TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం

Official TS Board Solutions for Class 8 Telugu: Lesson 02 Sea Voyage (Samudra Prayanam)

Review structured textbook solutions for Class 8 Telugu Lesson 02 Sea Voyage (Samudra Prayanam). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Chapter-wise Solutions for Telugu: Lesson 02 Sea Voyage (Samudra Prayanam)

Access the complete solution PDF for Class 8 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

Question 1: పడవలోని వాళ్ళు ఎక్కడికి ప్రయాణమైపోతున్నారు ?

Answer:

పడవలోని వాళ్ళు బొంబాయి నుండి ఇంగ్లండుకు ప్రయాణమైపోతున్నారు.

Exam Tips:

a) పాఠం ప్రారంభంలోని చిత్ర ప్రశ్నలకు చిత్రంలో కనిపించే అంశాల ఆధారంగా ఒకటి రెండు వాక్యాల్లో జవాబు రాస్తే చాలు.

 

Question 2: వాళ్ళు బ్రిటన్‌కు ఎందుకు వెళ్ళి ఉండవచ్చు ?

Answer:

వాళ్ళు చదువుకోవడానికి బ్రిటన్కు వెళ్ళి ఉండవచ్చు.

Exam Tips:

a) ఊహించి చెప్పే ప్రశ్న కాబట్టి ‘ఉన్నత చదువు కోసం’ అనే తార్కికమైన కారణం ఇవ్వండి.

 

Question 3: పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పటానికి గల కారణాలు ఏమై ఉంటాయి ?

Answer:

ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అనుకున్నచోటుకు క్షేమంగా చేరినందుకు దేవుడికి కృతజ్ఞతా వందనం చెప్పి ఉండవచ్చు. ఎంతో దూరంలో ఉన్న బ్రిటన్కు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా చేరినందుకు కృతజ్ఞతలు చెప్పి ఉండవచ్చు.

Exam Tips:

a) క్షేమంగా చేరడం, ప్రమాదాలు జరగకపోవడం, దూరం వంటి కారణాలను రెండు మూడు రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 13)

Question 1: వాహనాలు కాన్వాయ్గా వెళ్ళడం ఎప్పుడైనా చూశారా ? దేని కొరకు అట్లా వెళ్తాయి ?

Answer:

వాహనాలు కాన్వాయ్గా వెళ్ళటం చాలాసార్లు చూశాము. రాజకీయ నాయకులు, మంత్రులు ప్రయాణం చేస్తున్నపుడు వారికి రక్షణగా బందోబస్తు కొరకు కాన్వాయ్లు వెళ్తుంటాయి.

Exam Tips:

a) మీ స్వీయ అనుభవం ఆధారంగా రాయండి: కాన్వాయ్ అంటే ఒకదాని వెంట ఒకటిగా రక్షణతో వెళ్ళే వాహనాల వరుస అని చెప్పండి.

 

Question 2: సైరన్ లేదా అలారం ఎందుకు మోగిస్తారు ?

Answer:

ఒక సంకేతాన్ని గాని, హెచ్చరికను గాని సూచించటానికి సైరన్ లేదా అలారం మోగిస్తారు.

Exam Tips:

a) సైరన్/అలారం హెచ్చరిక లేదా సంకేతం ఇస్తాయి అని చెప్పి ఒక ఉదాహరణ (అంబులెన్స్, ప్రమాద సూచన) ఇవ్వండి.

 

Question 3: దూర ప్రయాణాలకు ఎట్లా సిద్ధం కావాలి ?

Answer:

దూర ప్రయాణాలకు సిద్ధమయ్యేటప్పుడు మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.
కావలసినంత డబ్బు, దుస్తులు, వస్తు సామగ్రిని, మందులను సిద్ధంగా ఉంచుకోవాలి.

Exam Tips:

a) డబ్బు, దుస్తులు, మందులు, తెలిసిన వారి చిరునామా – జాబితాగా రాయడం స్పష్టంగా ఉంటుంది.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 14)

Question 1: ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ప్రయాణీకులు ఏమేం చేస్తుంటారో చెప్పండి.

Answer:

ఇప్పుడు ప్రయాణంలో కాలక్షేపం కొరకు ఎఫ్.ఎమ్. రేడియోలు, లాప్టాప్లు, సెల్ఫోన్లు వాడుతున్నారు. వీటితోపాటుగా హౌసీ, చదరంగం వంటి ఆటలు ఆడుతున్నారు. కొంతమంది అంత్యాక్షరి పోటీలు కూడా పెట్టుకుంటారు.

Exam Tips:

a) ఆధునిక సాధనాలు (రేడియో, సెల్‌ఫోన్) మరియు ఆటలు (చదరంగం, అంత్యాక్షరి) అని రెండు రకాలుగా విభజించి రాయండి.

 

Question 2: ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో ఎట్లా ఉండాలి ? ఎందుకు ?

Answer:

ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణీకులతో సౌమ్యంగా, మర్యాదగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. వారితో కలిసిపోయి ఉండటానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే వారి భావాలు మనకు, మన భావాలు వారికి తెలుస్తాయి. నలుగురిలో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.

Exam Tips:

a) ‘సౌమ్యంగా, మర్యాదగా’ ఉండాలి అని చెప్పి కారణం (భావాల ఆదానప్రదానం, నలుగురిలో మసలే నేర్పు) తప్పక రాయండి.

 

Question 3: కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి భాష అర్థం కాకపోతే ఎటువంటి చిక్కులెదురవుతాయి ? అప్పుడు మీరేం చేస్తారు?

Answer:

కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు అక్కడి భాష అర్థంకాకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటప్పుడు వారు మాట్లాడేటప్పుడు వారి హావభావాలను బట్టి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. లేదా ‘దుబాసీ’ని ఏర్పాటు చేసుకుంటాం.

Exam Tips:

a) ఇబ్బందులు, మీరు చేసే పరిష్కారం (హావభావాలు, దుబాసీ) అని రెండు భాగాలూ రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 15)

Question 1: విదేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని సరిచేసుకోవాలి. దీనికి కారణం ఏమిటి ?

Answer:

సూర్యుడు తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేస్తాడు. కాబట్టి పశ్చిమ దేశాలకు వెళ్ళేటప్పుడు గడియారంలో సమయాన్ని పెంచుకోవాలి. తూర్పుదేశాలకు వెళ్ళేటప్పుడు సమయాన్ని తగ్గించుకోవాలి. గ్రీన్విచ్ మీన్ అని దీనిని వ్యవహరిస్తారు.

Exam Tips:

a) సూర్యుడు తూర్పు నుంచి పడమరకు కదులుతాడు కాబట్టి దేశాల మధ్య సమయ భేదం ఉంటుంది; గ్రీన్విచ్ మీన్ టైమ్‌ను ఆధారంగా తీసుకుంటారు.

 

Question 2: విదేశాలలో మనకు తెల్సినవారు, బంధువులుంటే ఎట్లాంటి సౌకర్యాలు పొందవచ్చో చెప్పండి.

Answer:

విదేశాలలో మనకు తెల్సినవారు బంధువులు ఉంటే ఒక రకమైన ఊరట కలుగుతుంది. ఆ ప్రాంతంలోని చారిత్రాత్మక, విశిష్ట ప్రదేశాలను తెలుసుకునే అవకాశం, చూసే అవకాశం ఉంటుంది. భాష అంతగా రాకపోయినా బాధపడవలసిన అవసరం ఉండదు.

Exam Tips:

a) ఊరట, చారిత్రక ప్రదేశాల సందర్శన, భాష సమస్య తగ్గడం – మూడు సౌకర్యాలను వరుసగా రాయండి.

 

Question 3: “ఈశ్వరా నీవే దిక్కు” అని రచయిత అనుకోటానికి కారణమేమిటి ? మీకెదురైన అట్లాంటి సందర్భాన్ని చెప్పండి.

Answer:

భారతదేశం నుండి ఇంగ్లండుకు చేరిన వారివద్ద తగినంత డబ్బు లేకపోతే అట్లాంటి వారిని డీ పోర్టు చేసి వాపసు పంపుతారని, బ్రిటీషు పోలీసులు చాలా స్ట్రిక్ట్ అని రచయితకు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్ చెప్పారు. అపుడు రచయిత తనను ఇంగ్లండులో దిగనివ్వకుండా వెనక్కు పంపుతారని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాడు. నేను ఒకసారి నా మిత్రునితో కలసి బెంగుళూరు వెళ్ళాను. అపుడు మా టికెట్ను ఎక్కడో పోగొట్టుకున్నాం. టి.సి. టికెట్ చూపించకపోతే జైలుకు పంపిస్తాడేమోనని భయపడి “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుకున్నాం.

Exam Tips:

a) రచయిత భయానికి కారణం (తగినంత డబ్బు లేకపోవడం, డీపోర్ట్ చేస్తారన్న మాట) చెప్పి, తర్వాత మీ సొంత అనుభవాన్ని ఒక్క ఉదాహరణగా రాయండి.

 

ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 16)

Question 1: రచయితకు సురేశ్ బాబు సహాయం లేకుండానే పర్మిషన్ దొరకడానికి కారణం ఏమై ఉంటుంది ?

Answer:

బ్రిటన్ పోలీసులు రచయితను చూసి చదువు కొరకు వచ్చారని అనుకున్నారు. అదే విషయం రచయితను అడిగారు. రచయిత అవునని చెప్పేటప్పటికి ఇంకా ఏమీ అడగకుండానే ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు. అందువల్ల రచయితకు సురేశ్బాబు సహాయం అవసరం లేకపోయింది.

Exam Tips:

a) పోలీసులు రచయితను చూసి విద్యార్థి అనుకోవడం, ‘పర్మిటెడ్’ స్టాంపు వేయడం – ఈ రెండు సంఘటనలను క్రమంలో రాయండి.

 

Question 2: ఏఏ సందర్భాల్లో మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటారో తెల్పండి.

Answer:

కష్టంలో నుండి బయటపడ్డప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. కుటుంబ సభ్యులలో, స్నేహితులలో ఎవరైనా అనారోగ్య స్థితి నుండి బయటపడవేసినందుకు దేవునికి కృతజ్ఞతను చెప్పుకుంటాం.

Exam Tips:

a) కష్టాల నుంచి బయటపడినప్పుడు, ఆపదలో ఉన్నవారు కోలుకున్నప్పుడు వంటి నిజమైన సందర్భాలను రాయండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య పట్టుదల, ఆత్మవిశ్వాసం గలవాడని ఎలా చెప్పగలవు ?

Answer:

ఏదైనా సాధించాలంటే పట్టుదల, దృఢ సంకల్పం అవసరం. ఈ రెండూ లేకపోతే దేనినీ సాధించలేము. ఉదాహరణకు మన పాఠంలోని సముద్ర ప్రయాణం వ్రాసిన ముద్దు రామకృష్ణయ్యనే తీసుకుందాం ! ఆయన ప్రయాణ కాలం రెండవ ప్రపంచ యుద్ధకాలం. అపుడు ప్రయాణం చేయాలంటే మనసును రాయి చేసుకోవాల్సిందే ! ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన కృష్ణయ్య దృఢ సంకల్పంతో, పట్టుదలతో తన మనసులోని కోరికను, లక్ష్యాన్ని సాధించటానికి సుదూర ప్రాంతమైన గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. పైసలు లేవు, తెలిసినవారు లేరు. అయినా మంచి సంకల్ప బలం ఆయనను ఇంగ్లండుకు నడిపించింది. ఆయనలోని కృతనిశ్చయం, దృఢ సంకల్పం ఆయన విజయానికి దారితీశాయి. గ్రేట్ బ్రిటన్‌కు వెళ్ళి అక్కడి లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం.ఇడి. పట్టా పొందారు కదా !
కాబట్టి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు.

Exam Tips:

a) ఉదాహరణతో సమర్థించండి: రచయిత పైసలు లేకపోయినా పట్టుదలతో బ్రిటన్ చేరి యం.ఇడి. పొందాడు; ముగింపులో పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పండి.

 

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నవో గుర్తించి, పేరాకు శీర్షికను పెట్టండి.
1) పడవలో రిసెప్షన్ రూం కూడా ఉంటుంది.
2) నేను ధోవతి శేర్వానీతో ఉంటిని
3) ఏవేళ ప్రాణం పోతుందో
4) మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం అయింది.

Answer:

1) 13వ పేజీలో 4వ పేరా – శీర్షిక : పడవ ప్రయాణంలో సౌకర్యాలు
2) శీర్షిక : వేషధారణ
3) 12వ పేజీ 1వ పేరా – శీర్షిక : రెండవ ప్రపంచ యుద్ధం
4) 16వ పేజీ చివరి పేరా – శీర్షిక : గ్రేట్ బ్రిటన్

Exam Tips:

a) పేరా సంఖ్యతో పాటు పేరా సారాంశాన్ని సూచించే చిన్న శీర్షిక (రెండు మూడు పదాలు) రాయండి.

 

Question 2: కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వేస్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.
ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమి రోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది.
అ) బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు ?
ఆ) సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది ?
ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు ?
ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ?
ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి.

Answer:

అ) బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి.
ఆ) సరస్వతీదేవి ఆలయం గోదావరి నదీ తీరాన ఉన్నది.
ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు వేదవ్యాస మహర్షి.
ఈ) నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి.
ఉ) ఆధ్యాత్మికతకు మారుపేరు – బాసర.

Exam Tips:

a) పేరాలోని వాక్యాల నుంచే సమాధానాన్ని ఎంచుకొని ఒకటి రెండు వాక్యాల్లో రాయండి; శీర్షిక పేరా మొత్తం భావాన్ని సూచించాలి.

 

III. స్వీయరచన – ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?

Answer:

దూర ప్రయాణాలకు పోయేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బు చేతినిండా ఉంచుకోవాలి. ఆయా ప్రాంతాన్ని బట్టి దుస్తులను సమకూర్చుకోవాలి. అక్కడ ఎవరైనా తెలిసిన వారుంటే వారి చిరునామా, ఫోన్ నంబర్లను తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను కొంతన్నా మాట్లాడగలగాలి. ముందే ఆ భాషను నేర్చుకొని ఉండాలి. లేదా ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందిన ఏదో ఒక భాషను నేర్చుకొని ఉండాలి. దానితోబాటుగా మన భాషలోను, ఆ ప్రాంతం భాషలోను చక్కగా మాట్లాడగలిగే వారిని ముందుగా కలుసుకోవటం చేయాలి.

Exam Tips:

a) జాగ్రత్తలను పాయింట్ల వారీగా ఐదు వాక్యాల్లో రాయండి: డబ్బు, దుస్తులు, తెలిసినవారి సంపర్కం, భాష.

 

Question 2: రచయిత ఉన్నతవిద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా ! దీని ద్వారా మీరేం గ్రహించారు ?

Answer:

కృషి, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలమన్న విషయాన్ని రచయిత ఇంగ్లాండుకు వెళ్ళిన సంఘటన రుజువు చేస్తోంది. జ్ఞానాన్ని సంపాదించటానికి ఎల్లలుండవు. దేన్నైనా సాధించాలనే దృఢ సంకల్పం ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. మంచి సంకల్పం ఉంటే విజయాలు వాటంతట అవే వెతుక్కుని వస్తాయట. కనుక మనం దేనిలో విజయం సాధించాలనుకున్నామో దానిని సాధించటానికి పట్టుదలతో కృషిచేయాలని గ్రహించాము.

Exam Tips:

a) ‘దీని ద్వారా గ్రహించింది’ అంటే నీతి/పాఠం: కృషి, పట్టుదల, దృఢ సంకల్పం విజయాన్నిస్తాయి – ఈ నీతిని చివరి వాక్యంలో స్పష్టంగా రాయండి.

 

Question 3: “ఉన్నత లక్ష్యం, పట్టుదలతో, దేనినైనా సాధించవచ్చు” వివరించండి.
(లేదా)
సముద్ర ప్రయాణం పాఠం ఆధారంగా పట్టుదలతో దేనినైనా సాధించవచ్చును అని వివరించండి.

Answer:

ఉన్నత లక్ష్యంతో, పట్టుదలతో దేనినైనా సాధించవచ్చన్నది యథార్థం. స్వామి వివేకానంద భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. దానికోసం ఆయన ప్రపంచదేశాలన్నీ చుట్టి వచ్చాడు. చేతిలో డబ్బుల్లేకపోయినా, ఎన్నో రోజులు పస్తులున్నా ఆయన ముందు తన దేశభక్తిని ప్రపంచానికి చాటాలనే లక్ష్యం ఉండటం చేత ఆ సమస్యలు ఆయనను ఏమి చేయలేక పోయాయి. చికాగోలో ఉపన్యాసానికి ముందు ఆయన ఆహారం లేక సొమ్మసిల్లి పడిపోతే ఆయనను ఎక్కడో చూసిన ఒక స్త్రీ రక్షించి ఆహారాన్నిచ్చి ఆయనను చికాగో నగరానికి పంపించింది. కాబట్టి ఉన్నత లక్ష్యం, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించగలం అన్నది నిజం.

Exam Tips:

a) పాఠం నుండి ఒక ఉదాహరణ, బయటి ఒక ఉదాహరణ (స్వామి వివేకానంద) – రెండూ ఇస్తే సమాధానం బలంగా ఉంటుంది.

 

Question 4: ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేంచేస్తారు ?

Answer:

క్రొత్త ప్రదేశాన్ని దర్శించినపుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రదేశంలో పరిచయమున్నవారితో స్నేహం చేసి తెలుసుకుంటాం. ఆ ప్రాంతానికి సంబంధించిన అట్లాసు, గైడ్లపై ఆధారపడతాం. తెలిసిన బంధువులు, స్నేహితులు, మన వూరివారు ఆ ప్రాంతంలో ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకుంటాం. అక్కడున్న పర్యాటక ఏజెన్సీలలో సంప్రదిస్తాం.
అక్కడి వింతలు, విశేషాలు తెలుసుకుని వాటిని చూడటానికి ప్రయత్నిస్తాం. నేటి సాంకేతిక పరిణామాలను అనుసరించి ‘నెట్’ ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాం. ‘వికిపీడియా’ ప్రపంచాన్నంతటిని మన చేతుల్లోకి తెచ్చింది కదా ! దానిని ఉపయోగించి మరింత సమాచారాన్ని తెలుసుకుంటాం.

Exam Tips:

a) స్థానికులతో స్నేహం, అట్లాస్/గైడ్లు, పర్యాటక సంస్థలు, ఇంటర్నెట్ – ఆచరణాత్మక మార్గాలను రాయండి.

 

Question 5: గ్రేట్ బ్రిటన్‌ని చేరిన రచయిత మనఃస్థితిని వివరించండి.

Answer:

రచయిత ఎన్నో అడ్డంకులను అధిగమించి చదువుకోసం చివరికి గ్రేట్ బ్రిటన్ చేరుకున్నారు. పడవలో నుండి బయటకు అడుగుపెట్టగానే ఆయనకు పట్టరాని సంతోషం కలిగింది. గ్రేట్ బ్రిటన్ని చూస్తూ అలా నిలబడిపోయారు. సాధ్యం కాదనుకున్న దానిని దేవుడు సాధ్యం చేశాడు. “ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టిన నేనెక్కడ, బ్రిటన్ ఎక్కడ ! పైసా లేకుండా రావటం ఎంత ఆశ్చర్యం. ఆ ఈశ్వరుడే నన్ను రక్షించి ఇక్కడకు తీసుకువచ్చాడు.” అని రచయిత అనుకున్నాడు. బ్రిటన్ సుందర దృశ్యాలను చూసే అదృష్టాన్ని ఉన్నత చదువులు చదివే అదృష్టాన్ని తనకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలను తెలుపుకున్నాడు.

Exam Tips:

a) సంతోషం, ఆశ్చర్యం, దేవునికి కృతజ్ఞత – ఈ మూడు భావాలను రచయిత మాటల ఆధారంగా రాయండి.

 

Question 6: సురేష్ బాబుకు, రచయితకు మధ్య జరిగిన సంభాషణను వివరించండి.

Answer:

రచయిత గ్రేట్ బ్రిటన్కు ప్రయాణమయ్యాడు. ఆయనతో పాటు కరీంనగర్కు చెందిన జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గారి అబ్బాయి సురేష్ బాబు ప్రయాణించాడు. ఆయన స్కాలర్షిప్తో పాటు దండిగా డబ్బులు తెచ్చుకుంటున్నాడు. రచయిత తనని తాను పరిచయం చేసుకొని క్లుప్తంగా తన దీన పరిస్థితిని, చదువుకోవాలన్న ఆసక్తిని వినిపించాడు. తన దగ్గర డబ్బు లేదన్న రహస్యాన్ని ఎవరికి చెప్పవద్దని వాగ్దానం తీసుకున్నాడు.
సురేష్ రచయిత “బాబు ! నీకు డబ్బు ప్రశ్న లేదు. నీ దగ్గరున్న 150 పౌండ్ల డ్రాఫ్ట్ ఉంది. అందులో వంద పౌండ్లు నావి అని చెప్పు” అని వేడుకున్నాడు. “నీ డబ్బు అడగను నన్ను పడవ దిగేటట్లు చూడు” అని కోరాడు. సురేష్ బాబు సరేనని ఒప్పుకున్నాడు. అయితే రచయితకు సురేష్ బాబు సహాయం లేకుండానే చివరికి ‘పర్మిటెడ్’ అని స్టాంపు వేశారు బ్రిటన్ పోలీసులు. అయినా తనకు ఒక ధీమాను, ఓదార్పును ఇచ్చిన సురేష్ బాబుకు రచయిత కృతజ్ఞతలను చెప్పుకున్నాడు.

Exam Tips:

a) సంభాషణ సారాంశం: తన పరిస్థితి చెప్పడం, రహస్యంగా ఉంచమనడం, 100 పౌండ్ల విషయం, చివరికి సహాయం అవసరం లేకపోవడం.

 

Question 7: రచయిత ఎడెన్‌లో దిగినప్పటి అనుభవాలను రాయండి.

Answer:

గ్రేట్ బ్రిటన్లో మొదటి మజిలీ ఆడెన్ (ఎడెన్). ఎడెన్ పట్టణంలోకి వెళ్ళటానికి రచయిత తోటి ప్రయాణీకులకు అనుమతి లభించింది. రచయిత తోటి ప్రయాణికుడి బంధువులు ఆడెన్లో ఉన్నారు. అందులో ఒకరు కారును తీసుకువచ్చి ఆడెన్ ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రాంతాలన్నీ చూపించాడు. వారింటిలోనే శాకాహార భోజనాన్ని వీరికి అందించాడు. కొంత విశ్రాంతి అనంతరం రచయితను ఆయనతో ఉన్న గుజరాతీ పిల్లలను మరల ఓడరేవులో దించేశాడు. ఆడెన్లో ఉండే వారందరూ దాదాపు అరబ్బీ ముస్లింలే. హైదరాబాద్ లోని ముస్లింల మొహల్లా ఉన్నట్లు ఆడెన్ ఉంటుంది. అది ఒక గొప్ప అనుభవంగా రచయిత భావించాడు.

Exam Tips:

a) ఆడెన్ అనుభవాలు: అనుమతి, బంధువు కారులో చారిత్రక ప్రదేశాలు, శాకాహార భోజనం, అరబ్బీ ముస్లింల మొహల్లా.

 

III. స్వీయరచన – పది వాక్యాల్లో జవాబులు రాయండి

Question 1: “అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైనది.” ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి.
(లేదా)
“అనుకున్నది సాధించడంలో ముద్దు రామకృష్ణయ్య ఎంతో సంతృప్తి పొందాడు.”
(లేదా)
అనుకున్నది సాధించినపుడు పొందే తృప్తి ఎట్లాంటిది?

Answer:

ముద్దు రామకృష్ణయ్య జనన విశేషాలు:
ముద్దు రామకృష్ణయ్య కరీంనగర్ జిల్లాలోని మంథని గ్రామంలో అక్టోబరు 18, 1907 లో జన్మించాడు. ఈయన తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. ఈయన ఒక బడి పంతులు. ఉన్నత విద్య కోసం రామకృష్ణయ్య గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకున్నాడు. తగినంత ధనం లేకపోయినా అనుకున్నది సాధించాడు.
గ్రేట్ బ్రిటన్ ప్రయాణం:
అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. ప్రయాణం మొదలయింది. బ్రిటన్లో ఎవరిని కలవాలో తెలీదు. ఎలాంటి ప్రతిఘటనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకున్నాడు రచయిత. తనకున్న రెండు జతల బట్టలను పైజమా కుర్తాలను సర్దుకుని పాస్పోర్టు 22 పౌండ్ల ధనాన్ని తీసుకుని పడవ ఎక్కాడు. ఆయన కండ్ల ముందు ఒకటే లక్ష్యం. ఆ లక్ష్య సాధనే ఆయన సిద్ధాంతం. తాను అనుకున్న ఉన్నత విద్యను సాధించాలని ప్రయాణం ప్రారంభించాడు.
సహాయకులు:
ఆయనకు పడవలో తొలి పరిచయస్తుడు ఆంగ్లో ఇండియన్ ఫాల్సెట్టు. ఆయన బ్రిటన్ గురించి అక్కడి అలవాట్లను గురించి వివరించాడు. తరువాత కరీంనగర్ నుండి బయలుదేరిన సురేష్ బాబు పరిచయం ఏర్పడి పడవ దిగేవరకు రచయితకు భరోసా ఇచ్చాడు.
బ్రిటన్లో కాలుపెట్టిన రచయిత అనుభూతి:
స్టడీస్ కొరకు వచ్చాడని తెలుసుకున్న పోలీసులు తేలికగానే పర్మిషన్ ఇవ్వటంతో బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గ్రేట్ బ్రిటన్‌ను చూస్తూ అలా నిలబడిపోయాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాననుకున్నాడు. సంకల్పం, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించగలం అన్న నమ్మకాన్ని అందరికి కలిగించాడు ముద్దు రామకృష్ణయ్య. అనిర్వచనీయమైన సంతృప్తి పొందుతాడు.

Exam Tips:

a) పది వాక్యాలకు మూడు శీర్షికల నిర్మాణం (జననం – ప్రయాణం – బ్రిటన్‌లో అనుభూతి) పాటించండి; ‘తృప్తి’ గురించి ముగింపు వాక్యం రాయండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: చదువును కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, ఇష్టంగా చదువుకుని, అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.

Answer:

ఖమ్మం, ది. XX. XX. XXXX
ప్రియమైన మిత్రుడు యాదగిరికి,
నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని భావిస్తున్నాను. నీ చదువు ఎలా సాగుతోంది. కష్టపడి పనిచేయాలి ఇష్టంగా చదవాలి అంటారు పెద్దలు. మొక్కుబడిగా చదివే చదువు బుర్రలోకి ఎక్కదు. జ్ఞాపకం ఉండదు. అందువల్ల ఎన్నిగంటలు చదివినా, చదవడం అవగానే మరచిపోతాము. అదే ఇష్టపడి చదివితే, మనసులోకి ఎక్కుతుంది. ఎన్నాళ్ళైనా మరచిపోవడం జరగదు. అందుకే చదువును ఎప్పుడూ కష్టంగా భావించకూడదు. ఉన్నత లక్ష్యాలను సాధించటానికి చదువు మూలం. చదువు మనకు సంస్కారాన్నిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. కాబట్టి చక్కగా చదువుకుని లక్ష్యాన్ని సాధించి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. లక్ష్యం ఉన్నతంగా ఉంటే, దానిని సాధించడానికి క్రమశిక్షణతో కృషిచేస్తాము. లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతాము. ఇలా కష్టపడి సాధించిన లక్ష్యం ఎంతో ఆనందాన్నిస్తుంది.
ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని వినాలని కోరిక. తప్పక రాస్తావు కదూ !
ఇట్లు నీ ప్రియమైన మిత్రుడు,
జమలయ్య.
చిరునామా:
కె. యాదగిరి,
8వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూలు,
జనగాం.

Exam Tips:

a) లేఖ నిర్మాణం: స్థలం, తేదీ, సంబోధన, విషయం, ముగింపు వాక్యాలు, ‘ఇట్లు’ మరియు చిరునామా.

 

Question 2: మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
(లేదా)
ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఉంటే వ్రాయండి.

Answer:

మేము మా కుటుంబంతో కలసి వేసవి సెలవులలో ఎక్కడికన్నా వెళ్లామనుకున్నాం. మా తాతగారు ఒరేయ్ మీకు ప్రకృతి అంటే ఏమిటో చూపిస్తాను వస్తారా ? అన్నారు. అందరం సరేనన్నాం. ఒక గంటలోనే అందరం ప్రయాణానికి సిద్ధం అయ్యాం. పెద్ద టాటా సుమో కారు మా యింటి ముందుకు వచ్చి ఆగింది. ఎక్కడికో ఏమిటో చెప్పనేలేదు. అందరం దాన్లో ఎక్కి కూర్చున్నాం. నేను తాతగారు ముందు, మిగిలిన వారందరూ వెనుక కూర్చున్నాం. అప్పుడన్నారు తాతగారు మనం భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్తున్నాం అని. ఇది కూడా ఒక ప్రయాణమేనా అని అందరం ఉసూరుమన్నాం. వాహనం ముందుకు సాగింది. భద్రాచలం అడవుల గుండా ప్రారంభమైన మా ప్రయాణం చింతూరు, మారేడుమిల్లి మీదుగా సాగింది.
అది చిన్న ఘాట్ రోడ్. కొండలు, గుట్టలు, లోయలు దారంతటా దర్శనమిస్తున్నాయి. నిజమైన ప్రకృతి సంపద వృక్షసంపద. ఆకాశాన్నంటే ఎత్తైన వృక్షాలు, ఋషుల జడలు లాగా అల్లుకున్న తీగలు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాగా ఉంది ఆ అడవి. పెద్ద పెద్ద సెలయేళ్ళు జలజలా ప్రవహిస్తుంటే ఒళ్ళు జలదరించింది.
పక్షుల కిలకిలా రావాలు, కీచురాళ్ళు పెట్టే ధ్వని మధ్యమధ్యలో అడవిలో తిరుగాడే కోతులు, చిరు జంతువుల అరుపులు, తోడేళ్ళ, నక్కల ఊళలు నిజంగా ప్రకృతి అంటే ఇదేగా అన్నట్లున్నది. ఆ ఘాట్రోడ్డులో జనసంచారమే కాదు వాహన సంచారం కూడా చాలా అరుదు. కొండమలుపుల్లో మాలో కలిగిన ఆందోళన అంత ఇంత కాదు. ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నాం. భయపడ్డాం. కానీ, అక్కడ వాతావరణం చూస్తే పళ్ళు, పూలతో అలరిస్తున్న చెట్లు నిజంగా అది ఒక స్వర్గలోకం అనిపించింది. తాతగారు చెప్పిన ప్రకృతి అర్థం ఇదా అని, ఇంతటి సుందర ప్రాంతాన్ని చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం.

Exam Tips:

a) వ్యాసంలో ఆరంభం (ప్రయాణ నేపథ్యం), మధ్య (దారిలో దృశ్యాలు, ఇబ్బందులు), ముగింపు (అనుభూతి) ఉండాలి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి.
అ) పై చదువుకు సరిపడా ద్రవ్యం నా వద్ద లేకుండె.
ఎ) శక్తి బి) సామర్థ్యం సి) డబ్బు డి) వస్తువు
ఆ) నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను.
ఎ) మాటతీసుకొను బి) మాటయిచ్చు సి) మాట మార్చు డి) డబ్బు యిచ్చు

Answer:

అ) సి) డబ్బు (ద్రవ్యం = డబ్బు)
ఆ) బి) మాటయిచ్చు (వాగ్దానం = మాట ఇవ్వడం)

Exam Tips:

a) సందర్భానికి సరిపోయే అర్థాన్ని ఎంచుకొని ఎంపిక అక్షరంతో పాటు పదాన్ని కూడా రాయండి.

 

Question 2: కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా : అందెవేసిన చేయి – సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి.
అ) పట్టరాని సంతోషం
ఆ) దేవునిపై భారంవేయు
ఇ) గుండె జల్లుమను
ఈ) చెమటలు పట్టు

Answer:

అ) నా కథకు మొదటి బహుమతి రావటం పట్టరాని సంతోషాన్నిచ్చింది.
ఆ) కష్టకాలంలో దేవునిపై భారం వేయటం. కష్టం తీరగానే మరచిపోవడం మానవ నైజం.
ఇ) రోడ్డు ప్రమాదాన్ని చూసి నా గుండె జల్లుమన్నది.
ఈ) పామును చూడగానే నాకు చెమటలు పట్టాయి.

Exam Tips:

a) జాతీయాన్ని వాక్యంలో ఇమిడ్చి సొంత వాక్యం రాయాలి; జాతీయంలోని పదాలు మారకుండా ఉండాలి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాయండి.
అ) ఆదిశేషునికి వేయితలలు
ఆ) కృష్ణార్జునులు సిద్ధమైనారు
ఇ) రవి, రాము అన్నదమ్ములు
ఈ) వారానికి ఏడురోజులు
ఉ) నూరేండ్లు జీవించు

Answer:

అ) వేయితలలు = వేయి సంఖ్య గల తలలు – ద్విగు సమాసం
ఆ) కృష్ణార్జునులు = కృష్ణుడును, అర్జునుడును – ద్వంద్వ సమాసం
ఇ) అన్నదమ్ములు = అన్నయును, తమ్ముడును – ద్వంద్వ సమాసం
ఈ) ఏడురోజులు = ఏడు సంఖ్య గల రోజులు – ద్విగు సమాసం
ఉ) నూరేండ్లు = నూరు సంఖ్య గల ఏండ్లు – ద్విగు సమాసం

Exam Tips:

a) విగ్రహవాక్యం రాసి సమాసం పేరు చెప్పండి. సంఖ్య మొదటి పదంగా ఉంటే ద్విగువు; ఇద్దరు సమానులైతే ద్వంద్వం.

 

Question 2: కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) విద్యాభ్యాసం
ఆ) మొదలయింది
ఇ) విద్యార్థులు
ఈ) ఏదైనా
ఉ) వారందరు

Answer:

అ) విద్య + అభ్యాసం = సవర్ణదీర్ఘ సంధి
ఆ) మొదలు + అయింది = ఉత్వసంధి
ఇ) విద్య + అర్థులు = సవర్ణదీర్ఘ సంధి
ఈ) ఏది + ఐన = ఇత్వసంధి
ఉ) వారు + అందరు = ఉత్వసంధి

Exam Tips:

a) సంధి విడదీసినప్పుడు పూర్వపదం చివర అచ్చు చూసి సంధి పేరు నిర్ణయించండి: ‘ు’ → ఉత్వసంధి, ‘ి’ → ఇత్వసంధి, ‘అ’ → అత్వ/సవర్ణదీర్ఘ సంధి.

 

Question 3: కింది పదాలను కలిపి రాయండి. ఏం జరిగిందో చెప్పండి.
ఉదా : తగిన + అంత = తగినంత.
అ) చాలిన + అంత
ఆ) సీత + అమ్మ
ఇ) అక్కడ + ఇక్కడ
ఈ) అందక + ఉండెను
ఉ) చెప్పుట + ఎట్లు
ఊ) రాక + ఏమి

Answer:

అ) చాలినంత
ఆ) సీతమ్మ
ఇ) అక్కడిక్కడ
ఈ) అందకుండెను
ఉ) చెప్పుటెట్లు
ఊ) రాకేమి
ఏం జరిగింది : పూర్వపదం చివరి ‘అ’ కారం లోపించి, పరపదం మొదటి అచ్చు దానిపై చేరింది. ఇది అత్వసంధి.

Exam Tips:

a) పూర్వపదం చివరి ‘అ’ లోపించిందని చెప్పడం మరవకండి – ఇదే అత్వసంధి లక్షణం.

 

Question 4: అత్వసంధి సూత్రాన్ని రాసి, సంధి ‘బహుళం’ అంటే ఏమిటో వివరించండి.

Answer:

సూత్రం : (అత్తు అంటే హ్రస్వమైన ‘అ’) నకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు.
సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని “బహుళం” అంటారు.

Exam Tips:

a) సూత్రం యథాతథంగా కంఠస్థం చేయండి; నిత్యం, వైకల్పికం, నిషేధం, అన్యకార్యం అనే నాలుగింటినీ ‘బహుళం’లో చెప్పండి.

 

భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని

Question 1: వివిధ పత్రికలలో వచ్చే యాత్రారచనలను చదివి, వాటిలో ఒక దానికి నివేదిక రాయండి.

Answer:

అ) ప్రాథమిక సమాచారం:
1) ప్రాజెక్టు పని పేరు : దర్శనీయ యాత్రాస్థలం – వేములవాడ
2) సమాచారాన్ని సేకరించిన విధానం : పత్రికలు చదివి
ఆ) నివేదిక:
విషయ వివరణ:
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి సుమారు 32 కి.మీ. దూరంలో నెలకొని ఉన్న వేములవాడ ప్రసిద్ధ యాత్రాస్థలం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంతో పాటు, భీమేశ్వర ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం కలవు. సుదూర ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు వేములవాడకు వచ్చి శ్రీ రాజరాజేశ్వరస్వామిని, అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి ఒకపూట ఇక్కడ నిద్రచేసి వెళ్తే తమ దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

భక్తులు బసచేయుటకు ప్రభుత్వ వసతి గృహాలతో పాటు, ప్రైవేటు లాడ్జ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయాన్ని వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు, రాజాదిత్య కట్టించినట్లు చరిత్రకారులు చెబుతారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. దీనిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇతర ఏ దేవాలయంలో లేని విధంగా భక్తులు కోడెలను కట్టివేసి మొక్కు చెల్లించుకొనే సాంప్రదాయం ఈ గుళ్ళో కలదు.
1830 ప్రాంతంలో కాశీయాత్రలో భాగంగా, నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామి, తన “కాశీయాత్ర” అనే పుస్తకంలో ఈ పుణ్యక్షేత్రం గురించి ప్రస్తావించారు. శివరాత్రి రోజున 3 లక్షల మంది భక్తులు రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. వంద మంది అర్చకులు మహాలింగార్చన చేస్తారు. రాత్రిపూట శివరాత్రి రోజున విద్యుద్దీపాల కాంతిలో ఈ దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతుంటే అది కళ్ళారా చూసి తరించాల్సిందే తప్ప నోటితో పొగడడం ఎవరి శక్యమూ కాదు.
కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడకు వేంచేశాడని పురాణ కథనం. మూల విరాట్టు రాజరాజేశ్వరస్వామి ఎడమవైపున శ్రీ రాజరాజేశ్వరిదేవి, కుడివైపున శ్రీ లక్ష్మీ సహిత సిద్ది వినాయక విగ్రహాలున్నాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్లనాటి మసీదు ఉంది. ఇలా ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. అతి పురాతనమైన భీమేశ్వర ఆలయంలో భక్తులు శనిగ్రహ దోష నివారణకు శని పూజలు జరుపుకుంటారు. ఈ దేవాలయంలో కోడెను కట్టివేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఇ) ముగింపు:
ఇంత ఘన చరిత్ర కలిగిన దేవాలయానికి ఒక్కసారి వెళ్ళి కనులారా ఆ దేవదేవుని దర్శించుకోవాలని కోరిక కలిగింది. మన గత వైభవానికి ప్రతీకలు, సంస్కృతీ సాంప్రదాయాలకు వారధులైన దర్శనీయ స్థలాల గూర్చి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే భావన నాలో కలిగింది.

Exam Tips:

a) నివేదికలో ప్రాథమిక సమాచారం, విషయ వివరణ, ముగింపు అనే మూడు భాగాలు తప్పనిసరి.

 

అదనపు ప్రశ్నలు

Question 1: రచయిత గ్రేట్ బ్రిటన్ కు వెళ్ళిన పడవ ప్రయాణంలోని సౌకర్యాలను వివరించండి.
(లేదా)
ముద్దు రామకృష్ణయ్య ప్రయాణించిన పడవలోని సౌకర్యాలు ఏమిటి ?

Answer:

రచయిత ముద్దు రామకృష్ణయ్య ప్రయాణం చేసిన పడవలో సౌకర్యాలకు కొదవలేదు. పడవ క్యాబిన్లో ఒక్కొక్కదానిలో 6 బెర్తులు ఉన్నాయి. ప్రతి పడవలోను ‘Life Boats’ ఉన్నట్లు ఈ పడవలో కూడా ఉన్నాయి. పడవ అటు చిన్నది కాదు, ఇటు పెద్ది కాదు. కొత్తగా పడవ ఎక్కినవారికి సముద్ర రోగం వస్తుంది. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. తలనొప్పి, వాంతులు అవుతాయి. డబ్బు తీసుకోకుండా పడవలోని డాక్టర్లు మందులు ఇస్తారు. రోగులు లేవలేని స్థితిలో డాక్టర్ క్యాబిన్‌లోకి వచ్చి మందులిస్తారు. పడవలో పోస్టాఫీసు కూడా ఉంది.
ప్రయాణీకులకు జాబు వస్తే క్యాబిన్‌కు తెచ్చి అందిస్తారు. అలాగే టెలిగ్రాఫ్ ఆఫీసు కూడా ఉంది. పడవలోని దుకాణాలలో మనకు కావలసిన వస్తువులను తెచ్చుకోవచ్చు. పడవ పైన రేడియో సెట్లు, లౌడ్ స్పీకర్లు అమర్చబడి ఉంటాయి. వార్తలు ఎప్పటికప్పుడు తెలుపబడతాయి. పీరియాడికల్స్ లాంజ్లో ఉంటాయి.
గొప్పవారి హోదాకు తగ్గట్లుగా లాంజ్లుంటాయి. చిన్నపిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్లుంటాయి.
వారి పూర్తి బాధ్యత పడవవారే చూసుకుంటారు. పడవలో లైబ్రరీ కూడా ఉంటుంది. ఆటలు కూడా ఆడుకునే వీలుంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సకల సౌకర్యాలతో పాటు అది రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలం అవటం చేత పడవల దిశానిర్దేశం చేస్తూ ఆకాశంలో విమానాలు అనుసరిస్తూ ఉన్నాయి.
ప్రయాణీకుల భద్రత ప్రథమలక్ష్యంగా అవి సాగుతుండేవి.

Exam Tips:

a) సౌకర్యాలను విభాగాలుగా (వైద్యం, పోస్టాఫీసు, దుకాణాలు, లాంజ్, పిల్లల సెక్షన్, లైబ్రరీ, ఈత కొలను) రాయండి.

 

Question 2: బ్రిటన్ పోలీసుల నిబద్ధతను వివరించండి.

Answer:

బ్రిటన్ పోలీసులు చాలా నిబద్ధత కలిగినవారు. వారు ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలించేవారు. ఏ మాత్రం తేడా ఉన్నా ఊరుకునేవారు కాదు. ఈ విషయం పట్ల పూర్తి అవగాహన రచయితకు ఆంగ్లో ఇండియన్ మిత్రుడు ఫాల్సెట్టు కలిగించాడు. బ్రిటన్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఉండేవారు. తగినంత డబ్బు లేకుండా విదేశీయులను బ్రిటన్లో దిగనిచ్చేవారు కాదు. అలాంటివారిని డీపోర్ట్ చేసి వెనక్కి పంపించేవారు. రచయిత కూడా ఈ విషయం విని చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆయన వద్ద కూడా తగినంత డబ్బు లేదు.
రచయితకు తనని కూడా డీపోర్టు చేసి ఇండియాకు పంపిస్తారన్న భయం పట్టుకుంది. అందుకే ఆయన “ఈశ్వరా నీవే దిక్కు” అని అనుక్షణం భగవంతునికి మొక్కుకున్నాడు. స్కాట్లాండ్ యొక్క గ్లాస్కో రేవు పట్టణంలో పడవ ఆగింది. అక్కడికి పడవ చేరకముందే పోలీసులు పడవలోకి వచ్చారు. ప్యాసింజర్ల పాస్పోర్టులను చెక్చేశారు. కొందరికి దిగటానికి పర్మిషన్ ఇవ్వలేదు. కారణం వారి దగ్గర సరైన పేపర్లు లేకపోవటం.
చివరకు రచయిత వంతు వచ్చింది. ఆయన పాస్పోర్టును చూసి మీరు “స్టడీస్ కొరకు వచ్చారా” అని అడిగి పర్మిటెడ్ అని స్టాంపు వేశారు. రచయిత బ్రతుకు జీవుడా అనుకున్నారు. ప్రతి విషయంలోనూ బ్రిటీషు పోలీసువారు మంచి నిబద్ధతతో వ్యవహరిస్తారనడానికి ఇవన్నీ కొన్ని నిదర్శనాలు.

Exam Tips:

a) పోలీసుల కఠినత: డబ్బు తనిఖీ, పాస్‌పోర్టు పరిశీలన, డీపోర్ట్ చేయడం – ఈ ఉదాహరణలతో రాయండి.

 

Question 3: ముద్దు రామకృష్ణ వివరించిన సముద్ర ప్రయాణాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళడానికి ముద్దు రామకృష్ణయ్య పడిన ఇబ్బందులేవి?
(లేదా)
గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన రచయిత ప్రయాణ అనుభవాలేవి? ఎలా ప్రయాణం సాగించాడు?

Answer:

18 -10 -1907 లో ముద్దు రాజన్న, అమ్మాయి దంపతులకు కరీంనగర్ జిల్లా మంథని గ్రామంలో ముద్దు రామకృష్ణ జన్మించాడు. ఉన్నత విద్య కోసం గ్రేట్ బ్రిటన్ వెళ్ళాలనుకొన్నాడు. తగినంత ధనం లేకున్నా రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న ఆ రోజుల్లో ఎవర్ని కలవాలో, ఎక్కడ దిగాలో, ఏం చేయాలో తెలియకుండానే రెండు జతల బట్టలు, పైజమా కుర్తా సర్దుకొని, 22 పౌండ్ల ధనంతో పడవ ఎక్కాడు.
పడవ ప్రయాణంలో ఆంగ్లో ఇండియన్ “ఫాల్సెట్” అక్కడి అలవాట్లు, పరిస్థితులు వివరించాడు. ధనంలేక డీపోర్టు చేస్తారని భయపడి కరీంనగర్ వాడైన సురేష్బాబు ఇతనికి భరోసా ఇచ్చాడు. స్టడీస్ కోసం వచ్చాడని గమనించిన పోలీసులు ఇతని పాస్పోర్టు చూసి “పర్మిటెడ్” అని అనగానే పట్టరాని సంతోషం కల్గింది. గ్రేట్ బ్రిటన్‌ను చూస్తూ నిలబడ్డాడు. అనుకున్న లక్ష్యాన్ని కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించాలని అనుకున్నాడు రామకృష్ణయ్య.

Exam Tips:

a) కాలక్రమంలో (జననం → బయలుదేరడం → పడవలో పరిచయాలు → పోలీసుల తనిఖీ → చేరిక) రాయండి.

 

Question 4: విద్యయొక్క అవసరాన్ని తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి.

Answer:

చదవనివాడు అజ్ఞాని అని, చదువుకుంటే వివేకము కలుగుతుందని, మనిషిగా పుట్టినవాడు జ్ఞానాన్ని సంపాదించాలని పోతన భాగవతంలో వివరించాడు. “విద్య లేనివాడు వింత పశువన్న” నానుడి లోకంలో ఉండనే ఉంది. చదువులు నేర్చిన వారు ఏ రంగంలోనైనా రాణించగలరు. విద్య సుఖ సంతోషాలనిస్తుంది. ఏ దేశమైతే సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం చదువులలో వెనుకబడి ఉంది.
గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఎంతోమంది నిరక్షరాస్యులుగా ఉండిపోతున్నారు. బాలకార్మిక వ్యవస్థ చదువులలో వెనుకబడటానికి ఒక కారణం. బంగారు తెలంగాణ కావాలంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం చదువులపై శ్రద్ధపెట్టాలి. రాష్ట్రంలోని వారినందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి.
వయోజనులలో కూడా చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి అందరూ చదువుకునేటట్లు చేయాలి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని అరికట్టాలి. విద్యాభ్యాసం తరువాత ఉద్యోగం వచ్చి జీవనానికి ఆసరాగా నిలుస్తుందన్న నమ్మకాన్ని కలిగించాలి.

Exam Tips:

a) వ్యాసంలో విద్య ప్రాధాన్యం, నేటి పరిస్థితి, ప్రభుత్వం మరియు సమాజం చేయవలసినవి అనే క్రమం పాటించండి.

 

Question 5: మీరే ముద్దు రామకృష్ణయ్య అయితే, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

Answer:

నేనే ముద్దు రామకృష్ణయ్యను అయితే విద్య యొక్క ఉపయోగాలను గురించి విద్యార్థులకు వివరిస్తాను. ‘కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు” అన్న విషయాన్ని వివరించి వారికి చక్కని మార్గాన్ని చూపిస్తాను. నైతిక విలువలతో కూడిన విద్యను నేర్వమని బోధిస్తాను. కృత నిశ్చయం, దృఢ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్తాను.
విద్యార్థులందరు లక్ష్యసాధన దిశగా పయనించి ఉన్నత విద్యలను నేర్చి దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని వివరిస్తాను. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా తెలంగాణ పౌరులు నిలవాలని ప్రబోధిస్తాను. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు, ఆ పల్లెలలోని ప్రజలు చదువుబాట పట్టి విద్యాధికులు కావటానికి వారిలో చైతన్యాన్ని తీసుకువస్తాను. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ విద్యాధికులు కావాలని కోరుకుంటాను.

Exam Tips:

a) ‘నేనే అయితే’ అని ఉత్తమ పురుషలో రాయండి: కృషి, నైతిక విలువలు, గ్రామీణ విద్య, స్త్రీ విద్య అనే సందేశాలు.

 

పాఠ్యభాగ పరిచయం

Question 1: ‘యాత్రా చరిత్ర’ ప్రక్రియను పరిచయం చేయండి.

Answer:

‘యాత్రా చరిత్ర’ ప్రక్రియకు చెందినదీ పాఠం. యాత్రవల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రాచరిత్ర. దేశ, విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా ఇవి వివరిస్తాయి. ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన “నా ప్రథమ విదేశీ యాత్ర” పుస్తకంలోనిది.

Exam Tips:

a) ప్రక్రియ పేరు (యాత్రా చరిత్ర), నిర్వచనం, గ్రంథం పేరు ‘నా ప్రథమ విదేశీ యాత్ర’ తప్పక రాయండి.

 

Question 2: ముద్దు రామకృష్ణయ్య గారిని గురించి రాయండి.

Answer:

ముద్దు రామకృష్ణయ్య పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి పెద్దపల్లి జిల్లాలోని మంథని గ్రామంలో 1907 అక్టోబరు 18న జన్మించాడు. వీరి తండ్రి ముద్దు రాజన్న, తల్లి ముద్దు అమ్మాయి. 1946లో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి యం. ఇడి. పట్టా పొందాడు. 1951-58 మధ్య కాలంలో ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా ఖండాలలోని పలుదేశాలు పర్యటించి, అక్కడి విద్యావిధానాలను అధ్యయనం చేశాడు. మనదేశపు విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. అవి నేటికీ ఆదర్శప్రాయాలైనాయి. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ‘ఈచ్ వన్ టీచ్ వన్’ ఉద్యమాన్ని జీవిత చరమాంకం వరకు కొనసాగించిన గొప్ప విద్యావేత్త.

Exam Tips:

a) జననం, తల్లిదండ్రులు, విద్య (లీడ్స్ – యం.ఇడి.), సేవలు (‘ఈచ్ వన్ టీచ్ వన్’) అని క్రమంగా రాయండి.

 

Question 3: సముద్ర ప్రయాణం పాఠ్యభాగ ప్రవేశికను తెలియజేయండి.

Answer:

ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడికి పోవాలో తెలవదు. ఎవరిని కలవాలో తెలవదు. కాని, ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నది. జీవితమంటే అన్నీ ఉంటాయి. కండ్ల ముందు ఒకటే లక్ష్యం. లక్ష్యసాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరుకకపోదు.
అనుకున్న విధంగా ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి. దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి ? ఎట్లా చెయ్యాలి ? పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నది మనసు. ప్రయాణం కొనసాగుతున్నది ! అనంతాకాశంలాగా పరుచుకున్న దరిలేని సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకున్నది ? ఎట్లా చేరుకున్నది తెలుసుకుందాం.

Exam Tips:

a) ప్రవేశికలో రచయిత లక్ష్యం, ధైర్యం, ప్రయాణం ఏ తీరం చేరిందనే ఆసక్తి – ఈ భావాలను రాయండి.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 8 Telugu Lesson 02 Sea Voyage (Samudra Prayanam)

Textbook Solutions for Class 8 Telugu Lesson 02 Sea Voyage (Samudra Prayanam)

Access structured TS Board textbook solutions for Lesson 02 Sea Voyage (Samudra Prayanam). Designed in alignment with the latest academic curriculum for Class 8 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Mastering Theoretical and Practical Questions

Clear, methodical explanations accompany every challenging problem within the Class 8 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Effective Self-Study and Homework Assistance

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 02 Sea Voyage (Samudra Prayanam) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం for the 2026-27 session?

The complete and updated TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం will help students to get full marks in the theory paper.

Do you offer TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Telugu. You can access TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire TS 8th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana సముద్ర ప్రయాణం in printable PDF format for offline study on any device.