TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం

Download TS Board Solutions for Class 10 Telugu Lesson 06 Bhagyodayam

Explore reliable textbook solutions for Lesson 06 Bhagyodayam tailored for Class 10 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Access TS Board Solutions and Answers

Access the complete solution PDF for Class 10 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

చదవండి – ఆలోచించి చెప్పండి (పాఠ్యపుస్తకం పేజీ 56)

నవభారత రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు, జాతీయతావాది, తత్త్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు డా॥ బి.ఆర్. అంబేద్కర్. దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు. నిమ్న వర్గాలలో ‘అందరిలాగా మనమూ అన్నీ చేయగలం’ అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని లక్ష్యం. దేశప్రజలు అందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. దేశ విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందాడు.

Question 1: పై పేరా ఎవరిని గురించి తెలుపుతున్నది?

Answer:

డా॥ బి.ఆర్. అంబేద్కర్ గురించి తెలుపుతున్నది.

Exam Tips:

a) పేరాలో ఉన్న ‘రాజ్యాంగ నిర్మాత’, ‘దళిత నాయకుడు’ వంటి ఆధారాలతో వ్యక్తిని గుర్తించి, పూర్తి పేరు (డా॥ బి.ఆర్. అంబేద్కర్) రాయండి.
b) ఇలాంటి పేరా ప్రశ్నలకు జవాబు ఎప్పుడూ పేరాలోనే ఉంటుంది; ఊహించి రాయకండి.

 

Question 2: ఆయన ఎవరి గురించి కృషి చేశాడు ? ఎందుకు ?

Answer:

నిమ్న వర్గాల గురించి కృషి చేశాడు. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పటానికి కృషిచేశాడు. ఎందుకంటే వారు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు.

Exam Tips:

a) ప్రశ్నలో ‘ఎవరి గురించి’, ‘ఎందుకు’ అనే రెండు భాగాలు ఉన్నాయి; రెండింటికీ వేరువేరుగా జవాబు రాయండి.
b) ‘ఆత్మవిశ్వాసం’ అనే ముఖ్య పదాన్ని పేరా నుండి తప్పక ఉపయోగించండి.

 

Question 3: మన రాష్ట్రంలో దళితులు, నిమ్నజాతుల వారి కోసం కృషి చేసిన వ్యక్తులు ఎవరు ? వాళ్ళ గురించి చెప్పండి.

Answer:

కృష్ణస్వామి ముదిరాజ్ : తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషిచేశాడు. 1948లో ఉర్దూలో ‘హైదరాబాద్ – కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు.
భాగ్యరెడ్డి వర్మ : దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడటానికి కృషి చేశారు. అలాగే దళితులను ‘ఆది ఆంధ్రులు’గా పిలుచుకోవాలని, దళిత బాలికలను దేవదాసీలుగా, జోగినులుగా చేయడాన్ని వ్యతిరేకించాడు.
జ్యోతిబాఫూలే : 1848వ సంవత్సరంలో పుణేలో బాలికల కోసం ఒక పాఠశాల స్థాపించి, తన భార్య సావిత్రిబాయికి శిక్షణనిచ్చి ఆమెను మొదటి మహిళా ఉపాధ్యాయినిగా చేశాడు. తర్వాత ‘అంటరాని’ కులాల పిల్లల కోసం కూడా పాఠశాలలు నడిపాడు. (జ్యోతిబాఫూలే మహారాష్ట్రకు చెందినవాడు; మన రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ, కృష్ణస్వామి ముదిరాజ్, బి.ఎస్. వెంకటరావు వంటివారు దళితుల కోసం కృషి చేశారు.)

Exam Tips:

a) కనీసం ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల పేర్లు, ఒక్కొక్కరి ఒక ముఖ్యమైన సేవ రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.
b) ‘మన రాష్ట్రం’ అని అడిగారు కాబట్టి భాగ్యరెడ్డి వర్మ, కృష్ణస్వామి ముదిరాజ్ వంటి తెలంగాణ వారికి ప్రాధాన్యం ఇవ్వండి.

 

ఆలోచించండి – చెప్పండి 1 (పాఠ్యపుస్తకం పేజీ 59)

Question 1: కుల వ్యవస్థ వలన, సమాజంలో ఏం జరుగుతున్నది ?

Answer:

కుల వ్యవస్థ వలన ఒక వర్గం వారు అంటరాని వారిగా చూడబడ్డారు. ఒక వర్గం తక్కువ, మరో వర్గం ఎక్కువ అనే భావం ప్రజల్లో ఉండేది. సామాజిక, ఆర్థిక అసమానతలు చోటుచేసుకున్నాయి. కొన్ని కులాల వారు అణగారిన వర్గాలుగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కులవ్యవస్థ వలన సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. ఒకరిపై ఒకరికి స్నేహభావం తగ్గుతోంది.

Exam Tips:

a) అంటరానితనం, హెచ్చుతగ్గుల భావం, సామాజిక–ఆర్థిక అసమానతలు అనే మూడు అంశాలను స్పష్టంగా పేర్కొనండి.
b) చివరలో కులవ్యవస్థ సమాజ ఐక్యతను దెబ్బతీస్తుందని మీ అభిప్రాయం ఒక వాక్యంలో రాయండి.

 

Question 2: చిత్తశుద్ధి, నిజాయితీ అంటే మీకు ఏమి అర్థమయింది ?

Answer:

చిత్తము అంటే మనస్సు. కొంతమంది మనసులో ఇష్టం లేకపోయినా పది మంది మెప్పుకోసం మంచి పనులు చేస్తారు. పేదలకు సహాయం చేస్తారు. పూర్తిగా వారు బాగుపడాలంటే మనసులో ఆ భావాలు బలంగా ఉండాలి. మనసులో బలమైన సంకల్పం కలగాలి. ఆ విధంగా మనసులో బలమైన సంకల్పం కలగడమే చిత్తశుద్ధి అంటారు. అంటే మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకోవడమే చిత్తశుద్ధి అంటారు.
నిజాయితీ : నిజమును అనుసరించి ప్రవర్తించడం అంటే సత్యవర్తన కలిగి ఉండడం. చేసే పనిలో తన స్వార్థం చూసుకోకుండా ఉండడం, చేసే పనిని కచ్చితంగా చేయడం. ఎదురుగా ఒక విధంగా వెనుక ఒక విధంగా ప్రవర్తించకుండా ఉండడం. నిజాయితీగా చేసే ఏ పని అయినా సాధ్యమే.

Exam Tips:

a) రెండు పదాలకు వేరువేరుగా అర్థం చెప్పి, ఒక్కొక్కదానికి చిన్న ఉదాహరణ ఇవ్వండి.
b) చిత్తము = మనస్సు, శుద్ధి = నిర్మలత్వం అని పదవిభాగం చూపిస్తే అర్థం స్పష్టమవుతుంది.

 

Question 3: అజ్ఞానం, ఉదాసీనత వలన నష్టాలేమిటి? చర్చించండి.

Answer:

జ్ఞానం అంటే తెలివి. ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం, ఏదైనా సమస్యను సులువుగా పరిష్కరించగల శక్తిని కూడా జ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే సరిపడ తెలివిలేకపోవడం. ఒక సమస్య యొక్క మూల స్వభావాన్ని తెలుసుకోలేక పోవడం కూడా అజ్ఞానమే. అసలు దానిని సమస్యగా గుర్తించలేకపోవడం కూడా అజ్ఞానమే.
ఉదాసీనత అంటే దేనినీ పట్టించుకోకపోవడం. తమకు ఉపకారం జరుగుతున్నా, అపకారం జరుగుతున్నా పట్టించుకోకపోవడం, మంచికానీ, చెడుకానీ పట్టించుకోకపోవడం కూడా ఉదాసీనతే. తెలిసినా తెలియనట్లు ఉండడం కూడా ఉదాసీనతే.

Exam Tips:

a) మొదట అజ్ఞానం, ఉదాసీనత అంటే ఏమిటో నిర్వచించి, తర్వాత వాటి వల్ల కలిగే నష్టాలను రాయండి.
b) ‘చర్చించండి’ అని అడిగినప్పుడు సమాజంపై వాటి ప్రభావాన్ని (మూఢనమ్మకాలు, దోపిడీ) కూడా చెప్పాలి.

 

ఆలోచించండి – చెప్పండి 2 (పాఠ్యపుస్తకం పేజీ 59)

Question 1: మూఢనమ్మకాలు అంటే మీకేం అర్థమయ్యింది ?

Answer:

శాస్త్రీయత లేకుండా గుడ్డిగా ఆచరించేవి అని అర్థం. అయితే పెరిగిన వాతావరణం, సంప్రదాయాలు, అజ్ఞానం వల్ల మూఢనమ్మకాలు మనిషిని పతనం (పడిపోయేటట్లు) చేస్తున్నాయి.
ఉదా : పిల్లి ఎదురొస్తే వెనుకకు తిరిగి రావటం, భర్త చనిపోయిన స్త్రీ ఎదురైతే అపశకునంగా భావించడం, తుమ్మితే ఆగిపోవటం మొదలగునవి.

Exam Tips:

a) ‘శాస్త్రీయ ఆధారం లేకుండా గుడ్డిగా నమ్మడం’ అనే నిర్వచనం ముందు రాయండి.
b) కనీసం రెండు ఉదాహరణలు ఇస్తే జవాబు బలంగా ఉంటుంది.

 

Question 2: వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు ?

Answer:

మనుష్యులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. మూఢనమ్మకాల వల్ల కలిగే అజ్ఞానాన్ని తొలగించాడు.
అంటరాని వర్గాలు చదువుకునేటట్లు ప్రోత్సహించాడు. తన జాతి జనుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకున్నాడు. నిమ్న వర్గాల్లో తాగుడు అలవాటును మాన్పించాడు.

Exam Tips:

a) ‘మనుషులంతా పుట్టుకతో సమానం’ అన్న వర్మ సందేశాన్ని తప్పక ఉల్లేఖించండి.
b) దేవదాసి, ముర్లీ వ్యవస్థల నిరోధం, తాగుడు మాన్పించడం వంటి నిర్దిష్ట మార్పులు రాయండి.

 

Question 3: మంచివక్త అని ఎవరిని అనవచ్చు ?

Answer:

ప్రతీ విషయాన్ని కూలంకషంగా (విస్తృతంగా, వివరంగా) చెప్పుట, తన అభిప్రాయాన్ని సశాస్త్రీయంగా నిరూపించుట, సమయం, సందర్భం పరిస్థితులనుబట్టి బాగా మాట్లాడేవాణ్ణి మంచి వక్త అని అనవచ్చును. అణగారిన వర్గాలలో చైతన్యాన్ని, సమాజాన్ని ప్రభావితం చెయ్యగలిగేటట్లు ప్రసంగించగలిగితే అతడిని మంచి వక్త అంటారు.

Exam Tips:

a) విషయ పరిజ్ఞానం, సందర్భోచితంగా మాట్లాడటం, శ్రోతలను ప్రభావితం చేయగలగడం – ఈ మూడు లక్షణాలు రాయండి.
b) భాగ్యరెడ్డి వర్మ 3,348 ఉపన్యాసాలు ఇచ్చాడని ఉదాహరణగా చెబితే మంచిది.

 

ఆలోచించండి – చెప్పండి 3 (పాఠ్యపుస్తకం పేజీ 60)

Question 1: చదువుకోవడం వల్ల సమాజం ఏవిధంగా చైతన్యవంతమవుతుంది ?

Answer:

సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం. మంచీ చెడు, కష్టం – సుఖం, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది, జ్ఞానం – అజ్ఞానం తెలియాలంటే తప్పనిసరిగా చైతన్యవంతమైన, జ్ఞానాత్మకమైన చదువును చదువుకోవల్సిందే. ఇంతకంటే వేరొక మార్గమే లేదు.

Exam Tips:

a) ‘సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం’ అన్న పాఠంలోని వాక్యాన్ని ఉపయోగించండి.
b) చదువు వల్ల హక్కులపై అవగాహన, మూఢనమ్మకాల నిర్మూలన జరుగుతాయని వివరించండి.

 

Question 2: నాయకత్వ పటిమను ఏవిధంగా అంచనా వేయవచ్చు?

Answer:

ఒక నాయకుడు, ఒక వ్యక్తి తను చెప్పిన అంశాలు ప్రజామోదం పొందినప్పుడు, అందరినీ మెప్పించగలిగినప్పుడు, అతని పలుకులే (మాటలే) శిరోధార్యమవుతాయి. దానినే నాయకత్వ పటిమ అని అంటారు. పైన చెప్పిన ప్రకారం ప్రజలలో నాయకునికి ఉన్న ఆదరణ బట్టే నాయకత్వ పటిమను మనం అంచనా వేయవచ్చు.

Exam Tips:

a) ప్రజాదరణ, మాటకు ఉన్న విలువ, అనుచరులను ఏకతాటిపై నడపగలగడం – ఇవే నాయకత్వ పటిమకు కొలమానాలని రాయండి.
b) ‘పటిమ’ అంటే నేర్పు, సామర్థ్యం అని అర్థం చెప్పి జవాబు ప్రారంభించండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: నిమ్న వర్గాలలో భాగ్యరెడ్డి వర్మ తెచ్చిన మార్పులు చెప్పండి.

Answer:

1. దళితుల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు.
2. అనేక బహిరంగ సభలు నిర్వహించాడు.
3. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు.
4. తనజాతి జనులను (నిమ్న వర్గాలను) ఏకతాటిపై నడిపాడు.
5. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకున్నాడు.
6. ఆడ, మగ పిల్లలను దేవునికి వదలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు.
7. కులవ్యవస్థ నిర్మూలన కొరకు శ్రమించాడు.
8. మనుషులంతా పుట్టుకతో సమానం అనే భావం కలిగించాడు.
9. చదువుపై శ్రద్ధ కల్గించాడు.
10. సాంఘిక దురాచారాలను నిర్మూలించాడు.
ఈ పై పనుల వల్ల నిమ్న వర్గాలలో సామాజిక భాగస్వామ్యం, స్వయంకృషి, ఆత్మవిశ్వాసం, నిస్వార్థసేవ వంటి మంచి విషయాలలో మార్పులు తీసుకువచ్చాడు.

Exam Tips:

a) మార్పులను సంఖ్యలతో పాయింట్లుగా రాయండి; కనీసం ఐదు అంశాలు ఉండాలి.
b) దేవదాసి, ముర్లీ నిరోధం, తాగుడు మాన్పించడం, విద్యపై శ్రద్ధ – ఈ నిర్దిష్ట అంశాలు తప్పక ఉండాలి.

 

Question 2: భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్ ల మధ్య పోలికలను తెలుపండి.

Answer:

భాగ్యరెడ్డి వర్మఅంబేద్కర్
1) అనేక బహిరంగ సభలు నిర్వహించారు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పారు.1) అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు.
2) జాతీయతావాది.2) జాతీయతావాది.
3) –3) తత్త్వశాస్త్రవేత్త.
4) దళిత నాయకుడు.4) దళిత నాయకుడు.
5) దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకున్నారు.5) దళితుల అభ్యున్నతికి కృషిచేశారు.
6) ఆడ, మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించారు.6) నిమ్న వర్గాలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు.
7) తాగుడును మాన్పించారు.7) దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని తపనపడ్డారు.
8) సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోశారు.8) మహామేధావి.

Exam Tips:

a) పోలికలను రెండు నిలువు వరుసల పట్టిక రూపంలో రాస్తే ఎగ్జామినర్‌కు సులభంగా అర్థమవుతుంది.
b) ఇద్దరూ దళిత నాయకులు, జాతీయతావాదులు అనే సామ్యాన్ని ముందు రాసి తర్వాత ఒక్కొక్కరి ప్రత్యేకతలు రాయండి.

 

Question 3: క్రింది పేరా చదవండి. సరైన జవాబు గుర్తించి కుండలీకరణం (బ్రాకెట్)లో రాయండి.
మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాఫూలె బహు జనుల అభివృద్ధికి విశేషకృషి చేశాడు. దొరల దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశాడు. సత్యశోధక సమాజం ఏర్పాటుచేశాడు. బి.యస్. వెంకటరావు హైదరాబాద్‌లోని ఘాసీమండిలో పుట్టాడు. హైదరాబాదు అంబేద్కర్‌గా ప్రసిద్ధిచెందాడు. హైదరాబాదులో అంబేద్కరిజానికి పాదులు తీసి, దారులు వేశాడు. సమరోత్సాహంతో దళిత ఉద్యమాలను నడిపిన ధీశాలి. హైదరాబాద్‌లో దేవదాసీ దురాచార నిర్మూలనకు, దళితులలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు. 1926 లో ఆదిహిందూ మహాసభను స్థాపించాడు.
అ) జ్యోతిబాఫూలె స్థాపించిన సమాజం పేరు ఏమిటి? ( )
(i) సత్యశోధక సమాజం (ii) సమసమాజం (iii) నవసమాజం
ఆ) పేదలందరికీ అందుబాటులోనికి రావలసింది ( )
(i) డబ్బు (ii) చదువు (iii) న్యాయం
ఇ) దేవదాసీ దురాచార నిర్మూలనకు కృషిచేసింది ( )
(i) జ్యోతిబాఫూలె (ii) అంబేద్కర్ (iii) బి.ఎస్. వెంకటరావు
ఈ) ఆదిహిందూ మహాసభను స్థాపించిన సంవత్సరం ( )
(i) 1936 (ii) 1926 (iii) 1916

Answer:

అ) (i) సత్యశోధక సమాజం
ఆ) (ii) చదువు
ఇ) (iii) బి.ఎస్. వెంకటరావు
ఈ) (ii) 1926

Exam Tips:

a) ప్రతి ప్రశ్నకు జవాబును పేరాలో వెతికి, ఎంపిక అక్షరంతో పాటు జవాబు పదాన్ని కూడా రాయండి.
b) సంవత్సరాలు (1926) వంటి అంకెల ప్రశ్నల్లో పేరాను మళ్ళీ చూసి నిర్ధారించుకోండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత: ఐదేసి వాక్యాల్లో జవాబులు

Question 1: చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.

Answer:

విద్యలేనివాడు వింత పశువు అని పెద్దలు అంటారు. చదవటం, రాయడం, లెక్కలు నేర్చుకోవడమే అక్షరాస్యత. చదువుకుంటే ఎవరిమీదా ఆధారపడకుండా జీవితాన్ని సాగించవచ్చు.
1. విద్య వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది.
2. మంచి కీర్తిని తెచ్చిపెడుతుంది.
3. సుఖ సంతోషాలను (భోగములను) ఇస్తుంది.
4. దొంగలు దొంగిలించలేని విద్య సొంతమైతే అజ్ఞానం పోతుంది.
5. సక్రమ మార్గంలో నడిపిస్తుంది.
6. ఆర్థిక భద్రత, సామాజిక భద్రత కల్పిస్తుంది.
7. విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి.

Exam Tips:

a) ‘ఐదు వాక్యాలు’ అని అడిగారు; ఐదు నుండి ఏడు స్పష్టమైన వాక్యాలు రాయండి, ఎక్కువ పొడిగించకండి.
b) ‘విద్యలేనివాడు వింత పశువు’ వంటి సూక్తితో ప్రారంభిస్తే జవాబు ఆకర్షణీయంగా ఉంటుంది.

 

Question 2: అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి?

Answer:

1. అందరూ విద్యను నేర్చుకోవాలి / నేర్పాలి.
2. నిమ్న వర్గాలు “అందరిలాగా మనమూ అన్నీ చేయగలం” అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
3. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి.
4. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు విలసిల్లాలి (వెల్లివిరియాలి).
5. జాతీయ జీవన స్రవంతిలో అందరూ కలవాలి. కులతత్వం, మతతత్వం, అంటరానితనం రూపుమాసిపోవాలి.
6. మూఢనమ్మకాలను పారద్రోలాలి.
ఇవన్నీ సాధిస్తే అసమానతలు తొలగి సమానత్వం ఏర్పడుతుంది.

Exam Tips:

a) విద్య, సమాన హక్కులు, మూఢనమ్మకాల నిర్మూలన, కులతత్వ నిర్మూలన అనే అంశాలను పాయింట్లుగా రాయండి.
b) చివరి వాక్యంలో ముగింపు (ఇవి సాధిస్తే సమానత్వం వస్తుంది) తప్పక రాయండి.

 

Question 3: అంకితభావంతో పనిచేయడం అంటే ఏమిటి?

Answer:

ఒక లక్ష్యం కోసం దీక్షతో పనిచేయడాన్ని అంకితభావంతో పనిచేయడం అంటారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. లక్ష్య సాధన దిశగా మన పని మనం చేసుకుంటూ పోవాలి.
డా॥ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మాగాంధీ లాంటి వారు అంకితభావంతో కృషి చేయడం వల్లనే సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయి.
సమాజాభివృద్ధికి కృషి చేయాలనుకునే నాయకులకు అంకితభావం, చిత్తశుద్ధి, నిజాయితీ అవసరం.

Exam Tips:

a) మొదట నిర్వచనం, తర్వాత అంబేద్కర్/గాంధీజీ వంటి ఉదాహరణ ఇవ్వండి.
b) అంకితభావంతో పాటు చిత్తశుద్ధి, నిజాయితీ అనే పాఠంలోని పదాలను ఉపయోగించండి.

 

Question 4: వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి?
(లేదా)
దుర్వ్యసనాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి?

Answer:

వ్యసనం అంటే అలవాటు. అది మంచి అలవాటు అయితే సద్వ్యసనం అంటారు. చెడు అలవాటైతే దుర్వ్యసనం అంటారు. సాధారణంగా ‘వ్యసనం’ అనే మాటను “చెడు అలవాటు” అనే అర్థంలోనే ఉపయోగిస్తాము.
1. మనిషి జీవనం పతనమవుతుంది.
2. చెదపురుగు వృక్షాన్ని నాశనం చేసినట్లు వ్యసనాలు మనిషిని సమూలంగా నాశనం చేస్తాయి.
3. జూదం అనే వ్యసనం వల్లనే కదా ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.
4. వ్యసనాల వల్ల మనిషి తన ఉనికిని కోల్పోతాడు.
5. త్రాగుడు (మద్యపానం), జూదం, వ్యభిచారం, లంచగొండితనం మొదలైనవి సమాజంలో వ్యసనాలుగా చెప్పవచ్చు.
6. వ్యక్తి నాశనమే కాక సమాజానికి హాని జరుగుతుంది.
7. సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతాడు.

Exam Tips:

a) సద్వ్యసనం, దుర్వ్యసనం మధ్య తేడాను మొదటి వాక్యాల్లో చెప్పండి.
b) ధర్మరాజు జూదం వంటి పురాణ ఉదాహరణ ఇస్తే జవాబుకు బలం వస్తుంది; వ్యక్తికీ సమాజానికీ కలిగే నష్టాలను వేరువేరుగా చెప్పండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత: పది వాక్యాల్లో జవాబులు

Question 1: మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారద్రోలడానికి మీరు ఏం చేయగలరు?
(లేదా)
మీ పరిసరాల్లో మీకు కన్పించే మూఢనమ్మకాల నిర్మూలనకు ఎలాంటి చర్యలను తీసుకుంటారు?

Answer:

మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నాయి. వాటిని పారద్రోలడానికి నేను చేసే పనులను వివరిస్తాను.
1. ముందుగా నిరక్షరాస్యులకు విద్య నేర్పుతాను.
2. వయోజనులకు మంచిగా నచ్చచెపుతాను.
3. స్వచ్ఛత, స్వేచ్ఛ, సమానత్వం గురించి వివరించి చెపుతాను. అప్పటికీ మార్పు రాకపోతే సామాజిక సేవా కార్యకర్తలు, సంస్కర్తలచే చెప్పిస్తాను.
4. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను చిన్నచిన్న నాటికల ద్వారా మా వాడలో ప్రదర్శిస్తాను.
5. మూఢనమ్మకాలను పారద్రోలటానికి ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తాను.
6. మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను కరపత్రాల ద్వారా, మౌఖికంగా వివరిస్తాను.
7. వయోజనులతో సత్సంబంధాలను కలిగి, వారికి నచ్చచెప్పి మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తాను.
8. నా మిత్ర బృందంతో కలిసి వారి జీవితాలలో మార్పు కొరకు కృషిచేస్తాను.

Exam Tips:

a) ‘నేను ఏం చేస్తాను’ అనే ఉత్తమ పురుషలో, కార్యాచరణ ప్రణాళికలాగా పాయింట్లుగా రాయండి.
b) కనీసం పది వాక్యాలు ఉండాలి; నాటికలు, ర్యాలీలు, కరపత్రాలు వంటి నిర్దిష్ట చర్యలు చెప్పండి.

 

Question 2: భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువుల కోసం చేసిన కృషిని వివరించండి.
(లేదా)
ఆదిహిందువుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషిని సొంత మాటల్లో వ్రాయండి.

Answer:

ఆదిహిందువుల మేలుకోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగొని వారు ఆదిహిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డివర్మ నిరంతర కార్యాచరణ, సభల వలన ఆదిహిందూ సమాజం జాగరూకమయ్యింది. ఆదిహిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి దాని బాధ్యతను గుర్తించేలా చేశాడు.
ఆయన కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆదిహిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆదిహిందువులుగా నమోదు చేయించాడు. మానవులలో ఎక్కువ, తక్కువలు లేవని ఆదిహిందువులు తెలుసుకొనేలా చేశాడు.
3,348 ఉపన్యాసాలు ఇచ్చి ఆదిహిందువులను చైతన్యపరిచాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలె. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు, పేలికలు కాకుండా రక్షించగలిగాడు.

Exam Tips:

a) 1931 జనాభా లెక్కల్లో ‘ఆదిహిందువులు’గా నమోదు, 3,348 ఉపన్యాసాలు – ఈ రెండు వాస్తవాలు తప్పక రాయండి.
b) విద్యకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు అనే అంశాలను కూడా చేర్చండి.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత: సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయడం

Question 1: భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా! ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా “అభినందన” వ్యాసం రాయండి.

Answer:

మలాలా యూసుఫ్ జాయ్
మలాలా యూసుఫ్ జాయ్ ఈ తరం బాలికల నూతన స్ఫూర్తికి ప్రతినిధి. మలాలా పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలోని మింగోరా పట్టణంలో 12 జూలై, 1997న జన్మించింది. చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఆసక్తిగల మలాలా తమ ప్రాంతంలోని ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడింది. అక్కడ ఆధిపత్యం వహిస్తున్న తాలిబాన్ ఛాందసవాదులు బాలికలు పాఠశాలకు వెళ్ళడం, చదువుకోవడంపై నిషేధం విధించారు. మలాలా ఏ మాత్రం భయపడకుండా చదువుకుంటూనే తన తోటి బాలికలకు చదువుపై ఆసక్తిని పెంచి పాఠశాలకు వెళ్ళేటట్లుగా ప్రోత్సహించింది.
దీంతో ఆగ్రహించిన తాలిబాన్లు మలాలాపై 9 అక్టోబర్, 2012న కాల్పులు జరిపారు. ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మలాలాపై సానుభూతి వెల్లువెత్తింది. అందరూ ఆమె కోలుకోవాలని కోరుకున్నారు.
ఆమె ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చింది. మలాలా చైతన్యానికి, సాహసానికి, ఆత్మస్థైర్యానికి ముగ్ధులైన ఐక్యరాజ్య సమితి ఆమె జన్మదినాన్ని (జూలై 12ను) ‘మలాలా రోజు’ (Malala Day)గా ప్రకటించింది. ప్రతీ బాలిక చదువుకోవడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మలాలాకు 2013లో ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్’ లభించింది. 2014లో 17 ఏళ్ళ వయస్సులోనే నోబెల్ శాంతి బహుమతి పొంది, ఆ బహుమతి పొందిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.
ఈ విధంగా తన ప్రాణాలను లెక్కచేయకుండా మలాలా యూసుఫ్ జాయ్ ఛాందసవాదులను ధైర్యంగా ఎదుర్కొంది. ఇది నాకు స్ఫూర్తినిచ్చిన అంశం. ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు.

Exam Tips:

a) అభినందన వ్యాసంలో వ్యక్తి పరిచయం, చేసిన సేవ, ఎదుర్కొన్న కష్టాలు, పొందిన గుర్తింపు, మీ అభినందన – ఈ క్రమంలో రాయండి.
b) తేదీలు, పురస్కారాలు సరిగా రాయండి; చివరలో ‘నా హృదయపూర్వక అభినందనలు’ అనే వాక్యంతో ముగించండి.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: క్రింది పదాలకు పర్యాయపదాలను రాయండి.
అ) అండ ఆ) ఉన్నతి ఇ) స్వేచ్ఛ ఈ) వికాసం

Answer:

అ) అండ = ఆసరా, తోడు, ఆలంబనం, ఆశ్రయం
ఆ) ఉన్నతి = వికాసం, అభివృద్ధి, ప్రగతి, ప్రవృద్ధి, ఘనత
ఇ) స్వేచ్ఛ = స్వతంత్రత, స్వాతంత్ర్యం, స్వాధీనత
ఈ) వికాసం = వికసనము, అభివృద్ధి, ప్రగతి, ఉన్నతి

Exam Tips:

a) ప్రతి పదానికి కనీసం రెండు పర్యాయపదాలు రాయండి.
b) ‘విచ్చలవిడి’ వంటి వ్యతిరేక భావం ఉన్న పదాలను పర్యాయపదంగా రాయకండి.

 

Question 2: క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) ఏకతాటిపై ఆ) మచ్చుతునక ఇ) మహమ్మారి ఈ) నిరంతరం

Answer:

అ) ఏకతాటిపై (ఒకే మాటమీద నిలబెట్టడం) : గాంధీజీ స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నిలిపారు.
ఆ) మచ్చుతునక (ఉదాహరణ) : ఆమ్లవర్షాలు పడటం పర్యావరణం దెబ్బతినడానికి ఒక మచ్చుతునక.
ఇ) మహమ్మారి (పెద్ద అంటువ్యాధి / తీవ్రమైన కీడు) : నేడు సమాజంలో అవినీతి అనే మహమ్మారి ఎక్కువయింది.
ఈ) నిరంతరం (ఎల్లప్పుడు) : విద్యార్థులు నిరంతరం అధ్యయనంపై దృష్టి పెట్టాలి.

Exam Tips:

a) వాక్యంలో ఇచ్చిన పదం అర్థం స్పష్టంగా తెలిసేలా సందర్భం ఉండాలి.
b) పదాన్ని మార్చకుండా అలాగే వాడండి; వాక్యం పూర్తిగా, వ్యాకరణ దోషాలు లేకుండా రాయండి.

 

Question 3: క్రింది పదాలు / పదబంధాలను వివరించి రాయండి.
అ) అంకితం కావడం ఆ) నైతిక మద్దతు ఇ) చిత్తశుద్ధి ఈ) సాంఘిక దురాచారాలు ఉ) సొంతకాళ్ళపై నిలబడడం

Answer:

అ) అంకితం కావడం : ఒక పనిని శ్రద్ధగా, ఇచ్చిన పనిని త్రికరణశుద్ధిగా చేయడం అని అర్థం. మహాత్మాగాంధీ జాతి స్వాతంత్ర్యం కోసం అంకితమయ్యారు.
ఆ) నైతిక మద్దతు : నీతిని, మంచిని సమర్థించడం. ఒక మంచి పనికి నైతిక మద్దతు చాలా అవసరం. అది లేనిదే విజయం లభించదు. సంఘసంస్కర్తలకు మనం నైతిక మద్దతు ఇవ్వాలి.
ఇ) చిత్తశుద్ధి : మనస్ఫూర్తిగా, మనసులో దోషం లేకుండా పనిచేయడం. “చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనా కొదువ కాదు” అని వేమన చెప్పాడు. చిత్తశుద్ధి లేకుండా చేసిన పని ఫలించదు.
ఈ) సాంఘిక దురాచారాలు : సంఘంలోని చెడ్డ ఆచారాలు. సాంఘిక దురాచారాలు ప్రగతికి ఆటంకం కలిగిస్తాయి. వాటిని రూపుమాపటానికి ఎందరో సంస్కర్తలు నడుం బిగించారు.
ఉ) సొంతకాళ్ళపై నిలబడడం : ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడం. శ్రమించి సంపాదించి తన కాళ్ళపై తాను నిలబడి జీవించడమే గౌరవప్రదం.

Exam Tips:

a) మొదట పదబంధం అర్థం చెప్పి, తర్వాత దానిని వాడిన ఒక ఉదాహరణ వాక్యం రాయండి.
b) పాఠం సందర్భానికి (భాగ్యరెడ్డి వర్మ కృషి) అన్వయిస్తే అదనపు విలువ ఉంటుంది.

 

III. భాషాంశాలు – వ్యాకరణాంశాలు (ప్రత్యక్ష, పరోక్ష కథనాలు)

Question 1: పాఠంలోని పరోక్ష కథన వాక్యాలను గుర్తించండి. వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి.

Answer:

1. పరోక్ష కథనం : తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలనని ఆయన అన్నారు.
ప్రత్యక్ష కథనం : “నా జాతి జనులను ఏకతాటిపై నడుపగలను” అని ఆయన అన్నారు.
2. పరోక్ష కథనం : ఆదిహిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.
ప్రత్యక్ష కథనం : “ఆదిహిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గము” అని భాగ్యరెడ్డి వర్మ అన్నారు.

Exam Tips:

a) ప్రత్యక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు (“ ”) తప్పక పెట్టాలి; పరోక్ష కథనంలో వాటిని తీసి ‘అని’ చేర్చాలి.
b) తాను/తన/తాము (ప్రథమ పురుష) ప్రత్యక్ష కథనంలో నేను/నా/మేము (ఉత్తమ పురుష)గా మారుతాయి – ఇదే సాధారణంగా వచ్చే తప్పు.

 

ప్రాజెక్టు పని

Question 1: బడుగు వర్గాల కోసం కృషిచేసిన జ్యోతిబాఫూలె, అంబేద్కర్, సావిత్రీబాయి ఫూలె జీవితాల్లోని ఏదైనా ముఖ్యమైన ఘట్టాన్ని మీ మాటల్లో రాయండి. నివేదిక రాసి తరగతిలో చదివి వినిపించండి.

Answer:

జ్యోతిబాఫూలె జీవితంలోని ముఖ్యమైన ఘటన:
ఒకరోజు రాత్రి ఇద్దరు మనుషులు జ్యోతిబాఫూలెను చంపడానికి వచ్చారు. సావిత్రిబాయి ఫూలె వాళ్ళకు, జ్యోతిబాకు మధ్యలో నిలబడింది. ‘అన్నలారా – ఆగండి, దయచేసి వెళ్ళిపొండి’ అని వారిని భయంతో ప్రార్థించింది. వాళ్ళలో ఒకడు “మేం ఆగటానికి రాలేదు” అని సావిత్రిపై గర్జించాడు. “అయితే మీరిక్కడకు ఎందుకొచ్చారు?” అని జ్యోతిబా నెమ్మదిగా అడిగాడు. “కొందరు పెద్దలు నిన్ను చంపే కాంట్రాక్టు మాకిచ్చారు. నువ్వు ఈ బడులు నడపటం, ఈ వ్యవహారమంతా మానేస్తేగాని సంఘం బాగుపడదని వాళ్ళు చెప్పారు” అని వాళ్ళు అన్నారు. తన చావు వాళ్ళకు లాభం అయితే చంపమని, బీదవాళ్ళకు సాయం చేయడమే తన జీవితాశయం అని జ్యోతిబా మెడవంచి శాంతంగా చావుకు సిద్ధమయ్యాడు.
ఆ ఇద్దరు మనుషులు గొడ్డళ్ళు క్రింద పారేసి, జ్యోతిబా కాళ్ళమీద పడ్డారు. “మేం మిమ్మల్ని చంపం. మీరు మాకు తండ్రి లాంటివారు. ఇప్పుడే వెళ్ళి మమ్మల్ని పంపిన వాళ్ళని చంపివస్తాం” అని అనగానే జ్యోతిబా వాళ్ళను ఆపి, వాళ్ళ ఆలోచన మారే దాకా వాళ్ళతో మాట్లాడాడు. ఆ ఇద్దరు హంతకుల పేర్లు రోడే, ధోండిరామ్ నామ్‌దేవ్ కుంభార్.
వాళ్ళు ఇద్దరూ రాత్రి బడిలో చేరారు. తర్వాత రోడే జ్యోతిబాకు అంగరక్షకుడు (బాడీగార్డ్) అయ్యాడు. కుంభార్ ‘వేదాచార్’ అనే పుస్తకం వ్రాసి ఫూలే దంపతులకు సహకరించాడు. చంపటానికి వచ్చిన వాళ్ళ హృదయం కూడా ఆ విధంగా పరివర్తన చెందిందంటే ఫూలే వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుస్తోంది.
అంబేద్కర్ జీవితంలో ముఖ్యఘటన:
1932లో బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు ద్వారా అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. దీనిని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఎరవాడ జైలులో నిరాహార దీక్ష చేపట్టారు. అప్పుడు అంబేద్కర్ గాంధీజీతో పూనా ఒడంబడిక (1932) చేసుకున్నారు. దాని ప్రకారం ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా ఉమ్మడి నియోజకవర్గాలలోనే అణగారిన వర్గాలకు రిజర్వు స్థానాలు కేటాయించబడ్డాయి.
అంబేద్కర్ సాంఘిక దురాచారాలకు లొంగక వాటిని ఎదిరిస్తూ జీవితమంతా ఏటికి ఎదురీదాడు.

Exam Tips:

a) నివేదికలో వ్యక్తి పేరు, సంఘటన, సంవత్సరం, దాని ప్రాముఖ్యం స్పష్టంగా ఉండాలి.
b) పూనా ఒడంబడిక (1932) వంటి చారిత్రక తేదీలను సరిగా రాయండి.

 

Free study material for Telugu

Telugu Class 10 Curriculum Solutions: Lesson 06 Bhagyodayam

Textbook Solutions for Class 10 Telugu Lesson 06 Bhagyodayam

Access structured TS Board textbook solutions for Lesson 06 Bhagyodayam. Designed in alignment with the latest academic curriculum for Class 10 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 06 Bhagyodayam concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Telugu.

FAQs

Where can I find the latest TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం for the 2026-27 session?

The complete and updated TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం will help students to get full marks in the theory paper.

Do you offer TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire TS 10th Class Telugu Guide 6th Lesson భాగ్యోదయం in printable PDF format for offline study on any device.