Official TS Board Solutions for Class 11 Physics: Chapter 06 Work, Energy and Power
Explore reliable textbook solutions for Chapter 06 Work, Energy and Power tailored for Class 11 learners. Utilizing these Physics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.
Chapter-wise Solutions for Physics: Chapter 06 Work, Energy and Power
Access the complete solution PDF for Class 11 Physics below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: బలం వల్ల పని జరగని పరిస్థితులను తెలపండి.
Answer:
1) టగ్ ఆఫ్ వార్ పోటీలో ఇద్దరు వ్యక్తులు తాడు మీద సమాన బలం F ప్రయోగిస్తే తాడులోని తన్యత T = F కు సమానము. ఎందుకనగా ఒక వ్యక్తి ప్రయోగించిన
బలాన్ని తాడుకు కట్టిన ఆధారంగా భావించాలి. ఆధారం లేని తాడులో మనం తన్యత కలిగించలేము. ఈ స్థితిలో స్థానభ్రంశము S = 0, కావున జరిగిన పని సున్న. 2) బలము F మరియు స్థానభ్రంశము \( \bar{S} \) లు పరస్పర లంబాలైతే ఆ బలం జరిపిన పని W = 0 ఎందుకనగా \( W = F. \bar{S}=|\bar{F}||\bar{S}| \) cos θ. ఇందులో cos 90° = 0.
Exam Tips:
a) \( W = Fs\cos θ \) సూత్రం రాసి, F = 0, s = 0 లేదా θ = 90° అయ్యే సందర్భాలను ఉదాహరణలతో చెప్పండి.
Question 2: పని, సామర్థ్యం, శక్తులను నిర్వచించండి. వాటి SI ప్రమాణాలు తెలియచేయండి.
Answer:
పని : ఏదైనా బలం వస్తువు మీద పనిచేసి బలప్రయోగ దిశలో దానిని స్థానభ్రంశం చెందించితే బలం పనిచేసింది అంటారు.
పని W = F.S. (F, S లు ఒకే దిశలో ఉంటే) ; లేదా పని W = FS cos θ
శక్తి : పని చేయుటకు కావలసిన దారుఢ్యము లేదా స్థోమతను శక్తి అంటారు.
ప్రమాణము జౌల్.
సామర్థ్యము (P) : పని జరిగే రేటును సామర్థ్యము అంటారు.
సామర్థ్యము (P) = \( \frac{\text{జరిగిన పని}}{\text{కాలము}} \). ప్రమాణము వాట్. సామర్థ్యము అదిశరాశి. మితిఫార్ములా \( ML^2T^{-3} \).
Exam Tips:
a) పని, సామర్థ్యం, శక్తికి నిర్వచనం, సూత్రం, SI ప్రమాణం (జౌల్, వాట్, జౌల్) మూడూ విడివిడిగా రాయండి.
Question 3: గతిజ శక్తి, ద్రవ్యవేగాల మధ్య సంబంధాన్ని తెలియచేయండి.
Answer:
గతిజశక్తి, ద్రవ్యవేగాల మధ్య సంబంధము:
గతిజశక్తి KE \( = \frac{1}{2} mv² , \)
ద్రవ్యవేగము P = mv
∴ KE \( = \frac{1}{2} m v^2=\frac{1}{2} \frac{m^2 v^2}{m}=\frac{p^2}{2 m} \)
Exam Tips:
a) \( K = \frac{p^2}{2m} \) మరియు \( p = \sqrt{2mK} \) రెండు రూపాలను ఉత్పాదనతో సహా రాయండి.
Question 4: కింది సందర్భాల్లో బలం చేసిన పని సంజ్ఞను తెలియచేయండి.
ఎ) బకెటు బిగించిన తాడు సహాయంతో బావిలో నుంచి బకెట్‌ను తీసే సందర్భంలో మనిషి చేసిన పని
బి) పై సందర్భంలో గురుత్వ బలం చేసిన పని
Answer:
ఎ) బావి నుండి నీటిని పైకి తోడడంలో మనిషి చేసిన పని ధనాత్మకము. ఎందుకనగా బలం, స్థానభ్రంశము ఒకే దిశలో ఉన్నాయి కావున.
బి) బకెట్‌ను పైకి లాగునపుడు గురుత్వాకర్షణ బలం చేసిన పని ఋణాత్మకము. ఎందుకనగా గురుత్వాకర్షణ బలం, స్థానభ్రంశం వ్యతిరేక దిశలో ఉన్నాయి కావున.
Exam Tips:
a) బలం, స్థానభ్రంశం మధ్య కోణం చూసి సంజ్ఞ నిర్ణయించండి (θ < 90° ధనం, θ > 90° ఋణం), కారణం తప్పక రాయండి.
Question 5: కింది సందర్భాల్లో ఒక బలం చేసిన పని సంజ్ఞను తెలియచేయండి.
ఎ) ఒక వస్తువు వాలు తలంపై కిందికి జారుతున్నప్పుడు ఘర్షణ చేసిన పని
బి) పై సందర్భంలో గురుత్వ బలం చేసిన పని
Answer:
ఎ) వస్తువు కిందికి జారునపుడు ఘర్షణ చేసిన పని ఋణాత్మకము. కారణము ఘర్షణ బలం ఎల్లప్పుడూ స్థానభ్రంశానికి వ్యతిరేకము.
బి) గురుత్వ బలం చేసిన పని ధనాత్మకము. కారణము వస్తువు వాలు తలంపై కిందికి జారుతున్నపుడు గురుత్వ బలం యొక్క అంశం స్థానభ్రంశ దిశలోనే ఉంటుంది.
Exam Tips:
a) ఘర్షణ ఎల్లప్పుడూ చలనానికి వ్యతిరేకం కావున ఋణ పని; జారుతున్నప్పుడు గురుత్వ బలం అంశం చలన దిశలోనే ఉంటుంది.
Question 6: కింది సందర్భాల్లో ఒక బలం చేసిన పని సంజ్ఞను తెలియచేయండి.
ఎ) ఒక వస్తువు సమవేగంతో ఘర్షణ ఉన్న క్షితిజ సమాంతర తలంపై చలిస్తూ ఉంటే అనువర్తించిన బలం చేసిన పని
బి) కంపిస్తున్న లోలకాన్ని విరామస్థితిలోకి తేవడానికి గాలి నిరోధక బలం చేసే పని
Answer:
ఎ) ఘర్షణ బలాన్ని ఎదిరిస్తూ స్థిర వేగంతో వస్తువు చలించడానికి అనువర్తన బలం చేసిన పని ధనాత్మకము.
కారణం : అనువర్తిత బలం, వస్తువు స్థానభ్రంశం ఒకే దిశలో ఉన్నాయి.
బి) కంపిస్తున్న లోలకాన్ని సమతాస్థితికి తేవడానికి గాలి నిరోధక బలం చేసిన పని ఋణాత్మకము.
కారణం : గాలి నిరోధక బలం ఎల్లప్పుడూ లోలకం చలన దిశకు (స్థానభ్రంశానికి) వ్యతిరేకంగా ఉంటుంది.
Exam Tips:
a) గాలి నిరోధం, ఘర్షణ వంటి బలాలు వస్తువు చలనానికి వ్యతిరేకంగా ఉంటాయి కావున వాటి పని ఋణాత్మకం అని రాయండి.
Question 7: కింద ఇచ్చిన వివరణలు సరియైనవా ? కాదా ? మీ సమాధానాలకు కారణాలు ఇవ్వండి.
ఎ) ఏ అంతర్బలాలు, బాహ్య బలాలు పనిచేస్తున్నప్పటికి ఒక వ్యవస్థ మొత్తం శక్తి నిత్యత్వంగా ఉంటుంది.
బి) చంద్రుడు భూమి చుట్టూ ఒక భ్రమణం చేయడానికి భూమి గురుత్వ బలం చేసిన పని శూన్యం.
Answer:
ఎ) సరియైనది కాదు. వ్యవస్థపై బాహ్య బలాలు (ముఖ్యంగా అనిత్యత్వ బలాలు) పని చేస్తే వ్యవస్థ మొత్తం శక్తి మారవచ్చు. శక్తి నిత్యత్వం వివిక్త (ఏకాంక) వ్యవస్థకు, లేదా నిత్యత్వ బలాలు మాత్రమే పనిచేసినపుడు వర్తిస్తుంది.
బి) నిజమే. గురుత్వాకర్షణ బలాలు నిత్యత్వ బలాలు కావున ఒక సంవృత పథంలో జరిపిన పని సున్న.
Exam Tips:
a) శక్తి నిత్యత్వం వివిక్త వ్యవస్థకు లేదా నిత్యత్వ బలాలకు మాత్రమే వర్తిస్తుంది; సంవృత పథంలో నిత్యత్వ బలం పని సున్న.
Question 8: కింది సందర్భాల్లో ఏ భౌతికరాశి స్థిరంగా ఉంటుంది ?
ఎ) స్థితిస్థాపక అభిఘాతంలో
బి) అస్థితిస్థాపక అభిఘాతంలో
Answer:
ఎ) స్థితిస్థాపక అభిఘాతాలలో వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్యవేగము, వ్యవస్థ మొత్తం శక్తి స్థిరము.
బి) అస్థితిస్థాపక అభిఘాతాలలో వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్యవేగము స్థిరము.
Exam Tips:
a) ప్రతి సందర్భంలో కేవలం నిత్యత్వ బలాలు ఉంటే యాంత్రిక శక్తి, బాహ్య బలం లేకపోతే ద్రవ్యవేగం స్థిరం అని కారణంతో రాయండి.
Question 9: ‘h’ ఎత్తు నుంచి స్వేచ్ఛగా కిందకు పడిన ఒక వస్తువు చదునైన నేలను తాకిన తరువాత h/2 ఎత్తుకు పైకి లేస్తే ఆ వస్తువుకు, నేలకు మధ్య ప్రత్యావస్థాన గుణకం ఎంత ?
Answer:
వస్తువు \( h_1 \) ఎత్తు నుండి కిందపడి \( h_2 \) ఎత్తు పైకి లేస్తే ప్రత్యావస్థాన గుణకం \( e = \sqrt{\frac{h_2}{h_1}} \)
ఇక్కడ \( h_1 = h,\ h_2 = \frac{h}{2} \) ∴ \( e = \sqrt{\frac{h/2}{h}} = \sqrt{\frac{1}{2}} = \frac{1}{\sqrt{2}} \)
Exam Tips:
a) \( e = \sqrt{h_2/h_1} \) సూత్రంలో విలువలు ప్రతిక్షేపించి \( \frac{1}{\sqrt{2}} \) అని తేల్చండి.
Question 10: స్వేచ్ఛగా కొంత ఎత్తు నుంచి భూమిపై పడ్డ వస్తువు అనేకసార్లు అదేచోట పడి లేచిన తరువాత అభిఘాతాలు ఆగిపోయే లోపు దాని మొత్తం స్థానభ్రంశం ఎంత ?
వస్తువుకు, భూమికి మధ్య ప్రత్యావస్థాన గుణకం ‘e’ అనుకోండి.
Answer:
కొంత ఎత్తు (h) నుండి జారవిడిచిన వస్తువు అనేకసార్లు భూమితో అభిఘాతాలు జరిపి పైకి లేచి మరల, మరల క్రింద పడి ఆగిపోవు లోపల దాని మొత్తం స్థానభ్రంశం దాని తొలి ఎత్తు (h) కి సమానము.
Exam Tips:
a) మొత్తం స్థానభ్రంశం = తొలి స్థానం నుండి చివరి స్థానానికి ఉన్న దూరం (= h); ప్రయాణించిన మొత్తం దూరం కాదు (అది \( hrac{1+e^2}{1-e^2} \)). రెండింటి భేదం స్పష్టంగా రాయండి.
స్వల్ప సమాధాన ప్రశ్నలు
Question 1: స్థితిజ శక్తి అంటే ఏమిటి ? గురుత్వ స్థితిజ శక్తికి సమాసాన్ని రాబట్టండి.
Answer:
స్థితిజశక్తి : ఏదైనా వస్తువుకు దాని స్థానం (లేదా స్థితి) వలన కొంత శక్తి సంప్రాప్తిస్తే దానిని స్థితిజ శక్తి అంటారు.
ఉదా : కొంత ఎత్తులో గల వస్తువులు, చుట్టబడిన గడియారపు స్ప్రింగ్.
స్థితిజ శక్తికి సమీకరణం ఉత్పాదించుట : m ద్రవ్యరాశి గల ఒక వస్తువును గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా h ఎత్తు వరకు నెమ్మదిగా పైకి జరిపినామనుకొనుము.
వస్తువుపై గురుత్వ బలం mg కిందికి ఉంటుంది కావున వస్తువును నెమ్మదిగా పైకి జరపడానికి mg కు సమానమైన బలం F = mg పైకి ప్రయోగించాలి.
వస్తువును పైకి జరుపుటలో చేసిన పని \( W = F \cdot S = mg \times h = mgh \)
వస్తువును పైకి ఎత్తుటలో జరిపిన పని వస్తువులో స్థితిజ శక్తిగా నిల్వ ఉంటుంది.
∴ వస్తువులో గల స్థితిజ శక్తి P.E. = mgh.
Exam Tips:
a) స్థితిజ శక్తి నిర్వచనం, mg బలంతో h ఎత్తుకు లేపే పని W = mgh అనే ఉత్పాదన క్రమంగా రాయండి; పటం గీయండి.
Question 2: ఒకే ద్రవ్యవేగం కలిగి ఉన్న ఒక లారీ, కార్లను విరామస్థితికి తీసుకొని రావడానికి ఒకే బ్రేక్ బలాన్ని ఉపయోగించారు. ఏ వాహనం తక్కువ కాలంలో విరామ స్థితికి వస్తుంది ? ఏ వాహనం తక్కువ దూరంలో ఆగుతుంది ?
Answer:
ద్రవ్యవేగము P = mv. ఇది లారీ మరియు కారులకు సమానము. బ్రేక్ బలం F కూడా సమానం.
కాలం : ప్రచోదనం = ద్రవ్యవేగ మార్పు ⇒ \( F t = P \) లేదా \( t = \frac{P}{F} \). P, F రెండూ సమానం కావున రెండు వాహనాలు ఒకే కాలంలో ఆగుతాయి.
దూరం : గతిజ శక్తి K.E. = \( \frac{P^2}{2m} \). వాహనాన్ని ఆపడంలో బలం చేసిన పని = గతిజ శక్తి లోని మార్పు
∴ \( F \cdot S = \frac{P^2}{2m} \) లేదా ఆగుటకు ముందు వాహనం కదిలిన దూరం \( S = \frac{P^2}{2mF} \)
P, F సమానం కావున \( S \propto \frac{1}{m} \), అనగా తక్కువ ద్రవ్యరాశి గల వాహనం ఎక్కువ దూరం వెళ్ళి ఆగుతుంది.
∴ లారీ (ఎక్కువ ద్రవ్యరాశి) తక్కువ దూరం ప్రయాణించి ఆగుతుంది; కారు ఎక్కువ దూరం ప్రయాణించి ఆగుతుంది. రెండూ ఆగడానికి పట్టే కాలం సమానం.
Exam Tips:
a) సమాన ద్రవ్యవేగానికి \( K = \frac{p^2}{2m} \) కావున తేలికైన కారు గతిజశక్తి ఎక్కువ; అందువల్ల దాన్ని ఆపే దూరం ఎక్కువ.
Question 3: నిత్యత్వ, అనిత్యత్వ బలాల మధ్య తేడాలను రాయండి. వాటికి ఒక్కొక్క ఉదాహరణ కూడా రాయండి.
Answer:
నిత్యత్వ బలాలు (Conservative forces) : ఏ సంవృతపథం వెంబడి ఐనా వస్తువు మీద బలం చేసిన పని మొత్తం విలువ సున్న ఐతే అటువంటి బలాలను నిత్యత్వ బలాలు అంటారు.
ఉదా:
1. ఏదైనా వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరినపుడు అది తిరిగి విసిరిన బిందువును చేరేసరికి దాని గతిజశక్తిలో మార్పు సున్న. కావున పని-శక్తి సిద్ధాంతం ప్రకారము జరిగిన పని సున్న.
2. విద్యుత్ క్షేత్రంలో Q అను ఆవేశాన్ని ఒక సంవృత పథంలో జరిపితే దానిపై చేసిన మొత్తం పని సున్న.
అనిత్యత్వ బలాలు (Non-conservative forces) : ఏదైనా సంవృత పథం వెంబడి వస్తువు మీద బలం చేసిన మొత్తం పని విలువ సున్న కాకపోతే అటువంటి బలాలను అనిత్యత్వ బలాలు అంటారు. అనిత్యత్వ బలాల వల్ల వస్తువును సంవృత పథంలో జరిపినప్పటికి మొత్తం పని సున్న కాదు.
ఉదా : వస్తువుల చలనానికి వ్యతిరేకంగా ఘర్షణ బలాలు జరిపిన పని. అనిత్యత్వ బలం వల్ల వస్తువుపై జరిపిన పని వస్తువు ప్రయాణించిన మార్గంపై ఆధారపడుతుంది. వస్తువును ఏ దిశలో కదిల్చినప్పటికి ఘర్షణ బలం వల్ల కొంత పని వ్యర్థమవుతుంది. వస్తువును ఘర్షణ బలానికి వ్యతిరేకంగా సంవృతపథంలో జరిపినప్పటికి మొత్తం పని సున్న కాదు. కావున ఘర్షణ బలాలు అనిత్యత్వ బలాలు.
Exam Tips:
a) తేడాలను పట్టిక రూపంలో రాయండి (సంవృత పథంలో పని, పథంపై ఆధారం, ఉదాహరణ: గురుత్వ బలం / ఘర్షణ బలం).
Question 4: ఏకమితీయ స్థితిస్థాపక అభిఘాతంలో అభిఘాతానికి ముందు రెండు వస్తువుల అభిగమన సాపేక్ష వేగం అభిఘాతం తరువాత వాటి నిగమన సాపేక్ష వేగానికి సమానం అని చూపండి.
Answer:
m₁, m₂ ద్రవ్యరాశులు గల రెండు వస్తువులు u₁, u₂. అను వేగాలతో ఒకే సరళరేఖ వెంబడి చలిస్తూ ముఖాముఖి స్థితిస్థాపక అభిఘాతం చెందినవనుకొనుము.
అభిఘాతం పిమ్మట వాటి వేగాలు v₁, v₂ అనుకొనుము.
స్థితిస్థాపక అభిఘాతాలు ద్రవ్యవేగ నిత్యత్వనియమాన్ని, గతిజశక్తి నిత్యత్వనియమాన్ని పాటిస్తాయి.
ద్రవ్యవేగ నిత్యత్వనియమం ప్రకారము
m₁u₁ + m₂u₂ = m₁v₁ + m₂v₂ లేదా m₁ (u₁ – v₁) = m₂ ( v₂ – u₂) …………… (1)
శక్తి నిత్యత్వనియమం ప్రకారము
\( \frac{1}{2}m₁u₁² + \frac{1}{2} m₂u₂² = \frac{1}{2}m₁v₁² + \frac{1}{2}m₂v₂² \) లేదా m₁ (u₁² – v₁²) = m₂ (v₂² – u₂²) …………. (2)
2వ సమీకరణాన్ని 1వ సమీకరణంచే భాగించగా
\( \frac{u_1^2-v_1^2}{u_1-v_1}=\frac{v_2^2-u_2^2}{v_2-u_2} \) లేదా \( \frac{\left(u_1- v_1\right)\left(u_1+v_1\right)}{\left(u_1-v_1\right)}=\frac{\left(v_2- u_2\right)\left(v_2+u_2\right)}{\left(v_2-u_2\right)} \)
u₁ + v₁ = v₂ + u₂ లేదా u₁ – u₂ = v₂ – v₁ …………….. (3)
అనగా అభిఘాతానికి ముందు వస్తువులు సమీపించు సాపేక్ష వేగము, అభిఘాతం పిమ్మట వస్తువులు విడిపోవు సాపేక్ష వేగమునకు సమానము అని నిరూపించబడినది.
Exam Tips:
a) \( v_1 - v_2 = -(u_1 - u_2) \) ఉత్పాదనకు ద్రవ్యవేగ, గతిజశక్తి నిత్యత్వ సమీకరణాలు రెండింటినీ రాయండి.
Question 5: రెండు సమాన ద్రవ్యరాశులు ఏటవాలు స్థితిస్థాపక అభిఘాతం చెందినప్పుడు అభిఘాతం తరువాత అవి ఒకదానికొకటి లంబంగా చలిస్తాయని చూపండి.
Answer:
రెండు సమాన ద్రవ్యరాశులు (m, m) కల వస్తువులు ఏటవాలు స్థితిస్థాపక అభిఘాతం చెందాయి అనుకోండి. మొదట వస్తువు ‘u’ అను తొలివేగంతో చలిస్తూ నిశ్చల స్థితిలో ఉన్న రెండవ వస్తువును ఢీకొన్నది అనుకోండి. అభిఘాతం పిమ్మట ఆ రెండు వస్తువులు X – అక్షంతో θ₁ మరియు θ₂ కోణాలతో చలిస్తే స్థితిస్థాపక అభిఘాతాలు ద్రవ్యవేగ నిత్యత్వనియమాన్ని పాటిస్తాయి. కావున X – అక్షం వెంబడి
mu = mv₁ cos θ₁ + mv₂ cos θ₂ లేదా
u= v₁ cos θ₁ + v₂ cos θ₂ …………….. (1)
ఇదే విధంగా y-అక్షం వెంబడి
0 = v₁ sin θ₁ – v₂ sin θ₂ ………… (2) (ఎందుకనగా y దిశలో తొలివేగం సున్న) సమీ. (1) మరియు (2) లను వర్గీకరించి కలుపగా
u² = v₁² + v₂² + 2v₁v₂ cos (θ₁ + θ ₂) ……….. (3)
స్థితిస్థాపక అభిఘాతాలు శక్తి నిత్యత్వనియమాన్ని పాటిస్తాయి.
∴ \( \frac{1}{2}mu² = \frac{1}{2}mv₁² + \frac{1}{2}mv₂² \) లేదా . u² = v₁² + v₂²
……………… (4)
3, 4 సమీకరణాల నుండి 2 v₁, v₂ cos (θ₁ + θ ₂) = 0
కాని v₁, v₂ లు సున్న కాదు కావున cos (θ₁ + θ ₂) = 0
cos (θ₁ + θ ₂) = 0 అనగా θ₁ + θ₂ = 90°
కావున సమాన ద్రవ్యరాశులు గల వస్తువులు కొంత కోణంతో అభిఘాతం చెందితే అభిఘాతం పిమ్మట అవి పరస్పర లంబ దిశలలో విడిపోతాయి.
Exam Tips:
a) సమాన ద్రవ్యరాశులలో ఒకటి నిశ్చలంగా ఉంటే ఏటవాలు స్థితిస్థాపక అభిఘాతం తరువాత అవి లంబంగా చలిస్తాయని వెక్టర్ సమీకరణాలతో చూపండి.
Question 6: కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా కిందికి పడిన వస్తువు భూమితో ‘n’ అభిఘాతాలు చెందిన తరువాత అది పొందిన ఎత్తుకు సమీకరణాన్ని ఉత్పాదించండి.
Answer:
ఏదైనా బంతిని ‘h’ ఎత్తు నుండి భూమి మీదకు జారవిడిచినామనుకొనుము. భూమిని ఢీకొన్న తరువాత అది మరల ‘h₁‘ అన్న ఎత్తు పైకి లేచినది అనుకొనుము.
భూమిని తాకుటకు ముందు వేగము \( u₁ = \sqrt{2 \mathrm{gh}} \)
మొదటి అభిఘాతం తరువాత విడిపోవు వేగము \( v₁ = \sqrt{2 \mathrm{gh}_1} \)
అభిఘాతం ముందు, అభిఘాతం తరువాత భూమి వేగము సున్న.
కావున u₂ = 0 మరియు v₂ = 0
ప్రత్యావస్థాన గుణకం \( e = \frac{\text{అభిఘాతం పిమ్మట నిగమన వేగము}}{\text{అభిఘాతం ముందు అభిగమన వేగము}} = \frac{v_2 - v_1}{u_1 - u_2} = \frac{-\sqrt{2gh_1}}{\sqrt{2gh}} \)
\( \therefore e = \sqrt{\frac{h_1}{h}} \) (− గుర్తు వ్యతిరేక దిశ వల్ల)
∴ h₁ = e ²h
∴ మొదటిసారి అభిఘాతం వల్ల పైకి లేచిన ఎత్తు h₁ = e ²h
2వ సారి అభిఘాతం వల్ల పైకి లేచిన ఎత్తు h₂ = e ²h₁ = e ²e ²h = e ⁴h
3వ సారి అభిఘాతం వల్ల పైకి లేచిన ఎత్తు h₃ = e ²h₂ = e ²e ⁴h = e ⁶h
∴ nవ సారి అభిఘాతం వల్ల పైకి లేచిన ఎత్తు hₙ = e²ⁿh.
Exam Tips:
a) ప్రతి అభిఘాతంలో వేగం e రెట్లు, ఎత్తు e² రెట్లు అవుతుంది; కావున \( h_n = h\,e^{2n} \).
Question 7: శక్తి నిత్యత్వ నియమాన్ని వివరించండి.
Answer:
“ఏదైనా వ్యవస్థపై పనిచేసే బలాలు నిత్యత్వ బలాలు ఐతే వ్యవస్థకు గల మొత్తం శక్తి (స్థితిజ శక్తి + గతిజ శక్తి) స్థిరము. దీనిని సృష్టించడం కాని, నాశనం చేయడంగాని సాధ్యపడదు.” వివరణ : ఒక వస్తువు నిత్యత్వ బలాల వల్ల ∆x అను స్వల్ప దూరం స్థానభ్రంశం పొందింది అనుకోండి. పని-శక్తి సిద్ధాంతం ప్రకారము KE లో మార్పు = జరిగిన పని ∴ ∆KE = F(x). ∆x ……………….. (1) కాని స్థితిజ శక్తిలో మార్పు
∆V = – F(x) . ∆x ………………… (2)
1, 2 సమీకరణాల నుండి ∆K = – ∆V లేదా
∆K + ∆V = 0. అనగా మొత్తం శక్తిలో మార్పు సున్న.
కావున వ్యవస్థకు గల మొత్తం గతిజశక్తి KE మరియు స్థితిజశక్తి PE స్థిరము. కావున శక్తి నిత్యత్వ నియమము నిరూపించబడినది.
Exam Tips:
a) శక్తి సృష్టించబడదు, నశించదు, ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది అని నియమం చెప్పి ఉదాహరణ ఇవ్వండి.
దీర్ఘ సమాధాన ప్రశ్నలు
Question 1: పని, గతిజశక్తి భావనలను అభివృద్ధి పరచి ఇది పని శక్తి సిద్ధాంతానికి దారితీస్తుందని చూపండి. (మార్చి 2014)
Answer:
పని : ఏదైనా బలం వస్తువు మీద పనిచేసి బలప్రయోగ దిశలో దానిని స్థానభ్రంశం చెందించితే బలం పనిచేసింది అంటారు.
పని W = F.S. (F. S లు ఒకే దిశలో ఉంటే)
లేదా పని W = FS cos θ (‘θ’ బలము F మరియు స్థానభ్రంశము S ల మధ్యకోణము. సదిశలలో పనిని
\( W = \overline{\mathrm{F}} . \overline{\mathrm{S}} = \) FS cos θ గా చెపుతారు. పని అదిశరాశి ప్రమాణము కి.గ్రా.మీ²/సె² దీనిని జౌల్ (J) అంటారు.
గతిజశక్తి : వస్తువులు చలనంలో ఉండటం వల్ల వాటికి సంప్రాప్తించే శక్తిని గతిజశక్తి అంటారు. గతిజశక్తి KE \( = \frac{1}{2} mv² \)
ఉదా : గమనంలో ఉన్న అన్ని వస్తువులకు గతిజశక్తి ఉంటుంది.
ఎ) గతిజశక్తి \( = \frac{1}{2} mv² \) ఉత్పాదన :
m ద్రవ్యరాశి గల వస్తువు వేగంతో గమనంలో ఉందనుకుందాము. గమనానికి వ్యతిరేకంగా F బలం వస్తువుపై ప్రయోగించినపుడు ఆ వస్తువు S దూరం ప్రయాణం చేసి విరామస్థితికి వచ్చిందనుకుందాము.
తొలివేగము u = v, తుది వేగము V = 0, ప్రయాణించిన దూరము = S
v² – u² = 2aS అను సమీకరణం నుండి
∴ 0 – v² = 2as
∴ త్వరణము \( a = \frac{-v^2}{2 s} \)
∴ నిరోధక బలం F = ma \( = \frac{m v^2}{2 \mathrm{~s}} \)
∴ వస్తువును విరామస్థితికి తేవడానికి జరిగిన పని W = FS
∴ \( W = \frac{m v^2}{2 s} \times \mathrm{S}=\frac{1}{2} m v^2 \)
వస్తువును ఆపడానికి చేసిన పని ఆ వస్తువులో గల గతిజశక్తికి సమానము.
∴ గతిజశక్తి \( = \frac{1}{2} mv² \)
పని-శక్తి సిద్ధాంతం: “ఒక స్థిర ఫలితబలం వస్తువుపై పనిచేయునపుడు ఆ వస్తువుపై జరిగిన పని దాని గతిజశక్తిలోని మార్పునకు సమానం.” నిరూపణ : m ద్రవ్యరాశి గల వస్తువుపై F బలం ప్రయోగించినపుడు దాని వేగం u నుంచి v కి మారిందనుకుందాము. వేగం U నుండి V కి మారునంతలో వస్తువు స్థానభ్రంశం S అనుకుందాము.
తొలివేగము = u, తుదివేగము = v, స్థానభ్రంశము = S కాని స్థానభ్రంశము = S = సగటు వేగం × కాలం
∴ \( S = \frac{(u+v)}{2}t \), త్వరణం \( = \frac{v-u}{t} = a \)
వస్తువుపై బలం, F= = ma \( = m\left(\frac{v-u}{t}\right) \)
∴ వస్తువుపై జరిగిన పని W = FS
∴ \( W = m\frac{(v-u)}{t} \cdot \frac{(u+v)}{2} t=m \frac{\left(v^2-u^2\right)} {2}=\frac{1}{2} m v^2-\frac{1}{2} m u^2 = KE₂ - KE₁ \)
అంటే, వస్తువుపై జరిగిన పని వస్తువు గతిజశక్తిలోని మార్పుకి సమానం.
Exam Tips:
a) \( W = \int F\,dx = \int mv\,dv = \frac{1}{2}mv^2 - \frac{1}{2}mu^2 \) ఉత్పాదన ప్రధానం; చివరకు పని-శక్తి సిద్ధాంతం వాక్యంలో రాయండి.
Question 2: అభిఘాతాలు అంటే ఏమిటి ? వాటిలో సాధ్యమయ్యే రకాలను వివరించండి. ఏకమితీయ స్థితిస్థాపక అభిఘాతాల సిద్ధాంతాన్ని వివరించండి. (మే 2014)
Answer:
అభిఘాతాలు (Collisions) : గమనంలో ఉన్న వస్తువు మరొక వస్తువును ఢీకొన్నపుడు దాని శక్తిలో మార్పులు సంభవిస్తాయి. ఈ రకమైన భౌతిక ప్రక్రియను అభిఘాతాలు అంటారు. ఇవి రెండు రకాలు. 1) స్థితిస్థాపక అభిఘాతము 2) అస్థితిస్థాపక అభిఘాతము.
స్థితిస్థాపక అభిఘాతాలు : స్థితిస్థాపక అభిఘాతాలు 1) ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని 2) శక్తి నిత్యత్వ నియమాన్ని పాటిస్తాయి. ఇటువంటి అభిఘాతాలలో శక్తి నష్టము ఉండదు.
అస్థితిస్థాపక అభిఘాతాలు: ఈ రకమైన అభిఘాతాలు ద్రవ్యవేగ నిత్యత్వ నియమాన్ని మాత్రమే పాటిస్తాయి. ఈ విధమైన అభిఘాతాలలో శక్తి నష్టం ఉంటుంది.
స్థితిస్థాపక అభిఘాతానికి గురైన రెండు వస్తువుల తుది వేగాలకు సమీకరణాలు : m₁, m₂ ద్రవ్యరాశులు గల రెండు వస్తువులు u₁, u₂ అను వేగాలతో ఒకే సరళరేఖ వెంబడి చలిస్తూ ముఖాముఖి స్థితిస్థాపక అభిఘాతం చెందినవనుకొనుము.
అభిఘాతం పిమ్మట వాటి వేగాలు v₁, v₂ అనుకొనుము.
స్థితిస్థాపక అభిఘాతాలు ద్రవ్యవేగ నిత్యత్వనియమాన్ని, గతిజశక్తి నిత్యత్వనియమాన్ని పాటిస్తాయి.
ద్రవ్యవేగ నిత్యత్వనియమం ప్రకారము
m₁u₁ + m₂u₂ = m₁v₁ + m₂v₂ లేదా m₁ (u₁ – v₁) = m₂ (v₂ – u₂) ……………….. (1)
శక్తి నిత్యత్వనియమం ప్రకారము
\( \frac{1}{2}m₁u₁² + \frac{1}{2} m₂u₂² = \frac{1}{2}m₁v₁² + \frac{1}{2}m₂v₂² \) లేదా m₁ (u₁² – v₁²) = m₂ (v₂² – u₂²) …………. (2)
2వ సమీకరణాన్ని 1వ సమీకరణంచే భాగించగా
\( \frac{u_1^2-v_1^2}{u_1-v_1}=\frac{v_2^2-u_2^2}{v_2-u_2} \) లేదా \( \frac{\left(u_1- v_1\right)\left(u_1+v_1\right)}{\left(u_1-v_1\right)}=\frac{\left(v_2- u_2\right)\left(v_2+u_2\right)}{\left(v_2-u_2\right)} \)
u₁ + v₁ = v₂ + u₂ లేదా u₁ – u₂ = v₂ – v₁ …………….. (3)
అనగా అభిఘాతానికి ముందు వస్తువులు సమీపించు సాపేక్ష వేగము, అభిఘాతం పిమ్మట వస్తువులు విడిపోవు సాపేక్ష వేగమునకు సమానము. అనగా వాటి
ప్రత్యవస్థాన గుణకము e = 1 కి సమానము.
v₁ విలువ కనుక్కోవడానికి v₂ = u₁ – u₂ + v₁ ను సమీకరణం (1) లో ప్రతిక్షేపించగా m₁u₁ + m₂u₂ = m₁v₁ + m₂( u₁ – u₂ + v₁)
∴ m₁u₁ + m₂u₂ = m₁v₁ + m₂u₁ – m₂u₂ + m₂v₁
m₁u₁ + 2m₂u₂ – m₂u₁ = v₁ (m₁ + m₂)
∴ u₁ ( m₁ – m₂) + 2 m₂u₂ = v₁ (m₁ + m₂ )
∴ మొదటి వస్తువు తుదివేగము \( v₁ = \frac{\mathrm{u}_1\left(\mathrm{~m}_1- \mathrm{m}_2\right)}{\mathrm{m}_1+\mathrm{m}_2}+\frac{2 \mathrm{~m}_2 \mathrm{u}_2}{\mathrm{~m}_1+\mathrm{m}_2} ……………… (4) \)
ఇదేవిధంగా v₂ కనుక్కోవడానికి v₁ = v₂ – u₁ + u₂ ను సమీకరణం (1) లో
ప్రతిక్షేపించగా
రెండవ వస్తువు తుదివేగము \( v₂ = \frac{\mathrm{u}_2\left(\mathrm{~m}_2- \mathrm{m}_1\right)}{\mathrm{m}_1+\mathrm{m}_2}+\frac{2 \mathrm{~m}_1 \mathrm{u}_1}{\mathrm{~m}_1+\mathrm{m}_2} …………….. (5) \)
Exam Tips:
a) అభిఘాత రకాలు (స్థితిస్థాపక, అస్థితిస్థాపక), ద్రవ్యవేగ, గతిజశక్తి నిత్యత్వ సమీకరణాల నుండి \( v_1, v_2 \) సూత్రాలను రాబట్టండి.
Question 3: శక్తినిత్యత్వ నియమాన్ని తెలిపి, స్వేచ్ఛగా కిందికి పడే వస్తువు విషయంలో దీనిని నిరూపించండి.
Answer:
శక్తినిత్యత్వ నియమము : శక్తిని సృష్టించడము కాని, నాశనం చేయడము కాని చేయలేము. కాని శక్తిని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చవచ్చును.
స్వేచ్ఛగా క్రిందికి పడుచున్న వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ సూత్రం
నిరూపించుట:
m ద్రవ్యరాశి గల వస్తువు h ఎత్తులో ఉన్న A బిందువు నుండి స్వేచ్ఛగా జారవిడచినామనుకొనుము.
1) A బిందువు వద్ద అనగా వస్తువును జారవిడచిన క్షణంలో
A వద్ద భూమి నుండి ఎత్తు = h; ∴ స్థితిశక్తి = mgh
వేగము u = 0 గతిజశక్తి = 0 (u = 0 కనుక)
∴ A వద్ద మొత్తం శక్తి = స్థితిశక్తి + గతిజశక్తి
= mgh + 0 = mgh ……………….. (1)
2) B బిందువు వద్ద అనగా భూమి నుండి ‘x’ ఎత్తులో ఉన్నపుడు
B వద్ద, వేగం v₁ అనుకుందాము. A నుండి B కి క్రిందకి పడిన దూరం = x. v² – u² = 2as కనుక v₁² – 0 = 2gx; . v₁² = 2gx
∴ B వద్ద గతిజశక్తి \( = \frac{1}{2} mv₁² = \frac{1}{2} m 2gx = \) mgx
B నేలనుండి (h – x) ఎత్తులో ఉంది. ∴ B వద్ద స్థితిశక్తి = mg(h-x)
∴ B వద్ద మొత్తం శక్తి = స్థితిశక్తి + గతిజశక్తి = mg (h – x) + mgx
= mgh ……………… (2)
3) C బిందువు వద్ద అనగా భూమిని తాకబోవు క్షణంలో C వద్ద, అది నేలను చేరింది కనుక h = 0
∴ స్థితిశక్తి = mg (h) = 0;
C వద్ద వేగం V అనుకుంటే, v² – u² = 2 as నుండి
v² – 0 = 2gh; ∴ v² = 2gh;
∴ గతిజశక్తి \( = \frac{1}{2} mv² = \frac{1}{2} m (2gh) = \) mgh
∴ C వద్ద మొత్తం శక్తి = స్థితిశక్తి + గతిజశక్తి = 0 + mgh = mgh ……………….. (3)
పై సమీకరణముల నుండి వస్తువు ఏ స్థానంలో ఉన్నా మొత్తం శక్తి స్థిరంగా ఉంటుంది. కాని తొలి స్థితిశక్తి అంతా నేలను చేరునపుడు గతిజశక్తిగా మారింది. మార్గమధ్యంలో వస్తువుకు కొంత స్థితిశక్తి, కొంత గతిశక్తి ఉంది కాని మొత్తం శక్తి స్థిరము. అనగా శక్తి నిత్యత్వనియమం నిరూపించబడినది.
Exam Tips:
a) ఎత్తు x వద్ద K.E. + P.E. స్థిరం అని మూడు స్థానాలలో (పై, మధ్య, నేల) చూపండి.
లెక్కలు
Question 1: 10 గ్రా. ద్రవ్యరాశి కలిగిన పరీక్ష నాళికలో కొంత ఈథర్ ఉంది. ఈ పరీక్షనాళికను 1 గ్రా. ద్రవ్యరాశి కలిగిన కార్క్‌తో మూయడమైంది. పరీక్షనాళికను వేడిచేసినప్పుడు ఈథర్ వాయువు కలిగించే పీడనం వల్ల కార్క్ ఎగిరిపోతుంది. 5 సెం.మీ. పొడవు ఉన్న దృఢమైన భారరహిత కడ్డీ నుంచి ఈ పరీక్ష నాళికను క్షితిజ సమాంతరంగా వేలాడదీశారు. పరీక్షనాళిక O బిందువు పరంగా నిలువు వృత్తంలో తిరగాలంటే ఎంత కనీస వేగంతో కార్క్ పరీక్ష నాళిక నుంచి ఎగిరిపోవాలి ? (ఈథర్ ద్రవ్యరాశిని పరిగణనలోనికి తీసుకోవద్దు)
Answer:
కడ్డీ పొడవు \( l = 5 \) సెం.మీ. = \( \frac{5}{100} \) మీ., g = 10 మీ/సె²; నాళిక ద్రవ్యరాశి M = 10 గ్రా., కార్క్ ద్రవ్యరాశి m = 1 గ్రా.
కడ్డీ దృఢమైనది కావున నాళిక వృత్తం పై బిందువును చేరాలంటే అక్కడ దాని వేగం సున్న అయినా సరిపోతుంది. నాళిక నిమ్నతమ బిందువు వద్ద కనీస వేగం V అయితే శక్తి నిత్యత్వం నుండి
\( \frac{1}{2}MV^2 = Mg(2l) \Rightarrow V = 2\sqrt{gl} = 2\sqrt{10 \times \frac{5}{100}} = 2 \times 0.707 = 1.41 \) మీ/సె
కార్క్ ఎగిరిపోయేటప్పుడు ద్రవ్యవేగ నిత్యత్వం (తొలి ద్రవ్యవేగం సున్న) ప్రకారం \( m v = M V \)
∴ \( v = \frac{M}{m}V = \frac{10}{1} \times 1.41 \approx 14.1 \) మీ/సె
కావున కార్క్ కనీసం సుమారు 14 మీ/సె వేగంతో ఎగిరిపోవాలి.
Exam Tips:
a) దృఢమైన కడ్డీ అయితే పై బిందువు వద్ద వేగం సున్న అయినా సరిపోతుంది (V = 2√(gl)), తరువాత ద్రవ్యవేగ నిత్యత్వం వాడండి.
Question 2: ఒక మర తుపాకి నిమిషానికి 360 బుల్లెట్లు పేల్చగలదు. వెలువడే ప్రతి బుల్లెట్ వేగం 600 మీ/సె. ప్రతి బుల్లెట్ ద్రవ్యరాశి 5 గ్రా. అయితే మరతుపాకి సామర్థ్యం ఎంత ? (మార్చి 2014)
Answer:
బుల్లెట్ల సంఖ్య n = 360;
కాలము = t = 1 ని = 60 సె.
బుల్లెట్ వేగము v = 600 మీ/సె ;
బుల్లెట్ ద్రవ్యరాశి m = 5 గ్రా= 5 × 10⁻³ కి.గ్రా.
మరతుపాకి సామర్థ్యము \( P = \frac{\text{మొత్తం బుల్లెట్ల గతిజశక్తి}}{\text{కాలము}} = \frac{n \cdot \frac{1}{2}mv^2}{t} \)
\( \therefore P = \frac{360 \left(\frac{1}{2}\times 5\times 10^{-3}\times (600)^2\right)}{60} = 5400 \) వాట్ = 5.4 కి.వాట్.
Exam Tips:
a) శక్తి/సెకను = బుల్లెట్ల సంఖ్య × ½mv² ÷ కాలం; గ్రాములను కి.గ్రా.లోకి మార్చడం మరువకండి.
Question 3: 8 మీ. లోతు ఉన్న బావి నుంచి గంటకు 3425 మీ³ నీటిని పైకి తోడుతున్నప్పుడు అశ్వసామర్థ్యంలో 40% వృధా అయితే ఇంజను సామర్ధ్యాన్ని అశ్వసామర్థ్యాలలో రాబట్టండి.
Answer:
తోడబడిన నీటి ఘనపరిమాణము v = 3425 మీ³
∴ పైకి తోడిన నీటి ద్రవ్యరాశి m = 3425 × 10³ కి.గ్రా.
(1m³ నీటి ద్రవ్యరాశి = 10³ కి.గ్రా.)
బావిలోతు d = 8 మీ.; కాలము t = 1 గం = 60 × 60 = 3600 సె.
వ్యర్థమైన సామర్థ్యము = 40%
∴ ఉపయోగపడిన సామర్థ్యము η = 60%
వాస్తవంగా జరిగిన పని W = mgh = 3425 × 10³ × 9.8 × 8 ≈ 2.685 × 10⁸ జౌల్
యంత్రము మొత్తం సామర్థ్యము \( = \frac{\mathrm{W}}{\mathrm{t}} \times \)
\( \frac{100}{\eta}=\frac{2.685 \times 10^{8} \times 100}{3600 \times 60} \)
= 124315 వాట్, కాని 1 అశ్వ సామర్థ్యము = 746 వాట్
∴ \( P = \frac{124315}{746} = 166.6 H.P \)
Exam Tips:
a) వాస్తవ పని mgh, సామర్థ్యం (%) ఆధారంగా మొత్తం సామర్థ్యాన్ని లెక్కించండి; kg, మీ³ ప్రమాణాల మార్పుపై శ్రద్ధ.
Question 4: ఒక పంపు 25 మీ. లోతు ఉన్న బావి నుంచి నిమిషానికి 600 కి.గ్రా.ల నీటిని పైకి తోడి 50 మీ/సె⁻¹ వడితో బయటకు వదలాలి. దీనికి అవసరమయ్యే సామర్థ్యాన్ని లెక్కించండి.
Answer:
ద్రవ్యరాశి m = 600 కి.గ్రా.
కాలము t = 1 ని = 60 సె.
లోతు d = 25 మీ.
నీటి వేగము v = 50 మీ/సె
యంత్రము సామర్థ్యము \( P = \frac{\text{వాస్తవంగా జరిగిన పని (P.E. + K.E.)}}{\text{కాలము}} \)
నీటి గతిజశక్తి KE \( = \frac{1}{2} mv² = \frac{1}{2} × 600 × 50 × 50 = 750000 \) జౌల్
స్థితిశక్తిలో మార్పు = నీటిని తోడడంలో జరిగిన పని = mgh
= 600 × 9.8 × 25 = 147000 జౌల్
మొత్తం పని W = 147000 + 750000 = 897000 జౌల్
యంత్రం సామర్థ్యము \( P = \frac{\mathrm{W}}{\mathrm{t}}=\frac{897000}{60} = 14950 = 14.95 \) కి.వా.
Exam Tips:
a) మొత్తం పని = P.E. మార్పు (mgh) + K.E. (½mv²); ఈ రెండింటినీ కూడి కాలంతో భాగించండి.
Question 5: తొలుత నిశ్చల స్థితిలో ఉండి మూల బిందువు నుంచి బయలుదేరిన 5 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న దిమ్మెపై ధన X-అక్షం వెంట F = (20 + 5x) N అనే బలం పనిచేస్తుంది. దిమ్మె x = 0 నుంచి x = 4m కు స్థానభ్రంశం చెందినపుడు ఆ బలం చేసిన పనిని లెక్కించండి.
Answer:
దిమ్మె ద్రవ్యరాశి m = 5 కి.గ్రా.;
దిమ్మెపై బలం F = (20 + 5x) న్యూ
వస్తువును ‘0’ నుండి ‘4’ మీటర్ల వరకు స్థానభ్రంశం చెందించడంలో జరిగిన పని \( W = \int \mathrm{dW}=\int_{\mathrm{x}=0}^{\mathrm{x}=4} \mathrm{~F} (\mathrm{x}) \cdot \mathrm{dx}=\int_{\mathrm{x}=0}^4(20+5 \mathrm{x}) \mathrm{dx}=\left[20 \mathrm{x}+\frac{5 \mathrm{x}^2}{2}\right]_0^4=80+\frac{5 \times 4 \times 4}{2} \)
= 80 + 40 = 120 జౌల్
Exam Tips:
a) \( W = \int F\,dx \) తో పని, పని-శక్తి సిద్ధాంతంతో వేగం రాబట్టండి; చివరి సమాధానానికి ప్రమాణాలు రాయండి.
Question 6: పటంలో చూపినట్లు 5 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న దిమ్మె ఘర్షణ లేని వాలుతలంపై నుంచి జారుతుంది. వాలు తలం అడుగు భాగాన 600 N/m బల స్థిరాంకం కలిగిన స్ప్రింగ్‌ను ఏర్పాటు చేశారు. దిమ్మె వేగం గరిష్ఠమయిన క్షణంలో స్ప్రింగ్‌లో కలిగే సంపీడనాన్ని కనుక్కోండి.
Answer:
దిమ్మె ద్రవ్యరాశి m = 5 కి.గ్రా.; స్ప్రింగ్ బల స్థిరాంకము k = 600 N/m
పటం నుండి \( \sin θ = \frac{3}{5} \)
దిమ్మె వేగం గరిష్ఠమయ్యే క్షణంలో నికర బలం సున్న, అనగా స్ప్రింగ్ బలం వాలు తలం వెంబడి గురుత్వ అంశానికి సమానం.
వాలుతలం వెంబడి గురుత్వ బలం అంశం \( F = mg\sin θ = 5 \times 10 \times \frac{3}{5} = 30 \) న్యూ
\( kx = F \Rightarrow x = \frac{F}{k}=\frac{30}{600} = 0.05 \) మీ. = 5 సెం.మీ.
Exam Tips:
a) వేగం గరిష్ఠమైన చోట నికర బలం సున్న: \( kx = mg\sin θ \).
Question 7: X-అక్షం వెంట ఒక కణంపై \( F = -\frac{K}{x^2}\ (x \neq 0) \) బలం పనిచేస్తుంది. కణం x = +a నుంచి x = +2a కి స్థానభ్రంశం చెందినప్పుడు బలం చేసిన పనిని కనుక్కోండి. K ని ధన స్థిరాంకంగా తీసుకోండి.
Answer:
ఇచ్చిన కణంపై బలము \( F = -\frac{K}{x^2} \)
కణం స్థానభ్రంశము = +a నుండి +2a వరకు
\( W = \int_{x=a}^{x=2a} F\,dx = \int_{x=a}^{x=2a} \frac{-K}{x^2}dx = -K\int_{a}^{2a} x^{-2}dx = -K\left[\frac{x^{-1}}{(-1)}\right]_{a}^{2a} \)
\( W = K\left[(2a)^{-1} - a^{-1}\right] = K\left[\frac{1}{2a}-\frac{1}{a}\right] = K\left[\frac{1-2}{2a}\right] = \frac{-K}{2a} \)
Exam Tips:
a) బలం \( -K/x^2 \) ను x = a నుండి 2a వరకు సమాకలనం చేయండి; ఋణ సంజ్ఞను విడిచిపెట్టకండి.
Question 8: ఒక కణంపై పనిచేసే బలం F, కణ స్థానం x తో గ్రాఫ్‌లో చూపించిన విధంగా మారుతుంది. x = −a నుంచి x = +2a కి కణం స్థానభ్రంశం చెందినపుడు బలం చేసిన పనిని కనుక్కోండి.
Answer:
గ్రాఫ్ మూల బిందువు గుండా పోయే సరళరేఖ; x = −a వద్ద F = −b, x = +2a వద్ద F = +2b.
ఇచ్చిన కణంపై పనిచేయు సగటు బలము \( F = \frac{-b+2b}{2}=\frac{b}{2} \)
కణం స్థానభ్రంశము = −a నుండి +2a వరకు = 3a
జరిగిన పని \( W = \int F\,dx = \int_{x=-a}^{x=2a} \frac{b}{2}\,dx = \frac{b}{2}[x]_{-a}^{2a} \)
∴ \( W = \frac{b}{2}\left(2a - (-a)\right) = \frac{b}{2}(3a) = \frac{3}{2}ab \)
Exam Tips:
a) గ్రాఫ్ నుండి F = (సగటు బలం) కనుక్కొని లేదా వైశాల్యం ద్వారా పని లెక్కించండి; పరిమితులు −a నుండి 2a.
Question 9: ఒక బంతిని 20 మీ. ఎత్తు నుంచి క్షితిజ సమాంతర నేల మీదకు 20 మీ/సె తొలి వేగంతో కిందికి విసిరారు. నేలను తాకిన తరువాత బంతి అంతే ఎత్తుకు పైకిలేచింది. ఈ అభిఘాతంలో బంతికి, నేలకు మధ్య ప్రత్యావస్థాన గుణకం కనుక్కోండి. (g = 10 మీ/సె²)
Answer:
తొలి వేగము u₁ = 20 మీ/సె. ;
ఎత్తు h = 20 మీ. ;
g = 10 మీ/సె²
నేలను సమీపించు వేగము u² = u₁² + 2gh
= 20² + 2 × 20 × 10
= 400 + 400
∴ \( u = \sqrt{800} = 20\sqrt{2} \)
పైకి లేచిన ఎత్తు h = 20 మీ.
∴ నేలను విడిపోవు వేగము \( v = \sqrt{2 \mathrm{gh}}=\sqrt{2 \times 10 \times 20}=\sqrt{400} = 20 మీ/సె. \)
ప్రత్యవస్థాన గుణకము
ప్రత్యావస్థాన గుణకము \( e = \frac{\text{నేల నుండి విడిపోవు వేగము}}{\text{నేలను సమీపించు వేగము}} = \frac{20}{20\sqrt{2}} = \frac{1}{\sqrt{2}} \)
Exam Tips:
a) తొలి వేగం 20 మీ/సె అని గుర్తుంచుకుని \( v^2 = u^2 + 2gh \) వాడండి; e = నిగమన వేగం / అభిగమన వేగం.
Question 10: స్వేచ్ఛగా 10 మీ. ఎత్తు నుంచి దృఢమైన క్షితిజ సమాంతర తలంపై పడిన బంతి అనేకసార్లు అదేచోట పడిలేచిన తరువాత నిశ్చల స్థితికి వచ్చేలోగా బంతి ప్రయాణించిన మొత్తం దూరం ఎంత ? బంతికి, తలానికి మధ్య ప్రత్యావస్థాన గుణకం \( \frac{1}{\sqrt{2}} \) అనుకోండి.
Answer:
బంతిని జారవిడచిన స్థానం ఎత్తు h = 10 మీ.
ప్రత్యావస్థాన గుణకము \( e = \frac{1}{\sqrt{2}} \), కావున \( e^2 = \frac{1}{2} \)
బంతి ఆగిపోవు లోపల ప్రయాణించిన మొత్తం దూరం \( d = h + 2h e^2 + 2h e^4 + \ldots = h\,\frac{1+e^2}{1-e^2} \)
\( d = 10\left(\frac{1+\frac{1}{2}}{1-\frac{1}{2}}\right) = 10\left(\frac{1.5}{0.5}\right) = 30 \) మీ.
Exam Tips:
a) తొలి ఎత్తు 10 మీ. అని ఉపయోగించి \( e^2 = \frac{1}{2} \) ప్రతిక్షేపించండి.
ముఖ్యమైన ఉదాహరణ లెక్కలు
Question 1: \( \overline{F} = (3\hat{i}+4\hat{j}-5\hat{k}) \) ప్రమాణాలు. స్థానభ్రంశం \( \overline{d} = (5\hat{i}+4\hat{j}+3\hat{k}) \) ప్రమాణాలు అయితే వాటి మధ్య కోణాన్ని, \( \overline{d} \) సదిశ దిశలో \( \overline{F} \) విక్షేపాన్ని కనుక్కోండి.
Answer:
\( \overline{F}\cdot\overline{d} = F_x d_x + F_y d_y + F_z d_z = 3(5) + 4(4) + (-5)(3) = 16 \) ప్రమాణాలు
∴ \( \overline{F}\cdot\overline{d} = F d \cos θ = 16 \) ప్రమాణాలు
ఇప్పుడు \( \overline{F}\cdot\overline{F} = F^2 = F_x^2 + F_y^2 + F_z^2 = 9 + 16 + 25 = 50 \) ప్రమాణాలు
\( \overline{d}\cdot\overline{d} = d^2 = d_x^2 + d_y^2 + d_z^2 = 25 + 16 + 9 = 50 \) ప్రమాణాలు
∴ \( \cos θ = \frac{16}{\sqrt{50}\sqrt{50}}=\frac{16}{50} = 0.32 \)
∴ \( θ = \cos^{-1}(0.32) \approx 71.3^{\circ} \)
\( \overline{d} \) దిశలో \( \overline{F} \) విక్షేపం (అంశం) \( = F\cos θ = \sqrt{50} \times 0.32 = \frac{16}{\sqrt{50}} \approx 2.26 \) ప్రమాణాలు
Exam Tips:
a) \( \cos θ = \frac{\overline{F}\cdot\overline{d}}{Fd} \) ఉపయోగించండి; విక్షేపం = F cos θ.
Question 2: వాన నీటి బిందువులు పడేటప్పుడు కిందకు పనిచేసే గురుత్వాకర్షణ బలం, దీన్ని వ్యతిరేకించే నిరోధక బలాల ప్రభావం ఉంటుందని మనకు బాగా తెలుసు. నిరోధక బలం వాన నీటి బిందువు వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీని గురించి నిర్ధారించవలసి ఉంది. 1.00 గ్రా. ద్రవ్యరాశి ఉన్న నీటి బిందువు 1.00 కి.మీ. ఎత్తు నుంచి కిందకు పడుతుందనుకోండి. అది 50.0 మీ/సె వడితో నేలను తాకింది. దానిపై ఎ) గురుత్వాకర్షణ బలం వల్ల జరిగిన పని ఎంత ? బి) తెలియని నిరోధక బలం వల్ల జరిగిన పని ఎంత ?
Answer:
ఎ) నీటి బిందువు గతిజశక్తిలో మార్పు
∆\( K = \frac{1}{2}mv² - 0 \)
\( = \frac{1}{2} × 10⁻³ × 50 × 50 = 1.25 \) జౌల్
ఇక్కడ నీటి బిందువు ప్రారంభంలో నిశ్చలస్థితిలో ఉందని ఊహించడమైంది. g విలువ 10 మీ/సె² తో స్థిరంగా ఉంటుందని ఊహిస్తే, గురుత్వాకర్షణ బలం వల్ల జరిగిన పని
Wg = mgh
= 10⁻³ × 10 × 10³ = 10.0 జౌల్
బి) పని-శక్తి సిద్ధాంతం నుంచి
∆K = Wg + Wᵣ
ఇక్కడ Wᵣ అనేది వాన నీటి బిందువుపై నిరోధక బలం వల్ల జరిగిన పని
Wᵣ = ∆K – Wg = 1.25 – 10 = – 8.75 జౌల్
Wᵣ విలువ ఋణాత్మకం.
Exam Tips:
a) పని-శక్తి సిద్ధాంతం \( \Delta K = W_g + W_r \) వాడి నిరోధక బలం పని ఋణాత్మకం అని చెప్పండి.
Question 3: సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి, బ్రేకు వేసినప్పుడు 10 మీ. దూరం జారుతూ ఆగాడు. ఈ ప్రక్రియలో రోడ్డు వల్ల సైకిల్ గమనానికి వ్యతిరేక దిశలో, సైకిల్‌పై పనిచేసే బలం 200 N.
ఎ) సైకిల్‌పై రోడ్డు ఎంత పనిచేస్తుంది ?
బి) రోడ్డుపై సైకిల్ ఎంత పని చేస్తుంది ?
Answer:
రోడ్డు సైకిల్‌పై చేసిన పని అంటే రోడ్డు వల్ల కలిగే నిరోధక బలం (ఘర్షణ బలం) చేసిన పని అవుతుంది.
ఎ) నిరోధక బలం, స్థానభ్రంశాలు ఒకదానితో ఒకటి చేసే కోణం 180° (π రేడియన్లు) కాబట్టి రోడ్డు వల్ల జరిగిన పని,
Wᵣ = Fd cos θ
200 × 10 × cos π = –2000 J
ఈ రుణ పనివల్లనే పని-శక్తి సిద్ధాంతం ప్రకారం సైకిల్ ఆగుతుంది.
బి) న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం సైకిల్ వల్ల సమానం, వ్యతిరేక బలం రోడ్డుపై పనిచేస్తుంది. దీని పరిమాణం 200 N. కాని రోడ్డు ఎటువంటి స్థానభ్రంశం పొందలేదు కాబట్టి రోడ్డుపై సైకిల్ చేసే పని శూన్యం అవుతుంది.
ఉదాహరణ నుంచి తెలిసే అంశమేమంటే A పై B కలగచేసే బలానికి సమానం, వ్యతిరేక దిశలో B పై A కలగచేసే బలం ఉన్నప్పటికీ (న్యూటన్ మూడవ గమన నియమం) B వల్ల A పై జరిగిన పనికి, B పై A వల్ల జరిగే పని సమానం, వ్యతిరేక దిశలో ఉండనవసరం లేదు.
Exam Tips:
a) న్యూటన్ మూడవ నియమంతో బలాలు సమానమైనా పని సమానం కాదని (రోడ్డు స్థానభ్రంశం సున్న) గుర్తించండి.
Question 4: ప్రక్షేపణాల ప్రదర్శనలో ఒక పోలీసు అధికారి 50.0 గ్రా. ద్రవ్యరాశి ఉన్న బుల్లెట్‌ను 200 మీ/సె వడితో 2.00 సెం.మీ. మందం ఉన్న ప్లైవుడ్లోకి పేల్చాడు. తొలి గతిజశక్తిలో కేవలం 10% తో మాత్రమే బుల్లెట్ బయటకు వెలువడింది. బయటకు వెలువడిన బుల్లెట్ వడి ఎంత ?
Answer:
బుల్లెట్ తొలి గతిజశక్తి \( = \frac{1}{2}mv^2 = \frac{1}{2} \times 0.05 \times 200^2 = 1000 \) J
దాని తుది గతిజశక్తి = 0.1 × 1000 = 100 J. బయటకు వెలువడిన బుల్లెట్ వడి \( v_f \) అయితే
\( \frac{1}{2}mv_f^2 = 100 \) J
\( v_f = \sqrt{\frac{2 \times 100}{0.05}} = 63.2 \) మీ/సె
వడి తొలి వడిలో దాదాపు 68% తగ్గింది (90% కాదు).
Exam Tips:
a) తొలి గతిజశక్తిలో 10% తుది శక్తి; వడి \( \sqrt{2K/m} \), ద్రవ్యరాశి కి.గ్రా.లోకి మార్చండి.
Question 5: ద్రవ్యరాశి m = 1కి.గ్రా. ఉన్న దిమ్మె క్షితిజ సమాంతర తలంపై vᵢ = 2 ms⁻¹ వడితో కదులుతూ x = 0.10 m నుంచి x = 2.01 m వరకు విస్తరించి ఉన్న గరుకు ప్రదేశంలోకి ప్రవేశించింది. ఈ వ్యాప్తిలో చలనానికి వ్యతిరేకంగా పనిచేసే బలం F ᵣ, x కు విలోమానుపాతంలో ఉంటుంది.
\( Fᵣ = \frac{-k}{x} 0.1 < x < 2.01 m \) వద్ద
= 0 x < 0.1m, x > 2.01 m వద్ద
ఇక్కడ k = 0.5 J. గరుకు ప్రదేశాన్ని దాటిన తరువాత దిమ్మె తుది గతిజశక్తి, వడి vf ఎంత ?.
Answer:
సమీకరణం \( K_f - K_i = \int_{x_i}^{x_f} F\,dx \) నుంచి
\( K_f = K_i + \int_{0.1}^{2.01}\frac{(-k)}{x}dx = \frac{1}{2}mv_i^2 - k\ln(x)\Big|_{0.1}^{2.01} = \frac{1}{2}mv_i^2 - k\ln(2.01/0.1) \)
\( = 2 - 0.5\ln(20.1) = 2 - 1.5 = 0.5 \) J, \( v_f = \sqrt{2K_f/m} = 1 \) m s⁻¹
ఇక్కడ ln, e ఆధారం కలిగిన సహజ సంవర్గమానం. అంతేకాని 10 ఆధారం కలిగిన సంవర్గమానం కాదు అని గుర్తించాలి. [ln X = logₑ X = 2.303 log₁₀ X].
Exam Tips:
a) \( \int \frac{dx}{x} = \ln x \) (సహజ సంవర్గమానం, ln 20.1 ≈ 3.0) అని గుర్తుంచుకోండి.
Question 6: కారు ప్రమాదాలను పోలి ఉండే విధంగా కారు తయారీదార్లు వివిధ స్ప్రింగ్ స్థిరాంకాలు కలిగిన స్ప్రింగ్‌తో గమనంలో ఉన్న కార్ల అభిఘాతాలను అధ్యయనం చేస్తారు. అలాంటి ఒక పోలికను పరిగణిద్దాం. 1000 కి.గ్రా. ద్రవ్యరాశి కలిగిన కారు 18.0 km/h వడితో నున్నటి రోడ్డుపై చలిస్తూ 6.25 × 10³ N m⁻¹ స్ప్రింగ్ స్థిరాంకం ఉన్న క్షితిజ సమాంతరంగా తగిలించిన స్ప్రింగ్‌ను ఢీకొంది. స్ప్రింగ్ చెందే గరిష్ఠ సంపీడనం ఎంత ?
Answer:
స్ప్రింగ్ గరిష్ఠ సంపీడనం చెందినప్పుడు కారు గతిజశక్తి పూర్తిగా స్ప్రింగ్ స్థితిజ శక్తిగా మారుతుంది.
18 km h⁻¹ = 5 m s⁻¹ (36 km h⁻¹ = 10 m s⁻¹ అని గుర్తుంచుకోవడం ఉపయోగకరం).
గమనంలో ఉన్న కారు గతిజశక్తి \( K = \frac{1}{2}mv^2 = \frac{1}{2} \times 10^3 \times 5 \times 5 = 1.25 \times 10^4 \) J
యాంత్రిక శక్తి నిత్యత్వ నియమం ప్రకారం గరిష్ఠ సంపీడనం \( x_m \) వద్ద స్ప్రింగ్ స్థితిజ శక్తి కారు గతిజశక్తికి సమానం.
\( V = \frac{1}{2}kx_m^2 = 1.25 \times 10^4 \) J
\( x_m^2 = \frac{2 \times 1.25 \times 10^4}{6.25 \times 10^3} = 4 \) ⇒ \( x_m = 2.00 \) మీ.
ఇక్కడ స్ప్రింగ్‌ను ద్రవ్యరాశి లేనిదిగా, తలానికి ఉపేక్షించదగిన ఘర్షణ ఉందని పరిగణించడమైంది. ఇది ఒక ఆదర్శ పరిస్థితి అని గమనించవచ్చు.
Exam Tips:
a) 18 km/h = 5 m/s మార్చి \( \frac{1}{2}mv^2 = \frac{1}{2}kx^2 \) సమీకరణం రాయండి.
ముఖ్యమైన అదనపు లెక్కలు
Question 1: వస్తువుపై బలం చేసిన పని సంజ్ఞ గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైంది. కింది భౌతికరాశులు, ధనాత్మకమా ? ఋణాత్మకమా ? జాగ్రత్తగా తెలియచేయండి.
ఎ) బకెట్‌కు బిగించిన తాడు సహాయంతో బావి నుంచి బకెట్‌ను తీసే సందర్భంలో మనిషి చేసిన పని
బి) పై సందర్భానికి గురుత్వ బలం చేసిన పని
సి) ఒక వస్తువు వాలు తలంపై జారుతున్నప్పుడు ఘర్షణ బలం చేసిన పని
డి) ఘర్షణ ఉన్న (గరుకు) క్షితిజ సమాంతర తలంపై వస్తువు సమవేగంతో చలిస్తున్నప్పుడు అనువర్తించిన బలం చేసిన పని
ఇ) కంపిస్తున్న లోలకాన్ని విరామస్థితిలోకి తేవడానికి గాలి నిరోధక బలం చేసే పని
Answer:
ఎ) బకెట్‌ను పైకి లాగడానికి దాని భారానికి సమానమైన బలం ప్రయోగించాలి. ఈ సందర్భంలో బలం, స్థానభ్రంశం ఒకే దిశలో ఉండటం వలన పని ధనాత్మకము.
బి) బకెట్ పైకి పోతున్నపుడు గురుత్వ బలం చేసిన పని ఋణాత్మకము. కారణం స్థానభ్రంశం మరియు గురుత్వ బలం వ్యతిరేక దిశలలో ఉండటము.
సి) ఘర్షణ బలం వస్తువు కదిలే దిశకు వ్యతిరేకము కావున ఘర్షణ బలం చేసిన పని ఋణాత్మకము.
డి) వస్తువు సమవేగంతో గరుకు తలంపై చలించాలంటే ఘర్షణకు సమానమైన బలాన్ని చలన దిశలో ప్రయోగించాలి. బలం మరియు స్థానభ్రంశం ఒకే దిశలో ఉంటాయి. కావున పని ధనాత్మకము.
ఇ) గాలి నిరోధక బలం గమన దిశకు వ్యతిరేకంగా ఉండటం వల్ల పని ఋణాత్మకము.
గమనిక : పని \( W = \overline{F} \cdot \overline{S} = FS\cos θ \). ఇది అదిశరాశి. \( \overline{F}, \overline{S} \) లు ఒకే దిశలో ఉంటే (θ < 90°) పని ధనాత్మకము, వ్యతిరేక దిశలలో ఉంటే (θ > 90°) పని ఋణాత్మకము.
Exam Tips:
a) సంజ్ఞ కోసం బలం, స్థానభ్రంశం దిశలను పోల్చి కారణం రాయండి; పని అదిశరాశి అయినా ధన/ఋణ విలువ కలిగి ఉంటుంది.
Question 2: గతిక ఘర్షణ గుణకం 0.1 కలిగిన బల్లపై నిశ్చల స్థితిలో ఉన్న 2 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న వస్తువు 7 న్యూ క్షితిజ సమాంతర బలం వల్ల చలిస్తూ ఉంది. కింది రాశులను లెక్కించండి.
ఎ) 10 సె. కాలంలో అనువర్తిత బలం చేసిన పని
బి) 10 సె. కాలంలో ఘర్షణ బలం చేసిన పని
సి) 10 సె. కాలంలో నికర బలం చేసిన పని
డి) 10 సె. కాలంలో వస్తువు గతిజ శక్తిలోని మార్పు
మీ ఫలితాలను వివరించండి.
Answer:
ద్రవ్యరాశి m = 2 కి.గ్రా. ; తొలి వేగము u = 0 ; బలము F = 7 న్యూ ; ఘర్షణ గుణకము μ = 0.1 ; g = 9.8 మీ/సె²
ఘర్షణ బలం \( f = \mu mg = 0.1 \times 2 \times 9.8 = 1.96 \) న్యూ
అనువర్తిత బలం వల్ల త్వరణము \( a_1 = \frac{F}{m} = \frac{7}{2} = 3.5 \) మీ/సె²
ఘర్షణ బలం వల్ల వ్యతిరేక దిశలో త్వరణము
\( a_2 = \frac{\text{ఘర్షణ బలం}}{m} \)
\( a_2 = \frac{\mu mg}{m} = 0.1 \times 9.8 = 0.98 \) మీ/సె²
ఫలిత త్వరణము \( a = a_1 - a_2 = 3.5 - 0.98 = 2.52 \) మీ/సె²
10 సె.లో వస్తువు కదిలిన దూరము \( s = ut + \frac{1}{2}at^2 = 0 + \frac{1}{2} \times 2.52 \times 10 \times 10 = 126 \) మీ.
ఎ) అనువర్తిత బలం చేసిన పని \( W_1 = F \cdot s = 7 \times 126 = 882 \) J
బి) ఘర్షణ బలం చేసిన పని \( W_2 = -f \cdot s = -1.96 \times 126 = -247 \) J
సి) నికర బలం చేసిన పని \( W_3 = (F - f)\,s = (7 - 1.96) \times 126 = 635 \) J
డి) \( v = u + at \) నుంచి \( v = 0 + 2.52 \times 10 = 25.2 \) మీ/సె
తుది గతిజశక్తి \( = \frac{1}{2}mv^2 = \frac{1}{2} \times 2 \times (25.2)^2 = 635 \) J ; తొలి గతిజశక్తి \( = \frac{1}{2}mu^2 = 0 \)
∴ గతిజశక్తిలో మార్పు = 635 – 0 = 635 J
ఫలితాల వివరణ : నికర బలం చేసిన పని (635 J) గతిజశక్తిలోని మార్పుకు (635 J) సమానం. ఇది పని-శక్తి సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది. అనువర్తిత బలం చేసిన పని (882 J) = నికర బలం చేసిన పని + ఘర్షణకు వ్యతిరేకంగా వెచ్చించిన పని (247 J).
Exam Tips:
a) ముందుగా నికర త్వరణం, దూరం కనుక్కొని ఆపై ప్రతి బలం పనిని లెక్కించండి; నికర పని = గతిజశక్తి మార్పు అని సరిచూడండి.
Question 3: పటంలో కొన్ని ఏకమితీయ స్థితిజ శక్తి ప్రమేయాలకు ఉదాహరణలు ఇవ్వడమైంది. కణం మొత్తం శక్తిని ద్వితీయ నిరూపక అక్షం (y-అక్షం) పై క్రాస్ సూచించడమైంది. ఇచ్చిన శక్తికి, కణాన్ని కనుక్కోలేని ప్రాంతం ఏదైనా ఉంటే ఆ ప్రాంతాన్ని ప్రతి సందర్భానికి వివరించండి. ప్రతి సందర్భంలో కణానికి ఉండవలసిన మొత్తం కనీస శక్తిని కూడా సూచించండి. ఈ స్థితిజ శక్తి ఆకారాలకు సంబంధించిన సరళమైన భౌతిక సందర్భాలను ఆలోచించండి.
Answer:
మొత్తం శక్తి E = P.E. + K.E. లేదా K.E. = E – P.E. ఇందులో K.E. విలువ ఋణాత్మకం కాదు, కావున కణం P.E. > E ఉన్న ప్రాంతంలో ఉండదు.
1. x > a ప్రాంతంలో P.E. (V₀) > E, అనగా K.E. ఋణాత్మకం కావలసి వస్తుంది. ఇది సాధ్యం కాదు కాబట్టి కణం x > a ప్రాంతంలో ఉండదు. (x < a లో V = 0 కావున కణం అక్కడ ఉంటుంది; x > a లోకి ప్రవేశించాలంటే E ≥ V₀ కావాలి.)
2. x < a మరియు x > b ప్రాంతంలో P.E. (V₀) > E, అనగా K.E. ఋణాత్మకము. ఇది సాధ్యం కాదు. కాబట్టి కణం x < a మరియు x > b ప్రాంతంలో ఉండదు. కణం a < x < b ప్రాంతంలో ఉంటుంది; అక్కడ కణానికి కనీస మొత్తం శక్తి E = –V₁.
3. ఈ పటంలోని ఏ ప్రాంతంలోను మనం కణాన్ని కనుక్కోలేము. ఎందుకనగా అన్ని ప్రాంతాలలో P.E. > E (మొత్తం శక్తి).
4. –b/2 < x < –a/2 మరియు a/2 < x < b/2 ప్రాంతాలలో P.E. > మొత్తం శక్తి E, కావున K.E. ఋణాత్మకంగా ఉండాలి. అనగా ఈ ప్రాంతాలలో కణం ఉండే అవకాశం లేదు. కణం |x| < a/2 మరియు |x| > b/2 ప్రాంతాలలో ఉంటుంది; కనీస మొత్తం శక్తి E = –V₁.
Exam Tips:
a) K.E. = E − P.E. ≥ 0 ఉండాలి; P.E. > E అయ్యే ప్రాంతాల్లో కణం ఉండదు.
Question 4: రేఖీయ సరళ హరాత్మక చలనం చేస్తున్న కణం స్థితిజ శక్తి ప్రమేయం \( V(x) = \frac{kx^2}{2} \) గా ఇవ్వడమైంది. ఇక్కడ k డోలకం బల స్థిరాంకం. k = 0.5 N m⁻¹ విలువకు V(x), x ల మధ్య గ్రాఫ్ పటంలో చూపించడమైంది. ఈ పొటెన్షియల్‌లో చలించే 1 J మొత్తం శక్తి కలిగిన కణం x = ± 2 మీ. కు చేరినపుడు అది వెనుకకు మరలుతుందని చూపండి.
Answer:
ఏదైనా క్షణంలో సరళ హరాత్మక చలనం చేస్తున్న కణం మొత్తం శక్తి = K.E. + P.E. \( = \frac{1}{2}mv^2 + \frac{1}{2}kx^2 \)
కణం వెనుకకు మరలే బిందువు వద్ద (గరిష్ఠ స్థానభ్రంశ బిందువు) v = 0 ⇒ K.E. = 0
∴ మొత్తం శక్తి \( E = \frac{1}{2}kx^2 \). ఇక్కడ E = 1 J, k = 0.5 N m⁻¹
\( 1 = \frac{1}{2} \times 0.5 \times x^2 \) ⇒ \( x^2 = 4 \) ⇒ x = ± 2 మీ.
కావున కణం x = ± 2 మీ. వద్ద వెనుకకు మరలుతుంది.
Exam Tips:
a) మరలే బిందువు వద్ద v = 0, కావున \( E = \frac{1}{2}kx^2 \) నుండి x = ± 2 మీ.
Question 5: కింది వాటికి సమాధానాలివ్వండి:
ఎ) రాకెట్ గమనంలో ఉన్నపుడు దాని చుట్టూ ఉన్న కప్పు ఘర్షణ వల్ల కాలిపోతుంది. కాలిపోవడానికి అవసరమయ్యే ఉష్ణ శక్తి రాకెట్ నుంచి లభ్యమవుతుందా ? లేదా వాతావరణం నుంచి లభ్యమవుతుందా ?
బి) అధిక దీర్ఘాక్ష దీర్ఘ వృత్తాకార కక్ష్యల్లో తోకచుక్కలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుని వల్ల తోకచుక్కపై పనిచేసే గురుత్వ బలం సాధారణంగా తోకచుక్క వేగానికి లంబంగా ఉండదు. కాని తోకచుక్క ప్రతి పూర్తి భ్రమణానికి గురుత్వ బలం చేసిన పని శూన్యమవుతుంది. ఎందుకు ?
సి) పలుచని వాతావరణంలో భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహం వాతావరణ నిరోధం వల్ల క్రమంగా చాలా స్వల్ప మోతాదులో శక్తిని కోల్పోతుంది. అయితే అది భూమిని దగ్గరగా సమీపిస్తున్న కొద్దీ దాని వడి ఎందుకు క్రమంగా పెరుగుతుంది ?
డి) పటం (i) లో ఒక మనిషి 15 కి.గ్రా. ద్రవ్యరాశిని తన చేతులతో తీసుకొని వెళ్తూ 2 మీ. దూరం నడిచాడు. పటం (ii) లో అతను తన వెనుక ఉన్న తాడును లాగుతూ అంతే దూరాన్ని నడిచాడు. కప్పీ మీదగా వెళ్తున్న తాడుకు రెండవ చివర 15 కి.గ్రా. ద్రవ్యరాశి వేలాడదీయడమైంది. ఏ సందర్భంలో జరిగిన పని ఎక్కువ ?
Answer:
ఎ) కాలిపోవడానికి అవసరమైన ఉష్ణ శక్తి రాకెట్ నుండి లభ్యమవుతుంది, వాతావరణం నుండి కాదు. గాలి ఘర్షణ బలానికి వ్యతిరేకంగా రాకెట్ పని చేస్తుంది; ఈ పని రాకెట్ యాంత్రిక శక్తి (గతిజశక్తి) నుండే సమకూరి ఉష్ణశక్తిగా మారి కప్పు కాలిపోవడానికి ఉపయోగపడుతుంది.
బి) గురుత్వాకర్షణ బలాలు నిత్యత్వ బలాలు. కావున ఒక సంవృత వలయంలో జరిగిన పని సున్నకు సమానము. అనగా తోకచుక్క ప్రతి పరిభ్రమణంలో జరిగిన పని = 0.
సి) ఉపగ్రహం భూమిని సమీపిస్తుంటే దాని ఎత్తు తగ్గుతుంది, కాబట్టి స్థితిజశక్తి తగ్గుతుంది. వాతావరణ రాపిడి వల్ల నష్టమయ్యే శక్తి అతి స్వల్పం; స్థితిజశక్తిలో తగ్గుదల దానికంటే ఎక్కువ. కావున గతిజశక్తి పెరుగుతుంది, అందువల్ల ఉపగ్రహం వడి పెరుగుతుంది.
డి) (i) పటంలో మనిషి ప్రయోగించిన బలం (భారాన్ని మోయడానికి నిలువుగా పైకి) మరియు వస్తువు స్థానభ్రంశం (క్షితిజ సమాంతరం) పరస్పరం లంబంగా ఉన్నాయి. ∴ θ = 90°
జరిగిన పని \( W = Fs\cos θ = Fs \cos 90° = 0 \)
(ii) ఈ పటంలో బలము, స్థానభ్రంశం ఒకే దిశలో ఉన్నాయి. ∴ θ = 0
జరిగిన పని \( W = Fs\cos θ = mgs\cos 0° = 15 \times 9.8 \times 2 = 294 \) J
కావున (ii) సందర్భంలో జరిగిన పని ఎక్కువ.
Exam Tips:
a) ప్రతి భాగానికి చిన్న కారణ వాక్యం రాయండి (సంవృత పథంలో నిత్యత్వ బలం పని సున్న, బలం ⟂ స్థానభ్రంశం అయితే పని సున్న).
Question 6: సరైన ప్రత్యామ్నాయం కింద గీత గీయండి.
ఎ) వస్తువుపై నిత్యత్వ బలం చేసిన పని ధనాత్మకమయితే, వస్తువు స్థితిజ శక్తి పెరుగుతుంది/తగ్గుతుంది/మారకుండా ఉంటుంది.
బి) ఘర్షణకు వ్యతిరేకంగా వస్తువు పనిచేయడం వల్ల ఎప్పుడూ గతిజ/స్థితిజ శక్తి నష్టం జరుగుతుంది.
సి) అనేక కణ వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్యవేగంలోని మార్పురేటు బాహ్యబలం / వ్యవస్థలోని అంతర బలాల మొత్తానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
డి) రెండు వస్తువుల మధ్య జరిగిన అస్థితిస్థాపక అభిఘాతంలో, అభిఘాతం తరువాత వ్యవస్థ మొత్తం గతిజశక్తి / మొత్తం రేఖీయ ద్రవ్యవేగం / మొత్తం శక్తి మారకుండా స్థిరంగా ఉంటుంది.
Answer:
ఎ) తగ్గుతుంది. నిత్యత్వ బలాలు ధనాత్మక పని చేస్తే వస్తువు స్థితిజశక్తి తగ్గుతుంది. ఎందుకనగా స్థితిజశక్తి వస్తువులో దాచిపెట్టబడిన పని.
బి) గతిజశక్తి. ఘర్షణకు వ్యతిరేకంగా పని జరిగినపుడు వస్తువు గతిజశక్తి తగ్గుతుంది. కారణం ఘర్షణకు వ్యతిరేకంగా జరిపిన పని గతిజశక్తి నుండి సమకూరడమే.
సి) బాహ్యబలం. ద్రవ్యవేగంలోని మార్పు బాహ్యబలం నుండే సమకూరుతుంది. కారణం అంతర్గత బలాలు వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగాన్ని మార్చలేవు.
డి) మొత్తం రేఖీయ ద్రవ్యవేగం. అస్థితిస్థాపక అభిఘాతాలలో వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగం స్థిరము; గతిజశక్తిలో కొంత నష్టం జరుగుతుంది.
Exam Tips:
a) ఎంపిక చేసిన ఎంపికను రాసి, ఒక వాక్యంలో కారణం ఇవ్వండి.
Question 7: క్రింద ఇచ్చిన ప్రతిపాదనలు సరి అయినవా ? కావా ? మీ సమాధానాలకు కారణాలు రాయండి.
ఎ) రెండు వస్తువుల మధ్య జరిగే స్థితిస్థాపక అభిఘాతంలో ప్రతి వస్తువు యొక్క ద్రవ్యవేగం, శక్తి నిత్యత్వంగా ఉంటుంది.
బి) వస్తువుపై ఎటువంటి అంతర, బాహ్యబలాలు పనిచేసినప్పటికీ వ్యవస్థ మొత్తం శక్తి ఎప్పుడూ నిత్యత్వంగా ఉంటుంది.
సి) ఒక సంవృత ఉచ్చు వెంబడి చలనంలో ఉన్న వస్తువుపై ప్రకృతిలోని ప్రతి బలం చేసే పని శూన్యం.
డి) అస్థితిస్థాపక అభిఘాతంలో వ్యవస్థ తొలి గతిజ శక్తి కంటె తుది గతిజ శక్తి ఎప్పుడూ తక్కువగా ఉంటుంది.
Answer:
ఎ) ప్రతిపాదన సరియైనది కాదు. స్థితిస్థాపక అభిఘాతాలలో వ్యవస్థ మొత్తం శక్తి, ద్రవ్యవేగాలు స్థిరము. విడివిడిగా ప్రతి వస్తువుకు ఈ నియమం వర్తించదు.
బి) ప్రతిపాదన సరియైనది కాదు. బాహ్యబలం వల్ల వ్యవస్థ మొత్తం శక్తి మారవచ్చు.
సి) ప్రతిపాదన సరియైనది కాదు. నిత్యత్వ బలాలకు మాత్రమే సంవృత మార్గంలో జరిపిన మొత్తం పని సున్న. అనిత్యత్వ బలాలకు ఈ నియమం వర్తించదు.
డి) నిజమే. అస్థితిస్థాపక అభిఘాతాలలో కొంత శక్తి నష్టం జరుగుతుంది.
Exam Tips:
a) "సరైనది/కాదు" ముందు రాసి కారణం కొనసాగించండి; నిత్యత్వ, అనిత్యత్వ బలాల భేదంపై దృష్టి పెట్టండి.
Question 8: తగిన కారణాలతో జాగ్రత్తగా సమాధానమివ్వండి:
ఎ) రెండు బిలియర్డ్ బంతుల స్థితిస్థాపక అభిఘాతంలో బంతుల మధ్య అభిఘాతం జరుగుతున్న స్వల్ప కాలంలో (ఒక దానితో ఒకటి స్పర్శించుకొన్నప్పుడు) మొత్తం గతిజ శక్తి నిత్యత్వంగా ఉంటుందా ?
బి) స్వల్ప కాలవ్యవధిలో రెండు బంతుల మధ్య జరిగిన స్థితిస్థాపక అభిఘాతంలో రేఖీయ ద్రవ్యవేగం మొత్తం నిత్యత్వంగా ఉంటుందా ?
సి) అస్థితిస్థాపక అభిఘాతానికి (ఎ), (బి) లకు సమాధానాలు ఏమిటి ?
డి) రెండు బిలియర్డ్ బంతుల స్థితిజ శక్తి, వాటి కేంద్రాల మధ్య దూరంపై మాత్రమే ఆధారపడితే ఆ అభిఘాతం స్థితిస్థాపకమా లేదా అస్థితిస్థాపకమా ? (సూచన : అభిఘాత సమయమప్పుడు ఉండే బలానికి సంబంధించిన స్థితిజ శక్తి గురించి మాట్లాడుతున్నాం కాని గురుత్వ స్థితిజ శక్తిని గురించి కాదు.)
Answer:
ఎ) లేదు. స్థితిస్థాపక అభిఘాతంలో అభిఘాతానికి ముందు వ్యవస్థ గతిజశక్తి, అభిఘాతం తరువాత వ్యవస్థ గతిజశక్తికి సమానము. కాని బంతులు స్పర్శలో ఉన్న స్వల్ప కాలంలో గతిజశక్తి నిత్యత్వంగా ఉండదు. అభిఘాత సమయంలో గతిజశక్తి కొంత స్థితిజశక్తిగా మారుతుంది (బంతులు వికృతి చెందుతాయి).
బి) నిజమే. వ్యవస్థపై బాహ్యబలాలు లేవు కావున అభిఘాతం జరిగే స్వల్ప వ్యవధిలో కూడా వ్యవస్థ మొత్తం రేఖీయ ద్రవ్యవేగం స్థిరము. బంతుల మధ్య ద్రవ్యవేగ వినిమయం జరుగుతుంది.
సి) అస్థితిస్థాపక అభిఘాతంలో గతిజశక్తి నిత్యత్వంగా ఉండదు (అభిఘాతానికి ముందు, తరువాత, అభిఘాత సమయంలో కూడా). కాని మొత్తం రేఖీయ ద్రవ్యవేగం అన్ని సందర్భాలలో స్థిరము.
డి) ఈ అభిఘాతం స్థితిస్థాపక అభిఘాతం. ఎందుకనగా ఇందులో పాల్గొనిన బలాలు నిత్యత్వ బలాలు.
Exam Tips:
a) అభిఘాత సమయంలో గతిజశక్తి స్థితిజశక్తిగా మారుతుంది కాని ద్రవ్యవేగం ఎప్పుడూ స్థిరం అని గుర్తుంచుకోండి.
Question 9: నిశ్చల స్థితి నుంచి బయలుదేరిన ఒక వస్తువు స్థిర త్వరణంతో ఏకమితీయ చలనం కలిగి ఉంది. t కాలంలో దానికి అందచేసిన సామర్థ్యం కింది వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది.
(i) t1/2
(ii) t
(iii) t3/2
(iv) t²
Answer:
v = u + at నుండి v = 0 + at. సామర్థ్యము P = F × v
∴ P = mav = m.a.a.t = ma ²t
m, a లు స్థిరం కావున P ∝ t. కావున సరైన సమాధానం (ii) t.
Exam Tips:
a) \( P = Fv = ma\cdot at = ma^2 t \) కావున P ∝ t.
Question 10: స్థిర సామర్థ్యాన్ని అందించే జనకం ప్రభావం వల్ల ఒక వస్తువు ఏక దిశాత్మకంగా చలిస్తుంది. t కాలంలో కలిగిన స్థానభ్రంశం కింది వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది.
(i) t1/2
(ii) t
(iii) t3/2
(iv) t²
Answer:
సామర్థ్యము P = బలం × వేగము
∴ P = [MLT ⁻²][LT ⁻¹] = [ML ²T ⁻³]
వస్తువు స్థిర సామర్థ్యముతో కదులుతున్నపుడు m, P లు స్థిరము
కావున L ²T⁻³ స్థిరము లేదా \( \frac{\mathrm{L}^2}{\mathrm{~T}^3} = \) స్థిరరాశి అనగా L² ∝ T³ లేదా L ∝ T3/2. కావున సరైన సమాధానం (iii) t3/2.
Exam Tips:
a) \( P = Fv \) స్థిరం అయితే \( v \propto t^{1/2} \), కావున \( x \propto t^{3/2} \) (మితి విశ్లేషణతో కూడా రాబట్టవచ్చు).
Question 11: ఒక నిరూపక వ్యవస్థలో Z-అక్షం వెంట చలనానికి పరిమితం అయిన వస్తువుపై \( \overrightarrow{F} = -\hat{i} + 2\hat{j} + 3\hat{k} \) N అనే స్థిర బలం పనిచేస్తుంది. ఇక్కడ X-, Y-, Z- అక్షాల వెంట ప్రమాణ సదిశలు వరుసగా \( \hat{i}, \hat{j}, \hat{k} \). Z-అక్షంపై 4 మీ. దూరం చలించడానికి ఈ బలం చేసిన పని ఎంత ?
Answer:
దత్తాంశం నుండి \( \overrightarrow{F} = -\hat{i} + 2\hat{j} + 3\hat{k} \) న్యూ, \( \overrightarrow{s} = 4\hat{k} \) మీ.
జరిగిన పని \( W = \overrightarrow{F} \cdot \overrightarrow{s} = (-\hat{i} + 2\hat{j} + 3\hat{k}) \cdot (4\hat{k}) = 12\,\hat{k}\cdot\hat{k} = 12 \) J
Exam Tips:
a) డాట్ లబ్ధంలో \( \hat{k}\cdot\hat{k} = 1 \), \( \hat{i}\cdot\hat{k} = \hat{j}\cdot\hat{k} = 0 \); కావున z అంశం మాత్రమే పనికి వస్తుంది.
Question 12: విశ్వకిరణాల ప్రయోగంలో 10 keV, 100 keV శక్తి గల ఎలక్ట్రాన్, ప్రోటాన్లను కనుక్కొన్నారు. వీటిలో వేగవంతం అయినది ఏది ? ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ ? వాటి వడుల నిష్పత్తిని రాబట్టండి. (ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి = 9.11 × 10⁻³¹ కి.గ్రా., ప్రోటాన్ ద్రవ్యరాశి = 1.67 × 10⁻²⁷ కి.గ్రా., 1 eV = 1.60 × 10⁻¹⁹ J).
Answer:
ఎలక్ట్రాన్ గతిజశక్తి \( KE_e = 10 \) keV \( = 10 \times 1.6 \times 10^{-16} \) J
ప్రోటాన్ గతిజశక్తి \( KE_p = 100 \) keV \( = 100 \times 1.6 \times 10^{-16} \) J
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి \( m_e = 9.11 \times 10^{-31} \) కి.గ్రా. ; ప్రోటాన్ ద్రవ్యరాశి \( m_p = 1.67 \times 10^{-27} \) కి.గ్రా.
\( \frac{1}{2}m_e v_e^2 : \frac{1}{2}m_p v_p^2 = 10 : 100 = 1 : 10 \)
\( \frac{v_e}{v_p} = \sqrt{\frac{1}{10} \cdot \frac{m_p}{m_e}} = \sqrt{\frac{1.67 \times 10^{-27}}{10 \times 9.11 \times 10^{-31}}} = \sqrt{183.3} \approx 13.5 \)
∴ ఎలక్ట్రాన్ ఎక్కువ వేగవంతమైనది; దాని వడి ప్రోటాన్ వడికి సుమారు 13.5 రెట్లు (v_e : v_p ≈ 13.5 : 1).
Exam Tips:
a) సమాన గతిజశక్తికి \( v \propto 1/\sqrt{m} \) కావున తేలికైన ఎలక్ట్రాన్ వేగవంతం; eV ను జౌల్లోకి మార్చండి.
Question 13: 500 మీ. ఎత్తు నుంచి 2 మి.మీ. వ్యాసార్ధం ఉన్న వాన నీటి బిందువు నేలపై పడుతుంది. సగం ఎత్తువరకు తగ్గుతున్న త్వరణం (గాలి స్నిగ్ధతా నిరోధం వల్ల) కలిగి గరిష్ఠ (అంత్య) వడిని పొందుతుంది. ఆ తరువాత అది ఏకరీతి వడితో కిందికి చలిస్తుంది. వాన నీటి బిందువు ప్రయాణంలో, మొదటి, రెండవ సగంలో గురుత్వ బలం చేసిన పని ఎంత ? 10 మీ/సె వడితో నేలను చేరినట్లైతే దాని పూర్తి ప్రయాణంలో నిరోధక బలం చేసిన పని ఎంత ?
Answer:
నీటి బిందువు వ్యాసార్ధము r = 2 మి.మీ. = 2 × 10⁻³ మీ. ; మొత్తం ప్రయాణించిన దూరము = 500 మీ. ; సగం దూరము = 250 మీ.
నీటి సాంద్రత ρ = 10³ కి.గ్రా./మీ³
నీటి బిందువు ద్రవ్యరాశి \( m = \frac{4}{3}\pi r^3 \rho = \frac{4}{3} \times \frac{22}{7} \times (2 \times 10^{-3})^3 \times 10^3 = 3.35 \times 10^{-5} \) కి.గ్రా.
నిరోధక బలం ఉన్నా లేకపోయినా గురుత్వ బలం చేసిన పని \( W = mgh \) (గురుత్వ బలం, స్థానభ్రంశం ఒకే దిశలో)
మొదటి సగంలో \( W_1 = mg \times 250 = 3.35 \times 10^{-5} \times 9.8 \times 250 = 0.082 \) J
రెండవ సగంలో కూడా \( W_2 = 0.082 \) J
మొత్తం \( W_g = 0.164 \) J
నేలను తాకినపుడు వేగము v = 10 మీ/సె. ∴ గతిజశక్తి \( \Delta K = \frac{1}{2}mv^2 = \frac{1}{2} \times 3.35 \times 10^{-5} \times 10^2 = 1.675 \times 10^{-3} \) J
పని-శక్తి సిద్ధాంతం నుండి \( \Delta K = W_g + W_r \)
\( W_r = \Delta K - W_g = 1.675 \times 10^{-3} - 0.164 = -0.162 \) J
నిరోధక బలం చేసిన పని ఋణాత్మకం, పరిమాణం సుమారు 0.162 J.
Exam Tips:
a) గురుత్వ బలం పని ప్రతి సగంలో mgh/2 (నిరోధంతో సంబంధం లేదు); నిరోధక బలం పని ఋణాత్మకం.
Question 14: పాత్రలో ఉన్న వాయువులోని అణువు, 200 మీ/సె వడితో, లంబంతో 30° కోణం చేస్తున్న దిశలో క్షితిజ సమాంతర (పాత్ర) గోడను ఢీకొని అంతే వడితో వెనుకకు మరలింది. ఈ అభిఘాతంలో ద్రవ్యవేగం నిత్యత్వంగా ఉంటుందా ? ఈ అభిఘాతం స్థితిస్థాపకమా లేదా అస్థితిస్థాపకమా ?
Answer:
వాయు అణువు తొలి వేగము \( v_1 \) = 200 మీ/సె ; తుది వేగము \( v_2 \) = 200 మీ/సె
ద్రవ్యవేగం : అణువు ద్రవ్యవేగం గోడకు లంబ దిశలో మారుతుంది (\( 2mv\cos 30° \) మేర), ఇది గోడకు బదిలీ అవుతుంది. అణువు మరియు గోడ కలిసిన వ్యవస్థపై బాహ్యబలం లేదు కావున వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగం నిత్యత్వంగా ఉంటుంది (గోడ చాలా భారీది కావడంతో దాని వేగం ఉపేక్షణీయం).
గతిజశక్తి : అభిఘాతానికి ముందు అణువు \( K.E. = \frac{1}{2}m(200)^2 \) ……(1)
గోడ నిశ్చలంగా ఉంది కావున దాని గతిజశక్తి సున్న, అభిఘాతం తరువాత కూడా ఉపేక్షణీయం.
అభిఘాతం తరువాత అణువు \( K.E. = \frac{1}{2}m(200)^2 \) ……(2)
సమీ. (1), (2) నుండి అభిఘాతానికి ముందు గతిజశక్తి = అభిఘాతం తరువాత గతిజశక్తి. కావున ఇది స్థితిస్థాపక అభిఘాతం.
Exam Tips:
a) అణువు + గోడ వ్యవస్థకు ద్రవ్యవేగం స్థిరం; వడి అదే కావున గతిజశక్తి స్థిరం, అభిఘాతం స్థితిస్థాపకం.
Question 15: భవనం నేల అంతస్తుపై ఉన్న పంప్ (మోటార్) 30 మీ³ ఘనపరిమాణం ఉన్న టాంకును 15 నిమిషాలలో నింపగలదు. పంప్ దక్షత 30% కలిగి ఉండి, టాంక్ నేలపై నుంచి 40 మీ. ఎత్తులో ఉంటే పంప్ ఎంత విద్యుత్ సామర్థ్యం వినియోగించుకొంటుంది ?
Answer:
నీటి ఘనపరిమాణము V = 30 మీ³ ; 1 మీ³ నీటి ద్రవ్యరాశి = 1000 కి.గ్రా.
నీటి ద్రవ్యరాశి m = 30 × 10³ కి.గ్రా. ; కాలము t = 15 ని. = 15 × 60 = 900 సె. ; ఎత్తు h = 40 మీ. ; దక్షత η = 30%
వాస్తవంగా జరిగిన పని \( W = mgh = 30 \times 10^3 \times 9.8 \times 40 \) J
వాస్తవ సామర్థ్యము \( P = \frac{W}{t} = \frac{30 \times 10^3 \times 9.8 \times 40}{900} = 13070 \) వాట్
యంత్రం వినియోగించుకొనే మొత్తం సామర్థ్యము \( P_t = \frac{P \times 100}{\eta} = \frac{13070 \times 100}{30} = 43567 \) వాట్ ≈ 43.6 కి.వాట్
Exam Tips:
a) ఘనపరిమాణం 30 మీ³ నుండి ద్రవ్యరాశి కనుక్కొని, \( P = mgh/t \) ను దక్షత 30% తో భాగించండి.
Question 16: ఘర్షణ లేని బల్లపై రెండు సర్వసమాన బాల్ బేరింగ్లు ఒకదానితో ఒకటి స్పర్శించుకొంటూ నిశ్చలంగా ఉన్నాయి. అంతే ద్రవ్యరాశి ఉన్న వేరొక బాల్ బేరింగ్, V తొలి వడితో వీటిని సూటిగా ఢీకొంది. ఇది స్థితిస్థాపక అభిఘాతమయితే, అభిఘాతం తరువాత పక్క వాటిలో (పటంలో) ఏది సాధ్యమయ్యే ఫలితమవుతుంది ?
Answer:
ప్రతి బంతి ద్రవ్యరాశి m అనుకోండి. కదులుతున్న బంతి వడి V. అభిఘాతానికి ముందు వ్యవస్థ మొత్తం \( K.E. = \frac{1}{2}mV^2 + 0 = \frac{1}{2}mV^2 \) (మిగిలిన బంతులు నిశ్చలంగా ఉన్నవి కావున) ; ద్రవ్యవేగం = mV
స్థితిస్థాపక అభిఘాతంలో ద్రవ్యవేగం, గతిజశక్తి రెండూ నిత్యత్వంగా ఉండాలి.
1వ సందర్భం : ద్రవ్యవేగం \( = 2m \times \frac{V}{2} = mV \) ✓. గతిజశక్తి \( K.E._1 = \frac{1}{2}(2m)\left(\frac{V}{2}\right)^2 = \frac{1}{4}mV^2 \) ✗ (నిత్యత్వం కాదు)
2వ సందర్భం : ద్రవ్యవేగం = mV ✓. గతిజశక్తి \( K.E._2 = \frac{1}{2}mV^2 \) ✓
3వ సందర్భం : ద్రవ్యవేగం \( = 3m \times \frac{V}{3} = mV \) ✓. గతిజశక్తి \( K.E._3 = \frac{1}{2}(3m)\left(\frac{V}{3}\right)^2 = \frac{1}{6}mV^2 \) ✗
పై సందర్భాలలో కేవలం 2వ సందర్భంలోనే గతిజశక్తి, ద్రవ్యవేగం రెండూ నిత్యత్వంగా ఉంటాయి. కావున సాధ్యమయ్యే ఫలితం (ii).
Exam Tips:
a) ద్రవ్యవేగం, గతిజశక్తి రెండూ ఒకేసారి నిత్యత్వం అయ్యే సందర్భాన్ని మాత్రమే సాధ్యమైనదిగా ఎంచండి.
Question 17: క్షితిజ లంబానికి 30° కోణం చేస్తూ ఉన్న లోలక గోళం A ని వదిలితే అది బల్లపై నిశ్చలస్థితిలో ఉన్న అంతే ద్రవ్యరాశి కలిగిన B గోళాన్ని పటంలో చూపినట్లు ఢీకొంది. అభిఘాతం తరువాత A గోళం ఎంత ఎత్తుకు లేస్తుంది ? అభిఘాతం స్థితిస్థాపకం అని ఊహించి, గోళాల పరిమాణాలను ఉపేక్షించండి.
Answer:
రెండు సమాన ద్రవ్యరాశులు గల వస్తువుల మధ్య అభిఘాతం జరిగితే అవి వాటి వేగాలను పరస్పరం మార్చుకుంటాయి.
B గోళం నిశ్చలంగా ఉంది కావున అభిఘాతం పిమ్మట A గోళం నిశ్చలస్థితికి వస్తుంది. పైకి లేవదు (ఎత్తు = 0); B గోళం A తొలి వడితో చలిస్తుంది.
Exam Tips:
a) సమాన ద్రవ్యరాశుల స్థితిస్థాపక అభిఘాతంలో వేగాలు ఒకదానితో మరొకటి మారుతాయి, A నిశ్చలమవుతుంది.
Question 18: ఒక లోలక గోళాన్ని క్షితిజ సమాంతర స్థానం నుంచి విడిచిపెట్టారు. గాలి నిరోధం వల్ల తొలి శక్తిలో 5% దుర్వ్యయమయితే గోళం అత్యంత నిమ్నతమ బిందువును ఎంత వడితో చేరుతుంది ? లోలకం పొడవు 1.5 మీ.
Answer:
లోలకం పొడవు l = 1.5 మీ. ; శక్తి నష్టం = 5%
క్షితిజ సమాంతర బిందువు నుండి నిమ్నతమ బిందువుకు వచ్చేటప్పుడు స్థితిశక్తిలో తగ్గుదల \( mgl \)
గోళం పొందిన గతిజశక్తి = mgl లో 95% \( = \frac{95}{100}mgl = \frac{1}{2}mv^2 \)
\( v = \sqrt{2 \times \frac{95}{100} \times gl} = \sqrt{2 \times \frac{19}{20} \times 9.8 \times 1.5} = \sqrt{27.93} = 5.28 \) మీ/సె
Exam Tips:
a) \( \frac{1}{2}mv^2 = 0.95\,mgl \) లో కారకం 2 మరువకండి: \( v = \sqrt{2\times0.95\,gl} \).
Question 19: 25 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న ఇసుక సంచిని మోస్తున్న 300 కి.గ్రా. ద్రవ్యరాశి కలిగిన ట్రాలీ ఘర్షణ లేని బాటలో 27 km/h ఏకరీతి వడితో చలిస్తూ ఉంది. కొంతసేపటి తరువాత సంచికి కలిగిన రంధ్రం ద్వారా 0.05 కి.గ్రా./సె. రేటుతో ఇసుక ట్రాలీ తలంపై లీకు అవుతూ ఉంది. ఇసుక సంచి ఖాళీ అయిన తరువాత ట్రాలీ వడి ఎంత ?
Answer:
ఏకరీతి వడితో చలిస్తున్నది, అనగా త్వరణము a = 0
∴ వ్యవస్థపై బాహ్య బలము F = ma = 0
ట్రాలీ నుంచి కారుతున్న ఇసుక వ్యవస్థ అంతర్గత బలము కావున ఇది ట్రాలీ వడిని మార్చజాలదు. (కారుతున్న ఇసుక క్షితిజ సమాంతర దిశలో ట్రాలీ వడితోనే చలిస్తుంది, క్షితిజ సమాంతర బాహ్యబలం లేదు కావున క్షితిజ సమాంతర ద్రవ్యవేగం స్థిరము.)
∴ ఇసుక సంచి ఖాళీ అయిన తరువాత కూడా ట్రాలీ వడి మారదు = 27 km/h (= 7.5 మీ/సె).
Exam Tips:
a) కారే ఇసుక క్షితిజ సమాంతర బలం కలిగించదు కావున ట్రాలీ వడి మారదని స్పష్టంగా రాయండి.
Question 20: 0.5 కి.గ్రా. ద్రవ్యరాశి ఉన్న వస్తువు సరళరేఖా మార్గంలో \( v = ax^{3/2} \) వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ \( a = 5\ \mathrm{m^{-1/2}\,s^{-1}} \). అది x = 0 నుంచి x = 2 m కి స్థానభ్రంశం చెందినపుడు ఫలిత బలం చేసిన పని ఎంత ?
Answer:
దత్తాంశం నుండి m = 0.5 కి.గ్రా. ; వేగము \( v = ax^{3/2} \) ; \( a = 5\ \mathrm{m^{-1/2}\,s^{-1}} \)
x = 0 వద్ద తొలి వేగము \( v_1 = 0 \)
x = 2 వద్ద తుది వేగము \( v_2 = 5 \times 2^{3/2} \) మీ/సె ; \( v_2^2 = 25 \times 8 = 200 \)
పని-శక్తి సిద్ధాంతం నుండి జరిగిన పని \( W = \frac{1}{2}m(v_2^2 - v_1^2) = \frac{1}{2} \times 0.5 \times 200 = 50 \) J
Exam Tips:
a) \( W = \frac{1}{2}m(v_2^2 - v_1^2) \) లో \( v_2^2 = a^2x^3 \) ప్రతిక్షేపించండి.
Question 21: ఒక గాలిమర రెక్కలు A వైశాల్యం ఉన్న వృత్తాన్ని చిమ్ముతున్నాయి. (ఎ) ఈ వృత్తానికి లంబంగా v వేగంతో గాలి ప్రవహిస్తుంటే, దీని ద్వారా t కాలంలో వెళ్ళే గాలి ద్రవ్యరాశి ఎంత ? (బి) గాలి గతిజశక్తి ఎంత ? (సి) గాలిమర, గాలి శక్తిలో 25% శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుందని ఊహించండి. A = 30 m², v = 36 km/h, గాలి సాంద్రత 1.2 kg m⁻³, ఉత్పత్తి అయ్యే విద్యుత్ సామర్థ్యం ఎంత ?
Answer:
ఎ) ఒక సెకనులో వీచిన గాలి ఘనపరిమాణం = Av ; గాలి ద్రవ్యరాశి / సె. = Avρ (ρ = గాలి సాంద్రత)
t సెకనులలో వీచిన గాలి ద్రవ్యరాశి = Avρt
బి) గాలి గతిజశక్తి \( K.E. = \frac{1}{2}mv^2 = \frac{1}{2}(Av\rho t)v^2 = \frac{1}{2}Av^3\rho t \)
సి) ఉత్పత్తి అయిన విద్యుచ్ఛక్తి = దక్షత × గాలి గతిజశక్తి ; దక్షత η = 25%
∴ ఉత్పత్తి అయిన విద్యుచ్ఛక్తి \( = \frac{25}{100} \times \frac{1}{2}Av^3\rho t \)
విద్యుదుత్పాదక యంత్ర సామర్థ్యము
\( P = \frac{\text{ఉత్పత్తి అయిన విద్యుచ్ఛక్తి}}{\text{కాలము}} \)
\( P = \frac{25}{100} \times \frac{\frac{1}{2}Av^3\rho t}{t} \)
దత్తాంశం నుండి A = 30 మీ², v = 36 km/h \( = \frac{36 \times 5}{18} = 10 \) మీ/సె, గాలి సాంద్రత ρ = 1.2 కి.గ్రా/మీ³
∴ \( P = \frac{1}{8} \times 30 \times 10^3 \times 1.2 = 4500 \) వాట్ = 4.5 కి.వాట్
Exam Tips:
a) t సెకన్లలో ద్రవ్యరాశి Avρt; \( P = \frac{1}{2}Av^3\rho \times 0.25 \); km/h ను m/s లోకి మార్చడం (÷3.6).
Question 22: బరువు తగ్గాలనుకొనే వ్యక్తి (dieter) 10 కి.గ్రా. ద్రవ్యరాశిని ప్రతిసారి 0.5 మీ. ఎత్తుకు లేపుతూ వెయ్యిసార్లు పైకి ఎత్తాడు. అతడు ప్రతిసారి ద్రవ్యరాశిని కిందకు దించేటప్పుడు నష్టపోయిన స్థితిజ శక్తి దుర్వ్యయమవుతుందని ఊహించండి.
ఎ) గురుత్వ బలానికి వ్యతిరేకంగా అతడు చేసిన పని ఎంత ?
బి) ప్రతి కిలోగ్రాముకు 3.8 × 10⁷ జౌల్ శక్తిని కొవ్వు అందిస్తుంది. ఇది, 20% దక్షతతో యాంత్రిక శక్తిగా మారుతుంది. బరువు తగ్గాలనుకొనే వ్యక్తి ఎంత కొవ్వును ఉపయోగించినట్లు ?
Answer:
దత్తాంశం నుండి m = 10 కి.గ్రా., h = 0.5 మీ., n = 1000 ; η = 20%
ఎ) గురుత్వ బలానికి వ్యతిరేకంగా జరిగిన పని \( W = n(mgh) = 1000 \times (10 \times 9.8 \times 0.5) = 49000 \) J
బి) 1 కి.గ్రా. కొవ్వు ఇచ్చే యాంత్రిక శక్తి = కొవ్వు అందించిన శక్తి × దక్షత \( = 3.8 \times 10^7 \times \frac{20}{100} = 0.76 \times 10^7 \) J/కి.గ్రా.
వాడిన కొవ్వు \( = \frac{49000}{0.76 \times 10^7} = 6.45 \times 10^{-3} \) కి.గ్రా.
Exam Tips:
a) ఎత్తిన పని n·mgh, కొవ్వు ఇచ్చే ఉపయోగపడే శక్తి = శక్తి × 20%; చివరి సమాధానంలో 10 యొక్క ఘాతాన్ని సరిచూడండి.
Question 23: ఒక కుటుంబం 8 కి.వాట్ విద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది.
ఎ) సౌరశక్తి నేరుగా క్షితిజ సమాంతర తలంపై సగటున ప్రతి చదరపు మీటరుకు 200 వాట్ రేటున పతనమవుతుంది. ఈ శక్తిలో 20% విద్యుత్ శక్తిగా ఉపయోగపడితే, 8 కి.వాట్‌ను సరఫరా చేయడానికి ఎంత పెద్ద వైశాల్యం ఉన్న తలం అవసరమవుతుంది ?
బి) దీన్ని ఒక మాదిరి ఇంటి పై కప్పు వైశాల్యంతో పోల్చండి.
Answer:
ఉపరితల వైశాల్యము A అనుకుంటే దానిపై ప్రతి సెకనుకు పతనం చెందే సౌరశక్తి \( E = 200A \) జౌల్ ; దక్షత = 20%
అవసరమైన విద్యుత్ సామర్థ్యం = 8 కి.వాట్ = 8000 వాట్
ఒక సెకనుకు ఉత్పత్తి అయ్యే ఉపయోగపడే విద్యుత్ శక్తి \( = 200A \times \frac{20}{100} = 40A \) వాట్
అందుబాటులో ఉండవలసిన వైశాల్యము \( A = \frac{\text{కావలసిన విద్యుచ్ఛక్తి}}{40} \)
\( A = \frac{8000}{40} = 200 \) చ.మీ.
బి) ఇది దాదాపు ఒక పెద్ద ఇంటి పై కప్పు వైశాల్యానికి సమానము.
Exam Tips:
a) ఉపయోగపడే విద్యుత్ శక్తి/మీ² = 200 × 20% = 40 W; వైశాల్యం = 8000/40.
Free study material for Physics
Physics Class 11 Curriculum Solutions: Chapter 06 Work, Energy and Power
Textbook Solutions for Class 11 Physics Chapter 06 Work, Energy and Power
Review comprehensive exercise answers for Class 11 Physics Chapter 06 Work, Energy and Power. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 06 Work, Energy and Power concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 06 Work, Energy and Power with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 1st Year Physics Study Material Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం is available for free on StudiesToday.com. These solutions for Class 11 Physics are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Physics Study Material Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Physics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Physics Study Material Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Physics. You can access TS Inter 1st Year Physics Study Material Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Physics Study Material Chapter 6 పని, శక్తి, సామర్ధ్యం in printable PDF format for offline study on any device.