Official TS Board Solutions for Class 12 Sanskrit: Poem 06 Nrisimhavirbhava
Access comprehensive textbook solutions for Poem 06 Nrisimhavirbhava using the official curriculum guides for Class 12 Sanskrit. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.
Chapter-wise Solutions for Sanskrit: Poem 06 Nrisimhavirbhava
Access the complete solution PDF for Class 12 Sanskrit below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
निबन्धप्रश्नौ (Essay Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)
Question 1: नृसिंहस्य आविर्भावं वर्णयत ।
(నృసింహావిర్భావమును వర్ణించండి.)
Answer:
‘నృసింహావిర్భావః’ అనే పాఠ్యభాగాన్ని డా॥ కె. సుధాకరరావుగారు రచించారు. వీరు ఆధునిక సంస్కృత కవులలో ప్రసిద్ధులు – వీరు రచించిన ‘శ్రీ నృసింహనఖకౌముది’ అనే గ్రంథం నుండి ఈ పాఠ్యభాగం స్వీకరింపబడింది. ఇందులో ప్రహ్లాదుని విష్ణుభక్తిని, నృసింహుని ఆవిర్భావాన్ని హిరణ్యకశిపుని వధను, దేవతల సంతోషాన్ని చక్కగా ఆవిష్కరించారు. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తీవ్రమైన కోపంలో తన కుమారుడైన ప్రహ్లాదునితో పెద్దగా నవ్వుతూ నాయనా ! నీవు శ్రీహరిని స్మరించడం మానుకో ! ప్రతిరోజు నన్నే ఆరాధించు నన్నే స్తుతించు.
నేను నిన్ను రక్షిస్తాను. నా వలన నీకు భయం లేదు. సకల భోగాలను అనుభవించు” అని పలికాడు. “सदा भोगसौख्येषु नूनं रमस्व” తండ్రి మాటలను వినిన ప్రహ్లాదుడు చిరునవ్వుతో ఓ తండ్రీ ! సకల సృష్టికి కారణమైన శ్రీహరి పాదాలను ఎప్పుడూ నేను స్మరిస్తాను. సర్వపాపములను నశింప చేయగలడు. సకల రాక్షస వంశాన్ని నాశనం చేయగల సమర్థుడు. అందరిచేత పూజింప దగినవాడు. ఆయన మనసులో తలచుకున్నంత మాత్రాన ఈ జగత్తునంతా సృష్టించగలడు. అంతేగాదు తన శక్తితో సమస్తసృష్టిని నశింపచేయగలడు.” అని పలికాడు. ఈ మాటలు హిరణ్యకశిపునికి తీవ్రమైన ఆగ్రహాన్ని కల్గించాయి.
తీవ్రమైన కోపంతో నీకు పూజనీయుడనైన నాకంటే ఆ శ్రీహరే పూజనీయుడు అయ్యాడా ? నా మంచి మాటలను నీవు వినడంలేదు. నా శత్రువైన విష్ణువును పూజిస్తానని పలుకుతున్నావు. ఓరీ మూర్ఖుడా ! నీవు పెద్ద తప్పు చేశావు. ఈ తప్పుకు తగిన శిక్ష అనుభవించకతప్పదు. నిన్ను ఈ గదతో సంహరిస్తాను. శ్రీహరి వచ్చి ఎలా రక్షిస్తాడో చూస్తాను. నీ శ్రీహరి అన్ని చోట్ల ఉంటాడని చెప్పావు. చూపించరా ! ఈ స్తంభంలో ఉన్నాడా ? ఈ భవనంలో ఉన్నాడా ? ఆ శ్రీహరి. स्तम्भेऽस्ति श्रीपतिः विष्णुः తండ్రి మాటలు వినిన ప్రహ్లాదుడు ప్రశాంతమైన మనసుతో ఈ విధంగా పలికాడు.
ఓ తండ్రీ ! శ్రీహరి అంతట ఉన్నాడు. అతడు ఇక్కడ ఉన్నాడని ఇక్కడలేడని చెప్పలేము. ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడు. సింహములలో, పక్షులలో, నీటిలో, నిప్పులో, గాలిలో, ఏనుగులలో, జింక శరీరాలలో ఉన్నాడు. ఆయన లేనిచోటు లేదు” అని పలికాడు. ఈ మాటలు విని చాలాకోపంతో హిరణ్యకశిపుడు “ఓరీ ! నీవు విష్ణువును చూపించు రా ? ఆ పిరికివాడు ఎక్కడరా. ఈ స్తంభంలో ఉన్నాడా ? ఉంటే ఈ గదతో కొట్టి చంపేస్తాను. నీహరి ఎక్కడికి పారిపోయాడురా ? “అని పెద్దగా అంటాడు. అది విని ప్రహ్లాదుడు తండ్రీ ! శ్రీహరిని చంపడం నీ వల్ల కాదు.
నీవు అన్నట్లుగా ఈ స్తంభంలోనే గాదు అంతటా ఉన్నాడు అని పలికాడు. ప్రహ్లాదుని మాటలు విని హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోయాడు. కోపంతో “ఎక్కడరా నీ శ్రీహరి ? అని పలుకుతూ గదతో ఆ సభలోని స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. వెంటనే శంఖచక్రములు ధరించిన శ్రీమహావిష్ణువు సింహం తల, మనిషి రూపంలో పదునై ప్రకాశిస్తున్న గోళ్ళతో మహాబలుడైన నరసింహ రూపంతో ఆవిర్భవించాడు.
Introduction : The lesson Nrisimhavirbhava is an extract from Nrisimhanakhakaumudi written by Dr. K. Sudhakara Rao. The lesson describes the appearance of Nrisimha from the pillar, and his subsequent killing of Hiranyakasipu, the father of Prahlada. Hiranyakasipu’s Challenge: Hiranyakasipu, the demon king asked his son Prahlada to stop worshipping Vishnu and start worshipping him instead and enjoy pleasures. Prahlada replied that he worshipped the lotus feet of Hari, which would remove the sins and destroy the demons.
The Universe was caused by the will of Vishnu. His power could end it in a moment. Hiranyakasipu was enraged at the words of Prahlada. He said that by worshipping the enemy of his father, Prahlada committed a grave sin. He would go to hell for that. He said that he would break his head with the blow of the mace. He asked whether Hari would come to his rescue. Prahlada’s reply: Prahlada calmly replied that Vishnu existed both in the animate and inanimate beings.
He dwelled in men, lions, birds, water, fire and air. Hiranyakasipu who got angrier asked him whether Hari was in the pillar in the palace. If so, he would kill him. Prahlada replied with a smile that it was not possible to kill Hari. He was everywhere. He was in the pillar also. स्तम्भेऽस्ति श्रीपतिः विष्णुः
Exam Tips:
a) క్రమం: రచయిత–మూల గ్రంథ పరిచయం, హిరణ్యకశిపుడు సుఖభోగాలను చూపి ప్రహ్లాదుని హరిభక్తిని మానిపించే ప్రయత్నం, ప్రహ్లాదుని సమాధానం.
b) "स्तम्भेऽस्ति श्रीपतिर्विष्णुः" సందర్భంలో ప్రహ్లాదుడు "హరి అంతటా ఉన్నాడు" అన్న మాటను చేర్చి, స్తంభం నుండి ఆవిర్భావంతో ముగించండి.
c) నృసింహుడు సింహ ముఖం – నరశరీరం, శంఖచక్రాలు, పదునైన గోళ్ళతో ఉన్నాడని రూప వర్ణన రాయండి.
Question 2: नृसिंहेन कृतं दनुजवधं प्रपञ्चयत ।
(నృసింహుని చేత చేయబడిన రాక్షస వధను వివరించుము.)
Answer:
వెంటనే నృసింహుడు హిరణ్యకశిపుడిని తన తోడలపై కూర్చోపెట్టుకొని గోళ్ళతో చీల్చి వేశాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు వెలుగుతున్న అగ్ని వలె, సూర్యునివలె ఉన్నాడు. భీకరంగా హిరణ్యకశిపుడిని చంపడాన్ని దేవతలు చూశారు. మహర్షులు, దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించి, భక్తితో స్తుతించారు. పూలతో పూజించారు.
The appearance of Nrisimha : Hiranyakasipu hit the pillar with the mace. Vishnu appeared in the form of Nrisimha holding conch and disk. He tore Hiranyakasipu with his sharp nails after dragging him on to his lap. The gods danced with joy
and worshipped Vishnu. आराधयामासुरभीष्टदं तम् ।
Exam Tips:
a) వధ క్రమం: తొడలపై కూర్చోబెట్టుకోవడం, గోళ్ళతో చీల్చడం, వెలుగుతున్న అగ్ని/సూర్యుని వలె ఉండటం.
b) దేవతలు, మహర్షులు చూసి స్తుతించి పూలతో పూజించారని, "आराधयामासुरभीष्टदं तम्" అనే చరణాన్ని ఉదహరించండి.
c) ముగింపులో రక్తసిక్త దేహంతో సాయంకాల సూర్యునివలె ప్రకాశించిన చతుర్భుజ నృసింహుని ఉపమను రాయండి.
सन्दर्भवाक्यानि (Annotations) (సందర్భ వాక్యాలు)
Question 1: सदा भोगसौख्येषु नूनं रमस्व ।
Answer:
परिचय : इदं वाक्यं नृसिंहाविर्भावः इति पाठ्यभागात् स्वीकृतम् । कविः डा. के. सुधाकररावः ।
सन्दर्भ : हिरण्यकशिपुः स्वपुत्रं प्रह्लादम् प्रति एवं अवदत् ।
भाव : हे पुत्र ! विष्णोः पूजं त्यक्त्वा सुखजीवितं यापय ।
विवरणम् : भवान् विष्णोः पूजां त्यज, सः अस्माकं वैरी, भवान् सुखजीवनं यापय ।
Exam Tips:
a) వక్త హిరణ్యకశిపుడు, శ్రోత ప్రహ్లాదుడు: "ఎల్లప్పుడూ సుఖభోగాలలో విహరించు" అని చెప్పినమాట.
b) పరిచయం, సందర్భం, భావం, వివరణ నాలుగూ రాయండి; "रमस्व" = ఆనందించు అని అర్థం చెప్పండి.
Question 2: स्तम्भेऽस्ति श्रीपतिर्विष्णुः ।
Answer:
परिचय : इदं वाक्यं नृसिंहाविर्भावः इति पाठ्यभागात् स्वीकृतम् । कविः डा. के. सुधाकररावः ।
सन्दर्भ : हिरण्यकशिपुः स्वपुत्रं प्रह्लादम् प्रति एवं अवदत् ।
भाव : हे पुत्रः भवता पूजितः हरिः एतत् स्तंभे अस्ति वा ?
विवरणम् : कुमार ! श्रीहरि एतत् स्तंभे अस्ति वा ? अस्तिचेत् प्रदर्शयतु |
Exam Tips:
a) హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎగతాళిగా అడిగిన మాట: "శ్రీహరి ఈ స్తంభంలో ఉన్నాడా?"
b) "श्रीपतिः" = లక్ష్మీపతి అయిన విష్ణువు అని పదార్థం చెప్పండి.
Question 3: आराधयामासुः अभीष्टदं तम् ।
Answer:
परिचय : इदं वाक्यं नृसिंहाविर्भावः इति पाठ्यभागात् स्वीकृतम् । कविः डा. के. सुधाकररावः ।
सन्दर्भ : श्री नृसिंहाविर्भावं दृष्ट्वा इन्द्रादि देवतानां स्पन्दनां एवं वदति ।
भाव : सर्वमभीष्टदं तं विष्णुं सर्वे देवताः आराधयामासुः ।
विवरणम् : स्तंभात् नृसिंहः आविर्बभूव तदा सर्वे देवाः देवदेवं दृष्ट्वा आराधयामासुः ।
Exam Tips:
a) నృసింహావిర్భావం చూసి ఇంద్రాది దేవతలు చేసిన పూజ – వక్త కవి (వర్ణన).
b) "अभीष्टदम्" = కోరికలనిచ్చువాడు అని చెప్పండి.
लघुसमाधानप्रश्नाः (Short Answer Questions) (స్వల్ప సమాధాన ప్రశ్నలు)
Question 1: विष्णोः सङ्कल्पेन शक्त्या च किं किं भविष्यति ?
Answer:
विष्णोः सङ्कल्पेन शक्त्या च विश्वसृष्टिः विनाशः च भविष्यति ।
Exam Tips:
a) విష్ణువు సంకల్పం, శక్తి వల్ల "విశ్వసృష్టి మరియు వినాశం" రెండూ జరుగుతాయని రాయండి.
b) విశ్వసృష్టిః – ప్రథమా ఏకవచనం; భవిష్యతి క్రియను మర్చిపోకండి.
Question 2: राक्षसः हिरण्यकशिपुः किमकरोत् ?
Answer:
राक्षसः हिरण्यकशिपुः स्तम्भोपरि गदाप्रहारं अकरोत् ।
Exam Tips:
a) హిరణ్యకశిపుడు స్తంభంపై గదతో కొట్టాడు (गदाप्रहारम्); ఫలితంగా నృసింహుడు వెలువడ్డాడు.
b) "स्तम्भोपरि" అనే అవ్యయీభావ రూపాన్ని సరిగా రాయండి.
Question 3: दैत्यं निहत्य चतुर्भुजः कथं रराज ?
Answer:
दैत्यं निहत्य चतुर्भुजः सायंकालीनः सूर्य इव रराज |
Exam Tips:
a) చతుర్భుజుడైన నృసింహుడు రక్తంతో తడిసిన శరీరంతో సాయంకాలపు సూర్యునివలె ప్రకాశించాడు.
b) "सायंकालीनः सूर्य इव" ఉపమను తప్పక రాయండి.
एकपदसमाधानप्रश्नाः (One Word Answer Questions) (ఏకపద సమాధాన ప్రశ్నలు)
Question 1: मुरारिः कीदृशः इतीरितम् ?
Answer:
मुरारिः सर्वगतः इतीरितम् ।
Exam Tips:
a) మురారి "సర్వగతః" (అన్నిచోట్లా ఉన్నవాడు) అని ప్రహ్లాదుడు అన్నాడు.
b) "सर्वगतः" = సర్వ + గత (వ్యాపించినవాడు).
Question 2: स्तम्भात् कः अजायत ?
Answer:
स्तम्भात् नृसिंहः अजायत ।
Exam Tips:
a) స్తంభం నుండి నృసింహుడు ఆవిర్భవించాడు (अजायत).
b) "अजायत" లఙ్ లకార రూపమని గుర్తుంచుకోండి.
Question 3: नृसिंहः हिरण्यकशिपुं कैः ददार ?
Answer:
नृसिंहः हिरण्यकशिपुं नखैः ददार ।
Exam Tips:
a) నృసింహుడు హిరణ్యకశిపుని నఖైః (గోళ్ళతో) చీల్చాడు – తృతీయా బహువచనం.
b) నఖైః అనే రూపాన్ని విసర్గతో రాయండి.
कठिनशब्दार्थाः
1. सर्वपापौघनाशं = सकलपापसमूहनाशकम्, సకల పాపముల సమూహాన్ని నశింపచేయు
2. क्रोधारुणाम्बक: = कोपेन रक्तनेत्रः, కోపంతో ఎరుపెక్కిన కన్నులు
3. हर्म्यगतः = प्रासादगतः, ఇంటికి వెళ్ళిన
4. रमाधवः = विष्णुः, విష్ణువు
5. विहङ्गमः = पक्षी, పక్షి
6. कुरङ्गगात्रम् = हरिणदेहः, జింక దేహము
7. मूर्खावतंसः = मूर्खशिरोमणिः, మూర్ఖశిఖామణి
8. प्रखरैर्नखैः = तीक्ष्णैः नखैः, వాడియైన గోళ్ళు
9. दनुजः = राक्षसः, రాక్షసుడు
10. कीलालसिक्तदेहो = रक्तसिक्तशरीरः, రక్తంతో తడిసిన శరీరము
11. सहस्त्राक्षमुखाः = इन्द्रादयः, ఇంద్రాదులు
12. निलिम्पाः = देवाः, దేవతలు
व्याकरणांशाः (Grammar) (వ్యాకరణము)
सन्धयः
1. इत्यादिकं + च = इत्यादिकञ्च – परसवर्णः
2. दैत्यराजः + असौ = दैत्यराजोऽसौ – विसर्गसन्धिः
3. प्रह्लादः + अपि = प्रह्लादोऽपि – विसर्गसन्धिः
4. विश्वसृष्टिः + भविष्यति = विश्वसृष्टिर्भविष्यति. – विसर्गसन्धिः
5. क्रोधारुणाम्बकः + दैत्यः = क्रोधारुणाम्बको दैत्यः- विसर्गसन्धिः
6. शिरः + त्वदीयम् = शिरस्त्वदीयं – विसर्गसन्धिः
7. प्रभवेत् + धरण्याम् = प्रभवेद्धरण्याम् – जश्त्वसन्धिः
8. गतवान् + तव = गतवांस्तव – रुत्वसन्धिः
9. श्रीपतिः + विष्णुः = श्रीपतिर्विष्णुः – विसर्गसन्धिः
10. क्रोधमूर्तिः + महाबलः = क्रोधमूर्तिर्महाबलः – विसर्गसन्धिः
11. प्रखरैः + नखैः = प्रखरैर्नखैः – विसर्गसन्धिः
समासाः
1. कोपस्य अतिरेकः – कोपातिरेकः – तस्मात् रौद्रः तेन – कोपातिरेकरौद्रेण – पञ्चमीतत्पुरुषः
2. चरणः एव कमलं – चरणकमलं चरणकमलस्य युग्मं – चरणकमलयुग्मम् – षष्ठीतत्पुरुषः
3. दनुजानां कुलं – दनुजकुलं, तस्य विनाशः तं – दनुजकुलविनाशं – षष्ठीतत्पुरुषः
4. शान्तं चित्तं यस्य सः – शान्तचित्तः – बहुव्रीहिः
5. स्थावराश्च जङ्गमाश्च स्थावरजङ्गमाः तेषु – स्थावरजङ्गमेषु – द्वन्द्व
6. वायोः तरङ्गः – वायुतरङ्गः – तन्मध्ये वायुतरङ्गमध्ये – सप्तमीतत्पुरुषः
7. मूर्खेषु अवतंसः मूर्खावतंसः, तत्सम्बुद्धौ मूर्खावतंसः सप्तमीतत्पुरुषः
8. सर्वं व्याप्नोति इति सर्वव्यापी – उपपदतत्पुरुषः
9. महत् बलं यस्य सः महाबलः – बहुव्रीहिः
10. निशायां चरतीति निशाचरः – बहुव्रीहिः
11. गदायाः प्रहारः गदाप्रहारः, तेन भिन्नं गदाप्रहारभिन्नं, तस्मात् – गदप्रहारभिन्नात् – पञ्चमीतत्पुरुषः
12. शङ्खश्च चक्रञ्च शङ्खचक्रे, ते धरतीति शङ्खचक्रधरः – उपपदतत्पुरुषः
13. कीलालेन सिक्तः देहः यस्य सः कीलालसिक्तदेहः – बहुव्रीहिः
14. चत्वारो भुजाः यस्य सः चतुर्भुजः – बहुव्रीहिः
भावः (Substance) (తాత్పర్యము)
1. कोपातिरेकरौद्रेण दैत्यभूपतिना तदा |
प्रहस्य वचनं प्रोक्तं दृष्ट्वा प्रह्लादबालकम् ||
Substance : Then the Demon king, who was very much angry, laughed and said to the boy Prahlada.
తాత్పర్యము : హిరణ్యకశిపుడు కోపంతో రౌద్రుడు అయ్యాడు. పిమ్మట పెద్దగా నవ్వి తన కుమారుడైన ప్రహ్లాదునితో ఈ విధంగా పలికాడు.
2. हरेः पूजनं त्वं परित्यज्य नित्यं ममैवार्चनं स्तोत्रमित्यादिकञ्च ।
कुरुष्वान्तरङ्गे भयं नास्ति पुत्र सदा भोगसौख्येषु नूनं रमस्व ॥
Substance : “Abandon the worship of Hari. Start worshipping me reciting hymns etc. Have no fear inside. Always enjoy pleasures and comforts.”
తాత్పర్యము : ఓయీ ! కుమారా ! శ్రీ మహావిష్ణువును సేవించడం విడిచిపెట్టు. నిత్యం నన్నే అర్చించు. స్తోత్రముచేయుము. నీ మనసులో భయాన్ని వదలిపెట్టు. సకల సౌఖ్యాలను అనుభవించు.
3. इत्युक्त्वा दैत्यराजोऽसौ विरराम महाबलः ।
मन्दस्मिताननो बालः प्रह्लादोऽपि तमब्रवीत् ॥
Substance : When the king of the Demons said thus, the boy Prahlada replied him with a smile.
తాత్పర్యము : రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఈ విధంగా మాట్లాడి ఊరకున్నాడు. పిమ్మట ప్రహ్లాదుడు చిరునవ్వుతో కూడిన ముఖముగలవాడై తండ్రితో ఈ విధంగా పలికాడు.
4. जनक सकलसृष्टेर्मूलभूतस्य तस्य
चरणकमलयुग्मं भूपते संस्मरामि ।
विमलमखिलवेद्यं सर्वपापौघनाशं
दनुजकुलविनाशं मानवैः पूजनीयम् ॥
Substance : “Father, I meditate on the lotus feet of the one, who is the cause of this whole universe. Those feet are pious, knowable to all, destroyer of all sins, the annihilator of the Danava dynasty and honourabe to human beings.
తాత్పర్యము : ఓ తండ్రి ! సకల సృష్టికి మూలభూతమైన, పవిత్రమైన, అంతయు తెలిసిన, సర్వపాపాలను తొలగించునట్టి, రాక్షస వంశాన్ని నాశనం చేయునట్టి, మానవులచే పూజించునట్టి ఆ శ్రీహరి పాద పద్మాలను స్మరిస్తాను.
5. तस्य सङ्कल्पमात्रेण विश्वसृष्टिर्भविष्यति ।
क्षणमात्रे विनाशोऽपि विष्णोः शक्त्या भविष्यति ॥
Substance : The whole creation happens just by his will. By the power of Vishnu it gets destructed in a moment.”
తాత్పర్యము : తండ్రి ! ఆ శ్రీమహావిష్ణువు యొక్క సంకల్పబలంతోనే ఈ సృష్టి ఆవిర్భ వించుచున్నది. ఆ మహనీయుని శక్తి వల్లనే ఈ సృష్టి క్షణకాలంలో నాశనం కలుగుతుంది.
6. एवमुक्त्वा स प्रह्लादो तूष्णी तस्थो महामतिः|
क्रोधारुणाम्बको दैत्यो जगाद वचनं कटु |
Substance : Having said so, the wise Prahlada remained silent. The Danava spoke harshly with eyes reddened with anger.
తాత్పర్యము : ప్రహ్లాదుడు ఈ విధముగా మాట్లాడి ఊరకుండెను. పిమ్మట రాక్షసరాజైన హరణ్యకశిపుడు కోపగించాడు. దాంతో అతని కన్నులు బాగా ఎర్రబడినాయి. పరుష వచనములతో ప్రహ్లాదునితో ఈ విధంగా పలికాడు.
7. गुरुं तिरस्कृत्य तदीयशत्रुं
हरिं समाराधयता त्वया हि ।
कृतोऽपराधः सुमहान् खलेन
यमालयं गच्छसि मूढबुद्वै ॥
Substance : “Rejecting your father, you worship his enemy; thereby you have committed a grave mistake. O fool, you will go to the abode of Yama.
తాత్పర్యము : ఓయీ ! దుర్భుద్ధికలవాడా ! మనకు శత్రువైన శ్రీహరిని ఆరాధిస్తున్నావు దీంతో నీవు పెద్ద తప్పుచేశావు. నీవు నరకానికి వెళ్తావు.
8. गदाप्रहारेण शिरस्त्वदीयं
करोमि भग्नं क्षणमात्रकाले ।
पश्याम्यहं कोऽपि हरिः समेत्य
त्वां रक्षितुं वै प्रभवेद्धरण्याम् ||
Substance : I will break your head in a moment with the blow of mace. Let me see if any Hari will come to your rescue in this world.
తాత్పర్యము : ఓరీ ! ఈ గద యొక్క దెబ్బతో నీ తలను క్షణకాలంలో పగులగొడతాను. లోకంలో ఏ విష్ణువు నిన్ను చేరి రక్షిస్తాడో నేను చూస్తాను.
9. हरिश्च ते सर्वगतो मुरारिः
इतीरितं बालक दर्शयाद्य |
स्तम्भेऽस्ति वा हर्म्यगते स विष्णुः
क्व श्रीनिवासः क्व महेन्द्रनीलः ॥
Substance : O boy, you say that Hari is everywhere. Show me now whether that Hari in this pillar in the palace. Where is Srinivasa ? Where is that Blue one”.
తాత్పర్యము : ఓయీ ! మురారి అయిన నీ విష్ణువు అంతట ఉన్నాడని నీవు చెప్పావు గదా ! ఇప్పుడు నాకు చూపించు. ఇంటిలోని ఈ స్తంభంలో ఉన్నాడా ? శ్రీనివాసుడు ఎక్కడ ? నీలదేహుడైన విష్ణువు ఎక్కడ ?
10. तदा तद्वचनं श्रुत्वा राक्षसस्य महामतिः ।
प्रह्लादः शान्तचित्तः सन् अवोचद्वाक्यमुत्तमम् ||
Substance : On hearing those words of the Rakshasa, Prahlada, whose mind was calm, replied thus.
తాత్పర్యము : రాక్షసరాజైన హిరణ్యకశిపుని మాటలను ప్రహ్లాదుడు విన్నాడు. ప్రశాంత భావంతో ప్రహ్లాదుడు ఉత్తమమైన మాటలను రాజుతో ఈవిధంగా పలికాడు.
11. रमाधवः स्थावरजङ्गमेषु नरेषु सिंहेषु विहङ्गमेषु ।
जलेऽनले वायुतरङ्गमध्ये विराजते हस्तिकुरङ्गगात्रे ॥
Substance : “The consort of Rama dwells in animate and inanimate beings, in men, lions, birds, water, fire, wind, waves and in the bodies of elephants and deer.”
తాత్పర్యము : ఓయీ, తండ్రి ! శ్రీ మహావిష్ణువు స్థావర జంగమాదులయందు, నదుల యందు, సింహాలయందు, పక్షులయందు, నీటియందు, అగ్నియందు, వాయు తరంగాలయందు, ఏనుగులయందు, జింకల శరీరాలయందు ప్రకాశిస్తున్నాడు అనగా విష్ణువు ఉన్నాడని భావము.
12. प्रह्लादवचनं दैत्यः समाकर्ण्य हिरण्यकः ।
क्रोधोन्मत्त उवाचेदं वचनं परुषाक्षरम् ॥
Substance : Hiranyaka, having heard the words of Prahlada, becoming mad with anger, spoke these harsh words.
తాత్పర్యము : రాక్షసరాజైన హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని మాటలను విన్నాడు. మిక్కిలి కోపంతో కూడినవాడై పరుషంగా ఈ విధంగా పలికాడు.
13. रे मूढ दर्शय हरिं क्व गतः स भीरुः
स्तम्भेऽस्ति वा मुररिपुः क्व गतो रमेशः ।
अद्यैव केशवमहं गदया हनिष्ये
मूर्खावतंस गतवांस्तव कुत्र विष्णुः ||
Substance : “Oh fool, Show me Hari. Where has that coward gone? Is he in this pillar? Where has he run away, that Muraripu? I will kill Kesava with the mace now itself. O stupid fellow, where has your Vishnu gone?”
తాత్పర్యము : ఓరీ మూఢుడా ! శ్రీ హరిని నాకు చూపించు. భయస్తుడైన ఆ విష్ణువు ఎక్కడికి వెళ్ళాడు ? ఈ స్తంభంలో ఉన్నాడా ? ఎక్కడికి వెళ్ళాడు. ఈ రోజే నా గదతో ఆ విష్ణువును చంపుతాను. నీ విష్ణువు ఎక్కడికి వెళ్ళాడు ?
14. तच्छ्रुत्वा वचनं बालः प्रह्लादः स्मितपूर्वकम् ।
जगाद स रमेशस्तु सर्वव्यापी महाबलः ॥
Substance : On listening those words, Prahlada smilingly said that Hari is omnipresent.
తాత్పర్యము : బాలుడైన ప్రహ్లాదుడు తన తండ్రి పలికిన మాటలను విని చిరునవ్వుతో మహాబలుడైన ఆ శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకుడు.
15. तस्य संहरणं नैव शक्यं तेऽस्ति निशाचर ।
स्तम्भेऽस्ति श्रीपतिर्विष्णुः वर्तते सर्वगोचरः ||
Substance : It is impossible to kill him. Vishnu is in this pillar. He can be seen everywhere.
తాత్పర్యము : తండ్రీ ! ఆ విష్ణువును సంహరించడం నీ వలన సాధ్యం కాదు. సర్వగోచరుడైన విష్ణువు ఈ స్తంభమునందు ఉన్నాడు.
16. तदा हिरण्यकशिपुः क्व हरिस्ते इति ब्रुवन् ।
गदाप्रहारमकरोत् स्तम्भस्योरि राक्षसः ॥
Substance : Then Hiranyakasipu hit the pillar with the mace shouting where your Hari is ?
తాత్పర్యము : రాక్షసుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో “నీ హరి ఎక్కడున్నాడు ?” అని పలుకుతూ స్తంభంపైన గదతో కొట్టడం చేశాడు.
17. गदाप्रहारभिन्नाञ्च स्तम्भात्तस्मादजायत ।
नृसिंह भगवान् विष्णुः क्रोधमूर्तिर्महाबलः ॥
Substance : From the pillar broken by the blow of the mace appeared Vishnu in the angry form Nrisimha.
తాత్పర్యము : హిరణ్యకశిపుడు గదతో స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం నుండి మిక్కిలి కోపంతో కూడిన, మహాబలవంతుడైన, నృసింహమూర్తిగా ఉన్న దైవమైన విష్ణువు ఆవిర్భవించాడు.
18. शङ्खचक्रधरो विष्णुः नृसिंहो प्रखरैर्नखैः ।
अङ्के संस्थाप्य दनुजं ददार पुरुषोत्तमः ॥
Substance : Vishnu, holding conch and disk, in the form of Nrisimha tore apart with sharp nails the Demon, having dragged him on to his lap.
తాత్పర్యము : చక్రధరుడు, పురుషోత్తముడు, నృసింహుడు అయిన విష్ణువు రాక్షసరాజైన హిరణ్యకశిపుడిని తన ఒడిలో ఉంచుకొని వాడియైన గోళ్ళతో చీల్చి సంహరించాడు.
19. दैत्यं निहत्य कीलालसिक्तदेहो चतुर्भुजः ।
रराज सायंकालीनः यथा सूर्योऽरुणो महान् ॥
Substance : Having killed the demon, with his body smeared with blood, Vishnu looked like the red Sun at the time of setting.
తాత్పర్యము : మహాత్ముడైన విష్ణువు రాక్షసేంద్రుడైన హిరణ్య కశిపుడిని సంహరించాడు. ఆ సమయంలో నరసింహుడు రక్తముతో తడిసిన శరీరముకలవాడై సాయంకాలపు సూర్యునివలె ప్రకాశించాడు.
20. दैत्यं नृसिंहेन हतं महोग्रं
ज्ञात्वा सहस्राक्षमुखा निलिम्पाः ।
आनन्दमग्ना ननृतुर्मुकुन्दम्
आराधयामासुरभीष्टदं तम् ॥
Substance : Indra and other gods, on knowing that the demon was killed, danced with joy and worshipped Vishnu, who did favour to them.
తాత్పర్యము : నరసింహుడు భీకరుడైన హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ విషయం తెలుసుకొని ఇంద్రాది దేవతలు ఆనందించారు. సకల కోరికలను అనుగ్రహించునట్టి శ్రీమహా విష్ణువును భక్తితో పూజించారు.
नृसिंहाविर्भावः Summary in Sanskrit
कविपरिचयः
पाठ्यांशोऽयं नृसिंहनखकौमुदी इत्याख्यमहाकाव्यात् गृहीतः । अस्य रचयिता डा. के. सुधाकररावः । संस्कृत-आंग्ल-तेलुगु- कन्नडेत्यादि भाषासु निष्णातः अयं कविपण्डितः आदोनि इत्याख्ये पट्टणे १९६० तमे वर्षे जातः । अस्य पितरौ श्रीअनसूया-तिम्माजिरावौ । बाल्ये श्रीदक्षिणामूर्तिविदुषः सकाशे शंस्कृतम् अभ्यस्तवानयम् । संस्कृते तेलुगुभाषायां च स्नातकोत्तरपरीक्षायाम् उत्तीर्णोऽयं विद्वान् द्विसप्ततिं ग्रन्थान् प्रणीतवान् । एतेषु तेलुगुभाषायां ३९, संस्कृते १५, कन्नडभाषायां १३, हिन्दीभाषायां च ५ ग्रन्थाः सन्ति ।
अयं २०१७ तमे वर्षे कर्णाटक विश्वविद्यालयात् विद्यावारिधिं अलभत । तन्त्रोपासनादक्षः श्री रावमहोदयः संस्कृते श्रीनृसिंहनखकौमुदी, श्रीलक्ष्मीहयग्रीवसुधा इति महाकाव्यद्वयम् अरचयत् । निरन्तरम् अध्ययने विविधशास्त्राणां परिशोधने च निमग्नोऽयं कविवरः Indian Information Service परीक्षायां १९८७ वर्षे उत्तीर्णतां प्राप्तवान् । इदानीं तेलंगाणाराज्यस्थभाग्यनगरे दूरदर्शनकेन्द्रे वार्ताविभागे निदेशकपदम् अलङ्करोति ।
कथासारांशः
नवसर्गात्मकस्य नृसिंहनखकौमुदी महाकाव्यस्य षष्ठसप्तमसर्गाभ्यां गृहीतोऽयं पाठ्यभागः । अत्र भगवतः नृसिंहस्य आविर्भावः वर्णितः । हिरण्यकशिपुः स्वसुतं प्रह्लादम् अध्ययनार्थम् आश्रमं प्रेषयति । किन्तु सुकृतवशात् प्रह्लादः सर्वदा भगवंतः श्रीहरेः स्मरणं करोति । हिरण्यकशिपुः प्रह्लादं श्रीहरिस्मरणात् निवर्तयितुं बहुधा प्रयतते । श्रीहरितः अहमेव श्रेष्ठः, अतः मामेव स्मरत्वमिति बहुधा वदि सः, तथापि पितृवाक्यम् अविगणय्य प्रह्लादः निरन्तरं श्रीहरिं सेवितुम् इच्छति तेन क्रुद्धः दनुजेन्द्रः प्रह्लादं क्लेशयति । अन्ते सः स्तम्भे श्रीहरिं दर्शयसि वेति पृच्छति, स्तम्भं गदया भिनत्ति च । तस्मात् आविर्भूतः भगवान् नृसिंहः हिरण्यकशि हन्ति ।
नृसिंहाविर्भावः Summary in Telugu
కవి పరిచయం
ఈ పాఠ్యభాగం “నృసింహనఖకౌముది” అనే కావ్యం నుండి స్వీకరింపబడింది. ఈ పాఠ్యభాగాన్ని డా॥ కె. సుధాకరరావు సంస్కృతం, ఆంగ్లము, తెలుగు, కన్నడ మొదలైన భాషలయందు గొప్ప పండితుడు. ఈయన ఆదోని అనే పట్టణంలో 1970వ సంవత్సరంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు తిమ్మాజిరావు తల్లి పేరు శ్రీ అనసూయ. బాల్యంలో శ్రీదక్షిణా మూర్తి సమక్షంలో సంస్కృతాన్ని చదివాడు. సంస్కృత భాషల యందు ఉన్నత డిగ్రీలను పొందారు. వీరు 72 గ్రంథాలను రచించారు. వీటిలో తెలుగులో 39, సంస్కృతంలో 15, కన్నడంలో 13, హిందీ భాషలో 5 గ్రంథాలు రచించారు.
వీరు 2017వ సంవత్సరంలో కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి విద్యావారధి డిగ్రీని పొందారు. సంస్కృతంలో శ్రీనృసింహనఖకౌముది, శ్రీలక్ష్మీహయగ్రీవసుధా అనే గ్రంథాలను రచించారు. వీరు నిరంతరం చదవడంలోను, పరిశోధన చేయడంలోను నిమగ్నమయ్యేవారు. వీరు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే పరీక్షలో 1987వ సంవత్సరంలో ఉత్తీర్ణుడయ్యారు. ప్రస్తుతం వీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోని దూరదర్శన్ కేంద్రంలో వార్తావిభాగంలో పని చేస్తున్నారు.
కథా సారాంశము
తొమ్మిది సర్గంతో కూడిన ‘నృసింహనఖకౌముది’ అనే గ్రంథంలోని షష్ఠ, సప్తమ సర్గల నుండి ఈ పాఠ్యభాగం స్వీకరింపబడింది. ఇక్కడ భగవంతుడైన నృసింహస్వామి అవతార ఆవిర్భావం గొప్పగా వర్ణింపబడింది. హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుడిని చదివించడంకోసం గురువుల వద్దకు పంపించాడు. దాని పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ప్రహ్లాదుడు భగవంతుడైన శ్రీమహావిష్ణువు యొక్క స్మరణ చేస్తుండేవాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని శ్రీహరి స్మరణ నుండి నివారింపజేయడానికి అనేక విధములుగా ప్రయత్నిం చాడు. శ్రీమహావిష్ణువు కంటే నేనే శ్రేష్ఠుడిని, అందువల్ల నన్నే స్మరించు అని అనేక విధాలుగా చెప్పాడు.
అయినా ప్రహ్లాదుడు తండ్రి మాటలను లెక్కచేయకుండా ఎల్లప్పుడు శ్రీమహావిష్ణువునే సేవించడానికి ఇష్టపడేవాడు. దీంతో కోపగించిన హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో కష్టాలకు గురిచేశాడు. చివరగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఈ స్తంభంలో విష్ణువును చూపిస్తావా ? అని అడిగాడు. స్తంభాన్ని గదతో గట్టిగా కొట్టాడు. ఆ స్తంభం నుండి శ్రీమహావిష్ణువు నృసింహ రూపంలో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించాడు.
ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. హిరణ్య – కశిపుడు విష్ణువైరి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని గురుకులంలో ఉంచాడు. సకలశాస్త్ర విద్యలను బోధింపజేశాడు. అయినా ప్రహ్లాదునిలో హరిపై భక్తి తగ్గలేదు. ఇది గమనించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో, “నాయనా ! మనకు విష్ణువు శత్రువు. అతడిని వదులు సర్వ సుఖాలను అనుభవించు.” అని బోధించాడు. అయినా ప్రహ్లాదునిలో మార్పురాలేదు.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తీవ్రంగా మందలించాడు. అనేక కష్టాలను పెట్టాడు. చివరకు ప్రహ్లాదునితో విష్ణువు ఎక్కడుంటాడని, అతడిని నా ముందు చూపమని ఆదేశించాడు. ప్రహ్లాదుడు తండ్రీ ! హరి సర్వత్రా ఉంటాడు. ఎక్కడైనా చూడవచ్చు అని పలికాడు. అది విని హిరణ్యకశిపుడు “ఈ స్తంభంలో ఉన్నాడా ?” అని అడిగాడు. ప్రహ్లాదుని మాటలు విని కోపంతో తన గదతో స్తంభాన్ని కొట్టాడు. స్తంభం నుండి విష్ణువు నృసింహుని రూపంలో ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఇంద్రాది దేవతలందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థించారు.
नृसिंहाविर्भावः Summary in English
Introduction of the Poet
The lesson is an extract from Nrisimhanakhakaumudi written by Dr. K. Sudhakara Rao. Dr. Rao authored many works in Sanskrit, Telugu, Kannada and Hindi. His Sanskrit works included Nrisimhanakhakaumudi and Lakshmihayagrivasudha. Dr. Rao, who belonged to Adoni, Andhra Pradesh was a post graduate in Sanskrit and Telugu. He took doctoral degree from Karnataka University. At present he is working as Director, News Division in Hyderabad Dooradarshan. The lesson describes the appearance of Nrisimha from the pillar and his subsequent killing of Hiranyakasipu, the father of Prahlada.
Free study material for Sanskrit
Step-by-Step Textbook Answers: Class 12 Sanskrit Poem 06 Nrisimhavirbhava
Textbook Solutions for Class 12 Sanskrit Poem 06 Nrisimhavirbhava
Review comprehensive exercise answers for Class 12 Sanskrit Poem 06 Nrisimhavirbhava. Fully updated to match current TS Board syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 12 Sanskrit module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for TS Board exams.
Effective Self-Study and Homework Assistance
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 12 Sanskrit.
FAQs
The complete and updated TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः is available for free on StudiesToday.com. These solutions for Class 12 Sanskrit are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Sanskrit concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Sanskrit. You can access TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 2nd Year Sanskrit Study Material Poem 6 नृसिंहाविर्भावः in printable PDF format for offline study on any device.