TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట

Official TS Board Solutions for Class 10 Telugu: Lesson 04 Kotta Bata (The New Path)

Review structured textbook solutions for Class 10 Telugu Lesson 04 Kotta Bata (The New Path). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Chapter-wise Solutions for Telugu: Lesson 04 Kotta Bata (The New Path)

Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

చదవండి – ఆలోచించి చెప్పండి (T.B. P.No. 36)

మార్కెట్టుకు వెళ్ళే మార్గం పక్కన ఇళ్ళున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మింపబడ్డాయి. గోడలకు వెల్లవేసి ఉన్నది. వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ళు మట్టితో నిర్మింపబడ్డాయి. ఆ ఇళ్ళకు చిరిగిన తాటియాకుల కప్పు ఉన్నది. చిన్న, పెద్ద ఇళ్ళలోను, పేదల, ధనికుల ఇళ్ళలోను, అన్ని ఇళ్ళలోను ప్రవేశద్వారం ప్రక్క కుండీలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు, ఊరకుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ, ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు.

Question 1: పై పేరాలో దేనిని గురించి ఉన్నది ?

Answer:

పై పేరాలో మార్కెట్టుకు వెళ్ళే దారి పక్కన ఉన్న ఒక పల్లెటూరి వీధి గురించి ఉన్నది. అక్కడి గట్టి ఇళ్ళు, మట్టి ఇళ్ళు, పేదల, ధనికుల ఇళ్ళు, ఇంటి ముందు తులసి మొక్కలు, దుమ్ములో ఆడుకునే పిల్లలు, సందులో నీళ్ళు పోసే స్త్రీలు – ఇలా ఆ ప్రాంతపు వాతావరణం వర్ణించబడింది.

Exam Tips:

a) పేరాలోని ముఖ్య అంశాలు – రెండు రకాల ఇళ్ళు, తులసి మొక్క, దుమ్ములో ఆడే పిల్లలు – ప్రస్తావిస్తూ ఒకటి రెండు వాక్యాలలో జవాబు రాయండి.
b) ‘దేని గురించి’ అనే ప్రశ్నకు ముందుగా ప్రధాన విషయం (పల్లెటూరి వీధి వాతావరణం) ఒక్క వాక్యంలో చెప్పండి.

 

Question 2: ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది ?

Answer:

ఇటువంటి వాతావరణం పల్లెటూళ్ళలో (గ్రామాల్లో), చిన్న పట్టణాల శివారు ప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ మట్టి ఇళ్ళు, గట్టి ఇళ్ళు పక్కపక్కనే ఉంటాయి. సందులు సరిగా లేక అపరిశుభ్రంగా కూడా ఉంటాయి.

Exam Tips:

a) పేరాలోని ఆధారాలు (మట్టి ఇళ్ళు, తాటియాకుల కప్పు, సందులో పోసే నీళ్ళు) చూపిస్తూ ప్రాంతాన్ని గుర్తించండి.
b) ఊహాత్మక ప్రశ్న కాబట్టి మీ అభిప్రాయానికి ఒక కారణం తప్పక రాయండి.

 

Question 3: మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి.

Answer:

నేను చూసిన పల్లె రామాపురం. పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంది.
స్వచ్ఛమైన పైరు గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఊరి పక్కన గలగల పారే సెలయేరు నా మనస్సును ఆకట్టుకుంది. కల్మషం లేని పల్లె ప్రజల శ్రమ జీవన సౌందర్యం ఆదర్శనీయం.

Exam Tips:

a) మీరు చూసిన ఒక పల్లె పేరు చెప్పి, పొలాలు, సెలయేరు, ప్రజల జీవనం వంటి అంశాలను క్రమంగా వర్ణించండి.
b) వర్ణనాత్మక పదాలు (పచ్చని, కళకళలాడే, గలగల) వాడితే జవాబు ఆకర్షణీయంగా ఉంటుంది.

 

Question 4: పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏయే మార్పులు చోటుచేసుకున్నాయి ?

Answer:

ఆనాడు పల్లెలు దరిద్రానికి, అనారోగ్యానికి, అవిద్యకు ప్రతిరూపాలుగా ఉండేవి. ఇప్పుడు పల్లెల్లో కూడా సౌభాగ్యం ఉంది. ప్రతి ఇంటికీ విద్యుత్తు, టీవీ ఉన్నాయి. ఇంచుమించు చాలామందికి మోటారు బైకులున్నాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బాగా చదువుకొంటున్నారు. కొన్ని విషయాలలో మాత్రం ఇంకా కొంత వెనుకబడి ఉన్నారు.

Exam Tips:

a) ‘నాడు – నేడు’ అని రెండు భాగాలుగా విభజించి పోల్చి రాయండి.
b) విద్యుత్తు, విద్య, ఆరోగ్యం, వాహనాలు వంటి స్పష్టమైన మార్పులను ఉదాహరణలుగా పేర్కొనండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 39)

నేను రాన్రా తమ్ముడు! ………….. గండ్లవడ్తనె ఉంది.

Question 1: “సెవ్వు మీద పేను వార్తెనా?” అంటే మీకేమి అర్థమైంది ?

Answer:

‘పేను’ తలలో ఉంటుంది. పేను పాకుతుంటే దురద పెడుతుంది. అందుచేత అది పాకుతున్నట్లు వెంటనే తెలుస్తుంది. అంటే చెవి మీద పేను పాకితే తెలుస్తుంది. కాని, అక్క చెప్పే మాటలను తమ్ముడు అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే కనీసం చెవి మీద పేను పాకినట్లు కూడా లేదతనికి. ఇంక ఆ మాటలు చెవిలోకి వెళ్ళే అవకాశం లేదు. వాటి గురించి ఆలోచించే ప్రశ్నే లేదు. అందుచేత అక్క చెప్పే మాటలను తమ్ముడు కనీసం పట్టించుకోవట్లేదని అర్థమయింది.

Exam Tips:

a) ఇది జాతీయం; ‘ఏ మాత్రం పట్టించుకోకపోవడం’ అనే అర్థాన్ని స్పష్టంగా రాయండి.
b) పాఠంలో అక్క మాటలను తమ్ముడు వినని సందర్భంతో జతచేసి వివరించండి.

 

Question 2: మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా ? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి.

Answer:

మేము ఎప్పుడైనా దగ్గర్లో ఉన్న చోట్లకు నడుచుకొంటూనే పోతాము. పోయేటప్పుడు గోడలపై రాతలు, సినిమా పోస్టర్లు మొదలైనవి గమనిస్తాం. దారి పక్కన చెట్లు, పక్షులు, జంతువులు, వాహనాలు, ఇళ్ళను చూస్తాం.

Exam Tips:

a) మీ స్వంత అనుభవంగా ‘మేము… గమనిస్తాం’ అని ఉత్తమ పురుషలో రాయండి.
b) చూసే విషయాలను (చెట్లు, పక్షులు, గోడలపై రాతలు, వాహనాలు) జాబితాగా చెప్పండి.

 

Question 3: మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి.

Answer:

మా ఊరి పొలిమేర పచ్చని పంటపొలాలతో, పచ్చని చేలతో, పంట కాలువలతో, వాగులూ వంకలతో, పక్షుల కిలకిలారావాలతో ప్రకృతి రమణీయంగా, చూడముచ్చటగా ఉంటుంది.

Exam Tips:

a) పొలాలు, కాలువలు, వాగులు, పక్షులు వంటి ప్రకృతి అంశాలను కలిపి వర్ణించండి.
b) ‘పొలిమేర’ అంటే ఊరి చివర హద్దు అని గుర్తుంచుకోండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 40)

మరి! మా తిక్క సన్నాసి…………. సంబురాన ముందుకు సాగిన

Question 1: “తన కాళ్ళమీద తను నిలబడటం” అంటే ఏమిటి ? చర్చించండి.

Answer:

తన కాళ్ళమీద తను నిలబడటం అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా తిండికి, బట్టకూ లోటు లేకుండా స్వశక్తితో సంపాదించుకోవడం. అంటే తన ప్రతిభకు తగిన ఉపాధిని పొందుతూ స్వతంత్రంగా జీవనాన్ని సాగించటం.

Exam Tips:

a) ‘ఇతరుల మీద ఆధారపడకుండా స్వశక్తితో బతకడం’ అనే అర్థం తప్పక రాయండి.
b) పాఠంలో అక్క తమ్మునికి చెప్పిన స్వతంత్ర జీవన సందేశంతో అనుసంధానించండి.

 

Question 2: నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా ?

Answer:

ఉన్నాయి. పూర్వం పెండ్లిళ్లు, పండుగలు మొదలైనవి వస్తే అందరూ కలిసి పనులు చేసుకొనేవారు. సాయంత్రం అందరూ కూర్చొని మాట్లాడుకొనేవారు. ఏ వ్యవహారంలోనూ మోసం, దగా ఉండేవి కావు. ఆడంబరాలు లేవు.
ఈనాడు ఆడంబరాలు ఎక్కువ. మోసం చేసే లక్షణాలు పెరిగిపోయాయి. ఎవరింట్లో వాళ్ళు టీవీలు చూస్తూ గడుపుతున్నారు. పిలిచినా పెళ్ళిళ్ళకు, పండుగలకు వచ్చేవారు తగ్గిపోయారు. వచ్చినా ఒక పూటకు మించి ఎవ్వరూ ఉండటం లేదు.

Exam Tips:

a) ‘ఉన్నాయి’ అని ముందు స్పష్టంగా చెప్పి, తర్వాత నాడు, నేడు అని రెండు పేరాలుగా రాయండి.
b) పెళ్ళిళ్ళు, పండుగలు, కలిసి జీవించడం వంటి ఉదాహరణలతో పోల్చండి.

 

Question 3: మీ ఊర్లో రచ్చబండ / గ్రామ సచివాలయం ఉన్నదా ? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడతారు ?

Answer:

మా ఊర్లో ఒకప్పుడు రచ్చబండ ఉండేదట. ఇప్పుడు గ్రామ సచివాలయం ఉంది. అక్కడ గ్రామ సర్పంచ్, పంచాయితీ వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించి ప్రణాళికలు రూపొందిస్తారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అక్కడ చెప్పుకుంటారు.

Exam Tips:

a) రచ్చబండ (పాత వ్యవస్థ), గ్రామ సచివాలయం (నేటి వ్యవస్థ) రెండింటినీ ప్రస్తావించండి.
b) అక్కడ ఎవరు (సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజలు) ఏ విషయాలు (అభివృద్ధి, సమస్యలు) చర్చిస్తారో విడిగా రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 41)

బండి సాగిపోతనే ఉండది ……… అడుక్కు తిండ్లు లేవు.

Question 1: ‘కడ్పుల ఇసం నాల్కెన తీపి’ అంటే మీరేం అర్థం చేసుకున్నారు?

Answer:

కడ్పుల ఇసం నాల్కెన తీపి అంటే కడుపులో విషం, నాలుక చివర తీపి. మనసులో అన్నీ చెడు ఆలోచనలు, విషపూరితమైన భావాలు ఉన్నా పైకి మాత్రం తియ్యగా మాట్లాడడం. కొంతమందికి లోపల చాలా కోపం ఉంటుంది. ఉదాహరణకు ధృతరాష్ట్రుడికి భీముడంటే చాలా కోపం. భీముడు చచ్చిపోవాలని నిరంతరం కోరుకొనేవాడు. కాని, ఎదురుపడితే మాత్రం “నాయనా ! భీమసేనా ! అన్నం తిన్నావా బాబూ ?” అంటూ ప్రేమగా అమృతం కురిపిస్తూ మాట్లాడేవాడు. అందుచేత ధృతరాష్ట్రుడి వంటి వారికి కడ్పుల ఇసం నాల్కెన తీపి ఉంటుంది.

Exam Tips:

a) మాండలిక పదాలకు ప్రామాణిక రూపం (కడ్పుల = కడుపులో, ఇసం = విషం, నాల్కెన = నాలుకపై) రాసి అర్థం వివరించండి.
b) ‘పైకి తియ్యగా మాట్లాడుతూ లోపల ద్వేషం’ అనే భావానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.

 

Question 2: పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి ? పంచాయితీలను ఎట్లా జరుపుతారు ?

Answer:

పంచాయితీలు చెప్పడం అంటే న్యాయం చెప్పడం, తగవులు తీర్చడం అని అర్థం. ఒకరు, ఇద్దరు పెద్దలు రచ్చబండపై కూర్చొని ఫిర్యాదీదారుడిని, ఇతర వ్యక్తులను వేర్వేరుగా పిలిచి మాట్లాడి పరిష్కారం చూపుతారు. దొంగతనాలు, తగవులు మొదలైనవి ఇలా పరిష్కరింపబడతాయి.
పంచాయితీని గ్రామ సచివాలయం లేదా రచ్చబండ లేదా ఒక పెద్దమనిషి ఇంట్లో నిర్వహిస్తారు. పంచాయితీకి గ్రామపెద్దలంతా వస్తారు.

Exam Tips:

a) ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయి – అర్థం, నిర్వహించే విధానం; రెండింటికీ విడిగా జవాబు రాయండి.
b) ఎక్కడ (రచ్చబండ, సచివాలయం), ఎవరు (గ్రామపెద్దలు) జరుపుతారో తప్పక పేర్కొనండి.

 

Question 3: “కళదప్పిన ఇల్లు” ఎట్లా ఉంటుంది ?

Answer:

కళదప్పిన ఇల్లు అనగా జీవం లేని ఇల్లు. దానిలో జీవకళ ఉండదు. ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. నిత్యం కష్టాలమయంగా, పాడుబడినట్లుగా ఉంటుంది.

Exam Tips:

a) ‘కళ తప్పిన’ అంటే కాంతి, సంతోషం లేని అని అర్థం; దాన్ని ఇంటికి అన్వయించి రాయండి.
b) సుఖసంతోషాలు లేని, పాడుబడిన ఇల్లు అనే భావాన్ని స్పష్టంగా చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి (T.B. P.No. 42)

బండి మా ఇంటి దిక్కు మూలమల్పు ……….. నల్గురు నడిసిందె బాట.

Question 1: రాత్రిబడి అంటే ఏమిటి ? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు ?

Answer:

పగలంతా పొలం పనులు, ఇతర పనులు చేసుకొని, రాత్రిపూట చదువుకోవాలనుకునే వారికి ప్రభుత్వం కల్పించిన సదుపాయమే రాత్రి బడి. రాత్రి బళ్ళను ప్రతి ఊరిలో నిర్వహిస్తారు. వ్యవసాయదారులకు, నిరక్షరాస్యులకు విద్యను నేర్పి, వారి వారి వృత్తులలో నైపుణ్యం పొందటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Exam Tips:

a) రాత్రిబడి నిర్వచనం, దాని ఉద్దేశం అని రెండు భాగాలుగా జవాబు రాయండి.
b) పగలు పనిచేసే వ్యవసాయదారులు, నిరక్షరాస్యులకు ఉపయోగం అని ప్రత్యేకంగా పేర్కొనండి.

 

Question 2: “నల్గురు నడిసిందె బాట”లోని అంతరార్థం ఏమిటి ? చర్చించండి.

Answer:

“పదుగురాడు మాట పాడియై ధరఁజెల్లు” అని వేమన ఎప్పుడో చెప్పాడు. అట్లే నలుగురు నడిచినదే బాట. ఒక్కడి మార్గాన్ని ఎవరూ అనుసరించరు; ఎక్కువమంది అంగీకరించి అనుసరించిన పద్ధతే చివరకు అందరికీ దారి (ఆచారం) అవుతుందని దీని అర్థం. ఊరి ప్రజలంతా కలిసి పాత దురాచారాలను వదిలి నడిచిన కొత్త దారే ‘కొత్తబాట’ అయింది.

Exam Tips:

a) వేమన పద్యపాదం వంటి సూక్తిని ఉదహరిస్తే జవాబు బలంగా ఉంటుంది.
b) ‘ఎక్కువమంది అనుసరించినదే ఆచారం అవుతుంది’ అనే అంతరార్థాన్ని కథలోని కొత్తబాటతో జతచేయండి.

 

Question 3: మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల రూపురేఖలు, వేషధారణ ఎట్లా ఉంటాయి?

Answer:

మా పరిసర ప్రాంతంలో పిల్లలు పరిశుభ్రంగా, దృఢంగా ఉంటారు. ఉన్నంతలో పరిశుభ్రమైన దుస్తులు ధరిస్తారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం, క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

Exam Tips:

a) పిల్లల రూపురేఖలు (ఆరోగ్యం), వేషధారణ (దుస్తులు) రెండింటి గురించీ రాయండి.
b) మీ పరిసరాల గురించి కాబట్టి ‘మా ప్రాంతంలో’ అని స్వంత పరిశీలనగా రాయండి.

 

ఇవి చేయండి – I. అవగాహన – ప్రతిస్పందన

Question 1: ఈ కథకు ‘కొత్తబాట’ అనే పేరు తగినదని భావిస్తున్నారా ? ఎందుకు ? చర్చించండి. (T.S Mar. ’16)

Answer:

పాకాల యశోదారెడ్డి తన గ్రామంలో వచ్చిన మార్పుల గురించి చెప్పిన కథకు ‘కొత్తబాట’ అని పేరు పెట్టారు. ఈ పేరు తగినదే.
‘కొత్తబాట’ అంటే కొత్తదారి అని అర్థము. యశోదారెడ్డి ఊరిలో ప్రజలు పాత ఆచారాలను వదలి కొత్తదారి పట్టారు. అందువల్ల ఈ కథకు ఆ పేరు సరిపోతుంది. ఆ గ్రామ ప్రజలు పట్టిన కొత్తదారి ఇది.
1. గ్రామంలో పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు సామాన్యుల కంటికి కనబడకుండా బండ్లకు తెరలు కట్టే ఆచారం నేడు పోయింది.
2. రచ్చబండపై గ్రామపెద్దతో కలిసి గ్రామస్థులు అందరూ నేడు కూర్చుంటున్నారు.
3. గ్రామపెద్ద రంగరాయడి వంటి వారి పెత్తనాన్ని నేడు గ్రామాల్లో ప్రజలు ధిక్కరిస్తున్నారు.
4. పోలీసు పటేళ్ళ పెత్తనం, ప్రజలు పోలీసులకు లంచాలివ్వడం పోయింది.
5. ప్రజలు చీటికిమాటికీ తగవులు, కొట్లాటలు మానారు. పంచాయితీలు, జరిమానాలు నేడు లేవు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తీర్పులు ఇస్తున్నారు.
6. రాత్రి దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు ముష్టి ఎత్తుకోడం మానివేశారు. వారు మంచి వేషాలు వేసుకుంటున్నారు.
7. పెళ్ళిళ్ళలో కూడా మేనాలు, పల్లకీలు ప్రజలు నేడు మోయడం లేదు.
8. పనిమనుషులను తమతోటి వారుగా చూస్తున్నారు.
ఈ విధంగా గ్రామాల్లో ప్రజలు కొత్తబాట పట్టారు. అందువల్ల ఈ కథకు ఈ పేరు బాగా సరిపడింది.

Exam Tips:

a) ముందుగా ‘తగినదే’ అని అభిప్రాయం చెప్పి, తర్వాత గ్రామంలో వచ్చిన మార్పులను క్రమసంఖ్యలతో ఆధారాలుగా రాయండి.
b) తెరల ఆచారం, పెత్తనం ధిక్కరించడం, లంచాలు, దొంగతనాలు పోవడం వంటి పాఠ్యాంశాలు తప్పక పేర్కొనండి.
c) ముగింపులో ‘అందువల్ల ఈ పేరు సరిపోయింది’ అని మళ్ళీ నిర్ధారించండి.

 

Question 2: పాఠం చదువండి. క్రింది పేరాల ఆధారంగా పట్టిక నింపండి.
(పట్టికలోని నిలువు వరుసలు: పేరా సంఖ్య, పేరా శీర్షిక, పేరాలోని జాతీయాలు / సామెతలు, పేరాలోని ముఖ్యమైన విషయం. పేరాలు: 2, 7, 13, 18)

Answer:

పేరా సంఖ్యపేరా శీర్షికపేరాలోని జాతీయాలు, సామెతలుపేరాలోని ముఖ్యమైన విషయం
2మొండిపట్టుతుమ్మబంక అంటుకున్నట్లు, వసదాగిన పిట్టొలె, మొండిపట్టు, జనిగెపట్టు, నక్షత్రకుడు, ఉల్లాసం పట్టలేకతమ్ముని మనస్తత్వం గురించి (గూర్చి) వివరించిన అక్క
7మారిన పరిస్థితులు / కొత్త (దారి) బాటఏకసిస్తుగ పాదరసం, ఇల్లలు కంగనె పండు గైతాది ?, కాలుగాలిన పిల్లిలోలె, గురుగింజిలోలె, అతీగతీ ఎరుగకుండపర్యావరణం, చెరువు గురించి
13మారిన ఊరుకులపెద్దనంట నెత్తి ఎత్తుకొని నిలబడ్డట్టు, పెద్దపులిని ప్రాణం తోటి పగ్గాన ఏసిన కుశాలు తోటి, పంగనామం పెట్టినాను, ఇర్కుటాన వడికుద్దీల పడ్డ ఎల్క తీర్గఊరులోని (నైసర్గిక) స్వరూపం మార్పును కళ్ళకు కట్టినట్లు చెప్పారు
18దురాచారం (మంచివైపు పయనం) / కొత్తబాటజలకళ సంబురాలు కట్టడి, జనం మెదులక బండ జింకలు చేరినట్లు, గుమ్ములిండ్ల అలంకరణలోలెదురాచారాలు రూపుమాపటం

Exam Tips:

a) పట్టికను నాలుగు నిలువు వరుసలతో గీసి ప్రతి పేరాకు శీర్షిక, జాతీయాలు, ముఖ్య విషయం నింపండి.
b) పేరా శీర్షిక చిన్నగా, ఆ పేరాలోని ప్రధాన భావాన్ని సూచించేలా ఉండాలి.

 

Question 3: క్రింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
పల్లెసీమకు పట్టుకొమ్మలాగ మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ (రూరల్) కాకతీయ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవిమధ్య నిలిచిన అటవీ గ్రామం. ఇక్కడ 1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది. 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామ సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు లోడి సంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించాయి. అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది. వందశాతం అక్షరాస్యత సాధించారు. గ్రామ జనాభాకు సరిపడా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు. పిల్లలందరినీ బళ్ళలో చేర్చారు. గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమగ్రామ పురస్కారానికి ఎంపిక చేసింది.
అ) కొండాపూర్ ఎక్కడ ఉన్నది ?
ఆ) గ్రామపంచాయితీ ఎప్పుడు ఏర్పడింది ?
ఇ) గ్రామసర్పంచ్ ఎవరు ?
ఈ) పక్కా రోడ్డు ఎవరి సహకారంతో, ఎవరు నిర్మించారు?
ఉ) గ్రామ ప్రజలు సాధించిన విజయాలేవి ?
ఊ) ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు? ఎందుకు ?

Answer:

అ) వరంగల్ (రూరల్) జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కి.మీ. దూరంలో, దట్టమైన అడవి మధ్య కొండాపూర్ ఉన్నది.
ఆ) 1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది.
ఇ) గ్రామసర్పంచ్ వాసం కన్నయ్య.
ఈ) లోడి సంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో గ్రామ కమిటీలు మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించాయి.
ఉ) పక్కా రోడ్డు నిర్మాణం, మద్యపాన నిషేధం, వందశాతం అక్షరాస్యత సాధించటం, గ్రామజనాభాకు సరిపడా మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు, గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేయటం, పిల్లలందరినీ బళ్ళలో చేర్చటం మొదలగునవి గ్రామ ప్రజలు సాధించిన విజయాలు.
ఊ) ‘ఆదర్శ గ్రామం – కొండాపూర్’ (లేదా ‘ఉత్తమ గ్రామ పురస్కారం పొందిన కొండాపూర్’) అనే శీర్షిక పెట్టవచ్చు. ఎందుకంటే గ్రామస్థులు కలిసికట్టుగా పనిచేసి సాధించిన అభివృద్ధి వల్ల కొండాపూర్ ఉత్తమ గ్రామ పురస్కారానికి ఎంపికై ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది.

Exam Tips:

a) ప్రతి ఉప ప్రశ్నకు జవాబు పేరాలోని వాక్యాల ఆధారంగానే రాయండి; కొత్త సమాచారం కలపవద్దు.
b) సంఖ్యలు, పేర్లు (1945, 18 కి.మీ., వాసం కన్నయ్య) ఖచ్చితంగా రాయండి.
c) శీర్షిక ప్రశ్నలో ‘ఎందుకు?’ అనే భాగానికి కూడా కారణం రాయడం మర్చిపోవద్దు.

 

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

Question 1: క్రింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.
అ) “ఎంత చెడ్డగని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు” అన్న అక్కమాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?

Answer:

ఇవి స్వతంత్ర ప్రవృత్తి గురించి అక్క తమ్మునితో చెప్పిన మాటలు. మనిషి బాగా బతికినా, కష్టాలతో బతికినా ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇంకొకరి ఆసరాతో, మంది భుజాలెక్కి ప్రయాణించడం అంటే ఇతరుల కష్టం మీద బతకడం. అలా బతకడం దారుణం, గౌరవం లేని బతుకు. తన కాళ్ళ మీద తను నిలబడి, స్వశక్తితో, స్వతంత్రంగా జీవన ప్రయాణం సాగిస్తే చాలు అన్నదే అక్క మాటల్లోని ఆంతర్యం.

Exam Tips:

a) స్వతంత్రంగా బతకడం, ఇతరులపై ఆధారపడకపోవడం అనే రెండు ముఖ్య భావాలు జవాబులో ఉండాలి.
b) ఐదు వాక్యాలకు మించకుండా, అక్క మాటలను సందర్భంతో వివరించండి.

 

Question 2: క్రింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.
ఆ) “అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తున్నవి” అంటే మీకేం అర్థమైంది ?

Answer:

నక్కలు మోసానికి ప్రతిరూపాలు. మోసం చేయడానికి అదను కోసం చూస్తుంటాయి. ఎంతసేపైనా నిరీక్షిస్తాయి. స్వయంగా వేటాడకుండానే ఆహారాన్ని సంపాదించగల దిట్టలు. పొదల్లో నక్కి ఉంటాయి. బలహీనమైన కోడి, మేకపిల్ల వంటి వాటిని చంపి తింటాయి. బలమైన జంతువులను ఏ సింహమో వేటాడేదాకా చూసి, అది తినగా మిగిలిన మాంసం తినేస్తాయి.
అలాగే ఊరు మారినా, రంగరాయడి లాంటి మోసగాళ్ళు కొందరు ఇంకా అమాయకులను మోసం చేయడానికి అవకాశం కోసం కాచుకొని ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని అక్క మాటల ఆంతర్యం అని మాకు అర్థమైంది.

Exam Tips:

a) నక్కల స్వభావం (అదను కోసం కాచుకోవడం)ను వివరించి, దాన్ని ఊరిలోని మోసగాళ్ళకు అన్వయించండి.
b) ఇది ప్రతీకాత్మక వాక్యం అని గుర్తించి అసలు అర్థాన్ని స్పష్టంగా చెప్పండి.

 

Question 3: క్రింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.
ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.

Answer:

మా ఊరు చాలా బాగుంటుంది. మామిడి తోటలతో, చక్కని వరిపొలాలతో, గోదావరి కాలువతో చూడముచ్చటైన ఊరు మా ఊరు. ఊరి చివర బడి, ఊరి మధ్యలో గుడి, మడులు, పిల్లల అరుపులు, పక్షుల కిలకిలారావాలు, నీళ్ళతో నిండిన చెరువులు, చక్కని రోడ్లు మా ఊరికే సొంతం.
మా గ్రామం ఆదర్శగ్రామంగా ఎంపిక కాబడింది. మా ఊరికి ఎవరు వచ్చినా మా ఊరి అందాలను ఫోటో తీయందే వెళ్లరు. చాలా సినిమాల షూటింగులు మా ఊళ్ళో జరిగాయి. గోదావరి అందాలు మా ఊరికి వన్నె తెస్తున్నాయి.

Exam Tips:

a) మీ ఊరి పేరు, ప్రకృతి (పొలాలు, చెరువులు, నది), ప్రత్యేకతలు (గుడి, బడి, పండుగలు) క్రమంగా రాయండి.
b) ఐదు వాక్యాల జవాబులో వర్ణనాత్మక పదాలు వాడితే మంచి మార్కులు వస్తాయి.

 

Question 4: క్రింది ప్రశ్నకు ఐదు వాక్యాల్లో జవాబు రాయండి.
ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి ?

Answer:

తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందునుంచే ఉన్నప్పటికీ కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, సంస్థానాధీశులు తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్వహణకు నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరువుపీడిత గ్రామాలుగా మారాయి.
ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలస పోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి ‘మిషన్ కాకతీయ’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.

Exam Tips:

a) కాకతీయుల కాలం, చెరువుల విధ్వంసం, వలసలు, మిషన్ కాకతీయ – ఈ క్రమంలో రాయండి.
b) చెరువులు వ్యవసాయానికి, తాగునీటికి, భూగర్భజలాలకు ఆధారం అని ప్రాముఖ్యతను స్పష్టంగా పేర్కొనండి.

 

Question 5: క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి. (T.S June ’16)

Answer:

“కొత్తబాట” అనే ఈ పాఠంలో అక్కాతమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడ నుండి ఎద్దులబండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేస్తారు. దారిలో పల్లెలో వచ్చిన అనేకరకాల మార్పులను చూస్తారు. అవి ఈ విధంగా ఉన్నాయి.
1. కొత్తబాట (రోడ్లు) నిర్మించారు. మెచ్చుకొని తీరవలసినట్లుగా ఆ రోడ్డు నిర్మాణం జరిగింది.
2. మోరుగవనం వేశారు. అందమైన ప్రకృతికి మారుపేరది.
3. రోడ్డుకిరువైపులా చెట్లు నాటారు. పూల తోటలు వేశారు. పొంటిమాన్లు చిగురించాయి.
4. చెరువును పూడిక తీసి అందంగా చేశారు. దానికి ఆయకట్టు కట్టడం వల్ల అందరికి ఆదరువైంది.
5. జారుడు బండలు ఏర్పాటు చేశారు.
6. ఇదివరకు బురద దారిలో కాళ్ళకు బురద అంటుకునేది; ఇప్పుడు ఆ బాధ లేదు.
7. కొట్టాల గడ్డివాములన్నీ కుదురుగా మట్టసంగా ఉన్నాయి.
8. ఎల్లమ్మ గుడిని బాగుచేయించారు.
9. దొంగతనాలు, దోపిడీలు, పంచాయితీ శిక్షలు పోయాయి. ప్రజలు ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవనం సాగిస్తున్నారు.
10. పని మనిషులు కూడా ఇంట్లో మనుషులతో సమానంగా గౌరవం అందుకుంటున్నారు.
11. మిత్తి పూజ పేరుతో ప్రజల మూఢనమ్మకాల్ని సొమ్ము చేసుకున్న వారిని ప్రజలు ఊరొదిలి పోయేలా తరిమికొట్టారు.
12. మారిన ఊరిని చూసి అక్క సంతోషంతో ఊపిరి పీల్చుకుంది.
ఈ విధంగా ఈ పాఠంలో పల్లెల్లో వచ్చిన అనేక మార్పులను రచయిత్రి తెలిపింది.

Exam Tips:

a) పరిచయ వాక్యం, కనీసం పది మార్పులు, ముగింపు వాక్యం అనే నిర్మాణంలో రాయండి.
b) రోడ్లు, చెట్లు, చెరువు, దురాచారాలు పోవడం, పనిమనుషులకు గౌరవం వంటి పాఠ్యాంశాలనే ఉదహరించండి.

 

Question 6: క్రింది ప్రశ్నకు సృజనాత్మకంగా సమాధానం రాయండి.
అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.

Answer:

పల్లె తాకనంటా (వచన కవిత)
కోడికూతతోనే కళ్ళుతెరచి
పల్లె ఒళ్ళు విరుచుకుంది
చల్లగాలుల్లోనే స్నానమాడి
చక్కగా కూర్చుంది
చూడచక్కగా తానుంది
చిట్టి గువ్వలన్నీ గూటిని వీడి గంతులు వేయగా
యేటిలో చేపలే గువ్వల సాటిగా ఎగరగా
చూడంగా చిన్నారి పాదాలు సందులలోన పరుగులు తీయంగా
ఆ చప్పుడు వింటూ
బంతులు – చేమంతులూ
మల్లెలు – మందారాలు
ముద్దుముద్దుగా విచ్చుకుంటున్నాయా
మొద్దు నిదురవీడి
– కోడి కూతతోనే
పల్లె తనదంటూ వదిలెల్లనంటూ మొండికేసే చంద్రుడే
కాదు నాదంటూ నువ్వెళ్ళి పొమ్మంటూ ఎర్రబారే సూరీడే
తగవు తీర్చలేక మబ్బు చల్లంగచేరి ఝల్లు కురిసింది
నే పల్లెన తాకానంటూ
ఆ సూరీడుకు, చంద్రుడుకు
ఆకాశాన చుక్కలకు
కన్నెగరేసిందీ
– కోడి కూతతోనే

Exam Tips:

a) కనీసం పది పంక్తులు ఉండేలా రాసి, పల్లె ప్రకృతి (కోడికూత, పక్షులు, పూలు, సూర్యోదయం) వర్ణించండి.
b) కవితకు ఒక శీర్షిక పెట్టండి; పదాలలో లయ, పునరావృతం (‘కోడి కూతతోనే’) ఉంటే ఆకర్షణీయంగా ఉంటుంది.

 

III. భాషాంశాలు – పదజాలం

Question 1: క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ) ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
ఆ) చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి.
ఇ) కుటిలవాజితనం పనికిరాదు.
ఈ) మా ఊరి పొలిమేరలో పంటపొలాలున్నాయి.

Answer:

అ) చెవివారిచ్చి (అర్థం : శ్రద్ధగా విను)
ప్రహ్లాదుడు చండామార్కులు (గురువు గారు) చెప్పిన పాఠాలను చెవివారిచ్చి వినేవాడు.
ఆ) గవిన్లలో (అర్థం : గుహలలో)
అజంతా, ఎల్లోరా గవిన్లలో చిత్రకళా సంపద దాగి ఉన్నది.
ఇ) కుటిలవాజితనం (అర్థం : కపట బుద్ధి, మోసం)
నక్క కుటిలవాజితనం కలిగి ఉంటుంది.
ఈ) పొలిమేర (అర్థం : ఊరిచివర హద్దు)
మా ఊరి పొలిమేర ఇప్పుడు చెరిగిపోయి నగరంలో కలిసిపోయింది.

Exam Tips:

a) ముందుగా గీత గీసిన పదం అర్థం రాసి, తర్వాత అదే అర్థం వచ్చేలా కొత్త వాక్యం రాయండి.
b) ప్రశ్నలోని వాక్యాన్నే తిరిగి రాయకూడదు; స్వంత వాక్యం ఉండాలి.

 

Question 2: క్రింది వాక్యాల్లో పర్యాయపదాల క్రింద గీత గీయండి.
అ) రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.
ఆ) మనుషులు నీళ్ళు దొరికె తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.

Answer:

అ) రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి.
(పెయి, మేను, దేహం – శరీరం అనే అర్థం గల పర్యాయపదాలు)
ఆ) మనుషులు నీళ్ళు దొరికె తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు.
(తావులు, చోటులు, ప్రదేశాలు – స్థలం అనే అర్థం గల పర్యాయపదాలు)

Exam Tips:

a) ఒకే అర్థం గల మూడు పదాలను గుర్తించి గీత గీయండి; వాటి సామాన్య అర్థం కూడా రాస్తే స్పష్టంగా ఉంటుంది.
b) పెయి, మేను – మాండలిక / తెలుగు పదాలు; దేహం – సంస్కృత పదం అని గుర్తుంచుకోండి.

 

Question 3: క్రింది పట్టిక నుండి ప్రకృతి, వికృతులను వేరుచేసి రాయండి.
సముద్రం, అదెరువు, శిఖ, విద్య, పైనం, విద్దె, ప్రయాణం, సంద్రం, సిగ, ఆధారం

Answer:

ప్రకృతి – వికృతి
1) సముద్రం – సంద్రం
2) ఆధారం – అదెరువు
3) శిఖ – సిగ
4) విద్య – విద్దె
5) ప్రయాణం – పైనం

Exam Tips:

a) ప్రకృతి – వికృతి జంటలను ‘ప్రకృతి – వికృతి’ క్రమంలోనే రాయండి; క్రమం మారితే మార్కులు పోతాయి.
b) సంస్కృత రూపం ప్రకృతి (సముద్రం, విద్య), తెలుగు మారిన రూపం వికృతి (సంద్రం, విద్దె).

 

Question 4: క్రింది జాతీయాలను ఏ అర్థంలో వాడుతారో తెలపండి.
నక్షత్రకుడు (ఉదా: వెంబడి బడి పీడించేవాడు అనే అర్థంలో వాడుతారు), నిండుకున్నవి, దడిగట్టు, నిప్పుకలుసెరుగంగ

Answer:

1) నక్షత్రకుడు : పట్టువదలనివాడు, వెంటబడి పీడించేవాడు అనే అర్థంలో వాడుతారు.
2) నిండుకున్నవి : అయిపోయినవి, లేవు అనే అర్థంలో వాడుతారు.
3) దడిగట్టు : అడ్డుకట్టినట్లు అనే అర్థంలో వాడుతారు.
4) నిప్పుకలుసెరుగంగ : “కోపంతో ఎర్రబడిన కళ్ళు” అనే అర్థంలో వాడుతారు.

Exam Tips:

a) ప్రతి జాతీయానికి ‘… అనే అర్థంలో వాడుతారు’ అనే పద్ధతిలో జవాబు రాయండి.
b) నక్షత్రకుడు – హరిశ్చంద్రుని వెంటపడి పీడించిన విశ్వామిత్రుని శిష్యుడు అనే నేపథ్యం గుర్తుంచుకోండి.

 

వ్యాకరణాంశాలు

Question 1: క్రింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.
అ) ప్రాణాలు గోల్పోవు ఆ) మూటఁగట్టు ఇ) ఆసువోయుట ఈ) కాలుసేతులు ఉ) పూచెనుగలువలు

Answer:

అ) ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు + కోల్పోవు (గసడదవాదేశ సంధి)
ఆ) మూటఁగట్టు = మూటన్ + కట్టు (సరళాదేశ సంధి)
ఇ) ఆసువోయుట = ఆసు + పోయుట (గసడదవాదేశ సంధి)
ఈ) కాలుసేతులు = కాలు + చేతులు (గసడదవాదేశ సంధి)
ఉ) పూచెనుగలువలు = పూచెను + కలువలు (సరళాదేశ సంధి)

Exam Tips:

a) విడదీసిన తర్వాత సంధి పేరు తప్పక రాయండి; కేవలం విడదీస్తే సగం మార్కులే వస్తాయి.
b) ప్రథమ మీది పరుషాలకు గ,స,డ,ద,వలు వస్తే గసడదవాదేశ సంధి; ద్రుతం మీది పరుషాలకు సరళాలు వస్తే సరళాదేశ సంధి.

 

Question 2: వృద్ధి సంధి : క్రింది పదాలను విడదీయండి. సూత్రాన్ని రాయండి.
ఉదా : రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ)
ఏకైక, వసుధైక, దేశైశ్వర్యం, అష్టైశ్వర్యాలు, వనౌషధి, మహౌషధి, దివ్యౌషధం, నాటకౌచిత్యం

Answer:

అ) ఏకైక = ఏక + ఏక = (అ + ఏ = ఐ)
ఆ) వసుధైక = వసుధ + ఏక = (అ + ఏ = ఐ)
ఉదా : దివ్యైరావతం = దివ్య + ఐరావతం (అ + ఐ = ఐ)
అ) దేశైశ్వర్యం = దేశ + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ)
ఆ) అష్టైశ్వర్యాలు = అష్ట + ఐశ్వర్యాలు = (అ + ఐ = ఐ)
ఉదా : ఘనౌషధి = ఘన + ఓషధి = (అ + ఓ = ఔ)
అ) వనౌషధి = వన + ఓషధి = (అ + ఓ = ఔ)
ఆ) మహౌషధి = మహా + ఓషధి = (ఆ + ఓ = ఔ)
ఉదా : రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ)
అ) దివ్యౌషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ)
ఆ) నాటకౌచిత్యం = నాటక + ఔచిత్యం = (అ + ఔ = ఔ)
పై పదాలను విడదీసినప్పుడు గమనించిన విషయాలు:
అ) ఈ సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ‘అ, ఆ’ లలో ఒకటి వచ్చింది.
ఆ) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ లున్నాయి.
ఇ) ‘అ’ కారానికి ఏ, ఐ లు కలిసినప్పుడు ‘ఐ’ వచ్చింది.
ఈ) ‘అ’ కారానికి ఓ, ఔ లు కలిసినప్పుడు ‘ఔ’ వచ్చింది.
(ఐ, ఔ లను ‘వృద్ధులు’ అంటారు.) ‘వృద్ధుల’ వల్ల ఏర్పడిన సంధి కనుక ఇది వృద్ధి సంధి.
సూత్రం : అకారానికి (అ, ఆ లకు) ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారం, ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారం ఏకాదేశంగా వస్తాయి.

Exam Tips:

a) అ + ఏ/ఐ = ఐ, అ + ఓ/ఔ = ఔ – ఈ రెండు సూత్రాలు గుర్తుంచుకుంటే వృద్ధి సంధి పదాలు సులభంగా విడదీయవచ్చు.
b) విడదీసిన తర్వాత బ్రాకెట్‌లో స్వర సంయోగం (అ + ఏ = ఐ) చూపిస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

ప్రాజెక్టు పని

Question 1: అందమైన పల్లెటూరు చిత్రాలను సేకరించండి. పల్లెకు సంబంధించిన కవిత / పాట సేకరించి ప్రదర్శించండి. మీ మిత్రులు రాసినవన్నీ ఒక చోట చేర్చి సంకలనం తయారు చేయండి.

Answer:

పల్లెకు సంబంధించిన తెలంగాణ గీతం (అత్యంత ప్రజాదరణ పొందిన గీతం)
పల్లెపల్లెనా పల్లేరు మొలచె పాలమూరులోన నా తెలంగాణలోన
పాతగోడలు పందిరిగుంజలు సిన్నబోయినాయి
ఇండల్ల దుమ్మురేపినాయి ||పాత||
చెట్టుమీద ఆ పిట్టలెగురగా సేదబావిలో ఊటలూరుగా
పచ్చా పచ్చా నూళ్ళు పలుగురాళ్ళు తేలినాయి
అయ్యో పనిపాట లేక ప్రజలు తల్లడిల్లినారో ||పల్లె పల్లెనా||
దండీ గడాలు వెండి గాజులు మొలతాడులు కొనగ పోగులు
ఉన్నాదంతా నమ్మి కనిపెంచి నూరు విడిచి
పొట్టచేతపట్టి బతుకు బయలెల్లినాడో ||పల్లె పల్లె||

Exam Tips:

a) సేకరించిన పాట / కవిత శీర్షిక, రచయిత పేరు (తెలిస్తే) తప్పక పేర్కొనండి.
b) ప్రాజెక్టు నివేదికలో సేకరణ, ప్రదర్శన, సంకలనం అనే మూడు దశలను వివరించండి.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 10 Telugu Lesson 04 Kotta Bata (The New Path)

Textbook Solutions for Class 10 Telugu Lesson 04 Kotta Bata (The New Path)

Access structured TS Board textbook solutions for Lesson 04 Kotta Bata (The New Path). Designed in alignment with the latest academic curriculum for Class 10 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 04 Kotta Bata (The New Path) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Telugu.

FAQs

Where can I find the latest TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట for the 2026-27 session?

The complete and updated TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట is available for free on StudiesToday.com. These solutions for Class 10 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట will help students to get full marks in the theory paper.

Do you offer TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Telugu. You can access TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire TS 10th Class Telugu Guide 4th Lesson కొత్తబాట in printable PDF format for offline study on any device.