TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు

Official TS Board Solutions for Class 8 Telugu Upavachakam: Lesson 06 P.V. Narasimha Rao

Access comprehensive textbook solutions for Lesson 06 P.V. Narasimha Rao using the official curriculum guides for Class 8 Telugu Upavachakam. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Chapter-wise Solutions for Telugu Upavachakam: Lesson 06 P.V. Narasimha Rao

View or download the dedicated Lesson 06 P.V. Narasimha Rao solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu Upavachakam.

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: పి.వి. నరసింహారావు గుణగుణాలను తెల్పండి.

Answer:

పి.వి. నరసింహారావు స్థితప్రజ్ఞుడు. సంస్కరణ శీలుడు. అపర చాణక్యుడు. న్యాయ శాస్త్రజ్ఞుడు. బహుభాషాకోవిదుడు. అందరికీ అయినవాడు. తెలంగాణ మహనీయుడు. దక్షిణ భారతం నుండి ప్రధానియైన మొదటివాడు. గొప్ప సాహితీ వేత్త. పద్నాలుగు భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన పండితుడు. దానకర్ణుడు. ఆటల్లో ఆరితేరినవాడు. సంగీతంలోనూ ఆయనకు ప్రవేశమున్నది. దేశహితాన్ని కోరిన మహామనీషి.

Exam Tips:

a) గుణాలను వరుసగా పేర్కొనండి: స్థితప్రజ్ఞుడు, సంస్కరణశీలుడు, బహుభాషాకోవిదుడు, దక్షిణ భారతం నుంచి మొదటి ప్రధాని; ‘పద్నాలుగు భాషలు’ అనే సంఖ్య తప్పక రాయండి.

 

Question 2: పి.వి. నరసింహారావు బాల్య విశేషాలు తెల్పండి.

Answer:

పి.వి. నరసింహారావు స్వగ్రామం కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర. వరంగల్లు జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో ఆయన 28 జూన్ 1921న జన్మించాడు. తల్లిదండ్రులు రుక్మాబాయమ్మ, సీతారామారావు. వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయనను దత్తత చేసుకున్నారు.

Exam Tips:

a) పుట్టిన తేదీ (28 జూన్ 1921), జన్మస్థలం లక్నేపల్లి, స్వగ్రామం వంగర, తల్లిదండ్రులు, దత్తత వివరాలు క్రమంగా రాయండి.

 

Question 3: పి.వి. విద్యాభ్యాసాన్ని వివరించండి.

Answer:

పి.వి.కి బాసరలో అక్షరాభ్యాసం జరిగింది. వంగరలో చదువు ప్రారంభించి హుజూరాబాద్లో 3, 4 తరగతులు చదివాడు. ఎప్పుడూ క్లాసులో ఫస్టుగా వచ్చేవాడు. గణితం ఆయనకు ఇష్టమైన విషయం. టెన్నిస్ బాగా ఆడతాడు. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతం పాడతాడు. హనుమకొండలో డిస్టింక్షన్ మార్కులతో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. మహారాష్ట్రలోని పూణేలో బి.యస్సి. నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి. పట్టాపొందాడు.

Exam Tips:

a) బాసర అక్షరాభ్యాసం, వంగర–హుజూరాబాద్ చదువు, హనుమకొండ మెట్రిక్యులేషన్, పూణే బి.ఎస్సీ., నాగపూర్ ఎల్.ఎల్.బి. అనే క్రమం పాటించండి.

 

Question 4: పి.వి. నరసింహారావు సాహిత్య సేవను తెల్పండి.

Answer:

పి.వి. నరసింహారావు 1948లో కాకతీయ పత్రికను స్థాపించాడు. జయ అనే మారు పేరుతో అనేక రచనలు చేశాడు. తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో విజయ అనే కలం పేరుతో ‘గొల్లరామవ్వ’ కథను కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథవారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ అనే పేరుతో హిందీలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. ‘పన్లక్షత్ కోనతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో అనువదించాడు. తన రాజకీయ సాహిత్య అనుభవాలతో ఆయన రాసిన ‘ది ఇన్ సైడర్’ నవల బాగా ప్రసిద్ధి పొందింది.

Exam Tips:

a) 1948 కాకతీయ పత్రిక, ‘జయ’, ‘విజయ’ మారుపేర్లు, సహస్రఫణ్ అనువాదం–అకాడమీ అవార్డు, ‘అబల జీవితం’, ‘ది ఇన్‌సైడర్’ అనే పుస్తకాల పేర్లు ఖచ్చితంగా రాయండి.

 

Question 5: పి.వి. బహుముఖ ప్రతిభను వివరించండి.

Answer:

పి.వి. నిజాం వ్యతిరేక పోరాటంలో రాటుదేలిన నాయకుడు. అనేక భాషలలో పండితుడు. రాజకీయరంగంలో శాసన సభ్యుడి నుండి ప్రధానమంత్రి వరకు అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించాడు. దేశాన్ని ప్రగతిబాటలో నడిపించాడు. పాత్రికేయునిగా కాకతీయపత్రికను స్థాపించి అనేక రచనలు చేశాడు. ఎన్నో నవలలకు అనువాదాలు రాశాడు. అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చదువులోను ఆటపాటలలోనూ ఆరితేరినవాడు.

Exam Tips:

a) రాజకీయం, భాషా పాండిత్యం, పాత్రికేయం, అనువాదాలు, క్రీడలు వంటి విభిన్న రంగాలను ఒక్కో వాక్యంగా రాయండి; స్పానిష్ ఉపన్యాసాన్ని ఉదాహరణగా చెప్పండి.

 

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు – పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: పి.వి. నరసింహారావు జీవిత విశేషాలను సంగ్రహించండి.

Answer:

పి.వి. నరసింహారావు సీతారామారావు, రుక్మాబాయమ్మల కుమారుడు. పాములపర్తి రంగారావు, రత్నాబాయిలు దత్తత చేసుకున్నారు. పి.వి. చదువులోను ఆటపాటల్లోనూ నిష్ణాతుడు. ఎల్.ఎల్.బి. పట్టా పొంది హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేశాడు. రాజకీయ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్నో శాఖలలో మంత్రిగా పనిచేస్తూ పలు సంస్కరణలు చేసి అందరి ప్రశంసలు పొందాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చాడు.
దీనివల్ల పేదలకు ఎంతో మేలు జరిగింది. తన రాజకీయ చతురతతో మిత్ర పక్షాలను కూడగట్టుకొని తాను ప్రధానమంత్రిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటుచేసి ఐదు సంవత్సరాలు చక్కని పరిపాలన నందించాడు. సాహితీవేత్తగా అనువాద గ్రంథాలు నవలలు రచించాడు. కాకతీయ పత్రికను స్థాపించి సమర్థవంతంగా నిర్వహించాడు. ఆచితూచి మాట్లాడడమే కాదు. రచనలోనూ పి.వి.ది అదే గాంభీర్యం, పరిణతి, దేశభక్తి కనిపిస్తుంది. సమున్నత వ్యక్తిత్వం కలవాడు పి.వి. నరసింహారావు.

Exam Tips:

a) పది వాక్యాల జవాబును కాలక్రమంలో రాయండి: కుటుంబం, చదువు, న్యాయవాద వృత్తి, ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి, సాహిత్యం.

 

Question 2: పి.వి. నరసింహారావు రాజకీయ జీవిత విశేషాలు సంగ్రహించండి.

Answer:

పి.వి. నరసింహారావు రాజకీయ జీవితం 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమితో ప్రారంభమైంది. తరువాత నాలుగు సార్లు మంథని శాసనసభ నియోజక వర్గంలో గెలిచాడు. రెండవసారి ఎన్నికైనపుడు రాష్ట్ర జైళ్ళు, ప్రజాసంబంధాలు, విద్యాశాఖ, ఆరోగ్యశాఖల మంత్రిగా పనిచేశాడు. ఆయాశాఖలలో సంస్కరణలు తెచ్చాడు.
మూడవసారి ఎన్నికైనపుడు ముఖ్యమంత్రియైనాడు.
పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చాడు. 1977లో హనుమకొండ నుండి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. శ్రీమతి ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయుడుగా ఉంటూ హోం, విదేశాంగ శాఖల మంత్రియైనాడు. రాజీవ్ గాంధి మంత్రి వర్గంలో మానవ వనరుల శాఖ, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ గాంధీ మరణానంతరం 1991లో ఏర్పడిన రాజకీయ అనిశ్చిత స్థితిని తొలగించాడు. మిత్ర పక్షాలను కూడగట్టుకొని తాను ప్రధాన మంత్రిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పరచాడు. ఐదు సంవత్సరాలు చక్కని పాలన నందించి రాజకీయ పండితులను ఆశ్చర్యపరచాడు.

Exam Tips:

a) 1952 ఎన్నికల్లో ఓటమి నుంచి 1991లో ప్రధాని అయ్యే వరకు సంవత్సరాలతో సహా పదవులను వరుసగా రాయండి.

 

పరిచిత గద్యభాగాలు

Question 1: కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.
భారతదేశంలో సాహితీ పరిమళాలు వెదజల్లిన అతి కొద్ది మంది రాజకీయ వేత్తలలో పి.వి. అగ్రతాంబూలానికి అర్హుడు. 1948లో ‘కాకతీయ’ పత్రికను స్థాపించి తొలితరం పత్రికా రచయితలలో ఒకడయ్యాడు. ‘కాకతీయ’ పత్రికలో ‘జయ’ అనే మారుపేరుతో అనేక రచనలు చేశాడు.
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో “గొల్లరామవ్వ” కథను ‘విజయ’ అనే కలం పేరుతో కాకతీయ పత్రికలో రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలను హిందీలోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించాడు. ఈ రచనకు పి.వి. కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు పొందాడు. ‘పన్లక్షత్ కోన్ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో అనువదించాడు.

Answer:

1. పి.వి. స్థాపించిన పత్రిక ఏది ?
2. ఆయన మారుపేర్లు తెల్పండి.
3. తెలంగాణా పోరాటంలో ఆయన చేసిన రచన ఏది ?
4. ‘అబల జీవితం’ ఏ భాషలోని పుస్తకానికి అనువాదం ?
5. వేయి పడగలు తెలుగులో రాసిందెవరు ?

Exam Tips:

a) ‘ఐదు ప్రశ్నలు రాయండి’ రకం ప్రశ్నలో పేరాలోని వాక్యాల నుంచే ఎవరు, ఏది, ఏ భాష వంటి ప్రశ్నలు తయారు చేసి నంబర్లు వేయండి.

 

Question 2: కింది వాక్యాలను సరైన క్రమంలో అమర్చండి.
1998లో ది ఇన్ సైడర్ గ్రంథం వెలువడింది. 1921లో పి.వి. నరసింహారావు జన్మించాడు. 1977లో కేంద్ర రాజకీయాలలో ప్రవేశించాడు. 1948లో కాకతీయ పత్రికను స్థాపించాడు. 1991లో ప్రధానమంత్రియైనాడు.

Answer:

1. 1921లో పి.వి. నరసింహారావు జన్మించాడు.
2. 1948లో పి.వి. కాకతీయ పత్రికను స్థాపించాడు.
3. 1977లో కేంద్ర రాజకీయాలలో ప్రవేశించాడు.
4. 1991లో ప్రధానమంత్రియైనాడు.
5. 1998లో ఇన్ సైడర్ గ్రంథం వెలువడింది.

Exam Tips:

a) సంఘటనలను సంవత్సరాల ఆరోహణ క్రమంలో అమర్చండి: 1921, 1948, 1977, 1991, 1998.

 

Question 3: కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
1924లో బాసరలో కొలువైన జ్ఞాన సరస్వతి సన్నిధిలో పి.వి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. వంగర ప్రభుత్వ పాఠశాలలో ఓనమాలు దిద్దాడు. 1928 నుండి 1930 వరకు హుజూరాబాద్ పాఠశాలలో మూడు, నాలుగు తరగతులు చదివాడు. వంగర నుండి హుజూరాబాద్కు దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం రోజూ సవారీ కచ్చడం (ఎడ్లబండి)లో వెళ్ళి వచ్చేవాడు. చదువుకునే రోజుల్లో పి.వి.
ఎప్పుడూ క్లాస్ ఫస్టే. తానెప్పుడూ క్లాస్లో సెకెండ్ రావడం ఎరుగనని ‘ఐ విట్నెస్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి పి.వి. చెప్పాడు. చిన్నప్పుడు గణితం సబ్జెక్టు అంటే అమితంగా ఇష్టపడేవాడు. చదువులోనే కాదు ఆటల్లోనూ ఆరితేరినవాడే. టెన్నిస్ క్రీడను బాగా ఆడేవాడు. పి.వి.కి చిన్నప్పటి నుండి సంగీతంలోనూ ప్రవేశం ఉంది. లలిత సంగీతం, భజనలు, శాస్త్రీయ సంగీతంతో కూడిన కీర్తనలు శ్రావ్యంగా పాడేవాడు.
ప్రశ్నలు :
1. బాసరలో ఉన్న దైవం ఎవరు ?

Answer:

జ్ఞాన సరస్వతి.

Exam Tips:

a) పేరా ఆధారిత ప్రశ్నలకు పేరాలోని వాక్యాల నుంచే జవాబు తీసుకోండి; బాసరలో కొలువైన దైవం జ్ఞాన సరస్వతి.

 

Question 4: పి.వి. మూడు నాలుగు తరగతులు ఎక్కడ చదివాడు ?

Answer:

హుజూరాబాద్లో

Exam Tips:

a) ‘ఎక్కడ’ అనే ప్రశ్నకు ప్రదేశం పేరు రాయండి: హుజూరాబాద్ (1928–1930 మధ్య).

 

Question 5: ఆయన ఏ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ?

Answer:

ఐ విట్నెస్

Exam Tips:

a) పత్రిక పేరు ‘ఐ విట్నెస్’ అని ఖచ్చితంగా రాయండి.

 

Question 6: ఆయనకు ఇష్టమైన ఆట ఏది ?

Answer:

టెన్నిస్

Exam Tips:

a) ఇష్టమైన ఆట టెన్నిస్ అని పేరాలోని ‘టెన్నిస్ క్రీడను బాగా ఆడేవాడు’ వాక్యం ఆధారంగా రాయండి.

 

Question 7: పి.వి. వంగర నుండి హుజూరాబాద్ ఎలా వెళ్ళేవాడు ?

Answer:

సవారీ కచ్చడం (ఎడ్లబండి)లో

Exam Tips:

a) ‘ఎలా’ ప్రశ్నకు ప్రయాణ సాధనం చెప్పండి: సవారీ కచ్చడం అంటే ఎడ్లబండి.

 

Free study material for Telugu Upavachakam

Step-by-Step Textbook Answers: Class 8 Telugu Upavachakam Lesson 06 P.V. Narasimha Rao

Accessing Lesson 06 P.V. Narasimha Rao Solutions

Explore reliable textbook solutions for Lesson 06 P.V. Narasimha Rao tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Telugu Upavachakam.

Concept-Driven Answers for Class 8 Telugu Upavachakam

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Telugu Upavachakam module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Telugu Upavachakam.

FAQs

Where can I find the latest TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు for the 2026-27 session?

The complete and updated TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu Upavachakam are as per latest TS Board curriculum.

Are the Telugu Upavachakam TS Board solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu Upavachakam concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు will help students to get full marks in the theory paper.

Do you offer TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Telugu Upavachakam. You can access TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు in both English and Hindi medium.

Is it possible to download the Telugu Upavachakam TS Board solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire TS 8th Class Telugu Guide ఉపవాచకం 6th Lesson Telangana పి.వి.నరసింహారావు in printable PDF format for offline study on any device.