో ప్రయాణిస్తుంది.
Exam Tips:
a) దారం తెగే క్షణంలో గోళం వేగ దిశలో (స్పర్శరేఖ వెంబడి) కదులుతుంది: గరిష్ఠ స్థానం వద్ద వేగం సున్న కావున నిలువుగా పడుతుంది, మాధ్యమిక స్థానం వద్ద క్షితిజ ప్రక్షేపకం (పరావలయం).
Question 13: ఒక వ్యక్తి ద్రవ్యరాశి 70 కి.గ్రా. ఇతడు లిఫ్ట్‌లో అమర్చిన బరువులు తూచే యంత్రంపై నిల్చొని ఉన్నాడు. ఆ లిఫ్ట్ ఎ) 10 ms⁻¹ ఏకరీతి వేగంతో పైకి, బి) 5 ms⁻² ఏకరీతి త్వరణంతో కిందికి, సి) 5 ms⁻² ఏకరీతి త్వరణంతో పైకి చలిస్తుంది. ప్రతీ సందర్భంలో యంత్రం చూపే రీడింగ్ ఎంత ?
డి) ఒకవేళ లిఫ్ట్‌ను నడిపే యంత్రం పనిచేయక, భూమ్యాకర్షణ బలం వల్ల స్వేచ్ఛగా కిందికి పడిపోయినట్లయితే యంత్రం చూపే రీడింగ్ ఎంత ?
Answer:
వ్యక్తి ద్రవ్యరాశి m = 70 కి.గ్రా., గురుత్వ త్వరణము g = 10 మీ/సె²
ఎ) 10 m/s ఏకరీతి వేగంతో చలిస్తుంటే త్వరణము a = 0
∴ దృశ్యభారము వాస్తవ భారము W = mg కి సమానము.
∴ W = mg = 70 × 10 = 700 న్యూ.
b) 5 మీ/సె² ఏకరీతి త్వరణంతో కిందికి దిగితే
దృశ్యభారము W₁ = m(g – a) = 70(10 – 5) = 350 న్యూ.
c) 5 మీ/సె² ఏకరీతి త్వరణంతో పైకి వెళుతుంటే
దృశ్యభారము . W₁ = m (g + a) = 70 (10 + 5) = 1050 న్యూ.
d) లిఫ్ట్ స్వేచ్ఛగా కిందికి పడిపోతే a = g కావున
దృశ్యభారము W = m (g – a) = m(g – g) = 0
Exam Tips:
a) లిఫ్ట్ లో స్థిర వేగంతో కదిలినా రీడింగ్ = mg ; పైకి త్వరణమైతే m(g + a), కిందికైతే m(g − a), స్వేచ్ఛాపతనంలో సున్న.
Question 14: 4కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక కణం స్థానం – కాలం వక్రం పటంలో చూపడమైంది. ఎ) t < 0, t > 4s, 0 < t < 4s కాలాల వద్ద కణంపై పనిచేసే బలం ఎంత ?
బి) t = 0, t = 4 s ల వద్ద ప్రచోదనం ఎంత ? (ఏకమితీయ గమనం మాత్రమే
తీసుకోండి)
Answer:
ఎ)
1. ఇచ్చిన రేఖాపటం నుండి t < 0 వద్ద కణం x = 0 స్థానంలో నిశ్చలంగా ఉంది కావున బలం F = 0.
2. t > 4 సె అయినపుడు వస్తువు స్థానభ్రంశ – వక్రరేఖ x సమాంతరము. ఇది నిశ్చలస్థితిని చూపిస్తుంది కావున a = 0 మరియు బలము F= 0.
3. 0 < t < 4 సెకనుల వద్ద వస్తువు స్థానభ్రంశ-కాల వక్రము సరళరేఖ; దీని వాలు వస్తువు సమవేగాన్ని ఇస్తుంది.
∴ a = 0 కావున బలము F = ma = 0
బి)
ప్రచోదనం = ద్రవ్యవేగంలో మార్పు. గ్రాఫ్ నుండి 0 < t < 4 సె లో కణం 0 నుండి 3 మీ. కు చేరింది, కావున సమవేగం \( v = \frac{3}{4} \) మీ/సె. ద్రవ్యరాశి m = 4 కి.గ్రా.
1. t = 0 వద్ద: కణం నిశ్చలస్థితి (u = 0) నుండి వేగం \( \frac{3}{4} \) మీ/సె కు మారుతుంది.
∴ \( J = mv - mu = 4\left(\frac{3}{4} - 0\right) = 3 \) కి.గ్రా. మీ/సె.
2. t = 4 సె. వద్ద: వేగం \( \frac{3}{4} \) మీ/సె నుండి 0 కు మారుతుంది.
∴ \( J = mv - mu = 4\left(0 - \frac{3}{4}\right) = -3 \) కి.గ్రా. మీ/సె.
Exam Tips:
a) x–t గ్రాఫ్ వాలు = వేగం. సరళరేఖ అంటే సమవేగం (F = 0). వేగం మారే క్షణాల వద్ద ప్రచోదనం = m(v − u) లెక్కించండి.
Question 15: నునుపైన క్షితిజ సమాంతర తలంపై 10 కి.గ్రా., 20 కి.గ్రా. ద్రవ్యరాశులు ఉన్న A, B అనే రెండు వస్తువులను వరుసగా అమర్చి రెండింటిని తేలికైన దారంతో కలిపారు. F= 600 N క్షితిజ సమాంతర బలాన్ని దారం వెంబడి i) A, ii) B ల మీద
ప్రయోగించారు. ప్రతీ సందర్భంలో దారంలో తన్యత ఎంత ?
Answer:
బలము F = 600 న్యూ. A ద్రవ్యరాశి m₁ = 10 కి.గ్రా., B ద్రవ్యరాశి m₂ = 20 కి.గ్రా.
వ్యవస్థ త్వరణము \( a = \frac{F}{m_1+m_2} = \frac{600}{10+20} = 20 \) మీ/సె²
1. బలం Aమీద ప్రయోగిస్తే తన్యత T = m₂a = 20 × 20 = 400 న్యూ
2. బలం B మీద ప్రయోగిస్తే తన్యత T = m₁a = 10 × 20 = 200 న్యూ.
Exam Tips:
a) రెండు వస్తువులకు ఒకే త్వరణం a = F/(m₁ + m₂) ; బలం ప్రయోగించని వస్తువు ద్రవ్యరాశి × a = తన్యత.
Question 16: 8 కి.గ్రా., 12 కి.గ్రా. ద్రవ్యరాశులను ఘర్షణ లేని కప్పి మీదుగా అమర్చిన తేలికైన, సాగని దారం సహాయంతో కలిపారు. ఆ వస్తువులను వదిలినప్పుడు ఆ వస్తువుల త్వరణాలను, దారంలోని తన్యతను కనుక్కోండి.
Answer:
ద్రవ్యరాశులు m₂ = 8 కి.గ్రా., m₁ = 12 కి.గ్రా.
వ్యవస్థ త్వరణము \( a = \left(\frac{m_1-m_2}{m_1+m_2}\right) g = \left(\frac{12-8}{12+8}\right) 9.8 = \frac{39.2}{20} = 1.96 \) మీ/సె²
దారంలో తన్యత \( T = \frac{2 m_1 m_2 g}{m_1+m_2} = \frac{2 \times 12 \times 8 \times 9.8}{20} = 94.1 \) న్యూ
Exam Tips:
a) a = (m₁ − m₂)g/(m₁ + m₂) మరియు T = 2m₁m₂g/(m₁ + m₂) సూత్రాలు గుర్తుంచుకోండి; g = 9.8 వాడినపుడు a = 1.96 m/s², T ≈ 94.1 N.
b) T సూత్రంలో 2m₁m₂/(m₁+m₂) ను వాడే ముందు a విలువతో T = m₂(g + a) గా సరిచూసుకోండి (8×(9.8+1.96) = 94.1 N).
Question 17: ప్రయోగశాల నిర్దేశ చట్రంలో ఒక కేంద్రకం విరామస్థితిలో కలదు. ఒకవేళ ఆ కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విఘటనం చెందితే, ఆ రెండు కేంద్రకాలు వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తాయని చూపండి.
Answer:
కేంద్రకం విభజించబడటం వల్ల వచ్చిన ముక్కల ద్రవ్యరాశులు m₁, m₂ మరియు వేగాలు v₁, v₂ అనుకోండి. పేలకముందు వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగము ‘0’ ఎందుకనగా కేంద్రకం విరామంలో ఉంది కావున.
∴ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం నుండి m₁v₁ + m₂v₂ = 0
లేదా m₁v₁ = – m₂v₂ – గుర్తు వ్యతిరేక దిశను తెలియజేస్తుంది. కావున కేంద్రక విచ్ఛిత్తి తరువాత
ఆ ముక్కలు వ్యతిరేక దిశలలో చలిస్తాయి.
Exam Tips:
a) విరామస్థితిలోని కేంద్రకం మొత్తం ద్రవ్యవేగం సున్న కావున m₁v₁ = −m₂v₂ ; ఋణ గుర్తు వల్ల వ్యతిరేక దిశ.
Question 18: 0.05కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న రెండు బిలియర్డ్స్ బంతులు 6 ms⁻¹ వేగంతో వ్యతిరేక దిశలలో ప్రయాణిస్తూ అభిఘాతం చెంది, ఆ తరువాత అంతే వేగంతో వెనుకకు తిరిగి వచ్చాయి. ప్రతి బంతికి, రెండవ బంతి వల్ల అందే ప్రచోదనం కనుక్కోండి.
Answer:
ఒక్కొక్క బంతి ద్రవ్యరాశి m = 0.05కి.గ్రా.
వేగము v₁ = 6 మీ/సె; వేగము v₂ = -6 మీ/సె. (వ్యతిరేక దిశ)
అభిఘాతం పిమ్మట వ్యతిరేక దిశలో వెనుదిరిగితే అభిఘాతం వల్ల ఒక్కొక్కదాని ద్రవ్యవేగంలో మార్పు J = m(v – u)
= 0.05 (-6 – 6) = -0.05 × 12 = -0.6 కి.గ్రా. మీ/సె.
రెండవ బంతికి ప్రచోదనం ఇదే పరిమాణంతో వ్యతిరేక దిశలో (+0.6 కి.గ్రా. మీ/సె) ఉంటుంది.
Exam Tips:
a) ఇద్దరి వేగాల సంకేతాలు వ్యతిరేకం (+6, −6) ; ప్రచోదనం = ద్రవ్యవేగంలో మార్పు = 0.05(−6 − 6) = −0.6 kg m/s.
Question 19: 100 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న తుపాకీని పేల్చినప్పుడు 0.020కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న బుల్లెట్ బయటికి వెలువడింది. తుపాకీ గొట్టం నుంచి బుల్లెట్ 80 ms⁻¹ వడితో వెలువడితే, ఆ తుపాకి ప్రత్యావర్తన వడి ఎంత ?
Answer:
బుల్లెట్ ద్రవ్యరాశి m = 0.02 కి.గ్రా.
వేగము vB = 80 మీ/సె.
తుపాకి ద్రవ్యరాశి M = 100 కి.గ్రా.
తుపాకి వెనుకకు మరలు వేగము vG = ?
పేలకముందు వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగము = 0
ద్రవ్యవేగ నిత్యత్వ నియమం నుండి mvB + MvG = 0
∴ \( v_G = -\frac{m v_B}{M}=-\frac{0.02 \times 80}{100} = -0.016 \) మీ/సె.
తుపాకి ప్రత్యావర్తన వడి = 0.016 మీ/సె (బుల్లెట్ దిశకు వ్యతిరేక దిశలో).
Exam Tips:
a) M v_G + m v_B = 0 ⇒ v_G = −mv_B/M = 0.016 m/s ; ద్రవ్యరాశుల ప్రమాణాలను (kg) సరిచూసుకోండి.
b) ప్రత్యావర్తన వడి మాత్రమే అడిగారు కావున పరిమాణం (0.016 m/s) తోపాటు బుల్లెట్‌కు వ్యతిరేక దిశ అని కూడా రాయండి.
Question 20: ఒక బ్యాట్స్‌మన్ 54 km/h తొలి వేగంతో ప్రయాణిస్తున్న బంతిని 45° కోణంతో తొలి వడిలో మార్పు లేకుండా మళ్ళించాడు. బంతికి అందిన ప్రచోదనం ఎంత ? (బంతి ద్రవ్యరాశి 0.15 కి.గ్రా.)
Answer:
బంతి ద్రవ్యరాశి m = 0.15కి.గ్రా.
వేగము = 54 km/h \( = 54 × \frac{5}{18} = 15 \) మీ/సె.
అభిఘాతం పిమ్మట బంతి 45° కోణంతో మళ్ళింది. అనగా తొలి వేగ దిశకు, తుది వేగ దిశకు మధ్య కోణం 45°. ఈ రెండు దిశలూ వాటి మధ్య కోణ సమద్విఖండన రేఖతో 22.5° చొప్పున కోణం చేస్తాయి.
బంతి వేగాన్ని ఈ రేఖ వెంబడి, దానికి లంబంగా విభజించగా లంబ అంశ (u sin 22.5°) మారదు, కావున దాని ప్రచోదనం = 0.
రేఖ వెంబడి అంశ u cos 22.5° తిరగబడుతుంది. ∴ ప్రచోదనం J = mv – mu = m(–u cos 22.5°) – m(u cos 22.5°) = –2mu cos 22.5°
పరిమాణం \( J = 2 × 0.15 × 15 × \cos 22.5° = 4.5 × 0.9239 = 4.16 \) కి.గ్రా. మీ/సె.
Exam Tips:
a) తొలి, తుది వేగాల మధ్య కోణం 45° ; ప్రచోదనం J = 2mu cos(θ/2) = 2 × 0.15 × 15 × cos 22.5°.
Question 21: 0.25 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న రాయిని దారం ఒక చివర కట్టి, 1.5 మీ.ల వ్యాసార్ధం ఉన్న క్షితిజ సమాంతర వృత్తాకార పథంలో 40 rev./min వడితో తిప్పారు. దారంలో ఏర్పడే తన్యత ఎంత ? దారం భరించగల గరిష్ఠ తన్యత 200 N అయితే, రాయిని ఎంత గరిష్ఠ వడితో తిప్పగలం ?
Answer:
ద్రవ్యరాశి m = 0.25 కి.గ్రా.,
భ్రమణాల సంఖ్య n = 40 r.p.m.
వ్యాసార్ధము r = 1.5 మీ.
కోణీయ వేగము \( ω = \frac{40 \times 2 \pi}{60}=\frac{4}{3} \pi \) రేడియన్/సె
గరిష్ఠ తన్యత T = 200 న్యూ
ఎ) దారంలో తన్యత \( T = m ω^2 r = 0.25 × \frac{4}{3} × \frac{4}{3}π^2 × 1.5 = 6.6 \) న్యూ
బి) గరిష్ఠ తన్యత T = 200 న్యూ \( = \frac{m v_{max}^2}{r} \)
∴ \( vₘₐₓ² = \frac{200 \times 1.5}{0.25} = 1200 \)
⇒ \( v = \sqrt{1200} = 34.6 \) మీ/సె.
Exam Tips:
a) rpm ను rad/s లోకి మార్చడం (ω = 2πn/60) ముఖ్యం; T = mω²r , గరిష్ఠ వడి v = √(T r/m).
Question 22: ఒకవేళ, పై లెక్కలో రాయి వేగాన్ని గరిష్ఠ వేగాన్ని అధిగమించేటట్లు పెంచితే, హఠాత్తుగా దారం తెగుతుంది. దారం తెగిన తరువాత, కింది వాటిలో ఏది రాయి ప్రయాణించే పథాన్ని తెలియచేస్తుంది ?
ఎ) రాయి వ్యాసార్ధం వెంబడి వెలుపలికి ప్రయాణిస్తుంది.
బి) దారం తెగిన క్షణంలో, స్పర్శారేఖ దిశలో రాయి ఎగిరిపోతుంది.
సి) స్పర్శా రేఖకు కొంత కోణంలో ఎగిరిపోతుంది. ఆ కోణం పరిమాణం రాయి వడిపై ఆధారపడి ఉంటుంది.
Answer:
పై లెక్కలో (21లో) రాయి వేగము గరిష్ఠ వేగాన్ని మించితే తీగ తెగిపోతుంది. తీగ తెగిన క్షణంలో ద్రవ్యరాశి ఆ బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ వెంబడి ఎగిరిపోతుంది. కావున ‘బి’ సరయిన జవాబు.
Exam Tips:
a) దారం తెగిన క్షణంలో వస్తువు స్పర్శరేఖ దిశలో ఎగిరిపోతుంది (జడత్వం), వ్యాసార్ధం వెంబడి కాదు.
Question 23: ఎందుకో వివరించండి.
ఎ) శూన్యాంతరాళంలో గుర్రం బండిని లాగలేదు, పరిగెత్తలేదు.
బి) వేగంగా ప్రయాణిస్తున్న బస్సును హఠాత్తుగా ఆపితే, బస్సులో కూర్చున్న ప్రయాణీకులు, వాళ్ళు కూర్చున్న స్థలం నుంచి ముందుకు తూలుతారు.
సి) లాన్ రోలర్‌ను నెట్టడం కంటె లాగడం తేలిక.
డి) క్రికెటర్ బంతిని క్యాచ్ పట్టుకొనేటప్పుడు తన చేతులను వెనుకకు లాగుతాడు.
Answer:
ఎ) శూన్యంలో గుర్రంబండి ప్రతిచర్య జరిపే అవకాశం లేదు. అందువల్ల చర్య కూడా సాధ్యపడదు. అందువల్ల గుర్రం బండిని లాగలేదు.
బి) వేగంగా వెళుతున్న బస్సును హఠాత్తుగా ఆపితే ప్రయాణీకులు ముందుకు పడటానికి కారణం చలనస్థితి జడత్వము (బస్సు ఆగినా వారి శరీరం అంతకుముందు చలనస్థితినే కొనసాగించాలని చూస్తుంది).
సి) లాన్ రోలర్‌ను నెట్టినపుడు ప్రయోగించిన బలం (F) లోని ఒక అంశ F sin θ రోలర్‌ను భూమివైపుకి బలంగా నెట్టుతుంది. కాని అదే బలం F తో లాగితే బల అంశ F sin θ రోలర్‌ను గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో పైకి లాగుతుంది. అందువల్ల లాన్ రోలర్‌ను నెట్టడం కన్నా లాగడం తేలిక.
డి) బంతిని క్యాచ్ పట్టుకునేందుకు చేతిని వెనుకకు లాగడం వల్ల బంతి ఆగిపోవడానికి పట్టిన కాలం పెరుగుతుంది. ఫలితంగా చేయి మీద ప్రచోదన ప్రభావం తగ్గును.
Exam Tips:
a) ప్రతి భాగానికి ఒక సూత్రం : న్యూటన్ మూడవ నియమం (ఎ), జడత్వం (బి), F sin θ అంశ (సి), Δt పెంచితే F తగ్గుతుంది (డి).
Question 24: 0.04 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు స్థానం-కాలం వక్రం పటంలో ఇవ్వడమైంది. ఈ గమనానికి తగిన భౌతిక సందర్భాన్ని సూచించండి. వస్తువు పొందిన రెండు వరుస ప్రచోదనాల మధ్య కాలం ఎంత ? ప్రతీ ప్రచోదనం పరిమాణం ఎంత ?
Answer:
వస్తువు ద్రవ్యరాశి m = 0.04 కి.గ్రా.
పటం నుండి వస్తువు 2 సెకన్లలో 0 నుండి 2 సెం.మీ. వరకు స్థానభ్రంశం పొందింది. ∴ వస్తువు వేగము = వాలు \( = \frac{2}{2} \) = 1 సెం.మీ./సె. = 10⁻² మీ/సె.
మరల తరువాత 2 సెకన్లలో 2 నుంచి 0 కి స్థానభ్రంశం పొందింది. ఈ దిశలో వేగము v = –1 సెం.మీ/సె.
అనగా వస్తువు ప్రతి 2 సెకన్లకు ఒకసారి వేగ దిశ మార్చుకుంటుంది. దాని కోసం దానిపై ప్రచోదనం పనిచేయాలి.
తగిన భౌతిక సందర్భం: 2 సెం.మీ. దూరంలో ఉన్న రెండు దృఢమైన గోడల మధ్య 1 సెం.మీ./సె వడితో స్థితిస్థాపకంగా అభిఘాతం చెందుతూ ముందుకు వెనుకకు చలించే బంతి.
రెండు వరుస ప్రచోదనాల మధ్య కాలం = 2 సె.
ప్రతి ప్రచోదనం J = m(v – u) = 0.04 (–1 – 1) × 10⁻² = –0.08 × 10⁻² = –8 × 10⁻⁴ కి.గ్రా. మీ/సె. అనగా పరిమాణం 8 × 10⁻⁴ కి.గ్రా. మీ/సె.
Exam Tips:
a) x–t గ్రాఫ్ వాలు ఋణం అయినపుడు వేగ దిశ తిరిగిందని అర్థం; ప్రచోదనం పరిమాణం = m × |Δv| = 0.04 × 0.02.
Question 25: పటంలో చూపినట్లు 1 ms⁻² త్వరణంతో తిరుగుతున్న క్షితిజ సమాంతర కన్వేయర్ బెల్ట్ పై ఒక వ్యక్తి. బెల్ట్‌కు సాపేక్షంగా విరామస్థితిలో నిల్చొని ఉన్నాడు. ఆ వ్యక్తిపై నికర బలం ఎంత ? వ్యక్తి బూట్లకు, బెల్ట్‌కు మధ్య స్థితిక ఘర్షణ గుణకం 0.2 అయితే, బెల్ట్ త్వరణం ఏ విలువ వరకు బెల్ట్‌కు సాపేక్షంగా ఆ వ్యక్తి అదే విధంగా విరామస్థితిలో కొనసాగుతాడు ?
(వ్యక్తి ద్రవ్యరాశి = 65కి.గ్రా.)
Answer:
ఎ) బెల్టు త్వరణము a = 1 మీ/సె²
కన్వేయర్ బెల్ట్ పరంగా మనిషి స్థిరంగా ఉండటం వల్ల అతని త్వరణము a = 1 మీ/సె².
మనిషి ద్రవ్యరాశి m = 65 కి.గ్రా.; నికరబలం F = ma = 65 × 1 = 65 న్యూ.
బి) సీమాంత ఘర్షణ బలం μmg ఇందులో μ = 0.2
∴ F = 0.2 mg
మనిషి కదలకుండా ఉండటానికి గరిష్ఠ త్వరణము a’ \( = \frac{\mu \mathrm{mg}} {\mathrm{m}} \)
a’ = μg = 0.2 × 9.8 = 1.96 మీ/సె²
Exam Tips:
a) బెల్ట్ తో పాటు త్వరణం కలగడానికి కావలసిన బలం స్థితిక ఘర్షణ నుండే వస్తుంది : ma ≤ μₛ mg ⇒ a ≤ μₛ g.
Question 26: దారం ఒక చివర కట్టిన m ద్రవ్యరాశి ఉన్న రాయి R వ్యాసార్ధం ఉన్న నిలువు వృత్త పథంలో పరిభ్రమిస్తుంది. ఆ వృత్త నిమ్నతమ, ఊర్ధ్వతమ బిందువుల వద్ద నిట్టనిలువుగా కిందికి పనిచేసే నికర బలాలు (సరియైన సమాధానం ఎన్నుకోండి)
| నిమ్నతమ బిందువు | ఊర్ధ్వతమ బిందువు | |
| a) | \( mg - T_1 \) | \( mg + T_2 \) |
| b) | \( mg + T_1 \) | \( mg - T_2 \) |
| c) | \( mg + T_1 - \frac{mv_1^2}{R} \) | \( mg - T_2 + \frac{mv_2^2}{R} \) |
| d) | \( mg - T_1 - \frac{mv_1^2}{R} \) | \( mg + T_2 + \frac{mv_2^2}{R} \) |
T₁, v₁ లు నిమ్నతమ బిందువు వద్ద తన్యత, వడిని సూచిస్తాయి. T₂, v₂ లు ఊర్ధ్వతమ బిందువు వద్ద తన్యత, వడిని సూచిస్తాయి.
Answer:
నిమ్నతమ బిందువు (L) వద్ద ఫలిత బలము FL = (mg – T₁),
ఊర్ధ్వతమ బిందువు (H) వద్ద ఫలిత బలము FH = mg + T₂
కావున (a) సరియైన ఎంపిక.
Exam Tips:
a) నిలువు వృత్తంలో కింది బిందువు వద్ద కిందికి నికర బలం mg − T₁ ; పై బిందువు వద్ద mg + T₂ (రెండూ కిందికే). సరైన ఎంపిక (a).
Question 27: 1000 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక హెలికాప్టర్ 15 ms⁻² నిలువు త్వరణంతో పైకిలేస్తుంది. హెలికాప్టర్ నడిపే వ్యక్తి, అందులోని ప్రయాణీకుల భారం 300 కి.గ్రా. కింది వివిధ సందర్భాలలో పనిచేసే బలం పరిమాణాన్ని, దిశను తెలియచేయండి. ఎ) హెలికాప్టర్ నడిపే వ్యక్తి, ప్రయాణీకుల వల్ల హెలికాప్టర్ అడుగు తలంపై పనిచేసే బలం బి) హెలికాప్టర్ రోటర్ దాని పరిసరాలలోని గాలిపై జరిపే చర్య సి) పరిసరాలలో ఉన్న గాలి, హెలికాప్టర్‌పై ప్రయోగించే బలం.
Answer:
హెలికాప్టర్ ద్రవ్యరాశి m = 1000 కి.గ్రా.
ప్రయాణీకులు + సిబ్బంది బరువు m₂ = 300 కి.గ్రా.
∴ మొత్తం బరువు M = 1000 + 300 = 1300 కి.గ్రా.
ఊర్ధ్వదిశలో త్వరణము a = 15 మీ/సె², g = 10 మీ/సె²
ఎ) హెలికాప్టర్ నేలపై సిబ్బంది వల్ల బలము F = m (g + a)
F = 300 (10 + 15) = 300 × 25 = 7500 న్యూ (అధోముఖంగా).
బి) రోటరు బ్లేడ్ల వల్ల పరిసరాలపై ప్రతిచర్య అధో దిశలో ఉంటుంది. (హెలికాప్టర్‌పైకి వెళ్ళింది కనుక) పైకి లేవడానికి హెలికాప్టర్ రోటర్ ల వల్ల మొత్తం బలం
F = (m₁ + m₂) (g + a)
F = 1300 (10 + 15) = 32500 న్యూ (అధోముఖంగా).
సి) పరిసరాల గాలివల్ల హెలికాప్టర్‌పై ప్రతిచర్య = హెలికాప్టర్
ఇంజన్ పరిసరాలపై ప్రయోగించిన బలము = 32500 న్యూ (ఊర్ధ్వముఖంగా).
(చర్య = – ప్రతిచర్య కావున)
Exam Tips:
a) హెలికాప్టర్ + సిబ్బంది మొత్తం ద్రవ్యరాశి 1300 kg ; ప్రతి భాగానికి F = m(g + a) తో ద్రవ్యరాశిని మార్చి లెక్కించండి, చర్య–ప్రతిచర్య సమానమని రాయండి.
Question 28: 10 ⁻²m² మధ్యచ్ఛేద వైశాల్యం ఉన్న ఒక పైపు ద్వారా నీటి ప్రవాహం 15 ms⁻¹ వేగంతో క్షితిజ సమాంతరంగా ప్రయాణిస్తూ బయటకు చిమ్మి, దగ్గరగా ఉన్న నిలువు గోడను తాకింది. గోడపై పతనం అయిన నీరు వెనుకకు తిరిగి రాదని భావిస్తే నీటి వల్ల గోడపై కలిగే బలం ఎంత ?
Answer:
నీటివేగము u = 15 మీ/సె. ;
గొట్టం అడ్డుకోత వైశాల్యం a₁ = 10⁻² మీ²
నీటి పరిమాణము = a₁ × v₁ = 10⁻² × 15 మీ³/సె
నీటి వేగము v₁ = 15 మీ/సె.
నీటి సాంద్రత d = 1000 కి.గ్రా./మీ³
1 సెకన్లో గోడను తాకిన నీటి ద్రవ్యరాశి a₁ v₁ d
= 10⁻² × 15 × 1000 = 150 కి.గ్రా.
నీరు వెనుకకు మరల లేదని భావిస్తే నీటి వల్ల గోడపై బలము \( F = \frac{\mathrm{d} \overline{\mathrm{p}}}{\mathrm{dt}}=\frac{\mathrm{mu}}{\mathrm{t}}=\frac{150 \times 15}{1} = 2250 \) న్యూ.
Exam Tips:
a) 1 సెకనులో గోడను తాకిన నీటి ద్రవ్యరాశి = ρ A v = 150 kg ; F = (ద్రవ్యవేగంలో మార్పు)/సమయం = 150 × 15.
b) ద్రవ్యవేగంలో మార్పు రేటు F = (dm/dt)·v అని రాయండి; నీరు వెనుకకు రాదు కావున తుది వేగం సున్న.
Question 29: రూపాయి నాణేలను పదింటిని ఒకదానిమీద ఒకటిగా ఒక బల్లపై ఉంచారు. ప్రతి నాణెం ద్రవ్యరాశి m. కింది ప్రతి సందర్భంలో ‘బల పరిమాణం, దిశను తెలపండి. ఎ) క్రింది నుంచి 7వ నాణెం మీద, పైనున్న నాణేల వల్ల బల పరిమాణం, దిశ బి) 8వ నాణెం వల్ల 7వ నాణెం మీద పనిచేసే బలపరిమాణం, దిశ సి) 6వ నాణెం వల్ల 7వ నాణెం మీద ప్రతిచర్య పరిమాణం, దిశ
Answer:
ఎ) 7వ నాణెంపై బలము = దానిపై గల 3 నాణేల (8, 9, 10) భారము ∴ F = 3mg, అధోముఖంగా.
బి) 8వ నాణెం భారము mg, దానిపై గల 9, 10 నాణేల భారము 2mg. మొత్తం 3mg. ఈ మొత్తం భారాన్ని 8వ నాణెం 7వ నాణెంపై ప్రయోగిస్తుంది. ∴ F = 3mg, అధోముఖంగా.
సి) 7వ నాణెం (7, 8, 9, 10 నాణేలు) మొత్తం భారం 4mg. 6వ నాణెం 7వ నాణెంపై ప్రయోగించే ప్రతిచర్య దీనికి సమానం, ఊర్ధ్వముఖంగా: R = 4mg.
Exam Tips:
a) ఒక నాణెంపై బలం = దానిపైన ఉన్న నాణేల భారం ; కింది నాణెం ప్రతిచర్య = ఆ నాణెంతో సహా పై నాణేల మొత్తం భారం.
Question 30: ఒక విమానం 720 km/h వడితో క్షితిజ సమాంతర వలయం ఆకారంలో ప్రయాణించింది. విమానం రెక్కల గట్టు కోణం 15°. ఆ వలయం వ్యాసార్ధం ఎంత ?
Answer:
రెక్కల గట్టు కోణము θ = 15°;
వేగము v = 720 kmph \( = 720 × \frac{5}{18} = 200 \) మీ/సె
g = 9.8 మీ/సె²
గట్టు కట్టినపుడు tan \( θ = \frac{\mathrm{v}^2}{\mathrm{rg}} \)
∴ వంపు వ్యాసార్ధము \( r = \frac{\mathrm{v}^2}{\mathrm{~g} \tan \theta}=\frac{200 \times 200}{9.8 \times \tan 15^{\circ}} \)
= 15232 మీ. లేదా 15.232 కి.మీ.
Exam Tips:
a) గట్టు కోణం θ కు tan θ = v²/(rg) ; వడిని km/h నుండి m/s కు మార్చండి (720 km/h = 200 m/s).
b) tan 15° ≈ 0.268 ; వ్యాసార్ధం కి.మీ.లో రావడం సహజం (≈ 15.2 km) — మీటర్లలో రాసి కి.మీ.గా కూడా చూపండి.
Question 31: ఒక రైలు 54 km/h వడితో 30 మీ. వ్యాసార్ధం ఉన్న గట్టుకట్టని వృత్తాకార రైలు మార్గం గుండా ప్రయాణిస్తుంది. రైలు ద్రవ్యరాశి 10⁶ కి.గ్రా. ఇంజన్, పట్టాలు ఈ రెండింటిలో ఏది రైలుకు కావలసిన అభికేంద్ర బలాన్ని సమకూరుస్తుంది. పట్టాలు అరిగిపోకుండా ఉండాలంటే, ఎంత కోణంలో గట్టు కట్టాలి ?
Answer:
వ్యాసార్ధము r = 30 మీ.
వడి = v = 54 kmph \( = 54 × \frac{5}{18} = 15 \) మీ/సె.
రైలు ద్రవ్యరాశి m = 10⁶ కి.గ్రా.
రైలుకు కావలసిన అభికేంద్ర బలాన్ని ఎత్తుగా నిర్మించిన వెలుపలి పట్టా అందజేస్తుంది. గట్టు కట్టకపోతే ఈ పట్టాకు అరుగుదల ఎక్కువ.
ఏటవాలు గట్టుకోణము tan \( θ = \frac{\mathrm{v}^2}{\mathrm{rg}}=\frac{15 \times 15}{30 \times 9.8} = 0.765 ≈ 0.77 \)
∴ tan θ ≈ 0.77 ⇒ θ = tan⁻¹ (0.765) ≈ 37.4°
Exam Tips:
a) గట్టు లేని వంపులో అభికేంద్ర బలాన్ని బయటి పట్టా అందిస్తుంది; tan θ = v²/(rg).
Question 32: సర్కస్ గ్లోబులో మోటారు సైకిల్‌ను నిలువు వృత్తంలలో వివిధ రకాల భంగిమలలో అబ్బురపరిచే విన్యాసాలను అతి సులువుగా ప్రదర్శించడం మనం చూస్తూనే ఉంటాం. (ఆ గ్లోబు గోళాకారంగా ఉండి, బయట నుంచి మనం చూడటానికి వీలుగా రంధ్రాలు కలిగి ఉంటుంది) గ్లోబులో మోటారు సైకిల్‌పై నిలువు వృత్తంలో పరిభ్రమించే ప్రదర్శకునికి కింది నుంచి ఎలాంటి ఆధారం లేకున్నా ఊర్ధ్వతమ బిందువు వద్ద ఉన్నప్పుడు పడిపోకుండా ఉండటానికి కారణమేమిటో వివరించండి. నిలువు వృత్తంలో ఊర్ధ్వతమ స్థానం వద్ద మోటారు సైకిల్‌పై గమనం పూర్తిచేయడానికి, నిమ్నతమ బిందువు వద్ద ఉండవలసిన కనిష్ఠ వేగం ఎంత ? గ్లోబు వ్యాసార్ధం 25 మీ.
Answer:
ఊర్ధ్వతమ బిందువు వద్ద R + mg \( = \frac{\mathrm{mv}^2}{\mathrm{r}} \) ఇందులో R. మోటారిస్ట్ అభిలంబచర్య
R = 0 అయితే అతని వేగము అతి తక్కువ
∴ mg \( = \frac{\mathrm{mv}^2}{\mathrm{r}} \) లేదా ఊర్ధ్వతమ బిందువు వద్ద అతని కనిష్ఠ వేగము \( v = \sqrt{\mathrm{gr}} \)
∴ ఊర్ధ్వతమ బిందువు వద్ద \( v = \sqrt{10 \times 25}=\sqrt{250} = 15.8 \) మీ/సె.
నిమ్నతమ బిందువు వద్ద కనిష్ఠ వేగం (శక్తి నిత్యత్వం నుండి): \( \frac{1}{2}mv_L^2 = \frac{1}{2}mv^2 + mg(2r) \) ⇒ \( v_L^2 = gr + 4gr = 5gr \)
∴ \( v_L = \sqrt{5 \times 10 \times 25}=\sqrt{1250} = 35.4 \) మీ/సె.
Exam Tips:
a) పై బిందువు వద్ద R = 0 అయితే కనిష్ఠ వేగం √(gr) ; నిమ్నతమ బిందువు వద్ద శక్తి నిత్యత్వం నుండి √(5gr) వస్తుంది — ప్రశ్న ఏ బిందువు గురించి అడిగిందో గమనించండి.
Question 33: 3 మీ. వ్యాసార్ధం ఉన్న ఒక బోలు స్థూపాకార డ్రమ్ దాని నిలువు అక్షంపరంగా, 200 rev/min వడితో పరిభ్రమిస్తుంది. 70 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఒక వ్యక్తి డ్రమ్ లోపలి గోడలకు తాకుతూ నిల్చొని ఉన్నాడు. వ్యక్తి బట్టలకు, డ్రమ్ గోడకు మధ్య ఘర్షణ గుణకం 0.15. అడుగు తలాన్ని హఠాత్తుగా తొలగించినప్పుడు, ఆ వ్యక్తి లోపలి గోడలకు అదే విధంగా తాకుతూ పడిపోకుండా ఉండాలంటే స్థూపాకార డ్రమ్‌కు ఉండాల్సిన కనిష్ఠ భ్రమణ వడి ఎంత?
Answer:
ద్రవ్యరాశి m = 70 కి.గ్రా.
వ్యాసార్ధము r = 3 మీ.
\( n = 200 r.p.m. = \frac{200}{60} × r.p.s. \); ఘర్షణ గుణకము μ = 0.15; మనిషి
పడిపోకుండా ఉండటానికి డ్రమ్‌కు ఉండవలసిన కనీస భ్రమణ వడి w = ?
ఈ సందర్భంలో మనిషి భారము mg = μ.mrw² కావలెను
\( w² = \frac{\mathrm{mg}}{\mu \mathrm{mr}} \Rightarrow \)
\( \mathrm{w}=\sqrt{\frac{\mathrm{g}}{\mu \mathrm{r}}}=\sqrt{\frac{10}{0.15 \times 3}} = 4.7 \) రేడియన్/సె. (సుమారు 45 భ్రమణాలు/నిమిషం)
Exam Tips:
a) గోడపై ఘర్షణ బలం (μN) భారాన్ని సమతూకం చేయాలి : μ mω²r = mg ⇒ ω = √(g/(μr)).
b) ఇక్కడ ఘర్షణ బలం భారాన్ని సమతూకం చేస్తుంది, అభిలంబ ప్రతిచర్య N = mω²r అవుతుంది — రెండింటినీ కలపకుండా వేర్వేరుగా రాయండి.
Free study material for Physics
TS Board Solutions for Class 11 Physics Chapter 05 Laws of Motion
Chapter Exercise Answers for Class 11 Physics
Access structured TS Board textbook solutions for Chapter 05 Laws of Motion. Designed in alignment with the latest academic curriculum for Class 11 Physics, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Detailed Answer Guides for Chapter 05 Laws of Motion
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 05 Laws of Motion concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Complete Preparation Kit for Class 11 Exams
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 11 Physics.
FAQs
The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 5 గమన నియమాలు is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 5 గమన నియమాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 5 గమన నియమాలు will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 5 గమన నియమాలు in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 5 గమన నియమాలు in printable PDF format for offline study on any device.