TS Inter 2nd Year Sanskrit Study Material Poem 5 रुद्रमदेवी

Solutions for Class 12 Sanskrit: Poem 05 Rudramadevi

Access comprehensive textbook solutions for Poem 05 Rudramadevi using the official curriculum guides for Class 12 Sanskrit. Designed to align with the 2026-27 TS Board standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 12 Sanskrit Solutions: Poem 05 Rudramadevi

Navigate directly to the solved Sanskrit textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

निबन्धप्रश्नौ (Essay Questions) (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)

Question 1: रुद्रमदेव्याः विजयं संक्षिपता?
(రుద్రమదేవి యొక్క విజయాన్ని సంక్షిప్తంగా వివరించండి.)

Answer:

‘రుద్రమదేవి’ అనే పాఠ్యభాగాన్ని శ్రీ దురిశేటి వెంకట రామాచార్యులు రచించారు. వీరు రచించిన ‘శిల్పశ్రీ’ అనే కావ్యం నుండి ఈ పాఠ్యభాగం స్వీకరింపబడింది. ఇందులో రుద్రమదేవి పరాక్రమాన్ని, ధైర్యాన్ని చక్కగా వర్ణించారు. కాకతిరాజ్య రాణిగా ఆమె సాధించిన విజయాలను చక్కగా ఆవిష్కరించారు. కాకతీయ చక్రవర్తులలో గణపతిదేవుడు ప్రసిద్ధుడు. అతడు తన పరాక్రమంతో రాజ్యాన్ని చాలాకాలం పాలించాడు. అతని కుమార్తె రుద్రమదేవి. యుద్ధ విద్యలో ప్రావీణ్యాన్ని సాధించింది. వృద్ధాప్యంతో గణపతిదేవుడు రాజ్యాన్ని పరిపాలించలేకపోతున్నారు.
ఇది గమనించిన అతని మంత్రి ఒకరోజు రాజును సమీపించి “రాజా ! తమ కుమార్తె అయిన రుద్రమదేవిని రాణిగా పట్టాభిషేకం చేయండి. తమ సర్వశక్తి సమన్వయురాలు. రాజ్యాన్ని పాలించగల సమర్థురాలు, ఆమె తన పాదాలను శత్రువుల శిరస్సులపై ఉంచి శత్రువులను అణచివేయగల సమర్థురాలు. అందువల్ల మీరు రుద్రమదేవిని రాణిగా పట్టాభిషేకం చేయండి. ప్రజలంతా సంతోషిస్తారు.” అని పలికాడు.
“निजधरां मुदितां कुरु सप्रजाम्”
గణపతిదేవుడు తన మంత్రి మాటలను శ్రద్ధగా విన్నాడు. చాలా సంతోషించాడు. వెంటనే తన రాజ్యంలోని ప్రజలకు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతట చాటింపు వేశాడు. ఒక మంచి ముహూర్తంలో పుణ్యనదీజలాలతోను, వేద మంత్రాలతోను, వేద పండితుల ఆశీర్వచనాలతోను రుద్రమదేవికి వైభవంగా పట్టాభిషేకం జరిపించాడు. రుద్రమదేవి పరాక్రమం తెలిసిన సామంతులందరు ఆమెకు నమస్కరించారు. ఆమె సామ్రాజ్యాధిపత్యాన్ని అంగీకరించారు. సకాలంలో పన్నులు కట్టారు. కాని దేవగిరి రాజ్యాన్ని పరిపాలిస్తున్న హరిహర, మురారి దేవులు మాత్రం రుద్రమదేవి ఆధిపత్యాన్ని అంగీకరించలేదు.
ఒక స్త్రీ తమపై పెత్తనం చెలాయించడం ఏమిటని తిరుగుబాటు చేయాలనుకున్నారు. వీరిద్దరు రుద్రమదేవిని ఎదిరించడానికి పన్నాగాలు పన్నారు. చతురంగ బలాలతో యుద్ధానికి బయలుదేరారు. ఆ సమయంలో రుద్రమదేవి పరమేశ్వరుడిని సేవించడానికి బయలుదేరింది. అదనుచూచి శత్రుమూకలు రాజ్యంపై దాడిచేశారు.
समभियान्त्यरयो विभियोऽधियः
Introduction : The lesson Rudrama Devi was written by Sri D. Venkataramacharya. It is taken from the author’s poem Silpasri. The present lesson describes Rudrama’s victory over Mahadeva, the ruler of Devagiri. Queen of Kakati Kingdom : When the king of Kakati kingdom became old, his minister advised him to install his daughter Rudrama as the queen. It would make the kingdom along with the subjects pleased. निजधरां मुदितां कुरु सप्रजाम् । The king felt happy at that suggestion, and made announcement to that effect.
On an auspicious day, Rudrama was made the queen while the priests chanted mantras, and water from holy rivers and oceans was sprinkled on her. The pious queen became successful as people and feudatory lords paid their taxes willingly. The Jealous Enemies: However, Harihara and Murari became jealous of her success. The king of Devagiri lured them by his crooked ways. He said that a weak woman insulted them. The ruler of Devagiri. who was proud of his army attacked Rudrama.
समभियान्त्यरयो विभियोऽधियः ।

Exam Tips:

a) క్రమం: గణపతిదేవుని వృద్ధాప్యం, మంత్రి సలహా ("निजधरां मुदितां कुरु सप्रजाम्"), రుద్రమకు పట్టాభిషేకం, సామంతులు పన్నులు కట్టడం, హరిహర–మురారిదేవుల అసూయ.
b) పాఠం శ్రీ దురిశేటి వేంకటరామాచార్యుల "శిల్పశ్రీ" కావ్యం నుండి తీసుకున్నదని మొదట రాయండి.
c) ఈ ప్రశ్న రుద్రమ రాణి అయ్యే వరకు కథ; యుద్ధ వివరాలు రెండో ప్రశ్నకు ఉంచండి.

 

Question 2: देवगिरिनाथः महादेवः रुद्रमाम्बया कथं पराजितः?
(దేవగిరినాథుడు రుద్రమదేవిచేత ఏ విధముగా ఓడింపబడెను ?)

Answer:

తన రాజ్యం శత్రుహస్తగతమైనదనే విషయాన్ని రుద్రమదేవి తెలుసుకుంది. కోపంతో కన్నులు ఎర్రబడినాయి. వెంటనే రుద్రమదేవి పరిమిత సైన్యంతో అపరకాళికవలె, శత్రుసైన్యంపై ఎదురుదాడి చేసింది. సామంతులందరు రుద్రమదేవిని అనుసరించారు. యుద్ధరంగంలో శంఖనాదం చేసింది. శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టించింది. క్షణాల్లో రుద్రమదేవి వీర ఖడ్గాన్ని చేపట్టింది. పగపట్టిన నాగు పామువలె బుసలు కొట్టింది. శత్రువుల తలలను నరుకుతూ యుద్ధరంగంలో వీరవిహారం చేసింది. శత్రుసైన్యం విలవిలలాడారు. దేవాద్రినాథుడిని చూచింది.
వెంటనే అంకుశాన్ని ధరించి మదగజంపై ఉన్న మావటివాడిని చంపింది. రథాన్ని ఎక్కి ధనస్సుతో బాణవర్షం కురిపించింది. రథాన్ని నడుపుతున్న సారధిని చంపింది. ఆతని గుర్రాలను చంపింది. చివరకు అతని రథాన్ని, పతాకాన్ని ఖండించింది. శత్రురాజు విరథునిగా చేసింది.
“नृपाग्रणीं तं विरथं चकार ”
చివరకు మహాదేవుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తన పరాజయాన్ని అంగీకరించాడు. శత్రుసైన్యాలు యుద్ధం నుండి పారిపోయారు. స్త్రీలు బలహీనులు అనే మాట తప్పని గ్రహించాడు. గతిలేక మహాదేవుడు కూడా యుద్ధరంగం నుండి పారిపోయాడు. ఈ రకంగా రుద్రమదేవి అసమాన పరాక్రమం చూపించి వీరనారిగా గుర్తింపు పొందింది.
At that time, Rudrama went to worship Siva. On getting the news that the city was under siege, she returned with limited forces to the city. When she blew her conch, the soldiers and feudatory kings understood that it was their queen, and blew their conches. The Warrior Queen: The queen and her soldiers attacked the enemy from opposite sides. Rudrama threw her sword and killed the mahout of Mahadeva’s elephant. The king of Devagiri jumped in to another chariot. Rudrama killed the charioteer and the horses, and broke his string and flag. नृपाग्रणीं तं विरथं चकार । The Devagiri ruler and his followers ran away from the battle field. He understood that women were not weak.

Exam Tips:

a) యుద్ధ క్రమం: శివపూజకు వెళ్లిన రుద్రమ వార్త విని పరిమిత సైన్యంతో తిరిగి రావడం, శంఖనాదం, మావటివాని వధ, సారథి–గుర్రాల వధ, రథం–పతాకం ఖండన.
b) "समभियान्त्यरयो विभियोऽधियः" మరియు "नृपाग्रणीं तं विरथं चकार" అనే రెండు సందర్భ వాక్యాలను ఉదహరించండి.
c) ముగింపు: మహాదేవుడు పారిపోయి "స్త్రీలు అబలలు కాదు" అని గ్రహించడం.

 

सन्दर्भवाक्यानि (Annotations) (సందర్భ వాక్యాలు)

Question 1: निजधरां मुदितां कुरु सप्रजाम् ।

Answer:

परिचयः – इदं वाक्यं ‘रुद्रमदेवी’ इति पाठ्यभागात् स्वीकृतम् । अस्य रचयिता श्री दुरिशेटि वेङ्कटरामाचार्यः ।
सन्दर्भः – काकतीयराजः वृद्धः अभवत् । पलितकेशं तं तस्य सचिवः अवदत् यत् रुद्रमदेवी राज्यं कर्तुम् अर्हति । ताम् अभिषेचय । प्रजाः तोषय इति ।
भावः – निजराज्यं प्रजाः च तोषय ।

Exam Tips:

a) వక్త మంత్రి, శ్రోత వృద్ధుడైన గణపతిదేవుడు: "నీ రాజ్యాన్ని, ప్రజలను సంతోషపెట్టు".
b) పరిచయం, సందర్భం, భావం మూడూ వరుసగా రాయండి; "सप्रजाम्" = ప్రజలతో కూడిన అని అర్థం చెప్పండి.

 

Question 2: समभियान्त्यरयो विभियोऽधियः ।

Answer:

परिचयः – इदं वाक्यं ‘रुद्रमदेवी’ इति पाठ्यभागात् स्वीकृतम् । अस्य रचयिता श्री दुरिशेटि वेङ्कटरामाचार्यः ।
सन्दर्भः – काकतीयराजः स्वपुत्रीं रुद्रमदेवीं राज्ये अभिषिक्तवान् । तदसहमानाः देवगिरिराजादयः वयम् अबलया अवमानिताः इति सञ्चिन्त्य ताम् अभिययुः ।
भावः – भयहीनाः मूर्खाः शत्रवः अभिद्रवन्ति ।

Exam Tips:

a) ఇది కవి మాట: భయం లేని మూర్ఖ శత్రువులు దాడి చేస్తారు.
b) "అబలచేత అవమానం" అనే శత్రువుల భావనను సందర్భంలో చేర్చండి.

 

Question 3: नृपाग्रणीं तं विरथं चकार ।

Answer:

परिचयः – इदं वाक्यं ‘रुद्रमदेवी’ इति पाठ्यभागात् स्वीकृतम् । अस्य रचयिता श्री दुरिशेटि वेङ्कटरामाचार्यः ।
सन्दर्भः – रुद्रमदेवी रणे देवगिरिराजस्य हस्तिपकम् अहनत् । तदनु तस्य सारथिम्, अश्वान् च हत्वा तं विरथं चकार ।
भावः – सा चक्रवर्तिनं तं रथहीनम् अकारयत् ।

Exam Tips:

a) యుద్ధంలో రుద్రమ ఏనుగు మావటివాడు, సారథి, గుర్రాలను చంపి మహాదేవుని రథహీనుని చేసిన సందర్భం.
b) "विरथम्" = రథం లేనివాడు అని చెప్పండి.

 

एकपदसमाधानप्रश्नाः (One Word Answer Questions) (ఏకపద సమాధాన ప్రశ్నలు)

Question 1: कस्य वचः निशम्य नृपतिः मुदम् अवाप ?

Answer:

सचिवस्य वचः

Exam Tips:

a) మంత్రి మాటలు (सचिवस्य वचः) విని రాజు సంతోషించాడు – షష్ఠీ విభక్తి రూపాన్ని రాయండి.
b) "నిశమ్య" క్రియతో వాక్యంలో ఉపయోగించవచ్చు.

 

Question 2: रुद्रमां का सफलां चकार ?

Answer:

शिवदेववाक्

Exam Tips:

a) రుద్రమను రాణిగా చేసి సఫలం చేసినది శివదేవుని వాక్కు (शिवदेववाक्).
b) ఇది ఒక సమాస పదం: శివదేవస్య వాక్ అని విగ్రహం చెప్పండి.

 

Question 3: रुद्रमया प्रयुक्तः खड्गः कं जघान ?

Answer:

देवगिरिराजस्य हस्तिपकं

Exam Tips:

a) రుద్రమ ఖడ్గం చంపినది దేవగిరిరాజు యొక్క మావటివాడిని (हस्तिपकम्).
b) ద్వితీయా విభక్తి కర్మ రూపం జాగ్రత్తగా రాయండి.

 

कठिनशब्दार्थाः

1. जरठः = वृध्दः, ముసలివాడు ,
2. धरणीभुक् = राजा, రాజు
3. पुरोधाः = पुरोहितः, పురోహితుడు
4. शत्रुवरुथिनी = शत्रुसेना, శత్రుసేన
5. वाहिनी = सेना, సేన
6. वृषा = इन्द्रः, ఇంద్రుడు
7. उज्ज्वलप्रथनदुर्गमवर्त्म = प्रकाशयुक्तः विस्तृतः दुष्प्राप्यमार्गः ప్రవేశింప వీలుగాని మార్గం
8. पृथुभण्डनपण्डिताः = दुष्टकर्मकुशलाः, చెడుపనులు చేయువారు
9. समीकम् = युद्धम्, యుద్ధము
10. विगतत्रपा = निर्लज्जाः, సిగ్గులేనివారు
11. विभियः = निर्भीकाः, భయంలేనివారు
12. अधियः = मूढाः, మూడులు
13. निकृताः = शठाः, శఠులు
14. अपसमंज्ञा = अपमानः, అవమానం
15. हस्तिपकः = गजनियन्ता, మావటివాఁడు
16. उन्मदद्विपः = मदगजः, మదగజము
17. तुरङ्गः = अश्व:, గుర్రం
18. व्याली = सर्पिणी, పాము
19. परीतम् = आक्रान्तम्, ఆక్రమణ
20. पराक्तम् = पराक्रान्तम्, ఇతరులచే పొందబడిన
21. अरातिसैन्यम् = शत्रुसैन्यम्, శత్రుసైన్యం
22. ईक्षा = दृक्, చూపు
23. जिघांसुः = हन्तुम् इच्छति इति जिघांसुः, చంపాలనే కోరిక
24. शरौघम् = शराणां समूहः, బాణాల సమూహం
25. तुमुलम् = कोलाहलमयम्, కోలాహలము
26. परिपन्थिनः = शत्रवः, శత్రువులు

व्याकरणांशाः (Grammar) (వ్యాకరణము)

सन्धयः

1. सितनिजातपवारणतः + अभितः = सितनिजातपवारणतोऽभितः – विसर्गसन्धिः
2. जरठः + अभवत् = जरठोऽभवत् – विसर्गसन्धिः
3. सचिवः + अवदत् = सचिवोऽवदत् – विसर्गसन्धिः
4. अभूत् + वलयन् = अभूद्वलयन् – जश्त्वसन्धिः
5. निगममन्त्रवचोभिः + अषिच्यत = निगममन्त्रवचोभिरषिच्यत – विसर्गसन्धिः
6. विधिवत् + निजकाम्यया = विधिवन्निजकाम्यया – अनुनासिकसन्धिः
7. हरिहरः + च = हरिहरश्च – श्चुत्व सन्धिः
8. यत् + अभिवीक्ष्य = यदभिवीक्ष्य – जश्त्वसन्धिः
9. पतिः + उज्वलप्रथनदुर्गमवर्त्मनि = पतिरुज्ज्वलप्रथनदुर्गमवर्त्मनि – विसर्गसन्धिः
10. विभियः + अधियः = विभियोऽधियः – विसर्गसन्धिः

समासाः

1. पलिताः केशाः यस्य सः – पलितकेशः – बहुव्रीहि
2. शत्रुणां शिरांसि – शत्रुशिरांसि तेषु शत्रुशिरस्सु – षष्ठीतत्पुरुष
3. मित्राणि च ते जनाश्च मित्रजनाः – विशेषणपूर्वपदकर्मधारय
4. सकलाश्च ते मित्रजनाश्च – सकलमित्रजनाः तेषु सकलमित्रजनेषु – विशेषणपूर्वपदकर्मधारयः
5. भयं करोतीति भयङ्करी – उपपदतत्पुरुष
6. निजस्य धरा निजधरा तां निजधराम् – षष्ठीतत्पुरुष
7. प्रजाभिः सह वर्तते इति सप्रजा तां सप्रजाम् – बहुव्रीहि
8. पुलकैः सहितं यथा स्यात् तथा सपुलकं – अव्ययीभाव
9. धरणीं भुङ्क्ते इति धरणीभुक् तेन धरणीभुजा – उपपदतत्पुरुष
10. तनोः जायते इति तनुजा – उपपदतत्पुरुष
11. विगतं मलं यस्याः सा विमला – बहुव्रीहि
12. अविद्यमानं कलुषं यस्याः सा अकलुषा ताम् अकलुषाम् – बहुव्रीहि
13. निजस्य काम्या निजकाम्या – षष्ठीतत्पुरुष
14. मह्याः पतिः महीपतिः – षष्ठीतत्पुरुष

भावः (Substance) (తాత్పర్యము)

1. अथ स काकतिराजपुरन्दरः सितनिजातपवारणतोऽभितः ।
पटुपराक्रमभानुमरीचिना चिरमुवास भुवं परिपालयन् ॥
Substance : The king of Kakati lived a long time ruling the earth with his rays of valour spreading on all sides of his royal umbrella.
తాత్పర్యము : కాకతీయ సామ్రాజ్య చక్రవర్తులలో శ్రేష్ఠుడైన ఆ గణపతి దేవుడు తన పటిష్ఠమైన పరాక్రమంతో, తెల్లనైన తన ఛత్రంతో భూమినంతా చాలా కాలం పాలించాడు.

2. बहुतिथे समये सति गच्छति प्रियपिनाकभुजो जरठोऽभवत् ।
पलितकेशममुं शिथिलीभवत्पटुनिजावयवं सचिवोऽवदत् ॥
Substance : As many days passed, the king became old. On seeing the king whose hair turned grey and limbs lost their strength, the minister said to him.
తాత్పర్యము : చాలా కాలం గడిచింది. రాజైన గణపతి దేవుడు ముసలివాడుగా అయ్యాడు జుట్టు తెల్లబడింది. అవయవాలు శిథిలమైనాయి. అటువంటి ఈ గణపతి దేవుడిని ఉద్దేశించి అతని మంత్రి పలికాడు.

3. अयि महन् दुहिता तव रुद्रमा निखिलकाकतिराज्यरमेश्वरी ।
भवितुमर्हति शत्रुशिरस्सु या कृतवती चरणं कमलारुणाम् ॥
తాత్పర్యము : ఓ మహారాజ ! నీ కుమార్తె అయిన రుద్రమదేవి సమస్త కాకతి రాజ్యలక్ష్మిగా అగుటకు యోగ్యురాలుగా ఉంది. ఆమె శత్రురాజుల శిరస్సులపై కమలములవలె ఎర్రనైన తన పాదాలను ఉంచగలదు.

4. सकलमित्रजनेष्वभयङ्करीं निखिलशत्रुजनेषु भयङ्करीम् ।
शिवपरामभिषेचय रुद्रमां निजधरां मुदितां कुरु सप्रजाम् ।
Substance : Crown Rudrama, the devotee of Siva, who removes the fear of all her friends, but who. frightens her enemies. Make the kingdom and the people happy.”
తాత్పర్యము : రాజా ! ఆశ్రితుల పట్ల అభయాన్ని కల్గించేదియును, శత్రుజనులపట్ల భయాన్ని కల్గించే, శివశక్తి సంపన్నురాలైన రుద్రమదేవిని రాణిగా పట్టాభిషేకం చేయండి. దాంతో రాజ్యమంతా మిక్కిలి ఆనందిస్తుంది.

5. इति निशम्य वचः सचिवस्य तन्नृपतिराप मुदं परमां तदा ।
जनपदेषु पुरेषु च घोषणाध्वनिरभूद्वलयन् विदिशो दिशः ॥
Substance : On hearing those words of the minister, the king became happy. Announcement to that effect was made in towns and villages, echoing in the quarters.
తాత్పర్యము : గణపతిదేవ మహారాజు తన మంత్రిమాటలను విని మిక్కిలి ఆనందించాడు. రుద్రమదేవి రాణి కాబోతుందన్న విషయాన్ని గ్రామాల్లోను, నగరాల్లోను, అన్ని దిక్కులయందు చాటింపు వేశాడు.

6. महितपुण्यसमुद्रनदीजलैः शुभदिने महतां च पुरोधसाम् ।
सपुलकं तनुजा धरणीभुजा निगममन्त्रवचोभिरषिच्यत ॥
Substance : On an auspicious day, as the priests chanted the Vedic mantras, she was sprinkled with the waters of the holy oceans and rivers.
తాత్పర్యము : గణపతిదేవుడు ఒక శుభముహూర్తంలో మహిమాన్వితమైన పుణ్యప్రదమైన సముద్రనదీ జలాలలోను, మహాత్ములైన వేదమంత్రాలతోను తన కుమార్తెను కాకతీయ రాణిగా పట్టాభిషేకం చేశాడు.

7. प्रियहिता विमला शिवदेववागकलुषां सफलां च चकार ताम् ।
नतमहीपतयो जनता च यत् करमदुः विधिवन्निजकाम्यया ॥
Substance : The blessing of Siva made her pious and accomplished. Kings and people payed taxes willingly.
తాత్పర్యము : గణపతిదేవుని మంత్రి అయిన శివ దేవుని ప్రియహితమైన, స్వచ్ఛమైన వాక్కు ఆ రుద్రమదేవిని సఫలురాలిగాను, కల్మషంలేనిదానినిగాను చేసింది. సామంత రాజుల, ప్రజలు శాస్త్ర విధానాన్ని అనుసరించి పూర్తి ఇష్టంతో తమ పన్నులను కట్టాడు.

8. हरिहरश्च मुरारिमहीपतिः यदभिवीक्ष्य नितान्तमसूयया ।
कलुषितौ चकितौ च तथाभवत् निखिलराष्ट्रमनन्तसमृद्धिमत् ॥
Substance : Harihara and Murari, having enviously observed that the kingdom was prosperous, became scared and frightened.
తాత్పర్యము : హరిహరుడు మరియు మురారి మిక్కిలి సమృద్ధితో కూడిన కాకతీయ రాష్ట్రాన్ని మిక్కిలి అసూయతో చూడసాగారు. వారు కలుషులు అయ్యే విధంగాను, ఆశ్చర్యం పొందే విధంగాను ఆ రాష్ట్రం మొత్తం అభివృద్ధిని పొందింది.

9. अथ च देवगिरेः पतिरुज्ज्वलप्रथनदुर्गमवर्त्मनि पण्डितः ।
हरिहरं च मुरारिमलोभयत् कुटिलनीतिजितात्महितावुभौ ॥
Substance : Then the king of Devagiri, the master in bad ways, lured them, who let their welfare won over by crooked mind.
తాత్పర్యము : పిమ్మట ప్రకాశవంతమైన, విస్తృతమైన ప్రవేశించుటకు యోగ్యముకాని మార్గమును రచించుటయందు నైపుణ్యంగల దేవగిరిరాజు హరిహరుడిని, మురారిని తన కుటిలనీతితో ప్రలోభపెట్టాడు.

10. अबलया च कयाचिदिमे वयं सुबलिनो बलिनो विगतत्रपाः ।
कलुषिता निकृताः परिपूरिताः मलिनयाऽसितयाऽपसमझया ||
Substance : ‘We, the powerful and fearless, having great army, are sullied with insult by some woman.”
తాత్పర్యము : బలసంపన్నమై సైన్యంతో బలవంతులమైన మనం ఒకానొక స్త్రీచేత సిగ్గువిడినవారం అయినాము. అంతేకాదు వారు మాలిన్యంతో కలుషితులైనారు. నల్లనైన పాపంతో కుత్సితులైనారు. అనాలోచనతో పూర్తిగా మునిగిపోయారు.

11. इति स देवगिरेः पतिरुन्मदद्विपतुरङ्गमसैनिक गर्वितः ।
अभिययौ पटुकाकतिवाहिनीं शिवबलामबलामिति रुद्रमाम् ॥
Substance : Thus, the ruler of Devagiri, proud of his intoxicated elephants, horses and soldiers, attacked the Kakati army thinking that Rudrama, who was blessed by Siva was weak.
తాత్పర్యము : బాగా మదించిన గజతురగ సైనిక బలంతో గర్వించిన ఆ దేవగిరి రాజు పటిష్టమైన సైన్య సంపత్తి కలిగిన, శివబల సమన్వితురాలైన రుద్రమదేవిని అబలగా భావించి ఎదుర్కొనడానికి సిద్ధపడినాడు.

12. शशिकलाभरणे निखिलेश्वरे भजनकामनया खलु रुद्रमा ।
गतवती पृथुभण्डनपण्डिताः समभियान्त्यरयो विभियोऽधियः ॥
Substance : While Rudrama went to worship the crescent ornamental Siva, the foolish enemies, who were experts in wrong deeds attacked.
తాత్పర్యము : రుద్రమదేవి నిఖిలేశ్వరుడైన పరమేశ్వరుడిని సేవించడానికి వెళ్ళింది. ఆ సమయంలో ప్రవేశించడానికి వీలుగాని మార్గమును తెలిసిన, శత్రువులు భయంలేనివారై, బుద్ధిహీనులై నగరాన్ని ఆక్రమించారు.

13. उदन्तमासाद्य नितान्तरोषकषायितारक्तमुखाऽरुणाक्षी ।
निवर्त्य सैन्येन मितेन वेगात् रुद्राम्बिका प्राप पुरं पराक्तम् ॥
Substance : On getting the news, Rudrama, whose eyes and face reddened with great anger, turned back and with limited force approached the city that was under attack.
తాత్పర్యము : రుద్రమదేవి జరిగిన విషయమంతా తెలుసుకుంది. దాంతో ఆమె మిక్కిలి కోపాన్ని పొందింది. ముఖం ఎర్రబడింది. కన్నులు ఎర్రబడినాయి. వెంటనే పరిమిత సైన్యంతో శివాలయం నుండి వెనుదిరిగి, శత్రువులతో ఆక్రమింపబడిన నగరాన్ని చేరుకుంది.

14. व्यालीव निश्वस्य परैः परीतं पुरं समुदीक्ष्य समीपमेत्य ।
दध्मौ स्वशङ्खं युधि चण्डिकेव जिघांसुरीक्षाभिररातिसैन्यम् ॥
Substance : Hissing like a serpent, she reached the city under siege of the enemies, and blew her conch, desiring to kill the armies of the enemy like Chandika.
తాత్పర్యము : రుద్రమదేవి శత్రువులతో ఆక్రమింపబడిన నగరాన్ని తన కన్నులతో చూచింది. వారిని సమీపించింది. పామువలె కోపంతో బుసలు కొట్టింది. వారిని జయింప దలచినదై యుద్ధరంగంలో చండికవలె ధ్వని శంఖాన్ని పూరించింది.

15. आध्मातशंखामधिगम्य राज्ञीं रुद्राम्बिकां दुर्गगता हि योधाः ।
सामन्तभूपाश्च विवृद्धमोदसमृद्धयो दध्मुरतोऽविलम्बम् ॥
Substance : Having understood that it was their queen Rudrama, who blew the conch, the feudatory kings and the soldiers in the city became overjoyed, and they blew their conches.
తాత్పర్యము : రుద్రమదేవి చేసిన శంఖ ధ్వనిని విని దుర్గంలోని వీరులు మరియు సామంతరాజులు మిక్కిలి ఆనందాన్ని పొందినవారై వెంటనే శంఖాన్ని పూరించారు.

16. अन्योन्यसंज्ञामधिगम्य सर्वे जजृम्भिरे शत्रुवरूथिनीनाम् ।
पश्चात्पुरस्ताच्च महाभटास्ते दवानला वा चटुलाटवीनाम् ।
Substance : Receiving signals from one another, they attacked the enemy forces from front and back, just as a forest fire would spread from both ends of a forest.
తాత్పర్యము : రుద్రమదేవి సైనికులందరు పరస్పర సంజ్ఞలతో శత్రుసైనికులు వచ్చారనే విషయాన్ని తెలుసుకొని అరణ్యంలో ఏర్పడిన కారుచిచ్చువలె శత్రుసైన్యానికి ముందు, వెనుక భాగాలను చుట్టుముట్టారు.

17. क्षणात्ततो रुद्रमया प्रयुक्तः खड्गः सपक्षश्च फणीव वेगात् ।
देवाद्रिनाथस्य गजे निषण्णं धृताङ्कुशं हस्तिपकं जघान ॥
Substance : In a flash, like a serpent, the sword thrown by Rudrama killed the Devagiri ruler’s mahout who sat on the elephant holding the hook.
తాత్పర్యము : పిమ్మట రుద్రమదేవి క్షణకాలంలో తన ఖడ్గాన్ని ప్రయోగించింది. అది వేగంగా రెక్కలున్న పామువలె దేవాద్రినాథుని ఏనుగుపై అంకుశాన్ని ధరించియున్న మావటివాడిని చంపింది.

18. पादाभिघातात् कुपितः फणीव श्वसन् महादेवनृपः सवेगम् ।
आरुह्य कस्यापि रथं सचापो वृषेव वर्षं व्यसृजच्छरौघम् ।
Substance : Angered like a serpent stamped by foot, the king of Devagiri got into someone’s chariot and rained arrows just as Indra would cause showers.
తాత్పర్యము : మహాదేవుడు పాదాలచే తొక్కబడిన పామువలె కోపగించినవాడై బుసలు కక్కుతూ, మరొక రథాన్ని ఎక్కి దేవేంద్రునివలె బాణవర్షాన్ని కురిపించాడు.

19. निवार्य तं सूतमिषुद्वयेन, षड्भिस्तुरङ्गौ, गुणकेतने च ।
एकैकबाणेन निपात्य, शत्रुं नृपाग्रणीं तं विरथं चकार ॥
Substance : Stopping him, killing the charioteer with two arrows, the two horses with six arrows, and felling the string and the flag with one arrow each, she made him devoid of his chariot.
తాత్పర్యము : రుద్రమదేవి సారధిని రెండు బాణములతోను, ఆరు బాణములతో గుర్రాలను, ఒక్కొక్క బాణంతో అల్లెత్రాడును, జెండాను పడగొట్టింది. పిమ్మట తన శత్రువైన ఆ రాజును కూడా రథంలేని వాడినిగా చేసింది.

20. कर्तव्यतामूढमतिस्स राजा ब्रीडाभिभूतं स्वबलं च कुर्वन् ।
पराजितात्माऽपगतः समीकात् स्त्रियोऽबला इत्यनृतं विजज्ञे ॥
Substance : Not knowing what to do, the defeated king causing shame to his army ran away from the battlefield. He realized that it was false to say that women were weak.
తాత్పర్యము : ఏమిచేయాలో తెలియని మనస్సుగల ఆ రాజు తన సైన్యాన్ని సిగ్గుపడే దానిగా చేశాడు. గత్యంతరం లేక పరాజయాన్ని పొంది యుద్ధం నుండి పారిపోయాడు. అబలలు అనేది అసత్యమని గ్రహించాడు.

21. विजृम्भितेऽस्मिन् तुमुले समीके रुद्राम्बया रुद्रबलात्तशक्त्या ।
जिता हि सर्वे परिपन्थिनस्ते पलायनं चक्रुरहो विचित्रम् ॥
Substance : In that tumultuous battle, Rudramba, who received strength from Rudra, defeated her enemies, and they ran away.
తాత్పర్యము : భయంకరంగా జరిగిన ఈ యుద్ధంలో రుద్రశక్తితో కూడిన రుద్రమదేవి . శత్రువులందరిని జయించింది. దాంతో ఈ శత్రువులంతా పలాయనం చేశారు. ఆహా ! ఎంత ఆశ్చర్యము.

रुद्रमदेवी Summary in Sanskrit

कविपरिचयः

‘रुद्रमदेवी’ इत्याख्यः पाठ्यभागोऽयं श्री दुरिशेटि वेङ्कटरामाचार्य – कविना रचितात् ” शिल्पश्रीः ” काव्यात् गृहीतः । श्री मङ्गाम्बा कनकाचार्ययोः सुतोऽयं कविपण्डितः साहित्यविद्याप्रवीणपरीक्षायाम् सर्वप्रथमस्थानम् अलभत । संस्कृतभाषानिबद्धानां काव्यानां पठने पाठने च श्रद्धावान् अयं कविपुङ्गवः तेलुगु- भाषायां ‘“अनार्कलि, अथर्वणाचार्युडु’ इति द्वे काव्ये अरचयत् । कालिदास- रघुवंशकाव्यस्य तेलुगुभाषया “अनार्कलि, अथर्वणाचार्युडु’ इति द्वे काव्ये अरचयत् कालिदास- रघुवंशकाव्यस्य तेलुगुभाषया अनुवादम् अकरोत् ।
अपि च “शिल्पश्रीः ” इति पञ्चसर्गात्मकं लघुकाव्यमरचयत् । अस्मिन् काव्ये सः काकतीयराजस्य गणपतिदेवस्य, तस्य पुत्र्याः वीरवनितायाः महाराज्ञ्याः रुद्रमाम्बायाः तेलंगाणाराज्ये अत्यन्तं प्रसिद्धस्य रामप्पदेवालयस्य निर्मातुः शिल्पिशिरोमणेः रामोजु पण्डितस्य च चरितम् अवर्णयत् ।

कथासारांशः

काकतिराजपुरन्दरः गणपतिदेवः प्रधानसचिवस्य शिवय्यदेवस्य अभिमत मनुसृत्य स्वपुत्र युद्धविद्यायां प्रजापरिपालने च कुशलिनीं रुद्रमां स्वराज्यस्य परिपालयित्रीं चकार । एतदसहमानौ हरिहरदेव – मुरारिदेवौ अपि च देवगिरिपालको यादवराजा महादेवः अनया सह योद्धुं समागतः । निशम्येदं नितान्तरोषकषायिता रक्तमुखा अरुणाश्री रुद्रमा मितेनैव सैन्येन वेगात् तैस्सह अभियोध्दुं जगाम । राज्ञ्या कृतां शङ्खध्वनिम् अनुसृत्य पराक्रमशीला नैके योधाः सामन्तभूपाश्च शत्रून् पराजेतुं युद्धभूमिं प्रति गताः । युद्धभूमौ शक्तिस्वरूपिण्याः रुद्रमायाः पराक्रमेण भीताः शत्रवः सर्वे पराजयम् अङ्गीकृत्य पलायनं कृतवन्तः ।

रुद्रमदेवी Summary in Telugu

కవి పరిచయం

‘రుద్రమదేవి’ అనే పాఠ్యభాగాన్ని శ్రీ దురిశేటి వెంకట రామాచార్యులు రచించారు. వీరు రచించిన ‘శిల్పశ్రీ’ అనే కావ్యం నుండి ఈ పాఠ్యభాగం స్వీకరింపబడింది. వీరి తల్లి పేరు ముగాంబ. తండ్రి పేరు కనకాచార్యులు. వీరు సాహిత్య విద్యా ప్రవీణయందు ప్రథమ శ్రేణిలో కృతార్థులయ్యారు. వీరు సంస్కృతభాషలోని వ్యాసములను చదువుట యందు మిక్కిలి ఆసక్తిని చూపేవారు. వీరు తెలుగు భాషలో “అనార్కలి, అధర్వణాచార్యుడు’ అనే రెండు గ్రంథాలను రచించారు. కాళిదాసు రచించిన ‘రఘువంశం’ అనే కావ్యాన్ని తెలుగులో అనువదించారు.
మరియు వీరు రచించిన ‘శిల్పశ్రీః, అనే కావ్యంలో ఐదు సర్గలు ఉన్నాయి. ఇది ఒకే లఘుకావ్యము. ఈ కావ్యంలో కాకతి రాజైన గణపతి దేవుని యొక్క కుమార్తె అయిన రుద్రమదేవి పరాక్రమం గురించి వర్ణింపబడింది. అంతేగాక రామప్పదేవాలయాన్ని నిర్మించిన శిల్పి శిరోమణి అయిన రామోజు పండితుని యొక్క చరిత్రను కూడా వర్ణించాడు.

కథా సారాంశము

కాకతిరాజైన గణపతిదేవుని ప్రధానమంత్రి అయిన శివయ్యదేవుడు వచ్చి రుద్రమను రాణిగా పట్టాభిషేకం చేయమని సూచించాడు. అతని కోరికను అనుసరించి రుద్రమదేవిని రాణిగా పట్టాభిషేకం చేయించాడు. దీన్ని హరిహరదేవుడు, మురారి దేవుడు అనే ఇద్దరు సామంత రాజులు సహించలేకపోయారు. దేవగిరి రాజైన మహాదేవునితో కలసి రుద్రమ దేవితో యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ వృత్తాంతాన్ని రుద్రమదేవి గ్రహించింది. కోపంతో ఎర్రబడిన కన్నులతో వేగంగా పరిమిత సైన్యంతో శత్రుసైన్యంపై తిరుగుబాటు చేసింది. కత్తిపట్టి యుద్ధరంగంలో వీరవిహారం చేసింది. శత్రుసైన్యాన్ని ఓడించింది. శత్రువులందరు యుద్ధరంగం నుండి పారిపోయారు. అందరు తమ పరాజయాన్ని అంగీకరించారు. స్త్రీలు అబలలు అనే మాట నిజం కాదని గ్రహించారు.

కాకతీయ రాజులో గణపతిదేవుడు ప్రసిద్ధుడు. అతని కుమార్తె రుద్రమదేవి. గణపతి దేవునికి వృద్ధాప్యం వచ్చింది. రాజపాలన చేయలేకపోతున్నారు. ఆ సమయంలో అతని మంత్రి ఒకరోజు రాజును సమీపించి రుద్రమదేవిని రాణిగా చేయమని సూచిస్తాడు. మంత్రి సలహాను అనుసరించి గణపతిదేవుడు ఒక మంచి సుముహూర్తంలో రుద్రమదేవిని రాణిగా పట్టాభిషేకం చేస్తాడు. సామంతులందరు రుద్రమదేవి నాయకత్వాన్ని అంగీకరిస్తారు. కాని సామంతులలో హరిహర, మురారి దేవులు మాత్రం రుద్రమను అబలగా తలచి ఆమె ఆధిపత్యాన్ని అంగీకరించలేరు. వారిద్దరు కుటిల పన్నాగం పన్నుతారు.

ఒకరోజు రుద్రమదేవి శివాలయానికి వెళ్ళింది. అదే సమయంలో వీరిద్దరు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించి దుర్గంలోకి ప్రవేశించారు. ఈ వార్తను విన్న రుద్రమదేవి మిక్కిలి కోపగించింది. పరిమిత సైన్యంతో వారిద్దరిని ఎదుర్కొంది. భీకర యుద్ధంలో శత్రుపక్షాల సైన్యాన్ని చీల్చి చెండాడింది. దాంతో భయపడిన మహాదేవుడు పరాజయంతో కూడిన అవమానంతో యుద్ధరంగం నుండి పలాయనం చేశాడు.

रुद्रमदेवी Summary in English

Introduction of the Poet

The lesson Rudramadevi is an extract from the poem Silpasri written by Sri D. Venkataramacharya. Silpasri is a poem with five cantos. It describes the story of Queen Rudrama Devi of the Kakatiya Dynasty. Sri Ramacharya authored two kavyas in Telugu namely Anarkali and Atharva Chanakyudu. He translated Raghuvamsa of Kalidasa into Telugu.

The present lesson describes how Rudrama Devi defeated the king of Devagiri.

Free study material for Sanskrit

TS Board Solutions for Class 12 Sanskrit Poem 05 Rudramadevi

Chapter Exercise Answers for Class 12 Sanskrit

Explore reliable textbook solutions for Poem 05 Rudramadevi tailored for Class 12 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official TS Board standards for Sanskrit.

Detailed Answer Guides for Poem 05 Rudramadevi

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Poem 05 Rudramadevi concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 12 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 12 Sanskrit.

FAQs

Where can I find the latest TS Inter 2nd Year Sanskrit Study Material Poem 5 रुद्रमदेवी for the 2026-27 session?

The complete and updated TS Inter 2nd Year Sanskrit Study Material Poem 5 रुद्रमदेवी is available for free on StudiesToday.com. These solutions for Class 12 Sanskrit are as per latest TS Board curriculum.

Are the Sanskrit TS Board solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the TS Inter 2nd Year Sanskrit Study Material Poem 5 रुद्रमदेवी as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Sanskrit concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 TS Board solutions help in scoring 90% plus marks?

Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 2nd Year Sanskrit Study Material Poem 5 रुद्रमदेवी will help students to get full marks in the theory paper.

Do you offer TS Inter 2nd Year Sanskrit Study Material Poem 5 रुद्रमदेवी in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Sanskrit. You can access TS Inter 2nd Year Sanskrit Study Material Poem 5 रुद्रमदेवी in both English and Hindi medium.

Is it possible to download the Sanskrit TS Board solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire TS Inter 2nd Year Sanskrit Study Material Poem 5 रुद्रमदेवी in printable PDF format for offline study on any device.