TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు

Official TS Board Solutions for Class 7 Telugu: Lesson 04 Amma Gnapakalu (Mother's Memories)

Review structured textbook solutions for Class 7 Telugu Lesson 04 Amma Gnapakalu (Mother's Memories). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Chapter-wise Solutions for Telugu: Lesson 04 Amma Gnapakalu (Mother's Memories)

Access the complete solution PDF for Class 7 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

బొమ్మను చూడండి – మాట్లాడండి

Question 1: పై బొమ్మలో ఎవరెవరున్నారు?

Answer:

పై బొమ్మలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాశంలో చందమామ ఉన్నాడు.

Exam Tips:

a) బొమ్మను జాగ్రత్తగా చూసి కనిపించే వారిని (తల్లి, ఇద్దరు పిల్లలు) మరియు ఆకాశంలో చందమామను తప్పక పేర్కొనండి.

 

Question 2: అమ్మ ఏం చేస్తున్నది?

Answer:

అమ్మ ప్రేమతో పిల్లకు చందమామను చూపి, గోరుముద్దలు తినిపిస్తున్నది.

Exam Tips:

a) అమ్మ చేస్తున్న పనులు రెండు – చందమామను చూపడం, గోరుముద్దలు తినిపించడం – రెండూ రాయండి.

 

Question 3: పిల్ల కోసం అమ్మ ఏయే సేవలు చేస్తుంది?

Answer:

పిల్ల కోసం అమ్మ అన్ని సేవలు చేస్తుంది. స్నానం చేయించడం, అన్నం వండడం, బట్టలు ఉతకడం, అన్నం పెట్టడం, నిద్ర పుచ్చడం వంటి సేవలను ఎంతో ప్రేమగా చేస్తుంది.

Exam Tips:

a) స్నానం, వంట, బట్టలు ఉతకడం, అన్నం పెట్టడం, నిద్రపుచ్చడం వంటి సేవలను పాయింట్లుగా రాయండి.

 

Question 4: మీరు మీ అమ్మకోసం ఎప్పుడెప్పుడు ఎటువంటి సేవలు చేశారు?

Answer:

మేము అమ్మకోసం గిన్నెలు సర్దడం, ఇల్లు శుభ్రం చెయ్యడం, బట్టలు మడత పెట్టడం వంటి పనులలో సేవలు చేశాము.

Exam Tips:

a) మీ సొంత అనుభవం ప్రకారం ఇంటి పనులలో చేసిన సేవలను ఉదాహరణలతో రాయండి.

 

Question 5: మీరు మీ అమ్మకోసం ఏమైనా చేసినపుడు ఎట్లా అనిపించింది?

Answer:

అమ్మ నాకోసం అన్నీ చేస్తున్నప్పుడు నేను కూడ ఇంటి పనులలో అమ్మకు సాయం చేయాలనిపించింది. అమ్మ నా పనులు చూచి వద్దన్నా నేను కూడా అమ్మకు సేవలు చేయడం నా బాధ్యత అనిపించింది.

Exam Tips:

a) “ఎట్లా అనిపించింది?” అనే ప్రశ్నకు మీ భావాన్ని (సంతోషం, బాధ్యత) స్పష్టంగా చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి

Question 1: “అమ్మ ముగ్గులేస్తే వాకిలి అద్దకపు చీరలా ఉందనడంలో” కవి ఆంతర్యమేమిటి?

Answer:

అమ్మ ముగ్గువేస్తే వాకిలి (ఇంటి ముందరిభాగం) రంగవల్లితో, చేనేతవారు చీరమీద వేసిన అద్దకంలా అందంగా అలంకరింపబడుతుందని కవి ఆంతర్యం.

Exam Tips:

a) అద్దకపు చీర – ముగ్గులేసిన వాకిలి అనే పోలికను స్పష్టంగా రాయండి.
b) చివరి వాక్యాన్ని “అని కవి ఆంతర్యం” అని ముగిస్తే ప్రశ్న అడిగిన విధానానికి సరిపోతుంది.

 

Question 2: అమ్మను నర్సు అని కవి ఎందుకన్నాడు?

Answer:

తన బిడ్డలకు జలుబు, వాంతులు, జ్వరం వస్తే అమ్మ చిన్నిచిన్ని చిట్కాలతో వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. తన ఒడినే తన పిల్లలకు వెచ్చని పక్కలా మార్చుతుంది. అందుకనే అమ్మను నర్సు అన్నారు.

Exam Tips:

a) అమ్మ చేసే పనులను (చిట్కాలు, మందులు వేయడం, ఒడినే పక్కగా మార్చడం) నర్సు చేసే పనులతో పోల్చి రాయండి.

 

Question 3: ఈ ఇంటిని హాస్పిటల్‌గా మార్చటం అంటే మీకేమర్థమైంది?

Answer:

ఇంటిలోని వారికి ఆరోగ్యం బాగాలేకపోతే తల్లి చుట్టుప్రక్కల పరిసరాలను హాస్పిటల్ కంటే పరిశుభ్రంగా ఉంచుతుంది. తడిగుడ్డతో తుడవడం, పిల్లలకు వేడినీటిని కాచి ఇవ్వడం, మందులు సకాలంలో వేయడం వంటివి చేయడం వలన ఇంటిని హాస్పిటల్‌గా మార్చటం అని అర్థమైంది.

Exam Tips:

a) పరిశుభ్రత, వేడినీరు, సకాలంలో మందులు – ఈ మూడు అంశాలను పేర్కొనండి.
b) “అర్థమైంది” అని అడిగారు కాబట్టి మీ సొంత మాటల్లో రాయండి.

 

Question 4: ఆస్థానపు తెల్లకుందేళ్ళు అని కవి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఎందుకు?

Answer:

దొరల బిడ్డలను ఉద్దేశించి కవి ఆ మాట అన్నాడు. దూడల నోళ్ళు కట్టేసి పితికిన బర్రెపాలను దూడలకు ఇవ్వకుండా దొరల బిడ్డలకు ఇవ్వడం వల్ల, వారు ఏ శ్రమా లేకుండా పెరిగే తెల్లని కుందేళ్ళలా ఉన్నారని వారిని తెల్లకుందేళ్ళతో పోల్చాడు.

Exam Tips:

a) ప్రశ్నలో రెండు భాగాలు (ఎవరిని? ఎందుకు?) ఉన్నాయి – రెండింటికీ విడివిడిగా సమాధానం రాయండి.

 

Question 5: అమ్మ పొద్దంతా ఎవరి కోసం కష్టపడుతుంది? మీకెట్లాంటి సేవలు చేస్తుంది?

Answer:

అమ్మ పొద్దంతా తన బిడ్డల కోసం కష్టపడుతుంది. మా కోసం ఉదయం నుండి రాత్రి వరకు అన్ని సేవలు చేస్తుంది. పాలు, టిఫిన్, భోజనం, మళ్ళీ ఆకలైతే తినడానికి పల్లికాయల్లాంటివి, సాయంత్రం ఇంటికెళ్ళేసరికి మళ్ళీ ఏదో ఒకటి పెడుతుంది. బట్టలుతకడం, పుస్తకాలు సర్దడం లాంటి అన్ని సేవలు చేస్తుంది.

Exam Tips:

a) ఉదయం–మధ్యాహ్నం–సాయంత్రం క్రమంలో అమ్మ సేవలను రాస్తే సమాధానం చక్కగా కనిపిస్తుంది.

 

Question 6: మీరు కేరింతలు కొడుతూ ఏయే సందర్భాల్లో ఆనందంగా ఉంటారు?

Answer:

1. మేము స్నానం చేసేటపుడు కేరింతలు కొడుతూ ఉంటాం.
2. చెరువుల్లో, కాలువల్లో స్నేహితులతో కలిసి ఆడేటప్పుడు కేరింతలు కొడతాం.
3. పుట్టినరోజున, హాయిగా ఉన్నప్పుడు, సంతోషం కలిగే వార్త విన్నప్పుడు కేరింతలు కొడతాం.

Exam Tips:

a) ఇది అనుభవ ప్రశ్న; మూడు నాలుగు సందర్భాలను పాయింట్లుగా రాస్తే చాలు.

 

Question 7: “అమ్మ జ్ఞాపకాలు తేనెటీగల్లా ముసురుతాయి” అనడంలో కవి ఆంతర్యమేమిటి?

Answer:

తేనెటీగలు ముసిరితే ఆగకుండా శబ్దం చేస్తాయి. అమ్మ కనబడే దేవత. తన కోసం ఏమీ చేసుకోదు. అన్నీ పిల్లల కోసమే ఆలోచిస్తుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఒకసారి తమ తల్లిని గుర్తుకు చేసుకుంటే, అమ్మ చేసిన పనులన్నీ మనసారా తలచుకుంటే, మనసున్న మనిషికి అమ్మ జ్ఞాపకాలు తేనెటీగల్లా ఆగకుండా ముసురుతాయి అని కవి ఆంతర్యం.

Exam Tips:

a) తేనెటీగలు ముసరడం – జ్ఞాపకాలు ఆగకుండా రావడం అనే పోలికను మొదట చెప్పి, తర్వాత అమ్మ త్యాగాన్ని వివరించండి.

 

ఇవి చేయండి – I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

Question 1: అమ్మ జ్ఞాపకాలను కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా! మీరు మీ అమ్మ గురించి చెప్పండి.

Answer:

మా అమ్మ నా బాల్యంలో నాకు స్నానం చేయించేది. పాలిచ్చేది. ఆకలివేస్తే అన్నం కాని ఏదో ఒకటి గాని పెట్టేది. దెబ్బ తగిలినా, బాధపడి వెళ్ళి ‘అమ్మా!’ అంటే ఓదార్చేది. నొప్పి వెంటనే పోయేది. జ్వరం, జబ్బు చేస్తే నిద్రపోయేది కాదు. రాత్రి, పగలు నా వెంటే ఉండేది. అమ్మ పక్కనే ఉంటే ఎంతో హాయిగా ఉండేది. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు. అమ్మ లేనపుడే అమ్మ విలువ తెలుస్తుంది.
మేమెప్పుడూ మా అమ్మను మరచిపోము.

Exam Tips:

a) మీ సొంత అనుభవాలను ఉదాహరణలతో రాయండి; పాఠంలోని వాక్యాలను యథాతథంగా దించవద్దు.

 

Question 2: మీరు మీ అమ్మను సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తారు?

Answer:

మేము మా అమ్మను సంతోషపెట్టడానికి మంచి పనులు చేస్తాము. మంచి ప్రవర్తనతో ఉంటాము. బాగా చదువుకొంటాము. ఇతరులతో తగాదాలకు వెళ్ళము. అమ్మ చెప్పిన పనులు చేస్తే అమ్మకు చాలా ఇష్టం కదా! అవే చేస్తాము. ఇంటి పనులలో అమ్మకు సహాయపడతాము. అమ్మ కోరుకున్నది సాధించడానికి ఏమి చేయడానికైనా సిద్ధపడతాము.

Exam Tips:

a) చదువు, ప్రవర్తన, ఇంటి పనిలో సాయం – ఈ మూడింటిని తప్పక చేర్చండి.

 

II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

Question 1: పాఠం చదవండి. వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి.

Answer:

అంశంపోలిక
ముగ్గులేసిన ప్రాంగణంఅద్దకపు చీర
పండ్లుపాల బలపాలు
ఇల్లుదవాఖానా
దొరల బిడ్డలుతెల్లకుందేళ్ళు
ముక్కుపోగునెలవంకలా అర్ధచంద్రాకారం
వడ్లు దంచే చప్పుడుమద్దెల మోత
ముక్కుపుల్లవిష్ణువు ముట్టెమీద ఎత్తిన భూగోళం
గంటీలుగడియారంలోని లోలకం
అమ్మ ఒడిగుమ్మి

Exam Tips:

a) పట్టికలో ఎడమ వైపు అంశం, కుడి వైపు పోలిక అని వరుస తప్పకుండా రాయండి.
b) తొమ్మిది పోలికలనూ రాయండి; ఒక్కటి వదిలినా మార్కులు తగ్గవచ్చు.

 

Question 2: కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే. లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశసమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడా తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు.
భారతజాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతులనందుకొనిన వీరశివాజీ తన తల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి, పెంచి, పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పుతిలీబాయి. ప్రపంచ చరిత్రను సునిశితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.
(అ) సీతమ్మ లవకుశులను ఎట్లా తీర్చిదిద్దింది?
(ఆ) ఆదిశంకరుల తల్లి పేరేమిటి?
(ఇ) శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచింది?
(ఈ) గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం ఎవరు?
(ఉ) జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు?

Answer:

(అ) సీతమ్మ లవకుశులను వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తీర్చిదిద్దింది.
(ఆ) ఆదిశంకరుల తల్లి పేరు ఆర్యాంబ.
(ఇ) శివాజీని జిజియాబాయి వీరుడిగా, శూరుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు పెంచింది.
(ఈ) గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం ఆయన తల్లి పుతిలీబాయి.
(ఉ) జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఆ మహనీయుల తల్లులే.

Exam Tips:

a) పేరాలోని వాక్యాలనే ఆధారంగా చేసుకొని సమాధానాలు రాయండి; బయటి విషయాలు చేర్చవద్దు.
b) ప్రతి సమాధానం ఒక పూర్తి వాక్యంగా రాయండి.

 

III. స్వీయరచన

Question 1: కవి రచనా శైలిని సొంతమాటల్లో రాయండి. (లేదా) ఈ కవితలోని రచయిత రచనాపద్ధతి ఎట్టిది?

Answer:

కవి ఈ గేయాన్ని వచనకవితా ప్రక్రియలో రాశాడు. గేయాన్ని ఎలాంటి ఛందో నియమాలను పట్టించుకోకుండా భావానికి ప్రాధాన్యత నిస్తూ రాశాడు. ‘అమ్మ’ను కవితా వస్తువుగా తీసుకొని ప్రతివాడి మనసులో అమ్మ స్థానాన్ని, విలువను నింపాడు. సరళమైన భాషతో, తేలికైన పదాలతో చెప్పదలచుకొన్న అభిప్రాయాన్ని చక్కగా తెలిపాడు. తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత రాసినవాడుగా గుర్తింపు పొందాడు.

Exam Tips:

a) వచన కవిత, ఛందస్సు లేకపోవడం, సరళమైన తెలంగాణ యాస – ఈ మూడు లక్షణాలు తప్పక రాయండి.
b) ఐదు వాక్యాల్లో రాయమన్నారు కాబట్టి ఐదు వాక్యాలకు మించకుండా రాయండి.

 

Question 2: “కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అమ్మ పనిచేసింది” అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? (లేదా) అమ్మ కుటుంబంలో పరిశుభ్రతను ఎలా పాటిస్తుంది?

Answer:

కవి తన రచనలో అమ్మను స్వచ్ఛభారత్‌లో కాలుష్య నిర్మూలనా కార్యకర్తగా చూపాడు. ఇంటి ముందరి ముగ్గులో రంగులద్దిన చీరను చూపాడు. అమ్మ పళ్ళను తెల్లని పాలబలపాలుగా చిత్రీకరించాడు. పిల్లలకు జ్వరం వస్తే ఇంటినే దవాఖానాగా మార్చాడు. దొరల కొట్టంలో బర్లను శుభ్రంచేసి, పెండను తీసే కార్యకర్తగా వర్ణించాడు. అమ్మ పిల్లల పెంపకంలో ఆరోగ్య కార్యకర్తగా చూపాడు.

Exam Tips:

a) కొట్టంలో పేడ తీయడం, ఇంటిని దవాఖానాగా మార్చడం వంటి పాఠంలోని ఉదాహరణలను తప్పక చేర్చండి.

 

Question 3: మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటలో రాయండి. (లేదా) మీ అమ్మ ఆలోచనలను, కోరికలను గూర్చి వ్రాయండి.

Answer:

మా అమ్మకు తన పిల్లలంటే చాలా ఇష్టం. తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, బాగా ఎదగాలని కోరేది. తన పిల్లలు అందరికంటే బాగా చదివితే ఇష్టం. తన పిల్లలు తన ముందే ఆటలలోను, పాటలలోను బాగా రాణిస్తే ఇష్టం. తన బిడ్డలు తన కళ్ళముందే ఎదుగుతుంటే లోలోపల ఆనందంతో మురిసిపోవడం తనకిష్టం. అమ్మ ఇష్టాలను తీర్చడం కష్టమైనా మాకిష్టం.

Exam Tips:

a) ఇది సొంత అనుభవ ప్రశ్న – మీ అమ్మ ఇష్టాలకు తగినట్లు మార్చి రాయవచ్చు.

 

Question 4: అమ్మ చేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి? (లేదా) మీ ఇంట్లో మీ తల్లికి సాయం చేయడంలో మీ పాత్ర ఏమిటి?

Answer:

అమ్మ తన బిడ్డలు కష్టపడకూడదని అన్ని పనులు తానే చేసుకుంటుంది. పిల్లలు పెద్దయిన తర్వాత వారే నేర్చుకుంటారని ఏ పనీ మనకు చెప్పదు. మనం ఇంట్లో అన్ని పనుల్లోను ఎంతో కొంత అమ్మకు సాయం చేయాలి. అమ్మకు సాయం చేస్తే అందులో మనకు కూడా పనులు అలవాటవుతాయి. నేర్చుకుంటాము. తృప్తి మిగులుతుంది. అమ్మ శిక్షణలో చేసే పనుల వలన పెద్దయిన తర్వాత మన పనులు మనమే చేసుకోగలుగుతాం. ఒక పనిని అందరూ చేస్తే ఎవరికీ ఎక్కువ శ్రమ, ఆయాసం ఉండదు. త్వరగా కూడా పూర్తవుతుంది.

Exam Tips:

a) కారణాలను (అమ్మకు శ్రమ తగ్గడం, మనకు పనులు అలవడడం, తృప్తి) వేరువేరుగా చెప్పండి.

 

Question 5: అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

అమ్మ పరిశుభ్రత : అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులు అద్దిన చీరలా కనిపించేది. నవ్వితే పళ్ళు బలపాల్లా ఉండేవి. పిల్లలకు జలుబు చేస్తే, జ్వరం వస్తే ఇంటినే దవాఖానా (హాస్పిటల్)గా మార్చేది. ఒక నర్సులాగా మందు బిళ్ళలు వేసేది.
అమ్మ కష్టం : అయ్య పాలు పిండితే అమ్మ దొరల కొట్టంలో పెండ తీసేది. భూస్వాముల ఇళ్ళముందు కుందెనలో పోసి వడ్లను దంచేది.
అమ్మ అందం : అమ్మ ముక్కుపోగు ఆకాశానికి హత్తుకొన్న నెలవంకలా అందంగా ఉండేది. అమ్మ ముక్కుపుల్ల ముట్టె మీద ఎత్తిన భూగోళంలా ఉండేది. చెవుల గెంటీలు గడియారంలోని లోలకంలా ఊగేవి. అమ్మకు కాళ్ళకు కడియాలు వేసుకోవడం, మట్టెలు తొడుక్కోవడం చాలా ఇష్టం.
అమ్మ ప్రేమ : అమ్మ రోజంతా పనిచేసి సోలెడు నూకలను చీరకొంగున మూటగట్టి తెచ్చేది. పిల్లలు ఎదురు చూస్తారని ఒడిలో పల్లికాయలు, పెసరకాయలు తెచ్చి పెట్టేది. అమ్మ ఒడి నుండి ఎన్ని తీసుకొన్నా ఇంకా మిగిలే ఉంటాయి. అమ్మ గొప్పదనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు.

Exam Tips:

a) పరిశుభ్రత, కష్టం, అందం, ప్రేమ అనే నాలుగు శీర్షికలుగా విభజించి రాస్తే పది వాక్యాల సమాధానం క్రమంగా ఉంటుంది.
b) కవితలోని పోలికలను (అద్దకపు చీర, పాలబలపాలు, నెలవంక) ఉదహరించండి.

 

IV. సృజనాత్మకత / ప్రశంస

Question 1: మీ అమ్మ బొమ్మ గీయండి. అమ్మ గొప్పతనం తెలిపేటట్లు చిన్న కవిత రాయండి.

Answer:


అమ్మ ప్రేమ చాలా మధురం
తీయని మాటల సమూహం
చక్కని అందాల సమస్తం
తన పలుకులతో పిల్లలను
ఉత్తమ రత్నాల్లా తీర్చేది అమ్మ
తన శ్రమనంతా కూర్చి
వారికెలాంటి బాధ, వ్యధ లేకుండా చేసేది అమ్మ
తన శరీరాన్ని స్థానంగా చేసి
అమృత ధారలను పంచి
హాయినీ, ఆనందాన్ని కుటుంబానికిచ్చేది అమ్మ

Exam Tips:

a) కవిత నాలుగైదు పంక్తులైనా అమ్మ త్యాగం, ప్రేమ అనే భావం స్పష్టంగా ఉండాలి.
b) బొమ్మ పరీక్షలో గీయమంటే శుభ్రంగా, పేరు రాసి గీయండి.

 

Question 2: పాఠ్యభాగం ఆధారంగా క్రింది ఖాళీలను పూర్తిచేయండి.
1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం …………………. లా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు ……………. తాగేవి.
3. గోవుల ప్రక్కన ……………. ఇంటిముందు ఆడుకొనేవాళ్ళు.
4. చెవుల గెంటీలు గడియారంలోని ……………….. లా ఊగేవి.
5. ……………… అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.

Answer:

1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్లకుందేళ్ళు తాగేవి.
3. గోవుల ప్రక్కన ల్యాగల్లా ఇంటిముందు ఆడుకొనేవాళ్ళం.
4. చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యులంలా ఊగేవి.
5. తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.

Exam Tips:

a) కవితలోని పంక్తులను గుర్తుకు తెచ్చుకొని ఖాళీలను నింపండి; పోలిక పదాన్ని మాత్రమే రాస్తే చాలు.

 

Question 3: అమ్మ ప్రేమ గొప్పతనాన్ని గూర్చి మీ స్నేహితురాలికి లేఖ వ్రాయండి.

Answer:

ఆదిలాబాద్,
తేది : XX-XX-XXXX.
ప్రియమైన స్నేహితురాలు సరళకు,
నేనిక్కడ కుశలం. నీ కుశలం తెలుపుము. మా పాఠశాల తెరచి నెలరోజులైంది. బాగా చదువుకుంటున్నాను. నేను నీకు ఈ లేఖలో అమ్మ గొప్పతనాన్ని చెప్పదలచుకున్నాను. అమ్మ జ్ఞాపకాలు పాఠం మా మాష్టారుగారు చెప్పారు. నేను మా అమ్మ గూర్చి చాలా రకాలుగా ఆలోచించాను. అమ్మ ఇంట్లో చాలా ముఖ్యమైన వ్యక్తి. అందరి అవసరాలు తీర్చేది. ఎవరికీ బాధ కలగకుండా, ఏమీ మన నుండి కోరకుండా తన పని తానే చేసుకుంటూ పోతుంది. అమ్మ లేకపోతే ఒక నిముషం గడవదు. అన్ని రకాలా, అందరికీ అవసరమైన వ్యక్తి. మనమంతా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మ విలువ తెలుసుకొని మెలగాలి. అక్కడి విశేషాలతో నీవు కూడా లేఖ వ్రాయాలి సుమా!
ఇట్లు,
నీ మిత్రురాలు విమల,
7వ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
ఆదిలాబాద్.
చిరునామా :
కరణం సరళ,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
వరంగల్.

Exam Tips:

a) లేఖలో ఊరు–తేదీ, సంబోధన, విషయం, ముగింపు, పంపినవారి పేరు, చిరునామా అనే భాగాలన్నీ తప్పక ఉండాలి.
b) తేదీ స్థానంలో అసలు తేదీ రాయండి (XX-XX-XXXX కాదు).

 

Question 4: కింది ప్రశ్నలకు ఇవ్వబడిన జవాబులలో సరైనదానిని గుర్తించండి.
1. అమ్మ ఇంటిని ఇలా మార్చింది: (అ) కుంపటి (ఆ) హాస్పిటల్ (ఇ) వంటశాల (ఈ) పాఠశాల
2. అమ్మ ముక్కుపోగు ఇలా ఉంది: (అ) రత్నం (ఆ) వజ్రం (ఇ) నెలవంక (ఈ) కంఠాభరణం
3. చెవుల గెంటీలు ఇలా ఊగేవి: (అ) గడియారంలోని పెండ్యులంలా (ఆ) ఆకాశంలో నక్షత్రాల్లా (ఇ) ఎద్దు మెడలోని గంటల్లా (ఈ) మెడలోని రత్నాలహారాల్లా
4. అమ్మ జ్ఞాపకాలు ఇలా ముసురుతాయి: (అ) సినిమా కథల్లాగా (ఆ) నిద్రలో కలలా (ఇ) చందమామ బొమ్మల్లాగా (ఈ) తేనెటీగల్లా
5. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం ఇలా ఉంటుంది: (అ) రంగవల్లిలా (ఆ) ముగ్గుల తోరణంలా (ఇ) అద్దకపు చీరలాగా (ఈ) రత్నాల హారంలా

Answer:

1. (ఆ) హాస్పిటల్
2. (ఇ) నెలవంక
3. (అ) గడియారంలోని పెండ్యులంలా
4. (ఈ) తేనెటీగల్లా
5. (ఇ) అద్దకపు చీరలాగా

Exam Tips:

a) బహుళైచ్ఛిక ప్రశ్నల్లో కవితలోని పోలిక పదాలను (హాస్పిటల్, నెలవంక, పెండ్యులం, తేనెటీగలు, అద్దకపు చీర) గుర్తుపెట్టుకోండి.

 

V. పదజాల వినియోగం

Question 1: కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.
1. జెండావందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం. (అ) బయట (ఆ) లోపల (ఇ) ముంగిలి (ఈ) ఇంటిలో
2. మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు. (అ) గోడకు వేసే సున్నం (ఆ) బట్టలకు రంగు వేసే విధానం (ఇ) రంగు వేయడం (ఈ) రంగు తీసివేయడం
3. బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది. (అ) కట్ట (ఆ) గోడ (ఇ) తీరం (ఈ) దూరం

Answer:

1. (ఇ) ముంగిలి
2. (ఆ) బట్టలకు రంగు వేసే విధానం
3. (ఇ) తీరం

Exam Tips:

a) ఇచ్చిన వాక్యంలో ఆ పదాన్ని ఉంచి చదివితే సరైన అర్థం సులభంగా తెలుస్తుంది.

 

Question 2: కింద గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.
(అ) కంచు మోగునట్టు కనకంబు మోగునా?
(ఆ) కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది.
(ఇ) అంబా అని తల్లి పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది.

Answer:

(అ) కంచు – కాంస్యం, ఘంటాలోహం
(ఆ) కుందేలు – చెవులపిల్లి, శశం
(ఇ) తల్లి – అమ్మ, జనని, మాత

Exam Tips:

a) పర్యాయపదాలు ఒకే అర్థం ఇచ్చే వేరు పదాలు; గీతగీసిన పదంతో సమానార్థం ఉన్నవే రాయండి.
b) కనీసం రెండు పర్యాయపదాలు రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 3: కింద గీతగీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.
(అ) కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు.
(ఆ) ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
(ఇ) శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది.

Answer:

(అ) కుల్య (ప్రకృతి) – కాలువ, కయ్య (వికృతి)
(ఆ) ఆకాశం (ప్రకృతి) – ఆకసం (వికృతి)
(ఇ) మొగము (వికృతి) – ముఖము (ప్రకృతి)

Exam Tips:

a) సంస్కృత పదం ప్రకృతి, దాని తెలుగు రూపం వికృతి అని గుర్తుపెట్టుకోండి.
b) జతలు: ఆకాశం–ఆకసం, ముఖం–మొగం, పక్షి–పక్కి వంటివి బాగా నేర్చుకోండి.

 

VI. భాషను గురించి తెలుసుకుందాం

Question 1: ఈ కింది పదాలను విడదీయండి.
(అ) అతడెక్కడ
(ఆ) బొమ్మనిచ్చెను
(ఇ) మనిషన్నవాడు

Answer:

(అ) అతడెక్కడ = అతడు + ఎక్కడ
(ఆ) బొమ్మనిచ్చెను = బొమ్మను + ఇచ్చెను
(ఇ) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు

Exam Tips:

a) విడదీసేటప్పుడు మొదటి పదం చివర లోపించిన అచ్చును (ఉ, ఇ) తిరిగి రాయాలి.

 

Question 2: ఈ క్రింది పదాలను కలపండి.
(అ) మేన + అల్లుడు
(ఆ) పుట్టిన + ఇల్లు
(ఇ) ఏమి + అంటివి

Answer:

(అ) మేన + అల్లుడు = మేనల్లుడు
(ఆ) పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు
(ఇ) ఏమి + అంటివి = ఏమంటివి

Exam Tips:

a) మొదటి పదం చివరి అచ్చు, రెండవ పదం మొదటి అచ్చు కలిసి ఎలా మారాయో గమనించి కలపండి.

 

Question 3: ఈ క్రింది పదాలను గమనించండి. ఉత్వసంధి సూత్రాన్ని రాయండి.
(అ) రాముడు + అతడు = రాముడతడు (ఉ + అ = అ)
(ఆ) సోముడు + ఇతడు = సోముడితడు (ఉ + ఇ = ఇ)
(ఇ) మనము + ఉంటిమి = మనముంటిమి (ఉ + ఉ = ఉ)
(ఈ) అతడు + ఎక్కడ = అతడెక్కడ (ఉ + ఎ = ఎ)

Answer:

మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని ఉ-కారం లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అలాగే నిలిచి ఉంటుంది. అనగా ఉ-కారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్వసంధి’ అంటాం. ‘ఉ’ కారాన్ని ఉత్తు అంటారు. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.

Exam Tips:

a) సూత్రం: “ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది” – ఈ వాక్యాన్ని తప్పనిసరిగా రాయండి.
b) ఒక ఉదాహరణ (రాముడు + అతడు = రాముడతడు) చేర్చండి.

 

Question 4: ఈ కింది పదాలను కలిపి రాయండి.
(అ) చెట్టు + ఎక్కి
(ఆ) వాడు + ఎక్కడ
(ఇ) ఎదురు + ఏగి

Answer:

(అ) చెట్టు + ఎక్కి = చెట్టెక్కి
(ఆ) వాడు + ఎక్కడ = వాడెక్కడ
(ఇ) ఎదురు + ఏగి = ఎదురేగి

Exam Tips:

a) మొదటి పదం చివరి ‘ఉ’ లోపించి, రెండవ పదంలోని అచ్చు మాత్రమే మిగులుతుంది.

 

Question 5: ఈ క్రింది పదాలను విడదీయండి.
(అ) నూకలేసుకొని
(ఆ) చూరెక్కి
(ఇ) ఎట్లున్నది

Answer:

(అ) నూకలేసుకొని = నూకలు + ఏసుకొని
(ఆ) చూరెక్కి = చూరు + ఎక్కి
(ఇ) ఎట్లున్నది = ఎట్లు + ఉన్నది

Exam Tips:

a) విడదీసినప్పుడు మొదటి పదం చివర “ఉ” తిరిగి రాయడం మరచిపోవద్దు.

 

ప్రాజెక్టు పని

Question 1: ఒకరోజు ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు అమ్మను గమనించండి. ఏమేమి పనులు చేసింది? ఆయా పనులు చేసేటప్పుడు ఆమె ఎట్లా ఉన్నది? మీకేమనిపించింది? ఈ వివరాలతో నివేదిక రాయండి.

Answer:

ఉదయం : అమ్మ ఉదయం 5 గంటలకే నిద్రలేచింది. తన పనులు చేసుకొన్న తర్వాత పిల్లలకు, భర్తకు ఆ రోజు ఏయే పనులు చేయాలో నిర్ణయించుకొన్నది. ఉదయం పిల్లలకు పాలిచ్చింది. ఆకలికి ఉండలేరని చద్ది అన్నంలో పచ్చడి / పెరుగు కలిపి పిల్లలకు ఆహారంగా పెట్టింది. వంటలో ఏమేమి వండాలో నిర్ణయించి కూరగాయలు తరిగింది. భర్తకు అల్పాహారం తయారుచేసి పెట్టింది. ఉతకవలసిన బట్టలు ఉతికి ఆరవేసింది. ముందురోజు అంట్లు తానే తోముకుంది. పిల్లలకు ఉతికిన బట్టలు వేసి పాఠశాలకు పంపింది.
మధ్యాహ్నం : 1 గంటకు ఆ రోజు మధ్యాహ్న భోజనానికి కావలసిన ఆహార పదార్థాలు వండి సిద్ధం చేసింది. కొంచెంసేపు విశ్రాంతి తీసుకొంది. మధ్యాహ్నం పిల్లలు, భర్త రాగానే వారికి అందరికీ ప్రేమతో పెట్టి పంపించింది. అన్ని పనులు తానే చేసుకోవడం వలన కొంత అలసిపోయింది.
సాయంత్రం : 5.30 గంటలకు బడి నుండి పిల్లలు, ఆఫీసు నుండి భర్త రావడానికి ముందే వారి ఆకలి తీర్చడానికి అల్పాహారం తయారుచేసింది. ఉతికిన బట్టలు మడతపెట్టింది. సాయంత్రం వారిని కొంతసేపు ఆడుకోనిచ్చిన తర్వాత పాఠశాల ఇంటిపని చేయడానికి సిద్ధం చేసింది. వారితో పాఠాలు చదివించింది.
రాత్రి : 8.30కు పిల్లలకు, భర్తకు కావలసిన పదార్థాలు మరల సిద్ధం చేసి వారికి పెట్టి తాను తిని, పిల్లలు, భర్త ముఖంలోని తృప్తిని చూచి తాను ఆనందంతో, అలసిన దేహంతో చక్కగా నిద్రపోయేది. మాకోసం శ్రమపడే మా అమ్మను చూస్తే మాకెంతో ఇష్టం.

Exam Tips:

a) నివేదికను ఉదయం – మధ్యాహ్నం – సాయంత్రం – రాత్రి అని సమయాల వారీగా విభజించి రాయండి.
b) చివర “నాకేమనిపించింది” అనే మీ భావాన్ని ఒక వాక్యంలో తప్పక రాయండి.

 

ముఖ్యమైన ప్రశ్నలు

Question 1: ‘అమ్మ జ్ఞాపకాలు’ పాఠం ద్వారా నీవేం తెలుసుకున్నావు?

Answer:

‘అమ్మ జ్ఞాపకాలు’ పాఠం ద్వారా అమ్మ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, తన సేవలను కుటుంబం కోసం ఎలా చేస్తుందో తెలుసుకొన్నాను. దేవుడు తన రూపం అంతటా ఉండాలని అమ్మను సృష్టించాడు. చిన్నతనంలో అమ్మపట్ల ప్రేమను, విలువను పెంచే విధానాన్ని కవి మాకు తెలిపాడు. తల్లికి కుటుంబంలో ఉన్న విలువను, స్థానాన్ని తెలిపాడు. పిల్లల అవసరాలను తీర్చడంలో తల్లి ఎంత తపన పడుతుందో తేనెవంటి తీయని మాటలు, ప్రవర్తన, స్పర్శ మొదలైన విషయాల ద్వారా జీవితమంతా గుర్తుండేటట్లు, మనసులలో నాటుకొనేటట్లు చెప్పాడు.
లోకంలోని గొప్పవారైన సీతమ్మ, ఆదిశంకరులు, శివాజీ, గాంధీజీ మొదలైన వారంతా తల్లి ఇచ్చిన స్ఫూర్తితో గొప్పవారైనవారే. తల్లి ఎలాంటి ప్రేరణ ఇస్తుందో పిల్లలు అలా తయారవుతారని ఈ పాఠం నేర్పుతోంది. అమ్మ గొప్పతనం మాటలకు అందనిది. అమ్మ విలువ ఉన్నప్పటి కంటే, లేనప్పుడు ఇంకా తెలుస్తుంది.
తేనెటీగలు తేనెకోసం పూల చుట్టూ తిరిగినట్లు అమ్మ జ్ఞాపకాల మాధుర్యం మన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.

Exam Tips:

a) పాఠ సారాంశాన్ని ప్రారంభం – అమ్మ సేవలు, మధ్య – గొప్పవారికి తల్లి ప్రేరణ, ముగింపు – తేనెటీగల పోలిక అనే క్రమంలో రాయండి.

 

అదనపు అభ్యాసాలు

Question 1: క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించి రాయండి.
(అ) ఆవు సాధుజంతువు. గోవుపాలు పిల్లలకు చాలా మంచిది. ధేనువులను హిందువులు పూజిస్తారు.
(ఆ) మా నాన్నగారు మాకు పూజనీయులు. తండ్రి ఇంటిలోని వారికి అన్నీ సమకూరుస్తాడు. మా అయ్యను విడచి ఉండలేము.
(ఇ) ప్రతివారికి ఇల్లు చాలా అవసరం. గృహం కొనాలంటే చాలా డబ్బు కావాలి. నివాసం శాంతంగా ఉండాలంటే అందరూ కలసి ఉండాలి.
(ఈ) గాలి ముక్కుతోనే పీల్చాలి. నాసికలోని నరాలు సున్నితంగా ఉంటాయి. మనం ఎలాంటి వాసననైనా పసికట్టడానికి ఘ్రాణం అవసరం.
(ఉ) నా పుట్టిన రోజున ఆనందంగా గడుపుకొంటాను. సంతోషాన్ని నల్గురితోను పంచుకోవాలి. మనం సుఖంగా ఉండాలంటే ఇతరులను కూడా హాయిగా ఉంచాలి.

Answer:

(అ) ఆవు, గోవు, ధేనువు
(ఆ) నాన్న, తండ్రి, అయ్య
(ఇ) ఇల్లు, గృహం, నివాసం
(ఈ) ముక్కు, నాసిక, ఘ్రాణం
(ఉ) ఆనందం, సంతోషం, సుఖం

Exam Tips:

a) ఒకే అర్థం ఇచ్చే మూడు పదాలను వాక్యాల్లో గుర్తించి, ఉన్నది ఉన్నట్లు రాయండి.

 

Question 2: క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి వేరుగా వ్రాయండి.
(అ) రాముడు ధర్మమును ఆచరించెను. దమ్మము తప్పనివారు ఎపుడూ గెలుస్తారు.
(ఆ) పక్షి రెక్కల సాయంతో ఎగురును. పక్కి తన పిల్లలకు ముక్కుతో ఆహారాన్ని అందించును.
(ఇ) ఆకాశంలో విమానం ఎగురుతోంది. ఆకసంలో ఇంద్రధనుస్సు ఏర్పడును.
(ఈ) కవులు కవితలు రాస్తారు. కైతలో విషయం ఉంటేనే అందరూ చదువుతారు.
(ఉ) రాత్రిళ్ళు బయట తిరగరాదు. అడవిలో రాతిరిపూట అంతా చీకటిగా ఉంటుంది.

Answer:

(అ) ధర్మము – దమ్మము
(ఆ) పక్షి – పక్కి
(ఇ) ఆకాశం – ఆకసం
(ఈ) కవిత – కైత
(ఉ) రాత్రి – రాతిరి

Exam Tips:

a) ప్రతి జతలో ముందు ప్రకృతి (సంస్కృత పదం), తరువాత వికృతి (తెలుగు రూపం) రాయండి.

 

Question 3: క్రింది వాక్యాలలోని గీతగీసిన సంధిపదాలను విడదీసి, సంధి పేరు గుర్తించండి.
(అ) సీత ముఖం చంద్రాకారంలో ఉంది.
(ఆ) కమల నవ్వుతున్నపుడు అందంగా ఉంటుంది.
(ఇ) మహాత్ముల రచనలు చదవాలి.
(ఈ) పెద్దవారు వచ్చినపుడు ఎదురేగి గౌరవించాలి.
(ఉ) గోపి చెట్టెక్కి కాయలు కోస్తున్నాడు.
(ఊ) రామయ్య మాటలు చాలా వినాలనిపిస్తుంది.

Answer:

(అ) చంద్రాకారం = చంద్ర + ఆకారం – సవర్ణదీర్ఘసంధి
(ఆ) నవ్వుతున్నపుడు = నవ్వుతు + ఉన్నపుడు – ఉత్వసంధి
(ఇ) మహాత్ములు = మహా + ఆత్ములు – సవర్ణదీర్ఘసంధి
(ఈ) ఎదురేగి = ఎదురు + ఏగి – ఉత్వసంధి
(ఉ) చెట్టెక్కి = చెట్టు + ఎక్కి – ఉత్వసంధి
(ఊ) రామయ్య = రామ + అయ్య – అత్వసంధి

Exam Tips:

a) మొదటి పదం చివర “ఉ” ఉంటే ఉత్వసంధి, “అ” కి “అ/ఆ” కలిస్తే సవర్ణదీర్ఘసంధి, “అ” కి అచ్చు కలిసి “అ” లోపిస్తే అత్వసంధి అని గుర్తుంచుకోండి.

 

Question 4: క్రింది వాక్యాలలోని గీతగీసిన పదాలకు విగ్రహవాక్యాలు వ్రాసి సమాసాలు గుర్తించండి.
(అ) సీతారాముల పిల్లలు లవకుశులు.
(ఆ) మా ఇల్లు పదిగజాల దూరంలో ఉంది.
(ఇ) వేసవిలో కూరగాయల ధర ఎక్కువ.
(ఈ) తల్లిదండ్రులను గౌరవించాలి.
(ఉ) బ్రహ్మవిష్ణుమహేశ్వరులను త్రిమూర్తులు అంటారు.

Answer:

(అ) లవకుశులు – లవుడు మరియు కుశుడు – ద్వంద్వ సమాసం
(ఆ) పదిగజాలు – పది అను సంఖ్యగల గజాలు – ద్విగు సమాసం
(ఇ) కూరగాయలు – కూరలు మరియు కాయలు – ద్వంద్వ సమాసం
(ఈ) తల్లిదండ్రులు – తల్లి మరియు తండ్రి – ద్వంద్వ సమాసం
(ఉ) త్రిమూర్తులు – త్రి అను సంఖ్యగల మూర్తులు – ద్విగు సమాసం
సూత్రాలు: సమాసపదంలో రెండు పదాలూ ప్రధానమైతే అది ద్వంద్వ సమాసం. సమాసపదంలో మొదటి పదం సంఖ్యను తెలిపితే అది ద్విగు సమాసం.

Exam Tips:

a) ద్వంద్వ సమాసంలో విగ్రహవాక్యం “… మరియు …”, ద్విగు సమాసంలో “… అను సంఖ్యగల …” అని రాయండి.

 

Question 5: కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అమ్మ జ్ఞాపకాలు పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. వచన శైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ‘శబ్నం’ కవితా సంపుటిలోనిది. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి, సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన సామాజిక కవి టి. కృష్ణమూర్తి యాదవ్. కరీంనగర్ జిల్లాకు చెందినవాడు. తన తొలి కవితా సంపుటి “తొక్కుడుబండ”తో సాహితీక్షేత్రంలో ప్రవేశించాడు. “శబ్నం” వీరి రెండవ కవితా సంపుటి.
(అ) అమ్మ జ్ఞాపకాలు రచయిత పేరు?
(ఆ) వచన కవితను ఆంగ్లంలో ఏమంటారు?
(ఇ) అమ్మ జ్ఞాపకాలు ఏ కవితా సంపుటి నుండి గ్రహించబడింది?
(ఈ) కవి తొలి కవితా సంపుటి పేరేమి?
(ఉ) పాఠ రచయిత ఏ జిల్లాకు చెందినవాడు?

Answer:

(అ) టి. కృష్ణమూర్తి యాదవ్
(ఆ) Free Verse
(ఇ) శబ్నం
(ఈ) తొక్కుడుబండ
(ఉ) కరీంనగర్

Exam Tips:

a) జవాబులన్నీ పేరాలోనే ఉన్నాయి – పేర్లను (కవి, సంపుటి, జిల్లా) అక్షరదోషం లేకుండా రాయండి.

 

Question 6: క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని తెలుగు నేలను గొప్ప స్థితిలో ఉంచిన కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అతడు మంచి పరిపాలకుడే కాదు, మానవ ధర్మం, కళాధర్మం తెలిసిన సాహితీవంతుడు. తెలుగు, సంస్కృత భాషలలో పండితుడు. సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పకళలకు గౌరవమిచ్చాడు. అతడికి ఉన్న బలహీనత జంతువులను వేటాడడం.
1. కాకతీయ రాజులలో చివరివాడు ఎవరు?
2. రెండవ ప్రతాపరుద్రుని సామ్రాజ్యానికి రాజధాని నగరం ఏది?
3. ప్రతాపరుద్రునికి ఏ భాషలలో పాండిత్యం ఉంది?
4. ప్రతాపరుద్రుడు గౌరవించే కళలు ఏవి?
5. అతని బలహీనత ఏమిటి?

Answer:

1. కాకతీయ రాజులలో చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు.
2. రెండవ ప్రతాపరుద్రుని సామ్రాజ్యానికి రాజధాని ఏకశిలా నగరం.
3. ప్రతాపరుద్రునికి తెలుగు, సంస్కృత భాషలలో పాండిత్యం ఉంది.
4. ప్రతాపరుద్రుడు సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పకళలను గౌరవించాడు.
5. అతని బలహీనత జంతువులను వేటాడడం.

Exam Tips:

a) అపరిచిత గద్యంలో ప్రశ్నలకు సమాధానాలు గద్యంలోనే ఉంటాయి; గద్యాన్ని రెండుసార్లు చదివి వాక్యాలను పూర్తిగా రాయండి.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 7 Telugu Lesson 04 Amma Gnapakalu (Mother's Memories)

Accessing Lesson 04 Amma Gnapakalu (Mother's Memories) Solutions

Review comprehensive exercise answers for Class 7 Telugu Lesson 04 Amma Gnapakalu (Mother's Memories). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 7 Telugu

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Telugu module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Lesson 04 Amma Gnapakalu (Mother's Memories) with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు for the 2026-27 session?

The complete and updated TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు is available for free on StudiesToday.com. These solutions for Class 7 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు will help students to get full marks in the theory paper.

Do you offer TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Telugu. You can access TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire TS 7th Class Telugu 4th Lesson Questions and Answers Telangana అమ్మ జ్ఞాపకాలు in printable PDF format for offline study on any device.