TS Inter 1st Year Physics Study Material Chapter 4 సమతలంలో చలనం

Official TS Board Solutions for Class 11 Physics: Chapter 04 Motion in a Plane

Explore reliable textbook solutions for Chapter 04 Motion in a Plane tailored for Class 11 learners. Utilizing these Physics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Chapter-wise Solutions for Physics: Chapter 04 Motion in a Plane

Navigate directly to the solved Physics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: ఒక సదిశ నిలువు అంశం దాని క్షితిజ సమాంతర అంశానికి సమానం. ఆ సదిశ x- అక్షంతో చేసే కోణం ఎంత ?

Answer:

ఒక సదిశ Ā నిలువు అంశం Ā⊥ = Ā sin θ.
క్షితిజ సమాంతర అంశం A|| = Ā cos θ
A⊥ = A|| అయితే వాటి మధ్య కోణము tan \( θ = \frac{\mathrm{A}_{\perp}} {\mathrm{A}_{\|}} = 1 \)
అనగా θ = 45°

Exam Tips:

a) సదిశ అంశాలు \( A\sin θ \), \( A\cos θ \) సమానమైతే tan θ = 1 అని రాసి θ = 45° అని తేల్చండి.

 

Question 2: ఒక సదిశ V క్షితిజ సమాంతరంతో θ కోణం చేస్తుంది. ఆ సదిశను ఆ కోణం భ్రమణం చెందించడమైంది. ఈ భ్రమణం సదిశ V లో మార్పు తెస్తుందా ?

Answer:

నిర్దేశక అక్షాలను త్రిప్పినంత మాత్రాన సదిశ పరిమాణం మారదు. ఇచ్చిన సదిశ పరిమాణము = V
క్షితిజ సమాంతర అక్షంతో కోణము = θ (అనుకొనుము)
నిరూపకాక్షాలను త్రిప్పిన కోణము = e అయితే, క్షితిజ సమాంతరంతో కోణము θ + e అవుతుంది.
ఇప్పుడు క్షితిజ సమాంతరాంశం = Vₓ = V Cos (θ + e), క్షితిజ లంబ అంశం Vy = V sin (θ + e)
ఇచ్చిన సదిశ పరిమాణము \( V = \sqrt{v_x^2+v_y^2} = V \sqrt{\cos ^2(e+\theta)+\sin ^2(e+\theta)} = V \)
కావున అక్షాన్ని భ్రమణం చెందించటం వల్ల సదిశ పరిమాణం మారదు.

Exam Tips:

a) అక్షాలను తిప్పినా సదిశ పరిమాణం మారదు (స్థిరరాశి) అని స్పష్టంగా నిర్ధారణ వాక్యం రాయండి.
b) \( \sin^2+\cos^2 = 1 \) ఉపయోగించడం ముఖ్యమైన దశ.

 

Question 3: 3 ప్రమాణాలు, 5 ప్రమాణాల పరిమాణం ఉన్న రెండు బలాలు ఒకదానితో ఒకటి 60° కోణంలో పనిచేస్తున్నాయి. వాటి ఫలిత పరిమాణం ఎంత ?

Answer:

సదిశల పరిమాణాలు 3 యూనిట్లు, 5 యూనిట్లు. వాటి మధ్య కోణము = θ
∴ ఫలిత సదిశ \( R = \sqrt{3^2+5^2+2 \times 3 \times 5 \cos 60^{\circ}}=\sqrt{9+25+15}=\sqrt{49} = 7 \) యూనిట్లు.

Exam Tips:

a) \( R=\sqrt{P^2+Q^2+2PQ\cos θ} \) సూత్రం రాసి విలువలు ప్రతిక్షేపించండి; cos 60° = 1/2 అని గుర్తుంచుకోండి.
b) యూనిట్లు (ప్రమాణాలు) రాయడం మరువకండి.

 

Question 4: \( \overrightarrow{A}=\hat{i}-\hat{j} \). ఈ సదిశ x-అక్షంతో చేసే కోణం ఎంత ?

Answer:

\( \overrightarrow{A}=\hat{i}-\hat{j} \) స్థాన సదిశ పటంలో చూపినట్లు (1, −1) బిందువు వద్ద 4వ పాదంలో ఉంటుంది.

పటం నుండి \( \tan θ = \frac{y}{x} = -1 \)
∴ θ = 315° (అనగా x-అక్షం నుండి సవ్యదిశలో 45°; 4వ పాదంలో ఉంటుంది.)

Exam Tips:

a) సదిశ ఏ పాదంలో ఉందో (x ధనం, y ఋణం → 4వ పాదం) చూసి కోణాన్ని x-అక్షం నుండి కొలవండి; tan θ ఋణమైతే కేవలం 45° అని రాయకూడదు.

 

Question 5: 7 యూనిట్లు, 24 యూనిట్లు పరిమాణం ఉన్న రెండు లంబ సదిశలు సంయోగం చెందినట్లైతే ఫలిత సదిశ పరిమాణం ఎంత ?

Answer:

దత్తాంశం నుండి \( \overline{\mathrm{P}} = 7 \) యూనిట్లు; \( \overline{\mathrm{Q}} = 24 \) యూనిట్లు; వాటి మధ్య కోణము θ = 90°
∴ ఫలిత సదిశ
\( \overline{\mathrm{R}}=\sqrt{\overline{\mathrm{P}}^2+\overline{\mathrm{Q}}^2+ 2 \mathrm{PQ} \cos \theta}=\sqrt{\overline{\mathrm{P}}^2+\overline{\mathrm{Q}}^2} (∵ \) cos 90° = 0) ∴ \( \overline{\mathrm{R}}=\sqrt{7^2+24^2}=\sqrt{49+576}=\sqrt{625} = 25 \) యూనిట్లు.

Exam Tips:

a) లంబ సదిశలకు cos 90° = 0 కావున \( R=\sqrt{P^2+Q^2} \); 7-24-25 పైథాగరస్ త్రిక అని గుర్తుంచుకోండి.

 

Question 6: P = 2i + 4j + 14k, Q = 4i + 4j + 10k అయితే P + Q పరిమాణం కనుక్కోండి.

Answer:

\( \overline{P}=2\hat{i}+4\hat{j}+14\hat{k} \) మరియు \( \overline{Q}=4\hat{i}+4\hat{j}+10\hat{k} \)
\( \overline{P}+\overline{Q}=6\hat{i}+8\hat{j}+24\hat{k} \)
\( \therefore |\overline{P}+\overline{Q}|=\sqrt{6^2+8^2+24^2}=\sqrt{36+64+576}=\sqrt{676}=26 \) యూనిట్లు.

Exam Tips:

a) ఫలిత సదిశ పరిమాణం \( \sqrt{x^2+y^2+z^2} \) సూత్రం ఉపయోగించి అంశాలను వర్గం చేసి కూడండి (6, 8, 24 → 676 = 26²).

 

Question 7: శూన్య పరిమాణం కలిగిన సదిశకు శూన్యం కాని అంశాలు ఉంటాయా ?

Answer:

శూన్య సదిశ యొక్క అంశాలు శూన్యేతర పరిమాణమును కలిగి ఉండవు.
ఎందుకనగా \( |\overline{V}|=\sqrt{V_x^2+V_y^2} = 0 \) కావాలంటే తప్పనిసరిగా \( V_x^2 \) మరియు \( V_y^2 \) సున్న కావలెను. అనగా \( V_x = V_y = 0 \) కావలెను.

Exam Tips:

a) పరిమాణం సున్న కావాలంటే ప్రతి అంశం సున్న కావాలి (వర్గాల మొత్తం సున్న) అని తర్కం రాయండి.

 

Question 8: ప్రక్షేపకం యొక్క ప్రక్షేప పథం అగ్రభాగంలో దాని త్వరణం ఎంత ?

Answer:

ప్రక్షేపకం అగ్రభాగంలో త్వరణము గురుత్వ త్వరణము g = 9.8 మీ/సె². ఇది భూమి కేంద్రంవైపు పనిచేస్తుంది.

Exam Tips:

a) అగ్రబిందువు వద్ద వేగం క్షితిజ సమాంతరం, కానీ త్వరణం ఎప్పుడూ g (నిలువుగా కిందికి) అని స్పష్టంగా రాయండి.

 

Question 9: రెండు అసమ పరిమాణం వున్న సదిశల సంకలన మొత్తం శూన్య సదిశను ఇవ్వగలదా ? మూడు అసమాన సదిశలు కలిసి శూన్య సదిశను ఇవ్వగలవా ?

Answer:

శూన్యం కాదు. రెండు అసమాన సదిశల ఫలిత సదిశ శూన్యం కాదు. కాని ఒకే సమతలంలో గల మూడు అసమాన సదిశల ఫలిత సదిశ శూన్యం కావచ్చును.

Exam Tips:

a) సమాన పరిమాణం గల రెండు సదిశలైనా కావాలంటే వ్యతిరేక దిశ అవసరం; అసమాన రెండింటికి శూన్యం అసాధ్యం, మూడు అసమానాలు ఒకే తలంలో త్రిభుజం ఏర్పరిస్తే సాధ్యమే.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: సదిశల సమాంతర చతుర్భుజ నియమాన్ని పేర్కొనండి. ఫలిత సదిశ పరిమాణం, దిశలకు సమీకరణం రాబట్టండి.

Answer:

సమాంతర చతుర్భుజ నియమం : “ఒక బిందువు వద్ద, ఏక కాలంలో పనిచేసే రెండు సదిశలను పరిమాణంలోను, దిశలోను సమాంతర చతుర్భుజం యొక్క రెండు ఆసన్న భుజాలతో సూచిస్తే అదే బిందువు గుండా పోయే కర్ణం రెండు సదిశల ఫలిత సదిశను పరిమాణం మరియు దిశలోను సూచిస్తుంది.” P, Q అను రెండు అనుషక్త సదిశలు ‘O’ వద్ద పనిచేయుచున్నవి. OA, OB భుజాలు ఆ రెండు సదిశల పరిమాణం మరియు దిశను సూచిస్తాయి. OA, OB ల మధ్యకోణం ‘θ’ అనుకొనుము. OA, OB లను ఆసన్న భుజాలుగా తీసుకొని సమాంతర చతుర్భుజం OACB ని నిర్మించండి.
OA ని పొడిగించి, దానిపై C నుండి లంబం గీస్తే ఆ లంబం OAని D వద్ద కలుస్తుంది. ODC లంబ కోణ త్రిభుజం కనుక, OC² = OD² + DC² కాని OD = OA + AD, ∴ OC² = (OA + AD)² + DC² = OA² + 2 (OA) (AD) + AD² + DC²
కాని AD² + DC² = AC² = OB² (ADC లంబకోణ త్రిభుజం కనుక)
∴ OC² = OA² + 2 (OA) (AD) + OB²
\( \frac{\mathrm{AD}}{\mathrm{AC}} = \) cos θ కనుక
OC² = OA² + 2(OA) (AC) cos θ + OB²
∴ \( R^2 = OC^2 = OA^2 + 2\,(OA)(OB)\cos θ + OB^2 \)
= P² + 2PQ cos θ + Q²
∴ \( R = \sqrt{\mathrm{P}^2+\mathrm{Q}^2+2 \mathrm{PQ} \cos \theta} \) ఇది రెండు సదిశల ఫలిత విలువ Rని తెలియచేస్తుంది.
R ఫలిత సదిశ OA తో α కోణం చేస్తుంది అనుకుంటే,
\( \tan α = \frac{CD}{OD} = \frac{CD}{OA + AD} \). కాని \( \frac{CD}{AC} = \sin θ \)
\( \therefore \tan α = \frac{AC \sin θ}{OA + AC \cos θ} \)
\( \therefore \tan α = \frac{Q \sin θ}{P + Q \cos θ} \)
ఇక్కడ α ఫలిత సదిశ ఆసన్న భుజంతో చేయు కోణమును తెలియజేస్తుంది.

Exam Tips:

a) సమాంతర చతుర్భుజ నియమాన్ని ముందు పేర్కొని, పటం గీసి, C నుండి OA పొడిగింపుపై లంబం గీసి R², tan α రెండూ రాబట్టండి.
b) \( R^2=P^2+Q^2+2PQ\cos θ \) మరియు \( \tan α=\frac{Q\sin θ}{P+Q\cos θ} \) రెండు సూత్రాలూ రాయడం తప్పనిసరి.

 

Question 2: సాపేక్ష చలనం అంటే ఏమిటి ? వివరించండి.

Answer:

సాపేక్ష వేగము : చలనంలో ఉన్న రెండు వస్తువులు A, B ల వేగాలను ఒకదానితో పోల్చి, వేరొకదాని వేగాన్ని వివరించడాన్ని సాపేక్ష వేగము అంటారు. అనగా A పరంగా B వేగాన్ని (\( V_{BA} \)) లేదా B పరంగా A వేగాన్ని (\( V_{AB} \)) వివరించడాన్ని సాపేక్ష వేగం అంటారు.
వివరణ : రెండు వస్తువులు A, B లు ఒకే అక్షం వెంబడి \( V_A \) మరియు \( V_B \) అను సగటు వేగాలతో చలిస్తున్నాయనుకోండి. కాలము t = 0 వద్ద వాటి స్థానాలు \( X_A(0) \), \( X_B(0) \) అనుకుందాం. t కాలం తరువాత వాటి స్థానాలు వరుసగా \( X_A(t) \) మరియు \( X_B(t) \) అయితే
\( X_A(t) = X_A(0) + V_A t \)
\( X_B(t) = X_B(0) + V_B t \) అవుతాయి.
ఇప్పుడు A నుంచి B స్థానభ్రంశం \( X_{BA}(t) = X_B(t) - X_A(t) \)
లేదా \( X_{BA}(t) = X_B(0) - X_A(0) + (V_B - V_A)\,t \)
\( X_A(0), X_B(0) \) ల తొలిస్థానాలు సున్న అని భావిస్తే \( X_{BA}(t) = (V_B - V_A)\,t \)
∴ A పరంగా B సాపేక్ష వేగము \( V_{BA} = \frac{X_{BA}(t)}{t} = V_B - V_A \)
అనగా రెండు వస్తువులు ఒకే దిశలో చలిస్తే వాటి సాపేక్ష వేగము ఆ వస్తువుల విడివిడి వేగాల భేదానికి సమానము.
ఇదే విధంగా B పరంగా A వస్తువు సాపేక్ష వేగము \( V_{AB} = V_A - V_B \).
అనగా \( V_{AB} = -V_{BA} \)
A, B లు వ్యతిరేక దిశలలో చలిస్తుంటే \( V_{AB} = V_A + V_B \) (పరిమాణంలో).
అనగా వ్యతిరేక దిశలలో చలించే వస్తువుల సాపేక్ష వేగము వాటి విడివిడి వేగాల మొత్తమునకు సమానము.

Exam Tips:

a) \( V_{BA}=V_B-V_A \) మరియు \( V_{AB}=-V_{BA} \) రాయండి; సమాన దిశలో భేదం, వ్యతిరేక దిశలో మొత్తం అని రెండు సందర్భాలు చెప్పండి.

 

Question 3: కనిష్ఠ కాలంలో నదిని దాటడానికి నావ నది నీటితో కొంత కోణం చేస్తూ ప్రయాణం చేయాలని చూపండి.

Answer:

ఒక పడవ నిశ్చలమైన నీటిలో ఒడ్డు దృష్ట్యా \( V_{bE} \) అను వేగంతో చలించగలదు అనుకొనుము. ఈ పడవను ఉపయోగించి ఒడ్డు దృష్ట్యా \( V_{wE} \) వేగంతో ప్రవహిస్తున్న నదిని దాటవలెను. నది వెడల్పు W అనుకోండి.
నదిని అతి తక్కువ కాలంలో దాటడం:
నదిని దాటడానికి పట్టే కాలము
\( t = \frac{\text{నది వెడల్పు}}{\text{పడవ వేగం}} = \frac{W}{V_{bE}} \)
నదిని కనీస కాలంలో దాటాలంటే పడవ వేగాంశం నది వెడల్పు దిశలోనే గరిష్ఠంగా ఉండాలి. అనగా పడవను ఒడ్డుకు లంబంగా (θ = 90°) నడపాలి. ఎందుకంటే అప్పుడు పడవ వేగం \( V_{bE} \) అంతా నది వెడల్పు దిశలోనే ఉంటుంది.
ఈ సందర్భంలో పడవ వేగము \( V_{bE} \) మరియు నది వేగము \( V_{wE} \) లు పరస్పర లంబము కావున పడవ ప్రవాహం వెంట కొంత దూరం కొట్టుకుపోతుంది. పడవ ఫలిత ప్రయాణ మార్గం పటంలో చూపినట్లు AC దిశలో ఉంటుంది.

Exam Tips:

a) పడవ ఒడ్డుకు లంబంగా నడిపితే \( t=W/V_{bE} \) కనిష్ఠమవుతుందని, ఆ సందర్భంలో ప్రవాహం వల్ల కొట్టుకుపోతుందని రాయండి.

 

Question 4: ప్రమాణ సదిశ, శూన్య సదిశ, స్థాన సదిశలను నిర్వచించండి.

Answer:

ప్రమాణ సదిశ : ఏకాంక పరిమాణం గల సదిశను ఏకాంక సదిశ లేక ప్రమాణ సదిశ అంటారు.
ఇచ్చిన సదిశను \( \overline{a} \) అనుకొన్నపుడు \( \overline{a} \) యొక్క ప్రమాణ సదిశ \( \hat{a}=\frac{\overline{a}}{|\overline{a}|} \) గా నిర్వచించారు.
శూన్య సదిశ : ఏదైనా సదిశ పరిమాణం శూన్యమైతే దానిని శూన్య సదిశ అంటారు. శూన్య సదిశకు ఆరంభ బిందువు, అంత్య బిందువు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి. అటువంటి సదిశ దిశను నిర్ణయించలేము.
ఉదా : \( \overline{A} - \overline{A} = \overline{0} \) ను శూన్య సదిశగా వ్యవహరిస్తారు.
స్థాన సదిశ : అంతరాళంలో గల ఏదైనా బిందువును \( \hat{i}, \hat{j} \) మరియు \( \hat{k} \) ప్రమాణ సదిశల రేఖీయ సంయోగంగా తెలుపవచ్చును. మూలబిందువు ‘O’ అయినపుడు P బిందువును \( \overrightarrow{OP} \) తో సూచిస్తారు.
\( \overrightarrow{OP}=x \hat{i}+y \hat{j}+z \hat{k} \) గా సూచిస్తారు. దీనిని P బిందువు స్థాన సదిశ అంటారు.
ఇందులో x, y మరియు z లు నిరూపకాక్షాలైన \( \hat{i}, \hat{j} \) మరియు \( \hat{k} \) ల వెంబడి గల అంశాలను తెలుపుతాయి.
\( \overrightarrow{OP} \) పరిమాణాన్ని \( |\overrightarrow{OP}|=\sqrt{x^2+y^2+z^2} \) ద్వారా లెక్కగడతారు.

Exam Tips:

a) ప్రమాణ సదిశకు \( \hat a=\vec a/|\vec a| \), స్థాన సదిశకు \( x\hat i+y\hat j+z\hat k \) సూత్రాలు తప్పక రాయండి.

 

Question 5: \( |\overrightarrow{a}+\overrightarrow{b}|=|\overrightarrow{a}-\overrightarrow{b}| \) అయితే \( \overrightarrow{a}, \overrightarrow{b} \) ల మధ్య కోణం 90° అని చూపండి.

Answer:

a, b లు రెండు సదిశలు అనుకోండి; వాటి మధ్య కోణం θ.
సదిశల మొత్తం పరిమాణము
\( |\overrightarrow{a}+\overrightarrow{b}| = \sqrt{a^2+b^2+2ab\cos θ} \) …(1)
సదిశల భేద పరిమాణము \( |\overrightarrow{a}-\overrightarrow{b}| = \sqrt{a^2+b^2-2ab\cos θ} \)
దత్తాంశం నుండి \( |\overrightarrow{a}+\overrightarrow{b}| = |\overrightarrow{a}-\overrightarrow{b}| \)
\( \therefore \sqrt{a^2+b^2+2ab\cos θ} = \sqrt{a^2+b^2-2ab\cos θ} \). ఇరువైపులా వర్గీకరించగా
\( a^2+b^2+2ab\cos θ = a^2+b^2-2ab\cos θ \Rightarrow 4\,|a||b|\cos θ = 0 \)
కాని |a|, |b| లు సున్న కావు కావున cos θ = 0 కావలెను. అనగా θ = 90°. అనగా \( \overrightarrow{a}, \overrightarrow{b} \) ల మధ్య కోణము θ = 90°.

Exam Tips:

a) రెండు వైపులా వర్గం చేసి cos θ = 0 అని తేల్చండి; |a|, |b| సున్న కావు అనే షరతు చెప్పడం మరువకండి.

 

Question 6: క్షితిజ సమాంతర దిశకు కొంత కోణం చేస్తూ విసిరిన వస్తువు (ప్రక్షిప్త) పథం పరావలయం అని చూపండి. (మే 2014)

Answer:

క్షితిజ సమాంతర తలంతో θ కోణం చేసే విధంగా u వేగంతో ఒక వస్తువును పైకి విసిరామనుకుందాము. ప్రక్షేపకము ప్రయాణించిన మార్గాన్ని ప్రక్షేపకపు గమన పథము అంటారు. ప్రక్షేపకాలలో వస్తువుపై గురుత్వ త్వరణం g మాత్రమే పనిచేస్తుంది. ఇది ఎల్లప్పుడూ నిలువుగా క్రిందికి ఉంటుంది. వస్తువుకి క్షితిజ సమాంతరంగా త్వరణం ఉండదు. కావున ప్రక్షేపకాలలో క్షితిజ సమాంతర వేగము మారదు.
OX దిశలో వేగాంశం = u cos θ (ఇది మారదు)
OY దిశలో వేగాంశం = u sin θ. ఇది గురుత్వ త్వరణం వలన మారుతూ ఉంటుంది.
t కాలం తరువాత క్షితిజ సమాంతరంగా పయనించిన దూరం x = (x-దిశలో వేగాంశం) × (కాలం)
\( \therefore x = (u\cos θ)\,t \) లేదా \( t = \frac{x}{u\cos θ} \) …(1)
క్షితిజ లంబ దిశలో పోయిన దూరం = y
\( s = ut + \frac{1}{2}at^2 \) నుండి \( y = u\sin θ\,t - \frac{1}{2}gt^2 \) …(2)
దీనిలో \( t = \frac{x}{u\cos θ} \) ను వాడగా
\( y = \frac{u\sin θ \cdot x}{u\cos θ} - \frac{1}{2}g\left(\frac{x}{u\cos θ}\right)^2 = x\tan θ - \frac{g x^2}{2u^2\cos^2 θ} \)
ఇందులో \( \tan θ = A,\ \frac{g}{2u^2\cos^2 θ} = B \) అనుకుంటే

\( y = Ax - Bx^2 \)
ఇది పరావలయ సమీకరణము.
అందువలన క్షితిజ సమాంతర దిశకు కొంత కోణంతో విసిరిన వస్తువు పథం పరావలయం.

Exam Tips:

a) t ను తొలగించి y = Ax − Bx² రూపానికి తెచ్చి A, B ల విలువలు చెప్పండి; ఇది పరావలయ సమీకరణం అని ముగించండి.

 

Question 7: సగటు వేగం, తాక్షణిక వేగం పదాలను వివరించండి. ఈ రెండు ఎప్పుడు సమానం అవుతాయి ?

Answer:

సగటు వేగము : వస్తువు స్థానభ్రంశానికి, ఆ స్థానభ్రంశానికి పట్టిన కాలవ్యవధికి గల నిష్పత్తిని వస్తువు సరాసరి లేదా సగటు వేగము అంటారు.
సగటు వేగము \( \overline{V} = \frac{\Delta \overline{r}}{\Delta t}=\frac{\Delta x\,\hat{i}+\Delta y\,\hat{j}}{\Delta t} = \frac{\Delta x}{\Delta t}\hat{i}+\frac{\Delta y}{\Delta t}\hat{j} \)
తాక్షణిక వేగము : కాలవ్యవధి అతి తక్కువగా ఉన్నపుడు, అనగా శూన్యాన్ని సమీపించేటంత చిన్నదైనపుడు, వస్తువు స్థానభ్రంశం మరియు కాలముల నిష్పత్తిని తాక్షణిక వేగం అంటారు.
\( \overline{V} = \lim_{\Delta t \to 0} \frac{\Delta \overline{r}}{\Delta t}=\frac{d\overline{r}}{dt} \) తాక్షణిక వేగము
కాలవ్యవధులు అత్యల్పంగా తీసుకొనినపుడు వస్తువు తాక్షణిక వేగము మరియు ఆ కాలంలో సగటు వేగము సమానమవుతాయి.

Exam Tips:

a) సగటు వేగానికి \( \Delta r/\Delta t \), తాక్షణిక వేగానికి \( dr/dt \) (లిమిట్ Δt → 0) రాయండి; రెండూ సమానమయ్యే సందర్భం (Δt → 0 లేదా ఏకరీతి వేగం) చెప్పండి.

 

Question 8: ప్రక్షేపకం యొక్క గరిష్టోన్నతి మరియు గరిష్ఠ వ్యాప్తులు వరుసగా \( \frac{u^2 \sin ^2 θ}{2 g} \) మరియు \( \frac{u^2 \sin 2 θ}{g} \) అని చూపండి. ఇక్కడ వాడిన పదాలు సాధారణంగా ఉపయోగించే అర్థంలోనే వాడాము.

Answer:

ఏదైనా వస్తువును ‘u’ అను తొలివేగంతో క్షితిజ సమాంతరానికి ‘θ’ కోణంతో గాలిలోనికి విసిరామనుకొనుము. x-దిశలో తొలివేగము \( u_x = u\cos θ \); y-దిశలో తొలివేగము \( u_y = u\sin θ \).
గరిష్టోన్నతి (\( h_{max} \)) : ప్రక్షిప్త వస్తువు క్షితిజ లంబ వేగాంశము సున్న అయ్యేవరకు పైకి పోయిన ఎత్తును దాని గరిష్టోన్నతిగా నిర్వచించారు.
త్వరణము a = −g, తొలి వేగము \( u_y = u\sin θ \)
\( v^2 - u^2 = 2as \) అను సమీకరణం నుండి
\( 0 - u^2\sin^2 θ = -2g\,h_{max} \)
∴ గరిష్టోన్నతి \( h_{max} = \frac{u^2 \sin ^2 θ}{2 g} \)

క్షితిజ సమాంతర వ్యాప్తి (R):
వస్తువు పలాయన కాలం (T) లో ప్రయాణించిన క్షితిజ సమాంతర దూరాన్ని వ్యాప్తిగా నిర్వచించారు.
x-దిశలో తొలివేగము \( u_x = u\cos θ \); పలాయన కాలము \( T = \frac{2 u \sin θ}{g} \)
x-దిశలో వేగం మారదు కావున వ్యాప్తి \( R = u_x × T = \frac{u \cos θ \cdot 2 u \sin θ}{g}=\frac{u^2 \cdot 2 \sin θ \cos θ}{g}=\frac{u^2 \sin 2 θ}{g} \)
∴ క్షితిజ సమాంతర వ్యాప్తి \( R = \frac{u^2 \sin 2 θ}{g} \)

Exam Tips:

a) h_max కు \( v^2-u^2=2as \), R కు \( R=u_xT \) వాడండి; \( 2\sin θ\cos θ=\sin 2θ \) సర్దుబాటు చూపండి.

 

Question 9: ఒక నిర్దేశ చట్రంలో వస్తువు ప్రక్షిప్త పథం పరావలయం అయితే, ఈ నిర్దేశ చట్రంతో సాపేక్షంగా స్థిరవేగంతో కదులుతున్న మరొక నిర్దేశ చట్రంలో కూడా వస్తువు పథం పరావలయ ఆకృతిలో ఉంటుందా ? ఒకవేళ ప్రక్షేపక పథం పరావలయం కాకపోతే అది ఏ ఆకృతిలో ఉంటుంది ?

Answer:

దత్తాంశం నుండి ఒక నిర్దేశ చట్రంలో వస్తువు గమనపథము పరావలయము.
రెండవ నిర్దేశ చట్రము మొదటి దానితో సాపేక్షంగా స్థిరవేగంతో చలిస్తున్నది.
అనగా ఆ రెండు చట్రముల మధ్య త్వరణము సున్న. కేవలం ఆ రెంటి మధ్య కొంత దశాభేదం ఉండవచ్చు. ఈ పరిస్థితులలో ఆ రెండు చట్రాలు ఒకేరకమైన నిర్దేశ చట్రాలను కలిగి ఉంటాయి. ఆ రెండు (1) జడత్వ నిర్దేశ చట్రంలో ఉండవచ్చు లేదా ఆ రెండు (2) సమానమైన త్వరణ నిర్దేశచట్రంలో ఉండవచ్చు. ఎందుకనగా సాపేక్ష త్వరణము సున్నకావున.
పై వివరణను బట్టి ఆ రెండు వ్యవస్థలు ఒకే రకమైన నిర్దేశ చట్రంలో వున్నాయి. తుల్యతా నియమం ప్రకారము ఒకేరకమైన వ్యవస్థలో జరిపిన ప్రయోగాలు ఒకేరకమైన ఫలితాన్ని ఇస్తాయి. కావున మొదటి నిర్దేశక చట్రంలో వస్తువు గమనము పరావలయమైతే రెండవ నిర్దేశ చట్రంలో కూడా దాని గమనపథము పరావలయమే అవుతుంది.

Exam Tips:

a) సాపేక్ష త్వరణం సున్న అయ్యే చట్రాలు (జడత్వ చట్రాలు) అని, భౌతిక నియమాలు రెండింటిలో ఒకటేనని ముగించండి.

 

Question 10: నిశ్చలస్థితిలో ఉన్న వస్తువుపై 2i + j – k న్యూటన్ల బలం పనిచేస్తుంది. 20 సెకనుల చివర వస్తువు వేగం 4i + 2j – 2k ms⁻¹ అయితే ఆ వస్తువు ద్రవ్యరాశి ఎంత ?

Answer:

బలము F = 2i + j – k, కాలము t = 20
తొలి వేగము Vₒ = 0
తుది వేగము V = 4i + 2j – 2k
∴ త్వరణము \( a = \frac{\mathrm{V}-\mathrm{V}_0}{\mathrm{t}}=\frac{4 \mathrm{i}+2 \mathrm{j}-2 \mathrm{k}}{20}=\frac{2(2 \mathrm{i}+\mathrm{j}- \mathrm{k})}{10} \)
వస్తువు ద్రవ్యరాశి \( m = \frac{F}{a}=\frac{2 i+j-k}{(2 i+j-k) / 10} = 10 \) కి.గ్రా.

Exam Tips:

a) \( a=(v-u)/t \) తో త్వరణం కనుక్కొని m=F/a; సదిశలు ఒకే దిశలో ఉన్నాయి కావున నిష్పత్తి 10 kg.

 

లెక్కలు

Question 1: ఓడ B కి ఓడ A పశ్చిమ దిశలో 10 km దూరంలో ఉంది. ఓడ A నేరుగా ఉత్తర దిక్కువైపు 30 km/h వడితో వెళుతుంటే, ఓడ B ఉత్తర దిశతో పడమరవైపు 60° కోణం చేస్తూ 20 km/h వడితో వెళుతుంది.
(i) ఓడ A కి సాపేక్షంగా ఓడ B వేగ పరిమాణాన్ని, దిశను కనుక్కోండి.
(ii) రెండింటి మధ్య అత్యంత సమీప దూరం (closest approach) ఎంత ?

Answer:

A వేగము = 30 km/h ఉత్తరం వైపు ∴ \( \overline{V}_A = 30\hat{j} \)
B వేగము = 20 km/h, ఉత్తర దిశ నుండి పడమరవైపు 60°
∴ \( \overline{V}_B = -20\sin 60^{\circ}\,\hat{i} + 20\cos 60^{\circ}\,\hat{j} = -10\sqrt{3}\,\hat{i}+10\,\hat{j} \)
A తో పోల్చితే B వేగము \( \overline{V}_{BA} = \overline{V}_B - \overline{V}_A = -10\sqrt{3}\,\hat{i}+10\,\hat{j}-30\,\hat{j} = -10\sqrt{3}\,\hat{i}-20\,\hat{j} \)
\( |\overline{V}_{BA}| = \sqrt{100 \times 3+400} = 10\sqrt{7} \) km/h ≈ 26.5 km/h.
దిశ : \( \tan φ = \frac{20}{10\sqrt{3}} = \frac{2}{\sqrt{3}} \) ⇒ φ ≈ 49°; అనగా పశ్చిమం నుండి దక్షిణం వైపు సుమారు 49° (నైరుతి దిశ).

అతి తక్కువ దూరము:
త్రిభుజం ABN నుండి అతి తక్కువ దూరము AN = AB sin θ
కాని AB = 10 km మరియు \( \sin θ = \frac{20}{10\sqrt{7}} \)
∴ \( AN = 10 × \frac{20}{10 \sqrt{7}}=\frac{20}{\sqrt{7}} ≈ 7.56 \) km

Exam Tips:

a) ముందు \( V_B \) అంశాలు రాసి \( V_{BA}=V_B-V_A \) తీసుకోండి; అతి సమీప దూరం = AB sin θ అని వాడండి.

 

Question 2: ప్రక్షేపక కోణం θ, వ్యాప్తి R, గరిష్ఠ ఎత్తు h, ప్రయాణ కాలం T అయితే (a) \( \tan θ = 4h/R \), (b) \( h = gT^2/8 \) అని చూపండి.

Answer:

(a) ప్రక్షేపక కోణము = θ, వ్యాప్తి \( R = \frac{u^2 \sin 2θ}{g} \), గరిష్ఠ ఎత్తు \( h = \frac{u^2 \sin^2 θ}{2g} \)
\( \frac{h}{R} = \frac{u^2\sin^2 θ}{2g} \times \frac{g}{u^2 \sin 2θ} = \frac{\sin^2 θ}{2\sin 2θ} = \frac{\sin θ\,\sin θ}{2 \times 2\sin θ\cos θ} = \frac{\tan θ}{4} \)
\( \therefore \tan θ = \frac{4h}{R} \)
(b) \( h = \frac{u^2 \sin^2 θ}{2g} \) మరియు \( T = \frac{2u\sin θ}{g} \Rightarrow \frac{u\sin θ}{g} = \frac{T}{2} \)
\( \therefore h = \frac{u^2 \sin^2 θ}{2g^2}\cdot g = \frac{g}{2}\left(\frac{u\sin θ}{g}\right)^2 = \frac{g}{2}\left(\frac{T}{2}\right)^2 = \frac{gT^2}{8} \)

Exam Tips:

a) h/R నిష్పత్తి తీసుకొని sin 2θ = 2 sin θ cos θ వాడండి; (b) లో \( T=2u\sin θ/g \) నుండి \( u\sin θ/g=T/2 \) ప్రతిక్షేపించండి.

 

Question 3: క్షితిజ సమాంతరంతో 60° కోణం చేస్తూ 800 m/s తొలి వేగంతో ఒక ప్రక్షేపకాన్ని పేల్చారు :
(i) భూమిని తాకే ముందు ప్రక్షేపకం ప్రయాణ కాలం కనుక్కోండి.
(ii) అది భూమిని తాకే ముందు ప్రయాణించిన దూరాన్ని (వ్యాప్తి) కనుక్కోండి.
(iii) గరిష్ఠ ఎత్తుకు చేరుకోడానికి పట్టే ప్రయాణ కాలాన్ని కనుక్కోండి.

Answer:

ప్రక్షేపక కోణము θ = 60°, తొలివేగము u = 800 m/s, g = 9.8 m/s²
(i) పలాయన కాలము \( T = \frac{2u\sin θ}{g} = \frac{2 \times 800}{9.8}\times\frac{\sqrt{3}}{2} = \frac{800 \times 1.732}{9.8} = 141.4 \) s
(ii) వ్యాప్తి \( R = \frac{u^2 \sin 2θ}{g} = \frac{800 \times 800 \times \sin(2 \times 60^{\circ})}{9.8} = \frac{800 \times 800}{9.8}\times\frac{\sqrt{3}}{2} = \frac{800 \times 800}{9.8} \times 0.8660 \approx 56{,}555\ \text{m} = 56.56 \) km
(iii) గరిష్ఠ ఎత్తు చేరటానికి పట్టిన కాలము = T/2
\( T_1 = \frac{2u\sin θ}{2g}=\frac{u\sin θ}{g}=\frac{800\sin 60^{\circ}}{9.8} = \frac{800 \times 0.8660}{9.8} = 70.7 \) s

Exam Tips:

a) T = 2u sin θ / g, R = u² sin 2θ / g, గరిష్ఠ ఎత్తుకు పట్టే కాలం T/2 — మూడు సూత్రాలనూ వేర్వేరుగా రాయండి.
b) sin 60° = 0.866 విలువను జాగ్రత్తగా వాడండి.

 

Question 4: భూమికి ఏటవాలుగా ప్రక్షిప్తం చేసిన కణం తన పథంలో గరిష్ఠ బిందువు దగ్గర ఉన్నప్పుడు ప్రక్షేపణ బిందువు దృష్ట్యా దాని స్థాన సదిశ పరిమాణం అది చేరుకొనే గరిష్ఠ ఎత్తుకు \( \sqrt{2} \) రెట్లు ఉన్నట్లయితే ప్రక్షేపక కోణం \( \tan^{-1}(2) \) అని చూపండి.

Answer:

గరిష్ఠ బిందువు వద్ద కణం స్థాన సదిశ అంశాలు : క్షితిజ సమాంతరంగా \( R/2 \), నిలువుగా \( h_{max} \).
ప్రశ్న ప్రకారం \( \sqrt{\left(\frac{R}{2}\right)^2 + h_{max}^2} = \sqrt{2}\,h_{max} \)
\( \Rightarrow \frac{R^2}{4} = h_{max}^2 \Rightarrow \frac{R}{2} = h_{max} \)
\( \frac{1}{2}\cdot\frac{u^2 \sin 2θ}{g} = \frac{u^2 \sin^2 θ}{2g} \)
\( \therefore 2\sin θ\cos θ = \sin^2 θ \Rightarrow \tan θ = 2 \)
∴ ప్రక్షేపక కోణము \( θ = \tan^{-1}(2) \)

Exam Tips:

a) గరిష్ఠ బిందువు వద్ద స్థాన సదిశ అంశాలు (R/2, h) అని రాసి పరిమాణ షరతు వాడితే R/2 = h వస్తుంది.

 

Question 5: భూమికి 20 m ఎత్తున ఉన్న శిఖరంపై నుంచి వస్తువును క్షితిజ సమాంతరానికి 30° కోణంతో 30 m/s తొలివేగంతో ప్రయోగించారు. భూమిపై దిగే ముందు క్షితిజ సమాంతరంగా వస్తువు ఎంత దూరం ప్రయాణిస్తుంది ? (g = 10 m/s²)

Answer:

శిఖరం ఎత్తు = 20 m, ప్రక్షేపక కోణము θ = 30°, ప్రక్షేపక వేగము u = 30 m/s
క్షితిజ సమాంతర దిశలో ప్రయాణించిన మొత్తం దూరము = OC = OB′ + B′C
(a) OB′ = AB = వ్యాప్తి \( R = \frac{u^2 \sin 2θ}{g} = \frac{30 \times 30 \sin 60^{\circ}}{10}=90 \times \frac{\sqrt{3}}{2}=45 \sqrt{3} \) …(1)

(b) దూరము B′C = B వద్ద నుండి భూమిని చేరేవరకు క్షితిజ సమాంతరంగా ప్రయాణించిన దూరం = \( u\cos θ \cdot t \)
\( u\cos θ = 30 \cdot \frac{\sqrt{3}}{2}=15 \sqrt{3} \)
B వద్ద వేగం క్రిందివైపు 30 sin 30° = 15 m/s, ఎత్తు 20 m. భూమిని తాకుటకు పట్టిన కాలము t = ?
\( 20 = 15 t + \frac{10}{2} t^2 \Rightarrow 5t^2 + 15t - 20 = 0 \)
లేదా \( t^2 + 3t - 4 = 0 \) లేదా \( (t + 4)(t - 1) = 0 \)
∴ t = −4 లేదా t = 1. t ఋణాత్మకంగా ఉండదు కావున t = 1 s.
∴ \( B′C = u\cos θ \cdot t = 15\sqrt{3} \) m …(2)
భూమిపై దిగే ముందు క్షితిజ సమాంతరంగా వస్తువు ప్రయాణించిన మొత్తం దూరం \( = 45\sqrt{3} + 15\sqrt{3} = 60\sqrt{3} \) m ≈ 104 m.

Exam Tips:

a) చలనాన్ని రెండు భాగాలుగా విడగొట్టండి: A→B (సమాన స్థాయి వ్యాప్తి) మరియు B→భూమి (కిందికి 15 m/s తొలివేగం, 20 m ఎత్తు).
b) రెండవ భాగంలో వర్గ సమీకరణంలో ఋణ కాలాన్ని తిరస్కరించండి.

 

Question 6: నేలపై O బిందువును మూల బిందువుగా తీసుకోవడమైంది. ఒక వస్తువు ముందు ఈశాన్య (North-East) దిశలో \( 10\sqrt{2} \) m స్థానభ్రంశాన్ని, ఆ తరవాత ఉత్తర దిశలో 10 m, పిమ్మట \( 10\sqrt{2} \) m వాయువ్య దిశలో పొందింది. మూల బిందువు నుంచి అది ఎంత దూరంలో ఉంది ?

Answer:

a) \( 10\sqrt{2} \) m ఈశాన్య దిశ
b) 10 m ఉత్తర దిశ
c) \( 10\sqrt{2} \) m వాయువ్య దిశ
పటములో మూలబిందువు ‘O’ నుండి మొత్తం స్థానభ్రంశము = OC
ఈశాన్యంలో \( 10\sqrt{2} \) m = (10 m తూర్పు, 10 m ఉత్తరం), వాయువ్యంలో \( 10\sqrt{2} \) m = (10 m పడమర, 10 m ఉత్తరం).
కావున తూర్పు-పడమర అంశాలు రద్దవుతాయి. OC = OA′ + A′B′ + B′C = 10 + 10 + 10 = 30 m (ఉత్తర దిశలో).

Exam Tips:

a) ఈశాన్య, వాయువ్య దిశల తూర్పు-పడమర అంశాలు రద్దవుతాయి; ఉత్తర అంశాలు కూడండి.

 

Question 7: భూమిపై ఒక బిందువు నుంచి తొలి వేగం u తో కణాన్ని క్షితిజ సమాంతర వ్యాప్తి గరిష్ఠం అయ్యే విధంగా ప్రక్షిప్తం చేశారు. దాని ఆరోహణ క్రమంలో (ascent) ఉండే సగటు వేగం పరిమాణాన్ని కనుక్కోండి.

Answer:

ప్రక్షేపక వేగము = u. వ్యాప్తి గరిష్ఠము ⇒ θ = 45°
ఆరోహణ కాలంలో x-దిశలో వేగం మారదు : \( u_x = v_x = u\cos θ = \frac{u}{\sqrt{2}} \) …(1)
y-దిశలో తొలివేగం \( u_y = u\sin θ = \frac{u}{\sqrt{2}} \), గరిష్ఠ ఎత్తు వద్ద \( v_y = 0 \)
y-దిశలో సగటు వేగము \( = \frac{u_y+v_y}{2} = \frac{u}{2\sqrt{2}} \) …(2)
ఆరోహణ కాలంలో సగటు వేగము \( = \sqrt{\left(\frac{u}{\sqrt{2}}\right)^2+\left(\frac{u}{2\sqrt{2}}\right)^2} = \sqrt{\frac{u^2}{2}+\frac{u^2}{8}}=\sqrt{\frac{5u^2}{8}}=\frac{u\sqrt{5}}{2\sqrt{2}} \)

Exam Tips:

a) గరిష్ఠ వ్యాప్తికి θ = 45°; ఆరోహణలో x-వేగం స్థిరం, y-వేగం సగటు \( u_y/2 \); రెండు అంశాల పరిమాణం కలపండి.

 

Question 8: భూమిపై నుంచి ఒక కణాన్ని కొంత తొలివేగంతో క్షితిజ సమాంతరానికి 45° కోణంతో ప్రక్షిప్తం చేశారు. అది క్షితిజ సమాంతరంగా 10 m దూరం ప్రయాణించేంతలో, భూమి నుండి 7.5 m ఎత్తుకు చేరుతుంది. ప్రక్షేపకం తొలి వడి ఎంత ? (g = 10 m/s²)

Answer:

ప్రక్షేపక కోణము θ = 45°, క్షితిజ సమాంతర దూరము x = 10 m, నిలువు ఎత్తు y = 7.5 m
పథ సమీకరణం \( y = x\tan θ - \frac{g x^2}{2u^2\cos^2 θ} \)
θ = 45° కావున \( \tan θ = 1,\ \cos^2 θ = \frac{1}{2} \)
\( 7.5 = 10 - \frac{10 \times 10^2}{2u^2 \times \frac{1}{2}} = 10 - \frac{1000}{u^2} \)
\( \Rightarrow \frac{1000}{u^2} = 2.5 \Rightarrow u^2 = \frac{1000}{2.5} = 400 \)
∴ u² = 400 ⇒ u = 20 m/s

Exam Tips:

a) పథ సమీకరణం \( y=x\tan θ-\frac{gx^2}{2u^2\cos^2θ} \) లో విలువలు ప్రతిక్షేపించడం సులభమైన పద్ధతి.

 

Question 9: దక్షిణ దిశ నుంచి 5 m/s వేగంతో గాలి వీస్తుంది. ఒక సైకిల్ తొక్కే వ్యక్తికి అది 5 m/s వేగంతో తూర్పు దిశ నుంచి వీస్తుందనిపిస్తుంది. సైకిల్ తొక్కే వ్యక్తి ఈశాన్య దిశలో \( 5\sqrt{2} \) m/s వేగంతో ప్రయాణిస్తున్నాడని చూపించండి.

Answer:


1. గాలి వేగము దక్షిణం నుండి ఉత్తరం వైపు 5 m/s : \( \overline{v}_w = 5\hat{j} \)
2. సైకిలిస్ట్ భావించిన వేగము = సాపేక్ష వేగము = 5 m/s తూర్పు నుండి పడమరవైపు : \( \overline{v}_{wc} = -5\hat{i} \)
3. సైకిలిస్ట్ వేగము \( \overline{v}_c = \overline{v}_w - \overline{v}_{wc} = 5\hat{j}+5\hat{i} \)
∴ సైకిలిస్ట్ వేగము \( = \sqrt{5^2+5^2} = 5\sqrt{2} \) m/s, ఈశాన్య దిశలో.

Exam Tips:

a) \( v_{wc}=v_w-v_c \) సూత్రం వాడి సైకిలిస్ట్ వేగం \( v_c=v_w-v_{wc} \) రాబట్టండి; దిశల (ఉత్తర, తూర్పు) గుర్తులు జాగ్రత్త.

 

Question 10: 4 m/s తో నడుస్తున్న మనిషి వాన బిందువులు ఏటవాలుగా తన ముఖంపై 4 m/s వడితో నిట్టనిలువుతో 30° కోణం చేస్తూ పడుతున్నాయని గమనించాడు. వాన బిందువు వాస్తవ వడి 4 m/s అని చూపండి.

Answer:

మనిషి వేగము \( \overline{v}_A = 4\hat{i} \) m/s
మనిషికి వాన చినుకుల సాపేక్ష వేగం = 4 m/s, నిట్టనిలువుతో 30° (ఇది సాపేక్ష వేగం)
∴ \( \overline{v}_R = \overline{v}_B - \overline{v}_A = -4\sin 30^{\circ}\,\hat{i} - 4\cos 30^{\circ}\,\hat{j} = -2\hat{i} - 2\sqrt{3}\,\hat{j} \)
ఇందులో \( \overline{v}_B \) వాన చినుకుల నిజవేగము.
\( \overline{v}_B = \overline{v}_R + \overline{v}_A = -2\hat{i} - 2\sqrt{3}\,\hat{j}+4\hat{i} = 2\hat{i} - 2\sqrt{3}\,\hat{j} \)
\( |\overline{v}_B| = \sqrt{4+4 \times 3}=\sqrt{16} = 4 \) m/s

Exam Tips:

a) సాపేక్ష వేగం \( v_R=v_B-v_A \) అని రాసి వాన వాస్తవ వేగం \( v_B=v_R+v_A \); అంశాల గుర్తులను (కిందికి ఋణం) సరిగా తీసుకోండి.

 

ముఖ్యమైన ఉదాహరణ లెక్కలు

Question 1: 35 m/s వడితో వాన నిట్టనిలువుగా పడుతోంది. కొంతసేపటి తరువాత 12 m/s వడితో గాలి తూర్పు నుంచి పడమర దిశగా వీచడం ప్రారంభించింది. బస్ స్టాప్‌లో వేచి ఉన్న బాలుడు వాన మీద పడకూడదు అంటే గొడుగును ఏ దిశలో పట్టుకోవాలి ?

Answer:

పటంలో వాన, గాలి వేగ సదిశలను వరుసగా \( v_r, v_w \) లతో సమస్యలో ఇచ్చిన దిశలో చూపించడమైనది. సదిశల సంకలన నియమం ద్వారా \( v_r, v_w \) ల ఫలిత సదిశ R పటంలో చూపిన విధంగా ఉంటుంది. R పరిమాణాన్ని కింది విధంగా లెక్కించవచ్చు.
\( R = \sqrt{v_r^2+v_w^2}=\sqrt{35^2+12^2}\ \text{m s}^{-1} = 37\ \text{m s}^{-1} \)
నిట్టనిలువుతో ఫలిత సదిశ R చేసే కోణం θ ను కింది విధంగా రాయవచ్చు.
\( \tan θ = \frac{v_w}{v_r}=\frac{12}{35} = 0.343 \)
లేదా \( θ = \tan^{-1}(0.343) \approx 19^{\circ} \)
కాబట్టి, నిట్టనిలువుతో తూర్పుదిశ వైపు 19° కోణం చేసే విధంగా గొడుగు పట్టుకొని నిలబడాలి.

Exam Tips:

a) వాన, గాలి వేగాల ఫలితం R చేసే కోణం \( \tan θ=v_w/v_r \); గొడుగు ఆ దిశలోనే పట్టాలి.

 

Question 2: ఒక మోటారు బోటు ఉత్తర దిశవైపు 25 km/h వేగంతో దూసుకుపోతోంది. అక్కడ నీటి ప్రవాహం 10 km/h వేగం కలిగి దక్షిణం దిశతో 60° కోణం చేస్తూ తూర్పువైపుకు ఉంది. బోటు ఫలితవేగాన్ని కనుక్కోండి.

Answer:

మోటారు బోటు వేగాన్ని \( v_b \) తో, నీటి ప్రవాహ వేగాన్ని \( v_c \) తో సమస్యలో ఇచ్చిన దిశలలో పటంలో చూపించడమైంది. సమాంతర చతుర్భుజ సంకలన నియమం ప్రకారం ఫలిత సదిశ R దిశ పటంలో చూపించిన విధంగా ఉంటుంది. కొసైన్ల న్యాయం ప్రకారం R పరిమాణాన్ని కింది విధంగా రాబట్టవచ్చు.
\( R = \sqrt{v_b^2+v_c^2+2v_b v_c\cos 120^{\circ}} = \sqrt{25^2+10^2+2\times 25\times 10\times(-1/2)} \approx 22 \) km/h
ఫలిత సదిశ దిశను కనుక్కోడానికి సైన్‌ల న్యాయాన్ని అనుసరించగా
\( \frac{R}{\sin θ} = \frac{v_c}{\sin φ} \) లేదా \( \sin φ = \frac{v_c}{R}\sin θ = \frac{10\times\sin 120^{\circ}}{21.8} = \frac{10\sqrt{3}}{2\times 21.8} \approx 0.397 \)
∴ φ ≈ 23.4° (ఉత్తరం నుండి తూర్పువైపు)

Exam Tips:

a) ఫలిత వేగానికి కొసైన్ న్యాయంలో కోణం 120° (cos 120° = −1/2) తీసుకోండి; దిశకు సైన్ న్యాయం వాడండి.

 

Question 3: ఒక కణం స్థానాన్ని \( \overline{r} = 3.0 t\,\hat{i}+2.0 t^2\,\hat{j}+5.0\,\hat{k} \) సూచిస్తుంది. ఇక్కడ t సెకనులలో, r మీటర్లలో ఉండే విధంగా గుణకాలు సరైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. కణం యొక్క (a) v(t), a(t) లను కనుక్కోండి. (b) t = 1.0 s వద్ద v(t) పరిమాణం, దిశను కనుక్కోండి.

Answer:

(a) \( \overline{v}(t) = \frac{d\overline{r}}{dt} = \frac{d}{dt}\left(3.0t\,\hat{i}+2.0t^2\,\hat{j}+5.0\,\hat{k}\right) = 3.0\,\hat{i}+4.0t\,\hat{j} \)
\( \overline{a}(t) = \frac{d\overline{v}}{dt} = 4.0\,\hat{j} \)
\( a = 4.0\ \text{m s}^{-2} \), దీని దిశ y-అక్షం వెంబడి ఉంటుంది.
(b) t = 1.0 s వద్ద \( \overline{v} = 3.0\,\hat{i}+4.0\,\hat{j} \)
దీని పరిమాణం \( v = \sqrt{3^2+4^2} = 5.0\ \text{m s}^{-1} \)
దిశ \( θ = \tan^{-1}\left(\frac{v_y}{v_x}\right) = \tan^{-1}\left(\frac{4}{3}\right) \approx 53^{\circ} \), x-అక్షంతో.

Exam Tips:

a) v = dr/dt, a = dv/dt; విలువలు ప్రతిక్షేపించి పరిమాణం మరియు \( \tan^{-1}(v_y/v_x) \) తో దిశ చెప్పండి.

 

Question 4: కాలం t = 0 వద్ద మూలబిందువు దగ్గర నుంచి బయలుదేరిన కణం \( 5.0\,\hat{i} \) m/s వేగంతో x-y తలంలో ప్రయోగించిన బలం వల్ల స్థిర త్వరణం \( (3.0\,\hat{i}+2.0\,\hat{j}) \) m/s² పొంది చలిస్తుంది. (a) x-నిరూపకం 84 m అయినప్పుడు కణం y-నిరూపకం ఎంత ? (b) ఈ కాలం వద్ద కణం వడి ఎంత ?

Answer:

కణం స్థానాన్ని కింది విధంగా రాయవచ్చు.
\( \overline{r}(t) = \overline{v}_0 t + \frac{1}{2}\overline{a}t^2 = 5.0\,\hat{i}\,t+\frac{1}{2}(3.0\,\hat{i}+2.0\,\hat{j})\,t^2 = (5.0t+1.5t^2)\,\hat{i}+1.0\,t^2\,\hat{j} \)
కాబట్టి \( x(t) = 5.0t + 1.5t^2 \), \( y(t) = +1.0t^2 \)
x(t) = 84 m గా ఇచ్చారు. అప్పుడు t = ?
\( 5.0t + 1.5t^2 = 84 \Rightarrow t = 6 \) s
t = 6 s అయినప్పుడు, \( y = 1.0\,(6)^2 = 36.0 \) m
ఇప్పుడు వేగం \( \overline{v} = \frac{d\overline{r}}{dt} = (5.0 + 3.0t)\,\hat{i}+2.0t\,\hat{j} \)
t = 6 s అయినపుడు \( \overline{v} = 23.0\,\hat{i}+12.0\,\hat{j} \)
వడి \( = |\overline{v}| = \sqrt{23^2+12^2} \approx 26\ \text{m s}^{-1} \).

Exam Tips:

a) స్థిర త్వరణ సూత్రం \( r=v_0t+\frac12at^2 \) ను అంశాలుగా విడగొట్టండి; x=84 నుండి t=6 s తీసి y, వడి లెక్కించండి.

 

Question 5: వాన నిట్టనిలువుగా 35 m/s వడితో పడుతోంది. ఒక మహిళ 12 m/s వేగంతో తూర్పు నుండి పశ్చిమ దిశలో సైకిల్‌పై వెళుతుంది. ఆమె ఏ దిశలో గొడుగును పట్టుకోవాలి ?

Answer:

పటంలో \( v_r \) వాన వేగాన్ని, \( v_b \) మహిళ తొక్కుతున్న సైకిల్ వేగాన్ని సూచిస్తాయి. ఈ రెండు వేగాలు కూడా భూమి దృష్ట్యానే. మహిళ సైకిల్ తొక్కుతుంది కాబట్టి, ఆమె దృష్ట్యా వాన వేగం, అంటే సైకిల్ వేగానికి సాపేక్షంగా వాన వేగం అని అర్థం. అంటే \( v_{rb} = v_r - v_b \)

ఈ సాపేక్ష వేగ సదిశ పటంలో చూపినట్లు నిట్టనిలువుతో θ కోణం చేస్తుంది.
\( \tan θ = \frac{v_b}{v_r}=\frac{12}{35} = 0.343 \)
లేదా \( θ \approx 19^{\circ} \)
అంటే మహిళ పడమర దిశలో నిట్టనిలువుతో 19° కోణం చేస్తూ గొడుగును పట్టుకోవాలి.

Exam Tips:

a) సైకిల్ దృష్ట్యా వాన వేగం \( v_{rb}=v_r-v_b \); గొడుగు సైకిల్ నడిచే వైపుకే వంగాలి.

 

Question 6: భూమికి 490 m ఎత్తున ఉన్న శిఖరం పైనుంచి ఒక పర్వతారోహకుడు రాయిని 15 m s⁻¹ తొలివేగంతో క్షితిజ సమాంతరంగా విసిరాడు. గాలి నిరోధాన్ని ఉపేక్షించి, రాయి నేలను తాకేందుకు పట్టే కాలాన్ని, అది నేలను తాకే వేగాన్ని కనుక్కోండి. (g = 9.8 m s⁻² గా తీసుకోండి).

Answer:

శిఖర శీర్షాన్ని మూల బిందువుగా తీసుకొని x-, y-అక్షాలను ఊహించండి. రాయిని t = 0 s వద్ద విసిరాడు అనుకొందాం. తొలి వేగం దిశలో ధన X అక్షం దిశ, నిట్టనిలువు ఊర్ధ్వదిశలో ధన y అక్షం దిశ ఉందనుకొందాం. x-, y-చలన అంశాలను స్వతంత్ర అంశాలుగా పరిగణించవచ్చు. ఇప్పుడు చలన సమీకరణాలు :
x(t) = x₀ + v₀ₓt
y(t) = y₀ + voyt + (1/2)ay t²
ఇక్కడ, x₀ = y₀ = 0, v0y = 0, ay = -g = -9.8 ms⁻²
v₀ₓ = 15 ms ⁻¹.
y(t) = -490 m అయినప్పుడు రాయి నేలను తాకుతుంది.
– 490 m = – (1/2) (9.8) t ². దీనిని సాధించగా, t = 10 s,
వేగాంశాలు vₓ = v₀ₓ, vy = v0y – g t
రాయి నేలను తాకే సందర్భంలో:
v₀ₓ = 15 m s⁻¹ ; v0y = 0 – 9.8 × 10 = -98 m s⁻¹
కాబట్టి, నేలను రాయి తాకే వడి
\( \sqrt{v_{\mathrm{x}}^2+v_{\mathrm{y}}^2}=\sqrt{15^2+98^2} = 99 ms⁻¹ \)

Exam Tips:

a) క్షితిజ, లంబ చలనాలను స్వతంత్రంగా తీసుకోండి; క్షితిజ వేగం స్థిరం, లంబ వేగం \( v_y=-gt \); చివరగా \( \sqrt{v_x^2+v_y^2} \).

 

Question 7: క్షితిజ సమాంతరంతో 30° కోణం చేస్తూ ఒక క్రికెట్ బంతిని 28 m s⁻¹ వేగంతో విసిరారు. కింది వాటిని లెక్కించండి. (a) గరిష్ఠ ఎత్తు, (b) బంతి తిరిగి అదే స్థాయికి రావడానికి పట్టే కాలం, (c) బంతి విసిరిన స్థానం నుంచి బంతి తిరిగి అదే స్థాయికి చేరిన స్థానానికి మధ్య దూరం.

Answer:

(a) గరిష్ఠ ఎత్తు
\( h_m = \frac{(v_0 \sin θ_0)^2}{2g}=\frac{(28 \sin 30^{\circ})^2}{2(9.8)}\ \text{m} = \frac{14 \times 14}{2 \times 9.8} = 10.0 \) m
(b) బంతి తిరిగి అదే స్థాయికి రావడానికి పట్టిన కాలం \( T = \frac{2 v_0 \sin θ_0}{g} = \frac{2 \times 28 \times \sin 30^{\circ}}{9.8} = \frac{28}{9.8} = 2.9 \) s
(c) బంతి విసిరిన స్థానం నుంచి బంతి తిరిగి అదే స్థాయికి చేరిన స్థానానికి మధ్య దూరం (వ్యాప్తి)
\( R = \frac{v_0^2 \sin 2θ_0}{g}=\frac{28 \times 28 \times \sin 60^{\circ}}{9.8} = 69 \) m

Exam Tips:

a) గరిష్ఠ ఎత్తుకు h = (v₀ sin θ)²/2g, కాలానికి T = 2v₀ sin θ/g, దూరానికి R = v₀² sin 2θ/g — ఒకే విలువల సెట్‌తో మూడూ లెక్కించండి.

 

Question 8: 12 cm వ్యాసార్ధం ఉన్న వృత్తాకార గాడిలో ఇరుక్కొన్న కీటకం 100 s కాలంలో నిలకడగా 7 పరిభ్రమణాలు పూర్తి చేసింది. (a) కీటకం కోణీయ వడి, రేఖీయ వడి ఎంత ? (b) త్వరణ సదిశ స్థిర సదిశేనా ? దాని పరిమాణం ఎంత ?

Answer:

ఏకరీతి వృత్తాకార చలనానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ R = 12 cm. కోణీయ వడి ω ని ఇలా రాబట్టవచ్చు.
\( ω = 2πν = 2π \times \frac{7}{100} = 0.44\ \text{rad s}^{-1} \)
రేఖీయ వడి v :
\( v = ωR = 0.44\ \text{s}^{-1} \times 12\ \text{cm} = 5.3\ \text{cm s}^{-1} \)
వేగ సదిశ \( \overline{v} \) వృత్తంపై ప్రతీ బిందువు వద్ద స్పర్శరేఖ దిశలో ఉంటుంది. త్వరణం వృత్త కేంద్రం వైపు ఉంటుంది. ఇక్కడ త్వరణం దిశ నిరంతరం మారుతుంది కాబట్టి అది స్థిర సదిశ కాదు. త్వరణం పరిమాణం మాత్రం స్థిరం.
\( a = ω^2R = (0.44\ \text{s}^{-1})^2 (12\ \text{cm}) = 2.3\ \text{cm s}^{-2} \)

Exam Tips:

a) ω = 2πν, v = ωR, a = ω²R; త్వరణం పరిమాణం స్థిరం కానీ దిశ మారుతుంది కావున సదిశ స్థిరం కాదు.

 

అదనపు లెక్కలు

Question 1: కింద ఇచ్చిన రాశులు సదిశలా లేదా అదిశలా తెలపండి. ఘనపరిమాణం, ద్రవ్యరాశి, వడి, త్వరణం, సాంద్రత, మోల్ల సంఖ్య, వేగం, కోణీయ పౌనఃపున్యం, స్థానభ్రంశం, కోణీయ వేగం.

Answer:

అదిశ రాశులు : ఘనపరిమాణము, ద్రవ్యరాశి, వడి, సాంద్రత, మోల్ల సంఖ్య, కోణీయ పౌనఃపున్యము.
సదిశ రాశులు : త్వరణము, వేగము, స్థానభ్రంశము, కోణీయ వేగము.

Exam Tips:

a) పరిమాణం మాత్రమే ఉంటే అదిశ; దిశ కూడా ఉండి సదిశ నియమాలు పాటిస్తే సదిశ — రెండు జాబితాలుగా స్పష్టంగా రాయండి.

 

Question 2: కింద ఇచ్చిన జాబితాలో రెండు అదిశరాశులను ఎంపిక చేయండి. బలం, కోణీయ ద్రవ్యవేగం, పని, విద్యుత్ ప్రవాహం, రేఖీయ ద్రవ్యవేగం, విద్యుత్ క్షేత్రం, సగటు వేగం, అయస్కాంత భ్రామకం, సాపేక్ష వేగం.

Answer:

ఇచ్చిన వాటిలో పని మరియు విద్యుత్ ప్రవాహము అదిశరాశులు.

Exam Tips:

a) పని, విద్యుత్ ప్రవాహం అదిశలు — విద్యుత్ ప్రవాహానికి దిశ ఉన్నా అది సదిశ నియమాలు పాటించదని గుర్తుంచుకోండి.

 

Question 3: కింద ఇచ్చిన జాబితాలో సదిశరాశి ఉన్నది. దానిని ఎంపిక చేయండి. ఉష్ణోగ్రత, పీడనం, ప్రచోదనం, కాలం, సామర్థ్యం, మొత్తం పథం పొడవు, శక్తి, గురుత్వ పొటెన్షియల్, ఘర్షణ గుణకం, విద్యుదావేశం.

Answer:

ఇచ్చిన వాటిలో సదిశరాశి ప్రచోదనము. ఇది బలము మరియు కాలముల లబ్ధము. ఇది ద్రవ్యవేగంలో మార్పుకు సమానము కావున సదిశరాశి.

Exam Tips:

a) ప్రచోదనం = బలం × కాలం = ద్రవ్యవేగ మార్పు; బలం సదిశ కావున ప్రచోదనం సదిశ.

 

Question 4: కింది ఇచ్చిన సదిశ, అదిశ రాశుల మధ్య జరిగే బీజగణిత పరిక్రియలు అర్థవంతమైనవో, కావో కారణాలతో వివరించండి.
(a) ఏవైనా రెండు అదిశల సంకలనం,
(b) ఒకే మితులు ఉన్న అదిశను సదిశకు సంకలనం చేయడం,
(c) ఏదైనా సదిశను ఏదైనా అదిశతో గుణించడం,
(d) ఏవైనా రెండు అదిశలను గుణించడం,
(e) ఏవైనా రెండు సదిశలను సంకలనం చేయడం,
(f) ఒక సదిశ అంశాన్ని అదే సదిశకు సంకలనం చేయడం.

Answer:

a) అర్థవంతమైనదే, కానీ రెండు అదిశలకు ఒకే మితులు (ఒకే భౌతిక రాశి) ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకనగా సంకలనం సజాతి రాశుల మధ్య మాత్రమే సాధ్యం.
b) అర్థవంతమైనది కాదు. అదిశను సదిశకు కలపడం సాధ్యపడదు, మితులు సమానమైనా అవి భిన్న స్వభావం గల రాశులు.
c) అర్థవంతమైనది. సదిశను అదిశతో గుణించవచ్చు.
ఉదా : ద్రవ్యరాశి × త్వరణము = బలము
d) అర్థవంతమైనది. రెండు అదిశలను గుణించవచ్చు.
ఉదా : పని = సామర్థ్యము × కాలము
e) అర్థవంతమైనదే, కానీ ఒకే భౌతిక రాశులైన (ఒకే మితి గల) సదిశలను మాత్రమే సంకలనం చేయగలము.
f) అర్థవంతమైనది. ఎందుకనగా ఒక సదిశ అంశం కూడా అదే మితిని గల సదిశ కావున.

Exam Tips:

a) ప్రతి భాగానికీ "అర్థవంతమా కాదా" అని చెప్పి మితుల (dimensions) ఆధారంగా కారణం రాయండి.

 

Question 5: కింద ఇచ్చిన ప్రవచనాలను జాగ్రత్తగా చదివి కారణాలతో అవి తప్పా లేదా ఒప్పా తెలియచేయండి.
(a) సదిశ పరిమాణం ఎప్పుడూ అదిశే,
(b) సదిశ ప్రతీ అంశం ఎప్పుడూ అదిశే,
(c) మొత్తం పథం పొడవు ఎప్పుడూ కణం స్థానభ్రంశ సదిశ పరిమాణానికి సమానం,
(d) కణం సగటు వడి (మొత్తం పథ దూరాన్ని ఆ పథాన్ని పూర్తిచేయడానికి పట్టేకాలంతో భాగించగా వచ్చే రాశి) అదే కాలవ్యవధిలో కణం సగటు వేగం పరిమాణం కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది,
(e) ఒకే తలంలో లేని మూడు సదిశలు కలిసి ఎప్పుడూ శూన్య సదిశను ఇవ్వలేవు.

Answer:

a) ఒప్పు. ఎందుకనగా సదిశ పరిమాణం ఒక సంఖ్య మాత్రమే (అదిశ).
b) తప్పు. ఎందుకనగా సదిశ ప్రతి అంశం కూడా ఒక సదిశే.
c) తప్పు. కణం సరళరేఖ వెంబడి దిశ మార్చకుండా చలిస్తేనే మొత్తం పథం పొడవు, స్థానభ్రంశ పరిమాణానికి సమానమవుతుంది; లేకపోతే పథం పొడవు ఎక్కువగా ఉంటుంది.
d) ఒప్పు. పథం పొడవు స్థానభ్రంశ పరిమాణం కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది కావున సగటు వడి ≥ సగటు వేగ పరిమాణం.
e) ఒప్పు. ఎందుకనగా ఏవైనా రెండు సదిశల ఫలితం వాటి తలంలోనే ఉంటుంది; మూడవ సదిశ ఆ తలంలో లేకపోతే అది ఆ ఫలితాన్ని రద్దు చేయలేదు.

Exam Tips:

a) ప్రతి ప్రవచనానికి ఒప్పు/తప్పు చెప్పి ఒక చిన్న కారణం లేదా ఉదాహరణ ఇవ్వండి; (c) లో సరళరేఖ మీద ఒకే దిశలో చలనం మాత్రమే సమానత్వానికి షరతు.

 

Question 6: రేఖాచిత్ర పట పద్ధతి లేదా ఇతర పద్ధతిలో కింద ఇచ్చిన సదిశా అసమానతలను రుజువు చేయండి :
(a) \( |\overrightarrow{A}+\overrightarrow{B}| \le |\overrightarrow{A}|+|\overrightarrow{B}| \)
(b) \( |\overrightarrow{A}+\overrightarrow{B}| \ge \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \)
(c) \( |\overrightarrow{A}-\overrightarrow{B}| \le |\overrightarrow{A}|+|\overrightarrow{B}| \)
(d) \( |\overrightarrow{A}-\overrightarrow{B}| \ge \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \)
ఏ సందర్భంలో సమానత గుర్తు వర్తిస్తుంది ?

Answer:

(a) \( |\overrightarrow{A}+\overrightarrow{B}| \le |\overrightarrow{A}|+|\overrightarrow{B}| \) అని చూపుట :
\( \overline{A} \) మరియు \( \overline{B} \) లు ఆసన్న భుజాలుగా \( (\overline{OP}, \overline{OQ}) \) తీసుకొని సమాంతర చతుర్భుజం నిర్మిస్తే కర్ణం \( \overline{OS} = \overline{A}+\overline{B} \) అవుతుంది.
\( \overline{OP} = \overline{A} \) మరియు \( \overline{OQ} = \overline{B} \), \( \overline{OS} = \overline{A}+\overline{B} \)
పటము నుండి (త్రిభుజం OPS లో) \( OS < OP + PS = OP + OQ \)
i.e. \( |\overline{A}+\overline{B}| < |\overline{A}|+|\overline{B}| \)
\( \overline{OP} \) మరియు \( \overline{OQ} \) లు ఒకే సరళరేఖ వెంబడి ఒకే దిశలో ఉంటే \( |\overline{OS}| = |\overline{A}+\overline{B}| = |\overline{A}|+|\overline{B}| \)
∴ \( |\overline{A}+\overline{B}| \le |\overline{A}|+|\overline{B}| \) నిరూపించబడింది.

(b) \( |\overrightarrow{A}+\overrightarrow{B}| \ge \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \) అని చూపుట : ΔOPS నుండి \( OS + PS > OP \) లేదా \( OS > |OP - PS| \) లేదా
\( OS > |OP - OQ| \) …(1) (∵ PS = OQ)
పై సమీకరణలో OS ఎల్లపుడు ధనాత్మకము. కాని OP − OQ ధనాత్మకం లేదా ఋణాత్మకం కావచ్చు. అందువలన
\( |\overrightarrow{OS}| = |\overrightarrow{A}+\overrightarrow{B}| > \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \) …(2)
\( \overrightarrow{A} \) మరియు \( \overrightarrow{B} \) లు వ్యతిరేక దిశలో ఒకే సరళరేఖ వెంబడి పనిచేస్తే
\( |\overrightarrow{A}+\overrightarrow{B}| = \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \) …(3)
(2), (3) లను కలిపితే \( |\overrightarrow{A}+\overrightarrow{B}| \ge \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \)
(c) \( |\overrightarrow{A}-\overrightarrow{B}| \le |\overrightarrow{A}|+|\overrightarrow{B}| \) అని చూపుట :
పటములో \( \overline{A} = \overline{OP} \), \( -\overline{B} = \overline{OT} = \overline{PR} \) మరియు \( (\overline{A}-\overline{B}) = \overline{OR} \)
త్రిభుజం ORP నుండి \( OR < OP + PR \) లేదా
\( |\overline{A}-\overline{B}| < |\overline{A}|+|\overline{B}| \) …(4)
సదిశలు \( \overline{A}, \overline{B} \) లు ఒకే సరళరేఖ వెంబడి వ్యతిరేక దిశలో పనిచేసేటప్పుడు \( |\overline{A}-\overline{B}| = |\overline{A}|+|\overline{B}| \) …(5)
పై నియమాల (4, 5) నుండి \( |\overline{A}-\overline{B}| \le |\overline{A}|+|\overline{B}| \)
(d) \( |\overrightarrow{A}-\overrightarrow{B}| \ge \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \) అని చూపుట : పటములోని ΔOPR నుండి \( OR + PR > OP \) లేదా
\( OR > |OP - PR| \) లేదా \( OR > |OP - OT| \) …(6) (∵ OT = PR)
పై సమీకరణంలో OR ఎల్లపుడు ధనాత్మకము. కాని OP − OT ధనాత్మకము లేదా ఋణాత్మకము కావచ్చు.
∴ \( |\overrightarrow{OR}| = |\overrightarrow{A}-\overrightarrow{B}| > \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \) …(7)
సదిశలు \( \overrightarrow{A} \) మరియు \( \overrightarrow{B} \) లు ఒకే సరళరేఖ వెంబడి ఒకే దిశలో పనిచేస్తే \( |\overrightarrow{A}-\overrightarrow{B}| = \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \)
(6), (7) ల నుండి \( |\overrightarrow{A}-\overrightarrow{B}| \ge \big||\overrightarrow{A}|-|\overrightarrow{B}|\big| \)
సమానత గుర్తు : (a) మరియు (c) లలో సదిశలు ఒకే సరళరేఖపై సమాన (a) లేదా వ్యతిరేక (c) దిశలలో ఉన్నప్పుడు, (b) మరియు (d) లలో వ్యతిరేక (b) లేదా సమాన (d) దిశలలో ఉన్నప్పుడు వర్తిస్తుంది.

Exam Tips:

a) త్రిభుజంలో ఏ భుజమైనా మిగిలిన రెండింటి మొత్తం కంటే చిన్నది అనే సూత్రం ఆధారంగా నాలుగు అసమానతలు రుజువు చేయండి; సమానత సందర్భాలు (ఒకే సరళరేఖ) చివర చెప్పండి.

 

Question 7: \( \overrightarrow{a}+\overrightarrow{b}+\overrightarrow{c}+\overrightarrow{d} = \overrightarrow{0} \) అని ఇచ్చారు. కింది ప్రవచనాలలో ఏది సరియైనది :
a) a, b, c, d లలో ప్రతీది శూన్య సదిశ,
b) (a + c) పరిమాణం (b + d) పరిమాణానికి సమానం,
c) సదిశ a పరిమాణం ఎప్పుడూ b, c, d ల పరిమాణాల మొత్తం కంటె అధికం కాదు,
d) a, d లు ఏకరేఖీయాలు కానప్పుడు b + c, a, d ఉండే తలంలోనే ఉండాలి. అవి ఏకరేఖీయాలు అయితే b + c, a, d లకు రేఖీయంగా ఉండాలి.

Answer:

a) సరి అయినది కాదు. ఎందుకనగా \( \overline{a}+\overline{b}+\overline{c}+\overline{d} = 0 \) అయ్యేందుకు ప్రతి సదిశ శూన్యం కావాల్సిన అవసరం లేదు; అనేక విధాలుగా ఇది సున్న కావచ్చు.
b) సరి అయినది. ఎందుకనగా \( \overline{a}+\overline{b}+\overline{c}+\overline{d} = 0 \) ఐతే \( \overline{a}+\overline{c}=-(\overline{b}+\overline{d}) \) లేదా \( |\overline{a}+\overline{c}| = |\overline{b}+\overline{d}| \)
c) సరి అయినది. ఎందుకనగా \( \overline{a}=-(\overline{b}+\overline{c}+\overline{d}) \) కావున \( |\overline{a}| = |\overline{b}+\overline{c}+\overline{d}| \le |\overline{b}|+|\overline{c}|+|\overline{d}| \)
d) సరి అయినది. ఎందుకనగా \( \overline{a}+(\overline{b}+\overline{c})+\overline{d} = 0 \) కావున మూడు సదిశలు \( \overline{a}, (\overline{b}+\overline{c}), \overline{d} \) ల ఫలితం సున్న కావాలంటే అవి ఒకే తలంలో ఉండాలి. ఒకవేళ \( \overline{a} \) మరియు \( \overline{d} \) లు ఏకరేఖీయాలైతే \( \overline{b}+\overline{c} \) కూడా వాటి రేఖపైనే ఉండాలి.

Exam Tips:

a) a+b+c+d=0 అయితే a = −(b+c+d); దీని నుండి పరిమాణ సంబంధాలు తీసుకోండి; ప్రతి సదిశ శూన్యం కానవసరం లేదు.

 

Question 8: ముగ్గురు బాలికలు 200 m వ్యాసార్ధం ఉన్న వృత్తాకార మంచు ఆటస్థలంలో ఆటస్థలం అంచు వెంబడి ఉన్న P బిందువు నుండి స్కేటింగ్ చేసుకుంటూ బయలుదేరి P కి వ్యాసీయంగా ఎదురుగా ఉన్న Q బిందువు వద్దకు వేరు వేరు మార్గాలలో పటంలో చూపిన విధంగా చేరుకొన్నారు. ప్రతి ఒక్కరి స్థానభ్రంశం సదిశ పరిమాణం ఎంత ? ఇది ఏ బాలిక తీసుకొన్న మార్గం పొడవుకు సమానం ?

Answer:

ప్రతి బాలిక స్థానభ్రంశము \( \overline{PQ} \) కి సమానము. \( PQ = 2 \times 200 = 400 \) m. B అను బాలికకు మాత్రమే స్థానభ్రంశ పరిమాణము మరియు మార్గం పొడవు సమానము (ఆమె PQ వ్యాసం వెంబడి నేరుగా వెళ్ళింది).

Exam Tips:

a) స్థానభ్రంశం = తొలి, తుది బిందువుల మధ్య సరళరేఖ దూరం (PQ = 2 × వ్యాసార్ధం); మార్గం పొడవు సమానమయ్యేది సరళ మార్గం B మాత్రమే.

 

Question 9: 1 km వ్యాసార్ధం ఉన్న పార్క్ కేంద్రం నుంచి సైకిల్పై బయలుదేరిన ఒక వ్యక్తి వృత్త అంచు P కి చేరుకుని, వృత్త పరిధిపై సైకిల్ తొక్కుతూ తిరిగి వృత్త కేంద్రాన్ని పటంలో చూపిన OQ రేఖ వెంబడి చేరుకొన్నాడు. పూర్తి తిరుగు ప్రయాణానికి 10 నిమిషాలు తీసుకొంటే (a) ఫలిత స్థానభ్రంశం ఎంత ?, (b) సగటు వేగం, (c) సైకిల్తొక్కే వ్యక్తి సగటు వడి ఎంత ?

Answer:

a) ఫలిత స్థానభ్రంశము సున్న (ప్రారంభ, అంత్య బిందువులు రెండూ O).
b) సగటు వేగము \( = \frac{\text{నికర స్థానభ్రంశము}}{\text{మొత్తం కాలము}} = \frac{0}{10\times 60} = 0 \)
c) సగటు వడి \( = \frac{\text{ప్రయాణించిన పథం పొడవు}}{\text{మొత్తం కాలము}} = \frac{1+\frac{2\pi r}{4}+1}{10/60} \) (r = 1 km)
\( = \frac{\left(1+\frac{2\pi \times 1}{4}+1\right)\text{km}}{(10/60)\ \text{h}} \approx 21.4 \) km/h

Exam Tips:

a) సగటు వేగానికి నికర స్థానభ్రంశం (సున్న), సగటు వడికి మొత్తం పథం పొడవు వాడండి; క్వార్టర్ వృత్త పొడవు = 2πr/4.

 

Question 10: కొత్తగా పట్టణానికి వచ్చిన ప్రయాణీకుడు స్టేషన్ నుండి నేరుగా ఉన్న రోడ్డుపై 10 km దూరంలో ఉండే హోటలు చేరుకోవాలనుకున్నాడు. మోసగాడు అయిన ఒక టాక్సీ కారు డ్రైవరు అతనిని మెలికల మార్గాల గుండా తిప్పుతూ 23 km దూరాన్ని 28 నిమిషాలపాటు తిప్పి హోటల్కు తీసుకొని వచ్చాడు. అయితే (a) టాక్సీ సగటు వడి ఎంత ? (b) సగటు వేగం పరిమాణం ఎంత ? (c) ఈ రెండూ సమానమేనా ?

Answer:

ప్రయాణ మార్గం పొడవు S = 23 km, స్థానభ్రంశము = 10 km
కాలము = 28 నిమిషాలు \( = \frac{28}{60} \) గం.
a) సగటు వడి \( = \frac{\text{ప్రయాణ మార్గం పొడవు}}{\text{కాలము}} = \frac{23}{28/60} = 49.3 \) km/h
b) సగటు వేగ పరిమాణము \( = \frac{\text{మొత్తం స్థానభ్రంశం}}{\text{కాలము}} = \frac{10}{28/60} = 21.4 \) km/h
c) ఈ సందర్భంలో సగటు వేగ పరిమాణము మరియు సగటు వడి సమానం కాదు (వడి > వేగ పరిమాణం).

Exam Tips:

a) సగటు వడి = పథం పొడవు/కాలం, సగటు వేగం = స్థానభ్రంశం/కాలం; నిమిషాలను గంటలకు మార్చడం మరువకండి.

 

Question 11: 30 m/s వడితో వర్షం నిట్టనిలువుగా పడుతోంది. ఒక మహిళ 10 m/s వడితో ఉత్తరం నుంచి దక్షిణ దిశకు సైకిలు తొక్కుతోంది. ఏ దిశలో ఆమె గొడుగును పట్టుకోవాలి ?

Answer:

పటం నుండి వర్షం 30 m/s వడితో OA దిశలో పడుతున్నది. మహిళ 10 m/s వేగంతో OB దిశలో చలిస్తున్నది.

వాన నుండి రక్షించుకోవడానికి ఆమె, తనకు సాపేక్షంగా వర్షం వచ్చే దిశలో గొడుగు పట్టుకోవాలి.
సాపేక్ష వేగం కనుక్కోవడానికి మహిళ వేగాన్ని వ్యతిరేక దిశలో (OC) తీసుకొని వర్షం వేగంతో కలిపి ఫలిత వేగం కనుక్కోవాలి.
పటంలో సమాంతర చతుర్భుజము OADC లో కర్ణము OD ఫలిత (సాపేక్ష) వేగాన్ని ఇస్తుంది.
దాని దిశ : \( \tan θ = \frac{AD}{OA}=\frac{OC}{OA}=\frac{10}{30} = 0.3333 \Rightarrow θ = 18^{\circ}26′ \)
అనగా గొడుగును నిట్టనిలువు నుండి 18°26′ కోణంతో, మహిళ నడిచే (దక్షిణ) వైపుకు వంచి పట్టుకోవాలి.

Exam Tips:

a) గొడుగును సాపేక్ష వేగ దిశలో పట్టాలి; tan θ = మహిళ వేగం/వాన వేగం = 10/30.

 

Question 12: నిలకడగా ఉన్న నీటిలో ఒక వ్యక్తి 4.0 km/h వడితో ఈదగలడు. 1.0km వెడల్పు ఉండి 3.0 km/h సమవడితో ప్రవహిస్తున్న నదిని ప్రవాహ దిశకు లంబంగా ఈదుతూ ఎంత కాలంలో దాటగలడు ? రెండో ఒడ్డుకు చేరేటప్పటికి అతడు నదిలో ఎంత కిందకు ప్రయాణిస్తాడు ?

Answer:

నది వెడల్పు = 1 km, నీటిలో వ్యక్తి వేగము = 4 km/h
నదిని దాటడానికి పట్టిన కాలము
\( t = \frac{\text{నది వెడల్పు}}{\text{నీటిలో వ్యక్తి వేగం}} \)
\( \therefore t = \frac{1\ \text{km}}{4\ \text{km/h}} = \frac{1}{4} \) గం. = 15 నిమిషాలు
నది వెంబడి ప్రయాణించిన దూరం \( x = v_R \times t \), నది వేగం \( v_R = 3 \) km/h
\( \therefore x = 3 \times \frac{1}{4} = 0.75 \) km

Exam Tips:

a) కాలం = వెడల్పు ÷ నీటిలో వేగం; నది వెంబడి కొట్టుకుపోవడం = నది వేగం × ఆ కాలం.

 

Question 13: పెద్ద హాలు లోకప్పు 25 m ఎత్తు ఉంది. 40ms వడితో విసిరిన బంతి హాలు లోకప్పును తాకకుండా వెళ్ళే గరిష్ఠ క్షితిజ సమాంతర దూరం ఎంత ?

Answer:

తొలి వేగము \( v_0 \) = 40 మీ/సె, కప్పు ఎత్తు H = 25 మీ.
కప్పును తాకుతూ వెళ్ళడానికి ప్రక్షేపక కోణము ‘θ’ అనుకోండి (అప్పుడు గరిష్ఠ ఎత్తు = 25 మీ).
\( H = \frac{v_0^2\sin^2 θ}{2g} \Rightarrow \frac{40^2 \sin^2 θ}{2\times 9.8} = 25 \)
\( \therefore \sin^2 θ = \frac{2\times 25\times 9.8}{40\times 40} = 0.30625 \Rightarrow \sin θ = 0.5534 \Rightarrow θ = 33.6^{\circ} \)
క్షితిజ సమాంతర వ్యాప్తి \( R = \frac{v_0^2 \sin 2θ}{g} = \frac{40^2 \times \sin(2\times 33.6^{\circ})}{9.8} = \frac{1600 \times 0.9219}{9.8} \approx 150.5 \) మీ.

Exam Tips:

a) కప్పును తాకకుండా వెళ్ళే గరిష్ఠ వ్యాప్తికి గరిష్ఠ ఎత్తు H = 25 m షరతు వాడి θ కనుక్కొని R లెక్కించండి.
b) sin²θ ను sin θ గా తప్పుగా తీసుకోకండి.

 

Question 14: ఒక క్రికెటర్ బంతిని గరిష్ఠంగా 100 m దూరం విసరగలడు. అదే బంతిని భూమికి ఎంత ఎత్తు వరకు అతడు విసరగలడు ?

Answer:

ప్రక్షేపక వేగం \( v_0 \) అనుకోండి. గరిష్ఠ వ్యాప్తి \( R_{max} = \frac{v_0^2}{g} = 100 \) మీ. (θ = 45° వద్ద)
అదే వేగం \( v_0 \) తో నిట్టనిలువుగా పైకి విసిరితే అది చేరగల ఎత్తు (గరిష్ఠ బిందువు వద్ద వేగం సున్న, కాలము \( t = \frac{v_0}{g} \))
\( y = y_0 + v_0 t + \frac{1}{2}at^2 \), ఇందులో \( y_0 = 0,\ a = -g \)
\( y = v_0\cdot\frac{v_0}{g} - \frac{1}{2}g\left(\frac{v_0}{g}\right)^2 = \frac{v_0^2}{g}-\frac{1}{2}\frac{v_0^2}{g} = 100 - \frac{1}{2}\times 100 = 50 \)
∴ నిట్టనిలువుగా పైకి చేరగల ఎత్తు y = 50 మీ.

Exam Tips:

a) గరిష్ఠ వ్యాప్తి \( v_0^2/g \) (45° వద్ద) మరియు గరిష్ఠ ఎత్తు (నిట్టనిలువుగా) \( v_0^2/2g \) మధ్య సంబంధం గుర్తుంచుకోండి.

 

Question 15: 80 cm పొడవు ఉన్న తాడుకు ఒక కొన వద్ద రాయిని కట్టి స్థిర వడితో క్షితిజ సమాంతర వృత్తంలో తిప్పారు. రాయి 25 s లలో 14 భ్రమణాలు చేస్తే, రాయి త్వరణం పరిమాణం, దిశను కనుక్కోండి.

Answer:

తాడు పొడవు = వ్యాసార్ధము r = 80 సెం.మీ. = 0.8 మీ; భ్రమణాల సంఖ్య = 14; కాలము t = 25 సె.
భ్రమణ పౌనఃపున్యం \( ν = \frac{14}{25} \) భ్రమణాలు/సె.
\( ω = 2πν = \frac{2 \times 22 \times 14}{7 \times 25} = \frac{88}{25} \) రే/సె.
అభికేంద్ర త్వరణము \( a = ω^2 r = \frac{88}{25} \times \frac{88}{25} \times 0.8 \approx 9.90 \) మీ/సె²
దీని దిశ వృత్త కేంద్రం వైపు (రాయి నుండి తాడు వెంబడి చేతి వైపు) ఉంటుంది.

Exam Tips:

a) ω = 2π × (భ్రమణాలు/కాలం) రేడియన్/సె లలో లెక్కించండి; అభికేంద్ర త్వరణం ω²r, దిశ కేంద్రం వైపు అని చెప్పండి.

 

Question 16: ఒక విమానం స్థిర వడి 900 km/h తో 1.00 km వ్యాసార్ధం వున్న క్షితిజ సమాంతర వలయాన్ని పూర్తిచేసింది. దాని అభికేంద్ర త్వరణాన్ని గురుత్వ త్వరణంతో పోల్చండి.

Answer:

విమానం వడి = 900 km/h \( = \frac{900 \times 5}{18} = 250 \) మీ/సె, వ్యాసార్ధము r = 1 km = 1000 మీ.
అభికేంద్ర త్వరణము \( a = \frac{v^2}{r}=\frac{250 \times 250}{1000} = 62.5 \) మీ/సె²
అభికేంద్ర త్వరణం, గురుత్వ త్వరణాల నిష్పత్తి \( \frac{a}{g} = \frac{62.5}{9.8} \approx 6.38 \)

Exam Tips:

a) వడిని km/h నుండి m/s కి మార్చండి (×5/18); అభికేంద్ర త్వరణం v²/r ను g తో భాగించి నిష్పత్తి చెప్పండి.

 

Question 17: కింది ప్రవచనాలను జాగ్రత్తగా చదివి తప్పొప్పుల కారణాలను ఇవ్వండి :
a) వృత్తాకార చలనంలో ఉన్న కణం ఫలిత త్వరణం ఎప్పుడూ వ్యాసార్ధం వెంబడి వృత్తకేంద్రంవైపు ఉంటుంది.
b) ఏదైనా బిందువు వద్ద కణం వేగ సదిశ ఆ బిందువు వద్ద పథం స్పర్శరేఖ వెంబడి ఉంటుంది.
c) ఏకరీతి వృత్తాకార చలనంలో ఒక పూర్తి భ్రమణంలో కణం సగటు త్వరణం ఒక శూన్య సదిశ.

Answer:

a) ప్రవచనం తప్పు. ఏకరీతి వృత్తాకార చలనంలో మాత్రమే ఫలిత త్వరణం వృత్త వ్యాసార్ధం వెంబడి ఉంటుంది.
b) ప్రవచనం సరి అయినది. ఎందుకనగా వస్తువు వృత్తాకార మార్గం వదిలేటపుడు ఆ బిందువు వద్ద గల స్పర్శరేఖ వెంబడి ప్రయాణిస్తుంది.
c) ప్రవచనం సరి అయినది. ఒక పూర్తి భ్రమణానికి వేగ సదిశలలో ఫలిత మార్పు సున్న కావున కణం త్వరణము సున్న.

Exam Tips:

a) ఏకరీతి వృత్తాకార చలనంలో మాత్రమే ఫలిత త్వరణం వ్యాసార్ధం వెంబడి ఉంటుంది — (a) తప్పు అనడానికి ఇదే కారణం.

 

Question 18: ఒక కణం స్థానం కింది విధంగా ఉంది.
\( \overline{r} = 3.0 t\,\hat{i}-2.0 t^2\,\hat{j}+4.0\,\hat{k} \)
ఇక్కడ t (కాలం) సెకనులో, ప్రమాణాలు మీటర్లలో ఉండే విధంగా ఇతర గుణకాల ప్రమాణాలు ఉన్నాయి. (a) కణం యొక్క v, a లను కనుక్కోండి, (b) t = 2.0 s వద్ద కణం వేగం పరిమాణం, దిశ ఏమిటి ?

Answer:

a) \( \overline{r} = 3.0t\,\hat{i}-2.0t^2\,\hat{j}+4.0\,\hat{k} \) m
వేగము \( \overline{v} = \frac{d\overline{r}}{dt} = 3\,\hat{i}-4t\,\hat{j} \)
త్వరణము \( \overline{a} = \frac{d\overline{v}}{dt} = -4\,\hat{j}\ \text{m s}^{-2} \)
b) కాలము t = 2 s వద్ద వేగము \( \overline{v} = 3.0\,\hat{i}-4\times 2\,\hat{j} = 3\,\hat{i}-8\,\hat{j} \)
\( |\overline{v}| = \sqrt{3^2+(-8)^2} = \sqrt{73} = 8.54\ \text{m s}^{-1} \)
దిశను \( \tan θ = \frac{v_y}{v_x} \) ఇస్తుంది. \( \therefore \tan θ = \frac{-8}{3} = -2.667 \)
\( θ = -\tan^{-1}(2.667) \)
అనగా దాని దిశ x-అక్షానికి కింది వైపు, x-అక్షంతో సుమారు 69.4° కోణం చేస్తుంది.

Exam Tips:

a) v = dr/dt, a = dv/dt; దిశ ఋణ కోణంగా (x-అక్షానికి కింద) చెప్పండి.

 

Question 19: అంతరాళంలో ఏదైనా యాదృచ్ఛిక చలనానికి కింద ఇచ్చిన ఏ సంబంధాలు ఒప్పు :
(a) vaverage = (1/2) (v(t₁ ) + v(t₂))
(b) vaverage = [r(t₂) – r(t₁)] / (t₂ – t₁)
(c) v (t) = v (0) + at
(d) r(t) = r(0) + v(0) t + (1/2) a t²
(e) aaverage = [v(t₂) – v(t₁)] / (t₂ – t₁)
(ఇక్కడ ‘average’ పదం t₁ నుంచి t₂ మధ్య ఉన్న కాలవ్యవధిలో ఆయా రాశుల సగటు విలువను తెలియచేస్తుంది.)

Answer:

పైన ఇచ్చిన వాటిలో b, e సంబంధాలు సరి అయినవి. ఎందుకనగా అవి సగటు వేగము, సగటు త్వరణముల గణిత నిర్వచనాలు. మిగిలిన a, c, d అను నియమాలు సమత్వరణంతో చలించే వస్తువులకు మాత్రమే వర్తిస్తాయి. యాదృచ్ఛిక చలనం సమత్వరణం కలిగి ఉండాలి అన్న కచ్చితమైన నిబంధన లేనందువల్ల a, c, d లు సరి అయినవి కావు.

Exam Tips:

a) సగటు నిర్వచనాలైన b, e ఎప్పుడూ సరైనవి; a, c, d సమత్వరణ చలనానికే వర్తిస్తాయి.

 

Question 20: కింది ప్రవచనాలను జాగ్రత్తగా చదివి కారణాలు, ఉదాహరణలలో తప్పొప్పులను వివరించండి :
అదిశ రాశి అనేది
(a) ఇచ్చిన ప్రక్రియలో నిత్యత్వమయ్యేది.
(b) ఎప్పుడూ ఋణ విలువలను తీసుకోదు.
(c) మితులు ఉండవు.
(d) అంతరాళంలో ఒక బిందువు నుంచి మరొక బిందువుకు దాని విలువ మారదు. (e) పరిశీలకులు వివిధ దిగ్విన్యాసాలతో కూడిన అక్షాలలో ఉన్నా దాని విలువ ఒకే విధంగా ఉంటుంది.

Answer:

a) అబద్ధము. ఎందుకనగా అస్థితి స్థాపక అభిఘాతాలలో శక్తి నిత్యత్వము కాదు (శక్తి అదిశరాశి).
b) అబద్ధము. ఎందుకనగా ఉష్ణోగ్రత ఋణాత్మకంగా కూడా ఉండవచ్చు (ఉష్ణోగ్రత అదిశరాశి).
c) అబద్ధము. ఎందుకనగా సాంద్రతకు మితులు కలవు. సాంద్రత అదిశరాశి.
d) అబద్ధము. ఎందుకనగా అంతరాళంలో ఒకచోట నుండి మరొకచోటుకు గురుత్వ పొటెన్షియల్ (ఇది అదిశరాశి) మారుతుంది కావున.
e) నిజమైనది. ఎందుకనగా అదిశ పరిమాణము పరిశీలకుల దృగ్విన్యాసంతో మారదు కావున.

Exam Tips:

a) ప్రతి భాగానికి ఒక ప్రతి-ఉదాహరణ ఇవ్వండి (శక్తి, ఉష్ణోగ్రత, సాంద్రత, గురుత్వ పొటెన్షియల్).

 

Question 21: భూమికి 3400 m ఎత్తున ఒక విమానం ఎగురుతోంది. భూమిపై ఉన్న పరిశీలన బిందువు వద్ద ఆ విమానం 10.0 s కాలవ్యవధిలో 30° కోణం చేస్తే వడి ఎంత ?

Answer:

పటంలో ‘O’ అనేది భూమిపై పరిశీలన బిందువు. A, B అను బిందువులు ‘O’ వద్ద చేసే కోణము ∠AOB = 30°. A, B లకు గీసిన మధ్య లంబరేఖ OC = 3400. ∠AOC = ∠COB = 15°.
A నుండి Bకి విమానం ప్రయాణించిన కాలము t = 10 సె.
పటంలో AC = OC tan 15° = 3400 × 0.2679 = 910.86 మీ.
AB = AC + CB = 910.86 + 910.86 = 1821.7 మీ.
విమాన సగటు వడి \( = \frac{AB}{\text{కాలము}} = \frac{1821.7}{10} = 182.17 \) m/s

Exam Tips:

a) విమానం చేసిన దూరం AB = 2 × 3400 × tan 15°; వడి = AB/10 s.

 

Question 22: ఒక సదిశకు పరిమాణం, దిశ ఉన్నాయి. దానికి అంతరాళంలో స్థానం ఉంటుందా ? అది కాలంతో మారుతుందా ? అంతరాళంలో వివిధ స్థానాల దగ్గర ఉన్న రెండు సమాన సదిశలు a, bలు సర్వసమాన భౌతిక ప్రభావాలను చూపించవలసిన ఆవశ్యకత ఉందా ? మీ సమాధానానికి మద్దతుగా ఉదాహరణలివ్వండి.

Answer:

1. ఒక సదిశ యొక్క దిశ, పరిమాణం మారకుండా దానిని ఎక్కడికైనా జరపవచ్చు. కావున సదిశకు అంతరాళంలో నియమతస్థానం ఉండదు. 2. సదిశ పరిమాణం కాలంతో పాటు మారవచ్చు. ఉదా : త్వరణం కలిగిన వస్తువు వేగం నిరంతరం మారుతుంది.
3. అంతరాళంలో రెండు వేరు వేరు ప్రదేశాలలో ఉన్న సమాన సదిశలు ఒకే ప్రభావం చూపవలసిన అవసరం లేదు.
ఉదా : ఒక వస్తువు మీద వ్యతిరేక దిశలో వేరు వేరు బిందువుల వద్ద పనిచేసే బలాలు ఒకే రకమైన టార్క్ను ఉత్పత్తి చేయవు.

Exam Tips:

a) సదిశను సమాంతరంగా జరిపినా మారదు కాని సమాన సదిశల భౌతిక ప్రభావం (టార్క్ వంటిది) వేరుగా ఉండవచ్చు — ఉదాహరణతో చెప్పండి.

 

Question 23: ఒక సదిశకు పరిమాణం, దిశ ఉన్నాయి. అంటే దిశ, పరిమాణం ఉన్న ప్రతీది సదిశ కావలసిన ఆవశ్యకత ఉందా? వస్తువు భ్రమణాన్ని దాని భ్రమణాక్షం దిశ, భ్రమణ కోణంతో వ్యక్తపరచవచ్చు. అంటే ప్రతి భ్రమణం సదిశ అవుతుందా?

Answer:

దిశ, పరిమాణం ఉన్న ప్రతీది సదిశ కానవసరం లేదు. సదిశలు తప్పనిసరిగా సంకలన నియమాలు పాటించాలి.
ఉదా : విద్యుత్ ప్రవాహానికి పరిమాణం, దిశ ఉన్నాయి కాని అది సదిశ కాదు (అదిశ).
వస్తువును భ్రమణ అక్షపరంగా భ్రమణం చెందించితే అది సదిశ కానవసరం లేదు. ఎందుకనగా అది సదిశల సంకలన నియమాల వంటి నియమాలను పాటించదు. కాని భ్రమణ కోణము θ చిన్నదైతే అది సదిశల సంకలన నియమాలను పాటిస్తుంది కాబట్టి అటువంటి సందర్భంలో భ్రమణాన్ని సదిశగా భావిస్తారు.

Exam Tips:

a) సదిశ కావాలంటే సంకలన నియమాలు పాటించాలి; పరిమిత భ్రమణాలు పాటించవు, చిన్న భ్రమణాలు పాటిస్తాయి.

 

Question 24: కింది వాటితో సదిశలను జతచేయవచ్చా ? వివరించండి. (a) ఉచ్చు (loop) ఆకారంలో వంచిన తీగ పొడవు (b) ఒక తల వైశాల్యం, (c) గోళం.

Answer:

a) ఉచ్చు ఆకారంలో వంచిన తీగ పొడవుతో సదిశను జతచేయలేము.
b) సమతల వైశాల్యంతో ఒక సదిశను జత చేయవచ్చు. ఇటువంటి దానిని విస్తీర్ణ సదిశ అంటారు. తలానికి గీసిన లంబదిశలో దీన్ని సూచిస్తారు.
c) గోళంతో సదిశను జతచేయలేము. గోళ ఘనపరిమాణం అదిశ; అలాగే మూసిన తలమైన గోళ ఉపరితలంపై అన్ని వైపుల విస్తీర్ణ సదిశల మొత్తం శూన్యం.

Exam Tips:

a) తీగ పొడవు సదిశ కాదు; సమతల వైశాల్యానికి తలానికి లంబంగా సదిశ ఉంది; గోళం మూసిన తలం కావున దానికి సదిశ లేదు — ఈ మూడూ చెప్పండి.

 

Question 25: క్షితిజ సమాంతరానికి 30° కోణంతో పేల్చిన బుల్లెట్ 3.0 km దూరంలో భూమిని తాకింది. దాని ప్రక్షేపక కోణాన్ని సరిచేసి 5.0 km దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురికొట్టవచ్చని ఎవరైనా ఆశించవచ్చా ? వడి స్థిరం అని, గాలి నిరోధాన్ని ఉపేక్షించడమైంది అని అనుకోండి.

Answer:

కోణము θ = 30°, ప్రయాణించిన దూరము = వ్యాప్తి = 3 km
\( R = \frac{u^2 \sin 2θ}{g} \Rightarrow 3 = \frac{u^2}{g}\sin 60^{\circ} = \frac{u^2}{g}\cdot\frac{\sqrt{3}}{2} \Rightarrow \frac{u^2}{g}=\frac{3}{\sqrt{3}/2}=2\sqrt{3} = 3.464 \) km
ఏ కోణం వద్దనైనా సాధ్యమయ్యే గరిష్ఠ వ్యాప్తి \( \frac{u^2}{g} = 3.464 \) km (θ = 45° వద్ద) మాత్రమే. ఇది 5 km కంటే తక్కువ కావున ఆ బుల్లెట్‌తో 5 km దూరంలోని లక్ష్యాన్ని తాకలేము.

Exam Tips:

a) \( R=\frac{u^2\sin 2θ}{g} \) నుండి \( u^2/g \) తీసి గరిష్ఠ వ్యాప్తితో (θ = 45°) పోల్చండి; 5 km దానికంటే ఎక్కువ.

 

Free study material for Physics

TS Board Solutions for Class 11 Physics Chapter 04 Motion in a Plane

Textbook Solutions for Class 11 Physics Chapter 04 Motion in a Plane

Explore reliable textbook solutions for Chapter 04 Motion in a Plane tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Physics.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 11 Physics module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 04 Motion in a Plane with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Physics Study Material Chapter 4 సమతలంలో చలనం for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 4 సమతలంలో చలనం is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.

Are the Physics TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 4 సమతలంలో చలనం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 4 సమతలంలో చలనం will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Physics Study Material Chapter 4 సమతలంలో చలనం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 4 సమతలంలో చలనం in both English and Hindi medium.

Is it possible to download the Physics TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 4 సమతలంలో చలనం in printable PDF format for offline study on any device.