TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు

Solutions for Class 7 Telugu: Lesson 05 Palle Andalu (Beauty of the Village)

Access comprehensive textbook solutions for Lesson 05 Palle Andalu (Beauty of the Village) using the official curriculum guides for Class 7 Telugu. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 7 Telugu Solutions: Lesson 05 Palle Andalu (Beauty of the Village)

View or download the dedicated Lesson 05 Palle Andalu (Beauty of the Village) solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Telugu.

ఆలోచించండి – చెప్పండి

Question 1: కవి చెరువును గంగాళంతో పోల్చాడు కదా! ఇంకా చెరువును వేటితో పోల్చవచ్చు?

Answer:

ఇంకా పెద్ద పాత్రతో, చిన్న సముద్రంతో పోల్చవచ్చు. బాగా విచ్చిన తామరపువ్వుతో పోల్చవచ్చు. హైదరాబాద్‌లోని చెరువులను హుసేన్ సాగర్, నిజాంసాగర్ అని సాగరంతో పోల్చడం జరిగింది. వనపర్తి సంస్థానంలోని 7 పెద్ద చెరువులను సప్తసముద్రాలుగా పిలిచేవారు. కావున చెరువును సముద్రంగా పోల్చవచ్చు.

Exam Tips:

a) “చెరువు” పోలికలను (సముద్రం, పెద్ద పాత్ర, తామరపువ్వు) పాయింట్లుగా రాయండి.
b) హుసేన్‌సాగర్, నిజాంసాగర్ వంటి ఉదాహరణలు ఇస్తే సమాధానం బలపడుతుంది.

 

Question 2: పాఠంలో “చెరువును పద్మాలకు నిలయాలు” అని కవి అన్నాడు కదా! ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు ?

Answer:

మా పాఠంలో కవి చెరువును పద్మాలకు నిలయాలు అని చెప్పాడు. పూర్వం పరిశుభ్రత, స్వచ్ఛత ఉండడం వలన అవి అలా ఉండేవి. నేడు రసాయనాలు, మురికి, చెత్తా, చెదారంతో నిండి చెరువులు కలుషితం అవుతున్నాయి.

Exam Tips:

a) “పూర్వం – ఇప్పుడు” అనే పోలిక క్రమంలో రాయండి: పూర్వం పద్మాలు, నేడు చెత్త, రసాయనాలు.

 

Question 3: సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది?

Answer:

సూర్యోదయ సమయంలో చెరువు పరిశుభ్రంగా, నిర్మలంగా ఉంటుంది. సూర్యుని లేత కిరణాలు చెరువులో పడి, అందులోని తామరపూలు వికసించి ఎంతో అందంగా ఉంటాయి. లేత కిరణాలు పడి చెరువు స్వచ్ఛత వలన చూడ ముచ్చటగా ఉంటుంది.

Exam Tips:

a) నిర్మలమైన నీరు, లేత సూర్యకిరణాలు, వికసించిన తామరపూలు – ఈ మూడు దృశ్యాలను పేర్కొనండి.

 

Question 4: పూవులను ఏయే సందర్భాలలో అలంకరణకు వాడుతారు?

Answer:

పూలను ఆడవారు తమ తలపై పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతిరోజు దేవునికి సమర్పించడానికి, పూజలు చేయడానికి వినియోగిస్తారు. పండుగలలోను, పెళ్ళిళ్ళలోను, ఇంకా ఇతర సమయాలలో అలంకరించడానికి వాడతారు.
గౌరవనీయులైన వారి మెడలో వేయడానికి పూల మాలలను వాడతారు. పూలు అలంకార సాధనం.

Exam Tips:

a) అలంకరణ సందర్భాలను (తలలో పూలు, పూజ, పండుగలు, పెళ్ళిళ్ళు, సన్మానం) వేరు వేరుగా రాయండి.

 

Question 5: ఏఏ ఋతువులో ఏయే పూలు దొరుకుతాయి?

Answer:

వసంతఋతువు – చైత్ర, వైశాఖం
గ్రీష్మఋతువు – జ్యేష్ఠం, ఆషాఢం
వర్షఋతువు – శ్రావణం, భాద్రపదం
శరదృతువు – ఆశ్వయుజం, కార్తీకం
హేమంతఋతువు – మార్గశిరం, పుష్యం
శిశిరఋతువు – మాఘం, ఫాల్గుణం

Exam Tips:

a) ఆరు ఋతువులు, ఒక్కొక్కదానిలో రెండు మాసాలు క్రమంలో గుర్తుంచుకోండి: వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం.

 

Question 6: మీ గ్రామ ప్రత్యేకతలు ఏమిటి?

Answer:

మా గ్రామంలో అన్ని వర్గాల వారు కలసి మెలసి ఉంటారు. ఒకరి మంచి చెడులలో అందరూ పాల్గొంటారు. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అందరూ వస్తారు.
ఎవరికి ఎలాంటి కోపతాపాలు ఉండవు. ప్రశాంతంగా జీవిస్తారు. ఒకరిని మరొకరు గౌరవించుకొంటారు. అందరిలోను నీతి, నిజాయితి ఉంది.

Exam Tips:

a) మీ గ్రామ ప్రత్యేకతలు మూడు నాలుగు పాయింట్లుగా (ఐకమత్యం, పరస్పర సాయం, శాంతి) రాయండి.

 

Question 7: పల్లె జీవితం నుండి పశుసంపద ఎందుకు దూరం అయ్యింది?

Answer:

ఆధునిక యంత్రాలైన ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు రావడం ఒక కారణం.
పశుసంపదను పోషించడానికి కావలసినంత వసతి, మేత దొరకక పోవడం ఒక కారణం. పశువుల ఖరీదు ఎక్కువ కావడం ఒక కారణం. పశువుల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం మరొక కారణం.

Exam Tips:

a) పశుసంపద తగ్గడానికి కారణాలు: యంత్రాల రాక, మేత కొరత, ఖరీదు, నిర్వహణ ఖర్చు – పాయింట్లుగా రాయండి.

 

Question 8: పల్లెలోని వ్యాపారులు ఎట్లాంటి వ్యాపారం చేసేవారు? మీగ్రామంలోని వ్యాపారులకు, వీరికి భేదం తెలుపండి.

Answer:

పల్లెలోని వ్యాపారులు అన్ని రకాల వస్తువులు అమ్మేవారు. మా గ్రామంలోని వ్యాపారులు రైతుల వద్ద ధాన్యం, కందులు, మినుములు, పెసలు మొ॥ వాటిని కొని నిల్వ చేస్తారు. బాగా ధర వచ్చినపుడు అమ్మి లాభాలు పొందుతారు.

Exam Tips:

a) పల్లె వ్యాపారులు – మీ ఊరి వ్యాపారులు అనే రెండు భాగాల్లో పోలిక/భేదం స్పష్టంగా రాయండి.

 

Question 9: మీ ఊరిలో అంగడి ఎట్లా జరుగుతుంది?

Answer:

మా ఊరి అంగడిలో అనేక వస్తువులు దొరుకుతాయి. ప్రతి వస్తువూ చౌకగా లభించడం మా అంగడి ప్రత్యేకత!

Exam Tips:

a) అంగడిలో దొరికే వస్తువులు (కూరగాయలు, ధాన్యాలు, బట్టలు) రెండు మూడు చెప్పి, అంగడి ఏ రోజు జరుగుతుందో కూడా రాస్తే మంచిది.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: పాఠంలోని పద్యాల ద్వారా ఊరి గురించి తెలుసుకున్నారు కదా! మీరు చూసిన ఊరుతో దీన్ని పోల్చి మాట్లాడండి.

Answer:

పాఠంలోని పద్యాలలో ఊరు చెరువులు, పూలు, పండ్లు, పంటలు, పాడి, చేనేత కార్మికుల గూర్చి చెప్పారు. మేము చూసిన ఊరు హుజూర్‌నగర్. అక్కడ కుమ్మరి కుండలు చేస్తాడు. రైతులు పంటలు పండిస్తారు. వడ్రంగివారు చెక్కపని చేస్తారు. ఆయా ఋతువులలో అన్ని రకాల పండ్లు దొరుకుతాయి.

Exam Tips:

a) పాఠంలోని ఊరిని, మీ ఊరిని పోలికలు – తేడాలుగా పోల్చి చెప్పండి.

 

Question 2: పాఠంలోని పద్యాలను రాగంతో చదవండి. వాటి భావాలు చెప్పండి.

Answer:

1. ఊరి పక్కన కనిపించే రెండు చెరువులు నిండు గంగాళాల్లా ఉన్నాయి. వాటి అలుగులు కలిసిపోవడం వల్ల అవి ఒకే చెరువులా కనిపిస్తున్నాయి.
2. మా ఊరి చెరువులు తమలోని నీరు కనిపించనంతగా పద్మాలతో నిండి, వాటిని ప్రేమతో పోషిస్తున్నట్లున్నాయి.
3. చెరువులోని పద్మాలు ఉదయాన్నే చిన్న అలలతో స్నానం చేసి, రేకులెత్తి సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్లున్నాయి.
4. బంతి, చేమంతి పూలు పసుపు దిద్దినట్లు, గోరింటాకు పారాణి అద్దినట్లు, పట్టుకుచ్చుల పూలు కుంకుమ బొట్టు పెట్టినట్లు ఉండగా మా ఊరు పండు ముత్తైదువలా అందంగా ఉంది.
5. మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అరటి, దానిమ్మ చెట్లు, గులాబీ, మల్లె, మొల్ల, గన్నేరు వంటి మొక్కలు ఆయా కాలాల్లో పండ్లను, పూలను దంపతుల్లా ఊరికి కానుకగా ఇస్తున్నాయి.
6. మా ఊరిలో మామిడి తోటలు, తీయని నీటి బావులు, పూల పరిమళాలు వెదజల్లే ప్రదేశాలు, పుణ్యరాశుల్లాంటి ఆవులు ఎన్నో ఉన్నాయి.
7. మా ఊరిలోని పద్మశాలీ కుటుంబాలు అందమైన వస్త్రాలను నేస్తూ, ఆకర్షణీయమైన రంగులతో అద్దకం వేస్తూ నైపుణ్యంతో జీవిస్తున్నారు.
8. కాపు కుటుంబాలవారు ఎడ్లను, గేదెలను బిడ్డల్లా సాకుతూ, భూమి దున్ని పాడిపంటలతో సంతోషంగా జీవిస్తున్నారు.
9. మా ఊరి అంగళ్ళు అన్ని వేళల్లో అనేక వస్తువులతో, కొనేవారితో, అమ్మేవారితో సందడిగా ఉంటాయి.

Exam Tips:

a) పద్యాన్ని రాగంతో చదివిన తర్వాత ప్రతి పద్యం భావాన్ని ఒకటి రెండు వాక్యాల్లో చెప్పండి.
b) ప్రతిపదార్థాలు చూసి కఠినమైన పదాల (అలుగు, గంగాళం, తటాకం) అర్థాలు గుర్తుంచుకోండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: ఈ కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రకృతి అందచందాలు అమూల్య సంపదలు. గలగలపారే సెలయేరు, ఉదయించే అరుణకిరణాల సూర్యుడు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని కొంగేసినట్లున్న వనసీమలు ఒకటేమిటి? ఎన్నెన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు. పల్లె ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునే తల్లి. ఆప్యాయతకు, అనురాగాలకు పట్టుగొమ్మ. పల్లె అమాయకత్వం, దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం.
(అ) అమూల్య సంపదలు అంటే ఏమిటి?
(ఆ) ఆనందానికి నెలవు అంటే ఏమిటి?
(ఇ) అక్కున చేర్చుకోవడం అంటే మీకేం అర్థమయింది?
(ఈ) అనురాగాలకు పట్టుగొమ్మ అంటే ఏమిటి?
(ఉ) పై పేరాకు పేరు పెట్టండి.

Answer:

(అ) అమూల్య సంపదలు అనగా చాలా విలువైన సంపదలు అని అర్థం. వాటికి విలువ కట్టలేమని భావం.
(ఆ) ఆనందానికి నెలవు అంటే సంతోషానికి నిలయం అని అర్థం.
(ఇ) అక్కున చేర్చుకోవడం అంటే ప్రేమ చూపడం అని అర్థమయింది.
(ఈ) అనురాగం అంటే ప్రేమ. పట్టుగొమ్మ అంటే ఆధారం/స్థానం. పల్లె ప్రేమకు, అనుబంధాలకు స్థానం అని అర్థం.
(ఉ) పేరాకు పేరు: పల్లె – తల్లిప్రేమ.

Exam Tips:

a) పదాలకు అర్థం చెప్పమన్నప్పుడు పేరాలో వాటి సందర్భాన్ని చూసి రాయండి.
b) శీర్షిక పేరా సారాంశాన్ని సూచించేలా ఉండాలి.

 

Question 2: పాఠం ఆధారంగా కింది భావం తెలిపే పద్యపాదాలను వెతికి రాయండి.
(అ) అలుగుల గడుసుదనంతో ఒకే చెరువా అని తెలుపుతున్నట్లున్నాయి.
(ఆ) సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్లున్నాయి.
(ఇ) దంపతులవలె మా ఊరికి కానుకలు సమర్పిస్తున్నాయి.
(ఈ) జనం రాకపోకలతో మా అంగళ్ళన్నీ సందడితో ఉంటాయి.

Answer:

(అ) “రెండు చెరువు లొక్కటేయని చెప్పుచునుండె నడుమ గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.”
(ఆ) “అరుణ కిరణాల దేవత కర్ఘ్యమిచ్చు ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు.”
(ఇ) “ఊరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.”
(ఈ) “జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా యంగడులు నన్ని వేళలందు.”

Exam Tips:

a) పద్యపాదాలను చూసి యథాతథంగా (అక్షరం మార్చకుండా) రాయండి.
b) ఇచ్చిన భావంలోని కీలక పదాన్ని (అలుగు, అర్ఘ్యం, దంపతులు, అంగళ్ళు) పద్యంలో వెతకండి.

 

III. స్వీయరచన

Question 1: కవి అంగడిని బహుళ వస్తుప్రధానం అన్నాడు కదా! మీ ఊరి అంగడి కూడా ఇట్లే ఉంటుందా? వివరించండి. (ఐదు వాక్యాల్లో)

Answer:

మా ఊరి అంగడి కూడా కవి ఊరి అంగడిలా అన్ని వస్తువులతో నిండి ఉంటుంది. మా ఊరి అంగడిలో అన్ని వస్తువులూ లభిస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు – ఇంటిలో ప్రతినిత్యం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మా అంగడిలో లభిస్తాయి. అంగడిలోని సరుకులు తాజాగా ఉంటాయి. చౌకగా లభిస్తాయి.

Exam Tips:

a) “బహుళ వస్తుప్రధానం” అంటే అనేక వస్తువులతో నిండినది అని అర్థం – ఇది మొదటి వాక్యంలో చెప్పండి.

 

Question 2: గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారు? వీరివల్ల ఊరివాళ్ళకేం లాభం కలుగుతుంది? (లేక) గ్రామాల్లోని కులవృత్తి వారి వలన కలిగే లాభాన్ని వివరించండి.

Answer:

గ్రామాలలో అనేక కులాల వారు ఉంటారు. వారు వారి కులవృత్తులను చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. కాపులు, పద్మశాలీలే కాకుండా మంగలిపనివారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగం వృత్తులవారు, పశుకాపరులు ఉంటారు. ఆయా కులాల వారు వారి వృత్తులను నిర్వర్తించడం వలన ఊరివాళ్ళ అవసరాలు తీరుతాయి. అందరికీ పని దొరుకుతుంది. అసమానతలు పోతాయి.

Exam Tips:

a) ఒక్కో వృత్తివారు చేసే పనిని (కుమ్మరి – కుండలు, కమ్మరి – పనిముట్లు) చెబితే సమాధానం బలపడుతుంది.

 

Question 3: ఆదర్శగ్రామం ఎట్లుండాలని నీవనుకుంటున్నావు? (లేక) ఆదర్శగ్రామానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి?

Answer:

ఆదర్శగ్రామంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా జీవించాలి. అన్ని మతాల పండుగల్లో అందరూ పాల్గొనాలి. ఎవరికి ఎలాంటి అవసరం లేదా కష్టం వచ్చినా అందరూ సాయం చేయాలి. ఒకరి అవసరాలకు వేరొకరు నిలబడాలి. పేద, ధనిక తేడా చూపకుండా కలసి మెలసి ఉండాలి. గ్రామం అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేసుకొని అందరూ కలసి పూర్తి చేయాలి. మనుషులు, మనసులు వేరైనా ఒకే ఆలోచనతో ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అదే ఆదర్శగ్రామం.

Exam Tips:

a) ఐక్యత, పరిశుభ్రత, సహకారం, అభివృద్ధి ప్రణాళిక – ఈ లక్షణాలను పాయింట్లుగా చెప్పవచ్చు.

 

Question 4: ఊరుకు, చెరువుకు ఉన్న బంధం ఎట్లాంటిది? (లేక) సమాజంలో ఊరికి, చెరువుకు దగ్గరి బంధం ఉంది. వివరించండి. (లేక) ఊరు చెరువుల బంధం విడదీయరానిది. వివరించండి.

Answer:

ఊరు అంటే ప్రజలు, వారితోపాటు పశువులు, పక్షులు. వీరందరికీ నీరు కావాలి. నీరు ఒక కాలంలో దొరికి ఒక కాలంలో దొరకకపోతే కష్టం. అందుకే నీరు నిల్వ ఉంచే చెరువు ప్రతి ఊరికి అవసరం. నీరు తాగడానికే కాదు, వ్యవసాయానికీ కావాలి. ఇన్ని అవసరాలు తీరాలంటే నీరు అన్ని కాలాలలో నిల్వ ఉంచే చెరువు కావాలి. ఇలా చెరువుకు, ఊరుకు విడదీయలేని సంబంధముంది.

Exam Tips:

a) తాగునీరు, వ్యవసాయం, పశుపక్ష్యాదులు అనే మూడు అవసరాలను తప్పక పేర్కొనండి.
b) ఒకే ప్రశ్న మూడు రకాలుగా అడగవచ్చు; సమాధానం ఒక్కటే.

 

Question 5: ఊరికి అందాన్నిచ్చే అంశాలేవి? ప్రస్తుతం పల్లెటూర్లో ఇవి ఉంటున్నాయా? మీ అభిప్రాయాలను సొంతమాటల్లో రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

ఊరికి అందాన్నిచ్చేవి:
తామరపూలతో, కలువపూలతో నిండిన చెరువులు, మంచినీటి బావులు. ఊరిని పండు ముత్తైదువులా చేసే బంతి, చేమంతి వంటి పూల మొక్కలు, పరిమళం వెదజల్లే గులాబీ, మొల్ల, గన్నేరు, దాసన వంటి పూల మొక్కలు. మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన చెట్లు. వివిధ వృత్తులవారు, పశువులను పోషిస్తూ పంటలను పండించే కాపు బిడ్డలు. జనం రాకపోకలతో సందడిగా ఉండే అంగళ్ళు.
ప్రస్తుతం పల్లెటూళ్ళలో ఇవేవీ ఉండటం లేదు. చెరువులు కనబడటం లేదు. పచ్చని పొలాలు మాయమైపోతున్నాయి. ట్రాక్టర్ల రాకతో పశువులు కనబడడం లేదు. ఇప్పుడు పల్లెలన్నీ పట్నాలలాగే ఉన్నాయి.

Exam Tips:

a) సమాధానాన్ని రెండు భాగాలుగా రాయండి: (1) ఊరికి అందాన్నిచ్చేవి, (2) ప్రస్తుత పరిస్థితి.
b) చివర మీ అభిప్రాయాన్ని (చెరువులు, చెట్లు కాపాడుకోవాలి) ఒక వాక్యంలో చేర్చండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: పాఠంలోని 3వ, 4వ పద్యాలలో ఊరి అందాలను కవి వర్ణించాడు కదా! మీరు చూసిన / మీకు తెలిసిన ఊరు అందాలను వర్ణిస్తూ రాయండి.

Answer:

నేను చూసిన పల్లె ఖమ్మం జిల్లా వైరాకు దగ్గరగా ఉన్న సిరిపురం. ఈ ఊరిలో ప్రకృతి రమణీయంగా ఉంది. ప్రధానంగా పచ్చని పంట పొలాలతో నిండి ఉంది. ఎక్కడ చూచినా మనోహరమైన దృశ్యాలతో చూడముచ్చటగా ఉంది. ఉదయం సూర్యకిరణాలు వెచ్చని స్పర్శతో నిద్ర లేపుతాయి. కొలనుగట్లపై ఏపుగా పెరిగిన గడ్డి, కొలనులోని కలువల అందాలు నా మనసును దోచుకున్నాయి. కొలనులలోని తామరపూల సౌందర్యం చూడగానే నేను ఎంతో పులకించిపోయాను. ఆ అందం వలన కలిగిన మధురానుభూతులు నా హృదయాన్ని పెనవేసుకొని పోయాయి.

Exam Tips:

a) మీరు నిజంగా చూసిన ఊరి పేరు, అక్కడి చెరువు, పొలాలు, పూలు వంటి వివరాలతో రాస్తే స్వీయరచన విలువ పెరుగుతుంది.

 

Question 2: మూడవ పద్యం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి. దాని గురించి చిన్న కవిత రాయండి.

Answer:


అర్ఘ్యం
కొలనులోని జలములలో
కదలాడే చిరుత అలల
తానమాడి సంధ్యవార్చి
ధ్యానములో కొంత మునిగి
మెత్తని తన చేతులెత్తి
దోసిళ్ళుగ వాటి జేర్చి
నిర్మలమౌ జలములతో
దోసిళ్ళను నింపుకొని
తరుణారుణ కిరణ మణికి
తరణికి ఆ తరుణీమణి
మనోహరిణి పద్మలతిక
ప్రత్యుషస్సు సమయమ్మున
అర్ఘ్యమిచ్చి అర్చించెను
కర్మసాక్షి దినకరునికి

Exam Tips:

a) చిత్రంలో కొలను, పద్మాలు, ఉదయించే సూర్యుడు తప్పక ఉండాలి.
b) కవితలో “పద్మాలు సూర్యునికి అర్ఘ్యమివ్వడం” అనే భావాన్ని స్పష్టంగా చెప్పండి.

 

Question 3: నీవు చూసిన పల్లెను వివరిస్తూ స్నేహితునికి లేఖ వ్రాయుము.

Answer:

ఖమ్మం,
తేది : XX-XX-XXXX.
ప్రియమైన స్నేహితునికి,
కుశలములతో నీ మిత్రుడు శంకర్ వ్రాయునది. నేనిక్కడ కుశలం. నీ కుశలములు తెలుపుము. నేను ఈ మధ్య వైరా దగ్గరలోని గోపాలపురం అనే పల్లెను చూశాను. అక్కడి నా స్నేహితులతో కలసి వేసవి సెలవులు గడిపాను. ఆ ఊరి ప్రజలు చాలా మంచివారు. అమాయకులు. అక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడ చూచినా చెట్లు, పూలమొక్కలు, పాడి ఆవులు, గేదెలు, పొలాలు ఎంతో అందంగా ఉన్నాయి. వారంతా కష్టజీవులు. నేను వారి వృత్తిపనులు చూసి చాలా ఆనందించాను. వడ్రంగి చేసే బొమ్మలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. నేత వారు నేసే వస్త్రాలు ఎంతో మన్నికగా ఉన్నాయి. వాటిపై వేసే అందమైన అద్దకాలు తనివితీరా చూడాల్సిందే! ఎలాంటి కాలుష్యం లేదు. నీవు కూడా వీలైతే ఏదైనా పల్లెకు వెళ్ళిరా. నీ అనుభూతులు రాయి.
ఇట్లు,
నీ మిత్రుడు,
శంకర్.
చిరునామా :
కె. సురేష్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా.

Exam Tips:

a) లేఖ రూపం: ఊరు – తేదీ, సంబోధన, విషయం, ముగింపు, పేరు, చిరునామా – అన్నీ ఉండాలి.
b) తేదీ స్థానంలో నిజమైన తేదీ రాయండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింద గీతగీసిన పదాలకు అదే అర్థాన్నిచ్చే పదాలు రాయండి.
ఉదా : సంపదతో గర్వపడకూడదు.
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి.
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం.
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది.

Answer:

ఉదా : సంపద – కలిమి, ధనము
(అ) తటాకం – చెరువు
(ఆ) అంబరాలు – వస్త్రాలు, వలువలు
(ఇ) పురం – పట్టణం, ప్రోలు

Exam Tips:

a) “అంబరం” అనే పదానికి ఆకాశం, వస్త్రం అనే రెండు అర్థాలున్నాయి; వాక్యంలో “ధరిస్తాం” అని ఉంది కాబట్టి వస్త్రం సరైన అర్థం.

 

Question 2: కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.
(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది.
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి.

Answer:

(అ) కెరటాలు – అలలు
(ఆ) అలుగు – చెరువు నిండినపుడు నీరు బయటకు పోయే తూము
(ఇ) కొట్టం – పశువుల పాక

Exam Tips:

a) అర్థం రాసేటప్పుడు వాక్యంలోని సందర్భానికి సరిపోయే అర్థాన్నే ఎంచుకోండి.

 

Question 3: పాఠం ఆధారంగా కారణాలు పట్టికలో రాయండి.

Answer:

సందర్భంకారణం
(అ) ఊరు పసుపు అద్దినట్లుండడానికిబంతి, చేమంతి పూలతో నిండి ఉండడం కారణం
(ఆ) ఎర్రని పారాణి అద్దినట్లుండడానికిగోరింటాకు వలన పారాణి అద్దినట్లుంది
(ఇ) కుంకుమబొట్టు పెట్టినట్లు ఉండడానికిపట్టుకుచ్చుల పూలు కారణం
(ఈ) పండు ముత్తైదువగా ఉండడానికిపై మూడింటి వలన

Exam Tips:

a) నాలుగో కారణం పై మూడింటి కలయిక అని గుర్తుంచుకోండి (పసుపు + పారాణి + కుంకుమ = ముత్తైదువ).

 

Question 4: భావనాచిత్రమంటే ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించుకోవడమే! ఒక గ్రామానికి చెందిన భావనాచిత్రం గీయమన్నపుడు గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామంలోని కీలక ప్రదేశాలు, ప్రజలు, వృత్తులు తదితర అంశాలన్నీ పరిగణిస్తాం.

ఇచ్చిన ఉదాహరణ అంశాల ఆధారంగా పై భావనా చిత్రాన్ని పూర్తిచేయండి.

Answer:

మా ఊరు – భావనాచిత్రం:
1. క్రీడలు – క్రికెట్, వాలీబాల్, చదరంగం, కబడ్డీ
2. సౌకర్యాలు – బడి, వైద్యశాల, బస్టాండు, పంచాయితీ, దుకాణాలు
3. వృత్తులు – కమ్మరి, కుమ్మరి, చేనేత, వడ్రంగి
4. పంటలు – వరి, కందులు, పత్తి, మినుములు, పెసలు
5. నీటివసతులు – కాలువలు, బావులు, చెరువులు
6. రవాణా వసతులు – సైకిల్, ఎడ్లబండ్లు, ఆటోలు, బస్

Exam Tips:

a) భావనాచిత్రంలో కేంద్రంలో “మా ఊరు” అని రాసి, ప్రతి శాఖకు శీర్షిక ఇచ్చి, వాటి కింద ఉదాహరణలు రాయండి.
b) మీ ఊరికి తగినట్లుగా మార్చి రాయవచ్చు.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: కింది పదాలను కలిపి రాసి, సంధిని గుర్తించండి.
ఉదా : నీవు + ఎక్కడ = నీవెక్కడ – ఉత్వసంధి
(అ) భీముడు + ఇతడు
(ఆ) అతడు + ఎక్కడ
(ఇ) ఇతడు + ఒకడు
(ఈ) ఆటలు + ఆడు

Answer:

(అ) భీముడు + ఇతడు = భీముడితడు – ఉత్వసంధి
(ఆ) అతడు + ఎక్కడ = అతడెక్కడ – ఉత్వసంధి
(ఇ) ఇతడు + ఒకడు = ఇతడొకడు – ఉత్వసంధి
(ఈ) ఆటలు + ఆడు = ఆటలాడు – ఉత్వసంధి

Exam Tips:

a) మొదటి పదం చివర “ఉ” ఉంటే, తరువాత అచ్చు వచ్చినపుడు సంధి తప్పక జరుగుతుంది – ఇదే ఉత్వసంధి.

 

Question 2: కింది పదాలను కలిపి రాయండి.
(అ) ఏమి + అది
(ఆ) ఎవరికి + ఎంత
(ఇ) మరి + ఇప్పుడు
(ఈ) అవి + ఏవి

Answer:

(అ) ఏమి + అది = ఏమది
(ఆ) ఎవరికి + ఎంత = ఎవరికింత
(ఇ) మరి + ఇప్పుడు = మరిప్పుడు
(ఈ) అవి + ఏవి = అవేవి

Exam Tips:

a) ఇక్కడ మొదటి పదం చివర “ఇ” ఉంది; దాని తర్వాత అచ్చు వచ్చినపుడు “ఇ” లోపిస్తుంది.

 

Question 3: పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించి ఇత్వసంధి సూత్రాన్ని రాయండి.

Answer:

మొదటి పదం చివరి అచ్చు “ఇ”కారం (ఇత్తు). రెండవ పదాల మొదట్లో అన్నీ అచ్చులే వచ్చాయి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ‘ఇ’కారానికి (ఇత్తుకు) అచ్చుపరమైనపుడు సంధి జరుగుతుంది. కొన్నిచోట్ల ఇలా సంధికార్యం జరగదు.
ఉదా : ఏమి + అయ్యె = ఏమయ్యె – సంధి జరిగింది.
ఏమి + అయ్యె = ఏమియయ్యె – సంధి జరగక యడాగమం వచ్చింది.
ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరగక (నిషేధము) పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ (వైకల్పికము) అంటారు. “ఏమి” మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము. దీనినే ఇత్వసంధి అంటారు.
సూత్రం : ఏమి మొదలైన పదాలలో ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.

Exam Tips:

a) సూత్రంలో “వైకల్పికంగా” అనే మాట తప్పక రాయండి – ఇత్వసంధి నిత్యం కాదు, వికల్పం.
b) ఉత్వసంధిలో సంధి తప్పక జరుగుతుంది; ఇత్వసంధిలో జరగవచ్చు, జరగకపోవచ్చు – ఈ తేడా గుర్తుంచుకోండి.

 

Question 4: కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఉదా : రావాలని = రావాలి + అని (ఇత్వసంధి)
(అ) చెప్పాలంటే
(ఆ) ఒక్కటే
(ఇ) రానిదని
(ఈ) నీటినిసుమంత
(ఉ) చెప్పినదియేమి
(ఊ) వచ్చినపుడు
(ఋ) ఎన్నియేని

Answer:

(అ) చెప్పాలంటే = చెప్పాలి + అంటే – ఇత్వసంధి
(ఆ) ఒక్కటే = ఒక్కటి + ఏ – ఇత్వసంధి
(ఇ) రానిదని = రానిది + అని – ఇత్వసంధి
(ఈ) నీటినిసుమంత = నీటిని + ఇసుమంత – ఇత్వసంధి
(ఉ) చెప్పినదియేమి = చెప్పినది + ఏమి – ఇత్వసంధి
(ఊ) వచ్చినపుడు = వచ్చిన + అపుడు – అత్వసంధి
(ఋ) ఎన్నియేని = ఎన్ని + ఏని – ఇత్వసంధి

Exam Tips:

a) విడదీసినపుడు మొదటి పదం చివర “ఇ” (ఇత్తు) ఉందో “అ” ఉందో చూసి సంధి పేరు నిర్ణయించండి.

 

ప్రాజెక్టు పని

Question 1: మీ ఊరిలో ఉన్న చెట్లను, పూలను, జరిగే వ్యాపారాలను, చేతివృత్తులవారిని పరిశీలించండి. పట్టికలో నమోదు చేయండి.

Answer:

చెట్లుపూలువ్యాపారంచేతివృత్తులవారుఇతరములు
ఉదా : మామిడిగన్నేరుబియ్యంవడ్రంగులు
1. నిమ్మబంతికందులుకుమ్మరిసంకీర్తనలు
2. దానిమ్మచేమంతిచింతపండుమేదరిభజనలు
3. జామసన్నజాజిఉల్లిపాయలుకంసాలి
4. సపోటగులాబిబెల్లంవడ్డెర
5. రావిసంపంగిమినుములురజకుడు
6. వేపకనకాంబరంపెసలుమంగలి
7. సీతాఫలంమల్లెఅల్లంచర్మకారుడు
8. బొప్పాయిమందారంబియ్యంతాపీపని

Exam Tips:

a) పట్టికను మీ ఊరిలో నిజంగా కనిపించే చెట్లు, పూలు, వ్యాపారాలు, వృత్తులతో నింపండి; ఇచ్చిన నమూనా కేవలం ఉదాహరణ.

 

ముఖ్యమైన ప్రశ్నలు

Question 1: పల్లె ప్రజల జీవనం గూర్చి వ్రాయండి.

Answer:

పల్లెలోని ప్రజలు నిరాడంబరంగా జీవిస్తారు. వారి ఆలోచనలు పట్టణ ప్రజల శైలికంటే వేరుగా ఉంటాయి. పల్లె ప్రజల మనస్సుల్లో కాలుష్యం ఉండదు.
అందరూ ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం రచ్చబండ వద్ద కలుస్తారు. అందరి కష్టసుఖాలు, సమాజం, దేశరాజకీయాలు చర్చిస్తారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటారు.

Exam Tips:

a) నిరాడంబరత, పరస్పర సహకారం, రచ్చబండ చర్చలు – ఈ మూడు అంశాలను తప్పక ప్రస్తావించండి.

 

Question 2: నీవు చూచిన ఒక పల్లెటూరును గూర్చి, అక్కడి పరిస్థితుల గూర్చి వ్రాయుము.

Answer:

మా ఊరి పేరు రామాపురం. మా గ్రామానికి సర్పంచి, వార్డు మెంబర్లు ఉన్నారు. గ్రామం మొత్తానికి పెద్ద అయిన రామయ్యగారు ఉన్నారు. వారు నిజాయితీపరులు. అందరి కష్టసుఖాలను తెలుసుకుంటారు. ఎవరికి సమస్య వచ్చినా వారి వద్దనే పరిష్కారమవుతుంది. ఆయన మాటంటే అందరికీ గౌరవం. ఊరిలో దుకాణాలు, కూరగాయల మార్కెట్టు, అనేకరకాల వస్తువులమ్మే అంగళ్ళు ఉన్నాయి. మా పల్లె పచ్చని పైరులతో అలరారుతున్నది. అందుకే మా ఊరంటే మాకెంతో ఇష్టం.

Exam Tips:

a) ఊరి పేరు, పాలన (సర్పంచి), ప్రజల స్వభావం, దుకాణాలు, పంటలు – ఈ క్రమంలో రాయండి.

 

Question 3: పల్లెజీవనానికి, పట్టణ జీవనానికి పోలికలెట్టివి?

Answer:

పల్లెజీవనంపట్టణజీవనం
1. పల్లె తల్లి వంటిది.1. పట్టణం పెంపుడు తల్లి వంటిది.
2. పల్లె “నీకేం కావాలి?” అంటుంది.2. పట్టణం “నాకేమిస్తావు?” అంటుంది.
3. ఒకరి అవసరాలు, కష్టాలు, సంతోషాలు మరొకరు తెలుసుకుంటారు.3. ఎవరి జీవితాలు వారివే గడుస్తాయి.
4. పల్లెల్లో కాలాలు, ఋతువులు తెలుస్తాయి.4. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు వేగంగా జీవితం గడపడం వలన ఏమీ తెలియదు.
5. పచ్చని పొలాలతో ప్రకృతి రమణీయంగా, ప్రశాంతంగా ఉంటుంది.5. రణగొణ ధ్వనులతో విపరీతమైన కాలుష్యం ఆవరించి ఉంటుంది.
6. ఇళ్ళు విశాలంగా, ఆలోచనలు విస్తరించి ఉంటాయి.6. ఇళ్ళు ఇరుకుగా ఉంటాయి. ఆలోచనలు కూడా స్వార్థపూరితంగా ఉంటాయి.
7. పల్లెల్లో సాయంత్రానికి ఒకచోట చేరి కష్టసుఖాలు పంచుకుంటారు.7. ఎవరి ఆలోచనలు, కష్టసుఖాలు వారివే; పక్కన ఎవరున్నా తెలియకుండా జీవితం వేగంగా గడుపుతారు.
8. పల్లెల్లో జీవించేవారు ఎక్కువకాలం జీవించగలుగుతారు.8. పట్టణాల్లో గాలి, నీరు, ఆహారం కలుషితమై ఉండి, ఎక్కువకాలం జీవించలేరు.

Exam Tips:

a) పల్లె–పట్టణం పోలిక ప్రశ్నను రెండు కాలమ్‌ల పట్టికగా రాస్తే స్పష్టంగా ఉంటుంది.
b) కనీసం ఐదు తేడాలు రాయండి.

 

అదనపు అభ్యాసాలు

Question 1: క్రింది పద్యాన్ని వరుసక్రమంలో అమర్చండి.
(అ) గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
ఊరిప్రక్కన గన్పట్టు నొదుగులేని
లొక్కటేయని చెప్పుచునుండె నడుమ

Answer:

ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగు లేని
నిండు గంగాళముల వంటి రెండు చెఱువు
లొక్కటేయని చెప్పుచునుండె నడుమ
గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.

Exam Tips:

a) పద్యంలో మొదటి పాదం “ఊరి ప్రక్కన …” అనే విషయ ప్రారంభంతో, చివరి పాదం “… గడుసుదనము” అని ముగుస్తుంది; పాదాల అర్థ సంబంధాన్ని చూసి అమర్చండి.

 

Question 2: క్రింది పద్యపాదాలలోని ఖాళీలను ఇచ్చిన పదాలతో పూర్తి చేయండి. (హాయిగ, అంగడులు, లలిత, మధురముల్, మాయూరి)
(అ) మా తటాకాలు ……………… పద్మాకరాలు.
(ఆ) ప్రత్యుషస్సున ………………. పద్మలతలు.
(ఇ) మావులున్నవి …………………. మంచినీటి బావులున్నవి.
(ఈ) వెలయు మా ………………… నన్నివేళలందు.
(ఉ) భూమిదున్నుకొని ……………….. నుందురు.

Answer:

(అ) మా తటాకాలు లలిత పద్మాకరాలు.
(ఆ) ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు.
(ఇ) మావులున్నవి మధురముల్ మంచినీటి బావులున్నవి.
(ఈ) వెలయు మా అంగడులు నన్నివేళలందు.
(ఉ) భూమిదున్నుకొని హాయిగ నుందురు.

Exam Tips:

a) పద్యాల్లోని పదాల వరుసను గుర్తుకు తెచ్చుకొని, అర్థానికి, ఛందస్సుకు సరిపోయే పదాన్ని ఎంచుకోండి.

 

Question 3: సరియైన వాటితో జతపరచండి.
1) చెరువులు
2) బంతి, చేమంతి పూలు
3) ఊరు
4) పట్టుకుచ్చుల పూలు
5) ఎర్రని గోరింటాకు
(అ) పారాణి అద్దినట్లు
(ఆ) పండు ముత్తైదువువలే
(ఇ) కుంకుమ పెట్టినట్లు
(ఈ) పసుపు దిద్దినట్లు
(ఎ) గంగాళములవలె

Answer:

1) చెరువులు – (ఎ) గంగాళములవలె
2) బంతి, చేమంతి పూలు – (ఈ) పసుపు దిద్దినట్లు
3) ఊరు – (ఆ) పండు ముత్తైదువువలే
4) పట్టుకుచ్చుల పూలు – (ఇ) కుంకుమ పెట్టినట్లు
5) ఎర్రని గోరింటాకు – (అ) పారాణి అద్దినట్లు

Exam Tips:

a) పసుపు – బంతి, చేమంతి; పారాణి – గోరింటాకు; కుంకుమ – పట్టుకుచ్చుల పూలు అనే జతలు పాఠంలోని 4వ పద్యంలో ఉన్నాయి.

 

Question 4: క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
“మిరపగింజ చూడ మీద నల్లగ నుండు
కొరికి చూడ లోన చురుకు మనును
సజ్జనులనెడి వారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినుర వేమ!”
(1) మిరపగింజ ఎలా ఉంటుంది?
(2) అది కొరికి చూస్తే ఎలా ఉంటుంది?
(3) మిరపగింజలాంటి వారు ఎవరు?
(4) పై పద్యం ఏ శతకం నుండి గ్రహించబడినది?
(5) పై పద్యానికి శీర్షిక పెట్టండి.

Answer:

(1) మిరపగింజ పైకి చూడడానికి నల్లగా ఉంటుంది.
(2) అది కొరికి చూస్తే లోపల చురుక్కుమంటుంది (ఘాటుగా ఉంటుంది).
(3) సజ్జనులు మిరపగింజలాంటివారు. పైకి సామాన్యంగా కనిపించినా వారి సారం (గొప్పదనం) లోపల ఉంటుంది.
(4) ఈ పద్యం వేమన శతకం నుండి గ్రహించబడినది.
(5) శీర్షిక: సజ్జనుల సారం.

Exam Tips:

a) పద్యంలోని పోలిక (మిరపగింజ – సజ్జనుడు) ఏమిటో ముందు గుర్తించి సమాధానాలు రాయండి.
b) వేమన పద్యాల మకుటం “విశ్వదాభిరామ వినుర వేమ” అని గుర్తుంచుకోండి.

 

Question 5: క్రింది పద్యపాదాలను చదివి వాటికి సరియైన అర్థం రాయండి.
1. అరుణ కిరణాల దేవత కర్ఘ్యమిచ్చు
ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు
2. ఊరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.

Answer:

1. మా ఊరిలోని తీగవంటి పద్మాలు ఉదయాన సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్లున్నాయి.
2. దంపతులవలె మా ఊరికి ఎల్లప్పుడూ కానుకలు సమర్పిస్తుంటాయి.

Exam Tips:

a) పద్య పాదంలోని ప్రతి పదానికి ప్రతిపదార్థం చూసి, వరుసగా కలిపి సరళమైన వాక్యంగా రాయండి.

 

Question 6: క్రింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించి వేరుగా రాయండి.
(అ) హిందువులు గోవులను పూజిస్తారు. ఆవు పాలు పిల్లలకు ఉత్తమమైనవి. ధేనువు సాధుజంతువు.
(ఆ) నేను ప్రతిరోజు కోవెలకు వెళతాను. దేవాలయం ప్రశాంతంగా ఉంటుంది. ఆ గుడి చాలా పెద్దది.
(ఇ) మనము ప్రతిదినము సూర్యుడు ఉదయించేటప్పటికి లేవాలి. భాస్కరుని ఉదయ కిరణాలు లేతగా ఉంటాయి. దినకరుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు.
(ఈ) మనము నీటిని వృథాచేయరాదు. జలము లేనిదే జీవించలేము. ఉదకము ఎక్కువగా తాగుట మంచిది.
(ఉ) గులాబీల పరిమళం ఎంతో బావుంటుంది. ఆ సువాసనలను పీల్చడం ఆరోగ్యానికి మంచిది. శుభకార్యాలలో సుగంధాలను వెదజల్లుతారు.

Answer:

(అ) గోవు, ఆవు, ధేనువు
(ఆ) కోవెల, దేవాలయం, గుడి
(ఇ) సూర్యుడు, భాస్కరుడు, దినకరుడు
(ఈ) నీరు, జలము, ఉదకము
(ఉ) పరిమళము, సువాసన, సుగంధము

Exam Tips:

a) ప్రతి వాక్యంలో ఒకే అర్థం వచ్చే మూడు పదాలు ఉంటాయి; వాటిని వాక్యంలో ఉన్నట్లే ఎంచుకోండి.

 

Question 7: క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి.
(అ) స్నానము చేయుట వలన మురికి పోవును. ప్రతివారు రోజుకు రెండుమారులు తానము చేయాలి.
(ఆ) ప్రతివారు భక్తితో పూజచేయాలి. బత్తిలేని పూజ పనికిరానిది.
(ఇ) వస్త్రములోని వర్ణములు అందంగా ఉన్నాయి. వన్నెలు బట్టి వస్త్రాలకు గిరాకీ ఏర్పడును.
(ఈ) ఆ పురమునందలి ఇళ్ళు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆకసంలో పక్షులు ఎగురుతున్నాయి.
(ఉ) ఈ భూమిపై అనేక జీవరాశులున్నాయి. బువిలో ప్రాణులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి.

Answer:

(అ) స్నానము – తానము
(ఆ) భక్తి – బత్తి
(ఇ) వర్ణము – వన్నె
(ఈ) ఆకాశం – ఆకసం
(ఉ) భూమి – బువి

Exam Tips:

a) ప్రకృతి (సంస్కృత పదం) ముందు, వికృతి (తెలుగు రూపం) తరువాత రాయండి.
b) పాఠం చివర ఇచ్చిన ప్రకృతి–వికృతుల జాబితాను బాగా నేర్చుకోండి.

 

Question 8: క్రింది పదాలను కలిపి రాయండి.
(అ) ఇంపు + ఆర
(ఆ) పద్మ + ఆకరము
(ఇ) దంపతులు + అట్లు
(ఈ) భీముడు + అతడు

Answer:

(అ) ఇంపు + ఆర = ఇంపార
(ఆ) పద్మ + ఆకరము = పద్మాకరము
(ఇ) దంపతులు + అట్లు = దంపతులట్లు
(ఈ) భీముడు + అతడు = భీముడతడు

Exam Tips:

a) “అ”కు “ఆ” కలిస్తే “ఆ” (సవర్ణదీర్ఘం) అవుతుంది; “ఉ”కు అచ్చు కలిస్తే “ఉ” లోపిస్తుంది.

 

Question 9: క్రింది పదాలను విడదీసి, సంధిపేర్లు రాయండి.
(అ) నాట్యమాడుతూ
(ఆ) సాంద్రమగుచు
(ఇ) ఆటలాడు
(ఈ) ఏమది

Answer:

(అ) నాట్యమాడుతూ = నాట్యము + ఆడుతూ – ఉత్వసంధి
(ఆ) సాంద్రమగుచు = సాంద్రము + అగుచు – ఉత్వసంధి
(ఇ) ఆటలాడు = ఆటలు + ఆడు – ఉత్వసంధి
(ఈ) ఏమది = ఏమి + అది – ఇత్వసంధి

Exam Tips:

a) మొదటి పదం చివర “ఉ” ఉంటే ఉత్వసంధి, “ఇ” ఉంటే ఇత్వసంధి అని గుర్తుంచుకోండి.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 7 Telugu Lesson 05 Palle Andalu (Beauty of the Village)

Official TS Board Solutions for Lesson 05 Palle Andalu (Beauty of the Village)

Review comprehensive exercise answers for Class 7 Telugu Lesson 05 Palle Andalu (Beauty of the Village). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Step-by-Step Explanations for Lesson 05 Palle Andalu (Beauty of the Village)

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Next Steps in Your Telugu Revision

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Telugu.

FAQs

Where can I find the latest TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు for the 2026-27 session?

The complete and updated TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు is available for free on StudiesToday.com. These solutions for Class 7 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Telugu. You can access TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire TS 7th Class Telugu 5th Lesson Questions and Answers Telangana పల్లె అందాలు in printable PDF format for offline study on any device.