Download TS Board Solutions for Class 11 Telugu Chapter 06 Raja Bahadur Venkata Rama Reddy's Service
Review structured textbook solutions for Class 11 Telugu Chapter 06 Raja Bahadur Venkata Rama Reddy's Service. Built according to TS Board guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access TS Board Solutions and Answers
Navigate directly to the solved Telugu textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
అభ్యాసం
I. వ్యాసరూప ప్రశ్నలు – సమాధానాలు
Question 1: రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన విద్యావ్యవస్థలను వివరించండి?
Answer:
‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వెంకట రామారెడ్డి అందరి మన్ననలను పొందిన వ్యక్తి.
బహుభాషావేత్త. తన జీవితాన్ని -ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. ఆయన విద్యపట్ల శ్రద్ధగలవారు. పలు విద్యాసంస్థలను స్థాపించి ప్రజాసేవ చేశారు.
1. బాలికల ఉన్నత పాఠశాల:
మొత్తం హైదరాబాదు రాష్ట్రంలో మన బాలికలకు మాతృభాషా బోధనకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవటం దురదృష్టకరమని రెడ్డిగారు భావించారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉర్దూ, ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతుంది. కావున హైదరాబాదులో ఒక మాతృభాషా పాఠశాలను బాలికల కోసం నిర్మించాలని తలచి స్త్రీ విద్యా ప్రోత్సాహకులు మాడపాటి హనుమంతరావుగారిని కలిసి బాలికల పాఠశాలను నిర్మించారు. ఇది బొంబాయిలో ‘కార్వే’ మహాశయులు స్థాపించిన మహిళావిద్యాపీఠంతో జత చేశారు. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.
2. పరోపకారిణీ బాలికా పాఠశాల:
హైదరాబాద్ రామారెడ్డిగారు స్థాపించిన మరొక పాఠశాల పరోపకారిణీ బాలికా పాఠశాల. ఇది ప్రైమరీ తరగతి వరకు ఉన్నది. దీనికి అధ్యక్షులుగా రామారెడ్డి ఉన్నారు.
3. ఎక్సెల్ సియర్ మిడిల్ పాఠశాల:
ఈ పాఠశాలను 1945లో స్థాపించారు. దీని పాలక వర్గ అధ్యక్షులు రామారెడ్డిగారే! దీనిలో తెలుగు బాలురకే ప్రవేశముంది. ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలు లేకపోవటంతో అంతగా విద్యార్థులు ఆసక్తి చూపలేదు.
4. బాలికా పాఠశాల (గొల్లఖిడ్కి):
హైదరాబాదు గొల్లఖిడ్కిలో ఒక ఆంధ్రబాలికా పాఠశాలను ప్రజాసేవకులు కొందరు స్థాపించారు. దీని బాధ్యతను కూడా రెడ్డిగారే స్వీకరించారు.
5. పరోపకారిణీ బాలికా పాఠశాల:
సికిందరాబాదు నగరంలో కీ॥శే॥ సీతమ్మగారు ఆ కాలంలో ఉండేవారు. ఆమె తన జీవితాన్ని ధారపోసి ఒక మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాల అభివృద్ధికి రెడ్డిగారు సహాయ పడ్డారు.
6. ఆంధ్రవిద్యాలయం:
హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువు చెప్పుటకు ఒక్క మాధ్యమిక పాఠశాల కూడా లేదు. 1931లో దేవరకొండ సభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజాబహద్దూర్ వెంకట రామరెడ్డిగారు ఆ సభకు అధ్యక్షత వహించారు. ఎలాగైనా ఒక పాఠశాలను నిర్మించాలని తీర్మానం చేశారు. అది చివరకు సెప్టెంబరు 1, 1944కు కానీ సానుకూలం కాలేదు. ఆ తరువాత అది 1947 నాటికి రెడ్డిగారి చలవతో ఉన్నత పాఠశాలగా ఎదిగింది.
ఇలా రాజాబహద్దూర్ రామారెడ్డిగారు విద్యపట్ల మిక్కిలి ఆసక్తిని కనపరచి, తెలుగు మాధ్యమంలో బాలికలు చదువు కోవటానికి పాఠశాలలను స్థాపించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులయ్యారు.
Exam Tips:
a) ఒక్కో విద్యాసంస్థకు పేరు, ఎవరు స్థాపించారు, రామారెడ్డి పాత్ర (అధ్యక్షుడు/సహాయం) – ఈ మూడు అంశాలు రాయండి.
b) ఆంధ్రవిద్యాలయం కాలక్రమం (1931 దేవరకొండ సభ → 1944 స్థాపన → 1947 ఉన్నత పాఠశాల) తప్పక పేర్కొనండి.
c) చివరి వాక్యంలో ‘తెలుగు మాధ్యమంలో బాలికల విద్యకు కృషి’ అనే సారాంశం రాయండి.
Question 2: రాజాబహద్దూర్ సంఘసేవా తత్పరతను పరిచయం చేయండి?
Answer:
రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర” అన్న గ్రంథం నుండి గ్రహించబడింది.
వెంకటరామారెడ్డి గొప్ప సంఘ సేవా తత్పరులు. విద్యార్థుల కోసం, బాలికల విద్య కోసం, వితంతు వివాహాలు, బాల్య వివాహాల నిరసన, అనాధల వేశ్యల రక్షణ మొదలగు అంశాలపై ఆయన చేసిన సేవ మెచ్చదగినది. హైదరాబాద్‌లో చదువుకునే రెడ్డి విద్యార్థులకు (హాస్టల్) వసతి గృహం నిర్మించటం, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్థినులకు పాఠశాలలను నిర్మించటం వారి సేవలో ప్రధాన భాగాలు.
సంఘ సంస్కారం:
గోల్కొండ పత్రికను స్థాపించి దాని ద్వారా యువతలో చైతన్యాన్ని నింపారు.
రెడ్డిగారు పూర్వకాలం వారు అయినప్పటికి సంఘసంస్కారం కలవారు. బాల్య వివాహాలను నిరసించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. కీ॥శే॥ పండిత కేశవరావుగారు వీటిపై రెండు చిత్తు శాసనాలను చేస్తే వాటికి రెడ్డిగారు మద్దతు నిచ్చారు. దీనిపై శాసనసభవారు ఒక ఉప సంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘంలో రెడ్డిగారు ముఖ్యపాత్ర వహించారు. ఒక రెడ్డి హాస్టల్ విద్యార్థి వితంతు వివాహం చేసుకుంటే అతనిని ప్రోత్సహించి ఉపాధిని కల్పించారు. వీరికి కులభేద పట్టింపులు లేవు. మూఢాచారాలను నిరసించారు. అన్ని కులాల మతాల వారితో కలిసి జీవించారు.
అనాధలపై ప్రేమ:
రెడ్డిగారికి అనాధలపై, వృద్ధులపై, రోగ గ్రస్తులపై, చివరకు జంతువులపై కూడా ప్రేమ ఉండేది. జంతు హింస నివారణ సంఘంలో ముఖ్యులుగా పనిచేశారు. అనాధ బాలికలను ధనవంతులు, నవాబులు ఉంచుకొనుట ఆచారంగా ఆ రోజులలో ఉండేది. నాటి పోలీసు అధికారి ‘సర్ ట్రెంచ్’ గానిని సంప్రదించి “శిశువుల సంరక్షక శాసనము’ను చేయించి అనాధ బాలికలను రక్షించారు.
సికిందరాబాద్ లో రెండు వృద్ధాశ్రమాలుండేవి. వాటికి ద్రవ్యసహాయాన్ని రెడ్డిగారు పలుమార్లు చేశారు. హైదారాబాద్ లో కుష్ఠిరోగుల చికిత్సాలయం ఉండేది. అక్కడి రోగుల పట్ల సేవాభావంతో చాలాసార్లు ఆర్థిక సహాయం చేశారు. అనాధలపై వీరికి ఎంతటి సేవాభావం ఉండేదో అలాగే హరిజనులపై ఉండేది. హిందువుల దురాచారాలలో అస్పృశ్యత ఒకటి. దీనితో పాటుగా మరొక కుసంస్కారం ఉండేది. హరిజన బాలికలను చిన్నతనంలోనే “మురళీలు”గను, “బసివిరాండ్రు”గను తయారుచేసి అగ్రవర్ణాలవారు వారితో వ్యభిచారం చేసేవారు. వారికిక వివాహం అంటూ ఉండేదికాదు. జీవితాంతం వ్యభిచారులుగానే గడపవలసి వచ్చేది. రెడ్డిగారు దీనిని నిరసించి వారిని ఆదుకున్నారు. సర్వజనులకు పరోపకారి, కరుణా సముద్రులు, ప్రజానురంజకులు, రాష్ట్రసేవాపరాయణులుగా ప్రజా సేవచేస్తూ కీర్తి ప్రతిష్టలను పొందారు రామారెడ్డిగారు.
Exam Tips:
a) సంఘసేవను శీర్షికలుగా విభజించండి: విద్య, సంఘ సంస్కారం, అనాథలపై ప్రేమ, హరిజనోద్ధరణ.
b) బాల్య వివాహ నిరసన, వితంతు వివాహ ప్రోత్సాహం, శిశు సంరక్షక శాసనం – ఈ ఉదాహరణలు మార్కులు తెస్తాయి.
II. సంగ్రహ రూప ప్రశ్నలు – సమాధానాలు
Question 1: ధనవంతులు తమ అధికార బలాన్ని దేనికి ఉపయోగించాలి?
Answer:
రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “వేంకట రామారెడ్డి జీవిత చరిత్ర” నుండి గ్రహించబడింది.
భారతదేశంలోను, మన రాష్ట్రంలోను అధికారులు, గొప్ప గొప్ప ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వారందరూ ధనమును బాగా సంపాదించినవారే! గొప్ప గొప్ప బిరుదులను పొందినవారే! కాని వారిని లోకం గుర్తించలేదు. దానికి కారణం వారిలో సామాజిక సంఘసేవా తత్పరత లేకపోవటమే! ఎంతటి గొప్పవారైనా ఎంతటి ధనికులైనా సంఘ సేవ చేయని ఎడల గుర్తింపు పొందరు.
తాము సంపాదించిన ధనములో ఎంతో కొంత సమాజ శ్రేయస్సుకు వినియోగించాలి. దేశాభివృద్ధికి ప్రజలలో మంచిని ప్రబోధించటానికి తప్పక వినియోగించాలి. అలా చేయనిఎడల గుర్తింపును కోల్పోతారు. రామారెడ్డిగారు ఇతరుల వలే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా మంచిపలుకుబడిని ప్రజానురాగాన్ని పొందారు. దానికి కారణం ఆయన తన ధనాన్ని శక్తిని, పలుకుబడిని ప్రజాభ్యుదయానికి ఉపయోగించారు.
కాబట్టి ధనవంతులు అధికారులు తమ అధికారాన్ని ధనాన్ని ఇతరుల కోసం, సమాజాభివృద్ధికి ఉపయోగించాలి.
Exam Tips:
a) ధనవంతులు తమ ధనం, అధికారం, పలుకుబడిని సమాజ శ్రేయస్సుకే ఉపయోగించాలనే ప్రధాన భావాన్ని మొదటి, చివరి వాక్యాల్లో రాయండి.
b) రామారెడ్డిని ఇతర అధికారులతో పోలుస్తూ రాయండి.
Question 2: సురవరం ప్రతాపరెడ్డి ‘సాహితీసేవ’ను వివరించండి?
Answer:
‘రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత’ అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన “రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.
సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థాన కేంద్రమైన ‘బోరవెల్లి’ గ్రామంలో మే 28, 1896న జన్మించారు. వీరి స్వస్థలం ‘ఇటిక్యాలపాడు’ తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డిలు. వీరు సంస్కృత సాహిత్యంతోపాటు ఎఫ్ఎ, బి.ఏ,బి.ఎల్ చదివారు. తొలుత న్యాయవాదిగా ఉన్నా తరువాత సాహిత్య కారునిగా మారారు.
సురవరం వారు గోల్కొండ పత్రికను స్థాపించారు. 1926 నుండి 20 సం॥ల పాటు ఆయనే సంపాదకత్వం వహించారు. “తెలంగాణలో కవులు పూజ్యం” అన్న విమర్శను తుడిచివేస్తూ 354 మంది తెలంగాణ కవుల జీవిత చరిత్రలను రాశారు. గోల్కొండ కవుల చరిత్రను వెలువరించారు. 1931 నుండి 1953 వరకు తెలంగాణ సామాజిక పరిస్థితులు ప్రతిబింబించేలా మొగలాయి కథలను రాశారు.
1948లో “ఆంధ్రుల సాంఘిక చరిత్రను” వెలువరించారు. “ప్రజావాణి” పత్రికను నడిపారు. “భక్త తుకారాం”, “డచ్చల విషాదము” అన్న నాటకాలను రచించారు.
హిందువుల పండుగలు హైందవధర్మవీరులు, రామాయణ విశేషాలు వంటి 40 గ్రంథాలను సురవరం వారు రాశారు.
Exam Tips:
a) సురవరం జననం (మే 28, 1896, బోరవెల్లి), వృత్తి, గోల్కొండ పత్రిక (1926) – వరుసగా రాయండి.
b) రచనల పేర్లు: ఆంధ్రుల సాంఘిక చరిత్ర, గోల్కొండ కవుల సంచిక, మొగలాయి కథలు – ఖచ్చితంగా రాయండి.
Question 3: ‘గోల్కొండ’ పత్రిక అభివృద్ధికి రాజాబహద్దూర్ ఎలా తోడ్పడ్డారు?
Answer:
రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి సేవతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డిచే రచించబడిన రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది.
సురవరం ప్రతాపరెడ్డిగారు 1926లో తెలంగాణలో గోల్కొండ పత్రికను స్థాపించారు. అప్పటి వరకు తెలంగాణలో పత్రికలకు ప్రాతినిధ్యం లేదు. ఆయనే 20 సం॥ల పాటు దానికి ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. పత్రికారంగంలో ఒక నూతన ఒరవడిని గోల్కొండ పత్రిక సృష్టించింది. సురవరం వారిలో రాజా బహద్దార్ రామారెడ్డి గారికి అనుబంధం ఏర్పడింది. అది గోల్కొండ పత్రికతో వారిద్దరికి ఉన్న అనుబంధం గోల్కొండ పత్రిక తొలుత హైదరాబాద్ నుండి వెలువడుటకు కావలసిన ముద్రణాలయము స్థాపించటానికి యంత్రాలకు కావలసిన ధన సహాయం. రూ. 7,300 రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి గారే సమకూర్చారు. గోల్కొండ పత్రిక ఒకటి తెలంగాణా నుండి రావటానికి ప్రధాన కారకుడిగా రాజాబహద్దూర్ గారు నిలిచారు.
Exam Tips:
a) గోల్కొండ పత్రికకు రామారెడ్డి అందించిన ఆర్థిక సహాయం (ముద్రణాలయ యంత్రాలకు) ప్రధానంగా రాయండి.
b) పత్రిక స్థాపన సంవత్సరం 1926, సంపాదకత్వం 20 సంవత్సరాలు అనే వివరాలు చేర్చండి.
Question 4: ‘రాజా బహద్దూర్’ హరిజనుల పట్ల చూపిన దృష్టిని తెలుపండి?
Answer:
శ్రీ రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి సేవాతత్పరత అను పాఠ్యభాగం సురవరం ప్రతాపరెడ్డి గారిచే రచించబడిన ‘రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి’ జీవిత చరిత్ర నుండి గ్రహించబడింది. వీరు తన బలమును, ధనమును, అధికారమును, ప్రజాభ్యుదయానికి వినియోగించారు. మంచి సంఘసంస్కరణాభిలాషి, అనాధలపై వీరికి ఎంతటి అనురాగమో హరిజనులపై కూడా అంతటి ప్రేమాదరణలను కలిగియున్నారు.
హిందూ దురాచారాలలో అగ్రస్థానం వహించిన అస్పృశ్యతా నివారణను పెద్ద దోషముగా రామారెడ్డిగారు భావించారు. వారిని కూడా హిందూ సోదరులుగా భావించి వారికి సమానత్వాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. హరిజనులలో ఒక దుష్ట సంప్రదాయం ఉండేది. హరిజనులు తమ ఆడపిల్లను ‘మురళీలుగా’ ‘బసివిరాండ్రుగా’ తయారు చేసేవారు.
బాల్యంలోనే ఇలా తయారుచేయబడిన హరిజన బాలికలు వారి జీవితాంతం వ్యభిచారులుగా బ్రతుకవలసి వచ్చేది. సమాజంలోని అగ్రవర్ణాలవారు వీరితో వ్యభిచారం చేసేవారు. ఈ దుష్ట సంప్రదాయాన్ని రూపుమాపటానికి రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి గారు తీవ్రమైన కృషి చేశారు. ఈయన సర్వజన ప్రియులై అఖండకీర్తి ప్రతిష్టలనందుకున్నారు.
Exam Tips:
a) హరిజన బాలికలను ‘మురళీలు, బసివిరాండ్రు’గా మార్చే దురాచారాన్ని రామారెడ్డి వ్యతిరేకించిన తీరును ప్రధానంగా రాయండి.
b) అస్పృశ్యత నివారణ, సమానత్వ భావన – రెండింటినీ పేర్కొనండి.
III. ఏకపద / వాక్య సమాధాన ప్రశ్నలు – సమాధానాలు
Question 1: సురవరం ప్రతాపరెడ్డి ఎప్పుడు జన్మించారు?
Answer:
సురవరం ప్రతాపరెడ్డి మే 28, 1896న జన్మించారు.
Exam Tips:
a) పుట్టిన తేదీని పూర్తిగా (మే 28, 1896) రాయండి.
Question 2: సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఏ గ్రంథం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందింది?
Answer:
1948లో రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ అనే గ్రంథానికి (1955లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది).
Exam Tips:
a) గ్రంథం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ (1948లో రచన); అకాడమీ పురస్కారం 1955 – రెండు సంవత్సరాలను కలపవద్దు.
Question 3: అనాథ బాలికల సంరక్షణ కోసం ఎలాంటి శాసనం వచ్చింది?
Answer:
అనాథ బాలబాలికల కోసం “శిశువుల సంరక్షక శాసనము వచ్చింది.
Exam Tips:
a) శాసనం పేరు ‘శిశువుల సంరక్షక శాసనము’ – పేరు ఉన్నదున్నట్లు రాయండి.
Question 4: బొంబాయిలో మహిళావిద్యాపీఠాన్ని ఎవరు స్థాపించారు?
Answer:
బొంబాయిలో మహిళా విద్యా పీఠాన్ని స్థాపించినవారు ‘కార్వే’ మహాశయుడు.
Exam Tips:
a) ‘కార్వే’ మహాశయుడు – పేరు అక్షరదోషం లేకుండా రాయండి.
Question 5: స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి ఎవరు సాయం చేశారు?
Answer:
స్త్రీల క్లబ్ భవన నిర్మాణానికి సాయం చేసింది సర్ బన్సీలాల్ గారు 15,000 రూ॥ ఇచ్చారు.
Exam Tips:
a) సహాయం చేసినవారు సర్ బన్సీలాల్, మొత్తం రూ. 15,000 – రెండూ రాయండి.
Question 6: స్వార్థం లేకుండా పరోపకారిణీ బాలికల పాఠశాల నడిపినదెవరు?
Answer:
కీ॥శే॥ సీతమ్మగారు.
Exam Tips:
a) సీతమ్మగారి పేరుతో ‘కీ॥శే॥’ అని గౌరవ సూచకం చేర్చండి.
Question 7: రాజాబహద్దూర్ కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కడెక్కడా కలవు?
Answer:
హైదరాబాద్ లో ఒకటి, సికిందరాబాద్‌లో ఒకటి కలవు.
Exam Tips:
a) రెండు వృద్ధాశ్రమాలు – హైదరాబాద్, సికిందరాబాద్లలో ఒక్కొక్కటి (పాఠం ప్రకారం).
Question 8: ‘సర్ ట్రెంచ్’ ఎవరు?
Answer:
‘ట్రెంచ్’ ఆ కాలంలో ఉన్న పోలీసు శాఖామంత్రి.
Exam Tips:
a) ‘ట్రెంచ్’ పేరుతో పాటు ఆయన పదవి, శిశు సంరక్షక శాసనంతో అనుబంధాన్ని రాయండి.
Free study material for Telugu
Telugu Class 11 Curriculum Solutions: Chapter 06 Raja Bahadur Venkata Rama Reddy's Service
Official TS Board Solutions for Chapter 06 Raja Bahadur Venkata Rama Reddy's Service
Access structured TS Board textbook solutions for Chapter 06 Raja Bahadur Venkata Rama Reddy's Service. Designed in alignment with the latest academic curriculum for Class 11 Telugu, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Step-by-Step Explanations for Chapter 06 Raja Bahadur Venkata Rama Reddy's Service
Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 Telugu text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Next Steps in Your Telugu Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 06 Raja Bahadur Venkata Rama Reddy's Service with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత is available for free on StudiesToday.com. These solutions for Class 11 Telugu are as per latest TS Board curriculum.
Yes, our experts have revised the TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Telugu concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using TS Board language because TS Board marking schemes are strictly based on textbook definitions. Our TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Telugu. You can access TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత in both English and Hindi medium.
Yes, you can download the entire TS Inter 1st Year Telugu Study Material Chapter 6 రాజాబహద్దుర్ వేంకట రామారెడ్డి సేవాతత్పరత in printable PDF format for offline study on any device.