Download TS Board Solutions for Class 8 Telugu Lesson 01 Selfless Sacrifice (Tyaganirathi)
Review structured textbook solutions for Class 8 Telugu Lesson 01 Selfless Sacrifice (Tyaganirathi). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access TS Board Solutions and Answers
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
Question 1: దధీచి ఎవరు ?
Answer:
దధీచి గొప్ప తపస్వి. చ్యవన మహర్షి కుమారుడు.
Exam Tips:
a) దధీచిని ‘చ్యవన మహర్షి కుమారుడు, గొప్ప తపస్వి’ అని పరిచయ వాక్యంగా రాయండి; ఒకటి రెండు వాక్యాలు చాలు.
Question 2: దధీచి చేసిన త్యాగం ఏమిటి ? ఎందుకు ?
Answer:
దధీచి తన శరీరాన్ని యోగాగ్నిలో దహించివేసుకొని తన ఎముకలను దేవతలకు ఆయుధాలుగా ఇచ్చాడు.
Exam Tips:
a) ప్రశ్నలో ‘ఏమిటి? ఎందుకు?’ అని రెండు భాగాలున్నాయి. త్యాగం (శరీరాన్ని యోగాగ్నిలో దహించి ఎముకలు ఇవ్వడం), కారణం (దేవతలకు ఆయుధాలు కావడం) రెండూ రాయండి.
Question 3: త్యాగం అంటే ఏమిటి ?
Answer:
తన కష్టనష్టాలను లెక్కచెయ్యకుండా పరహితం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేయడమే త్యాగం.
Exam Tips:
a) త్యాగానికి నిర్వచనం ఇచ్చేటప్పుడు ‘స్వార్థం లేకుండా, కష్టనష్టాలను లెక్కచేయకుండా పరుల హితం కోసం ఇవ్వడం’ అనే భావం తప్పనిసరిగా ఉండాలి.
Question 4: మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలుపండి.
Answer:
జీమూత వాహనుడు, బలిచక్రవర్తి, ఏకలవ్యుడు, హరిశ్చంద్రుడు మొదలైన వారు గొప్ప త్యాగధనులు.
Exam Tips:
a) కనీసం మూడు పేర్లు రాయండి. పాఠంలోని శిబి చక్రవర్తిని కూడా చేర్చితే మంచిది; ప్రతి పేరు పక్కన ఏం త్యాగం చేశారో ఒక్క మాట రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి.
ఆలోచించండి – చెప్పండి (TextBook Page No. 4)
Question 1: సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు ?
Answer:
శిబి చక్రవర్తి సత్యం వ్రతంగా కలవాడు. ఆడినమాట తప్పనివాడు. అన్ని ధర్మములు తెలిసినవాడు. ధర్మం తప్పక ఆచరించేవాడు. నిర్మలమైన మనస్సు, ప్రవర్తన కలవాడు. అందుచేత ఆయనను సత్యధర్మ నిర్మలుడన్నారు.
Exam Tips:
a) సత్యం, ఆడినమాట తప్పకపోవడం, ధర్మాచరణ, నిర్మల మనస్సు – ఇలా కారణాలను ఒక్కొక్కటిగా వరుసలో రాయండి.
Question 2: “ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్” దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.
Answer:
‘సత్యం మాట్లాడండి. ధర్మం ఆచరించండి.’ అనే విషయాలను వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాని వాటిని పాటించే సమయంలో వాటివల్ల అందరికీ మేలు జరుగుతుందా, లేదా అని పరిశీలించాలి. ఒకవేళ కీడు కలిగేట్లైతే అప్పుడు వాటిని సరి చూసుకోవాలి. ఏ నియమాలైనా ప్రజలమేలు కోసం ఏర్పాటు చేయబడేవే. అందుకే కవి నన్నయ ధర్మం అందరికీ మేలు కలిగించాలి అని ప్రయోగించాడు.
Exam Tips:
a) ఇది అభిప్రాయ ప్రశ్న: ‘ధర్మం అందరికీ మేలు చేయాలి’ అని మొదట చెప్పి, తర్వాత కారణం ఇవ్వండి. పద్యపాదాన్ని ఉటంకించడం మంచిది.
Question 3: ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు ?
Answer:
బలహీనుడు బలవంతుని వద్దకు రక్షణ కోసం వస్తాడు. అతడు తనను కాపాడగలడు అనే నమ్మకంతో వస్తాడు. కనుక అతనికి ఆశ్రయమిచ్చి కాపాడటం బలవంతుని కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు కలిగినా వారి నమ్మకాన్ని వృథా చేయకుండా కాపాడాలి. అందుకే ఆశ్రితులను విడిచిపెట్టరాదు.
Exam Tips:
a) ‘ఆశ్రయించినవారు మనపై నమ్మకంతో వస్తారు; ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం అధర్మం’ అనే ముఖ్య భావాన్ని రాయండి.
Question 4: ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు ?
Answer:
జంతువుల వలన, ఇతరుల వలన భయం కలిగినప్పుడు, శత్రువులు దండెత్తినప్పుడు, దుష్టుల వలన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, తాను తలపెట్టిన మంచి పనులకు ఆటంకాలు కలిగినప్పుడు, తన కష్టాన్ని ఇతరులు దోచుకుంటున్నప్పుడు – ఇలా అనేక సందర్భాల్లో ఇతరులు మనను ఆశ్రయిస్తారు.
Exam Tips:
a) కనీసం మూడు నాలుగు వేర్వేరు సందర్భాలను (భయం, శత్రువులు, ఆపద, అన్యాయం) వరుసగా రాయండి.
ఆలోచించండి – చెప్పండి. (TextBook Page No. 5)
Question 1: డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది ?
Answer:
పావురం డేగకు సహజమైన ఆహారం. శిబి దానికి ఆశ్రయం ఇచ్చాడు. డేగ ఆ పావురాన్ని ఇవ్వమని అడిగినా శిబి దానిని వదిలిపెట్టనంటున్నాడు. ధర్మబద్ధమైన తన ఆహారం తినకపోతే ఆకలితో చనిపోతానని, ఆపై తన భార్య, పిల్లలు కూడా బతకరని డేగ చెప్పింది. నీవు చెప్పింది ధర్మమే ఐనా నేను ఆశ్రయమిచ్చిన పావురాన్ని నీకు ఆహారం కానివ్వను. మరేది కోరినా తెప్పించి యిస్తాను అన్నాడు శిబి. అందుకని డేగ తన ఆకలిని తీర్చుకోడానికి శిబి మాంసాన్ని కోరింది.
Exam Tips:
a) డేగ వాదనలోని మూడు అంశాలు రాయండి: పావురం సహజాహారం, ఆకలితో చనిపోతే భార్యాపిల్లలు బతకరు, కనుక శిబి మాంసం కోరింది.
Question 2: ‘అనుగ్రహించితి మహా విహగోత్తమ’ అని శిబి చక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు?
Answer:
పావురాన్ని తప్ప వేరే ఏ ఆహారాన్నైనా కోరుకో. తెప్పించి ఇచ్చి నీ ఆకలి తీరుస్తాను. పావురాన్ని మాత్రం వదలను అన్నాడు శిబి చక్రవర్తి. అప్పుడు డేగ పావురం బరువుకు సరితూగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి కోసి యిస్తే ఒప్పుకుంటాను అన్నది. అందుకే శిబి పరమ సంతోషంతో “ఓ పక్షి రాజా ! నన్ను అనుగ్రహించావు. పావురాన్ని కాపాడతానన్న నా మాట నిలబెట్టావు” అని డేగతో అన్నాడు.
Exam Tips:
a) ‘అనుగ్రహించితి’ అంటే కరుణించావు అని అర్థం. శిబి తన మాట నిలబెట్టుకునే అవకాశం వచ్చినందుకు ఆనందించాడని వివరించండి.
Question 3: శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా ! త్యాగం ఆవశ్యకత ఏమిటి ?
Answer:
త్యాగం అనేది గొప్ప పుణ్యకార్యం. మనకు అక్కరలేని దాన్ని ఇచ్చేసి త్యాగం చేశాను అనుకోవడం త్యాగం అనిపించుకోదు. తనను ఎవరైనా ఆశ్రయించినప్పుడు వారి కోరిక తీర్చడానికి అవసరమైతే తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి.
అటువంటి వారే చరిత్రలో నిలచిపోతారు. ఆదర్శప్రాయులౌతారు. అందుకే త్యాగం చాలా గొప్ప గుణం.
Exam Tips:
a) ‘ఉన్నదానిలో కొంత ఇవ్వడం’ కాదు, అవసరమైతే ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడటమే నిజమైన త్యాగం అని స్పష్టం చేయండి.
ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
Question 1: త్యాగం అంటే ఏమిటి ? త్యాగంలోని గొప్పతనం ఏమిటి ?
Answer:
తనకు ఉన్నదానిలో కొంత ఇతరులకు ఇవ్వడమే త్యాగం. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని తనను ఆశ్రయించిన వారికి కావలసిన దానిని ఇవ్వడమే త్యాగం.
ఇందులో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేసిన వారు మహనీయులు. మనం త్యాగం చేసినందువలన ఆ ఫలితాన్ని పొందినవారు, వారి ఆత్మీయులు ఎంతో సంతోషపడతారు. ఆ సంతోషం మనకెంతో తృప్తినిస్తుంది. అదీ త్యాగంలోని గొప్పతనం.
Exam Tips:
a) రెండు భాగాలు ఉన్నాయి: త్యాగం అర్థం, దానిలోని గొప్పతనం (పొందినవారి సంతోషం, ఇచ్చినవారికి తృప్తి). రెండింటికీ విడివిడిగా పేరాలు రాయండి.
Question 2: ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి.
Answer:
భారతదేశాన్ని పరాయిపాలన నుంచి విడిపించి ప్రజలు పడుతున్న బానిసత్వపు బాధలను తొలగించడానికి ఎంతోమంది నాయకులు తమ సర్వస్వాన్నీ త్యాగంచేసి ఉద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు మొదలైన ఎందరో నాయకులు ధనాన్ని ఆస్తులను త్యాగం చేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటివారు ప్రాణాలను త్యాగం చేశారు. డా. ద్వారకానాథ్ కొట్నీస్ యుద్ధసైనికుల కోసం అమోఘమైన సేవలందించాడు.
Exam Tips:
a) స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు (ఉదా: భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు) ఇచ్చి, వారు ఏమి త్యాగం చేశారో చెప్పండి.
II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
Question 1: కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.
అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి
ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం
ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు
Answer:
అ) ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్.
ఆ) ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు.
ఇ) శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెద్ది ?
Exam Tips:
a) పద్యపాదాన్ని పాఠంలో ఉన్నట్లే యథాతథంగా (అక్షరం మారకుండా) రాయండి; భావాన్ని చూసి సరైన పాదాన్ని ఎంచుకోండి.
Question 2: కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.
ఆ॥ బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటె గాదు
చచ్చి గూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగ భావమునకు తరువులే గురువులు
లలిత సుగుణజాల తెలుగు బాల.
అ) ‘చెట్టు’ అను పదానికి సరిపోయే పదం – ఎ) తరువు బి) గురువు సి) ఫలం డి) గుణం
ఆ) త్యాగానికి గురువులు ఎవరు ? – ఎ) మానవులు బి) చెట్లు సి) పక్షులు డి) జంతువులు
ఇ) తనువును చీల్చి ఇచ్చేవి – ఎ) మేఘాలు బి) నదులు సి) చెట్లు డి) పక్షులు
ఈ) ‘చచ్చుట’ పదానికి వ్యతిరేకార్థం – ఎ) పెరుగుట బి) తరుగుట సి) బ్రతుకుట డి) మేల్కొనుట
ఉ) పై పద్యానికి తగిన శీర్షిక – ఎ) భారం బి) ప్రాణం సి) యోగం డి) త్యాగం
Answer:
అ) ఎ) తరువు
ఆ) బి) చెట్లు
ఇ) సి) చెట్లు
ఈ) సి) బ్రతుకుట
ఉ) డి) త్యాగం
Exam Tips:
a) పద్యాన్ని జాగ్రత్తగా చదివి ప్రతి ప్రశ్నకు సరైన ఎంపిక అక్షరాన్ని (ఎ, బి, సి, డి) రాయండి. ‘చచ్చుట’కు వ్యతిరేకపదం ‘బ్రతుకుట’ – వ్యతిరేకార్థాల్లో ఇలాంటి పదాలను గమనించండి.
III. స్వీయరచన – ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి
Question 1: ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.
Answer:
ఎవరైనా ఆహారం తినేది ఆకలి తీర్చుకోవడానికే. ఎంతో పనిచేసి, కడుపు ఆకలితో కాలిపోతూంటే, భోజనం చేద్దామని కూర్చొన్న వ్యక్తికి, ఆటంకం కలిగిస్తే ఆ వ్యక్తి చాలా బాధపడతాడు. ఆకలితో నీరసించిపోతాడు. ఇక పని చేయలేడు. పనిచేయలేడు కాబట్టి తిండికి కావలసిన ధనం సంపాదించలేడు. చివరికి ఆరోగ్యమే పాడయ్యే ప్రమాదముంది. అందుకే ఆహారం తినేటప్పుడు విఘ్నం కలిగించకూడదంటారు. సైన్సుపరంగా కూడా కారణముంది. భోజనం చేసే సమయంలో కడుపులోని జీర్ణరసాలు ఉత్తేజంగా ఉంటాయి. భోజనానికి ఆటంకం కలిగిస్తే, ఆ ఊరిన రసాలు పేగుల మీద ప్రభావం చూపి అనారోగ్యం కలిగిస్తాయి.
Exam Tips:
a) ఐదు వాక్యాల జవాబు: ఆకలి తీర్చుకోవడం, పని శక్తి, ఆరోగ్యం, జీర్ణరసాలు అనే కారణాలను వరుసగా రాయండి.
Question 2: ‘అందరూ ధర్మాన్ని ఆచరించాలి’ అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
Answer:
‘సత్యం మాట్లాడండి. ధర్మం ఆచరించండి.’ అనే విషయాలను వేద శాస్త్రాలు చెబుతున్నాయి. కాని వాటిని పాటించే సమయంలో వాటివల్ల అందరికీ మేలు జరుగుతుందా, లేదా అని పరిశీలించాలి. ఒకవేళ కీడు కలిగేట్లైతే అప్పుడు వాటిని సరి చూసుకోవాలి. ఏ నియమాలైనా ప్రజలమేలు కోసం ఏర్పాటు చేయబడేవే.
అందుకే కవి నన్నయ ధర్మం అందరికీ మేలు కలిగించాలి అని ప్రయోగించాడు.
Exam Tips:
a) ‘సమర్థిస్తూ రాయండి’ అంటే మీరు ఆ విషయంతో ఏకీభవిస్తున్నారని చెప్పి కారణాలు చూపాలి. ‘ధర్మం ప్రజలందరి మేలుకే’ అని ముగించండి.
Question 3: ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాలను చేయవచ్చో రాయండి.
Answer:
ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కాపాడాలి. మనం రక్తం దానం చేయవచ్చు. మన పనులను వాయిదా చేసుకొని వారిని హాస్పటల్స్‌కు తీసుకుని వెళ్ళవచ్చు. మన వాహనంలోనే ప్రమాదానికి గురైన వ్యక్తులను తరలించవచ్చు. నాన్న మనకోసం ఇష్టమైన వస్తువు తెచ్చినప్పుడు చెల్లికి అదే కావాలని అడిగితే తన కోసం మనం దాన్ని త్యాగం చెయ్యవచ్చు.
బస్సులోను, రైలులోను మనకంటే పెద్దవారు నిలబడి మనం కూర్చుని ఉంటే మన సీటు వారికోసం త్యాగం చెయ్యవచ్చు.
Exam Tips:
a) రోజువారీ జీవితం నుంచి ఉదాహరణలు (రక్తదానం, సీటు ఇవ్వడం, ఇష్టమైన వస్తువు వదులుకోవడం) ఇవ్వండి.
Question 4: “త్యాగనిరతి” అనే శీర్షిక పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి.
Answer:
ఈ పాఠంలో డేగ పావురాన్ని తినడానికి వెంటపడింది. పావురానికి ఆశ్రయమిచ్చి శిబి చక్రవర్తి పావురం కోసం ఏమైనా త్యాగం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. రాజు త్యాగ గుణాన్ని ఉపయోగించుకోడానికి డేగ పావురాన్ని త్యాగం చేసింది. డేగ రాజు శరీరంలోని మాంసాన్ని పావురం బరువుకు సరిపడ తూచి యిమ్మన్నది. అలా తూచడంలో చివరికి రాజు తానే త్రాసులో కూర్చుని తన ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. తన త్యాగ గుణాన్ని దేవతలు మెచ్చుకున్నారు.
అందుచేత ఈ పాఠానికి “త్యాగనిరతి” అనే శీర్షిక తగి ఉన్నది.
Exam Tips:
a) శీర్షికకు కారణాలు: శిబి ఆశ్రితుని కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, పాఠం మొత్తం త్యాగం చుట్టూ తిరుగుతుంది – ఈ రెండు అంశాలను తప్పనిసరిగా రాయండి.
III. స్వీయరచన – పది వాక్యాల్లో జవాబులు రాయండి
Question 1: త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి.
(లేదా)
త్యాగనిరతి పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
పావురాన్ని రక్షించుటకు శిబి చక్రవర్తి చేసిన త్యాగాన్ని వివరించండి.
(లేదా)
శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసివ్వటంలో ఆంతర్యం ఏమిటి ?
Answer:
ఇంద్రుడు, అగ్నిదేవుడు డేగ, పావురం రూపాల్లో శిబిచక్రవర్తి త్యాగ గుణాన్ని పరీక్షించడానికి వచ్చారు. శరణుకోరి వచ్చిన పావురానికి శిబి అభయమిచ్చాడు. అలా శరణన్న వారిని రక్షించటంలో ఎంతో ఆనందం ఉంటుంది. లోకంలో ఎంతోమంది ఉన్నా పావురం తన దగ్గరికే వచ్చిందంటే తన మీద ఎంతో నమ్మకం ఉండబట్టే గదా అని తలచుకుంటే శిబి గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ ఆనందం అనుభవించే వారికే తెలుస్తుంది.
అలాగే ధర్మాధర్మాల గురించి వాదించిన మీదట డేగ పావురానికి సరితూగినంత మాంసం శిబి శరీరం నుంచి తూచి ఇవ్వమన్నప్పుడు “నన్ననుగ్రహించితివి మహావిహగోత్తమ !” అంటూ ఎంతో సంతోషించాడు శిబి, తాను అన్నమాట నిలబెట్టుకోగలుగుతున్నాను గదా అని. అంతేగాక ఒకరిని రక్షించడానికి, మరొకరి ఆకలి తీర్చడానికి తాను ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు. రెండు విధాలుగా ధర్మాన్ని రక్షించగలిగానన్న ఆనందం, అనుభూతి ఎంతో గొప్పవి. ఆ ఆనందం అనుభవించే వారికే బాగా అర్థమౌతుంది.
Exam Tips:
a) పది వాక్యాల జవాబును ఆరంభం (ఇంద్రాగ్నుల పరీక్ష), మధ్య (శిబి ఆనందం, మాంసం తూచడం), ముగింపు (కీర్తి శాశ్వతం) అని మూడు భాగాలుగా రాయండి.
IV. సృజనాత్మకత / ప్రశంస
Question 1: అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పది. శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించుమని వార్తాపత్రికలకు లేఖ రాయండి.
Answer:
వరంగల్, ది.XX. XX. XXXX
గౌరవనీయులైన పత్రికా సంపాదకులకు,
నమస్తే తెలంగాణ పత్రిక
పుట్టుకతోనే అవయవలోపాలతో కొందరు పుడుతూ ఉంటే, ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకునేవారు కొందరు. కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు – వీటిలో ఏ అవయవం లేకపోయినా బాధాకరమే. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అందాలను చూసి ఆనందించాలన్నా, చక్కని సంగీతం వినాలన్నా, సుందరమైన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు తప్పనిసరి. ఇవేకాదు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అవయవభాగాలు ముఖ్యమైనవే.
రక్తం అవయవ భాగం కాకపోయినా, అవయవమంత ప్రాముఖ్యమున్నదే. కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తంవంటి వాటిని దానమిచ్చి మన చుట్టూ ఆయా అవయవాల లోపంతో బాధపడేవారిని ఆదుకోవడమే మానవజన్మకు సార్థకత.
జీవించి ఉండగానే, కళ్ళు, మూత్రపిండాలు వంటివి దానం చేయవచ్చు.
మరణించాక కూడా జీవించి ఉండడానికి మార్గం అవయవదానం. తమ మరణానంతరం, తమ కళ్ళను దానం చేస్తామంటూ, ఎంతోమంది నేటికాలంలో ముందుకొస్తున్నారు.
అలా నేత్రదానంతో ఎంతోమంది అంధులకు వెలుగునిస్తూ, మరణించాక కూడా జీవించడం గొప్ప విషయం. అలాగే ఇటీవల బెంగుళూరుకు చెందిన వ్యక్తి గుండె చెన్నైకి చెందిన మరొక వ్యక్తికి మార్పిడి చేయడం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోశారు. అలాగే ఇటీవల విజయవాడకు చెందిన మణికంఠ దానం చేసిన గుండె, నేత్రాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం మరికొందరిని జీవించగలిగేట్లు చేశాయి.
ఇలా అవయవ దానం వల్ల కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.
ఇటువంటివారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాతలు. చనిపోయాక కూడా జీవించాలంటే అవయవదానమే మార్గం. అవయవ దానానికి అందరూ ముందుకు వచ్చేలా మీ పత్రిక ద్వారా చైతన్యం కలిగించమని విజ్ఞప్తి.
ఇట్లు బాలభాను, ఒక పాఠకుడు. చిరునామా:
నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయం,
రోడ్ నెం. 10, బంజారా హిల్స్
హైదరాబాద్.
Exam Tips:
a) లేఖలో పై భాగంలో ఊరు, తేదీ; ‘గౌరవనీయులైన సంపాదకులకు’ అనే సంబోధన; చివరన ‘ఇట్లు’ మరియు మీ పేరు, చిరునామా తప్పక ఉండాలి.
V. పదజాల వినియోగం
Question 1: కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
ఉదా : కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు. – కపోతములు = పావురములు
అ) ఆశ్రితులను వదలి వేయుట ధర్మువు కాదు.
ఆ) ఉత్తముడు పరుల హితమునే కోరతాడు.
ఇ) ఎందరో మహానుభావుల పరిత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
ఈ) దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక !
ఉ) బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు.
Answer:
అ) ధర్మువు = ధర్మము
ఆ) హితమునే = మేలునే
ఇ) పరిత్యాగం = విడిచిపెట్టుట, ఇచ్చివేయుట
ఈ) వర్ధిల్లు = వృద్ధిపొందు
ఉ) బుభుక్షితుడు = ఆకలితో బాధపడువాడు
Exam Tips:
a) గీత గీసిన పదానికి సమానార్థకమైన పదాన్ని మాత్రమే రాయండి; వాక్యం మొత్తం మళ్ళీ రాయనవసరం లేదు.
Question 2: కింది వాక్యాలలోని నానార్థాలను గుర్తించి రాయండి.
ఉదా : ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి. – వర్షం = సంవత్సరం, వాన
అ) న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్ళు కలపడం ధర్మం కాదు. – పాడి = ______, ______
ఆ) అడవిలోని జంతువులకు నీరు కరువవుతున్నది. – వనం = ______, ______
Answer:
అ) పాడి : న్యాయం, పాలు
ఆ) వనం : అడవి, నీరు
Exam Tips:
a) నానార్థాలు అంటే ఒకే పదానికి ఉన్న వేర్వేరు అర్థాలు; వాక్యంలోని సందర్భానికి సరిపోయే అర్థాన్ని కూడా రాయడం మరవకండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
Question 1: కింది వాక్యాలను చదువండి. అవి ఎటువంటి వాక్యాలో గుర్తించి జతపరచండి.
ఉదా : లోపలకి రావచ్చు – అనుమత్యర్థక వాక్యం
అ) దయచేసి వినండి
ఆ) రమ చక్కగా రాయగలదు
ఇ) ఆహా ! ఎంత బాగుందో
ఈ) అల్లరి చేయవద్దు
ఉ) గిరి ! ఎక్కడున్నావు ?
1) ఆశ్చర్యార్థక వాక్యం 2) ప్రశ్నార్థక వాక్యం 3) సామర్థ్యార్థక వాక్యం 4) ప్రార్థనార్థక వాక్యం 5) నిషేధార్థక వాక్యం
Answer:
అ) 4 – ప్రార్థనార్థక వాక్యం
ఆ) 3 – సామర్థ్యార్థక వాక్యం
ఇ) 1 – ఆశ్చర్యార్థక వాక్యం
ఈ) 5 – నిషేధార్థక వాక్యం
ఉ) 2 – ప్రశ్నార్థక వాక్యం
Exam Tips:
a) వాక్యం చివరి భావాన్ని (అభ్యర్థన, ఆశ్చర్యం, ప్రశ్న, నిషేధం, సామర్థ్యం) చూసి వాక్యభేదం నిర్ణయించండి.
Question 2: కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) ఇంద్రాగ్నులు
ఆ) త్యాగమిది
ఇ) ఆహారార్థం
ఈ) నేనెట్లు
ఉ) శౌర్యాది
Answer:
అ) ఇంద్ర + అగ్నులు = సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
ఆ) త్యాగము + ఇది = ఉత్వ సంధి
సూత్రం : ఉత్తునకు అచ్చుపరమైనపుడు సంధి అవుతుంది.
ఇ) ఆహార + అర్థం = సవర్ణదీర్ఘ సంధి
ఈ) నేను + ఎట్లు = ఉత్వ సంధి
ఉ) శౌర్య + ఆది = సవర్ణదీర్ఘ సంధి
Exam Tips:
a) సంధి విడదీసేటప్పుడు ‘పూర్వపదం + పరపదం’ రాసి, సంధి పేరు, అవసరమైతే సూత్రం రాయండి. అకారం+అకారం = సవర్ణదీర్ఘ; ఉకారం+అచ్చు = ఉత్వసంధి.
భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టు పని
Question 1: త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయుల వివరాలను లేదా కథలను లేదా సంఘటనలను సేకరించండి. నివేదిక రాసి తరగతిలో ప్రదర్శించండి.
Answer:
అ) ప్రాథమిక సమాచారం:
1) ప్రాజెక్టు పని పేరు : త్యాగబుద్ధి కలిగిన ఇద్దరు మహనీయులు.
2) సమాచారాన్ని సేకరించిన విధానం : ఉపాధ్యాయుని ద్వారా / ఇంటిలోని పెద్దల (తాత/నానమ్మ/ అమ్మమ్మ) ద్వారా / గ్రంథాలయ పుస్తకాల ద్వారా
ఆ) నివేదిక:
విషయ వివరణ:
“తనకు ఎంతో అవసరమైనప్పటికిని లెక్కచేయకుండా ఇతరులకు ఇవ్వడాన్నే త్యాగం అంటారు.” దానం, త్యాగం అనే రెండు పదాలు దగ్గర అర్థాన్నిచ్చేవిగా ఉన్నా వీటి మధ్య ఎంతో తేడా ఉంది.
తనకున్నంతలో ఇతరులకు ఇవ్వడం దానం అయితే, తనకున్నా లేకున్నా ఇతరులకు ఇవ్వగలిగే గుణాన్ని త్యాగంగా చెప్పవచ్చు. అలాంటి త్యాగబుద్ధి గలిగిన ఇద్దరు మహాపురుషుల గూర్చి, నేను నివేదికలో పొందు పరుస్తున్నాను.
1. రంతిదేవుడు
“అతిథి దేవో భవ” అనేది మన సాంప్రదాయం. దాన్ని అక్షరాలా ఆచరించి శాశ్వత కీర్తి పొందిన రంతిదేవుని కథ నాకెంతోగానో నచ్చింది. రంతిదేవుడు ఒక మహారాజు. అమిత దానశీలి. తన రాజ్యాన్ని, సంపదలను దానం చేసి భార్యా బిడ్డలతో అడవికి వెళ్ళాడు.
అడవిలో కాయ, కసరులు తింటూ కడుపు నింపుకొనేవాడు, దైవికంగా లభించినది తిని తృప్తిపడేవాడు తప్ప దేన్నీ కోరేవాడు కాదు. భవిష్యత్ అవసరాలకు కూడా దేన్నీ దాచుకొనేవాడు కాదు. ఒకసారి 48 రోజులు పాటు అతనికి, అతని కుటుంబానికి ఏమీ లభించలేదు. 49వ రోజున కొంత ఆహారం లభించింది. కుటుంబమంతా కూర్చుండి తినడానికి ఉపక్రమించ బోతుండగా ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు.
అతనికి ఆహారం పెట్టాడు. తర్వాత ఒక బీదవాడు వచ్చాడు. రంతిదేవుడు అతని ఆకలి కూడా తీర్చి పంపాడు. తర్వాత ఒకడు, తన కుక్కల క్షుద్బాధ తీర్చమని వేడుకోగా వాటికి ఆహారం పెట్టాడు. చివరికి కొద్ది పాయసం మాత్రమే మిగిలింది.
దాన్నే తలా కాస్తా తాగుదామనుకోగా, ఒక ఛండాలుడు వచ్చాడు. ఉన్న పాయసం అతనికి ఇచ్చి, ఆకలి బాధ తట్టుకోలేక రంతి దేవుడు స్పృహ తప్పి పోయాడు.
మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు.
2. బలిచక్రవర్తి
రాక్షస రాజైన బలి చక్రవర్తి మహా బలవంతుడు. అతనికి ఎదురొడ్డి పోరాడలేక దేవతలు మహావిష్ణువును శరణు కోరతారు. ఎలాగైనా బలి చక్రవర్తిని చంపనైనా చంపు లేదా మాపై ఆధిపత్యం చలాయించకుండానైనా చూడ మంటారు. అప్పుడు విష్ణువు వారికి అభయమిచ్చి, తాను వామనరూప ధారియై బలి వద్దకు వెళ్తాడు.
గొడుగు ధరించి వచ్చిన ఆ వామనమూర్తిని చూడగానే రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి మనస్సెందుకో కీడు శంకించింది.
దివ్యదృష్టితో అతడు శ్రీ మహావిష్ణువని గ్రహించి బలిని, అతనికి దానమివ్వవద్దని ఎంత చెప్పినా బలి చక్రవర్తి ససేమిరా వినడు. తన కులం, వంశం, దేశం నాశనమైనా, చివరికి తాను చనిపోయినా ఆడిన మాట తప్పను అని వామనునికి 3 అడుగుల నేల దానం చేస్తాడు. 2 అడుగులకే భూమ్యాకాశాలను ఆక్రమించిన వామనుడు, తన 3వ అడుగు ఎక్కడ పెట్టాలో చెప్పమంటాడు. అప్పుడు బలి, తన శిరస్సు పైన ఉంచమంటాడు. వామనుడు, బలి శిరస్సుపై తన పాదాన్ని ఉంచి పాతాళానికి తొక్కి వేస్తాడు. దాంతో దేవతలకు బలి చక్రవర్తి పీడ విరగడైంది.
ఇ) ముగింపు:
ఈ విధంగా తమ సచ్చీలత, త్యాగనిరతి అనే గుణాలతో చరిత్రలో నిలిచిపోయిన ఇరువురు మహాపురుషుల కథలు చదువుతుంటే నాలో ఎంతో ఉత్తేజం, ఉద్వేగం కలిగాయి. ఇలాంటి మహాపురుషులను కన్న భరతభూమికి వందనాలు అర్పించాలనిపించింది.
Exam Tips:
a) ప్రాజెక్టు నివేదికను ప్రాథమిక సమాచారం – విషయ వివరణ – ముగింపు అనే మూడు శీర్షికలతో రాయండి.
అదనపు ప్రశ్నలు
Question 1: “శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది” అని శిబి అన్నాడు కదా! శరణాగతులను ఎందుకు విడువకూడదు ?
(లేదా)
శరణుకోరిన వారిని వదలకూడదు. ఎందుకు ?
(లేదా)
శరణాగత పరిత్యాగం అధర్మం అంటే నీకేమి అర్థమైంది ?
Answer:
తనను ఆశ్రయించినవారు శరణాగతులు. తనను కాపాడ గల్గినవారి వద్దకే, గొప్పనమ్మకంతో వస్తారు. ఆశ్రయమిచ్చిన వారిని కాపాడటం ధర్మం, కర్తవ్యం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆశ్రితులను కాపాడాలి శరణాగతులను వదలకూడదు. వారిని కాపాడకుండా వదిలిపెడితే అది అధర్మం అవుతుంది.
Exam Tips:
a) శరణాగతులు అంటే ఆశ్రయించినవారు; వారిని కాపాడటం ధర్మం అనే సారాన్ని ఒక్క వాక్యంలో ముందు చెప్పండి.
Question 2: త్యాగం అంటే ఏమిటి ? త్యాగం ఎందుకు చేయాలి? దేనిని గొప్ప త్యాగం అంటారు ? త్యాగగుణం ఎందుకు కలిగి ఉండాలి ?
Answer:
తనకి ఉన్నంతలో కొంత ఇతరులకి ఇవ్వడమే త్యాగం. ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని తనను ఆశ్రయించిన వారికి కావలసిన దానిని ఇవ్వడమే త్యాగం. ఆశ్రయించినవారి కోసం తన ప్రాణాలనైనా సంతోషంగా ఇవ్వడానికి సిద్ధపడడాన్ని గొప్పత్యాగం అంటారు.
త్యాగ ఫలితాన్ని పొందినవారు, వారి ఆత్మీయులు ఎంతో సంతోషపడతారు కనుక ఆ సంతోషం మనకెంతో తృప్తినిస్తుంది. అదీ త్యాగంలోని గొప్పతనం.
అనిర్వచనీయమైన ఆనందం, సంతృప్తి పొందటం కోసం త్యాగ గుణం కలిగి ఉండాలి.
Exam Tips:
a) ప్రశ్నలో నాలుగు ఉపప్రశ్నలు ఉన్నాయి; ప్రతిదానికీ ఒక్కో వాక్యం చొప్పున సమాధానం ఇవ్వండి.
Question 3: శిబిచక్రవర్తి వంటి వాళ్ళ కీర్తి శాశ్వతమని వివరించండి.
Answer:
ప్రాణభయంతో ఆశ్రయించిన వారు నీచులే అయినా వారిని విడిచి పెట్టడం ధర్మం కాదు. ఆహారమే కావలసివస్తే అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. వాటిని తిని ప్రాణాలు నిలుపుకోవచ్చు అని డేగతో అన్నాడు. ఆ డేగ శిబితో పావురం తనకు సహజసిద్ధంగా కల్పించబడిన ఆహారం. దీన్ని కాపాడాలనుకుంటే దాని బరువుకు తూగినంత మాంసం నీ శరీరం నుండి నాకు పెట్టమని అన్నది. తన ప్రాణాలను సైతం లక్ష్యపెట్టక ఆశ్రయించిన పావురాన్ని కాపాడటానికి సిద్ధపడ్డ శిబి చక్రవర్తిలాంటి వాళ్ళ కీర్తి శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
Exam Tips:
a) శిబి ప్రాణాలను లెక్కచేయకుండా ఆశ్రితుని కాపాడినందువల్ల ఇంద్రాగ్నులు ‘శబ్ద బ్రహ్మం ఉన్నంతకాలం కీర్తి నిలుస్తుంది’ అని వరమిచ్చారని రాయండి.
Question 4: త్యాగనిరతి పాఠం ద్వారా డేగ దృష్టిలో ధర్మం అంటే ఏది ?
Answer:
అన్ని ప్రాణులు ఆహారం తీసుకొనే బ్రతుకుతాయి. ఆహారం లేకపోతే ప్రాణులు ఉండవు. డేగకు పావురం వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. డేగలు పావురాలను తింటాయి. కాబట్టి పావురాన్ని చంపి తినుట తప్పుకాదని, అది ధర్మబద్ధమే అని డేగ ఉద్దేశం.
Exam Tips:
a) డేగ దృష్టిలో ధర్మం: అన్ని ప్రాణులు ఆహారంతోనే బతుకుతాయి, వేదం నిర్దేశించిన ఆహారం తినడం తప్పుకాదు – ఈ వాదనను రాయండి.
Question 5: త్యాగనిరతి పాఠం ఆధారంగా శిబి చక్రవర్తికి, డేగకు మధ్య జరిగిన సంభాషణ రాయండి.
Answer:
సంభాషణ
డేగ : ఓ శిబి చక్రవర్తీ ! నువ్వు గొప్ప సత్యధర్మ పరుడవని విన్నాను. మరి ఆకలిగొన్నవాడినైన నా ఆహారాన్ని తిననీకుండ చేస్తున్నావెందుకు ? నేను ఆకలితో చనిపోతే నా పిల్లలు, భార్య బతకరు. ఇన్ని ప్రాణాలు పోవడానికి నీవు కారణమౌతావు. ఇది నీకు ధర్మమా ?
శిబి చక్రవర్తి : నేను నీ ఆహారమైన పావురాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాను. నీ ఆకలి తీర్చడానికి నీకేం కావాలో కోరుకో ఇస్తాను.
డేగ : పావురాలు మా జాతికి ఆహారమని వేదాల్లో కూడా చెప్పబడింది. కనుక నాకీ పావురాన్నిచ్చెయ్.
శిబి చక్రవర్తి : అడవిలోని ఏ జంతువుల మాంసం కావాలన్నా తెప్పించి ఇస్తాను. ఈ పావురాన్ని విడిచిపెట్టను. నేను ఆడిన మాట తప్పను.
డేగ : అయితే దీని బరువుకు సమానమైన మాంసము నీ శరీరం నుండి కోసి యివ్వు.
శిబి చక్రవర్తి : చాలా సంతోషం. తప్పక ఇస్తాను. (భటులతో-) భటులారా ! త్రాసు తీసుకురండి.
భటులు : చిత్తం మహాప్రభూ ! (త్రాసు తెచ్చారు. శిబి మాంసం కోసి త్రాసులో పెట్టాడు. రెండవ వైపు పావురాన్ని ఉంచారు.)
శిబి చక్రవర్తి : ఏమి ఆశ్చర్యం ! ఎంత మాంసం ఉంచినా తూగడం లేదు ! నేను స్వయంగా త్రాసులో కూర్చుంటాను. (కూర్చున్నాడు.)
డేగ : భళా ! శిబి చక్రవర్తీ ! నీ త్యాగనిరతి అపూర్వం. మెచ్చాను నీ త్యాగానికి.
శిబి చక్రవర్తి : మహానుభావా ! ఎవరు మీరు ?
డేగ : నేను ఇంద్రుడను. ఈ పావురం అగ్నిదేవుడు. నీ త్యాగాన్ని పరీక్షించడానికి ఈ రూపాలలో వచ్చాము. నీ ధైర్య శౌర్యాదిగుణాలు చాలా గొప్పవి. నీ కీర్తి ఆచంద్రతారార్కంగా వర్ధిల్లుతుంది.
Exam Tips:
a) సంభాషణ రాసేటప్పుడు ప్రతి పాత్ర పేరు, కోలన్ (:) ఉంచి వరుసగా మాటలు రాయండి; చివరికి ఇంద్రుడు, అగ్ని వెల్లడి కావడం చూపండి.
పాఠ్యభాగ పరిచయం
Question 1: త్యాగనిరతి పాఠం నేపథ్యం వివరించండి.
Answer:
పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబిచక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపం ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది.
Exam Tips:
a) నేపథ్యం: శిబి యజ్ఞం, ఇంద్రాగ్నుల పరీక్ష, డేగ–పావురం రూపాలు – ఈ మూడు అంశాలు రాయండి.
Question 2: త్యాగనిరతి పాఠ్యభాగ వివరాలు తెల్పండి.
Answer:
త్యాగనిరతి పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ‘ఇది ఇట్లా జరిగింది’ అని అర్థం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాక ముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు. ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు.
Exam Tips:
a) ప్రక్రియ (ఇతిహాసం), అర్థం, గ్రంథం (ఆంధ్ర మహాభారతం – అరణ్యపర్వం) తప్పక రాయండి.
Question 3: త్యాగనిరతి పాఠం రచించిన కవిని పరిచయం చేయండి.
Answer:
రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానకవి నన్నయ. ఇతనికి వాగనుశాసనుడనే బిరుదు ఉన్నది. 11వ శతాబ్దం వాడు.
వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో 4వ ఆశ్వాసంలో “శారదరాత్రులు” అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. “ఆంధ్రశబ్ద చింతామణి” అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ‘అక్షరరమ్యత, ప్రసన్నకథా కలితార్థయుక్తి, నానారుచిరార్థసూక్తి నిధిత్వం’ అనే లక్షణాలున్నాయని చెప్పుకున్నాడు.
Exam Tips:
a) కవి పేరు (నన్నయ), ఆస్థానం (రాజరాజ నరేంద్రుడు), బిరుదు (వాగనుశాసనుడు), కాలం, రచనలు – ఈ అంశాలు వరుసగా రాయండి.
Question 4: త్యాగనిరతి పాఠం ప్రవేశిక (పాఠం నేపథ్యం) తెలియజేయండి.
Answer:
మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలియజేయడం ఈ పాఠం నేపథ్యం.
Exam Tips:
a) ప్రవేశిక అంటే పాఠం ఉద్దేశాన్ని సూచించే పరిచయం; శిబి త్యాగగుణాన్ని ప్రస్తావిస్తూ రాయండి.
Free study material for Telugu
Telugu Class 8 Curriculum Solutions: Lesson 01 Selfless Sacrifice (Tyaganirathi)
Textbook Solutions for Class 8 Telugu Lesson 01 Selfless Sacrifice (Tyaganirathi)
Review comprehensive exercise answers for Class 8 Telugu Lesson 01 Selfless Sacrifice (Tyaganirathi). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Effective Self-Study and Homework Assistance
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 01 Selfless Sacrifice (Tyaganirathi) with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి is available for free on StudiesToday.com. These solutions for Class 8 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Telugu. You can access TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి in both English and Hindi medium.
Yes, you can download the entire TS 8th Class Telugu 1st Lesson Questions and Answers Telangana త్యాగనిరతి in printable PDF format for offline study on any device.