TS Inter 1st Year Physics Study Material Chapter 3 సరళరేఖాత్మక గమనం

Solutions for Class 11 Physics: Chapter 03 Motion in a Straight Line

Access comprehensive textbook solutions for Chapter 03 Motion in a Straight Line using the official curriculum guides for Class 11 Physics. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 11 Physics Solutions: Chapter 03 Motion in a Straight Line

View or download the dedicated Chapter 03 Motion in a Straight Line solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Physics.

అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: గమన, నిశ్చల స్థితులు సాపేక్షం. వివరించండి.

Answer:

పరిసరాలతో పోల్చినపుడు వస్తువు స్థానం కాలంతోపాటు మారితే అది గమనంలో ఉన్నది అంటారు. దాని స్థానం మారకపోతే ఆ వస్తువు నిశ్చలంగా ఉంది అంటారు. కాబట్టి గమనము లేదా నిశ్చలత్వము అనేది సాపేక్ష భావన మాత్రమే!

Exam Tips:

a) గమనం/నిశ్చలత సాపేక్షం అని చెప్పడానికి ఒక ఉదాహరణ (రైలులో కూర్చున్న వ్యక్తి) రాయండి.

 

Question 2: సగటు వేగం ఏవిధంగా తత్కాల వేగంతో విభేదిస్తుంది?

Answer:

సగటు వేగం అనేది వస్తువు మొత్తం స్థానభ్రంశానికి, మొత్తం కాలవ్యవధికి గల నిష్పత్తి. తత్కాల వేగం అనేది ఇచ్చిన క్షణంలో వస్తువుకు గల వేగం.
మొత్తం కాలవ్యవధిని \( \Delta t \) వ్యవధి గల చిన్న చిన్న అంశాలుగా భావించి, ఆ కాలాలలో గల తత్కాల వేగాల సగటునే సగటు వేగంగా తీసుకుంటాం. అనగా కొన్ని క్షణాలలో తత్కాల వేగం సగటు వేగం కన్నా ఎక్కువగా లేదా తక్కువగా ఉండవచ్చు.

Exam Tips:

a) సగటు వేగం = మొత్తం స్థానభ్రంశం/కాలం; తత్కాల వేగం = ఒక క్షణంలో వేగం (dx/dt) — ఈ రెండు నిర్వచనాలు వేర్వేరుగా రాయండి.

 

Question 3: ఒక వస్తువు వేగం శూన్యమై దాని త్వరణం శూన్యం కాని సందర్భానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.

Answer:

వస్తువు వేగం శూన్యమైనప్పటికీ దాని త్వరణం సున్న కానవసరం లేదు. ఉదా :
నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువుకు గరిష్ఠ స్థానం వద్ద వేగము సున్న కానీ త్వరణం సున్న కాదు.

Exam Tips:

a) ఉదాహరణ ఇచ్చేటప్పుడు 'గరిష్ఠ ఎత్తు వద్ద v = 0, a = g' అని స్పష్టంగా రాయండి.

 

Question 4: ఒక వాహనం ప్రయాణించిన దూరం L లో సగం దూరం వడి v₁ తోనూ, రెండవ సగం దూరం వడి v₂ ప్రయాణించింది. ఆ వాహనం సగటు వడి ఎంత?

Answer:

మొత్తం ప్రయాణానికి పట్టిన కాలం \( t = \frac{L}{2v_1} + \frac{L}{2v_2} = \frac{(v_1+v_2)L}{2v_1v_2} \)
∴ సగటు వడి \( v = \frac{L}{t} = \frac{L \times 2v_1v_2}{(v_1+v_2)L} = \frac{2v_1v_2}{v_1+v_2} \)

Exam Tips:

a) సగటు వడి = మొత్తం దూరం/మొత్తం కాలం — సగం సగం కాలం కాదు, సగం సగం దూరం కావున హార్మోనిక్ సగటు 2v₁v₂/(v₁+v₂) వస్తుంది.

 

Question 5: కింది దిశలో ప్రయాణిస్తూ ఒక లిఫ్టు భూ అంతస్తు (ground floor) కు చేరబోతున్నది. భూ అంతస్తును మూల బిందువుగానూ, ఊర్ధ్వ దిశను ధన దిశగానూ అన్ని రాశులకూ ఎంపిక చేసుకొంటే కింద ఇచ్చినవాటిలో ఏది సరియైనది?
a) x < 0, v < 0, a > 0
b) x > 0, v < 0, a < 0
c) x > 0, v < 0, a > 0
d) x > 0, v > 0, a > 0

Answer:

భూ అంతస్తును మూలబిందువుగా, ఊర్ధ్వ దిశను ధనదిశగా తీసుకున్నాం.
లిఫ్ట్ భూ అంతస్తు పైన ఉండి కిందికి వస్తోంది ⇒ x > 0 (భూ అంతస్తు కన్నా పైన).
కిందికి కదులుతోంది ⇒ v < 0 (ధనదిశ ఊర్ధ్వం కావున).
భూ అంతస్తు వద్ద ఆగబోతోంది కావున వడి తగ్గుతోంది ⇒ త్వరణం ఊర్ధ్వ దిశలో, అనగా a > 0.
∴ సరియైన ఐచ్ఛికం (c): x > 0, v < 0, a > 0.

Exam Tips:

a) లిఫ్ట్ ఆగబోయేటప్పుడు త్వరణం వేగానికి వ్యతిరేక దిశలో ఉంటుంది; ధన దిశను ముందే నిర్ణయించి సంజ్ఞలు రాయండి.

 

Question 6: ఏకరీతి (సమరీతి) గమనం గల ఒక క్రికెట్ బంతి చాలా స్వల్పకాలం పాటు ఒక బ్యాట్తో కొట్టగా వెనుకకు మరలింది. తిరోదిశలో త్వరణాన్ని ధనాత్మకంగా తీసుకొని కాలంపరంగా త్వరణంలో మార్పుకు గ్రాఫు గీయండి.

Answer:


సమవేగంతో చలించే వస్తువుకు త్వరణం సున్న. బంతి, బ్యాటు కలిసి ఉన్న స్వల్ప క్షణంలో బ్యాటు వలన బంతి గమనదిశకు వ్యతిరేకంగా కొంత త్వరణం కలుగుతుంది.
కాబట్టి త్వరణం–కాలం గ్రాఫ్ కొట్టక ముందు సున్న, కొట్టిన స్వల్ప కాలం Δt లో ఒక శిఖరం (ధనాత్మక త్వరణం), కొట్టిన తరువాత మళ్ళీ సున్న అయ్యేలా ఉంటుంది.

Exam Tips:

a) గ్రాఫ్‌లో ధనాత్మక త్వరణం గల శిఖరం మాత్రమే (ఇతర సమయాల్లో సున్న) చూపండి; అక్షాలకు పేర్లు రాయండి.

 

Question 7: ధన x − దిశలో అక్షం వెంబడి ఏకమితీయ గమనాన్ని కలిగి ఉండి, ఆవర్తకంగా నిశ్చలస్థితికి వచ్చి ముందుకు పోతూ ఉండే ఒక కణం గమనానికి ఉదాహరణ ఇవ్వండి.

Answer:

లోలకం పొడవు బాగా ఎక్కువగా ఉండి కంపన పరిమితి తక్కువగా ఉన్న సందర్భంలో లోలకం చలనం సరళరేఖ వెంబడి జరుగుతున్నట్లు భావించవచ్చు. గరిష్ఠ స్థానభ్రంశ బిందువు వద్ద లోలకం వేగం సున్న కాని దాని త్వరణం సున్న కాదు. ఈ రకమైన చలనం నిర్ణీత కాలవ్యవధి తరువాత పునరావృతమవుతుంది.

Exam Tips:

a) లోలకం, స్ప్రింగ్ వంటి ఆవర్తన చలనాలు చివరి స్థానాల వద్ద క్షణకాలం నిశ్చలమై తిరిగి వస్తాయని రాయండి.

 

Question 8: ఒక (ద్రవంలో) ప్రవాహిలో పతనం చెందే ఒక వస్తువు a = g – bv త్వరణం కలిగి ఉందని పరిశీలించడం జరిగింది. ఇక్కడ g గురుత్వ త్వరణం, b ఒక స్థిరాంకం. కొంతకాలం తరువాత వస్తువు స్థిర వేగంతో పతనం చెందుతుందని
తెలుసుకొన్నారు. ఆ స్థిరవేగం విలువ ఎంతై ఉండవచ్చు?

Answer:

స్థిరవేగము అనగా త్వరణము a = 0. ఇచ్చిన సమీకరణం a = g – bv నుండి 0 = g – bv ⇒ \( v = \frac{\mathrm{g}}{\mathrm{b}} మీ/సె. \)

Exam Tips:

a) స్థిర (అంత్య) వేగం వద్ద త్వరణం సున్న (a = 0) అని మొదట రాయండి.

 

Question 9: ఒక నిర్దేశ చట్రం పరంగా ఒక వస్తువు గమన పథం పరావలయం. ఈ నిర్దేశ చట్రం పరంగా స్థిర వేగంతో గమనంలో ఉన్న వేరొక నిర్దేశ చట్రం పరంగా వస్తువు గమన పథం పరావలయం అవుతుందా? కాకపోతే మరేమై ఉండవచ్చు?

Answer:

ఒక నిర్దేశ చట్రం పరంగా వస్తువు గమన పథం పరావలయము: ఈ నిర్దేశ చట్రం పరంగా రెండవ చట్రం స్థిరవేగంతో చలిస్తున్నది అంటే ఆ రెండు చట్రాలు జడత్వ నిర్దేశక చట్రాలే. కావున మొదటి చట్రంలో కనిపించిన పరావలయ గమన పథమే రెండవ దానిలో కూడా కనిపిస్తుంది.

Exam Tips:

a) సమవేగంతో కదిలే చట్రాలు జడత్వ చట్రాలు; వాటి మధ్య భౌతిక నియమాలు ఒకేలా ఉంటాయి.

 

Question 10: ఒక స్ప్రింగు ఒక కొనను దృఢ ఆధారానికి బిగించి, రెండో కొనకు ఒక ద్రవ్యరాశిని వేలాడదీసి, లాగి వదిలారు. ఎప్పుడు త్వరణం పరిమాణం గరిష్ఠంగా ఉంటుంది?

Answer:

వ్రేలాడదీసిన స్ప్రింగ్ చివర బరువు తగిలించి లాగి వదిలితే అది సరళహరాత్మక చలనం చేస్తుంది. దత్తాంశం నుండి \( F \propto r \).
ఈ సందర్భంలో \( a = \frac{F}{m} = -\frac{K}{m}\,r \) (r = స్థానభ్రంశం).
త్వరణ పరిమాణం స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కావున గరిష్ఠ స్థానభ్రంశ బిందువుల వద్ద (చివరి స్థానాల వద్ద) త్వరణ పరిమాణం గరిష్ఠం.

Exam Tips:

a) సరళహరాత్మక చలనంలో a = −(k/m)x — గరిష్ఠ స్థానభ్రంశం వద్ద త్వరణం గరిష్ఠం, మధ్య స్థానంలో సున్న అని రాయండి.

 

స్వల్ప సమాధాన ప్రశ్నలు

Question 1: త్వరణం కాలంతోపాటు మారుతూ ఉన్నప్పుడు శుద్ధగతిశాస్త్రంలోని సమీకరణాలను ఉపయోగించవచ్చా? ఉపయోగించ వీలులేకపోతే ఆ సమీకరణాలు ఏ రూపాన్ని సంతరించుకొంటాయి?

Answer:

త్వరణం కాలంతో పాటు మారుతున్నది అనగా వస్తువుకు అసమ త్వరణం ఉంది. కావున శుద్ధగతిశాస్త్ర సమీకరణాలను ఇటువంటి సందర్భానికి వాడరాదు.
శుద్ధగతిశాస్త్ర సమీకరణాలు: \( 1)\ v = v_0 + at,\quad 2)\ x = v_0t + \frac{1}{2}at^{2},\quad 3)\ v^{2} - v_0^{2} = 2ax \) — ఈ ప్రతి సమీకరణంలోను త్వరణం a స్థిరం (సమత్వరణం) అని భావించబడింది. కావున వీటిని అసమత్వరణంతో చలించే వస్తువుకు వాడరాదు.
అందువలన ఈ సమీకరణాలు ఏ రూపం సంతరించుకుంటాయి అన్న ప్రశ్న ఉండదు; అసమత్వరణానికి కలనగణితంతో (సమాకలనంతో) వేరే సమీకరణాలు రాబట్టాలి.

Exam Tips:

a) గతిశాస్త్ర సమీకరణాలు సమత్వరణానికి మాత్రమే వర్తిస్తాయి అని స్పష్టంగా రాయండి.

 

Question 2: ఒక కణం ఒక సరళరేఖ వెంబడి సమత్వరణంతో గమనంలో ఉంది. t = 0 వద్ద కణం వేగం \( v_1 \), t = t వద్ద వేగం \( v_2 \), ఆ కణం సగటు వేగం, ఈ కాలవ్యవధిలో \( (v_1+v_2)/2 \) అని తెలిపితే, అది సరియైనదేనా? మీ సమాధానానికి తగిన వివరణ ఇవ్వండి.

Answer:

అవును, సమత్వరణ గమనంలో సగటు వేగం \( \bar{v} = \frac{v_1+v_2}{2} \) సరియైనదే.
వివరణ: t = 0 వద్ద వేగం \( v_1 \), t = t వద్ద వేగం \( v_2 \). సమత్వరణం \( a = \frac{v_2-v_1}{t} \)
స్థానభ్రంశం \( x = v_1t + \frac{1}{2}at^{2} = v_1t + \frac{1}{2}\frac{(v_2-v_1)}{t}t^{2} = v_1t + \frac{1}{2}(v_2-v_1)t = \left(\frac{v_1+v_2}{2}\right)t \)
సగటు వేగం \( \bar{v} = \frac{x}{t} = \frac{v_1+v_2}{2} \)
అనగా సగటు వేగం \( \frac{v_1+v_2}{2} \) సరియైనదని నిరూపించబడింది. (ఇది సమత్వరణ గమనానికి మాత్రమే వర్తిస్తుంది.)

Exam Tips:

a) సమత్వరణ గమనంలో మాత్రమే సగటు వేగం = (v₁ + v₂)/2 అని గుర్తుంచుకోండి; x = v₁t + ½at² నుండి నిరూపించండి.

 

Question 3: ఒక కణం వేగ దిశ, కణ త్వరణ దిశతో పోల్చితే వేరుగా ఉండవచ్చా? అవును అయితే ఉదాహరణ ఇవ్వండి.

Answer:

వస్తువు వేగము మరియు త్వరణములు వేరు వేరు దిశలలో ఉండవచ్చును.
ఉదా:
1. ప్రక్షేపకాలలో క్షితిజ లంబదిశలో తొలి వేగము uy = u sinθ. ఇది ఊర్ధ్వ దిశలో ఉంటుంది. కాని గురుత్వ త్వరణం అధోదిశలో ఉంటుంది. అనగా వేగము, త్వరణాలు వ్యతిరేక దిశలో ఉన్నాయి.
2. ప్రక్షేపకాలలో క్షితిజ సమాంతర దిశలో వేగము X అక్షము వెంబడి ఉంటుంది. కాని త్వరణము y- అక్షము వెంబడి ఉంటుంది. అనగా వేగము, త్వరణాలు పరస్పర లంబదిశలో ఉన్నాయి.
పై ఉదాహరణల నుండి వేగము, త్వరణాలు వేరువేరు దిశలలో ఉండవచ్చును అని తెలుస్తోంది.

Exam Tips:

a) క్షితిజ సమాంతర, నిలువు వేగాలను విడిగా తీసుకొని, a = g నిలువుగా ఉంటుందని ఉదాహరణ ఇవ్వండి.

 

Question 4: ఎగురుతూ ఉన్న విమానం నుంచి పారాచూట్ సహాయంతో ఒక వ్యక్తి భూమి నుండి 3 km ఎత్తు నుంచి దూకాడు. అతడు భూమి నుంచి 1 km ఎత్తులో ఉన్నప్పుడు పారాచూట్ను పూర్తిగా విప్పాడు. అతడి గమనాన్ని వివరించండి.

Answer:

ఎ) పారాచూట్ తెరచుకోవడానికి ముందు కిందికి దిగిన దూరం \( h_1 = 3\ \mathrm{km} - 1\ \mathrm{km} = 2\ \mathrm{km} = 2000 \) మీ.
∴ భూమి నుండి 1 km ఎత్తు వద్ద వేగం \( v = \sqrt{2gh_1} = \sqrt{2\times 10\times 2000} = \sqrt{40000} = 200 \) మీ/సె.
2 km కిందికి దిగటానికి పట్టిన కాలం \( t = \sqrt{\frac{2h_1}{g}} = \sqrt{\frac{2\times 2000}{10}} = \sqrt{400} = 20 \) సె.
బి) పారాచూట్ తెరచుకున్న తరువాత అది భూమిని దాదాపు సున్న వేగంతో తాకుతుంది.
తొలివేగం \( v_0 = 200 \) మీ/సె, తుదివేగం v = 0, దూరం x = 1000 మీ.
పారాచూట్ త్వరణం (\( v^{2} - v_0^{2} = 2ax \) నుండి): \( a = \frac{0^{2} - 200^{2}}{2\times 1000} = \frac{-40000}{2000} = -20 \) మీ/సె²
కాలం \( t = \frac{v - v_0}{a} = \frac{0-200}{-20} = 10 \) సె.

Exam Tips:

a) రెండు దశలను (స్వేచ్ఛాపతనం, పారాచూట్ తెరచిన తరువాత మందగమనం) వేర్వేరుగా లెక్కించి v–t గ్రాఫ్ గీయండి.

 

Question 5: ఒక పక్షి తన ముక్కున ఒక పండు కరుచుకుని భూమికి సమాంతరంగా ఎగురుతున్నది. ఒకానొక ఎత్తున అది పండును జారవిడిచింది. (ఎ) పక్షి పరంగానూ (బి) భూమిపై నిలబడిన వ్యక్తి పరంగానూ కింద పడుతున్న పండు గమన పథాన్ని వివరించండి.

Answer:

పక్షి భూమికి సమాంతరంగా ఎగురుతున్నది. కావున దాని నోటి నుండి జారిపడిన పండు తొలివేగం (V₀) క్షితిజ సమాంతరంగా ఉంటుంది. నోటి నుండి జారిన తరువాత పండు పై గురుత్వ త్వరణం ‘g’ పనిచేస్తుంది. కాని పక్షి మరియు పండు ఒకే క్షితిజ సమాంతర వేగం కలిగి ఉండడం వల్ల పక్షికి పండు నిట్టనిలువుగా క్రిందికి పడినట్లు కనిపిస్తుంది.
భూమిపై నిలబడి పరిశీలించిన వ్యక్తికి పండుకు గల క్షితిజ సమాంతర మరియు గురుత్వ త్వరణం వలన కలిగిన క్షితిజ లంబ అంశ వేగాల ఫలితమైన పరావలయ మార్గం కనిపిస్తుంది.

Exam Tips:

a) పక్షి పరంగా పండు నిలువు సరళరేఖలో, భూమి పరంగా పరావలయ మార్గంలో పడుతుంది — ఈ రెండు ఫలితాలూ రాయండి.

 

Question 6: ఒకడు ఎత్తయిన భవన ఉపరితలంపై పరిగెడుతూ, పక్కనే కొద్దిగా తక్కువ ఎత్తున్న ఇంకొక భవనం పైకి క్షితిజ సమాంతరంగా దూకాడు. అతడి వేగం 9 m s ⁻¹, రెండు భవనాల మధ్య దూరం 10 m, భవనాల ఎత్తులలో తేడా 9 m అయితే అతడు
రెండవ భవనం పైకి దూకగలడా? (g = 10 m s ⁻²)

Answer:

తొలివేగం \( v_0 = 9 \) మీ/సె; భవనాల ఎత్తుల భేదం = 9 మీ; భవనాల మధ్య క్షితిజ సమాంతర దూరం x = 10 మీ.
సురక్షితంగా రెండవ భవనంపై దూకడానికి అతని క్షితిజ సమాంతర వ్యాప్తి R, భవనాల మధ్య దూరం x కన్నా ఎక్కువ ఉండాలి.
9 మీ ఎత్తు కిందికి పడటానికి పట్టే కాలం \( t = \sqrt{\frac{2h}{g}} = \sqrt{\frac{2\times 9}{10}} = \sqrt{1.8} = 1.34 \) సె
\( R = v_0 t = 9\sqrt{1.8} = 9\times 1.341 = 12.07 \) మీ
∵ R > x (12.07 మీ > 10 మీ) అతను సురక్షితంగా రెండవ భవనం మీదకు దూకగలడు.

Exam Tips:

a) R = v₀√(2h/g) తో సరిపోల్చి R > x షరతును నిర్ధారించండి; తుది వాక్యం స్పష్టంగా రాయండి.

 

Question 7: ఒక ఎత్తయిన భవనంపై నుంచి ఒక బంతిని జారవిడిచారు. అదే క్షణంలో అక్కడి నుంచే, ఇంకొక బంతిని కొంత వేగంతో క్షితిజ సమాంతరంగా విసిరారు. ఏ బంతి మొదటగా భూమిని చేరుతుంది? మీ సమాధానాన్ని వివరించండి.

Answer:

జారవిడిచిన బంతికి y దిశలో తొలివేగం సున్న: \( v_{0y} = 0 \)
క్షితిజ సమాంతరంగా విసిరిన బంతికి కూడా y దిశలో తొలివేగం సున్న: \( v_{0y} = 0 \). రెండు బంతులూ కిందికి దిగిన ఎత్తు y సమానం.
భూమిని చేరడానికి పట్టే కాలం \( t = \sqrt{\frac{2y}{g}} \) రెండింటికీ సమానం. కావున రెండు బంతులూ ఒకేసారి భూమిని చేరతాయి.
గమనిక: నిలువు గమన కాలం క్షితిజ సమాంతర వేగంపై ఆధారపడదు.

Exam Tips:

a) క్షితిజ సమాంతర వేగం భూమిని చేరే కాలాన్ని మార్చదు — నిలువు గమనం స్వతంత్రం.

 

Question 8: ఒక భవనంపై నుంచి ఒక బంతిని జారవిడిచారు. అదే క్షణంలో ఇంకొక బంతిని నిట్టనిలువుగా పైకి కొంత వేగంతో విసిరారు. ఆ బంతుల సాపేక్ష వేగాలలో మార్పును కాలం ప్రమేయంగా వివరించండి.

Answer:

భవనంపై నుంచి జారవిడిచిన బంతికి తొలివేగము Vₒ = 0; ఏదైనా క్షణంలో దాని వేగము V₁ = Vₒ + gt = gt ……………….. (1)
నిట్టనిలువుగా పైకి విసిరిన బంతికి తొలివేగము Vₒ = u అనుకోండి.
వస్తువుకు ఏదైనా క్షణంలో వేగము V₂ = Vₒ – gt = u – gt ……………….. (2)
ఈ వస్తువులు వ్యతిరేక దిశలో చలించడం వల్ల వాటి సాపేక్ష వేగము VR = V₂ + V₁ = u – gt + gt = u.
ఈ సందర్భంలో వాటి మధ్య సాపేక్ష వేగము ‘u’. ఇది కాలంతో పాటు మారదు.
ఎందుకనగా మొదటి వస్తువు వేగం ఎంత పెరిగితే పైకి విసిరిన వస్తువు వేగం అదే కాలంలో అంతే తగ్గుతుంది కావున.

Exam Tips:

a) సాపేక్ష వేగం కాలంతో మారదు (= u), ఎందుకంటే రెండు బంతులకూ త్వరణం సమానం.

 

Question 9: ఒకానొక వర్ష బిందువు వ్యాసం 4 mm. భూమి నుంచి 1 km ఎత్తున గల మేఘం నుంచి ఆ వర్ష బిందువు జారిపడితే అది భూమిని ఎంత ద్రవ్యవేగంతో తాకుతుంది?

Answer:

వర్షపు బిందువు వ్యాసం D = 4 మి.మీ. ⇒ వ్యాసార్ధం \( r = 2\ \mathrm{mm} = 2\times 10^{-3}\ \mathrm{m} \)
ద్రవ్యరాశి m = ఘనపరిమాణం × సాంద్రత \( = \frac{4}{3}\pi r^{3}\times 1000 \) (నీటి సాంద్రత 1000 kg/m³)
\( m = \frac{4}{3}\times\frac{22}{7}\times(2\times 10^{-3})^{3}\times 1000 = 33.52\times 10^{-6}\ \mathrm{kg} \)
ఎత్తు h = 1 కి.మీ. = 1000 మీ; g = 9.8 మీ/సె²
నేలను తాకే ముందు వేగం \( v = \sqrt{2gh} = \sqrt{2\times 9.8\times 1000} = \sqrt{19600} = 140 \) మీ/సె
ద్రవ్యవేగం \( p = mv = 33.52\times 10^{-6}\times 140 = 4.693\times 10^{-3}\ \mathrm{kg\,m\,s^{-1}} \)

Exam Tips:

a) ద్రవ్యరాశి = ఘనపరిమాణం × సాంద్రత, తరువాత p = mv; యూనిట్లు (kg m s⁻¹) తప్పక రాయండి.

 

Question 10: క్షితిజంతో 45° కోణంతో ప్రక్షిప్తం చేసిన ప్రక్షేపకం చేరే గరిష్ఠ ఎత్తు దాని వ్యాప్తిలో నాలుగో వంతు ఉంటుందని చూపండి.

Answer:

ప్రక్షేపకంలో వ్యాప్తి \( R = \frac{u^{2}\sin 2\theta}{g} \), గరిష్ఠ ఎత్తు \( h_{max} = \frac{u^{2}\sin^{2}\theta}{2g} \)
θ = 45° కావున \( \sin 90^{\circ} = 1,\ \sin 45^{\circ} = \frac{1}{\sqrt{2}} \)
\( R = \frac{u^{2}\times 1}{g} = \frac{u^{2}}{g} \) → (1)
\( h_{max} = \frac{u^{2}\left(1/\sqrt{2}\right)^{2}}{2g} = \frac{u^{2}}{4g} \) → (2)
(1), (2) నుండి \( R = \frac{u^{2}}{g} = 4\,\frac{u^{2}}{4g} = 4h_{max} \), అనగా θ = 45° అయినప్పుడు గరిష్ఠ ఎత్తు \( h_{max} = \frac{R}{4} \).

Exam Tips:

a) R = u² sin2θ/g, H = u² sin²θ/2g సూత్రాలతో θ = 45° ప్రతిక్షేపించి H = R/4 చూపండి.

 

అదనపు ప్రశ్నలు

Question 1: వేగ – కాల వక్రాలు అనగానేమి? వివిధ రకాలైన వేగ – కాల వక్రాల ఆకృతులు, వాటి ఉపయోగాలు తెలుపండి.

Answer:

వేగ–కాల వక్రం (v–t గ్రాఫ్): వేగం v ని Y-అక్షం మీద, కాలం t ని X-అక్షం మీద తీసుకొని గీసిన రేఖాచిత్రాన్ని వేగ–కాల వక్రం అంటారు.
a) సమవేగంతో చలించే వస్తువు వేగ–కాల వక్రం X-అక్షానికి సమాంతరంగా ఉండే సరళరేఖ.
b) నిశ్చలస్థితి నుండి బయలుదేరి సమత్వరణంతో చలించే వస్తువు వేగ–కాల వక్రం మూలబిందువు గుండా పోయే సరళరేఖ.
c) తొలివేగం \( v_0 \) తో బయలుదేరి సమత్వరణంతో చలించే వస్తువు వేగ–కాల వక్రం Y-అక్షంపై అంతరఖండం (\( v_0 \)) కలిగి X-అక్షంతో కొంత కోణం చేసే సరళరేఖ.
d) వేగ–కాల వక్రం వాలు వస్తువు త్వరణం a ను ఇస్తుంది.
e) వేగ–కాల వక్రం కింద వైశాల్యం వస్తువు స్థానభ్రంశం s ను తెలియజేస్తుంది.
f) వేగ–కాల వక్రాల నుండి గతిశాస్త్ర సమీకరణాలు \( v = v_0 + at,\ x = v_0t + \frac{1}{2}at^{2},\ v^{2} - v_0^{2} = 2ax \) లను ఉత్పాదించవచ్చు.

Exam Tips:

a) మూడు రకాల v–t గ్రాఫ్‌ల బొమ్మలు గీసి, వాలు = త్వరణం, వైశాల్యం = స్థానభ్రంశం అని రాయండి.

 

Question 2: వేగ – కాల వక్రాల నుండి గతిశాస్ త్రప్రాథమిక సమీకరణాలు ఉత్పాదించండి.

Answer:

తొలివేగం \( v_0 \) తో బయలుదేరి సమత్వరణం a తో చలించే వస్తువు వేగ–కాల వక్రం పటంలో చూపినట్లు ఉంటుంది.

1) \( v = v_0 + at \) ఉత్పాదన:
వేగ–కాల వక్రం వాలు \( \frac{dy}{dx} \) వస్తువు త్వరణం a ను సూచిస్తుంది. పటంలో AC = dx = t, BC = BD − CD = v − \( v_0 \) = dy
\( \therefore\ a = \frac{dy}{dx} = \frac{v - v_0}{t} \Rightarrow at = v - v_0 \Rightarrow v = v_0 + at \)
2) \( x = v_0t + \frac{1}{2}at^{2} \) ఉత్పాదన:
వేగ–కాల వక్రం కింద వైశాల్యం స్థానభ్రంశాన్ని సూచిస్తుంది. ∴ x = OABD వైశాల్యం = దీర్ఘచతురస్రం OACD వైశాల్యం + త్రిభుజం ABC వైశాల్యం → (1)
OACD వైశాల్యం = OA × OD = \( v_0t \) → (2)
త్రిభుజం ABC వైశాల్యం \( = \frac{1}{2}\times AC\times BC = \frac{1}{2}t(v - v_0) \); కాని \( v - v_0 = at \) ∴ త్రిభుజ వైశాల్యం \( = \frac{1}{2}at^{2} \) → (3)
(1), (2), (3) నుండి \( x = v_0t + \frac{1}{2}at^{2} \)
3) \( v^{2} - v_0^{2} = 2ax \) ఉత్పాదన:
స్థానభ్రంశం x = సగటు వేగం × కాలం; సగటు వేగం \( = \frac{v+v_0}{2} \) మరియు కాలం \( t = \frac{v - v_0}{a} \)
\( \therefore\ x = \left(\frac{v+v_0}{2}\right)\left(\frac{v-v_0}{a}\right) = \frac{v^{2}-v_0^{2}}{2a} \) లేదా \( v^{2} - v_0^{2} = 2ax \)

Exam Tips:

a) గ్రాఫ్ గీసి A, B, C, D బిందువులను గుర్తించి ప్రతి సమీకరణ ఉత్పాదనను వాలు, వైశాల్యాల ఆధారంగా రాయండి.

 

లెక్కలు

Question 1: ఒకడు ఒక తిన్నని రోడ్డు వెంట తన ఇంటి నుంచి 2.5 km దూరాన ఉన్న మార్కెట్కు 5 km h⁻¹ వడితో నడిచాడు. మార్కెట్ మూసి ఉండటం గమనించి, వెంటనే వెనుదిరిగి ఇంటికి 7.5 km h⁻¹ వడితో చేరాడు. 0 నుండి 50 నిమిషాల కాలవ్యవధిలో అతడి (a) సగటు వేగ పరిమాణం, (b) సగటు వడి ఎంత?

Answer:

ఇంటి నుండి మార్కెట్‌కు వెళ్ళడానికి పట్టిన కాలం \( t_1 = \frac{2.5}{5} = \frac{1}{2} \) గం.
మార్కెట్ నుండి ఇంటికి రావడానికి పట్టిన కాలం \( t_2 = \frac{2.5}{7.5} = \frac{1}{3} \) గం.
∴ మొత్తం కాలం \( t = t_1 + t_2 = \frac{1}{2} + \frac{1}{3} = \frac{5}{6} \) గం. = 50 ని.
0 నుండి 50 నిమిషాల మధ్య ప్రయాణించిన మొత్తం దూరం = 2.5 + 2.5 = 5 km; మొత్తం స్థానభ్రంశం = 0
a) సగటు వేగం \( = \frac{\text{స్థానభ్రంశం}}{\text{కాలం}} = 0 \)
b) సగటు వడి \( = \frac{\text{దూరం}}{\text{కాలం}} = \frac{5}{5/6} = 6 \) km/h

Exam Tips:

a) సగటు వేగం (స్థానభ్రంశం/కాలం) మరియు సగటు వడి (దూరం/కాలం) మధ్య తేడా గమనించండి — తిరిగి మొదటి చోటికి వస్తే సగటు వేగం సున్న.

 

Question 2: ఒక కారు మొదటి మూడు వంతుల దూరాన్ని 10 kmph వేగంతోనూ, రెండవ మూడువంతుల దూరాన్ని 20 kmph వేగంతోనూ, చివరి మూడు వంతుల దూరాన్ని 60 kmph వేగంతోనూ ప్రయాణిస్తే, మొత్తం దూరాన్ని పూర్తి చేయడంలో కారు సగటు వడి ఎంత? (మే 2014)

Answer:

మొత్తం దూరం = s; \( s_1 = s_2 = s_3 = \frac{s}{3} \); వేగాలు \( v_1 = 10,\ v_2 = 20,\ v_3 = 60 \) kmph
మొత్తం కాలం \( t = t_1+t_2+t_3 = \frac{s}{3v_1}+\frac{s}{3v_2}+\frac{s}{3v_3} = \frac{s}{3}\left(\frac{v_2v_3+v_3v_1+v_1v_2}{v_1v_2v_3}\right) \)
\( = \frac{s}{3}\left[\frac{(20\times 60)+(60\times 10)+(10\times 20)}{10\times 20\times 60}\right] = \frac{s}{3}\cdot\frac{2000}{12000} \)
సగటు వడి \( = \frac{s}{t} = \frac{3\times 12000}{2000} = 18 \) kmph

Exam Tips:

a) మూడు సమాన దూరాలకు సగటు వడి = 3/(1/v₁ + 1/v₂ + 1/v₃) (హార్మోనిక్ సగటు); సరళ సగటు తీసుకోవడం తప్పు.

 

Question 3: ఒక తుపాకి గుండు 150 m s⁻¹ వడితో ప్రయాణిస్తూ చెట్టును తాకి 3.5 cm దూరం దూసుకొని పోయి ఆగిపోయింది. చెట్టు కాండంలో గుండు ఋణత్వరణం పరిమాణం, చెట్టును తాకిన తరువాత గుండు ఆగిపోవడానికి పట్టిన కాలం ఎంత?

Answer:

బుల్లెట్ తొలివేగం u = 150 m/s; తుదివేగం v = 0; దూరం s = 3.5 cm = \( 3.5\times 10^{-2} \) m
a) త్వరణం \( a = \frac{v^{2}-u^{2}}{2s} = \frac{0 - 150^{2}}{2\times 3.5\times 10^{-2}} = -3.214\times 10^{5}\ \mathrm{m\,s^{-2}} \) (ఋణ గుర్తు ఋణత్వరణాన్ని సూచిస్తుంది)
b) ఆగిపోవుటకు పట్టిన కాలం \( t = \frac{v-u}{a} = \frac{-150}{-3.214\times 10^{5}} = 4.67\times 10^{-4} \) సె.

Exam Tips:

a) ఋణత్వరణం విలువలో ఋణ గుర్తును వ్యాఖ్యతో రాయండి; cm ను m లోకి మార్చడం మరవకండి.

 

Question 4: ఒక మోటారు వాహకుడు మోటారును 30 నిమిషాలపాటు 85 km/h వేగంతో ఉత్తర దిశగా నడిపి 15 నిమిషాలపాటు ఆగిపోయాడు. తరువాత ఉత్తర దిశలోనే ప్రయాణించి 2 గంటలలో 130 km దూరం వెళ్ళాడు. అతడి మొత్తం స్థానభ్రంశం, సగటు వేగం ఎంత?

Answer:

మొదటి భాగం: వేగం \( v_1 = 85 \) kmph, కాలం \( t_1 = 30 \) ని.; దూరం \( s_1 = v_1t_1 = 85\times\frac{30}{60} = 42.5 \) km
రెండవ భాగం: దూరం \( s_2 = 0 \), కాలం \( t_2 = 15 \) ని.
మూడవ భాగం: దూరం \( s_3 = 130 \) km, కాలం \( t_3 = 120 \) ని. = 2 గం.
a) మొత్తం దూరం (= మొత్తం స్థానభ్రంశం, ఎందుకంటే అన్నీ ఉత్తర దిశలోనే) \( s = 42.5 + 0 + 130 = 172.5 \) km
b) మొత్తం కాలం \( t = 30 + 15 + 120 = 165 \) ని. \( = 2\frac{3}{4} = \frac{11}{4} \) గం.
∴ సగటు వేగం \( = \frac{\text{మొత్తం స్థానభ్రంశం}}{\text{మొత్తం కాలం}} = \frac{172.5}{11/4} = 62.7 \) kmph (ఉత్తర దిశలో).

Exam Tips:

a) అన్ని భాగాల దూరం, కాలం కూడిన తరువాత మాత్రమే సగటు తీసుకోండి; విరామ సమయం (15 ని.) కూడా మొత్తం కాలంలో చేర్చండి.

 

Question 5: ఒక భవనం పైకప్పు నుంచి బంతి Aని జారవిడిచిన క్షణంలోనే, అలాంటిదే బంతి B ను భూమిపై నుంచి నిట్టనిలువుగా పైకి విసిరారు. బంతులు ఢీకొట్టుకున్న క్షణంలో బంతి A వడి, బంతి B వడికి రెట్టింపు ఉంది. బంతులు అభిఘాతం జరుపుకొన్న ఎత్తు, భవనం ఎత్తులో ఎన్నో వంతు ఉంటుంది?

Answer:


బంతి A ను h ఎత్తు నుంచి జారవిడిచారు; రెండు బంతులు భూమి నుండి x ఎత్తులో ఢీకొన్నాయి అనుకుందాం. ఢీకొన్నప్పుడు \( v_A = 2v_B \).
జారవిడిచిన బంతి: \( h - x = \frac{1}{2}gt^{2} \) → (1)
పైకి విసిరిన బంతి: \( x = ut - \frac{1}{2}gt^{2} \) → (2)
x వద్ద వేగాలు: \( v_A = gt \) → (3), \( v_B = u - gt \) → (4)
కాని \( v_A = 2v_B \) ⇒ \( gt = 2(u - gt) \Rightarrow u = \frac{3gt}{2} \) → (5)
(1) ని (2) చే భాగించగా \( \frac{h-x}{x} = \frac{\tfrac{1}{2}gt^{2}}{ut - \tfrac{1}{2}gt^{2}} \). (5) నుండి u ను ప్రతిక్షేపించగా \( ut - \tfrac{1}{2}gt^{2} = \tfrac{3}{2}gt^{2} - \tfrac{1}{2}gt^{2} = gt^{2} \), కావున \( \frac{h-x}{x} = \frac{1}{2} \Rightarrow \frac{h}{x} = \frac{3}{2} \Rightarrow x = \frac{2h}{3} \)
అనగా బంతులు భవనం ఎత్తులో \( \frac{2}{3} \) వంతు ఎత్తులో (భూమి నుండి) ఢీకొంటాయి.

Exam Tips:

a) ఢీకొనే క్షణంలో రెండు వస్తువులు కదిలిన కాలం సమానం; v_A = 2v_B షరతు ఉపయోగించి u = 3gt/2 రాబట్టండి.

 

Question 6: 16 m ఎత్తు గల ఒక భవనం పై కప్పు నుంచి క్రమ కాలవ్యవధులలో నీటి బిందువులు పడుతున్నాయి. మొదటి నీటి బిందువు భూమిని తాకిన క్షణంలో, అయిదవ నీటి బిందువు పైకప్పును వదిలింది. వరుస నీటి బిందువుల మధ్య దూరం కనుక్కోండి.

Answer:


భవనం ఎత్తు h = 16 m. బిందువు భూమిని చేరడానికి పట్టే కాలం \( t = \sqrt{\frac{2h}{g}} = \sqrt{\frac{2\times 16}{9.8}} = \sqrt{3.26} = 1.8 \) సె.
బిందువుల సంఖ్య n = 5 ⇒ కాలవ్యవధుల సంఖ్య = n − 1 = 4. ఒక్కొక్క వ్యవధి \( = \frac{1.8}{4} = 0.45 \) సె.
మొదటి బిందువు: \( t_1 = 4 imes 0.45 = 1.8 \) సె, \( S_1 = \frac{1}{2}gt_1^{2} = \frac{1}{2}\times 9.8\times 1.8^{2} = 16 \) m
రెండవ బిందువు: \( t_2 = 3 imes 0.45 = 1.35 \) సె, \( S_2 = \frac{1}{2}\times 9.8\times 1.35^{2} = 4.9\times 1.822 = 9 \) m
మూడవ బిందువు: \( t_3 = 2 imes 0.45 = 0.9 \) సె, \( S_3 = \frac{1}{2}\times 9.8\times 0.9^{2} = 3.97 \simeq 4 \) m
నాల్గవ బిందువు: \( t_4 = 0.45 \) సె, \( S_4 = \frac{1}{2}\times 9.8\times 0.45^{2} \simeq 1 \) m
ఐదవ బిందువు: \( t_5 = 0 \), \( S_5 = 0 \) m
వరుస బిందువుల మధ్య దూరాలు: 1వ–2వ: 16 − 9 = 7 m; 2వ–3వ: 9 − 4 = 5 m; 3వ–4వ: 4 − 1 = 3 m; 4వ–5వ: 1 − 0 = 1 m.
∴ వరుస బిందువుల మధ్య దూరాలు 7 m, 5 m, 3 m మరియు 1 m.

Exam Tips:

a) పతనదూరాలు 1:3:5:7 నిష్పత్తిలో ఉంటాయని గమనించి సరిచూసుకోండి.

 

Question 7: ఒక వేటగాడు తనకు కొంత దూరంలో ఉన్న చెట్టు నుంచి వేలాడుతున్న ఒక కోతికి తుపాకీ గురిపెట్టాడు. వేటగాడు తుపాకీ పేల్చిన క్షణాన, గుండు తగలకుండా తప్పించుకోవాలని కోతి కొమ్మను విడిచి జారిపడింది. కోతిది తప్పుడు నిర్ణయం అని వివరించండి.

Answer:

బుల్లెట్‌ను ప్రక్షిప్తం చేసిన కోణం α, వేటగాని నుండి కోతికి దూరం x, కోతి ఎత్తు h అనుకుందాం.
కోతిని ఖచ్చితంగా గురిపెట్టినపుడు \( h = (u\sin\alpha)\,t \) (t సమయంలో బుల్లెట్ సరళరేఖ మార్గంలో చేరే ఎత్తు).
గురుత్వం వలన t సమయంలో బుల్లెట్ ఎత్తు \( h_1 = u\sin\alpha\,t - \frac{1}{2}gt^{2} = h - \frac{1}{2}gt^{2} \) → (1)
కోతి స్వేచ్ఛగా పడుతుంటే t సెకనులలో కిందికి పడిన దూరం \( \frac{1}{2}gt^{2} \). కావున కోతి కొత్త ఎత్తు \( h_2 = h - \frac{1}{2}gt^{2} \) → (2)
(1), (2) నుండి \( h_1 = h_2 \) ఋజువైంది. కావున కోతి కొమ్మను వదిలి కిందికి పడటం వల్ల బుల్లెట్ దానికి ఖచ్చితంగా తగులుతుంది. అనగా కోతి తప్పు నిర్ణయం తీసుకుంది.

Exam Tips:

a) బుల్లెట్, కోతి రెండూ కిందికి పడతాయి కావున గురి తప్పదు (రెండింటికీ ఒకే గురుత్వ త్వరణం g) — ఈ ముఖ్యాంశం రాయండి.

 

Question 8: భూమి నుంచి 500 m ఎత్తున 360 kmph వడితో క్షితిజ సమాంతర దిశలో ప్రయాణిస్తున్న విమానం నుంచి ఆహారపు పొట్లాన్ని జారవిడిచారు. (i) పొట్లం అవరోహణ కాలం, (ii) జారవిడిచిన బిందువు నుండి క్షితిజ సమాంతరంగా ఎంత దూరంలో పొట్లం భూమిని చేరుతుందో కనుక్కోండి.

Answer:

విమానం వేగం \( v = 360\ \mathrm{kmph} = 360\times\frac{5}{18} = 100 \) మీ/సె; ఎత్తు h = 500 మీ; g = 10 మీ/సె²
i) పొట్లం అవరోహణ కాలం \( t = \sqrt{\frac{2h}{g}} = \sqrt{\frac{2\times 500}{10}} = \sqrt{100} = 10 \) సెకనులు
ii) క్షితిజ సమాంతర దూరం (వ్యాప్తి) \( R = u\sqrt{\frac{2h}{g}} = 100\times 10 = 1000 \) మీ.

Exam Tips:

a) కిమీ/గం ను మీ/సె లోకి మార్చడానికి ×5/18 ఉపయోగించండి.

 

Question 9: ఒక భవనం కిటికీ నుంచి, క్షితిజానికి 20° కిందగా, 8 ms⁻¹ వేగంతో ఒక బంతిని విసిరారు. బంతి భూమిని 3s తరువాత తాకింది. బంతిని ఎంత ఎత్తు నుంచి విసిరారు? భవనం పునాది నుంచి ఎంత దూరంలో బంతి భూమిని తాకుతుంది?

Answer:

తొలివేగం u = 8 మీ/సె; క్షితిజానికి 20° కిందికి విసిరారు; కాలం t = 3 సె; g = 9.8 మీ/సె²
క్షితిజ సమాంతర తొలివేగం \( u_x = u\cos\theta = 8\cos 20^{\circ} = 8\times 0.94 = 7.52 \) మీ/సె
నిలువు (కిందివైపు) తొలివేగం \( u_y = u\sin\theta = 8\sin 20^{\circ} = 8\times 0.342 = 2.74 \) మీ/సె
బంతిని కిందివైపు విసిరారు కావున కిందివైపు దిశను ధనదిశగా తీసుకోవాలి.
a) విసిరిన ఎత్తు \( h = u_yt + \frac{1}{2}gt^{2} = 2.74\times 3 + \frac{1}{2}\times 9.8\times 3^{2} = 8.2 + 44.1 = 52.3 \) మీ.
b) భవనం పునాది నుండి దూరం \( x = u_xt = 7.52\times 3 = 22.56 \) మీ.

Exam Tips:

a) కిందివైపు విసిరితే తొలి నిలువు వేగం కూడా కిందివైపే; కిందివైపును ధనదిశగా తీసుకొని h = u_y t + ½gt² వాడండి.

 

Question 10: క్షితిజంతో 30°, 60° చేసే దిశలలో, ఒకే బిందువు నుంచి రెండు బంతులను ప్రక్షిప్తం చేశారు. ఆ రెండు బంతులూ (a) ఒకే ఎత్తును చేరితే, (b) ఒకే వ్యాప్తిని కలిగి ఉంటే వాటి తొలివేగాల నిష్పత్తి ఎంత?

Answer:

మొదటి బంతి ప్రక్షేప కోణం \( \theta_1 = 30^{\circ} \), రెండవ బంతి \( \theta_2 = 60^{\circ} \); తొలివేగాలు \( u_1,\ u_2 \) అనుకుందాం.
(a) రెండూ ఒకే గరిష్ఠ ఎత్తును చేరితే \( h_{max1} = h_{max2} \):
\( \frac{u_1^{2}\sin^{2}30^{\circ}}{2g} = \frac{u_2^{2}\sin^{2}60^{\circ}}{2g} \Rightarrow \frac{u_1}{u_2} = \frac{\sin 60^{\circ}}{\sin 30^{\circ}} = \frac{\sqrt{3}/2}{1/2} = \sqrt{3} \)
∴ తొలివేగాల నిష్పత్తి \( u_1 : u_2 = \sqrt{3} : 1 \)
(b) రెండింటికీ వ్యాప్తి సమానమైతే: \( R = \frac{u^{2}\sin 2\theta}{g} \)
\( \frac{u_1^{2}\sin 60^{\circ}}{g} = \frac{u_2^{2}\sin 120^{\circ}}{g} \Rightarrow \frac{u_1^{2}}{u_2^{2}} = \frac{\sin 120^{\circ}}{\sin 60^{\circ}} = 1 \) (∵ sin 120° = sin 60°)
∴ వేగాల నిష్పత్తి \( u_1 : u_2 = 1 : 1 \)

Exam Tips:

a) ఒకే ఎత్తు: u sinθ సమానం; ఒకే వ్యాప్తి: θ మరియు (90° − θ) సంపూరకాలు — వ్యాప్తి సమానమైతే వేగాలు సమానం.

 

ముఖ్యమైన ఉదాహరణ లెక్కలు

Question 1: ఒక కారు ఒక సరళరేఖ వెంబడి, OP అనుకుందాం, గమనంలో ఉన్నది. అది 18 s లో O నుంచి P బిందువును చేరి మరల P నుంచి వెనుదిరిగి Q బిందువును 6.0 s లో చేరింది. (a) O నుంచి P ను చేరినప్పుడు, (b) O నుంచి P ను, అటు నుంచి వెనుదిరిగి Q ను చేరినప్పుడు వస్తువు సగటు వేగం, సగటు వడి విలువలేమిటి?

Answer:

OP = 360 m, OQ = 240 m (Q, P కి 120 m వెనుక)

a) O నుండి P కు: సగటు వేగం \( = \frac{\text{స్థానభ్రంశం}}{\text{కాలవ్యవధి}} = \frac{+360\ \mathrm{m}}{18\ \mathrm{s}} = +20\ \mathrm{m\,s^{-1}} \)
సగటు వడి \( = \frac{\text{పథం పొడవు}}{\text{కాలవ్యవధి}} = \frac{360}{18} = 20\ \mathrm{m\,s^{-1}} \)
ఈ సందర్భంలో సగటు వడి సగటు వేగ పరిమాణానికి సమానం.
b) O నుండి P, అటునుండి వెనుదిరిగి Q కు: సగటు వేగం \( = \frac{+240\ \mathrm{m}}{(18+6.0)\ \mathrm{s}} = +10\ \mathrm{m\,s^{-1}} \)
సగటు వడి \( = \frac{OP + PQ}{\Delta t} = \frac{(360+120)\ \mathrm{m}}{24\ \mathrm{s}} = 20\ \mathrm{m\,s^{-1}} \)

Exam Tips:

a) సగటు వేగం (సదిశ) = స్థానభ్రంశం/కాలం; సగటు వడి (అదిశ) = పథం పొడవు/కాలం — ప్రతి భాగానికి విడిగా లెక్కించండి.

 

Question 2: x- అక్షం వెంబడి గమనంలో ఉన్న ఒక వస్తువు స్థానం x = a + bt² గా ఇవ్వడమైంది. ఇక్కడ a = 8.5m, b = 2.5ms ⁻², t ను సెకండ్లో కొలిచారు. t = 0s,t = 2.0 s వద్ద వేగం ఎంత? t = 2.0 s, t = 4.0 s మధ్య సగటు వేగం ఎంత?

Answer:

వేగం \( v = \frac{dx}{dt} = \frac{d}{dt}(a + bt^{2}) = 2bt = 5.0t\ \mathrm{m\,s^{-1}} \)
t = 0 s వద్ద v = 0 m s⁻¹; t = 2.0 s వద్ద v = 10 m s⁻¹
సగటు వేగం \( = \frac{x_2-x_1}{t_2-t_1} = \frac{x(4.0)-x(2.0)}{4.0-2.0} = \frac{a+16b-a-4b}{2.0} = 6.0\,b = 6.0\times 2.5 = 15\ \mathrm{m\,s^{-1}} \)

Exam Tips:

a) v = dx/dt తో అవకలనం చేసి, సగటు వేగానికి (x₂ − x₁)/(t₂ − t₁) ఉపయోగించండి — తేడా చూపండి.

 

Question 3: ఉత్తర – దక్షిణ దిశలో రెండు సమాంతర రైలు మార్గాలున్నాయి. రైలు A 54 km h⁻¹ వడితో ఉత్తరం వైపు, రైలు B 90 km h⁻¹ వడితో దక్షిణంవైపు ప్రయాణిస్తున్నాయి. (a) A పరంగా B వేగం ఎంత? (b) B పరంగా భూమి వేగం ఎంత? (c) రైలు A పైకప్పుపై 18km h⁻¹ వేగంతో రైలు వేగానికి వ్యతిరేక దిశలో పరుగెడుతున్న కోతి సాపేక్ష వేగం భూమిపై నిల్చున్న పరిశీలకుడి పరంగా ఎంత?

Answer:

దక్షిణం నుండి ఉత్తరం వైపు దిశను ధన x-అక్షంగా తీసుకుందాం. అప్పుడు \( v_A = +54\ \mathrm{km\,h^{-1}} = 15\ \mathrm{m\,s^{-1}} \), \( v_B = -90\ \mathrm{km\,h^{-1}} = -25\ \mathrm{m\,s^{-1}} \)
a) A పరంగా B సాపేక్ష వేగం \( = v_B - v_A = -40\ \mathrm{m\,s^{-1}} \), అంటే రైలు A పరంగా రైలు B, 40 m s⁻¹ వడితో ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది.
b) B పరంగా భూమి సాపేక్ష వేగం \( = 0 - v_B = +25\ \mathrm{m\,s^{-1}} \)
c) భూమి పరంగా కోతి వేగం \( v_M \) అనుకుందాం. రైలు A పరంగా కోతి సాపేక్ష వేగం \( v_{MA} = v_M - v_A = -18\ \mathrm{km\,h^{-1}} = -5\ \mathrm{m\,s^{-1}} \). అందువల్ల \( v_M = (15 - 5) = 10\ \mathrm{m\,s^{-1}} \) (ఉత్తర దిశలో).

Exam Tips:

a) ఒక దిశను ధనంగా తీసుకొని సాపేక్ష వేగం v_B − v_A సూత్రం ఉపయోగించండి.

 

Question 4: ఒక బహుళ అంతస్థు పైభాగం నుంచి ఒక బంతిని నిట్టనిలువుగా పైకి 20 m s⁻¹
వేగంతో విసిరారు. బంతిని విసిరిన బిందువు భూమి నుంచి 25.0m ఎత్తున ఉంది. (a) బంతి ఎంత ఎత్తుకు ఎగురుతుంది? (b) విసిరిన తరువాత బంతి భూమిని తాకడానికి ఎంత కాలము పడుతుంది? g = 10 ms⁻² గా తీసుకోండి (g నిజ విలువ 9.8 ms ⁻²).

Answer:

తొలివేగం \( v_0 = 20 \) m/s; g = 10 m/s²; భవనం పైభాగం ఎత్తు \( y_0 = 25 \) m; గరిష్ఠ ఎత్తు వద్ద తుదివేగం v = 0
a) \( v^{2} - v_0^{2} = 2a(y - y_0) \) నుండి \( 0 - 20^{2} = 2\times(-10)(y - y_0) \Rightarrow y - y_0 = 20 \) m. అనగా బంతి విసిరిన బిందువు నుండి 20 m ఎత్తుకు (భూమి నుండి 45 m) ఎగురుతుంది.
b) భూమిని తాకడానికి పట్టిన కాలం: \( y = y_0 + v_0t + \frac{1}{2}at^{2} \); y = 0 (భూమి వద్ద), \( a = -10 \) m/s²
\( 0 = 25 + 20t - 5t^{2} \Rightarrow t^{2} - 4t - 5 = 0 \Rightarrow (t-5)(t+1) = 0 \)
t = 5 s లేదా t = −1 s. కాలం ఋణాత్మకం కాదు కావున బంతి భూమిని చేరడానికి పట్టిన కాలం t = 5 s.

Exam Tips:

a) బంతి విసిరిన బిందువు నుండి గరిష్ఠ ఎత్తు, భూమి నుండి గరిష్ఠ ఎత్తు — రెండింటినీ వేరు చేసి రాయండి; t యొక్క ఋణ మూలాన్ని త్యజించండి.

 

అదనపు లెక్కలు

Question 1: కింద ఇచ్చిన గమన సంబంధ ఉదాహరణలలో దేనిలో వస్తువును బిందు వస్తువుగా ఉజ్జాయింపు చేయవచ్చు.
a) రెండు స్టేషన్ల మధ్య కుదుపులు లేకుండా ప్రయాణించే రైలు కారేజ్.
b) వృత్తాకార మార్గంలో సైకిల్ తొక్కే వ్యక్తి తలపై కూర్చున్న కోతి.
c) స్పిన్ తిరుగుతూ భూమిని తాకి హఠాత్తుగా మలుపు తిరిగిన క్రికెట్ బంతి.
d) టేబుల్ అంచు నుంచి జారిపడి అటూ ఇటూ దొర్లుతున్న బీకర్.

Answer:

a) స్టేషన్ల మధ్య దూరంతో పోలిస్తే రైలు కారేజ్ పరిమాణం చాలా చిన్నది. కావున దీన్ని బిందు వస్తువుగా భావించవచ్చు.
b) వృత్తాకార మార్గ వ్యాసార్ధం బాగా ఎక్కువగా ఉంటే కోతిని బిందు వస్తువుగా భావించవచ్చు.
c) బంతి భూమిని తాకి మలుపు తిరిగేటప్పుడు బంతి పరిమాణం, మలుపు చాపంతో పోలిస్తే చిన్నదికాదు. కావున దీనిని బిందు వస్తువుగా భావించలేము.
d) బల్ల ఎత్తుతో పోల్చితే బీకరు పరిమాణాన్ని విస్మరించలేము. కావున దీనిని బిందు వస్తువుగా భావించలేము.

Exam Tips:

a) పరిమాణం, దూరంతో పోలిస్తే చాలా చిన్నదైతే మాత్రమే వస్తువును బిందు వస్తువుగా భావించవచ్చు.

 

Question 2: ఇద్దరు పిల్లు A, B లు వారి స్కూలు () నుంచి వారి ఇళ్ళు P,Q లకు తిరిగి ప్రయాణమయ్యే సందర్భంలో వారి గమనాన్ని సూచించే స్థానం – కాలం (x – t) గ్రాఫు చూపడం జరిగింది. కింద ఇచ్చిన బ్రాకెట్లో సరియైన ఎంపికచేయండి.
a) (A/B) స్కూలుకు (B/A) కంటే దగ్గరగా ఉంటాడు.
b) (A/B) స్కూలుకు (B/A) కంటే ముందుగా బయలుదేరుతాడు.
c) (A/B), (B/A) కంటే వేగంగా నడుస్తాడు.
d) A, B లు ఇంటికి (ఒకే సమయంలో / వేరు వేరు సమయాలలో) చేరుతారు.
e) (A/B) ప్రయాణంలో (B/A) ను (ఒకసారి/రెండుసార్లు) దాటి వెళతాడు.

Answer:

a) A. (P బిందువు Q కన్నా దగ్గర: OP < OQ, కావున A ఇల్లు B ఇంటికన్నా స్కూలుకు దగ్గర.)
b) A. (A కు t = 0 వద్ద x = 0, కాని B కు t = 0 వద్ద x ≠ 0 కావున B కన్నా A ముందుగా బయలుదేరతాడు.)
c) B. (x–t గ్రాఫ్ వాలు వేగాన్ని ఇస్తుంది. A రేఖ వాలు కన్నా B రేఖ వాలు ఎక్కువ.)
d) ఒకే సమయంలో. (P, Q ల నుండి t-అక్షానికి సమాంతరంగా గీసిన రేఖలు A, B రేఖలను ఒకే కాలం వద్ద ఖండిస్తాయి.)
e) B, A ను ఒకసారి దాటి వెళతాడు. (A, B రేఖలు ఒక్క బిందువు వద్ద మాత్రమే ఖండించుకుంటాయి.)

Exam Tips:

a) x–t గ్రాఫ్‌లో వాలు = వేగం; రేఖల ఖండన బిందువులు = కలుసుకునే సందర్భాలు.

 

Question 3: ఒక స్ త్రీఇంటి వద్ద 9 am కు బయలుదేరి, కాలి నడకన 5km h⁻¹ వడితో తిన్నని రోడ్డుపై 2.5 km దూరంలో ఉ న్న కార్యాలయానికి చేరి, 5pm వరకు అక్కడ ఉండిపోయి, ఆటోలో 25 km h⁻¹ వడితో తిరిగి ఇంటికి చేరింది. తగిన స్కేలు తీసుకొని ఆ స్ త్రీగమనానికి సంబంధించి x – t గ్రాఫు గీయండి.

Answer:


కార్యాలయానికి చేరడానికి పట్టిన కాలం \( t = \frac{2.5}{5} = 0.5 \) గం. = 30 ని.
కార్యాలయం నుండి ఇంటికి చేరడానికి పట్టిన కాలం \( t = \frac{2.5}{25} = 0.1 \) గం. = 6 ని.
ఆమె 9.00 గం. నుండి 9.30 గం. వరకు చలనంలో, 9.30 గం. నుండి సాయంత్రం 5 గం. వరకు స్థిరంగా, తిరిగి 5.00 గం. నుండి 5 గం. 6 ని. వరకు చలనంలో ఉంది. ఆమె x–t గ్రాఫ్ పై వర్ణించిన విధంగా ఉంటుంది.

Exam Tips:

a) x–t గ్రాఫ్ విభాగాలు: చలనంలో వాలు రేఖలు, విశ్రాంతిలో క్షితిజ సమాంతర రేఖ.

 

Question 4: ఒక వ్యక్తి సన్నని వీధిలో 5 అడుగులు ముందుకు, 3 అడుగులు వెనక్కి మరల 5 అడుగులు ముందుకు, 3 అడుగులు వెనక్కి ఇలా నడిచాడు. ప్రతి అడుగులో అతడు 1 m దూరం, 1 సెకనులో ప్రయాణిస్తే, అతని గమనానికి x-t గ్రాఫు గీయండి. వ్యక్తి తాగినవాడైతే బయలుదేరిన చోటు నుంచి 13 m దూరంలో ఉన్న గుంతలో పడడానికి ఎంత సమయం పడుతుందో గ్రాఫు ద్వారా కనుక్కోండి.

Answer:

5 అడుగులు ముందుకు, 3 అడుగులు వెనుకకు నడిస్తే 8 అడుగులలో నికర స్థానభ్రంశం = 5 − 3 = 2 అడుగులు = 2 మీ. (ఒక్కో అడుగు 1 m, 1 s).
x–t గ్రాఫ్ ఒక రంపపు పళ్ళ (జిగ్‌జాగ్) వంటి రేఖ: ప్రతి 8 s లో 5 m పైకి, 3 m కిందికి; ప్రతి చక్రంలో నికర పెరుగుదల 2 m.
గుంట దూరం = 13 మీ. చివరి ప్రయత్నంలో ముందుకు వెళ్ళే దూరం = 5 మీ. కావున ముందు నడవవలసినది 13 − 5 = 8 మీ.
8 మీ. నికర దూరానికి అవసరమైన చక్రాలు = 8/2 = 4; అనగా 4 × 8 = 32 అడుగులు.
32 అడుగుల తరువాత మరో 5 అడుగులు ముందుకు నడిస్తే అతడు గుంటలో పడతాడు. ∴ మొత్తం అడుగులు = 32 + 5 = 37; ఒక అడుగుకు 1 s.
∴ గుంటలో పడటానికి పట్టిన కాలం = 37 s.

Exam Tips:

a) ఒక చక్రంలో నికర పురోగతి (2 m) లెక్కించి, చివరి చక్రం పూర్తి కాకముందే గుంటలో పడతాడని గమనించండి.

 

Question 5: 500 km h⁻¹ వడితో పోతున్న ఒక జెట్ విమానం పరంగా దాని నుంచి దగ్ధం చెందిన ఇంధన వాయువులు 1500 km h⁻¹ వడితో వెలువడుతున్నాయి. భూమిపై నుంచి పరిశీలించిన వ్యక్తికి వాయువులు ఎంత వడితో వెలువడుతున్నట్లు అనిపిస్తుంది?

Answer:

విమానం వేగం \( v_A = 500 \) kmph; వాయువుల సాపేక్ష వేగం (విమానం పరంగా, వెనుకకు) \( v_{PA} = -1500 \) kmph
\( v_{PA} = v_P - v_A = -1500 \Rightarrow v_P = 500 - 1500 = -1000 \) kmph
∴ భూమి నుంచి చూసే వ్యక్తికి వాయువులు 1000 km h⁻¹ వడితో వెలువడుతున్నట్లు అనిపిస్తుంది. − గుర్తు వాయువులు విమానం గమన దిశకు వ్యతిరేకంగా వెళతాయని సూచిస్తుంది.

Exam Tips:

a) భూమి పరంగా వేగం = విమాన వేగం + వాయు సాపేక్ష వేగం (సంజ్ఞతో) — దిశలను సూచించే ఋణ గుర్తును వివరించండి.

 

Question 6: ఒక తిన్నని రహదారి వెంట ఒక కారు 126 km h⁻¹ వడిలో ప్రయాణిస్తూ 200m దూరంలో నిశ్చలస్థితిలోకి వచ్చింది. కారు ఋణ త్వరణం (త్వరణం సమరీతి త్వరణం అని భావించండి) ఎంత? నిశ్చలస్థితికి రావడానికి కారు తీసుకొన్న సమయం ఎంత?

Answer:

తొలివేగం \( v_0 = 126\ \mathrm{kmph} = 126\times\frac{5}{18} = 35 \) మీ/సె; తుదివేగం v = 0; దూరం x = 200 మీ.
\( v^{2} - v_0^{2} = 2ax \Rightarrow a = \frac{-35^{2}}{2\times 200} = -\frac{1225}{400} = -3.06 \) మీ/సె²
కాలం (\( v = v_0 + at \) నుండి): \( 0 = 35 - 3.06\,t \Rightarrow t = \frac{35}{3.06} = 11.43 \) సె.

Exam Tips:

a) 126 km/h = 35 m/s మార్పిడి తరువాత v² = u² + 2as ఉపయోగించండి.

 

Question 7: 400 m పొడవున్న రెండు రైళ్ళు A, B లు రెండు సమాంతర రైలు మార్గాలపై 72 km h⁻¹ సమవడితో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. రైలు A, రైలు B కంటే ముందు ఉన్నది. రైలు B డ్రైవరు, రైలు Aని దాటిపోవాలని నిర్ణయించి తన రైలుకు 1 m s⁻² త్వరణం కలిగించాడు. 50s తరువాత రైలు Bలోని గార్డు, రైలు A డ్రైవరును దాటితే రెండు రైళ్ళ మధ్య ఉన్న అసలు దూరం ఎంత?

Answer:

A రైలు పొడవు \( l_A = 400 \) మీ; \( v_0 = 72\ \mathrm{kmph} = 72\times\frac{5}{18} = 20 \) మీ/సె; a = 0; t = 50 సె
A రైలు ప్రయాణించిన దూరం \( X_A = v_0t + \frac{1}{2}at^{2} = 20\times 50 = 1000 \) మీ.
B రైలుకు \( v_0 = 20 \) మీ/సె, a = 1 మీ/సె², t = 50 సె
\( X_B = 20\times 50 + \frac{1}{2}\times 1\times 50^{2} = 1000 + 1250 = 2250 \) మీ.
B రైలు గార్డు A రైలు డ్రైవరును దాటడానికి B ప్రయాణించవలసిన సాపేక్ష దూరం S = (రైళ్ళ మధ్య తొలి దూరం x) + A రైలు పొడవు + B రైలు పొడవు = x + 400 + 400
కాని S = \( X_B - X_A = 2250 - 1000 = 1250 \) ⇒ 1250 = x + 800
∴ రైళ్ళ మధ్య తొలి దూరం x = 1250 − 800 = 450 మీ.

Exam Tips:

a) రెండు రైళ్ళ పొడవులను సాపేక్ష దూరంలో చేర్చడం మరవకండి (x + 400 + 400).

 

Question 8: రెండు వరుసలున్న (two-lane) రోడ్డుపై కారు A 36 km h⁻¹ వడితో పోతున్నది. రెండు కార్లు B, C లు వ్యతిరేక దిశల్లో 54kmh⁻¹ వడితో A వైపు ప్రయాణిస్తున్నాయి. ఒకానొక క్షణాన, దూరాలు AB, AC లు 1km కు సమానమైనప్పుడు, C కంటే ముందుగా A ని దాటిపోవాలని B నిర్ణయించడం జరిగింది. ప్రమాదాన్ని నివారించడానికి కారు B కిఉండాల్సిన కనీస త్వరణం ఎంత?

Answer:

కారు A వేగం \( 36\ \mathrm{kmph} = 10 \) మీ/సె; కార్లు B, C ల వేగం \( 54\ \mathrm{kmph} = 15 \) మీ/సె
A తో పోల్చితే B సాపేక్ష వేగం = 15 − 10 = 5 మీ/సె
A తో పోల్చితే C సాపేక్ష వేగం = 15 + 10 = 25 మీ/సె (ఎదురుదిశ కావున)
AB = AC = 1 km = 1000 మీ. C, A ను చేరడానికి పట్టే కాలం \( \frac{1000}{25} = 40 \) సె
C సమీపించే లోపల B కారు A ను దాటాలంటే: తొలి సాపేక్ష వేగం \( v_0 = 5 \) మీ/సె, t = 40 సె, దూరం s = 1000 మీ
\( s = v_0t + \frac{1}{2}at^{2} \Rightarrow 1000 = 5\times 40 + \frac{1}{2}a\,(40)^{2} \Rightarrow 800a = 1000 - 200 = 800 \)
∴ కనీస త్వరణం a = 1 మీ/సె²

Exam Tips:

a) సాపేక్ష వేగాలు తీసుకొని 'కనీస కాలం'గా C చేరే కాలాన్ని వాడండి; తరువాత s = ut + ½at² ఉపయోగించండి.

 

Question 9: రెండు పట్టణాలు A, B ల నుంచి ప్రతి T నిమిషాలకు రెండు దిశల్లోనూ బస్సులు బయలుదేరేటట్లు రవాణా సౌకర్యంతో వాటిని సంధానించారు. A నుంచి Bకు 20 km h⁻¹ వడితో సైకిల్పై ప్రయాణించే వ్యక్తిని, అతని గమన దిశలో, ప్రతి 18 నిమిషాలకు ఒక బస్సు దాటుతుంది. వ్యతిరేక దిశలో ప్రతి 6 నిమిషాలకు ఒక బస్సు దాటుతుంది. రవాణా వ్యవస్థలో రెండు వరుస బస్సుల మధ్య కాలవ్యవధి T, బస్సుల వడి (స్థిర వడిగా భావించండి) ఎంత?

Answer:

A–B పట్టణాల మధ్య బస్సుల సమవడి V kmph అనుకుందాం; సైక్లిస్ట్ వడి = 20 kmph; T నిమిషాలలో బస్సు ప్రయాణించే దూరం = VT
సైక్లిస్ట్ దిశలో బస్సు సాపేక్ష వడి = (V − 20); 18 ని. కి ఒక బస్సు వెనుక నుంచి దాటింది: \( \frac{VT}{V-20} = 18 \Rightarrow VT = 18(V-20) \) → (1)
ఎదురు దిశలో 6 ని. కి ఒక బస్సు దాటింది: \( \frac{VT}{V+20} = 6 \Rightarrow VT = 6(V+20) \) → (2)
(1), (2) నుండి \( 18(V-20) = 6(V+20) \Rightarrow 3V - 60 = V + 20 \Rightarrow 2V = 80 \Rightarrow V = 40 \) kmph
(1) లో రాయగా \( 40T = 18(40-20) \Rightarrow T = \frac{18\times 20}{40} = 9 \) ని.
∴ బస్సు వడి V = 40 kmph; రెండు వరుస బస్సుల మధ్య కాలవ్యవధి T = 9 ని.

Exam Tips:

a) రెండు సందర్భాల సమీకరణాలు (వెనుక, ఎదురు) రాసి కలిపి సాధించండి.

 

Question 10: ఒక క్రీడాకారుడు ఒక బంతిని 29.4 m s⁻¹ తొలివేగంతో నిట్టనిలువుగా విసిరాడు. a) బంతి ఊర్ధ్వ దిశలో గమనంలో ఉన్న కాలంలో త్వరణం దిశ ఏమిటి?
b) బంతి గరిష్ఠ ఎత్తు వద్ద గల బిందువును చేరినప్పుడు బంతి వేగం, త్వరణాల విలువలు ఎంతెంత?
c) బంతి గరిష్ఠ ఎత్తు వద్ద x = 0 m, t = 0 s గా స్థానం, కాలం విలువలను ఎన్నుకొని, నిమ్నదిశను ధన x- దిశగా భావించి, స్థానం, వేగం, త్వరణం సంజ్ఞలను బంతి ఊర్ధ్వ దిశలో గమనంలో ఉన్నప్పుడు, నిమ్న దిశలో గమనంలో ఉన్నప్పుడు ఎలా
ఉంటాయో తెలుపండి.
d) బంతి ఎంత ఎత్తుకు చేరుతుందో, ఎంత కాలం తరవాత క్రీడాకారుని చేతిలోకి తిరిగి వస్తుందో తెలుపండి. ( g = 9.8 ms⁻² గాను, గాలి నిరోధం లేనట్లుగానూ
భావించండి)

Answer:

a) వస్తువు గురుత్వాకర్షణ క్షేత్రంలో చలిస్తున్నది కాబట్టి దానిపై త్వరణం ఎల్లప్పుడు అధోదిశలో (g = 9.8 m s⁻²) ఉంటుంది.
b) గరిష్ఠ ఎత్తు వద్ద వేగం v = 0, కాని త్వరణం a = g = 9.8 m s⁻² అధోదిశలో ఉంటుంది.
c) గరిష్ఠ ఎత్తు వద్ద x = 0, t = 0; అధోదిశను ధన x-దిశగా తీసుకుంటే:
• బంతి ఊర్ధ్వ దిశలో గమనంలో ఉన్నప్పుడు (t < 0): స్థానం ఋణాత్మకం, వేగం ఋణాత్మకం, త్వరణం ధనాత్మకం.
• బంతి నిమ్న దిశలో గమనంలో ఉన్నప్పుడు (t > 0): స్థానం ధనాత్మకం, వేగం ధనాత్మకం, త్వరణం ధనాత్మకం.
d) \( v_0 = 29.4 \) m/s పైకి; గరిష్ఠ ఎత్తు వద్ద v = 0: \( 0 - (29.4)^{2} = 2\times(-9.8)\,y \Rightarrow y = \frac{29.4\times 29.4}{2\times 9.8} = 44.1 \) m
పైకి పోవడానికి పట్టిన కాలం \( 0 = 29.4 - 9.8t \Rightarrow t = \frac{29.4}{9.8} = 3 \) s
చేతిలోకి తిరిగి రావడానికి పట్టిన కాలం T = 3 + 3 = 6 s.

Exam Tips:

a) గరిష్ఠ ఎత్తు వద్ద v = 0 కానీ a = g ≠ 0; సంజ్ఞల ఎంపికను ముందే ప్రకటించండి.

 

Question 11: కింది వాక్యాలను జాగ్రత్తగా చదివి, అవి తప్పో, ఒప్పో తెలిపి తగిన కారణాలను, ఉదాహరణలను పేర్కొనండి. ఒక కణం ఏకమితీయ గమనంలో ఉంది.
a) ఒకానొక క్షణంలో దాని వడి శూన్యమై, ఆ క్షణంలో త్వరణం శూన్యేతర విలువ కలిగి ఉండవచ్చు.
b) దాని వడి శూన్యమై, వేగం శూన్యేతర విలువ కలిగి ఉండవచ్చు.
c) అది స్థిరవడి కలిగి ఉండి తప్పక త్వరణం శూన్యమై ఉండి తీరాలి.
(d) దాని త్వరణం విలువ ధనాత్మకమై తప్పక వడి వృద్ధి కలిగి ఉండాలి.

Answer:

a) ఈ వాక్యం నిజమే. పైకి విసిరిన వస్తువుకు గరిష్ఠ స్థానభ్రంశ బిందువు వద్ద వడి సున్న, కాని త్వరణం సున్న కాదు.
b) ఈ వాక్యం తప్పు. వడి సున్న అయినపుడు వేగం శూన్యేతరం కాజాలదు; వడి వేగ పరిమాణమే.
c) ఈ వాక్యం నిజమే (ఏకమితీయ గమనంలో). వడి స్థిరంగా ఉండి వస్తువు సరళరేఖలో ప్రయాణిస్తే త్వరణం తప్పకుండా సున్న.
d) ఈ వాక్యం నిజమా కాదా అన్నది మన ఎంచుకున్న ధనదిశపై ఆధారపడుతుంది. త్వరణం, వేగం ఒకే దిశలో ఉంటే వడి పెరుగుతుంది; వస్తువు గమన దిశకు వ్యతిరేకంగా త్వరణం ఉంటే వడి తగ్గుతుంది. కాబట్టి త్వరణం ధనాత్మకమైనంత మాత్రాన వడి తప్పనిసరిగా పెరగదు.

Exam Tips:

a) ప్రతి వాక్యానికి ఒప్పు/తప్పు స్పష్టంగా రాసి, ఒక చిన్న ఉదాహరణతో సమర్థించండి.

 

Question 12: 90 m ఎత్తు నుంచి ఒక బంతిని నేలపైకి జారవిడిచారు. నేలతో అభిఘాతం జరిపిన ప్రతిసారి బంతి తన వేగంలో 10వ వంతు కోల్పోతుంది. t = 0,12s మధ్య బంతి గమనానికి సంబంధించి వడి-కాలం గ్రాఫును గీయండి.

Answer:

తొలివేగం v = 0; త్వరణం g = 10 మీ/సె²; ఎత్తు y = 90 మీ.
నేలను తాకడానికి పట్టిన కాలం \( t = \sqrt{\frac{2y}{g}} = \sqrt{\frac{2\times 90}{10}} = \sqrt{18} = 4.24 \) సె
నేలను తాకే ముందు వేగం \( v = \sqrt{2gy} = \sqrt{2\times 10\times 90} = 30\sqrt{2} \) మీ/సె (= 42.4 మీ/సె)
ప్రతి అభిఘాతంలో వేగంలో 10% నష్టం: \( v' = \frac{9}{10}\times 30\sqrt{2} = 27\sqrt{2} \) మీ/సె
పైకి పోవడానికి పట్టిన కాలం \( t_1 = \frac{v'}{g} = \frac{27\sqrt{2}}{10} = 2.7\sqrt{2} = 3.82 \) సె. కావున బంతి గరిష్ఠ ఎత్తుకు చేరే సమయం = 4.24 + 3.82 = 8.06 సె.
మళ్ళీ కిందికి పడటానికి 3.82 సె పడుతుంది కావున రెండవసారి నేలను తాకే సమయం = 8.06 + 3.82 = 11.88 సె.
రెండవ అభిఘాతం తరువాత వేగం \( v'' = \frac{9}{10}\times 27\sqrt{2} = 24.3\sqrt{2} \) మీ/సె
గ్రాఫ్: జారవిడిచిన తరువాత 4.24 సె కి \( 30\sqrt{2} \) మీ/సె వేగంతో నేలను తాకి, \( 27\sqrt{2} \) మీ/సె వేగంతో పైకి లేచి 8.06 సె కి గరిష్ఠ ఎత్తుకు (వడి సున్న) చేరి, 11.88 సె కి మళ్ళీ నేలను తాకుతుంది (వడి \( 27\sqrt{2} \) మీ/సె).

Exam Tips:

a) ప్రతి అభిఘాతం తరువాత వేగం 0.9 రెట్లు అవుతుందని ఉపయోగించి, ప్రతి దశ సమయాలను కూడండి.

 

Question 13: పటంలో ఒక కణం ఏకమితీయ గమనానికి x – t గ్రాఫు చూపడం జరిగింది. గ్రాఫు ద్వారా t < 0 అయినప్పుడు కణం సరళరేఖా మార్గంలో గమనంలో ఉన్నదనీ, t > 0 అయినప్పుడు పరావలయ పథంలో గమనంలో ఉన్నదనీ అనడం సరియైనదేనా? ఒకవేళ సరికాకపోతే, గ్రాఫు సూచించే తగిన భౌతిక సందర్భాన్ని తెలపండి.

Answer:

కణం సరళరేఖా మార్గంలో ఉండదు; ఇచ్చిన x–t గ్రాఫ్ కణం పథం కాదు, అది కణం స్థానం కాలంతో ఎలా మారుతుందో చూపుతుంది.
t < 0 అయినప్పుడు x స్థిరం (కణం నిశ్చలం), t > 0 అయినప్పుడు x ∝ t² కావున సమత్వరణ చలనం. ఈ గ్రాఫ్ నిశ్చలస్థితి నుండి స్వేచ్ఛగా కిందికి పడే వస్తువు స్థానభ్రంశం–కాలం వక్రాన్ని సూచిస్తుంది.

Exam Tips:

a) x–t గ్రాఫ్ పథం కాదని (కణం స్థానం–కాల సంబంధమని) స్పష్టంగా రాయండి.

 

Question 14: రహదారిపై 30 km h⁻¹ వడితో గమనంలో ఉన్న పోలీసు వ్యాను నుంచి అదే దిశలో 192 km h⁻¹ వడితో కారులో పారిపోతున్న దొంగలపైకి తుపాకీ గుండ్లను పేల్చారు. తుపాకి నుండి వెలువడిన గుండ్ల వడి 150 ms⁻¹ అయితే, ఎంత వడితో తుపాకి గుండు దొంగల కారును తాకుతుంది? (గమనిక : దొంగల కారుకు హాని చేకూర్చే వడిని రాబట్టండి).

Answer:

బుల్లెట్ వడి \( v_B = 150\ \mathrm{m\,s^{-1}} = 150\times\frac{18}{5} = 540 \) kmph; పోలీసు వ్యాన్ వేగం \( v_P = 30 \) kmph; దొంగల కారు వేగం \( v_T = 192 \) kmph
కదులుతున్న వ్యాన్ నుండి కాల్చడం వల్ల భూమి పరంగా బుల్లెట్ వడి \( v_R = v_B + v_P = 540 + 30 = 570 \) kmph
దొంగల కారుతో బుల్లెట్ సాపేక్ష వేగం \( v_{BT} = 570 - 192 = 378\ \mathrm{kmph} = \frac{378\times 5}{18} = 105\ \mathrm{m\,s^{-1}} \)
∴ బుల్లెట్ దొంగల కారును 378 km h⁻¹ (105 m s⁻¹) వడితో తాకుతుంది.

Exam Tips:

a) బుల్లెట్ వడి = తుపాకి వేగం + వ్యాన్ వేగం; తరువాత దొంగల కారుతో సాపేక్ష వేగం తీసుకోండి; km/h ↔ m/s మార్పిడి జాగ్రత్త.

 

Question 15: ఒక కణం యొక్క ఏకమితీయ గమనానికి x – t గ్రాఫులో చూపించారు. మూడు వేరు వేరు సమాన కాలవ్యవధులను సూచించారు. ఏ కాలవ్యవధిలో సగటు వడి గరిష్ఠం, ఏ కాలవ్యవధిలో సగటు వడి కనిష్టం? ప్రతి కాలవ్యవధిలో సగటు వేగపు సంజ్ఞను తెలపండి.

Answer:

స్థానభ్రంశ–కాల వక్రం వాలు ఇచ్చిన వ్యవధిలో సగటు వేగాన్ని తెలియజేస్తుంది.
3వ కాలవ్యవధిలో వాలు (పరిమాణంలో) గరిష్ఠం, కావున సగటు వడి గరిష్ఠం; ఆ వాలు ఋణాత్మకం కావున వేగం ఋణాత్మకం.
2వ కాలవ్యవధిలో వాలు అతి తక్కువ, కావున సగటు వడి కనిష్ఠం; ఆ వాలు ధనాత్మకం.
1వ కాలవ్యవధిలో వాలు ధనాత్మకం; దాని పరిమాణం 2వ వ్యవధి కన్నా ఎక్కువ, కాని 3వ వ్యవధి కన్నా తక్కువ.
∴ సగటు వేగం సంజ్ఞలు: 1వ వ్యవధి +, 2వ వ్యవధి +, 3వ వ్యవధి −.

Exam Tips:

a) వక్రం వాలు యొక్క పరిమాణం (వడి), గుర్తు (దిశ) విడిగా చెప్పండి.

 

Question 16: స్థిరమైన (ఒకే) దిశ వెంబడి గమనంలో ఉన్న ఒక కణం గమనానికి వడి – కాలం గ్రాఫును పటంలో చూపించారు. మూడు సమాన కాలవ్యవధులు చూపించారు. ఏ కాలవ్యవధిలో సగటు త్వరణం పరిమాణం గరిష్ఠం? ఏ కాలవ్యవధిలో సగటు వడి గరిష్ఠం? (స్థిర దిశ గల) గమన దిశను ధన దిశగా ఎంచుకుని, v, a ల సంజ్ఞలను మూడు కాలవ్యవధులలోనూ తెలపండి. A, B, C, D బిందువుల వద్ద త్వరణాలు ఏమిటి?

Answer:

వడి–కాల వక్రం వాలు ఆ వ్యవధిలో త్వరణాన్ని సూచిస్తుంది.
1వ వ్యవధిలో వాలు ధనాత్మకం ⇒ త్వరణం ధనాత్మకం; వడి ధనాత్మకం (గమన దిశను ధనదిశగా తీసుకున్నాం).
2వ వ్యవధిలో వాలు ఋణాత్మకం ⇒ త్వరణం ఋణాత్మకం; వడి ధనాత్మకం.
3వ వ్యవధిలో వాలు ధనాత్మకం మరియు చాలా ఎక్కువ ⇒ ఈ వ్యవధిలో సగటు త్వరణ పరిమాణం గరిష్ఠం; త్వరణం ధనాత్మకం, వడి ధనాత్మకం. సగటు వడి కూడా 3వ వ్యవధిలో గరిష్ఠం.
A, B, C, D బిందువుల వద్ద వక్రం స్పర్శరేఖ t-అక్షానికి సమాంతరంగా ఉంటుంది కావున ఈ బిందువుల వద్ద త్వరణం a = 0.

Exam Tips:

a) v–t గ్రాఫ్ వాలు = త్వరణం; గరిష్ఠ/కనిష్ఠ బిందువుల వద్ద వాలు సున్న కావున a = 0.

 

Question 17: నిశ్చలంగా ఉన్న పైకప్పు లేని లిఫ్ట్ లో నిలబడిన ఒక బాలుడు ఒక బంతిని నిట్టనిలువుగా అతడు విసరగలిగిన గరిష్ఠ తొలి వడి 49 m s⁻¹ తో విసిరాడు. అతని చేతిలోకి తిరిగి చేరడానికి బంతికి ఎంత సమయం పడుతుంది? లిఫ్టు, సమవడి 5 m s⁻¹ తో పై దిశలో కదులుతూ ఉన్నప్పుడు తిరిగి ఆ బాలుడు అతడు విసరగలిగిన గరిష్ఠ వడితో (49 ms ⁻¹ ) బంతిని పైకి విసిరితే అతని చేతిలోకి తిరిగి చేరడానికి బంతి తీసుకొనే సమయం ఎంత?

Answer:

నిట్టనిలువుగా పైకి దిశను ధనదిశగా తీసుకుందాం.
a) లిఫ్ట్ నిశ్చలంగా ఉన్నప్పుడు: తొలివేగం \( v_0 = 49 \) m/s, a = −9.8 m/s², స్థానభ్రంశం s = 0 (చేతిలోకి తిరిగి వస్తుంది).
\( s = v_0t + \frac{1}{2}at^{2} \Rightarrow 0 = 49t - 4.9t^{2} \Rightarrow t = \frac{49}{4.9} = 10 \) s
b) లిఫ్ట్ సమవేగంతో పైకి కదులుతుంటే లిఫ్ట్ త్వరణం 0 కావున లిఫ్ట్ పరంగా బంతి త్వరణం ఇంకా g = −9.8 m/s², బాలుడు విసిరిన తొలివేగం (లిఫ్ట్ పరంగా) 49 m/s. కావున ఈ సందర్భంలో కూడా బంతి 10 s లో బాలుడి చేతిలోకి తిరిగి వస్తుంది.

Exam Tips:

a) లిఫ్ట్ సమవేగంతో కదిలితే (a = 0) లిఫ్ట్‌లో భౌతిక నియమాలు నిశ్చల లిఫ్ట్ లాగానే ఉంటాయి కావున కాలం మారదు.

 

Free study material for Physics

TS Board Solutions for Class 11 Physics Chapter 03 Motion in a Straight Line

Textbook Solutions for Class 11 Physics Chapter 03 Motion in a Straight Line

Explore reliable textbook solutions for Chapter 03 Motion in a Straight Line tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Physics.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 03 Motion in a Straight Line concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 11 Physics.

FAQs

Where can I find the latest TS Inter 1st Year Physics Study Material Chapter 3 సరళరేఖాత్మక గమనం for the 2026-27 session?

The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 3 సరళరేఖాత్మక గమనం is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.

Are the Physics TS Board solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 3 సరళరేఖాత్మక గమనం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 3 సరళరేఖాత్మక గమనం will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 1st Year Physics Study Material Chapter 3 సరళరేఖాత్మక గమనం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 3 సరళరేఖాత్మక గమనం in both English and Hindi medium.

Is it possible to download the Physics TS Board solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 3 సరళరేఖాత్మక గమనం in printable PDF format for offline study on any device.