TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు

Step-by-Step Textbook Solutions for Class 8 Telugu Upavachakam Lesson 05 Janapada Kalalu

Review structured textbook solutions for Class 8 Telugu Upavachakam Lesson 05 Janapada Kalalu. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Lesson 05 Janapada Kalalu Textbook Solutions PDF

Navigate directly to the solved Telugu Upavachakam textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: జానపద కళలు అంటే ఏమిటి ? వాటి ప్రయోజనమేమి ?

Answer:

జానపదులు అంటే పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపదకళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, కోలాటం, భజన, పిట్టల దొర మొదలైనవి జానపదకళలు. భారత భాగవత రామాయణాలు, వీరుల కథలు లాంటివి ఈ కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చాయి. చదువురాని పల్లె ప్రజలకు వినోదంతోపాటు విజ్ఞానం కూడా అందించేందుకు ఈ జానపదకళలు ఉపయోగపడతాయి.

Exam Tips:

a) జానపదులు = పల్లె ప్రజలు అని నిర్వచించి, ఉదాహరణలు (ఒగ్గుకథ, బుర్రకథ, కోలాటం), తర్వాత వినోదం–విజ్ఞానం అనే ప్రయోజనం రాయండి.

 

Question 2: యక్షగానాలు అంటే ఏమిటి ?

Answer:

యక్షగానాలను కొన్ని చోట్ల బాగోతాలని, నాటకాలని కూడా అంటారు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొదలైన ప్రక్రియలతో ఇది సాగుతుంది. వీటిని రాత్రిపూట ప్రదర్శిస్తారు. నృత్య, నాటక, సంగీత గాత్రాల కలబోత యక్షగానం. ఆయా పాత్రల్లో నటులు నవరసాలు ఒలికిస్తుంటే ప్రేక్షకులు పరవశించిపోతారు.
యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన ఒక ప్రక్రియ.

Exam Tips:

a) యక్షగానం కర్ణాటక నుంచి వచ్చిందని, పాటలు–పద్యాలు–దరువుల కలయిక అని, రాత్రిపూట ప్రదర్శిస్తారని మూడు అంశాలు చేర్చండి.

 

Question 3: యక్షగానాలకు వేదిక ఎలా ఏర్పాటు చేస్తారు ?

Answer:

యక్షగానం ఆట ఆడే రోజు నాలుగు బజార్ల కూడలి దగ్గర వేదికను ఏర్పాటు చేస్తారు. నాలుగు వైపులా బొంగులు, కర్రలు పాతి పందిరి వేస్తారు. ఎదురుగా తెల్లటి బట్టను కడతారు. వీలైతే ప్రక్కలకు పరదాలు వేలాడదీస్తారు. ఒక్కోసారి గ్రామంలో నుంచి నాలుగు పెద్దబల్లలు తెచ్చి వేస్తారు. లేదంటే నేల మీదనే వేదిక ఏర్పాటు చేస్తారు. వేదికకు రెండు వైపులా కరెంటు బల్బులు గాని, పెట్రొమాక్సు లైట్లుగాని, ఏవీ లేకుంటే దివిటీలుగాని పెడతారు. అలా వేదిక ఏర్పాటు చేస్తారు.

Exam Tips:

a) వేదిక ఏర్పాటును క్రమంగా వివరించండి: స్థలం, పందిరి, తెల్లటి బట్ట, పరదాలు, వెలుతురు కోసం బల్బులు/దివిటీలు.

 

Question 4: జానపద కళలు మన జీవితంలో ఎలా కలిసిపోయాయి?

Answer:

కొన్ని వందల సంవత్సరాల నుండి వర్ధిల్లుతున్న ప్రజాకళలు పల్లె జీవనంతో సంస్కృతితో కలిసిపోయినవి ఈ జానపదకళలు.
ప్రజల సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు. తరతరానికి రూపు మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు. జీవితంలో ఒక భాగంగా సాగి కదిలి కదిలించిన కళలు ఈ జానపదకళలు. వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

Exam Tips:

a) ‘కాపాడుకోవడం మన బాధ్యత’ అనే ముగింపు వాక్యంతో జవాబు ముగించండి; కళలు పల్లె జీవనంతో కలిసిన తీరును వివరించండి.

 

Question 5: గొల్ల సుద్దుల వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ?

Answer:

గొల్లసుద్దులు కళారూపం సామాజిక చైతన్యం కలిగిస్తుంది. ఈ ప్రక్రియలో చెబితే సామాన్యులకు చక్కగా అర్థమౌతుంది. గొల్లసుద్దులు పాటల్లో సమాజంలో చెడును తొలగించే ప్రయత్నం కనబడుతుంది. వినోదాన్నే కాకుండా విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రజా ఉద్యమాల్లోనూ, అక్షరాస్యత, ఆరోగ్యం, పర్యావరణం, ఎయిడ్స్ నిర్మూలన, కుటుంబ నియంత్రణ, వ్యవసాయం మొదలైన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి మంచి మార్గంగా ఉంది.
ఎన్నో కళాబృందాలు తెలంగాణా సాధన కోసం చేసిన ప్రదర్శనలు విజయానికి కారణమైనాయి.

Exam Tips:

a) గొల్లసుద్దులు వల్ల చైతన్యం, చెడును తొలగించే ప్రయత్నం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం అనే ప్రయోజనాలను జాబితాగా రాయండి.

 

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు – పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: గొల్ల సుద్దులు అంటే ఏమిటి ?

Answer:

గొల్ల సుద్దులు అంటే గొల్లలు చెప్పే సుద్దులు. అంటే మంచి మాటలు. ఇందులో ప్రధానకథకుడు ఆటపాటలతో ప్రేక్షకులను అలరిస్తాడు. అటూ ఇటూ ఉన్న ఇద్దరు చెవికి చెయి కప్పి సాగదీసి వంతపాడుతారు. ఈ ప్రదర్శనలో వీరణాలు, కొమ్ములనుపయోగిస్తారు. ఈ ప్రదర్శనలో కథకుడు ప్రేక్షకుల మధ్య నుండి రంగస్థలం మీది కొస్తాడు. తప్పిపోయిన గొర్రెలను వెతుకుతున్నట్లు వంతలు ఆ మూలనుంచి ఒకరు ఈ మూలనుంచి ఒకరూ వస్తారు.
వీళ్ళ వేషధారణ మోకాళ్ళ వరకు మడిచి కట్టిన పెద్ద అంచు పంచె, నెత్తికి రుమాలు, చెవులకు దుద్దులు ముంజేతికి కడియాలు, వెండి బిళ్ళల మొలతాడు, భుజం మీద గొంగడి, కాళ్ళకు గజ్జెలు, చేతిలో కర్రతో గమ్మత్తుగా ఉంటారు. రకరకాల యాసభాషతో ఆద్యంతం నవ్విస్తుంటారు. కథను ఎటంటే అటు మలుపుతిప్పుతూ అందరినీ ఆకట్టుకుంటారు. సామాజిక చైతన్యం కలిగించాలంటే ఈ ప్రక్రియలో చెప్తే సామాన్యులు తేలికగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రదర్శనకు డప్పు, డోలక్ ఉపయోగిస్తున్నారు. సమస్యలను పరిష్కారాలను సుద్దుల రూపంలో చెబుతారు. సమాజంలోని చెడును తొలగించే ప్రయత్నం ఈ కళారూపంలో కనబడుతుంది.

Exam Tips:

a) గొల్లసుద్దులు = గొల్లలు చెప్పే మంచి మాటలు; వేషధారణ (పంచె, రుమాలు, గొంగడి, గజ్జెలు), వంతపాడేవారు, వాయిద్యాలను పది వాక్యాల్లో రాయండి.

 

Question 2: పిట్టల దొర ప్రదర్శన గురించి రాయండి.

Answer:

పిట్టల దొర వేషం చూస్తేనే నవ్వొస్తుంది. మాటలు వింటుంటే పగలబడి నవ్వాలనిపిస్తుంది. గమ్మత్తైన వేషం, చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతూ పైకి డాంబికాలు చెప్తూనే తన వెనుక నున్న కష్టాన్ని గుర్తించక అందర్నీ నవ్విస్తూ ఇంటింటికీ తిరిగి యాచిస్తుంటాడు. పిట్టల దొర. ఒక పక్క పైకి మడిచిన ఖాకీప్యాంటు, చినిగిన అంగి, తెల్ల ఈకతో కూడిన ఇంగ్లీషు దొరల టోపి, మెడలో రుమాలు, సన్నటి మీసం, కాళ్ళకు బూట్లు, భుజానికి కట్టెతుపాకి, ముఖానికి తెల్లరంగు ఇదీ పిట్టల దొర వేషం. “మా తాత తట్టల్గొర.
మానాన్న బుట్టల్గొర. నేను పిట్టల్గొర. నన్నందరూ లత్కోర్ సాబంటరు. మారాజా! నాకేం తక్కువ లేదు. తీసుకు తింటే తరుక్కపోద్దని అడుక్కతింటున్న. నా పెళ్ళికి అమెరికా, సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్ అన్ని దేశాల నుండి అందరచ్చిండ్రు. అందరికి తిండి సరిపోవాలని పేర్ల బియ్యం పోసిన తూంకింద మంట బెట్టిన చింతాకిస్తర్లేసి ఇద్దరికిత్తు సొప్పున మస్తుగ వడ్డిస్తే బద్దం తిన్నరు బాంచెను. మీ అందర్ని సూత్తంటే పెండ్లి కొచ్చినట్లే ఉన్నరు. కాని కట్నాల బుక్కులో ఒక్కరి పేరూ లేదు.” ఇలాంటి హాస్య సంభాషణలకు నవ్వని వారుంటారా ? ఇదీ పిట్టల దొర ప్రదర్శన.

Exam Tips:

a) పిట్టలదొర వేషం (ఖాకీ ప్యాంటు, టోపీ, కట్టెతుపాకి), హాస్య సంభాషణ ఉదాహరణను తప్పక రాయండి.

 

పరిచిత గద్యభాగాలు

Question 1: కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఈ కళలు ఇప్పటివి కావు. వందల సంవత్సరాలుగా వర్ధిలుతున్న ప్రజా కళలు పల్లె జీవనంతో, సంస్కృతితో కలిసిపోయిన కళలు. ప్రజల సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు. తరతరానికి రూపాన్ని మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు, జీవితంలో ఓ భాగంగా సాగి కదిలి కదిలించిన ఈ ప్రజాకళలు ఆదరణ లేక కనుమరుగై పోతున్నాయి. వీటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిది.
ప్రశ్నలు :
1. ఈ కళలు ఎప్పటివి ?

Answer:

వందల సంవత్సరాల నాటివి.

Exam Tips:

a) పేరా చదివి జవాబు రాసేటప్పుడు పేరాలోని పదాలనే వాడండి; ‘ఎప్పటివి’ అంటే కాలం: వందల సంవత్సరాల నాటివి.

 

Question 2: ఇవి ఎవరి కళలు ?

Answer:

ప్రజల కళలు

Exam Tips:

a) ‘ఎవరి కళలు’ అంటే ప్రజల కళలు అని చిన్న వాక్యంలో రాయండి.

 

Question 3: ఇవి వేటికి పదును పెట్టాయి ?

Answer:

ప్రజల ఆలోచనలకు

Exam Tips:

a) ‘వేటికి’ అంటే దేనికి; జవాబు: ప్రజల ఆలోచనా విధానానికి.

 

Question 4: జీవితంలో ఈ కళల స్థానమేమిటి ?

Answer:

ఇవి జీవితంలో ఒక భాగం

Exam Tips:

a) జీవితంలో ఈ కళలు ఒక భాగంగా సాగాయని పేరాలోని మాటల ఆధారంగా రాయండి.

 

Question 5: వీటిని మనం ఏం చేయాలి ?

Answer:

సంరక్షించుకోవాలి.

Exam Tips:

a) చివరి వాక్యం ఆధారంగా జవాబు: వీటిని సంరక్షించుకోవాలి (బాధ్యత మనందరిది).

 

Question 6: కింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు రాయండి.
జానపదులు అనగా పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, చిందుబాగోతాలు, చిడుతలరామాయణం, కోలాటం, భజన, తుపాకిరాముడు, పిట్టలదొర మొదలగునవి. జానపద కళలకు ఉదాహరణలు. భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవత కథలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు, వీరుల కథలు లాంటివి ఏండ్లకేండ్లుగా ఈ జానపద కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చినాయి. పల్లె ప్రజలు నిరక్షరాస్యులు. అట్లాంటి కాలంలో వాళ్లకు వినోదంతో పాటు నీతిసూత్రాల ఆలోచనను కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడేవి. వీటిలో యక్షగానాలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు గురించి తెలుసుకుందాం.

Answer:

1. జానపదులు అంటే ఎవరు ?
2. పల్లెల్లో అలరారు కళలను ఏమంటారు ?
3. పల్లె ప్రజలు ఎటువంటివారు ?
4. జానపద కళలకు ఒక ఉదాహరణ రాయండి.
5. జానపదకళలు పల్లె ప్రజలకు ఏమి కలిగిస్తాయి ?

Exam Tips:

a) పేరాలోని ప్రతి వాక్యం నుంచి ఒక ప్రశ్న చొప్పున ఎవరు, ఏమిటి, ఎటువంటి వంటి ప్రశ్నపదాలతో ఐదు ప్రశ్నలు రాయండి; జవాబు పేరాలో ఉండాలి.

 

Question 7: కింది పేరాను చదివి వాక్యాలలోని ఖాళీలు పూర్తిచేయండి.
తబల, తాళం, హార్మోనియంలను ఇందులో వాయిద్యాలుగా వాడతారు. వేషకాడు పాట పాడుతుంటే పాటకు అనుగుణంగా తబల తాళం మోగుతుంది. హార్మోనియం వీటితో జతకడుతుంది. తబల తాళం కొట్టేవాళ్లు మ్యాల్లంలో సభ్యులై ఉంటారు. వీరు కూడా వేషం వేస్తారు. వీరు స్టేజిమీదికి వెళ్లినప్పుడు ఆ బాధ్యతను మరొకరు తీసుకుంటారు.
1. తబల, ……………….., …………….. లను ఇందులో వాయిద్యాలుగా వాడతారు.
2. ……………….. పాట పాడుతుంటే తబల తాళం మోగుతుంది.
3. హార్మోనియం వీటితో ……………………
4. తబల తాళం కొట్టేవాళ్ళూ …………………. లో సభ్యులై ఉంటారు.
5. వీరు స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ఆ …………………. ను మరొకరు తీసుకుంటారు.

Answer:

1. తబల, తాళం, హార్మోనియంలను ఇందులో వాయిద్యాలుగా వాడతారు.
2. వేషకాడు పాట పాడుతుంటే తబల తాళం మోగుతుంది.
3. హార్మోనియం వీటితో జతకడుతుంది
4. తబల తాళం కొట్టేవాళ్ళూ మ్యాల్లంలో సభ్యులై ఉంటారు.
5. వీరు స్టేజి మీదికి వెళ్ళినప్పుడు ఆ బాధ్యతను మరొకరు తీసుకుంటారు.

Exam Tips:

a) ఖాళీలను పేరాలోని పదాలతో పూరించి నంబర్లతో రాయండి; తబల, తాళం, హార్మోనియం, వేషకాడు, మ్యాల్లం, బాధ్యత పదాలు సరిపోతాయి.

 

Free study material for Telugu Upavachakam

Telugu Upavachakam Class 8 Curriculum Solutions: Lesson 05 Janapada Kalalu

Accessing Lesson 05 Janapada Kalalu Solutions

Access structured TS Board textbook solutions for Lesson 05 Janapada Kalalu. Designed in alignment with the latest academic curriculum for Class 8 Telugu Upavachakam, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 8 Telugu Upavachakam

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 05 Janapada Kalalu concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Telugu Upavachakam.

FAQs

Where can I find the latest TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు for the 2026-27 session?

The complete and updated TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu Upavachakam are as per latest TS Board curriculum.

Are the Telugu Upavachakam TS Board solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu Upavachakam concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు will help students to get full marks in the theory paper.

Do you offer TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Telugu Upavachakam. You can access TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు in both English and Hindi medium.

Is it possible to download the Telugu Upavachakam TS Board solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire TS 8th Class Telugu Guide ఉపవాచకం 5th Lesson Telangana జానపద కళలు in printable PDF format for offline study on any device.