TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు

Official TS Board Solutions for Class 7 Telugu: Lesson 01 Chaduvu (Education)

Explore reliable textbook solutions for Lesson 01 Chaduvu (Education) tailored for Class 7 learners. Utilizing these Telugu answers ensures thorough preparation and strengthens foundational knowledge before final TS Board evaluations.

Chapter-wise Solutions for Telugu: Lesson 01 Chaduvu (Education)

Access the complete solution PDF for Class 7 Telugu below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

ఆలోచించండి – చెప్పండి (పాఠానికి ముందు)

Question 1: ఆటలు ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి?

Answer:

ఆటలు ఆడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మేధస్సు చురుకుగా ఉంటుంది. అందుకనే ఉదయం సాయంత్రం కొంతసేపు ఆటలాడుకోవాలి.

Exam Tips:

a) ఆటల వల్ల కలిగే ప్రయోజనాన్ని (ఆరోగ్యం – చురుకైన మేధస్సు) కారణ–ఫలితంగా రాయండి.
b) ఎప్పుడు అనే భాగానికి ‘ఉదయం, సాయంత్రం’ అని సమయం తప్పక పేర్కొనండి.

 

Question 2: ఏ సమయంలో చదువుకోవాలి? ఎందుకు?

Answer:

చదువుకుంటే తెలివితేటలు పెరుగుతాయి. బుద్ధి చురుకుగా ఉంటుంది. అందుకే తెల్లవారుజామున తప్పక చదువుకోవాలి. మిగతా సమయాలలో అవసరమైనపుడల్లా చదువుకోవాలి.

Exam Tips:

a) ‘ఏ సమయంలో’ అన్నదానికి తెల్లవారుజాము అని, ‘ఎందుకు’ అన్నదానికి తెలివితేటలు పెరుగుతాయని – రెండు భాగాలకూ జవాబు రాయండి.

 

Question 3: ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమౌతుంది?

Answer:

ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే సోమరితనం పెరిగిపోతుంది. శరీరానికి వ్యాయామం లేక ఒళ్ళు బరువెక్కి అనారోగ్యం పాలౌతారు. ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వల్ల కళ్ళు దెబ్బతింటాయి.

Exam Tips:

a) ఫలితాలను వరుసగా రాయండి: సోమరితనం, ఊబకాయం/అనారోగ్యం, కంటి సమస్యలు.

 

Question 4: చదువు సరిగ్గా చదువుకోకుంటే ఏమౌతుంది?

Answer:

చదువు సరిగ్గా చదువుకోకుంటే తెలివితేటలు పెరగవు.

Exam Tips:

a) చిన్న ప్రశ్న కాబట్టి ఒకటి రెండు వాక్యాలలో స్పష్టంగా రాస్తే చాలు.

 

ఆలోచించండి – చెప్పండి (పాఠం తర్వాత)

Question 1: అవివేకి లక్షణాలు ఏమై ఉంటాయి?

Answer:

అవివేకి చుట్టాలకు గాని తల్లిదండ్రులకు గాని ఏ విధంగానూ సహాయం చేయడు. సంతోషం కలిగించడు. చదువు సంధ్యలు నేర్వడు. పైకి ఆకారం బాగానే ఉన్నా సంస్కారం లేనివాడు. అడవిలోని మోదుగుపూల వంటివాడు.

Exam Tips:

a) పాఠంలోని పద్యం (‘విను ముత్తమమగు పుట్టువు…’) ఆధారంగా మోదుగ పువ్వు ఉపమానాన్ని ప్రస్తావించండి.
b) లక్షణాలను చుక్కలుగా లేదా వరుసగా రాస్తే మార్కులు సులభంగా వస్తాయి.

 

Question 2: కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు కదా! ఇట్లా అనడం తగినదేనా?
ఎందుకు?

Answer:

కవి కమలాకరుడిని జడాశయుడు అన్నాడు. ఇది సరియైనదే. ఎందుకంటే చదువు సంధ్యలు, సంస్కారం ఏమీ లేకుండా, ఎవ్వరికీ ఉపయోగపడకుండా కులానికి చెడ్డపేరు తెచ్చిపెట్టేట్లు జడాశయుడు ఉన్నాడు. వట్టి మూర్ఖునిలా ప్రవర్తిస్తున్నాడు. అందుకే కవి అతడిని జడాశయుడు అన్నాడు. కమలాకరం అంటే జలాశయం లేదా నీటిమడుగు. నీటిమడుగు ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది. కమలాకరుడు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నాడు. అందుకే ‘జడాశయుడు’ అని కవి అన్నాడు.

Exam Tips:

a) ‘కమలాకరం’ (నీటిమడుగు) అనే పేరులోని అర్థాన్ని, ‘జడాశయుడు’ అనే పదంతో పోల్చి వివరించడం ముఖ్యం.
b) ‘తగినదే’ అని మొదట నిర్ణయం చెప్పి, తరువాత కారణాలు రాయండి.

 

Question 3: “చదువురాని పిల్లలు వంశానికి తెగులు” అన్నాడు కవి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

Answer:

చదువుకున్నవాడు వివేకి అవుతాడు. తల్లిదండ్రులకు బంధువులకు సంతోషం కలిగిస్తాడు. సత్ప్రవర్తన కలిగి సంస్కారవంతుడై ఉంటాడు. అదే చదువుకోకపోతే పై లక్షణాలేవీ ఉండవు. పదిమందిలో నవ్వులపాలౌతాడు. దానివల్ల ఆ కుటుంబానికి వంశానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే చదువురాని పిల్లలు వంశానికి తెగులు అన్నాడు కవి.

Exam Tips:

a) పద్యంలోని ‘కులమునకు తెవులు’ (వంశానికి తెగులు) భావాన్ని ఉదహరించండి.
b) మీ అభిప్రాయ ప్రశ్నలలో కారణాలు, చదువు వల్ల కలిగే మేలు రెండూ రాయండి.

 

Question 4: తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని ఎట్లా సమర్థిస్తారు?

Answer:

చదివే కొద్దీ విజ్ఞానం పెరుగుతుంది. తను చదివింది ఇతరులతో పంచుకుంటే మరింత బాగా మనసుకెక్కుతుంది. ఎంత ఎక్కువమందికి ఆ చదువు పంచితే అంత ఎక్కువగా అది పెరుగుతుంది. అంతేగాక ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త ఆలోచనలు, కొత్తభావాలు కలిగి మరింత బాగా అర్థమౌతుంది. కనుక తాను నేర్చిన చదువు ఇతరులకు పంచితే కోటిరెట్లు పెరుగుతుంది అనే మాట నిజం.

Exam Tips:

a) ‘కోటిగుణోత్తర వృద్ధి’ అనే పద్యపాదాన్ని ఉదహరిస్తే జవాబు బలంగా ఉంటుంది.
b) చదువును పంచుకుంటే తరగదు, పెరుగుతుంది అని ఒక ఉదాహరణతో చెప్పండి.

 

Question 5: “చదువు దొంగలకు కనిపించదు” చర్చించండి.

Answer:

చదువు బుద్ధికి సంబంధించినది. నేర్చుకున్న విషయాలు నేరుగా మెదడుకు చేరతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నంతసేపూ ఆ విషయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞాపకం వస్తాయి. మనం బుద్ధిపూర్వకంగా చెబితే తప్ప ఎవరికీ తెలియవు కనిపించవు. కనిపించని వస్తువును ఎవరు కాజేయగలరు? కాబట్టి చదువు దొంగలకు కనిపించదు.

Exam Tips:

a) ‘దొంగలకు అగపడదు’ అనే పద్యభావాన్ని (పద్యం 6) గుర్తుచేసి చర్చించండి.
b) చదువు బుద్ధిలో ఉండే సంపద కాబట్టి దొంగిలించలేరు అనే తర్కాన్ని స్పష్టంగా రాయండి.

 

Question 6: అందరూ మెచ్చుకోవాలంటే మనం ఏయే చదువులు చదవాలి?

Answer:

అందరూ మెచ్చుకోవాలంటే మనం మంచి చదువులు చదవాలి. విజ్ఞానం పెంచే చదువులు చదవాలి. నలుగురితో ఎట్లా మెలగాలో నేర్పే చదువులు చదవాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకొనడానికి ఉపయోగపడే చదువు చదవాలి. నలుగురికి ఉపయోగపడే చదువు, మన గౌరవం పెంచే చదువు చదవాలి. మనం ఒకరికి భారం కాకుండా, ఆదర్శంగా బతకడానికి అవసరమైన చదువు చదవాలి.

Exam Tips:

a) ‘మంచి చదువులు’ అంటే ఏమిటో 3–4 లక్షణాలతో (విజ్ఞానం, విచక్షణ, ఆదర్శజీవనం) రాయండి.

 

Question 7: పశువులకు, మనుషులకు తేడాలేమిటి?

Answer:

పశువులకు భాష తెలియదు. మాట్లాడలేవు. మనిషి మాట్లాడగలడు.
ఆలోచించగలడు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించగలరు. దాన్నే విచక్షణాజ్ఞానం అంటారు. అది పశువులకు ఉండదు. పశువులు మాట్లాడలేవు. మనుషులు తమ భావాలను చెప్పడానికి మాట్లాడగలరు.

Exam Tips:

a) పోలిక ప్రశ్నలో రెండు వైపులా (పశువులు – మనుషులు) సమాన సంఖ్యలో పాయింట్లు రాయండి.
b) విచక్షణాజ్ఞానం అనే ముఖ్యపదాన్ని తప్పక వాడండి.

 

Question 8: కమలాకరుని తీరుగా మీరెప్పుడైనా ప్రతిన పూనారా? ఎందుకు?

Answer:

కమలాకరుని తీరుగా నేను ఒకసారి ప్రతిన పూనాను. నాకు బడిలో అన్ని విషయాలలో మంచి మార్కులతో తరగతిలో మొదటి స్థానం వచ్చేది. కాని లెక్కల్లో మాత్రం చాలా తక్కువ మార్కులు వచ్చేవి. నేను 9వ తరగతిలో ఉండగా ఒకసారి మా ఇంగ్లీషు టీచరు మా నాన్నగారిని పిలిచి ” మీ అమ్మాయి తెలివి తేటలకు పదవతరగతి పరీక్షలకు పంపినా ఫస్టు మార్కులు తెచ్చుకుంటుంది. కాని ఆ లెక్కల మూలంగా చాలా వెనకబడుతోంది” అని చెప్పారు. అంతే వెంటనే నాకు పట్టుదల వచ్చింది. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయం లెక్కలు అభ్యాసం చేసి మంచి మార్కులు సాధించాను.

Exam Tips:

a) సొంత అనుభవం అడిగిన ప్రశ్నలో పాఠంలోని కమలాకరుని పట్టుదలతో పోల్చి రాయడం మంచిది.
b) సంఘటన – పట్టుదల – ఫలితం అనే వరుసలో రాయండి.

 

Question 9: కమలాకరుడు గురువు సేవచేస్తూ విద్యను నేర్చుకున్నాడు. మీరు మీ ఉపాధ్యాయులకు ఏయే సేవలు చేస్తారు?

Answer:

నేను గురువులకు ఎలా సేవ చేస్తానంటే – ప్రతిరోజూ మానకుండా బడికి వెళుతూ శ్రద్ధగా పాఠాలు వింటాను. క్రమశిక్షణతో ప్రవర్తిస్తాను. ఏ రోజు ఇచ్చిన హోంవర్కు ఆ రోజు చేస్తాను. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. నా ప్రవర్తనతో వినయవిధేయతలతో గురువులకు ఆనందం కలిగిస్తాను. గురువులను బాధపెట్టకుండా ఉండడమే పెద్దసేవ.

Exam Tips:

a) సేవలను చిన్న వాక్యాలుగా (శ్రద్ధగా వినడం, క్రమశిక్షణ, హోంవర్కు) రాయండి.
b) చివరి వాక్యంలో గురువులను బాధపెట్టకపోవడమే గొప్ప సేవ అని ముగించండి.

 

పాఠ్యపుస్తక అభ్యాసాలు

Question 1: అందరికీ చదువు అవసరం అని తెలుసుకున్నారు కదా! అయినప్పటికీ ఇంకా మన సమాజంలో కొంతమంది పిల్లలు చదువుకోవడం లేదు. దీనివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు? వాళ్ళు కూడా చదువుకోవాలంటే మనమేం చేయాలి? (విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం)

Answer:

అందరికీ చదువు అవసరం. ఒకప్పుడు ఆడపిల్లలను బడికి పంపేవారుకాదు.
మగవారిలో కూడా చదువుకొనేవారు తక్కువ. ఇప్పుడు చదువు అవసరం తెలిసి ప్రతివారూ పై చదువులు చదువుతున్నారు. కాని ఇంకా పనిపాట్లు చేసుకొనేవారూ పిల్లలను పనికి పంపి ఇల్లు గడుపుకొనేవారూ కనిపిస్తూనే ఉన్నారు. దీనివల్ల వారు విలువైన బాల్యం కోల్పోతున్నారు. చదువుకోకపోతే వారు ధనవంతుల చేతిలోనూ మోసగాళ్ళ చేతిలోనూ అన్యాయమై పోతారు. కాబట్టి అందరూ చదువుకోవాలి.
బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. మనందరం బాలకార్మికులు లేకుండా చేయడానికి కృషి చెయ్యాలి. మన ఇళ్ళలో పిల్లలను పనిలో పెట్టుకోకూడదు. ఇలా అందరూ కృషిచేసి అందరూ చదువుకొనేట్లు చూడాలి.

Exam Tips:

a) బాలకార్మిక వ్యవస్థ, బాల్యాన్ని కోల్పోవడం, మోసపోవడం – అనే మూడు నష్టాలను చెప్పండి.
b) పరిష్కారంగా ‘బడిఈడు పిల్లలు బడిలోనే’ అనే సూచనను జతచేయండి.

 

Question 2: కింది భావం వచ్చే పాదాలు పద్యాల్లో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి.
(అ) చదువు నేర్చుకోని కొడుకు వంశానికి తెగులు కలిగిస్తాడు.
(ఆ) విద్య ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు వృద్ధి చెందుతుంది.
(ఇ) ఈ భూమిపై విద్యతో సమానమైన ధనం ఉందా?
(ఈ) ఏ చదువూ నేర్వనివాడు పశువుతో సమానం.
(ఉ) కష్టపడి సంగీతం సాహిత్యం వంటి కళలు నేర్చుకొని
(ఊ) ఆ పశువుల అదృష్టం కొద్దీ అతడు గడ్డి తినడు.

Answer:

(అ) చదువుల్ గట్టిగ నెఱుఁగని పుత్రుఁడు పుట్టుట కులమునకుఁ దెవులు పుట్టుట సుమ్మీ.
(ఆ) తానెవ్వరికిచ్చినఁ గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య.
(ఇ) ధరలో మఱి విద్యఁ బోల ధనములు గలవే?
(ఈ) సంగీతంబు కవిత్వ తత్త్వమును సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెఱుంగడేని భువి నాశ్చర్యంబుగా వాలమున్ శృంగ ద్వంద్వము లేని యెద్దతడనం జెల్లున్.
(ఉ) తివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి.
(ఊ) తృణంబాతడు నాంగీకంబున మేయడా పశువుల భాగ్యంబిచ్చటన్ గల్గుటన్.

Exam Tips:

a) ప్రతి భావానికి సరిపడే పద్యపాదాన్ని అక్షరం మారకుండా రాయండి; పద్యం పుస్తకంలో చూసి సరిచూసుకోండి.

 

Question 3: కింది పద్యాన్ని చదవండి. భావం రాయండి.
చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గల్గున్
చదువగ వలయును జనులకు,
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ! – (పోతన భాగవతం)

Answer:

“చదువుకోనివాడు అజ్ఞాని అవుతాడు. చదువుకుంటే మంచి చెడు తెలుసుకొనే తెలివితేటలు కలుగుతాయి. కాబట్టి జనులు తప్పక చదువుకోవాలి. నాయనా! నిన్ను చదివిస్తాను. గురువుల వద్ద చదువుకో” అని ఈ పద్య భావం.

Exam Tips:

a) పద్యంలోని ‘అజ్ఞుండగు’, ‘సదసద్వివేకము’ వంటి పదాల అర్థాలను భావంలో వాడండి.
b) భావాన్ని పద్యక్రమంలోనే వరుసగా రాయండి.

 

Question 4: చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?
(లేదా)
చదువురాని వారికి పశువులకు తేడాలేదని కవి ఎందుకన్నాడు? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి)

Answer:

చదువు నేర్వని వారిని కవి పశువుతో పోల్చాడు. ఎందుకంటే పశువులకు మాటలు రావు. భాషరాదు. అవి చదవలేవు. రాయలేవు. ఎక్కడ కట్టేస్తే అక్కడే పడి ఉంటాయి. మనిషి చదువుకోకపోతే చదవలేడు. రాయలేడు. సరిగా మాట్లాడలేడు. పశువుకెంత గౌరవం ఉంటుందో అతనికీ అంతే. పశువులు గడ్డి తింటాయి. అతడు అన్నం తింటాడు. పశువుకున్న తోక, కొమ్ములు అతడికి లేవు. అంతకు మించి చదువురాని వాడికీ, పశువుకూ ఏమీ తేడాలేదు.

Exam Tips:

a) ‘పశువు’ పోలికను, అవి చదవలేవు–రాయలేవు అనే కారణాన్ని తప్పక రాయండి.
b) ఐదు వాక్యాల పరిమితిని పాటించండి.

 

Question 5: త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎట్లాంటివి?
(లేదా)
చదువును గురించి త్రివిక్రముడు ఎలా ఆలోచించాడు? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి)

Answer:

చదువు పట్ల త్రివిక్రమునికి గల భావాలు : చదువు ఎవరికీ కనిపించని ఎవరూ దోచుకోలేని గొప్ప సంపద. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకు సహాయపడుతుంది. అందరినీ మనకు ఆప్తులుగా చేస్తుంది. చదువుకు సమానమైన సంపద మరేదీలేదు. మంచి కావ్యాలు చదవాలి. లలితకళలు నేర్చుకోవాలి. మంచివారితో మంచి మాటలతో కాలం గడపాలి. లోకజ్ఞానం సంపాదించాలి. అలా చదువులు నేర్వని వాళ్ళు పశువులతో సమానం.

Exam Tips:

a) చదువు అపహరించలేని సంపద, ఎక్కడైనా తోడు, ఆప్తులను చేస్తుంది – అనే మూడు భావాలు ముఖ్యం.

 

Question 6: కమలాకరుని స్వభావం ఎటువంటిది?
(లేదా)
కమలాకరుడు ఎలాంటివాడు? (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి)

Answer:

కమలాకరుడు జడాశయుడు. అంటే ఏ ఆలోచనలు, ఆశయాలు లేకుండా కాలం గడిపేవాడు. చదువు సంధ్యలు లేనివాడు. ఎవరితోనూ కలవడు మాట్లాడడు.
స్నేహితులు లేరు. తల్లిదండ్రులకు బంధువులకు ఏనాడూ సంతోషం కలిగించలేదు. అందమైన మోదుగపువ్వు అడవిలోపడి ఉంటే దాన్ని చూసి ఆనందించేవారెవ్వరూ ఉండరు. అలాంటి మూర్ఖుడే కమలాకరుడు.

Exam Tips:

a) జడాశయుడు, స్నేహితులు లేకపోవడం, మోదుగపువ్వు పోలిక – ఈ మూడూ రాయాలి.

 

Question 7: చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.
(లేదా)
“చదువు లేకపోవడమే కష్టాలన్నిటికీ మూలం” ఎలా? వివరించండి. (ఐదు వాక్యాల్లో జవాబు రాయండి)

Answer:

చదువు రాకపోతే అన్నీ కష్టాలే. మహాపండితుడు పురోహితుడు అయిన త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. కాని అక్షరం నేర్వలేదు. అందుకే అతన్నెవరూ ఆదరించలేదు. అతనికి స్నేహితులు లేరు. తల్లిదండ్రులు, బంధువులు ఎవ్వరూ అతనివల్ల సంతోషించలేదు. చివరికి కమలాకరుడు ఒంటరిగా ఏ తోడూ లేకుండా మిగిలిపోయాడు. తండ్రిచేత మాటలు పడ్డాడు. చదువు గొప్పదనం తెలిసికొని చదువుకొని మనిషిలా మారాడు. కాబట్టి చదువుకోకపోతే అన్నీ కష్టాలే.

Exam Tips:

a) కమలాకరుని ఉదాహరణతో కష్టాలను (ఆదరణ లేకపోవడం, ఒంటరితనం, మందలింపు) వివరించండి.

 

Question 8: చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. (పది వాక్యాల్లో)

Answer:

పరిచయం : కొఱవి గోపరాజు ‘చదువు’ పాఠంలో చదువు అవసరాన్ని చాలా చక్కగా చెప్పాడు.
నేపథ్యం : విక్రమార్కుని ఆస్థానంలో పురోహితుడుగా ఉన్న త్రివిక్రముని కుమారుడు కమలాకరుడు. అతడు చదువులేక జడపదార్థంగా ఉండటం వలన అతడిలో మార్పు తేవడానికి తండ్రి కుమారుని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపులో భాగంగా చదువు అవసరాన్ని వివరించాడు.
ఎటువంటి చదువు? : చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషం కలిగించే చదువులు పిల్లలు చదవాలి. అటువంటి చదువు చదవకపోతే ఆ పిల్లలు వంశానికి తెగులువంటివారు.
మూర్ఖులు : ఎంత మంచి రూపం కలిగి ఉన్నా, ఉత్తమ వంశంలో జన్మించినా మూర్ఖుడు కుటుంబానికి వెలుగునివ్వలేడు.
చదువు గొప్పతనం : మన అధీనంలో విద్యను దొంగలు దోచుకోలేరు.
అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. ఎంతమందికి దానం చేసినా ఆ చదువు కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య మన సొంత ధనం. ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటుంది. అది భారమేమి కాదు. అందరినీ మనకు హితులను చేస్తుంది. అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం వేరేదీ లేదు.
చదువుకోనివాడు? : ఏ చదువులూ నేర్చుకోనివారు పశువుల వంటివారు. వచన, పద్య కావ్యాలు చదవాలి. సంగీత నాట్య సాహిత్య జ్ఞానం పొందాలి. మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లోకజ్ఞానం పొందాలి. ఇవేవీ చేయనివాడు తోక, కొమ్ములు లేని పశువు అని చెప్పవచ్చు.
ముగింపు : తండ్రి మాటలకు కమలాకరుడు అభిమానపడ్డాడు. చదువు గొప్పదనం గ్రహించాడు. కాశ్మీరదేశం వెళ్ళి అక్కడ చంద్రకేతుడు అనే పండితుని ద్వారా వేదవేదాంగాలు, నీతిశాస్త్రాలు, దర్శనాలు, కావ్యనాటకాలు, సంగీతసాహిత్య కళలు నేర్చుకున్నాడు.

Exam Tips:

a) సారాంశాన్ని పరిచయం – నేపథ్యం – చదువు గొప్పతనం – ముగింపు అనే శీర్షికలతో రాయండి.
b) కవి పేరు (కొఱవి గోపరాజు), గ్రంథం (సింహాసన ద్వాత్రింశిక) తప్పక పేర్కొనండి.

 

Question 9: బాగా చదివేటట్లు మిమ్ములను ప్రేరేపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
(లేదా)
చదువు ఆవశ్యకత తెలిసేటట్లు కొన్ని నినాదాలు రాయండి.

Answer:

లేఖ:
కోదాడ,
తేది : XXXX
ప్రియమైన అన్నయ్యా !
ఇక్కడ అంతా క్షేమం. నీవు అక్కడ క్షేమమని తలుస్తాను. మా పరీక్ష ఫలితాలు వచ్చాయి. నాకు తరగతిలో రెండవ స్థానం లభించింది.
అన్నయ్యా ! ఇదంతా నీ ప్రేరణ వల్లనే జరిగింది. క్లాసులో ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకుంటూ అందరూ ఎగతాళి చేస్తే ఏడుస్తూ కూర్చునేవాణ్ణి. నువ్వు చెప్పిన మంచిమాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. చదువుపట్ల ఆసక్తిని పెంచాయి. ఏమైనా సరే మంచిమార్కులు సాధించి తీరాలని పట్టుదల నాలో పెరిగింది. గట్టిగా కృషిచేశాను. తగిన ఫలితం లభించింది. ఇదంతా నీ వల్లనే సాధ్యపడింది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సగౌరవంగా నేను చెప్పే ధన్యవాదాలు స్వీకరించు. ఉంటాను.
ఇట్లు నీ ప్రియమైన తమ్ముడు,
కార్తికేయ.
చిరునామా :
ఎ.వి.కె. ప్రసాద్,
బి.టెక్. ఫైనలియర్,
రీజనల్ ఇంజినీరింగ్ కాలేజి, వరంగల్లు.
చదువు ఆవశ్యకతపై నినాదాలు:
చదువుకుంటే కలదు లాభం.
ఎంత చదివితే అంత జ్ఞానం.
అభ్యాసం కూసు విద్య.
చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను.
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.
చదువు వల్ల సంస్కారం కలుగును.
రాజుకు తన దేశంలోనే గౌరవం.
పండితుని ప్రపంచమంతా గౌరవిస్తుంది. చదువు అంటిపెట్టుకొని ఉండే స్నేహితుడు.
చదువు లేకపోవటమే అసలైన గుడ్డితనం.

Exam Tips:

a) లేఖలో చిరునామా, తేదీ, సంబోధన, ముగింపు – ఈ నాలుగు భాగాలు ఉండాలి.
b) నినాదాలు చిన్నవిగా, ప్రాసతో ఉంటే బాగుంటాయి.

 

Question 10: కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు సరైన అర్థాలు రాయండి.
(అ) పశువులు శృంగాలతో పొడుస్తాయి.
(ఆ) గణపతి వక్త్రమున తొండము ఉంటుంది.
(ఇ) తృణము తిని ఆవు పాలిస్తుంది.
(ఈ) ఉత్తముడైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు.

Answer:

(అ) శృంగాలు – కొమ్ములు
(ఆ) వక్త్రము – ముఖం
(ఇ) తృణము – గడ్డి
(ఈ) పుత్రుడు – కుమారుడు, కొడుకు

Exam Tips:

a) అర్థాలు ఒక్క పదంలో స్పష్టంగా రాయండి; పర్యాయపదాలు ఉంటే రెండు రాయండి.

 

Question 11: కింది పదాలను వివరిస్తూ రాయండి.
(అ) మృదుభాషలు
(ఆ) ప్రబంధ సంపద
(ఇ) సౌజన్యభావం
(ఈ) సత్సాంగత్యం

Answer:

(అ) మృదుభాషలు: మృదు అంటే మెత్తని. భాషలు అంటే మాటలు. మృదుభాషలు అంటే మెత్తనైన మాటలు, అంటే అందరికీ నచ్చే మాటలు.
(ఆ) ప్రబంధ సంపద: ప్రబంధములు అంటే కావ్యాలు. ప్రబంధముల యొక్క సంపద అంటే కావ్యాలు అధికంగా ఉండటం.
(ఇ) సౌజన్యభావం: సౌజన్యం అంటే మంచితనం. సౌజన్యభావం అంటే మంచి ఆలోచనలు కలిగి ఉండటం.
(ఈ) సత్సాంగత్యం: సాంగత్యం అంటే సమీపం (చెంత ఉండటం). మంచివారితో కలిసి ఉండటమే సత్సాంగత్యం.

Exam Tips:

a) పదాన్ని విడదీసి (మృదు + భాషలు) అర్థం చెప్పి, తరువాత భావాన్ని రాయండి.

 

Question 12: కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
(అ) ధర
(ఆ) ఆత్మజుడు
(ఇ) వనం
(ఈ) శోకం

Answer:

(అ) ధర = ఇల, భూమి
(ఆ) ఆత్మజుడు = కుమారుడు, పుత్రుడు
(ఇ) వనం = అడవి, అరణ్యం
(ఈ) శోకం = దుఃఖం, వ్యథ

Exam Tips:

a) కనీసం రెండేసి పర్యాయపదాలు రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.

 

Question 13: కింది పేరాను చదవండి. అందులోని భాషాభాగాలను గుర్తించి పట్టికను పూరించండి.
మా ఊరి చెరువుగట్టున సంగమేశ్వర దేవాలయం ఉన్నది. పచ్చని ప్రకృతిలో పక్షుల కిలకిలారావాలతో అలరారే ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉంటుంది. అక్కడి వనంలో జింకలు, కుందేళ్ళు తిరుగాడుతుంటే సుందరంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఎర్రరని సూర్యకిరణాలు నీటి అలలపై ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్భుతదృశ్యాన్ని చూడటానికి రెండుకండ్లు చాలవు. అబ్బో! ఈ సౌందర్యాన్ని వర్ణిస్తూ పత్రికల్లో, ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ కథనాలు చదువుతూంటే మనస్సు ఆహా! అంటూ ఆనందడోలికల్లో తేలిపోతుంది కదా!

Answer:

నామవాచకంసర్వనామంవిశేషణంక్రియఅవ్యయం
జింకలుమాసుందరంగాఉన్నదిఅబ్బో
కుందేళ్ళుఆఎర్రనిఅలరారేఆహా
కండ్లుఅక్కడిఅద్భుతఉంటుందికిలకిల
సంగమేశ్వరపచ్చనిచాలవు
సూర్యుడుశోభాయమానంగావర్ణిస్తూ

Exam Tips:

a) ప్రతి పదాన్ని వాక్యంలో దాని పనిని బట్టి గుర్తించండి (పేరు – నామవాచకం, నామానికి బదులు – సర్వనామం, గుణం – విశేషణం, పని – క్రియ).

 

ముఖ్యమైన ప్రశ్నలు

Question 1: ‘బడి ఈడు పిల్లలు బడిలోనే’ – చదువుల పండుగ పై 12 లైన్ల వ్యాసం రాయండి.

Answer:

శీర్షిక : చదువుకోవలసిన వయసులో ఉన్న పిల్లలు ఉండవలసింది బడిలోనే కాని ఇంటిలోనో, పనిలోనో కాదు అని ఈ శీర్షిక తెలుపుతుంది.
ప్రవేశిక : మనదేశంలో చాలామంది బీదరికంలో జీవించేవారున్నారు. వారు పనిపాట్లు చేసుకొని ఎలాగో కాలం గడుపుతున్నారు. ఎక్కువమంది పిల్లలను కనటం, వారందరినీ పనికి పంపించితే డబ్బు ఎక్కువగా వచ్చి కాలం గడపటం సుఖంగా ఉంటుందని అనుకుంటున్నారు. అందువల్ల చదివించటానికి బడికి పంపటంలేదు. చదువు పిల్ల హక్కు వారి హక్కు వారికి దక్కాలి.
ప్రస్తుత స్థితి : బడికిపోయి చదువుకోవలసిన తియ్యని బాల్యంలో పిల్లలు తమలేత శరీరంతో కాయకష్టం చేస్తున్నారు. ధనికుల దుర్మార్గానికి బలియై గనుల్లోనూ, కార్ఖానాల్లోనూ కూడా పనిచేస్తున్నారు. వారిని చదువుకోడానికి బడికి పంపడం మనందరి కర్తవ్యం.
ప్రయోజనాలు : పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవడం వల్ల వారికి జ్ఞానం కలుగుతుంది. మంచిచెడు తెలుసుకోగలుగుతారు. బడిలో చదువుతోపాటు ఆటలు, పాటలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో పాల్గొని మానసిక ఆనందం పొందగలుగుతారు. మంచి వ్యక్తులుగా తయారౌతారు. తమ కాళ్ళమీద తాము నిలబడగలుగుతారు.
ముగింపు : బడి ఈడు పిల్లలను బడిలోకి పంపించే బాధ్యత సమాజంలోని పౌరులుగా మనందరిపైన ఉన్నది. పిల్లలను పనిలో పెట్టుకోగూడదని అలాచేసే వారికి బోధించడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయటం మనకర్తవ్యం.

Exam Tips:

a) వ్యాసాన్ని శీర్షిక – ప్రవేశిక – ప్రస్తుత స్థితి – ప్రయోజనాలు – ముగింపు క్రమంలో రాయండి.
b) 12 పంక్తుల పరిమితి మించకుండా చూడండి.

 

Question 2: కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.

Answer:

ఆత్మజుడు = కుమారుడు, పుత్రుడు
కమలం = తామర, పద్మం
శోకము = దుఃఖము, వ్యథ, ఏడుపు
వివేకము = తెలివి, జ్ఞానము
దూఱు = తిట్టు, నిందించు
తండ్రి = నాన్న, పిత, జనకుడు
వనము = అరణ్యం, అడవి,కోన
భవనము = మేడ, సౌధము
భూవరులు = రాజులు, భూపతులు
తస్కరుడు = దొంగ, చోరుడు
వ్రేగు = భారము, బరువు

Exam Tips:

a) పర్యాయపదాలను కనీసం రెండు చొప్పున కంఠస్థం చేయండి; ఇవి పదజాల ప్రశ్నలలో తరచు వస్తాయి.

 

Question 3: కింది పదాలకు నానార్థాలు రాయండి.

Answer:

వాసన – పరిమళము
సంజ్ఞ – పేరు, గుర్తు
దూఱు – నిందించు, ప్రవేశించు
వనము – అడవి, నీరు
గుణము – స్వభావము, అల్లెత్రాడు, రెట్టించు
ధర – భూమి, వెల
ప్రియము – ఇష్టము, ఎక్కువ ఖరీదు

Exam Tips:

a) నానార్థాలు ఒకే పదానికి వేరువేరు అర్థాలు; వాక్యప్రయోగంతో పాటు గుర్తుంచుకోండి.

 

Question 4: కింది పదాలకు ప్రకృతి – వికృతులు రాయండి.

Answer:

సంజ్ఞ – సన్న
రూపము – రూపు
మూర్ఖుడు – మొఱకు
బ్రధ్నుడు – ప్రొద్దు
భాష – బాస
పద్యము – పద్దెము, పద్దియము
పశువు – పసువు, పసరము
ఆశ్చర్యము – అచ్చెరువు
భాగ్యం – బాగ్గెం
విద్య – విద్దె, విద్దియ
శాస్త్రము – చట్టము
కావ్యము – కబ్బము
ఆజ్ఞప్తి – ఆనతి

Exam Tips:

a) ప్రకృతి (తత్సమ రూపం), వికృతి (తద్భవ రూపం) క్రమం మారకుండా రాయండి.

 

Question 5: కింది పద్యానికి భావం రాయండి. (ఈ ప్రశ్న కంఠస్థ పద్యాల నుండే అడుగబడుతుంది)
పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చినఁ గోటి గుణో
త్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడున్.

Answer:

పూర్తిగా తన అధీనమైన విద్యను ఇతరులు, అన్నదమ్ములు, రాజులు తీసుకోలేరు. మనం ఎవ్వరికిచ్చినా కోటిరెట్లు పెరుగుతుంది. అందుకే విద్య ఎప్పుడూ మన సొంత ధనం.

Exam Tips:

a) ‘కంఠస్థ పద్యం’ కాబట్టి పద్యాన్ని మొదట ఎత్తి రాసి, తరువాత భావం రాయండి.

 

Question 6: కింది పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
(అ) పరభూమి
(ఆ) జడాశయుడు
(ఇ) కమలాకరము
(ఈ) లోకోద్యమ లక్షణం

Answer:

(అ) పరభూమి: పరభూమిని తనదిగా చెప్పుకోవడం గొప్ప అనిపించుకోదు.
(ఆ) జడాశయుడు: జడాశయుడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా ప్రయోజనం లేదు.
(ఇ) కమలాకరము: కమలాకరములతో నిండిన సరస్సును చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోతుంది.
(ఈ) లోకోద్యమ లక్షణం: లోకోద్యమ లక్షణం ఉన్నవాడే ఉన్నతిని సాధిస్తాడు.

Exam Tips:

a) వాక్యంలో పదానికి సరైన అర్థం కనిపించేలా పూర్తి వాక్యం రాయండి.

 

బహుళైచ్ఛిక ప్రశ్నలు (సరైన జవాబు గుర్తించండి)

Question 1: పరుల మేలు కోరేవాడు సజ్జనుడు. – గీతగీసిన పదానికి అర్థం
(A) గొప్పవాళ్ళు
(B) మేలు చేసేవాళ్ళు
(C) ఇతరులు
(D) స్నేహితులు

Answer:

C (ఇతరులు)

Exam Tips:

a) ‘పరులు’ అంటే ఇతరులు; పాఠంలో ‘పరులకు సోదరులకు’ పద్యంలో ఈ పదం ఉంది.

 

Question 2: భూవరులు ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తారు. ‘భూవరులు’ అంటే …………
(A) తల్లులు
(B) తండ్రులు
(C) గొప్పవాళ్ళు
(D) రాజులు

Answer:

D (రాజులు)

Exam Tips:

a) భూ (భూమి) + వరులు (శ్రేష్ఠులు) = రాజులు అని విడదీసి గుర్తుంచుకోండి.

 

Question 3: మనం మాట్లాడే మాటలు అందరికీ ప్రియంగా ఉండాలి. – ప్రియం అంటే ……….
(A) ఇష్టం
(B) తీపి
(C) నచ్చడం
(D) సుందరం

Answer:

A (ఇష్టం)

Exam Tips:

a) ‘ప్రియం’ అంటే ఇష్టమైనది; ‘తీపి’ వంటి సమీప ఎంపికలకు మోసపోకండి.

 

Question 4: దేశభక్తి లేనివారి ‘పుట్టువు’ వ్యర్థం. – గీతగీసిన పదానికి అర్థం
(A) పుట్టుక
(B) ధనం
(C) గతం
(D) పట్టు

Answer:

A (పుట్టుక)

Exam Tips:

a) ‘పుట్టువు’ అంటే పుట్టుక, జన్మ; పాఠంలో ‘ఉత్తమమగు పుట్టువు’ అని వస్తుంది.

 

Question 5: ‘దూఱు’ కు పర్యాయపదాలు
(A) దూది, పత్తి
(B) దూరం, దవ్వు
(C) దొర, రాజు
(D) ప్రవేశించు, చొరబడు

Answer:

D (ప్రవేశించు, చొరబడు)

Exam Tips:

a) ‘దూఱు’కు నిందించు అనే అర్థమూ, ప్రవేశించు అనే నానార్థమూ ఉన్నాయి.

 

Question 6: దొంగ, చోరుడు అనే అర్థాలనిచ్చే పదం
(A) సత్కరుడు
(B) తస్కరుడు
(C) గూండా
(D) విపత్కరుడు

Answer:

B (తస్కరుడు)

Exam Tips:

a) తస్కరుడు, చోరుడు అనేవి దొంగకు పర్యాయపదాలు; ‘సత్కరుడు’ వంటి పోలిక పదాలను జాగ్రత్తగా గమనించండి.

 

Question 7: మామిడిపండ్ల వ్రేగు ఎక్కువయ్యి గున్నమామిడి వంగింది. ‘వ్రేగు’ అనే పదానికి సమానార్థక పదాలు
(A) కరువు, పెద్ద
(B) ఎక్కువ, అధికం
(C) బరువు, భారం
(D) కొమ్మలు, శాఖలు

Answer:

C (బరువు, భారం)

Exam Tips:

a) ‘వ్రేగు’ అంటే బరువు, భారం; ‘వ్రేగుకాదు’ అని పాఠంలో పద్యంలో ఉంది.

 

Question 8: అది పురాతన భవనం. ఆ మేడంటే కొందరికి భయం. అది ఆ ఊరిలో ఎత్తైన సౌధం – ఈ వాక్యాల్లోని సమానార్థక పదాలు
(A) అది, ఆ, ఊరు
(B) భవనం, భయం, మేడ
(C) సౌధం, భవనం, మేడ
(D) పురాతన, భయం, సౌధం

Answer:

C (సౌధం, భవనం, మేడ)

Exam Tips:

a) సమానార్థక పదాలను ఎంచేటప్పుడు ప్రతి ఎంపికలోని పదాలన్నీ ఒకే అర్థం ఇస్తున్నాయో చూడండి.

 

Question 9: దధీచి గొప్ప తపశ్శక్తి గలవాడు. ఇందులోని విశేషణం …………….
(A) తపశ్శక్తి
(B) దధీచి
(C) కలవాడు
(D) గొప్ప

Answer:

D (గొప్ప)

Exam Tips:

a) విశేషణం నామవాచకం గుణాన్ని చెబుతుంది; ఇక్కడ ‘గొప్ప’ అనేది తపశ్శక్తిని విశేషిస్తుంది.

 

Question 10: రాక్షసులు దేవతల అస్త్రాలు లాక్కొనిపోయారు. – గీతగీసిన పదం
(A) నామవాచకం
(B) సర్వనామం
(C) క్రియ
(D) విశేషణం

Answer:

A (నామవాచకం)

Exam Tips:

a) వస్తువు పేరు చెప్పే పదం (అస్త్రాలు) నామవాచకం.

 

Question 11: కిందివానిలో అవ్యయం
(A) భద్రం
(B) తమ
(C) దధీచి
(D) ఆహా !

Answer:

D (ఆహా!)

Exam Tips:

a) ఆహా, అబ్బో వంటి భావోద్వేగ పదాలు అవ్యయాలు (రూపం మారవు).

 

Question 12: ఆయుధాలు దధీచి వద్ద భద్రంగా దాచారు. ‘దాచారు’ అనేది
(A) సర్వనామం
(B) క్రియ
(C) విశేషణం
(D) అవ్యయం

Answer:

B (క్రియ)

Exam Tips:

a) పని చెప్పే పదం (దాచారు) క్రియ.

 

Question 13: వాళ్ళు తమ ఆయుధాలను కాపాడమని దధీచిని ప్రార్థించారు. ఈ వాక్యంలో ‘వాళ్ళు’ అనే పదం భాషాభాగం ?
(A) సంస్కృతం
(B) నామవాచకం
(C) సర్వనామం
(D) అవ్యయం

Answer:

C (సర్వనామం)

Exam Tips:

a) నామవాచకానికి బదులుగా వచ్చే పదం (వాళ్ళు, తాము) సర్వనామం.

 

Free study material for Telugu

Free TS Board Textbook Explanations: Class 7 Telugu Lesson 01 Chaduvu (Education)

Accessing Lesson 01 Chaduvu (Education) Solutions

Review comprehensive exercise answers for Class 7 Telugu Lesson 01 Chaduvu (Education). Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 7 Telugu

Clear, methodical explanations accompany every challenging problem within the Class 7 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Telugu.

FAQs

Where can I find the latest TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు for the 2026-27 session?

The complete and updated TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు is available for free on StudiesToday.com. These solutions for Class 7 Telugu are as per latest TS Board curriculum.

Are the Telugu TS Board solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు will help students to get full marks in the theory paper.

Do you offer TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Telugu. You can access TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు in both English and Hindi medium.

Is it possible to download the Telugu TS Board solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire TS 7th Class Telugu 1st Lesson Questions and Answers Telangana చదువు in printable PDF format for offline study on any device.