TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ

Step-by-Step Textbook Solutions for Class 7 Telugu Lesson 02 Nayanamma (Grandmother)

Review structured textbook solutions for Class 7 Telugu Lesson 02 Nayanamma (Grandmother). Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Lesson 02 Nayanamma (Grandmother) Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 7 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

ఆలోచించండి – చెప్పండి (పాఠానికి ముందు)

Question 1: పై బొమ్మలో ఎవరెవరున్నారు?

Answer:

పై బొమ్మలో ముసలవ్వ, ఆమె కొడుకు, కోడలు, మనుమడు, మనుమరాలు ఉన్నారు.

Exam Tips:

a) బొమ్మలో కనిపించే ప్రతి వ్యక్తి (ముసలవ్వ, కొడుకు, కోడలు, మనుమడు, మనుమరాలు) పేరు తప్పక రాయండి.

 

Question 2: బొమ్మలో ఏం జరుగుతున్నది?

Answer:

బొమ్మలో ముసలవ్వకు కోడలు బువ్వ తినిపిస్తున్నది. కొడుకు సహాయం చేస్తున్నాడు.

Exam Tips:

a) బొమ్మలో జరుగుతున్న పనిని వర్తమానకాలంలో (తినిపిస్తున్నది, సహాయం చేస్తున్నాడు) రాయండి.

 

Question 3: ముసలవ్వకు సేవలు చేస్తున్నవారు ఎవరై ఉంటారు?

Answer:

ముసలవ్వకు సేవలు చేస్తున్నవారు ఆమె కొడుకు, కోడలు అయి ఉంటారు.

Exam Tips:

a) ‘అయి ఉంటారు’ అని ఊహను తెలిపే రూపంలో జవాబు రాయండి.

 

Question 4: మీ ఇంట్లో ఉండే వృద్ధులకు మీరు ఎలాంటి సేవలు చేస్తారు?

Answer:

మా ఇంట్లో ఉండే వృద్ధులకు మేము త్రాగడానికి నీరిస్తాము. తినడానికి భోజనము అందిస్తాము. తినలేనివారికి తినిపిస్తాము. లేవలేని మా అవ్వను చేయి పట్టుకొని నడిపిస్తాము. వీధిలో అటుఇటు తిప్పుతాము. ఆరోగ్యం సరిగాలేనప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకుంటాము. మందులు టైం ప్రకారం వేస్తాము. వారికి అవసరమైన వాటిని విసుగులేకుండా సమకూరుస్తాము.

Exam Tips:

a) సొంత అనుభవ ప్రశ్న: 4–5 సేవలను వరుసగా రాసి, చివరిలో గౌరవభావాన్ని చెప్పండి.

 

ఆలోచించండి – చెప్పండి (పాఠం తర్వాత)

Question 1: “సాధారణంగా పిల్లలు నాయనమ్మను ఇష్టపడతారు” ఎందుకు?

Answer:

నాయనమ్మ పక్కన పడుకోబెట్టుకొని కథలు చెబుతుంది. ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేయించి బడికి పంపుతుంది. కొనుక్కొని తినడానికి డబ్బులిస్తుంది. ఇంట్లో చేసిన పిండివంటలు దాచిపెట్టి మళ్ళీ మళ్ళీ ఇస్తుంది. అందువల్ల పిల్లలకు నాయనమ్మ అంటే ఇష్టం.

Exam Tips:

a) నాయనమ్మ వల్ల పిల్లలకు కలిగే మేలు (కథలు, స్నానం, డబ్బులు, పిండివంటలు) ఉదాహరణలతో రాయండి.

 

Question 2: “ఏంకాదులే అవ్వా! అన్నింటికీ ఆ దేవుడున్నాడు” అని ఇంటికి వచ్చినవారు అనటంలో ఆంతర్యమేమిటి?

Answer:

నాయనమ్మను బిడ్డలు సుఖంగా చూసుకుంటున్నారు. ఏలోటూ లేదు. కానీ ఆమెకు కళ్ళు కనిపించవు. నడవలేదు. మంచం మీదనే ఉండడం ఆమెకు ఇబ్బందిగా ఉండేది. అందుకే వచ్చిన వారితో ‘ఎవళ్ళకూ పనికిరాని బతుకు’ అనేది. అందుకు వారు “నీవు కష్టపడకుండా ఇలాంటి సమయంలో కూడా బాగా చూసుకునే బిడ్డలున్నారు. సంతోషంగా ఉన్నావు. కొన్నిచోట్ల అలాలేదు. వారితో పోల్చితే నీవే ఎంతో మేలు” అన్నారు. అందుకే ‘ఎవరు ఎలా జీవించాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు’ అని అన్నారు.

Exam Tips:

a) వచ్చినవారి మాటల్లోని ఓదార్పు భావాన్ని, నాయనమ్మ బాధను రెండింటినీ పేర్కొనండి.

 

Question 3: “సల్లంగుండు బిడ్డా” అని ఏయే సందర్భాలలో అంటారు?

Answer:

పెద్దలకు మొక్కినపుడు, పుట్టినరోజునాడు, ఎవరినైనా ప్రమాదంలో కాపాడినపుడు, మంచిగ మాట్లాడినపుడు, ఆడపిల్లను అత్తవారింటికి సాగనంపేటపుడు, బాగా చదువుచున్నపుడు, అందరిచే పొగడబడినపుడు ‘సల్లంగుండు బిడ్డా’ అని దీవిస్తారు.

Exam Tips:

a) ‘సల్లంగుండు బిడ్డా’ అనేది పెద్దల దీవెన; దీవించే సందర్భాలను ఒక్కొక్కటిగా రాయండి.

 

Question 4: మీరు ఏయే ఆటలు ఆడుతారు?

Answer:

క్రికెట్టు, కబడ్డి, హాకీ, ఖోఖో, బంతాట, దాగుడుమూతలు, చిర్రరగోనె, మేకపులి, వామనగుంటలు మొదలైన ఆటలు మేము ఆడుతాము.

Exam Tips:

a) ఆటల పేర్లను కనీసం ఐదింటిని రాయండి; స్థానిక ఆటలను (చిర్రగోనె, వామనగుంటలు) చేర్చండి.

 

Question 5: మీతో ఆడడానికి వస్తానని స్నేహితుడు రాకపోతే మీకేమనిపిస్తుంది?

Answer:

ఆడడానికి వస్తానని రాకపోతే స్నేహితునిపై కోపం వస్తుంది. ఎంతో ఆనందంగా ఆడుకోవడానికి వచ్చినపుడు ఆ ఆనందాన్ని దూరం చేస్తూ అతడు రానప్పుడు అతనితో ఎప్పటికీ మాట్లాడకూడదనిపిస్తుంది.

Exam Tips:

a) భావాన్ని స్పష్టంగా చెప్పి, కారణం (కోపం, ఆనందం కోల్పోవడం) రాయండి.

 

Question 6: కలసి ఆడడంలో ఉన్న ఆనందం ఎటువంటిది?

Answer:

కలసి ఆడడం వల్ల ఉరుకులు, పరుగులు, కేరింతలు, గెలుపు ఓటములు, వెక్కిరింతలు, పొగడ్తల మధ్య సంభాషణలతో కలిగే మానసికోల్లాసం మాటల్లో చెప్పలేనిది.

Exam Tips:

a) కలసి ఆడడం వల్ల కలిగే మానసిక, శారీరక లాభాలు రెండింటినీ పేర్కొనండి.

 

Question 7: మీరు ఎవరికైనా ఎప్పుడైనా సహాయం చేశారా? ఎట్లాంటి సహాయం చేశారో చెప్పండి?

Answer:

నేను ఒక ముసలాయనకు సహాయం చేశాను. బడికి వెళ్ళేదారిలో ఒక వ్యక్తి స్కూటరుపై వెళ్తూ అటుగా పోతున్న పెద్దాయనను ఢీకొట్టి వెళ్ళిపోయాడు. అతనికి దాదాపు 65 సంవత్సరాలు ఉంటాయి. మోచేతిపై రక్త గాయం అయింది. కాలువలో పడిపోయాడు. అక్కడ ఎవరూలేరు. నేను పరుగెత్తుకెళ్ళి అతన్ని లేవదీసి, శుభ్రపరచి, ఇటుకల బట్టీ వద్దకు వెళ్ళి వారికి చెప్పి 108కి ఫోను చేయించి, త్రాగడానికి నీరు తెచ్చి తాగించాను. అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళేవరకు అక్కడే ఉండి సేవలు చేశాను.

Exam Tips:

a) సొంత అనుభవాన్ని సంఘటన – మీరు చేసినది – ఫలితం అనే క్రమంలో రాయండి.

 

Question 8: జ్వరం వచ్చినపుడు ఇంట్లో అందరూ నాయనమ్మతోనే ఉన్నారు కదా! దీనివల్ల నీవేమి గ్రహించావు?

Answer:

నాయనమ్మకు జ్వరం వచ్చినపుడు అందరూ ఆమెతోనే ఉన్నారు. దీనినిబట్టి ఆమెపై అందరికీ ప్రేమాభిమానాలు ఎక్కువని, అందరికీ ఆమె అంటే ఇష్టం అనీ, అనారోగ్యముతో ఉన్న వారి దగ్గర మనుషులుంటే వారు ధైర్యంగా ఉండి తొందరగా కోలుకుంటారని నేను గ్రహించాను.

Exam Tips:

a) కథలో ఉదాహరణ (అందరూ నాయనమ్మతో ఉండటం) ఇచ్చి, ప్రేమాభిమానాలు మనోధైర్యాన్ని పెంచుతాయని ముగించండి.

 

Question 9: శేఖర్ నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు?

Answer:

శేఖర్తో రవి ఎక్కువ సమయం ఆడడంలేదు. దానికి కారణం రవి నాయనమ్మకు సేవ చేయడమే. అందుకే నాయనమ్మపై శేఖర్ ద్వేషం పెంచుకున్నాడు.

Exam Tips:

a) శేఖర్ ద్వేషానికి కారణం రవి నాయనమ్మకు సేవ చేయడం అని స్పష్టంగా రాయండి.

 

Question 10: నీకు ఎప్పుడైనా ఎవరిమీదైనా కోపం వచ్చిందా? ఏ సందర్భంలో వచ్చిందో తెలపండి.

Answer:

మా పక్కింటి రంగన్న అతని 55 సంవత్సరాల తల్లిని పట్టుకొని వీధిలో కొడుతుంటే అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది.

Exam Tips:

a) సొంత అనుభవం: సంఘటన, కోపానికి కారణం, తరువాత మీరు చేసినది రాయండి.

 

Question 11: శేఖర్ పశ్చాత్తాప పడ్డాడుకదా! మీరు ఏయే సందర్భాలలో పశ్చాత్తాప పడ్డారో చెప్పండి?

Answer:

1. మా ఇంట్లో పిండివంటలు చేసినపుడు నాకు లేకుండా మా అన్న తినగా నేను ఏడ్చాను. మా అమ్మ అన్నను కొట్టింది. అతను బాధపడుతున్నప్పుడు నేను పశ్చాత్తాప పడ్డాను.
2. బడిలో నేను మాట్లాడినందుకు టీచరు నా పక్కన అబ్బాయిని కొట్టినప్పుడు నేను పశ్చాత్తాప పడ్డాను.

Exam Tips:

a) ఈ ప్రశ్నలో పశ్చాత్తాపం ఎందుకు కలిగిందో కారణంతో సహా ఉదాహరణలు ఇవ్వండి.

 

Question 12: శేఖర్ అందరితో మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉండిపోవడానికి కారణాలు వివరించండి.

Answer:

శేఖర్ చేసిన పని వల్ల నాయనమ్మ కాలు విరిగింది. దానివల్ల అందరూ బాధపడుతున్నారు. దాన్ని చూసి తాను చేసిన తప్పువల్ల ఇంతమంది బాధకు నేను కారణమయ్యానని భావించి శేఖర్ ముభావంగా ఉన్నాడు.

Exam Tips:

a) శేఖర్ ముభావానికి కారణం: తన తప్పు వల్ల నాయనమ్మ కాలు విరగడం, అందరూ బాధపడటం – ఈ రెండూ రాయండి.

 

Question 13: నాయనమ్మ క్షమించినా శేఖర్ ఎందుకు ఏడ్చాడు?

Answer:

శేఖర్ తాను చేసిన తప్పును చెప్తే నాయనమ్మ కోపపడుతుందని, కొడుతుందని భావించి ఉంటాడు. కానీ నాయనమ్మ అలా చేయలేదు. ఏమీ అనకపోగా బుజ్జగించడం, ఆప్యాయతతో వీపుపై నిమరడం చేసింది. దానితో పశ్చాత్తాప భావం ఎక్కువై శేఖర్ భోరున ఏడ్చాడు.

Exam Tips:

a) కథా సందర్భం (తప్పు ఒప్పుకోవడం, నాయనమ్మ ప్రేమ) ఆధారంగా శేఖర్ పశ్చాత్తాపాన్ని వివరించండి.

 

పాఠ్యపుస్తక అభ్యాసాలు

Question 1: రవి, శేఖర్ ఇద్దరిని గురించి తెలుసుకున్నారు కదా! ఎక్కువమంది పిల్లలు ఎవరివలె ఉంటారు? ఎందుకు? (విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం)

Answer:

సాధారణంగాఎక్కువమంది పిల్లలు శేఖర్ వలె ఉంటారు. ఎందుకంటే పిల్లలు తన ఈడు వారితో కలసి ఆడుకోవడానికి, ఆనందంగా తిరగడానికి ఇష్టపడతారు. దానికి ఇబ్బంది ఏర్పడినపుడు తీవ్ర అసహనానికి లోనవుతారు. కోపంతో ఆ ఇబ్బందికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది పిల్ల మనస్త్త్వం.

Exam Tips:

a) శేఖర్ వంటి పిల్లల స్వభావాన్ని (ఆడుకోవాలనే ఇష్టం, అసహనం) కథా ఉదాహరణతో సమర్థించండి.

 

Question 2: నాయనమ్మ కథను మీ సొంతమాటల్లో చెప్పండి.

Answer:

ఒక ఊరిలో రవి కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో రవి అమ్మానాన్నలు, తమ్ముడు, చెల్లెలు, నాయనమ్మ ఉండేవారు. నాయనమ్మకు వయసు అధికమై కళ్ళు కనిపించక, నడవలేక మంచం పట్టింది. ఆ ఇంట్లో అందరూ ఆమెకు సేవలు చేస్తుండేవారు. కొన్ని కొన్ని పనులలో ఇతరులపై ఆధారపడకుండా మంచానికి ఇరువైపులా ఆయా వస్తువులను పెట్టమని చేతితో తడిమి అవ్వే తీసుకొనేది.
ఒకసారి రవి చుట్టాలబ్బాయి శేఖర్ అమ్మానాన్నలతో కలిసి వీరింటికి వచ్చాడు. శేఖర్కు రవితో ఆడుకోవడం ఇష్టం. అవ్వకు జ్వరం రావడంతో రవి ఎక్కువ సమయం శేఖర్తో ఆడలేదు. అందుకు కోపించిన శేఖర్ అవ్వపై ద్వేషం పెంచుకున్నాడు. మంచంపక్కన వస్తువులను తారుమారు చేశాడు. అవ్వ మంచం దిగబోయి చెప్పులనుకొని నీళ్ళబిందెలో కాలుపెట్టింది. అవ్వకాలు విరిగింది. అవ్వ కిందపడింది. నెలరోజులు ఆసుపత్రిలో ఉండింది.
ఆ కుటుంబ సభ్యులు, అవ్వ బాధపడడం చూసి తనవల్లనే ఇదంతా జరిగిందని శేఖర్ పశ్చాత్తాప పడ్డాడు. ఎవరూలేని సమయంలో తాను చేసిన పనివల్లనే నీకీ కష్టం వచ్చిందని చెప్పి భోరున ఏడ్చాడు. నాయనమ్మ అతన్ని హత్తుకొని కన్నీళ్ళు తుడిచి, నవ్వింది. “నేను కష్టపడడం చూసి నీలో మార్పు వచ్చింది. “అందరితో కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండు” అంటూ వీపుపై నిమిరింది.

Exam Tips:

a) కథను పరిచయం – సంఘటన – పశ్చాత్తాపం – ముగింపు క్రమంలో రాయండి; పాత్రల పేర్లు (రవి, శేఖర్, నాయనమ్మ) తప్పక వాడండి.

 

Question 3: కింది పేరా చదవండి. ముఖ్యమైన పదాలు రాయండి.
ఒక శివరాత్రినాడు శివుడిని దర్శించడానికి జనం సముద్రంలాగ వచ్చారు. ఆ జనసమ్మర్థంలో కండ్లు సరిగా కనపడని ఒక వృద్ధురాలు కాలుజారి పడిపోయింది. ఆమె చేతిలోని గిన్నె గోతిలో పడింది. నుదిటిమీద దెబ్బతోని అవ్వ స్పృహ తప్పింది. ఎవ్వరూ ఆ ముసలమ్మను పట్టించుకోలేదు. శివుడిని చూడడానికి ఎగబడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు అది చూశారు. అవ్వను లేవదీసి కూర్చోబెట్టారు. దుమ్ముధూళి దులిపి గాయానికి కట్టుకట్టారు. అవ్వకు చల్లని నీళ్ళు తాగించారు. శివపూజకు తెచ్చిన అరటిపండ్లను తినిపించారు. “బంగారు తల్లులారా! సేవచేసి నా ప్రాణం కాపాడారు” అని అవ్వ ఆనందభాష్పాలు రాలుస్తూ ఆ పిల్లలను దీవించింది. ఉదా : జనసమ్మర్ధం, దీవించటం.

Answer:

1. దర్శించటం
2. శివరాత్రి
3. జనసమ్మర్థం
4. కాలుజారి పడిపోవడం
5. స్పృహ తప్పడం
6. పట్టించుకోకపోవడం
7. దుమ్ముదులపడం
8. గాయానికి కట్టుకట్టడం
9. నీరు తాగించడం
10. అరటిపండ్లు తినిపించడం
11. దీవించడం
12. ఆనందబాష్పాలు

Exam Tips:

a) పేరాలోని ముఖ్యమైన పదాలను క్రమంగా వరుస సంఖ్యలతో రాయండి.

 

Question 4: కింది వాక్యాలు చదవండి. వీటిలో మీరు చేసేవాటికి ‘✓’, చేయనివాటికి ‘✗’ గుర్తు పెట్టండి.
(అ) నాకు ముసలివాళ్ళంటే బాగా ఇష్టం.
(ఆ) నేను ముసలివాళ్ళకు ఎప్పుడైనా పనులు చేసిపెడతాను.
(ఇ) ఎవరి వస్తువులైనా నాకిష్టమైతే తీసుకుంటాను.
(ఈ) ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లలతో ఎప్పుడూ కలిసి ఆడుకుంటాను.
(ఉ) ముసలివాళ్ళకు మంచినీళ్ళివ్వడం, మందులు ఇవ్వడం వంటివి చేస్తాను.
(ఊ) అమ్మానాన్నలకు పనులలో సహాయం చేస్తాను.
(ఎ) ఎవరైనా నాతో ఆడుకోకుంటే నాకు కోపం వస్తుంది.
(ఏ) నావల్ల ఎవరికైనా బాధ కలిగితే నేను కూడా బాధపడతాను.
(ఐ) నేను చేసిన తప్పులను ఒప్పుకుంటాను.

Answer:

(అ) ✓
(ఆ) ✓
(ఇ) ✗
(ఈ) ✓
(ఉ) ✓
(ఊ) ✓
(ఎ) ✓
(ఏ) ✓
(ఐ) ✓

Exam Tips:

a) ఇది స్వీయ మూల్యాంకన ప్రశ్న; నిజాయితీగా మీ సమాధానానికి ✓ లేదా ✗ గుర్తు పెట్టండి.

 

Question 5: రవి, శేఖర్ మంచిమిత్రులు కదా! నీకున్న మంచి మిత్రుడెవరు? ఎందుకు? (ఐదు వాక్యాలలో జవాబు రాయండి)

Answer:

నాకున్న మంచి మిత్రుడు మధు. ఆతడు వరంగల్లులో ఉంటాడు. నాఈడు వాడే. అతడు అందరివలె తుంటరి కాదు. నేను చేసే తప్పులను సరిదిద్దుతాడు. చదువు విషయంలో సహాయం చేస్తాడు. పెద్దలతో ఎలామెలగాలో చెబుతాడు. అతనివల్ల నేనెంతో పరివర్తన చెందాను. అందుకే అతడు నాకు మంచిమిత్రుడు.

Exam Tips:

a) మిత్రుని పేరు, అతని మంచి గుణాలు (తప్పులు సరిదిద్దడం, సహాయం) ఐదు వాక్యాల్లో రాయండి.

 

Question 6: మీరు వృద్ధులకు ఎటువంటి సేవచేస్తారో తెలుపండి? (ఐదు వాక్యాలలో జవాబు రాయండి)

Answer:

మేము వృద్ధులకు రోడ్డుదాటటంలో సహాయం చేస్తాము. ఆరోగ్యం సరిగాలేనివారిని దవాఖానాకు తీసుకెళ్తాము. స్పృహ కోల్పోయేస్థితిలో ఉంటే ప్రథమచికిత్సగా వారికి సపర్యలు చేసి నీరు తాగించి, తినడానికి ఏదైనా ఇచ్చి తినిపిస్తాము. వారికి మా చేతనైనంత వరకు సేవ చేస్తాము. అవసరమైతే పెద్దల సహాయం తీసుకుంటాము.

Exam Tips:

a) వృద్ధులకు చేసే సేవలను (రోడ్డు దాటించడం, ప్రథమచికిత్స, నీరు ఇవ్వడం) ఐదు వాక్యాలలో రాయండి.

 

Question 7: “కుటుంబంలో తాత, నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి” ఎందుకో రాయండి. (ఐదు వాక్యాలలో జవాబు రాయండి)

Answer:

కుటుంబంలో అవ్వ, తాత, అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, పినతండ్రి, పిన్నమ్మ, వారి పిల్లలు అందరూ కలిసి ఉండాలి. ఎంత చదివినా జీవితంలో కొన్ని పెద్దల ద్వారా అనుసరించి నేర్చుకోవాలి. అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు అనుకరణ ద్వారానే నేర్చుకుంటాము. పిల్లలు చేసే తప్పులను సరిదిద్దుతారు. దండనలు, బుజ్జగింపులు, కీచులాటలు, అన్యోన్యతలు, ప్రేమాభిమానాలు సమిష్టికుటుంబంలోనే ఉంటాయి. స్వార్థంతో విడిపోయి ఇలాంటి అనుభూతులకు దూరంగా బతకడంలో ఏ మాత్రము సుఖసంతోషాలుండవు.

Exam Tips:

a) ‘అనుసరణ ద్వారా నేర్చుకోవడం’, ‘ప్రేమాభిమానాలు’ వంటి కారణాలను చెప్పండి.

 

Question 8: “ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషంవంటిది” దీన్ని సమర్థిస్తూ రాయండి. (ఐదు వాక్యాలలో జవాబు రాయండి)

Answer:

విషం మనిషి నాడీవ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపి తొందరగా మనిషిని చంపేస్తుంది. ఈర్ష్యకూడా అలాంటిదే. ఈర్ష్య మనసుకు సంబంధించినది.
ఓర్వలేనితనంవల్ల మనిషి మంచి ఆలోచన చేయడు. మంచి పనులు చేయడు. ప్రతీకారంతో చెడు ఆలోచనలు, చెడుపనులు చేస్తాడు. చెడు ఫలితాలను పొందుతాడు. సమాజంలో చెడ్డవానిగా గుర్తింపు పొందుతాడు. గౌరవ మర్యాదలు కోల్పోయి, అందరిచే దూషింపబడతాడు. అంటే ఈర్ష్యకలవాడు నైతికంగా చచ్చిపోతాడన్నమాట. అందుకే ఈర్ష్య మనసుకు విషం.

Exam Tips:

a) విషంతో ఈర్ష్యను పోల్చి, ఈర్ష్య వల్ల కలిగే చెడు ఫలితాలను వరుసగా రాయండి.

 

Question 9: శేఖర్ మార్పురావడానికి కారణాలేమిటి? నేటికాలంలో ఎక్కువమంది వృద్ధులు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. ఈ దుస్థితికి కారణాలు వివరించండి. (పది వాక్యాలలో జవాబు రాయండి)

Answer:

శేఖర్ రవి తనతో ఎక్కువ సమయం ఆడుకోలేదనే కోపంతో నాయనమ్మ కాలు విరగడానికి కారణమయ్యాడు. తర్వాత అవ్వ బాధపడడం చూచి అవ్వ స్థానంలో అమ్మను ఊహించుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడు.
నేటి కాలంలో వృద్ధులు చాలామంది వృద్ధాశ్రమాల్లో గడుపుచున్నారు. దానికి కారణం ఉమ్మడి కుటుంబాలు విడిపోయి చిన్నకుటుంబాలుగా మారడం.
జీవన విధానంలో డబ్బుసంపాదనే ధ్యేయంగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని హాస్టళ్ళలో విడిచిపెడుతున్నారు. దీంతో వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యోగం నుండి ఇంటికి వచ్చిన దంపతులు విశ్రాంతి తీసుకోవాలి. వారికి వృద్ధులను పట్టించుకునే తీరిక లేదు కనుక వృద్ధాశ్రమాల్లో వదిలి వస్తున్నారు. ఇంకనూ వృద్ధుల వద్ద సంపద లేకపోవడం, వారి పనులు వారు చేసుకోలేకపోవడం నాగరికత పేరుతో నాజూకు అధికమై పరిశుభ్రత పేరుతో వృద్ధులను అసహ్యించుకోవడం వంటి కారణాలు నేటి దుస్థితికి తోడై వృద్ధాశ్రమాలను పెంచుతున్నాయి.

Exam Tips:

a) ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయి: శేఖర్ మార్పుకు కారణం, వృద్ధాశ్రమాల కారణాలు – రెండింటికీ రాయండి.

 

Question 10: వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి.

Answer:

హన్మకొండ,
తేది : XXXX
ప్రియమిత్రుడు రాజుకు,
మధు రాస్తున్న లేఖ. ఉభయ కుశలోపరి. మీ నాయనమ్మ బాగుందా? లేచి తిరుగుతుందా? అవ్వను బాగా చూసుకో? కావలసినవి అన్నీ తెచ్చిఇవ్వు. పెద్దలకు ఏ ఇబ్బంది లేకుండా చూచుకోవడం మన ధర్మం. వృద్ధులు చిన్నపిల్ల మనస్త్వం కలిగి ఉంటారు. వయసు పెరిగే కొద్ది మరీ చిన్నపిల్ల వలే మారాం చేస్తారు. వారు మనం పిల్లలుగా ఉన్నపుడు మన  తల్లిదండ్రులకంటె ఎక్కువగా మనకు సేవ చేసి ఉంటారు.
చిన్నపిల్లలు ఏ విధంగా పనులు చేసుకోలేక తల్లిదండ్రుల మీద ఆధారపడుతారో అదేవిధంగా ముసలివాళ్ళు వారి పిల్లలపై ఆధారపడతారు. మనం మారాం చేసినపుడు అమ్మానాన్నలు విసుగుచెందకుండా మనల్ని బుజ్జగించి మన అవసరాలు తీర్చినట్లే మనం కూడా వృద్ధుల అవసరాలు తీర్చాలి. అదే మనకు శ్రీరామరక్ష. మరచిపోవు కదా! మీ అవ్వాతాతలను సుఖంగా చూసుకో. మీ అమ్మానాన్నలను అడిగినట్లు చెప్పు. మీ తమ్మునికి నా ముద్దులు. ఇంతే సంగతులు. ఇట్లు నీ ప్రియమైన మిత్రుడు,
యం. మధు,
ఏడవ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
హన్మకొండ, వరంగల్ జిల్లా.
చిరునామా :
బి. రాజు,
ఏడవ తరగతి,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
సిద్దిపేట, మెదక్ జిల్లా.

Exam Tips:

a) లేఖలో స్థలం, తేదీ, సంబోధన, విషయం, ముగింపు, చిరునామా తప్పక ఉండాలి.

 

Question 11: కింది పదాలకు అర్థాలు పట్టికలో వెతికి రాయండి.
(అ) అంధులు, ద్వేషం, జ్ఞాపకం, తుంటరి, జపమాల, ఆతృత
(పట్టికలోని అర్థాలు: పగ, గుర్తు, గుడ్డివారు, జపం చేసుకునే మాల, అల్లరి చేసేవాడు, తొందరపడు)

Answer:

అంధులు = గుడ్డివారు
ద్వేషం = పగ
జ్ఞాపకం = గుర్తు
తుంటరి = అల్లరి చేసేవాడు
జపమాల = జపం చేసుకునే మాల
ఆతృత = తొందరపడటం (తొందరపాటు)

Exam Tips:

a) అర్థాలు ఒక్క పదంలో లేదా చిన్న పదబంధంలో రాయండి.

 

Question 12: పాఠాన్ని చదవండి. పట్టికలో సూచించిన పదాలను వెతికి రాయండి.

Answer:

ఆటకు సంబంధించిన పదాలుఆసుపత్రికి సంబంధించిన పదాలుకుటుంబ పదాలుఅన్యభాషా పదాలు
చిర్రగోనెదవాఖానాఇల్లుబీరువా
దాగుడుమూతలుమందులుఅమ్మ, నాన్నడాక్టరు
కబడ్డీడాక్టరుతమ్ముడుఎక్స్-రే
ఎక్స్-రేచెల్లెలుఆపరేషన్
ఆపరేషన్నాయనమ్మ
అవ్వ

Exam Tips:

a) పట్టికలో పదాలను వర్గాల వారీగా ఉంచండి; ఒక పదం రెండు వర్గాల్లో ఉండవచ్చు (డాక్టరు).

 

Question 13: కింది వాక్యాలను సరియైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి.
(అ) నాయనమ్మ ……… మందులు వేసుకోవడం చాతనవుతుంది.
(ఆ) కోపం ……… ఇట్లా జరిగింది.
(ఇ) శేఖర్ ……… (కోసం) రవి ఎదురు చూశాడు.
(ఈ) అందరి ……… కలసి ఆడుకో!

Answer:

(అ) నాయనమ్మ కు మందులు వేసుకోవడం చాతనవుతుంది.
(ఆ) కోపం వలన ఇట్లా జరిగింది.
(ఇ) శేఖర్ కొరకు (కోసం) రవి ఎదురు చూశాడు.
(ఈ) అందరి తో కలసి ఆడుకో!

Exam Tips:

a) కు, తో, వలన, కొరకు వంటివి విభక్తి ప్రత్యయాలు; వాక్యార్థానికి సరిపడేదాన్ని ఎంచండి.

 

Question 14: కింది వాక్యాలలో క్రియలను గుర్తించి పక్కనే రాయండి.
(అ) రాజు ఆసుపత్రికి వెళ్ళాడు.
(ఆ) శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది.
(ఇ) మధు మైదానంలో పరిగెత్తుతున్నాడు.
(ఈ) సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు.

Answer:

(అ) వెళ్ళాడు
(ఆ) చదివి, నిద్రపోయింది
(ఇ) పరిగెత్తుతున్నాడు
(ఈ) చేసి, వెళ్ళాడు

Exam Tips:

a) వాక్యంలో పని తెలిపే పదం క్రియ; రెండు ఉంటే రెండూ రాయండి.

 

Question 15: పై వాక్యాలలో రెండు క్రియలున్న వాక్యాలు ఏవి? ఈ రెండు క్రియల్లో భేదం గమనించారా?

Answer:

రెండు క్రియలున్న వాక్యాలు:
(ఆ) శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. – చదివి, నిద్రపోయింది
(ఈ) సంతోష్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. – చేసి, వెళ్ళాడు
భేదం: పనిని తెలిపే పదాలను ‘క్రియలు’ అంటారు. సాధారణంగా తెలుగులో క్రియలు వాక్యం చివర ఉంటాయి. క్రియలు అసమాపక క్రియలు, సమాపక క్రియలు అని రెండు విధాలు. వాక్యం చివర ఉండి పని పూర్తయినట్లు తెలిపే క్రియలను ‘సమాపక క్రియలు’ అంటారు (నిద్రపోయింది, వెళ్ళాడు). పని పూర్తికానట్లు తెలిపే క్రియలను ‘అసమాపక క్రియలు’ అంటారు (చదివి, చేసి).
ఉదాహరణ:

అసమాపక క్రియలుసమాపక క్రియలు
వచ్చివచ్చాడు, వచ్చారు, వచ్చింది
చేసిచేశారు, చేశాడు, చేసింది
తినితిన్నాడు, తిన్నది
చూచిచూచాడు, చూచింది
చదివిచదివాడు, చదివింది

Exam Tips:

a) వాక్యం చివరి క్రియ సమాపకం, మధ్యలోని ‘ఇ’ తో ముగిసే క్రియ అసమాపకం.

 

Question 16: కింది వాక్యాల్లో సమాపక, అసమాపక క్రియలు గుర్తించండి.
(అ) చెంబుతో నీళ్ళు ముంచుకొని, తాగుతుంది.
(ఆ) ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు.
(ఇ) పరీక్షచేసి, కాలు విరిగిందని చెప్పాడు.
(ఈ) దగ్గరకు తీసుకొని, కన్నీళ్ళు తుడిచింది.

Answer:

(అ) అసమాపక క్రియ : ముంచుకొని; సమాపక క్రియ : తాగుతుంది
(ఆ) అసమాపక క్రియ : ఆపివేసి; సమాపక క్రియ : వెళ్ళిపోయాడు
(ఇ) అసమాపక క్రియ : చేసి; సమాపక క్రియ : చెప్పాడు
(ఈ) అసమాపక క్రియ : తీసుకొని; సమాపక క్రియ : తుడిచింది

Exam Tips:

a) ‘ఇ / ఉ / తూ’ తో ముగిసేవి సాధారణంగా అసమాపక క్రియలు; వాక్యం చివరివి సమాపకాలు.

 

Question 17: మీ ప్రాంతంలోని ఒకరిద్దరు వృద్ధులను కలవండి. ఏమేమి పనులవల్ల సంతోషం కలుగుతుందో తెలుసుకొని రాయండి.
(లేదా)
మీ ప్రాంతంలోని తాత, నాయనమ్మలతో కలసి ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబాన్ని కలిసి, వారితో మాట్లాడండి. మీకెట్లా అనిపించిందో రాయండి. (ప్రాజెక్టు పని)

Answer:

నా పేరు మధు. 7వ తరగతి చదువుచున్నాను. మాది వరంగల్లు పక్కనే ఉన్న హన్మకొండ. నేను ఒకరోజు అనుకోకుండా మా యింటి ప్రక్కనున్న రంగస్వామి, లక్ష్మక్క దంపతులను కలిశాను. వారికి దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి. అసలు నేను వాళ్ళింటికి వెళ్ళింది వాళ్ళ మనుమడు కుప్పుస్వామితో ఆడుకోవాలని. అతడు లేకపోయేసరికి వారితో పిచ్చాపాటి మాట్లాడాను. వారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిలో వారికి సంతోషం కలిగించేవి కొన్ని తెలియజేస్తాను.
1. తమ బిడ్డలు ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఉమ్మడికుటుంబంగా జీవిస్తుండడం.
2. ఇప్పటికీ వీరి సలహాలు తీసుకొని, వాటి ప్రకారం పనులు చేయడం.
3. వారు అధిక పని ఒత్తిడితో ఉన్నప్పటికీ తమని ఇంట్లోనుండి బయట కాలుపెట్టకుండా సుఖంగా చూసుకోవడం.
4. వారి ఆలనాపాలనా ప్రతినిత్యం పర్యవేక్షించడం.
5. మనుమళ్ళు, మనుమరాళ్ళు, మునిమనమళ్ళతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండడం. అవ్వాతాతలు వారితో ఆడుకోవడం.
6. ఇరుగు పొరుగు వారితో తగాదాలు లేకుండా ఉండడం.
7. వయసులో పెద్దవారు కనుక వీధిలోవారు, చుట్టాలు వీరి వద్ద తగిన సూచనలు తీసుకోవడం.
8. సాయంకాలం అందరూ కలసి ఆరుబయట పురాణకాలక్షేపం చేయడం.
9. అందరు కలసి భోంచేయడం.
10. ఇంత వయసు వరకు ఆరోగ్యంగా ఉండడం, దానికోసం చిన్నచిన్న వ్యాయామాన్నిచే ఇంటి పనులు చేసుకోవడం వంటి విషయాలు వృద్ధులకు సంతోషాన్నిస్తాయని వారి మాటలవల్ల తెలిసింది.
(లేదా)
నాపేరు మధు. 7వ తరగతి చదువుచున్నాను. మాది వరంగల్లు సమీపంలో హన్మకొండ. నేనీవేసవి సెలవుల్లో మా అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళఊరు సిద్ధిపేట. అక్కడ నా మిత్రుడు రాజు ఇంటికి వెళ్ళాను. వాళ్ళింటిలో తాత, నాయనమ్మ, వారి ఇరువురు కుమారులు, వారి పిల్లలు ఆరుగురు మొత్తం పన్నెండుమంది ఉంటారు. వారు చాలా అనందంగా ఉన్నారు. ఒకరికొకరు పనులలో సహాయం చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవిస్తున్నారు.
వారి మాటల్లో సంతృత్తి, ఆనందం మాటల్లో చెప్పలేనిది. వారితో మాట్లాడిన తర్వాత మా కుటుంబంలో కూడా అవ్వాతాతలు, చిన్నాన్న చిన్నమ్ములు, వారి పిల్లలు అందరూ మాతో కలిసి ఒకే ఇంట్లో ఉంటే బాగుండేదనిపించింది. మా తల్లిదండ్రులు అవ్వాతాతలతో ఎప్పుడో విడిపోయారు. ఇప్పుడు వారు మాకు చుట్టాలే. అందరం కలిసి ఉండుంటే రాజువలె నేను కూడా పురాణకథలు చెప్పించుకునేవాడిని. అనేక నీతి, ధర్మం, జీవనసత్లాలకు సంబంధించిన విషయాలు తెలిసేవి. ఒంటరితసంతో బాధపడేవాడినికాదు అనిపించింది. మా నాన్నతో చెప్పి వెంటనే మా అవ్నాతాతలను మా ఇంట్లోసే ఉండమని బ్రతిమిలాడుతాను. అందరూ కలసి ఉంటే ఆ ఆనందమే వేరు.

Exam Tips:

a) ప్రాజెక్టు పనిలో వృద్ధులను కలిసి మాట్లాడిన పాయింట్లను సంఖ్యలుగా రాయండి.

 

ముఖ్యమైన ప్రశ్నలు

Question 1: కింది పదాలకు అర్థాలు రాయండి.

Answer:

దవాఖానా = ఆసుపత్రి
బుగులైంది = బాధ కలిగింది
తీరు = విధము
ఈర్ష్య = ఓర్వలేనితనము
మాల = దండ
డూస్తూ = దువ్వుతూ
మందుగోలీలు = మాత్రలు
నయం = బాగుకావడం

Exam Tips:

a) పదానికి ముందు అర్థాన్ని సమానార్థక రూపంలో కంఠస్థం చేయండి.

 

Question 2: కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

Answer:

కన్ను = నేత్రము, అక్షి, లోచనం, చక్షువు
అమ్మ = తల్లి, మాత, జనని
ఈర్ష్య = అసూయ, ఈసు, ఈసరము
ఆట = తాండవము, నాట్యము, లాస్యము
చీకటి = అంధకారము, తిమిరము, ధ్వాంతము

Exam Tips:

a) కనీసం రెండేసి పర్యాయపదాలు గుర్తుంచుకోండి.

 

Question 3: కింది పదాలకు నానార్థాలు రాయండి.

Answer:

అవ్వ = తల్లితల్లి, తండ్రితల్లి, పూజ్యురాలు
కన్ను = నేత్రము, వల రంధ్రము
మాల = పూలదండ, వరుస, జాతివిశేషము
మెత్త = పరుపు, మృదువైనది

Exam Tips:

a) ఒక పదానికి వేరువేరు అర్థాలు ఉంటే అన్నీ రాయండి.

 

Question 4: కింది పదాలకు ప్రకృతి – వికృతి రాయండి.

Answer:

ఈర్ష్య – ఈసు, ఈసము
సహాయం – సాయం
వృద్ధులు – పెద్దలు
గౌరవం – గారవం
రాత్రి – రాతిరి, రేయి
అంబ – అమ్మ
మంచము – మంచె
ఆశ – ఆస
సంతోషము – సంతసము
స్నేహము – నెయ్యము
ప్రయత్నము – జతనము
నిటలము – నొసలు
విషం – విసం

Exam Tips:

a) ప్రకృతి (సంస్కృత రూపం), వికృతి (తెలుగు రూపం) క్రమం మారకుండా రాయండి.

 

Question 5: కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి.

Answer:

కష్టం × సుఖం
కోపం × శాంతం
సంతోషం × దుఃఖం, బాధ
నవ్వు × ఏడుపు
ప్రేమ × పగ, ద్వేషం
తప్ప × ఒప్పు
కొద్ది × చాలా

Exam Tips:

a) వ్యతిరేక పదాలను జంటగా (కష్టం × సుఖం) కంఠస్థం చేయండి.

 

Question 6: కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
(అ) నాయనమ్మ
(ఆ) పెట్టినపుడు
(ఇ) తినుమని
(ఈ) వినడమన్నా
(ఉ) వస్తాడేమో

Answer:

నాయనమ్మ = నాయన + అమ్మ = అకారసంధి
పెట్టినపుడు = పెట్టిన + అపుడు = అకారసంధి
సూత్రము : అత్తునకు సంధి బహుళము.
తినుమని = తినుము + అని = ఉకారసంధి
వినడమన్నా = వినడము + అన్నా = ఉకారసంధి
వస్తాడేమో = వస్తాడు + ఏమో = ఉకారసంధి
సూత్రము : ఉత్తునకు అచ్చుపరమగునపుడు సంధి నిత్యము.

Exam Tips:

a) సంధిని విడదీసి, చివరిలో సంధి పేరు, అవసరమైతే సూత్రం రాయండి.

 

Question 7: కింది సమాసపదాలకు విగ్రహవాక్యం, సమాసం పేరు రాయండి.
(అ) రెండు దిక్కులు
(ఆ) రెండు రోజులు
(ఇ) అమ్మానాన్నలు

Answer:

సమాసపదంవిగ్రహవాక్యంసమాసం పేరు
రెండు దిక్కులురెండు సంఖ్యగల దిక్కులుద్విగుసమాసం
రెండు రోజులురెండు సంఖ్యగల రోజులుద్విగుసమాసం
అమ్మానాన్నలుఅమ్మయును, నాన్నయునుద్వంద్వసమాసం

Exam Tips:

a) సమాసంలో విగ్రహవాక్యం మొదట రాసి, తరువాత సమాసం పేరు రాయండి; పూర్వపదం సంఖ్య అయితే ద్విగువు.

 

Question 8: కింది వాక్యాలలో విభక్తి ప్రత్యయాలను గుర్తించి రాయండి.
(అ) నాయనమ్మ శేఖర్ ను దగ్గరకు తీసుకున్నది.
(ఆ) నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని ఉంది.
(ఇ) శేఖర్ రవి కి దగ్గరి చుట్టం.
(ఈ) నాయనమ్మ తో నే ఉన్నాడు రవి.
(ఉ) పెద్ద వయసులో పెద్ద ప్రమాదం జరిగింది.
(ఊ) శేఖర్ కి రవి కంటె అవ్వపై కోపం పెరిగింది.
(ఎ) స్నేహితులతో కలిసి ఆడుకుంటే ఆనందం.
(ఏ) ఆడుకోవాలని ఎంతో ఆశతో ఉన్నారు.
(ఐ) నాయనమ్మ తనను ప్రేమగా చూస్తున్నది.

Answer:

(అ) ను
(ఆ) తో
(ఇ) కి
(ఈ) తో
(ఉ) లో
(ఊ) కి, కంటె
(ఎ) తో
(ఏ) తో
(ఐ) ను

Exam Tips:

a) విభక్తి ప్రత్యయం నామవాచకం చివర చేరి వాక్యంలో సంబంధాన్ని తెలుపుతుంది.

 

Question 9: కింది గద్యాన్ని చదవండి. ఐదు ప్రశ్నలు రాయండి.
రవి నాయనమ్మకు మందులిస్తూ సేవలు చేస్తూ ఉండేవాడు. రవి సేవలు చూస్తున్నకొద్దీ శేఖర్కు కోపం పెరిగిపోయింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఒకరోజు పగటిపూట నాయనమ్మ నిద్రపోయింది. చుట్టుపక్కల ఎవరూలేకుండా చూసి నాయనమ్మ మంచానికి రెండుదిక్కులా ఉన్న వస్తువులను మార్చాడు. బిందె, చెంబు ఉన్న దిక్కు చెప్పులను, చెప్పులు ఉన్న దిక్కున బిందెను ఉంచాడు. తర్వాత ఏమి తెలియనట్లు దూరంగ కూచుని నాయనమ్మనే చూడసాగాడు.

Answer:

1. రవి ఏమి చేస్తున్నాడు?
2. శేఖర్కు కోపం ఎందుకు కలిగింది?
3. నాయనమ్మ ఎప్పుడు నిద్రపోయింది?
4. శేఖర్ ఏమి చేశాడు?
5. శేఖర్ కోపంతో ఏమి ఆలోచించాడు?

Exam Tips:

a) ప్రశ్నలు గద్యంలోని సమాచారం నుంచే రావాలి; ఎవరు, ఏమి, ఎందుకు, ఎప్పుడు అనే పదాలతో ప్రశ్నలు తయారుచేయండి.

 

Question 10: క్రింది గద్యాన్ని చదివి ఐదు ప్రశ్నలు రాయండి.
నాయనమ్మ ఏమనలేదు. “నాయనమ్మా! నాకు రవితో ఆడుకోవడమంటే బాగా ఇష్టం. కాని రవి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టి నీతోనే ఉంటే నాకు కోపం వచ్చింది. అందుకే అట్లా చేసిన. ఇంక నువ్వు కొట్టినా నాకేం బాధలేదు” అన్నాడు ఏడ్చుకుంటూ.
నాయనమ్మ శేఖర్ను దగ్గరకు తీసుకున్నది. అతని కన్నీళ్ళు తుడిచి నవ్వింది. నాయనమ్మ నవ్వంగనే శేఖర్ ఏడువడం ఆపాడు.
“అంతా మంచే జరిగిందిరా నేను కష్టపడడం చూసి నీలో మార్పువచ్చింది. రవి నాతోనే ఉండడంతో నీకు నామీద ఈర్ష్య కలిగింది. ఇప్పుడా ఈర్ష్య పోయింది. ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషం వంటిది. నువ్వింక అందరితో కలిసి ఆడుకో సంతోషంగ ఉండు” అంటూ శేఖర్ వీపుమీద తన అరచేత్తో రాస్తూ ఓదార్చింది.

Answer:

1. శేఖర్కు బాగా ఇష్టమైనది ఏది?
2. శేఖర్కు కోపం ఎందుకు వచ్చింది?
3. ఈర్ష్య ఎటువంటిది?
4. నాయనమ్మ శేఖర్ను ఎలా ఓదార్చింది?
5. ఎవరు ఎవరికి కన్నీళ్ళు తుడిచారు?

Exam Tips:

a) ఇచ్చిన గద్యం నుంచి సమాధానం దొరికే ప్రశ్నలనే రాయండి.

 

గద్యం ఆధారిత ప్రశ్నలు

ఒకరోజు రవి వాళ్ళింటికి కరీంనగర్ నుండి చుట్టాలు వచ్చారు. వాళ్ళు దగ్గరి చుట్టాలు. వాళ్ళకొడుకు శేఖర్, రవి ఒకే ఈడువాళ్ళు. ఒకరితో ఒకరు కలసి ఆడుకోవడమంటే వాళ్ళకు చాలా ఇష్టం. కలిసి ఎగురుతారు, దుంకుతారు, ఆడుతారు, ప్రపంచం మొత్తం మర్చిపోతారు. శేఖర్ వస్తున్నాడని రవి ఎగిరి గంతులు వేశాడు. శేఖర్ అయితే ఎప్పుడు రవి దగ్గరకు పోదామా, ఎప్పుడు రవితో కలసి ఆడుకుందామా అని ఆతృతతో ఉన్నాడు.

Question 1: ఈ గద్యం ఏ పాఠంలోనిది ?

Answer:

ఈ గద్యం నాయనమ్మ పాఠంలోనిది.

Exam Tips:

a) గద్యం ఏ పాఠంలోనిదో పేరుతో రాయండి.

 

Question 2: శేఖర్ ఎందుకు ఆతృతతో ఉన్నాడు?

Answer:

రవితో కలిసి ఆడుకోవాలని శేఖర్ ఆతృతతో ఉన్నాడు.

Exam Tips:

a) గద్యంలో కారణం తెలిపే వాక్యాన్ని ఆధారంగా తీసుకోండి.

 

Question 3: చుట్టాలు ఎక్కడివారు?

Answer:

చుట్టాలు కరీంనగర్ వారు.

Exam Tips:

a) చిన్న ప్రశ్నకు ఒకే వాక్యంలో స్పష్టమైన జవాబు రాయండి.

 

Question 4: రవి, శేఖర్లు ఎప్పుడు ప్రపంచం మొత్తం మర్చిపోతారు?

Answer:

ఇద్దరూ కలిసి ఆడుకునేటపుడు ప్రపంచం మొత్తం మర్చిపోతారు.

Exam Tips:

a) ‘ఎప్పుడు’ అడిగిన ప్రశ్నలో సమయాన్ని/సందర్భాన్ని తప్పక చెప్పండి.

 

Question 5: ఎవరెవరు సమ ఈడువారు?

Answer:

రవి, శేఖర్ సమ ఈడువారు.

Exam Tips:

a) ‘సమ ఈడువారు’ అంటే ఒకే వయసు వారు అని తెలుసుకోండి.

 

Question 6: శేఖర్కు నచ్చని విషయం ఏది?

Answer:

రవి నాయనమ్మకు సేవచేస్తూ తనతో ఆడుకోకపోవడం శేఖర్కు నచ్చని విషయం.

Exam Tips:

a) శేఖర్ కోపానికి కారణం నాయనమ్మ మీద సేవ చేసే రవి ధ్యాస అని కథ ఆధారంగా రాయండి.

 

పదజాలం – వ్యాకరణం

Question 1: కింది వాక్యంలో గీతగీసిన పదానికి (‘ఆతృత’) అర్థం రాయండి.
పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఆతృతతో ఎదురుచూశారు.

Answer:

తొందరపాటు

Exam Tips:

a) వాక్యంలో గీతగీసిన పదాన్ని గమనించి దాని సరైన అర్థాన్ని ఒక్క పదంలో రాయండి.

 

Question 2: కింది వాక్యంలో గీతగీసిన పదానికి (‘ఈర్ష్య’) అర్థం రాయండి.
ఈర్ష్య మనసుకు విషం వంటిది.

Answer:

ఓర్వలేనితనం

Exam Tips:

a) వాక్యంలో గీతగీసిన పదాన్ని గమనించి దాని సరైన అర్థాన్ని ఒక్క పదంలో రాయండి.

 

Question 3: కింది వాక్యంలో గీతగీసిన పదానికి (‘దవాఖానా’) అర్థం రాయండి.
దవాఖానాలు ఆరోగ్య ప్రదాయినిలు.

Answer:

ఆసుపత్రి

Exam Tips:

a) వాక్యంలో గీతగీసిన పదాన్ని గమనించి దాని సరైన అర్థాన్ని ఒక్క పదంలో రాయండి.

 

Question 4: కింది వాక్యంలో గీతగీసిన పదానికి (‘తీరు’) అర్థం రాయండి.
విద్యార్థుల ప్రవర్తనాతీరులో పరివర్తన కలిగించేదే విద్య.

Answer:

విధము

Exam Tips:

a) వాక్యంలో గీతగీసిన పదాన్ని గమనించి దాని సరైన అర్థాన్ని ఒక్క పదంలో రాయండి.

 

Question 5: కింది వాక్యంలో గీతగీసిన పదానికి (‘జపమాల’) అర్థం రాయండి.
రుద్రాక్షలతో జపమాలను చేస్తారు.

Answer:

జపం చేసుకొనే మాల

Exam Tips:

a) వాక్యంలో గీతగీసిన పదాన్ని గమనించి దాని సరైన అర్థాన్ని ఒక్క పదంలో రాయండి.

 

Question 6: కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
(అ) ఈర్ష్య
(ఆ) మూలుగుట
(ఇ) అవసరం

Answer:

(అ) ఈర్ష్య: రాజకీయనాయకులు ఒకరిపై ఒకరు ఈర్ష్యతో నిందించుకుంటారు.
(ఆ) మూలుగుట: దెబ్బలు తగిలిన వ్యక్తి బాధతో మూలుగుతున్నాడు.
(ఇ) అవసరం: విద్యార్థికి క్రమశిక్షణ అవసరం.

Exam Tips:

a) ఇచ్చిన పదం వాక్యంలో సహజంగా ఇమిడేలా సొంత వాక్యం రాయండి.
b) వాక్యం చిన్నదిగా, అర్థవంతంగా ఉండాలి.

 

Question 7: కింది పదాలను విడదీసి సంధిపేరు రాయండి.
(అ) మందులుంటాయి
(ఆ) నాయనమ్మ

Answer:

(అ) మందులుంటాయి = మందులు + ఉంటాయి (ఉకార సంధి)
(ఆ) నాయనమ్మ = నాయన + అమ్మ (అకార సంధి)

Exam Tips:

a) సంధి పదాన్ని రెండు భాగాలుగా విడదీసి (పూర్వపదం + పరపదం) సంధి పేరు రాయండి.

 

Question 8: కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి.
(అ) కూరగాయలు
(ఆ) రెండు దిక్కులు

Answer:

(అ) కూరగాయలు = కూరయును, కాయయును (ద్వంద్వ సమాసం)
(ఆ) రెండు దిక్కులు = రెండు సంఖ్యగల దిక్కులు (ద్విగు సమాసం)

Exam Tips:

a) ద్వంద్వ సమాసంలో రెండు పదాలను ‘యును’ తో కలిపి విగ్రహవాక్యం రాయండి; ద్విగు సమాసంలో ‘సంఖ్యగల’ అని రాయండి.

 

Question 9: కింది ఖాళీలలో సరియైన విభక్తి ప్రత్యయాలను గుర్తించి రాయండి.
శేఖర్ అమ్మానాన్నలు తమ్ముని ……….. కలిసి ఇంటికి రాగానే రవి ……….. ఎంతో సంబరమైంది. ఆడుకుంటూ రవి నాయనమ్మదగ్గర ………… వెళ్ళాడు. దానిని చూసిన శేఖర్కు రవి …………. నాయనమ్మపై కోపం కలిగింది. దానితో శేఖర్ చెడు ఆలోచన …………. మంచం పక్కన వస్తువులను తారుమారు చేశాడు.

Answer:

శేఖర్ అమ్మానాన్నలు తమ్ముని తో కలిసి ఇంటికి రాగానే రవి కి ఎంతో సంబరమైంది. ఆడుకుంటూ రవి నాయనమ్మదగ్గర కు వెళ్ళాడు. దానిని చూసిన శేఖర్కు రవి కంటె నాయనమ్మపై కోపం కలిగింది. దానితో శేఖర్ చెడు ఆలోచన తో మంచం పక్కన వస్తువులను తారుమారు చేశాడు.

Exam Tips:

a) ప్రతి ఖాళీకి వాక్యార్థానికి తగిన ప్రత్యయం (తో, కి, కు, కంటె) ఎంచి వాక్యం మొత్తం చదివి సరిచూసుకోండి.

 

Question 10: కింది వాక్యాలలో అసమాపక క్రియలు, సమాపక క్రియలు వేరు చేసి రాయండి.
1. సమ్మక్క సారక్క జాతరకు ముఖ్యమంత్రిగారు వచ్చి, జనంతో కలిసి ఆడి, పాడి, గంతులు వేశారు.
2. ఖమ్మంజిల్లాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
3. నీవు బడికి వచ్చి, పాఠం చదివి, జ్ఞానాన్ని పెంచుకున్నావు.
4. ఆటలు ఆడి, శారీరక వ్యాయామం చేసి, మానసిక ఆనందం పొందావు.
5. సీతమ్మ వంటచేసి, బట్టలు ఉతికి, విశ్రాంతి తీసుకున్నది.

Answer:

1. అసమాపక క్రియలు : వచ్చి, ఆడి, పాడి; సమాపక క్రియ : వేశారు
2. అసమాపక క్రియ : చేరుస్తూ; సమాపక క్రియ : విడుదల చేసింది
3. అసమాపక క్రియలు : వచ్చి, చదివి; సమాపక క్రియ : పెంచుకున్నావు
4. అసమాపక క్రియలు : ఆడి, చేసి; సమాపక క్రియ : పొందావు
5. అసమాపక క్రియలు : చేసి, ఉతికి; సమాపక క్రియ : తీసుకున్నది

Exam Tips:

a) వాక్యంలో చివరి క్రియ సమాపకం; ‘ఇ’ తో ముగిసి వాక్యం పూర్తి కాని క్రియలు అసమాపకం.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 7 Telugu Lesson 02 Nayanamma (Grandmother)

Official TS Board Solutions for Lesson 02 Nayanamma (Grandmother)

Access structured TS Board textbook solutions for Lesson 02 Nayanamma (Grandmother). Designed in alignment with the latest academic curriculum for Class 7 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Step-by-Step Explanations for Lesson 02 Nayanamma (Grandmother)

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Lesson 02 Nayanamma (Grandmother) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Next Steps in Your Telugu Revision

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 7 Telugu.

FAQs

Where can I find the latest TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ for the 2026-27 session?

The complete and updated TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ is available for free on StudiesToday.com. These solutions for Class 7 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ will help students to get full marks in the theory paper.

Do you offer TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Telugu. You can access TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire TS 7th Class Telugu 2nd Lesson Questions and Answers Telangana నాయనమ్మ in printable PDF format for offline study on any device.