Step-by-Step Textbook Solutions for Class 11 Physics Chapter 02 Units and Measurements
Explore reliable textbook solutions for Chapter 02 Units and Measurements tailored for Class 11 learners. Utilizing these Physics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Download Chapter 02 Units and Measurements Textbook Solutions PDF
Access the complete solution PDF for Class 11 Physics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: యథార్థత, ఖచ్చితత్వాల మధ్య తేడాను రాయండి.
Answer:
యథార్థత (Accuracy) : మనం కొలిచిన విలువ మనం కొలవవలసిన భౌతికరాశి నిజమైన విలువకు ఎంత దగ్గరగా ఉన్నదో తెలియజేయు కొలమానాన్ని యథార్థత అంటారు.
ఖచ్చితత్వము (Precision) : ఖచ్చితత్వము అనేది మనం ఒక పరికరంతో ఎంత కనిష్ఠ అవధి వరకు ఇచ్చిన భౌతికరాశిని కొలవగలమో తెలియజేస్తుంది.
మనం కొలవగలిగిన కనిష్ఠ అవధి ఎంత తక్కువ ఐతే ఆ పరికరం ఖచ్చితత్వం అంత ఎక్కువ.
Exam Tips:
a) రెండు రాశుల మధ్య తేడా చెప్పేటప్పుడు ఆ రెండింటికీ నిర్వచనం, ఒక ఉదాహరణ రాయండి.
b) యథార్థత = నిజ విలువకు దగ్గరగా ఉండటం; ఖచ్చితత్వం = పరికర కనీస కొలత (పునరావృత్తి) — ఈ తేడాను స్పష్టంగా రాయండి.
Question 2: కొలతలో వచ్చే వివిధ రకాల దోషాలు ఏవి ?
Answer:
భౌతిక రాశుల కొలతలలో సంభవించగల దోషాలు రెండు రకాలు.
1. క్రమదోషాలు,
2. యాదృచ్ఛిక దోషాలు.
క్రమదోషాలను మరల 1) స్థిర దోషాలు, 2) వ్యక్తిగత దోషాలు, 3) పరిసర సంబంధిత దోషాలు, 4) ప్రయోగ విధాన కౌశలం లేక ప్రయోగ పద్ధతిలోని అసమగ్రత వలన కలుగు దోషాలుగా విభజించినారు.
Exam Tips:
a) రెండు ప్రధాన రకాలు (క్రమ దోషాలు, యాదృచ్ఛిక దోషాలు) తో పాటు క్రమదోషాల నాలుగు ఉపరకాలను కూడా పేర్కొనండి.
Question 3: క్రమదోషాలను ఏ విధంగా కనిష్ఠం చేయవచ్చు లేదా తొలగించవచ్చు ? (మార్చి 2014)
Answer:
1) ప్రయోగ టెక్నిక్లను మెరుగుపరచుకొని, 2) శ్రేష్ఠమైన పరికరాలను వాడి, 3) అనేక రీడింగులను తీసుకొని కొలతలో సంభవించగల క్రమదోషాలను అంచనా వేసి తగిన సవరణ చేయడం వల్ల క్రమదోషాలను తగ్గించవచ్చు.
Exam Tips:
a) మూడు పద్ధతులను (మెరుగైన పద్ధతులు, మంచి పరికరాలు, అనేక రీడింగులు) సంఖ్యలతో రాయండి.
Question 4: కొలత ఫలితాన్ని అందులో ఉండే దోషాన్ని సూచిస్తూ ఏ విధంగా నివేదిస్తారో ఉదాహరణలతో వివరించండి.
Answer:
కొలతల ఫలితాలను నివేదించే పద్ధతి : సాధారణ మీటరు స్కేలుతో 1 మి.మీ. వరకు కొలత ఖచ్చితంగా కొలవగలము. ఇటువంటి స్కేలుతో ఒక కడ్డీ పొడవు 62.5 సెం.మీ. అని కొలిచామనుకోండి. ఈ కొలతను 62.5 ± 0.1 అని చూపాలి. అంటే మన కొలత 0.1 సెం.మీ. లేదా 1 మి.మీ. వరకు ఖచ్చితమైనది అని తెలుపుతుంది.
ఇదే విధంగా లఘులోలకం ప్రయోగంలో డోలనావర్తన కాలము 2 సెకనులుగా కొలిస్తే దానిని 2.0 ± 0.1 గా చూపితే ఇందులో 0.1 మనం వాడిన ఆపు గడియారం కనీసపు కొలతను సూచిస్తూ మన ప్రయోగ విలువ మొదటి దశాంశము వరకు నమ్మదగినది అని తెలుపుతుంది.
Exam Tips:
a) నివేదించే రూపం 'విలువ ± దోషం' (ఉదా: 62.5 ± 0.1 cm) అని మొదట రాయండి.
b) ± తరువాత ఉన్న సంఖ్య పరికర కనీస కొలతను సూచిస్తుందని తప్పక చెప్పండి.
Question 5: సార్థక సంఖ్యలంటే ఏవి ? ఒక కొలత ఫలితాన్ని నివేదించేటప్పుడు అవి ఏమి సూచిస్తాయి ?
Answer:
ప్రయోగంలో నమోదు చేసిన కొలతల ఫలితం ఒక సంఖ్య. ఈ సంఖ్యలో మనం ప్రయోగం ద్వారా పొందిన నమ్మదగిన అంకెలతో పాటు అనిశ్చితత్వాన్ని తెలియజేసే మరొక సంఖ్యను కూడా కలిపి సార్థక సంఖ్యలు అంటారు.
ప్రయోగ ఫలితంలో సార్థక సంఖ్యల కన్నా ఎక్కువ అంకెల వల్ల ప్రయోజనం లేకపోగా అవి ఖచ్చితత్వానికి సంబంధించి తప్పుడు అభిప్రాయం కలుగచేస్తాయి.
Exam Tips:
a) సార్థక సంఖ్యలు = నమ్మదగిన అంకెలు + చివరి అనిశ్చిత అంకె అని నిర్వచించండి.
b) ఎక్కువ అంకెలు రాస్తే ఖచ్చితత్వం ఎక్కువగా ఉన్నట్లు తప్పుడు అభిప్రాయం కలుగుతుందని పేర్కొనండి.
Question 6: ప్రాథమిక ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాల మధ్య తేడాలు రాయండి. (మే 2014)
Answer:
ప్రాథమిక (మూల) రాశులను కొలిచే ప్రమాణాలను ప్రాథమిక ప్రమాణాలు అంటారు.
ఉదా : పొడవు – మీటరు, ద్రవ్యరాశి – కి.గ్రా.
ఉత్పన్న రాశులను కొలిచే ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటారు. ఉత్పన్న ప్రమాణాలు ప్రాథమిక ప్రమాణాల కలయిక వల్ల ఏర్పడతాయి.
ఉదా : వేగము – మీటరు/సెకను
Exam Tips:
a) ప్రాథమిక ప్రమాణాలకు (m, kg, s) ఉత్పన్న ప్రమాణాలకు (m/s, N, J) ఒక్కొక్క ఉదాహరణ తప్పక రాయండి.
Question 7: ఒకే భౌతికరాశికి వేరువేరు ప్రమాణాలు ఎందుకు ఉంటాయి ?
Answer:
భౌతిక రాశుల పరిమాణము అత్యల్ప విలువల నుండి అత్యధిక విలువల వరకు విస్తృత పరిధిలో మారే అవకాశం ఉండటం వల్ల ఒక రాశిని ఖచ్చితంగా కొలవడానికి వేరు వేరు ప్రమాణాలు అవసరమవుతాయి.
ఉదా : పరమాణువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఆంగ్జామ్ యూనిట్ను వాడతారు. 1 Å = 10⁻¹⁰ m . సుదూర నక్షత్రాల మధ్య దూరాలను కొలవడానికి కాంతి
సంవత్సరాన్ని ప్రమాణంగా వాడతారు.
Exam Tips:
a) విస్తృత పరిధి వల్ల వేర్వేరు ప్రమాణాలు అవసరమని చెప్పి ఉదాహరణలు ఇవ్వండి: ఆంగ్స్ట్రామ్ (1 Å = 10⁻¹⁰ m), కాంతి సంవత్సరం.
Question 8: మితీయ విశ్లేషణ అంటే ఏమిటి ?
Answer:
భౌతిక రాశుల మధ్య ప్రవర్తన వివరించడానికి (1) ఒకే మితులు కలిగిన భౌతిక రాశులను కలపడం లేదా వ్యవకలనం చేయడం జరుగుతుంది. (2) భౌతిక రాశుల మధ్య నిర్దిష్ట సంబంధాలు రాబట్టడానికి, ఆ సమీకరణాల యథార్థత పరిశీలించడానికి మితుల ఆధారంగా ఉపయోగించే పద్ధతులను మితి విశ్లేషణ అంటారు.
Exam Tips:
a) మితీయ విశ్లేషణ రెండు ఉపయోగాలు: సమీకరణాల సరిచూడటం, భౌతిక రాశుల మధ్య సంబంధాలను రాబట్టడం.
Question 9: కేంద్రకం వ్యాసార్ధంతో పోలిస్తే పరమాణు వ్యాసార్ధం పరిమాణ క్రమాలలో ఎంత ఎక్కువగా ఉంటుంది ?
Answer:
పరమాణు పరిమాణము 10⁻¹⁰ m స్థాయిలో ఉంటుంది.
కేంద్రక పరిమాణము 10⁻¹⁴ m స్థాయిలో ఉంటుంది.
కావున పరమాణు పరిమాణము, కేంద్రక పరిమాణ క్రమాల విలువ 10⁻¹⁰ ÷ 10⁻¹⁴ = 10 ⁴.
అనగా పరమాణు పరిమాణం, కేంద్రక పరిమాణము కన్నా సుమారు 10⁴ రెట్లు ఎక్కువ.
Exam Tips:
a) పరమాణు పరిమాణం ≈ 10⁻¹⁰ m, కేంద్రక పరిమాణం ≈ 10⁻¹⁴ m — ఈ రెండు విలువలను రాసి నిష్పత్తి 10⁴ అని ముగించండి.
Question 10: ఏకీకృత పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాన్ని కి.గ్రా.లో వ్యక్తం చేయండి.
Answer:
ఏకీకృత పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం (1 a.m.u.) అనేది కర్బన ఐసోటోపు \( {}_6^{12}\mathrm{C} \) పరమాణు ద్రవ్యరాశిలో \( \frac{1}{12} \) వ వంతుకు సమానం.
\( 1\ \mathrm{a.m.u.} = \frac{1}{12} \times m\left({}_6^{12}\mathrm{C}\right) = 1.66 \times 10^{-27} \) కి.గ్రా.
Exam Tips:
a) 1 a.m.u. = 1.66 × 10⁻²⁷ kg విలువను తప్పక గుర్తుంచుకోండి; C-12 పరమాణువులో 1/12 వంతు అని నిర్వచించండి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: ఒక పరికరం వెర్నియర్ స్కేలు 50 విభాగాలు కలిగి ఉంది. ఇవి ప్రధాన స్కేలుపై ఉండే 49 విభాగాలతో ఏకీభవిస్తాయి. ప్రధాన స్కేలులోని ప్రతి విభాగం విలువ 0.5 mm. అయితే ఈ పరికరంతో కొలిచే దూరంలో కనిష్ఠ యథార్థతారాహిత్యం ఎంత ఉంటుంది ?
Answer:
వెర్నియర్ కాలిపర్స్ కనీస కొలత \( \mathrm{L.C.} = \frac{S}{N} \)
ప్రధాన స్కేలు విభాగాల మధ్య దూరం S = 0.5 మి.మీ.
వెర్నియర్ స్కేలు విభాగాల సంఖ్య N = 50
\( \therefore\ \mathrm{L.C.} = \frac{S}{N} = \frac{0.5}{50} = \frac{1}{100} \) మి.మీ. = 0.01 మి.మీ.
కనిష్ఠ యథార్థతారాహిత్యం (కనీస దోషం) = 0.01 మి.మీ.
Exam Tips:
a) వెర్నియర్ కనీస కొలత = ప్రధాన స్కేలు ఒక విభాగం ÷ వెర్నియర్ విభాగాల సంఖ్య (0.5 mm ÷ 50 = 0.01 mm) సూత్రాన్ని మొదట రాయండి.
Question 2: ప్రమాణాల ఒక వ్యవస్థలో బలానికి ప్రమాణం 100 N, పొడవుకు ప్రమాణం 10m, కాలానికి ప్రమాణం 100s. ఈ వ్యవస్థలో ద్రవ్యరాశికి ఉండే ప్రమాణం ఏది ?
Answer:
బలానికి మితి ఫార్ములా \( [F] = MLT^{-2} \) → (1)
బల ప్రమాణం F = 100 N, పొడవు ప్రమాణం L = 10 మీ., కాల ప్రమాణం T = 100 సె.
(1) నుండి \( M = \frac{F}{LT^{-2}} = \frac{F\,T^{2}}{L} \)
\( M = \frac{100 \times (100)^2}{10} = 10^{5} \) కి.గ్రా.
∴ ద్రవ్యరాశి ప్రమాణం = \( 10^{5} \) కి.గ్రా.
Exam Tips:
a) ద్రవ్యరాశి = బలం × కాలం² ÷ పొడవు అని మితుల ద్వారా రాబట్టి విలువలు ప్రతిక్షేపించండి; యూనిట్లు తప్పక రాయండి.
Question 3: భూమి నుంచి ఒక గెలాక్సీ దూరం 10²⁵ m ల క్రమంలో ఉంది. గెలాక్సీ నుంచి కాంతి మనల్ని చేరేందుకు పట్టే కాలం పరిమాణక్రమాన్ని గణించండి.
Answer:
గెలాక్సీ దూరం d = \( 10^{25} \) మీ., కాంతివేగం c = \( 3 \times 10^{8} \) మీ/సె
కాంతి ప్రయాణించిన కాలం \( t = \frac{d}{c} = \frac{10^{25}}{3 \times 10^{8}} = \frac{1}{3} \times 10^{17} = 0.333 \times 10^{17} \) సెకనులు
పరిమాణక్రమం నిర్ణయించడంలో 10 యొక్క ఘాతం విలువ మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు.
∴ కాలం పరిమాణక్రమం = \( 10^{17} \) సె.
Exam Tips:
a) పరిమాణక్రమం కోసం 10 యొక్క ఘాతాన్ని (కుడివైపు 5 కంటే ఎక్కువ ఉన్న సంఖ్యను పైకి సవరించడం) గుర్తుంచుకోండి.
Question 4: భూమి-చంద్రుల మధ్య దూరం భూవ్యాసార్ధానికి సుమారు 60 రెట్లు. చంద్రుడి నుంచి చూస్తే భూమి వ్యాసం సుమారుగా ఎంత ఉంటుంది ?
Answer:
భూమి, చంద్రుల మధ్య దూరం D = 60 × భూమి వ్యాసార్ధం = 60r
భూమి వ్యాసం AB = 2r
చంద్రుని నుంచి చూసినప్పుడు పారలాక్టిక్ కోణం \( \theta = \frac{AB}{D} = \frac{2r}{60r} = \frac{1}{30} \) రేడియన్
\( \theta = \frac{1}{30} \times 57.3^{\circ} \simeq 1.9^{\circ} \simeq 2^{\circ} \)
Exam Tips:
a) θ = చాపం/వ్యాసార్ధం (రేడియన్లలో) సూత్రం ఉపయోగించి, రేడియన్‌ను డిగ్రీలలోకి మార్చడం మరవకండి.
Question 5: లోలకం 20 డోలనాలకు పట్టే కాలానికి వచ్చిన మూడు కొలతలు వరుసగా t₁ = 39.6s, t₂ = 39.9s, t₃ = 39.5s. కొలతల్లోని ఖచ్చితత్వం ఎంత ? కొలతల్లోని యథార్థత ఎంత ?
Answer:
ఖచ్చితత్వం పరికరం కనీస కొలతపై ఆధారపడుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితత్వం ± 0.1 సెకను, ఎందుకంటే కొలతలలోని చివరి అంకెలో మాత్రమే అనిశ్చితత్వం ఉంటుంది.
కొలతలలోని యథార్థత:
కొలతల సగటు విలువ \( = \frac{39.6+39.9+39.5}{3} = \frac{119.0}{3} = 39.67 \) సె
ప్రతి కొలతలో దోషం: \( \Delta a_1 = 39.67 - 39.6 = 0.07 \), \( \Delta a_2 = 39.9 - 39.67 = 0.23 \), \( \Delta a_3 = 39.67 - 39.5 = 0.17 \)
\( \Delta a_{\text{సగటు}} = \frac{0.07+0.23+0.17}{3} = 0.156 \) ≈ 0.2 సె (సార్థక సంఖ్యల వరకు సవరించగా)
∴ కొలతలోని యథార్థత ± 0.2 సె
పరిశీలనల ఫలితం 39.67 ± 0.2 ను సార్థక సంఖ్యలకు సవరించగా 39.7 ± 0.2 సెకనులు.
Exam Tips:
a) సగటు, పరమ దోషాలు, సగటు పరమ దోషం — వరుసగా ఒక్కొక్క దశ రాయండి; తుది ఫలితాన్ని సార్థక సంఖ్యలకు సవరించండి.
Question 6: 1 కెలోరి = 4.2 J, 1 J = \( 1\ \mathrm{kg\,m^2\,s^{-2}} \). ద్రవ్యరాశికి ప్రమాణం α kg గా, పొడవుకు ప్రమాణం β m గా, కాలం ప్రమాణం γ s గా ఉండే ఒక ప్రమాణ వ్యవస్థను వాడినప్పుడు, కొత్త వ్యవస్థలో కెలోరికి ఉండే పరిమాణం \( 4.2\,\alpha^{-1}\beta^{-2}\gamma^{2} \) అని చూపండి.
Answer:
1 కెలోరి = 4.2 J = \( 4.2\ \mathrm{kg\,m^{2}\,s^{-2}} \) → (1)
ద్రవ్యరాశి నూతన ప్రమాణం = α kg ⇒ \( 1\ \mathrm{kg} = \alpha^{-1} \) కొత్త ప్రమాణాలు
అదేవిధంగా \( 1\ \mathrm{m} = \beta^{-1} \), \( 1\ \mathrm{s} = \gamma^{-1} \). ఈ విలువలను (1) లో రాయగా
1 కెలోరి = \( 4.2\,(\alpha^{-1})(\beta^{-1})^{2}(\gamma^{-1})^{-2} \)
∴ నూతన వ్యవస్థలో కెలోరి పరిమాణం = \( 4.2\,\alpha^{-1}\beta^{-2}\gamma^{2} \)
Exam Tips:
a) 1 kg = α⁻¹, 1 m = β⁻¹, 1 s = γ⁻¹ అని ముందు రాసి ప్రతిక్షేపించండి; ప్రమాణం పెరిగితే సంఖ్యా విలువ తగ్గుతుందని గుర్తుంచుకోండి.
Question 7: శూన్యంలో కాంతి వడి 1 ms⁻¹ అయ్యేవిధంగా పొడవుకు ఒక కొత్త ప్రమాణాన్ని ఎంచుకొన్నారు. సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం 8 నిమిషాల 20 సెకన్లయితే కొత్త ప్రమాణాల్లో సూర్యుడు – భూమి మధ్య దూరం ఎంత ?
Answer:
శూన్యంలో కాంతి వడికి కొత్త ప్రమాణం c = 1 N.U./సె
కాంతి భూమిని చేరడానికి పట్టిన కాలం t = 8 ని. 20 సె. = (8 × 60) + 20 = 500 సె
సూర్యుని నుంచి భూమి దూరం x = c × t = 1 N.U./సె × 500 సె = 500 కొత్త ప్రమాణాలు
Exam Tips:
a) కొత్త ప్రమాణంలో c = 1 కావడంతో దూరం = కాలం (సెకన్లలో) అని గమనించండి; 8 ని. 20 సె. = 500 సె.
Question 8: 100 ఆవర్ధనం ఉండే సూక్ష్మదర్శినిని ఉపయోగించి ఒక విద్యార్థి మానవుడి వెంట్రుక మందాన్ని కొలుస్తున్నాడు. 20 పరిశీలనల వల్ల వెంట్రుకల సగటు మందాన్ని (సూక్ష్మదర్శినిలో చూసినదాని దృష్ట్యా) 3.5 mm గా కనుక్కొన్నాడు. అంచనాకు వచ్చే మందం ఎంత ?
Answer:
ఆవర్ధనం \( m = \frac{\text{కొలిచిన వెడల్పు }(Y)}{\text{వాస్తవ వెడల్పు }(X)} \)
⇒ వాస్తవ వెడల్పు \( x = \frac{y}{m} = \frac{3.5\ \text{మి.మీ.}}{100} = 0.035 \) మి.మీ.
Exam Tips:
a) ఆవర్ధనం = చిత్ర పరిమాణం ÷ వాస్తవ పరిమాణం; వాస్తవ మందం = కొలిచిన మందం ÷ ఆవర్ధనం.
Question 9: కొలవగలిగే నాలుగు రాశులు a, b, c, d లతో X అనే భౌతిక రాశి కింది విధంగా సంబంధాన్ని కలిగి ఉంది. \( X = a^{2}b^{3}c^{5/2}d^{-2} \). a, b, c, d లను కొలవడంలో దోష శాతాలు వరుసగా 1%, 2%, 3%, 4% అయితే X లో దోషశాతం ఎంత ?
Answer:
దత్తాంశం: \( X = a^{2}b^{3}c^{5/2}d^{-2} \)
\( \frac{\Delta a}{a}\times 100 = 1\%,\ \frac{\Delta b}{b}\times 100 = 2\%,\ \frac{\Delta c}{c}\times 100 = 3\%,\ \frac{\Delta d}{d}\times 100 = 4\% \)
\( \frac{\Delta X}{X} = \pm\left[2\frac{\Delta a}{a} + 3\frac{\Delta b}{b} + \frac{5}{2}\frac{\Delta c}{c} + 2\frac{\Delta d}{d}\right] \)
\( = \pm\left[2(1\%) + 3(2\%) + \frac{5}{2}(3\%) + 2(4\%)\right] = \pm 23.5\% \)
X లో దోషశాతం = ± 23.5%
Exam Tips:
a) X = aᵖbᵠ… అయితే గరిష్ఠ దోషశాతం = |p|·(a దోషశాతం) + |q|·(b దోషశాతం)… ఘాతాలు ఋణాత్మకమైనా దోషాలు కూడతాయి.
Question 10: ఒక వస్తువు వేగం v = At² + Bt + C అని ఇవ్వడమైంది. v, t లను SI ప్రమాణాల్లో వ్యక్తం చేస్తే A, B, C లకు ప్రమాణాలు రాయండి.
Answer:
మితుల సజాతీయతా సూత్రం ప్రకారం \( At^{2} \), \( Bt \) మరియు C ల మితి ఫార్ములాలు వేగం v మితి ఫార్ములాకు సమానం.
∴ \( [v] = LT^{-1} \)
\( LT^{-1} = A\,[T^{2}] \Rightarrow A = \frac{LT^{-1}}{T^{2}} = LT^{-3} \) కావున A ప్రమాణం మీ/సె³
\( LT^{-1} = B\,[T] \Rightarrow B = LT^{-2} \) కావున B ప్రమాణం మీ/సె²
\( LT^{-1} = C \) కావున C ప్రమాణం మీ/సె
Exam Tips:
a) మితుల సజాతీయతా సూత్రం (ప్రతి పదానికి ఒకే మితి) ఉపయోగించి A, B, C ప్రమాణాలను రాబట్టండి.
లెక్కలు
Question 1: P = E l² m⁻⁵ G⁻² అనే సమాసంలో E, l, m, G లు వరుసగా శక్తి, కోణీయ ద్రవ్యవేగం, ద్రవ్యరాశి, గురుత్వ స్థిరాంకాలను సూచిస్తే P ఒక మితిరహిత రాశి అని చూపండి.
Answer:
దత్తాంశం: \( P = E\,l^{2}m^{-5}G^{-2} \)
\( = [ML^{2}T^{-2}]\,[ML^{2}T^{-1}]^{2}\,[M]^{-5}\,[M^{-1}L^{3}T^{-2}]^{-2} \)
\( = M^{1+2-5+2}\,L^{2+4-6}\,T^{-2-2+4} = [M^{0}L^{0}T^{0}] \)
∴ P = \( [M^0L^0T^0] \) అనగా P మితులు లేని రాశి.
Exam Tips:
a) ప్రతి రాశికి మితి ఫార్ములా రాసి M, L, T ఘాతాలను వేర్వేరుగా కూడండి; అన్నీ సున్నా అయితే మితిరహితం.
Question 2: కాంతివేగం C, ప్లాంక్ స్థిరాంకం h, విశ్వగురుత్వ స్థిరాంకం G లను ప్రాథమిక రాశులుగా తీసుకొంటే, ఈ రాశుల మితుల్లో ద్రవ్యరాశి, పొడవు, కాలాలను రాయండి.
Answer:
దత్తాంశం నుండి \( c = [LT^{-1}],\ h = [ML^{2}T^{-1}],\ G = [M^{-1}L^{3}T^{-2}] \)
ద్రవ్యరాశి కోసం \( m = c^{x}h^{y}G^{z} \) → (1)
\( [M^{1}L^{0}T^{0}] = (LT^{-1})^{x}(ML^{2}T^{-1})^{y}(M^{-1}L^{3}T^{-2})^{z} \)
\( = M^{y-z}\,L^{x+2y+3z}\,T^{-x-y-2z} \)
మితుల సజాతీయతా నియమం నుండి
\( y - z = 1 \) → (2)
\( x + 2y + 3z = 0 \) → (3)
\( -x - y - 2z = 0 \) → (4)
(3), (4) లను కలుపగా \( y + z = 0 \). దీనిని (2) తో కలుపగా \( 2y = 1 \Rightarrow y = \frac{1}{2} \)
(2) నుండి \( z = y - 1 = -\frac{1}{2} \); (4) నుండి \( x = -y - 2z = -\frac{1}{2} + 1 = \frac{1}{2} \)
x, y, z విలువలను (1) లో రాయగా \( m = c^{1/2}h^{1/2}G^{-1/2} = \sqrt{\frac{ch}{G}} \)
ఇదేవిధంగా పొడవు, కాలాలకు సమీకరణాలు సాధిస్తే
\( L = \sqrt{\frac{hG}{c^{3}}} \) మరియు \( T = \sqrt{\frac{hG}{c^{5}}} \) లభిస్తాయి.
Exam Tips:
a) x, y, z లకు M, L, T ఘాతాల సమీకరణాలు మూడు రాసి సాధించండి; చివర్లో ఫలితాన్ని మితులతో సరిచూడండి.
Question 3: M ద్రవ్యరాశి, R వ్యాసార్ధం కలిగి ఉండే గ్రహం చుట్టూ r వ్యాసార్ధం ఉన్న వృత్తాకార కక్ష్యలో ఒక కృత్రిమ ఉపగ్రహం పరిభ్రమిస్తుంది. మితీయ విశ్లేషణ ఆధారంగా ఉపగ్రహ కక్ష్యావర్తన కాలం
\( T = \frac{k}{R} \sqrt{\frac{\mathrm{r}^3}{\mathrm{g}}} \) అని చూపండి. ఇక్కడ k మితిరహిత స్థిరాంకం, g గురుత్వ త్వరణం.
Answer:
దత్తాంశం నుండి \( T^{2} \propto r^{3} \) లేదా \( T \propto r^{3/2} \); కాలం T గురుత్వ త్వరణం g, గ్రహ వ్యాసార్ధం R లపై కూడా ఆధారపడుతుంది.
\( T = k\,r^{3/2}g^{a}R^{b} \) → (1) (k మితిరహిత స్థిరాంకం)
మితులు రాయగా \( [M^{0}L^{0}T^{1}] = L^{3/2}(LT^{-2})^{a}(L)^{b} = L^{a+b+3/2}\,T^{-2a} \)
మితుల సజాతీయతా నియమం నుండి \( a + b + \frac{3}{2} = 0 \) → (2), \( -2a = 1 \Rightarrow a = -\frac{1}{2} \)
(2) నుండి \( -\frac{1}{2} + b + \frac{3}{2} = 0 \Rightarrow b = -1 \)
a, b విలువలను (1) లో రాయగా \( T = k\,r^{3/2}g^{-1/2}R^{-1} \)
∴ ఉపగ్రహ కక్ష్యావర్తన కాలం \( T = \frac{k}{R}\sqrt{\frac{r^{3}}{g}} \)
Exam Tips:
a) T = k rᵃ… రూపంలో ఘాతాల పోలికను (L, T) వేర్వేరుగా రాయండి; kకు మితులు లేవని పేర్కొనండి.
Question 4: క్రింది సంఖ్యల్లో సార్థక సంఖ్యలు ఎన్ని ఉన్నాయో తెలపండి.
a) 6729
b) 0.024
c) 0.08240
d) 6.032
e) 4.57 × 10⁸
Answer:
a) 6729 — అన్ని అంకెలూ సార్థకమే. కావున సార్థక సంఖ్యలు నాలుగు.
b) 0.024 — మొదటి సున్నాకాని అంకెకు ముందున్న సున్నాలు సార్థక సంఖ్యలు కావు. కావున సార్థక సంఖ్యలు రెండు.
c) 0.08240 — ముందున్న సున్నాలు సార్థకం కావు; చివరన ఉన్న సున్నా సార్థకం. కావున సార్థక సంఖ్యలు నాలుగు.
d) 6.032 — సున్నాకాని రెండు అంకెల మధ్య ఉన్న సున్నా సార్థకం. కావున సార్థక సంఖ్యలు నాలుగు.
e) \( 4.57 \times 10^{8} \) — ఘాత రూపంలో రాసేటప్పుడు సార్థక సంఖ్యలనే రాస్తాం. కావున సార్థక సంఖ్యలు మూడు.
Exam Tips:
a) సార్థక అంకెల నియమాలు: సున్నా కాని అంకెలు, వాటి మధ్య సున్నాలు, దశాంశం తరువాత చివరి సున్నాలు సార్థకాలు; ముందు సున్నాలు కావు.
Question 5: రెండు కర్రల పొడవులు వరుసగా 12.132 సెం.మీ., 12.4 సెం.మీ. ఈ కర్రలను ఒకదాని చివర మరొకదాని చివరకు తాకునట్లు అమర్చితే మొత్తం పొడవు ఎంత ? రెండింటిని ఒకదాని పక్క మరొకటి అమర్చితే పొడవుల్లో వ్యత్యాసం ఎంత?
Answer:
పొడవులు \( l_1 = 12.132 \) సెం.మీ., \( l_2 = 12.4 \) సెం.మీ. వీటిలో దశాంశం తరువాత కనీస సార్థక అంకె ఒకటి (12.4).
a) రెండు కర్రలను ఒకదాని చివర మరొకటి ఉంచితే మొత్తం పొడవు \( l = l_1 + l_2 = 12.132 + 12.4 = 24.532 \) సెం.మీ.
సంకలనంలో ఫలితాన్ని దశాంశ స్థానం తరువాత కనీస సార్థక అంకెల వరకు సవరించాలి. కావున 24.532 ను సవరించగా 24.5 సెం.మీ.
b) కర్రల పొడవుల భేదం \( l = l_2 - l_1 = 12.4 - 12.132 = 0.268 \) సెం.మీ.
వ్యవకలనంలో కూడా ఫలితాన్ని కనీస సార్థక అంకెల వరకు సవరించగా 0.268 ≈ 0.3 సెం.మీ.
Exam Tips:
a) సంకలన, వ్యవకలనాల్లో దశాంశ స్థానాల సంఖ్య (తక్కువది) ఆధారంగా సవరించాలి — సార్థక అంకెల సంఖ్య ఆధారంగా కాదు.
Question 6: సమ ఘనం భుజం పొడవు 7.203 మీ. (i) ఘనం ఉపరితల వైశాల్యం, (ii) ఘనం ఘనపరిమాణాలను తగిన సార్థక సంఖ్యలకు లెక్కించండి.
Answer:
భుజం a = 7.203 మీ. ఇందులో సార్థక సంఖ్యలు నాలుగు.
1. ఉపరితల వైశాల్యం \( = 6a^{2} = 6 \times 7.203 \times 7.203 = 311.299 \). నాలుగు సార్థక సంఖ్యలకు సవరించగా \( 311.3\ \mathrm{m^{2}} \)
2. ఘనపరిమాణం \( V = a^{3} = (7.203)^{3} = 373.714 \). నాలుగు సార్థక సంఖ్యలకు సవరించగా \( V = 373.7\ \mathrm{m^{3}} \)
Exam Tips:
a) గుణకారంలో తుది ఫలితం ఇచ్చిన రాశిలోని సార్థక సంఖ్యలకు సమానంగా సవరించండి (ఇక్కడ 4).
Question 7: ఒక వస్తువు ద్రవ్యరాశి 2.42 g, ఘనపరిమాణం 4.7 cm ³. వాటిలోని దోషాలు వరుసగా 0.01 g, 0.1 cm³ అయితే వస్తువు సాంద్రతలో గరిష్ట దోషాన్ని కనుక్కోండి.
Answer:
ద్రవ్యరాశి m = 2.42 g, ఘనపరిమాణం V = 4.7 cm³; దోషాలు ∆m = 0.01 g, ∆V = 0.1 cm³
\( \text{m లో దోషశాతం} = \frac{\Delta m}{m}\times 100 = \frac{0.01}{2.42}\times 100 = 0.413\% \)
\( \text{V లో దోషశాతం} = \frac{\Delta V}{V}\times 100 = \frac{0.1}{4.7}\times 100 = 2.127\% \)
సాంద్రత \( \rho = \frac{m}{V} \)
సాంద్రతలో గరిష్ఠ దోషశాతం = m లో దోషశాతం + V లో దోషశాతం \( = 0.413 + 2.127 = 2.54\% \)
Exam Tips:
a) సాంద్రత = ద్రవ్యరాశి ÷ ఘనపరిమాణం; భాగహారంలో దోషశాతాలు కూడతాయి (తీసివేయవు).
Question 8: గోళం వ్యాసార్ధం కొలవడంలో దోషం 1% అయితే గోళం ఘనపరిమాణం కొలవడంలో దోషం ఎంత ?
Answer:
గోళ వ్యాసార్ధంలో దోషశాతం \( \frac{\Delta r}{r}\times 100 = 1\% \)
గోళ ఘనపరిమాణం \( V \propto r^{3} \Rightarrow \frac{\Delta V}{V} = 3\,\frac{\Delta r}{r} \)
ఘనపరిమాణంలో దోషశాతం \( = 3 \times 1 = 3\% \)
Exam Tips:
a) V ∝ r³ కాబట్టి సాపేక్ష దోషం 3 రెట్లు.
Question 9: ద్రవ్యరాశి, వడిలో దోష శాతాలు వరుసగా 2%, 3% అయితే గతిజ శక్తిలో గరిష్ఠ దోష శాతం ఎంత ?
Answer:
ద్రవ్యరాశిలో దోషశాతం \( \frac{\Delta m}{m}\times 100 = 2\% \); వడిలో దోషశాతం \( \frac{\Delta v}{v}\times 100 = 3\% \)
గతిజశక్తి \( K.E. = \frac{1}{2}mv^{2} \)
గతిజశక్తిలో దోషశాతం = 1 (ద్రవ్యరాశిలో దోషశాతం) + 2 (వడిలో దోషశాతం)
\( = 1 \times 2 + 2 \times 3 = 8\% \)
Exam Tips:
a) K.E. = ½mv² లో v ఘాతం 2 కాబట్టి v దోషశాతాన్ని 2తో గుణించాలి; ½ దోషం కలపదు.
Question 10: ప్రామాణిక ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక మోల్ ఆదర్శవాయువు 22.4L (మోలార్ఘనపరిమాణం) ఘనపరిమాణం ఆక్రమిస్తుంది. హైడ్రోజన్ అణు పరిమాణం సుమారుగా 1 Å, అయితే హైడ్రోజన్ మోలార్ ఘనపరిమాణానికి, పరమాణు ఘనపరిమాణానికి మధ్య నిష్పత్తి ఎంత ?
Answer:
హైడ్రోజన్ పరమాణు పరిమాణం ≃ 1 Å = \( 10^{-10} \) మీ = \( 10^{-8} \) సెం.మీ.
అవగాడ్రో సంఖ్య n = \( 6.022 \times 10^{23} \)
\( V_1 = \text{అణువుల సంఖ్య} \times \text{పరమాణు ఘ.ప.} = \frac{4}{3}\pi r^{3}\times n = \frac{4}{3}\times\frac{22}{7}\times(10^{-8})^{3}\times 6.022\times 10^{23} = 2.523 \) సెం.మీ.³
\( V_2 = 22.4\ \mathrm{L} = 22.4 \times 1000\ \mathrm{cm^{3}} = 2.24 \times 10^{4}\ \mathrm{cm^{3}} \)
∴ వాయు మోలార్ ఘనపరిమాణానికి, అణువుల ఘనపరిమాణానికి నిష్పత్తి \( V_2 : V_1 = 2.24\times 10^{4} : 2.523 \approx 10^{4} \)
Exam Tips:
a) పరమాణువు గోళంగా తీసుకొని ఘనపరిమాణం 4/3 πr³ ఉపయోగించి, మోల్‌లోని పరమాణువుల సంఖ్య (N_A)తో గుణించండి; cm³–L మార్పిడిలో జాగ్రత్త.
ముఖ్యమైన అదనపు లెక్కలు
Question 1: ఖాళీలను పూరించండి.
a) 1 cm భుజం పొడవు ఉండే సమఘనం ఘనపరిమాణం …………… m³
b) 2.0 cm వ్యాసార్ధం, 10.0 cm ఎత్తు ఉండే ఘన స్థూపం ఉపరితల వైశాల్యం …………… (mm)²
c) 18 km h⁻¹ వడితో చలిస్తున్న వాహనం 1 s లో ప్రయాణించే దూరం …………… m
d) సీసం సాపేక్ష సాంద్రత 11.3 అయితే దాని సాంద్రత …………… g cm⁻³ లేదా …………… kg m⁻³.
Answer:
a) భుజం పొడవు L = 1 సెం.మీ. = \( 10^{-2} \) మీ.
ఘనపరిమాణం \( = L^{3} = (10^{-2}\ \mathrm{m})^{3} = 10^{-6}\ \mathrm{m^{3}} \)
b) r = 2.0 సెం.మీ. = 20 మి.మీ., h = 10.0 సెం.మీ. = 100 మి.మీ.
స్థూపం ఉపరితల వైశాల్యం \( = 2\pi r(r + h) = 2\times 3.14\times 20\times(20+100) = 1.5\times 10^{4}\ \mathrm{mm^{2}} \)
c) వడి \( v = 18\ \mathrm{km\,h^{-1}} = \frac{18\times 1000\ \mathrm{m}}{60\times 60\ \mathrm{s}} = 5\ \mathrm{m\,s^{-1}} \)
∴ 1 సెకనులో ప్రయాణించే దూరం = 5 మీ.
d) సాపేక్ష సాంద్రత = 11.3 ⇒ సాంద్రత = 11.3 g cm⁻³ \( = \frac{11.3\times 10^{-3}\ \mathrm{kg}}{(10^{-2}\ \mathrm{m})^{3}} = 11.3\times 10^{3}\ \mathrm{kg\,m^{-3}} \)
Exam Tips:
a) స్థూపం 'ఉపరితల వైశాల్యం' అంటే పూర్తి ఉపరితలం 2πr(r + h) (రెండు వృత్తాకార ముఖాలతో సహా); మార్పిడిలో cm→mm (×10) మరవకండి.
Question 2: ప్రమాణాలను తగురీతిలో పరివర్తన చేయడం ద్వారా ఖాళీలను పూరించండి. a) 1 kg m² s⁻² = ………… g cm² s⁻²
b) 1 m = ………… ly (కాంతి సంవత్సరాలు)
c) 3.0 m s⁻² = ………… km h⁻²
d) G = 6.67 × 10⁻¹¹ N m² (kg)⁻² = ……….. (cm)³ s⁻² g ⁻¹.
Answer:
a) \( 1\ \mathrm{kg\,m^{2}\,s^{-2}} = 1\times 10^{3}\ \mathrm{g}\,(10^{2}\ \mathrm{cm})^{2}\,\mathrm{s^{-2}} = 10^{7}\ \mathrm{g\,cm^{2}\,s^{-2}} \)
b) ఒక కాంతి సంవత్సరం = \( 9.46\times 10^{15} \) m
\( 1\ \mathrm{m} = \frac{1}{9.46\times 10^{15}}\ \mathrm{ly} = 1.057\times 10^{-16}\ \mathrm{ly} \approx 1.06\times 10^{-16}\ \mathrm{ly} \)
c) \( 3\ \mathrm{m\,s^{-2}} = 3\times 10^{-3}\ \mathrm{km}\,\left(\frac{1}{3600}\ \mathrm{h}\right)^{-2} = 3\times 10^{-3}\times 3600\times 3600\ \mathrm{km\,h^{-2}} = 3.888\times 10^{4}\ \mathrm{km\,h^{-2}} \)
d) \( G = 6.67\times 10^{-11}\ \mathrm{N\,m^{2}\,kg^{-2}} = 6.67\times 10^{-11}\ \mathrm{m^{3}\,s^{-2}\,kg^{-1}} \)
\( = 6.67\times 10^{-11}\,(100\ \mathrm{cm})^{3}\,\mathrm{s^{-2}}\,(1000\ \mathrm{g})^{-1} = 6.67\times 10^{-8}\ \mathrm{cm^{3}\,s^{-2}\,g^{-1}} \)
Exam Tips:
a) పరివర్తన చేసేటప్పుడు ప్రతి ప్రమాణాన్ని విడిగా మార్చి ఘాతాలను జాగ్రత్తగా పరిగణించండి (ఉదా: m³ → (100 cm)³).
Question 3: క్రింది ప్రవచనాన్ని స్పష్టంగా వివరించండి:
“పోలికకు అవసరమయ్యే ప్రామాణికాన్ని నిర్దేశించకుండా మితీయరాశిని పెద్ది లేదా చిన్నది అని పిలవడం అర్థరహితం.” దీన్ని దృష్టిలో ఉంచుకొని కింది ప్రవచనాలను అవసరమైన చోట సరిచేసి తిరిగి రాయండి.
a) పరమాణువులు అతిచిన్న వస్తువులు.
b) జెట్ విమానం ఎక్కువ వడితో చలిస్తుంది.
c) బృహస్పతి ద్రవ్యరాశి చాలా ఎక్కువ.
d) ఈ గదిలోని గాలి అధిక సంఖ్యలో అణువులను కలిగి ఉంది.
e) ఎలక్ట్రాన్ కంటే ప్రోటాన్ ద్రవ్యరాశి చాలా ఎక్కువ.
f) కాంతి వేగం కంటే ధ్వని వేగం చాలా తక్కువ.
Answer:
ప్రవచనం సరియైనదే. ఎందుకనగా పోలికకు అవసరమైన ప్రమాణం లేకుండా ఒక భౌతిక రాశి పరిమాణం పెద్దదా చిన్నదా అని నిర్ణయించలేము.
a) సూది మొనతో పోలిస్తే పరమాణువులు అతిచిన్న వస్తువులు.
b) రైలు కన్నా జెట్ విమానం ఎక్కువ వడితో చలిస్తుంది.
c) భూమి కన్నా బృహస్పతి ద్రవ్యరాశి చాలా ఎక్కువ.
d) ఒక మోల్ వాయువులోని అణువుల సంఖ్య కన్నా గదిలోని గాలిలో అణువుల సంఖ్య ఎక్కువ.
e) ఇచ్చిన ప్రవచనం సరియైనదే (ఎలక్ట్రాన్‌తో పోలిస్తే ప్రోటాన్ ద్రవ్యరాశి దాదాపు 1836 రెట్లు ఎక్కువ).
f) ఇచ్చిన ప్రవచనం సరియైనదే (కాంతి వేగంతో పోలిస్తే ధ్వని వేగం చాలా తక్కువ).
Exam Tips:
a) పోలిక ప్రమాణం పేర్కొనకపోతే 'పెద్దది/చిన్నది' అనడం అర్థరహితం; ప్రతి వాక్యంలో పోలిక వస్తువును జోడించి రాయండి.
Question 4: పొడవును కొలవడానికి కింది వాటిలో ఏది చాలా ఖచ్చితమైన పరికరం ?
a) కదిలే స్కేలుపై 20 వెర్నియర్ విభాగాలు 19 ప్రధాన స్కేలు విభాగాలకు సమానంగా ఉండే కాలిపర్స్.
b) 1 mm పిచ్, 100 తలస్కేలు విభాగాలు ఉండే స్క్రూగేజి.
c) కాంతి తరంగదైర్ఘ్య విలువకు తక్కువ/సమానం వరకు పొడవును కొలిచే దృక్సాధనం.
Answer:
అతి తక్కువ కనీస కొలత గల పరికరం అత్యంత ఖచ్చితమైనది.
a) వెర్నియర్ కాలిపర్స్: కనీస కొలత = 1 MSD − 1 VSD = \( 1\ \mathrm{MSD}\left(1-\frac{19}{20}\right) = \frac{1}{20} = 0.05 \) mm (1 MSD = 1 mm గా తీసుకున్నాం)
b) స్క్రూగేజి: కనీస కొలత \( = \frac{\text{మర భ్రమణాంతరం}}{\text{తలస్కేలు విభాగాల సంఖ్య}} = \frac{1\ \mathrm{mm}}{100} = \frac{1}{100}\ \mathrm{mm} = 0.01 \) mm
c) కాంతి తరంగదైర్ఘ్యం \( 10^{-5} \) cm క్రమంలో ఉంటుంది. దీనిని కొలిచే దృక్సాధనం కనీస కొలత కూడా \( 10^{-5} \) cm (= \( 10^{-4} \) mm) లేదా అంతకంటే తక్కువ.
∴ ఇచ్చిన పరికరాలలో (c) అత్యంత ఖచ్చితమైనది.
Exam Tips:
a) కనీస కొలత ఎంత తక్కువైతే పరికరం అంత ఖచ్చితం; మూడు పరికరాల కనీస కొలతలను ఒకే ప్రమాణంలో రాసి పోల్చండి.
Question 5: క్రింది వాటికి సమాధానం వ్రాయండి.
a) నీకు ఒక దారం, మీటరు స్కేలును ఇస్తే దారం వ్యాసాన్ని ఏ విధంగా అంచనా వేస్తావు ?
b) ఒక స్క్రూగేజి పిచ్ 1.0 mm, వృత్తాకార స్కేలుపై విభాగాలు 200. వృత్తాకార స్కేలుపై విభాగాల సంఖ్యను అనియతంగా పెంచడం ద్వారా స్క్రూగేజి యథార్థతను పెంచడం సాధ్యమని నీవు అనుకొంటున్నావా ?
c) వెర్నియర్ కాలిపర్స్ సహాయంతో పలుచని ఇత్తడి కడ్డీ సగటు వ్యాసాన్ని నిర్ణయించవలసి ఉంది. 5 కొలతల సమితి కంటే 100 కొలతల సమితితో వచ్చే అంచనా విలువ ఎక్కువ నమ్మదగినదని మనమెందుకు ఆశిస్తాం ?
Answer:
a) దారం వ్యాసం చాలా తక్కువ కావున మామూలు స్కేలుతో కొలవలేము. దారాన్ని స్కేలుపై ఒకదాని పక్కన ఒకటి ఆనుకుని ఉండేలా n చుట్లు చుట్టి, ఆ చుట్ట పొడవు l ను కొలవాలి.
దారం వ్యాసం \( d = \frac{l}{n} \) అవుతుంది.
b) స్క్రూగేజి కనీస కొలత \( \mathrm{L.C.} = \frac{\text{మర భ్రమణాంతరం}}{\text{తలస్కేలు విభాగాల సంఖ్య}} = \frac{1.0\ \mathrm{mm}}{200} = 0.005 \) mm. తలస్కేలు విభాగాలు పెంచితే కనీస కొలత తగ్గి సున్నితత్వం పెరుగుతుంది. కానీ తల పరిమాణం దృష్ట్యా ఒక పరిమితికి మించి విభాగాలు పెంచితే రీడింగులను ఖచ్చితంగా చదవడం సాధ్యపడదు. అందువల్ల యథార్థతను అనియతంగా పెంచలేము.
c) పరిశీలనల సంఖ్య పెంచితే యాదృచ్ఛిక దోషాలు ఒకదానినొకటి సరిదిద్దుకునే అవకాశం ఎక్కువ. కావున 100 రీడింగుల సగటు, 5 రీడింగుల సగటు కన్నా ఎక్కువ నమ్మదగినది.
Exam Tips:
a) ప్రతి భాగానికి చిన్న వివరణ రాయండి; (b)లో L.C. = పిచ్ ÷ విభాగాల సంఖ్య సూత్రం ఉపయోగించండి.
Question 6: 35 mm స్లైడుపై ఒక ఇంటి ఛాయాచిత్రం వైశాల్యం 1.75 cm ². ఆ స్లైడును తెరపై ప్రాజెక్ట్ చేసినపుడు ఇంటి వైశాల్యం 1.55 m² గా ఉంది. ప్రొజెక్టర్-తెర అమరిక రేఖీయ ఆవర్ధనం ఎంత ?
Answer:
ప్రతిబింబ వైశాల్యం = 1.55 మీ² = \( 1.55\times 10^{4} \) సెం.మీ.²
స్లైడుపై ఛాయాచిత్ర వైశాల్యం = 1.75 సెం.మీ.²
\( \text{విస్తీర్ణ ఆవర్ధనం} = \frac{\text{ప్రతిబింబ వైశాల్యం}}{\text{వస్తు వైశాల్యం}} = \frac{1.55\times 10^{4}}{1.75} = 8857 \)
\( \text{రేఖీయ ఆవర్ధనం} = \sqrt{\text{విస్తీర్ణ ఆవర్ధనం}} = \sqrt{8857} = 94.1 \)
Exam Tips:
a) విస్తీర్ణ (వైశాల్య) ఆవర్ధనం = (రేఖీయ ఆవర్ధనం)² అని గుర్తుంచుకొని వర్గమూలం తీసుకోండి.
Question 7: క్రింద ఇచ్చిన వాటిలో సార్థక సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ?
a) 0.007 m²
b) \( 2.64\times 10^{24} \) kg
c) 0.2370 g cm⁻³
d) 6.320 J
e) 6.032 N m⁻²
f) 0.0006032 m²
Answer:
a) 0.007 m² లో సార్థక సంఖ్య ఒకటి.
b) \( 2.64\times 10^{24} \) kg లో సార్థక సంఖ్యలు మూడు.
c) 0.2370 g cm⁻³ లో సార్థక సంఖ్యలు నాలుగు.
d) 6.320 J లో సార్థక సంఖ్యలు నాలుగు.
e) 6.032 N m⁻² లో సార్థక సంఖ్యలు నాలుగు.
f) 0.0006032 m² లో సార్థక సంఖ్యలు నాలుగు.
Exam Tips:
a) సున్నా-నియమాలు: ముందు సున్నాలు లెక్కలోకి రావు, చివరి సున్నాలు (దశాంశం ఉంటే) వస్తాయి.
Question 8: దీర్ఘచతురస్రాకార లోహ పలక పొడవు, వెడల్పు, మందాలు వరుసగా 4.234 m, 1.005 m, 2.01 cm లు సరైన సార్థక సంఖ్యల వరకు ఆ పలక వైశాల్యం, ఘనపరిమాణాలను రాయండి.
Answer:
పొడవు l = 4.234 m, వెడల్పు b = 1.005 m, మందం t = 2.01 cm = \( 2.01\times 10^{-2} \) m
పలక వైశాల్యం \( = 2(l\times b + b\times t + t\times l) = 2(4.234\times 1.005 + 1.005\times 0.0201 + 0.0201\times 4.234) \)
\( = 2(4.3604739) = 8.7209478\ \mathrm{m^{2}} \)
కొలతలలో కనీస సార్థక సంఖ్యలు మూడు (2.01) కావున తుది జవాబులో మూడు సార్థక సంఖ్యలే ఉండాలి.
వైశాల్యం = \( 8.72\ \mathrm{m^{2}} \)
ఘనపరిమాణం \( V = l\times b\times t = 4.234\times 1.005\times 0.0201 = 0.0855289 \) ≈ \( 0.0855\ \mathrm{m^{3}} \) (మూడు సార్థక సంఖ్యలకు సవరించగా)
Exam Tips:
a) కొలతల్లో అన్నిటినీ ఒకే ప్రమాణంలోకి (m) మార్చి గణించండి; తుది ఫలితాన్ని కనీస సార్థక సంఖ్యలకు (3) సవరించండి.
Question 9: ఒక పెట్టెను కిరాణా షాపుదారు వాడే త్రాసుతో తూస్తే వచ్చిన ద్రవ్యరాశి 2.300 kg. ఇప్పుడు ఈ పెట్టెకు 20.15g, 20.17g ద్రవ్యరాశులు గల రెండు బంగారు ముక్కలను కలిపారు. (a) పెట్టె మొత్తం ద్రవ్యరాశి, (b) ముక్కల ద్రవ్యరాశుల్లో వ్యత్యాసాన్ని సరైన సార్థక సంఖ్యల వరకు రాయండి.
Answer:
పెట్టె ద్రవ్యరాశి m = 2.300 kg ≈ 2.3 kg
1వ బంగారు ముక్క ద్రవ్యరాశి \( m_1 = 20.15\ \mathrm{g} = 0.02015\ \mathrm{kg} \)
2వ బంగారు ముక్క ద్రవ్యరాశి \( m_2 = 20.17\ \mathrm{g} = 0.02017\ \mathrm{kg} \)
a) మొత్తం ద్రవ్యరాశి = m + m₁ + m₂ = 2.3 + 0.02015 + 0.02017 = 2.34032 kg. కనీస దశాంశ స్థానాల వరకు సవరించగా మొత్తం ద్రవ్యరాశి = 2.3 kg
b) ముక్కల ద్రవ్యరాశుల భేదం = m₂ − m₁ = 20.17 − 20.15 = 0.02 g.
Exam Tips:
a) కూడికలో దశాంశ స్థానాల నియమం, తీసివేతలో కూడా అదే నియమం — మొదటి భాగం 2.3 kg, రెండవది 0.02 g.
Question 10: P అనే భౌతికరాశి a, b, c, d అనే నాలుగు పరిశీలించగలిగే రాశులతో కింది విధమైన సంబంధాన్ని కలిగి ఉంది:
\( P = \frac{a^{3}b^{2}}{\sqrt{c}\,d} \)
a, b, c, d ల కొలతల్లోని దోషశాతాలు వరుసగా 1%, 3%, 4%, 2% అయితే P లోని దోషశాతం ఎంత ? పై సంబంధం ఉపయోగించి లెక్కించిన P విలువ 3.763 అయితే, ఫలితాన్ని నీవు ఏ విలువ వరకు సవరిస్తావు ?
Answer:
దత్తాంశం నుండి \( P = \frac{a^{3}b^{2}}{\sqrt{c}\,d} \)
P లో గరిష్ఠ సాపేక్ష దోషం
\( \frac{\Delta P}{P} = \pm\left[3\frac{\Delta a}{a} + 2\frac{\Delta b}{b} + \frac{1}{2}\frac{\Delta c}{c} + \frac{\Delta d}{d}\right] = \pm\left[3\left(\frac{1}{100}\right) + 2\left(\frac{3}{100}\right) + \frac{1}{2}\left(\frac{4}{100}\right) + \frac{2}{100}\right] = \pm\frac{13}{100} = \pm 0.13 \)
P లో దోషశాతం \( = \frac{\Delta P}{P}\times 100 = \pm 0.13\times 100 = \pm 13\% \)
దోషశాతం 13% కావున P విలువలో సార్థక సంఖ్యలు రెండు. తుది జవాబు 3.763 ను రెండు సార్థక సంఖ్యలకు సవరించగా 3.8 అవుతుంది.
Exam Tips:
a) ఘాతాలను దోషశాతాలతో గుణించి కూడండి (3×1 + 2×3 + ½×4 + 1×2 = 13%); దోషశాతం ఆధారంగా సార్థక అంకెలను నిర్ణయించండి.
Question 11: ముద్రణా దోషాలు అనేకంగా ఉండే పుస్తకంలో ఒక నిర్దిష్ట ఆవర్తన చలనం చేస్తున్న కణం స్థానభ్రంశానికి నాలుగు భిన్న ఫార్ములాలు ఉన్నాయి. అవి :
a) \( y = a\sin\frac{2\pi t}{T} \)
b) \( y = a\sin vt \)
c) \( y = \frac{a}{T}\sin\frac{t}{a} \)
d) \( y = \frac{a}{\sqrt{2}}\left(\sin\frac{2\pi t}{T} + \cos\frac{2\pi t}{T}\right) \)
(a = కణం పొందే గరిష్ఠ స్థానభ్రంశం, v = కణం వడి, T = ఆవర్తన కాలం) మితుల దృష్ట్యా తప్పు అయిన ఫార్ములాలను కొట్టివేయండి.
Answer:
త్రికోణమితి ప్రమేయాలలో ఆర్గ్యుమెంట్ (కోణం) మితి లేని రాశి అయి ఉండాలి.
(a) \( \frac{2\pi t}{T} = \frac{T}{T} = 1 = [M^{0}L^{0}T^{0}] \) — మితిరహితం, కావున సరైనది.
(b) \( vt = (LT^{-1})(T) = L = [M^{0}L^{1}T^{0}] \) — మితిరహితం కాదు, కావున తప్పు.
(c) \( \frac{t}{a} = \frac{T}{L} = [L^{-1}T^{1}] \) — మితిరహితం కాదు, కావున తప్పు.
(d) \( \frac{2\pi t}{T} = \frac{T}{T} = 1 = [M^{0}L^{0}T^{0}] \) — మితిరహితం, కావున సరైనది.
∴ ఇచ్చిన ఫార్ములాలలో (b), (c) తప్పు.
Exam Tips:
a) మితి విశ్లేషణలో త్రికోణమితి ప్రమేయం లోపలి రాశి మితిరహితంగా ఉండాలి; ప్రతి ఐచ్ఛికాన్ని విడిగా పరీక్షించండి.
ముఖ్యమైన ఉదాహరణ లెక్కలు
Question 1: కోణాలు a) 1° (డిగ్రీ) b) 1′ (చాపం యొక్క నిమిషం లేదా ఆర్కిమిన్), c) 1″ (చాపం యొక్క సెకను, లేదా ఆర్క్ సెకను) రేడియన్లో లెక్కించండి. 360 ° = 2π rad, 1° = 60′, 1′ = 60″ లను ఉపయోగించండి.
Answer:
a) \( 360^{\circ} = 2\pi\ \mathrm{rad} \) నుండి
\( 1^{\circ} = \frac{\pi}{180}\ \mathrm{rad} = 1.745\times 10^{-2}\ \mathrm{rad} \)
b) \( 1^{\circ} = 60' = 1.745\times 10^{-2}\ \mathrm{rad} \)
\( 1' = 2.908\times 10^{-4}\ \mathrm{rad} \approx 2.91\times 10^{-4}\ \mathrm{rad} \)
c) \( 1' = 60'' = 2.908\times 10^{-4}\ \mathrm{rad} \)
\( 1'' = 4.847\times 10^{-6}\ \mathrm{rad} \approx 4.85\times 10^{-6}\ \mathrm{rad} \)
Exam Tips:
a) π rad = 180° మరియు 1° = 60′, 1′ = 60″ సంబంధాలు ఉపయోగించి దశల వారీగా మార్చండి.
Question 2: భూమి వ్యాసంపై ఉండే రెండు వ్యతిరేక బిందువులు A, B ల నుంచి, చంద్రుడిని పరిశీలించారు. చంద్రుడి వద్ద రెండు పరిశీలనా దిశలు ఏర్పరిచే కోణం θ విలువ 1° 54′. భూమి వ్యాసం సుమారుగా 1.276 × 10⁷ m అయితే, భూమి నుంచి చంద్రుని దూరాన్ని లెక్కించండి.
Answer:
దత్తాంశం నుంచి \( \theta = 1^{\circ}54' = 114' = (114\times 60)''\times(4.85\times 10^{-6})\ \mathrm{rad} \) (\( 1'' = 4.85\times 10^{-6}\ \mathrm{rad} \))
\( \theta = 3.32\times 10^{-2}\ \mathrm{rad} \)
అంతేగాక b = AB = \( 1.276\times 10^{7} \) m
కాబట్టి \( D = \frac{b}{\theta} \) సమీకరణం నుంచి భూమి–చంద్రుల మధ్య దూరం \( = \frac{1.276\times 10^{7}}{3.32\times 10^{-2}} = 3.84\times 10^{8}\ \mathrm{m} \)
Exam Tips:
a) పారలాక్స్ పద్ధతి: D = b/θ (θ రేడియన్లలో); కోణాన్ని ముందు సెకన్లలోకి, తరువాత రేడియన్లలోకి మార్చండి.
Question 3: సూర్యుడి కోణీయ వ్యాసం 1920″ అని కొలిచారు. భూమి నుంచి సూర్యుడి దూరం D విలువ 1.496 × 10¹¹ m. అయితే సూర్యుడి వ్యాసం ఎంత ?
Answer:
సూర్యుడి కోణీయ వ్యాసం \( \alpha = 1920'' = 1920\times 4.85\times 10^{-6}\ \mathrm{rad} = 9.31\times 10^{-3}\ \mathrm{rad} \)
సూర్యుడి వ్యాసం \( d = \alpha D = (9.31\times 10^{-3})\times(1.496\times 10^{11})\ \mathrm{m} \)
\( = 1.39\times 10^{9}\ \mathrm{m} \)
Exam Tips:
a) కోణీయ వ్యాసం (రేడియన్లలో) × దూరం = వ్యాసం.
Question 4: థర్మామీటరుతో రెండు వస్తువుల ఉష్ణోగ్రతలను t₁ = 20 °C ± 0.5 °C, t₂ = 50 °C ± 0.5 °C గా కొలిచారు. వాటి ఉష్ణోగ్రతా భేదాన్ని, దానిలోని దోషాన్ని లెక్కించండి.
Answer:
\( t' = t_2 - t_1 = (50\,^{\circ}\mathrm{C} \pm 0.5\,^{\circ}\mathrm{C}) - (20\,^{\circ}\mathrm{C} \pm 0.5\,^{\circ}\mathrm{C}) \)
\( t' = 30\,^{\circ}\mathrm{C} \pm 1\,^{\circ}\mathrm{C} \)
Exam Tips:
a) తీసివేతలోనూ పరమ దోషాలు కూడుతాయి (0.5 + 0.5 = 1).
Question 5: నిరోధం R = V/I, ఇందులో V = (100 ± 5)V, I = (10 ± 0.2)A. అయితే R లోని దోష శాతాన్ని కనుక్కోండి.
Answer:
V లోని దోషశాతం = 5%, I లోని దోషశాతం = 2%.
కాబట్టి R లో మొత్తం దోషశాతం = 5 + 2 = 7%.
Exam Tips:
a) భాగహారంలో శాతం దోషాలు కూడతాయి: 5% + 2% = 7%.
Question 6: లఘులోలకం డోలనావర్తన కాలం \( T = 2\pi\sqrt{L/g} \). 1 mm తెలిసిన యథార్థతతో కొలిచిన L విలువ 20.0 cm. 100 డోలనాలకు పట్టిన కాలాన్ని 1 s పృథక్కరణం ఉన్న చేతి గడియారంతో 90 s అని కనుక్కొన్నారు. అయితే g విలువను నిర్ణయించడంలో యథార్థత ఎంత ?
Answer:
ఇక్కడ \( g = \frac{4\pi^{2}L}{T^{2}} \)
కాలం \( T = \frac{t}{n} \) కావున \( \Delta T = \frac{\Delta t}{n} \), అంటే \( \frac{\Delta T}{T} = \frac{\Delta t}{t} \). L, t రెండింటిలోని దోషాలు కనీసపు కొలత దోషాలు. కాబట్టి
\( \frac{\Delta g}{g} = \frac{\Delta L}{L} + 2\frac{\Delta T}{T} = \frac{0.1}{20.0} + 2\left(\frac{1}{90}\right) = 0.027 \)
అందువల్ల g లోని దోషశాతం \( 100\,\frac{\Delta g}{g} = 100\,\frac{\Delta L}{L} + 2\times 100\,\frac{\Delta T}{T} = 3\% \)
Exam Tips:
a) g = 4π²L/T² నుండి Δg/g = ΔL/L + 2ΔT/T; T కొలత ఒకే స్టాప్‌వాచ్ కనీస కొలత (1 s) పై ఆధారపడుతుందని గుర్తుంచుకోండి.
Question 7: ఒక ఘనం యొక్క ఒక్కొక్క భుజం పొడవును 7.203 mగా కొలిచారు. దాని మొత్తం ఉపరితల వైశాల్యం, ఘనపరిమాణాల విలువలను తగిన సార్థక సంఖ్యల వరకు, కనుక్కోండి.
Answer:
కొలిచిన పొడవులో నాలుగు సార్థక సంఖ్యలు ఉండటం వల్ల వైశాల్యం, ఘనపరిమాణాలను కూడా నాలుగు సార్థక సంఖ్యల వరకే సవరించాలి.
ఘనం ఉపరితల వైశాల్యం \( = 6(7.203)^{2} = 311.299254\ \mathrm{m^{2}} \approx 311.3\ \mathrm{m^{2}} \)
ఘనం ఘనపరిమాణం \( = (7.203)^{3} = 373.714754\ \mathrm{m^{3}} \approx 373.7\ \mathrm{m^{3}} \)
Exam Tips:
a) పరిమాణం ఘనాలు/వర్గాలు అయినా తుది ఫలితం ఇచ్చిన భుజంలోని సార్థక సంఖ్యల (4) వరకే.
Question 8: 5.74 g పదార్థం 1.2 cm³ ఘనపరిమాణం ఆక్రమిస్తుంది. సార్థక సంఖ్యలను దృష్టిలో ఉంచుకొని దాని సాంద్రత విలువను వ్యక్తపరచండి.
Answer:
కొలిచిన ద్రవ్యరాశిలో మూడు సార్థక సంఖ్యలు (5.74), ఘనపరిమాణంలో రెండు సార్థక సంఖ్యలు (1.2) ఉన్నాయి. కాబట్టి సాంద్రతను రెండు సార్థక సంఖ్యల వరకే వ్యక్తపరచాలి.
సాంద్రత \( = \frac{5.74}{1.2} = 4.783\ \mathrm{g\,cm^{-3}} \approx 4.8\ \mathrm{g\,cm^{-3}} \)
Exam Tips:
a) భాగహారంలో తుది ఫలితం తక్కువ సార్థక అంకెలున్న రాశికి (1.2 → 2 అంకెలు) సమానంగా ఉండాలి.
Free study material for Physics
Step-by-Step Textbook Answers: Class 11 Physics Chapter 02 Units and Measurements
Textbook Solutions for Class 11 Physics Chapter 02 Units and Measurements
Explore reliable textbook solutions for Chapter 02 Units and Measurements tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Physics.
Mastering Theoretical and Practical Questions
Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 Physics text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 02 Units and Measurements with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 2 ప్రమాణాలు, కొలత is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 2 ప్రమాణాలు, కొలత as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 2 ప్రమాణాలు, కొలత will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 2 ప్రమాణాలు, కొలత in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 2 ప్రమాణాలు, కొలత in printable PDF format for offline study on any device.